
స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్ దిద్దుబాటుకు గురై ఆకర్షణీయ విలువలకు చేరాయి. గతేడాది స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 21 శాతం పతనం కాగా, మిడ్‌క్యాప్ సూచీ 12 శాతం మేర నష్టపోయింది. స్మాల్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్ కంపెనీల్లో అస్థిరత కాస్త తక్కువ. ఈ తరుణంలో మంచి మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకుని దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులను సొంతం చేసుకునేందుకు అవకాశాలున్నాయి. అధిక రిస్క్ తీసుకున్నా గానీ, రాబడులు మెరుగ్గా ఉండాలనుకునే వారు కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు.
రాబడులు
గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో 9 శాతం నికర నష్టాలు ఉన్నాయి. కానీ, మిడ్‌క్యాప్ పథకాల రాబడులకు ప్రామాణికంగా చూసే నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 టీఆర్‌ఐ ఇండెక్స్ ఇదే కాలంలో 12.2 శాతం నష్టపోగా, దీంతో పోలిస్తే ఈ పథకంలో నష్టాలు కాస్త తక్కువే ఉన్నాయని భావించాల్సి ఉంటుంది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 10.5 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 19.2 శాతం చొప్పున ఈ పథకం ఇన్వెస్టర్ల పెట్టుబడులపై రాబడులను ఇచ్చింది. ఇదే కాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ రాబడులు మూడేళ్లలో 9.3 శాతం, ఐదేళ్లలో 13.6 శాతంగానే ఉన్నాయి. ఇక పదేళ్ల కాలంలో చూసుకున్నా కానీ ఈ పథకం వార్షికంగా సగటున 17 శాతం చొప్పున రాబడులను ఇవ్వడం గమనార్హం. బుల్ మార్కెట్లలో బెంచ్ మార్క్ కంటే అధిక రాబడులను ఇవ్వడంతోపాటు, కరెక్షన్లలో బెంచ్ మార్క్‌తో పోలిస్తే నష్టాలు తగ్గినట్టు ఈ పథకం పనితీరును పరిశీలిస్తే తెలుస్తుంది. ఇతర పోటీ పథకాలు హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ అపార్చునిటీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మిడ్‌క్యాప్, ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్ పథకాల కంటే మెరుగ్గా కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ నష్టాలనుతక్కువకు పరిమితం చేయడాన్ని గమనించొచ్చు.
పెట్టుబడుల విధానం: అప్పుడే అభివృద్ధి చెందుతున్న లేదా అప్పటికే అభివృద్ధి ప్రయాణం ఆరంభించిన మిడ్‌క్యాప్ కంపెనీలను పరిశోధన ద్వారా గుర్తించి ఇన్వెస్ట్ చేయడం అ పథకం అనుసరించే విధానం. ఈ తరహా స్టాక్స్‌లో మోస్తరు అస్థిరతలు ఉండడమే కాదు, దీర్ఘకాలంలో మంచి రాబడులకూ అవకాశం ఉంటుంది. పోర్ట్‌ఫోలియోలో 82 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్స్‌కు, స్మాల్‌క్యాప్‌నకు 12 శాతం చొప్పున కేటాయింపులు ప్రస్తుతం చేయగా, మరో 5 శాతాన్ని లార్జ్‌క్యాప్‌నకు కేటాయించింది. 2011, 2018 మార్కెట్ కరెక్షన్ల సమయాల్లో ఈ పథకంలో నష్టాలు బెంచ్ మార్క్‌తో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. 2014 నుంచి ఈ పథకం స్థిరమైన రాబడులను అందిస్తోంది. 25 రంగాలకు చెందిన 65 స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం పెట్టుబడుల్లో 20 శాతాన్ని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. తర్వాత కెమికల్స్ రంగానికి 15 శాతం, ఇంజనీరింగ్ 14 శాతం, క¯Œ స్ట్రక్ష¯Œ 9 శాతం, హెల్త్‌కేర్ రంగాల స్టాక్స్‌కు 9 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది.
టాప్ హోల్డింగ్స్
కంపెనీ పెట్టుబడుల శాతం
పీఐ ఇండస్ట్రీస్ 3.71
రామ్‌కో సిమెంట్స్ 3.58
అతుల్ 3.42
ఏయూ స్మాల్‌ఫైనా 3.29
సుప్రీమ్ ఇండస్ట్రీస్ 3.20
స్కాఫ్లర్ ఇండియా 3.07
ఆర్‌బీఎల్ బ్యాంకు 2.84
థర్మాక్స్ 2.83
ఎస్‌ఆర్‌ఎఫ్ 2.66
సోలార్ ఇండస్ట్రీస్ 2.56
Comments
Please login to add a commentAdd a comment