14 లక్షల దీపాలతో పరాక్రమ శ్రీరాముడు | Bihar Artist Anil Kumar Made Lord Ram Portrait Using 14 Lakh Diyas | Sakshi
Sakshi News home page

Ram Mandir: 14 లక్షల దీపాలతో పరాక్రమ శ్రీరాముడు

Published Sun, Jan 14 2024 7:09 AM | Last Updated on Sun, Jan 14 2024 10:29 AM

Bihar Artist Anil Kumar Made Lord Ram Portrait Using 14 Lakh Diyas - Sakshi

కోట్లాది మంది రామభక్తుల ఆకాంక్ష త్వరలో కనులముందు నిలవబోతోంది. జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొననుంది. 

అయోధ్యలో ఇప్పటికే  ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది. బీహార్‌కు చెందిన కళాకారులు అయోధ్యలో అద్భుత కళాకృతిని తీర్చిదిద్దారు. 14 లక్షల దీపాలతో రాముని ఆకృతిని రూపొందించారు. ఈ కళాఖండాన్ని బీహార్ మొజాయిక్ కళాకారుడు అనిల్ కుమార్ తన సహోద్యోగులతో కలిసి తీర్చిదిద్దారు.

కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే శనివారం అయోధ్యకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో బీహార్‌ కళాకారుల బృందం ఏడు రోజుల పాటు శ్రమించి 14 లక్షల దీపాలతో పరాక్రమ రూపంలోని శ్రీరాముని ఆకృతిని తీర్చిదిద్దిందని తెలిపారు. 14 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. నవ భారత యువకులలో ‘శౌర్యం’ ఉండాలనే సందేశాన్ని  ఈ రూపం అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఆర్ట్‌వర్క్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల ఛాయాచిత్రాలు కూడా ఉన్నాయి. దీపాలతో ‘జై శ్రీరామ్’ ఆకృతిని కూడా రూపొందించారు. 
ఇది కూడా చదవండి: అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట.. అతిథులకు అపూర్వ కానుక
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement