అయోధ్యలో 22న జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బాలరామునికి దేశవ్యాప్తంగా పలువురు కానుకలు పంపుతున్నారు. ఈ క్రమంలో 21.6 అడుగుల పొడవైన భారీ వేణువును పిలిభిత్(ఉత్తరప్రదేశ్) నుంచి అయోధ్యకు పంపించనున్నారు. అయోధ్యలోని మ్యూజియంలో ఈ వేణువును ఉంచనున్నారు.
అత్యంత పొడవైన ఈ వేణువును పిలిభిత్ నగరానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు, దివంగత నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్, కుమారుడు అర్మాన్ నబీ, వారి బంధువు షంషాద్ తదితరులు వారి స్నేహితుల సాయంతో తయారుచేశారు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వెదురును చరిత్రకు గుర్తు చాలా ఏళ్లుగా దాచివుంచామని, ఇప్పుడిది వేణువు రూపంలో శ్రీరాముని చెంతకు చేరుతున్నదని హీనా పర్వీన్ తెలిపారు. కాగా ఈ వేణువును హీనా పర్వీన్ స్థానిక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు అప్పగించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకర్త హరీష్ రౌతేలా ఈ వేణువుకు పూజలు చేశారు. ఈ వేణువును జనవరి 26న అయోధ్యధామానికి పంపనున్నారు.
కాగా వేణువు తయారీదారులలో ఒకరైన అర్మాన్ మాట్లాడుతూ ఈ వేణువు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైందన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలిచిందన్నారు. ఈ వేణువు తయారీకి వినియోగించిన వెదరును అస్సాం నుండి సుమారు 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చామన్నారు. ఇటువంటి వెదురు ప్రస్తుతం ఎక్కడా అందుబాటులో లేదన్నారు.
ఇది కూడా చదవండి: ఉత్సవ విగ్రహమే ఇంత సమ్మోహనంగా ఉందంటే..
ఈ వేణువును తయారీకి 10 రోజులు పట్టిందని, ఈ వేణువును రెండు వైపుల నుండి వాయించవచ్చని తెలిపారు. దీని తయారీకి దాదాపు రూ.70-80 వేలు ఖర్చయిందని తెలిపారు. ఈ బారీ వేణువుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వేణువును ఒక ట్రక్కులో అయోధ్యకు తరలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment