ఏప్రిల్‌ 17న 'రామాయణ' ప్రకటన.. అదే రోజు ఎందుకంటే | Ranbir Kapoor And Sai Pallavi Ramayana Began On April, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 17న 'రామాయణ' ప్రకటన.. అదే రోజు ఎందుకంటే

Published Sun, Mar 3 2024 7:19 AM | Last Updated on Sun, Mar 3 2024 1:28 PM

Ranbir Kapoor And Sai Pallavi Ramayana Began On April - Sakshi

భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో 'రామాయణ' అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడి పాత్రలో యశ్‌, శూర్పణఖ పాత్రలో  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఇతిహాస గాథను తెరపై అద్భుతంగా చూపించేందుకు మేకర్స్‌ ప్లాన​్‌ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.  ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకుంటున్నారట. అంతేకాకుండా ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలను  శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్‌ 17న  ప్రకటించనున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్‌ కపూర్‌ స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకోనున్నారని బాలీవుడ్‌ సమాచారం. డైలాగ్స్‌ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్‌ డిక్షన్‌లో రణ్‌బీర్‌ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాను నమిత్‌ మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తారనే ప్రచారం సాగుతోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement