Bobby Deol
-
విజయ్ 69 మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్
-
మీ తెలుగోడు నా జీవితాన్నే మార్చేశాడు.. డైరెక్టర్‌తో బాబీ డియోల్
బాబీ డియోల్(Bobby Deol) ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరో.. ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేసిన నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. 1995లో విడుదలైన 'బర్సాత్' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత సోల్జర్,రేస్ 3,ఓం శాంతి ఓం, క్రాంతి,దోస్తానా, కిస్మత్, హీరోస్, హౌస్‌ఫుల్ 4 వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపారు. అయితే, కెరీర్ పరంగా ఒకానొక సమయంలో వరుస పరాజయాలు దక్కడంతో సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఎంతో కుంగుబాటుకు గురయ్యారు. చివరకు భార్య సంపాదన మీద ఆధారపడుతున్నాడు అనే మాటలు కూడా ఆయనపై వచ్చాయి. ఒక్క ఛాన్స్‌తో రీ ఎంట్రీ కోసం ఎన్నో నిర్మాణ సంస్థలను కలిశారు. కానీ, ఎవ్వరూ ఇవ్వలేదు. కానీ, ఒక్క సినిమాతో ఆయన జీవితం మారిపోయింది. ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపుగా 15 ఏళ్లు ఇంట్లోనే కూర్చున్న బాబీ డియోల్‌కు ఇప్పుడు మళ్లీ ఛాన్సులు వస్తున్నాయి. ఇదంతా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వల్లే జరిగిందని బాబీ డియోల్ అన్నట్లు ప్రముఖ తెలుగు దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli) చెప్పారు.యానిమల్( Animal) సినిమా తర్వాత డాకు మహారాజ్‌తో బాబీ డియోల్ తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. అయితే, ఆయన జీవితానికి సంబంధించిన పలు విషయాలు డైరెక్టర్ బాబీ కొల్లి ఇలా చెప్పారు. 'యానిమల్ సినిమా తర్వాత బాబీ డియోల్ బిజీ అయిపోయాడు. మళ్లీ వరుస సినిమా ఛాన్సులతో స్పీడ్ పెంచాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అని తెలిసిందే. ఇదే విషయాన్ని బాబీ డియోల్ కూడా బహిరంగంగానే ఒప్పుకున్నాడు. మీ తెలుగోడు నా జీవితాన్ని మార్చేశాడు అంటూ.. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనం ఆయన్ను టచ్ చేస్తే చాలు ఏడ్చేస్తున్నాడు. అంతలా మన తెలుగువారిని బాబీ డియోల్ ప్రేమిస్తున్నాడు.' అని డైరెక్టర్ బాబీ కొల్లి పంచుకున్నారు.బాబీ డియోల్ కన్నీళ్లకు కారణాలు కూడా ఉన్నాయి. 2012 తర్వాత ఆయనకు సరైన సినిమాలు లేవు. ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ, పలితం దక్కలేదు. దీంతో దాదాపు 15 ఏళ్ల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. తన భార్య సంపాదనతోనే ఉండేవాడని ఒక బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసింది. ఒక ఇంటర్వ్యూలో తన కుమారుడి మాటలను ఆయన ఇలా గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ' నేను ఇంట్లో ఉండగానే నా కుమారుడు తన తల్లి వద్దకు వెళ్లి నాన్న ఎప్పుడూ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు..? ఎలాంటి పని చేయడా..? అని ప్రశ్నించాడు. అప్పుడు చాలా బాధ అనిపించింది. వాడు పుట్టక ముందే నేనొక సూపర్‌స్టార్. కానీ, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఫెయిల్యూ స్టార్‌ని అని నా మనసులో అనుకున్నా.' అని బాబీ డియోల్ గతంలో పంచుకున్నాడు. (ఇదీ చదవండి: మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్)సరిగ్గా అలాంటి సమయంలోనే ఆయనకు యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆయన దశ తిరిగింది. పాన్ ఇండియా రేంజ్లో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందుకే సందీప్ రెడ్డి అంటే బాబీ డియోల్‌కు చాలా ఇష్టం. యానిమల్ తర్వాత అతని లైఫే మారిపోయింది. హరిహర వీరమల్లు, హౌస్‌ఫుల్ 5, ఆల్ఫా, విజయ్ 69 ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝕍𝕠𝕟𝕘𝕠𝕕 𝕗𝕠𝕣𝕖𝕧𝕖𝕣 ♾️🛐 (@vongod_forever) -
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘డాకు మహారాజ్’ మూవీ సక్సెస్ ఈవెంట్ (ఫొటోలు)
-
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
టైటిల్: డాకు మహారాజ్నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సత్య తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: బాబీ కొల్లిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్విడుదల తేది: జనవరి 12, 2025కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..బాలయ్య చేసే మాస్ యాక్షన్ సినిమాల నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటుంది. విలన్ చెడు పనులు చేస్తూ జనాలను హింసించడం.. దాన్ని హీరో అడ్డుకోవడం. అన్ని కథలు ఇలానే ఉంటాయి. డాకు మహారాజ్(Daaku Maharaaj Review) కూడా అలాంటి కథే. అయితే పాత కథను కూడా కొత్తగా చెప్పడం కూడా ఓ కళ. అందులో దర్శకుడు బాబీ ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాడు. రొటీన్ కథనే అయినా హీరో ఫ్యాన్స్‌కి నచ్చేలా తెరకెక్కిస్తాడు.బాలయ్య తాలుకు ఇమేజ్‌ని దృష్టిలో ఫక్తు కమర్షియల్ ఫార్మెట్లో డాకు మహారాజ్ కథనాన్ని సాగించాడు. ప్రతి పది నిమిషాలకొక యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ యాక్షన్ సీన్లు కూడా కొత్తగా ఉంటాయి. గత సినిమాల మాదిరి బాలయ్య ఇందులో గట్టిగా అరవడం.. ఒంటి చేత్తో వందమందిని నరకడం లాంటివి ఉండవు. డీసెంట్ యాక్షన్ సీన్లతో బాలయ్యను కొత్తగా చూపించాడు. అయితే కథనం ఊహకందేలా సాగడం.. పాతకాలం నాటి సమస్యనే మళ్లీ తెరపై చూపించడం అంతగా ఆకట్టుకోదు. అలాగే మెయిన్ విలన్ని సెకండాఫ్ వరకు దాచడంతో హీరో, విలన్ల మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా సాగలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఎత్తుగడ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ప్రారంభంలోనే చూపించి కథనంపై ఆసక్తిని పెంచేశారు. మొదటి పావుగంట కృష్ణమూర్తి ఫ్యామిలీ, ఎమ్మెల్యే త్రిమూర్తుల చుట్టూనే తిరుగుతుంది. నానాజీగా బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. చిన్నారితో బాలయ్యకు ఏదో సంబంధం ఉంటుందని ఊహించినా.. అదేంటి అనేది సెకండాఫ్ వరకు దాచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. సివిల్ ఇంజనీర్ సీతారాం, డాకు మహారాజ్ కథంతా ద్వితియార్థంలోనే వస్తుంది. చంబల్ ప్రజలకు ఉన్న ఓ ప్రధాన సమస్యను తీర్చేందుకు సీతారాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఊచకోత ఉంటుంది. అది బాలయ్య అభిమానులను అలరిస్తుంది. ఎమోషన్ కోసం చిన్న పిల్లల పాత్రలను మరింత హింసాత్మకంగా తీర్చిదిద్దారు. అయితే ద్వితియార్థం ప్రారంభమైన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుందని ఊహించొచ్చు. క్లైమాక్స్‌ని ఇంకాస్త షార్ఫ్ గా కట్ చేస్తే బాగుండేదేమో. బాలయ్య అభిమానులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. బాలయ్యకు యాక్షన్ సినిమాలు కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాల్లో మరింత దూకుడుగా నటిస్తాడు. డాకు మహారాజ్లో కూడా అదే స్థాయితో నటించాడు. నానాజీగా, సీతారాంగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి, ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించాడు. యాక్షన్ సీన్లలో ఎప్పటి మాదిరే అదరగొట్టేశాడు. ఇందులో గత సినిమాల మాదిరి పెద్ద పెద్ద డైలాగ్స్, అరవడాలు ఉండవు. బాలయ్య చెప్పే డైలాగ్ తీరు కొత్తగా ఉంటుంది. బల్వంత్ ఠాకూర్‌గా బాబీ డియోల్ తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూనే డిఫరెంట్ విలనిజాన్ని చూపించాడు. ప్రగ్యా జైస్వాల్‌తో పోలిస్తే శ్రధ్ధా శ్రీనాథ్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. అయితే తెరపై మాత్ర ప్రగ్యానే ఎక్కువసేపు కనిపిస్తుంది. ఎమ్మెల్యే త్రిమూర్తులుగా రవికిషన్ చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో ఆయన విలనిజం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ ఆకట్టుకుంటుంది. ఊర్వశీ రౌతేలా పాటకే దబిడిదిబిడి పాటతో ఆకట్టుకోవడమే కాకుండా.. గ్లామర్‌తో యూత్‌ని అలరించింది. సచిన్ ఖేడ్కర్, చాందీనీ చౌదరితో పాటు వైష్ణవి పాత్ర పోషించిన చిన్నారి కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య సినిమా అంటే తమన్ రెచ్చిపోతాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా అదరిపోయే బీజీఎం అందించాడు. కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తాయి. పాటలు పర్వాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బాలయ్యతో కొత్త స్టంట్స్ చేయించారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ HD మూవీ స్టిల్స్
-
ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ'
తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువ'. దాదాపు మూడేళ్ల పాటు కష్టపడి తీసిన ఈ సినిమాని.. కోలీవుడ్ 'బాహుబలి' అని అన్నారు. తీరా చూస్తే రియాలిటీలో తేడా కొట్టేసింది. థియేటర్లలో అయితే పెద్దగా ప్రేక్షకులకు ఎక్కలేదు కానీ ఓటీటీలో కాబట్టి చూసేయొచ్చు. ఇప్పుడు ఈ చిత్రం అనుకున్న టైం కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8: రోహిణితో పాటు విష్ణుప్రియ ఎలిమినేట్!)తెలుగులో 'శౌర్యం', 'దరువు' తదితర చిత్రాలతో దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్న శివ.. తమిళంలోనూ అజిత్ హీరోగా పలు సినిమాలు తీశాడు. అయితే ఇతడిని నమ్మి 'కంగువ' సినిమా చేశాడు సూర్య. కానీ కష్టపడ్డప్పటికీ కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.నవంబర్ 14న థియేటర్లలో రిలీజైతే.. ఇప్పుడు అంటే డిసెంబరు 8న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి 'కంగువ' వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వెరన్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే మరీ మూడు వారాలకే ఇలా డిజిటల్‌గా అందుబాటులోకి రావడం విశేషం.(ఇదీ చదవండి: రెచ్చిపోయిన నిహారిక.. రొమాన్స్‌తో పాటు డ్యాన్స్‌లోనూ) -
Kanguva Review: ‘కంగువా’ ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ భారీ పీయాడిక్ యాక్షన్ ఫిల్మ్‌లో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలో పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సూర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.కంగువా కథేంటి? ఎలా ఉంది? సూర్య ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్‌లో కంగువా చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సూర్య యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. శివ టేకింగ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు, వీఎఫ్ఎక్స్ బాగున్నాయని చెబుతున్నారు. ఇక విలన్ పాత్రలో బాబీ డియోల్ అదరగొట్టేశాడని కామెంట్ చేస్తున్నారు. #Kanguva Review🌟🌟🌟🌟It's an EPIC BLOCKBUSTER 🔥 💥- #Suriya & #BobbyDeol's best movie till date and #DishaPatani also looks so hot🥵💥🔥👌- Top Tier BGM, faceoff Sequence Execution and VFX & visuals Top notch👍🔥✨🔥#KanguvaFromNov14#KanguvaBookings pic.twitter.com/6xjzx0SmVm— Ahmy (@ahmy30) November 14, 2024కంగువా బ్లాక్ బస్టర్ మూవీ. సూర్య, బాబీ డియోల్ కెరీర్లో ఇది బెస్ట్ ఫిల్మ్. దిశా పటానీ లుక్ హాట్‌గా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ బీజీఎం అదరగొట్టేశాడు. వీఎఫ్ఎక్స్, విజువల్స్ చాలా బాగున్నాయి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Kanguva Review🏆🏆🏆An engaging screenplay & solid performances from @Suriya_offl 😨💥Face off scenes Adrenaline pump💉🥵Can’t wait for #Kanguva2#BobbyDeol As usual nailed with his performance, He’s A BEAST🔥@ThisIsDSP you’re a musical magician🥵Overall - 4.25/ 5 ⭐️ pic.twitter.com/SI2s22zRTF— Lets OTT x CINEMA (@LetsOTTxCinema) November 13, 2024 స్క్రీన్‌ప్లే ఎంగేజింగ్‌గా ఉంది. సూర్య తన నటన అదిరిపోయింది. ఫేస్ ఆఫ్ సీన్స్ బాగున్నాయి. కంగువా 2 కోసం ఆగలేకపోతున్నాం. బాబీడియోల్ ఎప్పటిమాదిరే తనదైన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది’అంటూ ఓ నెటిజన్ 4.25/5 రేటింగ్ ఇచ్చాడు.#Kanguva is a below par fantasy action film that had a story with good potential but is executed in a clumsy way. Surya does well in his role and his efforts should be appreciated but it’s hard to save a script like this with just a performance. The film has a few decent…— Venky Reviews (@venkyreviews) November 14, 2024 కంగువా ఓ యావరేజ్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్. కథ బాగున్నా..తెరపై ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. సూర్య తన పాత్రకు న్యాయం చేశాడు. ఈ సినిమాకు కొన్ని సీన్లు బాగున్నాయి. మిగతా కథంతా యావరేజ్. ఎమోషనల్ మిస్ అయింది. డైరెక్టర్ శివ ఫస్టాఫ్ స్క్రీన్‌ప్లే బాగా రాసుకున్నాడు. కానీ సెకండాఫ్‌లో తడబడ్డాడు. బీజీఎం కొన్ని చోట్ల బాగుంది.మరికొన్ని చోట్ల అతిగా అనిపించింది. ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి’అంటూ ఓ నెటిజన్ 2.25 రేటింగ్ ఇచ్చాడు.#Kanguva - Honest Review 👍Positive : - Theatre ambience 👌- Safe Parking lot 💥- Unlimited Popcorn 🍿- Proper Sound system ♥️- Perfect AC temperature 🥶- Proper seating with correct level adjustments ✅Negative : -- Full Movie 👎👎— ... (@its_me_001) November 14, 2024Movie vera level🔥🥵🏆Siva has made a strong comeback! It’s a must-watch in theaters for its stunning visuals. As always, Suriya’s acting is outstanding.DSP BGM kangu kangu kanguvaaa🔥Racey Screen Play🔥🔥🔥Blockbuster #Kanguva 🔥🔥🔥🏆 pic.twitter.com/cLJ1qYZwAv— name_illa (@name_illainga) November 14, 2024First HalfFrancis Portion - 😐👎Kamguva Portion - 🙌Above avg 😐#Kanguva— Ciril_Thomas_997 (@Ciril_Thomas_97) November 14, 2024worth watching kanguva best ever tamil cinema . made tamil cinema at its peak 🔥🔥🔥🔥🥵🥵VFX , bgm , casting , dialogue delievery , surya 😱😱😱😱#Kanguva #KanguvaBookings #KanguvaFDFS #Surya #SiruthaiSiva #DSP #GnanavelRaja 🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌👌🥳🥳🥳🥳— karl marx (@vens1917) November 14, 2024 -
హైదరాబాద్‌లో ఘనంగా ‘కంగువ’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
సూర్య ‘కంగువ’ మూవీ HD ఫోటోలు
-
హీరో సూర్య ‘కంగువ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సూర్య ‘కంగువ’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
కంగువా చూశాక ఆ సినిమాలే గుర్తుకొస్తాయి: సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దసరాకే రావాల్సిన ఈ చిత్రం వేట్టయాన్ రావడంతో బాక్సాఫీస్ బరి నుంచి తప్పుకుంది. ఈ భారీ యాక్షన్ సినిమాను శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుందని కంగువా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండంతో కంగువా టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్ సూర్యతో పాటు హీరోయిన్ దిశాపటానీ, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంగువా గురించి సూర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ కచ్చితంగా హాలీవుడ్ చిత్రాన్ని తలపిస్తుందని అన్నారు. ఈ సినిమా బ్రేవ్‌హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి హాలీవుడ్ చిత్రాలను గుర్తు చేసేలా ఉంటుందని తెలిపారు. సూర్య మాట్లాడుతూ..'మనం బ్రేవ్‌హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, అపోకలిప్టో వంటి చిత్రాలను ఇష్టపడతాం. వాటిని చూసి ఆశ్చర్యానికి గురవుతాం కూడా. ఆ సినిమాలు చాలాసార్లు చూశాం. మేము కూడా ఇప్పుడు అలాంటి సినిమాలే చేయబోతున్నాం. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన శివకు వచ్చింది. అప్పటి ప్రజలు ఎలాంటి జీవితాన్ని గడిపారు? వారికి ఎదురైన కష్టాలేంటి? అనే విషయాలను తెరపై ఆవిష్కరిస్తే బాగుంటుందని చెప్పాడు. ఆ విధంగానే కంగువాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. విజువల్ ఎఫెక్ట్స్, కథ విషయంలో శివ చాలా ప్రతిభావంతుడు. అతను థియేటర్లో కంగువా చూశాక మీకే తెలుస్తుంది" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో విలన్‌గా బాబీ డియోల్ నటించారు. -
ఏడాదిన్నర ఆగితే.. 12 రోజులు షూట్ చేశారు: బాబీ డియోల్
సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. సినిమా రిలీజ్ తర్వాత చాలామంది రణ్‌బీర్‌తో పాటు బాబీ డియోల్ నటనపై కూడా ప్రశంసలు కురిపించారు. తెరపై ఆయన కనిపించేది కాసేపయినా.. తనదైన నటనతో భయపెట్టాడు. అయితే పాత్ర కోసం బాబీ దాదాపు ఏడాదిన్నర వేచి చూశాడట. ఒకనొక దశలో సినిమాలో తన పాత్ర ఉంటుందో లేదో అని భయపడిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా బాబీ డియోలే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఒక రోజు నాకు సందీప్ వంగా నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను తీయబోతున్న కొత్త సినిమాలో విలన్ పాత్ర కోసం కలవాలని చెప్పారు. వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. కథ చెప్పేందకు నా దగ్గరకు వస్తూ.. ఓ ఫోటోని తీసుకొని వచ్చాడు. అది నేను సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొన్న ఫోటో. అందులో నా ఎక్స్ప్రెషన్స్ చూసి ఆ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నానని సందీప్ చెప్పడంతో ఆశ్చర్యపోయాను. కథ, నా పాత్ర నచ్చి వెంటనే ఒకే చెప్పేశాను. షూటింగ్ మొదలై నెలలు గడుస్తున్న నన్ను మాత్రం పిలవలేదు. దీంతో నాకు అనుమానం కలిగింది. సందీప్ మనసు మార్చుకొని నా పాత్రను వేరే వాళ్లకి ఇచ్చాడేమో అనుకున్నాను. దాదాపు ఏడాదిన్నర తర్వాత నాకు పిలుపొచ్చింది.రణ్‌బీర్‌తో కలిసి నేను 12 రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నాను. అయితే సినిమా ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. నేను తెరపై కనిపించేది కాసేపే అయినా.. ప్రతి ఒక్కరు నా పాత్ర గురించి మాట్లాడుకోవడం సంతోషంగా అనిపించింది. సినిమా విడుదలకు ముందు తన అత్తయ్య చనిపోవడం వల్లే సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేకపోయాను’అని బాబీ డియోల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాబీ.. సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువా’ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. అలాగే పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తున్న ‘ఆల్ఫా’, బాలకృష్ణ 109వ చిత్రంలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. -
రోజూ ఎనిమిది గ్లాసులు పాలు తాగేవాడినంటున్న బాబీ డియోల్! ఇలా తీసుకోవచ్చా..?
బాలీవుడ్ నటుడు, యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్ ఒక ఇంటర్యూలో తన చిన్నప్పుడూ రోజుకి ఏకంగా ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు పాలు తాడేవాడినని చెప్పారు. అందదువల్లే తాను జీర్ణ సమస్యలు ఫేస్ చేస్తున్నానని తెలిసిందంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. తన నాన్న ధర్మేంద్రకి బహుమతిగా వచ్చిన ప్రత్యేక గాజు గ్లాస్ తన దగ్గర ఉండేదని, దానిలోనే పాలు తాగేవాడనని అన్నారు. ఇలా ఆ హీరోలా ప్రతి రోజూ అన్ని పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?. ఎదురయ్యే సమస్యలేంటీ తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.బాబీ డియోల్ మాదిరిగా అంతలా పాలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఇలా పిల్లలు, పెద్దలు తీసుకుంటే చాలా సమస్యలు ఫేస్ చేస్తారని అన్నారు. పాలు కాల్షియం, విటమిన్ డీ,ప్రోటీన్ మూలం. ఇవి ఎముకల పెరుగుదలకి, అభివృద్ధికి తోడ్పతుంది. అయితే అధికంగా తీసుకుంటే మాత్రం అధిక బరువు, లాక్టోస్ అసహనం, జీర్ణ సమస్యలు ఎదుర్కొనవల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.ఏంటి లాక్టోస్ అసహనం..?పాల ఉత్పత్తులు అధికంగా తీసుకోవడం వల్ల లాక్టోస్ ఎంజైమ్‌లు అధికంగా పని చేస్తాయి కాబట్టి శరీరంలో లాక్టోస్ ఎంజైమ్‌లలో క్షీణత ఏర్పడి ఇది లాక్టోస్ అసహనానికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ లాక్టోస్ అనేది పాలలో కనిపించే చక్కెర. ఇది లాక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా జీర్ణమవుతుంది. ఓ వయసు వచ్చేటప్పటికీ శరీరంలో లాక్టేజ్ కార్యకలాపాలు తగ్గుతాయి. దీంతో లాక్టోస్ అసహనం, జీర్ణ సమస్యలు ఎదురవ్వుతాయి. ఫలితంగా ఉబ్బరం, గ్యాస్, డయేరియా, పొత్తికడుపు తిమ్మిరికి కారణమవుతుంది. ఈ లక్షణాలు రోజూవారీ జీవితాన్ని, మొత్తం ఆరోగ్యాన్ని గణనీయం ప్రభావితం చేస్తాయని వెల్లడించారు నిపుణులు.వచ్చే ఆరోగ్య సమస్యలు..ఎక్కువ పాలు తాగే పెద్దల్లో అధిక సంతృప్త కొవ్వు పదార్ధం కారణంగా గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంటుంది. పాలు కేలరీలు కలిగిన పానీయం. పాలు, పాల ఉత్పత్తులలో ప్రోటీన్లు, చక్కెరలు, సంతృప్త కొవ్వులు పిల్లలలో ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలను కలుగజేసే అవకాశం ఉంది. కలిగిస్తుంది. ఇలా పాలు ఎక్కువగా తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగేందుకు దారి తీస్తుంది.అలాగే దీనిలోని అధిక కాల్షియం ఇతర ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అదీగాక చాలా పాడి పశువులకు హార్మోన్ల కాక్టెయిల్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఇది పశువులలో వేగవంతమైన పెరుగుదలను ప్రేరేపిస్తుంది. పైగా కృత్రిమంగా పాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. ఈ హార్మోన్లలో ఒకటి, IGF-1, అసాధారణ కణాల విభజన పెంచి, వివిధ కేన్సర్లు, మొటిమలు వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందువల్ల ఇక్కడ అందరూ గుర్తించుకోవాల్సింది ఒక్కటే.. మితంగా పాలు తీసుకుంటే మంచి పోషకాలను, ప్రయోజనాలను పొందగలం. పోషకాల అసమతుల్యతను నివారించేలా పిల్లలు, పెద్దలు సమతుల్య ఆహారానికే ప్రాధాన్యతే ఇవ్వాలి. ముఖ్యంగా సంతృప్త కొవ్వును తగ్గించడం లేదా తక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు తీసుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. (చదవండి: ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!) -
సూర్య 'కంగువా'.. ఆ సీన్ కోసం ఏకంగా పదివేలమందిని!
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు తెలుస్తోంది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్ షూట్ చేసినట్లు సమాచారం. దీంతో ఆడియన్స్‌కు కళ్లు చెదిరే యాక్షన్ ఎంటర్టైనర్గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
సూర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో ‘కంగువా’.. అన్ని కోట్లా?
కంగువా చిత్రం సౌండ్ సినీ వర్గాల్లో బాగా పెరిగిపో తోంది. నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో యూవీక్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న భారీ చిత్రం కంగువా. చారిత్రిక, సాంఘిక కథాంశాల ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మెట్లో తమిళం, తెలుగు, మలమాళం, కన్నడం, హిందీ తదితర 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.కాగా ఈ ప్రతిష్టాత్మక కథా చిత్రంలో నటుడు సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోని పిరియడ్ కాల పాత్రకు సంబంధించిన ఆయన గెటప్, టీజర్ విడుదల చేయగా విశేష ఆదరణ పొందాయి. కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.కాగా ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న కంగువ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బ్రహ్మాండమైన గ్రాఫిక్స్, సన్నివేశాలు చోటు చేసుకుంటాయని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇకపోతే కంగువ చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తాజా సమాచారం. నటుడు సూర్య కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. -
Bobby Deol His Wife Photos: యానిమల్ విలన్‌కు ఇంత అందమైన భార్య ఉందా..! (ఫోటోలు)
-
ఆలియాకు విలన్‌గా...?
ఆలియా భట్, షార్వరి లీడ్ రోల్స్‌లో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనుందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజు ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుందట. శివ్ రావైల్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించనున్నారు. గతంలో ‘రాజీ’ సినిమాలో స్పై పాత్రలో నటించిన ఆలియా భట్ మళ్లీ ఈ సినిమాలో ఆ తరహా పాత్రను ఓకే చేయడం విశేషం. ఇక ‘యానిమల్’లో విలన్ రోల్లో బాబీ డియోల్ విజృంభించిన విషయం తెలిసిందే. మరి.. యశ్ రాజ్ ఫిలింస్ తాజా చిత్రంలో విలన్‌గా సై అంటే... మరోసారి బాబీ నెగటివ్ పెర్ఫార్మెన్స్ని చూసే వీలు దక్కుతుంది. -
హీరోలు కన్నా విలన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్న ఆడియన్స్
-
సెకనుకు రూ.7 లక్షలు.. తెలుగు హీరోలకంటే ఎక్కువే!
పైసా..పైసా.. మంచి స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దాన్ని క్వాలిటీగా తీయాలంటే పైసా కావాల్సిందే! అయితే సినిమా నిర్మించడం కంటే అందులో నటించినవారికి ఇవ్వాల్సిన పారితోషికాలే తడిసి మోపెడవుతున్నాయి. సినిమా బడ్జెట్ అంతా ఒకెత్తు.. స్టార్స్ రెమ్యునరేషన్స్ మరో ఎత్తు అన్నట్లు మారింది పరిస్థితి! ఈ మధ్య ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడంతో ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. హిందీలో కంటే కూడా ఇతరత్రా భాషల్లోనే భారీగా అందుకుంటున్నారు. బీటౌన్ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దక్షిణాది సినిమాల కోసం బాలీవుడ్ తారలు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం.. జాన్వీ కపూర్ దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటుంది. తెలుగులో ఈమె దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కోసం రూ.5 కోట్లు పుచ్చుకుంటోందట. రామ్‌చరణ్ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ తెలుగు సినిమా అనగానే జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా మూడు రెట్లు డిమాండ్ చేస్తున్నాడు. దేవరలో విలన్‌గా నటిస్తున్నందుకు ఏకంగా రూ.13 కోట్లు తీసుకుంటున్నాడట! బాబీ డియోల్ బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్‌లో విలన్‌గా నటించినందుకుగానూ నటుడు బాబీ డియోల్ రూ.4 కోట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సూర్య 'కంగువా'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం డబల్ అంటే ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు. ఇమ్రాన్ హష్మీ ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే బాలీవుడ్లో తన రేటు పెంచేశాడు. దీంతో తెలుగులో కూడా అదే రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకుగానూ ఇతడు రూ.7 కోట్లు డిమాండ్ చేశాడు. సంజయ్ దత్, రవీనా టండన్ సంజయ్, రవీనా.. ఇద్దరూ కేజీఎఫ్ సినిమాలో అద్భుత నటన కనబర్చారు. రవీనా పాత్ర చిన్నది కావడంతో ఆమె రూ.2 కోట్లతో సరిపెట్టుకుంది. కానీ కల్నాయక్(సంజయ్) తన పాత్రకు తగ్గట్లు రూ.10 కోట్లు అందుకున్నాడు. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర కోసం రూ.10 కోట్లు తీసుకుంది. అజయ్ దేవ్‌గణ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించాడు. సినిమా మొత్తంలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇందుకుగానూ అతడు రూ.35 కోట్లు తీసుకున్నాడు. అంటే సెకనుకు రూ.7.2 లక్షలన్నమాట! ఈ లెక్కన పారితోషికం విషయంలో అందరికంటే అజయే ఎక్కువ అందుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: మహానటి స్థానంలో ప్రియమణి.. ఎందుకంటే? -
సూర్య 'కంగువ' టీజర్ విడుదలపై అధికారిక ప్రకటన
సూర్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా కొత్త సినిమా 'కంగువ' టీజర్ విడుదలకు రెడీ అవుతుంది . పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. జగపతిబాబు, బాబీ డియోల్, యోగిబాబు, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. భారీ అంచనాలతో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రం కంగువ.. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ను మేకర్స్ తాజాగా పంచుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్‌ను మార్చి 19న సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు స్టూడియోస్ గ్రీన్ నుంచి కూడా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సూర్య నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా సూర్య గెటప్ డిఫరెంట్‌గా ఉంది. త్రీడీ ఫార్మాట్లో తీస్తున్నారు. ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'కంగువ' షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి పాత్రలో సూర్య కనిపిస్తారు. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడు సమకాలీన పరిస్థితులకు కనెక్ట్ అయ్యే ఓ పాయింట్‌తో ‘కంగువా’ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రెండు భాగాలుగా వస్తున్న‘కంగువా’ పార్ట్-1 ఇదే 2024లోనే విడుదల కానుంది. -
కంగువా కోసం చెన్నైకి యానిమల్ విలన్..
ఇంతకుముందు హిందీ చిత్రాలలో కథానాయకుడిగా నటించి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన బాబీ డియోల్ ఇప్పుడు ప్రతి నాయకుడిగా విజృంభిస్తున్నారు. ఇటీవల యానిమల్ చిత్రంలో విలన్‌గా ఇరగదీశారు. తాజాగా దక్షిణాదిలోనూ సత్తా చూపేందుకు సిద్ధం అయ్యారు. ముఖ్యంగా కోలీవుడ్‌కు కంగువ చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కంగువ. బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి చిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, కోవై సరళ, రెడిన్ కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సూర్య ఇటీవలే డబ్బింగ్‌ను పూర్తి చేశారు. కంగువ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తిలకించడానికి బాబీడియోల్ గురువారం చైన్నెకి చేరుకున్నారు. దీంతో ఆయనకు కంగువ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్ రాజా ఘనస్వాగతం పలికారు. కంగువ చిత్రాన్ని 10 భాషల్లో త్రీడీ ఫార్మెట్లో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన 'వ్యూహం' సినిమా -
రూత్‌లెస్...పవర్ఫుల్
రూత్‌లెస్..పవర్ఫుల్..అన్ఫర్గెటబుల్... ఇవన్నీ ఒకరి గురించే. అతనే ఉధిరన్. ‘కంగువ’ సినిమాలో బాబీ డియోల్ పాత్ర పేరు ‘ఉధిరన్’. జనవరి 27 బాబీ డియోల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘కంగువ’ సినిమాలో ఆయన పోషిస్తున్న ఉధిరన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్ ఇది. ఇందులో దిశా పటానీ హీరోయిన్గా, ఓ కీలక పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ పదికి పైగా భాషల్లో, త్రీడీలోనూ విడుదల కానుంది. ‘‘ఉధిరన్‌గా యునిక్ మేకోవర్‌లో కనిపిస్తారు బాబీ డియోల్. యుద్ధానికి సిద్ధం అవుతున్న ఉధిరన్కు ఆయన ప్రజలు మద్దుతు తెలుపుతున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే... బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బాబీ డియోల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ శనివారం అధికారికంగా ప్రకటించింది. -
గుర్తుపట్టలేనట్లుగా 'యానిమల్' విలన్.. ఆ సినిమా కోసమే ఇలా!
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త సినిమా 'కంగువ'. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ పీరియాడికల్ మూవీని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. చారిత్రక నేపథ్య కథతో డైరెక్టర్ శివ తీస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో 'కంగువ' చిత్రాన్ని త్రీడీలోనూ రిలీజ్ చేయనున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) ఇకపోతే ఈ సినిమాలో ఉధిరన్ అనే శక్తివంతమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు. శనివారం ఈ నటుడి పుట్టినరోజు సందర్భంగా 'కంగువ' నుంచి ఆయన క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'రూత్ లెస్, పవర్ ఫుల్, అన్ ఫర్ గెటబుల్' అనే క్యాప్షన్‌తో ఉధిరన్ పాత్రని పరిచయం చేశారు. ఈ పోస్టర్లో బాబీ ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. యుద్ధానికి సిద్ధమవుతున్న ఉధిరన్కు ఆయన వర్గమంతా తమ మద్ధతు తెలుపుతున్నట్లు ఈ పోస్టర్లో చూపించారు. విజువల్ వండర్‌గా ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సీపీరియెన్స్ ఇచ్చేందుకు 'కంగువ' త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతోంది. రీసెంట్గా 'యానిమల్' మూవీలో క్లైమాక్స్‌లో కనిపించే విలన్‌గా చేసిన బాబీ.. ఇప్పుడు 'కంగువ'లో ఉధిరన్‌గా చేస్తున్నాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి) Happy birthday #BobbyDeol brother.. Thank you for the warm friendship. It was awesome to see you transform in full glory as the mighty #Udhiran in our #Kanguva Guys watch out for him! @directorsiva @ThisIsDSP @vetrivisuals @StudioGreen2 pic.twitter.com/e3cPBkdMcS — Suriya Sivakumar (@Suriya_offl) January 27, 2024 -
రాముడిగా రణ్‌బీర్.. కుంభకర్ణుడుగా బాబీ డియోల్!
‘యానిమల్’ సినిమాలో రణ్విజయ్ సింగ్‌గా రణ్‌బీర్ కపూర్, అబ్రార్‌గా బాబీ డియోల్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా రణ్‌బీర్, బాబీ డియోల్‌లు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారన్నది బాలీవుడ్లో వినిపిస్తున్న తాజా కబురు. రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా నితీష్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారని, ఈ పనులు తుది దశకు చేరుకున్న తరుణంలో నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారని టాక్. (చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది) ఈ నేపథ్యంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో దేవ్ దత్తా, రావణుడి పాత్రలో యశ్ నటించనున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. (చదవండి: జూ. ఎన్టీఆర్‌పై బాలకృష్ణ ద్వేషం.. చిచ్చు పెట్టింది ఎవరు..?) అన్నీ కుదిరి ‘రామాయణ్’ సినిమాలో రణ్‌బీర్, బాబీ డియోల్ సెట్ అయితే.. ‘యానిమల్’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించే సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందట. మధు మంతెన, నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్‌లు కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
జమల్ జమలు కుదు... యానిమలు!
‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్ ‘జమల్ జమలు కుదు’ సూపర్‌హిట్ అయింది. ఈ పాటలో ఒక్క ముక్క అర్థం కాకపోయినా యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాట యూత్ ఫ్రేవరెట్ రింగ్ టోన్గా మారింది. ‘జమల్ జమలు కుదు’ అనేది 1950 నాటి ఇరానీ పాట. ఇరానీ కవి బిజన్ స్మందర్ ఈ పాట రాశారు. ఖటరెహ్ మ్యూజిక్ గ్రూప్ ట్యూన్ కంపోజ్ చేసింది. తొలిసారిగా 1950లో టెహ్రాన్‌లోని ఖరజెమీ హైస్కూల్లో పాడారు. ‘జమల్ జమలు కుదు’ అంటే ఆంగ్లంలో ‘వో మై లవ్, మై స్వీట్ లవ్’ అని అర్థం. ఈ పాటలో కనిపించిన తనాజ్ దావూది సోషల్ మీడియాలో వైరల్ గర్ల్‌గా మారింది. టెహ్రాన్‌లో పుట్టి పెరిగిన తనాజ్ డ్యాన్సర్, మోడల్. ‘యానిమల్’ షూటింగ్ సమయంలో తనాజ్ ముంబైలో ఉంది. ఈ పాటకు సంబంధించిన ఓల్డ్ వెర్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘యానిమాల్ సినిమాలోని పాట కంటే ఓల్డ్ వెర్షన్ బాగా ఎంజాయ్ చేసే విధంగా ఉంది’ అంటూ స్పందిస్తున్నారు నెట్లోకవాసులు. -
సందీప్ రెడ్డి యానిమల్.. ఆ సీన్ కూడా కాపీనేనా?
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీపై మొదట చాలామంది విమర్శలొచ్చాయి. అయితే విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అదేస్థాయిలో వచ్చాయి. అయితే ఈ చిత్రంలో ఫైట్ సీన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. (ఇది చదవండి: 'యానిమల్' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్) అయితే తాజాగా బాబీ డియోల్, రణ్‌బీర్ కపూర్ క్లైమాక్స్ ఫైట్ సీన్‌పై కాపీ విమర్శలు వైరలవుతున్నాయి. 2001లో వచ్చిన ఆషిక్ మూవీలోని సీన్‌ను కాపీ కొట్టారంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆషిక్ మూవీ వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. నేను పొరపాటున రాంగ్ యానిమల్ మూవీ సీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఆషిక్ చిత్రంలో బాబీ డియోల్ హీరోగా నటించారు. అయితే గతంలోనూ యానిమల్‌పై కాపీ ఆరోపణలు వచ్చాయి. యానిమల్ ట్రైలర్‌ను విడుదలైన వెంటనే హువా మైన్ పాటలో రష్మిక, రణబీర్ ఫ్లైట్ సీన్‌ను 50 షేడ్స్ ఆఫ్ గ్రే చిత్రం కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అంతే కాకుండా మరో ఫైట్ సీక్వెన్స్ కొరియన్ చిత్రం నుండి కాపీ చేశారంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ, శక్తి కపూర్, సురేష్ ఒబెరాయ్, ప్రేమ్ చోప్రా బాలీవుడ్ తారలు నటించారు. #Animal#AnimalReview #AnimalMovie #RanbirKapoor𓃵 #SandeepReddyVanga Ranbir and Bobby Fight Scene Glimpse 🔥🔥🔥🔥 pic.twitter.com/ylMpVhIZov — ASHISH kushwaha (@ASHISHk18033956) December 2, 2023 -
'యానిమల్' నుంచి సూపర్ హిట్ వీడియో సాంగ్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్- రష్మిక మందన్న నటించిన యానిమల్ సినిమా కలెక్షన్లతో పాటు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం తగ్గడం లేదు. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే కలెక్షన్స్ విషయంలో జోరు కొనసాగిస్తుంది. ఇప్పుటికే పలు రికార్డులు బద్దలు కొట్టంది. యానిమల్ సినిమా 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.797.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. డిసెంబర్ 16న ఎంత కలెక్ట్ చేసింది ఇంకా ప్రకటించలేదు. కానీ రూ. 800 కోట్ల క్లబ్లో యానిమల్ చేరిపోయింది అని చెప్పవచ్చు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కానీ యానిమల్లోని పాటలు కూడా ట్రెండింగ్‌లో నిలిచాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'జమాల్ కుడు' అనే పాటకు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. బాబీ డియోల్ ఈ పాటతోనే ఎంట్రీ ఇస్తాడు. ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది. బాబీ డియోల్ మాదిరి అందరూ తలపై ఒక గ్లాసు పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షార్ట్ వీడియోలు ఇంటర్నెట్లో దుమ్మురేపుతున్నాయి. ఈ పాటకు సంబంధించిన వీడియో తాజాగా యూట్యూబ్‌లో విడుదలైంది. కొన్ని గంటల్లోనే 1 మిలియన్‌కు పైగానే వ్యూస్‌తో దూసుకుపోతుంది. -
ఆ సీన్ లేకుంటే ‘యానిమల్’ ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు: బాబీ డియోల్
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. విడుదలైన 12 రోజుల్లోనే దాదాపు 750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందంటే.. యానిమల్ ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాపై మొదట్లో విమర్శలు వచ్చాయి. కొన్ని సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయని, హింస ఎక్కువగా చూపించారంటో కొంతమంది విమర్శించారు. ముఖ్యంగా బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బాబీ డియోల్.. ఓ సీన్లో పెళ్లి వేదికపై పెళ్లికూతురిపై అత్యాచారానికి పాల్పడతాడు. ఆ తర్వాత తన ఇద్దరు భార్యలను కూడా గదిలోకి రమ్మని బలవంతం చేస్తాడు. ఈ సన్నివేశాలపై విమర్శలు వచ్చాయి. వైవాహిక అత్యాచారాన్ని ప్రోత్సహించేలా ఆ సన్నివేశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో బాబీ డియోల్‌ని ట్రోల్ చేశారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై బాబీ డియోల్ స్పందించాడు. పాత్ర డిమాండ్ మేరకే ఆ సన్నివేశంలో నటించానని, ఆ సీన్ లేకుంటే యానిమల్ అంత పెద్ద హిట్ కాకపోయేదన్నాడు. ‘పాత్ర తీరుతెన్నులను అర్థం చేసుకొని నటించి ప్రేక్షకులను అలరించడమే నటుల పని. యానిమల్‌లో నేను పోషించిన అబ్రార్ హక్ పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్న సమయంలో క్యారెక్టర్ ఎలాంటిదో ప్రేక్షకులకు అర్థం కావాలనే అలాంంటి సీన్స్ క్రియేట్ చేశారు. సమాజంలో జరుగుతున్న ఘటనలే సినిమాల్లో కనిపిస్తాయి తప్ప.. వాటిని సినిమాలు ప్రమోట్ చేయట్లేదు’ అని బాబీ డియోల్ చెప్పుకొచ్చాడు. -
Animal: ‘యానిమల్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Rashmika Mandanna: ‘యానిమల్’ మూవీ ప్రెస్మీట్లో రష్మిక మందన్న గ్లామర్ షో (ఫొటోలు)
-
‘యానిమల్’ లుక్ కోసం బాబీ కఠోర సాధన.. నాలుగు నెలలు నో స్వీట్స్!
అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ విలన్‌గా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా బాబీ దేవోల్ లుక్,యాక్టింగ్‌పై ప్రేక్షకులను నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఈ చిత్రంలోని తన పాత్ర కోసం బాబీ చాలా కష్టపడ్డాడట. రణ్‌బీర్ కంటే భారీగా కనిపించేందుకు నాలుగు నెలల పాటు కఠోర సాధన చేశాడట. బాబీ ఫిట్నెస్ ట్రైనర్ ప్రజ్వల్ శెట్టి ఈ విషయాన్ని తెలియజేశాడు. ‘యానిమల్ చిత్రంలో విలన్ పాత్ర పోషించేందుకు బాబీ చాలా కష్టపడ్డాడు. లుక్ విషయంలో దర్శకుడు సందీప్ కొన్ని సూచనలు చేస్తూ.. రణ్‌బీర్ కంటే భారీగా కనిపించాలని కండీషన్ పెట్టాడు. దీంతో బాబీ..నాలుగు నెలల పాటు కచ్చితమైన డైట్ ఫాలో అయ్యాడట. తనకు బాగా ఇష్టమైన స్వీట్స్ కూడా తినకుండా.. సాధన చేశాడు. దీంతో బాబీ డియోల్ శరీరంలోని కొవ్వు శాతం 12కి తగ్గింది. అతని బరువు 85 నుండి 90 మధ్యకు చేరింది.ట్రైనింగ్ అనంతరం బాబీ లుక్ చూసి చిత్ర యూనిట్ అంతా షాకైంది. క్లైమాక్స్ షూట్ రోజు బాబీ నన్ను సెట్‌కి పిలించుకొని అందరి ముందు అభినందించారు’అని ప్రజ్వల్ తెలిపాడు. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. -
‘హరి హర వీరమల్లు’లో బాలీవుడ్ స్టార్.. స్పెషల్ వీడియో వైరల్
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పవన్ లుక్కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సెట్లో మరో స్టార్ హీరో అడుగుపెట్టాడు. ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ నేడు ఈ చారిత్రాత్మక చిత్ర బృందంలో అధికారికంగా చేరారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న ఆయన.. చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు. బాబీ డియోల్ కి ఘన స్వాగతం పలుకుతూ హరి హర వీర మల్లు బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. -
ఆమె లీనమైపోయింది, అలా ఆ రొమాంటిక్ సీన్ ఈజీ అయింది
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ 3 (ఆశ్రమం). క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఇషా గుప్తా నటించగా ప్రకాశ్ జా దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఎమ్ఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతోందీ సిరీస్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాబీ డియోల్ ఈ సిరీస్‌లోని అభ్యంతరకర సన్నివేశాలపై స్పందించాడు. 'మొదటి సారి అభ్యంతరకర సన్నివేశేంలో నటించడం కావడంతో నాకు చాలా భయమేసింది. ఇలా మరీ సన్నిహితంగా కలిసి నటించడం నాకిదే తొలిసారి. కానీ ఇషా చాలా ప్రొఫెషనల్. ఆమె పాత్రలో లీనమైపోవడంతో నాకు ఆమెతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కొంత ఈజీ అయింది. అది స్క్రీన్‌పై కూడా సరిగ్గా వచ్చింది. ఇక ప్రతికూల పాత్రలో జనాలు నన్ను అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ చేయగలనన్న నమ్మకం వచ్చింది' అని చెప్పుకొచ్చాడు బాబీ డియోల్. చదవండి: హీరోయిన్ ఇంట్రస్టింగ్ పోస్ట్, తనతో ఉంది ఆ క్రికెటరే అంటున్న ఫ్యాన్స్ టీఆర్పీలో టాప్ సీరియల్.. కానీ నటులకు జీతాలివ్వట్లేదా? -
నేరాలు చేసే 'బాబా నిరాలా' మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఆసక్తిగా ట్రైలర్
Bobby Deol Ashram 3 Trailer Released And Streaming On MX Player: బాలీవుడ్ హీరో బాబీ డియోల్ బాబాగా నటించి మెప్పించిన వెబ్ సిరీస్ ఆశ్రమ్ (ఆశ్రమం). ఆగస్టు 28, 2020న విడుదలైన ఈ సిరీస్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత అదే సంవత్సరం చాప్టర్ 2 పేరుతో నవంబర్‌లో 'ఆశ్రం 2'ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ మూడో చాప్టర్ రానుంది. తాజాగా ఆశ్రమ్ మూడో చాప్టర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎమ్ఎక్స్ ప్లేయర్లో జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ప్రకాష్ జా దర్శకత్వం వహించారు. తనకు తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ మహిళల దోపిడీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాజకీయాలను నియంత్రించే బాబా పాత్రలో బాబీ డియోల్ ఆకట్టుకున్నాడు. ఇందులో బాబా మరింత పవర్‌ఫుల్‌గా, తానే దేవుడన్నట్లుగా కనపించనున్నట్లు తెలుస్తోంది. 'నేనే దేవున్ని.. నిరాలా భగవాన్' అని బాబీ డియోల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఆశ్రమ్ చాప్టర్ 2లో త్రిదా చౌదరీ హైలెట్‌గా నిలవగా.. ప్రస్తుతం వస్తున్న మూడో చాప్టర్లో బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా అలరించనుంది. మరీ ఇషా గుప్తా ఏమేరకు ఆకట్టుకోనుందో చూడాలి. ఇందులో అదితీ పోహంకర్, చందన్ రాయ్ సన్యాల్, దర్శన్ కుమార్, అనుప్రియా గోయెంకా, అధ్యాయన్ సుమన్, త్రిదా చౌదరీ, తుషార్పాండే తదితరులు నటిస్తున్నారు. చదవండి: సన్నీ డియోల్ తనయుడికి నిశ్చితార్థమంటూ వార్తలు.. ఇదిగో క్లారిటీ -
ఫన్నీ వీడియో: ఆ నటుడికి కరోనా గురించి ముందే తెలుసు!
పాడు కరోనా.. 2020లోనే దీని కథ కంచికి చేరుతుందనుకుంటే ఈ ఏడాది కూడా నీడలా వెంటాడుతూ అందరికీ చెమటలు పట్టిస్తోంది. ఈ కోవిడ్ పుణ్యమా అని ప్రతి ఒక్కరూ మాస్కులతోనే దర్శనమిస్తున్నారు. షేక్ హ్యాండ్‌కు గుడ్‌బై చెప్తూ నమస్కారానికి ప్రతినమస్కారం చేస్తున్నారు. జన జీవనశైలినే మార్చేసిన ఈ మాయదారి కరోనా అంత ఈజీగా జనాలను వదిలేలా కనిపించడం లేదు. అయితే కరోనా నియంత్రణ కోసం పాటించే చర్యలను బాలీవుడ్ హీరో బాబీ డియోల్ 30 ఏళ్ల క్రితమే చెప్పినట్లుగా ఉన్న ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కరోనాను దూరం పెట్టేందుకు పాటించే చర్యలన్నింటినీ చూపించారు. ముఖ్యంగా బాబీ డియోల్ ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేస్తున్నట్లుగా నటి ఐశ్వర్యరాయ్ ముక్కులో బడ్ పెట్టడం, క్వారంటైన్‌కు వెళ్తున్నట్లుగా తలుపేసుకుని గదిలో ఉండటం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం లాంటి సన్నివేశాలు ఫన్నీగా ఉన్నాయి. బాబీ డియోల్ నటించిన కొన్ని సినిమాల్లోని క్లిప్పింగ్‌లను అన్నింటినీ చేర్చి ఈ వీడియోను క్రియేట్ చేశారు కొందరు మీమర్స్. మరి ఈ ఫన్నీ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.. View this post on Instagram A post shared by Indian Memes (@theindianmemes) చదవండి: ఛీఛీ.. ఏడాది కూడా ఆగలేకపోయావా అంకితా! అది అఫైర్ కాదు, ఆమె మీద నాకున్న ప్రేమ! Filmfare Awards 2021: విజేతలు వీరే.. -
హీరో డ్యాన్స్.. అచ్చం అంపైరింగ్లా!
-
వైరల్: హీరో డ్యాన్స్.. అచ్చం అంపైరింగ్లా!
ముంబై: బాలీవుడ్ సెలబ్రెటీల మీద సరదాగా మీమ్స్, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు అభిమానులు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అభిమాని తన ట్విటర్ ఖాతాలో బాడి డియోల్ నటించిన పలు సినిమాల్లోని పాటలకు సంబంధించిన డ్యాన్స్ క్లిపింగ్స్‌తో కూడిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ‘బాబీ డియోల్ క్రికెట్ అంపైర్’ అంటూ కామెంట్ జతచేశాడు. ఈ వీడియోలో బాబీ డాన్స్.. అచ్చం క్రికెట్లో బౌండరీలు, వైడ్ సంజ్ఞలను సూచించే అంపైర్ మాదిరిగానే ఉంటుంది. ‘ప్రియమైన బీసీసీఐ మా హీరో అంపైరింగ్ నైపుణ్యం చూసి ఐపీఎల్ 2021లో అంపైర్‌గా నియమించుకోని ఆనందించండి’, ‘ఆయన క్రికెట్ అంపైరింగ్ సూపర్’, ‘విలక్షణ అంపైర్ బిల్లీ బౌడెన్ కంటే బాగా అంపైరింగ్ చేస్తున్నాడు’ అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల పంజాబ్‌లోని పటియాలాలో ఆయన నటిస్తున్న ‘లవ్ హాస్టల్’ మూవీ షూటింగ్‌ను రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. బాబీ డియోల్ సోదరుడు, బీజేపీ నాయకుడు, గుర్దాస్పూర్ ఎంపీ సన్నీ డియోల్ రైతుల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సరదా వీడియోను 99 వేల మంది వీక్షించగా, ఎనిమిది వేల మంది లైక్ చేశారు. దవండి: ఆ బుక్ ఎన్నో తరాలను పరిచయం చేస్తుంది: ప్రియాంక -
అది అఫైర్ కాదు, ఆమె మీద నాకున్న ప్రేమ!
గోవిందా మనసారా ఇష్టపడ్డ అమ్మాయి నీలమ్. కానీ సునీతతో జీవితాన్ని పంచుకోవాల్సి వచ్చింది. ఆమెతో పెళ్లయిన ఏడాదికి గానీ ఆ విషయాన్ని నీలమ్‌తో చెప్పలేదు గోవిందా. ‘నేను చేసింది తప్పే. సునీతతో పెళ్లి విషయం నేను నీలమ్‌కు చెప్పి ఉండాల్సింది’ అని తప్పు ఒప్పుకుంటాడు గోవిందా. అయితే నీలమ్‌ను ఇష్టపడ్డం, పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పేం లేదు అనీ అంటాడు. ‘అవును.. నీలమ్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. సునీతతో నిశ్చితార్థాన్ని తెంచుకునైనా నీలమ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నాకెలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకున్నానో అలాంటి అమ్మాయే నీలమ్. అలాగని సునీతను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.. పెట్టను. భర్తగా నా బాధ్యతనెప్పుడూ విస్మరించలేదు. నీలమ్ మీద ఇష్టమూ చావలేదు. ఇప్పటికీ ఆమె ఎక్కడ కనపడ్డా నా గుండె లయ తప్పుతుంది. కానీ ఎందుకో నీలమే నాతో సినిమాలు చేయడం మానేసింది. బహుశా అదే డాన్స్, అదే డైలాగ్ డెలివరీ తనకు బోర్ కొట్టి ఉండొచ్చు. తనతో మళ్లీ సినిమాలు చేయాలనుంది’ అని చెప్పాడు గోవిందా ఒక ఇంటర్వ్యూలో. ఇంకో మాటా గట్టిగా చెప్పాడు.. ‘దయచేసి మాది అఫైర్ అని కామెంట్ చేయొద్దు. అది అఫైర్ కాదు.. నీలమ్ మీద నాకున్న ప్రేమ’ అని. గోవిందా పెళ్లి విషయం తనకు తెలిసినప్పటి నుంచి అతనితో స్నేహాన్నే కాదు.. సినిమాలనూ మానేసింది. అలాగని గోవిందా పట్ల ఎన్నడూ కోపాన్ని, దురుసుతనాన్నీ ప్రదర్శించలేదు. బహుశా.. తను ఆ వ్యవహారాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదేమో అంటారు నీలమ్ సన్నిహితులు. ఆమె సినిమాల్లో రాణించాలనే లక్ష్యం వల్లా అది నిర్లక్ష్యం అయిండొచ్చు అంటారు. నీలమ్ కూడా ప్రేమలో పడింది. బాబీ డియోల్‌తో. అతనూ నీలమ్‌ను మనసులో నింపుకున్నాడు. ఆ ప్రేమను పెళ్లితో భద్రం చేసుకోవాలనీ అనుకున్నాడు. నీలమ్, బాబీ కలసి తిరుగుతున్నారు అన్న విషయం మొదట్లో ధర్మేంద్రకు తెలిసినా ఇండస్ట్రీలో అది మామూలే అని ఊరుకున్నాడ్లు. కానీ ఎప్పుడైతే కొడుకు ఆలోచన పెళ్లి దాకా వెళ్లిందని తెలిసిందో అప్పుడు సీరియస్ అయ్యాడు ఆ తండ్రి. నీలమ్ అంటే ఇష్టం లేక కాదు.. సినిమా హీరోయిన్లు తనింటి కోడళ్లుగా రావడం ఇష్టంలేక. ఆ మాటే బాబీ డియోల్కూ చెప్పాడు ధర్మేంద్ర. హతాశుడయ్యాడు బాబీ డియోల్. ఆ విషయంలో తండ్రిది మొండిపట్టే అని సన్నీ కూడా చూచాయగా మందలించాడు. అందుకు సన్నీ జీవితమే పెద్ద ఉదాహరణ. సినిమాల్లోకి వచ్చి అలాంటి ఆకర్షణలకు లోనవుతాడని తెలిసే పెళ్లి చేశాకే సన్నీని వెండితెర మీదకు తెచ్చాడు. తండ్రి ఆ ఆచరణంతా బాబీకి తెలియందేం కాదు. తండ్రి కోసం నీలమ్‌ను వదులుకోవాలనీ లేదు. తండ్రి తత్వం తెలిసీ మొండి పట్టూ పట్టలేదు. భారమైన హృదయంతోనే ఒకరోజు నీలమ్‌ను కలిశాడు బాబీ డియోల్. తండ్రికి, తనకు మధ్య జరిగిన చర్చ గురించి చెప్పాడు. మొత్తం సీన్ అర్థమైపోయింది ఆమెకు. అందుకే ఎదురు ప్రశ్నలేం వేయకుండానే ‘సరే.. ఇక్కడితో ఆపేద్దాం’ అంది. ఆ మాట అంటున్నప్పుడు నీలమ్ కళ్లల్లో నిండిన నీళ్లు బాబీ దృష్టి దాటి పోలేదు. నిస్సహాయంగా ఇద్దరూ గుడ్ బై చెప్పుకున్నారు అయిదేళ్ల ఆ అనుబంధానికి. వదంతులు.. చెక్ ఆ ఇద్దరి బ్రేకప్ మీద చాలా వదంతులు ప్రచారమయ్యాయి. ఒకసారి నీలమ్ స్టార్‌డస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వదంతులకు చెక్ పెట్టింది. ‘వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడ్డం నాకిష్టం ఉండదు. నా లవ్ అండ్ బ్రేకప్ గురించి వస్తున్న రూమర్స్ వింటూంటే నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడక తప్పట్లేదు. నాకు, బాబీకి బ్రేకప్ అయిన మాట నిజమే. అయితే పూజాభట్ ఇన్వాల్వ్మెంట్ వల్లే మా బ్రేకప్ అయిందన్నది శుద్ధ అబద్ధం. పూజానే కాదు ఇంకే అమ్మాయి వల్లా మా బ్రేకప్ కాలేదు. మా పరస్పర అవగాహనతోనే విడిపోయాం’ అంటూ స్పష్టం చేసింది. ‘సెపరేషన్ బాధాకరమే. దాదాపు ఎమోషన్స్‌కి సర్జరీ చేసినట్టే. ఒక ఎమోషన్‌ను తీసేసి ఇంకో ఎమోషన్‌ను అనుభవించడమే. చుట్టూ ఆరోగ్యకర వాతావరణం ఉంటే ఆ గాయం నుంచి త్వరగా కోలుకోగలం. అయితే ఆ విడిపోవడం, ఎడబాటు నిజాయితీగా జరిగితేనే త్వరగా కోలుకోగలుతాం. మా బ్రేకప్ అలాంటిదే. విడిపోవాలని ఒక్కసారి నిర్ణయించుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచించలేదు. కన్నీళ్లు పెట్టలేదు. ముందుకే వెళ్లాను’ అని బ్రేకప్ తర్వాత తన మానసిక స్థితినీ వివరించింది నీలమ్. తర్వాత.. బ్యాంకాక్‌కు చెందిన రిషి సేథియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. కాని ఆ బంధం ఎన్నాళ్లో నిలువలేదు. ఆ విడాకుల తర్వాత జ్యుయెలరీ డిజైన్ మీద మనసు పెట్టింది. ఓ వైపు ఈ కొత్త వృత్తి ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న టైమ్‌లోనే నటుడు సమీర్ సోనీతో స్నేహం కుదిరింది. ప్రేమగా మారింది. పెళ్లీ చేసుకుంది. ఒక అమ్మాయి (ఆహనా)ని దత్తత కూడా తీసుకుంది ఆ జంట. ‘కదిలిపోయిన గతం పట్ల రిగ్రెట్స్ లేవు. వర్థమానమంతా సంతోషమే. భవిష్యత్ గురించి బెంగలేదు’ అంటుంది నీలమ్. - ఎస్సార్ చదవండి: ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న గోవిందా -
‘లవ్ హాస్టల్’ షూటింగ్‌ను అడ్డుకున్న రైతులు
చండీగఢ్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కొత్త సినిమా ‘లవ్ హాస్టల్’ సినిమా షూటింగ్‌ను రైతులు అడ్డుకున్నారు. పంజాబ్‌లోని పటియాలాలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. శుక్రవారం మెహాన్ గ్రామంలోని ఓ ఇంట్లో ‘లవ్ హాస్టల్’ షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న దాదాపు 200 మంది రైతులు షూటింగ్‌ను అడ్డుకున్నారు. బాబీ డియోల్ కుటుంబం కానీ, అతడి సోదరుడు, బీజేపీ నాయకుడు, గుర్దాస్పూర్ ఎంపీ సన్నీ డియోల్ కానీ, రైతుల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్ చేసుకోనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఇంటి ముందు భైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటన చోటుచేసుకున్న సమయంలో బాబీ డియోల్ అక్కడ లేకపోవటం గమనార్హం. చదవండి : పోర్న్ వీడియో రాకెట్: నటి అరెస్ట్ -
అవకాశాలు లేక తాగుడుకు బానిసై..
