Public metting
-
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
అన్నమయ్య జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని.. పొరపాటున బాబుకు ఓటస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రోడ్డులో ప్రచార సభలో మాట్లాడుతూ చంద్రబాబు.. మోదీ, అమిత్‌షాను తీసుకొచ్చి సభలు పెట్టించారు. ప్రత్యేక హోదా హామీ వస్తుందేమోనని ప్రజలు ఎదురుచూశారు.. వాళ్లు ప్రత్యేక హోదా హామీ ఇవ్వకుండా.. విమర్శించి వెళ్లిపోయారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.‘‘చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారు. కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఏం కావాల్లో అది మాత్రమే మాట్లాడారు. పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి’’ అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.‘‘2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?. చంద్రబాబు కూటమి.. పెత్తందార్ల కూటమి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే.. వ్యతిరేకించారు. పెత్తందార్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా? 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అక్క చెల్లెమ్మలకు నేరుగా రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం’’ అని సీఎం వివరించారు.గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు. ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన. ఇంటర్నేషనల్ యూనివర్శిటీలతో సర్టిఫైడ్ కోర్సులు. పిల్లల చదువు కోసం తల్లులను పోత్సహిస్తూ అమ్మఒడి. విద్యారంగంలో జరిగిన విప్లవాలు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. మహిళా సాధికారతకు అర్థం చెప్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. మొదటిసారి మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.⇒రాజంపేటలో అక్కచెల్లెమ్మల పేరిట 4వేల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణం..⇒మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..⇒జరగబోయే ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయించేవి..⇒మీ జగన్ తీసుకొచ్చినన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?⇒ఈ తరహాలో పేదవాడి మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో చూశారా? ⇒ప్రత్యేకహోదాను అమ్మేశారు, పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి..⇒చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని జిల్లా కేంద్రం చేస్తా అంటున్నాడు..⇒రాజంపేట, మదనపల్లి, రాయచోటిలను జిల్లా కేంద్రం చేస్తానంటున్నాడు నమ్ముతారా?⇒రాజంపేటలో పింఛా డ్యాం ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం⇒అన్నమయ్య ప్రాజెక్ట్, గాలేరు-నగరి కాల్వ పనులు పూర్తి చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి⇒రాజంపేట కేంద్రంగా అన్నమయ్య కాలేజ్‌ను యూనివర్శిటీగా తీర్చిదిద్దాం⇒మీ బిడ్డ తీసుకున్న నిర్ణయం రాజంపేట చరిత్రలో నిలిచిపోతుంది⇒అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు -
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి(శనివారం) ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘరామ్ శుక్రవారం విడుదల చేశారు.సీఎం జగన్ 4వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురం పార్లమెంట్ పరిధి హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధి పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధి నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. -
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు.. షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: 22 రోజుల్లో 23 జిల్లాలు.. 86 నియోజకవర్గాలు.. 2,188 కి.మీలు.. 9 భారీ రోడ్ షోలు 6 ప్రత్యేక సమావేశాలు 16 బహిరంగ సభలు.. జన ప్రభంజనం మధ్య జైత్ర యాత్రలా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సాగింది. మండుటెండైనా, అర్ధరాత్రయినా పిల్లలు, పెద్దలు ఆత్మీయ స్వాగతం పలికారు. యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మరో జైత్రయాత్రకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించనున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు. 28న ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకారావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు30న కొండెపి, మైదుకూరు, పీలేరుమే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు -
Naidupeta: సీఎం జగన్ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్‌లు
సాక్షి, తిరుపతి జిల్లా: అయ్యా చంద్రబాబు.. నువ్వు 14 ఏళ్లు, మూడుసార్లు సీఎం అని చెబుతావ్ కదా.. మరి అన్నేళ్లు చేశానని చెప్పుకుంటూ.. నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచిగానీ, సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా?’’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలు అంటించారు. 8వరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ ♦చంద్రబాబుకి గుర్తొచ్చేది.. వెన్నుపోటు అంటూ సింబాలిక్‌గా సైగతో చూపించారు సీఎం జగన్ ♦మనకు కోట్ల మంది అభిమానులు ఉంటే.. ఆ యెల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు ♦ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఓ దత్తపుత్రుడు. అంతా పొరుగు రాష్ట్రం నుంచే ఉన్నారు. వీళ్ల రాజకీయం దోచుకోవడం.. దాచుకోవడం. చంద్రబాబును హంతకుడు అనలేమా? ఈ ఎన్నికలు రెండు భావజాలాలు.. పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలం మధ్య జరుగుతున్న సంఘర్షణ. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా, తాతలు ప్రాణాలు కోల్పోయారు చంద్రబాబును హంతకుడు అందాం.. అంతకంటే దారుణంగా చెబుదామా? వలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు జూన్ 4వరకు ఓపిక పట్టండి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది తొలి సంతకం వలంటీర్ వ్యవస్థపైనే చేసి.. పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తాం 2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు ముగ్గురిని తెచ్చుకున్నాడు. స్వయంగా మేనిఫెస్టో కూడా ముఖ్యమైన హామీలు అంటూ ఇంటింటికి పంచాడు ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు టీవీల్లో ప్రకటనలు ఇచ్చాడు.. ప్రధాన హామీలంటూ స్వయంగా సంతకాలు చేశాడు.. మరి పొదుపు సంఘాల పూర్తి రుణమాఫీ అన్నాడు? చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25వేలు డిపాజిట్ చేస్తా అన్నాడు.. చేశాడా? ఇంటింటికి నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా? రైతులకు రుణమాఫీ అన్నాడు? చేశాడా? మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు.. కనీసం సెంటు స్థలం అయినా ఇచ్చాడా? -
సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?.. రేవంత్ సవాల్
సాక్షి, కామారెడ్డి: ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోలుపై సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?.. విచారణకు నేను సిద్ధం.. సవాల్ విసురుతున్నా.. లేకపోతే కామారెడ్డిలో ముక్కు నేలకు రాయాలి’’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో మాట్లాడుతూ, కామారెడ్డి బంగారు తునక అంటున్నారు.. గజ్వేల్ నుంచి ఎందుకు వస్తున్నారు. అమ్మకు అన్నం పెట్టని వారు చిన్నమ్మకు బంగారు గాజులు అంటే నమ్మడానికి కామారెడ్డి ప్రజలు అమాయకులు కాదు’’ అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ‘‘కుట్రతో కామారెడ్డి భూముల కోసం ఇక్కడికి వస్తున్నారు కేసీఆర్. మాస్టర్ ప్లాన్ రద్దు అంటున్నారు.. మీ ప్రభుత్వమే రద్దు అయ్యింది. మీ కుటుంబం కోసమేనా 1200 మంది ఆత్మహత్య చేసుకున్నది. కేసీఆర్‌ను ఓడించేందుకే, పార్టీ ఆదేశం మేరకే కామారెడ్డికి వచ్చాను. బూచోడు వస్తున్నాడు. మీ భూములు లాక్కుంటారు.. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కనిపించడు.. వినిపించడు.. కామారెడ్డి నియోజక వర్గంలో 3 లక్షల 60 వేల ఎకరాలకు వైఎస్సార్ తీసుకొచ్చిన ప్రాణహిత, చేవెళ్ల ద్వారా గోదావరి జలాలు అందాలంటే కాంగ్రెస్ గెలవాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ బీజేపీ కుట్రే: కేటీఆర్ -
వరంగల్‌లో బీజేపీ సభకు హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: హనుమకొండలో బీజేపీ బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడి సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో శనివారం బహిరంగ సభ నిర్వహించుకునేందుకు బీజేపీకి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఇటీవల రాష్ట్రంలో పలు బహిరంగ సభలకు అనుమతినిచ్చి, ఈ సభకు నిరాకరించడం సరికాదని పేర్కొంది. అయితే ఎలాంటి రెచ్చగొట్టే, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయవద్దని షరతు పెట్టింది. ప్రదర్శనలు, సభలు, ర్యాలీలను నిషేధిస్తూ పోలీసులు జారీ చేసిన నోటిఫికేషన్ చట్టవ్యతిరేకమని, దానిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది. అయితే సభ ఎంతసేపు నిర్వహిస్తారు, ఎందరు జనం వస్తున్నారు, పార్కింగ్ ఏర్పా ట్లు తదితర వివరాలను వరంగల్ సీపీకి అందజేయాలని బీజేపీ నేతలకు సూచించింది. సభలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా అందుకు పిటిషనర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సభకు అనుమతి కోరుతూ కోర్టుకు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా.. 27న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభ చేపట్టారు. కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి సభ నిర్వహణ కోసం ఈ నెల 23న అనుమతి తీసుకున్నారు. కానీ తాము ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నట్టు 25వ తేదీన ప్రిన్సిపాల్ ప్రకటించారు. శాంతిభద్రతల కారణాలతో సభకు అనుమతించబోమని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రిన్సిపాల్ సభకు అనుమతి ఇచ్చినా పోలీసుల ఒత్తిడి వల్ల రద్దు చేశారని.. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని విన్నవించారు. ఏదైనా పార్టీకిగానీ, సొసైటీకిగానీ సభలు, సమావేశాలు నిర్వహించుకునే ప్రాథమిక హక్కు ఉందంటూ.. గతంలో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను తమ పిటిషన్‌కు జత చేశారు. మధ్యాహ్నం కొనసాగిన వాదనలు.. బీజేపీ నేతల పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ శుక్రవారం మధ్యాహ్నం విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. యూనివర్సిటీలు, కాలేజీలు రాజకీయ సభలు, సమావేశాలకు వేదిక కారాదని గతంలో ఇదే హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, సభ కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ప్రిన్సిపాల్ సభకు అనుమతి రద్దు చేశారని కోర్టుకు వివరించారు. పిటిషనర్ల తరఫున అడ్వొకేట్ ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఇతర పాదయాత్రలు, సభలకు అనుమతిచ్చి.. ఈ సభకు ఇవ్వకపోవడం సరికాదని న్యాయమూర్తికి వివరించారు. ప్రత్యేక రాజకీయ ఎజెండాతోనే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇలా దాదాపు 2 గంటల పాటు వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయమూర్తి తన తీర్పు వెలువరించారు. రాష్ట్రంలో సభలు, సమావేశాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలేమీ లేవని గుర్తు చేశారు. గత వారం రోజుల్లో పలు సభలకు అనుమతి ఇచ్చి ఈ సభకు నిరాకరించడం సరికాదని పేర్కొన్నారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ సభను నిరాకరించిన కారణాలు ఇక్కడ వర్తించవని చెప్పారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని కాలేజీలపైనే వీసీకి అధికారం ఉంటుందని.. మరో ప్రాంతంలోని కాలేజీలపై నిర్ణయాధికారం ఉండదని పేర్కొన్నారు. అయినా ఇక్కడ కాలేజీ, గ్రౌండ్ రెండూ కలిసి లేవని.. సభ కారణంగా విద్యార్థులకు ఇబ్బంది ఉండే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. సభ నిర్వహణ, శాంతిభద్రతలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం వరంగల్ పోలీస్ కమిషనర్‌కు మాత్రమే ఉంటుందని.. కిందిస్థాయి అధికారులకు ఉండదని చట్టం చెబుతోందని వివరించారు. సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. చదవండి: అదే జరిగితే.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే! -
ప్రాజెక్టుల్లో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు జల దృశ్యం పేరిట లేవనెత్తిన ప్రశ్నలకు బదులివ్వకుండా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తెలివిగా తప్పించుకుంటున్నారని, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావును ఇందుకు వాడుకుంటున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శిం చారు. విద్యాసాగర్‌రావు, శ్రీధర్‌రావు దేశ్ పాండే ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటున్న ఉద్యోగులేనని, వారెలా రాజకీయాలు మాట్లాడతారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. ప్రాజెక్టుల్లో అవినీతిని ఆధారాలతో నిరూపించడానికి తాము సిద్ధమని, ఈ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.