ప్రాజెక్టుల్లో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు జల దృశ్యం పేరిట లేవనెత్తిన ప్రశ్నలకు బదులివ్వకుండా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తెలివిగా తప్పించుకుంటున్నారని, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావును ఇందుకు వాడుకుంటున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శిం చారు. విద్యాసాగర్‌రావు, శ్రీధర్‌రావు దేశ్ పాండే ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటున్న ఉద్యోగులేనని, వారెలా రాజకీయాలు మాట్లాడతారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. ప్రాజెక్టుల్లో అవినీతిని ఆధారాలతో నిరూపించడానికి తాము సిద్ధమని, ఈ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.