Diya
-
సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..!
ప్రతి దీపకాంతి పసిడి వర్ణంలో వెలుగులు విరజిమ్ముతుంది. అయితే, కొన్ని దీపాల నుంచి వచ్చే పరిమళాలు మాత్రం విభిన్నంగా మదిని కట్టిపడేస్తున్నాయి. మట్టి ప్రమిదల్లో నూనెతో దీపాలను వెలిగించడంతోనే సంతృప్తి పడటం లేదు నేటితరం అందుకే, భిన్న ఆస్వాదనల వెలుగులను పరిచయం చేస్తున్నారు క్రియేటర్స్. ఈ దీపావళిని సుంగంధ భరితం చేస్తున్న వెలుగులు ఇవి..స్వీట్ ట్రీట్లను పోలి ఉండేలా నోరూరించే దియా డిజైన్ల శ్రేణి ఆన్లైన్ మార్కెట్లో సందడి చేస్తోంది. తియ్యని కప్ కేక్‌ల నుంచి ఐస్‌క్రీమ్‌ల వరకు ప్రతి కొవ్వొత్తి డిజైన్ అబ్బుర పరుస్తోంది. క్రీముతో కూడిన పంచదార పాకం సువాసనలను ఈ కొవ్వొత్తుల ద్వారా ఆస్వాదించవచ్చు. వీటి ధరలు కూడా వందల రూపాయల నుంచి వేలలో ఉన్నాయి. వీగన్ కాంతి..జంతు ఆధారిత ఉత్పత్తులు ఏవీ ఉపయోగించకుండా వీగన్ కొవ్వొత్తుల డిజైన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్వీట్ డిజర్ట్ క్యాండిల్స్‌లో కుకీస్, బ్లాక్‌బెర్రీ, డార్క్ చాకొలెట్, లెమన్ డిజర్ట్, స్ట్రాబెర్రీ డిజర్ట్ క్యాండిల్స్ చూపులకు, సువాసనలకు నోరూరిస్తున్నాయి కూడా.ఆకారానికో అందం..మనుషులు, జంతు ఆకారాలను పోలిన క్యాండిల్స్తోపాటు సెంటెడ్ మట్కీ దియా సెట్, టెర్రకోట క్యాండిల్ దియాస్, ఘీ బ్లెండెడ్ ఫిల్డ్ క్లే దియా, మిర్రర్ డెకొరేషన్ దియాస్, షాడో దియాస్, వాటర్ లైట్ దియాస్ లభిస్తున్నాయి. భిన్న ఆకృతిలో డిజైన్లలో కనిపిస్తున్న వెలుగులు ఈ దీపావళికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. (చదవండి: -
నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. కూతురిపై జ్యోతిక ప్రశంసలు
కోలీవుడ్ స్టార్ జంట సూర్య- జ్యోతికల కూతురు దియా మరోసారి తన పేరెంట్స్ గర్వపడేలా చేసింది. ఈ మధ్యే పన్నెండో తరగతిలో టాప్ మార్కులు సాధించిన దియా.. తాజాగా ఓ డాక్యుమెంటరీ రూపొందించి తన టాలెంట్ బయటపెట్టింది. ఇండస్ట్రీలో మహిళా టెక్నీషియన్ల ఇబ్బందులను డాక్యుమెంటరీలో ప్రస్తావించింది.వివక్ష..సినిమాలో ఒక సీన్ అద్భుతంగా రావాలంటే నటీనటులకు మంచి టాలెంట్ ఉంటే సరిపోదు. ఆ సీన్ షూట్ చేసే ప్రదేశంలో మంచి లైటింగ్ ఉండాలి. సీన్‌కు తగ్గట్లుగా ఎఫెక్ట్స్ ఉండాలి. అయితే ఇవన్నీ సరిగ్గా ఉండేట్లు చూసుకునే మహిళా టెక్నీషియన్లకు సరైన గుర్తింపు మాత్రం రావడం లేదు. చాలామంది వారిని చిన్నచూపు చూస్తారు. వారి ఇబ్బందులను ప్రస్తావిస్తూ దియా.. లీడింగ్ లైట్: ద అన్‌టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఉమెన్ బిహైండ్ ద సీన్స్ అనే డాక్యుమెంటరీ తెరకెక్కించింది. ఇది దియా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. వెలుగులోకి తీసుకొచ్చినందుకు థాంక్యూఈ విషయాన్ని జ్యోతిక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ కూతురిపై ప్రశంసలు కురిపించింది. దియా, నిన్ను చూస్తే గర్వంగా ఉంది. లేడీ టెక్నీషియన్స్ ఎదుర్కొంటున్న వివక్షను డాక్యుమెంటరీలో అర్థవంతంగా చూపించావు. ఎన్నాళ్లుగానో మూలుగుతున్న ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చినందుకు థాంక్యూ అని రాసుకొచ్చింది. ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింనకుగానూ దియా ఉత్తమ స్క్రీన్‌రైటర్‌గా త్రిలోక ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం విశేషం. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) చదవండి: ఈ ఇండస్ట్రీలో ఇదే పెద్ద సమస్య.. తప్పు ఆడాళ్లపైకి తోసేస్తారు: హీరోయిన్ -
14 లక్షల దీపాలతో పరాక్రమ శ్రీరాముడు
కోట్లాది మంది రామభక్తుల ఆకాంక్ష త్వరలో కనులముందు నిలవబోతోంది. జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొననుంది. అయోధ్యలో ఇప్పటికే ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది. బీహార్‌కు చెందిన కళాకారులు అయోధ్యలో అద్భుత కళాకృతిని తీర్చిదిద్దారు. 14 లక్షల దీపాలతో రాముని ఆకృతిని రూపొందించారు. ఈ కళాఖండాన్ని బీహార్ మొజాయిక్ కళాకారుడు అనిల్ కుమార్ తన సహోద్యోగులతో కలిసి తీర్చిదిద్దారు. కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే శనివారం అయోధ్యకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో బీహార్ కళాకారుల బృందం ఏడు రోజుల పాటు శ్రమించి 14 లక్షల దీపాలతో పరాక్రమ రూపంలోని శ్రీరాముని ఆకృతిని తీర్చిదిద్దిందని తెలిపారు. 14 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. నవ భారత యువకులలో ‘శౌర్యం’ ఉండాలనే సందేశాన్ని ఈ రూపం అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఆర్ట్‌వర్క్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల ఛాయాచిత్రాలు కూడా ఉన్నాయి. దీపాలతో ‘జై శ్రీరామ్’ ఆకృతిని కూడా రూపొందించారు. ఇది కూడా చదవండి: అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట.. అతిథులకు అపూర్వ కానుక अयोध्या धाम के साकेत महाविद्यालय में श्रीराम कर्मभूमि न्यास सिद्धाश्रम बक्सर द्वारा 14 लाख दीयों से भगवान श्रीराम का पराक्रमी स्वरूप, श्रीरामलला मंदिर, आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, मा. मुख्यमंत्री योगी आदित्यनाथ जी छवि उकेरी गई। इस कार्य में लगे सभी कलाकारों को बधाई। pic.twitter.com/7YrPs9LoVQ — Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) January 13, 2024 -
యువరాణికి పట్టం.. డిప్యూటీ సీఎంగా దియాకుమారి
జైపూర్: అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ.. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో అనుహ్యంగా కొత్తవారిని ముఖ్యమంత్రులుగా ప్రకటించి సరికొత్త వ్యూహాన్ని అమలు పరిచింది. అయితే తాజాగా కూడా అదే ఫార్ములా ప్రయోగించింది. రాజస్థాన్‌లో కేవలం మొదటిసారి గెలిచిన భజన్‌లాల్ శర్మను సీఎంగా బీజేపీ ప్రకటించింది. అయితే ఇక్కడ ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చింది బీజేపీ హైకమాండ్. ప్రేమ్ చంద్ భైరవ, దియా కుమారిలను డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. సామాజిక సమీకరణాల దృష్ట్యా రాజస్థాన్‌లో రాజ కుంటుబానికి చెందిన దియా కుమారికి.. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఈసారీ బీజేపీ హైకమాండ్ రాజస్థాన్ సీఎంగా దియా కుమారికి అవకాశం కల్పిస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. సీఎం పదవి కోసం వసుంధర రాజే, అర్జున్‌రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ వంటి సీనియర్ నేతలతో పోటీపడ్డ దియా కుమారి.. డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకుంది. ప్రస్తుతంగా ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జైపూర్ మహారాజ కుటుంబంలో ఆమె 1971లో జన్మించారు. తాత మాన్ సింగ్-2 బ్రిటీష్ ఇండియా కాలంలో చివరి జైపూర్ మహారాజు. తండ్రి బ్రిగేడియర్ సవాయ్ భవానీ సింగ్ మహావీర చక్ర అవార్డు గ్రహిత. ఆయన 1971లో ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. మహారాణి గాయత్రీ దేవి పాఠశాల విద్య, జైపూర్‌లోని మహారాణి కళాశాలలో కాలేజీ చదువును పూర్తి చేసుకున్నారు. నరేంద్ర సింగ్‌ను వివాహం చేసుకున్న దియాకుమారికి.. ముగ్గురు పిల్లలు. ఆమె 2018లో నరేంద్ర సింగ్‌తో విడాకులు తీసుకుంది. రాజకీయం జీవితం.. రాజకీయలపై ఆసక్తితో దియాకుమారి 2013లో అసెంబ్లీ ఎన్నికల్లో మాధోపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. మొదటిసారి గెలుపొందగానే పలు ప్రాంతాలను అభివృద్ధి చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాజసమంద్ నియోజకవర్గం నుంచి పోటీ ఎంపీగా గెలుపోందారు. రాజకీయాలతో పాటు దియా కుమారి అనేక బిజినెస్ వెంచర్లు, రెండు స్కూల్స్, మ్యూజియం, ట్రస్టు, హోటల్, ఎన్జీఓలను నిర్వహిస్తున్నారు. పలు కార్యక్రమాల ద్వారా ఆమె స్త్రీల అభ్యున్నతికి కృషి చేస్తారు. పలు ఎన్జీఓ ద్వారా సేవ చేసినందుకు.. ఆమె ఇటీవల జైపూర్‌లోని అమిటీ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. 2023 రాజస్థాన్ అసెంబ్లీలో విధ్యాదర్నగర్లో నియోజకవర్గలో పోటీ చేసి 71,368 భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ సేవ ఈ యువరాణి(దియా కుమారి) మహిళలకు భద్రతకు కృషి చేస్తానని, యూవతకు ఉద్యోగ అవకాశాలు, రైతుల కష్టాలను తీర్చుతానని ప్రచారంలో హామీలు ఇచ్చారు. చదవండి: రాజస్థాన్ సీఎంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మ -
రాజస్తాన్ రాజెవరో?
రాజస్తాన్ శాసనసభ ఎన్నికల్లో విపక్ష బీజేపీ ఘన విజయం సాధించింది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి పరాభవం ఎదురైంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై అందరి దృష్టి కేంద్రకృతమైంది. రాజస్తాన్ రాజు ఎవరవుతారో మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. ప్రధానంగా నలుగురు ముఖ్యనేతలు సీఎం రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరోసారి పదవి ఆశిస్తున్నారు. పార్లమెంట్ సభ్యురాలు దియా కుమారి(ఈ ఎన్నికల్లో విద్యాధర్‌నగర్ స్థానం నుంచి గెలిచారు), కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మహంత్ బాలక్‌నాథ్ యోగి సైతం సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే.. వసుంధర రాజే వసుంధర రాజే గతంలో రెండుసార్లు రాజస్తాన్ సీఎం చేశారు. ఈ ఎన్నికల్లో జాల్రాపటాన్ స్థానం నుంచి భారీ మెజారీ్టతో గెలుపొందారు. ఆమె బీజేపీ అధిష్టానాన్ని విభేదిస్తున్న నేతగా పేరుగాంచారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పెద్దగా సత్సంబంధాలు లేవన్న సంగతి బహిరంగ రహస్యమే. బీజేపీలో పాతతరం నేత అయిన వసుంధర రాజేను మూడోసారి గద్దెనెక్కించడానికి పార్టీ అగ్రనేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఆశీస్సులు లేకపోవడంతో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కుదించుకుపోయాయి. దియా కుమారి రాజ్‌సమంద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దియా కుమారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి నెగ్గారు. జైపూర్ దివంగత మహారాణి గాయత్రి దేవి మనవరాలైన దియా కుమారి బీజేపీలో వసుంధర రాజేకు ప్రత్యామ్నాయ నేతగా ఎదిగారు. రాచరిక నేపథ్యం, రాజ్‌పుత్ వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసివచ్చాయి. చాలాఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. గతంలో సవాయ్‌మాధోపూర్ ఎమ్మెల్యేగా ఆమె చేసిన అభివృద్ధి పనులు ప్రశంలందుకున్నాయి. రాజస్తాన్‌లో నూతన ముఖ్యమంత్రిని నియమించే విషయంలో పార్టీ అధిష్టానం దియా కుమారి వైపు మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మహంత్ బాలక్‌నాథ్ యోగి రాజస్తాన్‌లోనూ ఉత్తరప్రదేశ్ తరహా ప్రయోగం చేయాలనుకుంటే ముందుగా గుర్తొచ్చే పేరు మహంత్ బాలక్‌నాథ్ యోగి. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్ మఠాధిపతి అయిన ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యారు. బాలక్‌నాథ్ ప్రస్తుతం రాజస్తాన్‌లో అల్వార్ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. గతంలో సన్యాసం స్వీకరించారు. మహంత్ చాంద్‌నాథ్ మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. రాష్ట్రంలో బలమైన అనుచరవర్గం ఉంది. నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం దృష్టిలో ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గజేంద్రసింగ్ షెకావత్ రాజస్తాన్ బీజేపీలో మరో సీనియర్ నేత గజేంద్రసింగ్ షెకావత్. ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అవినీతి వ్యవహారాలపై పలు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా పనిచేశారు. ముఖ్యమంత్రిపై పలు ఆరోపణలు గుప్పించారు. తదుపరి సీఎం రేసులో తాను ఉన్నానంటూ ఇప్పటికే సంకేతాలు పంపించారు. కొందరు బీజేపీ ముఖ్యనేతలు ఆయనకు మద్దతిస్తున్నారు. సీఎం పోస్టుపై గజేంద్రసింగ్ ఆశలు పెట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిత్రకూట్ దీపావళి ప్రత్యేకత ఏమిటి? మందాకినీ తీరంలో ఏం జరుగుతుంది?
మధ్యప్రదేశ్‌ని చిత్రకూట్‌లో జరిగే దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపావళి పండుగ సందర్భంగా చిత్రకూట్‌లోని మందాకిని నది తీరంలో ఐదు రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు. లంకను జయించిన శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తూ, ఋషులతో కలిసి మందాకిని నదిలో దీప దానాన్ని చేశాడని స్థానికులు చెబుతారు. చిత్రకూట్‌లో దీపావళి పండుగను అయోధ్యలో జరిగే వేడుకల స్థాయిలో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ధన్తేరస్ మొదలుకొని భాయ్ దూజ్ వరకు ఐదు రోజుల పండుగ జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులు మందాకినీ నదిలో దీప దానం చేస్తారు. అంటే నదికి దీపాలు సమర్పించి, తమకు శ్రేయస్సు అందించాలని నదీమతల్లిని కోరుకుంటారు. చిత్రకూట్‌లో పదకొండున్నర సంవత్సరాలపాటు వనవాసం చేసిన శ్రీరాముడు ఇప్పటికీ ఇక్కడ తిరుగాడుతూ, భక్తులకు కనిపిస్తాడని స్థానికులు చెబుతుంటారు. దీపావళి సందర్భంగా ఇక్కడ నిర్వహించే ఐదు రోజుల దీప దాన ఉత్సవం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రతీయేటా 20 నుంచి 25 లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇది కూడా చదవండి: డోంగర్‌ఘఢ్‌కు ప్రధాని మోదీ.. బమ్లేశ్వరి ఆలయంలో పూజలు -
యూత్‌ఫుల్ ప్రేమకథ
కిశోర్ కేఎస్డీ, దియా సితెపల్లి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. టాంగాప్రోడక్షన్స్ ఎల్ఎల్పీ, సినీ వ్యాలీ మూవీస్ పతాకాలపై విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, లుక్ బాగుందని, ఈ సినిమా విజయం సాధించాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వైవిధ్యమైన లవ్‌స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్ , సహనిర్మాత: ఉపేంద్ర గౌడ్ ఎర్ర. -
యంగ్ హీరో ఇంట తీవ్ర విషాదం
‘దియా’ ఫేం, కన్నడ యంగ్ హీరో పృథ్వీ అంబర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సుజాత కన్నుమూశారు. కొంతకాలం హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో శుక్రవారం ఆరోగ్యం విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో పృథ్వీ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. ఆమె మృతిపట్ల కన్నడ టీవీ, సినీ నటీనటులు సంతాపం తెలుపుతు పృథ్వీ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. చదవండి: పూరీ దంపతుల విడాకులపై అంబర్ పేట్ శంకరన్న క్లారిటీ! కాగా పృథ్వీ పలు టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందాడు. 2008 ‘రాథా కల్యాణ’ సీరియల్‌తో నటుడిగా పరిచమైన పృథ్వీ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ హీరో అయ్యాడు. 2014లో వచ్చిన ‘బరికే’ అనే తుళు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ 2020లో వచ్చిన ‘దియా’ సినిమాతో హీరో అయ్యారు. ఈ సినిమా తెలుగులోనూ ‘దియా’ పేరుతో రిలీజై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోగా పృధ్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. చదవండి: లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే! -
మేము రాముడి వంశస్థులమే: మహేంద్ర సింగ్
జైపూర్ : అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాదం కేసు రోజువారీ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై మేవార్ ఉదయ్‌పూర్ రాజకుటుంబీకుడైన మహేంద్ర సింగ్ స్పందించారు. తాము రాముడి వంశస్థులమని, ఒకవేళ ఏవైనా వివరాలు కావాలనుకుంటే కోర్టు తమను నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ కేసులో అవసరమైన సాక్ష్యాలను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి చట్టబద్ధమైన పత్రాలు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా అయోధ్య భూ వివాదం కేసులో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడికి, ఆయన జన్మస్థలానికి చట్టబద్ధత ఉందనీ, కాబట్టి ఆయన పేరుపై ఆస్తులు ఉండొచ్చనీ, పిటిషన్లు దాఖలు చేయొచ్చని రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు న్యాయవాది పరాశరన్ వాదించారు. ఇందుకు స్పందనగా సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం...‘ ‘మేం ఉత్సుకతతోనే అడుగుతున్నాం. రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇంకా అయోధ్యలోనే నివాసం ఉంటున్నారా?’ అని అడిగింది. దీంతో పరాశరన్ స్పందిస్తూ..‘దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వివరాలను మీ ముందు ఉంచుతాం’ అని జవాబిచ్చారు. ఈ నేపథ్యంలో తాము రాముడి కుమారుడు కుశుడి వంశానికి చెందినవారమని జైపూర్ రాజకుమారి, బీజేపీ ఎంపీ దియా కుమారి పేర్కొన్న విషయం విదితమే. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ‘రాముడి వారసులు ఉన్నారా అని సుప్రీంకోర్టు అడిగింది. వారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. అంతెందుకు మా కుటుంబం కుశుడి అంశ నుంచి ఉద్భవించింది. రాజ కుటుంబం వద్దనున్న మను చరిత్ర, జన్యుశాస్త్రం, ఆధారంగా ఈ విషయం చెబుతున్నాను. మా వంశవృక్షంలో 62వ రాజుగా దశరథుడు, 63వ రాజుగా రాముడు, 64వ రాజుగా కుశుడి పేరు ఉన్నాయి. కావాలంటే నా దగ్గర ఉన్న పత్రాల ద్వారా ఈ విషయాన్ని నిరూపిస్తాను కూడా. దాదాపు ప్రతీ ఒక్కరు రాముడి పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. అయోధ్య కేసులో త్వరగా తీర్పు వెలువరించాల్సిందిగా వారందరి తరఫున విన్నపం చేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. -
మేము కుశుడి వంశస్థులం: రాజకుమారి
జైపూర్ : తాము రాముడి కుమారుడు కుశుడి వంశానికి చెందిన వారమని బీజేపీ ఎంపీ, జైపూర్ రాజకుమారి దియా కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడి వంశస్థులు ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నారని.. అయోధ్య వివాదం తొందరలోనే పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం దియా కుమారి మాట్లాడుతూ... ‘రాముడి వారసులు ఉన్నారా అని సుప్రీంకోర్టు అడిగింది. వారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. అంతెందుకు మా కుటుంబం కుశుడి అంశ నుంచి ఉద్భవించింది. రాజ కుటుంబం వద్దనున్న మను చరిత్ర, జన్యుశాస్త్రం ఆధారంగా ఈ విషయం చెబుతున్నాను. కావాలంటే నా దగ్గర ఉన్న పత్రాల ద్వారా ఈ విషయాన్ని నిరూపిస్తాను కూడా. దాదాపు ప్రతీ ఒక్కరు రాముడి పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. అయోధ్య కేసులో త్వరగా తీర్పు వెలువరించాల్సిందిగా వారందరి తరఫున విన్నపం చేస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాదం కేసు రోజువారీ విచారణలో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడికి, ఆయన జన్మస్థలానికి చట్టబద్ధత ఉందనీ, కాబట్టి ఆయన పేరుపై ఆస్తులు ఉండొచ్చనీ, పిటిషన్లు దాఖలు చేయొచ్చని రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు న్యాయవాది పరాశరన్ వాదించారు. ఇందుకు స్పందనగా సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం...‘ ‘మేం ఉత్సుకతతోనే అడుగుతున్నాం. రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇంకా అయోధ్యలోనే నివాసం ఉంటున్నారా?’ అని అడిగింది. దీంతో పరాశరన్ స్పందిస్తూ..‘దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వివరాలను మీ ముందు ఉంచుతాం’ అని జవాబిచ్చారు. జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్నవ్యక్తిగా ఎలా పరిగణిస్తారని కోర్టు ప్రశ్నించడంతో..‘ కేదర్నాథ్ ఆలయాన్నే తీసుకుంటే, అక్కడ ఎలాంటి విగ్రహం లేకపోయినా ప్రజలు పూజలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ కేసులో జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్న వ్యక్తిగా పరిగణించవచ్చు’ అని పరాశరన్ తెలిపారు. -
విడాకులు తీసుకోనున్న రాజకుమార్తె
జైపూర్ : జైపూర్ రాజకుమారి, సవాయి మాధోపూర్ ఎమ్మెల్యే దియా కుమారి విడాకుల కోసం దరఖాస్తు చేశారు. హిందూ వివాహ చట్టం 13బీ సెక్షన్ కింద గాంధీనగర్ ఫ్యామిలీ కోర్టులో ఆమె విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు దరఖాస్తులో పేర్కొన్నారు. కాగా జైపూర్ మహారాజు భవానీ సింగ్ కుమార్తె అయిన దియా కుమారి నరేంద్ర సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 1997లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో 21 ఏళ్ల తర్వాత ఈ జంట విడిపోనున్నది. భర్త, పిల్లలతో దియాకుమారి ఇక బీజేపీ తరపున సవాయి మాధోపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దియా కుమారి ఇటీవల జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వ్యక్తిగత కారణాల వల్ల పోటీకి దూరంగా ఉన్నానని ప్రకటించడంతో ఆమె స్థానంలో ఆశా మీనా అనే కొత్త అభ్యర్థికి బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే లోక్‌సభ అభ్యర్థిగా దియాను రంగంలోకి దింపాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఆశాకు అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. -
చాంప్స్ విష్ణు, దియా
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రీజినల్ ఐసీఎస్ఈ, ఐఎస్సీ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో బి. విష్ణు, దియా చాంపియన్లుగా నిలిచారు. సీనియర్ బాలుర ఫైనల్లో జ్ఞాన రేవంత్ (ఫ్యూచర్ కిడ్స్)పై విష్ణు (గీతాంజలి) గెలుపొందాడు. హృదయ్ షా (గీతాంజలి) మూడో స్థానంలో నిలిచాడు. బాలికల ఫైనల్లో మధుమాల (నాసర్ స్కూల్, ఖైరతాబాద్)పై దియా (నాసర్ స్కూల్) నెగ్గింది. సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ కింగ్‌కోఠికి చెందిన దిశా సంఘ్వి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు జూనియర్ బాలురు: 1. ఫణీంద్ర (సెయింట్ ఆన్స్, రాజమండ్రి), 2. ఒమర్ మంజూర్ ఖాన్ (నాసర్ స్కూల్, గచ్చిబౌలి), 3. రవివర్మ (సెయింట్ జాన్స్, వైజాగ్); బాలికలు: 1. ఛార్వి ఫల్గుణ్ (ఫ్యూచర్ కిడ్స్, రాజమండ్రి), 2. టి. అంకిత (టింపనీ స్కూల్, వైజాగ్), 3. టి. ఆశ్రిత (టింపనీ స్కూల్, వైజాగ్). జూనియర్ బాలుర డబుల్స్: 1. కృషాల్– లక్ష్య (ఫ్యూచర్‌కిడ్స్), 2. జి.మోహిత్– ఆకర్ష్ (ఫ్యూచర్‌కిడ్స్), 3. శ్రీవాస్తవ–మహంతి (హెచ్‌పీఎస్, బేగంపేట్); బాలికలు: ఫాతిమా–రషిక (నాస ర్ స్కూల్), 2. అమారా– ఈషా (నాసర్ స్కూల్), 3. హితశ్రీ–సాత్విక (టింపనీ స్కూల్). సీనియర్ బాలుర డబుల్స్: 1. ఆర్యన్–అనికేత్ (గీతాంజలి), 2. బిస్మాన్–గౌరవ్ (ఫ్యూచర్ కిడ్స్), 3. కుంజ్ గుప్తా–వన్‡్ష (గీతాంజలి); బాలికలు: ఉర్వా– హన్నా రెహమాన్ (నాసర్ స్కూల్), 2. ఖుషి–స్మృతి (నాసర్ స్కూల్), 3. ముస్కాన్–సంస్కృతి (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్). -
అడుగో సూర్యుడు!
సూర్యుడు ఉదయించాడు. అదే సమయంలో దీయా బజాజ్ ఎవరెస్టు శిఖరం మీద తొలి పాదం మోపింది. ఆమె తండ్రి అజీత్ బజాజ్ ఆమెకు ఒక్క అడుగు మాత్రమే వెనక ఉన్నాడు. ఐదు రోజుల క్రితమే.. మే 16న ఈ తండ్రీకూతుళ్లు ఆ మంచుకొండల్లో.. ఎల్తైన ఆ ఎవరెస్టు శిఖరం పైనుంచి సూర్యోదయం చూశారు. చిన్నతనంలో జాబిల్లిని చూపిస్తూ కూతురికి పాలబువ్వ తినిపించి ఉంటాడు ఆ తండ్రి. ఇప్పుడా కూతురే పెరిగి పెద్దదై ఎవరెస్ట్ పైనుంచి సూర్యుణ్ని చూపించింది తన తండ్రికి! వివక్షపై శిఖర సందేశం సరిగ్గా ఉదయం 4.30కి దీయా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. తరువాత ఆమె తండ్రి, వారితో పాటు షేర్పా సర్దార్ మినానీరు ఆమెను అనుసరించారు. బేస్ క్యాంపు నుంచి సాగిన ప్రయాణాన్ని దీయా తన బ్లాగులో లైవ్‌లో చూపుతూ వచ్చింది. వారి సాహసాలు, వాతావరణ పరిస్థితులు, ప్రకృతి అందాలు, వారు ఉన్న ప్రాంతం.. ఒకటేమిటి అన్ని విషయాలు కళ్లకు కట్టినట్లుగా చూపింది. ‘‘ప్రపంచంలోకెల్లా అతి ఎత్తయిన ప్రదేశం నుంచి నేను సూర్యోదయం చూశాను. ఇది నా జీవితంలో నేను మరిచిపోలేని క్షణం’’ అంటూ తన శిఖరయానం పూర్తయిన వెంటనే పులకరించిపోతూ పోస్ట్ పెట్టింది దీయా. భారతదేశంలో ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొట్టమొదటి తండ్రీకూతుళ్లు వీళ్లే కావడం విశేషం. సమాజంలో లింగ వివక్షను రూపుమాపాలన్న సందేశంతో ఈ సాహసయాత్రను చేపట్టారు వీళ్లు. శుభోదయ సాహసాలు ‘‘మా అమ్మాయికి తండ్రితో కలిసి ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలని కోరిక. ఇక ఈ ప్రయాణానికి సంబంధించి మరో అంశం.. ‘అవకాశం ఇస్తే, ఆడపిల్లలు తమను తాము నిరూపించుకోగలగడమే కాదు, ఉన్నత శిఖరాలకు కూడా చేరుకోగలరు’ అని చెప్పడం కూడా’’ అని అజీత్ బజాజ్ భార్య షిర్లీ థామస్ బజాజ్ అన్నారు. ‘‘వేసవి సెలవుల్లో దీయా, ఆమె చెల్లి ఇద్దరూ ఉదయాన్నే లేచేవారు. వైల్డ్‌లైఫ్ సఫారీకి వెళ్లేవారు. స్కూబా డైవింగ్ చేసేవారు. అన్నీ సాహస క్రీడలే’’ అని చెబుతారు షిర్లీ తన కూతుళ్ల గురించి మురిపెంగా. స్కీయింగ్ కూడా కలిసే! అజీత్ మూడు దశాబ్దాలుగా సాహస క్రీడలలో పాల్గొంటూనే ఉన్నారు. ఉత్తర ధ్రువంలో స్కీయింగ్ చేసిన మొట్టమొదటి భారతీయుడు అనే రికార్డు కూడా ఆయన పేరు మీద ఉంది. 2011 మే నెలలో ఈ సాహసం చేశాడు. ఆ తరువాతి సంవత్సరమే అజీత్, దీయా కలిసి గ్రీన్లాండ్ ఐస్ క్యాప్ గుండా స్కీయింగ్ చేసిన మొదటి భారతీయులుగానూ గుర్తింపు పొందారు. వీరిని చూస్తే, ఈ తండ్రీ కూతురు కలిసి ఏ సాహసమైనా చేయగలరని, వారికి సాధ్యం కానిది ఏమీ ఉండదనిపిస్తుంది. స్వాప్నికుల కుటుంబం దీయా, అజీత్‌లకు ఎవరెస్టును జయించాలన్న కోరిక కలగడానికి చాలామందే ప్రేరణ అయ్యారు. చిన్నప్పటి నుంచి దీయా పర్వతారోహకుల గురించి వింటూండేది. వారికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూండేది. తండ్రికి ఒక ఆలోచనైతే ఉండేది... ‘ఎప్పటికైనా ఎవరెస్టును ఎక్కాలి’ అని. అలా ఇద్దరి ఆశలూ ఒకటయ్యాయి. ఢిల్లీలోని స్నో లెపార్డ్ అడ్వెంచర్‌లో దీయా తల్లి షిర్లీ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. 2012లో అజీత్‌కి స్కీయింగ్‌లో పద్మశ్రీ అవార్డు లభించింది. అటువంటి సాహస కుటుంబం నుంచి వచ్చిన దీయా.. యు.ఎస్. లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందాక తల్లిదండ్రుల బాటలోనే సాహసాల వెంట పయనించింది. -
జ్యోతిక ... హౌ ఓల్డ్ ఆర్ యూ
చెన్నై: ప్రముఖ నటి జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారా అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ పరిశ్రమ వర్గాలు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్రం తమిళంలో అదే పేరుతో రీమేక్ చేయనున్నారు. 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్ర నిర్మాణ హక్కులను జ్యోతిక భర్త, ప్రముఖ హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్టైన్మెంట్' సొంతం చేసుకుంది. మలయాళంలో నిర్మించిన హౌ ఓల్డ్ ఆర్ యూ చిత్రంలో మంజూ వారియర్ ముఖ్య భూమిక పోషించారు. తమిళంలో రీమేక్ అవుతున్న ఆ చిత్రంలోని మంజూ పాత్రలో జ్యోతిక ఒదిగిపోనున్నారు. మలయాళంలో ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన రోషన్ అండ్రూస్ తమిళంలో నిర్మిస్తున్న చిత్రానికి కూడా దర్శకత్వ వహించనున్నారు. హీరోహీరోయిన్ జ్యోతిక, సూర్యలు ఒకరినోకరు ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో ఆ ఇద్దరు ఏడు అడుగులు నడిచారు. అనంతరం జ్యోతిక ఇద్దరు చిన్నారులు దివ్య, దియాలకు జన్మ నిచ్చింది. ఏడేళ్ల విరామం తర్వాత జ్యోతిక మరోసారి తెరంగేట్రం చేయనున్నారు. 2007లో మణికందా తమిళ చిత్రంలో జ్యోతిక నటించారు. ఇదే అమె చివరి చిత్రం అన్న సంగతి తెలిసిందే. -
టీచర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న చంద్రముఖి