Kotak Mahindra
-
హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్!
న్యూఢిల్లీ: అకౌంటింగ్లో అవకతవకల ఆరోపణలతో అదానీ గ్రూప్‌ను కుదిపేసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకాజ్ నోటీసులు జారీ చేసింది. అదానీ సంస్థల స్టాక్స్ విషయంలో అనుచిత వ్యాపార విధానాలను అమలు చేశారనే ఆరోపణల మీద జూన్ 27న తమకు 46 పేజీల నోటీసు వచ్చినట్లు హిండెన్‌బర్గ్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఇది అర్ధరహితమైన చర్యగా కొట్టిపారేసింది. కార్పొరేట్ అవినీతిని, మోసాలను బహిర్గతం చేసేవారిని భయపెట్టేందుకు భారత్‌లో అత్యంత శక్తిమంతులైన వారు చేస్తున్న ప్రయత్నమని వ్యాఖ్యానించింది.అదానీ గ్రూప్ స్టాక్స్‌లో తమకు షార్ట్ పొజిషన్లు ఉన్నాయనే విషయాన్ని అధ్యయన నివేదికను ప్రకటించినప్పుడే తాము వెల్లడించామని హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఒక ఇన్వెస్టర్ తరఫున తీసుకున్న పొజిషన్లకు సంబంధించి 4.1 మిలియన్ డాలర్లు లభించాయని, సొంతంగా అదానీ అమెరికా బాండ్లను షార్ట్ చేయడం ద్వారా 31,000 డాలర్లు వచ్చాయని తెలిపింది. లీగల్ ఖర్చులు, అధ్యయనంపై చేసిన వ్యయాలకు అవి బొటాబొటీగా సరిపోయాయని వివరించింది. ఆర్థికంగా గానీ వ్యక్తిగత భద్రతపరంగా గానీ అదానీ గ్రూప్‌పై అధ్యయనం తమకు ఏమాత్రం ప్రయోజనకరమైనది కాకపోయినా ఇప్పటివరకు తాము చేసిన వాటిల్లో అత్యంత గర్వకారణమైనదిగా ఇది నిలిచిపోతుందని హిండెన్‌బర్గ్ తెలిపింది. కోటక్ గ్రూప్ పాత్ర .. అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేసేందుకు తమ భాగస్వామ్య ఇన్వెస్టరు ఒకరు .. కోటక్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ ఫండ్‌ను ఉపయోగించినట్లు హిండెన్‌బర్గ్ తెలిపింది. ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ పేరు బైటికి రాకుండా చూసేందుకే సెబీ తన నోటీసులో కోటక్‌ను ప్రస్తావించకుండా కే–ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ (కేఐవోఎఫ్) అని మాత్రమే పేర్కొందని ఆరోపించింది. సెబీ నోటీసుల ప్రకారం హిండెన్‌బర్గ్ క్లయింట్ అయిన కింగ్డన్ క్యాపిటల్.. అధ్యయన నివేదిక విడుదలకు ముందు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్కి (కేఎంఐఎల్) చెందిన కేఐవోఎఫ్లో ఇన్వెస్ట్ చేసింది.అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను షార్ట్ చేసిన కేఐవోఎఫ్ .. నివేదిక విడుదల తర్వాత పరిణామాలతో మొత్తం రూ. 183.24 కోట్ల లాభాలు ఆర్జించింది. మరోవైపు, కేఐవోఎఫ్, కేఎంఐఎల్‌కు హిండెన్‌బర్గ్ ఎన్నడూ క్లయింటుగా లేదని కోటక్ మహీంద్రా గ్రూప్ స్పష్టం చేసింది. తమ ఇతర ఇన్వెస్టర్లకు, హిండెన్‌బర్గ్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి తమకు తెలియదని పేర్కొంది. అదానీ గ్రూప్‌లో షేర్లు, అకౌంట్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
జ్యురిక్ చేతికి కొటక్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: కొటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 70 శాతం వాటాను జ్యురిక్ ఇన్సూరెన్స్ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 5,560 కోట్లుగా కొటక్ మహీంద్రా బ్యాంక్ పేర్కొంది. సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి జ్యురిక్ 70 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు తెలియజేసింది. దీంతో విదేశీ యాజమాన్య వాటాను 74 శాతం వరకూ అనుమతించిన తర్వాత దేశీయంగా జనరల్ ఇన్సూరెన్స్‌లో ప్రవేశించిన తొలి విదేశీ కంపెనీగా జ్యురిక్ నిలిచినట్లు పేర్కొంది. 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతూ 2021లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనలను సవరించిన సంగతి తెలిసిందే. 30 శాతం బ్యాంక్ చేతిలో కొటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో మిగిలిన 30% వాటాను ప్రస్తుతం కొటక్ మహీంద్రా బ్యాంక్ కలిగి ఉంది. మరోపక్క మెజారిటీ వాటా కొనుగోలుతో సంస్థ పేరు జ్యురిక్ కొటక్ జనరల్ ఇన్సూరెన్స్‌గా మారినట్లు జ్యురిక్ ఇన్సూరెన్స్ పేర్కొంది. -
ఆర్బీఐ కొట్టిన దెబ్బ.. షేర్లు భారీగా పతనం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొట్టిన దెబ్బతో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాని వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఉదయ్ కోటక్ సంపదకు కూడా భారీగా గండి పడింది.కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.ఆర్బీఐ చర్యల తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం 13 శాతం వరకు పడిపోయాయి. కంపెనీలో దాదాపు 26 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఉదయ్ కోటక్ భారీ నష్టాన్ని చవిచూశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10 వేల కోట్లు) తగ్గింది. ఏప్రిల్ 24 నాటికి ఉదయ్ కోటక్ నెట్‌వర్త్ 14.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 లక్షల కోట్లు).ప్రత్యర్థి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ 2016 సెప్టెంబర్ తర్వాత మొదటిసారి కోటక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించిన తర్వాత యాక్సిస్ షేర్లు పుంజుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవోగా ఉదయ్ కోటక్ తప్పుకొన్న తర్వాత అశోక్ వాస్వానీ ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్నారు. -
సంప్రదాయంగా ఉండక్కర్లేదు.. ఎందుకంటే..
