Key
-
వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్!
ఇష్టపడి కారు కొంటున్నారా.. భవిష్యత్తు ప్రమాదాల దృష్ట్యా వాహనబీమా కూడా చేయిస్తుంటారు కదా. ప్రమాదశాత్తు మీ కారు కీ పోయిందనుకోండి. ఏం చేస్తారు.. ‘ఏముంది నకిలీ కీ తయారు చేయిస్తాం’ అంటారా.. అయితే మీకు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ వర్తించదనే సంగతి తెలుసా? నకిలీ కీ ఉంటే బీమా ఎందుకు రాదో.. కీ పోయినా బీమా వర్తించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.ముప్పే ఏళ్ల కిందట సైకిల్ వినియోగిస్తే మహాగొప్ప. బైక్ ఉందంటే సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం ఉండేది. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం సైకిల్, బైక్‌ను ఎవరూ పట్టించుకోవడంలేదు. దాదాపు చాలామంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. కారు కొనే సమయంలో కంపెనీలు వాహనబీమా ఇస్తుంటాయి. అయితే అనుకోకుండా కారు కీ పోయిందనుకోండి. వెంటనే దాని నకిలీ తయారు చేయించి వాడుతుంటారు. కారు ఏదైనా ప్రమాదంబారిన పడినప్పుడు బీమా క్లెయిమ్ చేయడానికి వెళ్తారు. కానీ బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను రెజెక్ట్ చేస్తుంది. మీరు నకిలీ కీ వాడుతున్నట్లు రుజువవుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటుంది.ఇదీ చదవండి: పెరుగుతున్న ప్రైవేట్ మూలధన వ్యయంవాహన బీమా తీసుకునేప్పుడే ‘కారు కీ రీప్లేస్మెంట్’ యాడ్ఆన్ సర్వీసును తీసుకోవాలి. అందుకోసం కంపెనీను బట్టి రూ.250-రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీసును ఎంచుకుని ఉంటే ఒకవేళ భవిష్యత్తులో కారు కీ పోయినా దాన్ని కంపెనీ రీప్లేస్ చేస్తుంది. అలా రీప్లేస్ చేసిన కీ వాడుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా కంపెనీ బీమాను క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కీ రీప్లేస్మెంట్ యాడ్ఆన్ సర్వీసును ఎంచుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు. -
దేశ బడ్జెట్‌ని మార్చగలిగేది మహిళలే! ఎలాగంటే..!
గృహిణిగా ప్రతి ఇల్లాలు తన ఇంట్లో చేసే ప్రతి పని కుటుంబ బడ్జెట్‌నే గాక దేశ బడ్జెట్‌ని కూడా మార్చగలదు. వంటింట్లో మండే గ్యాస్ నుంచి తినే ఆహార పదార్థాలు, తాగిపడేసి బాటిల్ దాక ఆమె చేసే ప్రతి పని ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కడైనా ఆమె అజాగ్రత్తగా వృధా చేసిందా అది కుటుంబ బడ్జెట్‌నే కాదు దేశ ఆర్థికవ్యవస్థపైనే భారం పెంచేస్తుంది. ఓ మహిళగా మనం ఆచరిస్తేనే..మన కుటుంబం దాన్ని ఫాలో అవుతుంది. అదికాస్త దేశ బడ్జెట్‌నే మారుస్తుంది. అదెలాగో చూద్దామా..!ఫుడ్: ఇంట్లో వండిన అన్నం పిల్లలు తినకపోవడం వల్లనో వృధా అయిపోతుందా. ప్రతిరోజూ వండిన అన్నం కూరలు డస్ట్‌బిన్ పాలు చేస్తున్నారా!. ఇలా దేశంలోని లక్షలాది మంది చేస్తే వృధా అవుతున్న ఆహార పదార్థాల విలువ ఏకంగా ఏటా రూ. 92 వేల కోట్లుకి చేరుతుంది. ఇది మన జీడీపీలో ఒక శాతం కన్నా ఎక్కువ. అంతేగాదు గణాంకాల ప్రకారం..దేశంలోని ప్రతి ఒక్కరూ ఏటా కిలోల కొద్ది ఆహార పదార్థాలను మట్టిపాలు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి దీన్ని పండించడానికి రైతు ఎంత శ్రమ పడతాడో తెలుసా..!. అది మన మన దాకా చేర్చడానికి ఎంతమంది, ఎన్ని గంటలు వెచ్చించాల్సి వస్తుందో తెలుసుకుంటే కచ్చితం వృధా చేసే సాహసం చేయరు. ఈ రోజు నుంచే ఈ వృధాని నివారిద్దాం.వాటర్: నీళ్లే కదా అని తీసి పారేయొద్దు. ప్రభుత్వం ఈ నీటి కోసం ఏటా రూ.69 వేల కోట్లు పైనే ఖర్చు చేస్తోంది. మనం నిర్లక్ష్యంగా కట్టికట్టనట్లుగా ట్యాప్‌ని వదిలేస్తున్నాం. ఇది వ్యర్థ జలంగా మారపోతుంది. ఇలా మన దేశంలో వృధాగా వెళ్తున్న నీరు ఏడున్నర కోట్ల లీటర్లని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ఇంటి నుంచి 60 శాతం పైగా నీరు మరుగునీరుగా మారిపోతున్నాయి. వీటిని వాడకంలోకి తీసుకురావాలంటే వేల కోట్లు ఖర్చు చేయాల్సిందే. మహిళలు ఇక్కడ కాస్త బాధ్యతతో వ్యవహరిస్తే కుటుంబ సభ్యులు బాధ్యతగా తీసుకునేందుకు ముందుకొస్తారు. అలా కుటుంబంతో సహా మొత్తం దేశంలో అందరిలోనే నెమ్మదిగా మార్పు వస్తుంది.కరెంట్: దేశవ్యాప్తంగా కరెండ్ వృథా ఎంతంటే ..రోజూకి ఐదు కోట్ల యూనిట్లు. ఈ విద్యుత్ శక్తి తయారీకి అయ్యే ఖర్చు చూస్తే ఏకంగా రూ. 12 కోట్లుపైనే. మరీ ఈ భారం పడేది మనపైనే. అలాగే రేపు విద్యుత్ కొరత తలెత్తితే ఇబ్బంది పడేది కూడా మనమే. అందుకే ఇప్పటి నుంచే ఇంట్లో ప్రతి గదిని చెక్ చేసి మరీ లైట్లు, ఫ్యాన్ల స్విచ్‌లను ఆపేద్దాం.ప్లాస్టిక్ పనిపడదాం: ఇంట్లో ఏ సరకులు తేవాలన్నా క్యారీ బ్యాగ్ తప్పనిసరి. వాటర్ బాటిల్ నుంచి పాల ప్యాకెట్ వరకు ప్రతిదీ ప్లాస్టికే. ఏటా 74 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్తగా మారుతుంది. దీన్ని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత నష్టాన్నీ... కాలుష్యం వల్ల వచ్చే కష్టాన్నీ అన్నింటినీ మనమే భరించాల్సి వస్తోంది. అందువల్ల ఈ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు తెలుసుకుని వాటిని అలవాటు చేసుకుందాంవంట గ్యాస్: మన వంటింట్లో వెలిగే గ్యాస్ పొయి అంటే మనకు ఎంత నిర్లక్యమో చెప్పాల్సిన పనిలేదు. రోజూ ఏదో కూర మాడడం లేదా వెలిగించి కట్టడం మర్చిపోవడం వంటివి చేస్తూ అగ్ని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం. నిజానికి కాస్త తెలివితో నాణ్యమైన స్టౌ ఎంచుకుంటే చక్కగా ఇంధనాన్ని ఆదా చెయ్యొచ్చు. మనకు కూడా గ్యాస్‌కి పెట్టే ఖర్చు తగ్గుతుంది కూడా. ముఖ్యంగా బర్నర్లు, పైపులు, రెగ్యులేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అవన్నీ సక్రమంగా ఉన్నాయా..ఎక్కడైనా లీకేజ్‌లు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఇలా చేస్తే కోట్లాది రూపాయాలు ఖరీదు చేసే ఇంధనం వృధా కాకుండా నివారించొచ్చు. అందువల్ల ప్రతి ఇల్లాలు ఇంట్లో చేసే ప్రతి పనిని జాగ్రత్తగా బాధ్యతతో వ్యవహరించి.. వృధాకు అడ్డుకట్ట వేస్తే కుటుంబ బడ్జెటే కాదు దేశ బడ్జెట్‌ని అదుపు చెయ్యొచ్చు..లాభాలు పొందొచ్చు.(చదవండి: Union Budget 2024-25: మహిళలు, బాలికలకు గుడ్ న్యూస్) -
నీట్ పేపర్ లీకేజీ నిజమే
పట్నా: బిహార్‌లో చోటుచేసుకున్న నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. పేపర్ లీక్ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్‌కు ఒక్క రోజు ముందు ప్రశ్నపత్రంతోపాటు సమాధానాల ‘కీ’ని సైతం అభ్యర్థులకు అందజేసి, పరీక్షకు సిద్ధం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో బిహార్ పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నలుగురు నీట్ అభ్యర్థులు అనురాగ్ యాదవ్, శివానందన్, అభిõÙక్, ఆయుష్ రాజ్, ఇద్దరు లీకేజీ ముఠా సభ్యులు నితీశ్, అమిత్ ఆనంద్‌తోపాటు ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ యాదవేందు ఉన్నారు. ఈ యాదవేందు మేనల్లుడే అనురాగ్æ. విచారణలో నిందితులు ఏం చెప్పారో వారి మాటల్లోనే... ‘‘బిహార్ దానాపూర్ టౌన్ కౌన్సిల్లో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సికిందర్ ప్రసాద్ యాదవేందు మమ్మల్ని సంప్రదించాడు. మేనల్లుడు అనురాగ్‌సహా నలుగురికి ప్రశ్నపత్రం ఇచి్చ యాదవేందు నుంచి రూ.32 లక్షలు తీసుకున్నాం’’ – నితీశ్, అమిత్, ‘‘ అమిత్, నితీశ్ ప్రశ్నపత్రం, కీ అందజేశారు. పరీక్షకు సిద్ధం కావడానికి సహకరించారు’ – అనురాగ్, నీట్ అభ్యర్థి ‘‘యాదవేందు అంకుల్ మే 4న ఓ ఇంటికి రమ్మని చెప్పాడు. అక్కడ నితీశ్, అమిత్ ప్రశ్నపత్రం ఇచ్చి నన్ను పరీక్షకు సిద్ధం చేశారు’’ – శివానందన్ కుమార్, నీట్ అభ్యర్థి ‘‘నీట్ ప్రశ్నపత్రం కోసం యాదవేందుకు రూ.40 లక్షలు చెల్లించాం’’ –అవదేశ్, అభిషేక్ కుమార్ తండ్రి ‘‘యాదవేందు రూ.40 లక్షలు తీసుకున్నాడు’’ నీట్ అభ్యర్థి ఆయుష్ రాజ్ తండ్రి ‘‘రాజస్తాన్‌లోని కోటాలో శిక్షణ పొందుతున్న నా మేనల్లుడు అనురాగ్ యాదవ్ నా సోదరి రీనా కుమారితో కలిసి నీట్ పరీక్ష రాయడానికి పాట్నా వచ్చాడు. వారికి పాటా్నలో ప్రభుత్వ అతిథి గృహంలో నేనే బస ఏర్పాట్లు చేశా. నీట్ పరీక్ష రాయడానికి నా మేనల్లుడు సహా నలుగురి అభ్యర్థులకు సహకరించా. నలుగురికి ప్రశ్నపత్రాలు సమకూర్చా. ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షల చొప్పున డిమాండ్ చేశా. నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్ రూ.32 లక్షల చొప్పున తీసుకున్నారు’’ – యాదవేందు, ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ తేజస్వీ యాదవ్ సహాయకుడి హస్తం! ప్రభుత్వ అతిథి గృహంలో అనురాగ్ యాదవ్, ఆయన తల్లికి బస ఏర్పాట్ల వెనుక బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గెస్టు హౌస్ బిల్లులను పరిశీలించగా, అందులో మంత్రిజీ అని ఉంది. తేజస్వీ యాదవ్ వ్యక్తిగత సహాయకుడైన ప్రీతమ్ కుమార్ ఈ గెస్టు హౌస్‌ను బుక్ చేసేందుకు యాదవేందుకు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
అయోధ్య గుడికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం
అయోధ్య రామునికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యూపీలోని అలీఘర్కు చెందిన జ్వాలాపురి నివాసి సత్యప్రకాష్ శర్మ తయారుచేసిన 400 కిలోల బరువున్న తాళాన్ని అయోధ్యకు తరలించనున్నారు. ఈ తాళం ప్రపంచంలోనే అతిపెద్ద తాళంగా గుర్తింపు పొందింది. ఈ తాళాన్ని సత్యప్రకాశ్ శర్మతో పాటు అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ చంద్ సంయుక్తంగా తయారు చేశారు. ఈ తాళాన్ని అయోధ్యలో సమర్పించేందుకు మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్‌కు రుక్మిణిదేవి అప్పగించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించేవారు ఈ తాళాన్ని అలీఘర్ ప్రాంతానికి చిహ్నంగా గుర్తించనున్నారు. హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి అశోక్ కుమార్ పాండే మీడియాతో మాట్లాడుతూ తాళాల తయారీదారుడు సత్య ప్రకాష్ శర్మ దంపతులు తయారు చేసిన ఈ తాళాన్ని బాలరామునికి అర్పించనున్నట్లు తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యప్రకాష్ శర్మ, అతని భార్య రుక్మిణి శర్మ ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుని, తాము స్వయంగా తయారుచేసిన ఆరు కిలోల తాళాన్ని ఆయనకు బహుకరించారు. అలాగే తాము అయోధ్యలోని శ్రీరామ మందిరానికి 400 కిలోల బరువు కలిగిన భారీ తాళం సిద్ధం చేశామని, ఆలయ ప్రారంభోత్సవ సమయానికి అందజేస్తామని ఆ దంపతులు ప్రధానికి తెలిపారు. ఇది కూడా చదవండి: కాశీ నుంచి అయోధ్యకు 50 క్వింటాళ్ల పూలు మూడు అడుగుల నాలుగు అంగుళాల పొడవున్న ఈ తాళానికి గల తాళం చెవి 30 కిలోల బరువుంటుందని రుక్మణి దేవి తెలిపారు. ఈ తాళం తయారీకి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందన్నారు. కాగా సత్యప్రకాష్ శర్మ గత డిసెంబర్ 12న గుండెపోటుతో కన్నుమూశారు. అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ శర్మ తండ్రి కోరిక మేరకు ఈ తాళాన్ని మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్‌కు అప్పగించారు. -
అదే బరి.. వీరులు వారే..
మేకల కళ్యాణ్ చక్రవర్తి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగడమంటే ఆషామాషీ కాదు. పోటీ చేసి గెలవాలంటే అంత ఈజీ కాదు. పదేపదే పోటీ చేస్తుంటే..ఓసారి గెలిచి మరోమారు ఓడిపోతుంటే.. పదే పదే గెలుస్తుంటే.. లేదా పదే పదే ఓడిపోతుంటే.. ఆ ఉత్కంఠ అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. అలా పదేపదే పోటీ చేయడం కత్తిమీద సాము లాంటిదే. పోటీ చేసిన వారే పదేపదే పోటీ చేయడం.. ఒకే నియోజకవర్గంలో నేతలు రెండు నుంచి ఐదు సార్లు తలపడితే వారినే ‘పాతకాపు’లంటారు. నియోజకవర్గం మారినా, పార్టీలు మారినా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ వారి మధ్యనే ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు అలా పాతుకుపోతారంతే. ఇలాంటి పాతకాపులు ఈసారి కూడా హోరాహోరీ తలపడుతున్నారు. చిరకాల ప్రత్యర్థులపై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాతకాపుల పోటాపోటీ ఎలా ఉందంటే..! నిజామాబాద్ బోధన్‌లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి హోరాహోరీ తలపడిన షకీల్ అహ్మద్, సుదర్శన్‌రెడ్డి ఈసారి కూడా అవే పార్టీల నుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ రూరల్లోనూ పాతకాపులే మళ్లీ పోటీ పడుతున్నారు. 2018లో నిల్చున్న బాజిరెడ్డి గోవర్ధ్దన్ (బీఆర్ఎస్), భూపతిరెడ్డి (కాంగ్రెస్)లు ఈసారీ బరిలో ఉన్నారు. బాల్కొండలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి (బీఆర్ఎస్)పై గత ఎన్నికల్లో బీఎస్పీ పక్షాన తలపడిన సునీల్‌కుమార్ ఈసారి కాంగ్రెస్ నుంచి తలపడుతున్నారు. ఆదిలాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు పాతకాపులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తలపడిన కోనేరు కోనప్ప (బీఆర్ఎస్)పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి హరీశ్ ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య (బీఆర్ఎస్), జి.వినోద్‌లు మళ్లీ పోటీ పడుతున్నారు. అయితే, గత ఎన్నికల్లో వినోద్ బీఎస్పీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గా రంగంలో ఉన్నారు. మంచిర్యాలలో ఎన్.దివాకర్‌రావు (బీఆర్ఎస్), కె.ప్రేమ్‌సాగర్‌రావు (కాంగ్రెస్) మళ్లీ అవే పార్టీల తరఫున రంగంలోకి దిగారు. నిర్మల్‌లో వరుసగా ఏడోసారి ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేస్తుండగా ఆయనపై రెండు వరుస ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన మహేశ్వర్‌రెడ్డి, కూచాడి శ్రీహరిరావులిద్దరూ ఈసారి ఆయనపై బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి పోటీలో నిలిచారు. ఖమ్మం పినపాకలో గత ఎన్నికల్లో రేగా కాంతారావు (కాంగ్రెస్), పాయం వెంకటేశ్వర్లు (బీఆర్ఎస్) నుంచి పోటీ చేయగా, ఇప్పుడు కూడా వీరే తలపడుతున్నా పార్టీలు మారారు. ఇల్లెందులోనూ ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన హరిప్రియానాయక్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోరం కనకయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మధిరలో గత నాలుగో ఎన్నికల్లోనూ మల్లు భట్టి విక్రమార్క, లింగాల కమల్రాజ్లే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. భట్టి కాంగ్రెస్ అభ్యర్థి గా నాలుగుసార్లు రంగంలో ఉండగా, కమల్‌రాజ్ మాత్రం రెండుసార్లు సీపీఎం నుంచి, రెండోసారి బీఆర్ఎస్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భద్రాచలం నుంచి పొదెం వీరయ్య (కాంగ్రెస్), తెల్లం వెంకట్రావు (బీఆర్ఎస్) వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. మెదక్ అందోల్ నియోజకవర్గంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్), చంటి క్రాంతి కిరణ్ (బీఆర్ఎస్)లు వరుసగా రెండోసారి బరిలో ఉన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి (కాంగ్రెస్), చింత ప్రభాకర్ (బీఆర్ఎస్)లు వరుసగా నాలుగోసారి అమీతుమీ తేల్చుకుంటున్నారు. పటాన్చెరులోనూ 2018 ఎన్నికల్లో తలపడిన మహిపాల్‌రెడ్డి (బీఆర్ఎస్), శ్రీనివాస్‌గౌడ్ (కాంగ్రెస్)లే 2023 ఎన్నికల్లోనూ పోటీ పడుతున్నారు. వరంగల్ డోర్నకల్‌లో రెడ్యానాయక్ (బీఆర్ఎస్), రామచంద్రునాయక్ (కాంగ్రెస్) మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్), పెద్ది సుదర్శన్‌రెడ్డి (బీఆర్ఎస్) మూడోసారి తలపడుతున్నారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి (బీఆర్ఎస్), గండ్ర సత్యనారాయణరావు (కాంగ్రెస్) రెండోసారి పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి, సత్యనారాయణరావు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. రంగారెడ్డి జిల్లా మల్కాజ్‌గిరిలో వరుసగా రెండోసారి మైనంపల్లి హనుమంతరావు, ఎస్.రాంచందర్‌రావు (బీజేపీ)ల నడుమ పోరు జరుగుతోంది. మైనంపల్లి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దిగగా, ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానంద (బీఆర్ఎస్), కూన శ్రీశైలం గౌడ్ మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. శ్రీశైలం గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం జనరల్ స్థానంగా మారిన తర్వాత జరుగుతున్న నాలుగు ఎన్నికల్లోనూ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే గతంలో బీఎస్పీ నుంచి, ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మల్రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 2009, 2014లో టీడీపీ నుంచి పోటీ చేయగా, 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటున్నారు. పరిగిలో కొప్పుల మహేశ్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి మధ్య బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వరుసగా రెండోసారి పోటీ జరుగుతోంది. వికారాబాద్లోనూ మెతుకు ఆనంద్ (బీఆర్ఎస్), గడ్డం ప్రసాద్‌కుమార్ (కాంగ్రెస్) రెండోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కరీంనగర్ జగిత్యాల నుంచి సంజయ్‌కుమార్ (బీఆర్ఎస్), టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) వరుసగా మూడోసారి తలపడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చెరోసారి విజయం సాధించగా, ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)పై అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్) వరుసగా ఐదోసారి పోటీ చేస్తున్నారు. ఐదు ఎన్నికల్లో ఓటమిపాలైనా గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిన ఆయన మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంథనిలో పుట్టా మధు (బీఆర్ఎస్), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (కాంగ్రెస్) వరుసగా నాలుగోసారి ఢీ కొడుతున్నారు. పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్), విజయరమణారావు (కాంగ్రెస్) వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ (బీఆర్ఎస్)పై బండి సంజయ్ (బీజేపీ) వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. చొప్పదండిలోనూ సుంకె రవిశంకర్ (బీఆర్ఎస్), మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) మధ్య రెండోసారి పోటీ నెలకొంది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ (బీఆర్ఎస్)పై పాతకాపు కె.కె.మహేందర్‌రెడ్డి (కాంగ్రెస్) మరోమారు పోటీ చేస్తున్నారు. ఒక్కసారి మినహా గత నాలుగు ఎన్నికల్లోనూ ఆ ఇద్దరే ముఖాముఖి తలపడటం గమనార్హం. నల్లగొండ దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గంలో బాలూనాయక్ (కాంగ్రెస్), రవీంద్రకుమార్ (బీఆర్ఎస్) రెండోసారి తలపడుతున్నారు. కోదాడలో పద్మావతిరెడ్డి (కాంగ్రెస్), బొల్లం మల్లయ్య (బీఆర్ఎస్), సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి (బీఆర్ఎస్), దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్)లు వరుసగా రెండుసార్లు తలపడుతున్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి మధ్య మూడోసారి పోటీ జరుగుతోంది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్), కె. ప్రభాకర్‌రెడ్డి (బీఆర్ఎస్) మధ్య కూడా వరుసగా మూడోసారి పోటీ జరుగుతోంది. భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి (బీఆర్ఎస్), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) మధ్య కూడా వరుసగా రెండోసారి సమరం జరుగుతోంది. నకిరేకల్‌లో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్యల నడుమ మూడోసారి పోటీ జరుగుతోంది. అయితే, గత ఎన్నికల్లో ఈ ఇద్దరు పోటీ చేసిన పార్టీలు వేర్వేరు కావడం గమనార్హం. మహబూబ్‌నగర్ కొడంగల్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి (బీఆర్ఎస్) నడుమ రెండోసారి యుద్ధం జరుగుతోంది. అచ్చంపేటలో గువ్వల బాలరాజు (బీఆర్ఎస్), చిక్కుడు వంశీకృష్ణ (కాంగ్రెస్) కూడా వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కల్వకుర్తి నుంచి జైపాల్‌యాదవ్ (బీఆర్ఎస్), టి.ఆచారి (బీజేపీ) కూడా రెండోసారి పోటీ పడుతున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్), హర్షవర్దన్‌రెడ్డి (బీఆర్ఎస్) మూడోసారి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఈ ఇద్దరూ పోటీ చేసిన పార్టీల నుంచి కాకుండా మరో పార్టీ నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం. -
చట్టబద్ధత కల్పించలేం
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం అలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. ‘‘అది న్యాయస్థానానికి సంబంధించింది కాదు. పార్లమెంటు పరిధిలోని అంశం. కోర్టులు చట్టాలు చేయవు. వాటిని మంచి చెడులను బేరీజు వేస్తాయంతే’’ అని పేర్కొంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. అయితే స్వలింగ సంపర్కులకు పెళ్లాడే స్వేచ్ఛ, హక్కు ఉంటాయని స్పష్టం చేసింది. అంతేగాక ఇతరుల మాదిరిగానే వారికి అన్ని రకాల హక్కులూ సమానంగా ఉంటాయని, వారిపై వివక్ష చూపొద్దని పేర్కొంది. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయమై సాధారణ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది. తద్వారా స్వలింగ సంపర్కులు వివక్ష ఎదుర్కోకుండా చూడాలని పేర్కొంది. అలాగే స్వలింగ బంధాలు పట్టణ, సంపన్న వర్గాలకు పరిమితమైన ధోరణి అన్న కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ధర్మాసనం తప్పుట్టింది. ‘‘స్వలింగ సంపర్కం అనాది కాలం నుంచీ ఉన్న సహజ ధోరణే. అది కేవలం పట్టణాలకో, సంపన్న వర్గాలకో సంబంధించింది కాదు. ఈ విషయంలో కుల, సామాజిక వర్గ భేదాలూ ఉండవు. కనుక ఆ అపోహను వదిలించుకోవాలి’’ అని సూచించింది. కాకపోతే స్వలింగ జంటలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కుండబోదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 3:2తో మెజారిటీ తీర్పు వెలువరించింది. దత్తతతో పాటు పలు న్యాయపరమైన అంశాల విషయంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌తో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పి.ఎస్.నరసింహ విభేదించారు. నాలుగు తీర్పులు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2018లో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కూడా కల్పించాలంటూ ఎల్జీబీటీక్యూఐఏ++ వర్గాల తరఫున 21 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుదీర్ఘ విచారణ అనంతరం గత మే 11న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా దీనిపై మొత్తం 4 తీర్పులు వెలువరించింది. మొత్తం అంశంపై సీజేఐ 247 పేజీల తీర్పు వెలువరించారు. స్వలింగ జంటల దత్తత తదితర అంశాలపై సీజేఐ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ జస్టిస్ కౌల్ విడిగా 17 పేజీల తీర్పు వెలువరించారు. కాగా వాటితో విభేదిస్తూ తనతో పాటు జస్టిస్ కోహ్లీ తరఫున జస్టిస్ భట్ 89 పేజీల తీర్పు వెలువరించారు. దానితో పూర్తిగా ఏకీభవిస్తూ జస్టిస్ నరసింహ 13 పేజీల తీర్పు రాశారు. స్వలింగ ప్రవృత్తి సహజమైనదే తప్ప మానసిక రుగ్మత కాదని సీజేఐ స్పష్టం చేశారు. లైంగిక గుర్తింపు, ప్రవృత్తుల గురించి విచారణ జరిపే నెపంతో స్వలింగ జంటలను పోలీసులు వేధించవద్దని ఆదేశించారు. ఈ నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించడం గానీ, వారి నివాసాలకు వెళ్లడం గానీ చేయొద్దని చెప్పారు. దత్తతపై... అవివాహితులకు, స్వలింగ జంటలకు దత్తత హక్కుండదంటూ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది. వారికి ఆ హక్కును నిషేధిస్తున్న దత్తత చట్ట నిబంధనలను సమర్థిస్తున్నట్టు పేర్కొంది. అయితే దీనిపై కూడా పార్లమెంటు సమగ్రంగా చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. సమస్యల పరిష్కారానికి కమిటీ స్వలింగ సంపర్కులకు చట్టబద్ధ వివాహ హక్కు లేదని, రాజ్యాంగం ప్రకారం దాన్ని మౌలిక హక్కుగా పొందజాలరని పేర్కొంటూ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. అదే సమయంలో, స్వలింగ జంటల సమస్యలు, ఆందోళనల పరిష్కారానికి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించేందుకు కేబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎల్జీబీటీ కమ్యూనిటీతో పాటు సామాజిక తదితర రంగాల నిపుణులకు అందులో చోటుండాలని సూచించింది. వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయానికైనా వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని వర్గాల వారి వాదనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలియజేసింది. రేషన్ కార్డు తదితరాల నిమిత్తం స్వలింగ జంటను ఒకే కుటుంబంగా పరిగణించడం, ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవడం, డెత్ బెనిఫిట్స్ తదితరాల నిమిత్తం తమలో ఒకరిని నామినీగా పేర్కొనడం వంటి సౌకర్యాలను కల్పించవచ్చేమో పరిశీలించాలని సూచించింది. దాంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చారు. అన్ని అంశాలనూ సమగ్రంగా పరిశీలించిన మీదట కమిటీ ఇచ్చే తుది నివేదికను కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాలనపరంగా అన్ని స్థాయిల్లోనూ అమలు చేయాలని సీజేఐ స్పష్టం చేశారు. ‘స్వలింగ జంటల బంధాన్ని చట్టపరంగా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. లేదంటే వారికి అన్యాయం చేసినట్టే అవుతుంది’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఎల్జీబీటీక్యూఐఏ++ అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్, క్వశ్చనింగ్, ఇంటర్‌సెక్స్, పాన్‌సెక్సువల్, టూ స్పిరిట్, అసెక్సువల్ తదితరులు కేవలం లైంగిక ప్రవృత్తి ఆధారంగా పెళ్లి చేసుకునే విషయంలో ఫలానా వారికి ఫలానా హక్కు వర్తించబోదని చెప్పబోవడం పొరపాటే అవుతుంది. స్వలింగ జంటలు పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకోవడాన్ని ఎవరూ నిషేధించలేరు. కానీ దానికి చట్టపరమైన గుర్తింపును మాత్రం ఇప్పటికైతే వారు కోరజాలరు. అలాగే దత్తత హక్కును కూడా! ఈ విషయంలో జస్టిస్ భట్ తీర్పుతో పూర్తిగా ఏకీభవిస్తున్నా – జస్టిస్ నరసింహ ఎవరేమన్నారు.. అవివాహితులు, స్వలింగ జంటలు దత్తత తీసుకోవడాన్ని నిషేధిస్తున్న సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్అథారిటీ (సీఏఆర్ఏ) నిబంధన 5(3) రాజ్యాంగవిరుద్ధం, చట్టవిరుద్ధం. స్త్రీ పురుష జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులు కాగలరన్న భావన సరికాదు. అది స్వలింగ జంటల పట్ల వివక్షే అవుతుంది. అసలు వివాహమనే బంధానికి సమానంగా వర్తించే సార్వత్రిక భావనంటూ ఏదీ లేనే లేదు – సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వలింగ సంపర్కుల పట్ల జరుగుతున్న చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకు బహుశా ఇది సరైన సందర్భం. ఈ దిశగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ సకారాత్మక చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా – జస్టిస్ ఎస్.కె.కౌల్ ఎల్‌జీబీటీక్యూఏఐ++ జంటల సమస్యలు మా దృష్టికి రాకపోలేదు. కానీ వారికి దత్తత హక్కు లేదన్న సీఏఆర్ఏలోని నిబంధన 5(3) చెల్లుబాటవుతుంది. అయితే స్వలింగ స్వభావులకు భాగస్వాములను ఎంచుకునేందుకు, సహజీవనం చేసేందుకు పూర్తి హక్కుంటుంది. అయితే ఆ బంధంతో వారికి దఖలు పడాల్సిన హక్కులను గుర్తించాల్సిన అనివార్యత మాత్రం ప్రభుత్వాలకు లేదు -జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ -
కౌలు చెల్లించాల్సింది సీఆర్డీఏ.. రాష్ట్ర ప్రభుత్వం కాదు
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపు విషయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది బైరెడ్డి సాయి ఈశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనిపై కౌంటర్లు దాఖ లు చేయాలని భూములిచ్చిన పిటిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించినందుకు ‘మీరు పిటిషనర్ల పట్ల ప్రతికూల అభిప్రాయంతో ఉన్నారం’టూ న్యాయమూర్తిపై రాజధాని రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తీవ్ర ఆరోపణ చేశారు. రాజధానికి భూములిచ్చినందుకు మేలో చెల్లించాల్సిన వార్షిక కౌలు ఇప్పటివరకు చెల్లించలేదంటూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితితో సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ సోమవారం మరోసారి విచారణ జరి పారు. ఈ సందర్భంగా బైరెడ్డి సాయి ఈశ్వరరెడ్డి తరపున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపిస్తూ.. రాజధానికి భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం కౌలు చెల్లించడాన్ని సవాలు చేస్తూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని కోసం సేకరించిన భూముల కోసం రూ.1,000 కోట్లతో డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారని, ఇది సీఆర్డీఏ వద్ద ఉంటుందని తెలిపారు. ఈ ఫండ్ నుంచి సీఆర్డీఏనే కౌలు చెల్లించాలన్నారు. ఇందుకు విరుద్ధంగా 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని, ఇది చట్ట విరుద్ధమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు పత్రికల్లో రోజూ కథనాలు వస్తున్నాయని, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కోట్ల రూపాయలను రాజధానికి భూములిచ్చారన్న పేరుతో కేవలం ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తులకే చెల్లించడం సరి కాదని అన్నారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి విరుద్ధంగా ఎలాంటి క్లెయిమ్స్ లేవనెత్తడానికి వీల్లేదన్నారు. సీఆర్డీఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరడానికి వీల్లేదని, రాజధాని విషయంలో నిధులను సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఆర్డీఏపై ఉందని చెప్పా రు. వాదనలు వినిపించేందుకు తమను ఇంప్లీడ్ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను అనుమతిస్తున్న ట్లు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకే... ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించడంపై రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము ఎప్పుడో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినకుండా ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించడం సరికాదన్నారు. రైతులకు కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇందులో భాగంగానే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలైందని తెలిపారు. మీరు (జస్టిస్ కృష్ణమోహన్) తమ పట్ల ప్రతికూల అభిప్రాయం (ప్రిజుడీస్) కలిగి ఉన్నారని ఆరోపించారు. రాజకీయ కారణాలతో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. రాజకీయాలతో ఈ పిటిషన్‌కు సంబంధం లేదని, పిటిషనర్ న్యాయవాది అని వివేకానంద వివరించారు. ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆ తరువాత పూర్తి విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
గురుకుల పరీక్షల తుది ‘కీ’లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత నెలలో నిర్వహించిన అర్హత పరీక్షల తుది ‘కీ’లను గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఖరారు చేసింది. ఆగస్టు చివరి వారంలో ప్రాథమిక కీలను అందుబాటులోకి తీసుకొచ్చిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. వాటిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన నిపుణుల కమిటీ వాటికి సంబంధించి టీఆర్‌ఈఐఆర్‌బీకి సిఫార్సులు చేసింది. వీటిని పరిశీలించిన అధికారులు వాటి ఆధారంగా తుది కీలను ఖరారు చేశారు. వీటిని టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. మొత్తంగా 51 కేటగిరీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీలు తాజాగా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన తుది కీలలో ఇకపై ఎలాంటి మార్పులు ఉండవని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. రోస్టర్ పాయింట్ల మార్పులు... ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ చార్ట్ కీలకంగా పనిచేస్తుంది. ఈ చార్ట్‌లో నిర్దేశించిన రిజర్వేషన్ల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. తాజాగా రోస్టర్ పాయింట్లలో కొన్ని రకాల మార్పులు చేస్తూ సవరించిన రోస్టర్ జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇందులో ప్రధానంగా 13, 37 (ఎక్స్ సర్వీస్‌మెన్) రోస్టర్ పాయింట్లలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. సొసైటీ వారీగా నిర్దేశించిన పోస్టు కేటగిరీల్లో ఈ పాయింట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు ప్రకటించిన పాయింట్లు... తాజాగా సవరించిన పాయింట్లతో కూడిన జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
ఇండియా కూటమి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
Updates.. ముంబైలో జరిగిన ఇండియా కూటమి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతల కూటమి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. జుడేగా ఇండియా.. జీతేగా ఇండియా నినాదంతో ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. అదే విధంగా చంద్రయాన్-3 విజయంపై ఇస్రోను అభినందిస్తూ కూటమి తీర్మానించింది. 13 మందితో సమన్వయ కమిటీని ఇండియా కూటమి ప్రకటించింది. ఇందులో శరద్ పవార్, స్టాలిన్ సహా పలువురు కీలక నేతలకు చోటు దక్కింది. ఇండియా కూటమి సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ వేదికపై 60 శాతం భారత్ ఉందన్నారు. ఈ బలమైన శక్తిని ఓడించడం బీజేపీ తరం కాదని అన్నారు. ఎన్నికలు చాలా దగ్గరగా వచ్చాయని, త్వరలోనే జీ 20 శిఖరాగ్ర సదస్సు జరగనుందని తెలిపారు. అదానీ విషయంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తన లఢక్ యాత్ర గురించి చెబుతూ..లఢక్‌లో చాలా భాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పారు. మన భూభాగాలను చైనా ఆక్రమించలేదని ప్రధాని మోదీ చెప్పడం పూర్తిగా అబద్ధమని అన్నారు. అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడానని అన్నారు. భారత ప్రభుత్వం తమను మోసం చేస్తోందని లఢక్‌లో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసని అన్నారు. చైనా, భారత మధ్య సరిహద్దు విషయంలో రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. సరిహద్దు మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. #WATCH | Congress MP Rahul Gandhi says, "I spent a week in Ladakh. I went to Pangong Lake right in front of where the Chinese are. I had detailed discussions, probably the most detailed discussion that any politician outside Ladakh has had with the people of Ladakh. They… pic.twitter.com/neR3JPZ8ih — ANI (@ANI) September 1, 2023 ► కూటమి పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే ఓడించే సత్తా బీజేపీకి లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. సమర్ధవంతంగా ఐక్యంగా ఉండటమే తమ ముందున్న కర్తవ్యమని చెప్పారు. సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కూటమిలో నాయకుల మధ్య ఏర్పడిన సంబంధాలే అసలైన బలమని రాహుల్ చెప్పారు. బీజేపీని తప్పుకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Congress MP Rahul Gandhi at INDIA alliance meet in Mumbai "Today, two very big steps were taken. If parties on this stage unite, it is impossible for BJP to win elections. The task in front of us is to come together in the most efficient way. Forming a coordination… pic.twitter.com/SyDw8Tzmhk — ANI (@ANI) September 1, 2023 ► బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీలన్నీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. దాని ఫలితమే ఈ సమావేశం. కూటమి చేతిలో కేంద్రంలో ఉన్న బీజేపీకి ఓడిపోతుండి. ప్రస్తుతం మీడియా వారి చేతిలో ఉంది. వారి చెర నుంచి ఒక్కసారి మీడియాకు విముక్తి కలిగితే మళ్లీ మీడియా స్వేచ్చగా పనిచేస్తుంది. ఇలా చాలా ముఖ్యమైంది. వారు చరిత్రను మార్చాలనుకుంటున్నారు. అందుకు మేము అంగీకరించం. దీనిపై ప్రజలు, మేము కలిసి పోరాడతామన్నారు. #WATCH | Bihar CM and JD(U) leader Nitish Kumar says, "...Parties are working together unitedly. So, as a result of this, those who are at the Centre will lose. They will go away. Be assured...You (media) are captive right now. Once you are free from them, you - the press - will… pic.twitter.com/53gmDcCin8 — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి కేవలం 28 పార్టీల కూటమి కాదు.. 140 కోట్ల కూటమిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. దేశ చరిత్రలో మోదీ ప్రభుత్వం అత్యధిక అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రం కొందరి కోసమే పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఇండియా కూటమిని చీల్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి ఇండియా కూటమి ఉందని అన్నారు. ఇక్కడ పదవులు ఎవరూ ఆశించరని చెప్పారు. #WATCH | AAP National Convenor & Delhi CM Arvind Kejriwal on INDIA alliance meeting "This is an alliance not just of some 28 parties, but an alliance of 140 crore people...Modi government is the most corrupt and arrogant government in the history of independent India. We are… pic.twitter.com/Dqek2ybyVx — ANI (@ANI) September 1, 2023 ► 'ఎవరూ అడగకుండానే పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను ఏర్పాటు చేశారు. మణిపూర్ ఘటన జరిగిన సందర్భంలో ఎలాంటి సెషన్లు నిర్వహించలేదు. పెద్దనోట్ల రద్దు, చైనా దురాక్రమణ, కరోనా సమయంలో కూడా ఎలాంటి ప్రత్యేక సెషన్లను ప్రకటించలేదు. నియంతలా కేంద్రం దేశాన్ని పరిపాలిస్తోంది.' అని కేంద్రాన్ని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. #WATCH | Congress President Mallikarjun Kharge on INDIA alliance meeting in Mumbai "Today, without asking anyone, the opposition, a special session of Parliament has been called. A special session of Parliament was never called even when Manipur was burning, during the COVID-19… pic.twitter.com/wjwkDEMzPJ — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి భేటీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన అన్ని పార్టీలకు ఒకటే ధ్యేయం దేశాన్ని రక్షించడమేనని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అనేక సమస్యలపై పొరాడతామని చెప్పారు. కేంద్రం మొదట గ్యాస్ ధరలు పెంచిన మళ్లీ తగ్గిస్తున్నారు.. మోదీ ప్రభుత్వం పేదల కోసం పనిచేయడం లేదని అన్నారు. #WATCH | Congress President Mallikarjun Kharge on INDIA alliance meeting in Mumbai "All parties conducted this meeting well. A structure was formed for the alliance during talks at my residence earlier, in the Patna meeting an agenda was set and now in Mumbai, everyone has kept… pic.twitter.com/3KKlz20UG8 — ANI (@ANI) September 1, 2023 మూడు తీర్మాణాలు.. ► మూడు తీర్మాణాలు 1) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం 2) ఈ నెల మూడో వారం నుంచి ర్యాలీలు నిర్వహించనున్నారు. 3) జుడేగా భారత్-జీతేగా ఇండియా నినాదంతో ప్రజల ముందుకు #WATCH | Shiv Sena (UBT) leader Aaditya Thackeray says, "Today, INDIA parties passed three resolutions. One, we the INDIA parties hereby resolve to contest the forthcoming Lok Sabha elections together as far as possible. Seat-sharing arrangements in different states will be… pic.twitter.com/VAEXozqV9S — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమికి 14 మందితో కూడిన సమన్వయ కమిటీని నియమించారు. కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయం ఇంకా ప్రకటించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సీట్ల పంపకాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. #WATCH | Shiv Sena (UBT) MP Sanjay Raut announces names of the 14-member coordination committee -- KC Venugopal (INC), Sharad Pawar (NCP), TR Baalu (DMK), Hemant Soren (JMM), Sanjay Raut (SS-UBT), Tejashwi Yadav (RJD), Abhishek Banerjee (TMC), Raghav Chadha (AAP), Javed Ali Khan… https://t.co/JrhGDqO74I pic.twitter.com/zPyGtxpdND — ANI (@ANI) September 1, 2023 ► సమావేశం జరగునున్న హోటల్ గదికి కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీలు హాజరయ్యారు. #WATCH | Maharashtra | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, party president Mallikarjun Kharge and MP Rahul Gandhi arrive at the venue of the meeting of INDIA alliance in Mumbai. pic.twitter.com/xOCth1XXm9 — ANI (@ANI) September 1, 2023 ► భేటీకి హాజరుకావడానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ముంబయిలోని హాయత్ హోటల్‌కు చేరుకున్నారు. #WATCH | Tamil Nadu CM and DMK leader MK Stalin arrives at the venue of the meeting of the INDIA alliance in Mumbai. pic.twitter.com/UNVMmvUGme — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి సమన్వయ కమిటీని నేడు ప్రకటించనున్నారు. అన్ని పార్టీల నుంచి ఒక అభ్యర్థి పేరు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూటమి నాయకులను కోరారు. Live: INDIA alliance meet Day 2 in Mumbai Live: Opposition bloc to unveil logo Read @ANI | https://t.co/OCbMsEp4Fp#INDIAAlliance #INDIA #OppositionMeeting pic.twitter.com/Tqotpp95UK — ANI Digital (@ani_digital) September 1, 2023 ముంబయి: 2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి 'ఇండియా' సన్నద్ధమవుతోంది. నేడు ముంబయి వేదికగా రెండో రోజు సమావేశం ముగిసింది. 28 పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన డిన్నర్ భేటీలో కూటమికి లోగోను ఎంపిక చేయడంతోపాటు సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. నేడు ప్రధానంగా మూడు అంశాల్లో తుది నిర్ణయం తీసుకున్నారు. ► సమన్వయ కమిటీతో పాటు ఎన్నికల ప్రచారం, ర్యాలీల నిర్వహణకు మరో నాలుగు బృందాలను నియమించనున్నారు. ఈ కమిటీ సభ్యులే సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతలను చేపట్టనున్నట్లు సమాచారం. ► అక్టోబర్ 2నాటికి ఇండియా కూటమి తన మేనిఫెస్టోని విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీకి హాజరైన నాయకులను కోరారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ధీటుగా కామన్ అజెండాను రూపొందించాలని కోరారు. ► కూటమికి లోగోను రూపొందిండంపై నేడు తుది నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఉమ్మడిగా అధికార ప్రతినిధిని కూడా నియమించనున్నారు. ఇండియా కూటమికి కన్వినర్ పదవిని నియమించాలా..? వద్దా..? అనే అంశంపై కూడా నేడు చర్చలు జరగనున్నాయి. ► నిన్న రాత్రి శివ సేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని డిన్నర్ భేటీలో కూటమి నాయకులందరు పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు రానున్నాయని కొందరు నాయకులు అంచనా వేశారు. ఎన్డీయే వేసే ఎత్తులకు ధీటైన జవాబు ఇవ్వాలని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ► ఇండియా కూటమి ముంబయిలో సమావేశమైన మొదటి రోజే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ అంశం కూడా నేడు కూటమి నాయకుల చర్చకు రానుంది. ► ఇండియా కూటమి మొదటి సమావేశం పాట్నాలో జరగగా.. రెండవసారి బెంగళూరు వేదికగా పూర్తయింది. మూడోసారి ముంబయి వేదికగా కూటమి నాయకులు హాజరయ్యారు. ఎన్నికల దగ్గర పడనున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే!
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ ఈ ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 41 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా అడుగుపెట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది. దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్–3 మిషన్ ఏమేం చేసింది? అనే వివరాలను ఇస్రో బహిర్గతం చేసింది. రోవర్ చాకచక్యం చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండర్ నుంచి రోవర్ విజయవంతంగా బయటికి వచ్చి తన కార్యాచరణ ప్రారంభించడం, చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు అనేవి మూడు ప్రధాన లక్ష్యాలు కాగా, ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ భూమిపైకి చేరవేసింది. అందరూ అనుకుంటున్నట్లు చంద్రుడు చల్లగా ఉండడని, ఉపరితలంపై 70 డిగ్రీల దాకా వేడి ఉంటుందని తేల్చింది. ఆగస్టు 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్‌ను పాటిస్తూ రోవర్ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ మిషన్‌కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరం. సాంకేతికంగా వాటికి ఇదే చివరి దశ. మిగిలిన ఏడు రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్ మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తాయి. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావాన్ని విశ్లేషిస్తుంది. చంద్రుడిపై ఉన్న దుమ్ము ధూళీ, రాళ్లలోని రసాయనిక సమ్మేళనాలను రోవర్ గుర్తిస్తుంది. చందమామ ఉపరితల వాతావరణం, ఉపరితలం లోపలి పరిస్థితుల గురించి సమాచారం అందిస్తుంది. ల్యాండర్ విక్రమ్‌లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై ప్రకంపనలు, ఉపరితలంపై ఉష్ణోగ్రతల స్థితిగతులు, ప్లాస్మాలో మార్పులను అధ్యయనం చేస్తాయి. చంద్రుడికి–భూమికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా లెక్కించడంలో ల్యాండర్‌లోని పేలోడ్లు సహకారం అందిస్తాయి. చంద్రుడిపై మట్టి స్వభావాన్ని విశ్లేషిం చడం, ఉష్ణోగ్రతలను గుర్తించడం అనేవి అత్యంత కీలకమైనవి. చందమామ దక్షిణ ధ్రువంలో చీకటి పడగానే 14 రోజులపాటు ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలకు పడిపోనుంది. ఈ అత్యల్ప ఉష్ణోగ్రతను తట్టుకొని పనిచేసేలా ల్యాండర్‌ను, రోవర్‌ను డిజైన్ చేయలేదు. ఉపరితలంపై సూర్యాస్తమయం కాగానే ఇవి పనిచేయడం ఆగిపోతుంది. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ చంద్రయాన్–3 మిషన్ ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదు. ఎవరూ చూడని జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి కీలక సమాచారం అందించింది. చంద్రయాన్–3 చివరి దశలోకి ప్రవేశించడంతో ఇక ల్యాండర్, రోవర్ అందించే సమాచారం కోసం ప్రపంచ దేశాలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాయి. చంద్రయాన్–3 విజయంపై కేబినెట్ ప్రశంస చందమామపై చంద్రయాన్–3 ల్యాండర్ విక్రమ్ క్షేమంగా దిగడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం తీర్మానం ఆమోదించింది. ఇది కేవలం ‘ఇస్రో’ విజయం మాత్రమే కాదని, దేశ ప్రగతికి, అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న దేశ గౌరవ ప్రతిష్టలకు నిదర్శనమని కొనియాడింది. ఆగస్టు 23వ తేదీని ‘నేషనల్ స్పేస్ డే’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతించింది. చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోను మంత్రివర్గం అభినందించిందని, సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. -
నెలాఖరులోగా గురుకుల పరీక్షల తుది ‘కీ’లు!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వడివడిగా సాగుతోంది. తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో అర్హత పరీక్షలను కేవలం మూడు వారాల వ్యవధిలో నిర్వహించి రికార్డు సృష్టించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ).. చివరి పరీక్ష రోజునే ప్రాథమిక కీలను విడుదల చేసింది. తాజాగా ‘ఫైనల్ కీ’(తుది జవాబు పత్రం) తయారీలో గురుకుల బోర్డు నిమగ్నమైంది. దాదాపు 56 కేటగిరీలకు సంబంధించి 19 రోజుల పాటు రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించింది. శనివారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. ఆన్లైన్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించేందుకు బోర్డు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అభ్యర్థుల అభ్యంతరాలను తగిన ఆధారాలతో పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఫైనల్ కీలను తయారుచేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు టీఆర్‌ఈఐఆర్‌బీ కసరత్తు వేగవంతం చేసింది. ఈనెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా గురుకుల బోర్డు కసరత్తు చేస్తోంది. అవరోహణ క్రమంలో నియామకాలు గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగాలకు వెబ్‌నోట్ జారీ చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ఆ తర్వాత జారీ చేసిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ల ప్రకారం 9,210 పోస్టులకు మాత్రమే ప్రకటనలను పరిమితం చేసింది. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అర్హత పరీక్షలు జరిగాయి. సగటున 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ కేటగిరీలు మినహా మిగతా అన్ని కేటగిరీల్లోని అర్హత పరీక్షల ప్రాథమిక కీలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఈ మూడు కేటగిరీల కీలను విడుదల చేయలేదు. ఈ నెలాఖరులో తుది కీలను ఖరారు చేసి, అదేరోజున అభ్యర్థులు సాధించిన మార్కులను కూడా వెబ్సైట్లో పెడతారు. గురుకుల సొసైటీల్లో ఉద్యోగాల భర్తీకి బోర్డు అవరోహణ విధానాన్ని ఎంచుకుంది. ముందుగా పైస్థాయి పోస్టులను భర్తీ చేస్తూ క్రమంగా కింది స్థాయిలో పోస్టుల నియామకాలను ముగిస్తుంది. ఈ క్రమంలో తొలుత డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేస్తారు. ప్రస్తుతం తుది కీలను విడుదల చేసి మార్కులు ప్రకటించిన తర్వాత అర్హతల ఆధారంగా డీఎల్, జేఎల్ పోస్టులకు డెమో పరీక్షలు సైతం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అతి త్వరలో తేదీలను ఖరారు చేసే దిశగా గురుకుల బోర్డు చర్యలు వేగవంతం చేసింది. -
Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా?
అక్షయ తృతీయ హిందువులకు పవిత్రమైన రోజు. దీన్ని అఖ తీజ్ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అందుకే ఈ రోజున బంగారం కొంటే అంతులేని సిరి సంపదలు కలుగుతాయని భావిస్తారు. అయితే ఏప్రిల్ 1 నుంచి బంగారు వస్తువులు, ఆభరణాల కొనుగోలుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు మోసపోకుండా గమనించాల్సిన విషయాలు తెలుసుకోవడం అవసరం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID) లేకుండా బంగారు ఆభరణాలు విక్రయించడాన్ని నిషేధించింది. బంగారం స్వచ్ఛతను పరిశీలించడం ఎలా? HUID హాల్‌మార్క్ 3 మార్కులను కలిగి ఉంటుంది. BIS లోగో, బంగారం స్వచ్ఛత, ఆరు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID ఉంటాయి. ఒక్కో బంగారు వస్తువు లేదా ఆభరణానికి ఒక్కో విశిష్టమైన ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఉంటుంది. BIS లోగో BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ప్రతి బంగారు వస్తువు, ఆభరణంపైనా BIS లోగో ఉంటుంది. ఇది ఉంటే ఆ ఆభరణం BIS అధీకృత ల్యాబ్‌లో పరీక్షించి ధ్రువీకరించినట్లు అర్థం. కొనుగోలుదారులు బంగారు ఆభరణంపైనా ఈ లోగో ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. భారతదేశంలోని బంగారు వస్తువులు, ఆభరణాల స్వచ్ఛతను ధ్రువీకరించే ఏకైక సంస్థ BIS. స్వచ్ఛత గ్రేడ్ ఆభరణాలలో స్వచ్ఛమైన బంగారాన్ని ధ్రువీకరించే మరో గుర్తు ఫైన్నెస్ నంబర్, క్యారెట్ (KT లేదా Kగా పేర్కొంటారు). వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కూడిన బంగారు మిశ్రమాలలో నాణ్యతను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే 24 క్యారెట్ల బంగారం చాలా మృదువైనది కావడంతో ఆభరణాల కోసం ఇతర లోహాలను దీనికి కలుపుతారు. 916 అనేది ఫైన్నెస్ నంబర్. 22 క్యారెట్ల బంగారానికి మరో పదం. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల బరువు ఉంటే అందులో 91.6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ (HUID) బంగారు ఆభరణాలను అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్లో మాన్యువల్‌గా ప్రత్యేక నంబర్‌తో స్టాంప్ చేస్తారు. ప్రతి ఆభరణానికి ప్రత్యేకమైన HUID ఉంటుంది. ఇది విశ్వసనీయతకు కీలకం. పాత బంగారు ఆభరణాలు? ఇది వరకే ఉన్న నిబంధనల ప్రకారం.. వినియోగదారుల వద్ద ఉన్న పాత హాల్‌మార్క్ ఆభరణాలు కూడా చెల్లుబాటులో ఉంటాయి. BIS రూల్స్ 2018 సెక్షన్ 49 ప్రకారం.. ఆభరణాలపై పేర్కొన్న దానికంటే తక్కువ స్వచ్ఛతతో ఉన్నట్లు గుర్తించినట్లయితే కొనుగోలుదారులు నష్టపరిహారం పొందవచ్చు. -
లగ్జరీ బీఎండబ్ల్యూ.. తాళంచెవి లేకున్నా స్టార్ట్ చేయొచ్చు.. షావోమీ కీలక ప్రకటన
స్మార్ట్‌ఫోన్ కంపెనీలు లగ్జరీ కార్లకు డిజిటల్ కీలు రూపొందించే పనిలో పడ్డాయి. యాపిల్ సంస్థ ఇలాంటి కార్ కీ ఫీచర్‌ను 2020లోనే ప్రకటించింది. ఆ తర్వాత ఒప్పో, వన్‌ప్లస్, వివోలు కూడా కొన్ని రోజుల క్రితం డిజిటల్ కీలను విడుదల చేశాయి. తాజాగా షావోమీ ప్రీమియం లగ్జరీ బీఎండబ్ల్యూ కార్లకు డిజిటల్ కీ రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో షావోమీ 13 సిరీస్ ప్రకటన సందర్భంగా ఆ కంపెనీ అధికార ప్రతినిధి ఈ మేరకు ప్రకటించారు. ఎంపిక చేసిన బీఎండబ్ల్యూ మోడళ్లకు డిజిటల్ కీలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: వన్ ప్లస్ 11 కాన్సెప్ట్ ఫోన్ ఫస్ట్ లుక్.. లిక్విడ్ కూలింగ్ ఫీచర్ అదుర్స్!) ఈ డిజిటల్ కీలను కార్లను లాక్, అన్‌లాక్‌తో పాటు స్టార్ట్ కూడా చేయొచ్చు. ముఖ్యంగా కారును వేరొకరికి ఇచ్చినప్పుడు ఈ డిజిటల్ కీ బాగా ఉపయోగపడుతుంది. వారికి అసలైన కీ ఇవ్వాల్సిన పని లేకుండా కేవలం డిజిటల్ కీని మొబైల్ ద్వారా షేర్ చేయొచ్చు. ఈ డిజిటల్ కీని గూగుల్ వాలెట్ వంటి వాటితో అనుసంధానించనున్నారు. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) -
పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు
-
ముందస్తు ఎన్నికలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
-
అమిత్ షా తో సీఎం వైఎస్ జగన్ చర్చించిన అంశాలు ఇవే
-
వెన్నుపోటు ఎపిసోడ్ పై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
-
కాపు రిజర్వేషన్లపై తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కీలక వ్యాఖ్యలు
-
కిచెన్ రూమ్ తాళం చెవి ఇవ్వలేదని.. భార్యపై కత్తెరతో దాడి
సాక్షి, హైదరాబాద్: కిచెన్ రూమ్ తాళం చెవి ఇవ్వలేదనే అక్కసుతో భార్యపై భర్త దాడి చేసిన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. హిమాయత్‌నగర్ రత్నదీప్ సూపర్ మార్కెట్ సమీపంలో నివాసం ఉండే వినయ్ తన భార్య సీతల్ ఆగర్వాల్ కిచెన్‌రూమ్ తాళం చెవి ఇవ్వాలని అడిగాడు. ఆమె తాళం చెవి ఇవ్వకపోవడంతో కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో సమీపంలో ఉన్న కత్తెరతో సీతల్‌పై దాడి చేస్తుండగా ఇంట్లోనే ఉన్న కుమార్తె అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెపై సైతం దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన తల్లి, కుమార్తె స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అకారణంగా తమపై దాడికి పాల్పడిన తన భర్త వినయ్‌పై చర్యలు తీసుకోవాలని సీతల్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక అరెస్ట్
-
డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
-
కీహోల్ ద్వారా.. ఆర్చరీలో అరుదైన రికార్డు..
-
కరెంటు తీగలపై కారు తాళాలు తీస్తూ వ్యక్తి దుర్మరణం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): విద్యుత్ తీగపై పడిన కారు తాళాన్ని తీస్తున్న వ్యక్తికి తీగలు తగలడంతో షాక్ కొట్టి ప్రాణాలు వదిలాడు. ఈ దుర్ఘటన హాసన్ పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు... ఉదయగిరికి చెందిన మల్లప్ప ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నాడు. ఆయన ఇంటి రెండో అంతస్తులో ఉంటాడు. ఏమైందో కానీ ఆయన కారు తాళాలు ఇంటి ముందు వెళ్లే కరెంట్ తీగపై పడ్డాయి. ఇంట్లో చెత్తను ఊడ్చే ఇనుప కడ్డీతో తాళాలను తీసేందుకు యత్నించాడు. ఆ ఇనుప రాడ్ కరెంటు తీగలను తాకగానే పెద్ద మెరుపుతో కూడిన మంటలు వచ్చి షాక్ కొట్టింది. మల్లప్ప అక్కడికక్కడే మరణించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై బడావణె పోలీసులు కేసు నమోదు చేశారు. ఇనుప కడ్డికీ కరెంట్ తగిలితే ప్రమాదమని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? అని ప్రజలు ఆశ్చర్యపోయారు. చదవండి: (బెంగళూరులో పెరిగిన సహజీవనం కల్చర్.. బాధితులంతా వారే) -
వారాంతంలో గ్రూప్–1 ప్రిలిమినరీ కీ.. కసరత్తు చేస్తున్న టీఎస్పీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని ఈ వారాంతంలో విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వేగవంతం కసరత్తు చేస్తోంది. ప్రాథమిక కీ విడుదలకు ముందే అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను వారి ఓటీఆర్ లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటివరకు 60 శాతం స్కానింగ్ పూర్తయినట్లు సమాచారం. దీపావళి పండుగ తర్వాత స్కానింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి శనివారం నాటికి ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 16న 1,019 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో 75 శాతం మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. శుక్రవారం నాటికి స్కానింగ్ పూర్తి! ఈనెల 16న పరీక్ష నిర్వహించిన టీఎస్పీఎస్సీ... 18వ తేదీ నుంచి ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించింది. కమిషన్ ఆధ్వర్యంలోని సాంకేతిక విభాగం సామర్థ్యం ప్రకారం అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్‌కు కనీసం ఎనిమిది పని దినాల గడువు పడుతుందని అంచనావేసి ప్రకటించింది. శుక్రవారం నాటికి స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. స్కానింగ్ పూర్తయిన వెంటనే అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల కాపీలను వారి ఓటీఆర్ లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి.. దానిపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించిన తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు. చదవండి: కాలుష్యానికి చెక్.. ఇక హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులే..! -
పుతిన్ మిత్రుడు గుండెపోటుతో ఆకస్మిక మృతి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అత్యంత సన్నిహిత మిత్రుడు వ్లాదిమిర్ సుంగోర్కిన్ నికోలెవిచ్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన ఖబరోవ్స్క్ పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతను మృతి చెందే సమయంలో తన సహచరుడు లియోనిడ్ జఖారోవ్తో కలిసి ఉన్నట్లు సమాచారం. రష్యన్ అన్వేషకుడు, ఫార్ ఈస్ట్ పుస్తక రచయిత అయిన వ్లాదిమిర్ అర్సెనీవ్కి సంబంధించిన ఒక పుస్తకాన్ని సేకరించడం కోసం ఖబరోవ్స్క్ పర్యటిస్తున్న సమయంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసకుంది. సుంగోర్కిన్ రష్యన్ ప్రభుత్వ పత్రిక ప్రావ్దా ఎడిటర్ ఇన్ చీఫ్. ఈ మేరకు సుంగోర్కిన్ మిత్రుడు జఖారోవ్ మాట్లాడుతూ...ఆ రోజు భోజనం చేద్దాం అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా సుంగోర్కిన్ అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడుతుంటే...గాలిలోకి తీసువెళ్లాం. కానీ కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో తాము హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. ఐతే డాక్టర్లు సుంగోర్కిన్ గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఆయన మరణం రష్యన్ జర్నలిజానికి తీరని లోటు అని అన్నారు. సంగోర్కిన్ తన వృత్తిపరమైన నీతికి, విధేయతకు కట్టుబడి ఉన్న గొప్ప వ్యక్తి అని కన్నీటి పర్యంతమయ్యారు. సుంగోర్కిన్1997 నుంచి ఎడిటర్ ఇన్ చీఫ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఇటీవలే రష్యన్ వ్యాపరవేత్త, ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ ఇవాన్ పెచోరిన్ అనుమానస్పద స్థితిలో మరణించిన కొద్దిరోజులకే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పుతిన్ పై హత్య ప్రయోగం జరిగిందంటూ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇలా ప్రముఖులు వరుసగా హఠాత్తుగా మృతి చెందడం బాధాకరం.