బాలీవుడ్లో నెపొటిజమ్ వల్ల ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని వారు నష్టపోతున్న వార్తలు ఒకవైపు వింటున్నాం. మరోవైపు అన్ని వెన్నుదన్నులు ఉన్నా ఒక్క వేషం దొరక్క తెర మరుగైపోయే స్టార్ కిడ్స్ కథలు కూడా ఉన్నాయి. బాబీ డియోల్ పుట్టినరోజు నిన్న (జనవరి 27). కాని ఐదేళ్ల పాటు ఒక్క సినిమా కూడా చేయకుండా తాగుడుకు అలవాటు పడితే భార్య ఇంటినుంచి అతణ్ణి బయటకు పంపేసిన కథ ఇవాళ బయటకు వచ్చింది. ధర్మేంద్ర రెండో కొడుకు బాబీ డియోల్. పెద్ద కొడుకు సన్ని డియోల్‌ను లాంచ్ చేసిన ధర్మేంద్రనే బాబీ డియోల్‌ను కూడా ‘బర్సాత్’ సినిమాతో ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత బాబీ ‘గుప్త్’ సినిమాతో హిట్ కొట్టాడు. కొన్నాళ్లు కెరీర్ బాగానే సాగింది కాని 2012 నాటి అతడికి ఒక్క సినిమా కూడా దొరకలేదు. ఫ్లాపుల హీరోగా పేరు పడి ఇంట్లో ఉండిపోయాడు. ‘ఎందరిని అడిగినా ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు’ అని బాబీ డియోల్ చెప్పుకున్నాడు. దాంతో తాగుడులోకి వెళ్లిపోయాడు బాబీ. అతని భార్య తాన్యా డియోల్ ఒక దశలో విసిగిపోయి ఇంటినుంచి వెళ్లగొట్టేంత పని చేసింది. అయితే ఆమె సపోర్ట్‌తో మెల్లగా అతను డిప్రెషన్ నుంచి బయటపడ్డాడు. సల్మాన్‌ఖాన్ అతనికి ‘రేస్ 3’లో అవకాశం ఇచ్చాడు. అది ఆడకపోయినా బాబీకి పేరు వచ్చింది. ఇటీవల ఓటిటి ప్లాట్ఫామ్లో వచ్చిన ‘ఆశ్రమ్’లో బాబీ డియోల్ విశేషమైన ప్రతిభ కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక మీదట అతడి కెరీర్ సజావుగా సాగుతుందని కోరుకుందాం. -
మళ్లీ వస్తున్నాం
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ఆయన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్ కలసి స్క్రీన్ మీద నవ్వులు పండించిన చిత్రం ‘అప్నే’. ధర్మేంద్ర, సన్నీ, బాబీ, కత్రీనా కైఫ్, శిల్పా శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 2007లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘అప్నే’కు సీక్వెల్‌గా ‘అప్నే 2’ను తెరకెక్కించే పనిలో ఉన్నట్టు ఆదివారం ప్రకటించారు ధర్మేంద్ర. ‘మీ అందరికీ ‘అప్నే 2’ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ∙సన్నీ డియోల్, ధర్మేంద్ర, బాబీ డియోల్ -
లవ్ హాస్టల్
విక్రాంత్ మెస్సే, ‘దంగల్’ ఫేమ్ శాన్యా మల్హోత్రా జంటగా బాబీ డియోల్ ముఖ్యపాత్రలో నటించనున్న నూతన చిత్రాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ‘గుర్గావ్’ చిత్రదర్శకుడు శంకర్ రమణ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మనీష్ ముంద్రాతో కలిసి షారుక్ ఖాన్ తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ పతాకంపై నిర్మించనున్నారు. నార్త్ ఇండియాలో జరిగిన ఘటనల ఆధారంగా ‘లవ్హాస్టల్’ సినిమాను రూపొందించనున్నారు. వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్ ఆరంభం కానుంది. ఈలోపు ఈ సినిమాలో నటించనున్న నటీనటులందరూ వర్క్‌షాప్స్‌లో పాల్గొంటారని చిత్రబృందం తెలిపింది. ఊపిరిబిగపట్టే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం సాగుతుందని నిర్మాతలు చెప్పారు. -
‘నా మీద నాకే జాలి.. మద్యం అలవాటయ్యింది’
కెరీర్లో చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని.. అప్పుడు తన మీద తనకే జాలి వేసేదన్నారు నటుడు బాబీ డియోల్. ఆ బాధను మర్చిపోవడానికి తాను మద్యానికి అలవాటు పడ్డానని తెలిపారు. ఎంతో ఉన్నతంగా సాగిన ఈ హీరో కెరీర్ కొన్నేళ్ల క్రితం తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యింది. అయితే తాజాగా బాబీ డియోల్ ‘క్లాస్ ఆఫ్ 83’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో బాబీ డియోల్ మాట్లాడుతూ..‘మన మీద మనం జాలి పడుతున్నాం అంటే మన జీవితంలో అదే అత్యంత కఠినమైన దశ. ఇక అప్పుడు ప్రపంచాన్ని శపించడం మొదలుపెడతాం. నా జీవితంలో రెండు మూడేళ్ల పాటు ఇదే జరిగింది. నా మీద నాకే జాలేసేది. ప్రపంచం నాతో పని చేయాలనుకోవడం లేదని భావించాను. దాంతో మద్యానికి దగ్గరయ్యాను. మౌనంగా మారిపోయాను. అయితే ఓ రోజు నా పిల్లలు నా వైపు చూసిన చూపు నాలో మార్పుకు కారణమయ్యింది. నా తప్పేంటో తెలిసి వచ్చింది’ అన్నారు బాబీ డియోల్. ‘ఓ రోజు నా పిల్లలు ‘మా నాన్న ఏంటి రోజంతా ఇంట్లోనే ఉంటాడు.. ఏం పని చేయడు.. తాగుతూనే ఉంటాడన్నట్లు’ చూశారు. ఇదే భావం నా భార్య, తండ్రి కళ్లలో కూడా కనిపించేది. దాంతో నాలో మార్పు మొదలయ్యింది. నేను ఎక్కడ తప్పు చేశానో తెలిసింది. నేనే ముందుకు సాగాలి తప్ప ఎవరి కోసం ఎదురుచూడకూడదు అని అర్థం అయ్యింది. నా ప్రయాణం నేనే చేయ్యాలని తెలిసింది. ఈ ఆలోచన వచ్చాక నేను పని చేయడం మొదలు పెట్టాను. గత రెండు మూడేళ్లుగా నేను చాల బిజీగా ఉన్నాను’ అన్నారు బాబీ డియోల్. అంతేకాక ‘సల్మాన్, షారుక్ ఖాన్ జీవితాల్లో కూడా కష్టాలు ఉంటాయి. కానీ వారు పోరాడుతున్నారు తప్ప వదిలేయలేదు’ అన్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ఇన్సైడర్, ఔట్‌సైడర్ చర్చపై స్పందించారు బాబీ డియోల్. (మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు) ‘పరిశ్రమలో ఎవరి నుంచి మనకు మద్దతు లభించదు. నా కుటుంబం పరిశ్రమలో ఉన్నారంటే దానర్థం వారు నాకు మద్దతిచ్చారని కాదు. అదే నిజమయితే ధర్మేంద్ర కొడుకుగా నేను పెద్ద పెద్ద చిత్రాల్లో నటించాలి. కానీ అలా జరగలేదు కదా. ధర్మేంద్ర కొడుకుగా పుట్టడం నా అదృష్టం. కానీ అది ఫస్ట్ సినిమా వరకే పనికొస్తుంది. ఆ తర్వాత నా ప్రతిభ మీదనే నా మనుగడ ఆధారపడి ఉంటుంది’ అన్నారు. ప్రస్తుతం బాబీ డియోల్ షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో వస్తోన్న ‘క్లాస్ ఆఫ్ 83’లో నటిస్తున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం విడుదల కానుంది. -
అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్ లాంచ్
-
తిరిగొచ్చి తిప్పలు పెడతారు
1419వ సంవత్సరంలో క్రూరమైన ఆలోచనలున్న రాజకుమారుడు బాలా. అదే రూపంతో 2019లో అమాయకపు హ్యారీగా పుడతాడు. ఆరొందల ఏళ్ల బాలా ఆత్మ హ్యారీను ఎలాంటి ఇబ్బందుల్లో పడేసిందో తెలియాలంటే ఆ క్రేజీ హౌస్‌లోకి ఎంటర్ కావాల్సిందే. అక్షయ్‌కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా, పూజా హెగ్డే, కృతీ సనన్, కృతీ కర్భందా ముఖ్యపాత్రల్లో ఫర్హాద్ సంజీ రూపొందించిన కామెడీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో నాలుగో చిత్రం ఇది. ఈ సినిమా కథాంశం పునర్జన్మల చుట్టూ తిరుగుతుంది. ఇందులోని ప్రతి పాత్రకి 600 ఏళ్ల క్రితం పాత్రలతో సంబంధం ఉంటుందట. వాళ్లందరూ ఆత్మల రూపంలో తిరిగొచ్చి తిప్పలు పెడతారట. ఈ సినిమాలో నటీనటుల లుక్స్‌ను రిలీజ్ చేశారు అక్షయ్ కుమార్. రాజకుమారుడు బాలా, లండన్ రిటర్న్ హ్యారీగా రెండు లుక్స్‌లో అక్షయ్ కనిపిస్తారు. అక్షయే కాదు సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. -
ఫుల్ జోష్
వెబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టడం చాలా ఉత్సాహంగా ఉంది అంటున్నారు బాబీ డియోల్. అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండజ్ ఈ ఏడాది తమ వెబ్ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు. ఈ లిస్ట్‌లోకి బాబీ కూడా యాడ్ అయ్యారు. ‘క్లాస్ ఆఫ్ 83’ అనే నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ద్వారా వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారాయన. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాబీ డియోల్ కనిపిస్తారు. అతుల్ షబర్వాల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై షారుక్‌ఖాన్ నిర్మించనున్నారు. బాబీ డియోల్ నటించిన ‘హౌస్‌ఫుల్’ 4 రిలీజ్‌కు రెడీగా ఉంది. -
రాజాధిరాజా
విభిన్న సినిమాలు, విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుంటారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఇటీవల రిలీజైన ‘కేసరి’లో అక్షయ్ తలపాగా కట్టుకున్న సిక్కు పాత్రలో కనిపిస్తే తదుపరి చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’లో గుండుతో కనిపిస్తారట. ‘హౌస్‌ఫుల్’ కామెడీ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం ఇది. అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితేశ్ దేశ్‌ముఖ్, రానా, కృతీ సనన్, కృతీ కర్బందా, పూజా హెగ్డే, బొమ్మన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. పునర్జన్మల ఆధారంగా ఈ చిత్రకథ ఉండబోతోందని టాక్. సినిమాలో అక్షయ్ కుమార్ 16వ శతాబ్దపు రాజుగా నటించారట. గుండు, మెలి తిరిగిన మీసాలతో అక్షయ్ లుక్ ఉండబోతోంది. పొడుగు జుట్టుతో బాబీ డియోల్ గెటప్ ఉండబోతోందట. గత జన్మలో జరిగిన కథను రాజస్థాన్‌లో, ప్రస్తుత కథను లండన్‌లో షూట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవడంతో నానా పటేకర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అతని స్థానంలో రానా నటించారు. -
లండన్ టు జైపూర్
లండన్‌కి బై బై చెప్పారు కథానాయిక పూజా హెగ్డే. ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రం కోసం ఆమె లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, బాబీ డియోల్, బొమన్ ఇరానీ, కృతీ సనన్, కృతీ కర్భందా, పూజా హెగ్డే ముఖ్య తారలుగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ బార్బర్ గెటప్‌లో కనిపిస్తారట. లండన్‌లో మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్లో భాగంగానే ఫర్హాఖాన్ కొరియోగ్రఫీ చేసిన ఓ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెల మొదటివారంలో జైపూర్‌లో స్టార్ట్ కానుందని బీ టౌన్ సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు సాగుతుందట. ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
డేట్ మారింది
ఈ ఏడాది ఆగస్టు 15కు బాక్సాఫీస్ వద్ద అక్షయ్‌కుమార్ ‘గోల్డ్’, జాన్ అబ్రహాం ‘సత్యమేవ జయతే’, ధర్మేంద్రల ‘యామ్లా పాగ్లా దీవానా ఫిర్ సే’ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. కానీ ఇప్పుడు ‘యామ్లా పాగ్లా దీవానా..’ చిత్రబృందం తమ నిర్ణయాన్ని మార్చుకుని సినిమాను ఆగస్టు 31కి వాయిదా వేసుకున్నట్లు బీటౌన్ టాక్. ‘గోల్డ్, సత్యమేవ జయతే’ రెండూ దేశభక్తికి సంబంధించిన చిత్రాలే కావడం ఇందుకు కారణమట. నవనీత్‌సింగ్ దర్శకత్వంలో తండ్రీకొడుకులు ధర్మేంద్ర, సన్నీ డియోల్, బాబీ డియోల్ ముఖ్య తారలుగా రూపొందిన ‘యామ్లా పాగ్లా దీవానా ఫిర్ సే’ కామెడీ జానర్ మూవీ. రెండు దేశభక్తి చిత్రాలతో కామెడీ జానర్ మూవీ ఎందుకు? అని విడుదలను వాయిదా వేసుకున్నారట. ఈ ప్రాంచైజీలో వచ్చిన తొలిపార్ట్‌కు సమీర్ కార్నిక్ దర్శకత్వం వహించగా, రెండో పార్ట్‌కు సంగీత్ శివన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. -
సల్మాన్ ఖాన్ ‘రేస్-3’ రివ్యూ
టైటిల్ : రేస్-3 జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అనిల్ కపూర్, బాబీ డియోల్, డైసీ షా, ఫ్రెడ్ఢీ దారువాలా, షకీబ్ సలీం సంగీతం : సలీం సులేమాన్ దర్శకత్వం : రెమో డిసౌజా నిర్మాత : రమేష్ ఎస్ తౌరాని, సల్మా ఖాన్ 2008లో వచ్చిన ‘రేస్’, 2013లో రిలీజైన ‘రేస్ 2’, ఇప్పుడు 2018 జూన్ 15న (శుక్రవారం) ‘రేస్ 3’... ఈ మూడూ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలే. వీటన్నింటి కథామూలం ఒక్కటే. ‘‘తలతన్నేవాడుంటే వాడి తాడి తన్నేవాడొకడుంటాడు’’ అనే సామెత మన తెలుగులో చాలా ఫేమస్. అదే కాన్సెప్ట్‌తో ఎన్ని సినిమాలొచ్చినా సినీ ప్రియులు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఈ సినిమాల గురించి మాట్లాడాల్సి వస్తే ప్రతి ఒక్క సినిమాని పోల్చి చూడటం సహజం అని ఒప్పుకోక తప్పదు. అందుకే సిరీస్‌గా వచ్చిన సినిమాలన్నింటిలోకి ఏది బావుందో తప్పనిసరిగా పోలిక వస్తుంది. అలా పోలిస్తే మిగతా రెండు రేసుల కంటే ఈ రేస్ కొంచెం ఎక్కువ అంచనాలతోనే విడుదలైందని చెప్పాలి. రేస్ సిరీస్ హీరోతో సహా అన్ని పాత్రలూ డాన్లు, మాఫియా, ఇంటర్నేషనల్ క్రిమినల్స్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌తో నిండి ఉంటాయి. సినిమా అంతా పూర్తిగా ట్విస్టులతో నిండి ఉంటుంది. ఈ సిరీస్‌లో ముఖ్యంగా మూడు ‘రేస్’లతోను అనుబంధం ఉన్న నటుడు అనిల్‌కపూర్. ఈయన ఒక్కరే ‘రేస్’, ‘రేస్–2’, ‘రేస్–3’ అన్నింటిలో నటించారు. మొదటి రెండు సినిమాలకు దర్శకులుగా పనిచేసిన బాలీవుడ్ ద్వయం ‘అబ్బాస్–మస్తాన్’లను కాదని మూడో భాగం దర్శకత్వ బాధ్యతలు మరో బాలీవుడ్ దర్శకుడు రెమో డిసౌజాకు అప్పగించారు చిత్ర హీరో మరియు నిర్మాతల్లో ఒకరైన ‘సల్మాన్ ఖాన్ ’. నిర్మాతల్లో ఒకరైన రమేశ్ తౌరాని ‘రేస్ 3’ కథను తీసుకుని సల్మాన్‌ఖాన్ దగ్గరికి వెళితే ‘సినిమా చేస్తాను కాని కథలో కొన్ని మార్పులతో పాటు దర్శకుడిగా ‘రెమో డిసౌజా’ను తీసుకోవా’లని సూచించారట. ఆ విషయాన్ని సల్మానే స్వయంగా రేస్ ప్రమోషన్ టైమ్‌లో మీడియాకు చెప్పారు. అలా ఈ ప్రొడక్షన్లోకి వచ్చిన దర్శకుడు ‘రెమో’ సినిమాను ఎలా తెరకెక్కించారో తెలుసుకుందాం... ముఖ్య తారాగణం షంషేర్ సింగ్‌గా ‘అనిల్‌కపూర్’ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. ఇతను చుట్టూ అల్లిన కథే ‘రేస్–3’ అని చెప్పొచ్చు. షంషేర్ సింగ్ అన్న కొడుకు సిఖిందర్ సింగ్ పాత్రలో నటించారు ‘సల్మాన్‌ఖాన్’. అనిల్ కపూర్ కవలపిల్లలుగా నటి డైసీ షా (సంజన సింగ్) మరియు సాఖిబ్ సలీమ్ (సూర జ్ సింగ్) నటించారు. య‹శ్ అనే ఓ ముఖ్య పాత్రలో హీరో బాబీ డియోల్ నటించారు. ఈ సింగ్ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా వీళ్లందరికీ ట్రబుల్ షూటర్ లాగా పనిచేసే పాత్రలో నటించారు ‘బాబీ డియోల్’. సినిమా మొత్తం ఏ ఫ్రేమ్‌లో చూసినా వీరే ఉంటారు. సినిమా కథా కమామీషు... అనిల్ కపూర్ మారణాయుధాలను అమ్మే వ్యాపారి. అతని అన్న కూడా ఇదే వ్యాపారంలో ఉంటాడు. ఓ లోకల్ లీడర్‌తో ఏర్పడిన వైరం అన్న ప్రాణాలు తీసేస్తుంది. అన్న భార్యను, కొడుకును తీసుకుని అనిల్ కపూర్ విదేశాలు పారిపోతాడు. వదినను తన భార్యగా చేసుకుంటాడు. ఈ ఇద్దరికీ కవలపిల్లలు (కొడుకు, కూతురు సాఖిబ్ సలీమ్, డైసీషా) పుడతారు. బిడ్డలిద్దరూ తండ్రితో పాటు ఉంటూ వ్యాపార శత్రువులకు పోటీగా నిలుస్తారు. ఓ రోజు అనిల్ కపూర్‌ని ఎటాక్ చేస్తారు యాంటీ గ్యాంగ్. ఆ గ్యాంగ్ అధినేత డ్రగ్ మాఫియాలో ఆరితేరిన ఫ్రీడీ దారువాలా (రానా). తండ్రిపై జరిగిన ఎటాక్‌కు కారణం ఎవరో తెలుసుకుని ఇమ్మీడియట్‌గా ఫ్రీడి మీదకి వెళతారు డైసీ, సాఖిబ్. అలా వెళ్లిన తన తమ్ముడు, చెల్లెలు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వారిద్దరినీ విడిపించటానికి అక్కడికి వెళతాడు. అది సల్మాన్ ఇంట్రడక్షన్. అలా వీరు ముగ్గురు విలన్ గ్యాంగ్‌తో ఫైట్ చేస్తుంటే వీరికి తోడుగా ట్రబుల్ షూటర్ బాబీ డియోల్ జాయిన్ అవుతాడు. అందరూ అక్కడి నుండి సేఫ్‌గా బయటపడతారు. అనిల్ కపూర్ పిల్లలందర్నీ రమ్మని చెప్పి తన ఫ్యామిలీ లాయర్ ద్వారా ఆస్తి పంపకాలు చేస్తాడు. ఆస్తిలో 50 శాతం వాటాను తన పిల్లలైన డైసీషా, సాఖిబ్‌లకు మిగతా 50 శాతం వాటాను సల్మాన్ ఖాన్‌కు రాస్తున్నట్టు ప్రకటిస్తాడు అనిల్‌కపూర్. అది విని స్వతహాగా కోపంగా ఉండే తన పిల్లలు ఆవేశపడిపోతారు. అక్కడి నుండి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ప్రారంభమవుతాయి. కానీ అవేమి పెద్ద ప్రాబ్లమ్స్ కావు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ అందరూ ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తుంటారు. ఈ టైమ్‌లో అందరూ పార్టీ చేసుకుంటుంటే పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ తమ లవర్స్‌తో వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు, కానీ ఆ నలుగురు మాత్రం ఒంటరిగా ఉంటారు. వచ్చినవారందరూ ఎంజాయ్ చేస్తున్నారు మనం మాత్రం ఇలా ఉన్నాం అని డైసీషా అంటే మీకెవ్వరికీ ఏమీ లేదేమో కానీ నాకు మాత్రం లవర్ ఉంది అని బాబీ డియోల్ తన లవర్ ‘జాక్వెలిన్ ఫెర్నాండజ్’ గురించి చెప్తాడు. అందరూ వారి వారి కబుర్లు చెప్పుకుంటారు. ఇదిలా వుంటే అనిల్ కపూర్ చిన్ననాటి స్నేహితుడు భారత్ దేశం నుండి ఫోన్ చేసి, అర్జంట్‌గా కలవాలని ఓ మంచి డీల్‌తో వచ్చానని చెప్తాడు. సరే అని అతన్ని కలిసి విషయం తెలుసుకున్న అనిల్ కపూర్ ఫ్యామిలీ అందర్నీ పిలిచి తను ఒప్పుకున్న డీల్ గురించి చెప్తాడు అనిల్ కపూర్. ఆ డీల్ సారాంశం ఏంటంటే.. భారత్‌లో ఓ 7 స్టార్ హోటల్ ఉంది. ఆ హోటల్లో 8 మంది మంత్రులు అమ్మాయిలతో ఉండటాన్ని రహస్య కెమెరాల ద్వారా చిత్రించి, వాటిని ఆ మంత్రులకే పంపి బిజినెస్ ప్రపోజల్ పెడతారు. ఆ వీడియోలన్నీ ఉన్న హార్డ్‌డిస్క్ వేరే కంట్రీలో ఓ లాకర్లో ఉన్న సమాచారం నా దగ్గర ఉంది. ఆ హార్డ్ డిస్క్ నా కిస్తే మీకు బిలియన్ డాలర్ల మనీ ఇస్తాను, అది డీల్ అని చెప్తాడు అనిల్ కపూర్ ఫ్రెండ్. అక్కడి నుండి హార్డ్ డిస్క్‌ను ఎలా తీసుకొచ్చారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కథ ప్రీ–క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఇక్కడనుండి కథలో ఉన్న చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా రివీల్ అవుతుంటాయి. బాబీ డియోల్ తన గర్ల్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెస్ అసలు అతని ప్రేయసియేనా? సల్మాన్ లవరా? అనే డౌట్ ప్రేక్షకులకు ఉంటుంది. ఎప్పుడూ తన తమ్ముడు, చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడుకుంటాననే సల్మాన్ ఆస్తి వివాదాల వల్ల చివరి దాకా అలానే ఉన్నాడా? వీరి జీవితాల్లోకి జాక్వెలిన్ సడన్ ఎంట్రీకి కారణం ఏంటి? బాబీ డియోల్ క్యారెక్టర్ వెనక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటి? ఎనిమిది మంత్రుల వీడియోలు ఏమయ్యాయి? అన్నది క్లైమాక్స్‌లో చూడాల్సిందే. హైలైట్స్ – తారాగణం, గత చిత్రాలతో పోల్చితే సల్మాన్ సూపర్ స్టార్ కింద లెక్క. – వండర్ఫుల్ విజువల్స్. – బ్యాగ్రౌండ్ స్కోర్. – పంచ్ డైలాగ్స్. – అద్భుతమైన లొకేషన్స్. – ఆసక్తికరమైన మలుపులు. మైనస్ – కథ, కథనాల్లో ఎక్కడా స్పీడ్ లేదు. – స్లో నారేషన్. – స్టోరీలో డ్రామా లోపించడం. – పాత్రధారులంతా పాత్రల్లో లీనమైనట్లుగా కనిపించదు. – సాంగ్స్ చెప్పుకోదగ్గ విధంగా లేవు. - శివ మల్లాల -
నా మీద నాకే జాలేసింది : హీరో
లాంగ్ గ్యాప్ తరువాత పోస్టర్ బాయ్స్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ యాక్షన్ హీరో బాబీ డియోల్ త్వరలో రేస్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సల్మాన్ కారణంగానే తనకు ఈ అవకాశం వచ్చిందని చెపుతున్న బాబీ డియోల్, తనకు అవకావాలు లేని సమయంలో అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ‘నా గురించి నేను పట్టించుకోవటం మానేశాను. నటుడిగా మేం బాడీని మెయిన్టైన్ చేయాల్సి ఉంటుంది. కానీ నేను నెమ్మదిగా అన్ని కోల్పోతూ వచ్చాను. నా మీద నాకే జాలేసి, రోజూ తాగేవాడిని’ అన్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో సల్మాన్ తనకు ధైర్యం చెప్పాడని.. తరువాత కాల్ చేసి ఈ అవకాశం ఇచ్చారని తెలిపాడు. ‘ఇప్పుడు నా మీద నాకు నమ్మకం కలిగింది. ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నా. ఇప్పుడు ఒక రోజు కూడా ఖాలీగా ఇంట్లో కూర్చోవాలని లేదన్నా’రు బాబీ డియోల్. రేస్ 3 తరువాత హౌస్ ఫుల్ 4తో పాటు అన్న సన్నిడియోల్, తండ్రి ధర్మేంద్రలతో కలిసి యమ్లా పగ్లా దీవానా ఫిసే సినిమాలలో నటించేందుకు రెడీ అవుతున్నారు. -
‘రేస్-3’ ట్రైలర్ వచ్చేసింది
-
ఫ్యామిలీ ఉంటే చాలు.. శత్రువులు అవసరం లేదు!
ముంబై : అందరూ ఎంతోగానో ఎదురుచూస్తున్న ‘రేస్-3’ ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ హీరోగా రెమో డిసౌజా దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాడెంజ్, బాబీ డియోల్, అనిల్ కపూర్, డైసీ షా వంటి భారీ తారాగణం ఉన్నారు. ‘రేస్’ సీక్వెల్లో గత సినిమాల తరహాలోనే మూడోపార్టు కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో తెరకెక్కింది. ‘యే రేస్ జిందగికీ రేస్ హై.. కిసికీ జిందగీ లేకేహీ ఖతం హోగీ’ వంటి షార్ప్, క్రిస్పీ డైలాగులతో మోస్ట్ యాక్షన్ సీన్స్‌తో.. సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేసేలా ట్రైలర్ ఉంది. ఒక వ్యాపార కుటుంబం.. ఆ కుటుంబంలోని అంతర్గత కుట్రలు నేపథ్యంగా సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ‘ఫ్యామిలీ ఉంటే చాలు.. నీకు శత్రువులు అవసరం లేదు’ అని ట్రైలర్లో చూపించడం సినిమా థీమ్ ఏంటో చెప్పకనే చెప్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో నంబర్‌వన్‌గా ట్రెండ్ అవుతున్న ‘రేస్-3’ ట్రైలర్ భాయ్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈద్ సందర్భంగా జూన్ 15న ఈ సినిమా విడుదలకానుంది. -
రేస్ 3...తాజా పోస్టర్ చూస్తే...
సాక్షి,ముంబై: బాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీపై తాజాగా వెల్లడైన పోస్టర్ అభిమానుల్లో హల్చల్ చేస్తోంది. తన అప్‌కమింగ్ మూవీ ‘రేస్ 3’ ట్విటర్లో హింట్లు ఇస్తున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ తాజాగా మరో ఫోటోను షేర్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ పోస్టర్ని ట్విటర్లో సల్మాన్ పోస్ట్ చేశారు. అయితే ఈ సారి మాత్రం హీరో బాబీ డియోల్‌తో జాక్విలైన్ ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను పోస్ట్ చేయడం విశేషం. ఈ పోస్టర్ లుక్, బాబీ, జాక్విలైన్ మధ్య రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల సల్మాన్ ట్వీట్ ప్రకారం సల్మాన్‌తో వెరైటీగా పోజులిచ్చిన జాక్విలైన్, ఇప్పుడు బాబీడియోల్‌తో కనిపించడంతో ఈ సినిమాపై ఇంకా భారీ క్రేజ్ నెలకొనడంతోపాటు యూత్‌లో భారీ సస్పెన్స్ నెలకొంది. ఎవరు ఏంటో అనే సీక్రెట్ త్వరలోనే రివీల్ అవుతుందంటూ సల్మాన్ ప్రకటించడంతో.. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరితో రొమాన్స్ చేయబోతోందన్న డౌట్ సినీలవర్స్‌ని వెంటాడుతోంది. రెమో డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌లో సల్మాన్, అనిల్‌కపూర్ బాబీడియోల్తోపాటు జాక్విలైన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా ‘రేస్’ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టగా, గతంలో సైఫ్ చేసిన రోల్లో ఇప్పుడు సల్మాన్ అలరించనున్నారు. జాక్విలైన్ మొదటి రెండు భాగాల్లోనూ నటించారు. ఈద్ సందర్భంగా జూన్ 15 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
పిచ్చి ప్రేమ...
కాజల్ ప్రేమలో పడ్డారండి. అది కూడా అలాంటి ఇలాంటి ప్రేమ కాదు. క్రేజీగా పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నారట. ఇంతకీ ఎవరా లక్కీ ఫెలో అనుకుంటున్నారా? హిందీ నటుడు బాబీ డియోల్. ఈ ఇద్దరికీ లవ్ కుదిరింది ఎక్కడో తెలుసా? ‘యామ్లా పగ్లా దీవానా’లో. ఈ టైటిల్ అర్థం క్రేజ్, మ్యాడ్ అని. ఈ సినిమాలోనే ఈ ఇద్దరూ లవర్స్‌గా నటిస్తున్నారు. అసలు విషయం అది. ధర్మేంద్ర, బాబీ డియోల్, సన్నీ డియోల్ యాక్ట్ చేసిన ‘యామ్లా పగ్లా దీవానా’ చిత్రం 2011లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 2013లో దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘యామ్లా పగ్లా దీవానా 2’ చిత్రం ఓ మోస్తారుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి.. బాబీ, కాజల్ నటించనున్న ‘యామ్లా పగ్లా దీవానా 3’ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. హిందీలో కాజల్‌కి పెద్దగా హిట్లు లేవు. ఆ కొరతను ఈ సినిమా తీర్చేస్తుందని బాలీవుడ్ వారు అంటున్నారు. స్క్రిప్ట్ అంత బాగుందట. -
'మా అబ్బాయిలతో కలిసి నటించాలని ఉంది'
న్యూఢిల్లీ : తన కుమారులతో కలిసి నటించాలని ఉందని బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర అన్నాడు. మంచి కథ దొరికితే తన కుమారులతో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. సన్నీడియోల్, బాబీడియోల్లు ధర్మేంద్ర మొదటి భార్య సంతానం అన్న విషయం అందరికి విదితమే.గతంలో వీరు ముగ్గురి కలయికలో అప్నే, యమ్లా పగ్లా దీవానా చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో మరో మూవీ చేయాలని వెటరన్ నటుడు, షోలే సూపర్ స్టార్ ధర్మేంద్ర ఉవ్విళ్లూరుతున్నాడు. తొలి రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ, యమ్లా పగ్లా దీవానా సీక్వెల్ ఫ్లాప్ అవడంతో మళ్లీ ఈ ముగ్గురి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ధరమ్ ఘరమ్ అనే ఓ స్టార్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. సన్నీ, బాబీలతో కలిసి మరోసారి వెండితెరపై కనిపించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. కానీ ఓ మంచి స్క్రిప్ట్ దొరికితే ఈ తండ్రీకొడుకులను మరోసారి సిల్వర్స్ర్ర్కీన్పై అభిమానులను కనువిందు చేస్తామన్నాడు. యాక్టింగ్ కింగ్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ధర్మేంద్ర 1960లలో బాలీవుడ్లో తన ప్రస్థానం ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదిగినా తనను తాను ఎప్పుడు ఓ స్టార్ అని భావించనని 'షోలే' సూపర్ స్టార్ మరిన్ని ముచ్చట్లను అభిమానులతో పంచుకున్నాడు. -
చెల్లి పెళ్లికి డుమ్మా!
ముంబై: ధర్మేంద్ర, హేమామాలిని చిన్న కూతురు అహనా డియోల్ పెళ్లికి బాలీవుడ్ పెద్దలంతా వచ్చేసినా, సవతి సోదరులు సన్నీ, బాబీ డియోల్ మాత్రం కనిపించలేదు. ఢిల్లీకి చెందిన వ్యాపారి వైభవ్ వోరాతో అహనా పెళ్లిని ముంబైలోని ఐదు నక్షత్రాల హోటల్లో ఆదివారం నిర్వహించారు. దక్షిణాది, పంజాబీ పద్ధతిలో పెళ్లి జరిపించారు. బాలీవుడ్ బాసులు షారుఖ్ ఖాన్, అమితాబ్, జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్, అభిషేక్, రేఖతోపాటు జావెద్ అఖ్తర్, షబానా ఆజ్మీ, జితేంద్ర, దీపికా పదుకొణే, రణ్వీర్ సింగ్, జుహీచావ్లా, సాహిల్ సంఘా, దియామీర్జా, సోనాక్షి సిన్హా, ఆశాభోస్లే తదితరులు పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. అయితే 2012లో జరిగిన ఈశా డియోల్ పెళ్లికి కూడా సన్నీ, బాబీ డియోల్ రాలేదు. ధర్మేంద్ర సోదరుని కొడుకు అభయ్ డియోల్ మాత్రం పెళ్లిలో కనిపించాడు. విశేషమేమంటే ఈశా పెళ్లిలోనే అహనా, వోరాకు పరిచయమయిందట. అందంగా అలంకరించిన గుర్రపుబండిలో వోరా వివాహ వేదికకు చేరుకోవడంతో పెళ్లి లాంఛనంగా ప్రారంభయింది. పెళ్లి, విందును ముంబై ఐటీసీ మరాఠా హోటల్లోనే ఏర్పాటు చేశారు. ఈ ఏడాది బాలీవుడ్లో జరిగిన అతి పెద్ద పెళ్లి ఇదే కావడంతో తారలతోపాటు వ్యాపార ప్రముఖులు అనిల్ అంబానీ, ఆయన తల్లి కోకిలాబెన్, యోగాగురువు బాబా రామ్‌దేవ్ వంటి వాళ్లు కూడా వచ్చారు. రాజకీయ నాయకులు అమర్‌సింగ్, శివసేన అధిపతి ఉద్ధవ్‌ఠాక్రే, ఆయన సతీమణి రష్మి అహనా వివాహ విందులో కనిపించారు. సన్నీ, బాబీ రాకపోవడంపై మాట్లాడడానికి ధరే ్మంద్ర కుటుంబ సభ్యులెవరూ ఆసక్తి చూపలేదు. -
సోదరి వివాహానికి బాబీ, సన్నీడియోల్ దూరం!
సోదరి ఇషా డియోల్ పెళ్లికి గైర్హాజరైన సన్నీ, బాబీ డియోల్ లు అహనా పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలనాటి బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ప్రకాశ్జీల సంతానం సన్నీ, బాబీ డియోల్ కాగా, ధర్మేంద్ర రెండవ భార్య సినీనటి హేమమాలినిలకు ఇషా, అహనా డియోలు ఇద్దరు కూతుళ్లు. ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్న కారణంగా 2012 లో జరిగిన ఇషా డియోల్ వివాహానికి హాజరుకాలేదు. అయితే అహనా పెళ్లికి హాజరుకాకపోవడం వెనుక ఎలాంటి కారణాలు లేవని సన్నిహితులు వెల్లడించారు. ఇషా, అహనా, బాబీ, సన్నీ డియోల మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయన్నారు. అహనా పెళ్లి కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన మెహందీ వేడుకలో ఇషా డియోల్ జారి కింద పడిపోవడంతో ఆమె భుజానికి స్వల్పంగా గాయమైంది. చేతికి ఉన్న కట్టుతోనే వివాహ వేడుకల్లో ఇషా హడావిడి చేస్తోంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోరా తో అహనా వివాహం ఆదివారం సాయంత్రం ముంబైలోని ఐటీసీ మరాఠాలో జరుగనుంది. ఈ వివాహానికి బాలీవుడ్ కు చెందిన షారుక్ ఖాన్ తోపాటు పలువురు తారలు, రాజకీయ నేతల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, రాజ్ థాకరేలు హాజరుకానున్నారు.