ఇష్టపడి కారు కొంటున్నారా.. భవిష్యత్తు ప్రమాదాల దృష్ట్యా వాహనబీమా కూడా చేయిస్తుంటారు కదా. ప్రమాదశాత్తు మీ కారు కీ పోయిందనుకోండి. ఏం చేస్తారు.. ‘ఏముంది నకిలీ కీ తయారు చేయిస్తాం’ అంటారా.. అయితే మీకు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ వర్తించదనే సంగతి తెలుసా? నకిలీ కీ ఉంటే బీమా ఎందుకు రాదో.. కీ పోయినా బీమా వర్తించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
ముప్పే ఏళ్ల కిందట సైకిల్ వినియోగిస్తే మహాగొప్ప. బైక్ ఉందంటే సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం ఉండేది. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం సైకిల్, బైక్‌ను ఎవరూ పట్టించుకోవడంలేదు. దాదాపు చాలామంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. కారు కొనే సమయంలో కంపెనీలు వాహనబీమా ఇస్తుంటాయి. అయితే అనుకోకుండా కారు కీ పోయిందనుకోండి. వెంటనే దాని నకిలీ తయారు చేయించి వాడుతుంటారు. కారు ఏదైనా ప్రమాదంబారిన పడినప్పుడు బీమా క్లెయిమ్ చేయడానికి వెళ్తారు. కానీ బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను రెజెక్ట్ చేస్తుంది. మీరు నకిలీ కీ వాడుతున్నట్లు రుజువవుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటుంది.
ఇదీ చదవండి: పెరుగుతున్న ప్రైవేట్ మూలధన వ్యయం
వాహన బీమా తీసుకునేప్పుడే ‘కారు కీ రీప్లేస్‌మెంట్’ యాడ్‌ఆన్ సర్వీసును తీసుకోవాలి. అందుకోసం కంపెనీను బట్టి రూ.250-రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీసును ఎంచుకుని ఉంటే ఒకవేళ భవిష్యత్తులో కారు కీ పోయినా దాన్ని కంపెనీ రీప్లేస్ చేస్తుంది. అలా రీప్లేస్ చేసిన కీ వాడుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా కంపెనీ బీమాను క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కీ రీప్లేస్‌మెంట్ యాడ్‌ఆన్ సర్వీసును ఎంచుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment