70 శాతం వాటా కొనుగోలు
డీల్ విలువ రూ. 5,560 కోట్లు
న్యూఢిల్లీ: కొటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 70 శాతం వాటాను జ్యురిక్ ఇన్సూరెన్స్ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 5,560 కోట్లుగా కొటక్ మహీంద్రా బ్యాంక్ పేర్కొంది. సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి జ్యురిక్ 70 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు తెలియజేసింది.
దీంతో విదేశీ యాజమాన్య వాటాను 74 శాతం వరకూ అనుమతించిన తర్వాత దేశీయంగా జనరల్ ఇన్సూరెన్స్‌లో ప్రవేశించిన తొలి విదేశీ కంపెనీగా జ్యురిక్ నిలిచినట్లు పేర్కొంది. 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతూ 2021లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనలను సవరించిన సంగతి తెలిసిందే.
30 శాతం బ్యాంక్ చేతిలో కొటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో మిగిలిన 30% వాటాను ప్రస్తుతం కొటక్ మహీంద్రా బ్యాంక్ కలిగి ఉంది. మరోపక్క మెజారిటీ వాటా కొనుగోలుతో సంస్థ పేరు జ్యురిక్ కొటక్ జనరల్ ఇన్సూరెన్స్‌గా మారినట్లు జ్యురిక్ ఇన్సూరెన్స్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment