ముంబై: బాలీవుడ్ సెలబ్రెటీల మీద సరదాగా మీమ్స్, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు అభిమానులు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అభిమాని తన ట్విటర్ ఖాతాలో బాడి డియోల్ నటించిన పలు సినిమాల్లోని పాటలకు సంబంధించిన డ్యాన్స్ క్లిపింగ్స్‌తో కూడిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ‘బాబీ డియోల్ క్రికెట్ అంపైర్’ అంటూ కామెంట్ జతచేశాడు. ఈ వీడియోలో బాబీ డాన్స్.. అచ్చం క్రికెట్‌లో బౌండరీలు, వైడ్ సంజ్ఞలను సూచించే అంపైర్ మాదిరిగానే ఉంటుంది.
‘ప్రియమైన బీసీసీఐ మా హీరో అంపైరింగ్ నైపుణ్యం చూసి ఐపీఎల్ 2021లో అంపైర్‌గా నియమించుకోని ఆనందించండి’, ‘ఆయన క్రికెట్ అంపైరింగ్ సూపర్’, ‘విలక్షణ అంపైర్ బిల్లీ బౌడెన్ కంటే బాగా అంపైరింగ్ చేస్తున్నాడు’ అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల పంజాబ్‌లోని పటియాలాలో ఆయన నటిస్తున్న ‘లవ్ హాస్టల్’ మూవీ షూటింగ్‌ను రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. బాబీ డియోల్ సోదరుడు, బీజేపీ నాయకుడు, గుర్‌దాస్‌పూర్ ఎంపీ సన్నీ డియోల్ రైతుల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సరదా వీడియోను 99 వేల మంది వీక్షించగా, ఎనిమిది వేల మంది లైక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment