అయోధ్య గుడికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం | World Largest Lock, 400 KG Aligarh Lock Will Be Installed In Shri Ram Temple In Ayodhya, More Details Inside - Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir Lock Facts: 400 కేజీల తాళానికి 30 కిలోల చెవి!

Published Sat, Jan 20 2024 12:18 PM | Last Updated on Sat, Jan 20 2024 5:59 PM

400 KG Aligarh Lock will be Installed in Shri Ram Temple - Sakshi

అయోధ్య రామునికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యూపీలోని అలీఘర్‌కు చెందిన జ్వాలాపురి నివాసి సత్యప్రకాష్ శర్మ  తయారుచేసిన 400 కిలోల బరువున్న తాళాన్ని అయోధ్యకు తరలించనున్నారు. ఈ తాళం ప్రపంచంలోనే అతిపెద్ద తాళంగా గుర్తింపు పొందింది. ఈ తాళాన్ని సత్యప్రకాశ్ శర్మతో పాటు అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ చంద్ సంయుక్తంగా తయారు చేశారు. ఈ తాళాన్ని అయోధ్యలో సమర్పించేందుకు మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్‌కు రుక్మిణిదేవి అప్పగించారు. 

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించేవారు ఈ తాళాన్ని అలీఘర్ ప్రాంతానికి చిహ్నంగా గుర్తించనున్నారు. హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి అశోక్ కుమార్ పాండే మీడియాతో మాట్లాడుతూ తాళాల తయారీదారుడు సత్య ప్రకాష్ శర్మ దంపతులు తయారు చేసిన ఈ తాళాన్ని బాలరామునికి అ‍ర్పించనున్నట్లు తెలిపారు. 

గత ఏడాది సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యప్రకాష్ శర్మ, అతని భార్య రుక్మిణి శర్మ ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుని, తాము స్వయంగా తయారుచేసిన  ఆరు కిలోల తాళాన్ని ఆయనకు బహుకరించారు. అలాగే తాము అయోధ్యలోని శ్రీరామ మందిరానికి 400 కిలోల బరువు కలిగిన భారీ తాళం సిద్ధం చేశామని, ఆలయ ప్రారంభోత్సవ సమయానికి అందజేస్తామని ఆ దంపతులు ప్రధానికి తెలిపారు.

ఇది కూడా చదవండి: కాశీ నుంచి అయోధ్యకు 50 క్వింటాళ్ల పూలు

మూడు అడుగుల నాలుగు అంగుళాల పొడవున్న ఈ తాళానికి గల తాళం చెవి 30 కిలోల బరువుంటుందని రుక్మణి దేవి తెలిపారు. ఈ తాళం తయారీకి ఐదు లక్షల రూపాయలు ఖర్చు  అయ్యిందన్నారు. కాగా సత్యప్రకాష్ శర్మ గత డిసెంబర్ 12న గుండెపోటుతో కన్నుమూశారు. అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ శర్మ తండ్రి కోరిక మేరకు ఈ తాళాన్ని మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్‌కు అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement