రాముడిగా రణ్‌బీర్‌.. కుంభకర్ణుడుగా బాబీ డియోల్‌! | Bobby Deol Could Play Kumbhakrna In Nitesh Tiwari Ramayan, Rumour Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

రాముడిగా రణ్‌బీర్‌.. కుంభకర్ణుడుగా బాబీ డియోల్‌, రావణుడిగా యశ్‌!

Published Fri, Jan 19 2024 9:01 AM | Last Updated on Fri, Jan 19 2024 10:34 AM

Bobby Deol Could Play Kumbhakrna In Nitesh Tiwari Ramayan - Sakshi

‘యానిమల్‌’ సినిమాలో రణ్‌విజయ్‌ సింగ్‌గా రణ్‌బీర్‌ కపూర్, అబ్రార్‌గా బాబీ డియోల్‌ అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌ చేశారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా రణ్‌బీర్, బాబీ డియోల్‌లు మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారన్నది బాలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా కబురు. రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీష్‌ తివారి ‘రామాయణ్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా నితీష్‌ ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ చేస్తున్నారని, ఈ పనులు తుది దశకు చేరుకున్న తరుణంలో నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారని టాక్‌.

(చదవండి: 'సలార్‌' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది)

ఈ నేపథ్యంలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో దేవ్‌ దత్తా, రావణుడి పాత్రలో యశ్‌ నటించనున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది.

(చదవండి: జూ. ఎన్టీఆర్‌పై బాలకృష్ణ ద్వేషం.. చిచ్చు పెట్టింది ఎవరు..?)

అన్నీ కుదిరి ‘రామాయణ్‌’ సినిమాలో రణ్‌బీర్, బాబీ డియోల్‌ సెట్‌ అయితే.. ‘యానిమల్‌’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించే సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందట. మధు మంతెన, నమిత్‌ మల్హోత్రా, అల్లు అరవింద్‌లు కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement