Ramayan
-
రామాయణంతో ఆటలా? బాంబే ఐఐటీ విద్యార్థులకు భారీ జరిమానా
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ బాంబే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)మరోమారు వార్తల్లో నిలిచింది. రామాయణంలోని కొన్ని అంశాల ఆధారంగా ఇక్కడి విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ వివాదాస్పదంగా మారింది. రామాయణాన్ని అపహాస్యం చేసేవిధంగా విద్యార్థులు ఈ నాటకం వేశారంటూ పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి.రామాయణం నాటకం పేరుతో బాంబే ఐఐటీ విద్యార్థులు సనాతన హిందూ సంప్రదాయాలను మంట గలిపారనే విమర్శలు వెల్లువెత్తాయి. రెండు నెలల క్రితం ఐఐటీ బాంబేలో ‘రాహోవన్’ పేరుతో విద్యార్థులు రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఒక నాటకాన్ని ప్రదర్శించారు. ఇది విమర్శలపాలైన నేపధ్యంలో తాజాగా ఆ విద్యార్థులపై ఐఐటీ బాంబే అధికారులు చర్యలు చేపట్టారు.ఈ నాటకంలో వివిధ పాత్రలు పోషించిన విద్యార్థులలో ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున జరిమానా విధించారు. బాంబే ఐఐటీలో ప్రతియేటా ఆర్ట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. 2024 మార్చి 31న ఈ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ వేడుకల్లో కొంత మంది విద్యార్థులు ‘రాహోవన్ ’ అనే నాటకాన్ని ప్రదర్శించారు.రామాయణం ఇతివృత్తంగా ఈ నాటకాన్ని రూపొందించారు. అయితే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను వారు పోషించిన పాత్రలకు నేరుగా ఉపయోగించలేదు. అయితే రామాయణంలోని అరణ్య కాండంలోని కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలు వీరు ప్రదర్శించిన నాటకంలో ఉన్నాయి. అవి రామాయణాన్ని అపహాస్యం చేసేవిగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. వీరు వేసిన నాటకంలోని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
‘ఆదిపురుష్’లో రావణుడిని వీధి రౌడీలా చూపించడం బాధేసింది: ‘రామాయణ్’సీత
రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారణంగా బోల్తా పడింది.అంతేకాదు ఈ మూవీలోని ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విధానంపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ పోషించిన రావణాసూరుడు పాత్రపై ఎన్నో వివాదాలు వచ్చాయి. రామాయణ ఇతిహాసాన్ని అపహాస్యం చేసేలా చిత్రాన్ని తెరకెక్కించారని ఓ వర్గం మండిపడింది. తాజాగా ‘రామాయణ్’ సీరియల్లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా కూడా ‘ఆదిపురుష్’సినిమాపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ సినిమాలో రావణుడిని వీధి రౌడీలా చూపించారని మండిపడ్డారు. ‘ఆదిపురుష్ సినిమా చూసి నేటి తరం పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందని భావించే అవకాశం ఉంది. అది భవిష్యత్తుకే ప్రమాదకరం. ఇందులో చూపించినట్లుగా రావణుడు మరీ అంత చెడ్డవాడు కాదు. ఆయన గొప్ప శివ భక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మాంసాహారం తినడు. సీతాదేవిని అపహరించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. సీతాదేవి కూడా అలా ఉండదు. ఈ సినిమాలో చూపించినట్లుగా రావణుడు ఉండడని పిల్లలకు ఎవరూ వివరించడం లేదు. నేను ఈ సినిమాను థియేటర్లో చూడలేదు. టీవీలో కొంచెం చూడగానే నచ్చలేదు. సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించేస్తున్నారు’ అని దీపికా చిఖ్లియా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీశెట్టి సీతగా నటించారు. -
‘రామాయణం’ రామునికి టీవీ సీత శుభాకాంక్షలు
రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణం’లో రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు సంపాదించుకున్నారు. తాజాగా యూపీలోని మీరట్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. దీంతో అరుణ్ గోవిల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.టీవీ షో ‘రామాయణం’లో సీత పాత్రలో కనిపించిన దీపికా చిఖాలియా కూడా అరుణ్ గోవిల్‌కు అభినందనలు తెలిపారు. అలాగే తన ఇన్‌స్టాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో ఆమె అరుణ్ గోవిల్‌తో ముచ్చటిస్తున్న దృశ్యాలున్నాయి. క్యాప్షన్‌లో అరుణ్ గోవిల్‌కు అభినందనలు తెలిపారు.తన విజయం తర్వాత అరుణ్ గోవిల్ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. దాని క్యాప్షన్‌లో ‘మీరట్ లోక్‌సభ నియోజకవర్గపు ఓటర్లు, కార్యకర్తలు, అగ్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరందరూ నాపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు. నేను మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను...జై శ్రీరామ్’ అని పేర్కొన్నారు.బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీకి చెందిన సునీతా వర్మపై 10,585 ఓట్ల తేడాతో గెలుపొందారు. అరుణ్ గోవిల్‌కు మొత్తం 5,46,469 ఓట్లు వచ్చాయి. -
సినిమా కోసం నిజమైన బంగారం.. కారణం ఇదే
మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో సినిమా వస్తున్న విషయం తెలిసిందే.బారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న యశ్ ధరించే ఆభరణాల నుంచి దుస్తులు, ఆయన ఉపయోగించే వస్తువులు అన్నీ నిజమైన బంగారంతో తయారు చేసినవే ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం రావణుడు లంకాధిపతి. ఆ నగరం మొత్తం బంగారంతో నిర్మితమై ఉందని ఇతిహాసాల్లో చెప్పారు. దీంతో సినిమాలో కూడా ఆ గొప్పతనాన్ని అలాగే చూపించాలని చిత్ర యూనిట్ భావించిందట. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రాన్ని నమిత్ మల్హోత్రా , యశ్ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ భాషలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
గాడ్ పవర్?
‘రామాయణ్’ టైటిల్ ‘గాడ్ పవర్’గా మారిందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రాముడు, సీత పాత్రల్లో నితీష్ తివారీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రామాయణం ఆధారంగా ‘రామాయణ్’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి.అలాగే సీతారాముల గెటప్స్‌లో సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ ఉన్న ఫొటోలు లీక్ అయి, వైరల్‌గా మారాయి. ముంబైలో చడీ చప్పుడూ లేకుండా కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ ఆరంభించారు. ఆ లొకేషన్లోని రణ్‌బీర్, సాయి పల్లవి ఫొటోలే బయటికొచ్చాయి. కాగా.. ఈ చిత్రానికి ‘రామాయణ్’ టైటిల్‌కి బదులు ‘గాడ్ పవర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని యూనిట్ అనుకుంటోందనే వార్త ప్రచారంలో ఉంది. -
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
‘‘రామాయణ్’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించాలనే ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? ఆ సినిమాలో నటించమని ఇప్పటివరకూ ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఆ అవకాశం వస్తే మాత్రం నటించేందుకు నేను సిద్ధం’’ అన్నారు బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ్’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. కాగా ఈ చిత్రంలోని నటీనటులపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారని లీక్ అయిన ఒక ఫొటో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కైకేయి పాత్రలో లారా దత్తా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించారు లారా దత్తా. ‘‘రామాయణ్’లో నేను కైకేయి పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవి విన్నప్పుడు సంతోషంగానే ఉంది. ఎందుకంటే.. అంత గొప్ప సినిమాలో నటించాలని ఎవరు కోరుకోరు? ఒకవేళ ఈ మూవీలో నాకు అవకాశం వస్తే కైకేయి పాత్రే కాదు.. శూర్పణఖ, మండోదరి లాంటి క్యారెక్టర్స్ చేయడానికి కూడా నేను రెడీ. ఈ మూడు పాత్రల్లో దేనికైనా నేను చక్కగా సరిపోతాను’’ అంటూ తన మనసులోని మాటని బయటపెట్టారు లారా దత్తా. మరి... ఈ మూడు ్రపాతల్లో ఏదో ఒకటి చేసే చాన్స్ లారా దత్తాకి వస్తుందా? అనేది చూడాలి. -
సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్
పాన్ ఇండియా భారీ బడ్జెట్ 'రామాయణ్' షూటింగ్ మొదలైపోయింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేసినట్లు ఉన్నారు. సాయిపల్లవి సీతగా, రణ్‌బీర్ కపూర్ రాముడి గెటప్‌లో ఉన్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా సాయిపల్లవి అందానికి ఫిదా అయిపోతున్నారు.ప్రతిష్టాత్మక రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఇవన్నీ కూడా ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. గతేడాది రిలీజైన 'ఆదిపురుష్' మాత్రం ఘోరమైన ట్రోలింగ్కి గురైంది. తాజాగా బాలీవుడ్లో రామాయాణాన్ని సినిమాగా తీస్తున్నారు. గతంలో న్యూస్ వచ్చినప్పటికీ దీన్ని ఎవరూ నిర్ధారించలేదు.శ్రీరామ నవమికి అయినా సరే అధికారిక ప్రకటన వస్తుందనుకున్నారు. కానీ అలాంటిదేం రాలేదు. కానీ ఇప్పుడు సెట్స్ నుంచి రాముడు, సీత పాత్రలకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇవి సర్క్యూలేట్ అవుతున్నాయి. లుక్స్ బాగానే ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఇందులో రావణుడిగా 'కేజీఎఫ్' ఫేమ్ యష్ కనిపించబోతున్నాడు. -
‘రామాయణం’పై మరో సినిమా
రామాయణంపై, రామాయణంను ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఎందరో గొప్ప గొప్ప నటీనటులు సీతా రాములుగా, రావణ, లక్ష్మణ, ఆంజనేయులుగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు అదే బాటలో రామాయణంను తెరకెక్కించటానికి నిర్మాత వేణు దోనేపూడి సిద్ధమయ్యారు. వి.ఎన్.ఆదిత్య నేతృత్వంలో ఒక టీమ్ ఈ చిత్రానికి సంబంధించి అయోధ్య సహా పలు చోట్ల లోకేషన్స్ రెక్కీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు మేకర్స్. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, భారీగా నిర్మించబోతున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి నిర్మాణ సారధ్యం తమ్మారెడ్డి భరద్వాజ. ప్రస్తుతం చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పీపుల్ మీడియా బ్యానర్‌తో కలిసి గోపీచంద్, శ్రీనువైట్ల కాంబినేషన్లో ‘విశ్వం’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. -
రాముడికి ఓ బెంజ్.. 10 కోట్ల ఆస్తులు!
సాక్షి, నేషనల్ డెస్క్ : రఘుకులసోముడైన జగదభిరామునికి బెంజ్ కారేమిటా అనుకుంటున్నారా? ఇది జగదేక చక్రవర్తి శ్రీరాముడి గురించి కాదు. టీవీ రామాయణంలో రాముని పాత్రధారి అరుణ్ గోవిల్ గురించి! 80వ దశకంలో దూరదర్శన్‌లో వచ్చిన రామాయణం సీరియల్‌కు లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఆదివారమొస్తే చాలు.. ఉదయాన్నే దేశమంతా ‘వినుడు వినుడు రామాయణ గాథ’ను వింటూ టీవీలకు అతుక్కుపోయిన రోజలవి. ఇప్పటికీ అరుణ్ గోవిల్ ఎక్కడ కన్పించినా రామున్నే చూసినంత ఆనందంతో కాళ్లకు నమస్కరించి భక్తి పారవశ్యంలో మునిగిపోతుంటారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఈ 72 ఏళ్ల టీవీ రాముడు యూపీలోని మీరట్ నుంచి లోక్‌సభ బరిలో ఉన్నారు. తనకు రూ.62.99 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్‌తో పాటు రూ.3.19 కోట్ల చరాస్తులు, రూ.5.67 కోట్ల స్థిరాస్తులు, బ్యాంకులో రూ.1.03 కోట్లు, చేతిలో రూ.3.75 లక్షల నగదు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో గోవిల్ వెల్లడించారు. రూ.14.64 లక్షల కారు రుణముందని చెప్పారు. సీరియల్లో రాక్షససంహారం చేసిన ఈ టీవీ రామునిపై ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవండోయ్! 17 ఏళ్లకు సొంతూరికి... గోవిల్ పుట్టింది మీరట్లోనే. ముంబైలో స్థిరపడ్డారు. రాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యలో అడుగుపెడితే ఈ టీవీ రాముడు 17 ఏళ్ల ‘సిటీ’వాసం తర్వాత సొంతూరికి చేరారు. ఆయన కోసం మీరట్‌లో 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన రాజేంద్ర అగర్వాల్‌ను బీజేపీ పక్కనబెట్టింది! సమాజ్‌వాదీ నుంచి అతుల్ ప్రధాన్, బీఎస్పీ తరఫున దేవవ్రత్ త్యాగి గోవిల్ ప్రత్యర్థులు. ‘‘ఈ ఎన్నికలతో నేను కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నా. రాముడి ఆశీ్వర్వాదం తప్పకుండా ఉంటుంది’’ అని విశ్వాసం వెలిబుచ్చారు గోవిల్. అయోధ్య రామమందిర ప్రారంభ వేడుకల్లో ఆయన సీరియల్ సీత దీపికా చిఖలియా, లక్ష్మణుడు సునీల్ లాహరితో సహా పాల్గొనడం విశేషం. – -
సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?
ప్రస్తుత జనరేషన్ లో నేచురల్ బ్యూటీ అంటే సాయిపల్లవినే. ఎందుకంటే చాలా సాధారణమైన పాత్రల్లో చేస్తూనే సూపర్ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం హిందీలో భారీ బడ్జెట్ తో తీస్తున్న 'రామాయణ' మూవీలో నటిస్తోంది. అయితే ఇందులో నటిస్తున్నందుకు కళ్లుచెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న అనసూయ లేటెస్ట్ మూవీ) 'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా మారిన సాయిపల్లవి.. ఆ తర్వాత 'ఫిదా'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించి హిట్స్ కొట్టింది. చివరగా 'విరాటపర్వం'లో కనిపించింది. ఇది వచ్చి నాలుగేళ్లుపైనే అయిపోయింది. అయితే గత రెండేళ్లుగా నటనకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యే మళ్లీ బిజీగా మారుతోంది. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తున్న సాయిపల్లవి.. హిందీలో ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న సినిమా చేస్తోంది. అలానే రణ్ బీర్, యష్ తదితరులు నటిస్తున్న 'రామాయణ'లోనూ సీత పాత్ర చేయబోతుంది. త్వరలో ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించబోతున్నారు. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సాయిపల్లవి.. మూడు భాగాలుగా తీస్తున్న 'రామాయణ' కోసం మాత్రం రూ.10-15 కోట్ల వరకు తీసుకుంటుందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నయనతారని దాటేసి రికార్డ్ సృష్టించినట్లే. సీత పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్టానే తన పారితోషికాన్ని సాయిపల్లవి అమాంతం పెంచేసిందని అంటున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
‘రామాయణం*లోకి త్రివిక్రమ్!
మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామయణ' పేరుతో సినిమా రానుంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ బాలీవుడ్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు మేకర్స్ అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు ఉండటంతో చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదించిందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఈ ఏడాదిలో 'గుంటూరు కారం'తో ప్రేక్షకులను మెప్పించిన త్రివిక్రమ్ తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుందని గతంలో ఆయన చెప్పారు. అయితే బన్నీ 'పుష్ప2'తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవేళ ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత కూడా ఆయన అట్లీతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రామాయణ టీమ్‌లోకి త్రివిక్రమ్ చేరడం దాదాపు లాంఛనమే అని చెప్పవచ్చు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే ఛాన్స్ వుంది. -
ఎన్నికల్లో ‘శ్రీరాముడు’.. మీరఠ్‌లో జన్మించి..
టీవీ సీరియల్ ‘రామాయణం’లో శ్రీరాముని పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించిన నటుడు అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలోగి దిగాడు. అరుణ్ గోవిల్కి స్టార్డమ్తో పాటు మీరఠ్తో అనుబంధం కూడా ఉంది. అరుణ్ గోవిల్ మీరఠ్ కాంట్‌లో 1958 జనవరి 12న జన్మించారు. అతని తండ్రి చంద్రప్రకాష్ గోవిల్ మీరట్ మునిసిపాలిటీలో హైడ్రాలిక్ ఇంజనీర్‌గా పనిచేశారు. అరుణ్ ప్రారంభ విద్యాభ్యాసం సరస్వతి శిశు మందిర్‌లో సాగింది. తరువాత ఆయన ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదువుకున్నారు. అనంతరం చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారు. అరుణ్‌ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని అతని తండ్రి భావించారు. అయితే అరుణ్ నటనారంగంలోకి ప్రవేశించారు. ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులలో అరుణ్ నాల్గవవాడు. గోవిల్ నటి శ్రీలేఖను వివాహం చేసుకున్నారు. వీరికి సోనిక, అమల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 17 ఏళ్ల వయసులోనే అరుణ్ గోవిల్ ముంబైకి వెళ్లి నటునిగా అవకాశాల కోసం ప్రయత్నించారు. 1977లో హిందీ సినిమా 'పహేలీ' సినిమాలో అరుణ్‌కు అవకాశం దక్కింది. అయితే అరుణ్ గోవిల్‌కు ‘రామాయణం’ సీరియల్ ఎంతో పేరును తీసుకువచ్చింది. అరుణ్ పోషించిన రాముని పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆయనను సాక్షాత్తూ రామునిగా చూసినవారు కూడా ఉన్నారట. రామాయణం తర్వాత అరుణ్ గోవిల్ టీవీ ఇండస్ట్రీలో యాక్టివ్‌గా మారారు. పలు పౌరాణిక సీరియల్స్‌లో నటించారు. ఇప్పుడు మీరఠ్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన అరుణ్ గోవిల్ భవితవ్యాన్ని కాలమే తేల్చి చెప్పనుంది. -
నిరాశే మిగిల్చనున్న రామాయణం మూవీ డైరెక్టర్
-
ఏప్రిల్ 17న 'రామాయణ' ప్రకటన.. అదే రోజు ఎందుకంటే
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో 'రామాయణ' అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడి పాత్రలో యశ్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇతిహాస గాథను తెరపై అద్భుతంగా చూపించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకుంటున్నారట. అంతేకాకుండా ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలను శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తారనే ప్రచారం సాగుతోంది. -
శరవేగంగా రణబీర్ కపూర్ రామాయణం..
-
ప్రాణ ప్రతిష్టలో ప్రత్యేక ఆకర్షణగా అలియా భట్ చీర..ఏకంగా..!
అయోధ్యలో 500 ఏళ్ల నిరీక్షణకు తెరతీస్తూ బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ప్రధాన నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అయోధ్యలోని ఈ కార్యక్రమంలో ప్రముఖులు సెలబ్రెటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి మరీ పాలు పంచుకున్నారు కూడా. ఈ వేడుకలో బాలీవుడ్ నటి అలియా భట్ నీలిరంగు మైసూర్ చీర తళక్కుమన్న సంగతి తెలిసిందే. ఆమె భర్త కూడా ఈ మహోత్సవంలో చక్కగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించి సందడి చేశారు. అయితే అలియా కట్టుకున్న చీర ఇప్పుడూ ఓ సెన్సేషన్‌గా మారింది. నెట్టింట ఈ విషయం గురించే హాట్‌టాపిక్‌గా మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఆమె చీరపై రామాయణ ఇతీహసంలోని దృశ్యాలు చిత్రించడమే. ఇంత ప్రత్యేకతతో కూడిన చీరనా! ఆమె కట్టుకుంది? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు!. పైగా ఆలియా సో గ్రేట్ అని పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు అభిమానులు. అంతేగాదు అలియానే ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా తాను ధరించిన ఆ చీర గురించి వివరించింది. అద్దం ముందు దిగిన సెల్ఫీ ఫోటోను జత చేసి మరీ ఆ చీర విశేషాలను పంచుకుంది. ఆ చీరపై రామాయణంలోని ముఖ్యమైన దృశ్యాలు రామసేతు, హనుమాన్, రాముడు శివ ధనుస్సును బద్దలు కొట్టడం, రాముడి వనవాసం, గంగానదిపై వంతెన, బంగారు జింక, సీతను అపహరించడం.. తదితర ఘట్టాలను చిత్రీకరించారు. అందుకు దాదాపు 100 గంటలకు పైగా సమయం తీసుకుందని చెప్పుకొచ్చింది. అయితే ఈ చీర పల్లు మొత్తం చేత్తో డిజైన్ చేసింది కావడం విశేషం. ఇక ఆమె ఈ కార్యక్రమంలో భర్త రణబీర్ కపూర్ తెల్లటి కర్తా పైజామా ధరించి ఒక తెల్లటి శాలువా కప్పుకున్నారు. కాగా, అలియా సంప్రదాయాన్ని గౌరవించేలా ఇలా రామాయణం ఇతివృత్తంతో కూడిన చీరను ధరించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) (చదవండి: ప్రాణ ప్రతిష్ట వేళ సెలబ్రెటీలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..!) -
యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పి రూ.1400 కోట్ల కంపెనీ సీఈవోగా
దూరదర్శన్‌లో 1983లో ప్రసారమైన రామాయణం సీరియల్ గుర్తుందా? రామాయణం, రాముడి కథను అద్భుత దృశ్యకావ్యంగా బుల్లి తెరకు పరిచయం చేసిన ఘనత రామానంద్ సాగర్‌కు చెందుతుంది. ఇప్పటికీ కోట్లాది మంది భారతీయుల్లో గుండెల్లో నిలిచిపోయిన ఆధ్యాత్మిక అద్భుతమంది. రామాయణం తరువాత ఉత్తర రామాయణ్ కూడా తీసుకొచ్చారు రామానంద్. ఈ రెండూ అత్యధికంగా వీక్షించిన సీరియల్స్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాయి. అంతేకాదు ఈ పాపులర్ సీరియల్లోని ప్రతి పాత్రధారుడు అద్భుతంగా నటించారు. సీత రాముడు అంటే ఇలానే ఉంటారా అన్న రీతిలో వారిని గుర్తుంచుకున్నారు జనం. ఈ సీరియల్లోని చాలా మంది నటులు ఇప్పటికీ నటనా రంగంలో కొనసాగుతున్నారు. శ్రీరాముడు తనయులు లవకుశుల్లో ఒకరిగా నటించిన వ్యక్తి ఇపుడు ఎక్కుడున్నాడో తెలుసా? నటనా ప్రపంచానికి పూర్తిగా దూరంగా వ్యాపారంలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. ఒక కంపెనీకి సీఈవోగా కోట్లకు అధిపతిగా ఉన్నారు. ఆయన పేరే మయూరేష్ క్షేత్రమదే. బాల నటుడిగా మయూరేష్ లవుడి పాత్రలో కనిపించారు. అయితే 13 ఏళ్ల వయసులో నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ చదువుల వైపు దృష్టి సారించాడు. ఫైనాన్స్ ప్రపంచంలో తన వృత్తిని కొనసాగించడానికి అమెరికా వెళ్లాడు. మయూర్ష్ 2003లో ప్రపంచ బ్యాంక్‌లో పరిశోధకుడిగా తన వృత్తిని ప్రారంభించి, ఆ తరువాత అనేక ఇతర సంస్థలలో పనిచేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. 2016లో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్ కమిషన్ జంక్షన్లో చేరాడు. 2019 నాటికి మయూరేష్ కంపెనీ సీఈవో స్థాయికి ఎదిగారు. 2022 నాటికి, దీని ఈ కంపెనీ ఆదాయం 170 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 1400 కోట్లు) పైమాటే. కుటుంబంతో సహా అమెరికాలో నివసిస్తున్నారు. మయూరేష్ స్పైట్ అండ్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు. ఈ సీరియల్లో కుష్ పాత్రను స్వప్నిల్ జోషి మరాఠీ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇతనికి పిల్లు టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. రామాయణ సీరియల్లో శ్రీరాముడిగా నటించిన అరుణ్ గోవిల్, సీత పాత్రలో దీపికా చికిలియా, లక్ష్మణుడి పాత్రలో సునీల్ మెప్పించారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఈ ముగ్గురు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మా రాముడొచ్చాడు అంటూ వీరికి భక్తులు నీరాజనాలు పట్టిన సంగతి తెలిసిందే. -
రాముడిగా రణ్‌బీర్.. కుంభకర్ణుడుగా బాబీ డియోల్!
‘యానిమల్’ సినిమాలో రణ్విజయ్ సింగ్‌గా రణ్‌బీర్ కపూర్, అబ్రార్‌గా బాబీ డియోల్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా రణ్‌బీర్, బాబీ డియోల్‌లు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారన్నది బాలీవుడ్లో వినిపిస్తున్న తాజా కబురు. రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా నితీష్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారని, ఈ పనులు తుది దశకు చేరుకున్న తరుణంలో నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారని టాక్. (చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది) ఈ నేపథ్యంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో దేవ్ దత్తా, రావణుడి పాత్రలో యశ్ నటించనున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. (చదవండి: జూ. ఎన్టీఆర్‌పై బాలకృష్ణ ద్వేషం.. చిచ్చు పెట్టింది ఎవరు..?) అన్నీ కుదిరి ‘రామాయణ్’ సినిమాలో రణ్‌బీర్, బాబీ డియోల్ సెట్ అయితే.. ‘యానిమల్’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించే సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందట. మధు మంతెన, నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్‌లు కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
Ramayan: అయోధ్యకు చేరుకున్న సీతారామలక్ష్మణులు
అయోధ్య: రామ మందిరంలో 22న రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. అతి త్వరలో జరగనున్న ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించడానికి సీతారాములు, లక్ష్మణుడు బుధవారమే అయోధ్యకు చేరుకున్నారు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. నిజమే వచ్చింది సీతారామలక్ష్మణులే. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ సీరియల్ అయిన రామాయణ్‌లో నటించిన అరుణ్ గోవిల్(రాముడు), దీపిక చిక్లియా(సీత), సునీల్ లహ్రీ(లక్ష్మణుడు) రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం వీక్షించేందుకు విచ్చేశారు. ఇంతేకాక సోను నిగమ్ పాడిన ‘హమారే రామ్ ఆయేంగే’ పాట చిత్రీకరణలో వీరు పాల్గొననున్నారు. అయోధ్యలోని గుప్తార్‌ఘాట్, హానుమాన్గర్హి, లతాచౌక్‌లో ఈ పాట చిత్రీకరణ జరగనుంది. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానాలందిన వారిలో రామాయణ్ సీరియల్ నటులు కూడా ఉన్నారు. ఇదీచదవండి.. రామ్ మందిర ప్రారంభంపై హైకోర్టులో పిటిషన్ -
అలీగడ్.. హరిగఢ్ ఎందుకయ్యింది? రామాయణంతో సంబంధం ఏమిటి?
ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ తర్వాత మరో నగరమైన అలీగఢ్ పేరు మారింది. తాజాగా అలీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ అలీగఢ్ పేరును హరిగఢ్‌గా మార్చే ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. యూపీలోని నగరాల పేర్లను మార్చడం ఇదేమీ మొదటిసారి కాదు. అయితే దీనిలో అలీగఢ్ పేరు మార్పు వెనుక ఒక ప్రత్యకత, ఘనమైన చరిత్ర ఉంది. అలీగఢ్‌ను పూర్వకాలంలో అంటే 200 ఏళ్ల క్రితం కోయిల్ లేదా కోల్ అని పిలిచేవారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కౌశిరివ్ పేరు కనిపిస్తుంది. అతనిని యుద్ధంలో ఓడించిన కోల్ అనే రాక్షస రాజు ఈ ప్రదేశానికి పాలకునిగా మారతాడు. అతని పేరును అనుసరించి ఈ ప్రదేశానికి కోల్ అని పేరు పెట్టారు. కాగా సయ్యద్ రాజవంశం కాలంలో కోల్ ప్రాంతం పేరు అలీగఢ్గా మారింది. అలీగఢ్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరం. దీనిని లాక్ సిటీ అని కూడా అంటారు. మొఘలుల కాలం నుండి తాళాల తయారీకి ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఈ నగరంలో సెంట్రల్ యూనివర్శిటీ ఉంది. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు తమ చదువులను పూర్తి చేస్తున్నారు. భారతీయత ఉట్టిపడాలనే ఉద్దేశంతోనే అలీగఢ్‌ను హరిగఢ్‌గా మార్చారు. ఇది కూడా చదవండి: దుబాయ్‌లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్ ఖలీఫాలో ఏం జరుగుతుంది? -
చిత్రకూట్ దీపావళి ప్రత్యేకత ఏమిటి? మందాకినీ తీరంలో ఏం జరుగుతుంది?
మధ్యప్రదేశ్‌ని చిత్రకూట్‌లో జరిగే దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపావళి పండుగ సందర్భంగా చిత్రకూట్‌లోని మందాకిని నది తీరంలో ఐదు రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు. లంకను జయించిన శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తూ, ఋషులతో కలిసి మందాకిని నదిలో దీప దానాన్ని చేశాడని స్థానికులు చెబుతారు. చిత్రకూట్‌లో దీపావళి పండుగను అయోధ్యలో జరిగే వేడుకల స్థాయిలో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ధన్తేరస్ మొదలుకొని భాయ్ దూజ్ వరకు ఐదు రోజుల పండుగ జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులు మందాకినీ నదిలో దీప దానం చేస్తారు. అంటే నదికి దీపాలు సమర్పించి, తమకు శ్రేయస్సు అందించాలని నదీమతల్లిని కోరుకుంటారు. చిత్రకూట్‌లో పదకొండున్నర సంవత్సరాలపాటు వనవాసం చేసిన శ్రీరాముడు ఇప్పటికీ ఇక్కడ తిరుగాడుతూ, భక్తులకు కనిపిస్తాడని స్థానికులు చెబుతుంటారు. దీపావళి సందర్భంగా ఇక్కడ నిర్వహించే ఐదు రోజుల దీప దాన ఉత్సవం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రతీయేటా 20 నుంచి 25 లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇది కూడా చదవండి: డోంగర్‌ఘఢ్‌కు ప్రధాని మోదీ.. బమ్లేశ్వరి ఆలయంలో పూజలు -
G20 Summit - జీ20 అతిధులకు బుక్లెట్లు
న్యూఢిల్లీ: 'భారత్' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ 20 సదస్సుకు ఆయా దేశాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. వారికి ఇవ్వడానికి భారతీయత ఉట్టిపడే విధంగా రెండు పుస్తకాలను ముద్రించింది కేంద్ర ప్రభుత్వం. క్రీస్తుపూర్వం 6000 ఏళ్లనాటి భారత చరిత్ర మొత్తం ప్రతిబింబించేలా వీటిని ముద్రించింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగబోయే జీ 20 సమావేశాలకు భాగస్వామ్య 20 దేశాలతో పాటు అతిధులుగా మరో తొమ్మిది దేశాలు కూడా హాజరు కానున్నాయి. ఈ నేపథ్యంలో అతిరథ మహారధులందరికి చేతికి అందివ్వడానికి రెండు బుక్లెట్లను ముద్రించింది కేంద్రం. వీటిలో ఒకటి 'భారత్-ప్రజాస్వామ్యానికి మాతృక' కాగా రెండవది 'భారతదేశంలో ఎన్నికలు'. ఈ రెండు పుస్తకాల్లోని 40 పేజీల్లో రామాయాణం, మహాభారతంలోని ఇతిహాస ఘట్టాలు, ఛత్రపతి శివాజీ, అక్బర్ వంటి చక్రవర్తుల వీరగాధలతో పాటు సార్వత్రిక ఎన్నికల ద్వారా భారతదేశంలో అధికార మార్పిడి గురించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు. ప్రజాస్వామ్య తత్వమన్నది భారతదేశ ప్రజల్లో సహస్రాబ్దాలుగా భాగమని చెప్పడము ఈ రెండు బుక్లెట్ల ముఖ్య ఉద్దేశ్యమని తెలుపుతూ ఈ ప్రతుల సాఫ్ట్ కాపీలను జీ20 అధికారిక వెబ్సైట్లో కూడా ఉంచింది. మొదటి 26 పేజీల డాక్యుమెంటు భారత దేశాన్ని ప్రజాస్వామ్యానికి మాతృకగా వర్ణిస్తుంది. దీని ముఖచిత్రంగా 5000 ఏళ్ల నాటి నాట్యం చేస్తున్న మహిళామూర్తి కాంస్య ప్రతిమను ముద్రించారు. సామాన్యులు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల సభనుద్దేశించి చతుర్వేదాల్లో ఆది వేదమైన ఋగ్వేదంలోని శ్లోకాన్ని కూడా ముద్రించారు. రామాయణ, మహాభారతాల్లోని ప్రజాస్వామిక అంశాలను ప్రస్తావించారు. రామాయణం నుంచి దశరధ మాహారాజు ప్రజాప్రతినిధులు, మంత్రులను సంప్రదించి వారు ఆమోదించిన తర్వాతే శ్రీరామచంద్రుడిని చక్రవర్తిగా పట్టాభిషేకం ఘట్టాన్ని ప్రచురించారు. అదేవిధంగా మహాభారతం నుంచి ధర్మరాజుకు భీష్మణాచార్యలు చెప్పినా సుపరిపాలనా నియామాల గురించి.. ప్రజా శ్రేయస్సు, సంతోషాలను కాపాడటమే రాజు ధర్మమని చెప్పిన అంశాలను కూడా పుస్తకంలో ప్రస్తావించారు. బౌద్ధమతం దాని సిద్ధాంతాలు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో, అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటి చక్రవర్తులకు చాణక్యుడి అర్థశాస్త్రం ఏ విధంగా ప్రజాస్వామ్య నిఘంటువుగా నిలిచి నడిపియించిందో అందులో పొందుపరిచారు. ఇది కూడా చదవండి: రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ.. సుప్రీంకోర్టులో పిల్ -
ఆనాటి సీరియల్ రామాయణం.. ఎలా ఉన్నారో చూసేయండి (ఫోటోలు)
-
'ఆదిపురుష్' ఎఫెక్ట్.. ఆ 'రామాయణం' మళ్లీ రిలీజ్
ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా విడుదలై పదిరోజులు దాటిపోయింది. కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. జనాలు ఈ చిత్రం గురించి మాట్లాడుకోవడం మెల్లగా తగ్గించేస్తున్నారు. కానీ వివాదాలు మాత్రం వదలట్లేదు. తాజాగా అలహాబాద్ హైకోర్ట్ చిత్రబృందంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డైలాగ్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదలా ఉండగానే 'రామాయణ్' మరోసారి విడుదలకు సిద్ధమైంది. డేట్ కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. వివాదాలే వివాదాలు! 'ఆదిపురుష్' సినిమాని రామాయణంలోని అరణ్యకాండ, యుద్ధకాండ ఆధారంగా తీశారు. టీజర్ విడుదలైనప్పుడు రావణుడి గెటప్ వల్ల విపరీతంగా విమర్శలు వచ్చాయి. దీంతో ట్రైలర్స్ లో అతడిని అస్సలు చూపించలేదు. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత రావణుడి కంటే.. గ్రాఫిక్స్, డైలాగ్స్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిపోయాయి. ఇది కాదన్నట్లు డైలాగ్ రైటర్ మనోజ్.. 'ఈ సినిమా రామాయణం కాదు', 'హనుమంతుడు దేవుడు కాదు' లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్- కె'.. ఆ విషయంలో ఆదిపురుష్‌ను దాటేయనుందా?) 'రామాయణ్' మరోసారి మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశాడని 'ఆదిపురుష్' డైలాగ్ రైటర్ మనోజ్‌ని చంపేస్తామని కొందరు బెదిరించారు. రామాయణాన్ని వక్రీకరించి ఈ సినిమా తీశారని కొందరు కేసు వేశారు. ఇలా 'ఆదిపురుష్' సినిమాపై లెక్కలేనంత నెగిటివిటీ వచ్చింది. ఈ క్రమంలోనే దయానంద్ సాగర్ 'రామాయణ్' సీరియల్ ని మరోసారి టీవీల్లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజూ రాత్రి! బాక్సాఫీస్ దగ్గర 'ఆదిపురుష్' కాస్త తగ్గిన నేపథ్యంలో 'రామాయణ్' సీరియల్ ని ఆ ఛానెల్ లో జూలై 3 నుంచి ప్రతిరోజూ రాత్రి 7:30 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో పలుమార్లు ఈ సీరియల్ రీ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. లాక్‌డౌన్‌లోనూ ప్రసారం చేస్తే అప్పుడు విశేషాదరణ దక్కింది. 'ఆదిపురుష్' ఎఫెక్ట్ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి? (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) -
జపనీస్‌లో 30 ఏళ్ల క్రితమే 'రామాయణం'.. అప్పట్లోనే 80 కోట్లు!
'ఆదిపురుష్'.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించే డిస్కషన్. ఫ్రెండ్స్, నెటిజన్స్ ఇలా ఎవరిని తీసుకున్నా సరే వాళ్ల మధ్య హాట్ టాపిక్ ఈ మూవీనే. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకులని అలరించడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయింది. మరోవైపు 'ఆదిపురుష్'ని దాదాపు 30 ఏళ్ల క్రితం జపనీస్ లో వచ్చిన 'రామాయణ్' మూవీతో పోల్చి చూస్తున్నారు. దీంతో ఆ చిత్రం కాస్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటా సినిమా ప్రత్యేకత? రామాయణం గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రకరకాల మాధ్యమాల్లో రాముడి కథని మనం వింటున్నాం, చూస్తూనే ఉన్నాం. తెలుగులో కొన్నాళ్ల ముందు దర్శకుడు బాపు.. 'శ్రీ రామరాజ్యం' తీసి జనాల్ని భక్తి పారవశ్యంలో ముంచారు. ఇప్పుడు రిలీజైన 'ఆదిపురుష్' వల్ల మరోసారి ఈ ఇతిహాసం గురించి మాట్లాడుకునే ఛాన్స్ దక్కింది. మన దేశంలో రామాయణం ఆధారంగా సినిమాలు, సీరియల్స్ బోలెడన్నీ వచ్చాయి. కానీ అసలు ఏ మాత్రం సంబంధం లేని జపాన్ లో కూడా 1992లోనే 'రామాయణ: ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' అనే యానిమేటెడ్ మూవీ తీశారు. హిట్ కూడా కొట్టారు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ సరికొత్త రికార్డు.. దేశంలో ఫస్ట్ హీరోగా!) వాల్మీకి రామాయణం ఆధారంగా తీసిన సినిమాల్లో ఈ జపనీస్ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు! 1980లో జపనీస్ యానిమేటర్ యుగో సాకో తొలిసారి మనదేశాన్ని సందర్శించారు. ఆ టైంలో రామాయణాన్ని విజువల్ గా చూపిద్దామనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆ తర్వాత దశాబ్ద కాలంలో దాదాపు 60 సార్లు భారతదేశానికి వచ్చివెళ్లారు. 1985లో ఈయన అయోధ్యని దర్శించినప్పుడు.. రామాయణాన్ని డాక్యుమెంటరీగా తీయాలని ఫిక్స్ అయ్యారు. Ramayan: Legend of Prince RamThis film was made by Japanese n was scheduled to release in India Jan 1993But due to Babri incident in Dec 1992, Congress banned it n it cud never release in Indianominated for Oscars in 2001Watch this song of that filmGoosebumps guaranteed pic.twitter.com/0Oh11qB6M1— STAR Boy (@Starboy2079) October 4, 2022 ఆ తర్వాత యుగో సాకో.. ఫాదర్ ఆఫ్ ఇండియన్ యానిమేషన్ మోహన్ తోపాటు 450 మందితో కలిసి పనిచేసి, రామాయణాన్ని ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ గా తీర్చిదిద్దారు. దీన్ని ఎందుకు యానిమేషన్ లో తీయాల్సి వచ్చిందో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 'రాముడు దేవుడు. ఎవరైనా యాక్టర్ కంటే యానిమేషన్ లో తీస్తేనే బెస్ట్' అని సాకో చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్) జపనీస్ థియేటర్లలో 1992లో రిలీజైన 'రామాయణ: ద లెజెండ్ ఆఫ్ ప్రిన్ రామ'.. అక్కడి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. మన దగ్గర మాత్రం ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కలేదు. పబ్లిసిటీ సరిగా చేయకపోవడమే దీనికి కారణమని పలు మీడియా రిపోర్ట్స్ చెప్పుకొచ్చాయి. ఇప్పుడొచ్చిన 'ఆదిపురుష్'ని దాదాపు రూ.500 కోట్లతో నిర్మిస్తే.. జపనీస్ రామాయణాన్ని 1992లోనే రూ.80 కోట్ల జపనీస్ యెన్ తో నిర్మించడం విశేషం. ఈ సినిమాలోని పాత్రలకు పలువురు హిందీ ప్రముఖ నటులు డబ్బింగ్ చెప్పారు. అయితే జపనీస్ 'రామాయణ్' మూవీని స్పూర్తిగా తీసుకునే ఓం రౌత్ 'ఆదిపురుష్' తీశాడని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియదు. ఒకవేళ తీశాడే అనుకున్నా.. ఇప్పుడున్న టెక్నాలజీ, యాక్టర్స్, బడ్జెట్ ఉపయోగించి ఇంకా బాగా తీయొచ్చు. కానీ ఆ విషయంలో ఓం రౌత్ పూర్తిగా ఫెయిలయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే టైంలో 'ఆదిపురుష్' కంటే జపనీస్ లో వచ్చిన 'రామాయణ' బెటర్ అని మాట్లాడుకుంటున్నారు. After hearing reviews and leaked pics of #SaifAliKhan in #Adipurush i think indian producers and Japanese anime company should again collaborate for Ramayan anime long series where they can give all story of Ramayana in details.#AdipurushReview pic.twitter.com/O43yUvjavK— axay patel🔥🔥 (@akki_dhoni) June 16, 2023 (ఇదీ చదవండి: Adipurush Review: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ) -
రీసెంట్గా పెళ్లి.. భార్య కోసం ప్రముఖ నిర్మాత షాకింగ్ డెసిషన్!
మూవీ ఇండస్ట్రీలో లవ్, రిలేషన్, పెళ్లి, విడాకులు లాంటివి చాలా కామన్. కలిసి నటించిన యాక్టర్స్ ప్రేమలో పడి ఓవైపు పెళ్లి చేసుకుంటే.. మరోవైపు కొందరు నిర్మాతలు లేటు వయసులోనూ రెండోసారి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు ఉంటున్నాయి. తెలుగులో దిల్ రాజు ఇలానే రెండో పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ నిర్మాత మధు మంతెన కూడా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ కి చెందిన మధు మంతెన.. దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగులో 'కార్తిక్' మూవీ తీశారు. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైపోయారు. ఆమిర్ ఖాన్ 'గజిని', రక్త చరిత్ర, క్వీన్, మసాన్, సూపర్ 30 లాంటి హిట్ మూవీస్ కి నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం 'రామాయణ్' అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం తీసే బిజీలో ఉన్నారు. 2015లో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాని పెళ్లి చేసుకున్న మధు మంతెన.. 2019లో ఆమెకి విడాకులు ఇచ్చేశారు. రీసెంట్ గా యోగా ట్రైనర్ ఐరా త్రివేదిని రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మాల్దీవులకు ఈ జంట హనీమూన్ కు వెళ్లింది. భార్య ఫొటోల్ని కొన్ని ఈయన పోస్ట్ చేశారు. అయితే ఐరాని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇంటిపేరుని తన ఇన్ స్టాలోనూ జోడించారు. ప్రస్తుతం 'మధు మంతెన త్రివేది' అని ఉంది. సాధారణంగా భర్తల పేరు లేదా ఇంటిపేరుని భార్య తన పేరు చివర చేర్చుకుంటుంది. ఇక్కడేమో రివర్స్ లో జరిగింది. (ఇదీ చదవండి: Jee Karda Review: 'జీ కర్దా' వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ) -
రావణ చరిత్ర కోసం చిరంజీవిని కలుస్తాం: భరద్వాజ
సౌద అరుణ స్టూడియోస్ పతాకంపై డ్రవిడ భూమి యొక్క ఆత్మ గౌరవ నినాదంతో 'కోడ్ రామాయణ' రానుంది. పాపులర్ రైటర్ సౌద అరుణ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బౌద్ధ బిక్షువు బంతె షీల్ రక్షిత్, ప్రముఖ రచయిత్రి లలిత చేతుల మీదుగా పోస్టర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. (ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్ చివరి సినిమా ఇదేనా?) దూర్వాసుడు పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ.. కోడ్ రామాయణ ద్వారా దాని అంతరార్థం మాత్రం తెలుస్తుందన్నారు. దీని తరువాత వచ్చే రెండవ భాగం 'రావణచరిత్ర' మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుంది. దాంట్లో రావణ పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఆ తరువాత మూడవ భాగం 'ఉత్తర రామాయణం' ఉంటుంది. ఇలా మూడు భాగాలుగా చెపుతూ.. డ్రవిడ భూమి ఆత్మ గౌరవం గురించి ఈ సినిమాలు తెలుపుతాయి. డ్రవిడ భూమి ఏ కారణాల చేత గుర్తింపు లేకుండా పోయిందో తెలపడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశమని భరద్వాజ అన్నారు. ప్రముఖ దర్శకుడు సౌద రచించిన ఈ పౌరాణిక అధ్యయనాన్ని ఇప్పుడు దృశ్య రూపకంగా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ సినిమా రిలీజ్ కాగానే మెగాస్టార్ చిరంజీవికి చూపించి... రెండోవ భాగంలో వచ్చే 'రావణచరిత్ర'లోని రావణాసుర పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తామని భరద్వాజ తెలిపారు. (ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్) -
డ్రెస్‌కోడ్ మార్చకపోతే రైలుని అడ్డుకుంటాం.. దెబ్బకు దిగొచ్చిన రైల్వే శాఖ
ఉజ్జయిని: రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పనిచేసే వెయిటర్ల డ్రెస్‌కోడ్‌ను రైల్వే శాఖ సోమవారం ఉపసంహరించుకుంది. వారి యూనిఫామ్‌ను మార్చేసింది. వారి డ్రెస్‌కోడ్ పట్ల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మత గురువులు, సాధువులు అభ్యంతరం వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. వెయిటర్లు సాధువుల తరహాలో కాషాయ రంగు దుస్తులు, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి, రైలులో విధులు నిర్వర్తిస్తున్నారని, ఇది హిందూ మతాన్ని అవమానించడమే అవుతుందని వారు ఆక్షేపించారు. డ్రెస్‌కోడ్‌ను మార్చకపోతే ఢిల్లీలో ఈ రైలును అడ్డుకుంటామన్నారు. రెండు రోజుల క్రితం రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు. దీంతో రైల్వే శాఖ వెంటనే స్పందించింది. సిబ్బంది దుస్తులను మార్చింది. సాధారణ చొక్కా, ప్యాంట్, సంప్రదాయ తలపాగా ధరించి, యాత్రికులకు సేవలందిస్తారని తెలిపింది. కాషాయ రంగు మాస్కులు, చేతి గ్లౌజ్‌ల్లో మార్పులు చేయలేదు. రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇటీవలే ఢిల్లీలో ప్రారంభమయ్యింది. 7,500 కి.మీ.ల మేర దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టేసి మళ్లీ ఢిల్లీకి చేరుకోనుంది. -
ప్రముఖ నటుడు అరవింద్ త్రివేది కన్నుమూత
ప్రముఖ నటుడు, ‘రామయణ్’ ఫేం అరవింద్ త్రివేది(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న త్రివేది మంగళవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందినట్లు ఆయన బంధువులు వెల్లడించారు. ఆయన మరణ వార్త తెలిసి బాలీవుడ్ టీవీ, సినీ నటీనటుల సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా అరవింద్ త్రివేది ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణ్’ సీరియల్లో రావణుడి పాత్ర పోషించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. చదవండి: తండ్రిని చూసి గుక్కపెట్టి ఏడ్చిన ఆర్యన్ ఖాన్ 1980లో వచ్చిన ఈ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అపురూప దృశ్య కావ్యానికి ఉన్న క్రేజ్‌ను బట్టి ఇటీవల ఫస్ట్ లాక్డౌన్లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు దూరదర్శన్ ‘రామాయణ్’ను పున:ప్రసారం చేసింది. 2020 ఏప్రిల్ 16న తిరిగి ప్రసారమైన రామయణ్‌ను ప్రపంచవ్యాప్తంగా 7.7 కోట్ల మంది వీక్షించడంతో సరికొత్త రికార్డు సృష్టించింది. రామానంద సాగర్ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ విడుదలైన 33 ఏళ్ల తర్వాత కూడా ఈ సీరియల్‌కు అంతటి స్థాయిలో ఆదరణ లభించడం విశేషం. చదవండి: ఆర్యన్ ఖాన్‌పై ఆరోపణలు నిరాధారం: అర్బాజ్ తండ్రి అయితే గతంలో అరవింద్ కరోనా మృతి చెందినట్లు వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై రామాయణ్‌లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహ్రీ స్పందించారు. అరవింద్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని సూచించారు. ఇప్పుడు అరవింద్ మృతి వార్తను కూడా ఆయన వెల్లడించారు. కాగా ఈ సీరియల్లో రావణుడిగా అరవింద్ త్రివేదీ నటించగా అరుణ్ గోవిల్.. రాముడిగా, సునీల్ లాహిర్.. లక్ష్మణ్‌గా, దీపిక చిఖిలియా.. సీతగా నటించారు. View this post on Instagram A post shared by Sunil Lahri (@sunil_lahri) -
విషాదం: ‘రామాయణ్’ ఫేమ్ చంద్రశేఖర్ కన్నుమూత
ప్రముఖ నటుడు, ‘రామాయణ్’ సీరియల్ ఫేమ్ చంద్ర శేఖర్ (98) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వయోభారంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ముంబైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ‘నాన్నగారు నిద్రలోనే కన్నుమూశారు. ఆయనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. వయసు మీద పడటంతోనే చనిపోయారు’’ అని చంద్ర శేఖర్ కుమారుడు, నిర్మాత అశోక్ శేఖర్ ట్వీట్ చేశాడు. జుహులోని పవన్ హాన్స్లో ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్. నటనపై మక్కువతో 1950లో జూనియర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆ తర్వాత ‘సురంగ్’ అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ‘కవి’, ‘మస్తానా’, ‘బసంత్ బహార్’, ‘కాలీ టోపీ లాల్ రుమాల్’, ‘గేట్ ఆఫ్ ఇండియా’, ‘ఫ్యాషన్’, ‘ధర్మ’, ‘డ్యాన్స్ డ్యాన్స్’, ‘లవ్ లవ్ లవ్’ తదితర సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ్ సీరియల్‌తో మరింత ఫేమస్ అయ్యారు. ఇందులో ఆర్య సుమంత్ అనే పాత్ర పోషించారు. रामायण में महामंत्री सुमंत्र का चरित्र निभाने वाले श्री चंद्रशेखर जी का आज देहांत हो गया है। उन्हें शांति और सद्गति मिले, राम जी से यही प्रार्थना है 🙏 सर, आपकी बहुत याद आएगी 🙏🙏 pic.twitter.com/1Wj1o6UaBC — Arun Govil (@arungovil12) June 16, 2021 -
బీజేపీలోకి ‘రాముడు’
న్యూఢిల్లీ: రామాయణం సీరియల్లో రాముడి పాత్రధారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు అరుణ్ గోవిల్(63) గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ జనరల్ సెక్రటరీ దేవశ్రీ చౌదరి సమక్షంలో అరుణ్ గోవిల్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైశ్రీరామ్ అనేది రాజకీయ నినాదం కాదన్నారు. భారతీయులకు అదొక జీవన విధానమని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను జైశ్రీరామ్ నినాదం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. -
కన్న తల్లిని కోల్పోవడం చాలా బాధకరం
సాక్షి, న్యూఢిల్లీ: దూరదర్శన్‌లో ప్రసారమైన ‘రామాయణ్’ ధారవాహికలో సీతగా నటించిన నటీ దీపికా చిఖాలియా కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. శనివారం ఆమె తల్లి మృతి చెందారు. దీపకా తన తల్లి మరణించిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తన తల్లిలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘కన్న తల్లిని కోల్పోవడం చాలా బాధకరం. ఆ దుఖం నుంచి బయటకు రావటం అంత సులభం కాదు. అమ్మా మీ అత్మకు శాంతి కలగాలి’ అని కామెంట్ చేశారు. సోషల్ మీడియోలో చాలా యాక్టివ్‌గా ఉండే దీపికా చిఖాలియా.. కొన్ని నెలల క్రింతం తన తల్లిదండ్రులతో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘అమ్మా, నాన్న, నేను.. మా కుటుంబానికి సంబంధించిన ఫొటో ఆల్బమ్‌లో నేను ఎంతో ఇష్టంగా పంచుకోవాలనుకునే ఫొటో ఇది. మా అమ్మకి చీరలు ధరించడం అంటే చాలా ఇష్టం. ఆమె తరచు చీరలు ధరించడానికే ఆసక్తి చూపేవారు. అదే విధంగా ఆమె వివిధ రకాల ఫర్స్‌లను కూడా ఇష్టపడేవారు. అందుకే నేను చాలా ఇష్టంగా పలు రకాల పర్స్‌లను సేకరించడం అలవాటుగా మార్చుకున్నాను. ఈ ఫొటో నా సోదరి పుట్టక ముందు బరోడా(వడోదరా)లో దిగినది’ అని కాప్షన్ జత చేశారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ కావ్యాన్ని దృశ్యంగా మలచిన ‘రామాయణ్’ ధారవాహిక ఏడాదిన్నర కాలం పాటు ప్రేక్షకులను అలరించింది. ఆ దృశ్యకావ్యంలో అరుణ్ గోవిల్ ‘శ్రీరాముడి’గా నటించగా, దీపికా చిఖాలియా ‘జానకి’గా నటించిన విషయం తెలిసిందే. View this post on Instagram Mum 🙏 RIP A post shared by Dipika (@dipikachikhliatopiwala) on Sep 11, 2020 at 9:14pm PDT -
టాప్ రేటింగ్‌లో ‘రామాయణం’
న్యూఢిల్లీ: 33 ఏళ్ల కిందట దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం, మహాభారతం సీరియళ్లు టెలివిజన్ చరిత్రలో ఓ ట్రెండ్ క్రియేట్ చేశాయి. అంతటి విశేష ప్రజాదరణ పొందిన ఈ సీరియళ్లు కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో మరోసారి బుల్లితెరపై కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం ప్రస్తుతం దంగల్ అనే ఛానల్లో ప్రసారమవుతోంది. తాజాగా బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అందించిన నివేదిక ప్రకారం టెలివిజన్‌లో ఎక్కువ మంది తిలకించే కార్యక్రమాల్లో రామాయణం మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. (స్టార్ మాలో రామాయణం) ఆగస్టు 1 నుంచి 31 వరకు భారతీయ ప్రేక్షకులు టీవీల్లో ఏయే కార్యక్రమాలను ఎక్కువగా వీక్షించారనే దానిపై బార్క్ ఒక నివేదిక విడుదల చేసింది. దీని ఆధారంగా టీఆర్పీల పరంగా రామాయణం ఇప్పటికీ టాప్ రేటింగ్‌లో దూసుకుపోతుందని పేర్కొంది. జీ టీవీలో వస్తున్న శ్రద్ధా ఆర్య, ధీరజ్ ధూపర్ నటించిన కుండలి భాగ్య సీరియల్ రెండో స్థానంలో ఉంది. అలాగే మహిమా శానిదేవ్ కీ మూడవ స్థానంలో కొనసాగుతంది. దూరదర్శలో ప్రసారమవుతోన్న శ్రీ కృష్ణ నాలుగో స్థానం, స్టార్ ప్లస్‌లో ప్లే అవుతున్న అనుపమా అయిదో స్థానం దక్కించుకున్నాయి. (‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’) బార్క్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తితో సతమతమవుతున్న జనాలు కాస్తా వినోదం కోరుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో ప్రేక్షకులు కామెడీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు ది కపిల్ షో, తారక్ మెహతా కా ఓల్తా చాష్మా వంటి కామెడీ కార్యక్రమాలతో మరోసారి నవ్వుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్రాణ భయంతో పరుగులు పెట్టాం: నటి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా 80లనాటి పాపులర్ సీరియల్ రామాయణ మళ్లీ ప్రజల ముందుకొచ్చింది.. బాగా పాలపులర్ కూడా అయింది. అందులో నటించిన ప్రధాన పాత్రధారులు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా షూటింగ్ విశేషాలను, తమ అనుభవాలను పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా రామాయణలోని సీత పాత్రధారి దీపికా చిఖ్లియా సీరియల్ షూటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఓ మర్చిపోలేని అనుభవాన్ని నెమరు వేసుకున్నారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు. అనంతరం ‘‘ఈ దృశ్యాల వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే! మేమా సమయంలో మర్రి చెట్టు కింద షూటింగ్ చేస్తూ బిజిగా ఉన్నాం. నేను, రాముడు, లక్ష్మణుడు డైలాగులను నేర్చుకుంటున్నాం. అంతా మామూలుగానే ఉంది. ( ‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’) అంతలోనే కెమెరామెన్ అజిత్ నాయక్ అక్కడికి వచ్చారు. ఆ వెంటనే ‘‘మీరు దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపోండి. చెట్టుకింద నిలబడొద్దు’’ అని అన్నారు. ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాం. ఆయన చెట్టుకింద ఉన్న మిగితా వారిని కూడా పక్కకు వెళ్లిపొమ్మన్నారు. డైరెక్టర్ సాగర్ గారు కూడా ఏం జరుగుతోందో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. ఆ వెంటనే చెట్టుమీద ఉన్న పెద్ద పామును ఆయన గమనించారు. ఆ తర్వాత అందరం ప్రాణ భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టాం’’ అంటూ చెప్పుకొచ్చారు. ( రామాయణంపై మిమ్స్.. నటుడిపై నెటిజన్ల ఫైర్) View this post on Instagram There is a story behind this scene ....so I shared ...we were busy with the shoot, learning lines and so on...the day was as normal as could be, after the scene got over our cameraman Ajit naik (cinematography) came to tell us please vacate the place and don’t stand underneath the tree and we were wondering all the three actors as to what was the hurry and why so abrupt ...he asked all the technicians also to clear the field ..sagar Saab was also wondering what happened ...and then he pointed out to a huge fat snake on the tree and what followed after that was we all RAN for our life🤣 sooo many memories 😊....#memories#ramayan#sagarworld# tree#banyantree#snake#fear#phobia#umbergoan#studio#sets#actors#actress#costume A post shared by Dipika (@dipikachikhliatopiwala) on Jun 11, 2020 at 7:21pm PDT -
‘దీపికా’ రాజకీయవేత్త అని మీకు తెలుసా?
హిందీలో ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి విశేష ఆదరణ పొందారు దీపికా చిఖలియా. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. తాజాగా స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ ‘సరోజిని’లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. గురువారం విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా లాక్డౌన్ కారణంగా హిందీ రామాయణ్‌ను దూరదర్శన్‌లో పునఃప్రసారం చేస్తున్నారు. దీంతో దీపిక క్రేజ్ మరోసారి అమాంతం పెరిగిపోయింది. అయితే నటిగా మంచి గుర్తింపు పొందిన దీపిక రాజకీయ రంగప్రవేశం చేశారని చాలా కొంతమందికే తెలుసు. అయితే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి సీత ఇప్పటి సరోజిని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘రామాయణం సినిమాగా తెరకెక్కించాలనే డిమాండ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయంది. అయితే ఈ సినిమాలో నటించాలన్నా, తెరకెక్కించాలన్న రామాయణం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఒక వేళ రామాయణాన్ని సినిమాగా తెరకెక్కిస్తే సీతారాముల పాత్రలకు హృతిక్ రోషన్, అలియాభట్‌లు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. అంతేకాకుండా అజయ్ దేవ్‌గణ్ రావణుడు, వరుణ్ ధావన్ లక్ష్మణుడి పాత్రలు చేస్తే బాగుంటుంది. ఇక రామయణ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో పలు మ్యాగజైన్స్ ఫోటో షూట్‌కు పిలిచారు. అందుకు భారీ మొత్తం కూడా ఆఫర్ చేశారు. కానీ ఓ వైపు సీత పాత్ర పోషిస్తూ ఫోటో షూట్లో పాల్గొనడం భావ్యం కాదని సున్నితంగా తిరస్కరించాను. 1991లో భారతీయ జనతా పార్టీలో చేరాను. దివంగత నాయకులు అటల్ బిహార్ వాజ్‌పేయ్ స్పూర్థితో రాజకీయం రంగ ప్రవేశం చేశాను. మా తాత ఆరెస్సెస్ కార్యకర్త. దీంతో నాలో చిన్నప్పట్నుంచే ఆరెస్సెస్ భావాలు ఉండేవి. ఎల్కే అద్వానీ, సుష్మాస్వరాజ్, నరేంద్ర మోదీ తదితరులు నా రాజకీయ సహచరులు. గుజరాత్‌లోని బరోడా లోని లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచాను. ఇప్పటికీ పార్టీకి అవసరమైనప్పుడు నా వంతు సహాయం, సలహాలు అందిస్తుంటాను’అంటూ దీపికా చిఖలియా పేర్కొన్నారు. ఈ నటి తెలుగులో కూడా యమపాశం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించారు. చదవండి: ‘సాహో ఎన్టీఆర్.. నీకు సెల్యూట్’ ‘సితారా.. సింగర్‌గా ట్రై చేయ్’ -
‘రావణుడి’పై అసత్య ప్రచారం
న్యూఢిల్లీ: తాను బతికే ఉన్నానని దూరదర్శన్ రామాయణ్ సీరియల్లో రావణ పాత్రధారి అరవింద్ త్రివేది లంకేశ్(82) వెల్లడించారు. ఆయన చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఇది నిజమా, కాదా తెలుసుకునేందుకు అభిమానులు ట్విటర్ ద్వారా లంకేశ్ కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. దీంతో తాను బతికేవున్నానని ఆయన ప్రకటించారు. లంకేశ్ చనిపోయినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన మేనల్లుడు కౌస్తుభ్ త్రివేది తోసిపుచ్చారు. ‘మా అంకుల్ అరవింద్ త్రివేది లంకేశ్ క్షేమంగా ఉన్నారు. దయచేసి ఆయనపై అసత్య ప్రచారం ఆపండి. ఆయన బతికే ఉన్నారన్న సమాచారాన్ని అందరికీ తెలియజేయాల’ని కౌస్తుభ్ ట్వీట్ చేశారు. లంకేశ్ కూడా ఇదే ట్వీట్‌ను హిందీలో తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో రామాయణ్ సీరియల్‌ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. రావణ పాత్రధారి అరవింద్ త్రివేది.. తాజాగా సీతాపహరణం దృశ్యాన్ని చూస్తున్న వీడియో ఇటీవల వైరల్ అయింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 16న రామాయణ్‌ను 7.7 కోట్లు వీక్షించడంతో కొత్త రికార్డు నమోదయింది. రామానంద సాగర్ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ ధారావాహిక విడుదలైన 33 ఏళ్ల తర్వాత కూడా భారతీయ టెలివిజన్ ప్రపంచాన్ని ఏలుతుండటం విశేషం. చదవండి: డీడీ నంబర్ వన్ -
రాజమౌళికి రిక్వెస్ట్.. ఏం చేస్తారో చూడాలి
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజానీకం ఇంటికే పరిమితమైంది. ఈ లాక్డౌన్ సమయాన్ని వినోదంతో నింపేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వీరందిరినీ బుల్లితెర వైపు తిప్పుకునేందుకు అనేక ఛానళ్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో అత్యంత ప్రజాధరణ పొందిన సీరియళ్లు, షోలను తిరిగి ప్రసారం చేస్తున్నారు. అయితే అందరి అంచనాలను మించి దూరదర్శన్‌లో ప్రసారం అవుతున్న రామయణం సీరియల్‌కు విశేష ప్రేక్షకాధరణ లభిస్తోంది. ప్రతి రోజు కొన్ని కోట్లలో ఈ సీరియల్‌ను వీక్షిస్తున్నారు. రామాయణం ఇంత బిగ్గెస్ట్ హిట్ సాధించడంతో తెరపైకి ఓ డిమాండ్ వచ్చింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రామాయణం చిత్రాన్ని తెరకెక్కించాలని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా RajamouliMakeRamayan అనే హ్యాష్ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే మహాభారతం రూపొందించడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రామయణ చిత్రం కూడా తీస్తే భావి తరాలకు గుర్తిండిపోయే చిత్రమవుతుందని నెటిజన్లు ఆశపడుతున్నారు. ‘సర్ దయచేసి రామయణాన్ని తెరకెక్కించండి’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరి రామాయణం గురించి రాజమౌళి మనసులో ఏముందో తెలియాలంటే వేచిచూడాల్సిందే. చదవండి: భన్సాలీ చిత్రం.. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ బన్ని భారీ ఫైట్.. ఖర్చెంతో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_541241401.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘రామాయణ్’ ప్రపంచ రికార్డు
న్యూఢిల్లీ: రామానంద సాగర్ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ ధారావాహిక విడుదలైన 33 ఏళ్ళ తరువాత సైతం, ఇప్పటికీ భారతీయ టెలివిజన్ ప్రపంచాన్ని ఏలుతుంది. రామాయణ్ సీరియల్‌ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే రెండోసారి ప్రసారమౌతోన్న ధారావాహిక ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షిస్తోన్న కార్యక్రమంగా రికార్డయినట్టు దూరదర్శన్ ఇండియా ట్విట్టర్లో షేర్ చేసింది. ఏప్రిల్ 16వ తేదీన ‘రామాయణ్ ను ప్రపంచవ్యాప్తంగా వీక్షించినవారి సంఖ్య అక్షరాలా 7.7 కోట్లు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చూసే టీవీ ప్రసారాల రికార్డుని రామాయణ్ బద్దలు కొట్టినట్టయ్యింది. డీడీ నేషనల్ ఛానల్లో మార్చి నుంచి తిరిగి ప్రారంభించిన రామాయణ్ రోజుకి రెండు సార్లు ప్రసారం అవుతోంది. -
రామాయణ్ మరో కొత్త రికార్డు
న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీవీ ప్రేక్షకులను ఆనందింపజేయడానికి 1980, 90లలో అమితంగా ఆకట్టుకున్న రామాయణ్, మహాభారత్, శ్రీ కృష్ణ వంటి సీరియళ్లను దూరదర్శన్ తిరిగి ప్రసారం చేస్తుంది. పునఃప్రసారంలో భాగంగా ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన రామాయణ్ సీరియల్ తాజాగా మరో కొత్త రికార్డును తన పేరిట లిఖించుకొంది. లాక్డౌన్ కారణంగా మార్చి 28 నుంచి డీడీలో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్‌ను ఏప్రిల్ 16న 7.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు రీ టెలికాస్ట్‌లో భాగంగా ప్రసారమైన సీరియళ్లలో అత్యధికంగా వీక్షించిన సీరియల్‌గా రామాయణ్ నిలిచింది. ఈ విషయాన్ని ప్రసారభారతి తన ట్విటర్లో గురువారం అధికారికంగా వెల్లడించింది. (మహాభారత్ డీడీ నంబర్ వన్) మొత్తం 72 ఎపిసోడ్లుగా ఉన్న రామాయణ్ సీరియల్ దూరదర్శన్‌లో ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్ ప్రసారమవుతుంది. 1987లో దూరదర్శన్‌లో మొదటిసారిగా ప్రసారమైన రామాయణ్ సీరియల్‌ను రామానంద సాగర్ దర్శకత్వం వహించారు. సీరియల్లో రామునిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిలాకియా, రావణునిగా అరవింద్ త్రివేది, హనుమాన్‌గా ధారాసింగ్ తదితరులు నటించారు. Ramayan World Record - Highest Viewed Entertainment Program Globally#IndiaFightsCorona#IndiaFightsBack pic.twitter.com/RdCDehgxBe — Prasar Bharati (@prasarbharati) April 28, 2020 -
సీతాపహరణం చూస్తున్న ‘రావణుడు’!
-
సీతాపహరణం చూస్తున్న ‘రావణుడు’!
న్యూఢిల్లీ: భారత్‌లో రామాయణ, మహాభారత ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన సీరియళ్లు, సినిమాలు, నాటకాల ఆదరణకు కొదవే ఉండదు. ఇక లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమతమైన అభిమానులు, సెలబ్రిటీల కోరికమేరకు 37 ఏళ్ల క్రితం విజయవంతంగా ప్రదర్శితమైన రామాయణ్, మహాభారత్ సీరియళ్లను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రేటింగ్స్ పరంగా నయా రికార్డులను సాధిస్తున్న రామాయణ్ మరోసారి వార్తల్లో నిలిచింది. నాడు రామాయణ్ సీరియల్లో రావణ పాత్రధారి అరవింద్ త్రివేది.. తాజాగా సీతాపహరణం దృశ్యాన్ని చూస్తున్న వీడియో వైరల్ అయింది. (చదవండి: డీడీ నంబర్ వన్) 81 ఏళ్ల వయసున్న త్రివేది సీతను అపహరించే ఘట్టం క్లైమాక్స్‌కు చేరుకున్న దృశ్యాల్ని టీవీ ముందు కూర్చుని ఆసక్తికరంగా వీక్షిస్తున్న వీడియో అది. సీతను రావణుడు చెరబడుతున్న సందర్భంలో ఆయన రెండు చేతులూ జోడించడం గమనార్హం. ఈ వీడియోను రామాయణ్ ఫ్యాన్స్ క్లబ్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్ అయింది. కాగా, రామానంద్‌సాగర్ దర్శకత్వం, నిర్మాణ సారథ్యంలో 1987లో వచ్చిన ఈ సీరియల్లో రాముడిగా అరుణ్ గోవలి, సీతగా దీపికా చిఖిలా, లక్ష్మణుడిగా సునీల్ లహరి నటించారు. (చదవండి: ఒక్కరోజులోనే ఆ సీరియల్‌కు 50 మిలియన్ వ్యూస్) -
డీడీ నంబర్ వన్
కేబుల్ రాకముందు దూరదర్శన్ (డీడీ) ఛానలే అందరికీ వినోదం, విజ్ఞానం అందించింది. కేబుల్ టీవీ, స్మార్ట్ ఫోన్స్ వినియోగం ఎక్కువ కావడంతో దూరదర్శన్ కి ఇంతకు ముందు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి. అయితే ఈ ‘లాక్ డౌన్’ సమయంలో ‘డీడీ నేషనల్’ తన పూర్వ వైభవాన్ని చూస్తోంది. టీ. ఆర్. పీ రేటింగ్స్ లో అగ్రగామిగా నిలుస్తోంది. కారణం దూరదర్శన్ లో ఒకప్పుడు బాగా పాపులర్ అయిన సీరియల్స్, షోలను పునః ప్రసారం చేయడమే. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) విడుదల చేసిన డేటా ఆధారంగా దేశంలో దూరదర్శన్ నంబర్ వన్ స్థానంలో ఉంది. లాక్ డౌన్ కి ముందు వారాల్లో టాప్ 10లో లేకపోయినా ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం. మార్చి చివరి వారం (మార్చి 21–27) రేటింగ్ సంఖ్యతో పోలిస్తే ఆ మరుసటి వారం (మార్చి 28– ఏప్రిల్ 3) దూరదర్శన్ వీక్షకుల సంఖ్య సుమారు 580 రెట్లు పెరిగినట్టు తెలిసింది. ‘‘రామాయణం, మహాభారతం, శక్తిమాన్, సర్కస్, బ్యోమకేష్ బక్షి వంటి పాపులర్ సీరియళ్లు, ప్రోగ్రాములు తిరిగి ప్రసారం కావడం దేశం మొత్తాన్ని శ్రద్ధగా టీవీలకు అతుక్కుపోయేలా చేసింది డీడీ. ముఖ్యంగా రామాయణం , మహాభారతం ప్రసారం అవుతున్న సమయాల్లో వీక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. అలాగే క్వారంటైన్ సమయాల్లో టీవీ వీక్షించే సమయం కూడా 43 శాతం వరకు పెరిగింది’’ అని బార్క్ సంస్థ తెలిపింది. -
సరోజినీ నాయుడుగా...
స్వాతంత్య్ర సమరయోధురాలు, కవయిత్రి, స్వతంత్ర భారతదేశ తొలి మహిళా గవర్నర్, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ తెరకెక్కనుంది. సరోజినీ నాయుడు పాత్రను దీపికా చిఖలియా పోషించనున్నారు. ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి, అప్పటి తరానికి అభిమాన తారగా మిగిలిపోయారు దీపికా. అప్పట్లో ఆమెను అసలు పేరుతో కాకుండా ‘సీత’ అనే చాలామంది పిలిచేవారు. ఆ పాత్రను అంత అద్భుతంగా చేశారు దీపికా. ఆ తర్వాత నటిగా వెండితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారామె. 1991లో ఎన్టీఆర్ నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంలో చంద్రమతిగా నటించారు దీపిక. హిందీ, తమిళం, గుజరాత్ భాషల చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. సరోజినీ నాయుడు బయోపిక్ గురించి దీపిక మాట్లాడుతూ– ‘‘సరోజినీ నాయుడు బయోపిక్‌లో నటించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆన్లైన్లో సరోజినీగారి గురించి వెతికాను. నాకు కావాల్సినంత సమాచారం దొరకలేదు. రైటర్ ధీరజ్ మిశ్రా ఈ బయోపిక్ గురించి చెప్పారు. అయితే నేనింకా సైన్ చేయలేదు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత పూర్తి స్క్రిప్ట్ విని నిర్ణయం తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ధీరజ్ మిశ్రాయే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని బాలీవుడ్ టాక్. -
రామాయణ్ చూస్తున్నా.. మరి మీరు?
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోకే పరిమితమవుతున్నారు. దేశంలో లాక్డౌన్ విధించడంతో సెలబ్రిటీలు సైతం సెల్ప్ కార్వంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. వారి సినిమా వివరాలను, రోజంతా ఇంట్లో కాలక్షేపం చేస్తున్న పనులను వారితో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ ట్విటర్ ద్వారా తెలిపారు. ‘లాక్డౌన్ సమయంలో రామాయణం చూస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. (కరోనా: ధోనిపై ట్రోలింగ్.. మండిపడ్డ భార్య!) ‘దూరదర్శన్ ఛానల్లో ప్రసారమవుతున్న రామాయణం, మహా భారతం నన్ను మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్తుంది. మొత్తం కుటుంబంతో కలిసి చూస్తున్నాం. ఇది మా ఫ్యామిలీ వీకెండ్ ప్లాన్. రామాయణం మళ్లీ ప్రారంభం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు భారతీయ పురాణాలను నేర్చుకోవడానికి ఇది గొప్ప మార్గం’ అంటూ ఆమె తెలిపారు. కాజల్‌తో పాటు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సైతం రామాయణం వీక్షిస్తున్న వీడియోను షేర్ చేశారు. (నాకు కరోనా లక్షణాలు లేవు.. కానీ: కైలీ జెన్నర్) Taking me back to childhood. #Ramayan and #Mahabharat on @DDNational with the entire family! This was our routine weekend plan. 😍 so glad it’s restarted, great way for kids to learn Indian Mythology. pic.twitter.com/ZFc4X0oTFl — Kajal Aggarwal (@MsKajalAggarwal) March 28, 2020 కాగా, శ్రీరాముని జీవితగాథ ఆధారంగా తీసిన రామాయణం ధారావాహిక మరోసారి దేశవ్యాప్తంగా ప్రజలను అలరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సీరియల్‌ను ఈనెల 28వ తేదీ నుంచి దూరదర్శన్ డీడీ నేషనల్ చానెల్లో ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. దేశమంతా కరోనా లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు ఈ ఆధ్యాత్మిక సీరియల్‌ను మరోసారి ప్రసారం చేయాలని నిర్ణయించామన్నారు. శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను దూరదర్శన్‌లో చూడొచ్చని శుక్రవారం ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. 1987లో మొదటిసారిగా దూరదర్శన్‌లో రామాయణం ప్రసారమైన విషయం తెలిసిందే. Please tune in to @DDNational at 9 am & 9 pm to watch 'Ramayan' and @DDBharati at 12 noon and 7 pm to watch 'Mahabharat' today and everyday.#StayHomeStaySafe #IndiaFightsCorona@narendramodi @PIB_India @DDNewslive @DDNewsHindi — Prakash Javadekar (@PrakashJavdekar) March 28, 2020 -
మరోసారి ‘రామాయణ్’
న్యూఢిల్లీ: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని జీవితగాథ ఆధారంగా తీసిన రామాయణ్ ధారావాహిక మరోసారి దేశవ్యాప్తంగా ప్రజలను అలరించనుంది. ఈ సీరియల్‌ను ఈనెల 28వ తేదీ నుంచి దూరదర్శన్ డీడీ నేషనల్ చానెల్లో ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. దేశమంతా కరోనా లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు ఈ ఆధ్యాత్మిక సీరియల్‌ను మరోసారి ప్రసారం చేయాలని నిర్ణయించామన్నారు. శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను దూరదర్శన్‌లో చూడొచ్చని శుక్రవారం ట్విట్టర్లో ప్రకటించారు. 1987లో మొదటిసారిగా దూరదర్శన్‌లో రామాయణ్ ప్రసారమైంది. -
రమణీయం.. రామాయణం
-
శ్రీ రాముడిగా?
‘సూపర్ 30’ సక్సెస్‌తో సూపర్ ఎనర్జీలో ఉన్నారు హృతిక్ రోషన్. ఇప్పుడు వరుసగా సినిమాలను సైన్ చేస్తున్నారు. ఫర్హాన్ ఖాన్‌తో ‘సత్తే పే సత్తే’, ఆ తర్వాత ‘క్రిష్ 4’ ఉంటుందని ప్రకటించారు. లేటెస్ట్గా అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ్’ సినిమాలో హృతిక్ హీరోగా నటించనున్నారని బాలీవుడ్ టాక్. ఇందులో శ్రీరాముడిగా హృతిక్ నటించనున్నారట. లైవ్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమాను ‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారి, ‘మామ్’ దర్శకుడు రవి ఉడయార్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూడు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రం బడ్జెట్ సుమారు 1500 కోట్లు. -
పదిహేను వందల కోట్ల రామాయణం
చిన్నప్పటి నుంచి రామాయణాన్ని, అందులోని పాత్రలను కథలు కథలుగా వింటూనే ఉన్నాం. అందులో కొన్ని ఘట్టాలను పలు పౌరాణిక సినిమాల్లో చూశాం. ఇప్పుడు పూర్తి స్థాయి రామాయణాన్ని 3డీలో తెరకెక్కించడానికి రంగం సిద్ధమైంది. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ, ‘మామ్’ ఫేమ్ రవి ఉడయార్ ఈ లైవ్ యాక్షన్ 3డీ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. గతంలో 40 కోట్ల భారీ (అప్పటి మార్కెట్ వాల్యూ) బడ్జెట్‌తో ‘మగధీర’, బాలీవుడ్ మొదటి వంద కోట్ల చిత్రం ‘గజిని’ నిర్మించిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ భారీ రామాయణానికి ఓ నిర్మాత కావడం విశేషం. ఇప్పుడు 1500కోట్ల భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ సంస్థ ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రాతో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మధు మంతెన నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారు. ‘‘మూడేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, పంజాబీ నటులు నటించనున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా ‘రామాయణ్’ని రూపొందించబోతున్నాం. మూడు భాగాలుగా తెరకెక్కబోయే ఈ చిత్రం మొదటి భాగం 2021లో రిలీజ్ కానుంది. ఒక్కో భాగానికి 500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించనున్నాం’’ అని చిత్రబృందం ప్రకటించింది. -
కృష్ణ పరవశం
రాముణ్ణి సీరియల్ హీరోగా చేయొచ్చని ‘రామాయణ్’ ద్వారా గ్రహించిన రామానంద్ సాగర్ కృష్ణుడి వేణుగానంతో 200 ఎపిసోడ్లు తీయవచ్చని నిరూపించాడు. శ్రీకృష్ణుడిపై నిర్మించిన ‘శ్రీకృష్ణ’ సీరియల్ ఆ విహారి విశ్వరూపాన్ని ఇంటింట్లో ప్రత్యక్షం చేయించింది. ఆ కృష్ణ పరవశం నేటికీ మరపురానిది. బాల్యంలో కన్నతల్లి దేవకి అయినా పెంచిన తల్లి యశోద దగ్గర అల్లారుముద్దుగా పెరుగుతాడు కృష్ణుడు. రామానంద్‌సాగర్ దేవకిలా శ్రీకృష్ణ సీరియల్‌కి ప్రాణం పోస్తే.. తాను యశోదలా మురిపెంగా పెంచి ప్రతి ఒక్కరి కళ్లకు కట్టింది దూరదర్శన్. 1993 నుంచి 1996 వరకు నాలుగేళ్ల పాటు శ్రీకృష్ణ లీలలను ప్రసారం చేసింది గ్రేట్ ఇండియన్ టెలివిజన్. 90ల కాలంలో బుల్లితెరకు దాదాపు వందకోట్ల ఆదాయం తెచ్చిన సీరియల్ శ్రీకృష్ణ కావడం విశేషం.కృష్ణుడి గురించి దేశమంతా తెలుసు. కథలు కథలుగా కృష్ణుడు ప్రతి ఇంటి బిడ్డడే. ఆ అల్లరి, కొంటెతనం తెలియనివారుండరు. ఆ వెన్నదొంగను అప్పటికే సినిమా పరిశ్రమ ఎన్నో విధాల పరిచయం చేసింది. మళ్లీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది అనుకోలేదు రామానంద్‌సాగర్. అప్పటికే రామాయణానికి ముందు తన పేరును సార్థకం చేసుకున్న రామానంద్‌సాగర్ రాముడు తర్వాత మరో పురాణ పురుషుడిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనుకున్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడిని అప్పటికే జనం చూసి ఉన్నారు. తిరిగి కృష్ణుడిని చూడాలంటే ఓ ప్రత్యేకత ఉండాలి. అందుకే భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, హరివంశం, విష్ణుపురాణం, పద్మపురాణం, గర్గ సంహిత, భగవద్గీత, మహాభారత్ గ్రం«థాల నుంచి కృష్ణుడున్న ప్రతీ సన్నివేశాన్ని తీసుకున్నారు. ఆసక్తిగా మలుచుకున్నారు. మూడేళ్ల పాటు టీవీ ప్రేక్షకులను కృష్ణలీలలతో అలరించారు. రాక్షస సంహారమే ప్రధానం కంసుడు తన చెల్లెలు దేవకి – బావ వసుదేవుడిని బంధించి చెరసాలలో ఉంచుతాడు. యోగులకు, దేవతలకు తాను భూమ్మీద జన్మిస్తున్నట్టు చెబుతాడు వైకుంఠ నారాయణుడు. దేవకి కడుపున అష్టమసంతానంగా జన్మిస్తాడు నారాయణుడు. కంసుడి కంటపడకుండా ఉండటానికి వసుదేవుడు ఆ బిడ్డను గంపలో పెట్టుకొని అర్ధరాత్రి కారాగారాన్ని ముంచేస్తున్నట్టు పరవళ్లు తొక్కుతున్న యమునా నదిని దాటుకొని రేపల్లెలో ఉన్న నందుని ఇంటికి చేరుతాడు. యశోద ప్రసవించిన ఆడబిడ్డను తీసుకొని, తన కొడుకును ఆమె పక్కన పడుకోబెట్టి తిరిగి కారాగారం చేరుకుంటాడు. దేవకి ప్రసవించిందని తెలుసుకున్న కంసుడు ఆ బిడ్డను చంపడానికి కత్తి ఎత్తుతాడు. దాంతో ఆ బిడ్డ అదృశ్యమై తను యోగ మాయ అని, తాను దేవకి బిడ్డ కాదని, రేపల్లెలో కృష్ణుడు పెరుగుతున్నాడని, అతడే కంసుడిని హతమారుస్తాడని చెప్పి అదృశ్యమౌతుంది. అప్పటినుంచి కంసుడు రేపల్లెలో పెరుగుతున్న కృష్ణుడిని చంపడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. యశోదా గారాబు తనయుడిగా కృష్ణుడు రేపల్లెలో చేయని అల్లరంటూ ఉండదు. గోకులంలో గోవర్ధానాన్ని ఎత్తి యాదవులందరినీ కాపాడిన విధం, సాందీపుని ఆశ్రమంలో నేర్చిన విద్య, రాక్షసులను సంహరించి, తన బలగాన్నంతా కాపాడుకున్న విధం... చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి మనసును గెలుచుకుంది. కృష్ణుడి బాల్యంతోపాటు కౌమారం అటు నుంచి రాధాకృష్ణుల ప్రేమనూ బుల్లితెర మీద హృద్యంగా చూపారు దర్శకులు. మంచి పక్షాన నిలిచిన దైవం బృందావనం నుంచి ద్వారక చేరి మామ కంసుడిని హతమార్చి తల్లిదండ్రులని చెరసాల నుంచి విడిపించిన బలరామకృష్ణుల గాధలను టీవీ కట్టేసినా మరచిపోలేక పోయారు ప్రేక్షక జనం. ద్వారకా నగరం, అక్కడ కృష్ణుడి వైభవంతోపాటు తనను కోరి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదరించే సుగుణాన్ని ఎంతో అందంగా కళ్లకు కట్టారు. భారత యుద్ధ సమయంలో అర్జునుడు–దుర్యోదనాదుల రాక, యుద్ధంలో పాండవుల పక్షాన కృష్ణుడు పాల్గొనడం.. వంటి ఘట్టాలనూ చూపారు. కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు కృష్ణుని కథ పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది. మహాభారతం చివరిలో కృష్ణుని నిర్యాణంతో సీరియల్ ముగుస్తుంది. – ఎన్.ఆర్ వందకోట్ల కృష్ణుడు 1993లో బుల్లితెరమీద ప్రత్యక్షమైన శ్రీ కృష్ణ సీరియల్‌ను 1995లో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ వరించింది. వందకోట్ల సంపాదనతో దూరదర్శన్ ద్వారకానగర వైభవమంత వెలిగిపోయింది ∙ సిరివెన్నెల సినిమా హీరో సర్వదమన్ డి. బెనర్జీ. కృష్ణుడిగా బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు ∙శ్రీ కృష్ణ సీరియల్‌ను రామానందసాగర్, సుభాష్ సాగర్, ప్రేమ్‌సాగర్‌లు ‘సాగర్ ఎంటర్ప్రైజెస్’ ద్వారా నిర్మించారు. దర్శకులు రామానంద్‌సాగర్, ఆనంద్‌సాగర్, మోతీసాగర్లు ∙యువ కృష్ణుడిగా స్వాప్నిల్ జోషి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కృష్ణుడుగా బెనర్జీ నటించారు. స్వాప్నిల్ జోషి కన్నా బెనర్జీ కృష్ణుడిగా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరస్థానాన్ని పొందారు. అందుకు బెనర్జీ రూపమే కాదు చిరుమందహాసం, నటన జనాన్ని అమితంగా ఆకట్టుకున్నాయి ∙రవీంద్ర జైన్ ఈ సీరియల్ సంగీతాన్ని అందించారు. ‘శ్రీ కృష్ణ గోవింద్ హరే మురారీ’ టైటిల్ సాంగ్ ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా చాలా పాపులర్ అయ్యింది ∙ఈ సీరియల్ మారిషస్, నేపాల్, సౌత్ ఆఫ్రికా, జకర్తా, థాయిలాండ్ టీవీలు సైతం ప్రసారం చేశాయి ∙ఆ తర్వాత వివిధ చానెల్స్‌లో ప్రసారమైన జై శ్రీ కృష్ణ, రాధా కృష్ణ, పరమావతార్ శ్రీ కృష్ణ.. వంటి సీరియల్స్ ప్రేక్షకులను అలరించాయి. అలరిస్తున్నాయి. -
ఇరువురు జానకీలు ఒక్కచోట చేరిన వేళ...
దూర్‌దర్శన్‌లో ధారవాహికలు ప్రారంభమయిన తొలి నాళ్లలో వచ్చిన సంచలనం ‘రామాయణ్’. వాల్మీకి మహర్షి రచించిన ఆ అపురూప కావ్యాన్ని దృశ్యంగా మలచి ఏడాదిన్నర కాలం పాటు ప్రేక్షకులను అలరించింది. ఆదివారం వచ్చిందంటే చాలు ఎన్ని పనులున్నా ‘రామాయణ్’ ప్రసార సమయానికి మాత్రం టీవీల ముందు వాలిపోయేవారు. అంతలా జనాల్ని అలరించిన ఆ దృశ్యకావ్యంలో అరుణ్ గోవిల్ ‘శ్రీరాముడి’గా నటించగా, దీపికా చిఖాలియా ‘జానకి’గా అలరించింది . ‘రామాయణ్’లో వారు ప్రేక్షకులను ఎంతలా అలరించారంటే, వారనేదో టీవీ నటుల్లా కాక, దేవతా మూర్తులు ‘సీతారాముల్లా’నే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. నేటి కాలంలో కూడా పలు ఇతిహాసాలను తెరకెక్కితోన్నా, అలనాటి ‘రామాయణ్’ స్థానం ప్రత్యేకం. ఈ కాలం నటినటులతో 2008లో కూడా ‘రామాయణ్’ ధారావాహిక ప్రారంభమయ్యింది. ఇది కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇందులో బొన్నెర్జి సీతా దేవి పాత్రలో నటించింది. అయితే ఈ మధ్య ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ నాటి సీత దీపికా చిఖాలియా, ఈ నాటి సీత బొన్నెర్జిలు ఇద్దరు ఒక్క చోట చేరడం జరిగింది. ఇంకేముంది ఇద్దరు జానకీలను తమ కెమరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటి పడ్డారు. ఈ సందర్భంగా బొన్నెర్జి, చిఖలియాతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దాంతో పాటు ‘ఈ నాటి సీత, ఆ నాటి సీతను కలిసింది. చాలా అద్భుతమైన, అరుదైన సందర్భం. నేను రామాయణలో నటించడానికి ఒప్పుకున్నప్పుడు మీ(చిఖాలియా) డీవీడీలను చూసి, అర్ధం చేసుకుని, తెలుసుకొని నటించాను. నిజంగా మీరోక లెజెండ్. ప్రేమతో’ అనే సందేశాన్ని పోస్టు చేశారు బొన్నెర్జి. ఇలా ఇద్దరు సీతలను ఒక్క చోట చూసిన అభిమానులు కూడా తెగ సంతోషిస్తున్నారు. వీరిద్దరి ఫోటోలను తెగ షేర్ చేస్తోన్నారు. When #Sita meets Sita ........ How I savoured this moment of meeting you @dipikkatopiwala my first work #ramayana was on the foundation of seeing your DVDs , understanding, forming knowledge. #legend................ lots of looooove. 🙏🏻🙏🏻🙏🏻 A post shared by Debina Bonnerjee (@debinabon) on Jul 29, 2018 at 2:07am PDT ఏనాటికైనా చెడుపై మంచే విజయం సాధిస్తుందనే ఇతివృత్తంతో వాల్మీకి రచించిన ఇతిహాసం రామాయణాన్ని సుభాష్ సాగర్, రామానంద్ సాగర్, ప్రేమ్ సాగర్లు నిర్మాతలుగా, రామానంద్, ఆనంద్ సాగర్, మోతీ సాగర్ దర్శకత్వంలో రామాయణ్‌ను తెరకెక్కించారు. దాదాపు 78 వారాలపాటు ప్రసారమయిన ఈ ధారావాహిక తొలి ఎపిసోడ్ 1986, జనవరి 25న ప్రారంభం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సీరియల్‌ను దాదాపు 65 కోట్ల మంది వీక్షించారు. -
కత్తి మహేష్‌పై ఫిర్యాదులు
సాక్షి, అమలాపురం: రామయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అమలాపురం ఆజాద్ ఫౌండేషన్ కోరింది. ఓ వార్తా చానల్ చర్చా కార్యక్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ ఆదివారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఆ ఫౌండేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావుకు అందజేశారు. న్యూస్ ఛానల్ డిబేట్లో కత్తి మహేష్ మాట్లాడుతూ.. ‘రామాయణం నాకొక కథ మాత్రమే. రాముడు దగుల్భాజీ అని నేను నమ్ముతా. ఆ కథలో సీత రావణుడితో ఉంటేనే న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అజాద్ ఫౌండేషన్ అధ్యక్షుడు యల్లమిల్లి నాగసుధా కొండ తెలిపారు. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌పైన, ఇలాంటి పనికి రాని చర్చలు పెట్టి మతాలు, కులాల, సామాజిక వర్గాలను రెచ్చ గొట్టేలా ప్రసారాలు చేసే ఆ టీవీ ఛానల్ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని ఫౌండేషన్ ప్రతినిధులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించి కత్తి మహేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమజానికి ఎంత మాత్రం ప్రయోజనం లేని అలాంటి డిబేట్లను ఇప్పటికైనా నిలిపివేసి సమాజ హితమైన అంశాలను ప్రసారం చేయాలని ఫౌండేషన్ ప్రతినిధులు ఆ టీవీ ఛానల్‌కు విజ్ఞప్తి చేశారు. కత్తి మహేష్‌పై చర్యలు తీసుకునే వరకూ తమ ఫౌండేషన్ ద్వారా ఆందోళనలు చేపడతామని చెప్పారు. ఫౌండేషన్ ప్రతినిధులు బసవా సత్య సంతోష్, మహదేవ నాగేశ్వరరావు, జొన్నాడ దుర్గారావు, ఇవాని శర్మ, కొత్తపల్లి వంశీ, కొండేపూడి ప్రకాష్, బొక్కా నాని తదితరులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. హైదరాబాద్‌లోనూ ఫిర్యాదు కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ జనశక్తి నేతలు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆయనపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
జాతీయాలు
కాలనేమి జపం రామాయణం నుంచి పుట్టిన జాతీయం ఇది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ద్రోణగిరిపై ఉన్న ఒక మూలికను తేవడానికి సన్నద్ధుడవుతాడు ఆంజనేయుడు. ఈ విషయం రావణాసురుడికి తెలుస్తుంది. హనుమంతుడిని దారి తప్పించి మాయాసరస్సులో స్నానం చేసేలా చేయమని మారీచుడి కొడుకైన కాలనేమితో చెబుతాడు రావణాసురుడు. ద్రోణగిరిని వెదుకుతూ వెళుతున్న హనుమంతుడికి దారిలో మహర్షి రూపంలో జపం చేస్తున్న కాలనేమి కనిపిస్తాడు. ద్రోణగిరికి దారి చెప్పమని హనుమంతుడు అడిగినప్పుడు- ‘‘అక్కడ ఉన్న కొలనులో స్నానం చేస్తే కొత్త శక్తి వస్తుంది’’ అని తప్పుడు సమాచారం ఇస్తాడు. ఆ తరువాత ఏమైంది అనేది వేరే విషయంగానీ... దొంగ భక్తులను, చిత్తశుద్ధి లేకుండా పూజాపునస్కారాలు చేసేవాళ్లను, పవిత్రంగా కనిపిస్తూ ఇతరులను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించే వాళ్లను ‘కాలనేమి జపం’తో పోల్చుతారు. చిదంబర రహస్యం! పరమ శివుడు శివతాండవం చేస్తూ నటరాజుగా వెలసిన ఆలయం చిదంబరం. ఈ ఆలయంలో శివుడు నిరాకార స్వరూపుడిగా కొలవబడతాడు. గర్భగుడిలోని ఖాళీ స్థలాన్ని తెరతో కప్పిపెడతారు. పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ఈ ఖాళీస్థలం ప్రతీక. ఏమీ లేకపోయినా తెరను అలా ఎందుకు కప్పిపెడతారు? దీనికి ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు ఎన్ని ఉన్నా చాలామందికి ఇది ‘రహస్యం’గానే మిగిలిపోయింది. ఆ తెర వెనుక ఎన్నో కనిపిస్తాయనేది కొందరి నమ్మకం. కొందరికి బంగారు బిల్వ పత్రాలు కనిపిస్తే కొందరికి మరొకటి. ఈ మర్మం ఎవరికీ అర్థం కానిది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏదైనా తెలియని రహస్యం లేదా తెలియకుండా దాచిపెట్టిన విషయాన్ని ‘చిదంబర రహస్యం’ అనడం పరిపాటిగా మారింది. తంజావూరు సత్రం ‘రాను రాను ఈ ఇల్లు తంజావూరు సత్రంలా తయారైంది. పని చేసే వాళ్లు తక్కువ... పడి తినేవాళ్లు ఎక్కువ’ ఇలాంటి మాటలు వింటుంటాం. తమిళనాడులోని ప్రాచీన పట్టణం తంజావూరు. కావేరి నది తీరాన ఉన్న ఈ పట్టణం ఆలయాలకి ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణానికి ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వచ్చేవారు. ఆ రోజుల్లో... రాజులు ఆలయాలు కట్టించడమే కాదు... యాత్రికుల సౌకర్యం కోసం అన్నసత్రాలు కట్టించేవాళ్లు. ఈ అన్నసత్రాల వల్ల జరిగిన మంచి మాట ఎలా ఉన్నా... సోమరులకు ఇవి నిలయాలుగా ఉండేవి. ఈ సత్రాల వ్యవహారం ఒక ప్రహసనంలా తయారైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పుట్టిందే ‘తంజావూరు సత్రం’ జాతీయం. ఒక ఇంట్లో ఒక్కరే కష్టపడుతూ, ఏ పనీ చేయకుండా సోమరిగా కాలం వెళ్లదీసే వాళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఇంటిని తంజావూరు సత్రంతో పోల్చుతుంటారు. శ్రావణ భాద్రపదాలు కొందరు ఎప్పుడు చూసినా చాలా సంతోషంగా ఉంటారు. వారికి సమస్యలు లేవని కాదు... ఉన్నా వారి సంతోషానికి అవేమీ అడ్డు కాదు. కొందరు మాత్రం ఎప్పుడు చూసినా ఏడుపు ముఖంతో కనిపిస్తారు. సమస్యలు ఉన్నా లేకున్నా ఒకేవిధంగా ఉంటారు. ఏదో విషయంలో ఏదో ఒక అసంతృప్తి కనిపిస్తూనే ఉంటుంది. వారి కళ్లల్లో సంతోషం కాకుండా దుఃఖ వర్షమే ఎప్పుడూ కనిపిస్తుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ‘అతడి కళ్లు శ్రావణ భాద్రపదాల్లా ఉన్నాయి’ అంటారు. శ్రావణ భాద్రపదాలు తెలుగు నెలలు. ఇవి వర్షాకాలపు నెలలు. వర్షాన్ని గుర్తు చేసే నెలలు. కళ్లు ఎప్పుడూ తడిగానే ఉంటాయి అని చెప్పడానికి ఉపయోగించే జాతీయం ఇది. సంతోషాన్ని ఇష్టపడే వాళ్లు స్నేహితులైనట్లే, ఎప్పుడూ విచారంతో కనిపించేవారు కూడా స్నేహితులవుతారు. ఇలాంటి జంటను ‘శ్రావణ భాద్రపదాలు’ అని పిలుస్తారు. -
రామాయణ రహస్యం తెలిసిన నది
ఎన్నో నదీ తీరాలను చూసిన, అక్కడ వసించిన రాముడు మనసారా ‘గోదావరీ రమ్యా’ అని సంభాషించడం గోదావరి వరిష్ఠతకు నిదర్శనం. రాముడు మెచ్చిన నది గోదావరి. అది ఆంధ్రదేశంలో అధిక భాగం ఉండడం ఆంధ్రుల పుణ్యం. సీత గంగాతీరంలో తన వనవాసాన్ని గడుపుతుంది. భర్త తోడు లేకుండా గడుపుతుంది. గోదావరి తీరంలో అలా కాదు. ఒక పుష్కరకాలం పైగా సీతారాములు అన్యోన్యంగా కలసిమెలసి ఉన్నారు. నాటి జనపదాల్లోని, నేటి తెలుగుదేశ భాగంలోని పెద్ద నదుల్లో గోదావరి గొప్పది. రామాయణంలో మొదటిసారిగా అరణ్యకాండలో గోదావరి దర్శనమిస్తుంది. సీతారామలక్ష్మణులు చిత్రకూటం నుంచి బయలుదేరి అగస్త్యాశ్రమానికి వస్తారు. నివాసానికి ఏదైనా ఉత్తమమైన ప్రదేశాన్ని సూచించమని అభ్యర్థిస్తారు. అప్పుడు అగస్త్యుడు ‘రామా! ఇక్కడకు సమీపంలో పంచవటి అనే రమ్యమైన ప్రదేశం ఉంది. ఆ పంచవటీ ప్రాంతం పక్కనే గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది..., అని చెప్తాడు. సీతారామలక్ష్మ ణులు పంచవటి చేరుకున్నారు. ఆ సందర్భంలో రాముడు ‘ఇయం గోదావరీ రమ్యా పుష్టితై స్తరుభిర్వృతా/ హంస కారండ వాకీర్ణ చక్రవాకోప శోభితా/ నాతి దూరే న బాసన్నే మృగ యూధ పీడితా’ అంటాడు. ఆ నదిని చూడగానే రాముని అనుభూతి ఇదే. అంటే- ‘ఇదే రమ్యమైన గోదావరీ నది. ఒడ్డునే విరగపూచిన చెట్లతో నిండి ఉంది. హంసలు, కారండవాలు, చక్రవాకాలు వంటి జలపక్షులతో శోభిస్తోంది. ఆ నది మనకు మరీ దూరంగానూ లేదు, దగ్గరగానూ లేదు. ఈ ప్రదేశంలో లేళ్లు మందలు మందలుగా నిర్భయంగా తిరుగుతున్నాయి.’ సహసీత, సహానుజంగా రాముడు గోదావరిలో స్నానం చేశాడు. భక్తితో దేవత లకు, పితృదేవతలకు తర్పణాలు సమర్పించారు. ఉదయిస్తున్న సూర్యభగవానునికి నమస్కరించారు. సర్వదేవతలను స్తోత్రం చేశారు. ఆ సమయంలో సీతతో లక్ష్మణునితో కూడి ఉన్న శ్రీరాముడు గంగానదిలో స్నానం చేసి పార్వతితో నందితో ప్రకాశిస్తున్న శివునిలా ఉన్నాడంటాడు వాల్మీకి. ఈ శ్లోకం హరిహరాద్వైతాన్నే కాదు, గోదావరి గంగ వంటి పవిత్రమైన నది అనే విషయాన్ని కూడా ధ్వనింపచేస్తోంది. మాయలేడి సన్ని వేశంలో చివరిగా, ‘నేను నీకు దక్కుతాననుకుంటున్నావేమో, రాముడు లేకపోతే గోదావరిలో దూకేస్తాను’ అంటుంది సీతాసాధ్వి. ఈ విధంగా మానరక్షణకు గోదావరిని సమాశ్రయిస్తానంటుంది సీత. అంతేకాదు, రావణాసురుడు అపహరించుకుపోతూ ఉంటే, సీత గోదావరికి వందనాలర్పిస్తూ తన విషయం, రావణుని సంగతీ రామునికి చెప్పమని అర్థిస్తుంది. సీతాన్వేషణ సందర్భంలో రాముడు, సీతకు గోదావరి చాలా ప్రియమైనది. ఆ నదికి గాని వెళ్లిందా? అయినా నేను లేకుండా ఒంటరిగా వెళ్లదే అను కుంటాడు. ‘గోదావరీయం సరితాం వరిష్ఠాప్రియా యా మమ నిత్యకాలం/ అష్య త్రగచ్ఛేదితి చింతయామి నైకాకినీ యాతిహిసాకదాచితం’ అంటూ గోదావరి నదులలో శ్రేష్టమైనదని శ్రీరాముడే స్వయంగా చెప్పిన సందర్భమిది. ‘సీత ఏది?’ అని రాముడు గోదావరిని ప్రశ్నిస్తాడు. మళ్లీ గోదావరి ప్రసక్తి వాల్మీకి రామాయణంలో రావణ వధానంతరం శ్రీరాముడు విజయలక్ష్మీయుతుడై సీతాలక్ష్మణ సహితుడై పుష్పక విమానంలో అయోధ్యానగరికి వెళ్లే సందర్భంలో వస్తుంది. సీతాన్వేషణ సమయంలో తాను చూసిన ప్రదేశాలన్నింటినీ సీతకు చూపిస్తూ దండకారణ్య సమీపంలో గోదావరిని కూడా చూపిస్తూ, గోదావరి రమ్యమై ప్రసన్న సలిలయై ఉంది చూడు మైథిలీ అంటాడు. వాల్మీకి రామాయణాన్ని బట్టి రాముడు గోదావరిని చూడడం ఇది కడసారి. పంచవటిలో చూసినపుడు, ‘ఇయం గోదావరీ రమ్యా’ అని, చివరిసారి, ‘ఏషా గోదావరీ రమ్యా!’ అంటాడు. ఎన్నో నదీ తీరాలను చూసిన, అక్కడ వసించిన రాముడు మనసారా ‘గోదావరీ రమ్యా’ అని సంభాషించడం గోదావరి వరిష్ఠతకు నిదర్శనం. రాముడు మెచ్చిన నది గోదావరి. అది ఆంధ్రదేశంలో అధిక భాగం ఉండడం ఆంధ్రుల పుణ్యం. రామాయణాన్ని వాడుక భాషలోకి వచన కావ్యంగా తెనిగించిన శ్రీ శ్రీపాద సుబ్ర హ్మణ్యశాస్త్రి అరణ్యకాండ పీఠికలో వ్రాసిన వాక్యాలు ఈ సందర్భంలో స్మరింపతగినవే. ‘మన గోదావరీ మధురజలాలు సీతారామలక్ష్మణ స్నానపుణ్యాలు. రాముడనేక నదులు చూశాడు. స్వయంగా ఒక నది వొడ్డునే పుట్టి పెరిగి వ్యవహరించాడు కూడా! కానీ మన గోదావరి వంటిది మాత్రం మరొకటి కనబడలేదతనికి’. భవభూతి తన ఉత్తర రామచరిత్ర నాటకంలో రామకథా ఘట్టాన్ని గోదావరీ తీరంలో నడిపించాడు. నన్నయ్యభట్టు భారత మూలంలో లేకపోయినా అర్జునుని తీర్థయాత్రా సందర్భంలో ‘దక్షిణ గంగనా తద్దయునొప్పు’ గోదావరిని ప్రవేశపెట్టాడు. (వ్యాసకర్త విశ్రాంత ఆచార్యులు ఫోన్: 0891-2530289 - డా॥కోలవెన్ను మలయవాసిని