నియంత్రణ సంస్థలు మరీ సంప్రదాయకంగా ఉండాల్సిన అవసరం లేదని, ఆర్థిక రంగంలో ప్రమాదాలకు వేగంగా స్పందించాల్సిందేనని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపక డైరెక్టర్ ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. కేవైసీ నిబంధనల అమలులో వైఫల్యానికి గాను ఇటీవలే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ నిషేధం విధించడం తెలిసిందే. ఈ తరుణంలో ఉదయ్ కోటక్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘అసలు ప్రమాదాలే లేని విధానం ప్రమాదకరమైంది. వేగంగా వృద్ధి చెందాలని కోరుకునేట్టు అయితే, చక్కని నియంత్రణలు కూడా అవసరమే. కొన్ని ప్రమాదాలు తలెత్తొచ్చు. కానీ, ఎంత వేగంగా స్పందించాం, చక్కదిద్దామన్నదే కీలకం’’అని ఆల్ ఇండియా మేనేజ్మెంట్ ఆసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించిన సమావేశంలో భాగంగా ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: పిల్లల కోసం ‘ఎల్ఐసీ అమృత్‌బాల్’.. ప్రత్యేకతలివే.. గతం తాలూకూ మచ్చలు నియంత్రణ సంస్థలను మరింత రక్షణాత్మకంగా లేదా అప్రమత్తంగా మార్చకూడదంటూ, అదే సమయంలో మెరుగైన నియంత్రణ వాతావరణం అవసరమేనన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ గురించి ప్రస్తావన రాగా, ‘‘విడిగా వేరే కంపెనీ గురించి నేను వ్యాఖ్యానించను. కానీ, ఆర్బీకి మీ కంటే, నా కంటే ఎక్కువే తెలుసు’’అని పేర్కొన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మార్చి 15 తర్వాత నుంచి ఎలాంటి డిపాజిట్లు స్వీకరించరాదని ఆర్బీఐ నిషేధించడం తెలిసిందే. -
కొటక్ మహీంద్రా క్యూ3 గుడ్
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 4,265 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం రూ. 2,792 కోట్ల నుంచి రూ. 3,005 కోట్లకు బలపడింది. డిబెంచర్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. వడ్డీ ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 16 శాతం పుంజుకుని రూ. 6,554 కోట్లకు చేరగా.. నికర వడ్డీ మార్జిన్లు 5.47 శాతం నుంచి 5.22 శాతానికి స్వల్ప వెనకడుగు వేశాయి. ఇతర ఆదాయం రూ. 1,948 కోట్ల నుంచి రూ. 2,2,97 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 149 కోట్ల నుంచి రూ. 579 కోట్లకు పెరిగాయి. ఫలితంగా లాభాల్లో వృద్ధి పరిమితమైనట్లు వెల్లడించింది. బ్యాంక్ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్(ఏఐఎఫ్‌లు)లో పెట్టుబడులకు రూ. 190 కోట్లమేర కేటాయింపులు చేపట్టినట్లు పేర్కొంది. అన్సెక్యూర్డ్ రుణాల కారణంగా తాజా స్లిప్పేజీలు రూ. 748 కోట్ల నుంచి రూ. 1,177 కోట్లకు పెరిగాయి. బ్యాంక్ పటిష్టస్థితిలో ఉన్నట్లు ఎండీ, సీఈవోగా కొత్తగా ఎంపికైన అశోక్ వాస్వాని స్పష్టం చేశారు. కనీస మూలధన నిష్పత్తి 20 శాతం నుంచి 19 శాతానికి వెనకడుగు వేసింది. వారాంతాన బీఎస్ఈలో కొటక్ మహీంద్రా షేరు 2.3 % బలపడి రూ. 1,806 వద్ద ముగిసింది. -
పెట్టుబడి లక్ష.. లాభం రూ. 2 వేల కోట్లు.. షాకింగ్‌గా ఉన్నా ఇదే నిజం!
మీకు కొటక్ మహీంద్రా బ్యాంక్ గురించి తెలుసే ఉంటుంది. అయితే మీరెప్పుడైనా కొటక్ మహీంద్రా బ్యాంక్ పేరులో ‘మహీంద్రా’ అనే పేరు ఎందుకు ఉందోనని అనుకున్నారా? ఆనంద్ మహీంద్రా వాళ్ల ఇంటి పేరు మీదగా కొటక్ మహీంద్రా బ్యాంక్‌గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది. అలా కొటక్‌లో మహీంద్రా అనే పేరు కలపడానికి ఇంకేమైనా కారణాలున్నాయా? ఇదిగో ఇలా మీరెప్పుడైనా ఆలోచించారా? ఉదయ్ సురేష్ కొటక్ (ఉదయ్ కొటక్) ఉన్నత మధ్యతరగతి గుజరాతీ కుటుంబంలో జన్మించారు. వంట గది తరహాలో ఉండే ఇంట్లో 60 మంది కుటుంబ సభ్యులతో కలిసుండేవారు. అయితే ఉదయ్‌లో ఉన్న ప్రతిభకు పేదరికం ఎప్పుడూ అడ్డు కాలేదు. ఉన్నత చదువులు పూర్తి చేసి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని అనుకున్నారు. 1985లో ఉదయ్ కొటక్‌కు పల్లవిలకు వివాహం జరిగింది.పెళ్లికి అప్పుడే హార్వర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన ఆనంద్ మహీంద్రా హాజరయ్యారు. ఆనంద్ మహీంద్రాకు ఉదయ్ కొటక్‌కు కామన్ ఫ్రెండ్ ఉండేవారు. అతను ఉదయ్ సొంతంగా ఓ బ్యాంక్‌ను ప్రారంభించాలి’అని అనుకుంటున్న విషయాన్ని ఆనంద్ మహీంద్రాకు చెప్పారు. వెంటనే తన వద్ద ఉన్న లక్ష రూపాయల్ని ఉదయ్ కొటక్ ప్రారంభించబోయే సంస్థలో పెట్టుబడి పెట్టారు. మొత్తం 30 లక్షలతో ప్రారంభమైన ఆ సంస్థకు తొలుత ఉదయ్ కోటక్, సిడ్నీ ఏఏ పింటో అండ్ కోటక్ & కంపెనీ పేరుతో కార్యకలాపాల్ని ప్రారంభించింది. ఆ తర్వాత అదే ఏడాది కొటక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా అవతరించింది. ఆ మరుసటి ఏడాది హరీష్ మహీంద్రా, ఆనంద్ మహీంద్రాలో వాటా కొనుగోలు చేశారు. ఆ కంపెనీ పేరు కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్‌గా 2003లో కోటక్ మహీంద్రా బ్యాంక్‌గా ప్రసిద్ధి చెందింది. ఆ బ్యాంక్ విలువ రూ.1.14లక్షల కోట్లకు చేరింది. కోటక్ మహీంద్రా గ్రూప్ నవంబర్ 1985లో కోటక్ గ్రూప్‌లో లక్ష పెట్టుబడి పెట్టారు. ఆ లక్ష పెట్టుబడి కాస్తా 2017 ఏప్రిల్ 1 నాటికి రూ.1,400 కోట్లుకు చేరింది. పలు ఇంటర్వ్యూల్లో ఆనంద్ మహీంద్రా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తాను తీసుకున్న మంచి పెట్టుబడి నిర్ణయాల్లో ఇదొకటని గుర్తు చేసుకుంటుంటారు. 1985. Young Uday Kotak enters my office&offers financing.He's so smart,I ask if I can invest in him.My Best decision https://t.co/cCfntHkiih — anand mahindra (@anandmahindra) March 25, 2017 ప్రస్తుతం, పలు నివేదికల అంచనాల ప్రకారం.. కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో ఆనంద్ మహీంద్రా వాటా అక్షరాల రూ.2 వేల కోట్లుకు చేరినట్లు తెలుస్తోంది. మహీంద్రా కుటుంబ సభ్యుల పేరు మీద కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో మొత్తం 3.68 వాటా ఉంది. ఇదీ చదవండి : నీకు జీవితాంతం రుణపడి ఉంటా -
ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? కొత్త రూల్స్ చూసారా..!
కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. ఈ తరుణంలో ఎన్నెన్నో కొత్త రూల్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డులలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. ఇందులో ఎస్బీఐ, కోటక్ మహీంద్రా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నాయి. ఈ బ్యాంకులు చేసిన మార్పులను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీచేసే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్బీఐ కార్డ్) తమ AURUM కార్డ్‌లలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. దీని ప్రకారం ఆరమ్ కార్డు కలిగిన వారు RBL Luxeకి బదులుగా టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ. 5000 వోచర్ పొందుతున్నారు. గతంలో రూ.5 లక్షలు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన వారికి ఆర్బీఎల్ లగ్జరీ నుంచి ఈ వోచర్ వచ్చేది. ఈజీ డైనర్ ప్రైమ్, లెన్స్ కార్ట్ గోల్డ్ మెంబర్ షిప్ ప్రయోజనాలను తొలగించింది. అయితే ఈ కార్డు మీద ప్రైమ్ అండ్ లెన్స్‌కార్ట్ గోల్డ్ మెంబర్షిప్ బెనిఫిట్ ఇకపై అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) 2023 మే 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కూడా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఏటీఎమ్ నుంచి అమౌంట్ డ్రా చేసుకోవడం వంటి లావాదేవీలపైన రూ. 10 + జీఎస్టీ విధిస్తోంది. అంతే కాకుండా డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు వంటి వాటికి కూడా కొంత రుసుము అమలు చేసే ప్రక్రియలో బ్యాంకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు విషయానికి వస్తే, ఇది 2023 మే 23 నుంచి డెబిట్ కార్డు చార్జీలను రూ. 259తో పాటు GST పెంచనున్నట్లు తమ కస్టమర్లకు ఒక మెయిల్ ద్వారా తెలిపింది. గతంలో ఈ చార్జీలు రూ. 199 ప్లస్ జీఎస్టీతో ఉండేది. కావున ఈ బ్యాంకు కూడా త్వరలోనే కొత్త రూల్స్ ద్వారా కస్టమర్ల మీద పెను భారాన్ని మోపే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
కోటక్ మహీంద్రా లాభం ప్లస్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఏడాది(2022–23) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 21 శాతం పుంజుకుని రూ. 3,608 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 27 శాతం జంప్‌చేసి రూ. 2,581 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 8,408 కోట్ల నుంచి రూ. 10,047 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 27 శాతం బలపడి రూ. 5,099 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 5.17 శాతానికి చేరాయి. అయితే ఆటోమాటిక్ పద్ధతిన రుణాలపై మార్కెట్‌కు అనుసంధానమైన రేట్లతో మార్జిన్లు మెరుగుపడటం ఇందుకు దోహదం చేసినప్పటికీ భవిష్యత్‌లో 4.25–4.35 శాతం స్థాయిలో ఇవి కొనసాగగలవని బ్యాంక్ వివరించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.19 శాతం నుంచి 2.08 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.06 శాతం నుంచి 0.55 శాతానికి దిగివచ్చాయి. తాజా స్లిప్పేజీలు రూ. 983 కోట్లుగా నమోదయ్యాయి. అనుబంధ సంస్థల తీరు ఇదీ.. కోటక్ బ్యాంక్ అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ లాభం రూ. 155 కోట్ల నుంచి రూ. 270 కోట్లకు ఎగసింది. సెక్యూరిటీస్ లాభం రూ. 243 కోట్ల నుంచి రూ. 224 కోట్లకు తగ్గింది. కొటక్ ప్రైమ్ లాభం రూ. 18 కోట్లు తక్కువగా రూ. 222 కోట్లకు పరిమితమైంది. ట్రస్టీ విభాగం నుంచి రూ. 9 కోట్లు అధికంగా రూ. 106 కోట్లు లభించినట్లు కొటక్ బ్యాంక్ వెల్లడించింది. కోటక్ ఇన్వెస్ట్మెంట్స్ రూ. 11 కోట్లు తగ్గి రూ. 78 కోట్ల లాభం ఆర్జించింది. మైక్రోఫైనాన్స్ లాభం రూ. 8 కోట్ల నుంచి ఏకంగా రూ. 70 కోట్లకు దూసుకెళ్లింది. అయితే కోటక్ క్యాపిటల్ లాభం రూ. 58 కోట్ల నుంచి రూ. 22 కోట్లకు క్షీణించింది. చదవండి: వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్! -
కోటక్, ఇండస్ ఇండ్ బ్యాంకులకు ఆర్బీఐ షాక్!
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.కోటి చొప్పున జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించకపోవడం దీనికి కారణమని పేర్కొంది. నాలుగు సహకార బ్యాంకులపై కూడా జరిమానాను విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్, 2014కి సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు అలాగే కస్టమర్ ప్రొటెక్షన్ బాధ్యతలకు సంబంధించి ఆదేశాలను పాటించనందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ. 1.05 కోట్ల పెనాల్టీ విధించినట్లు ప్రకటన పేర్కొంది. నిర్దిష్ట నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను పాటించనందుకు ఇండస్ఇండ్ బ్యాంక్‌పై రూ. 1 కోటి జరిమానా విధించినట్లు వివరించింది. నవ్ జీవన్ కో–ఆపరేటివ్ బ్యాంక్, బలంగీర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, ధాకురియా కోఆపరేటివ్ బ్యాంక్ (కోల్‌కతా), ది పళని కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌పై రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ జరిమానా విధించినట్లు తెలిపింది. -
Russia-Ukraine: భారత్‌పై కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు..!
ప్రముఖ కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్ రష్యా - ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘర్షణ ఒక దేశానికి సంబంధించిన భౌగోళిక విషయాలను హైలైట్ చేస్తుంది అని అన్నారు. భారతదేశం 'ఆత్మనీర్భర్' లేదా స్వావలంబనగా మారాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. సైనిక సామగ్రి కోసం రష్యాపై భారతదేశం ఆధారపడటంతో ఉదయ్ కోటక్ ఈ వ్యాఖ్యలు చేశారు. "అణు సామర్ధ్యం కలిగిన చైనా, వైపు పాకిస్తాన్ దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రష్యన్ సైనిక పరికరాలపై మనం ఆధారపడటం శ్రేయస్కరం కాదు, అలాగే, మనకు అమెరికా చాలా దూరంలో ఉంది. కాబట్టి ప్రస్తుతం మనకు అనేక సవాళ్లు ఉన్నాయి. ఈ యుద్ధం ఖచ్చితంగా ఒక బోధించే విషయం: ఆత్మనీర్భర్ భారత్'గా మారాల్సిన సమయం అని!" కోటక్ తన ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. భారతదేశానికి అతిపెద్ద ఆయుధ సరఫరాదారులో రష్యా ఒకటి. గత ఏడాది డిసెంబర్ నెలలో భారత్, రష్యా మధ్య రక్షణ సహకారం కోసం నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి. Ukraine Russia conflict highlights that geography matters. For India, with China on one side and Pakistan on the other, both nuclear enabled, our dependence on Russian military equipment, and US far away, we have challenges. One thing this war teaches for sure : be Atmanirbhar! — Uday Kotak (@udaykotak) February 27, 2022 ఇటీవలే ఏకంగా రూ.35,000 కోట్ల విలువైన ఎస్-400 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి సమకూర్చుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా పేరున్న ఎస్-400 డీల్‌ను అమెరికా అభ్యంతరాలను తోసిరాజని మరీ ఓకే చేసుకుంది. దాంతోపాటు 6.1 లక్షల అత్యాధునిక ఏకే-203 అసాల్ట్ రైఫిళ్ల తయారీ ఒప్పందం కూడా ఇరు దేశాల మధ్య కుదిరింది. దీని విలువ రూ.5 వేల కోట్ల పైచిలుకే. రష్యాతో కలిసి యూపీలోని అమేథీ ఫ్యాక్టరీలో ఈ రైఫిళ్లను తయారు చేస్తారు. (చదవండి: ఉక్రెయిన్ నుంచి మనవాళ్లు రావాలంటే.. ఇంత ఖర్చు అవుతుందా?) -
ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుంది
న్యూఢిల్లీ: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుందని ప్రముఖ మార్కెట్ నిపుణుడు, కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (మ్యూచువల్ఫండ్/ఏఎంసీ) ఎండీ నీలేష్ షా అభిప్రాయపడ్డారు. కరోనా రెండో విడత వల్ల తాత్కాలిక సమస్యలున్నా కానీ.. దీర్ఘకాలంలో కంపెనీల లాభదాయకత మెరుగుపడడం ర్యాలీకి మద్దతునిచ్చే అంశంగా ఆయన పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్ఛంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) ‘ఈక్విటీ మార్కెట్ల భవిష్యత్తు’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో నీలేష్ షా మాట్లాడారు. ‘‘కంపెనీల లాభాల్లో పురోగతిని స్టాక్ మార్కెట్ సానుకూలంగా పరిగణిస్తోంది. 2020 జూన్ త్రైమాసికంలో రూ.32,000 కోట్లుగా ఉన్న లాభం.. 2021 మార్చి త్రైమాసికం నాటికి రూ.2,10,000 కోట్లకు పెరిగింది. దీంతో కరోనా కారణంగా స్వల్పకాలంలో ఉండే సమస్యలను మార్కెట్ పట్టించుకోవడం లేదు. దీర్ఘకాలంలో కంపెనీల లాభదాయకతను సానుకూలంగా చూస్తోంది. 2021 జూన్ త్రైమాసికంలో కంపెనీల లాభాలు తగ్గుతాయి. అయితే ఆ తర్వాత మళ్లీ పుంజుకుంటాయన్నది మార్కెట్ అంచనాగా ఉంది’’ అని నీలేష్‌షా తెలిపారు. ఇవీ సానుకూలతలు.. అందరికీ టీకాలు ఇచ్చే కార్యక్రమం, ఆరోగ్యసంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ నిర్వహణ వ్యయాలు, ప్రజల జీవనానికి మద్దతుగా ఉద్దీపన చర్యలు అన్నవి మార్కెట్లకు వచ్చే ఆరు నెలల కాలంలో ఎగువవైపు దిశగా మద్దతునిస్తాయని నీలేష్ అంచనా వేశారు. దీర్ఘకాలానికి భారత్ మూలాలు బలంగా ఉండనున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయిలో ఉండేందుకు తీసుకున్న చర్యలు, ద్రవ్యలోటు స్థిరత్వం, విదేశీ మారక నిల్వలు దండిగా ఉండడం, బ్యాంకింగ్ రంగం బలోపేతం కావడడం, భౌతిక, డిజిటల్ సదుపాయాలు అందుబాటులో ఉండడం ఆర్థిక ప్రగతికి తోడ్పడే అంశాలుగా వివరించారు. గృహ ఆధునికీకరణ, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్, డిజిటలైజేషన్ దీర్ఘకాలంలో మంచి పనితీరు చూపిస్తాయని అంచనా వేశారు. ఇదే సమావేశంలో ఏఎన్ఎంఐ ప్రత్యామ్నాయ ప్రెసిడెంట్ కమలేష్‌షా మాట్లాడుతూ.. రిటైల్ ఇన్వెస్టర్లు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా స్టాక్ మార్కెట్లలో పాల్గొంటున్న తీరు ఆనందాన్నిస్తుందన్నారు. ఆది ఆశ, భయం సిద్ధాంతాన్ని గుర్తు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. -
దశాబ్ద కనిష్టానికి గృహ రుణ రేట్లు
ముంబై: వ్యవస్థలో నిధుల లభ్యత (లిక్విడిటీ) పెరగడంతో గృహ రుణ రేట్లు దశాబ్ద కనిష్టానికి దిగొచ్చాయి. ఇలా రేట్లను తగ్గించిన వాటిల్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు సైతం ఉన్నాయి. గత వారం చివరికి బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.6.5 లక్షల కోట్ల నిధుల మిగులు ఉన్నట్టు కేర్ రేటింగ్స్ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఈ డిపాజిట్లు అన్నీ సేవిం గ్స్ ఖాతాల్లోనివే అనుకున్నా.. వాటిపై కనీసం 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ రేటును బ్యాంకులు చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో గృహ రుణాలపై రేట్లను స్వల్ప మార్జిన్‌తోనే ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2020–21లో గృహ రుణాల జారీలో వేగం తగ్గింది. 2020 జనవరిలో గృహ రుణాల మంజూరులో 17.5 శాతం ఉండగా.. 2021 జనవరిలో ఇది 7.7 శాతానికే పరిమితమైం ది. కరోనా మహమ్మారి ఎంతో మంది ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసిన విషయం తెలిసిందే. రిస్క్‌కు దూరం..: నిధుల లభ్యత అధికంగా ఉన్నప్పటికీ బ్యాంకులు రిస్క్ తీసుకునేందుకు ధైర్యం చేయలేకపోతున్నాయి. దీంతో కొంత వరకు భద్రత ఉండే గృహ రుణాల వైపు మొగ్గు చూపుతున్నాయి. వ్యక్తిగత రుణాలన్నవి అన్సెక్యూర్డ్వి. అదే గృహ రుణాల్లో ప్రాపర్టీ బ్యాంకు తనఖాలో ఉంటుంది. అందుకే ఎన్పీఏలు ఈ విభాగంలో 1% కంటే తక్కువే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతుండడంతో ఇళ్ల కొనుగోలు డిమాండ్ పెరుగుతుందని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. వినియోగదారులకూ గృ హ రుణాల విషయంలో ప్రస్తుతం పలు ప్రయోజనాలు ఉన్నాయి. గృహ రుణాలపై పన్ను రాయితీలు, అందుబాటులో ప్రాపర్టీ ధరలు, పలు చోట్ల స్టాంప్‌డ్యూటీ చార్జీల తగ్గింపు వంటివి ఆకర్షణీయమైనవే. క్రెడిట్ స్కోరే ప్రామాణికం.. ఇక అందరికీ ఒకటే రేటు అని కాకుండా.. మెరుగైన రుణ చరిత్ర ఉన్నవారికి బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీకే గృహ రుణాలను ఇస్తున్నాయి. ఎస్బీఐ 6.7 శాతం, కోటక్ బ్యాంకు 6.65 శాతం చొప్పున తాజా ఆఫర్లను తీసుకొచ్చాయి. కానీ, 800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికే ఈ రేట్లు వర్తిస్తాయి. వాస్తవానికి గృహ రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో బ్యాంకుల మధ్య పోటీకి తెరతీసింది ఎస్బీఐనే. గృహ రుణ మార్కెట్లో 34 శాతం వాటా కలిగిన ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తూ 6.7%> మార్చి 1న ప్రకటించింది. దీంతో ఇతర అగ్రగామి బ్యాంకులూ ఇదే బాటలో నడవక తప్పలేదు. -
బ్లాక్‌డీల్ విక్రయం: కోటక్ బ్యాంక్ 8శాతం జంప్
కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు 8శాతం లాభపడింది. బ్యాంక్ ప్రధాన ప్రమోటర్ ఉదయ్ కోటక్ నేడు బ్లాక్‌డీల్ పద్దతిలో సెకండరీ మార్కెట్ ద్వారా 2.8శాతం వాటా(56లక్షల మిలియన్ షేర్లు)ను విక్రయించనున్నారు. ఆర్బీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆగస్ట్ కల్లా కోటక్ బ్యాంక్ ప్రమోటర్ల వాటాను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ వాటా విక్రయానికి ధరల శ్రేణి రూ. 1,215-1,240గా నిర్ణయించడమైంది. అలాగే ఈ డీల్ మొత్తం విలువ రూ.6,804-6,944 కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వాటా విక్రయంతో ఉదయ్ కోటక్ ప్రమోటింగ్ వాటా 28.94 శాతం నుంచి 26.1 శాతానికి దిగివస్తుంది. ఆర్బీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆగస్ట్ కల్లా కోటక్ బ్యాంక్ ప్రమోటర్ల వాటాను తగ్గించుకోవాల్సి ఉంటుంది. వాటా విక్రయ వార్తలతో కోటక్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 5శాతం లాభంతో 5.66శాతం లాభంతో రూ.1320 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒకదశలో 8శాతం లాభంతో రూ.1348 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:30 సమయంలో 5.50శాతం లాభంతో రూ.1318.00 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1000.35, రూ.1739.95గా ఉన్నాయి. -
వాహనదారులకు యాక్సిస్ ఉచిత ఫాస్టాగ్స్
ముంబై: జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే డిసెంబర్ ఒకటి నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని నెలలపాటు ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తామని యాక్సిస్ బ్యాంక్ బుధవారం ప్రకటించింది. ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంలో భాగంగా టోల్‌ప్లాజాలు, పార్కింగ్ ప్రాంతాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ఫాస్టాగ్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుండగా.. ఈ టెక్నాలజీకి సేవలందించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీంతో పాటు ఇందుకోసం ప్రతి ఒక్క ట్యాగ్‌కు రూ. 100 వరకు ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించింది. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తుండగా, ప్రాసెసింగ్ ఛార్జీలను ఎత్తివేసినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈనెల చివరివరకే ఈ సేవలు అందిస్తామని ఇరు బ్యాంకులు ప్రకటించాయి. 70 లక్షల ఫాస్టాగ్‌ల జారీ దేశవ్యాప్తంగా 70 లక్షల ఫాస్టాగ్‌లను (బుధవారం నాటికి) జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 26 (మంగళవారం) నాడు అత్యధికంగా 1,35,583 ట్యాగ్లు అమ్ముడుకాగా, అంతకుముందు రోజు 1.03 లక్షల విక్రయాలు నమోదైనట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ వెల్లడించింది. -
ఆర్బీఐ ఎఫెక్ట్: డిపాజిట్లపై వడ్డీరేటు కోత
సాక్షి, ముంబై: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మానిటరీ రివ్యూలో 25 పాయింట్ల రెపో రేట్ కట్ తరువాత దేశీయ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిప్ బ్యాంకు, కోటక్ మహీంద్ర , హెచ్డీఎఫ్సీ బ్యాంకు వివిధ కాలపరిమితి గల డిపాజిట్లపై వినియోగదారులకు చెల్లించే వడ్డీరేటు స్వల్పంగా తగ్గించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్ల కోసం ఎంపిక చేసిన మెచ్యూరిటీలపై 10 -25 బిపిఎస్ మధ్య వడ్డీ రేట్లను తగ్గించింది. 61-90 రోజులు, 91-120 రోజులు, 121-184 రోజుల కాలపరిమితి డిపాజిట్లపై 6 శాతం వడ్డీ చెల్లిస్తుంది. అదేవిధంగా, 390 రోజుల నుండి 2 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లపై కొత్త రేటు 7.10 శాతం నుండి 7 శాతానికి పడిపోయింది, 2-3 సంవత్సరాల డిపాజిట్లపై 20 బిపిఎస్ నుండి 7.3 శాతానికి తగ్గింది. యాక్సిస్ బ్యాంకు దేశీయ డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ రూ .2 కోట్ల లోపు ఒక సంవత్సరం మెచ్యూరిటీలపై డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించామని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. ఉదాహరణకు, బ్యాంక్ ఇప్పుడు 1 సంవత్సరం డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ చెల్లించనుంది. ఈ సవరించిన రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక అడుగు ముందుకు వేసి, బిల్ల డిపాజిట్ కాలాన్ని ఆఫర్లో ఉన్న మొత్తం పదవీకాలం 20 నుండి 18నెలలకు తగ్గించింది. 18 నెలలు- 2 సంవత్సరాల లోపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు 7.10 శాతంగా ఉంది. గతంలో మూడు వేర్వేరు 391 రోజుల నుండి 2 సంవత్సరాల కన్నా తక్కువ 7.20 శాతంగా ఉంది. అదేవిధంగా, 2-3 సంవత్సరాల దేవిధంగా, 2-3 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లు ఇప్పుడు 10 బీపీఎస్ పాయింట్లు తగ్గించి ప్రస్తుతం 7శాత వడ్డీని చెల్లిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కూడా డిపాజట్లపై వడ్డీరేటును తగ్గించింది. ఈ సవరించిన రేట్లు జూన్12నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. 2కోట్ల రూపాయల లోపు డిపాజిట్లపై చెల్లించేవడ్డీరేటు 7.30శాతంగా ఉంది. 2-3 ఏళ్ల డిపాజిట్లపై 7.25 శాతానికి తగ్గించింది. 5-10 ఏళ్ల డిపాజిట్లపై 6.5శాతం వడ్డీని చెల్లిస్తుంది. -
రిస్క్ ఉన్నా రాబడులు ఆశించే వారికి...
స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్ దిద్దుబాటుకు గురై ఆకర్షణీయ విలువలకు చేరాయి. గతేడాది స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 21 శాతం పతనం కాగా, మిడ్‌క్యాప్ సూచీ 12 శాతం మేర నష్టపోయింది. స్మాల్క్యాప్తో పోలిస్తే మిడ్‌క్యాప్ కంపెనీల్లో అస్థిరత కాస్త తక్కువ. ఈ తరుణంలో మంచి మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకుని దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులను సొంతం చేసుకునేందుకు అవకాశాలున్నాయి. అధిక రిస్క్ తీసుకున్నా గానీ, రాబడులు మెరుగ్గా ఉండాలనుకునే వారు కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో 9 శాతం నికర నష్టాలు ఉన్నాయి. కానీ, మిడ్‌క్యాప్ పథకాల రాబడులకు ప్రామాణికంగా చూసే నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 టీఆర్ఐ ఇండెక్స్ ఇదే కాలంలో 12.2 శాతం నష్టపోగా, దీంతో పోలిస్తే ఈ పథకంలో నష్టాలు కాస్త తక్కువే ఉన్నాయని భావించాల్సి ఉంటుంది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 10.5 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 19.2 శాతం చొప్పున ఈ పథకం ఇన్వెస్టర్ల పెట్టుబడులపై రాబడులను ఇచ్చింది. ఇదే కాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ రాబడులు మూడేళ్లలో 9.3 శాతం, ఐదేళ్లలో 13.6 శాతంగానే ఉన్నాయి. ఇక పదేళ్ల కాలంలో చూసుకున్నా కానీ ఈ పథకం వార్షికంగా సగటున 17 శాతం చొప్పున రాబడులను ఇవ్వడం గమనార్హం. బుల్ మార్కెట్లలో బెంచ్ మార్క్ కంటే అధిక రాబడులను ఇవ్వడంతోపాటు, కరెక్షన్లలో బెంచ్ మార్క్‌తో పోలిస్తే నష్టాలు తగ్గినట్టు ఈ పథకం పనితీరును పరిశీలిస్తే తెలుస్తుంది. ఇతర పోటీ పథకాలు హెచ్డీఎఫ్సీ మిడ్‌క్యాప్ అపార్చునిటీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మిడ్‌క్యాప్, ఎల్అండ్టీ మిడ్‌క్యాప్ పథకాల కంటే మెరుగ్గా కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ నష్టాలనుతక్కువకు పరిమితం చేయడాన్ని గమనించొచ్చు. పెట్టుబడుల విధానం: అప్పుడే అభివృద్ధి చెందుతున్న లేదా అప్పటికే అభివృద్ధి ప్రయాణం ఆరంభించిన మిడ్‌క్యాప్ కంపెనీలను పరిశోధన ద్వారా గుర్తించి ఇన్వెస్ట్ చేయడం అ పథకం అనుసరించే విధానం. ఈ తరహా స్టాక్స్‌లో మోస్తరు అస్థిరతలు ఉండడమే కాదు, దీర్ఘకాలంలో మంచి రాబడులకూ అవకాశం ఉంటుంది. పోర్ట్‌ఫోలియోలో 82 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్స్‌కు, స్మాల్‌క్యాప్‌నకు 12 శాతం చొప్పున కేటాయింపులు ప్రస్తుతం చేయగా, మరో 5 శాతాన్ని లార్జ్‌క్యాప్‌నకు కేటాయించింది. 2011, 2018 మార్కెట్ కరెక్షన్ల సమయాల్లో ఈ పథకంలో నష్టాలు బెంచ్ మార్క్‌తో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. 2014 నుంచి ఈ పథకం స్థిరమైన రాబడులను అందిస్తోంది. 25 రంగాలకు చెందిన 65 స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం పెట్టుబడుల్లో 20 శాతాన్ని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. తర్వాత కెమికల్స్ రంగానికి 15 శాతం, ఇంజనీరింగ్ 14 శాతం, క¯Œ స్ట్రక్ష¯Œ 9 శాతం, హెల్త్‌కేర్ రంగాల స్టాక్స్‌కు 9 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. టాప్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం పీఐ ఇండస్ట్రీస్ 3.71 రామ్‌కో సిమెంట్స్ 3.58 అతుల్ 3.42 ఏయూ స్మాల్ఫైనా 3.29 సుప్రీమ్ ఇండస్ట్రీస్ 3.20 స్కాఫ్లర్ ఇండియా 3.07 ఆర్బీఎల్ బ్యాంకు 2.84 థర్మాక్స్ 2.83 ఎస్ఆర్ఎఫ్ 2.66 సోలార్ ఇండస్ట్రీస్ 2.56 -
బ్యాంకుల్లో రోబో హల్చల్
న్యూఢిల్లీ: బ్యాంకులు టెక్నాలజీ ఆధారిత వేగవంతమైన సేవల వైపు అడుగులు వేస్తున్నాయి. సిబ్బంది అవసరాన్ని తగ్గించి టెక్నాలజీ సాయంతో ఆటోమేషన్ విధానంలో కస్టమర్ల విచారణలకు వివరాలు అందించడం, చాట్ ద్వారా, వాయిస్ ద్వారా సత్వర సేవలను అందించేందుకు విధానాలను అమలు చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, యస్ బ్యాంకులు కస్టమర్ల సేవలకు చాట్‌బాట్స్, వాయిస్ బాట్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి. 15 నెలల క్రితం నుంచి ఈ దిశగా అడుగులు వేయడం ఆరంభించాయి. ప్రాంతీయ భాషల్లో ప్రాసెసింగ్‌కు, కృత్రిమ మేథలో ఆధునికతల నేపథ్యంలో తాము భవిష్యత్తు ఆటోమేటెడ్ అంచున ఉన్నట్టు అవి పేర్కొంటున్నాయి. ‘‘ఏడాదిన్నర క్రితమే బాట్స్ (రోబో మాదిరిగా ఇంటర్నెట్ వేదికగా పనిచేసే ఓ ఆర్టిఫీషియల్ టూల్) వినియోగాన్ని ఆరంభించాం. ఇప్పటి వరకు 80 లక్షల విచారణలను పూర్తి చేశాం. సేవల విషయంలో 90 శాతం కచ్చితత్వాన్ని సాధించాం’’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిజిటల్ హెడ్ నితిత్‌చుగ్ తెలిపారు. కేవలం బ్యాంకింగ్ సేవల సహాయకారిగానే ఉండకుండా, తమ చాట్‌బాట్ అప్లికేషన్ ‘ఎవ’ ద్వారా బిల్లుల చెల్లింపులు, సినిమా టికెట్ల బుకింగ్, ఇతర సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఎవ చాట్‌బాట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నెట్‌బ్యాంకింగ్ పోర్టల్‌లో కనిపిస్తుంది. ఈ టూల్ సాయంతో కస్టమర్లు తమ సందేహాలు, సేవలకు సంబంధించిన వివరాలు పొందొచ్చు. భిన్న రూపాల్లో వచ్చే ప్రశ్నలను ఏ విధంగా పరిష్కరించాలన్న దానిపై ఈ టూల్స్‌కు బ్యాంకర్లు ఎప్పటికప్పుడు తెలియజేయడం ద్వారానే ఎక్కువ కచ్చితత్వానికి అవకాశం ఉంటుంది. కోటక్ బ్యాంకు సైతం కోటక్ మహింద్రా బ్యాంకు సైతం తన కార్యకలాపాల్లో బాట్ సేవలను ప్రోత్సహిస్తోంది. బాట్‌ద్వారా ప్రతీ కస్టమర్ ప్రతిస్పందించడాన్ని మూడు నాలుగు స్టెప్‌లకే పరిమితం చేస్తున్నామని, ఇది కస్టమర్ సేవల నిడివిని 45–50 సెకండ్లకే పరిమితం చేసేందుకు సాయపడుతోందని కోటక్ మహీంద్రా బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ కపూర్ తెలిపారు. 2018 ఫిబ్రవరిలో ప్రారంభించగా, 16 లక్షల ప్రశ్నలకు చాట్‌బాట్ సమాధానాలు ఇచ్చినట్టు, 91 శాతం అక్యురసీ ఉందని కపూర్ చెప్పారు. ఐవీఆర్ ఆధారిత సేవల పరిష్కారం సాధారణ ప్రక్రియలో 3 శాతంగా ఉంటే, బాట్ సాయంతో తొలి దశలోనే 9 శాతానికి చేరుకున్నట్టు తెలిపారు. రెండో దశలో ఇది ఇప్పటికే 14 శాతానికి చేరుకుందన్నారు. రెండో దశలో ఫిర్యాదుల నమోదు, పరిష్కారానికి అనుకూలంగా ఈ అప్లికేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు కపూర్ తెలిపారు. యస్ బ్యాంకు అయితే, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లను యస్ రోబో టూల్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఆధునిక ధోరణులే... బ్యాంకుల ఆధునిక పోకడల వెనుక కారణాలను టెక్ స్టార్టప్ యాక్టివ్ ఏఐ వ్యవస్థాపకుడు రవిశంకర్ వివరించారు. ‘‘మిలీనియల్స్ (21 శతాబ్దంలో యుక్త వయసులోకి వచ్చిన వారు) సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ఇతర వేదికల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. కనుక బ్యాంకులు సైతం ఆయా ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. మెస్సేజింగ్ యాప్స్‌కు 30 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. కానీ, బ్యాంకులకు 2.5 కోట్ల యూజర్లే ఉన్నారు. బ్యాంకులు సంభాషణల ఆధారిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌లతో కస్టమర్లకు చేరువ కావాలి. బ్యాంకు అప్లికేషన్లోనే గూగుల్ సెర్చ్ మాదిరిగా సెర్చ్ బార్ ఉండాలి. అక్కడ కస్టమర్‌కు అందుబాటులో ఉన్న అన్ని సేవల వివరాలు ఉంచాలి. అలాగే, బ్యాంకింగ్‌తో సంభాషణలన్నీ టెక్స్ట్, ఎమోజిలు, గెస్చర్స్‌తోనే జరగాలి. ఆర్థిక సేవలకు భవిష్యత్తు అంతా ఆర్టిఫీషియల్ తరమే’’ అని రవిశంకర్ పేర్కొన్నారు. ఈ తరహా సేవల వల్ల బ్యాంకులకు ఖర్చులు బాగా తగ్గుతాయి. అలాగే కస్టమర్లకు సేవలు వేగంగా అందుతాయి. -
బీమా జేవీని సొంతం చేసుకున్న కోటక్ బ్యాంక్
డీల్ విలువ రూ.1,292 కోట్లు ముంబై: కోటక్ మహీంద్రా – ఓల్డ్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్లో భాగస్వామి వాటాను కోటక్ మహీంద్రా బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఈ జేవీలో బ్రిటిష్ భాగస్వామి, ఓల్డ్ మ్యూచువల్‌కు ఉన్న 26 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు కోటక్ గ్రూప్ ప్రెసిడెంట్(అసెట్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్) గౌరంగ్ షా చెప్పారు. ఈ వాటా కొనుగోలుతో ఈ జేవీలో వంద శాతం వాటా కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఉంటుందని పేర్కొన్నారు. ఈ డీల్ విలువ రూ.1,292 కోట్లు. డీల్ ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా పూర్తవుతుందనే అంచనాలు ఉన్నాయి. గత ఏడాది ఈ జేవీ రూ.300 కోట్ల నికర లాభం ఆర్జించిందని, గత నాలుగేళ్లలో లాభాలు ఏటా 20 శాతం చొప్పున వృద్ధి చెందాయని గౌరంగ్ షా తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి ఈ సంస్థ నెట్‌వర్త్ రూ.1,825 కోట్లు. 1.50 కోట్ల మంది వినియోగదారులున్నారు. డీల్ వార్తల కారణంగా బీఎస్ఈలో కోటక్ బ్యాంక్ షేర్ 1.4% క్షీణించి రూ.901 వద్ద ముగిసింది. -
చెక్ బుక్స్ డిమాండ్ ఐదు రెట్లు పెరిగింది
కొటక్ మహీంద్రా బ్యాంక్ ముంబై: దేశీ ఐదో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ‘కొటక్ మహీంద్రా’ తాజాగా పెద్ద నోట్ల రద్దు కారణంగా చెక్ బుక్స్ డిమాండ్ ఐదు రెట్లు పెరిగిందని పేర్కొంది. అలాగే కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదవుతోందని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్–చైర్మన్ ఉదయ్ కొటక్ తెలిపారు. ఈ అంశాల ప్రాతిపదికన చూస్తే దేశం లెస్–క్యాష్ ఎకానమీ దిశగా వేగంగా అడుగులేస్తోందని చెప్పారు. ‘టెక్నాలజీతోనే బ్యాంకింగ్ రంగం ఈ ప్రపంచంతో అనుసంధానమవ్వగలదు. కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలి. వాటిని అవలంభిస్తూ ముందుకెళ్లాలి’ అని పేర్కొన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ ప్రొడక్టŠస్ సేవల కోసం ప్రజలకు సాయమందించేందుకు బ్యాంక్ ప్రతి బ్రాంచ్‌లోనూ ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించామని ఉదయ్ తెలిపారు. -
ఏటీఎంలో వంద డ్రా చేస్తే.. రూ.500 వస్తోంది!
-
ఏటీఎంలో వంద డ్రా చేస్తే.. రూ.500 వస్తోంది!
