Socail Media
-
వీడియో: వెడ్డింగ్ ఫొటో షూట్లో మిస్ ‘ఫైర్’
ప్రస్తుత జనరేషన్లో ఏదీ చేయాలన్నా డిఫరెంట్‌గా ఉండాలని యూత్ కోరుకుంటున్నారు. అలా చేసి ప్రమాదాలను కోరి మరీ తెచ్చుకుంటున్నారు. వివాహా వేడుకలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయాలని ఢిఫరెంట్‌గా ఫొటో షూట్ (Photo Shoot) తీసుకుందామన్నారు. కానీ, ఆ నిర్ణయం వధువు పాలిట శాపమైంది. కలర్ బాంబ్ కారణంగా వధువు తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలో భారత సంతతి పెళ్లి జంటకు చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. భారత సంతతి విక్కీ, ప్రియా జంట తమ వివాహం కోసం కెనడా (Canada) నుంచి స్వదేశానికి వచ్చారు. ఘనంగా వివాహ వేడుక జరుగుతోంది. ఈ వేడుకను తిలకించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో వివాహ వేడుక రోజున.. వధువరులిద్దరూ డిఫరెంట్‌గా ఫొటో షూట్ తీసుకోవాలనుకున్నారు. దీనికి ప్రత్యేకంగా కలర్ బాంబ్లను వాడాలని డిసైడ్ అయ్యారు. వీరిద్దరూ ఫొటోలు దిగుతుంటే అక్కడున్నంతా వారంతా ఎంజాయ్ చేస్తున్నారు.ఇంతలోనే వధువరులిద్దరూ వీడియో కోసం ఫోజులిస్తున్నారు.. అటు నుంచి కెమెరామెన్.. రెడీ.. అనగానే.. వధువును వరుడు ఎత్తుకున్న సమయంలో వారి పక్కనే స్పెషల్ ఎట్రాక్షన్ కోసం ఏర్పాటు చేసిన కలర్ బాంబ్ ఒక్కసారిగా పేల్చింది. సూపర్‌గా వచ్చింది అనుకునేలోపే.. బాంబు నుంచి మంటలు వచ్చి.. వధువును అంటుకున్నాయి. మంటల కారణంగా ఆమె జుట్టు.. వెనుక భాగం కాలిపోయింది. మంటలకు బాడీ కమిలిపోవడంతో వధువు విలవిల్లాడిపోయింది. దీంతో, ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, పెళ్లిళ్లలో బాణాసంచా పేల్చడం సహజమే. కానీ, జాగ్రత్తలు అవసరం.. ఏది శృతి మించినా అది ప్రమాదానికి దారి తీస్తుంది. తమలా ఎవరూ చేయవద్దని.. ఒకవేళ ఫొటోషూట్లు చేసుకున్నా జాగ్రత్తలు తీసుకోవాలని జంట విక్కీ, ప్రియా విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను 22 మిలియన్ల మంది వీక్షించారు. ఆమె వెంటనే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని యథావిధిగా పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఇక వీడియోను వీక్షించిన నెటిజన్లు.. వధువు పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. త్వరగా కోలుకుని వివాహ బంధాన్ని ఆస్వాదించాలని కోరారు. అయితే ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందనే వివరాలు వెల్లడి కాలేదు. View this post on Instagram A post shared by Vicky & Piya ♡ Luxury Travel Couple (@viaparadise) -
అనురాగ్ కశ్యప్ కూతురి హల్దీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
TaapseePannu సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైకే వావ్ (ఫోటోలు)
-
ప్రశ్నిస్తే కేసులు... FIRలు స్వయంగా చదివి వినిపించిన జగన్
-
‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ వైరల్ ఫొటోపై ఇజ్రాయెల్ కౌంటర్
హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని రఫా నగరంపై దాడులతో విరుచుకుపడుతోంది. ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం.. రఫాలో పాలస్తీనా పౌరులు తల దాచుకుంటున్న శిబిరాలపై భీకర వైమానిక దాడులకు తెగపడింది. ఈ దాడుల్లో 45 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. సుమారు రెండువేల మంది గాయపడ్డారు. దీంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తమైంది.All eyes on #Rafah 🇵🇸 pic.twitter.com/bg3bAtl3dQ— The Palestinian (@InsiderWorld_1) May 27, 2024 ‘ఆల్ ఐస్ ఆన్ రఫా (అందరి దృష్టి రఫా పైన)’అని పాలస్తీనా శిబిరాలపై రాసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు షేర్ చేసి పాలస్తీనా పౌరులకు మద్దతుగా నిలిచారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను సెలబ్రిటీలు, నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. మరికొంత మంది నెటిజన్లు.. పాలస్తీనా పౌరులపై దాడులు ఆపేయాలని కోరారు.ALL EYES ON RAFAH pic.twitter.com/2dstfq7rWt— The Saviour (@stairwayto3dom) May 30, 2024 అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి వ్యక్తమైన ఆగ్రహం,వ్యతిరేకతపై తాజాగా ఇజ్రాయెల్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది. ‘‘ మేము అక్టోబర్ 7 ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేసిన మెరుపు దాడులను మాట్లాడటం మానుకోము. అదేవిధంగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలను విడిపించుకునే వరకు మా పోరాటం ఆపము ’’ అని ‘వేర్ వర్ యువర్ ఐస్’అని చిన్నపిల్లాడి ముందు హమాస్ మిలిటెంట్ తుపాకి పట్టుకొని ఉన్న ఫొటోను షేర్ చేసి కౌంటర్ ఇచ్చింది.We will NEVER stop talking about October 7th. We will NEVER stop fighting for the hostages. pic.twitter.com/XoFqAf1IjM— Israel ישראל (@Israel) May 29, 2024‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ ఫొటో హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 45 మిలియన్ల మంది షేర్ చేశారు. భారతీయ సినీ సెలబ్రిటీలు సైతం తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఫొటోను షేర్ చేశారు. ప్రియాంకా చోప్రా జోనస్, అలియా బట్, కరీనా కపూర్ ఖాన్, మధూరి దీక్షిత్, వరుణ్ దావన్, సమంత్ రుత్ ప్రభు తదితరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 36,050 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. సుమారు 81,026 మంది గాయపడ్డారు. -
పతనావస్థ దిశగా ప్యాకేజ్ స్టార్ పరుగులు!
పేరుకు సొంత జిల్లా అయినా చంద్రబాబుకు ఏనాడూ ప్రజల మద్దతు దక్కలేదు.. పొత్తుల పేరుతో ఇతర పార్టీలతో కలిసి వచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు.. అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని యత్నించినా ప్రయోజనం చేకూరలేదు.. మళ్లీ పాత కథే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తుండడంతో టీడీపీ అధినేతకు దిక్కుతోచడం లేదు. అసలే బలమైన అభ్యర్థులు లేక ఆందోళన చెందుతున్న బాబుగారికి భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది. ఎలాగైనా విజయావకాశాలు మెరుగుపరుచుకోవాలనే దురాలోచన చేస్తున్నట్లు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. చివరకు టీడీపీ.. జనసేన నేతల మధ్య చిచ్చుపెట్టి వేడుక చూస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. చివరకు టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కల్పిస్తున్నారు. కీలకమైన తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. పొత్తులో భాగంగా పై మూడు స్థానాలను జనసేన కోరకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారం తెలిసిందే. తన నైజానికి తగ్గట్టు చంద్రబాబు ఆయా స్థానాలను జనసేనకు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చినా, వీటిని వదులు కోవడానికి సిద్ధంగా లేరు. ఎలాగైనా ఈ స్థానాల్లో కూడా తమ అభ్యర్థులనే బరిలోకి దింపాలని టీడీపీ అంతర్గత సమావేశంలో నిర్ణయించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన కండువా కప్పించి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు. నేడో, రేపో చేరిక ఉండవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. జన బలమే కాదు.. పార్టీ కమిటీలకు దిక్కులేని జనసేన నాయకులమని చెప్పుకునే పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ మాత్రం ఎవరికి వారు తామే అభ్యర్థులమని ప్రకటించుకుంటున్నారు. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నా పైకి మాత్రం భాయ్భాయ్ అని కలరింగ్ ఇచ్చుకు తిరుగుతున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో జరిగిన జనసేన నేతలతో పరిచయ కార్యక్రమంలో తలెత్తిన వివాదంపై పసుపులేటికి షోకాజ్ నోటీసు ఇవ్వడం వెనుక కిరణ్ రాయల్ హస్తం ఉన్నట్లు తెలిసింది. వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా.. మరికొందరికి సీటు ఇస్తామని చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్లు ముమ్మర ప్రచారం జరుగుతోంది. భారంగా ‘రా కదలిరా’ అభ్యర్థుల విషయమే తేల్చకుండా.. చంద్రబాబు ‘రా కదలి రా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా, పచ్చ పత్రిలు, ఎల్లో ఛానళ్లలో తప్ప టీడీపీ గురించి పట్టించుకోని జనంలో పార్టీకి హైప్ తెచ్చేందుకే ఎన్నికల ముందు ఈ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ‘రా కదలిరా’ను అట్టహాసంగా చేపట్టాలని టీడీపీ నేతలకు చంద్రబాబు హుకుం జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది తలకు మించిన భారంగానే ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. చేసేది లేక ఎక్కడికక్కడ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అధినేత ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నుంచి తమ పార్టీలోకి పెద్దసంఖ్యలో చేరికలు జరుగుతున్నాయని ప్రజలను నమ్మించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో కంటికి కనిపించిన వారిని పట్టుకువచ్చి పచ్చ కండువా కప్పేస్తున్నారు. వారందరూ వైఎస్సార్సీపీ నుంచి వలస వచ్చేస్తున్నారని కలరింగ్ ఇచ్చేస్తున్నారు. అందులో భాగంగానే శనివారం కుప్పం మండలం మల్లనూరు సమీపంలోని టి.సదుమురు, హెచ్.కొట్టాల గ్రామాలకి చెందిన పలువురిని తీసుకెళ్లి టీడీపీ కండువాలు కప్పేసి ఫొటోలకు ఫోజులిప్పించేశారు. తమ్ముళ్ల అవస్థలు పసిగట్టిన ప్రజలు బాహాటంగానే నవ్వుకుంటుండడం కొసమెరుపు. చిత్తూరులో బాబు చిచ్చు చిత్తూరులో టీడీపీ జెండా మోసేవారు కరువైన సమయంలో మాజీ మేయర్ కఠారి హేమలత, మరి కొందరు టీడీపీ శ్రేణులు పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థిత్వం తమకే దక్కుతుందనుకున్న కఠారి హేమలత, బాలాజీ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లేశారు. కొత్తగా జగన్మోహన్ అనే వ్యక్తిని రంగంలోకి దింపారు. కొంత కాలంగా జగన్మోహన్ చిత్తూరులోనే ఉంటూ ప్రజలకు రకరకాల బహుమతులు పంపిణీ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. చిత్తూరు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న జగన్మోహన్కు సైతం చంద్రబాబు హ్యాండిచ్చేశారు. తాజాగా డీకే ఆదికేశవులు నాయుడు బంధువులను రంగంలోకి తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. చాలా కాలంగా బెంగళూరుకే పరిమితమైన డీకే కుటుంబీకులు కొద్ది రోజులుగా చిత్తూరు, శ్రీకాళహస్తిలో టీడీపీ శ్రేణులతో మమేకమవుతున్నారు. ఈ క్రమంలోనే డీకే ఆదికేశవులు నాయుడు మనుమరాలు చైతన్యకు జనసేన కండువా కప్పించారు. శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్, టీడీపీ దివంగత నేత గురవయ్య నాయుడుకు ఈమె కోడలు. అందుకే శ్రీకాళహస్తి నుంచి జనసేన అభ్యర్థిగా ఆమెను బరిలోకి దింపాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న బొజ్జల సుధీర్‌రెడ్డి అభ్యర్థిగా పనికిరాడని స్థానిక టీడీపీ నేతలు కొందరు చంద్రబాబుకు వెల్లడించినట్లు సమాచారం. అవగాహన రాహిత్యం, అసభ్య పదజాలంతో సుధీర్‌రెడ్డి మాట్లాడిన మాటలు, ప్రవర్తనపై బాబుకు వీడియోలు పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బొజ్జల సుధీర్ అభ్యర్థిగా పనికి రాడనే అభిప్రాయానికి ఆ పార్టీ అధినేత వచ్చినట్లు తమ్ముళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక చిత్తూరు విషయానికి వస్తే.. డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబంలోని వ్యక్తికే అభ్యర్థిత్వం ఇవ్వాలని భావించిన చంద్రబాబు.. తాజాగా మరో వ్యక్తికి ఫోన్‌చేసి టికెట్ ఆఫర్ చేసినట్లు తెలియడం గమనార్హం. -
అసభ్యకర పోస్టులు.. సోషల్ మీడియా కట్టడి అవసరం: వాసిరెడ్డి పద్మ
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ తెలిపారు. శుక్రవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి ట్రోల్ చేయడం రాతియుగంలో కూడా లేని హీనత్వాన్ని తలపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలపై అసభ్యకర పోస్టులు ప్రధానంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలపై అసభ్యకరమైన పదజాలంతో పాటు అశ్లీల చిత్రాలు, అక్రమ సంబంధాల వంటి కట్టు కథల పోస్టింగులు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎంతో జుగుప్సాకరమైన విషయం అన్నారు. యూకేలో ఉన్న ఓ మహిళ రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారి కుటుంబ మహిళలపై సోషల్ మీడియాలో ఎంతో బాధాకరమైన పోస్టులు పెట్టడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. వారిని సమర్థించడం సరికాదు టీడీపీ కార్యకర్త శ్వేతా చౌదరి దారుణంగా మాట్లాడుతోందని, ఆమెకు చంద్రబాబు మద్దతు తెలపడం సరికాదని హితవుపలికారు. సీఎం ఇంట్లో మహిళలను కించపరిస్తే ప్రతిపక్షనేత ప్రోత్సహిత్సారా? అని మండిపడ్డారు. అటువంటి వారికి మద్దతుగా మాట్లాడతం చంద్రబాబు ద్వంద నీతికి నిదర్శనమన్నారు. ఇటు వంటి సందేశాలు ఇవ్వడం ద్వారా వారు సమాజానికి ఎటు వంటి సంకేతాలు ఇస్తున్నారు అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చైర్ పెర్సన్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టుకు పోస్టు పెట్టడమే సమాధానం కాదని, ఎంత మాత్రం సమర్థనీయం కూడా కాదని ఆమె స్పష్టం చేశారు. చదవండి: సీఎం జగన్ భరోసా.. ఆదుకోవాలన్న బాధితులకు అండ సోషల్ మీడియా కట్టడి అవసరం సోషల్ మీడియా సమాజంలో సృష్టించే దారుణాతి దారుణమైన పరిస్థితులను నియంత్రించడంలో న్యాయ, పోలీసు వ్యవస్థలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులో ఉండటం వల్ల సమస్య మరింత జఠిలం అవ్వడానికి దారితీస్తున్నదన్నారు. సోషల్ మీడియా దాడిని యాసిడ్ దాడులు, హత్యాయత్నాలతో సమానంగా చూడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. వ్యక్తిత్వ హననం హత్య కంటే దారుణంగా మారినప్పుడు చట్టాలకు పదును పెట్టి అదుపుతప్పున సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. జులై 5న సెమినార్ ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకురావల్సిన ఆవశ్యకతపై పలువురి సూచనలు, సలహాలను స్వీకరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 5న విజయవాడలో ఓ సెమినార్‌ను నిర్వహించనున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. సమాజంలోని మేథావులు, సంఘ సంస్కర్తలు, విద్యావంతులు ఈ సెమినార్లో పాల్గొని సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తమ కార్యాలయానికి మెయిల్ ద్వారా కూడా సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని ఆమె తెలిపారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెపుతూ తమ కమిషన్‌కు వచ్చిన పిర్యాధులు అన్నింటిపై సత్వరమే చర్యలు తీసుకోనేందుకు పోలీస్ శాఖకు, ముఖ్యంగా సైబర్ క్రైం వారికి పంపించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు సజ్జల కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎస్సీ ముఖ్యనేతల సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకం వెనుక సీఎం జగన్ కృషి ఉందని చెప్పారు. పేదలకు ఎంతగా ఉపయోగపడతాయో ఆలోచించి పథకాలు తెచ్చారని పేర్కొన్నారు. 'సామాన్యుల నుండి సానుకూల దృక్పథం ఉంది. సోషల్ మీడియా ద్వారా వీటిని మరింతగా జనంలోకి తీసుకెళ్లాలి. ఇందుకోసం ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తాం. వీడియోలు చేసి పంపిస్తే వాటిని జనంలోకి తీసుకెళ్దాం. ధరలు దేశమంతటా పెరిగాయన్న విషయాన్ని సామాన్యులు సైతం మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ఏపీలోనే పెరిగాయని ఎవరూ అనరు. మన ప్రత్యర్థులు చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. మనం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చినందున ధైర్యంగా జనంలోకి వెళ్తున్నాం.' అని సజ్జల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చదవండి: ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు జరుగుతోంది -
అచ్చం సీఎం షిండేలా ఉన్నారే!.. ప్రముఖ వ్యాపారవేత్త ట్వీట్ వైరల్
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా.. సమకాలీన అంశాలపై త్వరగతిన సోషల్ మీడియా స్పందిస్తుంటారు. అదే టైంలో ఆయన నుంచి సరదా విషయాలు కూడా కొన్ని నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఫుడ్ వేస్టేజ్ విషయంలో బాధ్యతయుతంగా వ్యవహరించాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు సైతం ఎంతోమందిని ఆకట్టుకుంది కూడా. ఈ తరుణంలో తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్.. పలువురిని ఆకట్టుకుంటోంది. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బ్లాక్ అండ్ వైట్ ఫొటోను.. ఆ పక్కనే తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఉంచి హర్ష్ గోయెంకా ఒక క్యాప్షన్ ఉంచారు. ‘నన్ను కలవడానికి వచ్చిన వారికి.. ఏదైనా సౌలభ్యం కోసం క్షమించండి. నా Z+ కేటగిరీ భద్రత ఇబ్బందిగా ఉంటుందని నాకు తెలుసు. మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నాను. జై మహారాష్ట్ర!’ అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. సరదాగా చేసిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడు తషీమ్ పూనావాలాతో పాటు ఎందరో నెటిజన్లను ఆ ఫొటోకు కామెంట్లు చేస్తున్నారు. To those who come to meet me, sorry for any convenience. I know my Z+ security can be a nuisance. Look forward to your support. Jai Maharashtra! 😜 pic.twitter.com/zXb9HynS6W — Harsh Goenka (@hvgoenka) July 3, 2022 -
Video Viral: ‘బాలుడు చేసిన పనికి.. హత్తుకొని ముద్దు ఇవ్వాలనుంది’
తల్లులు పిల్లలకు అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తారు. కాలేజీ, ఆఫీస్ క్యాంటిన్లో పలువురు తమ మిత్రులకు ప్రేమగా అన్నం కలిపి తినిపించటం కూడా చూశాం. ప్రియమైనవారికి ప్రేమతో అన్నం తినిపించటంలో కూడా కొంతమంది ఆనందాన్ని పొందుతారు. చిలిపిగా మారాం చేసినా.. ఇంకొంచం తినూ రా.. అంటూ గద్దించి మరీ ప్రేమతో నోటికి అన్నం ముద్దలు అందిస్తారు. అటువంటి కల్మషం లేని ప్రేమ.. ముఖ్యంగా బాల్యంలో అధికంగా కనిపిస్తుందనటంలో సందేహం లేదు! తాజాగా అటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాఠశాలలో విద్యార్థులంతా లైన్లో కూర్చొని భోజనం చేస్తుంటారు. అయితే అందులో ఓ ఇద్దరు విద్యార్థుల ముందు అన్నం ప్లేట్ ఉంటుంది. అయితే అందులో ఒక విద్యార్థి మాత్రమే అన్నం తింటూ.. తన స్నేహితుడైన మరో విద్యార్థికి అన్నం కలిపి నోటికి అందిస్తాడు. ఎందుకంటే రెండో విద్యార్థికి కళ్లు కనిపించవు.. ఆ బాలుడు మారాం చేస్తున్నా తను తింటూ స్నేహితుడికి అన్నం తినిపిస్తాడు. ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘సంస్కారం అనేది ప్రవర్తనలో కనిపిస్తుంది!’ అని కామెంట్ చేశాడు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు అన్నం తినిపించే బాలుడి స్నేహాన్ని అభినందిస్తున్నారు. ‘ఆ బాలుడిని హత్తుకొని ఓ ముద్దు ఇవ్వాలని ఉంది’.. ఇదే స్వచ్ఛమైన స్నేహం.. బాలుడికి ఉన్న సంస్కారం అందరిలో ఉండాలి’.. ‘అద్భుతం! అలా పెంచిన పిల్లాడి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. If you get right Sanskars,it shows up in your behaviour ❤️🙏 pic.twitter.com/ruvH780YWb — Vikas Chopra (@Pronamotweets) November 28, 2021 -
West Bengal: 108 గ్రాముల బంగారంతో.. గోల్డ్ మాస్క్!! జనాల్లో ధరించలేక..
జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెడుతుందనే సామెత వినే ఉంటారు. మరి బంగారం ఉంటే..!! అవును.. ఇతగాడు బంగారంతో ఏకంగా మాస్క్ చేయించుకున్నాడు. ఈ గోల్డ్ మాస్క్ ముచ్చట్లేమిటో తెలుసుకుందాం.. కోవిడ్ వచ్చాక మన జీవితాల్లో మాస్కులు కూడా ఒక భాగమైపోయాయి. వీటిని ధరించడంలో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ అనుసరిస్తున్నారు. మ్యాచింగ్ మాస్కులు, ఫొటో ఫ్రింట్ మాస్కులు, ఏ చీర కామాస్కు.. ఇలా ఎన్నో. ఐతే వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త 108 గ్రాముల బంగారంతో రూ. 5 లక్షల 70 వేల ఖరీదు చేసే గోల్డ్ మాస్క్ చేయించుకున్నాడు. దీనిని చందన్ దాస్ అనే జ్యువెలరీ డిజైనర్‌తో ప్రత్యేకంగా తయారు చేయించాడట. కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజ వేడుకల సందర్భంగా సదరు వ్యాపారవేత్త ముచ్చటపడి చేయించుకున్న గోల్డ్ మాస్క్‌ను ధరించాడు. ఐతే జనాలు గోల్డ్ మాస్కును చూసేందుకు చుట్టూ మూగడంతో కాసేపట్లోనే తీసి జేబులో దాచుకున్నాడు. రీతుపర్నా చటర్జీ అనే జర్నలిస్ట్ గోల్డ్ మాస్క్‌కు సంబంధించిన ఫొటోలను ‘వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్?' అనే క్యాప్షన్‌తో ట్విటర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట వెరల్ అయ్యాయి. తనకు ఆభరణాల పట్ల మక్కువ ఎక్కువని, అందుకే బంగారంతో మాస్కు చేయించుకున్నాడని, మెడలో రకరకాల బంగారు గొలుసులు, రెండు చేతులకు అనేక ఉంగరాలు ధరించినట్లు స్థానిక మీడియాకు సదరు వ్యాపారవేత్త తెలిపాడు. ఏదిఏమైనా కోవిడ్ కాలంలో కడుపునింపుకునేందుకు జనాలు నానాఅగచాట్లు పడ్డారు. అటువంటిది ఇతగాడు తన సంపదను ప్రదర్శించుకునేందుకు ఏకంగా గోల్డ్‌తో మాస్క్ చేయించుకోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోందీ గోల్డ్ మాస్క్. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. What is the purpose of this? pic.twitter.com/Zy4MqIPNCZ — Rituparna Chatterjee (@MasalaBai) November 10, 2021 -
బ్యాంకులో మాస్క్ పెట్టుకోవాలి అన్నందుకు.. అధికారులకు దిమ్మతిరిగేలా షాకిచ్చాడు!
బీజింగ్: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కరోనా. మహమ్మారి కట్టడి కోసం మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటివి సర్వ సాధారణమయ్యాయి. మాస్క్ లేనివారిని జన సంచారమున్న ప్రాంతంలో, మాల్స్‌లో, బ్యాంకుల్లో కూడా అనుమతించడం లేదు. తాజాగా ఓ మిలియనీర్ మాస్కు పెట్టుకోకుండా బ్యాంకుకు వెళ్లాడు. అక్కడి సెక్యూరిటీ గార్డ్ ఆ బిలియనీర్‌ని అడ్డగించి మాస్క్ ధరించకపోతే బ్యాంకులోకి అనుమతిలేదని తేల్చి చెప్పాడు. దీంతో సదరు మిలియనీర్ చేసిన పనికి బ్యాంకు అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన చైనాలోని బ్యాంక్ ఆఫ్ షాంఘైలో చోటు చేసుకుంది. సెక్యూరిటీ గార్డు చెప్పిన విధానం నచ్చలేదో, లేదా అతని ప్రవర్తన నచ్చలేదో గానీ ఆ వ్యక్తి తన ఖాతాలోని డబ్బులన్నీ విత్ డ్రా చేసేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే నిబంధనల ప్రకారం.. ఒక రోజుకు 5 మిలియన్ల యువాన్లు (భారత కరెన్సీ ప్రకారం 5.8 కోట్లు) మాత్రమే బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకునే పరిమితి ఉంది. దీంతో అంత సొమ్మును ఒకేసారి విత్ డ్రా చేశాడు ఆ బిలియనర్. ఇదిలా ఉంటే ఒకే కరెన్సీ కౌంటర్‌తో అంత పెద్ద మొత్తాన్ని లెక్కపెట్టడానికి బ్యాంకు సిబ్బందికి రెండు గంటలపైగా పట్టిందట. అంతటి ఆగకుండా తన ఖాతాలో డబ్బు మొత్తం విత్ డ్రా చేసే వరకూ ప్రతిరోజూ ఇదే సీను రిపీట్ అవుతుందని ఆ మిలియనీర్ చెప్పాడట. అలా విత్ డ్రా చేసిన డబ్బును వేరే బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి డబ్బులు ఉన్న సూట్‌కేసులను తన లగ్జరీ కారులో తీసుకెళ్తున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: Viral Video: గిఫ్ట్ బాక్స్ చూసి షాక్ అయిన వధువు..ఇంతకీ అందులో ఏమందంటే..! -
Mental Health: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..!
‘అతి చేస్తే గతి తప్పుతుంది’ అని పెద్దలు ఊరికే అనరు..! ఏదైనా మితంగానే ఉండాలి. టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం చూపతుందని రకరకాల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు టీనేజర్స్ అతుక్కుపోతున్నారని, దీని వల్ల నష్టం జరుగుతుందనే మాట వినబడుతుంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. హానికరమైన కంటెంట్ నుంచి టీనేజర్స్‌ను దూరంగా పెట్టే చర్యలు చేపట్టనుంది. ఉదాహరణకు ఒక టీనేజర్ అదేపనిగా ఏదైనా కంటెంట్ చూస్తున్నాడనుకుందాం, అట్టి కంటెంట్ హానికరమైనదైతే దాన్ని బ్లాక్ చేస్తుంది. అదేపనిగా ఇన్‌స్టాగ్రామ్‌ను యూజ్ చేస్తుంటే ఇక చాలు... టేక్ ఏ బ్రేక్ అని హెచ్చరిస్తుంది. ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు. ఇవి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఫేస్‌బుక్‌కు కూడా వర్తిస్తాయా? అనేది ఇంకా తెలియదు. చదవండి: ఛీ! యాక్!! మూడేళ్లగా పచ్చిమాంసం మాత్రమే తింటున్నాడు.. ఒక్క రోజు కూడా.. -
నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే..
పెన్సిల్వేనియాలోని మిల్‌ఫోర్డ్‌లో ‘మంచ్కిన్’ చాలా ఫేమస్. ఎవరీ మంచ్కిన్ అనేకదా మీ డౌట్! ఇది ఒక బాతు. 20 యేళ్ల క్రిస్సీ ఎలిస్ పెంపుడు జంతువే ఈ మంచ్కిన్ అనే బాతు. ఇప్పుడిది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కష్టపడే పెంపుడు జంతువుగా ప్రసిద్ధి కెక్కింది. ఎలాగంటే.. క్రిస్సీకి చిన్నప్పటి నుంచి బాతులను పెంచే అలవాటుంది. ఐతే టీనేజ్‌లో ఉన్నప్పుడు మంచ్కిన్ అనే బాతు ఆమె దగ్గరికి చేరింది. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీరిద్దరికీ కలిపి ‘డంకిన్ డక్స్’ అనే పేరుతో కామన్ ఎకౌంట్ కూడా క్రిస్సీ తెరిచేసింది. తను ఉండే టౌన్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డంకిన్ డొనట్స్ పేరు ప్రేరణతో ఈ పేరు పెట్టిందట. ఇక అప్పటినుంచి వీరిద్దరి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియలో పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఈ ప్రక్రియలో ఆమె ఇలాంటి ఆసక్తులు, అభిరుచులను పంచుకునే వ్యక్తులతో కనెక్ట్ అయ్యింది. వీరికి టిక్‌టాక్‌లో 2.7 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో రెండు సోషల్ మీడియాల ద్వారా నెలకు ఏకంగా 3,34,363ల రూపాయలు తన యజమానికి సంపాదించి పెడుతుందట ఈ బాతు. అంతేకాకుండా పెయింటింగ్‌ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తోంది. దీంతో న్యూయార్క్ పోస్ట్ నివేదిక ‘కష్టపడి పనిచేసే పెట్’ అని పేర్కొంది. సాధారణంగా క్యూట్ గా ఉండే రకరకాల జంతువుల వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంటాయి. వాటిల్లో ఈ బాతు వీడియోలు మరింత క్రేజీగా దూసుకుపోతున్నాయి. చదవండి: అబ్బే ఏం లేదు.. నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే!! View this post on Instagram A post shared by Krissy & Munchkin (@dunkin.ducks) -
Viral Video: యుద్ధ విమానం విన్యాసం.. ఇంత ధైర్యమా..!
ఆస్ట్రేలియా బ్రిస్బేన్ నగరంలోని అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యాల మధ్య నుంచి గురువారం ఓ పేద్ద యుద్ధ విమానం రయ్యిన దూసుకుపోయింది. ఆకాశాన్నంటే భవనాల మధ్య మెలికలు తిరుగుతూ ఆ విమానం చేస్తున్న విన్యాసాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ భవనాల్లో ఉన్న వారు ఒకింత ఆందోళన చెందారు. ఇంత ధైర్యమా..! ఏదైనా జరగరానిది జరిగితే... అంటూ ముక్కున వేలేసుకున్నారు. అయితే.. సుశిక్షితులైన పైలెట్లు నడిపిన ఆ విమానం సాదా సీదాది కాదు. ఆస్ట్రేలియా రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి–17 కార్గో విమానం. రివర్ ఫ్రంట్ ఉత్సవాలకు ముందస్తుగా చేసిన రిహార్సల్లో భాగంగా ఆ విమానం ఇలా విన్యాసాలు చేసింది. స్థానికులు మాత్రం ఇదేమంత పెద్దగా పట్టించుకోవాల్సింది కాదని అంటున్నారు. ఆకాశహర్మ్యాల మధ్యన ఉన్న నదిపైనే ఆ విమానం ఎక్కువగా తిరిగిందని చెబుతున్నారు. అయినా.. ఇది చాలా సాహసోపేతమైన విన్యాసం అని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆమెరికా ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా దాడిని గుర్తు చేస్తూ ట్వీట్లు పెట్టారు. -
సోషల్ మీడియా వెబ్ పోర్టల్ లలో నకిలీ వార్తలపై సుప్రీంకోర్టు అసహనం
-
Viral: ఊహించని పరిణామం.. పెద్దపులి పరుగో పరుగు!
జైపూర్: పెద్దపులి అంటే అడవిలో పలు జంతువులు భయంతో పరుగులు తీస్తాయి. కొన్ని జంతువులు పులి విసిరే పంజాలకు ప్రాణాలు కోల్పోయి వాటికి ఆహారంగా మారుతాయి. పులులు సైతం తనకు ఎవరైనా భయపడాల్సిందే! అని గాంభీరంగా జంతువులపై దాడి చేస్తుంటాయి. అయితే పులి పంజాకు భయపడక కొన్ని జంతువులు వాటిని ప్రతిఘటిస్తే.. పులి సైతం పరుగులు తీయక తప్పదు. అయితే అచ్చం అటువంటి ఓ ఘటన రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుంది. చదవండి: Anand Mahindra: ‘ఇదొక భావోద్వేగం’ ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్ల కామెంట్స్ ఆకలితో ఉన్న ఓ పెద్దపులి వెనక నుంచి పంజా విసిరి ఓ ఎలుగుబంటిని చంపి తినాలనుకుంది. అయితే చడీ చప్పుడు కాకుండా పులి.. ఎలుగుబంటి వద్దకు వెళ్లి పంజా విసిరి దానిపై పడుతుంది. అయితే అంతే వేగంగా పులి దాడిని పసిగట్టిన ఎలుగుబంటి ఒక్కసారిగా వెనక్కు తిరిగి గట్టిగా అరుస్తూ తిరగబడుతుంది. ఊహించని ఈ పరిణామనికి ఖంగు తిన్నపెద్దపులి.. ప్రాణ భయంతో ఎలుగుబంటి నుంచి తప్పించుకోవాడనికి పరుగులు తీస్తుంది. చదవండి: అమ్మ కళ్లల్లో ఆనందం: డీఎస్పీ కుమారుడికి సెల్యూట్ చేసిన ఏఎస్సై తల్లి దీనికి సంబంధించిన వీడియోను సుశాంత నందా అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ పిల్లిలా వెనక నుంచి వచ్చిన పులి.. చివరకు పిల్లిలా పరుగులు తీసింది’.. ‘ఎలుగుబంటి కోపానికి పులి భయంతో పరుగో.. పరుగో..’ అని కామెంట్లు చేస్తున్నారు. -
పాక్‌లో దారుణం: మహిళా టిక్‌టాకర్‌పై 300 మంది దాడి!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా టిక్‌టాకర్‌పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్ట్14 పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఓ టిక్‌టాకర్ తన ఆరుగురు స్నేహితులతో కలిసి లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద టిక్‌టాక్ వీడియోను చిత్రీకరించాలనుకున్నారు. ఆ సమయంలో సుమారు 300మంది ఆమెను చుట్టిముట్టి దాడికి పాల్పడ్డారు. ఆమెను గాల్లోకి ఎగరేస్తూ దుస్తులు చించడానికి యత్నించారు. ఆమె చుట్టూ చేరిన వందలాది మంది నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఎంతకు సాధ్యం కాలేదు. ఈ పరిస్థితిని గమనించిన సెక్యూరిటీ గార్డు మినార్-ఇ-పాకిస్తాన్ గేటు తెరవటంతో అక్కడి నుంచి తన స్నేహితులతో ఆమె బయటపడింది. బలవంతంగా ఆమె చేతి ఉన్న ఉంగరం, చెవి రింగులు, తన స్నేహితుల వద్ద ఉన్న మోబైల్ ఫోన్, ఐడీ కార్డు, రూ.15 వేలను లాక్కున్నారు. ఈ ఘటనపై సదరు టిక్‌టాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. This is one of the many videos that are being shared on WhatsApp groups showing how men were groping her and touching her. Look at the number of people in this video!! All she wanted to do was celebrate Independence Day at minar e Pakistan. Is that a crime? pic.twitter.com/9LPaWAo4wQ — Nida Abbas (@OutOnAbudget) August 16, 2021 -
వైరల్: మాస్క్‌తో భయపెట్టాలనుకున్నాడు.. చివరికి
పాకిస్తాన్: విభిన్నమైన ఫేస్ మాస్కులు ధరించి కొంతమంది పలు వేడుకల్లో సందడి చేస్తారు. అయితే కొన్ని మాస్కులు వినూత్నంగా ప్రముఖుల ముఖాలు, జంతువులను పోలి ఉంటాయి. అటువంటి వాటిని ధరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ కొన్ని మాస్కులు మాత్రం ఎదుటివారికి భయం కలిగించేలా దెయ్యాలు, వికృతమైన ముఖాలతో తయారు చేయారుబడతాయి. ఆ మాస్కులు ధరించిన వారికి చిక్కులు కూడా తప్పవు కొన్ని సార్లు. అయితే అటువంటి ఓ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లోని పెషావర్‌కు చెందిన ఓ వ్యక్తి భయంకరమైన ముఖాన్ని పోలిన ఓ మాస్కును ధరించి రోడ్డు మీద వెళ్లే వారిని ఆట పట్టించాలనుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను నైలా ఇనాయత్ అనే జర్నలిస్ట్ ట్విటర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మరికొన్ని రోజుల్లో రాబోయే పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ మాస్క్‌ను ధరించి అందరిని భయపెట్టించాలని చూస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే గతంలో కూడా ఇలా భయంకమైన మాస్కులు ధరించి అల్లరి చేసేవారిని పాక్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. This guy arrested in Peshawar, had plans to celebrate independence day by scaring people. Apparently, the police wasn't much impressed, he was caught in his scary mask. pic.twitter.com/eYEe5YIaQE — Naila Inayat (@nailainayat) August 10, 2021 -
చోద్యం కాకపోతే.. భర్తకు తిండి పెట్టడానికి కూడా డబ్బు తీసుకుంటుందట
‘పీనాసి వాడి పెళ్ళికి పచ్చడి మెతుకులు సంభావన’ అనేది ఓ సామెత. గీసిగీసి బేరమాడే వాళ్లని, పావలాకు పదిరూపాయలు లాభం కోరుకునేవాళ్లని.. పీనాసి సంఘంలో చేర్చి మరీ ఎండగట్టినా మారరు. పైపెచ్చు అదేదో ఘనకార్యమన్నట్లుగా పొంగిపోతుంటారు ‘అహా నా పెళ్లంట’ సినిమాలోని కోట శ్రీనివాసరావు మాదిరి. ఆ కోవలోకి చెందిందే అమెరికా వాసి.. నలభై ఒక్కేళ్ల బికీ గుయిలీస్. ‘అమెరికాలోనే అత్యంత పినాసి మహిళ’గా పేరు తెచ్చుకుంది. వాటర్ బిల్లు చెల్లించడం కూడా ఇష్టం లేని గుయిలీస్.. ఇంటి ముందు కురిసే మంచు సేకరించి దాన్ని నీరుగా మార్చి ఇంటి అవసరాలకు వాడుతుంది. ఈమె పీనాసితనానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫ్రీ బై లేడీ’ పేరుతో తన పొదుపు సూత్రాలను పంచుకుంటున్న గుయిలీస్.. భర్త జాయ్‌కు తిండి పెట్టడానికి కూడా డబ్బు తీసుకుంటుందట. ‘తిండి విషయంలో కూడా నేను చాలా పొదుపుగా ఉంటాను. నా భర్త నేను తినే ఆహారం కంటే ఎక్కువ తింటే.. అందుకుగాను అతడు నాకు డబ్బు చెల్లించాల్సిందే. ఆ మొత్తాన్ని ఇంటి అవసరాల కోసం దాచిపెడతాను. నేను ఏదైనా వస్తువు కొనాలంటే అది 90 శాతం చవకదైనా అయ్యుండాలి లేదా ఉచితంగానైనా రావాలి. మొదట్లో ఇంత పొదుపుగా ఉండేదాన్ని కాదు. మా పెద్దబ్బాయి పుట్టాక ఏడాదికి 30 వేల డాలర్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంటి బాధ్యతలు స్వీకరించాను. అకస్మాత్తుగా ఉద్యోగం మానేయడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అందుకే అవసరాలన్నింటినీ తగ్గించడం మొదలుపెట్టాను. చివరికి ఇంటి మరమ్మత్తులు కూడా నేనే చేసుకుంటాను’ అని చెప్పుకొస్తుంది గుయిలీస్. అయితే ఈ కథ విన్నవారంతా పొదుపు మంచిదే కానీ పొట్ట కట్టుకుని మరీ ఇంతలా చేయాలా? అని విస్తుపోతున్నారు. భార్య పీనాసి తనాన్ని భరిస్తున్న జాయ్ మీద సానుభూతి చూపిస్తున్నారు. -
ఆలోపు జీవిత భాగస్వామిని ఎంచుకో.. లేదంటే ఒంటరిగా చావాలి!
టిక్ టాక్ వీడియోలంటే అందరికీ గుర్తుకు వచ్చేంది తమలోని కళలను బయటపెట్టడం. డ్యాన్స్‌లు, పాటలు, డైలాగ్‌లు ఇలా అన్ని రంగాల్లో టిక్‌టాక్ వీడియోలు చేసి తమ ప్రతిభతో పాపులర్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా ఓ టిక్‌టాక్ వీడియో ఇందుకు భిన్నంగా ఉండటంతో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. ఓ తాత, మనవరాలు మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో అది. మేగాన్ అనే ఓ అమ్మాయికి తన తాత ఫోన్లో చాటింగ్ చేస్తూ.. ఆమెకు చాలా సరదా సూచనలు, జాగ్రత్తలు చేప్పారు. 91 ఏళ్ల ఈ తాత తన గారాల మనవరాలుతో.. ‘29 ఏళ్ల లోపు జీవిత భాగస్వామని ఎంచుకోని అమ్మాయి.. ఇక ఒంటరిగానే జీవితాన్ని ముగిస్తుందని ఓ న్యూస్ ఆర్టికల్ చదివాను. ఇంకో మూడు నెలలకు నీ బర్త్ డే వస్తుంది. ఈ విషయాన్ని నీకు తెలియజేయాలనుకుంటున్నా’ అని ఫోన్లో సరదాగా సందేశం పంపారు. మరో సందేశంలో.. ‘మేగాన్, నువ్వు బరువు తగ్గుతున్నావని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన కుటుంబ సభ్యలు గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు’ అని అన్నారు. మరో ఫోన్ సందేశంలో.. ‘హాయ్ మేగాన్. నువ్వు అధికంగా తాగడంలేదని అనుకుంటున్నా. ఎందుకంటే మద్యం ధరలు ఆకాశానంటుతున్నట్లు న్యూస్ చదివి తెలుసుకున్నా’ అని చాలా ఫన్నిగా చెబుతాడు. దానికి మేగాన్ స్పందిస్తూ.. ‘నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటా తాత’ అని రిప్లై ఇస్తారు. అయితే తన తాతతో జరిగిన సరదా సంభాషణకు సంబంధించి మొబైల్ చాటింగ్ స్క్రీన్ షాట్లతో మేగాన్ టిక్‌టాక్ వీడియో తయారు చేశారు. ఆ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరి సంభాషణ చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘తాత, మనవరాలు అంటే ఇలా ఉండాలి’.. ‘91 ఏళ్ల ఓ తాత తన మనవరాలకు ప్రస్తుత కాలంతో వివాహానికి సంబంధించిన ఫన్నీ సూచనలు అద్భుతం’.. ‘అంత సరదాగా మాట్లాడే తాత ఉండటం ఆమె అదృష్టం’.. అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
హర్ష్ గోయాంక షేర్ చేసిన మేఘాల జలపాతం చూస్తే.. మెస్మరైజ్!
ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సామాజిక అంశాలు, స్ఫూర్తిని నింపే విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన తన ట్వీటర్ ఖాతాలో షేర్ ఓ మెస్మరైజింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన షేర్ చేసిన ఈ వీడియోలో దట్టమైన తెల్లని మేఘాలు కొండల మీద నుంచి కిందకు ఒకదానిపై నుంచి ఒకటి నీరు ప్రవహిస్తున్నట్లు కదులుతున్నాయి. అచ్చం జలపాతం లాగా మేఘాలు కిందకు కదిలే ఈ దృశ్యాన్ని చూసి మెస్మరైజ్ కాకుండా ఉండలేము. ఈ దృశ్యం మిజోరం రాష్ట్రంలోని ఐజ్వాల్‌లో చోటు చేసుకుంది. ‘కొండ మీద నుంచి కిందకు దూకుతున్న మేఘాలు.. మీజోరంలోని ఐజ్వాల్ కనువిందు చేస్తున్నాయి. మేఘాలు జలాపాతాన్ని తలపిస్తున్నాయి. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో మేఘాలు ఇలా మారుతాయి. కొండల నుంచి నీరు ప్రవహిస్తున్నట్లు మేఘాలు కదులుతుంటాయి. ఇది చూడడానికి చాలా అరుదైన దృశ్యం’ అని హర్ష్ గోయాంక కామెంట్ జత చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 19వేల మంది వీక్షించారు. ఈ వీడియోను మొదటగా ‘ది బెటర్ ఇండియా’లో ట్విటర్ పోస్ట్ చేసింది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని సైమన్ జేగర్ అనే వ్యక్తి వీడియోలో బంధించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిని నెటిజన్లు... వావ్! అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘కొండల మధ్య అద్భుతమైన దృశ్యం’, ‘ఈ వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు, ఇది నిజంగా చాలా మెస్మరైజింగ్ వీడియో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Clouds cascade down the mountains at Aizawl in Mizoram, creating a mesmerizing 'cloud waterfall'! This viral phenomenon requires very specific weather conditions to take shape, making it a rare sight to behold. VC: Simon Jaeger (simon.jaeger.587 on Facebook) pic.twitter.com/VieStWaysA — The Better India (@thebetterindia) July 3, 2021 -
బల్లికి ఆహారంగా పురుగు, ఎలా అందించారనేదే మేటర్!
బల్లిని చూస్తేనే చాలా మందికి విపరీతమైన భయం. అదెక్కడో గోడ మీద కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెత్తేవారు ఉంటారు. అలాంటిది బల్లి మీద పడితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చదవబోయే న్యూస్‌లో అంతకు మించిన మ్యాటర్ ఉంది. ఇక్కడ బల్లి దాని యజమాని పెదవుల మీద ఉన్న పురుగును అమాంతం నోట్లో వేసుకుంది. యాక్ అనిపించినా ఇది వాస్తవం. ఆ వివరాలు.. సరీసృపాల జూ వ్యవస్థాపకుడు జే బ్రూవర్ తన జూలోని జంతులాలతో ఎంతో ప్రేమగా ఉంటారు. వాటిని స్వయంగా ఆహారం అందించి మురిసిపోతుంటాడు. తాజాగా ఆయన ఓ పెద్ద బల్లికి పురుగుని ఆహారంగా అందించాడు. మాములుగా ఇస్తే.. ఓకే! కానీ అతను తన పెదవులపై ఆ పురుగును ఉంచుకోగా.. బల్లి వేగంగా దాన్ని తన పొడవాటి నాలుకతో నోట కరుచుకుంది. అందుకనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటివెన్నో జే బ్రూవర్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. (చదవండి: ఇది నిజంగా ముంబైలో జరిగిందా?) -
వైరల్: ఏనుగు డాన్స్ చూస్తే నవ్వకుండా ఉండలేం!
కేరళ: ఏనుగు అంటే అందరికీ భారీ కాయంతో గంభీరంగా ఉంటుందని గుర్తుకు వస్తుంది. అయితే కొన్ని ఏనుగులు సరదా పనులు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఏనుగులు రహదారులను దాటుతూ.. అడవిలో మరో జంతువును రక్షిస్తూ, కొన్ని సమయాల్లో తమకు ఆపద కలిగించే జంతువులను తరుముతూ కనిపించిన సందర్బాలు చాలా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఓ ఏనుగు బాలీవుడ్ సినిమా పాటకు చేసిన నృత్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ‘కేరళ ఎలిఫెంట్స్’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఇది కర్ణాటకలోని కొడియాడ్కా ఆలయానికి చెందిన ఏనుగు ‘లక్ష్మీ’ చేసిన డాన్స్’ అని కామెంట్ కూడా జత చేసింది. బాలీవుడ్ ‘కేదారానాథ్’ మూవీలోని ‘నమో నమోజీ శంకర’ అనే పాటకు ఈ ఏనుగు తన తల, తొండం, తోకను ఎంతో లయబద్ధంగా కదిలిస్తూ డాన్స్‌ను చేసింది. ఈ ఏనుగు నృత్యం వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటజన్లు సరదాగా కామెంట్లు చేసున్నారు. ‘చాలా జంతువులు నృత్యం చేసినప్పుడు చూశాం. కానీ ఈ ఏనుగు చేసిన వీడియోను చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం’.. ‘వావ్ సూపర్! ఈ ఏనుగు నా కంటే చాలా బాగా డాన్స్ చేస్తోంది’..‘ఏనుగు పేరు లక్ష్మీ.. ఏనుగు నృత్యం అద్భుతం!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఈ వీడియోను వేల మంది వీక్షించగా.. ఐదు వేల మంది లైక్ చేశారు. చదవండి: సెలవు కోసం భార్యకు విడాకులిచ్చిన భర్త...అది కూడా 3 సార్లు View this post on Instagram A post shared by 🌟 പൂരനായകൻ 🌟 (@kerala_elephants) -
ఉయ్యాలపై వృద్దుడి స్టంట్.. నెటిజన్లు ఫిదా!
-
ఉయ్యాలపై వృద్దుడి స్టంట్.. నెటిజన్లు ఫిదా!
ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక బిజినెస్‌లో ఎంత బిజీగా ఉన్నప్పకీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యే ఆసక్తికరమైన వీడియోలను ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తారు. తాజాగా ఆయన ఓ వృద్దుడు చేసిన సాహసపూరితమైన స్టంట్‌ను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఓ పార్క్‌లోని చిన్న పిల్లలు సరదాగా ఊగే ఉయ్యాల వద్ద ఓ పిల్లాడు ఉయ్యాలను పట్టకొని ఎలా ఊగాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ పక్కనే మరో ఉయ్యాలో ఉన్న ఓ వృద్దుడు వేగంగా ఉయ్యాల ఊగుతూ ఒక్కసారిగా అలా గాలిలోనే పల్టీ కొట్టి ఉయ్యాల నుంచి కాళ్లు కిందపెట్టి ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోతాడు. ‘ఉయ్యాలపై అద్భతంగా వేలాడాడు’ అంటూ హర్ష్ గోయాంక కామెంట్ జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వృద్దుడు చేసిన స్టంట్ వీడియోను పది లక్షల మంది వీక్షించగా, నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘ప్రతి వృద్దుడిలో చిన్న పిల్లవాడు ఉంటాడు’, ‘అతను జిమ్నాస్టిక్ తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు’, ‘ఆయనకి చిన్నప్పుటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: చావు భయంతో ఏనుగు పరుగులు -
ట్విటర్లో సరికొత్త ఫీచర్, ఉచితం మాత్రం కాదండోయ్!
వాషింగ్టన్: సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ట్విటర్ తమ ఫ్లాట్‌ఫాంపై మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా రాబోతున్న ఈ ఫీచర్లో మన టీట్లకు సవరణలు, డిలీట్ చేసేలా ‘అన్ డూ’ ఆప్షన్ ఉంటుంది. అయితే ఇది గతంలో మాదిరిగా ఉచితం కాదండోయ్! సబ్‌స్క్రైబ్ చేసుకుంటే తప్ప ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. దీంతో ఇప్పుడు ట్విటర్ వాడుతున్న వారంతా భవిష్యత్తులో ఈ ఫీచర్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యూజర్ల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ట్విట్టర్ ఈ ‘అన్డూ’ ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఓ ఫీచర్‌ను ఉచితంగా కాకుండా సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులోకి తీసుకురావాలనే ట్విట్టర్ సంస్థ ఆలోచన సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి. మార్చి 5న ఇంజనీరింగ్ నిపుణుడు, జేన్ మంచంగ్ వాంగ్, మాట్లాడుతూ ట్విట్టర్లో అన్డూ ఫీచర్‌కి అవకాశం ఉన్నందున త్వరలోనే ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ‘'ట్వీట్ అన్ డూ' ఫీచర్ టైమర్ కలిగి ఉంటుంది, అంటే జీమెయిల్ అన్‌సెండ్ మెయిల్ ఫీచర్ లాగా పనిచేస్తుంది. అనగా యూజర్లకు పరిమిత సమయంలోనే తాము పంపిన ట్వీట్ అన్‌సెండ్, ఎడిట్ చేయడానికి వీలుంటుంది. ఎందుకోగానీ మిగతా ఫీచర్లలా దీన్ని ఉచితంగా అందించేందుకు మాత్రం ట్విట్టర్ సిద్ధంగా లేదు. ప్రత్యేకంగా సబ్ స్కైబ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆప్షన్ ఇవ్వాలని ట్విట్టర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సబ్‌స్క్రైబ్ చేసుకున్న తర్వాత యాప్‌లో యూజర్లకు అన్ డూ బటన్ దర్శనమిస్తుంది. సాధారణంగా యూజర్ తాను ట్వీట్ చేసిన వెంటనే తప్పిదాన్ని గుర్తించి దాన్ని వెనక్కి తీసుకునేందుకు లేదా తొలగించేందుకు అన్ డూ బటన్ నొక్కాల్సి ఉంటుంది. అలా చేస్తే వెంటనే ఆ ట్వీట్ ఉపసంహరించవచ్చు. ఈ రకంగా అన్ డూ ఉపయోగపడుతుంది’ అని మంచంగ్ వాంగ్ పేర్కొన్నారు. చదవండి: తొలి ట్వీట్ ఖరీదు రూ.18.30 కోట్లు! -
హీరో డ్యాన్స్.. అచ్చం అంపైరింగ్లా!
-
వైరల్: హీరో డ్యాన్స్.. అచ్చం అంపైరింగ్లా!
ముంబై: బాలీవుడ్ సెలబ్రెటీల మీద సరదాగా మీమ్స్, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు అభిమానులు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అభిమాని తన ట్విటర్ ఖాతాలో బాడి డియోల్ నటించిన పలు సినిమాల్లోని పాటలకు సంబంధించిన డ్యాన్స్ క్లిపింగ్స్‌తో కూడిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ‘బాబీ డియోల్ క్రికెట్ అంపైర్’ అంటూ కామెంట్ జతచేశాడు. ఈ వీడియోలో బాబీ డాన్స్.. అచ్చం క్రికెట్లో బౌండరీలు, వైడ్ సంజ్ఞలను సూచించే అంపైర్ మాదిరిగానే ఉంటుంది. ‘ప్రియమైన బీసీసీఐ మా హీరో అంపైరింగ్ నైపుణ్యం చూసి ఐపీఎల్ 2021లో అంపైర్‌గా నియమించుకోని ఆనందించండి’, ‘ఆయన క్రికెట్ అంపైరింగ్ సూపర్’, ‘విలక్షణ అంపైర్ బిల్లీ బౌడెన్ కంటే బాగా అంపైరింగ్ చేస్తున్నాడు’ అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల పంజాబ్‌లోని పటియాలాలో ఆయన నటిస్తున్న ‘లవ్ హాస్టల్’ మూవీ షూటింగ్‌ను రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. బాబీ డియోల్ సోదరుడు, బీజేపీ నాయకుడు, గుర్దాస్పూర్ ఎంపీ సన్నీ డియోల్ రైతుల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సరదా వీడియోను 99 వేల మంది వీక్షించగా, ఎనిమిది వేల మంది లైక్ చేశారు. దవండి: ఆ బుక్ ఎన్నో తరాలను పరిచయం చేస్తుంది: ప్రియాంక -
“ఏకే వర్సెస్ ఏకే” : అనిల్ కపూర్ క్షమాపణలు
న్యూ ఢిల్లీ: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న “ఏకే వర్సెస్ ఏకే” చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తీసివేయాలని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డిమాండ్ చేసింది. ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యూనిఫాం తప్పుగా ధరించారని, వాడకూడని భాష మాట్లాడారని భారత వైమానిక దళం బుధవారం చేసిన ఓ ట్వీట్లో పేర్కొంది. ‘‘ఇది భారత దళాలలో ఉన్నవారి ప్రవర్తనా నిబంధనలకు అనుగుణంగా లేదు. సంబంధిత దృశ్యాలను తీసివేయాలి’’ అని చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్, నెట్‌ఫ్లిక్స్ ఇండియాను ఈ ట్వీట్లో ట్యాగ్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర హీరో అనిల్ కపూర్ స్పందించారు. బుధవారం ట్విటర్ వేదికగా క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘నా కొత్త చిత్రం ఏకె వర్సెస్ ఏకె ట్రైలర్ కొంతమందిని బాధపెట్టిందని తెలిసింది. నేను భారత వైమానిక దళం యూనిఫాం ధరించి అభ్యంతరకర భాషను మాట్లాడి అందరినీ బాధపెట్టినందుకు నా వినయపూర్వకమైన క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని అన్నారు. విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఏకే వర్సెస్ ఏకే. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ అనిల్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. -
ప్యాంట్ సూట్లో షాకిచ్చిన వధువు!
వివాహం జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక.. దాంతో చాలా మంది పెళ్లి తంతును గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటారు. బట్టలు మొదలు కళ్యాణ మంటపం వరకు ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. ఇక పెళ్లి కూతురు అనగానే మన మనోఫలకం మీద లెహంగా లేదా.. పట్టు చీర ధరించిన అందమైన యువతి మెదులుతుంది. అమ్మాయిలు ఈ పెళ్లి పట్టు చీర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మొత్తం పెళ్లి బట్టల్లో ఎక్కువ డబ్బు దీనికే కేటాయిస్తారు. ఇక పెళ్లి నాడు కడితే.. ఆ తర్వాత మళ్లీ ఎన్నో ఏళ్లకు దాన్ని బయటకు తీస్తారు. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఇదే జరుగుతుంది. అసలు పెళ్లికి చీరే కట్టుకోవాలా.. రోజు వేసుకునే దుస్తులు వేసుకుంటే ఏం అవుతుంది అని ఆలోచించింది ఓ యువతి. దాంతో ఇంతవరకు భారతీయ వధువు కనిపించని నయా అవతారంలో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఆ వివరాలు ఏంటో చూడండి.. (చదవండి: ఆరు కోట్ల ఎంగేజ్మెంట్ రింగ్!) సంజన రిషి అనే యువతి తన పెళ్లికి ప్యాంట్ సూట్ ధరించింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లి కుమార్తె అనగానే సాంస్కృతికంగా.. పోత పోసిన బొమ్మలా ఉండాలని ఎవరు చెప్పారు. వ్యక్తిత్వం మాత్రమే కరెక్ట్‌గా సూట్ అవుతుంది ఎవరికైనా. నా స్టైల్‌కి నప్పే దుస్తులను ఎన్నుకోవాలనుకున్నాను. కానీ స్థానిక చేతి వృత్తుల వారికి మద్దతు ఇవ్వాలనే నా నిర్ణయం మేరకు నేను కూడా ఎంతో కొంత చేశాను. ఈ పాత చేవి రింగులను సలోని కొత్వాల్ నుంచి తీసుకున్నాను. నా అద్భుతమైన నూతన ఆభరణాలను అనుమెర్టాన్ దగ్గర నుంచి తీసుకున్నాను. స్థానికల కళాకారులు నాలుగు రోజులు కష్టపడి వీటిని డిజైన్ చేశారు. ఇక నేను ధరించిన బస్టడ్ నా స్నేహితురాలి తల్లి దగ్గర నుంచి తీసుకున్నాను. కాఫీ పౌడర్‌తో డై వేసుకున్నాను. ఇక ఈ మొత్తం తంతులో నా సొంతమైనది ఏదైనా ఉందా అంటే నేను ధరించిన పౌడర్ బ్లూ ప్యాంట్ సూట్ మాత్రమే. నాకు నచ్చినట్లు నా బ్రైడల్ లుక్‌ని డిజైన్ చేసుకున్నాను. ఇందుకు గాను నేను లక్షలకు లక్షలు డబ్బు ఖర్చు చేయలేదు. సమయం కూడా వృథా చేయలేదు. అన్నింటికి మించి ఎంతో సంతృప్తికరంగా ఉన్నాను’ అంటూ సంజన రిషి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. నెటిజనులు ఆమె ఐడియాకి ఫిదా అయ్యారు. మీరు, మీ ఐడియా రెండూ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram Unprecedented vibes ... Who says bridal looks have to fit a mould, cultural or otherwise? The only thing a look must fit (other than your body) is your personality! I wanted to choose a wedding outfit that encapsulated my style but also stayed true to my commitment to supporting sustainability, local artisans and ethical shopping. I think I did great! Something old: These earrings I stole from @salonikotwal & @_rangana Something new: My stunning jewelry, put together by @anumerton and talented artisans in basically 4 days & this custom made-to-order #veilpatta by @toraniofficial Something borrowed: My bustier, which belonged to my best friends’ (@instagirma + @stop_youplay2much) mom, hand dyed by a frantic me the night before the wedding using old coffee. Something blue: The beyond gorgeous Pre-owned #GianfrancoFerre powder blue pantsuit of my dreams I’m never going to get over how I look and feel in this outfit! #pantsuitnation #bride #sustainablefashion #sustainableclothing #sustainability #slowfashion #slowfashionmovement #vintagefashion #vintageclothing #handmadejewelry #secondhandfashion #indianbride #indianbridal A post shared by Sanjana Rishi (@sanjrishi) on Sep 20, 2020 at 1:34am PDT -
సూపర్ పవర్స్ చిన్నారి, వీడియో వైరల్!
చిన్నప్పుడు పిల్లలకు ఏవేవో కథలు చెబుతూ ఉంటాం. అవి నిజమనుకొని పిల్లలు ఆ కథల్లోని పాత్రలను నిజ జీవితంలో ఊహించుకుంటూ ఉంటారు. ఆ కథలో వాళ్లకు బాగా నచ్చిన పాత్రలో తమని తాము ఊహించుకొని మురిసిపోతూ ఉంటారు. ఇప్పుడు కథలు చెప్పే కాలం పోయి పిల్లలందరికి టీవీలో కార్టూన్లు, యూ ట్యూబ్‌లో బొమ్మల కథలను చూపిస్తున్నాం. అయితే ఒక పిల్లాడు తాను చూసే బొమ్మల్లో ఒక పాత్రకు ఉండే సూపర్ పవర్స్ తనకి కూడా ఉన్నాయని అనుకుంటున్నాడు. ఒక చెట్టు దగ్గరికి వచ్చి తాను చేతులు కదపగానే చెట్టు ఆకులు కదలడాన్ని చూసి తనకున్న సూపర్ పవర్స్ వల్లే చెట్లు ఆకులు ఊగుతున్నాయని సంబరపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( గాళ్‌ఫ్రెండ్ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే..) తాను చూసే కార్టూన్ పాత్రల్లో తనని తాను ఊహించుకుంటున్న ఒక పిల్లాడు తాను కూడా ఒక సూపర్ మ్యాన్ని అని అనుకున్నాడు. తనకున్న సూపర్ పవర్‌తోనే చెట్టు కొమ్మలు, ఆకులు ఊగుతున్నాయని తెగ సంబర పడిపోతున్నాడు. అసలు ఇంతకి ఏం జరిగిందంటే ఆ పిల్లవాడు ఆకుల్ని చూస్తూ చేతులు ఆడించగానే చెట్టు ఆకులు కదులుతున్నాయి. ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి తన తండ్రి వైపు చూసి నా శక్తుల వల్లే ఆకులు కదులుతున్నాయని చెబుతాడు. దానికి వాళ్ల నాన్న కూడా నీ వల్లే అని తల ఊపుతాడు.నిజానికి ఆ చెట్టుకు కట్టిన ఊయలలో ఆ బాబు తండ్రి కూర్చోని పిల్లవాడు చేతులు కదపగానే ఊయలని కదుపుతున్నాడు. దీంతో ఆకులు కదులుతున్నాయి. అది తెలియని చిన్నారి తన శక్తుల వల్లే ఆకులు కదులుతున్నాయని మురిసిపోతున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసి క్వారంటైన్ సమయంలో చిన్నారి తండ్రి పిల్లవాడికి ఎంతో కొంత ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని కొందరు భావిస్తుంటే మరి కొంతమంది పిల్లవాడిని అతని తండ్రి ఫూల్ చేస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. (సర్ప్రైజ్ సూపర్!.. ఆ అట్టపెట్టెలో ఏముందంటే..) Giving a little boy super powers from r/HumansBeingBros -
5 నిమిషాల్లో వైరస్ మాస్క్
-
‘నెట్టే’ట మునక
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ప్రజలు ‘నెట్’లోకంలో మునిగితేలుతున్నారు. గంటలకొద్దీ డిజిటల్ ప్రపంచంలో విహరిస్తూ ఇంటర్నెట్కు బానిసలుగా మారుతున్నారు. ఆధునిక సాంకేతికతను అవసరానికి మించి వాడుతూ శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ, సోషల్ మీడియా... ఇలా డిజిటల్ మాధ్యమాలతో రోజుకు ఏడు గం టల చొప్పున ఏడాదికి సరాసరిన 1,800 గంటలపాటు కుస్తీ పడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. డిజిటల్ మార్కెటీర్ అనే సంస్థ ఇటీవల హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ తదితర మెట్రో నగరాల్లో ఆన్లైన్ మాధ్యమం ద్వారా సుమారు 50 వేల మంది అభిప్రాయాలు సేకరించి అధ్యయన వివరాలు ప్రకటించింది. చేతిలో నిరంతరం స్మార్ట్‌ఫోన్‌తో దర్శనమిచ్చే యువత... ఖాళీ సమయాల్లో డిజిటల్ మాధ్యమాలతో కుస్తీ పడుతోంది. ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి సెల్‌ఫోన్ టచ్ చేస్తూ అప్డేట్స్ చూసుకుంటున్నట్లు అధ్యయనం తెలి పింది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు సెల్‌ఫోన్ తమ జీవితంలో విడదీయరాని భాగంగా మారిందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. టీనేజర్లలో 50% మంది డిజిటల్ ఎడిక్షన్‌కు గురవుతున్నట్లు స్పష్టం చేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే డిజిటల్ అడిక్షన్తో పలు శారీరక, మానసిక సమస్యలతో బాధపడాల్సి వస్తుందని హెచ్చరించింది. డిజిటల్ వర్రీ.. క్షణం తీరికలేకుండా స్మార్ట్‌ఫోన్‌తో గంటలతరబడి కాలక్షేపం చేస్తున్న మెట్రో నగరవాసులకు కొత్త చిక్కులొచ్చాయి. నిరంతరాయంగా వాట్సాప్‌లో చాటింగ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిలో అప్డేట్స్ కోసం రెప్పవాల్చకుండా స్మార్ట్‌ఫోన్ వైపు దృష్టిసారిస్తుండడంతో మెడ, వెన్నునొప్పులతో సతమతమవుతున్నట్లు తేలింది. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్‌ను చేతిలో పట్టుకొని సరిగా కూర్చోకుండా చాటింగ్ చేయడం, అధిక సమయం చాటింగ్‌లోనే గడిపేస్తుండటంతో వెన్నెముక డిస్క్ లు ఒత్తిడికి గురై పలువురు వెన్నునొప్పులతో బాధపడుతున్నట్లు పేర్కొంది. చాటింగ్ సమయం లో భుజం, తల, మెడ కండరాలు అధికంగా ఒత్తిడికి గురై బిగుసుకుపోవడంతోనే ఇవి తలెత్తుతున్నాయని, ఛాతీ కండరాలూ పలుమార్లు బిగుసుకుపోతున్నట్లు వైద్యులను ఉటంకిస్తూ పేర్కొంది. చిన్నారులూ బాధితులే.... అధిక గంటలు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లలో గేమ్స్ ఆడే చిన్నారులు సైతం మెడ, వెన్నునొప్పులతో సతమతమవుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రధానంగా సెల్ఫోన్లు, ట్యాబ్లెట్స్‌లో గేమ్స్ ఆడే సమయంలో సోఫాలు, మంచాలు, కుర్చీల్లో సరిగా కూర్చోకపోవడం వల్ల శారీరక కదలికలు లేక జీవనక్రియల్లో సమతౌల్యం దెబ్బతిని అనారోగ్యం పాలవుతున్నారని వెల్లడించింది అనర్థాలివే: మెడ నొప్పులు, వెన్నెముక డిస్క్‌లు ఒత్తిడికి గురై నొప్పులతో సతమతమవడం, నరాలు బిగుసుకుపోవడం, చేతివేళ్లకు తరచూ తిమ్మిర్లు రావడం, స్పర్శకోల్పోవడం, జీవన క్రియలు మందగించ డం, వెన్నునొప్పులు, నిద్రలేమి, తుంటికండరాలు పట్టేయడం. శ్రుతి మించితే వైద్యులను సంప్రదించాల్సిందే. చిన్నారులకు స్మార్ట్‌ఫోన్ వినియోగం దురలవాటు గా మారితే తప్పకుండా సైకియాట్రిస్ట్‌లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారుల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫోన్ హాబీ ఇటీవలి కాలంలో 5 రెట్లు పెరిగిందని సైకాలజిస్టులు చెబు తున్నారు. పిల్లలకు ఫోన్లను సరదా కోసం ఇస్తున్న తల్లిదండ్రులు... అది వారికి దురలవాటుగా మారి నప్పుడే కళ్లు తెరుస్తున్నారని చెబుతున్నారు. చాలా మంది మాట్లాడటం కంటే ఫోన్ చాటింగ్‌కే ప్రాధాన్యతనిస్తున్నట్లు సైకాలజిస్టులు చెబుతున్నారు. ఫోన్ హాబీ శ్రుతి మించి దురలవాటుగా మారితే చిన్నారుల మెదడు కణాలూ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శారీరక వ్యాయామం, ఆటల ద్వారా చిన్నారుల్లో మానసిక, శారీరక ఆరోగ్యం పెరుగుతుందని సూచిస్తున్నారు. ఆటలకు దూరమై ఫోన్లు, ట్యాబ్లెట్లతో కుస్తీపట్టే చిన్నారులు తీవ్ర ఆవేశకావేశాలకు గురవడంతోపాటు వారిలో క్రమంగా హింసా ప్రవృత్తి పెరుగుతోందని స్పష్టం చేస్తున్నారు. ఇలా చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం ►స్మార్ట్ఫోన్లు వినియోగించే సమయంలో తరచూ బ్రేక్ తీసుకోవాలి. శరీర కదలికలు ఉండేలా చూసుకోవాలి. ►మెడను వంచకుండా స్మార్ట్‌ఫోన్ తెరను చూడాలి. ►నొప్పులు అధికమైతే న్యూరోసర్జన్లు, ఫిజియోథెరపిస్టులను సంప్రదించాలి. -
ఇద్దరు మహిళల ఘర్షణ; వీడియో వైరల్
లక్నో : మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో బుధవరం ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు పరస్పరం కొట్టుకున్నారు. వీరిలో ఒకరు లాయర్ కాగా మరోకరు స్థానిక మహిళగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి ఘర్షణ మధ్యలో మరో వ్యక్తి(లాయర్) కల్పించుకొని ఇద్దరు మహిళలను చితకబాదాడు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గొడవలకు కారణం ఏంటనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే పాత కక్షల కారణంగానే ఈ ఘర్షణ జరగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. -
వైరల్ వీడియో: నా గదిలో జెర్రీ ఉంది..!
ఇంగ్లీష్ భాషలో మనం ఒకటి మాట్లాడితే ఎదుటివాళ్లకు మరొలా అర్థం అవుతుందన్న విషయం తెలిసిందే. అలాంటి ఓ ఫన్నీ సంఘటన యూకేలోని ఓ హోటల్లో చోటు చేసుకుంది. అరబ్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఇంగ్లండ్‌లోని ఇంటర్ కాంటినెంటల్ అనే హోటల్ గదిలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దాన్ని సదరు హోటల్ రిసెప్షనిస్ట్‌కు కొంచం హాస్య చతురతను జోడించి వ్యక్తం చేశాడు. తన గదిలో ఉన్న పిల్లిని చూసి.. ‘నా గదిలో జెర్రీ ఉంది. వెంటనే నా గదికి ఒక టామ్‌ను తీసుకురండి. అప్పుడు ఆ టామ్ నా గదిలో ఉన్న జెర్రీని పట్టుకుంటుంది’ అని ఆ వ్యక్తి హోటల్ రిసెప్షనిస్ట్‌కు ఫోన్ చేశాడు. దీంతో ఆ రిసెప్షనిస్ట్ అతను చేసిన ఫిర్యాదుకు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తర్వాత అతను మాట్లాడిన ఫన్నీ ఫోన్ సంభాషణను ఓ ట్విటర్ యూజర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనికిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా టామ్ అండ్ జెర్రీకి సంబంధించిన పలు మీమ్స్‌ను నెటిజన్లు కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. అతను చేసిన ఫన్నీ సంభాషణకు నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటూ.. లైకులు, షేర్లు చేస్తున్నారు. -
రెప్పపాటులో చావు వరకూ వెళ్లి.. బతికాడు!
తిరువనంతపురం: కళ్లముందే మృత్యు ఘడియలు నృత్యం చేసిన భయానక అనుభవం కేరళలోని ఓ వ్యక్తికి ఎదురైంది. రెప్పపాటులో మరణం అంచుకు వెళ్లి బతికి బయటపడ్డాడు ఆ యువకుడు. వివరాల్లోకి వెళితే.. కేరళ కోజికొడ్‌లోని ఎంగపుజా ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ వీరంగం సృష్టించాడు. బస్‌ను ఫుట్‌పాత్‌కు దగ్గర అతివేగంగా నడిపాడు. అదే సమయంలో రోడ్డును దాటడానికి ప్రయత్నించిన ఓ స్కూటరిస్ట్ అనుకోకుండా ఒక్కసారిగా బస్సు కింద పడ్డాడు. అయితే బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో.. బస్సు.. స్కూటర్‌ను చాలా దూరం వరకు లాక్కొని పోయింది. దీంతో ఆ వ్యక్తి బస్సు టైరులో చిక్కుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సు కొంచం వేగం తగ్గాక అతడు అందులో నుంచి బయట పడ్డాడు. ఈ సంఘటనలో బాధితుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫుట్‌పాత్ మీద ఉన్న రెండు బైకులు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాద దృశ్యాలు ఫుట్‌పాత్ పక్కన ఓ దుకాణంలో అమర్చిన సీసీ టీవీలో రికార్డు అయింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. కాగా కేరళలో రోజుకు సమారు 12 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలన్ని అతి వేగం కారణం జరుగుతున్నాయని తెలుస్తోంది. -
రైల్వే స్టేషన్లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..!
న్యూఢిల్లీ : ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పాడిన అలనాటి క్లాసిక్ పాటలను తన గళంతో సుతిమెత్తగా ఆలాపిస్తూ.. సంగీత ప్రియుల హృదయాల్ని గెలుచుకున్న రణు మొండాల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తన గాన మాధుర్యంతో రాత్రికి రాత్రే పాపులరైన పశ్చిమ బెంగాల్‌కు చెందిన రణు మొండాల్‌ను బాలీవుడ్ నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా ప్రోత్సహించాడు. తన తదుపరి సినిమా ‘హ్యాపీ హార్డీ అండ్ హీర్’లో ఆమెకు పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఈ క్రమంలో రణు మొండాల్ పాట పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘తేరీ మేరీ కహానీ’ అనే పాటను ఆమె అద్భుతంగా ఆలపించారని చెప్పాడు. ‘మనం కన్న కలలు నిజమయ్యే రోజు తప్పక వస్తుంది. లక్ష్య సాధన కోసం కృషి చేయడం మాత్రం మరువొద్దు. ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తేనే అది సాధ్యం. నన్ను అభిమానించే వారందరికీ ధన్యవాదాలు’అని హిమేష్ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు. హిమేష్ మంచి మనసును చాటుకున్నాడని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (చదవండి : అద్భుతమైన గానం.. నెటిజన్ల ఆనంద పారవశ్యం!) ‘. ఈ నేపథ్యంలో ‘నిన్న రైల్వే స్టేషన్లో ఉన్న రణు మొండాల్‌ను నేడు ప్లేబ్యాక్ సింగర్‌ను చేశావ్. నీది చాలా గొప్ప మనసు’ అని కొందరు.. రణు మొండాల్ కలను నిజం చేశావ్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక బెంగాల్‌లోని రణఘాట్ రైల్వేస్టేషన్లో రణ మొండాల్ పాడిన పాటల్ని ‘బర్పెటా టౌన్ ద ప్లేస్ ఆఫ్ పీస్’ అనే ఫేస్బుక్ పేజీ నెటిజన్లకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘లతా మంగేష్కర్‌లా తీయగా పాడుతోంది..‘రణాఘాట్ లత’ అని నెటిజన్లు కామెంట్లు చేశారు. -
వైరల్ : విరుచుకుపడిన ‘సునామీ’ అలలు..!
బీజింగ్ : ఓ తెలుగు సినిమా పాటలో చెప్పినట్టు.. ‘జలకాలటాలలో.. గలగల పాటలలో.. ఎంత హాయిలే హలా.. ఏమేమీ హాయిలే హలా’అన్నట్టుగా ఉంటుంది నీటి కొలనులో ఈదులాడటం. దక్షిణ చైనాలోని సముద్రం ఒడ్డున ఉన్న ఓ వాటర్ పార్కులో చాలా మంది జనం గత ఆదివారం అలాంటి పాటే పాడుకుంటూ.. జలకాల్లో మునిగిపోయారు. కానీ.. ఉన్నట్టుండీ ఓ ఉపద్రవం ముంచుకొచ్చింది. అంతెత్తున ‘సునామీ‘ కెరటాలు వారిని ముంచెత్తాయి. నీటిలో చాలా మంది కిందామీద పడ్డారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒడ్డున ఉన్నవారు బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టారు. ఓ 10 సెకన్ల పాటు అక్కడ బీతావహ వాతావరణం నెలకొంది. అయితే, అది సునామీ కాదని తేలిపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వాటర్ పార్కులో అలలు సృష్టించే మెషీన్ తప్పిదం వల్ల భారీ ఎత్తున నీటి కెరటాలు వారిపై విరుచుకుపడ్డాయని తెలిసింది. ఘటనకు చింతిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తీవ్రమైన అలల తాకిడికి కొలనులో ఉన్న 44 మంది గాయపడ్డారు. ఒడ్డున ఉన్న ఓ మహిళ పరుగెత్తబోయి కిందపడటంతో గాయాలపాలయ్యారు. పార్కు నిర్వాహకులపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ కొనసాగుతోంది. పార్కుని మూసివేశారు. ఈ ‘సునామీ’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ప్రియా వారియర్ (స్టూడెంట్) రాయని డైరీ
ప్రతి మనిషికీ లైఫ్‌లో ఏదో ఒక టైమ్‌లో ఎవరో ఒకరి మోరల్ సపోర్ట్ అవసరమౌతుంది! సపోర్ట్ లేకపోయినా ధైర్యంగా బతికేయొచ్చు. మోరల్ సపోర్ట్ లేకపోతే.. బతికే ధైర్యమే ఉండదు. తిండికి అమ్మ సపోర్ట్, కాలేజ్‌కి నాన్న సపోర్ట్. అంతవరకు ఓకే. బయట ఏదైనా సమస్య వచ్చినప్పుడే.. ఇంట్లో అమ్మానాన్న ఇచ్చే సపోర్ట్ సరిపోదు. బయటి నుంచి మోరల్ సపోర్ట్ రావాలి. ఇంట్లో ఇంత తిని, కాలేజ్‌కి వెళ్లొచ్చి, మళ్లీ రాత్రికి ఇంత తింటే తిని, నిద్రొచ్చే వరకు వాట్సాప్ చూసుకుంటూ, తెల్లారే లేచి మళ్లీ కాలేజ్‌కి వెళ్లొస్తుంటే.. సమస్యలేం ఉండవు. ఇల్లు, కాలేజీ కాకుండా.. ఆడపిల్ల ఇంకో ప్లేస్‌లో కనిపిస్తేనే మోరల్ సపోర్ట్ కోసం చూడాల్సి వస్తుంది! అలాగని ఇష్టమైన ప్లేస్‌లకు వెళ్లకుండా ఎలా?! సమాజం.. విలువల్ని పట్టుకుని వేలాడుతోందని, ఆడపిల్లలూ ఇంటిని పట్టుకుని వేలాడాలా?! కోర్టుకు రమ్మని సమన్లు వచ్చిన రోజు చూడాలి ఇంట్లో! ‘మన వంశంలో లేని పనులు ఎందుకంటే విన్నావా? ఇప్పుడు చూడు ఎవరో కేసు వేశారు. పరువు పోయింది’ అన్నారు నాన్న. సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఆయన. సోషల్ మీడియాలో నేను వైరల్ అయినందుకు ఆఫీస్‌లో అంతా ఆర్నెల్లుగా నాన్నకు కంగ్రాట్స్ చెబుతూనే ఉన్నారట. ‘నీకేమైనా సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందా తల్లీ.. వాళ్లలా కంగ్రాట్స్ చెబుతుంటే నేను థ్యాంక్స్ చెప్పడానికి!’ అన్నారు. ‘సివిల్స్‌లో ర్యాంక్ వస్తే వైరల్ అవుతారా.. నాన్నా..’ అనబోయాను. ‘అయినా.. ఆ కన్ను గీటటం ఏంటే?’ అంది అమ్మ.. నా బుగ్గలు నొక్కేస్తూ. ఆ రోజు అమ్మ, నాన్న.. ఇద్దరూ నా గురించే చాలాసేపు మాట్లాడుకున్నారు. ‘సర్లే.. భయపడకు’ అన్నారు. అది నాకు ధైర్యం చెప్పినట్లు లేదు. వాళ్లకు వాళ్లు ధైర్యం చెప్పుకున్నట్లే ఉంది. నవ్వాను. ‘‘ఏంటే నవ్వుతున్నావ్?’’ అంది అమ్మ. ‘ఇంకెప్పుడూ కన్ను గీటనులే’ అని అమ్మకు కన్ను గీటాను. సపోర్ట్ ఇచ్చేవాళ్లు చుట్టూ చాలామందే ఉంటారు. మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్లే.. కేరళలో ఒకరిద్దరు, ఢిల్లీలో ఇద్దరుముగ్గురు ఉంటారు. ఫస్ట్ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చింది రాహుల్ గాంధీ. ఇవ్వడం అంటే.. ఫోన్ చేసి ‘ఏం పర్లేదు ప్రియా’ అని చెప్పడం కాదు. సినిమా కోసం నేను చేసిన పనే, పార్లమెంటులో ఆయన చేశారు. కన్నుగీటారు. మనం చేసిన పనే మరొకరు చేస్తే అంతకుమించిన మోరల్ సపోర్ట్ ఏముంటుంది? నిన్న మళ్లీ ఢిల్లీ నుంచి సపోర్ట్ వచ్చింది. ఈసారి సుప్రీంకోర్టు నుంచి. ముగ్గురు జడ్జిలు నన్ను సపోర్ట్ చేశారు. ‘ఎవరో సినిమా తీస్తే, ఎవరో పాట పాడితే, ఎవరో అందులో యాక్ట్ చేస్తే.. వేరే పనేమీ లేనట్లు కేసు వెయ్యడమేనా?’ అని.. నాపై కేసు కొట్టేశారు. సుప్రీంకోర్టే కొట్టేశాక.. ఇక ఏ దేవుడి కోర్టు నన్ను దైవదూషణ కింద శిక్షిస్తుంది! ఈ నెలలో నా బర్త్‌డే. సుప్రీంకోర్టు నుంచి అడ్వాన్స్‌గా నాకు బర్త్‌డే విషెస్ వచ్చినంత ఆనందంగా ఉంది. ఈ నెలలోనే.. నేను కన్ను గీటిన సినిమా రిలీజ్ అవబోతోంది. ఈ నెలలోనే.. దుల్ఖర్తో నేను యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. అవి కూడా నాకు బర్త్‌డే గిఫ్ట్‌లు. ఊహు.. బర్త్‌డే గిఫ్టులు కాదు.. బర్త్‌డే లే! -
కత్తులు ప్రదర్శిస్తూ..బస్సులో ఫుట్‌బోర్డింగ్
-
మరోసారి అడ్డంగా బుక్కైన చంద్రబాబు
సాక్షి, అమరావతి : దేనినైనా మసిపూసి మారేడు కాయ చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. బాబు చేసేది గోరంత చెప్పుకొనేది కొండంత. ఇందులో ఆయనకు ఉన్న అనుభవం ముందు ఎంతటి వారైనా దిగదుడుపే. కేంద్ర సంక్షేమ పథకాలను సైతం ప్రభుత్వం పేరు చెప్పుకొని ప్రచారం చేసుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఇటీవల ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన పథకాన్ని చంద్రన్న భీమా పేరుతో ప్రమోట్ చేసుకోవాలని ప్రయత్నించిన చంద్రబాబు అడ్డంగా బుక్కైపోయారు. తాజాగా ప్రచార బాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి దొరికిపోయారు. విషయం ఏంటంటే అన్న క్యాంటీన్ పేరుతో ఇటీవల చంద్రబాబు నాయుడు కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు. అయితే ప్రారంభించిన రెండో రోజునే ఆహారం లేదంటూ కొన్ని చోట్ల క్యాంటీన్లను మూసివేశారు. మరికొన్ని చోట్ల ఆకలి తీర్చుకుందామని వచ్చిన పేదలపై తెలుగుదేశం నాయకులు జులుం చూపించారు. పట్టెడు మెతుకుల కోసం వచ్చిన వారిపై నిర్థాక్ష్యణ్యంగా దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. అయితే చేసిన గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకొనే చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రమోట్ చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఆయన చేసిన అసలు ఘనత బయటపడింది. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాలుగు రూపాయలకే భోజనం అంటూ రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు రూపాలయకే నాణ్యమైన భోజనం పేదలకు అందించాలనే లక్ష్యంతో ఆళ్ల ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఆ సందర్భంగా రాజన్న క్యాంటీన్ దగ్గర కడుపు నింపుకుంటున్న కొన్ని ఫొటోలను ఫేస్బుక్లో పోస్టు చేశారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను ప్రమోట్ చేసుకోవడానికి ప్రచార మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చారు. ఆ చిత్రంలో కొంత మంది పేదలు భోజనం చేస్తున్న ఫొటోలను కూడా పొందు పరిచారు. కానీ వాటిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన రాజన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఫొటోలను ఉపయోగించుకున్నారు. దీన్ని గ్రహించిన సోషల్ మీడియా కార్యకర్తలు చంద్రబాబు పనితీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రచారం తప్ప పనిలేదని మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రచార చిత్రాలను పరిశీలించండి పై చిత్రం 11-07-2018 రోజున ప్రచార మధ్యమాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన. ఇందులో బ్లూకలర్‌లో ఉన్న వృత్తాన్ని పరిశీలించండి. ముగ్గురు వ్యక్తలు భోజనం చేస్తున్నారు. ఇప్పుడు కింద ఉన్న మరో చిత్రాన్ని పరీక్షించండి. ఈ ఫొటో 14-05-2017 రోజున మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన రోజున ఫేస్బుక్లో చేసిన పోస్ట్. ఈ ఫొటోనే చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ప్రచార చిత్రంగా వాడుకుంది. -
నేను గర్భవతిని కాదు
గోవా బ్యూటీ ఇలియానాకి బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో పెళ్లి అయ్యిందా? లేదా? అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ లేదు. ఆండ్రూతో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేస్తుంటారే కానీ, పెళ్లి విషయంపై ఇలియానా కూడా స్పష్టత ఇవ్వడం లేదు. కానీ, ఆమె ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఇలియానా. సౌత్‌లో స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ సక్సెస్ బాటలో ముందుకెళ్తున్నారు. అయితే.. ఆమె గర్భవతి అంటూ ఇటీవల వార్తలు హల్చల్ చేశాయి. ‘‘నేను గర్భవతిని కాదు’’అంటూ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు ఇలియానా. ప్రెగ్నెంట్ విషయంపై క్లారిటీ ఓకే.. మరి పెళ్లి విషయంలో కూడా ఇలియానా ఓ స్పష్టత ఇస్తే బాగుంటుంది కదా! అంటున్నారు సినీ జనాలు. -
విషాదం: భార్యతో బ్రేకప్.. లైవ్‌లో పాముకాటుతో..
మాస్కో: ప్రేమించిన భార్య వదిలేసి వెళితే ఎవరికైనా బాధే. యవ్వనంలో ఉంటే ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి బాధను తట్టుకోవడం అందరి వల్లా కాదు. బాధతో తల్లడిల్లుతూ జీవితాంతం కుంగిపోతూ కృషించిపోయే వాళ్లు కొందరైతే, జీవితానికి ఎదురీది భార్యకన్నా బతుకు ముఖ్యమనుకొని జీవితంలో మరింతగా రాణించేవారు మరికొందరు. భార్యలేని జీవితం తనకెందుకని అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకునే పిరికివారు కూడా ఉంటారు. కానీ రష్యాలోని పీటర్స్బర్గ్కు చెందిన 31 ఏళ్ల ఆర్సే వలీవ్ ఈ కోవల్లో దేనికి చెందిన వాడు కాదు. 20 ఏళ్లుగా భయంకర విషపూరిత పాములతోని, మనుషులను తినే అడవి పిల్లులతోని ఆడుకునే వాడు. వాటి పట్ల ఉన్న ప్రేమతోనే ఆయన కొంతకాలం జంతుప్రదర్శన శాలలో పనిచేశాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి యూట్యూబ్‌లో పలు ఛానళ్ల నిర్వహించడం ద్వారా లక్షలాది అభిమానులను కూడగట్టుకున్నాడు. ఆయనకు భార్య ఏక్తరీనా కాత్యా అంటే కూడా చాలా ఇష్టమే. ఇద్దరూ యూట్యూబ్ ఛానళ్లలో తమ పెంపుడు పాములు, పిల్లులతో కనిపిస్తూ అల్లరిచేసే వారు. పాములతో ఆడుకోవడమూ, వాటికి సంబంధించిన విశేషాలు చెప్పడం ఇద్దరికీ ఇష్టమే. వారి మధ్య ఈ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్య తనతో సరిగ్గా ఉండడం లేదని, అందుకు మరో వ్యక్తితో ప్రేమాయణం సాగించడమే కారణమని వలీవ్కు అనుమానం వచ్చింది. ఆగస్టు 4వ తేదీన భార్య తలపై కొట్టాడు. ఆమె అప్పుడు స్పహతప్పి పడిపోయింది. జూలై నుంచి తమ మధ్య సెక్స్ లేదని, అందుకు కారణం ఆమె తనను పట్టించుకోకపోవడమే కారణమని వలీవ్ కెమేరా లైవ్‌లో తన బాధను పంచుకున్నారు. భార్యను కొట్టినందుకు సెప్టెంబర్ 21వ తేదీన ప్రజాముఖంగా క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. అయినప్పటికీ భార్యతో ఆయనకు సఖ్యత కుదరలేదు. ఇటీవల ఓ రోజున తనకు అత్యంత ఇష్టమైన ‘బ్లాక్ మాంబ’తో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చూపిస్తానని చెప్పాడు. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బ్లాక్ మాంబ. అది కరిస్తే కొన్ని నిమిషాల్లోనే మనిషి చనిపోతాడు. ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించిన మరుసటి రోజే వలీవ్ కెమేరా ముందుకు వచ్చి. తాను తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని, తెల్లారే నిద్ర లేచేసరికి పక్కన ఎవరూ లేకపోవడం ఎంతో వెలితిగా ఉందని అన్నారు. ఇలాంటి జీవితం అవసరమా ? అని ప్రేక్షకులను ప్రశ్నించారు. ఒక్క క్షణం అంటూ కెమేరా నుంచి పక్కకు వెళ్లాడు. కాసేపటికీ మత్తుగా ఉన్న కళ్లతో కెమేరా ముందుకు వచ్చాడు. ‘ఇదిగో చూడండి! నా కిష్టమైన బ్లాక్ మాంబతో కరిపించుకున్నా’ అని చెప్పాడు. ఆయన వేళ్లపైన పాము కరచినట్లు రెండు రక్తం చుక్కలు కనిపించాయి. ఇంతలో ఆయన కళ్లు మూసుకుపోతుండగా అటూఇటూ తూగుతూ మత్తుగా మాట్లాడాడు. చివరి నిమిషంలో తనకు భార్యను చూడాలని ఉందని, ఎవరైనా తన భార్యకు ఫోన్‌చేసి పరిస్థితి చెప్పండంటూ ఆమె మొబైల్ ఫోన్ నెంబర్ బయటకు చదివారు. ఆ తర్వాత లేచి బాత్రూమ్ వైపు వెళుతూ కనిపించాడు. కాసేపటికి కెమేరా ఆగిపోయింది. వలీవ్ బాత్రూమ్లోకి కాకుండా ఇంటిముందుకు వెళ్లి తనను కాపాడాల్సిందిగా బాటసారులను కోరారట. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న వారిలో కొందరు సమీపంలోని ఆస్పత్రికి ఫోన్లు చేయడంతో అంబులెన్స్ వచ్చి వలీవ్ను ఎక్కించుకొని వెళ్లిందట. ఆస్పత్రికి వెళ్లేలోగానే వలీవ్ కన్నుమూశాడు. ఆయన భార్య కాత్య ఈ వీడియోను చూసిందీ లేనిదీ తెలియదు. ఎలా స్పందించారో కూడా తెలియదు. -
బాపు....లేదు మరపు
బాపు కుంచెకు ప్రాణంపోసిన బెజవాడ అత్యధికంగా నగరంలోనే ముద్రితం ఏడాది పాటు గాంధీనగర్లోనే అద్దెకు ఉన్న బాపు-రమణలు కృష్ణమ్మ పరవళ్లు, బీసెంట్‌రోడ్డు రద్దీ, గాంధీనగర్ అంటే ఆయనకెంతో ఇష్టం.. అచ్చతెలుగు ఆనంద శిఖరం కరిగిపోయింది. భక్తిచిత్రాల బంగారు నిధి నింగికెగసింది. అందాల అలివేణి.. తెలుగింటి విరిబోణి అయిన ‘బాపు’బొమ్మ మూగబోయింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న తెలుగుతేజం దేహం విడిచింది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఎన్నో సినిమాలకు జీవంపోసిన సంప్రదాయ సంగమం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించిన సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు) ఆదివారం చెన్నైలో పరమపదించడంతో జిల్లాలోని ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యూరు. ఆ మహనీయునికి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విజయవాడ కల్చరల్ : బాపు కుంచె నుంచి జాలువారిన చిత్రాలెన్నో బెజవాడలోనే ప్రాణం పోసుకున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలసంఖ్యలో బాపు బొమ్మలు నగరంలో ముదిత్రమయ్యాయి. 1955లో బెజవాడతో మొదలైన ఆయన అనుబంధం తుదిశ్వాస విడిచే వరకు కొనసాగింది. నగరానికి చెందిన పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, స్వాతి వారపత్రిక అధినేత వేమూరి బలరామ్, ప్రముఖ రచయితలు పెద్దిభొట్ల సుబ్బరామయ్య, పన్నాల సుబ్రహ్మణ్యభట్టు, నవోదయ పబ్లిషర్స్‌కు చెందిన రామ్మోహన్రావు, న్యూస్టూడెంట్ బుక్ సెంటర్ అధినేత బాజ్జీ, కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీవీ పూర్ణచంద్, బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కృష్ణమ్మ పరవళ్లు, బీసెంట్‌రోడ్డులో రద్దీ, డిస్ట్రిబ్యూటర్ల కేంద్రమైన గాంధీనగర్ అంటే బాపు గారికి ఎంతో అభిమానం. ఇలా సుమారు 50 ఏళ్ల పాటు నగరంతో ఆయన సాహితీ అనుబంధాన్ని కొనసాగించారు. బాపు బొమ్మలకు డిమాండ్ ఎక్కువ ఒకప్పుడు ఏదైనా ముఖచిత్రంపై బాపు బొమ్మ ఉంటే చాలు ఆ పుస్తకాలకు డిమాండ్ విపరీతంగా ఉండేది. ఇదే కోవలో బాపుకు బెజవాడతో బంధం ఏర్పడింది. అనేకమంది ఔత్సాహిక కవులు, రచయితలు రాసిన పుస్తకాలపై బాపుతో ముఖచిత్రం వేయించుకోవటం అంటే అప్పట్లో పెద్ద క్రేజ్‌గా ఉండేది. ఇలా వందల పుస్తకాలు ముద్రితమైన క్రమంలో బాపు స్వయంగా రచయితతో, పబ్లిషర్‌తో మాట్లాడేవారు. న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్ ముద్రించే నోట్ పుస్తకాలపై బాబు వేసిన బొమ్మలు, కొత్త సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబించించేలా ముద్రించే అభినందన గ్రీటింగ్ కార్డులకు బాపు బొమ్మలు వేసేవారు. వీటికి అప్పట్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. మాసపత్రిక నుంచి మోడరన్ కేఫ్ వరకు.. బాపుకు విజయవాడలో ఏడాది పాటు అద్దెకు ఉన్నారు. 1970వ దశకంలో ఆంధ్రజ్యోతి మాసపత్రికలో కార్టూనిస్ట్‌గా పనిచేశారు. అదే మాసపత్రికకు ముళ్లపూడి రచయితగా పనిచేశారు. గాంధీనగర్‌లోని పాత రాధా టాకీస్ సమీపంలోని నివాసంలో బాపు, రమణ ఒకేచోట నివాసం ఉన్నారు. ఏడాదిపాటు ఇక్కడ పనిచేసిన ఇద్దరూ ఆ తరువాత చెన్నై వెళ్లిపోయూరు. ఆ తర్వాత ప్రచురణలు, ఇతర పనుల నిమిత్తం ఎప్పుడు విజయవాడ వచ్చినా బీసెంట్‌రోడ్డులోని మోడరన్ కేఫ్ హోటల్లోనే బస చేసేవారు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా రూపొందించిన ‘ఇద్దరుమిత్రులు’ సినిమా కథ రచన, చిత్రాల రూపకల్పన పనులన్నీ అక్కడే జరిగాయని బాపు ఒక సందర్భంలో ప్రకటించారు. ఆ తర్వాత విశాలాంధ్ర పబ్లిషర్స్‌లో ఆయన ముఖచిత్రాలు అనేకం ప్రచురితమయ్యూరుు. ‘బుక్ ఫెస్టివల్’తో అనుబంధం విజయవాడలో ఏటా నిర్వహించే బుక్ ఫెస్టివల్‌కు, బాపుకు విడదీయరాని బంధం ఉంది. దీనికి కావాల్సిన లోగోలు, బొమ్మలు ఆయనే వేసేవారు. ఈ ఏడాది జరిగిన 20వ బుక్ పెస్టివల్ లోగో బొమ్మను ఆయనే వేశారు. ఆయన సన్మానాలకు ఇష్టపడేవారు కాదని ఆయనకు సన్నిహితంగా ఉండేవారు పేర్కొంటారు. అయితే, బుక్ ఫెస్టివల్‌కు వచ్చి ఇక్కడ పుస్తకాలు కొనుగోలు చేసుకుని వెళ్లేవారు. బుక్ ఎగ్జిబిషన్ లైబ్రరీలో బాబు బొమ్మలు మనకు దర్శనమిస్తాయి. అపర శ్రీరామభక్తుడు బాపు రామభక్తుడు. ఒక రచయిత్రి ‘రామాయణ విషవృక్షం’ అనే నవల రాసి ముఖచిత్రం వేసి ఇవ్వమంటూ ఖాళీ చెక్కును ఆయనకు పోస్ట్ చేశారు. ఆయన ఆ ఖాళీ చెక్కుపై శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ.. అని రాసి సదరు రచయితకు తిప్పి పంపి తన భక్తిని చాటుకున్నారు. దైవానికి వ్యతిరేకంగా బొమ్మలు గీయడం కానీ, వ్యాఖ్యానాలు చేయడం కానీ బాపు ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవు. చిత్ర పరిశ్రమకు తీరని లోటు తెలుగు సినీరంగానికి విశేష సేవలందించిన బాపు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన దర్శకత్వంలో ఎన్నో కళాత్మక చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తనదైన బాణీలో సినిమాలు తీసి సినీరంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. - మండలి బుద్ధప్రసాద్, శాసనసభ డెప్యూటీ స్పీకర్ గోటితో నా బొమ్మ వేశారు.. నేను రచించిన ‘ధ్రువతార’ నవల వారంవారం ప్రచురితమయ్యేది. దాని ముఖచిత్రాలు బాపునే వేసేవారు. ముఖచిత్రం ఏవిధంగా ఉంటే ఆకర్షణగా ఉంటుందో ఆయనే నాతో మాట్లాడేవారు. నేను రాసిన ‘అంగారతల్పం’ నవలకు కూడా ముఖచిత్రం ఆయనే వేశారు. ఒకసారి ఆయనను కలిసినప్పుడు నాతో మాట్లాడుతూనే.. గోటితో నా బొమ్మను వేసి ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. - పెద్దిబొట్ల సుబ్బరామయ్య, రచయిత ఏడు దశాబ్దాల అనుబంధం బాపు, రమణ లతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఏడు దశాబ్దాలుగా బాపుతో స్నేహాన్ని కొనసాగిస్తున్నాను. రమణతో కలిసి నేను ప్రజాతంత్ర పత్రికలో పనిచేసేవాడ్ని. అక్కడకు బాపుగారు కూడా వచ్చేవారు. ‘బాపు రమణీయం’ పుస్తకం నన్నెంతో ఆకట్టుకుంటుంది. బాపు శ్రీరామ కథలను సినిమాగా తీసేవారు. నేటితరం ఆర్టిస్టులకు ఆయన ఆదర్శం. - తుర్లపాటి కుటుంబరావు, సీనియర్ పాత్రికేయుడు రచయిత ఆరాధ్యుడు.. మాలాంటి రచయితలు బాపును ఆరాధిస్తారు. ఆయన సోదరుడు సత్తిరాజు రామనారాయణకు మ్యూజియంరోడ్డులో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. నా తొలి పుస్తకం ‘అమలిన శృంగారం’ 1980లో విడుదలైంది. దాని ముఖచిత్రం బాపుగారే వేశారు. ‘నీ స్నేహితుడు కాబట్టి అతని వద్ద డబ్బు తీసుకోవద్దు. పూర్ణచంద్‌కు నా అభినందనలు.’ అని బాపు అనడం మరచిపోలేను. - జీవీ పూర్ణచందు,కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి -
బాపు గీసిన తొలి బొమ్మ
-
రమణగారు లేని జీవితం కష్టంగా ఉందండీ!
బాపుగారి చివరి ఇంటర్వ్యు సరిగ్గా 200 రోజుల క్రితం... ఉదయం పదకొండు గంటల వేళప్పుడు - చెన్నైలో బాపుగారింట్లో... ఆయన ఇంటర్వ్యూకోసం దర్శకుడు వీఎన్ ఆదిత్య, నేను (సినిమా డెస్క్‌హెడ్ పులగం చిన్నారాయణ), ఫొటోగ్రాఫర్ శివ చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా ఒక చేదువార్త... బాపు గారికి నీరసంగా ఉందట. ఇప్పుడేం మాట్లాడరట.. ముగ్గురం నీరసపడిపోయాం. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి. కనీసం ఆయనను కలిసి అయినా వెళదామని అలానే కూర్చుండిపోయాం.. మా అదృష్టం బాగుంది. బాపు గారు కరిగిపోయారు. లోపలకు రమ్మన్నారు. చాలా నీరసంగా కనబడ్డారాయన. మాటలు మొదలయ్యాక... చాలా హుషారు ఆయనలో. చిన్న పిల్లాడై పోయారు. చిత్రాలు... చిత్ర పటాలు... చిత్రాతిచిత్రమైన సంఘటనలు... గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌లు... మనసులో తగిలించుకున్న జ్ఞాపకాల చిత్తరువులు... పలు రకాల పుస్తకాలు.. బోలెడన్ని గ్రామ్‌ఫోన్ రికార్డులు... ఆయన బొమ్మలేసే చోటు.. రంగులేసే కుంచె... ఆ పక్కనే ఆయనకు కావాల్సిన స్వరాలందించే పాతకాలపు టేప్‌రికార్డర్... బాపు గారితో అలా... అలా... లీనమైపోయాం. రెండున్నర గంటలు... బాపు గారితో గడపడమంటే, మా మనసు ముంగిట్లో ముత్యాలముగ్గు వేసుకున్నంత ఆనందం. ఈ ఇంటర్వ్యూ మా జీవితంలో గ్రేటెస్ట్ మెమొరీ. కానీ... అదే ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ అవుతుందని అనుకోలేదు. మనసు నిండా విషాద మేఘాలు కమ్ముకున్న ఈ వేళ... ఒక్కసారి ఆయన జ్ఞాపకాలలోకి... మాటలలోకి... మీకు ఈ చిత్రకళ ఎలా అబ్బింది? బాపు: మా నాన్నగారు కూడా బొమ్మలు వేసేవారు. ఆయన అడ్వకేట్ అయినా హాబీగా బొమ్మలు వేసేవారు. అయితే ఇది కూడూ గుడ్డా పెట్టేది కాదని ఆయన అభిప్రాయం. నిజంగానే ఆ రోజుల్లో ఆర్టిస్టుగా బతకడం కష్టం. అందుకే నన్ను ‘లా’ చదివించారు. లా పూర్తయ్యాక, ఎప్పుడైనా కోర్టులో వాదించారా? అస్సల్లేదు. అప్పుడప్పుడు కోర్టుకి వెళ్లా. బీఎల్ డిగ్రీ రావడానికి ఎన్రోల్ కావాలి కదా. స్నేహితుల దగ్గర నల్లకోటు అరువు తీసుకుని వెళ్లాను. ఇంతకూ మీరు వెళ్లింది ఏ కోర్టు? నేను పుట్టి పెరిగిందంతా చెన్నై కదా. అక్కడ కోర్టుకే వెళ్లా. మా నాన్నగారు కూడా అక్కడే అడ్వకేట్‌గా పనిచేశారు. తమిళంలో ఓ ఫేమస్ ఆర్టిస్ట్‌కు మీరు ఏకలవ్య శిష్యుడట? ఆయన పేరు గోపులుగారు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాకు ఇష్టమైన ఆర్టిస్టులు అందరి దగ్గరికీ వెళ్తుండేవాణ్ణి. శని, ఆదివారాలు అదే పని నాకు. గోపులుగారింటికి ఆదివారాలు వెళ్లి, ఆయన బొమ్మలు వేస్తుంటే చూసేవాణ్ణి. నేనంటే చాలా ప్రేమ ఆయనకు. అప్పట్లో ఆయన ‘ఆనంద వికటన్’ మేగజైన్లో పనిచేసేవారు. మీరు బొమ్మలు గీసే పద్ధతి ఎలా ఉంటుంది? (వెంటనే ఆయన తన గదిలోకి తీసుకెళ్లి తను కూర్చుని బొమ్మలు గీసే ప్లేస్ చూపించారు). ఇక్కడే నేల మీద బాసింపట్టు వేసుకుని బొమ్మలు వేస్తుంటాను. మొదట్నుంచీ ఇదే అలవాటు. టేబుల్, కుర్చీ వాడను. ఏ ఆర్ట్‌కైనా మూడ్ ప్రధానం కదా. మరి మీకు ఏ టైమ్‌లో మూడ్ ఉంటుంది. నాకు మ్యూజిక్ ఉంటే చాలు. మూడ్‌తో పనిలేదు. ఏ టైమ్ అయినా, అర్ధరాత్రయినా సరే మ్యూజిక్ వింటూ బొమ్మలేసుకునే పని చేసేవాణ్ణి. ఇలా బొమ్మల మధ్యనే పడుకుని నిద్రపోయిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు ఓపిక లేదు. కూర్చుంటే లేవలేను. మీ రూమ్‌లో హిందీ మ్యూజిక్ డెరైక్టర్ సి. రామచంద్ర ఫొటో పెట్టుకున్నారు..? చాలా మంచి మ్యూజిక్ డెరైక్టరాయన. ‘అనార్కలి’ చేయడానికి ఆయన మద్రాసు వచ్చినప్పుడు కలిశాను. నా క్లోజ్‌ఫ్రెండ్ వి.ఎ.కె. రంగారావుగారు ఆయనకు వీరాభిమాని. సి. రామచంద్రగారి పాటల వల్ల నాకు ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. నాకు నలుగురితో కలిసి మాట్లాడటమంటే భయం. జలగండంలా నాకు ‘జన’గండం ఉన్నట్టుంది. రామచంద్ర పాట అంటే ఇష్టమని చెప్పగానే, అయిదు నిమిషాల్లో నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్లు చాలామంది ఉన్నారు. మీరు వినేది గ్రామ్‌ఫోన్ రికార్డులా? ఆడియో క్యాసెట్లా? మొదట్లో గ్రామ్‌ఫోన్ రికార్డులే వినేవాణ్ణి. తర్వాత క్యాసెట్లు. ఇప్పుడు సీడీలు. మీ దగ్గర బ్రహ్మాండమైన మ్యూజిక్ కలెక్షన్ ఉందట? మెహదీహాసన్, బడే గులాం అలీఖాన్‌ల మ్యూజిక్ కలెక్షన్ మొత్తం ఉంది. వాళ్ల గజల్స్ అంటే నాకు ప్రాణం. గజల్స్ అనే కన్నా, వాళ్ల వాయిస్సే నాకిష్టం. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని వాయిస్సులు వాళ్లవి. నాకు ఉర్దూ పెద్దగా రాదు. అయినా వారి వాయిస్‌ల వల్ల ఆ పాటలు బాగా ఎంజాయ్ చేశాను. 1978లో మెహదీహాసన్‌ని కలిశాను. ఓ బొమ్మవేసి ఇచ్చి సంతకం పెట్టమన్నాను. ‘‘హార్మోనియం పెట్టె... సగం బొమ్మే గీశావ్. మొత్తం గీసి తీసుకురా. అప్పుడు పెడతాను’’ అన్నారు. పెద్దవాళ్లకు వాళ్ల కళంటే అంత అభిమానం. బడే గులాం అలీఖాన్‌ను కలవలేకపోయాను. ఆయన కచ్చేరీలకు నన్ను పీబీ శ్రీనివాస్ తీసుకు వెళ్లేవారు. సినిమాలు బాగా చూస్తారా? రెగ్యులర్‌గా చూస్తా. అయితే అన్నీ వీడియోల్లోనే. నేను సినిమా బఫ్‌ని. రోజుకి పది దాకా వీడియోలు చూడగలను. వీడియోలు లేని రోజుల్లో మద్రాసులో మూడు రిలీజ్‌లుండేవి. మూడు పూట్లా మూడు రిలీజ్లు చూసేసేవాణ్ణి. సినిమా సినిమాకీ మధ్య ఒక టీ తాగి, బిస్కెట్లు తినేవాళ్లం. సినిమాలు తీయడానికి మీకు ఇన్స్పిరేషన్..? చిన్నప్పట్నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. మద్రాసులో హాలీవుడ్ సినిమాలన్నీ విడుదలయ్యేవి. అన్నిటికీ నేలక్లాసుకి వెళ్లిపోయేవాళ్లం. మీరు మౌత్ ఆర్గాన్ బాగా వాయించేవారట? కాలేజీ రోజుల్లో బాగా వాయించేవాణ్ణి. ‘మూగమనసులు’ పోస్టర్ మీరే డిజైన్ చేశారు కదా? అవును. రమణగారు ఆ సినిమాకి వర్క్ చేశారు కదా. సినిమాలో ఉన్నదాన్నే ఎలివేట్ చేస్తూ పడవ, పంగలి కర్ర, ముద్దబంతి పువ్వు ఆర్ట్‌గా వేశాను. మీ తొలి సినిమా ‘సాక్షి’కి మీరు పబ్లిసిటీ డిజైన్ చేసుకోకుండా ఈశ్వర్‌తో చేయించారెందుకని? ఈశ్వర్ పోస్టర్స్ ఇష్టపడి ‘సాక్షి’కి తనతో వేయించాను. ‘బంగారు పిచిక’లో యద్దనపూడి సులోచనారాణిగారిని కథానాయికగా తీసుకోవాలనుకున్నారట..? హీరోయిన్గా కాదు. ఆ సినిమాలో ఓ చోట హీరోకి గొప్పింటి సంబంధాలు తీసుకు వస్తుంది తల్లి. అక్కడ ఓ పెళ్లికూతురి వేషం యద్దనపూడి గారితో చేయించాలనుకున్నాం. ఆవిడ కూడా ఒప్పుకున్నారు. కానీ చేయించడం కుదర్లేదు. మీ ప్రతి సినిమాకూ స్టోరీబోర్డ్ వేసుకుంటారు. ఆ ఆలోచన ఎందుకొచ్చింది? నాకు బొమ్మలేయడం వచ్చు కాబట్టి, కన్వీనియంట్‌గా ఉంటుందని స్టోరీ బోర్డ్ వేసుకుంటుంటాను. హాలీవుడ్లో దాదాపుగా అందరూ స్టోరీబోర్డ్ ఫాలో అవుతుంటారు. హైదరాబాద్‌లో కూడా స్టోరీబోర్డ్ వేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అది ప్యూర్లీ పర్సనల్. బయటివాళ్లకు అర్థం కావు. ఆర్టిస్టులు కూడా చూద్దామని తీసుకుని అర్థంకాక ఇచ్చేసేవారు. మీ తొలి సినిమా ‘సాక్షి’ నుంచి స్టోరీబోర్డ్ ఫాలో అయ్యారా? అవును. నేను హోమ్‌వర్క్ ఎక్కువ చేసేవాణ్ణి. మీ స్టోరీబోర్డ్ ఫాలో అయితే ఎవరైనా ఫొటోగ్రఫీ చేసేయొచ్చునంటారు. లెన్స్ రేంజ్‌లు కూడా డీటెల్డ్‌గా రాస్తారట? అబ్బే అదేం లేదండి. ఎవరి పని వాళ్లదే. మీ సినిమాలకు గొప్ప గొప్ప బాలీవుడ్ కెమెరామేన్లు పనిచేశారు కదా! బాబా ఆజ్మీ, ఇషాన్ ఆర్యలాంటి వాళ్లు పనిచేశారు. వాళ్లతో మీకెలా పరిచయం? వాళ్ల సినిమాలు చూశాను. హిందీ సినిమా ‘గరమ్ హవా’కు ఇషాన్ ఆర్య వర్క్ చూసి, ఆయన ఎక్కడుంటారో కనుక్కుని మాట్లాడాను. ‘ముత్యాల ముగ్గు’ ఆయనకు తొలి తెలుగు సినిమా. దానికి ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. స్నేహం, గోరంత దీపం, తూర్పు వెళ్లే రైలు సినిమాలకు నాతో పనిచేశారు. ఆయన అసిస్టెంటే బాబా ఆజ్మీ. నటి షబనా ఆజ్మీ తమ్ముడాయన. కైఫీ ఆజ్మీగారబ్బాయ్. రాజాధిరాజు, వంశవృక్షం, రాధా కల్యాణం, త్యాగయ్య, పెళ్లీడు పిల్లలు తదితర సినిమాలకు వర్క్ చేశారు. ‘సంపూర్ణ రామాయణం’ సినిమాకి ట్రిక్ వర్క్ అంతా రవికాంత్ నగాయిచ్‌గారు చూసుకున్నారు. మీరు షాట్ ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేవారా? అలా మాట వినకపోతే నాతో పని చేయడం కష్టం. ఆర్టిస్టులకి మీరు యాక్ట్ చేసి చూపిస్తారా? చూపించాలి కదండీ. లేకపోతే వాళ్లకు ఎక్స్‌ప్రెషన్సూ అవీ ఎలా తెలుస్తాయండీ. సినిమా మొత్తం మనకు తెలుస్తుంది. వాళ్లు ఎక్కడనుంచో ఇక్కడకు వస్తారు. మనం చెప్పకపోతే వాళ్లకు ఎలా తెలుస్తుంది? మీ సినిమాల్లో ‘సీతమ్మ పెళ్లి’ ప్రత్యేకంగా అనిపిస్తుంది... చాలా మంచి కథ అది. మహేంద్రన్‌గారని తమిళంలో నాకిష్టమైన దర్శకుడు చేసిన ‘నిండు కొయిరాన్’ని తెలుగులో నేను చేశాను. తమిళంలో రజనీకాంత్ చేసిన పాత్రని తెలుగులో మోహన్‌బాబుతో చేయించాం. అందరూ మీ బొమ్మలు వాడుతుంటారు. మీరేమో ‘సీతాకల్యాణం’లో ఓ పాటలో మీ బొమ్మలు కాకుండా వేరే చిత్రకారుని బొమ్మలు వాడినట్టున్నారు? పిలకా నరసింహమూర్తిగారని మా గురువుగారు. ఆయనతో దశావతారాలు బొమ్మలు వేయించాను. మీ సినిమాల్లో ఎక్కడో ఒక చోట పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకని? ఐజన్‌బర్గ్ గారని గాడ్‌ఫాదర్ ఉండేవారు. ఫోర్డ్ ఫౌండేషన్‌వాళ్లు పెట్టిన సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్ట్‌కి ఆయన హెడ్. ఆయన చెప్పేవారు... సినిమాలో ఎక్కడో ఒకచోట పుస్తకం చూపించమని. వంటగదిలో సీన్ అయినా సరే. ఇల్లాలు పిల్లాడికి పాలు పట్టిస్తున్నా ఓ చేత్తో పుస్తకం ఉన్నట్టు చూపించమనేవారు. అందరూ పుస్తకాలు చదవాలనేది ఆయన అభిలాష. ‘సాక్షి’ సినిమాని ఇప్పుడు కూడా రీమేక్ చేయొచ్చునా? చాలామంది స్క్రీన్‌ప్లే అది. స్క్రీన్‌ప్లే వైజ్ గొప్పదే కానీ, పర్సనల్‌గా నా వర్క్ నాకు అంత గొప్పగా అనిపించదు. తమిళంలో ఏమైనా చేశారా? ఓకే ఒక్క సినిమా చేశాను. ‘ఇన్సాఫ్ కే తరాజ్’ని తెలుగులోనూ, తమిళంలోనూ చేశాం. మీ సినిమాలకు నెగిటివ్ ఎక్స్పోజర్ కూడా చాలా తక్కువనుకుంటాను? అవునండీ. సినిమా నిడివికి మూడు రెట్లు ఎక్స్పోజర్ ఉండేది. ఎందుకంటే రమణగారు స్క్రిప్ట్ రాసి ఇస్తే, నేను స్టోరీబోర్డ్ వేసేసేవాణ్ణి. అక్కడే చాలామట్టుకు ఎడిటింగ్ అయిపోతుంది. ఓ హిందీ సినిమాని ఒకే సెట్లో రెండు చోట్ల ఊటీలోనూ, ముంబైలో తీసేశాం. కాల్షీట్లు ఇబ్బంది వల్ల. అదంతా స్టోరీబోర్డ్ వల్ల సాధ్యపడింది. రమణగారికి ఏయన్నార్ క్లోజ్ అయితే, మీకు ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఉండేదా? అదేం లేదండి. నాకెవ్వరితోనూ ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది కాదు. ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు చేశాను. పిల్లల కోసం ప్రభుత్వం తరఫున ఓ ప్రాజెక్ట్ చేయిస్తే చేశాను. అదంతా రమణగారి చలవవల్లే. అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉండటం చాలా కష్టం. మీది మొదట్నుంచీ అదే పద్ధతి. కానీ ఏమీ లేకపోయినా డాంబికాలు పలికేవారిని చూస్తే ఏమనిపిస్తుంది? ఇంకొకళ్ల గురించి జడ్జ్ చేయడం కష్టం. తప్పు కదా..? ఈ గోడ మీద మీ బొమ్మలు కాకుండా పెద్ద పెద్ద పెయింటింగ్స్ ఏంటండీ? ఇవన్నీ ఓల్డ్‌మాస్టర్ పెయింటింగ్స్. ‘సీతా కల్యాణం’ టైమ్‌లో లండన్ వెళ్లినపుడు గూటాల కృష్ణమూర్తి గారితో వెళ్లి ఈ పెయింటింగ్స్ కొన్నా. నా ఇంకో ఫ్రెండ్ శ్రీరమణగారు ఇవన్నీ లామినేట్ చేసి పెట్టారు. 1978 నాటి బొమ్మలివి. చిత్రకళలో వచ్చే మార్పుల్ని గమనించడం కోసం ఇంటర్నెట్‌ని ఫాలో అవుతుంటారా? నాకస్సలు కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలీదు. ఎప్పటికప్పుడు పుస్తకాలు రిఫర్ చేస్తుంటాను. అప్పట్లో సెంట్రల్ స్టేషన్ దగ్గర్లో మూర్ మార్కెట్ ఉండేది. అక్కడ చిత్రకళకు, సంబంధించి ఫారిన్ బుక్స్ దొరికేవి. ఆల్మోస్ట్ ఆల్ అదే నాకు స్కూలులాంటిది. ప్రతివారం ఆ మార్కెట్‌కి వెళ్తుండేవాణ్ణి. లేకపోతే లైబ్రరీకి వెళ్లి బుక్స్ రిఫర్ చేస్తుండేవాణ్ణి. నా చిన్నప్పుడు ‘బాల’ అనే చిల్డ్రన్ మేగజైన్ ఉండేది. ‘రేడియో అన్నయ్య’ న్యాపతి రాఘవరావు గారిది. అందులో బొమ్మలేసేవాణ్ణి. ఆయనే ఎంకరేజ్ చేసేవారు. పుస్తకాల షాపుకి తీసుకెళ్లి ‘నీకు కావాల్సినవి కొనుక్కోవయ్యా’ అనేవారు. షీట్స్, రంగులు అన్నీనూ. ఇంటర్నేషనల్ లెవెల్లో మీ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ ఏమైనా పెట్టారా? చాలా పెట్టారండీ. అమెరికా, లండన్. ‘సీతాకల్యాణం’ టైమ్‌లో నేను కూడా లండన్ వెళ్లాను. మంచి ఆర్టిస్ట్ కావాలంటే ఏం చేయాలండీ? లోపల ఉండాలండీ. నేచురల్‌గా ఇంట్రస్ట్ ఉంటే ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్... చేస్తూనే ఉండాలి. అబ్దుల్ కరీం ఖాన్ అని గొప్ప క్లాసికల్ సింగర్ ఉండేవారు. చేతిలో పొన్ను కర్ర. దానికి వెండి పిడి. ఒకాయన ఎవరో మూడు నెలలు సెలవు పెట్టి వస్తాను... సంగీతం నేర్పించమన్నాడట. దానికాయన తన పొన్నుకర్రని చూపించి దీన్ని ఫ్యాక్టరీలో మెషిన్ మీద అయిదు నిమిషాల్లో తయారు చేస్తారు. కానీ నా అరచేయి కింద 30 ఏళ్లుగా ఉంది. అందుకే ఇంత నునుపు తేలింది. సంగీతం మూడు నెలల్లో నేర్చుకుంటే రాదు అన్నారట. అందుకే నిరంతరం అదే పనిలో ఉండాలి. వర్తమానంలో చిత్రకళ గురించి మీ అభిప్రాయం? అద్భుతంగా ఉంది. ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. పాతవే మంచివి అనుకోవడం పొరపాటు. ప్రస్తుతం మీకు నచ్చిన చిత్రకారుడెవరు? (నవ్వుతూ) నాకు జుట్టు లేదు కానీ, ఇంతమంది చిత్రకారులున్నారు. నిజంగా వేలల్లో ఉన్నారు. మనవళ్లూ మనవరాళ్లలో ఎవ్వరికైనా మీ ఆర్ట్ అబ్బిందా? నా రెండో అబ్బాయి కూతురు బొమ్మలు వేస్తుంది. దానికి 8 ఏళ్లు. మా అమ్మాయి కూడా బొమ్మలు వేస్తుంది. తను ఏదో గ్రాఫిక్స్ కంపెనీలో పనిచేస్తోంది. బొమ్మలు వేయడం నేర్పమని పిల్లలు అడగరా? (నవ్వేస్తూ) నాకు వస్తే కదా... వాళ్లకు నేర్పేది. నేను నిరంతర విద్యార్థిని. నేర్చుకుంటూనే ఉంటాను. ఇప్పుడు మీకు కాలక్షేపం ఏంటి? ఓపిక ఉంటే బొమ్మలు వేయడం. లేకపోతే పుస్తకాలు చదవడం. మొదట్నుంచీ పుస్తకాలు ఎక్కువ చదివేవాణ్ణి. రమణగారి స్క్రిప్టు లేకుండా మీరు రెండు సినిమాలు చేసినట్టున్నారు? లేదండీ. ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ నాటకం ఆధారంగా తీసిన సినిమా కదా. పద్యాలు ఉంటాయని గబ్బిట వెంకట్రావ్‌గారితో స్క్రిప్ట్ చేయించాం. రమణగారి ఇది లేనిదే నేను ఏ సినిమా తీయలేదు. ‘రామాంజనేయ యుద్ధం’కు రమణగారి కంట్రిబ్యూషన్ ఇన్‌డెరైక్ట్‌గా ఉంది. రమణగారు రాసిపెట్టుకున్న సినిమా స్క్రిప్టులు ఇంకేమైనా ఉన్నాయాండీ? లేవండీ. కొన్ని కొన్ని స్టోరీ ఐడియాలుండేవి. చేద్దామని ఫుల్‌ఫ్లెడ్జ్‌డ్‌గా ఏ స్క్రిప్టూ పెట్టుకోలేదు. ఐడియా నచ్చితే అప్పటికప్పుడు స్క్రిప్టు తయారు చేసుకునేవాళ్లం. డబ్బు ఎంత గొప్ప స్నేహితులనైనా విడదీస్తుందంటారు. మీరిద్దరూ తీసిన సినిమా ఫ్లాప్ అయితే ఏం ఇబ్బంది ఎదురు కాలేదా? అంతా రమణగారే చూసుకునేవారు. ఈ ఇల్లు ఆయన కట్టించిందే. ఎన్టీఆర్‌గారి స్కూలు పాఠాల ప్రాజెక్ట్ తర్వాత ఇది, పక్కన మా అమ్మాయి ఇల్లు, వెనుక రమణగారిల్లు కట్టుకున్నాం. రమణగారు ఇల్లు అమ్మేశాక, ఈ ఇంట్లోనే పైన ఉండేవారు. వెనుక ఇంట్లో ఏడాదో, రెండేళ్లో ఉన్నారంతే. ‘‘ఎప్పుడూ కలిసుండేవాళ్లం ఇలా వెనక్కు వెళ్లాను. అందుకే అమ్మేశాను’’ అని జోక్ చేసేవారు రమణ. చిన్నప్పట్నుంచీ తను మా ఇంట్లోనే ఉండేవాడు. మా అమ్మగారు తనను పెద్దబ్బాయ్ అని పిలిచేది. రమణగారు ఉండి ఉంటే... ఇంకో సినిమా చేసేవారా? చేసేవాణ్ణి. ‘శ్రీరామరాజ్యం’ తర్వాత ఏమైనా అనుకున్నారా? ‘శ్రీరామరాజ్యం’ జరుగుతుంటేనే పోయారాయన. స్క్రిప్ట్ ముందే రాసేస్తారు కనుక ఇబ్బంది అనిపించలేదు. రమణగారితో మీ లాస్ట్ వర్డ్? రాత్రి రెండింటికి వాళ్లావిడ పిలిచింది. నన్ను పైకి రమ్మంటున్నారని. జస్ట్ టూ మినిట్స్. అనాయాస మరణం. ఊపిరి అందలేదు. రమణగారు లేని లైఫ్ ఎలా ఉందండీ? చాలా కష్టంగా ఉందండీ (అంటుండగానే ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి). అప్పటి నుంచీ నాకు ఓపిక పోయింది. - సంభాషణ: వి.ఎన్. ఆదిత్య, పులగం చిన్నారాయణ -
దర్శకుడు బాపు కన్నుమూత
-
ప్రముఖ దర్శకుడు బాపు కన్నుమూత!
ప్రముఖ సినీ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని మల్లార్ ఆస్పత్రిలో మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఐదు నంది అవార్డులు అందుకున్నారు. 1933 సంవత్సరం డిసెంబర్ 15 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బాపు జన్నించారు. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. ఆంధ్రపత్రికలో ఆయన కార్టూనిస్తుగా కెరీర్ ప్రారంభించిన ఆయన సంగీతకారుడిగా, చిత్రకారుడిగా, కార్టునిస్ట్, డిజైనర్ గా పలు రంగాలకు ఎనలేని సేవనందించారు. సాక్షి చిత్రం ద్వారా చలన చిత్ర జీవితాన్ని ప్రారంభించిన బాపు తన కెరీర్ లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపు చివరి చిత్రం శ్రీరామరాజ్యం. ఆయన సినీ జీవితంలో 5 నంది అవార్డులు, రెండు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ముత్యాలముగ్గు చిత్రానికి బాపుకు జాతీయ పురస్కారం లభించింది. 1986 సంవత్సరంలో ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2013లో పద్మశ్రీ అవార్డు లభించింది. తెలుగులో సాక్షి, బాలరాజు కథ, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, మనవూరి పాండవులు, గోరంత దీపం, తూర్పు వెళ్లే రైలు, వంశవృక్షం, మిస్టర్ పెళ్లాం, రాధా గోపాలం, శ్రీరామ రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాలకు, హిందీలో హమ్ పాంచ్, సీతా స్వయవర్, అనోఖా భక్త్, బేజుబాన్, వో సాత్ దిన్, ప్యారీ బహ్నా, మొహబ్బత్, మేరా ధరమ్, ప్రేమ్ ప్రతిజ్ఞ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలరాజుకథ, అందాల రాముడు, ముత్యాలముగ్గు, పెళ్లిపుస్తకం, శ్రీరామరాజ్యం చిత్రాలకు నంది అవార్డు లభించింది. ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్లాం చిత్రాలకు జాతీయ అవార్డులను బాపు సొంతం చేసుకున్నారు. -
సోషల్ మీడియాలో బాపు మృతిపై అభిమానుల దిగ్బ్రాంతి
బాపు స్కూల్ నుంచి వచ్చిన వాడినని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నానని సినీ హీరో నానీ అన్నారు. బాపు వద్ద దర్శకత్వ శాఖలో నానీ పనిచేసిన సంగతి తెలిసిందే. బాపు మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతిని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. Rip Bapu garu. A legend rests. What an amazing artistic journey. — Lakshmi Manchu (@LakshmiManchu) August 31, 2014 Bapu gaaru is no more..My first director..My guru..My inspiration.A great artist.An amazing director.A complete human being.Will miss u sir. — Nani (@NameisNani) August 31, 2014 I am very very proud to say that I belong to Bapu school .. Thank you for everything sir. pic.twitter.com/44XD3ua81t — Nani (@NameisNani) August 31, 2014 Oh Sad news, veteran director Bapu, maker of some memorable movies in Telugu, Hindi has passed away, may his soul have peace. — Ratnakar Sadasyula (@ScorpiusMaximus) August 31, 2014 RIP bapu garu. Greatest filmmaker ever. — idlebrain jeevi (@idlebrainjeevi) August 31, 2014 One frame of Bapu garu will tell 100stories, Master!! Pride of Telugu. Rest in peace Legend. — Deepak (@Deepuzoomout) August 31, 2014 Saddened by the demise of dir. Bapu.Admired his work a lot &worked in Radha Kalyanam which got me a lot of awards .A genius. RIP sir — Radikaa Sarathkumar (@realradikaa) August 31, 2014 One of the biggest compliments for any Telugu girl is to be called a Bapu Bomma. Such was his artistry, may God grant peace to his soul. — Ratnakar Sadasyula (@ScorpiusMaximus) August 31, 2014 RIP Bapu garu!!!a great loss for the industry..:( — Priya Mani (@priyamani6) August 31, 2014 Highly shocking to knw that Bapu garu is no more!! :-O! Snehithudi deggaraki vellipoyara appude? Will take more time to digest this news :-( — Kireeti Damaraju (@KirrD) August 31, 2014 Rip legendary director bapu garu... I shall always treasure the paintings that u drew and gave me when I met u for te first time... — soumya bollapragada (@bsoumya26) August 31, 2014 Bapu garu, director of many classics like Mutyalamuggu, is no more. Great loss to Tollywood. RIP. — Jalapathy Gudelli (@JalapathyG) August 31, 2014 very sad to hear about the sudden demise of legendary director bapu garu.... rest in peace... — krishnachaitanya (@kanchetikrishna) August 31, 2014 -
రిక్రూటర్ నాడి పట్టెయ్.. ఉద్యోగాన్ని ఒడిసి పట్టెయ్!