మధ్యప్రదేశ్‌ని చిత్రకూట్‌లో జరిగే దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపావళి పండుగ సందర్భంగా చిత్రకూట్‌లోని మందాకిని నది తీరంలో ఐదు రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు. లంకను జయించిన శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తూ, ఋషులతో కలిసి మందాకిని నదిలో దీప దానాన్ని చేశాడని స్థానికులు చెబుతారు.
చిత్రకూట్‌లో దీపావళి పండుగను అయోధ్యలో జరిగే వేడుకల స్థాయిలో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ధన్తేరస్ మొదలుకొని భాయ్ దూజ్ వరకు ఐదు రోజుల పండుగ జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులు మందాకినీ నదిలో దీప దానం చేస్తారు. అంటే నదికి దీపాలు సమర్పించి, తమకు శ్రేయస్సు అందించాలని నదీమతల్లిని కోరుకుంటారు.
చిత్రకూట్‌లో పదకొండున్నర సంవత్సరాలపాటు వనవాసం చేసిన శ్రీరాముడు ఇప్పటికీ ఇక్కడ తిరుగాడుతూ, భక్తులకు కనిపిస్తాడని స్థానికులు చెబుతుంటారు. దీపావళి సందర్భంగా ఇక్కడ నిర్వహించే ఐదు రోజుల దీప దాన ఉత్సవం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రతీయేటా 20 నుంచి 25 లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు.
ఇది కూడా చదవండి: డోంగర్‌ఘఢ్‌కు ప్రధాని మోదీ.. బమ్లేశ్వరి ఆలయంలో పూజలు
Comments
Please login to add a commentAdd a comment