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఓ ఏటీఎం నుంచి డబ్బుల వర్షం కురిపించింది. ఏటీఎం నుంచి రూ.100 విత్ డ్రా చేసేందుకు చూడగా ఆశ్చర్యకరంగా రూ.500 నోటు వచ్చింది. ఈ విషయం తెలియడంతో మరికొందరు ఏటీఎం వద్దకు చేరుకుని ఆ విధంగా డ్రా చేసుకుని తమదారిన తాము వెళ్లిపోయారు. దాదాపు రూ.8 లక్షల మేర నగదు డ్రా అయినట్లు సమాచారం. ఆ వివరాలిలా ఉన్నాయి. ఎయిర్‌పోర్టులోకి వెళ్లే వద్ద ఉన్న రెండో గేటు సమీపంలోని కోటక్ మహీంద్రా బ్యాంకుకు చెందిన ఏటీఎంలో ఓ వ్యక్తి శనివారం సాయంత్రం రూ.2500 డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అతనికి రూ.2000 నోటు ఒకటి వచ్చింది. దాంతోపాటు ఇంకా రావాల్సిన ఐదు వందలకు రూ.100 నోట్లు 5 రావాల్సి ఉండగా రూ.500 నోట్లు ఐదు వచ్చాయి. అంటే మొత్తం రూ.4,500లు వచ్చాయి. దీంతో ఏటీఎం వద్ద క్యూలో నిలుచున్న మిగతా వారు కూడా ఇలాగే డ్రా చేసుకుని వెళ్లిపోయారు. ఈ విధంగా దాదాపు 40 నిమిషాలపాటు జరిగింది. చివరకు ఎయిర్‌పోర్టు అధికారులు గమనించి బ్యాంకు వారిని రప్పించి ఏటీఎంను తాత్కాలికంగా మూసివేయించారు. అప్పటికే సుమారు రూ.8 లక్షల మేర డ్రా అయి ఉంటాయని ఎయిర్‌పోర్టు అధికారులు, బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. అయితే సాంకేతిక లోపాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. -
బద్దలైన మరో ప్రైవేటు బ్యాంకు బాగోతం!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఉన్న యాక్సిస్ బ్యాంకు శాఖల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. యాక్సిస్ బ్యాంకు బాగోతం మరువకముందే మరో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులో నకిలీ ఖాతాల వ్యవహారం కలకలం రేపుతోంది. న్యూఢిల్లీ కస్తుర్బా గాంధీ మార్గ్‌లో ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంకు శాఖపై తాజాగా ఆదాయపన్ను (ఐటీ) అధికారులు నజర్ పెట్టారు. ఈ బ్యాంకులో దాదాపు రూ. 70 కోట్లు డిపాజిట్ చేసిన నకిలీ ఖాతాలు వెలుగుచూసినట్టు సమాచారం. ఇందులో రూ. 39 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారుల సహకారంతో తొమ్మిది నకిలీ ఖాతాలు తెరిచి.. అందులో సుమారు రూ. 39 కోట్లను డిపాజిట్ చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నకిలీ ఖాతాలన్నింటినీ రమేశ్ చంద్, రాజ్‌కుమార్ అనే వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్టు భావిస్తున్నారు. కాగా, రాధికా జెమ్స్ అనే కంపెనీ పేరిట ఉన్న మరో నకిలీ ఖాతాలో మరో 36.40 కోట్లు డిపాజిట్ చేసినట్టు తెలుస్తోంది. నకిలీ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయడమే కాదు.. పెద్ద ఎత్తున డిమాండ్ డ్రాప్ట్స్ ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు బ్యాంకు అధికారులు సహకరించినట్టు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు తమ బ్యాంకులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలు అన్ని తీసుకున్న తర్వాత ఆయా ఖాతాల్లో డిపాజిట్లకు అనుమతించామని కోటక్ మహేంద్ర బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుల విషయంలో ఐటీ అధికారుల విచారణకు సహకరిస్తున్నట్టు పేర్కొంది. -
బద్దలైన మరో ప్రైవేటు బ్యాంకు బాగోతం!
-
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్...
• డిసెంబర్లో సేవలు షురూ..! • మారుమూల పల్లెలకూ సర్వీసులు • కోటక్ మహీంద్రాతో కలసి కార్యకలాపాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ భారతి ఎయిర్టెల్ త్వరలో పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభిస్తోంది. డిసెంబర్లోనే ఈ సర్వీసులను మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. వాస్తవానికి జూలై-సెప్టెంబర్‌లో ఆరంభించాలని అనుకున్నప్పటికీ ప్రారంభ తేదీ వారుుదా పడుతూ వస్తోంది. పేమెంట్స్ బ్యాంకు సేవలను అందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంకుతో ఎరుుర్‌టెల్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఎరుుర్‌టెల్ అనుబంధ కంపెనీ అరుున ఎరుుర్‌టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్ (ఏఎంఎస్ఎల్) 2016 ఏప్రిల్‌లో ఆర్బీఐ నుంచి లెసైన్సును దక్కించుకుంది. దేశంలో పేమెంట్స్ బ్యాంకు లెసైన్సును పొందిన తొలి కంపెనీ ఏఎంఎస్ఎల్ కావడం విశేషం. మారుమూల పల్లెల్లో సేవలు..: పేమెంట్స్ బ్యాంకులో సేవింగ్స, డిపాజిట్, పేమెంట్, రెమిటెన్సు సేవలను ఆఫర్ చేస్తారు. మారుమూల పల్లెల్లో ఉన్న లక్షలాది మందికి ఆర్థిక సేవలు అందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంకు అనుభవం ఎరుుర్‌టెల్‌కు దోహదం చేయనుంది. దేశవ్యాప్తంగా ఎరుుర్‌టెల్‌కు 26 కోట్లకుపైగా మొబైల్ చందాదారులు ఉన్నారు. 15 లక్షలకుపైగా కేంద్రాల ద్వారా ఎరుుర్‌టెల్ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దేశంలో 87% జనాభాకు టెలికం కవరేజ్‌ను విస్తరించింది. బ్యాంకింగ్ రంగంలో కొత్త కస్టమర్లను దక్కించుకోవడానికి ఇరు బ్రాండ్లకు ఉన్న పాపులారిటీ ఉపయోగపడుతుంది. 2011 నుంచి ఎరుుర్‌టెల్ మనీ సేవలు అందిస్తున్న ఏఎంఎస్ఎల్ పేరును ఈ ఏడాది మే నెలలో ఎరుుర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌గా మార్చారు. -
7న ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాభాల్లో నడుస్తున్న పాతతరం ప్రైవేటు రంగ బ్యాంక్ ఐఎన్జీ వైశ్యాను కొత్త తరం ప్రైవేటు రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రాలో విలీనం చేయడంపై ఐఎన్జీ వైశ్యా బ్యాంకు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోటక్ బ్యాంక్‌లో విలీనాన్ని నిరసిస్తూ జనవరి 7న దేశవ్యాప్తంగా సమ్మె చేయునున్నట్లు ఐఎన్జీ వైశ్యా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా వైశ్యా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ కె.జె.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యూనియున్లతో మాటమాత్రమైనా చెప్పకుండా కోటక్ బ్యాంక్‌లో వీలనం చేయాలన్న ఐఎన్జీ వైశ్యా యాజమాన్య నిర్ణయాన్ని తప్పు పట్టారు.