
న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం(ఈడీఎల్‌ఐ) కింద పొందే గరిష్ట ప్రయోజన పరిమితిని ఈపీఎఫ్‌ఓ రూ. 7 లక్షలకు పెంచింది. దీంతో ఈపీఎఫ్ సభ్యులు అనారోగ్యం, యాక్సిడెంట్ లేదా సహజ కారణాలతో మరణించినట్లయితే వారి నామినీకి రూ.7 లక్షల వరకు చెల్లిస్తారు. ఈపీఎఫ్‌ఓ సభ్యులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
గతంలో డెత్ ఇన్సూరెన్స్ పరిమితి 2–6 లక్షల రూపాయలుండగా, తాజాగా ఈ పరిమితిని రూ.2.5–7 లక్షల రూపాయలకు పెంచినట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. మరణానికి 12 నెలల ముందు ఉద్యోగి పొందిన సరాసరి జీతం ఆధారంగా కవరేజ్ వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment