
బాబీ డియోల్
వెబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టడం చాలా ఉత్సాహంగా ఉంది అంటున్నారు బాబీ డియోల్. అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండజ్ ఈ ఏడాది తమ వెబ్ ఎంట్రీని కన్‌ఫర్మ్ చేశారు. ఈ లిస్ట్‌లోకి బాబీ కూడా యాడ్ అయ్యారు. ‘క్లాస్ ఆఫ్ 83’ అనే నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ద్వారా వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారాయన. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాబీ డియోల్ కనిపిస్తారు. అతుల్ షబర్వాల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై షారుక్‌ఖాన్ నిర్మించనున్నారు. బాబీ డియోల్ నటించిన ‘హౌస్‌ఫుల్’ 4 రిలీజ్‌కు రెడీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment