సాక్షి, తాడేపల్లి: 22 రోజుల్లో 23 జిల్లాలు.. 86 నియోజకవర్గాలు.. 2,188 కి.మీలు.. 9 భారీ రోడ్ షోలు 6 ప్రత్యేక సమావేశాలు 16 బహిరంగ సభలు.. జన ప్రభంజనం మధ్య జైత్ర యాత్రలా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సాగింది. మండుటెండైనా, అర్ధరాత్రయినా పిల్లలు, పెద్దలు ఆత్మీయ స్వాగతం పలికారు. యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మరో జైత్రయాత్రకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించనున్నారు.
మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు. 28న ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకారావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.
మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్
28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు
29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు
30న కొండెపి, మైదుకూరు, పీలేరు
మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment