Insurence
-
వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్!
ఇష్టపడి కారు కొంటున్నారా.. భవిష్యత్తు ప్రమాదాల దృష్ట్యా వాహనబీమా కూడా చేయిస్తుంటారు కదా. ప్రమాదశాత్తు మీ కారు కీ పోయిందనుకోండి. ఏం చేస్తారు.. ‘ఏముంది నకిలీ కీ తయారు చేయిస్తాం’ అంటారా.. అయితే మీకు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ వర్తించదనే సంగతి తెలుసా? నకిలీ కీ ఉంటే బీమా ఎందుకు రాదో.. కీ పోయినా బీమా వర్తించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.ముప్పే ఏళ్ల కిందట సైకిల్ వినియోగిస్తే మహాగొప్ప. బైక్ ఉందంటే సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం ఉండేది. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం సైకిల్, బైక్‌ను ఎవరూ పట్టించుకోవడంలేదు. దాదాపు చాలామంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. కారు కొనే సమయంలో కంపెనీలు వాహనబీమా ఇస్తుంటాయి. అయితే అనుకోకుండా కారు కీ పోయిందనుకోండి. వెంటనే దాని నకిలీ తయారు చేయించి వాడుతుంటారు. కారు ఏదైనా ప్రమాదంబారిన పడినప్పుడు బీమా క్లెయిమ్ చేయడానికి వెళ్తారు. కానీ బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను రెజెక్ట్ చేస్తుంది. మీరు నకిలీ కీ వాడుతున్నట్లు రుజువవుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటుంది.ఇదీ చదవండి: పెరుగుతున్న ప్రైవేట్ మూలధన వ్యయంవాహన బీమా తీసుకునేప్పుడే ‘కారు కీ రీప్లేస్మెంట్’ యాడ్ఆన్ సర్వీసును తీసుకోవాలి. అందుకోసం కంపెనీను బట్టి రూ.250-రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీసును ఎంచుకుని ఉంటే ఒకవేళ భవిష్యత్తులో కారు కీ పోయినా దాన్ని కంపెనీ రీప్లేస్ చేస్తుంది. అలా రీప్లేస్ చేసిన కీ వాడుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా కంపెనీ బీమాను క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కీ రీప్లేస్మెంట్ యాడ్ఆన్ సర్వీసును ఎంచుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు. -
జ్యురిక్ చేతికి కొటక్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: కొటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 70 శాతం వాటాను జ్యురిక్ ఇన్సూరెన్స్ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 5,560 కోట్లుగా కొటక్ మహీంద్రా బ్యాంక్ పేర్కొంది. సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి జ్యురిక్ 70 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు తెలియజేసింది. దీంతో విదేశీ యాజమాన్య వాటాను 74 శాతం వరకూ అనుమతించిన తర్వాత దేశీయంగా జనరల్ ఇన్సూరెన్స్‌లో ప్రవేశించిన తొలి విదేశీ కంపెనీగా జ్యురిక్ నిలిచినట్లు పేర్కొంది. 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతూ 2021లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనలను సవరించిన సంగతి తెలిసిందే. 30 శాతం బ్యాంక్ చేతిలో కొటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో మిగిలిన 30% వాటాను ప్రస్తుతం కొటక్ మహీంద్రా బ్యాంక్ కలిగి ఉంది. మరోపక్క మెజారిటీ వాటా కొనుగోలుతో సంస్థ పేరు జ్యురిక్ కొటక్ జనరల్ ఇన్సూరెన్స్‌గా మారినట్లు జ్యురిక్ ఇన్సూరెన్స్ పేర్కొంది. -
పాలసీదారులను మోసం చేస్తున్న బీమా ప్లాట్‌ఫామ్‌లు
ఆన్లైన్ బీమా ప్లాట్‌ఫామ్‌లు పాలసీ సమయంలో మోసపూరిత పద్ధతులను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 36వేల మంది పాలసీదారులు ఈ సర్వేలో పాల్గొన్నారని సంస్థ తెలిపింది. ఇందులో 66 శాతం మంది పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నట్లు చెప్పింది. 49% మంది టైర్ 1 సిటీ నుంచి, 24% మంది టైర్ 2 సిటీ, 27% మంది టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు సర్వేలో పాల్గొన్నట్లు లోకల్‌సర్కిల్స్ తెలియజేసింది.సర్వేలోని వివరాల ప్రకారం.. ఆన్లైన్ బీమాను కొనుగోలు చేసిన 61 శాతం మంది ‘సబ్స్క్రిప్షన్ ట్రాప్’లో పడుతున్నారు. తర్వాత తమ పాలసీని రద్దు చేసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. 86% బీమా ప్లాట్‌ఫారమ్‌లు తరచూ ‘నగ్గింగ్’ విధానాన్ని ఉపయోగిస్తున్నాయి. పాలసీని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సరైన పరిష్కారం చూపకుండా సందేశాలతో సమాధానమిస్తున్నాయి. 57% మంది పాలసీదారుల నుంచి ఆన్లైన్ బీమా ప్లాట్‌ఫామ్‌లు అనవసరమైన వ్యక్తిగత వివరాలు కోరుతున్నాయి. ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి.‘జీవిత బీమా, ఆరోగ్య బీమా, మోటారు, ఆస్తి.. వంటి బీమా పాలసీలను అమ్మేప్పుడు పాలసీదారులకు ఏజెంట్లు పూర్తి వివరాలు తెలియజేయడం లేదు. తమ టార్గెట్లు చేరుకోవాలనే ప్రయత్నంలో ఎక్కువ ఇన్సెంటివ్ ఉన్నవాటికే ఏజెంట్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులోని పరిమితులు, నిబంధనలను చెప్పడంలేదు. పాలసీదారులు కూడా ఆ ‘టర్మ్స్ అండ్ కండిషన్’ పత్రాలను పూర్తిగా చదవకుండానే పూర్తిగా ఏజెంట్‌ను నమ్మి బీమా తీసుకుంటున్నారు. ఏదైనా ఒక పాలసీ పరిమిత కాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇస్తూ లేనిఅత్యవసరాన్ని సృష్టిస్తున్నారు’ అని లోకల్ సర్కిల్స్ తెలిపింది.ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీమా రెన్యువల్, రద్దుకు సంబంధించిన ఫిర్యాదులు అధికమవుతున్నాయని నివేదిక తెలిపింది. గత 9 నెలల్లో ఆన్లైన్ బీమా ప్లాట్‌ఫామ్‌లపై మిస్ సెల్లింగ్, మానిప్యులేటివ్ సెల్లింగ్ ఫిర్యాదులు ఎక్కువయ్యాయని సర్వే ద్వారా తెలిసింది.ఇదీ చదవండి: ట్రక్‌ట్యాక్సీను ఢీకొట్టిన 180 మంది ప్రయాణిస్తున్న విమానం!ఆన్లైన్ బీమా ప్లాట్‌ఫామ్‌లు పాటించకూడని 13 అంశాలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతేడాది నవంబర్‌లో నిషేధం విధించినట్లు నివేదిక తెలిపింది. అందులో ప్రధానంగా అత్యవసరాన్ని సృష్టించడం, వినియోగదారులకు పాలసీ లేదంటూ హేళన చేయడం, బలవంతంగా పాలసీని కట్టబెట్టడం, సబ్స్క్రిప్షన్ ట్రాప్, ప్లాన్ ధర తగ్గినట్లు చూపడం, అస్పష్టమైన ప్రకటనలు.. వంటి అంశాలపై నిషేధం విధించారు. -
ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలు
ఆరోగ్య బీమా రంగ సంస్థలు పాలసీదారులకు షాకివ్వబోతున్నాయి. గతేడాదిగా పాలసీ ప్రీమియంను దాదాపు 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రీమియం ఛార్జీలు పెంచకతప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరగగా..వచ్చే కొన్ని నెలల్లో మరో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని లోకల్‌సర్కిల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో 11 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 21 శాతం మంది ప్రీమియం 50 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించగా..31 శాతం మంది 25-50 శాతం వరకు పెరిగాయని తెలిపారు.ప్రీమియం అధికమవడంతో సామాన్యులు ఆరోగ్య పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. 2022లో 62 శాతంగా ఉన్న పాలసీదారులు 2023లో 52 శాతానికి తగ్గారు. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా కంపెనీలు రికార్డు స్థాయిలో లాభాలు పొందుతున్నాయి. వాటి సరాసరి వార్షిక వృద్ధిరేటు 20 శాతంగా నమోదవుతుంది. కరోనాతో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, క్రమంగా తగ్గుతోంది. -
బీమా.. నడిపినోళ్లకు నడిపినంత!
గుప్తా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఢిల్లీలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. వారానికి రెండు రోజులు ఆఫీస్‌కు వెళ్లి వస్తుంటాడు. మూడు రోజులు ఇంటి నుంచే పనిచేస్తుంటాడు. ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో నివాసం ఉంటున్నాడు. ఆఫీస్‌కు వెళ్లి వచ్చే సమయంలోనే అతడు కారును ఉపయోగిస్తుంటాడు. తన నివాసం నుంచి ఆఫీస్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 30 ఏళ్ల మణి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంటాడు. రోజూ ఢిల్లీ నుంచి గురుగ్రామ్‌కు వెళ్లి రావడం అతడు ఉద్యోగంలో భాగం. అంతేకాదు, వారాంతంలో దూర ప్రయాణాలు (లాంగ్ డ్రైవ్) చేయడం అతడికి హాబీ. దీంతో ఏటా 30,000 కిలోమీటర్ల మేర అతడు ప్రయాణం చేస్తుంటాడు. కానీ, గుప్తా ఏడాది మొత్తం తిరిగేది 4,000 కిలోమీటర్లు మించదు. వీరిలో రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? సాధారణంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ప్రమాదాల రిస్క్ ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి రిస్క్ ఉంటుంది. కానీ, ఇక్కడ ఇద్దరూ తమ కారు కోసం ఏటా చెల్లిస్తున్నది ఒకే రకమైన ప్రీమియం. నియమ నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ, పరిమిత వేగంతో, తక్కువ దూరం ప్రయాణించే వారిని.. ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిని ఒకే గాటన కట్టడం సహేతుకంగా అనిపించదు. అందుకే నడిపినంత దూరానికే, నడిపే తీరు ఆధారంగా ప్రీమియం చెల్లించే సదుపాయాన్ని బీమా సంస్థలు తీసుకొచ్చాయి. ‘‘రోజూ ఎక్కువ దూరం పాటు ప్రయాణించే వారు, దూర ప్రయాణాలకు తరచుగా వెళ్లే వారితో పోలిస్తే తక్కువ ప్రీమియం చెల్లించడానికే నా ప్రాధాన్యం. ఎందుకంటే నేను కారులో తిరిగేది చాలా తక్కువ దూరం. పైగా నేను ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను. అందుకే నేను చెల్లించే బీమా ప్రీమియం తక్కువగా ఉండాలని కోరుకున్నాను’’అని గుప్తా తెలిపారు. అందుకే ఆయన ‘పే యాజ్ యూ డ్రైవ్’ (పీఏవైడీ), ‘పే హౌ యూ యూజ్’ (పీహెచ్ఐయూ) యాడాన్స్ను ఎంపిక చేసుకుని, గతంతో పోలిస్తే తక్కువ ప్రీమియం చెల్లిస్తున్నారు. గుప్తా వంటి వారికి ఇప్పుడు పీఏవైడీ పాలసీలు ఒక మంచి ఎంపికగా, ఆకర్షణీయంగా మారాయనడంలో సందేహం లేదు. వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుందన్న దాని ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియం వసూలు చేయడం ఈ పాలసీల్లో ఉన్న వెసులుబాటు. అందుకే తక్కువ నడిపే వారికి, జాగ్రత్తగా నడిపే వారికి ఇవి పెద్ద ఊరటనిస్తున్నాయి. ఈ పీఏవైడీ, పీహెచ్యూఐ పాలసీలు ఎలా పనిచేస్తాయి? వీటిని తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు? ఈ వివరాలను అందించే కథనమే ఇది. నేపథ్యం.. మోటార్ బీమా పాలసీలకు సంబంధించి టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను ప్రవేశపెట్టేందుకు బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) 2022 జూలైలో అనుమతించింది. వినియోగ ఆధారిత వాహన బీమా ప్లాన్లు, రైడర్లు ఆ తర్వాత నుంచి మార్కెట్ ప్రవేశం చేశాయి. టెలీమ్యాటిక్స్ డివైజ్‌లు/గ్యాడ్జెట్ల (పరికరాలు) సాయంతో వాహన వినియోగాన్ని అంచనా వేసి, ఆ మేరకు ప్రీమియాన్ని సాధారణ బీమా సంస్థలు వసూలు చేస్తున్నాయి. కారు నడిపే తీరును కూడా అవి ఈ పరికరాల ద్వారా పరిశీలిస్తాయి. దీంతో సంబంధిత వాహనదారుడి డ్రైవింగ్ తీరు, దూరంపై బీమా కంపెనీలకు కచి్చతమైన సమాచారం లభిస్తుంది. వీటిని విశ్లేషించిన అనంతరం, రిస్క్ ఆధారంగా ప్రీమియం నిర్ణయిస్తాయి. పీఏవైడీ ప్లాన్ల/రైడర్లలో వాహనం తక్కువ నడిపే వారికి ప్రీమియం భారం ఎలా అయితే తగ్గుతుందో.. వాహనం ఎక్కువగా వినియోగించే వారికి ప్రీమియం భారం పెరుగుతుంది. పీఏవైడీ, పీహెచ్ఐయూ యాడాన్లుగా లభిస్తాయి. ప్రస్తుత ప్లాన్‌కు అనుసంధానంగా తీసుకోవచ్చు. రెన్యువల్ సమయంలో బీమా కంపెనీకి ఈ విషయాన్ని చెబితే చాలు. బీమా ఏజెంట్ లేదంటే నేరుగా బీమా కంపెనీ పోర్టల్ నుంచే వీటిని తీసుకోవచ్చు. దరఖాస్తు పత్రాన్ని నింపి, అప్పటికే కలిగి ఉన్న బీమా ప్లాన్ వివరాలను సమరి్పస్తే చాలు. దూరం ఆధారంగా.. పాలసీ కొనుగోలు సమయంలో ఎంపిక చేసుకున్న కిలోమీటర్ల ఆధారంగా పీఏవైడీ పాలసీల ప్రీమియం ఆధారపడి ఉంటుంది. పలు రకాల ప్రీమియం శ్లాబులు ఉంటాయి. వీటి నుంచి పాలసీదారుడు ఎంపిక చేసుకోవచ్చు. ‘‘మన దేశంలో టెలీమ్యాటిక్స్ డివైజ్‌లు కేవలం కొన్ని రకాల కార్ల మోడళ్లకే అందుబాటులో ఉన్నాయి. అందుకని మేము తీసుకొచి్చన పాలసీలో, ఓడోమీటర్ సాయంతో దూరాన్ని లెక్కిస్తున్నాం. ఓడోమీటర్ రీడింగ్‌ను టెలీమ్యాటిక్స్ డివైజ్ లేదంటే మొబైల్ యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు’’అని హెచ్డీఎఫ్సీ ఎర్గో రిటైల్ బిజినెస్ ప్రెసిడెంట్ పార్థానిల్ ఘోష్ తెలిపారు. సాధారణ ప్రీమియంతో పోలిస్తే బీమా సంస్థలు పీఏవైడీ ప్లాన్ కింద.. 2,500 కిలోమీటర్ల వరకు తిరిగే కార్లకు ప్రీమియంలో 25 శాతం తగ్గింపునిస్తున్నాయి. ఏడాదికి 2,501 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్ల దూరానికి 17.50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఇక 5,001–7,000 కిలోమీటర్ల పరిధిలో తిరిగే వాహనాలకు ప్రీమియంలో 10 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. 7,501–10,000 కిలోమీటర్ల దూరం నడిచే కార్లకు ప్రీమియంలో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఏడాదికి 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పాటు నడిచే కార్లకు ప్రీమియంలో ఎలాంటి రాయితీ ఉండదు. పాలసీ కొనుగోలు చేసే సమయంలో ఉన్న ఓడోమీటర్ రీడింగ్‌ను బీమా సంస్థలు నమోదు చేస్తాయి. తిరిగి రెన్యువల్ సమయానికి తిరిగిన దూరం ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తాయి. ‘‘ఇలా ఏడాదిలో తిరిగిన దూరం ఆధారంగా మరుసటి ఏడాది ప్రీమియంలో బీమా కంపెనీలు తగ్గింపును ఇస్తాయి. ఒకవేళ పాలసీదారుడు అదే కంపెనీ వద్ద రెన్యువల్ చేసుకోకుండా, మరొక కంపెనీ వద్ద పాలసీ తీసుకున్నా సరే, గడిచిన ఏడాదికి సంబంధించిన డిస్కౌంట్‌ను నెఫ్ట్ ద్వారా పాలసీదారు ఖాతాకు బదిలీ చేస్తాయి. అదే కంపెనీతో కొనసాగితే రెన్యువల్ ప్రీమియంలో తగ్గించి, మిగిలినది చెల్లిస్తే సరిపోతుంది’’అని పార్థానిల్ ఘోష్ వివరించారు. పాలసీ తీసుకునే సమయంలో ఎంపిక చేసుకున్న కిలోమీటర్లను ఏడాది కాక ముందే అధిగమించేశారనుకుంటే, అప్పుడు టాపప్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏడాదికి 6,000 కిలోమీటర్ల కోసం పాలసీ తీసుకుని, రెన్యువల్ గడువుకు ముందే ఈ దూరం దాటేస్తే, అప్పుడు దీన్ని పెంచుకోవచ్చు. ‘‘ఒకటికి మించిన కార్లు ఉన్నవారు లేదా తక్కువ దూరం ప్రయాణించే వారికి పీఏవైడీ ప్లాన్లు మంచి ప్రయోజనాన్నిస్తాయి. ప్రీమియంలో తగ్గింపు అనేది కారు మోడల్, దాని వయసు, రిజి్రస్టేషన్ అయిన ప్రాంతం ఆధారంగా నిర్ణయం అవుతుంది. కొన్ని బీమా సంస్థలు రెన్యువల్ సమయంలో అదనపు రివార్డులను కూడా ఇస్తున్నాయి. పాలసీ సంవత్సరంలో కారు తక్కువ వినియోగిస్తాననే స్పష్టత యజమానికి ఉంటే, వాస్తంగా వినియోగించుకున్న మేరకే ప్రీమియం చెల్లించడం సహేతుకంగా ఉంటుంది’’అని పాలసీబజార్ మోటార్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల హెడ్ ఆకర్‡్ష శర్మ సూచించారు. నడిపే తీరు కూడా ముఖ్యమే గుప్తా మాదిరే తాము కూడా డ్రైవింగ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తామని అనుకునే వారు ‘పే హౌ యూ యూజ్’ (పీహెచ్ఐయూ) ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో వాహనం నడిపే తీరు ఆధారంగా ప్రీమియం చార్జ్ చేస్తారు. పీఏవైడీ మాదిరే, పీహెచ్వైయూ (పే హౌ యు యూజ్) కూడా యాడాన్‌గా వస్తోంది. ‘‘నడిపే తీరు ఆధారితంగా ఆల్గోరిథమ్ ఇంటర్నల్ స్కోర్‌ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా అండర్‌రైటర్స్ (బీమా అధికారులు) ప్రీమియంను కచి్చతంగా లెక్కిస్తారు. దేశంలో కనెక్టెడ్ కార్లను ప్రారంభించడం పీఏవైడీ ఆఫర్ చేయడానికి అనుకూలం. అవి డ్రైవింగ్ తీరుపై బీమా సంస్థలకు నాణ్యమైన సమాచారాన్ని ఇస్తాయి’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ మోటార్ డి్రస్టిబ్యూషన్ హెడ్ సుభాశిష్ మజుందార్ తెలిపారు. కనెక్టెడ్ కార్స్ అంటే ఇంటర్నెట్తో అనుసంధానమైనవి. వీటిల్లో కమ్యూనికేషన్ డివైజ్‌లు, సెన్సార్లు కూడా ఉంటాయి. ఈ ప్లాన్లను తమకు కావాల్సిన విధంగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. పాలసీని ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. జునో జనరల్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్న ‘స్విచ్’ అనేది ఆన్ డిమాండ్ పాలసీ. పట్టణానికి వెలుపల ఉండి, కారును నడపని సమయంలో పాలసీని ఆఫ్ చేసుకోవచ్చు. దీనివల్ల బీమా ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు. కానీ, ఇలా ఆఫ్ చేసుకున్న సమయంలో కారుకు ఏదైనా నష్టం ఏర్పడితే అందుకు బీమా కంపెనీ నుంచి పరిహారం రాదని (కొన్ని మినహాయింపులు) గుర్తుంచుకోవాలి. కస్టమర్ కారు నడుపుతున్న తీరు ఆధారంగా డ్రైవింగ్ స్కోర్‌ను బీమా సంస్థలు కేటాయిస్తాయి. అధిక వేగం, పరధాన్యంతో డ్రైవింగ్, ఉన్నట్టుండి బ్రేక్‌లు కొట్టడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్కోర్ కేటాయిస్తాయి. ఒకవేళ పాలసీని స్విచాఫ్ చేసుకున్న తర్వాత, కారును వినియోగించినట్టయితే ఆ సమయంలో స్విచాన్ చేయడం మర్చిపోయినా.. వారి తరఫున యాప్ ఆ పనిచేస్తుంది. అన్నింటిపై కాదు.. నడిపినంత దూరం, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంపై వచ్చే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఓన్ డ్యామేజ్ అంటే వాహనానికి ఏదైనా కారణం వల్ల నష్టం వాటిల్లినా లేదా చోరీకి గురైనా పరిహారం ఇచ్చేదని అర్థం చేసుకోవాలి. థర్డ్ పార్టీ అంటే తమ వాహనం వల్ల ఎదుటి వాహనానికి, వ్యక్తులకు జరిగే నష్టానికి రక్షణనిచ్చే కవరేజీ. కొన్ని బీమా కంపెనీలు కేవలం ఓన్ డ్యామేజ్ వరకే ఈ డిస్కౌంట్‌ను ఇస్తున్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి సంస్థలు థర్డ్ పార్టీ కవరేజీపైనా డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కనుక మొత్తంమీద డిస్కౌంట్ ఎంత వస్తుందన్నది ముందే విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు కారు ప్రీమియం రూ.5,000 చెల్లిస్తున్నారనుకుంటే.. అందులో రూ.3,000 ఓన్ డ్యామేజ్ కోసం, రూ.2,000 థర్డ్ పార్టీ కోసం అయితే, ఓన్ డ్యామేజ్ రూ.3,000పై 5–25 శాతం వరకు డిస్కౌంట్ అంటే రూ.150–750 వరకు తగ్గుతుందని అర్థం. ఇక్కడ వాహనదారుడి ప్రయాణ సమాచారం ఎప్పటికప్పుడు బీమా కంపెనీలకు తెలుస్తుందని గుర్తు పెట్టుకోవాలి. గోప్యత కోరుకునే వారు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ డేటా ఆధారంగానే బీమా సంస్థలు ప్రీమియంపై నిర్ణయానికి వస్తాయి. డిస్కౌంట్ పొందే వారి డ్రైవింగ్ తీరు సైతం బీమా కంపెనీలకు తెలిసిపోతుంది. భవిష్యత్తులో ప్రమాదాల క్లెయిమ్‌లు వచి్చన సమయంలో ఈ డేటా వాటికి ఉపకరించొచ్చు. రద్దీ సమయాల్లో డ్రైవింగ్, ప్రమాదాలకు అధిక రిస్క్ ఉన్న ప్రాంతాల్లో డ్రైవింగ్‌కు సంబంధించి బీమా కంపెనీలు కొన్ని పరిమితులు విధించే అవకాశం లేకపోలేదు. బీమా కంపెనీ కోరినట్టు టెలీమ్యాటిక్స్, ఇతర పరికరాలు అమర్చుకోవాలంటే, అందుకు కొంత అదనపు వ్యయం అవుతుంది. ఈ పరికరాలకు మెయింటెనెన్స్, మరమ్మతుల ఖర్చు కూడా వాహనదారుడిపైనే పడుతుంది. వాహనంలో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే.. అందుకు సంబంధించి పాలసీ నియమ, నిబంధనలు ఏంటో ముందే తెలుసుకోవాలి. వీటికి కవరేజీ.. ► సంప్రదాయ బీమాలో మాదిరే అన్ని రకాల రిస్క్‌లను పీఏవైడీ కవర్ చేస్తుంది. అయితే ప్రీమియం చెల్లింపుల్లో వ్యత్యాసం ఉంటుంది. ► ప్రమాదం జరిగితే కారు రీపేర్ లేదంటే రీప్లేస్‌కు అయ్యే ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది. ► చోరీకి గురైతే లేదా చోరీ కారణంగా కారు డ్యామేజ్ అయినా పరిహారం లభిస్తుంది. ► వరదలు, భూకంపాలు తదితర విపత్తుల వల్ల కారుకు నష్టం ఏర్పడినా పరిహారం వస్తుంది. ► థర్డ్ పార్టీ కవరేజీ కూడా పీఏవైడీలతో వస్తుంది. ► కొన్ని పీఏవైడీ పాలసీలు గాయాల రక్షణ కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. మినహాయింపులు.. ► ఉద్దేశపూర్వకంగా చేసుకునే నష్టానికి పరిహారం రాదు. ► మద్యం, డ్రగ్స్ ప్రభావంతో కారు నడుపుతూ ప్రమాదం, నష్టం వాటిల్లితే బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. ► డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడపడం వల్ల ఎదురయ్యే నష్టానికి పరిహారం రాదు. ► రోజువారీ వినియోగం వల్ల వాహనంలో విడిభాగాలను మార్చాల్సి వస్తే వాటికి పరిహారం రాదు. ► ఎలక్ట్రికల్, మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల నష్టం ఏర్పడితే పరిహారం చెల్లించవు. ప్రీమియం తగ్గించుకునే టిప్స్.. ► తక్కువ దూరం నడిపే వారికి పీఏవైడీతో ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. దగ్గరి దూరానికి కారును ఉపయోగించుకోకుండా ఉండాలి. కార్యాలయానికి వెళ్లేవారు సహచర ఉద్యోగితో కలసి చెరొక రోజు కారును వినియోగించుకోవడం వల్ల ఆదా చేసుకోవచ్చు. ► చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఏ సందర్భంలోనూ ట్రాఫిక్ నియామాలు ఉల్లంఘించకూడదు. పరిమిత వేగాన్ని మించకుండా ఉండాలి. సడెన్ బ్రేక్‌లు వేయడం, రిస్క్ తీసుకుని క్రాస్ చేయడం ఇలా ప్రమాదాలకు దారితీసే చర్యలకు దూరంగా ఉండాలి. ► ఎయిర్ బ్యాగ్‌ల వంటి భద్రతా ఫీచర్లు ఎక్కువగా ఉన్న కారును ఎంపిక చేసుకోవడం వల్ల కూడా ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు. ► మద్యపానం సేవించే వారు ఆ సమయంలో క్యాబ్ సేవలు వినియోగించుకుని, వ్యక్తిగత డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి. -
రూ 456 కడితే రూ 2 లక్షల బెనిఫ్ట్..!
-
యాంటీబాడీ కాక్టెయిల్కు పరిహారం ఇవ్వాల్సిందే: ఐఆర్డీఏఐ
న్యూఢిల్లీ: కరోనా రోగులకు చికిత్సలో భాగంగా ఇచ్చే యాంటీబాడీ కాక్టెయిల్కు పరిహారాన్ని తిరస్కరించొద్దని బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఆదేశించింది. యాంటీబాడీ కాక్టెయిల్ కరోనా చికిత్సలో మెరుగైన ఫలితాలు ఇస్తుండడం తెలిసిందే. అయితే, దీన్ని ప్రయోగాత్మక చికిత్సగా పేర్కొంటూ బీమా కంపెనీలు పరిహార క్లెయిమ్‌లు ఆమోదించడం లేదు. ‘‘కరోనాకు సంబంధించి క్లెయిమ్‌లను తిరస్కరించడం లేదా యాంటీబాడీ కాక్టెయిల్ చికిత్సకు అయిన వ్యయాలను ‘ప్రయోగాత్మక చికిత్సలు’ పేరిట తగ్గించి ఇస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది’’ అని ఐఆర్డీఏఐ పేర్కొంది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ మండలి గతేడాది మే నెలలో యాంటీబాడీ కాక్టెయిల్కు అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత క్లెయిమ్‌లకు పరిహారాన్ని నిబంధనల మేరకు చెల్లించాలని ఆదేశించింది. ఈ విధమైన బకాయిలను పరిష్కరించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కరోనా మూడో విడత చికిత్సల ప్రోటోకాల్‌పై ఎంతో అనిశ్చితి నెలకొన్నట్టు బీమా బ్రోకింగ్ సంస్థ సెక్యూర్‌నౌ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా పేర్కొన్నారు. యాంటీబాడీ కాక్టెయిల్ చికిత్సా వ్యయాలను చెల్లించాలని ఐఆర్డీఏఐ ఆదేశించినప్పటికీ.. బీమా సంస్థలపై పెద్ద భారం పడబోదన్నారు. ఇప్పటికే ఈ తరహా చికిత్సలకు బీమా సంస్థలు పరిహారాన్ని తిరస్కరించినట్టయితే.. మళ్లీ తిరిగి దరఖాస్తు చేసుకోవడం ద్వారా పొందొచ్చని సూచించారు. -
ఈ జాగ్రత్తలు పాటిస్తే హోం లోన్ చెల్లింపులు ఎంతో ఈజీ !
గృహ రుణం తీసుకుంటున్నామంటే దీర్ఘకాలం పాటు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటున్నట్టు అర్థం చేసుకోవాలి. ఆ రుణాన్ని 10–20 ఏళ్లపాటు చెల్లించేందుకు ఆర్థికంగా, భౌతికంగా, భావోద్వేగ పరంగా సన్నద్ధులై ఉండాలి. ఇలా దీర్ఘకాలం పాటు రుణ చెల్లింపుల ఒప్పందంలోకి ప్రవేశించిన తర్వాత.. దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగి రుణ గ్రహీత మరణిస్తే.. లేదా రుణ గ్రహీత ఆదాయం నిలిచిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. రుణం తీసుకునే వ్యక్తి తనకు ఏదైనా జరిగితే తన కుటుంబంపై రుణం తీర్చాల్సిన ఆర్థిక భారం పడుతుందన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి భిన్న పరిస్థితుల్లో గృహ రుణం చెల్లింపులు ఆగిపోకుండా సజావుగా చెల్లించేలా చూసుకునేందుకు మార్గాలున్నాయి. రుణంపై బీమా కవరేజీ గృహ రుణం ఇచ్చే సమయంలోనే కొన్ని సంస్థలు ఇన్సూరెన్స్ కవరేజీ కూడా తీసుకోవాలని కోరుతున్నాయి. ఈ కవరేజీతో చెల్లింపులకు రక్షణ ఏర్పడుతుంది. సాధారణంగా హోమ్‌లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ (హెచ్‌ఎల్‌పీపీ) అన్నది మీరు తీసుకునే గృహ రుణం విలువకు సమానంగా ఉంటుంది. ఇలా కాకుండా వ్యక్తిగతంగానూ రుణ గ్రహీత టర్మ్ కవరేజీ ప్లాన్‌ను తీసుకోవచ్చు. రూ.25 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారనుకోండి. అప్పుడు హెచ్‌ఎల్‌పీపీ కూడా రూ.25 లక్షల కవరేజీతో వస్తుంది. ఇందుకు ప్రీమియం కింద సుమారు రూ.86,335 చెల్లించాల్సి వస్తుంది. ఒక ఏడాది తర్వాత చెల్లించాల్సిన గృహ రుణం రూ.20.5 లక్షలకు తగ్గిందనుకుందాం. ఆ సమయంలో రుణ గ్రహీత మరణిస్తే బీమా సంస్థే పాలసీదారు తరఫున మిగిలిన గృహ రుణ బకాయిని పూర్తిగా తీర్చేస్తుంది. టర్మ్ కవరేజీ టర్మ్ కవరేజీని విడిగా తీసుకోవడం వల్ల పాలసీదారుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పైన చెప్పుకున్నట్టుగానే రూ.25 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకున్న ఏడాది తర్వాత రుణ గ్రహీత మరణించించినట్టయితే.. రూ.25 లక్షల టర్మ్ ప్లాన్ పూర్తి మొత్తాన్ని పొందొచ్చు. అంటే మిగిలిన రుణ బకాయి రూ.20.5 లక్షలుపోను రూ.4.5 లక్షలను రుణ గ్రహీత కుటుంబం అందుకోవచ్చు. ప్రీమియం చెల్లింపుల పరంగా హెచ్ఎల్పీపీతో పోలిస్తే టర్మ్ ప్లాన్ సౌకర్యంగా ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని రుణం తీసుకునే సమయంలోనే చెల్లించాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్ బీమా ప్లాన్ మాదిరే క్రమానుగతంగా ప్రీమియం చెల్లించుకునే ఆప్షన్ ఉంటుంది. కనుక హెచ్‌ఎల్‌పీపీ, టర్మ్ప్లాన్లో అనుకూలమైన దానిని రుణ గ్రహీత ఎంపిక చేసుకోవచ్చు. అత్యవసర నిధి బీమా కవరేజీ తీసుకుని హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుంటే సరిపోదు. ప్రతీ నెలా ఈఎంఐ చెల్లించాల్సిన బాధ్యత నేపథ్యంలో అత్యవసర పరిస్థితులకు సన్నద్ధమై ఉండాలి. గృహ రుణం మాదిరి పెద్ద మొత్తంలో రుణ బాధ్యతను మోస్తున్నప్పుడు.. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా, గృహ రుణం ఈఎంఐలకు చెల్లింపులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరం. కనుక లిక్విడ్ ఫండ్స్‌లో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. దీనివల్ల పెట్టుబడులపై రాబడులకుతోడు.. నిర్ణీత కాలంలో ఒక నిధి ఏర్పడుతుంది. ఈ చిన్న అడుగులతో గృహ రుణ బాధ్యత విషయంలో భద్రతను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థతులు తలెత్తినా అప్పుడు మీరు కంగారు పడిపోవక్కర్లేదు. మీ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లకుండా కాపాడినట్టు అవుతుంది. గృహ రుణం ఈఎంఐను క్రమం తప్పకుండా చెల్లించినట్టయితే మంచి క్రెడిట్ స్కోర్ కూడా ఏర్పడుతుంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ అన్నది భవిష్యత్తులో రుణ అవసరాల్లో ఎంతో సాయపడుతుంది. - అరవింద్ హాలి, మోతీలాల్ ఓస్వాల్ హోమ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో చదవండి: ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు.. తెలియకుండానే బోలెడంత లాస్!! -
జీవిత బీమా పాలసీకి ఈ నాలుగూ ఎంతో కీలకం
ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమాది కీలకపాత్ర. ఇతర ఆర్థిక సాధనాలు, పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు దీనికి ప్రాధాన్యమివ్వాలి. కరోనా వైరస్ మహమ్మారిపరంగా ఏదైనా మంచి జరిగిందంటే.. అది చాలా మంది తమ ఆర్థిక ప్రణాళికలు, జీవిత బీమా ప్రాధాన్యతలను గుర్తించడమే. వైవిధ్యభరితమైన ఆర్థిక సాధనంగా.. జీవితంలో వివిధ దశల్లో లక్ష్యాలను సాధించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతగానో అక్కరకొస్తుంది. జీవిత బీమా పాలసీలను ఆన్లైన్లో కూడా సులభతరంగా కొనుగోలు చేయడానికి వీలున్న ప్రస్తుత తరుణంలో.. పాలసీ ఎంపికలో గుర్తుంచుకోతగిన అంశాలు నాలుగు ఉన్నాయి. అవేంటంటే.. అంచనా వేసుకోవడం మీ జీవితంలో ఆర్థిక లక్ష్యాలను అర్థం చేసుకోవాలి. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆకాంక్షలు, లక్ష్యాలు వేర్వేరుగా ఉండవచ్చు. పిల్లల చదువు, పెళ్లిళ్లు కావచ్చు.. రుణాలను తీర్చివేసేందుకు లోన్ తీసుకోవడం కావచ్చు, వైద్య చికిత్స ఖర్చులు.. రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం నిధిని ఏర్పాటు చేసుకోవడం కావచ్చు.. అవసరాలు అనేకం ఉండవచ్చు. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు, మీ మీద ఆధారపడిన వారి భవిష్యత్తును సురక్షితంగా కాపాడేందుకు వీలుగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీ కావాలనుకుంటే టర్మ్ పాలసీని ఎంచుకోవడం శ్రేయస్కరం. అలాగే యులిప్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లో పెట్టుబడులు పెట్టడం లేదా క్రమానుగత ఆదాయం కోసం రిటైర్మెంట్ ప్లాన్ తీసుకోవడం వంటివి పరిశీలించవచ్చు. అధ్యయనం చేయడం నిర్దిష్ట ప్లాన్‌ను ఎంచుకునే ముందు మార్కెట్లో ఉన్న వివిధ పథకాలను అధ్యయనం చేయండి. పాలసీ రకాలు, అవి అందించే ప్రయోజనాల గురించి తెలుసుకోండి. ఉదాహరణకు టర్మ్ ప్లాన్ తీసుకుంటే రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఉపయోగపడేది కాగా.. పిల్లల భవిష్యత్తును భద్రపర్చేదిగా చైల్డ్ ప్లాన్ పనికి వస్తుంది. ఇక ఎండోమెంట్ పాలసీ తీసుకుంటే ఇటు జీవిత బీమా, అటు పొదుపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఎంత కవరేజీ సరైన పథకం ఎంచుకోవడం ఎంత ముఖ్యమో.. తగినంత స్థాయిలో సమ్ అష్యూర్డ్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. పాలసీదారు ఆర్థిక స్థితిగతులు బట్టి కవరేజీని లెక్కించడానికి వీలవుతుంది. ఆదాయం, వ్యయాలు, భవిష్యత్తులో వచ్చే బాధ్యతలు, తీర్చాల్సిన రుణాలు, జీవితంలో వివిధ దశలకు సంబంధించి ఆర్థిక లక్ష్యాలు మొదలైనవి ఇందుకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సమ్ అష్యూర్డ్ ఎంతకు తీసుకోవాలన్న దానికి ప్రామాణికమైన అంకె ఏమీ లేదు. కానీ వార్షిక జీతానికి కనీసం 15 రెట్లు అయినా ఎక్కువగా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. పాలసీ ల్యాప్స్ కానివ్వొద్దు టర్మ్ పూర్తయ్యేదాకా ప్రీమియం చెల్లింపులను కొనసాగించాలి. ల్యాప్స్ కానివ్వకుండా చూసుకోవాలి. అప్పుడే పాలసీ ద్వారా అందాల్సిన ప్రయోజనాలు సక్రమంగా అందుతాయి. ఇలాంటి ప్రాథమిక సూత్రాలను గుర్తుంచుకుంటే, పాలసీ ప్రక్రియ సులభతరంగా ఉంటుంది. మీకు, మీ కుటుంబానికి.. వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ ఆర్థికమైన భరోసా లభించగలదు. - సంజయ్ తివారి, డైరెక్టర్ (స్ట్రాటజీ), ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ చదవండి:జీవిత బీమా ‘క్లెయిమ్’ చేయాల్సి వస్తే..? -
కరోనా కాలం.. అండగా నిలిచే ఆర్థిక సూత్రాలు
అసాధారణమైన కోవిడ్–19 మహమ్మారి సంక్షోభం ప్రపంచాన్ని ఒక్కసారిగా చుట్టేసింది. దీనితో వ్యాపారాలు కుదేలై, ఉద్యోగాలు కోల్పో యి, ఆదాయాలు పడిపోయి, ఖర్చులు పెరిగిపోయి ఎందరో సతమతమవుతున్నారు. ఇళ్లు గడవడం కోసం చాలా మంది రిస్కు చేసి మరీ పనిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కష్టకాలమే అయినప్పటికీ భద్రమైన భవిష్యత్తును నిర్మించుకోవడంలో ఆర్థిక ప్రణాళిక అవసరాన్ని గురించిన అనేక పాఠాలు చెబుతోంది. కష్టసమయంలో మీ ఆర్థిక పరిస్థితులను నియంత్రణలో ఉంచుకోవడానికి తోడ్పడే అంశాలు కొన్ని ఉన్నాయి. * ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మదింపు చేసుకోవాలి: మీకు ఆదాయం వచ్చే అన్ని వనరులను (జీతభత్యాలు, పెట్టుబడులు–పొదుపు మొత్తాలపై రాబడులు మొదలైనవి) పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆస్తులు, పెట్టుబడుల జాబితా తయారు చేసుకోవాలి. అవసరమైతే అప్పటికప్పుడు లిక్విడేట్ (వెంటనే విక్రయించి నగదు పొందగలిగేవి) చేయగలిగేవి, 1–3 నెలల వ్యవధిలో విక్రయించగలిగేవి, అమ్మడానికి సమయం పట్టేసేవి (స్థిరాస్తులు, లాకిన్ పరిమితులు ఉండే ఫండ్లు, బాండ్లు వంటివి) అన్నీ ఒక లిస్టు రూపొందించుకోవాలి. ఆ తర్వాత మీ బాకీలు, చెల్లించాల్సిన రుణాలు మొదలైనవి రాసుకోవాలి. * ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి: పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆదాయాలు, వ్యయాలు, పొదుపు, పెట్టుబడులు, రుణాలు మొదలైనవన్నీ కూడా కుటుంబానికి సంబంధించిన స్వల్పకాలిక .. దీర్ఘకాలిక అవసరాలు, ఆకాంక్షలు, జీవిత లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకోవాలి. మారే అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా మధ్య, మధ్యలో ఆయా ప్రణాళికల్లో అవసరమైతే సవరణలు చేసుకుంటూ ఉండాలి. కొంత మొత్తాన్ని సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లలో ఇన్వెస్ట్ చేయడం పరిశీలించవచ్చు. ఇవి ఎక్కువ భారంగా ఉండవు. పన్నుపరంగానే కాకుండా కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల సగటు పెట్టుబడి వ్యయం కొంత తగ్గుతుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా జీవితం ఎంత అస్థిరమైనదన్నది కరోనా మహమ్మారి ప్రపంచానికి తెలియజెప్పింది. కాబట్టి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రాధాన్యమివ్వాలి. ఒకవేళ ఇంటి పెద్దకు ఏదైనా అనుకోనిది జరిగినా కుటుంబం ఆర్థిక సమస్యల్లో చిక్కుకోకుండా తగు స్థాయి కవరేజీతో జీవిత బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇందుకోసం తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీనిచ్చే టర్మ్ ప్లాన్లను పరిశీలించవచ్చు. ప్రస్తుత ఆర్ధిక సంక్షోభ పరిస్థితుల్లో గ్యారంటీగా రాబడులు ఇచ్చే పథకాల్లో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇటీవలి కాలంలో జీవన శైలికి సంబంధించిన వ్యాధులు, చికిత్స వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా తీసుకోవాలి. తగినంత కవరేజీ ఉండేలా చూసుకోవాలి. అత్యవసర నిధి ఆర్థిక సంక్షోభ సమయంలో అత్యవసర నిధే ఆదుకుంటుంది. దాదాపు 6–12 నెలల ఆదాయానికి సరిపడేంత స్థాయిలో ఇలాంటి ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే చేతిలో ఉండేలా చూసుకోవాలి. మరో విషయం, దీన్ని కేవలం ఎమర్జెన్సీలోనే ఉపయోగించాలన్న సూత్రాన్ని నిబద్ధతతో పాటించాలి. రుణాల వలలో చిక్కుకోవద్దు కొంగొత్త ఉత్పత్తులు, మార్కెటింగ్ గిమ్మిక్కులు, సులభంగా రుణాలు లభించే అవకాశాలు మొదలైన వాటి ఆకర్షణలో పడిపోతే రుణాల వలలో చిక్కుకునే ముప్పు ఉంది. ఇది మీ ఆర్థిక ప్రణాళికకు ప్రతికూలమే కాకుండా, ఆర్థిక సంక్షోభ పరిస్థితి ఎదురైనప్పుడు గట్టి దెబ్బతీసే అవకాశం ఉంటుంది. వివిధ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుబడులన్నీ ఒకే సాధనంలో ఉంచకండి. షేర్లు, డెట్ (బాండ్లు మొదలైనవి), పసిడి, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో కొంత కొంతగా ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల రిస్కులు తగ్గించుకోవడంతో పాటు కొంత ఎక్కువ రాబడిని పొందగలిగే అవకా>శాలు ఉంటాయి. ఆర్థిక సాధనం ఎంచుకునేటప్పుడు ఎన్నాళ్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ అవసరానికి ఇన్వెస్ట్ చేస్తున్నారన్నది దృష్టిలో ఉంచుకోవాలి. ఉదాహరణకు ఈక్విటీలు దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించగలవు. ఇవి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవడం, చాలా రిస్కులతో ముడిపడి ఉన్నవి కావడం వల్ల స్వల్పకాలిక అవసరాల కోసం వీటిలో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం కాదు. స్థూలంగా చెప్పాలంటే, జీవితంలో ఎత్తుపల్లాలను అధిగమించాలంటే, నిశ్చింతగా ముందుకెళ్లాలంటే ఆర్థిక క్రమశిక్షణ, వివేకంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ప్రస్తుత కరోనా మహమ్మారి కొన్నాళ్లకు వెళ్లిపోవచ్చు. కానీ ఈ సంక్షోభం నుంచి నేర్చుకున్న ఆర్థిక పాఠాల సారాంశాన్ని గ్రహించి, ఇకపైనా అమలు చేయడం కొనసాగించగలిగితే.. భవిష్యత్తులో మరో సవాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనగలము. - కార్తీక్ రామన్, సీఎంవో, ఏజీఎస్ ఫెడరల్ లైఫ్ ఇన్సురెన్స్ చదవండి: ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జెరోదా..! -
బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు, అదనంగా ఎంత ప్రీమియం చెల్లించాలి?
వాహనదారుల సంక్షేమాన్ని కోరుతూ బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు తప్పనిసరి చేస్తూ మద్రాసు హై కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అమల్లోకి వస్తే వాహనం కొనుగోలు చేసేప్పుడు ఎంత ఆర్థిక భారం పడుతుంది. అమలు విధానం ఎలా ఉండవచచ్చు, కోర్టు తీర్పుపై ఇటు వాహన తయారీ సంస్థలు, అటు ఇన్సురెన్సు కంపెనీలు ఏమనుకుంటున్నాయి ? బంపర్ టూ బంపర్ లక్షలు ఖర్చు పెట్టి వాహనం కొనుగోలు చేసే సందర్భంలో ఇన్సెరెన్సు ప్రీమియం కట్డడంలో చాలా మంది వెనుకాముందు ఆలోచిస్తారు. ప్రీమియం తగ్గించుకునేందుకు రకరకాల ప్లాన్లు వేస్తారు. దీనికి తగ్గట్టే ఇన్సెరెన్సు సంస్థలు, వాటి ఏజెంట్లు అతి తక్కువ ప్రీమియం ఉండే థర్డ్ పార్టీ ఇన్సురెన్సు ప్లాన్లనే చెబుతుంటారు. ఇప్పటి వరకు ఈ తరహా పద్దతే ఎక్కువగా చెల్లుబాటు అవుతూ వస్తోంది. అయితే వాహనం కొనుగోలు చేసిన తర్వాత మొదటి ఐదేళ్ల పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును తప్పనిసరి చేసింది మద్రాసు హై కోర్టు. అంటే వాహనానికి ఏదైనా ప్రమాదం వాటిలినప్పుడు ఆ వాహనంతో పాటు దాని యజమాని లేదా డ్రైవరు, అందులో ప్రయాణించే వ్యక్తులందరికీ నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది. ప్రీమియం ఎంత పెరుగుతుంది? కొత్త వాహనాలకు కొనుగోలు చేసేప్పుడు నూటికి తొంభైశాతం మంది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సునే చేయిస్తున్నారు. ఆ తర్వాత రెన్యువల్ చేయించేప్పుడే థర్డ్ పార్టీ ఇన్సురెన్సులకు వెళ్తున్నారు. ప్రస్తుతం వాహన నెట్ప్రైస్లో 3 శాతం మొత్తాన్ని ఒక ఏడాది పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు ప్రీమియంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ కాలాన్ని ఐదేళ్లకు పొడిగించాలని కోర్టు సూచించింది. ఆ లెక్కన వాహనం ధరలో 3 శాతం మొత్తాన్ని ఐదేళ్లకు పెంచితే మార్కెట్‌వాల్యూ, తరుగుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇన్సురెన్సు ప్రీమియం దాదాపు మూడింతలు పెరిగిపోతుంది. ఆర్థిక భారం ఎంతంటే ? ఐదేళ్ల కాలానికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును లెక్కించందుకు హ్యుందాయ్ కంపెనీకి చెంది వెన్యూ కారును పరిగణలోకి తీసుకుంటే.. ఇప్పుడు ఒక ఏడాది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్కి రూ. 38,900 ప్రీమియంగా ఉంది. ఇదే ఇన్సురెన్సును ఐదేళ్ల కాలానికి తీసుకుంటే ప్రీమియం మొత్తం ఒకేసారి రూ. 1,26,690కి చేరుతుంది. అంటే వినియోగదారుడు ప్రస్తుతం చెల్లిస్తుదానికి అదనంగా రూ. 87,790లు చెల్లించాల్సి వస్తుంది. వివిధ మోడళ్లను బట్టి ఈ ప్రీమియం మారుతుంది. వాహన తయారీ సంస్థలు ఏమంటున్నాయి ? కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే ఆటో మొబైల్ పరిశ్రమ కొలుకుంటోంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వాహన తయారీ సంస్థలు ధరల తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఒకసారి ఐదేళ్లకు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్‌ని కోర్టు తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వాహనాల ధరలు పెరిగిపోతాయని, ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడుతుందని వాహన తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకి హ్యుందాయ్ వెన్యూ వాహనానికి సంబంధించి ఒక ఏడాది బంపర్ టూ బంపర్ రెండేళ్లు థర్డ్ పార్టీ ఇన్సురెన్సుతో కలిసి నెట్ప్రైస్ రూ. 9,96,310 ఉంది. ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం ఐదేళ్ల ఇన్సునెన్సు ప్రీమియం చెల్లించాలంటే రూ.10,84,295 చెల్లించాల్సి వస్తుంది. అదే మారుతి బ్రెజా విషయానికి వస్తే ఈ మొత్తం రూ.9,86,199 నుంచి రూ. 10,76,180కి చేరుకుంటుంది. ఇన్సురెన్సు కంపెనీ స్పందన ఏంటీ ? ఏ తరహా పాలసీ తీసుకోవాలి, ప్రీమియం ఎంత చెల్లించాలనే అంశంపై వాహన కొనుగోలుదారులను తాము ఒత్తిడి చేసేది ఏమీ ఉండదని ఇన్సురెన్సు కంపెనీలు చెబుతున్నాయి. మోటారు వాహన చట్టాలను లోబడి వాహన కొనుగోలుదారుడి ఇష్టాఇష్టాలకు అనుగుణంగానే పాలసీలు చేయిస్తామని చెబుతున్నాయి. వాహనం కొనుగోలు చేసేప్పుడు చాలా మంది మొదటి ఏడాదికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ చేయిస్తారని, ఆ తర్వాత వాహనం వాడే విధానం, రిస్క్ ఆధారంగా థర్డ్‌పార్టీ లేదా బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సులు తీసుకుంటారని ఇన్సురెన్సు కంపెనీ ఏజెంట్లు వెల్లడిస్తున్నారు. చదవండి : బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
ఇన్సూరెన్స్ కోసం కారు తగలబెట్టిన యజమాని
-
ఈడీఎల్ఐ పరిమితి రూ. 7 లక్షలకు పెంపు
న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం(ఈడీఎల్ఐ) కింద పొందే గరిష్ట ప్రయోజన పరిమితిని ఈపీఎఫ్ఓ రూ. 7 లక్షలకు పెంచింది. దీంతో ఈపీఎఫ్ సభ్యులు అనారోగ్యం, యాక్సిడెంట్ లేదా సహజ కారణాలతో మరణించినట్లయితే వారి నామినీకి రూ.7 లక్షల వరకు చెల్లిస్తారు. ఈపీఎఫ్ఓ సభ్యులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. గతంలో డెత్ ఇన్సూరెన్స్ పరిమితి 2–6 లక్షల రూపాయలుండగా, తాజాగా ఈ పరిమితిని రూ.2.5–7 లక్షల రూపాయలకు పెంచినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. మరణానికి 12 నెలల ముందు ఉద్యోగి పొందిన సరాసరి జీతం ఆధారంగా కవరేజ్ వర్తిస్తుంది. చదవండి:పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
అమ్మాయితో ఫోన్.. ఉచిత ఇన్సూరెన్స్.. తీరాచూస్తే..
సాక్షి, జీడిమెట్ల(హైదరాబాద్): ఉచితంగా ఇన్సూరెన్స్ వస్తుందని నమ్మి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కిన వ్యక్తి రూ.98 వేలు పోగొట్టుకున్న ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు తెలిపిన ప్రకారం... చింతల్ ప్రసూన నగర్‌కు చెందిన గుళ్లపల్లి కిషోర్ ప్రైవేట్ ఉద్యోగి. ఇతను స్టాండర్డ్ చార్టెడ్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నాడు. గత నెల 29న కిషోర్ ఫోన్‌కు వరినీక అనే పేరుతో ఓ అమ్మాయి ఫోన్ చేసి తాను స్టాండర్డ్ చార్టెడ్ క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని హిందీలో మాట్లాడి పరిచయం చేసుకుంది. అనంతరం మీ క్రెడిట్ కార్డుతో ఫ్రీగా ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి అతడి వివరాలు అడిగింది. దీంతో కిషోర్ తన పేరు, కార్డ్ నంబర్, పుట్టిన తేదీ, కార్డు వ్యాలిడిటీ అన్నీ చెప్పాడు. అనంతరం మీ కార్డుకు ఓటీపీ వస్తుంది అది చెప్పండి అని అడగ్గా కిషోర్ ఆమెను గుడ్డిగా నమ్మి చెప్పేశాడు. వెంటనే అతడి క్రెడిట్ కార్డు నుంచి రూ.98 వేలు వాడుకున్నట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. ఈ విషయాన్ని సదరు అమ్మాయికి తెలపగా మళ్లీ ఇంకో ఓటీపీ వస్తుందని, అది చెప్తే రూ.98 వేలు తిరిగి మీ అకౌంట్‌కు వస్తాయని చెప్పింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన కిషోర్ ఫోన్ కట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.3,000 కోట్ల టర్నోవర్ దిశగా డిజిట్ ఇన్సూరెన్స్
ముంబై: ఆన్లైన్ సాధారణ బీమా సంస్థ ‘డిజిట్ ఇన్సూరెన్స్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే లాభ, నష్టాల్లేని స్థితికి చేరుకుంటుందని కంపెనీ చైర్మన్ కామేష్‌గోయల్ తెలిపారు. కెనడాకు చెందిన ఎన్ఆర్ఐ బిలియనీర్ ప్రేమ్‌వత్సకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఈ కంపెనీ ప్రమోటర్‌గా ఉంది. ఇప్పటికే 140 మిలియన్ డాలర్ల నిధులను (రూ.1,036 కోట్లు) డిజిట్లో ఇన్వెస్ట్ చేసింది. బెంగళూరు కేంద్రంగా 2017 డిసెంబర్లో కార్యకలాపాలు ప్రారంభించిన డిజిట్ ఇన్సూరెన్స్‌లో ఏ91 పార్ట్నర్స్, ఫేరింగ్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ కూడా పెట్టుబడులు పెట్టాయి. డిజిట్ ఇన్సూరెన్స్ రెండో ఏడాది (2019–20) రూ.2,252 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసిందని, 2018–19లో వచ్చిన రూ.1,205 కోట్ల ఆదాయంతో పోలిస్తే దాదాపు87 శాతం పెరిగిందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,000 కోట్ల టర్నోవర్ మార్క్‌ను అధిగమిస్తామని కామేష్ గోయల్ వివరించారు. ప్రమోటర్లు ఇప్పటి వరకు రూ.1,650 కోట్ల నిధులను సమకూర్చారని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి సాధనకు అదనపు నిధుల అవసరం లేదన్నారు. ఆగస్ట్ నెలలో మోటారు ఇన్సూరెన్స్ పాలసీల విక్రయాల్లో 87 శాతం వృద్ధి నమోదయ్యిందని తెలిపారు. కానీ, పరిశ్రమ వృద్ధి ఒక శాతంగానే ఉందన్నారు. తమ మోటారు, హెల్త్‌పాలసీలకు మంచి డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వల్ప లాభం నమోదు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపారు. తొలి ఏడాది కార్యకలాపాలపై తాము రూ.425 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్టు ఆయన చెప్పారు. మోటారు ఇన్సూరెన్స్‌లో తమకు 2.6 శాతం వాటా ఉందని, మొత్తం మీద సాధారణ బీమాలో 1.54 శాతం వాటా జూన్ చివరి నాటికి ఉన్నట్టు కామేష్‌గోయల్ వెల్లడించారు. -
ఇన్సూరెన్స్ షేర్లను ఇప్పుడు కొనొచ్చా..!?
స్టాక్ మార్కెట్ నుంచి వేదాంత షేరు స్వచ్ఛందంగా డీలిస్ట్ కావడంతో దాని స్థానంలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరును చేర్చారు. అలాగే ఆగస్ట్ చివరిలో నిఫ్టీ-50 ఇండెక్స్ మార్పు చేర్పుల్లో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్ షేరు స్థానంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేర్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పులతో నిఫ్టీ-50 ఆదాయ వృద్ధి ప్రొఫైల్‌ను మెరుగుపడుతుందని ఇండెక్స్‌లో నాన్లెండింగ్ ఫైనాన్స్ సర్వీస్ స్టాక్‌ల వెయిటేజీని పెంచుతుందని వారు విశ్వసిస్తున్నారు. అయితే ఇండెక్స్ నుంచి ఒక షేరు తొలగించినంత మాత్రమే షేరును అమ్మకం గానీ, అలాగే చేర్చిన షేరును కొనుగోలు చేయడం మంచి పద్దతి కాదని వారంటున్నారు. ఇండెక్స్‌లో స్థానం ఇందుకే: నిఫ్టీ-50 ఇండెక్స్‌లో చేర్పు/తొలిగింపు అనే అంశం సంబంధిత స్టాక్ పనితీరు ప్రతిబింబిస్తుంది. అలాగే మార్కెట్లో ఆయా రంంగాల డిమాండ్‌ను తెలియజేస్తుంది. భారత్‌లో ఇన్సూరెన్స్ సెక్టార్‌కు అధిక సామర్థ్యం ఉంది. అందుకే ఇన్సూరెన్స్ స్టాకులను ఇండెక్స్‌లో స్థానం కల్పిస్తున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ‘‘భారత్‌లో గత 17ఏళ్లలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ సెక్టార్ దాదాపు 15శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం మార్కెట్లో 50శాతం వాటాను కలిగి ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో భీమా వ్యాపారం తక్కువగా ఉంది. దేశం వృద్ధిని సాధిస్తే గొప్ప పనితీరును కనబరిచే రంగాల్లో ఇన్సూరెన్స్ సెక్టార్ ఒకటిగా ఉంటుంది. దీర్ఘకాలికం దృష్ట్యా ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లలో పెట్టబడులు పెట్టవచ్చు.’’ అని ఐడీబీఐ క్యాపిటల్ రీటైల్ హెచ్ ఏకే ప్రభాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలపై ఐడీబీఐ క్యాపిటల్ బ్రోకరేజ్ తన అభిప్రాయాలను తెలిపింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: ఏజెంట్‌కు చెల్లించే కమిషన్ ఇన్సూరెన్స్ పరిశ్రమలోనే అత్యల్పంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 23వేల ఎస్బీఐ శాఖల ప్రయోజనాన్ని ఉచితంగా పొందుతుంది. ఈ రెండు అంశాలు కంపెనీ వ్యయాలను భారీగా తగ్గిస్తున్నాయి. ఎస్బీఐలో లాస్ట్-మైల్ కనెక్టివిటీ ఉత్తమంగా పనిచేస్తుంది. కాబట్టి, అది వ్యాపారంగా రూపాంతరం చెందితే, అది చాలా బాగా పనిచేయవచ్చు అని ఐడీబీఐ క్యాపిటల్ సంస్థ తెలిపింది. అలాగే షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.892గా నిర్ణయించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్: ఇండెక్స్‌లోకి ప్రవేశించిన తర్వాత రీ-రేటింగ్‌ను చూడవచ్చు. కోవిడ్-19 సంక్షోభంతో చాలా కస్టమర్లు ప్రీమియం చెల్లింపుల్లో విఫలం కావడంతో ఈ ఏడాది అది ఆశించిన స్థాయిలో రాణించకపోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో మంచి రాణించేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. దీర్ఘకాల ప్రదర్శన దృష్టా్య షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు టార్గెట్ ధరను రూ.568 గా నిర్ణయించినట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ రెండు ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లతో పాటు మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు ఐడీబీఐ క్యాపిటల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
ఈ తప్పులకు తప్పదు... మూల్యం!
మనలో చాలా మందికి ఆర్థిక విషయాల పట్ల పరిపూర్ణ అవగాహన తక్కువేనని అంగీకరించాల్సిందే..! ఎందుకంటే అవసరాలకు ఖర్చు చేయడం మినహా, ప్రత్యేకమైన ఆర్థిక ప్రణాళిక చాలా మందిలో కనిపించదు. ఈ కారణంగానే ఎంతో మంది ఆర్థిక అంశాల విషయంలో తమకు తెలియకుండానే ఎన్నో తప్పులకు చోటు ఇస్తుంటారు. కానీ, వీటి కారణంగా ఎంతో నష్టపోవాల్సి రావచ్చు. వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ పట్ల అవగాహన లేకపోవడమే దీనికి కారణమని తేల్చారు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, జేఎస్జీ అండ్ కంపెనీకి చెందిన సీఏ గోవింగ్ ఎం.చందక్. భారతీయులు సాధారణంగా చేసే ఇటువంటి తప్పులు, వాటి కారణంగా ఏర్పడే ఆర్థిక నష్టాల గురించి ఆయన ఒక నివేదిక రూపంలో తెలియజేశారు. భవిష్యత్తు లక్ష్యాల దృష్ట్యా రాబడుల కోసం బీమా పాలసీల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ప్రతీ 100 మందిలో 95 మంది ఇదే తప్పు చేస్తున్నారు. ఎటువంటి రాబడులు ఇవ్వని, చౌక ప్రీమియంకు అధిక బీమా రక్షణనిచ్చే టర్మ్ పాలసీకి.. ‘ప్రీమియం ఎక్కువ, బీమా కవరేజీ తక్కువ’ ధోరణితో కూడిన ఎండోమెంట్ పాలసీకి మధ్య తేడా తెలిసిన వారు తక్కువ మందే ఉన్నారు. క్రెడిట్ కార్డు మిస్టరీ క్రెడిట్ కార్డుపై పరిమితిని వాడేసుకుని, కనీస మొత్తమే చెల్లిస్తున్నారా..? అయితే, మీరు క్రెడిట్‌కార్డు మాయ(రుణ ఊబి)లో చిక్కుకున్నట్టే. ఉదాహరణకు క్రెడిట్ కార్డు బిల్లు రూ.40,000 వినియోగించుకుని.. గడువు నాటికి ఈ మొత్తాన్ని చెల్లించకపోతే ఆలస్యపు ఫీజు కింద రూ.100–1,000 మధ్య చెల్లించాలి. ఈ ఫీజు తప్పించుకునేందుకు కనీస బకాయి కింద బిల్లులో 5 శాతం చెల్లించడం ద్వారా కార్డును యాక్టివ్‌గానూ ఉంచుకోవచ్చు. కానీ, ఇలా కొద్ది మొత్తమే చెల్లించడం వల్ల మిగిలి ఉన్న బకాయిపై భారీ వడ్డీ బాదుడు ఉంటుంది. కాంపౌండింగ్ మహిమ రాబడి/వడ్డీ వచ్చి అసలుకు చేరడాన్ని కాం పౌండింగ్గా చేప్పుకోవచ్చు. ఇలా రాబడి నిర్ణీత కాలానికోసారి అసలుకు కలుస్తుంటే, కొంత కాలా నికి సంపద గణనీయంగా వృద్ధి చెందుతుంది. పెట్టుబడులకు ఎంత సుదీర్ఘకాలం ఉంటే, కాంపౌడింగ్ మహిమతో రాబడి అంత అధికంగా ఉంటుంది. కాంపౌండింగ్ మహిమను ప్రపంచంలో ఎనిమి దో అద్భుతంగా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అభివర్ణించారు. టిప్స్ సాయంతో స్టాక్స్ కొనుగోలు స్వీయ అధ్యయనం లేకుండా, కంపెనీల ఫండమెంటల్స్ గురించి పూర్తి అవగాహనకు రాకుండా.. టిప్స్‌ను నమ్ముకుని పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే నష్టాలు ఎదురవుతాయి. జీవన ద్రవ్యోల్బణం వేతనం పెరిగిందని అప్పటి వరకు 2బీహెచ్‌కే ఇంట్లో ఉన్న వారు 3బీహెచ్‌కే ఇంటికి మారిపోవడం.. మంచి బోనస్ వచ్చిందని కారును మార్చేయడం అన్నవి జీవన ద్రవ్యోల్బణానికి మంచి ఉదాహరణలు. అవసరం ఉంటే తప్ప వేతనం పెరిగిందని ఇలా చేస్తే ఆర్థికంగా తప్పటడుగే. తక్కువ ధరలకు వస్తున్నాయని డిస్కౌంట్ చూసి అవసరం లేకపోయినా కొనే వారు చాలా మందే ఉన్నారు. అంటే అవసరం లేని దాని కోసం వృధా చేయడమే అవుతుంది. వారాంతపు పార్టీలు వారంలో ఐదు రోజులు పని. రెండు రోజులు వినోదం. నగరాలు, పట్టణాల్లో విస్తరిస్తున్న సంస్కృతి ఇది. వారాంతాల్లో పబ్‌లు, పార్టీల పేరుతో భారీగా ఖర్చు చేసేస్తే.. నెలాఖరుకు బ్యాలన్స్ సున్నాకు చేరుతుంది. ఖర్చులను కనిపెట్టడం దేనికోసం, ఎంత, ఎందుకు ఖర్చు చేస్తున్నామన్నది పట్టించుకునే వారు తక్కువే. ఇది దీర్ఘకాలంలో ఎంతో నష్టానికి దారితీస్తుంది. అత్యవసర నిధి లేకపోవడం అత్యవసర సందర్భాల్లో ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఓ ఫండ్ అంటూ లేకపోతే.. క్రెడిట్ కార్డును గీకడం లేదా పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ లేదా తెలిసిన వారి దగ్గర చేయి చాచాల్సి వస్తుంది. ఇలా చేస్తే మీ జీవన లక్ష్యాలకు మిగిలేది ఏముంటుంది? ఆర్థిక ప్రణాళిక చాలా మందికి ఆర్థిక లక్ష్యాలనేవి ఉండడం లేదు. దాంతో డబ్బును దాచుకోవాలన్న ఆలోచన కూడా వారికి ఉండడం లేదు. ఆరోగ్య బీమా అవసరం వైద్య బీమా అవసరాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా ఆస్పత్రి పాలైతే.. చెల్లించాల్సిన బిల్లు అప్పటి వరకు చేసుకున్న పొదుపులన్నింటినీ కరిగించేస్తుంది. వైద్య ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో బీమా లేకుండా వాటిని భరించడం సామాన్య, మధ్యతరగతి వారివల్ల అయ్యే పని కాదు. వైవిధ్యానికి దూరం కావడం పొదుపు మొత్తాన్ని తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ మార్కెట్లో లేక బంగారంపైన లేక పూర్తిగా స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసే వారు.. అలాగే బ్యాంకు లాకర్లలో పెట్టేవారూ ఉన్నారు. ఇలా ఒకటి రెండింటికే పరిమితం కాకుండా, తమ రిస్క్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని, భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారు కొద్ది మందే ఉంటారు. వాయిదా వేయడం ‘రేపటి నుంచి ఇన్వెస్ట్ చేయాలి’.. ‘హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి’.. ఇలా అనుకోవడమే కానీ, ఆచరణలో పెట్టే వారు తక్కువే. కీలక నిర్ణయాలను వాయిదా వేయడం లేదా జాప్యం చేయడం వల్ల నష్టమే ఎక్కువ. ఓపిక లేమి డబ్బులు పిల్లలు పెట్టాలంటే అందుకు తగినంత వ్యవధి ఇవ్వాలి. కొందరికి స్వల్ప కాలంలోనే పెట్టుబడి రెట్టింపు కావాలని ఉంటుంది. అందుకే స్టాక్ మార్కెట్ పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. ఇలా ఓపిక లేమి, పెట్టుబడి సాధనాల గురించి, రిస్క్, రాబడులను అర్థం చేసుకోకపోవడం వల్ల నష్టపోయేవారు చాలా మందే ఉన్నారు. ఇతరుల నిర్ణయాలపై ఆధారపడడం పెట్టుబడుల గురించి తెలియక ఇతరులపై ఆధారపడే వారూ ఉన్నారు. తమ కష్టార్జితాన్ని వృద్ధి చేయాలంటూ ఇతరుల చేతుల్లో పెడితే గాల్లో దీపం వంటిదే. రాబడులు రావచ్చు లేకపోతే మొత్తం కోల్పోవచ్చు. సమయాన్ని వృధా చేసుకోవడం కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా కొత్త నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి బదులు ఎక్కువ మంది సోషల్ మీడియాలో, యూట్యూబులలో గడిపేస్తుంటారు. ఆస్తులు–అప్పులు భవిష్యత్తు ఆదాయాలపై భరోసా లేనివారు కారువంటి విలాసాలు అప్పుపై కొనడం అంత మంచిదికాదు. వీటిపైనా దృష్టి పెట్టాలి... లాకర్లలో బంగారం: రూ.లక్షలతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకుని, రక్షణ కోసం తీసుకెళ్లి బ్యాంకు లాకర్లలో పెట్టేస్తుంటారు. లక్షలాది రూపాయలు ఆభరణాల రూపంలో బ్లాక్ అయినట్టే. వీటిపై రాబడి ఉండదు. దీర్ఘకాలంలో బంగారం ధర పెరిగినా ఆభరణాలను అమ్ముకునేందుకు మనస్కరించదు. కష్టార్జితమంతా పెళ్లిళ్లకే: కొందరు తమ కష్టార్జితమంతా తమ పిల్లల పెళ్లిళ్ల కోసమే ఖర్చు చేస్తుంటారు. దీనివల్ల తదనంతర కాలంలో వారి జీవితం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. క్రమశిక్షణ లేమి: ఆదాయం వచ్చిన వెంటనే ప్రణాళిక మేర ఇన్వెస్ట్ చేసి, మిగిలినది ఖర్చు చేయాలి. కానీ, ఎక్కువ మంది దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. ఆడంబరాలు: కొందరు తాము గొప్పగా కనిపించాలనుకుంటారు. అందుకోసం కారు, ఖరీదైన ఇల్లు, ఖరీదైన వాచ్, ట్రిప్ ఇలా ఏవేవో ప్లాన్ చేస్తుంటారు. విలువను తెచ్చిపెట్టే వాటిపై ఇన్వెస్ట్ చేయడాన్ని పక్కకు నెట్టేస్తుంటారు. -
‘మానసిక అనారోగ్యాలకూ బీమా భద్రత’
సాక్షి, న్యూఢిల్లీ : మానసిక అస్వస్థతకూ బీమా భద్రతను కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం మంగళవారం కేంద్ర ప్రభుత్వం, ఐఆర్‌డీఏకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మానసిక సమస్యలకూ బీమా కవరేజ్‌ను ఎందుకు వర్తింపచేయరాదో బదులివ్వాలని కోరింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. కోవిడ్-19 దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుండటం బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్పుట్ బలవన్మరణం నేపథ్యంలో కుంగుబాటు, యాంగ్జైటీలపై చర్చ సాగుతున్న క్రమంలో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. కాగా, బీమా పాలసీల్లో మానసిక అస్వస్థతకూ బీమా భద్రత కల్పించేలా కేటాయింపులు చేపట్టాలని 2018లో ఐఆర్డీఏ బీమా కంపెనీలను ఆదేశించింది. శారీరక అనారోగ్యానికి అవసరమయ్యే చికిత్సల తరహాలో మానసిక అనారోగ్యానికి బీమా కవరేజ్ కల్పించాలని బీమా కంపెనీలను ఆదేశిస్తూ ఐఆర్డీఏ 2018 మేలో ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి : కరోనా మృతదేహాలను పట్టించుకోరా?: సుప్రీంకోర్టు -
కరోనా కాలంలో ఎఫ్‌పీఐలు, డీఐఐలు మెచ్చిన రంగమిదే..!
సముద్రాన్ని తుఫాను తాకినపుడు, భూమి సురక్షితమైన ప్రదేశంగా కనిపిస్తుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్‌ను కోవిడ్-19 తాకినపుడు ఎఫ్ఐఐలు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ సంస్థలకు ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు సురక్షితమైనవి భావించాయి. ముఖ్యంగా పీఎస్‌యూ కంపెనీలు భారీ స్థాయిలో చెల్లించే డివెడెండ్ చెల్లింపులు వారిని ఆకర్షించాయి. ఎఫ్ఐఐలు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్‌ల ఫోర్ట్‌ఫోలియోలో ... ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఐఓసీ, బీఈఎల్, హెచ్‌సీఎల్, గెయిల్ ఇండియా, పీఎఫ్సీలు కంపెనీల షేర్లు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న ఈ టాప్- 10 పీఎస్‌యూ కంపెనీలు ఫండమెంటల్స్ ఆకర్షణీయంగా ఉండటంతో పాటు జనవరి నుంచి కరెక్షన్కు లోనయ్యాయి. ఈ కంపెనీల్లో ప్రధాన వాటాను ప్రభుత్వం కలిగి ఉండటంతో ఎఫ్ఐఐలు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ ఈ కంపెనీల్లో భారీ ఎత్తున వాటాను కొనుగోలు చేశాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కొంతశాతం పీఎస్‌యూ స్టాక్స్‌కు కేటాయించడం ఉత్తమం. ఒకవేళ మనం నిఫ్టీ పీఎస్ఈ ఇండెక్స్‌ను పరిశీలిస్తే.., మొత్తం ఇండెక్స్ వెయిటేజీలో 40శాతం ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలున్నాయి. తర్వాత 31శాతం వెయిటేజీ పవర్ కంపెనీలకు, 15శాతం మెటల్ కంపెనీలు కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఈ రంగాలు కీలకం.’’ అని గౌరవ్ తెలిపారు. ఎఫ్ఐపీ మార్చి త్రైమాసిక ఫోర్ట్‌ఫోలియో పరిశీలిస్తే పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, గెయిల్, ఐఓసీ, కంటైనర్ కార్ప్, హెచ్‌పీసీఎల్, ఆర్ఈసీలు టాప్ షేర్లుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీల మార్చి త్రైమాసిక ఫోర్ట్‌ఫోలియో చూస్తే కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, ఎన్ఎండీసీ, గెయిల్ ఇండియా, న్యూ అస్యూరెన్స్, జీఐసీలు టాప్ షేర్లుగా ఉన్నాయి. ‘‘ఎఫ్‌పీఐ, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్లు ఎంచుకున్న ఈ కంపెనీలు ఫండమెంటల్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం డిమాండ్ మందగమనంతో ఈ కంపెనీలు కూడా తమ వ్యాపారాలలో గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇటీవల, ప్రభుత్వం ప్రైవేటు రంగ భాగస్వామ్యం, ప్రైవేటీకరణ ద్వారా ఈ సంస్థలలో అధిక సామర్థ్యానికి సహాయపడే ప్రభుత్వ రంగ విధానాన్ని రూపొందించింది. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలకు ఇది సానుకూలంగా ఉన్నప్పటికీ, సమీపకాలంలో ఆర్థిక మందగమనం కారణంగా ప్రభావానికి లోనుకాగలవు.’’ అని రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. -
స్టాక్స్..రాకెట్స్!
ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం, వాణిజ్య యుద్ధ భయాలు, జీడీపీ అంచనాల తగ్గింపు, కంపెనీల ఆదాయాల డౌన్‌గ్రేడింగ్ వంటి గడ్డు పరిస్థితుల్లోనూ నిఫ్టీ గతేడాది దీపావళి (2018 నవంబర్ 7) నుంచి ఈ ఏడాది అక్టోబర్ 15 దాకా సుమారు 11% రాబడులిచ్చింది. కానీ మిడ్‌క్యాప్ సూచీ 6%, స్మాల్‌క్యాప్ సూచీ 10% మేర క్షీణించాయి. అయితే, రియల్టీ 14%, బ్యాంకెక్స్ 13%, ఆయిల్ అండ్ గ్యాస్ 13% పెరిగాయి. ఇక సంవత్ 2076లో ఆశావహ పరిస్థితులే కనిపిస్తున్నాయన్నది బ్రోకరేజీ సంస్థల మాట. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30% నుంచి 22 శాతానికి తగ్గించడం, తయారీ రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చే చర్యలు ప్రకటించడం సెంటిమెంటును మెరుగుపరుస్తాయన్నది వారి అంచనా. ఈ నేపథ్యంలో నిఫ్టీ 14,000 పాయింట్లకు , సెన్సెక్స్ 46,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. ‘సంవత్ 2076’లో ఐటీ, మెటల్, ఫార్మా, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లకు దూరంగా ఉండటమే మంచిదన్నది బ్రోకరేజీ సంస్థల సూచన. ప్రైవేట్ బ్యాంకులు, బీమా సంస్థలు, ఎఫ్ఎంసీజీ రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నాయి. ఆ సిఫారసుల వివరాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... బ్రోకరేజి సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 469 టార్గెట్ ధర రూ. 550 ఇతరత్రా సవాళ్లు, కొత్తగా బయటికొస్తున్న మొండిపద్దులకు సంబంధించి మిగతా బ్యాంకులతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంకు పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆదాయాలను మెరుగుపర్చుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. రుణ వితరణకు సంబంధించి వార్షిక ప్రాతిపదికన 2019–21లో 17 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చు. హెచ్‌యూఎల్ ప్రస్తుత ధర రూ. 2,143 టార్గెట్ ధర రూ. 2,265 మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వేగంగా మార్పులు, చేర్పులు చేసుకోగల సామర్థ్యాలు, ప్రీమియమైజేషన్ ట్రెండు పటిష్టంగా ఉండటం, టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవటం వంటివి ఈ సంస్థకు సానుకూలాంశాలు. లార్జ్ క్యాప్ కన్జూ మర్ సంస్థల్లో హెచ్‌యూఎల్ ఆదాయాలు మరింత మెరుగ్గా నమోదయ్యే అవకాశాలున్నాయి. టైటాన్ ప్రస్తుత ధర రూ. 1,334 టార్గెట్ ధర రూ. 1,435 సొంతంగా అమలు చేస్తున్న వ్యూహాలు, నియంత్రణ వ్యవస్థ పరంగా సానుకూలాంశాలు టైటాన్ వృద్ధికి దోహదపడనున్నాయి. సేమ్ స్టోర్ సేల్స్ గ్రూప్ (ఎస్‌ఎస్‌ఎస్‌జీ) అమ్మకాల వృద్ధిలో జ్యుయలరీ విభాగం వాటా 60% పైగా ఉంది. నిర్వహణ మార్జిన్లు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఎస్బీఐ ప్రస్తుత ధర రూ. 282 టార్గెట్ ధర రూ. 350 నిర్వహణ పనితీరు స్థిరంగా ఉంది. ఆదాయాలు మెరుగుపడతాయి. అలాగే, ఎన్సీఎల్టీకి చేరిన మొండిపద్దుల నుంచి కూడా భారీ రికవరీలకు గణనీయమైన అవకాశాలున్నాయి. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత ధర రూ. 2,103 టార్గెట్ ధర రూ. 2,600 లిక్విడిటీ పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ.. తక్కువ వ్యయాలతో నిధులు సమీకరించుకోగలగడం, మార్కెట్ షేరు పెంచుకోగలగడం దీనికి సానుకూల అంశాలు. 2019–2022 మధ్య ఏయూఎం వృద్ధి వార్షిక ప్రాతిపదికన 14 శాతం స్థాయిలో ఉండొచ్చని, నికర వడ్డీ మార్జిన్లు స్థిరంగా ఉండగలవని అంచనా. బ్రోకరేజి సంస్థ: రెలిగేర్ బ్రోకింగ్ హావెల్స్ ఇండియా ప్రస్తుత ధర రూ. 665 టార్గెట్ ధర రూ. 795 కొంగొత్త ఉత్పత్తులతో పోర్ట్‌ఫోలియోను వేగవంతంగా విస్తరిస్తోంది. ఎఫ్ఎంఈజీ రంగంలో అత్యధికంగా మార్కెట్ వాటా, పటిష్టమైన నెట్వర్క్ దీనికి లాభించే అంశాలు. పండుగ సీజన్ డిమాండ్‌తో రాబోయే రోజుల్లో పనితీరు మరింత మెరుగుపడవచ్చు. రుణభారం తక్కువగా ఉండటం, రాబడులు మెరుగ్గా ఉండటం కలిసొస్తాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుత ధర రూ. 578 టార్గెట్ ధర రూ. 695 ఆటో పరిశ్రమలో మందగమ నం కారణంగా ఏడాది కాలంగా ఈ షేరు కరెక్షన్కు లోనయ్యింది. వర్షపాతం బాగుండటం, ద్రవ్య లభ్యత మెరుగ్గా ఉండటం, తక్కువ స్థాయిలో వడ్డీ రేట్లు ట్రాక్టర్ పరిశ్రమ రికవరీకి తోడ్పడగలవని అంచనా. ఫోర్డ్ ఇండియాతో జట్టు కట్టడం .. ఎంఅండ్ఎం పోర్ట్‌ఫోలియో మరింత పటిష్టపర్చుకోవడానికి, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకోవడానికి, భారత్ నుంచి ఎగుమతులు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. మారికో ప్రస్తుత ధర రూ. 393 టార్గెట్ ధర రూ. 451 సమీప భవిష్యత్‌లో ఎఫ్ఎంసీజీకి సవాళ్లు ఉన్నప్పటికీ.. క్రమంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవచ్చు. సానుకూల అంచనాల కారణంగా 13–15 శాతం మేర ఆదాయ వృద్ధిని కంపెనీ ఆశిస్తోంది. కొత్త ఉత్పత్తులు, కొన్ని విభాగాల్లో అగ్రస్థానం ఉండటంతో పాటు కొబ్బరి ధరలు తగ్గుతుండటం.. కంపెనీ మార్జిన్లపరంగా సానుకూల అంశాలు. వోల్టాస్ ప్రస్తుత ధర రూ. 699 టార్గెట్ ధర రూ. 780 పెరిగే డిమాండ్‌కు తగ్గట్లుగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కొత్త ఉత్పత్తులు, నెట్వర్క్ పటిష్టపర్చుకోవడం సానుకూల అంశాలు. మున్ముందు రూమ్ ఏసీలు, ఎయిర్ కూలర్లకు డిమాండ్‌తో వోల్టాస్ విక్రయాలు గణనీయంగా పెరగవచ్చు. తీవ్ర పోటీ ఉన్నా రూమ్ ఏసీల విభాగంలో వోల్టాస్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవచ్చు. బ్రోకరేజి సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సుప్రీం ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,173 టార్గెట్ ధర రూ. 1,420 దేశీయంగా అతి పెద్ద ప్లాస్టిక్ ప్రాసెసింగ్ సంస్థల్లో ఒకటి. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం, అన్ని ప్రాంతాల్లో తాగు నీటి వసతి కల్పించడం, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపర్చడం వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు పైపుల రంగానికి .. తద్వారా ఈ సంస్థకు సానుకూల అంశాలు. 2019–21 మధ్య కాలంలో కంపెనీ ఆదాయాలు 13 శాతం పైగా వృద్ధి చెందగలవని అంచనా. యునైటెడ్ బ్రూవరీస్ ప్రస్తుత ధర రూ. 1,337 టార్గెట్ ధర రూ. 1,620 దేశీ బీరు మార్కెట్లో 52 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. పటిష్టమైన బ్రాండ్స్, విస్తృతమైన నెట్వర్క్ దీనికి బలం. ఇతర ఉత్పత్తుల రేట్ల పెంపుతో పాటు ప్రీమియం బ్రాండ్స్ విక్రయాలు మెరుగుపడనుండటం సంస్థకు సానుకూలం. కొత్తగా క్రాఫ్ట్ బీరు, నాన్–ఆల్కహాల్ బెవరేజెస్ వ్యాపారాలు కూడా సంస్థకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి. కాన్సాయ్ నెరోలాక్ ప్రస్తుత ధర రూ. 545 టార్గెట్ ధర రూ. 620 దేశీయంగా అతి పెద్ద ఇండస్ట్రియల్ పెయింట్ కంపెనీ. ఇండస్ట్రియల్ పెయింట్స్ విభాగంలో 35 శాతం, మొత్తం పెయింట్స్ మార్కెట్లో 14 శాతం వాటా ఉంది. పట్టణీకరణ, రీపెయింటింగ్కు డిమాండ్‌తో పాటు మెరుగైన వర్షపాతం, అందరికీ ఇళ్ల పథకాలు మొదలైనవి పెయింట్ పరిశ్రమకు, ఈ సంస్థకు సానుకూల అంశాలు. కార్పొరేట్ ట్యాక్స్ రేటు కోత కూడా కంపెనీకి లాభిస్తుంది. డాబర్ ఇండియా ప్రస్తుత ధర రూ. 465 టార్గెట్ ధర రూ. 550 పలు రకాల ఉత్పత్తులతో.. వివిధ విభాగాల్లోకి కంపెనీ విస్తరించింది. మూడు బ్రాండ్స్ (రియల్, వాటికా, ఆమ్లా) టర్నోవరు రూ. 1,000 కోట్ల పైగా ఉంటుండగా, రూ. 100 కోట్ల పైగా టర్నోవరుండే బ్రాండ్స్ 16 దాకా ఉన్నాయి. పతంజలి నుంచి పోటీ తగ్గి గత కొద్ది త్రైమాసికాలుగా రెండంకెల స్థాయి వృద్ధి సాధిస్తోంది. జేకే సిమెంట్ ప్రస్తుత ధర రూ. 1,117 టార్గెట్ ధర రూ. 1,260 గ్రే సిమెంట్ విభాగంలో టాప్ సంస్థల్లో ఇదొకటి. వైట్ సిమెంట్‌లో మార్కెట్ లీడరు. ఉత్తర, దక్షిణాది మార్కెట్లో కార్యకలాపాలు ఉన్నాయి. భారీ విస్తరణ ప్రణాళికల కోసం రూ.2,000 కోట్లు వెచ్చిస్తోంది. వైట్ సిమెంటు విభాగంలో అగ్రస్థానంలో ఉండటం, కార్పొరేట్ ట్యాక్స్ కోత దీనికి లాభించగలవని అంచనా. బ్రోకరేజి సంస్థ : ఏంజిల్ బ్రోకింగ్ మారుతీ సుజుకీ ప్రస్తుత ధర రూ. 7,469 టార్గెట్ ధర రూ. 8,552 ప్యాసింజర్ వాహనాల విభాగంలో 52 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతూ ప్రీమియం కస్టమర్లను కూడా ఆకర్షిస్తోంది. ఆటోమొబైల్ రంగం రికవర్ అయ్యే క్రమంలో ముందుగా అవకాశాలను అందిపుచ్చుకునే సత్తా ఉండటం దీనికి సానుకూలం. జీఎంఎం ఫాడ్లర్ ప్రస్తుత ధర రూ. 1,421 టార్గెట్ ధర రూ. 1,740 ఆగ్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఫార్మా తదితర రంగాల్లో రసాయనాల ప్రాసెసింగ్‌కు ఉపయోగించే గ్లాస్ లైన్డ్ (జీఎల్) స్టీల్ పరికరాల ఉత్పత్తిలో దేశీయంగా అగ్రస్థానంలో ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాలకు సరిపోయేలా ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. మధ్యకాలికంగా జీఎల్యేతర వ్యాపారాలను కూడా మెరుగుపర్చుకుంటోంది. లార్సన్ అండ్ టూబ్రో ప్రస్తుత ధర రూ. 1,425 టార్గెట్ ధర రూ. 1,850 ఇన్ఫ్రా, హైడ్రోకార్బన్, సర్వీసుల విభాగాలతో దేశీయంగా అతి పెద్ద ఈపీసీ కంపెనీ. వివిధ అనుబంధ సంస్థల ద్వారా ఐటీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలలోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. దేశ, విదేశాల్లో రూ.3 లక్షల కోట్ల విలువ చేసే ఆర్డర్లతో పటిష్టంగా ఉంది. ప్రభుత్వం ఇన్ఫ్రాపై దృష్టి, కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపు వంటివి సంస్థకు లాభించేవి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 1,229 టార్గెట్ ధర రూ. 1,390 డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా వ్యాపారాన్ని మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతోంది. నగరాలు కానిచోట కొత్త శాఖల సంఖ్యను మరింతగా పెంచుకోవడం, పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్)లను 4 రెట్లు పెంపు, వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్ క్లయింట్స్ సంఖ్య రెట్టింపు వంటి లక్ష్యాలు నిర్దేశించుకుంది. మెరుగైన మార్జిన్లు నమోదు చేయగలుగుతోంది. బ్లూ స్టార్ ప్రస్తుత ధర రూ. 795 టార్గెట్ ధర రూ. 867 భారత్‌లో ఏసీలు తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఒకటి. రూమ్ ఏసీల మార్కెట్లో ప్రతి ఏడాది తన మార్కెట్ వాటాను పెంచుకుంటూనే ఉంది. ఫలితంగా కంపెనీ మొత్తం ఆదాయంలో కూలింగ్ ప్రొడక్ట్స్ డివిజన్ వాటా పదేళ్లలో రెట్టింపైంది. ఇదే జోరు భవిష్యత్తులో కూడా కొనసాగనున్నది. రెండేళ్లలో ఆదాయం 11 శాతం చొప్పున వృద్ధి చెందగలదని అంచనా. మార్జిన్లు వచ్చే ఏడాది 7%కి పెరగవచ్చు. గోల్డ్ రన్.. రూ. 41,500కు చేరే అవకాశం అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, భౌగోళిక.. రాజకీయ ఆందోళనలు, బ్రెగ్జిట్‌పై తొలగని అనిశ్చితి... ఇవన్నీ 2019లో పసిడికి లాభించాయి. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ప్రపంచ దేశాల వృద్ధి రేటు అంచనాలను కుదిస్తుండటంతో .. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు మరింత పెంచుకున్నాయి. దేశీయంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం పుత్తడికి కలిసొచ్చింది. మొత్తం మీద గత దీపావళి నుంచి చూస్తే ఈక్విటీలపై 10 శాతం మేర రాబడులు రాగా.. పసిడి 21 శాతం దాకా లాభాన్నిచ్చింది. అయితే, ధరతో పాటు దిగుమతి సుంకాలూ పెరిగిపోవటం పసిడికి కొంత ప్రతికూలమే. 2019లో దిగుమతులు 12 శాతం తగ్గగా.. పండుగ సీజన్లో కూడా డిమాండ్ ఒక మోస్తరుగానే ఉంది. వాణిజ్య యుద్ధభయాలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. వేగం తగ్గినా.. పసిడి పరుగు కొనసాగుతుందనే అంచనాలున్నాయి. ప్రధాన ఎకానమీల్లో మందగమనం మరి కొన్నాళ్లు కొనసాగే అవకాశాలు, సెంట్రల్ బ్యాంకులు ఉదార విధానాలు కొనసాగించనుండటం పసిడి ధరకు మద్దతుగా నిలవవచ్చు. ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధ భయాలు తగ్గిపోతే పసిడి కొంత కరెక్షన్కు లోనైనా.. రూ.35,500 మద్దతును నిలబెట్టుకోగలిగితే మళ్లీ గత గరిష్ట స్థాయి రూ.39,500ను తాకవచ్చు.. ఆ పైన వచ్చే 12 నెలల్లో రూ. 41,500కి కూడా చేరవచ్చు. -
నష్టాలపాలు
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది జిల్లాలో సబ్సిడీ ఆవులు పొందుతున్న లబ్ధిదారుల పరిస్థితి. ఆవులతోనైనా అప్పులు పూడ్చుకోవచ్చని భావించిన పేదలకు చివరకు కష్టాలు.. నష్టాలే మిగులుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినఆవులు ఇక్కడమనలేక మృత్యువాతపడుతున్నాయి. వీటికి బీమా సొమ్మూ ఇవ్వకుండా అధికారులు అప్పులపాలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బలవంతంగా అంటగట్టారు నాకు పట్టించిన ఆవులు ఏమీ బాగోలేవు. ఇవి వద్దన్నా బ్యాంకర్లు, పశువైద్యాధికారులు వినలేదు. మీకు సబ్సిడీ ఆవులు కావాలంటే వీటినే పట్టుకోండి అంటూ హుకుం జారీ చేశారు. చేసేది లేక వారు చూపించిన వాటినే పట్టుకున్నా. ఆవులు ఇంటికి చేరేలోపే ఓ ఆవుకు కడుపులోనే దూడ చనిపోయింది. దూడను బయటకు తీసి ఆవుకు వైద్యం చేయాలని డాక్టర్‌కు చెప్పినా పట్టించుకోలేదు. చివరకు ఆవుకూడా చనిపోయింది. – వేద, మహిళా రైతు, ఎట్టేరి చిత్తూరు అగ్రికల్చర్ : జిల్లాలో 2017–18కి గాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మొత్తం 920 పాడి ఆవులు పంపిణీ చేశారు. ఇందులో 60 శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధిదారునికి రెండేసి ఆవులను అంటగట్టారు. వీటిని ఇతర రాష్ట్రాల్లోనే కొనుగోలు చేసేవిధంగా అధికారులు ఆంక్షలు విధించారు. సమీప రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి ఆవులను పట్టించి ఇచ్చారు. అక్కడి ఆవులు ఇక్కడ మనుగడ సాగించలేకపోతున్నాయి. వింత వ్యాధితో మృత్యువాత పడుతున్నాయి. నెల తిరక్కనే.. సబ్సిడీ ఆవులు ఇక్కడికొచ్చిన నెల రోజులకే పాడెక్కుతున్నాయి. బ్యాంకర్లు, వైద్యాధికారులు పక్కరాష్ట్రాల్లో ఆవులను పట్టిస్తున్నారే గానీ వాటిని ఇక్కడికి తీసుకొచ్చాక పట్టించుకోవడం లేదు. కొన్ని చూలు ఆవులు ఇక్కడకు చేరుకునే సమయానికే కడుపులోనే దూడలు చనిపోతున్నాయి. లబ్ధిదారులు వైద్యాధికారులకు తెలిపినా సకాలంలో స్పందించడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 200 సబ్సిడీ ఆవులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఒకే గ్రామంలోనే 8 ఆవులు.. గంగాధరనెల్లూరు మండలం ఎట్టేరి గ్రామస్తులకు తమిళనాడులోని నామక్కళ్ గ్రామం వద్ద మొత్తం 22 ఆవులను అధికారులు పట్టించారు. అక్కడి నుంచి తీసుకొచ్చే సమయంలో ఐదు ఆవులకు కడుపులోనే దూడలు చనిపోయాయి. మరో వారం రోజులకే మూడు ఆవులు వింత వ్యాధితో మృత్యువాత పడ్డాయి. ఇంకో రెండు ఆవుల పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అప్పుల ఊబిలోకి లబ్ధిదారులు సబ్సిడీ పేరుతో ఆవులు పొందిన లబ్ధిదారులు అప్పులపాలవుతున్నారు. బ్యాంకులో రుణం చెల్లించలేక.. పెట్టుబడీ చేతికి రాక చితికిపోతున్నారు. బీమా ఏదీ? సబ్సిడీ ఆవులకు బీమా తప్పనిసరి. బీమా చేసిన ఆవుల చెవులకు ఏజెంట్లు గుర్తుగా కమ్మ వేయాలి. కానీ ఆ ఏజెంట్లు గ్రామాలకు వచ్చే సమయానికే ఆవులు వ్యాధుల బారినపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏజెంట్లు వాటికి కమ్మ వేసేందుకు సమ్మతించడంలేదు. బీమా వర్తించకనే ఆవులు మృత్యువాత పడుతున్నాయి. సబ్సిడీ..దోపిడీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే మొత్తాలు పక్కదారి పడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఆవులను పట్టించేందుకు వెళుతున్న బ్యాంకర్లు, వైద్యాధికారులు అక్కడి పాడి ఆవుల దళారీలతో కుమ్మక్కై సబ్సిడీ నిధులను అప్పనంగా దిగమింగుతున్నారన్న విమర్శలున్నాయి. ప్రతి ఆవుకూ రూ.50 వేలు కేటాయించగా, అందులో రూ.20 వేలు లబ్ధిదారునికి బ్యాంకు రుణం, మిగిలిన రూ.30 వేలు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ కింద అందించాల్సి ఉంది. కానీ బ్యాంకర్లు, వైద్యాధికారులు రూ.20 వేల విలు చేసే ఆవులను పట్టించి మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని దిగమింగుతున్నట్లు పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దోచేసుకున్నారు ఆవులకు కార్పొరేషన్ అందించే సబ్సిడీని బ్యాంకర్లు, వైద్యాధికారులు దోచేసుకున్నారు. మాకు పట్టించిన ఆవులు ఒక్కొక్కటీ రూ.20 వేలే చేస్తాయి. రూ.50 వేలని పట్టించారు. మిగిలిన డబ్బులు వారే పంచుకున్నారు. ఆఖరుకు ఇటు ఆవూలేక.. అటు రుణం తీర్చలేక ఇబ్బందులు పడుతున్నాం. – రాధిక, మహిళారైతు, ఎట్టేరి బీమా లేదు బ్యాంకు రుణం ద్వారా పట్టుకొస్తున్న ఆవులకు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదు. తమిళనాడు నుంచి ఆవులు ఇక్కడకు తీసుకొచ్చే సమయానికే కొన్ని జబ్బు చేసి పైకిలేవలేని స్థితికి చేరుతున్నాయి. బీమా ఏజెంట్లకు చెప్పినా ఫలితం లేకుండా పోతోంది. – జయలక్ష్మి, మహిళా రైతు, ఎట్టేరి జాగ్రత్తగా చూసుకోక పోవడం వల్లే పక్క రాష్ట్రాల్లో పట్టిస్తున్న ఆవులకు అక్కడి వాతావరణం, ఇక్కడి వాతావరణానికి తేడా ఉంటుంది. లబ్ధిదారులు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కొందరు అలా చేయడంలేదు. అందువల్లే కొన్ని ఆవులు చనిపోతున్నాయి. – వెంకట్రావ్, జేడీ, పశుసంవర్థకశాఖ -
ప్రతి రైతుకు బీమా వచ్చేవరకు పోరాడుతాం
సాక్షి, కడప/కమలాపురం అర్బన్ : ‘టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతి ఒక్కరూ, ప్రతిరోజూ ఏదో ఒకచోట రోడ్డెక్కి ఉద్యమాల బాట పడుతూనే ఉన్నారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ఎవరూ రోడ్డుమీదికి రాలేదని చెప్పుకోవడం సిగ్గుచేటు’ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. పంట సాగుచేసిన రైతులందరికీ బీమా ఇవ్వాలంటూ కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలోని కమలాపురం క్రాస్‌రోడ్డులో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రైతులు ఒక్కరోజైన రోడ్డెక్కారా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ పాలన స్వర్ణయుగం అని, ఆయన రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, గిట్టుబాటు ధర అన్ని సౌకర్యాలు ముందే కల్పించారని తెలిపారు. 2016 రబీలో ప్రీమియం చెల్లించిన ప్రతి రైతు ఖాతాకు బీమా జమచేసే వరకు పోరాడుతామని తెలిపారు. 2012 బుడ్డశగన మూడో విడత బీమా విషయంలో కూడా ఆలస్యం సాగుతోందని, మిగతా జిల్లాల్లో 75శాతం రైతులకు అందిందని, వైఎస్సార్ జిల్లాలో మాత్రం రాలేదన్నారు. కేంద్రం తన వాటా వేయడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్రప్రభుత్వం ఏదో ఒక సాకుతో వెనుకంజ వేస్తోందన్నారు. తాను 17నెలల క్రితం లేఖ రాస్తే ఇంతవరకు రాష్ట్రప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. అలాగే ఎన్నోమార్లు వ్యవసాయ కమిషనర్ దృష్టికి కూడా ఈ లేఖ విషయాన్ని తీసుకెళ్లానని అయినప్పటికి స్పందన లేదన్నారు. రూ.50 కోట్లు వాటా వేయాల్సి వస్తుందని రాష్ట్రప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 రబీలో మరో 57వేల మంది ప్రీమియం చెల్లిస్తే వారిలో 16 వేల దరఖాస్తులు తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీల ఎదుటే ధర్నా నిర్వహించి ప్రతిరైతుకు ఇన్సూరెన్స్ వచ్చేలా పోరాడుతామన్నారు. టీడీపీ పాలనలో ఏ సమస్య పరిష్కరించుకోవాలన్నా రోడ్డెక్కే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కడప దెబ్బ పుణేకు తెలియాలి 2016 రబీలో రైతుల నుంచి బీమా ప్రీమియం వసూలు చేసి ఇప్పుడు పరిహారం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్న ఐసీఐసీఐ ఇన్సూరెన్స్ కంపెనీకి కడప దెబ్బ తెలియాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 2012–13కు సంబంధించి రు.120కోట్ల వరకు ఇన్సూరెన్స్ రావాల్సి ఉందన్నారు. అప్పట్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి ఇన్సూరెన్స్ కంపెనీ ఎదుట ధర్నా నిర్వహిస్తే 18వేల మందికి ఇన్సూరెన్స్ చెల్లించారని గుర్తుచేశారు. ఇంకా 21వేల మందికి రావాల్సి ఉందన్నారు. 2016 రబీలో ప్రీమియం చెల్లించిన రైతులకు అమౌంట్ తక్కువ కట్టారని రిజెక్ట్ చేశారని, ఇది సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. వెలుగు అధికారుల ద్వారా ప్రీమియం తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్ ఈ విషయంపై స్పందించడం లేదని, ఒక్కో సారు ఒక్కో గడువు విధిస్తున్నారన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు స్పందించకపోతే పుణేలో ఉన్న ఐసీఐసీఐ హెడ్డాఫీస్ ఎదుట ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. సర్కార్ పాలనపై టీడీపీలో వ్యతిరేకత రాష్ట్రంలో చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలతోపాటు పాలకపక్షమైన టీడీపీలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అందుకు సంబంధించి 51శాతం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు టీడీపీలోనే చర్చ సాగుతోందని ఎమ్మెల్యే అంజద్‌బాష, పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబులు మండిపడ్డారు. వ్యతిరేకత ఉన్న విషయాన్ని స్వయంగా ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ స్పష్టం చేస్తున్నారని వారు వివరించారు. మన రాష్ట్రం 82శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉందన్నారు. అలాంటిది రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ అందించక పోతే ఎలా? అని ప్రశ్నించారు. రైతులు, మహిళలు అన్నివర్గాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రీమియం కట్టి పంట నష్టపోయిన ఇన్సూరెన్స్ చెల్లించకపోవడం దారుణమన్నారు. అదే సమయంలో జన్మభూమి–మాఊరు కార్యక్రమానికి వెళుతున్న వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో వైఎస్సార్‌సీపీనేతలు వినతిపత్రం అందించి....ప్రీమియం కట్టిన ప్రతి రైతుకు బీమా వచ్చేలా చూడాలని కోరారు. -
ఇక సర్కారీ ఇన్సూరెన్స్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పత్తి సాగు చేసిన రైతుల కోసం పంజాబ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా కంపెనీలు ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. ఆయా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాచారం తెప్పించుకొని, లోటుపాట్లపై అధ్యయనం చేయిస్తున్నారని తెలిపారు. ఎకరా పత్తికి రూ.33 వేలు ఇన్సూరెన్స్ చేస్తారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 10 శాతం చొప్పున ప్రీమియం చెల్లిస్తే.. రైతు ఐదు శాతం అంటే రూ.1,650 ప్రీమియం చెల్లించాలన్నారు. ప్రీమియం ఎక్కువగా ఉండటంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఎక్కువ మంది రైతులు ఇన్సూరెన్స్ చేయించుకోలేకపోతున్నారని చెప్పారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో ముఖ్యమంత్రి పలుసార్లు చర్చించారన్నారు. గత ఏడాది పలు బ్యాంకుల ఇన్సూరెన్స్ కంపెనీల లాభం రూ.16 వేల కోట్లు ఉందని, రైతులకు రావాల్సింది వాళ్లు లాభాల్లో చూపించుకుంటున్నారని పేర్కొన్నారు. -
2 కోట్ల అసంఘటిత రంగ కార్మికులకు బీమా
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రాష్ట్రంలోని 2 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా పథకంలో బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ డి. వరప్రసాద్ తెలిపారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరంలోని లా హాæస్పిన్ హోటల్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు దేశంలో మొదటిసారిగా మన రాష్ట్రంలోనే బీమా సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ఈ బీమా ద్వారా ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల నగదు చెల్లిస్తారన్నారు. సాధారణ మరణానికి రూ. 30 వేలు ఇస్తారన్నారు. ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగితే రూ. 5 లక్షలు, పాక్షిక, శాశ్వత అంగ వైకల్యం చెందితే రూ. 3.62 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. అంతేకాకుండా ఆ కార్మికుల పిల్లలకు 9, 10, ఇంటర్, ఐఐటి చదివే వారికి సంవత్సరానికి రూ. 1,200 చొప్పున స్కాలర్ షిప్ అందజేస్తారన్నారు. చంద్రన్న బీమాలో నమోదు చేసుకున్నవారికి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా వివాహ కానుక, ప్రసూతి సహాయం, తాత్కాలిక ప్రమాద భృతి, వృత్తి నైపుణ్య శిక్షణ, అంత్య క్రియల సహాయం వంటి సదుపాయాలు కూడా లభిస్తాయన్నారు. ఎన్ఆర్ఈజీఎస్లో కూడా 50 రోజులు పని చేసిన కూలీలను భవన నిర్మాణ కార్మికులుగా పరిగణిస్తారని తెలిపారు. ఈ పథకం కింద కార్మికులకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తం రూ. 134 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందన్నారు. సర్వీసు ఛార్జీ కింద బీమాదారు కేవలం రూ. 15 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చనిపోయిన వ్యక్తి పేరిట బీమా
పదేళ్ల క్రితమే మృతిచెందిన పాలసీదారు ఏడాది క్రితం కొత్త పాలసీ కట్టిన సోదరుడు మూడు నెలల క్రితం మృతి చెందినట్లు ధ్రువీకరణ పత్రం క్లెయిం చేసి బీమా కంపెనీని బురిడీ కొట్టించేందుకు యత్నం కంపెనీ ప్రతినిధి విచారణతో వెలుగులోకి చొప్పదండి : డబ్బు కోసం మనిషిని ఎంతటి కక్కుర్తికైనా ఒడిగడతాడనడానికి ఈ సంఘటన ఓ చక్కటి ఉదాహరణ. అక్రమంగా బీమా సొమ్ము పొందేందుకు ఓ వ్యక్తి పదేళ్ల క్రితమే చనిపోయిన తన అన్న పేరిట పాలసీ తీసుకుని బీమా సంస్థను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. చొప్పదండి గ్రామ పంచాయతీ పరిధిలోని తొగిరిమామిడికుంట ప్రాంతానికి చెందిన ఇరుగురాల శంకరయ్య పదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పుడు ఆయన వయస్సు 30 ఏళ్లు. ఇతడి సోదరుడు మల్లేశం డబ్బు కోసం శంకరయ్య పేరిట ఏడాది క్రితం ఓ ప్రయివేటు కంపెనీ బీమా పాలసీ తీసుకున్నాడు. రూ.5 లక్షల పాలసీ కోసం రూ.15 వేల ప్రీమియం చెల్లించాడు. గత మే నెలలో శంకరయ్య మృతి చెందినట్లు గ్రామ పంచాయతీ నుంచి తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శికి పూర్తి వివరాలు తెలియకపోవడంతో ఓ వ్యక్తి సాయంతో కార్యాలయ సిబ్బంది సహకారంతో పదేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి మూడు నెలల క్రితమే మరణిచినట్లు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. విచారణతో వెలుగులోకి.. బీమా కంపెనీలకు క్లెయిమ్‌లు చేసిన సమయంలో సదరు కంపెనీకి చెందిన అధికారి ఒకరు పాలసీదారు మృతిపై విచారణ జరుపుతారు. పాలసీ తీసుకున్న కంపెనీ ప్రతినిధి శుక్రవారం చొప్పదండికి వచ్చి మృతుడి వివరాలు ఆరా తీశారు. మృతుడి ఇంటి పరిసరాలలోని వారు శంకరయ్య పదేళ్ల క్రితమే చనిపోయినట్లు చెప్పడంతో విచారణ జరుపుతున్న ప్రతినిధికి అనుమానం వచ్చింది. వెంటనే స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శి వెంకట రాజశేఖర్‌ను మరణ ధ్రువీకరణ పత్రం జారీ గురించి ఆరా తీశాడు. ఆయన కార్యాలయంలోని ఫైళ్లు పరిశీలించగా పదేళ్ల క్రితమే చనిపోయినట్లు తేలింది. మల్లేశం తప్పుడు దరఖాస్తుతో తమ వద్ద మరణ ధ్రువీకరణ పత్రం పొందాడని, బీమా సంస్థను బురిడీ కొట్టించేందుకు ఎత్తులు వేశాడని గుర్తించారు. శంకరయ్య మృతిపై జారీ చేసిన ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తున్నట్లు బీమా కంపెనీ ప్రతినిధికి లేఖ ఇవ్వడంతో ఆయన వెళ్లిపోయాడు. బీమా పాలసీ క్లెయిం కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రం పొందడంలో సహకరించిన వారి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారంపై కేసులు నమోదు కాకుండా అప్పుడే మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. సర్టిఫికెటర్ రద్దు చేశాం – వెంకట రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి తొగిరిమామిడి కుంటకు చెందిన మల్లేశం సెల్ఫ్ డిక్లరేషన్‌తో శంకరయ్య మరణ ధ్రువీకరణ పత్రం పొందాడు. బీమా కంపెనీ ప్రతినిధి సంప్రదించడంతో పూర్తి స్థాయి విచారణ చేసి ఇటీవల జారీ చేసిన ధ్రువీకరణను రద్దు చేశాం. డెత్ సర్టిఫికెట్ జారీ వెనుక ఎవరెవరి హస్తం ఉందో విచారణ జరపాల్సి ఉంది. తప్పుడు డెత్ సర్టిఫికెట్ జారీపై విచారణ మెట్పల్లి: తప్పుడు డెత్ సర్టిఫికెట్ జారీ చేసి సస్పెండ్ అయిన మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ భూమానందంను మున్సిపల్ కార్యాలయంలో సిరిసిల్ల కమిషనర్, విచారణాధికారి సుమన్‌రావు శుక్రవారం విచారణ చేశారు. బాస రాజేందర్ అనే పేరు మీద పట్టణానికి చెందిన నందగిరి దామోదర్ ఎల్ఐసీ నుంచి రూ.5 లక్షలు, రూ.10 లక్షల పాలసీలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు మరణించినట్లుగా మున్సిపల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ సమయంలో భూమానందం ఎలాంటి పరిశీలన జరుపకుండా డెత్ సర్టిఫికెట్ జారీ చేశాడు. ఈ సర్టిఫికెట్తో దామోదర్ ఎల్ఐసీ నుంచి రూ.5 లక్షలను క్లెయిమ్ చేసుకున్నాడు. ‘సాక్షి’ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తేవడంతో ఎల్ఐసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు కేసు నమోదు చేసి ఇప్పటి వరకు దామోదర్‌తోపాటు ఇద్దరు ఏజెంట్లు, భూమానందంను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఉన్నతాధికారులు భూమానందంను సస్పెండ్ చేసి సుమన్‌రావును విచారణాధికారిగా నియమించారు. ఈ మేరకు ఆయన మెట్‌పల్లికి వచ్చి మున్సిపల్ కార్యాలయంలో డెత్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత రికార్డులను పరిశీలించి భూమానందం నుంచి వివరాలు సేకరించారు.