
ప్రస్తుత జనరేషన్‌లో ఏదీ చేయాలన్నా డిఫరెంట్‌గా ఉండాలని యూత్ కోరుకుంటున్నారు. అలా చేసి ప్రమాదాలను కోరి మరీ తెచ్చుకుంటున్నారు. వివాహా వేడుకలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయాలని ఢిఫరెంట్‌గా ఫొటో షూట్ (Photo Shoot) తీసుకుందామన్నారు. కానీ, ఆ నిర్ణయం వధువు పాలిట శాపమైంది. కలర్ బాంబ్ కారణంగా వధువు తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలో భారత సంతతి పెళ్లి జంటకు చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. భారత సంతతి విక్కీ, ప్రియా జంట తమ వివాహం కోసం కెనడా (Canada) నుంచి స్వదేశానికి వచ్చారు. ఘనంగా వివాహ వేడుక జరుగుతోంది. ఈ వేడుకను తిలకించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో వివాహ వేడుక రోజున.. వధువరులిద్దరూ డిఫరెంట్‌గా ఫొటో షూట్ తీసుకోవాలనుకున్నారు. దీనికి ప్రత్యేకంగా కలర్ బాంబ్‌లను వాడాలని డిసైడ్ అయ్యారు. వీరిద్దరూ ఫొటోలు దిగుతుంటే అక్కడున్నంతా వారంతా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంతలోనే వధువరులిద్దరూ వీడియో కోసం ఫోజులిస్తున్నారు.. అటు నుంచి కెమెరామెన్.. రెడీ.. అనగానే.. వధువును వరుడు ఎత్తుకున్న సమయంలో వారి పక్కనే స్పెషల్ ఎట్రాక్షన్ కోసం ఏర్పాటు చేసిన కలర్ బాంబ్ ఒక్కసారిగా పేల్చింది. సూపర్‌గా వచ్చింది అనుకునేలోపే.. బాంబు నుంచి మంటలు వచ్చి.. వధువును అంటుకున్నాయి. మంటల కారణంగా ఆమె జుట్టు.. వెనుక భాగం కాలిపోయింది. మంటలకు బాడీ కమిలిపోవడంతో వధువు విలవిల్లాడిపోయింది. దీంతో, ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే, పెళ్లిళ్లలో బాణాసంచా పేల్చడం సహజమే. కానీ, జాగ్రత్తలు అవసరం.. ఏది శృతి మించినా అది ప్రమాదానికి దారి తీస్తుంది. తమలా ఎవరూ చేయవద్దని.. ఒకవేళ ఫొటోషూట్‌లు చేసుకున్నా జాగ్రత్తలు తీసుకోవాలని జంట విక్కీ, ప్రియా విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను 22 మిలియన్ల మంది వీక్షించారు. ఆమె వెంటనే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని యథావిధిగా పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఇక వీడియోను వీక్షించిన నెటిజన్లు.. వధువు పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. త్వరగా కోలుకుని వివాహ బంధాన్ని ఆస్వాదించాలని కోరారు. అయితే ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందనే వివరాలు వెల్లడి కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment