Equity Funds
-
ఫండ్స్‌లో ‘సిప్’ చేస్తున్నారా..?
‘‘స్మాల్, మిడ్‌క్యాప్‌లో సిప్‌లను ఇక నిలిపేయాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నా. ఎందుకంటే వాటి వేల్యుయేషన్లు చాలా అధిక స్థాయిలో ఉన్నాయి’’ మ్యూచువల్ ఫండ్స్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న వెటరన్ ఫండ్ మేనేజర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఈవో ఎస్.నరేన్ తాజాగా చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు ఇవి. దీంతో స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో మరింత అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. నరేన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీశాయి. సిప్పై సందేహాలు ఏర్పడ్డాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి నెలవారీ రూ.26 వేల కోట్లకు పైనే పెట్టుబడులు వస్తున్నాయి. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు సిప్ మెరుగైన సాధనమన్న నిపుణుల సూచనలు, ఫండ్స్ పరిశ్రమ ప్రచారంతో ఇన్వెస్టర్లలో దీనిపై ఆకర్షణ పెరిగిపోయింది. వేతన జీవులతోపాటు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ (హెచ్ఎన్ఐలు/ధనవంతులు) సైతం సిప్‌కు జై కొడుతున్నారు. అన్ని కాలాలకూ అనువైన సాధనంగా సిప్‌ను భావిస్తుంటే, దీనిపై నరేన్ వ్యాఖ్యలు అయోమయానికి దారితీశాయి. ఈ తరుణంలో అసలు సిప్ దీర్ఘకాల లక్ష్యాల సాధనకు ఏ మేరకు ఉపకరిస్తుంది? ఇందులో ప్రతికూలతలు ఉన్నాయా? తదితర అంశాలపై నిపుణులు ఏమంటున్నారో తెలిపే కథనమిది... సిప్ అంటే..? నిర్ణిత మొత్తం, నిర్ణిత రోజులకు ఒకసారి చొప్పున ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్ చేయడానికి వీలు కల్పించేదే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). రోజు/వారం/పక్షం/నెల/మూడు నెలలకోసారి సిప్ చేసుకోవడానికి ఫండ్స్ అనుమతిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద 10.26 కోట్ల సిప్ ఖాతాలుంటే.. వీటి పరిధిలో జనవరి చివరికి మొత్తం రూ.13.12 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. మొత్తం ఈక్విటీ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో సిప్‌కు సంబంధించే 40 శాతానికి పైగా ఉన్నాయి. పొదుపు–మదుపులో క్రమశిక్షణ సిప్‌తో నిర్బంధ పొదుపు, మదుపు సాధ్యపడుతుంది. ఇన్వెస్టర్ ప్రమేయం లేకుండా ప్రతి నెలా నిర్ణిత తేదీన నిర్ణీత మొత్తం పెట్టుబడిగా మారిపోతుంది. సిప్ కాకుండా.. ఇన్వెస్టర్ వీలు చూసుకుని ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ సందర్భాల్లో సాధ్యపడకపోవచ్చు. దీర్ఘకాల లక్ష్యాల సాధనకు కావాల్సింది క్రమశిక్షణ. అది సిప్ ద్వారా సాధ్యపడుతుంది.దీర్ఘకాలంలో సంపద సృష్టి 10 ఏళ్లలో కారు కొనుగోలు. 15–20 ఏళ్లలో పిల్లల ఉన్నత విద్య, 25 ఏళ్లకు పిల్లల వివాహాలు, అప్పటికి సొంతిల్లు.. ఇలా ముఖ్యమైన లక్ష్యాలను ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులతో సాకారం చేసుకోవచ్చు. ఇలా ప్రతి లక్ష్యానికి నిర్ణీత కాలం అంటూ ఉంది. అన్నేళ్లలో అంత సమకూర్చుకునేందుకు ప్రతి నెలా, ప్రతి ఏటా ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్నది నిపుణుల సాయంతో తెలుసుకోవాలి. వారు చెప్పిన విధంగా.. మార్కెట్ అస్థిరతలను పట్టించుకోకుండా నియమబద్ధంగా సిప్ పెట్టుబడి చేసుకుంటూ వెళ్లిపోవడమే. దీనివల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. కాలాతీతం.. ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడు ఎటు వైపు చలిస్తాయో ఇదమిత్థంగా ఎవరూ చెప్పలేరు. ఈ స్థాయి నుంచి ఇంకా పెరుగుతాయని, ఫలానా స్థాయి నుంచి కరెక్షన్కు వెళతాయని.. దిద్దుబాటులో ఫలానా స్థాయిల నుంచి మద్దతు తీసుకుని తిరిగి ర్యాలీ చేస్తాయని.. గమనాన్ని ఎవరూ కచి్చతంగా అంచనా వేయలేరు. మార్కెట్లు సహేతుక స్థాయిలో దిద్దుబాటుకు గురైనప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి దీర్ఘకాలంలో పెట్టుబడిపై అద్భుత రాబడులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, దిద్దుబాటు సమయంలో ఎప్పుడు, ఏ స్థాయిల వద్ద ఇన్వెస్ట్ చేయాలనేది సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు అర్థం కాని విషయం. లమ్సమ్ (ఏకమొత్తం) ఇన్వెస్ట్ చేస్తుంటే, ఒకవేళ మార్కెట్లు గరిష్టాల్లో ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే అక్కడి నుంచి మార్కెట్లు పతనాన్ని చూస్తే.. రాబడి చూడడానికి చాలా కాలం పట్టొచ్చు. విసిగిపోయిన ఇన్వెస్టర్ నష్టానికి తన పెట్టుబడిని వెనక్కి తీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారమే సిప్. మార్కెట్ ర్యాలీ చేస్తోందా? లేక పతనం అవుతోందా? అన్నదానితో సంబంధం లేదు. ఒక పథకంలో ప్రతి నెలా 1వ తేదీన రూ.5,000 ఇన్వెస్ట్ చేయాలని సిప్ దరఖాస్తు సమరి్పస్తే.. కచి్చతంగా ప్రతి నెలా అదే తేదీన బ్యాంక్ ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్ అయి పెట్టుబడి కింద మారుతుంది. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఉదాహరణకు ఎఫ్ అనే పథకంలో రూ.2,000 సిప్ చేస్తున్నారు. ఆ ఫండ్ యూనిట్ ఎన్ఏవీ 2025 జనవరి 1న రూ.40గా ఉంది. దీంతో 50 యూనిట్లు వస్తాయి. ఫిబ్రవరి 1కి కరెక్షన్ వల్ల అదే ఫండ్ ఎన్ఏవీ 34కు తగ్గింది. దీంతో 58.82 యూనిట్లు వస్తాయి. జనవరి నెల సిప్‌తో పోలి్చతే ఫిబ్రవరిలో దిద్దుబాటు వల్ల 8.82 యూనిట్లు అదనంగా వచ్చాయి. మార్చి1న ఫండ్ యూనిట్ ఎన్ఏవీ ఇంకా తగ్గి రూ.32కు దిగొస్తే.. అప్పుడు 62.5 యూనిట్లు వస్తాయి. ఈక్విటీ విలువల్లో మార్పులకు అనుగుణంగా ఫండ్ ఎన్ఏవీ మారుతుంటుంది. దీనికి అనుగుణంగా సిప్ కొనుగోలు సగటు ధర తగ్గుతుంది. దీనివల్ల 10–15–20 ఏళ్లు అంతకుమించిన కాలాల్లో మంచి రాబడులకు అవకాశం ఉంటుందని గత చరిత్ర చెబుతోంది.స్వల్ప మొత్తం... చాలా పథకాల్లో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.5,000 అవసరం, కొన్ని పథకాలకు ఇది రూ.1,000గా ఉంది. అదే సిప్ రూపంలో అయితే రూ.500 స్వల్ప మొత్తంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇటీవలే రూ.250 సిప్‌ను (జన్నివే‹Ù) ప్రారంభించింది. రోజువారీ/వారం వారీ అయితే రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.కేవలం ఈక్విటీలకేనా..? సిప్ ప్రయోజనం ఎక్కువగా ఈక్విటీ పెట్టుబడులపైనే లభిస్తుంది. డెట్ పెట్టుబడులపై రాబడి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు ఈక్విటీలంత చంచలంగా ఉండవు. నిర్ణిత సైకిల్ ప్రకారం రేట్లు చలిస్తుంటాయి. డెట్ ఫండ్స్‌లోనూ సిప్ చేసుకోవచ్చు. దీనివల్ల ఈక్విటీల మాదిరి అస్థిరతలను అధిగమించి, రాబడులు పెంచుకునే ప్రత్యేక ప్రయోజనం ఉండదు. డెట్, ఈక్విటీ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌లో సిప్‌తో మెరుగైన ప్రతిఫలం పొందొచ్చు. సౌలభ్యం.. సిప్ కోసం సమ్మతి తెలిపామంటే.. కచి్చతంగా పెట్టుబడి పెట్టి తీరాలనేమీ లేదు. వీలు కానప్పుడు, లేదా పథకం పనితీరు ఆశించిన విధంగా లేనప్పుడు ఆ సిప్‌ను నిలిపివేసే స్వేచ్ఛ, వెసులుబాటు ఇన్వెస్టర్లకు ఎప్పుడూ ఉంటుంది. మార్కెట్‌తో ముడిపడి.. ప్రతి నెలా రూ.1,000 చొప్పున గత ఐదేళ్లలో రూ.60 వేలు ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడి వస్తే ఐదేళ్లకు ఆ మొత్తం రూ.90 వేలకు చేరుతుంది. సరిగ్గా ఆ సమయంలో మార్కెట్ 25 శాతం పడిపోయిందనుకుంటే.. రూ.90 వేల పెట్టుబడి కాస్తా.. రూ.67,500కు తగ్గుతుంది. నికర రాబడి రూ.7,500కు తగ్గిపోతుంది. దీంతో వచ్చే వార్షిక కాంపౌండెడ్ రాబడి 4.5 శాతమే. డెట్ సెక్యూరిటీల కంటే తక్కువ. చారిత్రక డేటాను పరిశీలిస్తే లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పలు సందర్భాల్లో ఐదేళ్ల సిప్ రాబడులు 5 శాతం కాంపౌండెడ్గానే (సీఏజీఆర్) ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతికూల రాబడులు వచి్చన సందర్భాలూ ఉన్నాయి. అదే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులపై ఈ ప్రభావం ఇంకా అధికంగా ఉంటుంది.అనుకూలం/అననుకూలం→ 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి, అవసరమైతే 20 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించే వెసులుబాటు ఉన్న వారికే సిప్ అనుకూలం. → అధిక రిస్క్ తీసుకునే వారే మిడ్, స్మాల్ క్యాప్‌లో సిప్ చేసుకోవాలి. → సిప్‌తో సగటు కొనుగోలు ధర తగ్గుతుందన్నది సాధారణంగా చెప్పే భాష్యం. కానీ, ఈక్విటీలు కొంత కాలం పాటు భారీ దిద్దుబాటు అన్నదే లేకుండా అదే పనిగా ర్యాలీ చేస్తూ వెళ్లి.. అక్కడి నుంచి భారీ పతనంతో కొన్నేళ్లపాటు బేర్ గుప్పిట కొనసాగితే రాబడులు కళ్లజూసేందుకు కొన్నేళ్లపాటు వేచి చూడాల్సి రావచ్చు. → సిప్ మొదలు పెట్టిన తర్వాత మార్కెట్లు కుదేలైతే.. పెట్టుబడి విలువ క్షీణతను ఎంత వరకు భరించగలరు? అని ప్రశి్నంచుకోవాలి. 50–60 శాతం పడిపోయినా ఓపిక వహించే వారికే అనుకూలం. → ‘ఈక్విటీ పెట్టుబడులు సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్’ అన్న హెచ్చరికను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మార్కెట్ల పనితీరు మెరుగ్గా ఉంటేనే సిప్పై మెరుగైన రాబడి వస్తుంది. అంతేకానీ సిప్పై లాభానికి గ్యారంటీ లేదు.అధిక రాబడులు ఎలా ఒడిసిపట్టాలి..? సిప్ చేస్తూనే.. మార్కెట్ పతనాల్లో పెట్టుబడిని రెట్టింపు చేయాలి. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 సిప్ చేస్తుంటే.. మార్కెట్ దిద్దుబాటు సమయంలో రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. దిద్దుబాటు ముగిసి, బుల్ ర్యాలీ మొదలైన తర్వాత అదనపు సిప్‌ను నిలిపివేసుకోవచ్చు. 10 ఏళ్లకు మించిన సిప్ పెట్టుబడులపై రాబడిని స్వల్ప స్థాయి కరెక్షన్లు తుడిచి పెట్టేయలేవు. అదే 15–20 ఏళ్లు, అంతకుమించిన దీర్ఘకాలంలో రాబడులు మరింత దృఢంగా ఉంటాయి. ఒకవేళ పెట్టుబడిని ఉపసంహరించుకునే సమయంలో మార్కెట్ కరెక్షన్లోకి వెళితే, తిరిగి కోలుకునే వరకు లక్ష్యాన్ని వాయిదా వేసుకోవడమే మార్గం. ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే.. ఆర్థిక లక్ష్యానికి రెండేళ్ల ముందు నుంచే క్రమంగా సిప్ పెట్టుబడులను విక్రయిస్తూ డెట్‌లోకి పెట్టుబడులు మళ్లించాలి. చివరి మూడేళ్ల పాటు ఈక్విటీ పథకంలో కాకుండా డెట్ ఫండ్‌లో సిప్ చేసుకోవాలి. ప్రత్యామ్నాయాలు.. పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించుకోకూడదు. ఈక్విటీ, డెట్, బంగారం, రీట్, ఇని్వట్లతో కూడిన పోర్ట్‌ఫోలియో ఉండాలి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌లో వేర్వేరుగా పెట్టుబడి పెట్టుకోవాలి. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో పెట్టుబడుల ఉపసంహరణ అవసరమైతే ఈక్విటీ పెట్టుబడులను కదపకుండా.. డెట్, గోల్డ్ తదితర ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. సిప్ ఎప్పుడు స్టాప్ చేయాలి? → ఒక పథకం గతంలో మెరుగైన రాబడి ఇచి్చందని అందులో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. భవిష్యత్తులోనూ అదే స్థాయి రాబడిని ఆ పథకం నుంచి ఆశిస్తుంటారు. ఒక పథకం 3, 5, 10 ఏళ్లలో సగటున మెరుగైన ప్రతిఫలం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయా కాలాలను మరింత లోతుగా విశ్లేషిస్తే మధ్యలో ఒక్కో ఏడాది తక్కువ, ప్రతికూల రాబడులు ఇచి్చన సందర్భాలూ ఉంటాయి. సిప్ మొదలు పెట్టిన తొలి ఏడాదే రాబడిని ఆశించడం అన్ని వేళలా అనుకూలం కాదు. కనీసం రెండు మూడేళ్లకు గానీ పథకం అసలు పనితీరు విశ్లేషణకు అందదు. అందుకే ఒక పథకం ఎంపిక చేసుకునే ముందు.. ఆ విభాగంలోని ఇతర పథకాలతో పోల్చి చూసినప్పుడు రాబడి మెరుగ్గా ఉందా? కనీసం సమానంగా అయినా ఉందా అన్నది నిర్ధారించుకోవాలి. → ఒక ఫండ్ మేనేజర్ పనితీరు నచ్చి పథకంలో సిప్ చేయడం మొదలు పెట్టారు. తర్వాతి కాలంలో ఆ మేనేజర్ మరో సంస్థకు మారిపోయారు. అప్పుడు కొత్తగా వచ్చిన ఫండ్ మేనేజర్ చరిత్రను ట్రాక్ చేయాలి. → పై రెండు ఉదాహరణల్లోనూ పథకం పనితీరు ఆశించిన విధంగా లేకపోతే సిప్ నిలిపివేయొచ్చు. ప్రతికూల రాబడులు ఇటీవలి మార్కెట్ పతనంతో 26 స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఏడాది కాల సిప్ పెట్టుబడులపై రాబడి ప్రతికూలంగా మారింది. అంటే నికర నష్టంలోకి వెళ్లింది. క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్‌లో సిప్ పెట్టుబడిపై ఎక్స్ఐఆర్ఆర్ (రాబడి) మైనస్ 22.45 శాతంగా మారింది. మహీంద్రా మాన్యులైఫ్ స్మాల్‌క్యాప్ ఫండ్‌లో మైనస్ 21.84 శాతంగా మారింది. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ ఎక్స్ఐఆర్ఆర్ మైనస్ 18.25 శాతంగా ఉంది. ఇవే పథకాలు రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల సిప్‌లపై డబుల్ డిజిట్ రాబడులు అందించడం గమనార్హం. దశాబ్దాల పాటు కుదేలైతే..? జపాన్ ‘నికాయ్ 225’ ఇండెక్స్ 1989 డిసెంబర్లో చూసిన 38,271 గరిష్ట స్థాయి నుంచి 2009 ఫిబ్రవరిలో 7,416 కనిష్ట స్థాయికి పతనమైంది. నెమ్మదిగా కోలుకుంటూ 35 ఏళ్ల తర్వాత.. 2024 మార్చిలో తిరిగి 1989 నాటి గరిష్ట స్థాయిని అధిగమించింది. రియల్ ఎస్టేట్ బబుల్ బద్దలు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 1989 డిసెంబర్ నాటి ముందు వరకు సిప్ లేదా లమ్సమ్ రూపంలో జపాన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుని, దీర్ఘకాలం పాటు వేచి చూసే అవకాశం లేని వారు.. ఆ తర్వాత నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉండిపోయారు. స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం పాటు స్తబ్దుగా కొనసాగడం వల్లే ఇన్నేళ్లపాటు అక్కడి మార్కెట్ ర్యాలీ చేయలేదు. ప్రస్తుతం చైనాలోనూ ఇలాంటి వాతావరణమే నడుస్తోంది. అలాంటి పరిస్థితులు భారత్ మాదిరి వర్ధమాన దేశాలకు అరుదు. నరేన్ ఏం చెబుతున్నారు? అర్థం, పర్థం లేని అధిక విలువలకు చేరిన అస్సెట్ క్లాస్‌లో (అది స్మాల్ లేదా మిడ్ లేదా మరొకటి అయినా) ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆ సిప్‌లపై రాబడి రాదన్నది నరేన్ విశ్లేషణగా ఉంది. ఇందుకు 2006 నుంచి 2013 మధ్య కాలాన్ని ప్రస్తావించారు. ఆ కాలంలో స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో సిప్ చేసిన వారికి ఎలాంటి రాబడులు రాలేదని చెప్పారు. కనీసం 20 ఏళ్లపాటు తమ పెట్టుబడులను కొనసాగించే వారికే స్మాల్, మిడ్‌క్యాప్ పెట్టుబడులకు మంచి వేదికలు అవుతాయన్నారు. అంతకాలం పాటు ఆగలేని వారికి మల్టిక్యాప్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ లేదా మల్టీ అస్సెట్ ఫండ్స్ అనుకూలమని చెప్పారు. నరేన్ అభిప్రాయాలతో ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా విభేధించారు. ‘‘2006 గరిష్టాల నుంచి 2013 కనిష్టాల మధ్య రాబడులను చూస్తే అంత మంచిగా కనిపించవు. కానీ, మార్కెట్లో అలాంటివి సాధారణమే. మార్కెట్లో సంపద సృష్టి జరగాలంటే కనీసం 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి సిప్ ద్వారా పెట్టుబడి పెట్టుకోవడం అవసరం’’ అని రాధికా గుప్తా సూచించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రిటైల్ ఇన్వెస్ట్టర్లు తగ్గేదేలే... ఈక్విటీల్లోకి రూ.39,688 కోట్లు
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలతో కొన్ని నెలలుగా ఈక్విటీలు బేలచూపులు చూస్తుంటే.. దేశీ రిటైల్ ఇన్వెస్టర్లు ‘తగ్గేదేలే’ అంటూ కొత్త పెట్టుబడులతో పరిణతి చూపుతున్నారు. ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు నిదర్శనంగా ‘సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్’ (సిప్) రూపంలో జనవరిలోనూ ఈక్విటీ పథకాల్లోకి రూ.26,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు డిసెంబర్ నెలలో వచ్చిన రూ.26,459 కోట్లతో పోలి్చతే కేవలం రూ.59 కోట్లే తగ్గాయి. ఇక జనవరి నెలలో అన్ని రకాల ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.39,688 కోట్లుగా ఉన్నాయి. 2024 డిసెంబర్ నెలలో వచ్చిన రూ.41,156 కోట్లతో పోల్చి చూస్తే 3.56% తగ్గినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) జనవరి నెల గణాంకాల ను తాజాగా విడుదల చేసింది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఈక్విటీ పెట్టుబడుల విలువ డిసెంబర్‌తో చూస్తే 4% తగ్గి రూ.30.57 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈక్విటీ, డెట్ ఇలా అన్ని రకాల నిర్వహణ ఆస్తుల విలువ జనవరి చివ రికి రూ.67.25 లక్షల కోట్లకు చేరింది. డిసెంబర్ చి వరికి ఈ విలువ రూ.66.93 లక్షల కోట్లుగా ఉంది. దీర్ఘకాల దృక్పథం.. ‘‘మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ సిప్ రూపంలో రూ.26,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అస్థిరతల్లోనూ పెట్టుబడులు కొనసాగించేందుకు, సంపద సృష్టికి కమ్రశిక్షణతో కూడిన దీర్ఘకాల విధానం అనుసరించే దిశగా ఇన్వెస్టర్లలో అవగాహనకు ఇక ముందూ మా ప్రయత్నాలు కొనసాగుతాయి’’అని యాంఫి సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం సిప్ ఆస్తుల విలువ రూ.13.12 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం ఈక్విటీ నిర్వహణ ఆస్తుల్లో సిప్‌కు సంబంధించే 40 శాతానికి పైగా ఉండడం గమనార్హం. జనవరిలో కొత్తగా 30.7 లక్షల ఫోలియోలు (ఒక పథకంలో పెట్టుబడికి గుర్తింపు సంఖ్య) నమోదయ్యాయని, మార్కెట్ దిద్దుబాటు నేపథ్యంలో పెట్టుబడుల అవకాశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. ఈక్విటీ నిర్వహణ ఆస్తుల విలువ 4 శాతం తగ్గడానికి మార్కెట్లలో ఆటుపోట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూనియన్ బడ్జెట్ ముందు అప్రమత్తతను కారణాలుగా ఐటీఐ మ్యూచువల్ ఫండ్ సీఈవో జతిందర్ పాల్ సింగ్ పేర్కొన్నారు.విభాగాల వారీగా.. → సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.9,016 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. డిసెంబర్లో ఇదే విభాగంలోకి రూ.15,331 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. → మిడ్‌క్యాప్ విభాగంలోకి రూ.5,148 కోట్లు వచ్చాయి. డిసెంబర్లో ఇదే విభాగం రూ.5,721 కోట్లను ఆకర్షించింది. → అస్థిరతలు కాస్త తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్ విభాగంలోకి పెట్టుబడులు పెరిగాయి. డిసెంబర్లో రూ.2,010 కోట్లు రాగా, జనవరిలో రూ.3,063 కోట్లకు చేరాయి. → ఫ్లెక్సిక్యాప్ ఫండ్స్ సైతం అంత క్రితం నెలతో పోలి్చతే జనవరిలో 20 %అధికంగా రూ.5,697 కోట్లను ఆకర్షించాయి. → డెట్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్లో ఈ విభాగం నుంచి రూ.1.27 కోట్లను ఉపసంహరించుకున్న ఇన్వెస్టర్లు జనవరిలో మళ్లీ అంతే మేర తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) ఇటీవలి కాలంలో ఎన్నడూలేనంత గరిష్ట స్థాయిలో రూ.3,751 కోట్లను ఆకర్షించాయి. ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించినట్టు స్పష్టమవుతోంది. -
పన్ను ఆదా.. భవిష్యత్తుకు పెట్టుబడి!
మనది పొదుపు సమాజం. మన తల్లిదండ్రులు, తాతలు ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేసేవారు. భవిష్యత్ కోసం వీలైన ప్రతి రూపాయినీ ఆదా చేసేవారు. కానీ, నేటి తరం ఖర్చు చేయడాన్ని ఇష్టపడుతోంది. సౌకర్యాలు, సుఖాలు, ఆడంబరాలు, ఆనందం కోసం ఖర్చుకు వెనుకాడని ధోరణి పెరిగిపోతోంది. ‘ధనవంతుడు కావాలంటే పేదవారిగా బతకాలి’ అన్నది ఆర్థిక నిపుణులు చెప్పే సూక్తి. పేదవారిగా జీవించాలని చెప్పడం కాదు ఇందులోని అసలు అర్థం. ఆడంబరాలకు, అనవసర ఖర్చులకు పోకూడదన్న సూచన ఇందులో కనిపిస్తుంది. తాజా కేంద్ర బడ్జెట్లో ఆదాయపన్ను రాయితీలను గణనీయంగా పెంచేశారు విత్త మంత్రి. రూ.12.75 లక్షల వరకు కొత్త విధానంలో పన్ను లేకుండా వరాలు కురిపించారు. దీంతో వివిధ తరగతుల వారికి గరిష్టంగా రూ.లక్ష, అంతకుమించి పన్ను రూపంలో ఆదా కానుంది.ఇలా ఆదా అయ్యే మొత్తాన్ని ఖర్చు బకెట్లో వేసేసుకుని సంబరపడిపోకుండా.. పెట్టుబడులకూ కొంత కేటాయించుకోవాలన్నది నిపుణుల సూచన. తద్వారా భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలకు మరింత బలం చేకూరుతుంది. త్వరగా ఆర్థిక స్వేచ్ఛను సొంతం చేసుకోగలరు. పన్ను భారం తప్పించుకునేందుకు కొత్త విధానంలోకి మారిపోయి.. ఇప్పటి వరకు పాత విధానంలో చేస్తున్న పన్ను ఆదా పెట్టుబడులకు మంగళం పాడే తప్పు అస్సలు చేయొద్దని సూచిస్తున్నారు. ఆదాయ స్థాయిలకు అనుగుణంగా కొత్త పన్ను విధానంలో ఆదా అయ్యే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షలు సంపాదించే వారికి రూ.83,200, రూ.15 లక్షలు సంపాదించే వారికి రూ.32,500 వరకు తాజా ప్రతిపాదనలతో పన్ను ఆదా కానుంది. అలాగే, రూ.24 లక్షల సంపాదనాపరులకు రూ.1.14 లక్షలు, రూ.కోటి ఆదాయ వర్గాలకు రూ.1,25,840, రూ.5 కోట్ల ఆదాయం కలిగిన వారికి రూ.1.43 లక్షల వరకు పన్ను మిగులు లభించనుంది. ఈ కొత్త ప్రతిపాదనలు 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానున్నాయి. అంటే 2026–27 అసెస్మెంట్ సంవత్సరానికి ఇవి వర్తిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు అమల్లో ఉన్న రేట్లే వర్తిస్తాయి. పాత విధానంలో వివిధ సెక్షన్ల కింద పలు రకాల పెట్టుబడులతోపాటు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలతో కలుపుకుని రూ.8.50 లక్షల ఆదాయంపై పన్ను ఆదాకు అవకాశం ఉంది. పెట్టుబడులు ఆపొద్దు.. ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక ఉండాలి. జీవితంలో అన్ని ముఖ్య అవసరాలను సాధించే మార్గసూచీగా ఇది ఉంటుంది. ఈ లక్ష్యాలకు పెట్టుబడులే ఆధారం. ఆదాయంలో కనీసం 30 శాతం అయినా పెట్టుబడులకు మళ్లించుకోవాలి. అయితే, జీవిత లక్ష్యాల దృష్టితో కాకుండా పన్ను ఆదా కోసమే పెట్టుబడులను ఆశ్రయించే వేతన జీవులు కూడా ఉన్నారు. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), ఐదేళ్ల పన్ను ఆదా ఎఫ్‌డీల్లో పెట్టుబడులు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై సెక్షన్ 80సీ పరిధిలో (పాత పన్ను వ్యవస్థ) రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీనికి అదనంగా హెల్త్ ఇన్సూరెన్స్‌కు సెక్షన్ 80డీ పరిధిలో పన్ను మినహాయింపులు ఉన్నాయి. గృహ రుణం తీసుకుని అసలు చెల్లింపులను సెక్షన్ 80సీ పరిధిలో, వడ్డీ చెల్లింపులను సెక్షన్ 24 పరిధిలో చూపించుకోవచ్చు. కొత్త పన్ను వ్యవస్థ ఆకర్షణీయంగా ఉండడంతో, ఇంతకాలం పన్ను ఆదా దృష్టితో కొనసాగించిన ఈ పెట్టుబడులను నిలిపివేసే ప్రమాదం లేకపోలేదు. ఈ తప్పు అస్సలు చేయొద్దు. కొత్త పన్ను విధానం సూటిగా, సరళంగా ఉంటుంది. పన్నుల గందరగోళం వద్దనుకునే వారు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే తప్పేమీ కాదు. కానీ, అదే సమయంలో పాత పన్ను విధానం ప్రోత్సహిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, మదుపులను విస్మరించకుండా, వాటిని కొనసాగించడం ద్వారానే గరిష్ట ప్రయోజాన్ని పొందగలరు. పన్ను ఆదా కోసం ఉద్దేశించినవి కాకపోయినా, మెరుగైన ఇతర సాధనాల్లో అయి నా పెట్టుబడులు కొనసాగించుకో వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈక్విటీ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్‌లో ఈఎల్ఎస్ఎస్ ఒక విభాగం. ఇందులో పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీంతో ఇతర ఈక్విటీ ఫండ్స్ అంత అమ్మకాల ఒత్తిడి వీటిల్లో ఉండదు. కనుక స్థిరత్వం ఎక్కువ. మల్టీక్యాప్ (ఏ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేయగలదు) విధానంతో పెట్టుబడులు పెడుతుంటుంది. పదేళ్ల కాలంలో 12–18 శాతం మధ్య, ఐదేళ్లలో 13–27 శాతం మధ్య రాబడులు ఈ పథకాల్లో గమనించొచ్చు. కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు ఈఎల్ఎస్ఎస్లోనే ఇన్వెస్ట్ చేయాలని లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫ్లెక్సీక్యాప్, ఇండెక్స్ ఫండ్స్‌లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, బీమా పథకాలకు పన్ను ఆదాకు మించి ప్రయోజనాలను ఇచ్చే సామర్థ్యం ఉన్నట్టు సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ కునాల్ సవాని పేర్కొన్నారు. కొత్త విధానంలోకి వెళ్లినా కానీ, భవిష్యత్ కోసం ఉద్దేశించిన ఈ పెట్టుబడులను నిలిపివేయొద్దని సూచించారు. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత బీమా (టర్మ్, ఎండోమెంట్) పాలసీల ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పాత వ్యవస్థలో పన్ను మిననహాయింపు ఉంది. వార్షిక ప్రీమియం మొత్తం కవరేజీలో (సమ్ అష్యూర్డ్/రక్షణ) 10 శాతం మించకపోతే, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను లేదు. ఈ పన్ను ప్రయోజనం కోసం ఎండోమెంట్, టర్మ్ పాలసీలను కొందరు తీసుకుంటున్నారు. ఏ పన్ను విధానంలో ఉన్నారనే అంశంతో సంబంధం లేకుండా, కుటుంబానికి ఆర్థికంగా ఆధారమైన ప్రతి వ్యక్తీ తన పేరిట తగినంత బీమా కవరేజీతో అచ్చమైన టర్మ్ పాలసీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. తన వార్షిక ఆదాయానికి సుమారుగా 20 రెట్ల మేర సమ్ అష్యూర్డ్ ఉండేలా చూసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆర్జించే వ్యక్తి ప్రాణానికి ప్రమాదం వాటిల్లితే, వచ్చే బీమా పరిహారంతో అతనిపై ఆధారపడిన కుటుంబం సాఫీగా జీవించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నేడు జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. కనుక ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఇది కేవలం పన్ను ఆదా కోసం ఉద్దేశించిన సాధనం కానే కాదు. పెద్ద ప్రమాదం లేదా కరోనా వంటి విపత్తు పరిస్థితుల్లో ఆస్పత్రి పాలైతే, హెల్త్ కవరేజీ లేని పరిస్థితుల్లో అప్పటి వరకు కూడబెట్టినదంతా కరిగిపోయే ప్రమాదం ఎదురవుతుంది. అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం వల్ల ఆర్థికంగా సమస్యల్లోకి వెళ్లకూడదని కోరుకుంటే, హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలి. ఒక కుటుంబానికి ఎంత లేదన్నా రూ.10లక్షలు ఉండేలా చూసుకోవాలి. దీనిపై అదనపు కవరేజీని సూపర్ టాపప్ ప్లాన్ రూపంలో తీసుకోవచ్చు. ఉద్యోగం చేసే సంస్థ తరఫున గ్రూప్ హెల్త్ కవరేజీ ఉన్న వారు సైతం విడిగా తమ కుటుంబానికి ఒక హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా కారణంతో కంపెనీని వీడినా, ఉద్యోగం మానేసినా కవరేజీ కొనసాగుతుంది.ఖర్చు కంటే పెట్టుబడి ముఖ్యం చాలా మంది తమ ఆదాయంలో ఖర్చులుపోను మిగులుంటే అప్పుడు పెట్టుబడులకు మళ్లిస్తుంటారు. కానీ, ముందు పెట్టుబడులకు కేటాయింపులు చేసిన తర్వాతే ఖర్చులకు వెళ్లాలన్నది నిపుణుల సూచన. కొత్త పన్ను వ్యవస్థలో మిగిలే నిధులను ఎన్పీఎస్ తదితర పెన్షన్ ప్లాన్లకు కేటాయించుకోవాలని సింఘానియా అండ్ కో పార్ట్నర్ బన్సాల్ సూచించారు. దీనివల్ల గణనీయమైన రిటైర్మెంట్ ఫండ్ ఏర్పడుతుందన్నారు. చాలా మంది రిటైర్మెంట్ లక్ష్యాన్ని పెద్దగా పట్టించుకోరు. 60 ఏళ్ల తర్వాత సంగతి కదా అని తేలికగా తీసుకుంటారు. కానీ, ఉద్యోగంలో చేరిన నాటి నుంచే రిటైర్మెంట్ తర్వాతి జీవితం కోసం పెట్టుబడి చేసుకుంటూ వెళ్లడం ద్వారా స్వల్ప మొత్తమే పెద్ద నిధిగా మారుతుందన్నది తెలుసుకోవాలి.కొత్త–పాత పన్ను వ్యవస్థలు ఏ విధానంలో కొనసాగాలన్నది తమ ఆదాయం ఆధారంగానే నిర్ణయించుకోవాలి. హెచ్ఆర్ఏ, గృహ రుణ ప్రయోజనాలు, ఎల్టీసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ పెట్టుబడులతో రూ.8 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్‌తో రూ.50 వేలు మొత్తంగా రూ.8.50 లక్షల వరకు పాత పన్ను వ్యవస్థలో మినహాయింపులున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే రూ.24 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారికి పాత వ్యవస్థ అనుకూలమని నిమిత్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు నితేష్ బుద్దదేవ్ తెలిపారు. ఒకవేళ తమ పెట్టుబడులు ఈ స్థాయిలో లేకపోతే కొత్త విధానాన్ని పరిశీలించొచ్చు. రూ.24 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి కొత్త విధానమే అనుకూలం. ఎన్పీఎస్ రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న మెరుగైన సాధనాల్లో ఎన్పీఎస్ ఒకటి. అతి తక్కువ నిర్వహణ చార్జీలతోపాటు, పెట్టుబడిపైనా, రాబడి ఉపసంహరణపైనా పన్ను ప్రయోజనాలున్నాయి. ఇందులో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై సెక్షన్ 80సీసీఈ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80సీ గరిష్ట ప్రయోజనం కిందకే ఇది కూడా వర్తిస్తుంది. దీనికి అదనంగా సెక్షన్ 80సీసీడీ (1బి) కింద ఎన్పీఎస్ టైర్–1 ఖాతాలో మరో రూ.50,000 పెట్టుబడికి సైతం పన్ను మినహాయింపు ఉంది. ఈ సెక్షన్ కిందే ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో పెట్టుబడికీ పన్ను ఆదా ప్రయోజనాన్ని 2025–26లో బడ్జెట్లో కల్పించారు. తమ పేరు మీద లేదా తమ కుమార్తె లేదా కుమారుల పేరిట ఎన్పీఎస్ వాత్సల్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బి) కింద గరిష్ట ప్రయోజనం రూ.50వేలకు పరిమితం. 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకంలో సమకూరిన మొత్తం నిధి నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు. మరో 40 శాతం మొత్తానికి పింఛను ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో చేసే జమలపైనా పాత విధానంలో పన్ను ప్రయోజనాలున్నాయి. సెక్షన్ 80సీసీడీ (2) కింద మూలవేతనం, డీఏ మొత్తంలో 10 శాతాన్ని ఉద్యోగి తరఫున యాజమాన్యం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగి తరఫున ప్రభుత్వమే జమ చేస్తుంటే అప్పుడు 14 శాతంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలోనూ సెక్షన్ 80సీసీడీ (2) కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పించారు. కొత్త విధానంలో ఉద్యోగి తరఫున యాజమాన్యం ఎన్పీఎస్ టైర్–1లో జమ చేస్తే (మూలవేతనం, డీఏలో 10 శాతం / వచ్చే ఏప్రిల్ నుంచి 14 శాతం) ఆ మేరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ హామీతో కూడిన డెట్ పెట్టుబడి సాధనాలు. వీటిల్లో రిస్క్ సున్నా. ఈ రెండు సాధనాల్లో ఏటా చేసే పెట్టుబడులను పాత పన్ను వ్యవస్థలోని సెక్షన్ 80సీ పరిధిలో చూపించుకుని రూ.1.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల గడువు ముగిసిన తర్వాత చేతికి అందే మొత్తంపై పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో పన్ను లేదు. పన్ను ప్రయోజనాలున్న ఈ మెరుగైన పథకాలు ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిందే. తమ మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతం ఈ సాధనాలకు కేటాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌కు మళ్లించుకోవచ్చు. దీనివల్ల పెట్టుబడికి కొంత రక్షణతోపాటు దీర్ఘకాలంలో అధిక రాబడిని సొంతం చేసుకోగలరు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో పెట్టుబడులకు వర్తించే వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ వీటి రేట్లను ప్రకటిస్తుంటుంది. పీపీఎఫ్‌లో ప్రస్తుతం 7.10 శాతం రేటు అమల్లో ఉంది. దీని కాల వ్యవధి 15 ఏళ్లు. అనంతరం మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.2 శాతం రేటు అమల్లో ఉంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని ప్రారంభించుకోవచ్చు. బాలికల వయసు 10 ఏళ్లు మించకూడదు. ఆలోపు వయసున్న వారి పేరుతో ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కుమార్తెలకు 21 ఏళ్లు నిండగానే పథకం ముగిసిపోతుంది. లేదా 18 ఏళ్లు నిండిన తర్వాత, 21 ఏళ్లు రాక ముందే వారికి వివాహం నిశ్చయమైతే అప్పుడు ఈ పథకం నుంచి వైదొలగొచ్చు. కొత్త పన్ను విధానంలో ఉన్న వారికీ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలు అనుకూలమేనని వేద్ జైన్ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ అంకిత్ జైన్ సూచించారు. ఎందుకంటే ఈ రెండు పథకాల్లో పెట్టుబడులపై పన్ను ప్రయోజనం కొత్త వ్యవస్థ కింద లేకపోయినా కానీ, వడ్డీ రాబడికి పన్ను మినహాయింపు ప్రయోజనం ఉన్నట్టు తెలిపారు. కుమార్తెల వివాహం, ఉన్నత విద్య కోసం సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ పెట్టుబడులు ఎంతో ఉపయోగపడతాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈక్విటీ ఫండ్స్ సానుకూలమా..?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు నవంబర్ నెలలో రూ.35,943 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అక్టోబర్ నెల పెట్టుబడులతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గాయి. అయినప్పటికీ వరుసగా 45వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లో సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నవంబర్ నెల గణాంకాలను విడుదల చేసింది.స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఎన్నికలు తదితర పరిణామాలతో ఈక్విటీ మార్కెట్లు గత రెండు నెలల కాలంలో ఎన్నో అస్థిరతలు ఎదుర్కోవడం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించి ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ సీబీవో అఖిల్ చతుర్వేది తెలిపారు. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నవంబర్‌లో నికరంగా రూ.60,295 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో పెట్టుబడుల రాక రూ.2.4 లక్షల కోట్లతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గడం గమనార్హం. ప్రధానంగా డెట్ ఫండ్స్ అక్టోబర్‌లో రూ.1.57 లక్షల కోట్లను ఆకర్షించగా, నవంబర్‌లో ఇవి కేవలం రూ.12,915 కోట్లకు పరిమితమయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) అక్టోబర్ చివరికి ఉన్న రూ.67.25 లక్షల కోట్ల నుంచి నవంబర్ చివరికి రూ.68.08 లక్షల కోట్లకు పెరిగింది. లక్ష్యాలకు కట్టుబాటు..నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.25,000 కోట్లకు పైనే ఉండడం అన్నది దీర్ఘకాల లక్ష్యాలు, ప్రణాళిక పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న అంకిత భావానికి నిదర్శనమని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. సిప్ పెట్టుబడులను స్థిరంగా ఉండడం దీర్ఘకాలంలో ఫండ్స్ విలువను సమకూర్చుతాయన్న విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. విభాగాల వారీగా..లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,548 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో వచ్చిన రూ.3,452 కోట్లతో పోల్చితే 26 శాతం తగ్గాయి. సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.7,658 కోట్లను రాబట్టాయి. అక్టోబర్‌లో ఇవే పథకాల్లోకి రూ.12,279 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.13,255 కోట్ల చొప్పున రావడం గమనార్హం. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,084 కోట్లు వచ్చాయి. ఇక స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల దూకుడు కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ నెలతో పోల్చితే నవంబర్‌లో స్మాల్ క్యాప్ ఫండ్స్ 9 శాతం అధికంగా రూ.4,112 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ 4.3 శాతం అధికంగా రూ.4,883 కోట్ల చొప్పున ఆకర్షించాయి. రిస్క్ ఉన్నా కానీ ఇన్వెస్టర్లు అధిక రాబడులు కోరుకుంటున్నారనే దానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తాయి.లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.4,680 కోట్లు, వ్యాల్యూ ఫండ్స్ రూ.2,088 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.430 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ రూ.619 కోట్ల చొప్పున ఆకర్షించాయి. 18 కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) నవంబర్ లో మార్కెట్లోకి వచ్చి రూ.4,052 కోట్లను సమీకరించాయి. అక్టోబర్‌లో 29ఎన్‌ఎఫ్‌వోలు రూ.6,078 కోట్లు సమీకరించడం గమనార్హం. డెట్ విభాగంలో 16 విభాగాలకు గాను 9 విభాగాల్లోకి పెట్టుబడులు రాగా, మిగిలినవి పెట్టుబడులు కోల్పోయాయి. ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి రూ.2,109 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.2,962 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ రూ.4,374 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.2,426 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లోకి రూ.2,138 కోట్ల చొప్పున వచ్చాయి.డెట్‌లో లిక్విడ్ ఫండ్స్ రూ.1,779 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.454 కోట్లు, మీడియం డ్యురేషన్ ఫండ్స్ రూ.201 కోట్ల చొప్పున కోల్పోయాయి. ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలుసిప్ పెట్టుబడులు ఫ్లాట్సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నవంబర్‌లో ఈక్విటీ పథకాల్లోకి రూ.25,320 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్ సిప్ పెట్టుబడులు రూ.25,323 కోట్లతో పోల్చి చూస్తే ఫ్లాట్‌గా నమోదయ్యాయి. కొత్తగా 49.46 లక్షల సిప్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అక్టోబర్‌లో ఇవి 63.70 లక్షలుగా ఉన్నాయి. మొత్తం సిప్ ఖాతాలు 10.12 కోట్ల నుంచి 10.23 కోట్లకు పెరిగాయి. -
ఈక్విటీ రాబడులపై పన్ను సున్నా!
కొన్నేళ్ల క్రితం విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలు పెడితే మన ఈక్విటీలు బేల చూపు చూసేవి. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మిన మేర ఇనిస్టిట్యూషన్స్, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. మన దేశ ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం గతంతో పోలి్చతే గణనీయంగా పెరిగిందని చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. నేరుగా స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాతి నుంచి ఈక్విటీ మార్కెట్ మంచి బుల్ ర్యాలీ చేయడం.. ఎంతో మంది ఇన్వెస్టర్లు అటు వైపు అడుగులు వేసేలా చేసింది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగత పెట్టుబడుల (సిప్) ప్రాధాన్యాన్ని ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు. తమ భవిష్యత్ ఆరి్థక లక్ష్యాల్లో ఈక్విటీలకు చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈక్విటీ రాబడులపై పన్ను బాధ్యతను ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా అర్థం చేసుకోవాలి. 2024–25 బడ్జెట్లో ఈక్విటీ లాభాలపై స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును కేంద్ర సర్కారు పెంచేసింది. ఈ భారం సాధ్యమైన మేర తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్ల ముందు పలు మార్గాలున్నాయి. వాటి గురించి వివరించే కథనమే ఇది. ఆదాయపన్ను చట్టంలో ఇటీవలి మార్పుల అనంతరం స్వల్పకాల లాభాలపై 20 శాతం, దీర్ఘకాల లాభాలపై 12.5 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది నిండకుండా విక్రయించిన స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే లాభం స్వల్పకాల మూలధన లాభం (ఎస్టీసీజీ) అవుతుంది. దీనిపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది పూర్తయిన అనంతరం విక్రయించినప్పుడు వచి్చన లాభం దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) కిందకు వస్తుంది. ఎల్టీసీజీ ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించకపోతే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం ఎల్టీసీజీ చెల్లించాల్సి ఉంటుంది. పన్ను తగ్గించుకునే మార్గాలు..ఈక్విటీల్లో స్వల్పకాల మూలధన లాభాలపై (ఎస్టీసీజీ) 20 శాతం పన్ను చెల్లించాల్సిందే. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి వెసులుబాట్లు లేవు. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే మూలధన లాభాలపై పన్ను భారం లేకుండా చూసుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మార్గాలున్నాయి. ముఖ్యంగా ఈక్విటీలు మూడేళ్లు అంతకుమించిన కాలానికే అనుకూలం. మూడేళ్లలోపు పెట్టుబడులకు ఈక్విటీలు సూచనీయం కాదు. ఎందుకంటే స్వల్పకాలంలో ఈక్విటీలు స్థూల ఆరి్థక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధాన నిర్ణయాలు తదితర ఎన్నో అంశాల ఆధారంగా అస్థిరతలకు లోనవుతూ ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలంలో ఈ అస్థిరతలను అధిగమించి స్టాక్స్ ర్యాలీ చేస్తుంటాయి. కనుక స్వల్పకాలంలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు భరోసా ఉంటుంది. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు తమ మధ్య, దీర్ఘకాల లక్ష్యాల కోసమే ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తద్వారా అధిక రాబడులకు తోడు, ఆ మొత్తంపై పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి అవకాశాలుంటాయి.ట్యాక్స్ హార్వెస్టింగ్ఒక ఆరి్థక సంవత్సరంలో ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షల వరకు పన్ను లేదు కనుక, ఏటా తమ పెట్టుబడులపై ఈ మేరకు లాభాలను స్వీకరించడం ట్యాక్స్ హార్వెస్టింగ్ అవుతుంది. తిరిగి అంతే మొత్తాన్ని మళ్లీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు 2023 సెపె్టంబర్ 1న స్టాక్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. 2024 సెపె్టంబర్ 1 నాటికి ఈ విలువ 12 శాతం రాబడి అంచనా ప్రకారం రూ.6,75,305 అవుతుంది. ఇందులో లాభం రూ.75,305. రూ.1.25లక్షల వరకు లాభం ఉన్నా పన్ను లేదు కనుక, ఈ మొత్తాన్ని విక్రయించి తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి పన్ను భారం పడదు. ఇలా ఏటా రూ.1.25లక్షల మేరకు దీర్ఘకాలిక మూలధన లాభాన్ని స్వీకరిస్తూ.. తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ఒక మార్గం. ఇల్లు కొనడం.. ఈక్విటీ దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేకుండా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ మార్గం చూపిస్తోంది. ఈ సెక్షన్ కింద గరిష్ట ప్రయోజనం రూ.10 కోట్లు. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన మొత్తం రూ.10 కోట్ల వరకు ఉంటే, దీనిపై భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు ఆ మొత్తంతో ఒక నివాస గృహం కొనుగోలు చేస్తే సరి. ఇలా చేయడం వల్ల ఎలాంటి పన్ను లేకుండా సెక్షన్ 54ఎఫ్ కింద పూర్తి ప్రయోజనం పొందొచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలే (హెచ్‌యూఎఫ్) ఈ ప్రయోజనానికి అర్హులు. దీర్ఘకాలిక ఈక్విటీ పెట్టుబడులే అని కాదు, ప్లాట్, వాణిజ్య భవనం, బంగారం, ట్రేడ్ మార్క్‌లు, పేటెంట్లు, మెషినరీ సైతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తాయి. వీటిపైనా ఇదే ప్రయోజనం పొందొచ్చు. బాండ్లు సెక్షన్ 80ఈసీ కింద ఈక్విటీ దీర్ఘకాల మూలధన లాభాలను క్యాపిటల్ గెయిన్స్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. ఆర్ఈసీ, ఎన్హెచ్ఏఐ తదితర ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో పెట్టుబడులపై రాబడి 6 శాతం వరకు ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించిన తేదీ నుంచి ఆరు నెలలు దాటకుండా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తేనే ప్రయోజనం లభిస్తుంది. గరిష్టంగా రూ.50 లక్షల పెట్టుబడులకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన మొత్తం రూ.50 లక్షలకు మించి ఉంటే, అదనపు మొత్తంపై నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఐదేళ్లలోపు వాటిని విక్రయిస్తే.. గతంలో పొందిన పన్ను ప్రయోజనం కోల్పోతారు. అంటే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ బాండ్లపై ఐదేళ్లలోపు రుణం పొందినా ఈ ప్రయోజనం కోల్పోతారు.షరతులు ఉన్నాయ్... దీర్ఘకాల ఈక్విటీ మూలధన లాభాలపై సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించే తేదీకి ఏడాది ముందు కాలంలో లేదా విక్రయించిన తేదీ నుంచి తర్వాతి రెండేళ్లలోపు నివాస అవసరాలకు వినియోగించే ఇల్లు (పాతది లేదా కొత్తది) కొనుగోలు చేయాలి. ఇల్లు నిరి్మంచుకునేట్టు అయితే దీర్ఘకాల క్యాపిటల్ అసెట్స్ విక్రయించిన నాటి నుంచి మూడేళ్ల వరకు వ్యవధి ఉంటుంది. మూలధన లాభాలే కాకుండా, విక్రయించినప్పుడు వచ్చిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంత మొత్తంతోనే ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణంపై వెచి్చస్తే, అప్పుడు మిగిలిన మూలధన లాభాలపై నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఇంటి కొనుగోలుకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ ధీర్ఘకాల పెట్టుబడులు విక్రయించగా వచ్చిన మొత్తం రెండిళ్ల కొనుగోలుపై వెచ్చిస్తే.. ఒక ఇంటిపై చేసిన వ్యయాన్నే సెక్షన్54ఎఫ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే, ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించే నాటికి ఒక ఇంటిని మించి కలిగి ఉండకూడదు. రెండో ఇంటిని జాయింట్లో కలిగి ఉన్నా అర్హత కోల్పోయినట్టే. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులను విక్రయించినప్పుడు పన్ను మినహాయింపు కోసం ఇంటిపై వెచ్చించాలని చెప్పుకున్నాం. అయితే, విక్రయించిన ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేసే నాటికి ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచడం సాధ్యపడలేదు అనుకుందాం. అలాంటప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ కింద ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత దీని నుంచి ఉపసంహరించుకుని నిబంధనలకు అనుగుణంగా నిరీ్ణత కాలం లోపు ఇంటి కోసం వెచి్చంచి, పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిరీ్ణత కాలంలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచలేకపోయారని అనుకుందాం. అటువంటప్పుడు ఆ మొత్తాన్ని క్రితం ఆరి్థక సంవత్సరానికి సంబంధించి ఎల్‌టీసీజీగా చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.సరైన నిర్ణయమేనా?మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లాభాలపై పన్ను తప్పించుకునేందుకు సెక్షన్ 54ఎఫ్‌ను వినియోగించుకుని ఇంటిపై ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా..? అంటే, అందరికీ కాకపోవచ్చన్నదే సమాధానం. పిల్లల ఉన్నత విద్య, వారి వివాహం, రిటైర్మెంట్ తదితర లక్ష్యాల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, పన్ను మినహాయింపు కోసం తీసుకెళ్లి ఇంటిపై వెచి్చంచడం సరైనది అనిపించుకోదు. కనుక ఈ విషయంలో ఇన్వెస్టర్లు అందరికీ ఒక్కటే సలహా నప్పదు. సొంతిల్లు సమకూర్చుకోవాలని కోరుకునే వారికి సెక్షన్ 54ఎఫ్ మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే, పన్ను మినహాయింపు కోసం ఇంటిపై ఇన్వెస్ట్ చేసి వృద్ధాప్యంలో ఆ ఇంటిని రివర్స్ మార్ట్గేజ్ కోసం వినియోగించుకునే ఆలోచన ఉన్న వారికి కూడా 54ఎఫ్ ప్రయోజనం అనుకూలమే.నష్టాలతో భర్తీ..ఈక్విటీల్లో మూలధన లాభాలపై పన్ను తగ్గించుకునేందుకు.. మూలధన నష్టాలతో భర్తీ చేసుకోవడం మరో ఆప్షన్. ఏడాదికి మించని ఈక్విటీ పెట్టుబడులు విక్రయించగా వచ్చిన స్వల్పకాల మూలధన నష్టాన్ని.. తిరిగి స్వల్పకాల మూలధన లాభం లేదా దీర్ఘకాల మూలధన లాభంలో సర్దుబాటు చేసుకోవచ్చు. ఇలా సర్దుబాటు చేయగా మిగిలిన మొత్తంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలా సర్దుబాటు చేసుకున్న తర్వాత కూడా నష్టం మిగిలి ఉంటే దాన్ని అప్పటి నుంచి తదుపరి ఎనిమిదేళ్లపాటు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. పన్ను రిటర్నులు దాఖలు చేయడం ద్వారానే ఇందుకు అవకాశం ఉంటుంది. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాన్ని.. కేవలం దీర్ఘకాల మూలధన లాభంతోనే సర్దుబాటు చేసుకోగలరు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక!
క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్ఐపీ–సిప్)పై ఇన్వెస్టర్ల భరోసా పెరుగుతోంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) సెప్టెంబర్ తాజా గణాంకాల ప్రకారం సిప్ల రూపంలో రికార్డు స్థాయిలో రూ.24,509 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్‌లోకి ఒకే నెలలో ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి.క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక సంపద వైపు మళ్లుతున్న పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ఈ పరిణామం తెలియజేస్తోందని ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని అన్నారు. కాగా, ఆగస్టులో సిప్‌లోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.23,547 కోట్లు. క్రమంగా ఈక్విటీ మార్కెట్‌పై మదుపర్లకు నమ్మకం పెరుగుతోంది. దానికితోడు మ్యూచువల్ ఫండ్ మేనేజర్ల వద్ద దాదాపు రూ.లక్ష ఇరవైవేల కోట్లు నిలువ ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి స్టాక్‌లు విక్రయిస్తున్నారు. అందులో నాణ్యమైన స్టాక్‌లపై ఫండ్ మేనేజర్లు ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: తుక్కుగా మార్చాల్సిన వాణిజ్య వాహనాలు ఎన్నంటే..ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.34,419 కోట్లు..ఇక మొత్తంగా చూస్తే, ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు సెప్టెంబర్‌లో 10 శాతం (ఆగస్టుతో పోల్చి) పడిపోయి రూ.34,419 కోట్లుగా నమోదయ్యాయి. లార్జ్ క్యాప్, థీమెటిక్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. అయితే ఈక్విటీ ఫండ్స్‌లోకి నికర పెట్టుబడులు సుస్థిరంగా 43 నెలలుగా కొనసాగుతుండడం సానుకూల అంశం. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసానికి ఇది అద్దం పడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంన్నాయి. ఇక ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఆగస్టులో రూ.66.7 లక్షల కోట్లు ఉంటే, సెప్టెంబర్‌లో రూ.67 లక్షల కోట్లకు ఎగసింది. -
ఎన్ఆర్ఐలకు ఫండ్స్ రూట్!
మెరుగైన ఆరి్థక వృద్ధితో భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయమైన చిరునామాగా నిలుస్తోంది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులతో ముందుకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు (ఎన్ఆర్ఐలు) సైతం భారత ఈక్విటీ అవకాశాలు మెరుగైన ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. తమ పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడంతోపాటు, ఆకర్షణీయమైన రాబడులు, పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. తమ విశ్రాంత జీవనాన్ని స్వదేశంలో ప్రశాంతంగా, హాయిగా గడపాలని కోరుకునే వారు.. భారత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టుబడులకు అనుకూల విధానాలు, వాతావరణంతోపాటు, మెరుగైన నియంత్రణలు భద్రతకు హామీనిస్తున్నాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి లేదా స్థిరమైన ఆదాయం కోసం ఎన్ఆర్ఐలు ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లు (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) విదేశీ మారకంలో పెట్టుబడులు స్వీకరించవు. అదే విధంగా ఎన్ఆర్ఐలు భారత్‌లో సాధారణ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్‌కు విదేశీ మారకద్రవ్య చట్టం (ఫెమా) అనుమతించదు. రూపాయి మారకంలో పెట్టుబడులకే అనుమతి ఉంటుంది కనుక ఎన్ఆర్ఐలు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉండాలి. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ (ఎన్ఆర్వో), ఫారీన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్) అకౌంట్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక బ్యాంక్ ఖాతా అవసరం→ ఎన్ఆర్ఈ ఖాతా అయితే.. విదేశాల్లో ఆర్జించిన మొత్తాన్ని స్వదేశానికి పంపుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతాలో డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను లేదు. → ఎన్ఆర్వో ఖాతా.. భారత్‌లో ఆదాయ వనరులను ఇక్కడే డిపాజిట్ చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతా ద్వారా భారత్‌లో ఆదాయాన్ని భారత్‌లోనే ఇన్వెస్ట్చేసుకోవచ్చు. ఈ ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా మిలియన్ డాలర్లనే ఈ ఖాతా నుంచి విదేశీ ఖాతాకు మళ్లించుకోగలరు.→ విదేశీ కరెన్సీ రూపంలో డిపాజిట్లు కలిగి ఉండేందుకు ఎఫ్సీఎన్ఆర్ ఖాతా అనుకూలిస్తుంది. ఈ ఖాతాతో కరెన్సీ మారకం రేట్ల రిస్క్ లేకుండా చూసుకోవచ్చు. ఎఫ్సీఎన్ఆర్ టర్మ్ డిపాజిట్ ఖాతా కాగా, ఎన్ఆర్ఈ పొదుపు/కరెంటు/రికరింగ్/ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాగా పనిచేస్తుంది. → చెక్, డీడీ, నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేస్తే.. ఈ నిధుల మూ లాలు తెలియజేసేందుకు వీలుగా ఫారిన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ సర్టిఫికెట్ (ఎఫ్ఐఆర్సీ)ను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఛానళ్లు, బ్రోకరేజీ సంస్థల సాయంతోనూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.కేవైసీ కీలకంభారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం పాస్‌పోర్ట్ కాపీ, పుట్టిన తేదీ ధ్రువీకరణ కాపీ, పాన్, ఫొటో, విదేశీ చిరునామా ధ్రువీకరణ కాపీలను సమరి్పంచాలి. ప్రస్తుత నివాసం అది శాశ్వతమైనా లేదా తాత్కాలికమైనా సరే రుజువులు సమరి్పంచాలి. ఫారిన్ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఓసీఐ కార్డ్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.పెట్టుబడుల మార్గాలు.. ఎన్ఆర్ఐలు తామే స్వయంగా లేదంటే పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) ద్వారా ఇతరుల సాయంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేరుగా అంటే ఎన్ఆర్ఈ/ఎన్ఆర్వో ఖాతాను తెరిచి వాటి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయడం లేదా సిప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది వీలు కానప్పుడు.. భారత్‌లో తాము విశ్వసించే వ్యక్తికి ఈ పని అప్పగిస్తూ పీవోఏ ఇవ్వొచ్చు. మీ తరఫున సంబంధిత వ్యక్తి పెట్టుబడుల వ్యవహారాలు చూస్తారు. ప్రతి లావాదేవీ నిర్వహణ సమయంలో పీవోఏ లేదా నోటరైజ్డ్ కాపీని సమరి్పంచాల్సి ఉంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఎన్ఆర్ఐ స్వయంగా హాజరు కావాలని కోరుతున్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు యూఎస్ఏ, కెనడాలోని ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులు అనుమతించడం లేదు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియన్స్ యాక్ట్ (ఫాక్టా) నిబంధనల అమలు ప్రక్రి య సంక్లిష్టంగా ఉండడమే దీనికి కారణం. ఎన్ఆర్ఐలు, యూఎస్ పౌరుల ఆర్థిక లావాదేవీల వివరాలను అమెరికా ప్రభుత్వంతో పంచుకోవాలని ఫాక్టా నిర్దేశిస్తోంది. విదేశీ ఆదాయంపై పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ఈ నిబంధన పెట్టారు. పైగా అమెరికా, కెనడా నియంత్రణ సంస్థల వద్ద భారత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే అన్నీ కాకుండా, కొన్ని అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు యూఎస్ఏ, కెనడా నుంచి ఎన్ఆర్ఐల పెట్టుబడులను కొన్ని షరతుల మేరకు అనుమతిస్తున్నాయి. కనుక అమెరికా, కెనడాలోని ఎన్ఆర్ఐలు అదనపు డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావ చ్చు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, నిప్పన్ ఇండియా, క్వాంట్ మ్యూచువల్ ఫండ్, సుందరం మ్యూచువల్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కాకుండానే ఆన్లైన్లో, ఎలాంటి పరిమితులు లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కావాలనే సంస్థల్లో.. 360 వన్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, డీఎస్పీ మ్యూచువల్ ఫండ్, ఐటీఐ మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్, నవీ మ్యూచువల్ ఫండ్, ఎన్జే ఇండియా మ్యూచువల్ ఫండ్, పీపీఎఫ్ఏఎస్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, టారస్ మ్యూచువల్ ఫండ్, వైట్ఓక్ క్యాపిటల్ ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్ కేవలం అమెరికాలోని ఇన్వెస్టర్ల నుంచే పెట్టుబడు లు స్వీకరిస్తున్నాయి. ఇవి కూడా ఫిజికల్ మోడ్‌లో నే (భౌతిక రూపంలో) పెట్టుబడులు అనుమతిస్తున్నాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మొదటి లా వాదేవీ భౌతిక రూపంలో, తదుపరి లావాదేవీలు అన్లైన్లో నిర్వహించేందుకు అనుమతిస్తోంది. https://mfuindia.com/usa-canada-residents నుంచి యూఎస్, కెనడాలోని ఎన్ఆర్ఐలు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అవకాశాలు.. మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్, డైరెక్ట్ అని రెండు రకాల ప్లాన్లు ఉన్నాయి. రెగ్యులర్ ప్లాన్లు మధ్యవర్తుల ప్రమేయంతో పొందేవి. అంటే పంపిణీదారులకు ఈ ప్లాన్ల ద్వారా కమీషన్ ముడుతుంది. కేవైసీ, డాక్యుమెంటేషన్ ప్రక్రియ, ఎటువంటి పథకాలను ఎంపిక చేసుకోవాలి తదితర సేవలను వీరి నుంచి పొందొచ్చు. వీరికి కమీషన్ చెల్లించాల్సి రావడంతో రెగ్యులర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో (ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ) ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు దీనికి విరుద్ధం. ఇందులో మధ్యవర్తులకు కమీషన్ చెల్లింపులు ఉండవు. దీంతో ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్ల కంటే తక్కువగా ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో రెగ్యులర్ కంటే డైరెక్ట్ ప్లాన్లలో రాబడులు అధికంగా ఉంటాయి. ఒక పథకానికి సంబంధించి అది రెగ్యులర్ లేదా డైరెక్ట్ ప్లాన్ ఏది అయినా కానీ.. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో ఒక్కటే ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు ఎంపిక చేసుకునే ఎన్ఆర్ఐలు తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోగల అవగాహన కలిగి ఉండాలి. అప్‌స్టాక్స్, కువేరా, ఎన్ఆర్ఐలకు సంబంధించి వాన్స్ తదితర ప్లాట్‌ఫామ్‌లు డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడులకు వీలు కలి్పస్తున్నాయి. ఉపసంహరణ – పన్ను బాధ్యత భారత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే లాభంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి వస్తుందన్న భయం అక్కర్లేదు. భారత్‌తో ద్వంద పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఒక చోట పన్ను చెల్లిస్తే సరిపోతుంది. యూఎస్, కెనడా, మధ్యప్రాచ్య దేశాలు సహా మొత్తం 80 దేశాలతో భారత్‌కు ఈ విధమైన ఒప్పందాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై భారత పౌరులకు, ఎన్ఆర్ఐలకు ఒకే రకమైన నిబంధనలు అమలవుతున్నాయి. ఎన్ఆర్ఐలు తమ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఆన్లైన్లోనే విక్రయించుకోవచ్చు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు లాభంపై పన్నును మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్వో ఖాతాకు జమ చేస్తాయి. అన్ని ఏఎంసీలు ఎన్ఆర్ఐలు పెట్టుబడులు విక్రయించిన సందర్భంలో టీడీఎస్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం, అంతకులోపు విక్రయించగా వచ్చిన లాభం (స్వల్ప కాల మూలధన లాభం)పై 15 శాతం టీడీఎస్ అమలు చేస్తాయి. అదే డెట్ ఫండ్స్‌లో లాభాలపై పన్ను ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డీటీఏఏ కింద పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవాలనుకునే వారు తాము నివసిస్తున్న దేశం నుంచి ట్యాక్స్ రెసిడెన్సీ సరి్టఫికెట్ (టీఆర్సీ) సమరి్పంచాల్సి ఉంటుంది. భారత్‌లో పన్ను చెల్లించిన ఎన్ఆర్ఐలు తమ దేశంలో డీటీఏఏ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలు భారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా తమ విశ్రాంత జీవనానికి తగినంత నిధి సమకూర్చుకోవచ్చని రిటైర్మెంట్ విషయంలో సలహా, సూచనలు, పరిష్కారాలు అందించే ‘ద్యోత సొల్యూషన్స్’కు చెందిన కౌశిక్ రామచంద్రన్ సూచిస్తున్నారు. మధ్య ప్రాచ్య దేశాల్లో పౌరసత్వం పొందలేరు కనుక రిటైర్మెంట్ తర్వాత స్వదేశానికి రావాల్సిందేనని, అలాంటి వారికి భారత మ్యూచువల్ ఫండ్స్ అనుకూలమని పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం
ముంబై: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జూన్ లో రూ.40,608 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో వచి్చ న పెట్టుబడుల కంటే 17 శాతం అధికం. మే నెలలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 83 శాతం అధికంగా రూ.34,670 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.1,07,357 కోట్లు బయటకు వెళ్లాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ జూన్ చివరికి రూ.61.15 లక్షల కోట్లకు చేరింది. మే నెలతో పోలిస్తే 4% అధికం. ఇందులో ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.27.67 లక్షల కోట్లుగా ఉంది.కొత్త గరిష్టానికి సిప్ పెట్టుబడులుసిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.21,262 కోట్ల పెట్టుబడులు వచ్చా యి. ఇది నెలవారీ సరికొత్త గరిష్ట స్థాయి. మే నెల సిప్ పెట్టుబడులు రూ.20,904 కోట్లు. జూన్‌లో కొత్తగా 55.13 లక్షల సిప్ రిజి్రస్టేషన్లు పెరిగాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య మే చివరికి ఉన్న 8.76 కోట్ల నుంచి జూన్ చివరికి 8.99 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు రూ.12.44 లక్షల కోట్లకు దూసుకుపోయాయి. మే చివరికి ఇవి రూ.11.53 లక్షల కోట్లుగా ఉన్నాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చెప్పుకోతగ్గ వృద్ధిని చూసింది. ఆర్థిక స్థిరత్వానికి, కోట్లాది మంది ఇన్వెస్టర్ల సంపద సృష్టికి కీలకంగా మారింది.’’అని ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. జూన్‌లో పెట్టుబడులు రూ.21,262 కోట్లు మేలో పెట్టుబడులు రూ.20,904 కోట్లుపెట్టుబడుల మొత్తం రూ.12.44 లక్షల కోట్లు (యాంఫి నివేదిక)థీమ్యాటిక్ అదుర్స్ రంగాలవారీ/థీమ్యాటిక్ ఫండ్స్ జూన్ నెలలో రూ.22, 351 కోట్లు ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ విభాగంలో 9 కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభమయ్యాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లు సమీకరించాయి. మలీ్టక్యాప్ ఫండ్స్‌లోకి 78% అధికంగా రూ.4,708 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్‌క్యాప్ పథకాల్లోకి పెట్టుబడులు 46% పెరిగి రూ.970 కోట్లుగా ఉన్నాయి. స్మాల్‌క్యాప్ పథకాల్లోకి 17% తగ్గి రూ.2,263 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి 3% తక్కువగా రూ.2,527 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హైబ్రిడ్ ఫండ్స్ రూ.8,854 కోట్ల పెట్టబడులను ఆకర్షించాయి. ప్యాసివ్స్లోకి రూ.14,601 కోట్లు వచ్చాయి. -
ఈక్విటీల్లో మహిళల భాగస్వామ్యం ఎలా ఉందంటే..
ఈక్విటీ మార్కెట్లో మహిళా పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరుగుతోంది. వారి సగటు పోర్ట్‌ఫోలియో పరిమాణం రూ.55,454గా ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇది ఈక్విటీ పెట్టుబడిదారుల జాతీయ సగటు కంటే ఎక్కువ. ఈక్విటీలో పెట్టుబడిపెట్టే మొత్తం మహిళల్లో మెజారిటీ (68%) రూ.1 లక్షలోపు పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నారని ఆన్లైన్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ ఫైయర్స్ డేటా ద్వారా తెలిసింది.ఈ నివేదిక ప్రకారం 21% మహిళలు రూ.1 లక్ష-రూ.5 లక్షల వరకు పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నారు. 11% మంది రూ.5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. మహారాష్ట్రలోని మొత్తం ఇన్వెస్టర్లలో దాదాపు మహిళలు సగం మంది ఉన్నారు. మొత్తం మహిళా పెట్టుబడిదారుల్లో 22.38% మంది మహారాష్ట్ర వారే. ఆంధ్రప్రదేశ్‌లో 10.68%, కర్ణాటక 7.65%, కేరళ 5.78% మంది మహిళలు ఈక్వీటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థమహిళా వ్యాపారులు ఉన్న మొదటి ఐదు నగరాల్లో ముంబై (4.16%), బెంగళూరు (4.19%), పుణె (3.93%), థానే (2.66%), హైదరాబాద్ (2.62%) ఉన్నాయి. 26-55 ఏళ్ల వయసు ఉన్న మహిళలు 58% మంది ఉన్నారు. ఫైయర్స్ ప్లాట్‌ఫారమ్‌లో మహిళా పెట్టుబడిదారులు నెలకు 5% స్థిరమైన వృద్ధితో పెరుగుతున్నారని డేటా ద్వారా తెలిసింది. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి భారీ పెట్టుబడులు - సిప్ రూపంలో రూ.17 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అక్టోబర్‌లోనూ ఇన్వెస్టర్ల ఆదరణ చూరగొన్నాయి. నికరంగా రూ.20,000 కోట్లను ఆకర్షించాయి. సెప్టెంబర్‌లో వచ్చిన రూ.14,091 కోట్లతో పోలిస్తే 40 శాతానికి పైగా పెరిగాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నెలవారీగా వచ్చే పెట్టుబడులు రూ.16,928 కోట్ల మైలురాయిని చేరాయి. సిప్ రూపంలో ఒక నెలలో వచ్చిన గరిష్ట స్థాయి పెట్టుబడులు ఇవే కావడం గమనించొచ్చు. అక్టోబర్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గురువారం విడుదల చేసింది. అక్టోబర్ నెలలో నాలుగు కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు నిధుల సమీకరణ కోసం మార్కెట్లోకి రాగా, ఇవి రూ.2,996 కోట్లను సమీకరించాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.4,495 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. గత కొన్ని నెలలుగా స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తుండడం గమనించొచ్చు. థీమ్యాటిక్ ఫండ్స్ రూ. 3,896 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వరుసగా ఐదు నెలల పాటు పెట్టుబడులను కోల్పోయిన లార్జ్‌క్యాప్ పథకాల దశ మారింది. ఇవి నికరంగా రూ.724 కోట్లను రాబట్టాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి నికరంగా రూ.42,634 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో డెట్ విభాగం నుంచి నికరంగా రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లడం గమనార్హం. డెట్‌లో లిక్విడ్ ఫండ్స్ రూ.32,694 కోట్లను ఆకర్షించాయి. గిల్ట్ ఫండ్స్‌లోకి రూ.2,000 కోట్లు వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లోకి రూ.841 కోట్లు వచ్చాయి. అన్ని విభాగాల్లోకి కలిపి అక్టోబర్‌లో రూ.80,528 కోట్లు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్ చివరికి ఉన్న రూ. 46.58 లక్షల కోట్ల నుంచి రూ. 46.71 లక్షల కోట్లకు పెరిగాయి. -
ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా.. వారంవారీ సిప్.. నెలవారీ సిప్ ఏది బెటర్?
నేను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం వారీ సిప్ లేదా నెలవారీ సిప్ ఏది ఎంపిక చేసుకోవాలి? – అమర్ సహాని నేను ఈ రెండింటిని పోల్చి ఎటువంటి వివరణాత్మక అధ్యయనం చేయలేదు. కానీ ఫలితాలు యాదృచ్ఛికంగా ఉంటాయని తెలుసు. వారం వారీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. వారం వారీ అంటే నెలలో నాలుగు సార్లు పెట్టుబడుల లావాదేవీలు నమోదవుతాయి. దీంతో లావాదేవీల నివేదిక కూడా చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. డిజిటల్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా అని అనుకోవచ్చు. కానీ, తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ చేసుకోవడం? దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్‌లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్‌లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్‌లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్‌లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్‌ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్‌గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్‌ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండడమే సరైనది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
Q & A: ఇల్లు కొందామనుకుంటున్నా.. డౌన్‌పేమెంట్ కోసం ఈక్విటీ ఫండ్స్ కరెక్టేనా?
నేను వచ్చే 15 ఏళ్లలో రూ.2.5–3 కోట్ల వరకు విలువ చేసే ఇంటిని కొనుగోలు చేద్దామని అనుకుంటున్నాను. డౌన్‌పేమెంట్ సమకూర్చుకునేందుకు... టాటా స్మాల్‌క్యాప్ లేదంటే ఎడెల్వీజ్ స్మాల్‌క్యాప్, మిరే అస్సెట్ మిడ్‌క్యాప్ లేదా పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ అన్నవి మంచి ఎంపికలేనా? – ఆదిత్య బి మీరు ఇప్పటి నుంచి 10–15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలనే ప్రణాళికతో ఉంటే సరైన ట్రాక్‌లో ఉన్నట్టుగానే భావించాలి. ఎందుకంటే మీ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు తగినంత వ్యవధి ఉంది. ఈక్విటీ ఫండ్స్‌లో మోస్తరు రాబడులకు ఇంతకాలం అనుకూలమని చెప్పుకోవచ్చు. దీంతో మీ ఇంటి కొనుగోలుకు కావాల్సిన డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంటి కొనుగోలుకు అయ్యే ధరను ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అంచనా వేస్తునట్టు అయితే, దీనికి రియల్ ఎస్టేట్‌లో ఉండే సగటు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని జోడించాల్సి ఉంటుంది. అప్పుడు వాస్తవ కొనుగోలు ధరపై అంచనాకు రావాలి. దీనివల్ల డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు నెలవారీగా ఎంత మేర సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలన్న దానిపై స్ప ష్టత సాధించొచ్చు. సిప్ మొత్తాన్ని రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి రెండు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పథకాలను కూడా జోడించుకోవచ్చు. కాకపోతే వీటిల్లో 25–30 శాతానికి మించి కేటాయింపులు చేసుకోవద్దు. మీ రిస్క్ సామర్థ్యం, ఈక్విటీ ఫండ్స్ పట్ల మీకు ఉన్న గత అనుభవం ఆధారంగా కేటాయింపులపై నిర్ణయానికి రావాలి. గృహ రుణానికి చెల్లించే ఈఎంఐ మీ నెలవారీ ఆదాయంలో మూడింట ఒక వంతు మించకుండా చూసుకోండి. ఇందుకు గాను కావల్సినంత డౌన్ పేమెంట్‌ను ముందే సమకూర్చుకోవాలి. మరోవైపు ఇంటిని పెట్టుబడిగా చూడడం మంచి ఆలోచన కాదు. రియల్ ఎస్టేట్‌లో లిక్విడిటీ చాలా తక్కువ. ఇంటిని కొనుగోలు చేయడం, విక్రయించడం అంత సులభం కాదు. కనుక ఇంటి కొనుగోలు నివాసం కోణం నుంచే చూడాలి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్‌లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్‌లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్‌లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్‌లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్‌ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్‌గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్‌ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండడమే సరైనది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
భారత్‌పై ఆశావహంగా విదేశీ ఇన్వెస్టర్లు
ముంబై: భారత్‌పై అమెరికా, యూరప్‌లోని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆశావహంగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు ఈక్విటీల్లోకి 9.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు తిరిగి రావడమే ఇందుకు నిదర్శనమని స్విస్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. అంతక్రితం మూడు నెలల్లో 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయని వివరించింది. చాలా మంది గ్లోబల్ ఇన్వెస్టర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీనే తిరిగి గెలుస్తారని విశ్వసిస్తున్నారని, డిసెంబర్ త్రైమాసికంలో పలు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల ఫలితాల గురించి వారు పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొంది. 50 పైగా అమెరికన్, యూరోపియన్ ఎఫ్‌పీఐలతో సమావేశాల అనంతరం యూబీఎస్ ఈ నివేదికను రూపొందించింది. ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో పాటు పెట్టుబడులు మెరుగ్గా ఉండటం .. ఇన్వెస్టర్లలో ఆశావహ ధోరణికి కారణమని పేర్కొంది. అయితే, బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతున్నందున ప్రజలు తమ సొమ్మును ఈక్విటీల్లో కాకుండా ఇతరత్రా సాధనాల్లో దాచుకోవడం, వృద్ధి బలహీనపడటం తదితర రిస్కులు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిఫ్టీ 18,000 స్థాయిలోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు యూబీఎస్ వివరించింది. -
ఈక్విటీల్లో ఫండ్స్ పెట్టుబడులు రూ.2,400 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మే నెలలో ఈక్విటీల్లో కొనుగోళ్ల బాట పట్టాయి. ఏప్రిల్ నెలలో నికరంగా రూ.4,553 కోట్లను ఈక్విటీల నుంచి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) వెనక్కి తీసుకోగా, మే నెలలో రూ.2,446 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడం, జీడీపీ వృద్ధి బలంగా ఉండడం ఇందుకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు చెబుతున్నారు. మే నెలలో ఈక్విటీ పెట్టుబడుల విషయంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), దేశీ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మధ్య చాలా అంతరం నెలకొంది. ఎఫ్‌పీఐలు ఏకంగా రూ.43,838 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, మ్యూచువల్ ఫండ్స్ రూ.2,446 కోట్ల పెట్టుబడులకే పరిమితమైనట్టు సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్‌లోనూ ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో రూ.11,631 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఈ తాత్కాలిక మార్పు ఈక్విటీలకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు భావిస్తున్నారు. ‘‘స్థిరమైన జీడీపీ వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం, ఇన్వెస్టర్‌కు అనుకూలమైన విధానాలు మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు తోడ్పడ్డాయి. ఎఫ్‌పీఐలు, మ్యూచువల్ ఫండ్స్ ఒకరికొకరు సమతుల్యంగా వ్యవహరించారు. ఎఫ్‌పీఐలు విక్రయించినప్పుడు దేశీ ఇనిస్టిట్యూషన్స్ (మ్యూచువల్ ఫండ్స్ సహా) కొనుగోళ్లకు ముందుకు వచ్చాయి’’అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ఎఫ్‌పీఐలు, దేశీ ఇనిస్టిట్యూషన్స్ మధ్య వైరుధ్యం ఉన్నప్పటికీ గడిచిన 11 నెలలుగా మార్కెట్లు మొత్తం మీద సానుకూలంగా ట్రేడ్ అవుతుండడం గమనార్హం. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగమనంపై ఆందోళనలు నెలకొనగా, దీర్ఘకాలంలో భారత్‌కు మెరుగైన వృద్ధి అవకాశాలు ఉన్న విషయాన్ని ఎప్సిలాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్‌రావు గుర్తు చేశారు. -
ఈక్విటీ పథకాల్లో కొనసాగిన పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక డిసెంబర్లో బలంగా నమోదైంది. రూ.7,303 కోట్లను ఈక్విటీ ఫండ్స్ ఆకర్షించాయి. అంతకుముందు నవంబర్ నెలలో వచ్చిన రూ.2,224 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగాయి. డిసెంబర్ నెలకు సంబంధించి ఫండ్స్ సంస్థల గ ణాంకాలను యాంఫి విడుదల చేసింది. డెట్ మ్యూ చువల్ ఫండ్స్ నికరంగా రూ.21,947 కోట్లను కో ల్పోయాయి. 2022 సంవత్సరం మొత్తం మీద అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తు లు (ఏయూఎం) 5.7 శాతం (రూ.2.2 లక్షల కోట్లు ) వృద్ధి చెంది రూ.39.88 లక్షల కోట్లకు చేరాయి. 2021లో 7 శాతం వృద్ధితో పోలిస్తే తగ్గింది. పథకాల వారీగా.. ► ఈక్విటీ విభాగంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,245 కోట్లు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.26 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ రూ.203 కోట్ల పెట్టుబడులను కోల్పోయాయి. ► 24 ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్ల రూపంలో (నూతన పథకాలు/ఎన్‌ఎఫ్‌వోలు) ఫండ్స్ సంస్థలు డిసెంబర్లో ఇన్వెస్టర్ల నుంచి రూ.6,954 కోట్లను సమీకరించాయి. ► 12 క్లోజ్ ఎండెడ్ ఎన్‌ఎఫ్‌వోలు రూ1,532 కోట్లను సమీకరించాయి. ► మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.676 కోట్లు రాగా, లా ర్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.1189 కోట్లు ఆకర్షించా యి. మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,962 కో ట్లు వచ్చా యి. ► వ్యాల్యూ ఫండ్స్‌లోకి రూ.648 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.564 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.403 కోట్ల చొప్పున వచ్చాయి. ► డెట్ విభాగంలో అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.13,852 కోట్లు బయటకు వెళ్లాయి. ► మల్టీ అస్సెట్ అలోకేషన్ పథకాలు రూ.1,711 కోట్లను ఆకర్షించాయి. సిప్ రూపంలో రూ.13,573 కోట్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి డిసెంబర్ నెలలో రూ.13,573 కోట్లు వచ్చాయి. అంతకుముందు నెల నవంబర్‌లో సిప్ పెట్టుబడులు రూ.13,307 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. సిప్ వరుసగా వృద్ధి చూపించడం ఇది మూడో నెల. డిసెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ మొత్తం ఫోలియోల సంఖ్య 14.11 కోట్లకు చేరింది. ఒక పథకంలో ఇక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపును ఫోలియోగా చెబుతారు. పెట్టుబడులు కొనసాగుతాయి.. ‘‘ఇన్వెస్టర్లు సమీప భవిష్యత్తులోనూ మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో పెట్టుబడులు కొనసాగిస్తారు. వృద్ధి ఆధారిత బడ్జెట్ కోసం ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఇది మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించనుంది. దీర్ఘకాల లక్ష్యాలకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలన్న ప్రాధాన్యాన్ని ఇన్వెస్టర్లు విస్మరించలేదు. సిప్ ఖాతాలు పెరగడం దీన్నే సూచిస్తోంది. కొత్తగా డిసెంబర్లో 24 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి. ఈ సాధనంపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఇది తెలియజేస్తోంది’’అని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. -
ఎఫ్‌పీఐల దూకుడు, ఈక్విటీలలో భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా దేశీ ఈక్విటీలలో అమ్మకాలకే కట్టుబడుతున్న విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నవంబర్‌లో మాత్రం కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నారు. వెరసి దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 36,329 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు స్పీడు తగ్గవచ్చన్న అంచనాలు, నీరసించిన చమురు ధరలు, ద్రవ్యోల్బణం ఇందుకు కారణమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల డాలరు ఇండెక్స్‌తోపాటు ట్రెజరీ ఈల్డ్స్ మందగించడం, దేశీ ఆర్థిక పురోగతిపై ఆశావహ అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. సెపె్టంబర్, అక్టోబర్ తదుపరి గత నెల నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న ఎఫ్‌పీఐలు డిసెంబర్‌లోనూ పెట్టుబడులకే ప్రాధాన్యమివ్వడం గమనార్హం! దీంతో ఇకపై ఈ నెలలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత వారానికల్లా మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరడంతో సమీప కాలంలో కొంతమేర లాభాల స్వీకరణకు అవకాశమున్నదని, వేల్యూ స్టాక్స్‌వైపు దృష్టి సారించవచ్చని అరిహంత్ క్యాపిటల్ నిపుణులు అనితా గాంధీ, జియోజిత్ ఫైనాన్షియల్ విశ్లేషకులు వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. సెపె్టంబర్, అక్టోబర్‌లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 7,632 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. చదవండి అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ! -
ఇంట్లో పెళ్లి కోసం.. తక్కువ రిస్క్‌తో ఈ మార్గంలో ఇన్వెస్ట్ చేయండి!
నేను నా సోదరి వివాహం కోసం ప్రతి నెలా రూ.45,000 చొప్పున పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా సార్వభౌమ బంగారం బాండ్లలోనా? మన దేశంలో వివాహాలు సాధారణంగా చూస్తే తక్కువ ఖర్చుతో ముగిసేవి కావు. మీరు అనుకుంటున్నట్టు ప్రతి నెలా రూ.45,000 చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్టయితే గణనీయమైన మొత్తమే సమకూరుతుంది. వివాహం లక్ష్యం విషయంలో రాజీపడలేం. అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే. వాయిదా వేయడానికి ఉండదు. తక్కువ రిస్క్ కోరుకునే వారు అయితే మధ్యస్థ మార్గాన్ని అనుసరించాలి. అందుకుని 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్ విషయంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్‌క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ ఈ పెట్టుబడి మీ పోర్ట్‌ఫోలియో పరంగా చూస్తే స్వల్ప మొత్తం అయి, అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే.. అప్పుడు కాస్త దూకుడుగా పెట్టుబడుల సాధనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆటుపోట్లను తట్టుకునేట్టు అయితే ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి. బంగారం కోసమే అయితే సార్వభౌమ బంగారం బాండ్లలో (ఎస్‌జీబీలు) కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బంగారం విలువ పెరుగుదలకు తోడు, పెట్టుబడి విలువపై ఏటా 2.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ బంగారంతో సోదరి పెళ్లి సమయంలో ఆభరణాలు చేయించొచ్చు. ‘‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ స్టాక్ స్ప్లిట్‌నకు గురవుతోంది. రూ.10 ముఖ విలువ నుంచి రూ.1కు తగ్గనుంది. ఇందుకు సంబంధించి రికార్డు తేదీ సెప్టెంబర్ 02, 2022’’ అంటూ నాకు మెస్సేజ్ వచ్చింది. అంటే దీనర్థం ఏంటి? ఒక ఇన్వెస్టర్‌గా దీనివల్ల నాకు ఏం జరగనుంది? దయచేసి వివరాలు తెలియజేయగలరు. సాధారణంగా ఫండ్ హౌస్‌లు స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిక్విడిటీ (లభ్యత) పెంపునుకు వీలుగా స్టాక్ స్ప్లిట్ ప్రకటిస్తుంటాయి. దీనివల్ల సదరు ఈటీఎఫ్ యూనిట్ విలువ మరింత తగ్గి చిన్న ఇన్వెస్టర్లకు కూడా కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది. నిబంధనల ప్రకారం ఈటీఎఫ్ యూనిట్లను స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్ట్ చేయడం తప్పనిసరి. ఒక ఇన్వెస్టర్‌గా ఇలాంటి నిర్ణయాల వల్ల పెట్టుబడులకు సంబంధించి జరిగే మార్పు ఏమీ ఉండదు. ఈటీఎఫ్ ముఖ విలువ తగ్గడం వల్ల యూనిట్ ఎన్ఏవీ కూడా తగ్గుతుంది. అదే సమయంలో యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. ఉదాహరణకు మీకు రూ.10 ముఖ విలువ కలిగిన 100 యూనిట్లు ఉన్నాయని అనుకుందాం. రూ.1 ముఖ విలువకు యూనిట్‌ను స్ప్లిట్ చేయడం వల్ల అప్పుడు మీ వద్దనున్న 100 యూనిట్లు కాస్తా 1,000 యూనిట్లకు పెరుగుతాయి. కొత్త యూనిట్లు రికార్డు తేదీ తర్వాత మీ ఖాతాకు జమ అవుతాయి. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
ఈక్విటీ ఫండ్స్‌లో తగ్గిన పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక క్రమంగా తగ్గుతోంది. ఆగస్ట్‌లో కేవలం రూ.6,120 కోట్ల వరకే వచ్చాయి. అంతకు ముందు నెలలో (జూలై) వచ్చిన రూ.8,898 కోట్లతో పోలిస్తే 30 శాతం తగ్గాయి. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.15,890 కోట్లు, మే నెలలో రూ.18,529 కోట్లు, జూన్‌లో రూ.15,495 కోట్ల చొప్పున వచ్చిన పెట్టుబడులు.. తర్వాతి రెండు నెలల్లో గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. ఆగస్ట్‌లో వచ్చిన పెట్టుబడులు 2021 అక్టోబర్ (రూ.5,215 కోట్లు) తర్వాత అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అయితే, ఈక్విటీల్లోకి నికర పెట్టబుడుల రాక 18వ నెలలోనూ నమోదైంది. సిప్ ద్వారా రూ.12,693 కోట్లు..: ఫ్లెక్సీక్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, మిడ్‌కాయ్ప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. కొత్త పథకాల ఆవిష్కరణపై సెబీ నియంత్రణ ఎత్తివేయడంతో ఏఎంసీలు పలు కొత్త పథకాల ద్వారా నిధులు సమీకరించాయి. హైబ్రిడ్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.6,601 కోట్లను వెనక్కి తీసుకున్నారు. బంగారం ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ నుంచి రూ.38 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఆగస్ట్‌లో రూ.12,693 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్ ఖాతాల సంఖ్య అత్యంత గరిష్ట స్థాయి 5.71 కోట్లకు చేరింది. డెట్‌లోకి భారీగా.. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఆగస్ట్‌లో రూ.49,164 కోట్లు వచ్చాయి. జూలైలో వచ్చిన రూ.4,930 కోట్లతో పోలిస్తే పది రెట్లు పెరిగాయి. -
ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్: వారం/నెలవారీ సిప్ ఏది బెటర్?
ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఓ మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 ఉండేది కాస్తా, 3కు తగ్గింది. అందుకుని ఈ పెట్టుబడులను విక్రయించేసి, తిరిగి 4 స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఈ మొత్తం ఒకే విడత చేయాలా..? లేక సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో చేసుకోవాలా? – రాజ్‌దీప్ సింగ్ ముందుగా ఓ పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్‌ను 4 నుంచి 3కు తగ్గించడం ఒకే కారణంగా ఉండకూడదు. 3 స్టార్ అంటే చెత్త పనితీరుకు నిదర్శనం కానే కాదు. ఎందుకంటే 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. అందుకుని ముందు మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి ఎందుకు వైదొలుగుతున్నదీ సూక్ష్మంగా విశ్లేషించుకోవాలన్నది నా సూచన. ఆ తర్వాతే ఒకే విడతగానా లేదంటే ఎస్‌డబ్ల్యూపీ రూపంలోనా అన్న అంశానికి రావాలి. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని, వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్‌డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్‌లోడ్, మూలధన లాభాల అంశాలను దృష్టిలో పెట్టుకుని సిస్టమ్యాటిక్‌గా వైదొలగాలా? లేదా? అన్నది నిర్ణయించుకోండి. రెండు మూడు విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనది. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ విధంగా పన్ను ఆదా అవుతుంది. సిప్ రూపంలోఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం/నెలవారీ సిప్‌లలో ఏది బెటర్? – అమర్ సహాని వీక్లీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. దీనివల్ల నెలలో నాలుగు సార్లు పెట్టుబడులు పెట్టుకున్నట్టు అవుతుంది. దీని కారణంగా మీ ఖాతాలో లావాదేవీల సంఖ్య చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందికరమే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ అమలు చేయాలి? అని ఒకసారి ప్రశ్నించుకోండి. దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే ఇన్వెస్టర్లకు సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
ఈక్విటీ ఫండ్స్‌లో తగ్గిన పెట్టుబడులు,రూ.8,898 కోట్లకే పరిమితం!
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక జూలైలో నిదానించింది. కేవలం రూ.8,898 కోట్ల పెట్టుబడులను ఈక్విటీ పథకాలు ఆకర్షించాయి. అంతకుముందు జూన్ నెలలో వచ్చిన రూ.15,495 పెట్టుబడులతో పోల్చి చూస్తే 43 శాతం తగ్గాయి. మే నెలలో రూ.18,529 కోట్లు, ఏప్రిల్‌లో రూ.15,890 కోట్ల చొప్పున పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలైలోనే పెట్టుబడులు తక్కువగా నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతల ప్రభావం పెట్టుబడులపై పడినట్టు తెలుస్తోంది. ఫండ్స్ పెట్టుబడుల వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫీ) సోమవారం విడుదల చేసింది. ఇన్వెస్టర్లలో సానుకూల ధోరణికి నిదర్శనంగా 2021 మార్చి నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అంతకుముందు 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.46,791 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆర్బీఐ ఆగస్ట్‌లోనూ రేట్లను పెంచొచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి అనుసరించి ఉంటారని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవితా కృష్ణన్ తెలిపారు. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు ఆదరణ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో స్మాల్‌క్యాప్ ఫండ్స్ పథకాలు అత్యధికంగా రూ.1,780 కోట్లను జూలైలో ఆకర్షించాయి. ఆ తర్వాత ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.1,381 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్ విభాగాలు ఒక్కోటీ రూ.1,000 కోట్లకు పైనే నికర పెట్టుబడులను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో రూ.12,140 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్ ఖాతాల సంఖ్య 5.61 కోట్లకు చేరుకుంది. ఇక గత నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి రూ.4,930 కోట్ల పెట్టుబడులు నికరంగా వచ్చాయి. జూన్‌లో రూ.92,247 కోట్లు డెట్ నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించాలి. గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) నుంచి రూ.457 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారు. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ గత నెలలో రూ.23,605 కోట్ల పెట్టుబడులను రాబట్టింది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ జూలై చివరికి రూ.37.75 లక్షల కోట్లకు చేరింది. జూన్ చివరికి ఇది రూ.35.64 లక్షల కోట్లుగా ఉంది. -
ఇక కొత్త పథకాల జోరు.. ముగిసిన మూడు నెలల నిషేధం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాలు ఇక మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. కొత్త పథకాల ఆరంభంపై సెబీ విధించిన మూడు నెలల నిషేధం ముగిసిపోయింది. దీంతో అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఫండ్స్ సంస్థలు) కొత్త పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క జూలైలోనే 28 పథకాలను కంపెనీలు ప్రారంభించాయి. ఈక్విటీ, డెట్, ఇండెక్స్, ఈటీఎఫ్‌ల విభాగాల్లో వీటిని తీసుకొచ్చాయి. ఇన్వెస్టర్ల నిధుల పూలింగ్ విషయంలో తాను తీసుకొచ్చిన నిబంధనలను జూలై 1 నాటికి అమలు చేయాలని ఆదేశిస్తూ.. అప్పటి వరకు కొత్త పథకాలు ప్రారంభిచొద్దని ఈ ఏడాది ఏప్రిల్‌లో సెబీ ఆదేశించింది. జూలై 1తో నిషేధం ముగిసిపోయింది. పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో డ్యుయల్ అథెంటికేషన్, ఖాతా మూలాలను గుర్తించాలని కూడా సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కొత్త నిబంధనలు తెచ్చింది. జూలైలో 28 ఎన్‌ఎఫ్‌వోలు జూలైలో 18 ఏఎంసీలు కలసి 28 కొత్త పథకాలను ప్రారంభించాయి. ఇందులో నాలుగు పథకాలు ముగిసిపోగా, 24 పథకాలు ఇంకా పెట్టుబడుల స్వీకరణలో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, బరోడా బీఎన్పీ పారిబాస్, కెనరా రొబెకో, డీఎస్పీ, మోతీలాల్ ఓస్వాల్, ఐడీఎఫ్సీ, మిరే అస్సెట్ నుంచి ఈ పథకాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రారంభమైన పథకాల్లో చాలా వరకు సెబీ విధించిన మూడు నెలల నిషేధానికి ముందే అనుమతి పొందినవిగా ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ హెడ్ అమర్ రాను తెలిపారు. ప్యాసివ్ విభాగంలో పథకాలు లేకపోతే వాటా కోల్పోతామన్న ఉద్దేశ్యంతో.. ఏఎంసీలు ప్యాసివ్ ఇండెక్స్ పథకాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. యాక్టివ్ నిర్వహణతో కూడిన ఈక్విటీ పథకాల్లో మంచి రాబడులు లేకపోవడంతో.. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొంత పెట్టుబడులను ప్యాసివ్ పథకాలకు మళ్లిస్తున్నట్టు అమర్‌రాను వెల్లడించారు. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నుంచి ఈటీఎఫ్‌లకు ఆసక్తి పెరిగినట్టు మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. 176 కొత్త పథకాలు.. 2021–22లో ఏఎంసీలు 176 కొత్త పథకాలను ఆవిష్కరించి, వీటి రూపంలో రూ.1.08 లక్షల కోట్లను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించాయి. అంటే సగటున ఒక్కో నెలలో 15 పథకాలు ప్రారంభమయ్యాయి. 2020–21లో 84 కొత్త పథకాలు రాగా, అవి రూ.42,038 కోట్లను ఆకర్షించాయి. రానున్న రోజుల్లో మరిన్ని నూతన పథకాలు ఇన్వెస్టర్ల ముందుకు వస్తాయని, వీటిల్లో డెట్, ఈక్విటీ విభాగం నుంచి ప్యాసివ్ (ఇండెక్స్‌ల్లో) స్ట్రాటజీతో ఉంటాయని ఎపిస్లాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్‌రావు చెప్పారు. -
ఈక్విటీల్లోకి మరింతగా ఈపీఎఫ్‌వో పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీల్లో మరింతగా ఇన్వెస్ట్ చేసే అంశాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో పరిశీలిస్తోంది. ప్రస్తుతం 15 శాతంగా ఉన్న పరిమితిని 20 శాతం వరకూ పెంచాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై జులైలోనే ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జులై 29, 30 తారీఖుల్లో జరిగే ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈపీఎఫ్‌వో తన దగ్గరున్న ఇన్వెస్ట్ చేయతగిన డిపాజిట్లలో 5-15 శాతం భాగాన్ని ఈక్విటీలు లేదా ఈక్విటీ సంబంధ స్కీముల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. తాజాగా దీన్ని 20 శాతం వరకూ పెంచే ప్రతిపాదనకు ఈపీఎఫ్‌వో సలహాదారు ఫైనాన్స్ ఆడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ (ఎఫ్ఏఐసీ) ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఎఫ్ఏఐసీ సిఫార్సులను తుది ఆమోదం కోసం కీలక నిర్ణయాలు తీసుకునే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ముందు ఉంచనున్నారు. 2015 ఆగస్టు నుంచి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లలో పెట్టుబడుల ద్వారా ఈక్విటీల్లో 5 శాతం ఇన్వెస్ట్ చేయడాన్ని ఈపీఎఫ్‌వో ప్రారంభించింది. ఇటీవలే ఈ పరిమితిని 15 శాతానికి పెంచింది. అయితే, రాబడులకు ప్రభుత్వ హామీలాంటివి ఉండని స్టాక్‌మార్కెట్లలో పింఛను నిధులను ఇన్వెస్ట్ చేయడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) చదవండి: Tata Steel: వ్యయాల సెగ.. అందుకే టాటా స్టీల్ ఫలితాలు ఇలా! -
లాభాలు తెచ్చి పెట్టే ఈ 'ఈక్విటీ ఫండ్' గురించి మీకు తెలుసా?
ఈక్విటీల్లో మెరుగైన రాబడులు ఆశించే వారు ఫోకస్డ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు భారీ సంఖ్యలో స్టాక్స్‌ను తమ పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉండవు. ఎంపిక చేసిన కొన్ని స్టాక్స్‌పైనే ఫోకస్ (ప్రత్యేక దృష్టి) పెడతాయి. ఈ విభాగంలో ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ నమ్మకమైన పనితీరు ప్రదర్శిస్తోంది. అన్ని రకాల మార్కెట్లలోనూ లాభాలు ఇవ్వగల స్టాక్స్‌ను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. కనుక ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు ఇదొక మంచి పెట్టుబడి ఆప్షన్ అవుతుంది. ఈ పథకానికి 2009 నుంచి ఆర్ శ్రీనివాసన్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదొక అనకూలత. గతంలో ఎస్బీఐ ఎమర్జింగ్ ఫండ్‌తో నడిచిన ఈ పథకం పేరు ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌గా మారింది. పెట్టుబడుల విధానం ఫోకస్డ్ ఈక్విటీ పథకాల్లో సుదీర్ఘకాల ట్రాక్ రికార్డు ఈ పథకం సొంతం. పోర్ట్‌ఫోలియోలో 25 స్టాక్స్ వరకు నిర్వహిస్తుంటుంది. మిగిలిన ఈక్విటీ పథకాల మాదిరిగా కాకుండా... ఫోకస్డ్ ఈక్విటీ విభాగంలోని పథకాలు తక్కువ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటాయి. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో 25 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్‌లోనే 50 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. ఇందులోనూ ముత్తూట్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, పీఅండ్‌జీ హైజీన్, దివిస్ ల్యాబ్స్‌లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడుల్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 30 శాతం పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత హెల్త్‌కేర్ రంగ కంపెనీల్లో 12 శాతం, సేవల రంగ కంపెనీల్లో 10 శాతానికి పైగా పెట్టుబడులను కలిగి ఉంది. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల కలయికగా పోర్ట్‌ఫోలియో ఉంది. లార్జ్‌క్యాప్‌లో 57 శాతం, మిడ్‌క్యాప్‌లో 43 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడుల్లో కొంత మేర విదేశీ స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ఐఎన్‌సీ క్లాస్ఏ షేర్లలో 5 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ 3 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఈ తరహా స్టాక్స్ ఎంపిక వల్లే ఈ పథకానికి దీర్ఘకాలంలో మంచి రాబడుల చరిత్ర ఉంది. రాబడులు దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉంది. గడిచి ఏడాది కాలంలో ఒక శాతం నష్టాలను ఇచ్చింది. కానీ, మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 12.50 శాతంగా ఉంది. ఐదేళ్లలోనూ 12.85 శాతం, ఏడేళ్లలో 12.65 శాతం, పదేళ్లలో 16 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచి్చంది. కానీ, బీఎస్ఈ 500టీఆర్ఐ రాబడి ఐదేళ్లలో 11.5 శాతం, ఏడేళ్లలో 11.30 శాతం, పదేళ్లలో 13.80 శాతంగానే ఉంది. ఫ్లెక్సీక్యాప్ సగటు రాబడి చూసినా మూడేళ్లలో 11 శాతం, ఐదేళ్లలో 9.76 శాతం, ఏడేళ్లలో 9.86 శాతం, పదేళ్లలో 13.60 శాతం చొప్పున ఉంది. ఇండెక్స్, ఫ్లెక్సీక్యాప్ విభాగం కంటే ఈ పథకంలో రాబడి ఎక్కువగా ఉంది. 2004 నుంచి ఈ పథకం పనిచేస్తోంది. నాటి నుంచి చూస్తే వార్షిక రాబడి రేటు 18 శాతానికి పైనే ఉండడం గమనించాలి. -
ఈక్విటీలకు దేశీ ఇన్వెస్టర్ల మద్దతు
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లకు దేశీ నిధుల మద్దతు దండిగా ఉంది. ఇందుకు నిదర్శనంగా మే నెలలోనూ ఈక్విటీ ఫండ్స్ రూ.18,529 కోట్ల మేర నికర పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన రూ.15,890 కోట్ల కంటే మరింత అధికంగా వచ్చాయి. మే నెలకు సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. 2021 మార్చి నెల నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెలా నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అంతకుముందు వరుసగా ఎనిమిది నెలల కాలంలో నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. అన్ని విభాగాల్లోకి.. ► మే నెలలో ఈక్విటీలోని అన్ని విభాగాల్లోకి పెట్టుబడులు ప్రవహించాయి. ఫ్లెక్సీ క్యాప్ విభాగంలోకి అత్యధికంగా రూ.2,939 కోట్లు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, సెక్టోరల్ ఫండ్స్‌లోకి రూ.2,200 కోట్లు, అంతకుమించి పెట్టుబడులు వచ్చాయి. ► ఇండెక్స్ ఫండ్స్, ఇతర ఈటీఎఫ్‌లు రూ.11,779 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. ► గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.203 కోట్లను ఆకర్షించాయి. ► డెట్ విభాగం నుంచి నికరంగా రూ.32,722 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు నెల ఏప్రిల్‌లో రూ.69,883 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ► అన్ని విభాగాలు కలిపితే ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.7,532 కోట్లను నికరంగా వెనక్కి తీసేసుకున్నారు. ఏప్రిల్‌లో నికర పెట్టుబడుల రాక రూ.72,846 కోట్లుగా ఉంది. ► మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తులు (ఏయూఎం) ఏప్రిల్ చివరికి ఉన్న రూ.38.89 లక్షల కోట్ల నుంచి మే చివరికి రూ.37.37 లక్షల కోట్లకు క్షీణించింది. సిప్ కళ..: సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చిన పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.11,863 కోట్లు కాగా>, మే నెలలో రూ.12,286 కోట్లకు పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లోనూ ఈక్విటీల పట్ల నమ్మకాన్ని చూపిస్తున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.10వేల కోట్లకు పైన రావడం వరుసగా ఇది తొమ్మిదో నెల కావడాన్ని గమనించాలి. -
కల్లోలంలో కుదురుగా ఉంటేనే..!
పుష్కలమైన లిక్విడిటీతో మంచి రాబడులను ఇచ్చే మెరుగైన సాధనం ఏదైనా ఉందంటే అది ఈక్విటీయే. కానీ, ఈక్విటీలన్నవి అస్థిరతల నడుమ తిరుగుతుంటాయి. సానుకూల పరిణామాలకు పొంగిపోయినట్టే.. ప్రతికూలతల్లో పతనాలను చూస్తుంటాయి. ఇవన్నీ సర్వసాధారణం. ఈ పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటున్నాం..? అన్నదే రాబడులను నిర్ణయిస్తుంటుంది. మార్కెట్లో మన స్థానాన్ని పరీక్షిస్తుంది. జనవరి 17న సెన్సెక్స్ 61,475. మే 9న 54,470కు దిగొచ్చింది. మార్చి 8న 52,261 కనిష్ట స్థాయి వరకూ వెళ్లిన సెన్సెక్స్, అక్కడి నుంచి మార్చి 31 నాటికి 58,891కు చేరింది. మళ్లీ ఇప్పుడు వెనుక చూపులు చూస్తోంది. ఈ అస్థిరతలకు ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తున్నారన్నది ఈక్విటీ పెట్టుబడులకు కీలకం అవుతుంది. ఈ తరహా అశాంతి, ఆందోళనకు గురిచేసే ఈక్విటీ కల్లోల పరిణామాల్లో సాధారణ ఇన్వెస్టర్లు ఏం చేస్తే మెరుగ్గా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయాల ఆధారంగా తెలియజేసే కథనమే ఇది. 2020 మార్చిలో సెన్సెక్స్ 29,468 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఒక్క నెలలోనే 9,442 పాయింట్లు కోల్పోయింది. ఇది 24 శాతానికి సమానం. మార్కెట్లు పడినప్పుడే ఇన్వెస్ట్ చేద్దామని ఎదురు చూసే ఇన్వెస్టర్లు కొందరు ఉంటారు. వీరికి 2020 మార్చి–ఏప్రిల్ కరోనా క్రాష్ మంచి అవకాశం. తమ దగ్గరున్న మిగులు నిల్వలను పెట్టుబడిగా పెట్టుకున్నారు. అయితే, ప్రతీ మార్కెట్ పతనాన్ని పెట్టుబడులకు చక్కని అవకాశంగా తీసుకోవడం సాధ్యపడదు. అలాగే, మార్కెట్ గరిష్టాలను సరిగ్గా అంచనా వేసి అక్కడ విక్రయించడం కూడా ఎక్కువ సందర్భాల్లో అసాధ్యమే. మంచి అవకాశం తలుపుతట్టినా ఆ సమయంలో ఇన్వెస్టర్ ఎలా స్పందించాడన్నది కీలకం అవుతుంది. 2020 మార్కెట్ పతనం సమయంలో మెజారిటీ ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. మార్కెట్లు ఇంకా పడిపోతాయని అనుకున్నారు. మెజారిటీ విశ్లేషకులు కూడా ఇదే అంచనా వేశారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఒక దశ నుంచి మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. అదే ఏడాది చివరికి దాదాపు నష్టాలన్నింటినీ భర్తీ చేసుకున్నాయి. మార్కెట్లు అంచనాలకు భిన్నంగా అలా పెరిగేసరికి అక్కడి నుంచి మళ్లీ పడిపోతాయన్న అంచనాలు వినిపించాయి. దీంతో సెన్సెక్స్ 40వేల స్థాయికి చేరగానే కొందరు పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. కానీ, ఏమైంది..? మార్కెట్లు అక్కడి నుంచి పడిపోలేదు. మరో 50 శాతం పెరిగి 60,000కు చేరింది సెన్సెక్స్. ‘‘మార్కెట్లు ఎగిసిపడడం సర్వసాధారణం. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా వాటిని చూసి అనవసరంగా మన పెట్టుబడులను విక్రయించడం లేదా కొనుగోలు చేస్తే గాయాలపాలు కావాల్సి వస్తుంది’’అన్నది నిపుణుల సూచన. మార్కెట్ల గరిష్ట స్థాయి ఇది, కనిష్ట స్థాయి ఇది.. మార్కెట్లు ఇక్కడి నుంచి పెరుగుతాయి.. ఇక్కడి నుంచి పడిపోతాయి.. ఈ తరహా అంచనాలు (మార్కెట్ టైమింగ్) వేసుకోవడం సరైన విధానం కానే కాదు. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లకు ఇది అనుసరణీయం కాదు. ఎక్కువ సందర్భాల్లో అంచనాలు తప్పి, ర్యాలీలు మిస్ అయిపోవచ్చు. ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను చేజార్చుకుని, ఖరీదైన వ్యాల్యూషన్ల వద్ద అడుగు పెట్టొచ్చు. అందుకని రిటైల్ ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఇన్వెస్ట్ చేసి కొనసాగడమే సరైన విధానం అవుతుంది. తరచూ పెట్టుబడులను మార్చే విధానం వారికి పెద్దగా కలసి రాదు. క్రమం తప్పకుండా ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి సారించాలి. ‘‘మార్కెట్లలో పతనాల కోసం వేచి చూస్తూ, ప్రస్తుతం మార్కెట్ పతనంలో పెట్టుబడి పెట్టాలని చూసే వారికి మేమిచ్చే సలహా ఒక్కటే. ఒకే విడత పెట్టుబడి పెట్టకుండా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి చేసుకోవడమే మెరుగైన మార్గం. మీరు నిర్ణయించుకున్న అస్సెట్ అలోకేషన్ విధానానికి అనుగుణంగా నడుచుకోవాలి’’ అని ‘క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్’ ఈక్విటీ ఫండ్ మేనేజర్ సార్బ్ గుప్తా సూచించారు. అస్థిరతలు.. అవకాశాలు మార్కెట్లలో అస్థిరతలు నిజానికి ఇన్వెస్టర్లకు రాబడి తెచ్చి పెట్టే అవకాశాలుగా అర్థం చేసుకోవాలి. అందరూ ఎగబడి కొంటుంటే విక్రయించడం.. అందరూ ఆందోళనతో విక్రయిస్తుంటే కొనుగోలు చేయడం అన్న వారెన్ బఫెట్ సూత్రాన్ని గుర్తు చేసుకోవాలి. అస్సెట్ అలోకేషన్ కూడా ఇదే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. మార్కెట్లు పడిపోతుంటే స్టాక్స్ చౌక ధరలకే లభిస్తాయి. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు కూడా ఎక్కువ సొంతం చేసుకోవచ్చు. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఉదాహరణకు రూ.1,000ను ఒక పథకంలో రూ.11 ఎన్ఏవీ వద్ద ఇన్వెస్ట్ చేశారనుకుంటే.. అప్పుడు 90.90 యూనిట్లు వస్తాయి. ఏడాది చివరికి అదే ఎన్ఏవీ రూ.13కు వెళితే 18.18 శాతం రాబడి వచ్చినట్టు అవుతుంది. ఒకవేళ ఎన్ఏవీ రూ.9కు దిగిపోతే అప్పుడు మరో రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే 111.11 యూనిట్లు వస్తాయి. మొత్తం రూ.2,000 పెట్టుబడికి వచ్చిన యూనిట్లు 202. అప్పుడు ఎన్ఏవీ రూ.13కు చేరిందనుకోండి రాబడి రేటు 31.30 శాతంగా ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ కానీ, సిప్ విధానంలో కానీ ఈ విధమైన ప్రయోజనాన్ని పొందొచ్చు. సమాచారం విషయంలో జాగ్రత్త ఈక్విటీలకు సంబంధించి ఎంతో సమాచారం డిజిటల్ వేదికలపై ప్రసారమవుతుంటుంది. ఒకప్పటితో పోలిస్తే నేడు అధిక సమాచార వ్యాప్తి ఇన్వెస్టర్లను కుదురుగా ఉండనీయడం లేదు. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌లో సమస్త సమాచారం తెలుసుకునే అవకాశం తప్పటడుగులకు దారితీయకుండా చూసుకోవాలి. అవసరమైన సమాచారానికే పరిమితం కావాలి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిందన్న సమాచారం వెలుగు చూడగానే కంగారుగా ఈక్విటీ పెట్టుబడులను విక్రయించేసిన ఇన్వెస్టర్లు ఉన్నారు. విక్రయించడం సులభమే. కానీ, ఈ పెట్టుబడిని మళ్లీ ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తామన్నది కూడా రాబడులను నిర్ణయిస్తుంటుంది. యుద్ధం వల్ల మొత్తం మార్కెట్ కంటే కూడా విడిగా కొన్ని కంపెనీలపై ప్రభావం భిన్నంగా ఉంటుంది. ‘‘ఒక కంపెనీ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నప్పటికీ స్వల్ప కాలంలో ఆ కంపెనీ షేరు ధర పడిపోవచ్చు. కానీ, అది తాత్కాలికమే. దీర్ఘకాలంలో అదే తీరు కొనసాగదు. మార్కెట్లో ఉన్న సెంటిమెంట్, పరిశ్రమ భవిష్యత్తు అంచనాలు, యాజమాన్యం నాణ్యత, ప్రమోటర్, కార్పొరేట్ చర్యలు ఇలా ఎన్నో అంశాలు షేర్ల ధరలను, మార్కెట్ విలువను ప్రభావితం చేస్తుంటాయి’’అని స్మాల్‌కేస్ సీఈవో వసంత్కామత్ పేర్కొన్నారు. ఒక కంపెనీ షేరు ధర ఎప్పటికైనా దాని వ్యాపార, ఆర్థిక మూలాలకు తగ్గట్టు నడుచుకోవాల్సిందేనన్నారు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారు కంపెనీ ఆర్థిక, వ్యాపార బలాలు, ఇతర అంశాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలి తప్పించి, తాత్కాలికంగా వినిపించే వార్తలు, సమాచారంతో అయోమయానికి గురి కాకూడదు. పెట్టుబడి కాల వ్యవధి కూడా ఈ తరహా సమాచారంపై ఆధారపడాలా? లేదా అన్నది నిర్ణయించుకోవడానికి మార్గదర్శి అవుతుంది. ‘‘ఉదాహరణకు మూడేళ్లు, అంతకుమించిన కాలానికి ఇన్వెస్ట్ చేశారనుకోండి. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించి వార్తలు రణగొణధ్వనే అవుతుంది. ఒకవేళ మూడు నెలల కోసం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, అప్పుడు ప్రస్తుత యద్ధం సంక్షోభ పరిణామాలకు స్పందించాల్సి ఉంటుంది’’అని మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ పీఎంఎస్ ఫండ్ మేనేజర్ శ్రేయి లూంకర్ వివరించారు. యుద్ధం కంపెనీ వ్యాపార నమూనానే దెబ్బతీస్తుందా? లేక తాత్కాలిక ప్రభావం చూపిస్తుందా? అన్నది తేల్చుకున్న తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలి. కాల వ్యవధి కీలకం.. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈక్విటీలు మంచి పనితీరు చూపించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే స్వల్పకాలంలో ఆటుపోట్ల కారణంగా పెట్టుబడికి నష్టం ఏర్పడవచ్చు. స్వల్పకాలంలో అస్థిరతలను ఎదుర్కొన్నా.. సుదీర్ఘ బాటసారిగా మార్కెట్లు ముందుకే ప్రయాణం చేస్తాయని చరిత్ర చెబుతోంది. ఉదాహరణకు 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2020 కరోనా సంక్షోభ సమయాల్లో ఈక్విటీ మార్కెట్లు సగం మేర వాటి విలువను కోల్పోయాయి. కానీ, ఈ రెండు సందర్భాల తర్వాతి కాలంలో మార్కెట్లు మళ్లీ లేచి నిలబడ్డాయి. స్వల్పకాలంలో గణాంకాలు నిరాశకు గురి చేయవచ్చు. దీర్ఘకాలంలో పనితీరు ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. ఈక్విటీల తీరు అలా ఉంటుంది. గడిచిన మూడు నెలల కాలంలో నిఫ్టీ 100, బీఎస్ఈ 500 సూచీల రాబడి 0.75 శాతం, 1.23 శాతం కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటుగానే ఉంది. కానీ, గత ఐదేళ్ల కాలంలో చూస్తే వీటి కాంపౌండెడ్ వార్షిక వృద్ధి 15 శాతంగా ఉంది. ఈక్విటీ పెట్టుబడి అంటే.. ఏదో ఒక స్టాక్‌లో ఒక ధర వద్ద ఇన్వెస్ట్ చేసి, నిర్ణీత శాతం పెరిగిన తర్వాత విక్రయించడం అని కాదు. ఒక వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నట్టు. ఆ వ్యాపారానికి దీర్ఘకాలంలో ఉన్న వృద్ధి అవకాశాలను చూడాలి. వాటి ఆధారంగా ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు ఆ వ్యాపారం వృద్ధి సాధిస్తున్న కొద్దీ అది షేరు ధరపై ప్రతిఫలిస్తుంది. అంతిమంగా పెట్టుబడి మంచి వృద్ధిని చూస్తుంది. కనుక ఈక్విటీలను ఎప్పుడూ దీర్ఘకాల పెట్టుబడి సాధనంగానే చూడాల్సి ఉంటుంది. స్వల్పకాల దృష్టితో చూసే వారికి డెట్ సాధనాలే మార్గం. రీబ్యాలెన్సింగ్ కీలకం... అస్సెట్ అలోకేషన్ ప్రణాళికను మార్కెట్ల అస్థిరతల సమయాల్లో లేదా ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. దీన్నే రీబ్యాలెన్సింగ్ అంటారు. ఉదాహరణకు ఈక్విటీ వ్యాల్యూయేషన్ మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 50 శాతం ఉండాలని నిర్ణయించుకున్నారని అనుకుందాం. మార్కెట్ల అస్థిరతల్లో ఈక్విటీ పెట్టుబడుల విలువ మొత్తం పెట్టుబడుల విలువలో 40 శాతానికి పడిపోయిందనుకోండి. అప్పుడు ఈక్విటీ పెట్టుబడుల విలువ 50 శాతానికి వచ్చే విధంగా ఇతర విభాగాల నుంచి పెట్టుబడులను తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ పట్ల క్రమశిక్షణగా నడుచుకుంటే దీర్ఘకాలంలో ఆ ప్రయోజనం ఏంటో స్వయంగా కళ్లజూస్తారు. అంతేకాదు, మార్కెట్లు బాగా ర్యాలీ చేసిన సందర్భాల్లో ఈక్విటీల వ్యాల్యుయేషన్ మొత్తం పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 70 శాతానికి చేరిందనుకుంటే.. అప్పుడు ఈక్విటీ పెట్టుబడుల విలువ 50 శాతానికి దిగి వచ్చే విధంగా కొంత పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలి. వాటిని ఇతర సాధనాలకు కేటాయించుకోవాలి. దీన్నే రీబ్యాలెన్స్ అంటారు. దీనివల్ల ఒక విభాగంలో వచ్చే ఆటుపోట్లను అవకాశంగా తీసుకుని అదనపు పెట్టుబడులు పెట్టడం.. ఒక విభాగంలో అధిక వృద్ధి నుంచి లబ్ధి పొందడం ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. అస్సెట్ అలోకేషన్ అంటే వైవిధ్యం అని కూడా అర్థం చేసుకోవాలి. ఒకే చోట పెట్టుబడులు అన్నింటినీ పెట్టకుండా వైవిధ్యం పాటించడం. అలాగే, విడిగా ఆయా విభాగాల్లోనూ వైవిధ్యాన్ని పాటించడం మంచిది. ఉదాహరణకు ఈక్విటీల్లో ఒకే రంగంలో, ఒకే విభాగంలో (లార్జ్/మిడ్/స్మాల్‌క్యాప్) కాకుండా వర్గీకరించుకోవాలి. ఈక్విటీ మార్కెట్ల సహజ తీరును అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంలో కోరుకుంటున్న రాబడి రేటు, కావాల్సిన నిధి, ఏ మేరకు పెట్టుబడులు పెట్టగలరు వీటన్నింటినీ విశ్లే షించుకుని చక్కని అస్సెట్ అలోకేషన్ ప్రణాళిక వేసుకుంటే.. ఇక మార్కెట్లు ఎలా స్పందించినా.. అది చూసి ఇన్వెస్టర్‌గా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. పోర్ట్‌ఫోలియో మీరు ఆశించిన మేర ఫలితాలను ఇచ్చే విధంగా రక్షణ కల్పించుకున్నట్టు అవుతుంది. అస్సెట్ అలోకేషన్.. మార్కెట్లు ఏ స్థాయిలో ఉంటే మనకు ఎందుకు..? అస్సెట్ అలోకేషన్ ప్రణాళికకు అనుగుణంగా పెట్టుబడుల క్రమం కొనసాగాలన్నది నిపుణుల సూచన. అస్సెట్ అలోకేషన్ అన్నది వివిధ సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఎంత కాలం పాటు పెట్టుబడులు పెట్టగలరు, కొనసాగించగలరు, ద్రవ్యోల్బణం, అస్థిరతలు ఇత్యాది అంశాల ఆధారంగా ఎవరికి వారే తమకు అనుకూలమైన అస్సెట్ అలోకేషన్‌ను నిర్ణయించుకోవాలి. సాధారణంగా ఈక్విటీ పెట్టుబడులకు.. డెట్, బంగారంలోని పెట్టుబడులు అస్థితరలకు రక్షణగా నిలుస్తాయి. ఈక్విటీ మార్కెట్లు కుదేలైన సందర్భాల్లో పోర్ట్‌ఫోలియోలో వాటి విలువ సహజంగానే పడిపోతుంది. అదే సమయంలో బంగారం, డెట్ ఫండ్స్‌లోని పెట్టుబడుల రూపంలో కొంత రక్షణ ఉంటుంది. ఈక్విటీల షాక్‌లను తట్టుకునేందుకు ఇలా భిన్న సాధానాలతో అస్సెట్ అలోకేషన్ ఉండాలి. గుడ్లు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే పెట్టెలో పెట్టకూడదన్నదే అస్సెట్ అలోకేషన్‌కు మూలం. ఈక్విటీ, డెట్, ఇతర సాధనాల మధ్య సమతూకం పాటించాలి. ఎక్కువ రాబడులను ఇస్తుంది కదా అని ఈక్విటీలపైనే పూర్తిగా ఆధారపడకూడదు. డెట్ ఫండ్స్‌లో రాబడులు చాలా తక్కువగా ఉన్నా సరే పెట్టుబడి కాపాడుకునే వ్యూహంలో భాగంగా కొంత మొత్తాన్ని డెట్ సాధనాలకూ కేటాయించుకోవాల్సిందే. ఈ విధమైన సమతూకం లేకపోతే మార్కెట్ల పతనాల్లో ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందన్న నిపుణుల హెచ్చరిక. -
షేర్లు ‘సిప్’ చేస్తారా? ఇదుగో మీకు కావాల్సిన సమాచారం
మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) గురించి తెలుసు. వారం/పక్షం/మాసం లేదా త్రైమాసికం.. వీటిల్లో ఎంపిక చేసుకున్న నిర్ణీత కాలానికి ఒకసారి బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిగ్గా మ్యూచువల్ ఫండ్ పథకంలోకి పెట్టుబడి వెళుతుంది. ఇదే సిప్‌ను నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకూ సాధనంగా వినియోగించుకోవచ్చు. ఇన్వెస్టర్లు తాము నిర్ణయించుకున్నన్ని షేర్లను నిర్ణీత కాలానికోసారి ఆటోమేటిగ్గా కొనుగోలు చేసుకునే సిప్ సదుపాయాన్ని స్టాక్ బ్రోకర్లు ఆఫర్ చేస్తున్నారు. అయితే, ఇది అందరికీ కాదు.. ఈక్విటీల పట్ల లోతైన అవగాహన, రిస్క్‌లు తెలిసిన వారికే. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ మార్గమే బెటర్. నేడు సమాచార వ్యాప్తి విస్తృతి కారణంగా గతంతో పోలిస్తే సిప్‌కు ఎంతో ఆదరణ పెరిగింది. ప్రతి నెలా రూ.11,000 కోట్లకు పైనే సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడులు వస్తున్నాయి. ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో రూ.1,000 ప్రతి నెలా సిప్‌గా నిర్ణయించుకుంటే.. నిర్ణీత రోజున ఆ మొత్తం ఆ పథకంలో పెట్టుబడిగా చేరిపోతుంది. అదే స్టాక్స్‌లో అయితే ఎంపిక చేసుకున్నన్ని షేర్లు సిప్ రూపంలో డీమ్యాట్ ఖాతాలోకి చేరిపోతాయి. ఇన్వెస్టర్ తరఫున స్టాక్ బ్రోకర్లు ఈ సేవను ఆఫర్ చేస్తున్నారు. ప్రతి నెలా ఏ తేదీన, ఏ కంపెనీ షేర్లను ఎన్ని కొనుగోలు చేయాలన్నది ఇన్వెస్టర్లు చెబితే చాలు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అయితే ఎంత మొత్తం ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. సొంతంగా వేసుకునే సిప్ (డీఐవై సిప్) ఏ షేర్లలో సిప్ చేసుకోవాలన్నది ఇన్వెస్టర్లు నిర్ణయించుకోవాలి. ఒక్క కంపెనీయే అని కాదు.. ఒకటికి మించిన స్టాక్స్‌లో సిప్ ఏర్పాటు చేసుకోవచ్చు.. దీనివల్ల పెట్టుబడుల్లో వైవిధ్యం నెలకొంటుంది. తద్వారా పెట్టుబడుల్లో రిస్క్ తగ్గించుకోవచ్చు. స్టాక్ సిప్‌లను కావాలనుకున్నప్పుడు నిలిపివేసు కోవచ్చు. లేదా రద్దు చేసుకోవచ్చు. ఎప్పుడైనా పెట్టుబడులకు ఇబ్బంది అనిపించినప్పుడు నిలిపివేసుకునే సౌలభ్యం ఇన్వెస్టర్లకు ఉంటుంది. ట్రేడింగ్ ఖాతా నుంచే సిప్‌లో మార్పులు (మోడిఫై) చేసుకోవచ్చు. స్టాక్‌ను మార్చుకోవచ్చు. అలాగే, సిప్ రూపంలో కొనుగోలు చేయాల్సిన స్టాక్స్ సంఖ్యను కూడా మార్చుకోవచ్చు. కొందరు బ్రోకర్లు ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడయ్యే ఈటీఎఫ్‌ల్లోనూ సిప్ అవకాశాన్ని కల్పిస్తున్నారు. చార్జీలు నిల్...! ఏ సేవ అయినా అందులో చార్జీలు ఉంటాయని తెలిసిం దే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్టివ్ ఫం డ్స్ సాధారణంగా 2.5% వరకు ఎక్స్పెన్స్ రేషియో పేరిట చార్జ్ వసూలు చేస్తున్నాయి. అంటే ఏటా ఇన్వెస్టర్ల పెట్టుబడి వి లువ నుంచి ఈ మేరకు అవి మినహాయించుకుంటాయి. కానీ, స్టాక్ సిప్ విషయానికొస్తే ఎ క్కువ బ్రోకరేజీ సంస్థలు ప్రత్యేకంగా చార్జీలు తీసు కోవడం లేదు. ఈక్విటీ డెలివరీగానే వాటిని చూస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డెలివరీ లావాదేవీలపై 0.5% బ్రోకరేజీ వసూ లు చేస్తోంది. కొందరు బ్రోకర్లు అసలు డెలివరీకి ఎటువం టి చార్జీ తీసుకోవడం లేదు. జెరోదా, అప్‌స్టాక్స్ ఇవన్నీ డెలివరీకి జీరో బ్రోకరేజీ అమలు చేస్తున్నాయి. కనుక ఆయా సంస్థల్లో స్టాక్ సిప్ ఉచితమే. కాకపోతే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తరఫున లావాదేవీ చార్జీ స్వల్పంగా 0.00345 ఉంటుంది. దీనిపై 18% జీఎస్టీ ఉన్నా కానీ, ఈ చార్జీ చాలా కొద్ది మొత్తమే. రిస్క్‌లు కూడా ఉన్నాయ్.. మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లతో పోలిస్తే స్టాక్స్ సిప్‌తో రిస్క్ ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నవి నిపుణుల ఆధ్వర్యంలో నడిచేవి. అవి ఏ ఒకటి, రెండు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవు. 25 నుంచి 75 స్టాక్స్ వరకు తమ పోర్ట్‌ఫోలియోలో నిర్వహిస్తుంటాయి. పెట్టుబడుల పరిమాణాన్ని బట్టి స్టాక్స్ సంఖ్యను నిర్ణయిస్తుంటాయి. అది కూడా భిన్న రంగాలకు చెందిన, బిన్న సైజు (లార్జ్, మిడ్, స్మాల్) కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ వైవిధ్యాన్ని పాటించగలవు. తద్వారా పెట్టుబడులపై రిస్క్‌ను తగ్గిస్తాయి. కానీ, రిటైల్ ఇన్వెస్టర్ నేరుగా సిప్ రూపంలో స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుంటే అది ఒకటి లేదా రెండు స్టాక్స్‌కు పరిమితం కావచ్చు. దీనివల్ల రిస్క్ అధిక పాళ్లలో ఉంటుంది. సిప్ కోసం ఎంపిక చేసుకున్న రెండు కంపెనీల్లో ఒక కంపెనీలో ఏదైనా అక్రమాలు బయటపడితే.. వ్యాపార విధానంలో తేడా వచ్చి చతికిలపడితే అప్పుడు ఎదుర్కొనే రిస్క్ అధికంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకాదు కొన్నేళ్ల పాటు అలా సిప్ చేసుకుంటూ వెళితే.. మీ పెట్టుబడుల్లో అధిక భాగం అలా ఒకటి రెండు కంపెనీల్లోనే పోగుపడిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు, పరిశోధన బృందం మార్కెట్ తీరు, పరిస్థితుల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. భావోద్వేగ నిర్ణయాలకు సాధ్యమైనంత దూరంగా పనిచేస్తుంటారు. పెట్టుబడుల విధానాలు తెలిసి ఉంటారు. ఎంతో లోతైన, విస్తృత అధ్యయనం చేసి, నమ్మకం కలిగితేకానీ ఒక కంపెనీలో ఎక్స్పోజర్ తీసుకోరు. కానీ, రిటైల్ ఇన్వెస్టర్లు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విధమైన పరిశోధన, అధ్యయనం చేస్తారా? దాదాపు లేదనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంది. స్టాక్ సిప్ కోసం ఎంపిక చేసుకున్న కంపెనీ.. సమర్థవంతమైనది కాకపోతే నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్ల గురించి తెలిసి, మంచి విజ్ఞానం ఉన్న వారికి స్టాక్ సిప్ అనుకూలిస్తుంది. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి.. రాబడులా లేక నష్టాలా అన్నది ముఖ్యంగా ఎంపికపైనే ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. అంత పరిజ్ఞానం ఉన్న వారికే స్టాక్సిప్. లేదంటే నిపుణుల ఆధ్వర్యంలో నడిచే మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ చేసుకోవడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్లు అసలు స్టాక్ సిప్ గురించి ఆలోచించకపోవడమే మంచిది. ప్రయోజనం ఉందా..? ఒక కంపెనీ స్టాక్ ధర ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు. తగ్గుతూ పెరుగుతుండడం సాధారణం. సిప్ రూపంలో అయితే తగ్గినప్పుడు, పెరిగినప్పుడు పెట్టుబడి పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకేసారి పెట్టుబడులు పెట్టే వెసులుబాటు లేని ఇన్వెస్టర్లు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అటువంటి వారు సిప్ రూపంలో దీర్ఘకాలంలో నచ్చిన కంపెనీలో వాటాలను పోగు చేసుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు లోనైనప్పుడే ఇన్వెస్ట్ చేయాలని వేచి చూసే అవస్థ, అయోమయానికి స్టాక్ సిప్ పరిష్కారం చూపుతుంది. ఎందుకంటే మార్కెట్లు పడినా, పెరిగినా సిప్ రూపంలో వాటిని కొనుగోలు చేస్తుంటారు కనుక ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ (ఫోమో)’ను అధిగమించొచ్చు. ఫోమో అంటే ఒకవేళ వెంటనే కొనుగోలు చేయకపోతే ఆ స్టాక్ ధర పెరిగిపోతుందేమో, చేయి దాటిపోతుందేమో? అన్న ఆందోళన. ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఫోమో కారణంగానే స్టాక్స్‌ను గరిష్ట వ్యాల్యూషన్ల వద్ద కొనుగోలు చేస్తుంటారు. అక్కడి నుంచి స్టాక్స్ పడిపోతుంటే భయంతో అమ్మి బయటపడదామని భావిస్తుంటారు. సిప్ అయితే ఈ తలనొప్పి ఉండదు. -
రిస్క్ ప్రాజెక్టులకు ఈక్విటీ నిధులే బెటర్!
న్యూఢిల్లీ: అమలుకు విషయంలో ఇబ్బందులు ఉన్న (ఇంప్లిమెంటేషన్ రిస్క్) ప్రాజెక్టులకు సాధారణంగా క్యాపిటల్ మార్కెట్ల ద్వారా నిధులు సమీకరణే సమంజసమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు ప్రజా డిపాజిట్లను ఉపయోగించే బ్యాంకుల డబ్బు వినియోగం తగదని ఉద్ఘాటించారు. అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చగల, దాని నష్టాలను నిర్వహించగల బలమైన బాండ్ మార్కెట్ భారతదేశానికి అవసరమని అన్నారు. మొండిబకాయిలకు సంబంధించి భారత్ బ్యాంకింగ్ నియమ నిబంధనలు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ఐబీఏలో తొలి అడుగే..: సంతోష్ కుమార్ శుక్లా కాగా కార్యక్రమంలో ఇన్సూరెన్స్ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ శుక్లా మాట్లాడుతూ, బ్యాంకింగ్‌లో ఎన్పీఏలు తగ్గుదలకు దివాలా చట్టం ఎంతో దోహదపడుతోందన్నారు. ఈ విషయంలో గడచిన ఐదేళ్లలో ఎంతో పురోగతి సాధించినా, ఇవి ఇంకా తొలి అడుగులుగానే భావించాలని అన్నారు. దివాలా పరిష్కార పక్రియలో చోటుచేసుకుంటున్న జాప్యం నేపథ్యంలో కొన్ని అసెట్స్ విలువల్లో క్షీణత సైతం చోటుచేసుకుంటోదన్నారు. సీఓసీ (క్రెడిటార్ల కమిటీ) వేగవంతమైన నిర్ణయాలు తీసుకోగలిగి, ఇతర వ్యవస్థలతో త్వరితగతిన అనుసంధానమై పనిచేయగలిగితే, దివాలా పరిష్కార పక్రియ మరింత వేగవంతం అవుతుందని అన్నారు. దేశ రుణ భారం తగ్గాలి: అజిత్ పాయ్ సమావేశంలో ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్‌కు సంబంధించి నీతి ఆయోగ్ విశిష్ట నిపుణుడు అజిత్ పాయ్ మాట్లాడుతూ, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దేశ రుణ భారం నిష్పత్తి (దాదాపు 80 శాతం) మరింత తగ్గాల్సి ఉందన్నారు. ఇతర పలు జీ–20 దేశాలతో పోలి్చతే ఈ విషయంలో భారత్ వెనుకబడి ఉందని అన్నారు. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.25,077 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డిసెంబర్ నెలలో ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో పెట్టుబడులు పెట్టారు. ఈక్విటీ ఫండ్స్ నికరంగా రూ.25,077కోట్లను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడుల రాక కూడా బలంగా నమోదైంది. మల్టీక్యాప్ ఫండ్స్‌లోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా పదో నెలలోనూ నమోదైంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) తాజా గణాంకాలను తన పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. డిసెంబర్లో పెట్టుబడుల రాక గతేడాది జూలై తర్వాత అత్యధిక స్థాయిలో ఉంది. గతేడాది జూలైలో ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు రూ.25,002 కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చి నుంచి ఈక్విటీ ఫండ్స్ నికరంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి. ఈ కాలంలో మొత్తం రూ.1.1 లక్షల కోట్లు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. అంతకుముందు 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.46,791 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అన్ని విభాగాల్లోకి.. ఈక్విటీల్లో దాదాపు అన్ని విభాగాలు పెట్టుబడులను ఆకర్షించాయి. మల్టీక్యాప్ విభాగంలోకి అత్యధికంగా రూ.10,516 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.313 కోట్లుగా ఉన్నాయి. డెట్ విభాగం నుంచి నికరంగా రూ.49,154 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. 20 నూతన పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) ఫండ్స్ సంస్థలు ప్రారంభించాయి. రూ.37.72 లక్షల కోట్లు 2021 డిసెంబర్ నాటికి మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఇన్వెస్టర్ల ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.37.72 లక్షల కోట్లకు చేరింది. నవంబర్ చివరికి ఈ మొత్తం రూ.37.34 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. సిప్ జోరు.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిస్) ద్వారా డిసెంబర్లో రూ.11,305 కోట్లు ఈక్విటీల్లోకి వచ్చాయి. నవంబర్‌లో సిప్ పెట్టుబడులు రూ.11,005 కోట్లు. సిప్ ఖాతాలు కూడా 4.78 కోట్ల నుంచి 4.91 కోట్లకు పెరిగాయి. ‘‘క్రమానుగత పెట్టుబడులకు, సాధారణ వ్యక్తి సైతం క్రమశిక్షణగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు సిప్ ఆకర్షణీయ సాధనంగా మారింది’’ అని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ అన్నారు. సిప్ రూపంలో మార్కెట్లలో అస్థిరతలను అధిగమించొచ్చని ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నట్టు చెప్పారు. సిప్ వల్ల పెట్టుబడుల వ్యయం సగటుగా మారుతుందని తెలిసిందే. -
మ్యూచువల్ ఫండ్స్ వల్ల కలిగే లాభాలేమిటి?
కరోనా మహమ్మారి తర్వాత తమ డబ్బును ఖర్చు చేయకుండా, మంచి రాబడి ఇచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. అయితే, ఎందులో పెట్టుబడి పెట్టాలని తెగ ఆలోచిస్తుంటారు. ఈ మధ్య పెట్టుబడికి మ్యూచువల్ ఫండ్ ఒక మంచి ఎంపిక అని నిపుణులు ఎక్కువగా చెబుతున్నారు. ఇందులో రాబడి కూడా స్థిరంగా వస్తుంది. అలాగే, స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంతేకాదు, స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో పూర్తిగా తెలియని వారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. అందుకే, పెట్టుబడి పెట్టే ముందు మ్యూచువల్ ఫండ్ గురుంచి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి, దాని వల్ల కలిగే లాభాలేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి స్టాక్‌లు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి మొదలైన వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడి పెట్టే ఒక రకమైన పెట్టుబడి పథకం. ఫండ్ మేనేజర్లు అని పిలిచే ప్రొఫెషనల్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్లు మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తారు. మీ తరుపున మార్కెట్ గురించి మంచి జ్ఞానం ఉన్న ఆర్ధిక నిపుణులు మనకు లాభాలను తెచ్చిపెట్టే ఫండ్‌లో మీ డబ్బును పెట్టుబడి పెడతారు. ఈ నిపుణులు పెట్టుబడిదారుల తరఫున సెక్యూరిటీలను కొనుగోలు చేసి విక్రయిస్తాడు. ఈ కంపెనీలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారుల నుండి కమీషన్లు తీసుకుంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం గురించి పెద్దగా తెలియని వారికి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడికి మంచి ఎంపిక. మ్యూచువల్ ఫండ్స్ రకాలు ఫైనాన్షియల్ సంస్థలు వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. స్కీమ్ రకం, ఫండ్ లక్ష్యాలు, పెట్టుబడి పెట్టిన ఆస్తులు మొదలైన వాటి ఆధారంగా వీటిని అనేక కేటగిరీలుగా వర్గీకరించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్: ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతుంటే దాన్ని ఈక్విటీ ఫండ్ అంటారు. వీటిపై మార్కెట్ రిస్క్‌తో పాటు రాబడి కూడా అధికంగా ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్: ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. డెట్ ఫండ్స్ విషయంలో కంపెనీలు కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లు వంటి రిస్క్ తక్కువగా ఉండే మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ తక్కువగా ఉంటుంది. అయితే వీటిలో లాభాలు ఎక్కువగా ఉండవు. డెట్ ఫండ్స్‌లో ఫిక్స్డ్ రిటర్న్‌లతోపాటు డబ్బు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ తక్కువ సమయంలో సురక్షితమైన పెట్టుబడికి డెట్ ఫండ్స్ మంచి ఆప్షన్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: కొన్ని కంపెనీలు షేర్లలో కొంత మొత్తాన్ని, డెట్ సెక్యూరిటీలలో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలాంటి పథకాలను హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. లిక్విడ్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతర మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫండ్ కంపెనీ పెట్టుబడి పెట్టే షేర్ల రకాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లేదా మల్టీ క్యాప్ రకాలు కూడా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ వల్ల కలిగే ప్రయోజనాలు మ్యూచువల్ ఫండ్ వల్ల ప్రయోజనం ఏమిటంటే, ఇక్కడ మీ పెట్టుబడిని ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు, అతను మార్కెట్ గురించి మంచి అవగాహన కలిగి ఉంటాడు. అటువంటి పరిస్థితిలో, అతను మీ డబ్బును ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెడతాడు, అక్కడ రాబడి మంచిదని భావిస్తున్నారు. అదే సమయంలో, మీ పోర్ట్‌ఫోలియో మ్యూచువల్ ఫండ్ల ద్వారా వైవిధ్యభరితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ, కేవలం ఒక వాటాకు బదులుగా, డబ్బును వేర్వేరు వాటాలలో లేదా ఆస్తి తరగతిలో ఉంచారు. ఒకదానిలో ప్రమాదం ఉంటే, అది మరొకదాని ద్వారా భర్తీ చేస్తూ ఉంటుంది. మీ డబ్బు డెట్ ఫండ్లలో కూడా పెట్టుబడి పెట్టబడింది, కాబట్టి మార్కెట్ అస్థిరత ఉన్నప్పటికీ, డబ్బు ఇప్పటికీ సురక్షితంగా ఉంది. మీరు పెట్టుబడి పెట్టగల గరిష్ట మొత్తంపై పరిమితి లేనప్పటికీ, రూ. 500 కంటే తక్కువ మొత్తంతో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. అయితే ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడుల విషయంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు(ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం) మాత్రమే మీరు పన్ను ప్రయోజనాన్ని పొందుతారని గుర్తుంచుకోండి. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంలో గరిష్టంగా కమిషన్ 2.5%(సెబీ నిబంధనల ప్రకారం) వరకు తీసుకుంటాయి. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.5,215 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక ఆక్టోబర్‌లో కాస్తంత నిదానించింది. నికరంగా రూ. 5,215 కోట్ల పెట్టుబడులను ఈక్విటీ ఫండ్స్ ఆకర్షించాయి. సెప్టెంబర్‌లో ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.8,677 కోట్లుగా ఉన్నాయి. మార్కెట్లు గరిష్టాల వద్ద కదలాడుతుండడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే నికర పెట్టుబడుల్లో క్షీణతకు కారణమని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్, అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. ‘‘అధిక విలువలను చూసి చాలా మంది ఇన్వెస్టర్లు తటస్థంగా ఉండియారు. ఇందుకు నిదర్శనమే.. సెప్టెంబర్‌లో రూ.3 6,656 కోట్లను సమీకరించగా.. అక్టోబర్‌లో ఇది రూ. 28,671 కోట్లకు తగ్గడం’’ అని శ్రీవాస్తవ వివరించారు. ‘‘ఈక్విటీల్లో పెట్టుబడుల వాతావరణం కొనసాగింది. కానీ, అదే సమయంలో లాభాల స్వీకరణ కూడా కనిపించింది. మొత్తం మీద రూ. 23,500 కోట్ల మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి ఈక్విటీ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈ ఎనిమిది నెలల్లో రూ. 73,766 కోట్లు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. విభాగాల వారీగా.. - మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడులు (ఆస్తులు/ఏయూఎం) అక్టోబర్ చివరికి రూ.38.21లక్షల కోట్లకు పెరి గాయి. సెప్టెంబర్ చివరికి ఈ మొత్తం రూ. 37.41 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. - వ్యాల్యూ, ఈఎల్ఎస్ఎస్ మినహా మిగిలిన అన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విభాగాలు నికరంగా పెట్టుబడులను ఆకర్షించాయి. సెక్టోరల్/థీమ్యాటిక్, ఫ్లెక్సీక్యాప్, లార్జ్‌క్యాప్, ఫోకస్డ్, లార్జ్‌అండ్‌మిడ్‌క్యాప్ విభాగాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. - బ్రిడ్ విభాగంలోని పథకాల్లోకి నికరంగా రూ.10,437 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో ఈ మొత్తం రూ.3,587 కోట్లుగానే ఉంది. - డైనమిక్ అస్సెట్ అలోకేషన్/బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ విభాగం సైతం రూ.11,219 కోట్లను ఆకర్షించింది. వ్యాల్యూషన్ల ఆధారంగా డెట్, ఈక్విటీ మధ్య పెట్టుబడులను ఈ విభాగంలోని పథకాలు మారుస్తుంటాయి. - ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల్లోకి రూ.10,759 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. - నెలవారీగా వచ్చే సిప్ పెట్టుబడులు అక్టోబర్‌లో 10,518 కోట్లకు పెరిగాయి. ఇది రికార్డు గరిష్ట స్థాయి. సెప్టెంబర్‌లో ఈ మొత్తం రూ.10,351 కోట్లుగా ఉంది. - డెట్ ఫండ్స్ నికరంగా రూ.12,984 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో డెట్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.63,910 కోట్లను వెనక్కి తీసుకోవడం గమనార్హం. - మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి (డెట్, ఈక్విటీ తదితర) అక్టోబర్‌లో రూ.38,275 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో వచ్చిన రూ.47,257 కోట్లతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. చదవండి: ఒకే పథకం.. ఒకటికి మించి ప్రయోజనాలు -
డెట్ ఫండ్స్..తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయాలి!
‘ఈక్విటీల్లో అధిక రిస్క్ ఉంటుంది’.. తరచుగా ఈ మాట వింటుంటాం. నిజానికి రిస్క్ లేని పెట్టుబడి సాధనాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఆ మాటకొస్తే డెట్ ఫండ్స్‌లోనూ రిస్క్ ఉంటుంది. ఈక్విటీలను మించిన రిస్క్ డెట్ ఫండ్స్‌లోనూ ఉంటుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డెట్ పథకాల మూసివేత ఉదంతాన్ని పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈక్విటీల్లో రిస్క్.. డెట్‌లో రిస్క్ లేదన్న అపోహలు వీడాలి. పెట్టుబడులకు ముందే ప్రతీ సాధనాన్ని అర్థంచేసుకునేందుకు ప్రయత్నిస్తే రిస్క్పాళ్లు తెలుస్తాయి. తెలుసుకోకుండా ఏదేనీ సాధనంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి.. అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటే ఎన్నో ఆకాంక్షలతో చేసిన పెట్టుబడులను తిరిగి పొందడం ఆశగానే మిగిలిపోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నిపుణుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయి కనుక.. పెట్టుబడులు సురక్షితం అనుకోవద్దు. వారు సైతం తప్పటడుగులు వేయొచ్చు. నియంత్రణ సంస్థలు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను అన్ని సందర్భాల్లోనూ కాపాడతాయనుకోలేము. ఇన్వెస్టర్లే తగిన ముందస్తు అధ్యయనం, జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వారి పెట్టుబడులకు రక్షణ సాధ్యపడుతుంది. సెబీ ఇటీవలి ఆదేశాలను పరిశీలిస్తే.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం నుంచి ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన అనుభవాలు కొన్ని కనిపిస్తాయి. ఆ వివరాలే ఈవారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనంలో... 2018లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మ్యూచువల్ ఫండ్స్ విభాగాలకు (కేటగిరీలు) సంబంధించి పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. మ్యూచువల్ ఫండ్స్ పథకాలను 36 విభాగాలుగా వర్గీకరించింది. దీనివల్ల ఇన్వెస్టర్లు తమకు అనువైన పథకాలను సులభంగా ఎంపిక చేసుకోవచ్చన్నది సెబీ ఉద్దేశం. పథకాల పెట్టుబడుల విధానం పేరులో ప్రతిఫలించేలా సెబీ నాడు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ వాస్తవంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల పెట్టుబడులు వాటి పేరును ప్రతిఫలించడం లేదనే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీరు నిరూపించింది. అందుకే పేరును చూసి మోసపోవద్దు. ఆ పథకం పెట్టుబడుల విధానం ఆయా విభాగం పరిధికి అనుగుణంగా ఉన్నదీ, లేనిదీ ఇన్వెస్టర్లు విచారించుకోవాలి. లో డ్యూరేషన్ ఫండ్స్, షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్, లాంగ్డ్యూరేషన్ ఫండ్స్ ఇలా ఎన్నో డెట్ విభాగాలున్నాయి. ఇవన్నీ కూడా తక్కువ రిస్క్ ఉండేవే. కానీ, అసలు రిస్క్ అన్నది ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసుకునే డెట్ పేపర్లపైనే ఆధారపడి ఉంటుంది. ఫండ్ నిర్వహణ సంస్థ తక్కువ రిస్క్ ఉండే డెట్ పేపర్లనే అన్ని కాలాల్లోనూ ఎంపిక చేసుకుంటుందని నమ్మడానికి లేదు. అధిక రాబడుల కోసం నాణ్యతలేమి డెట్ పేపర్లలోనూ పెట్టుబడులు పెట్టొచ్చు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అదే చేసింది. పరిమితికి మించి పెట్టుబడుల్లో రిస్క్ తీసుకుంది. సాధారణంగా ఏఏ అంతకంటే దిగువ రేటింగ్ పేపర్లలో క్రెడిట్ రిస్క్ ఉంటుంది. అంటే డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. అందుకే ఆయా డెట్ పేపర్లను జారీ చేసే సంస్థలు అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్లకు అధిక రాబడులను ఆఫర్ చేసే ఉద్దేశంతో 2019 డిసెంబర్ నాటికి ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్ 84 శాతం పెట్టుబడులను తీసుకెళ్లి ఏఏ, అంతకంటే తక్కువ రేటింగ్ పేపర్లలో పెట్టేసింది. అలాగే, షార్ట్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్ పథకం కింద పెట్టుబడుల్లోనూ 80 శాతాన్ని అధిక రిస్క్ ఉండే పేపర్లలో ఇన్వెస్ట్ చేసింది. కానీ ఈ పథకాల పేర్లలో క్రెడిట్ రిస్క్ లేదన్నది గమనించాలి. ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్ 86 శాతం పెట్టుబడులను ఏఏ అంతకు దిగువ పేపర్లలో ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. క్రెడిట్ రిస్క్ అని పేరులోనే ఉంది కనుక ఇలా ఇన్వెస్ట్ చేయడంలో అర్థం ఉంది. కానీ, లో డ్యూరేషన్, షార్ట్‌టర్మ్ ఇన్కమ్ ప్లాన్ విషయంలోనూ అదే విధంగా పెట్టుబడుల విధానాన్ని పాటించి తప్పు చేసింది. ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూయల్ ఫండ్, ఇన్కమ్ అపార్చునిటీస్ ఫండ్ సైతం అదే తోవలో నడిచాయి. సెబీ కేటగిరీ నిబంధనలను ఏ మాత్రం పాటించలేదన్న విషయం ఇక్కడ తేటతెల్లమవుతోంది. అందుకే ఇన్వెస్టర్లు పెట్టుబడుల కోసం డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకునే ముందు కేవలం పేరు, విభాగానికే పరిమితం కావద్దు. వాటి పోర్ట్‌ఫోలియోను పూర్తిగా చూసి, నిబంధనల మేరకే ఉందని నిర్ధారించుకున్న తర్వా తే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పటికే మీరు డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఆయా పథకాలను ఒక్కసారి సమగ్రంగా పరిశీలించుకోండి. తెలియకపోతే నిపుణుల సాయం పొందడానికి వెనుకాడొద్దు. రాబడులే గీటురాయి కావద్దు.. పెట్టుబడికి రాబడి ఒక్కటే ప్రామాణికంగా భావించడం సరికాదు. రాబడితోపాటు పెట్టుబడికి రక్షణ కూడా అంతే ముఖ్యం. కానీ, చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు అధిక రాబడులను ఇచ్చే పథకాలనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటుంటారు. అంత రాబడులను ఆయా పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఫ్రాంక్లిన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ సంస్థ అర్ధంతరంగా మూసేసిన డెట్ పథకాలు కూడా రాబడులతో ఇన్వెస్టర్లను ఆకర్షించినవి కావడం గమనార్హం. అనలిస్టులు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు సైతం ఫ్రాంక్లిన్ ఇండియా సంస్థ అంత రాబడులను ఎలా ఇవ్వగలుగుతోందన్న సంశయాన్ని ఎదుర్కొన్న వారే. ఆ రాబడుల వెనుకనున్న అసలు రూపం ఆలస్యంగానే బయటకు వచ్చింది. అధిక రాబడులను ఇచ్చే ఫ్రాంక్లిన్ డెట్ పథకాలను ఇన్వెస్టర్లకు సూచించిన ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా డెట్ పథకాలు రాబడులను ఎలా ఇస్తాయన్నది తెలియకపోతే వాటికి ఇన్వెస్టర్లు దూరంగా ఉండడమే మంచిదని నిపుణుల సూచన. పోటీ పథకాలతో పోలిస్తే అధిక రాబడులను ఇవ్వాలన్న లక్ష్యాన్ని ఫ్రాంక్లిన్ ఇండియా అనుసరించింది. అందుకోసం అసాధారణ విధానాలను ఎంచుకుంది. పెట్టుబడుల్లో సింహ భాగాన్ని ‘బీస్పోక్ బాండ్స్’.. అంటే ప్రైవేటుగా జారీ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేసింది. 2020 మార్చి నాటికి ఆరు డెట్ పథకాలకు సంబంధించి 56 శాతం నుంచి 77 శాతం పెట్టుబడులను ఫ్రాంక్లిన్ ఇండియా సంస్థ ఇటువంటి బాండ్లలోనే పెట్టింది. ప్రైవేటుగా జారీ చేసిన బాండ్లలో 70 శాతం పెట్టుబడులు ఈ సంస్థవే ఉన్నాయి. బీస్పోక్ బాండ్లలో సింహ భాగం పెట్టుబడులు ఈ ఒక్క సంస్థే పెట్టడంతో అధిక వడ్డీ రేటును డిమాండ్ చేసి పొందగలిగింది. కానీ, ఆయా బాండ్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్నవి కావు. అంటే లిక్విడిటీ తగినంత లేనివి. బాండ్లను జారీ చేసిన సంస్థ సమస్యల్లో పడిపోవడంతో ఫ్రాంక్లిన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఎదురైంది. పైగా ఆయా బాండ్ల నుంచి కాల వ్యవధి తీరిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసేసుకోకుండా.. వాటిల్లోనే కొనసాగుతూ వడ్డీ రేట్లను సవరించుకుంటూ ముందుకు వెళ్లింది. దీనివల్ల వడ్డీ రేట్ల పరంగా ఎక్కువ ప్రతిఫలాన్ని రాబట్టే ప్రయత్నం చేసింది. ఇక్కడే మరో తప్పిదం కూడా జరిగింది. ఆయా బాండ్లలోనే కొనసాగే విధానం వల్ల.. షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొనసాగించే విధానాలను ఆశ్రయించింది. అంటే స్వల్పకాలం కోసం తీసుకున్న పెట్టుబడులను దీర్ఘకాల బాండ్లలో ఇన్వెస్ట్ చేసింది. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఉదాహరణకు లో డ్యురేషన్ ఫండ్స్ అన్నవి 6 నెలల నుంచి 12 నెలలకు మించని కాల వ్యవధితో కూడిన డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంటే 12 నెలలకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవు. కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ లో డ్యూరేషన్ ఫండ్స్ పెట్టుబడులను బీస్పోక్ బాండ్లలోనే గడువు తీరినా కొనసాగిస్తూ వెళ్లింది. కేవలం అధిక రాబడుల కోసమే ఇలా చేసింది. వడ్డీ రేట్లను సవరించిన తేదీలనే పెట్టుబడుల కాల వ్యవధిగా చూపించింది. ఇలాంటి విధానాలతో అధిక రాబడులను ఇవ్వొచ్చేమో కానీ.. ఇన్వెస్టర్ల పెట్టుబడులను అధిక రిస్క్‌లో పెట్టినట్టే అవుతుంది. సెబీ నిబంధనల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పోర్ట్‌ఫోలియో వివరాలను నెలవారీగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, ఈ పోర్ట్‌ఫోలియోలో మ్యూచువల్ ఫండ్ పథకం కలిగి ఉన్న బాండ్ల వివరాలే ఉంటాయి. అంతకుమించి వివరాలు తెలియవు. దీంతో ఇక్కడే రిస్క్ ఏర్పడుతుంది. మన బాండ్ మార్కెట్ ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. దీంతో చాలా బాండ్లు ప్రైవేటుగా అనధికారిక ఒప్పందాల మేరకు జారీ అవుతుంటాయి. అందుకే డెట్ ఫండ్స్ విషయానికొస్తే మీరు చూసేది వేరు.. పొందేది వేరన్నది గ్రహించాలి. పోర్ట్‌ఫోలియోలో డెట్ పేపర్లు, వాటి కాల వ్యవధి వివరాలు ఉంటాయి. వాటిని సమగ్రంగా పరిశీలించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. నియంత్రణపరమైన లోపాలు మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన నియంత్రణల మధ్య నడుస్తుంటాయని, మంచి రాబడులను ఇస్తాయని అందరికీ తెలిసిన విషయం. అంటే నూరు శాతం రిస్క్ లేనివని భావించొద్దు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్ సంస్థలు దివాలా తీసిన తర్వాత డెట్ ఫండ్స్ విషయంలో సెబీ నిబంధనలను కఠినతరం చేసిన మాట వాస్తవమే. సెబీ అన్ని చర్యలు తీసుకున్నాకానీ.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రూపంలో మరోసారి లోపాలు బయటపడ్డాయి. అందుకే నియంత్రణ సంస్థలు, నిబంధనలపై భారం వేసి ఇన్వెస్టర్లు నిశ్చింతగా కూర్చుంటామంటే కుదరదు. ఎందుకంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ మూసివేయడానికి ముందే.. ఆ సంస్థ సీనియర్ ఉద్యోగులు ఆయా పథకాల్లో తమకున్న పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నట్టు సెబీ గుర్తించింది. ఇది ఇన్వెస్టర్లను పూర్తిగా వంచించడమే అవుతుంది. స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి కఠినమైన ఇన్సైడర్ నిబంధనలను సెబీ అమలు చేస్తోంది. స్టాక్ ఎక్సే్చంజ్‌ల స్థాయిలో నిఘా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఇవే నిబంధనలు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లకు వర్తించవు. దీంతోఫండ్స్ సంస్థల్లో పనిచేసేవారు, వారి సన్నిహితులు ఆంత రంగిక సమాచారం ఆధారంగా యూనిట్లలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఇన్వెస్టర్ల ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఫ్రాంక్లిన్ వ్యవహరించింది. దీంతో సెబీ మ్యూచువల్ ఫండ్స్ నిబంధనల్లో లోపాలకు వెంటనే చెక్ పెట్టకపోతే.. ఇతర సంస్థల్లోనూ ఈ తరహా లోపాలకు ఆస్కారం లేకపోలేదు. అందుకే ఇన్వెస్టర్లు కాస్త అవగాహనతో వ్యవహరించడం ముఖ్యం. స్టార్‌ను చూస్తేనే సరిపోదు.. స్టార్ ఫండ్ మేనేజర్.. మంచి రాబడుల చరిత్ర అన్నవి మ్యూచువల్ ఫండ్స్ పథకం ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లు చూసే అంశాలు. కానీ, ఇవి మాత్రమే చాలవని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం సూచిస్తోంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డెట్ పథకాలను పర్యవేక్షించిన ఫండ్‌మేనేజర్ సంతోష్ కామత్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఆయన పనితీరును చూసి రిస్క్‌కు భయపడే ఇన్వెస్టర్లకు ఫ్రాంక్లిన్ డెట్ పథకాలను ఆర్థిక సలహాదారులు సూచించే వారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డెట్ పేపర్ల నాణ్యతలో, లిక్విడిటీ విషయంలో కామత్ రాజీపడ్డారు. అదే సంక్షోభానికి దారితీసింది. అందుకే స్టార్ రేటింగ్‌లకే పరిమితం కాకుండా కాస్త లోతుగా చూసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. సుప్రీం జోక్యం వరకూ.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్.. ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్‌టర్మ్ ఇన్కమ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కమ్ అపార్చునిటీస్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూయల్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్‌రిస్క్ ఫండ్లను 2020 ఏప్రిల్‌లో నిలిపివేసింది. ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు అభ్యర్థనలు వస్తుండగా.. వాటికి చెల్లింపులు చేసే స్థాయిలో లిక్విడిటీ లేకపోవడం (అంటే పెట్టుబడులను విక్రయించాలనుకుంటే కొనేవారు లేక)తో ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆసియా పసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ వివేక్ కుద్వా ఈ పథకాలను మూసివేయడానికి ముందే తన వ్యక్తిగత హోదాలో ఇన్వెస్ట్ చేసిన రూ.32 కోట్లను వెనక్కి తీసేసుకున్నట్టు సెబీ గుర్తించింది. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్. అందుకే డెట్ ఫండ్స్ పథకాలకు సంబంధించి ఉండే గరిష్ట రిస్క్ స్థాయిలను ఇన్వెస్టర్లకు తెలియజేయాలంటూ సెబీ ఇటీవలే నిబంధనలను తీసుకొచ్చింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ మూసేసిన ఆరు డెట్ పథకాల ఇన్వెస్టర్లకు జూన్ 15 నాటికి రూ.17,777 కోట్లు వెనక్కి రావడం కొంత ఊరట. 2020 ఏప్రిల్ 23 నాటికి ఆయా పథకాల్లోని మొత్తం పెట్టుబడుల్లో ఇది 71%. సుప్రీంకోర్టు జోక్యంతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లిక్విడేటర్‌గా రంగంలో దిగడంవల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు వారికి చేరడానికి మార్గం సుగమం అయ్యింది. -
అమెరికా షేర్లలో పెట్టుబడి ఈజీ..!
‘గుడ్లు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే బుట్టలో పెట్టరాదు’ అని ఇన్వెస్ట్మెంట్లో ప్రాథమిక సూత్రం ఒకటి ఉంది. ఇన్వెస్టర్లు అందరూ పాటించాల్సిన సూత్రం ఇది. కానీ, పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని అందరూ పాటించరు. కొంత మంది మాత్రం ఈక్విటీల్లో, బాండ్లలో, బంగారంలో ఇలా భిన్నమైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించుకునే సూత్రాన్ని అనుసరిస్తుంటారు. ఇలా పెట్టుబడులను ఒకటికి మించిన వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. ఒక్కో సమయంలో ఒక్కో సాధనం చూపించే అసాధారణ పనితీరు నుంచి ప్రయోజనం పొందొచ్చు. పైగా కొన్ని సందర్భాల్లో ఒక్కో విభాగం నష్టాలను చూడాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో రిస్క్‌ను తగ్గించుకున్నవారు అవుతారు. ఈక్విటీ పెట్టుబడులను సైతం అన్నింటినీ మన మార్కెట్లలోనే ఇన్వెస్ట్ చేయడం కాకుండా, కొంత భాగాన్ని యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కూడా వైవిధ్యమే అవుతుంది. ఒకప్పుడు లేని ఈ అవకాశాన్ని నేడు పలు బ్రోకరేజీ సంస్థలు తమ ఇన్వెస్టర్లకు అందిస్తున్నాయి. భౌగోళికంగా భిన్న మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం అన్నది ఒకే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడంతో పోలిస్తే ఆటుపోట్లను అధిగమించి మెరుగైన రాబడులకు వీలు కల్పిస్తుంది. పైగా మన ఈక్విటీ మార్కెట్లలో అందుబాటులో లేని వినూత్న అవకాశాలు యూఎస్ ఈక్విటీల్లో ఉన్నాయి. ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ ఈ తరహా సంస్థలు మన మార్కెట్లలో లిస్ట్ అయి లేవు. కానీ, ఈ దిగ్గజాలు ఎప్పటికప్పుడు మరింత బలపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూజర్లను కలిగి ఉన్నవి కావడంతో వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వృద్ధి ఫలాలను పొందొచ్చు. అమెరికాలో సెక్యూరిటీల నియంత్రణ మండలి అయిన ‘ఎస్ఈసీ’ ఫ్రాక్షనల్ షేర్లలోనూ ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తోంది. ఉదాహరణకు చాలా ఖరీదైన షేరును కొనుగోలు చేయాలనుకునే వారి దగ్గర తక్కువ పెట్టుబడే ఉన్నట్టయితే.. అప్పుడు ఆ స్టాక్‌లో కొంత భాగాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. తమవద్దనున్న ఫ్రాక్షనల్ షేర్ల విలువకు తగినట్టు ఓటింగ్ హక్కులతోపాటు డివిడెండ్‌కు అర్హులవుతారు. తమ పిల్లలను అమెరికాలో ఉన్నత విద్యకు పంపించాలనుకుంటుంటే అమెరికన్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి ఆలోచన అవుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా వారి విద్యకు అవసరమైన మొత్తాన్ని స్టాక్స్ పెట్టుబడుల రూపంలో సమకూర్చుకోవచ్చు. ఇన్వెస్ట్ చేయడం ఎలా..? దేశీయంగా ఈక్విటీల్లో నేరుగాను, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నట్టే.. యూఎస్ స్టాక్ మార్కెట్లలోనూ నేరుగా స్టాక్స్ కొనుగోలు చేసుకోవచ్చు. లేదా అక్కడి స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను కల్పిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. నేరుగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ వేదికలు అయిన వెస్టెడ్ ఫైనాన్స్, స్టాకాల్, విన్వెస్టా ఉన్నాయి. భారత్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థలు ఐసీఐసీఐ డైరెక్ట్, యాక్సిస్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యూఎస్ బ్రోకరేజీ సంస్థలతో ఒప్పందం చేసుకుని అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడుల సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో ఐసీఐసీఐ డైరెక్ట్.. ఇంటరాక్టివ్ బ్రోకర్స్ ఎల్ఎల్సీతోను, యాక్సిస్ సెక్యూరిటీస్ వెస్టెడ్ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి విదేశాల్లో ట్రేడింగ్ అకౌంట్ ప్రారంభానికి కేవైసీ డాక్యుమెంట్లతోపాటు దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. పాన్, గుర్తింపు ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి. అకౌంట్ ఓపెనింగ్ చార్జీలు, బ్రోకరేజీ చార్జీలు, కమీషన్లు సంస్థలను బట్టి మారిపోతాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ డైరెక్ట్ అయితే అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌పై అకౌంట్ ప్రారంభానికి ఎటువంటి చార్జీలను వసూలు చేయడం లేదు. కానీ, వార్షిక సబ్స్క్రిప్షన్ చార్జీగా రూ.999–9,999 మధ్య చెల్లించుకోవాలి. బ్రోకరేజీ కింద ఒక షేరుకు యూఎస్ సెంట్ నుంచి 2.99 డాలర్ల వరకూ వసూలు చేస్తున్నాయి. అంటే కస్టమర్లు ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా చార్జీల్లో మార్పు ఉంటుంది. ఐసీఐసీఐ డైరెక్ట్ కస్టమర్లకు ‘గ్లోబల్ స్టార్టర్’, ‘గ్లోబల్ అడ్వాంటేజ్’ అనే రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వెస్టెడ్ ఫైనాన్స్ బేసిక్ ప్లాన్ అకౌంట్ ప్రారంభానికి రూ.399 చార్జీ వసూలు చేస్తోంది. ఇది మినహా ఇతరత్రా బ్రోకరేజీ లేదా కమీషన్లను వసూలు చేయడం లేదు. మోడల్ పోర్ట్‌ఫోలియో తదితర విలువ ఆధారిత సేవలతో కూడినప్రీమియం ప్లాన్‌ను ఎంచుకున్న వారికి అకౌంట్ ప్రారంభ చార్జీల మినహాయింపు ఉంటుంది. నిధుల బదిలీ.. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశాల్లో తమ ట్రేడింగ్ ఖాతాలకు నిధులను బదిలీ చేసుకోవచ్చు. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2,50,000 డాలర్లను పంపుకునేందుకు అనుమతి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ మార్గంలో నిధుల బదిలీ సేవలను చాలా వరకు బ్రోకర్లు అందిస్తున్నారు. మరి ఒకవేళ అక్కడి స్టాక్స్‌ను విక్రయించి ఆ నిధులను తిరిగి వెనక్కి పొందాలంటే అందుకు కొంత సమయం తీసుకుంటుంది. బ్యాంకుల వద్ద ప్రాసెసింగ్‌కు పట్టే సమయంతోపాటు, అమెరికాలో టీ ప్లస్ 3 సెటిల్మెంట్ విధానం అమల్లో ఉంది. అంటే విక్రయించిన నాటి నుంచి నాలుగో రోజు నిధులు అకౌంట్లో జమ అవుతాయి. మన దేశంలో టీప్లస్ 2 విధానం అమల్లో ఉంది. మినహాయింపులు.. భారతీయ ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి యూఎస్ ఈక్విటీల్లో, లిస్టెడ్ బాండ్లలో, ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అమెరికన్ స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో ఇతర దేశాల కంపెనీల లిస్టింగ్‌కు కూడా అనుమతి ఉంది. ప్రస్తుతానికి 465 అమెరికాయేతర కంపెనీలు యూఎస్ ఎక్సే్చంజ్‌ల్లో క్రాస్లిస్డ్ అయి ఉన్నాయి. వీటిల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అమెరికాలో వచ్చే ఐపీవోలకు దరఖాస్తు చేసుకునే అవకాశం మాత్రం లేదు. భారత్‌లో నివసించే వారు అంతర్జాతీయ మార్కెట్లలో మార్జిన్ ట్రేడింగ్, లెవరేజీ ట్రేడింగ్‌కు ఆర్బీఐ అనుమతించడం లేదు. దీనికి అదనంగా కొన్ని బ్రోకరేజీ సంస్థలు అదనపు నియంత్రణలు పెడుతున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ డైరెక్ట్ అయితే అంతర్జాతీయ ట్రేడింగ్ అకౌంట్ ప్రారంభించే ఇన్వెస్టర్‌కు కనీసం 5,000 డాలర్ల నెట్‌వర్త్ ఉండాలంటూ నిబంధన అమలు చేస్తోంది. అంటే కనీసం రూ.3.7 లక్షల నెట్‌వర్త్ అయినా ఉండాలన్నమాట. ఇక రాబడులపై పన్నుల భారం కూడా మోయాల్సి ఉంటుంది. అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడులపై అందుకునే డివిడెండ్‌పై 25 శాతం విత్‌హోల్డింగ్ ట్యాక్స్ పడుతుంది. అయితే, ఇటువంటి పన్నులను ఫామ్ 67ను దాఖలు చేయడం ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నేరుగా యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు తగినంత నైపుణ్యం ఉంటే ఫర్వాలేదు. లేకుంటే చేతులు కాల్చుకున్నట్లే. కనుక కొత్త ఇన్వెస్టర్లు, తగినంత సమయం వెచ్చించలేని వారికి ఫండ్స్, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే పథకాలు) అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్, నిప్పన్ ఇండియా యూఎస్ ఈక్విటీ అపార్చునిటీస్ ఫండ్, డీఎస్పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్, ఎడెల్వీజ్ యూఎస్ వ్యాల్యూ ఈక్విటీ ఆఫ్‌షోర్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఇలా ఎన్నో పథకాలు అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నాయి. టీసీఎస్ పడుతుంది.. విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు నిజంగా మంచి అవకాశమే. ఇందులో సందేహం లేదు. కానీ పైన చెప్పుకొన్నట్టు పన్నుల భారాన్ని కూడా గమనించాలి. అక్టోబర్ 1 నుంచి ఒక ఏడాదిలో రూ.7లక్షలకు మించి నిధులు పంపించుకుంటే (విదేశీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్‌కు పంపుకునే నిధులపైనా) 5 శాతం మూలం వద్ద పన్నును బ్యాంకులు వసూలు చేయాలని (టీసీఎస్) కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఆధార్, పాన్ కార్డు ఇవ్వని వారి విషయంలో టీసీఎస్ 10 శాతం అమలవుతుంది. ‘‘ఈ నిబంధన తీసుకురావడం వెనుక ఉద్దేశ్యం పన్ను పరిధిని పెంచడమే. ప్రభుత్వం వద్దనున్న సమాచారం ప్రకారం చూస్తే చాలా మంది వ్యక్తులు ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉపయోగించుకుని ఎటువంటి పన్నులు చెల్లించడం లేదు’’ అని వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో విరమ్ షా పేర్కొన్నారు. విదేశీ స్టాక్స్, బాండ్లు, ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేసే భారతీయులకు ఈ నిబంధన వల్ల వ్యయాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, నిజాయితీపరులైన వారు రిటర్నులు దాఖలు చేసి టీసీఎస్‌ను రిఫండ్‌గా పొందొచ్చని సూచిస్తున్నారు. ‘‘విదేశీ లావాదేవీల ప్రారంభ వ్యయాలను ఇది అధికం చేస్తుంది. అయితే, ఈ వ్యయాలను పన్ను రిటర్నులను దాఖలు చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక ఏడాదిలో రూ.7లక్షల్లోపు నగదు పంపుకునే ఇన్వెస్టర్లపై ఈ నిబంధనలు ఎటువంటి ప్రభావం చూపించవు’’ అని విన్వెస్టా సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ తెలిపారు. విదేశీ విద్య కోసం, విదేశీ పర్యటనల కోసం నిధుల వ్యయాలపై నిబంధనల్లో మార్పు ఉంది. ఒకవేళ విదేశీ విద్య కోసం బ్యాంకులో రుణం తీసుకుని పంపిస్తున్నట్టు అయితే.. అది కూడా రూ.7లక్షలు మించిన సందర్భంలో 0.5 శాతాన్ని టీసీఎస్‌గా మినహాయిస్తారు. అదే విదేశీ పర్యాటక ప్యాకేజీలను బుక్ చేసుకుంటే ఎంత విలువ అన్నదానితో సంబంధం లేకుండా 5 శాతం టీసీఎస్ అమలవుతుంది. ఒకవేళ సొంతంగా విదేశీ పర్యటనను (ట్రావెల్ ఏజెన్సీలతో సంబంధం లేకుండా) బుక్ చేసుకుంటే ఈ పన్ను పడదు. -
సంక్షోభం ఏదైనా.. ఆగకూడదు ప్రణాళిక
చరిత్రలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆర్థిక మాంద్యాలు, ఆరోగ్యపరమైన సంక్షోభాలను ప్రపంచం విజయవంతంగా అధిగమించి ప్రగతి దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఈ క్రమంలో 2020లో కరోనా వైరస్ (కోవిడ్–19) ప్రపంచ దేశాలకు సవాల్‌గా మారింది. గతంలో పడి లేచిన కెరటాల్లాంటి ఎన్నో అనుభవాలు ఉన్నప్పటికీ.. ఇటీవలి కరోనా వైరస్ ఆధారిత మార్కెట్ పతనం.. ఇన్వెస్టర్లలో తమ పెట్టుబడులకు దీర్ఘకాల భద్రత ఏంటన్న ఆందోళనకు దారితీసింది. ఎంతో మంది ఇన్వెస్టర్లు నిపుణులు, బ్రోకరేజీలు, ఫండ్స్ హౌస్‌లకు తమ ఆందోళనలను ప్రశ్నల రూపంలో సంధిస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి, మార్కెట్ల పతనంలో అవకాశాలు, తదితర విషయాలపై అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన పరిశోధక బృందం తరచుగా ఇన్వెస్టర్ల నుంచి తమకు ఎదురైన ప్రశ్నలు, వాటికి నిపుణుల సమాధానాలు, సూచనలను విడుదల చేసింది. కరోనా సంక్షోభం అనంతరం ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల విషయమై ఏ విధంగా వ్యవహరించాలన్నది వీటి ఆధారంగా ఇన్వెస్టర్లు ఓ నిర్ణయానికి వచ్చేందుకు వీలుంటుంది. ఇందుకు సంబంధించి హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ టీమ్ విడుదల చేసిన ప్రశ్నలు, జవాబుల జాబితా ఇది... కొనుగోళ్లకు ఇది సరైన తరుణమేనా..? నిర్దేశిత పరిమాణం కంటే ఈక్విటీల్లో తక్కువ ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే.. ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పెట్టుబడులను ప్రారంభించుకోవచ్చు. ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫం డ్స్ లేదా నేరుగా స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు. రిస్క్ తీసుకునే వారు 100 నుంచి తమ వయసును తీసివేయగా మిగిలిన శాతం పెట్టుబడులను ఈక్విటీలకు (ఫండ్స్ లేదా స్టాక్స్) కేటాయించుకోవచ్చు. ఒకవేళ రిస్క్ ఎక్కువగా తీసుకోలేని వారు 100కు బదులు 70 నుంచి తమ వయసును తీసివేసి, మిగిలిన శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మిగిలిన పెట్టుబడులను స్థిరాదాయ పథకాలైన ఎఫ్డీలు, బాండ్ ఫండ్స్ లేదా చిన్న మొత్తాల పొదు పు పథకాలు, బంగారానికి కేటాయించుకోవచ్చు. ఫండ్స్ పెట్టుబడుల విలువ పడిపోతే? ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు వాటి ఇటీవలి గరిష్టాల నుంచి రెండు నెలల వ్యవధిలోనే 40 శాతం పడిపోయాయి. ఫండ్స్ లేదా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు అందరూ ఈ నష్టాలను చూస్తున్నారు. గడిచిన 34 ఏళ్లలో (ఆరు భారీ బేర్ మార్కెట్లు (40% అంతకంటే ఎక్కువ నష్టపోవడం) ఎదురయ్యాయి. కానీ, ప్రతీ పతనం తర్వాతి రెండు మూడేళ్ల కాలంలో మార్కెట్లు కోలుకున్నాయి. ప్రస్తుత స్థాయిలో మార్కెట్లో కరెక్షన్ ముగి సిందని చెప్పలేం. వచ్చే కొన్నేళ్ల కాలానికి డబ్బు అవసరం లేని వారు తమ ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. అయితే, ప్రస్తుతం, భవిష్యత్తులోనూ సమయానుకూలంగా తమ పెట్టుబడులను సమీక్షించుకోవడం మర్చిపోవద్దు. సిప్‌ను కొనసాగించాలా..? ప్రస్తుత మార్కెట్ కరెక్షన్ కారణంగా ఫండ్స్ పథకాల్లోని పెట్టుబడులు నష్టాలు చూపిస్తున్నాయని సిప్‌ను ఆపేద్దామని అనిపించొచ్చు. కానీ, అలా చేస్తే అది పెద్ద తప్పిదమే అవుతుంది. ఇటువంటి మార్కెట్ల దిద్దుబాట్లు ఫండ్స్ యూనిట్ల కొనుగోలు ఖర్చును తగ్గిస్తాయి. తక్కువ ధరల కారణంగా అధిక యూనిట్లను సమకూర్చుకునే అవకాశం ఇటువంటి సందర్భాల్లోనే లభిస్తుంది. కనుక వీలైనంత వరకు సిప్‌ను ఇప్పుడు కొనసాగించాలి. వీలుంటే సిప్ మొత్తాన్ని పెంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. అయితే, పనితీరు సజావుగా లేని పథకాల్లో సిప్ ఆపేసి, మంచి పథకాల్లో సిప్ కొనసాగించడం, పెంచుకోవడం చేయాలి. ఎఫ్ అండ్ ఓ లతో రక్షణ ఎలా? రిస్క్ నిర్వహణకు డెరివేటివ్స్ (ఎఫ్‌అండ్‌వో) చాలా ముఖ్యమైన సాధనం. హెడ్జింగ్ రూపంలో నష్టాల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. నిఫ్టీ పుట్ ఆప్షన్ల కొనుగోలు ద్వారా మీ పోర్ట్‌ఫోలియోకు సులభంగా హెడ్జ్ చేసుకోవచ్చు. అయితే, హెడ్జింగ్ అన్నది బీమా కవరేజీ వంటిది. ఒకవేళ మార్కెట్లు పడిపోకుండా పెరిగితే పుట్ ఆప్షన్ల కోసం చెల్లించిన ప్రీమియం నష్టపోవాల్సి వస్తుంది. కానీ, మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో లాభపడింది కనుక దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, అన్ని వేళలా హెడ్జింగ్ కాకుండా.. మార్కెట్లు పెద్ద కరెక్షన్లు లేకుండా దీర్ఘకాలం పాటు గణనీయంగా పెరిగిన సందర్భాల్లో హెడ్జ్ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో బేర్ మార్కెట్లు ఎంత కాలం పాటు కొనసాగాయి? 1992, 2000, 2008 సందర్భాల్లో బేర్ మార్కెట్లను చవిచూశాం. 1992 కరెక్షన్ తర్వాత సెన్సెక్స్ తన పూర్వపు గరిష్టాలను అధిగమించేందుకు రెండున్నరరేళ్ల సమయం తీసుకుంది. 2000–2001 కరెక్షన్ తర్వాత సెన్సెక్స్ గరిష్టాలకు చేరుకునేందుకు నాలుగేళ్లు పట్టింది. 2008 తర్వాత పూర్వపు గరిష్టాలను దాటేందుకు సెన్సెక్స్‌కు ఆరేళ్లు పట్టింది. బంగారంలో ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? అంతర్జాతీయ సంక్షోభ సమయంలో బంగారం అన్నది విశ్వసనీయమైన పెట్టుబడి సాధనం. ఈక్విటీలకు బంగారం వ్యతిరేక దిశలో ఉంటుంది. కనుక ఈక్విటీ మార్కెట్ల పతనం సమయంలో బంగారం సురక్షిత సాధనం. ప్రస్తుత సమయాల్లో బంగారంలో పెట్టుబడులను కొనసాగించుకోవడమే సూచనీయం. ఈక్విటీ మార్కెట్లు కనిష్టాలకు చేరినట్టు ధ్రువీకరణ అయిన తర్వాత బంగారంలో కొంత లాభాలను స్వీకరించొచ్చు. మొదటి సారి ఇన్వెస్ట్ చేస్తే...? మొదటి సారి పెట్టుబడులు పెట్టే వారికి ప్రస్తుత సమయం అనుకూలమైనది. మంచి నాణ్యమైన ఐపీవోలకు దరఖాస్తు చేసుకోవడంతోపాటు, మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ ద్వారా పెట్టుబడులు ప్రారంభించుకోవాలి. తగినంత అనుభవం, పరిజ్ఞానం సంపాదించిన తర్వాత నాణ్యమైన కంపెనీల షేర్లలో నేరుగానూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌తో ప్రయోజనం పొందే రంగాలు? ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, టెలికం, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ రంగ కంపెనీలు, ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాలు లౌక్‌డౌన్ సమయంలో కొనసాగుతున్నాయి. ఇతర కంపెనీలతో పోలిస్తే ఇవి సంక్షోభాన్ని మెరుగ్గా అధిగమించగలవు. ఒక్కసారి లౌక్‌డౌన్ ముగిస్తే ఆకర్షణీయంగా ఉన్న ఇతర రంగాల వైపు మళ్లొచ్చు. నష్టాలను బుక్ చేసుకోవచ్చా..? భవిష్యత్తు పరిస్థితుల గురించి అవగాహన లేకుండా చెప్పుడు మాటల ద్వారా, విన్న వార్తల ద్వారా ఏవైనా కొనుగోలు చేసి ఉంటే, ఈ సమయంలో ఆ కంపెనీల ఫండమెంటల్స్, ఇటీవలి పరిణామాలు, సూచీలతో పోలిస్తే స్టాక్ ధర పరంగా జరిగిన నస్టాన్ని సమీక్షించుకోవడం చేయాలి. ఈ అంశాల్లో బలహీనంగా కనిపిస్తే ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకుని, దీర్ఘకాలంలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావించే వాటిల్లో, నిపుణుల సూచనల మేరకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. -
ఈక్విటీ ఫండ్స్ ఏ రేంజ్ రాబడులనిస్తాయి?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రాబడులు ఏ రేంజ్లో వస్తాయి? –హిమబిందు, విజయవాడ దీర్ఘకాలం పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులే పొందవచ్చు. అయితే ఏ శాతం రేంజ్లో రాబడులు వస్తాయో అంచనా వేయడం కష్టం. మన ఇన్వెస్ట్మెంట్స్ మీద ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను పొందాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే మంచి మార్గం. గతంలో మన దేశంలో వడ్డీరేట్లు 9–13 శాతం రేంజ్లో ఉండేవి. అప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు 18–20 శాతం రేంజ్లో ఉండేవి. ఇప్పుడు ఈ రాబడులు కనిష్టంగా 7–8 శాతానికి తగ్గాయి. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్ రాబడులు 8–9.50 శాతం రేంజ్లో ఉన్నాయి. ఫండ్ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫైడ్‌గా ఉన్నప్పటికీ, ఈ ఫండ్ నిర్వహణ చాలా సులభం. దీంతో పోల్చితే ఈక్విటీ ఫండ్స్ నిర్వహణ కొంచెం క్లిష్టమైనది. కాబట్టి వీటికి వ్యయాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వ్యయాలు ఎక్కువగా ఉన్నా, ఇండెక్స్ ఫండ్స్‌తో పోల్చితే ఈక్విటీ ఫండ్స్ అధిక రాబడులనే ఇస్తాయి. ద్రవ్యోల్బణం 4 శాతం రేంజ్లో ఉన్నప్పుడు ఈక్విటీ రాబడులు 12 శాతం మేర ఉంటాయని చెప్పవచ్చు. పిల్లల పై చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ అవసరాల కోసం నిధి ఏర్పాటు తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే మంచి మదుపు మార్గమని చెప్పవచ్చు. నాకు ఇటీవలనే ఒక పాప పుట్టింది. ఆమెను డాక్టర్ చేయాలన్నది నా కల. ఇప్పటి నుంచి నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఈ మొత్తాన్ని స్మాల్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? లేకుంటే వేరే ఇతర ఫండ్స్‌లో మదుపు చేయమంటారా ? –ఆనంద్, కర్నూలు మీరు తీసుకున్నది మంచి నిర్ణయమేనని చెప్పవచ్చు. మీరు 18–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలరు. ఇంత దీర్ఘకాలం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, కనీసం రెండు మూడేళ్లకొకసారైనా మీరు ఈ ఫండ్ పనితీరును మదింపు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు, లేదా మూడేళ్ల కాలంలో ఈ ఫండ్ పనితీరు ఎలా ఉంది ? ఫండ్ మేనేజర్ మారారా ?ఇతర ఫండ్స్ దీనికి మించిన రాబడులను ఇస్తున్నాయా?తదితర అంశాలను మీరు మదింపు చేయాల్సి ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ విషయంలో అత్యంత కీలకమైనది ఫండ్ మేనేజర్ నిర్వహణ. స్మాల్ క్యాప్ ఫండ్స్ పనితీరు దాదాపు 80 శాతం ఫండ్ మేనేజర్ తీరుపైననే అధారపడి ఉంటుంది. అదే లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో అయితే ఆ ఫండ్ పనితీరుపై ఫండ్ మేనేజర్ ప్రభావం 40 శాతమే ఉంటుంది. లార్జ్ క్యాప్ కంపెనీలు వందలోపే ఉంటాయి. ఈ ఫండ్ మేనేజర్ ఈ వంద కంపెనీలను గమనిస్తే సరిపోతుంది. కానీ స్మాల్ క్యాప్ కంపెనీలు వందలాదిగా ఉంటాయి. ఒక స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్ కనీసం 2,000 కంపెనీలను గమనించాల్సి ఉంటుంది. ఏతావాతా లార్జ్ క్యాప్ ఫండ్ మేనేజర్ కంటే స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్‌కు అధిక బాధ్యత ఉంటుంది. అందుకని స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ విషయాలన్నీ కూలంకషంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి. నేను ఇటీవలనే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైరయ్యాను. నాకు ఎలాంటి అప్పులు లేవు. పిల్లల బాధ్యతలన్నీ తీరిపోయాయి. నాకు వచ్చే పెన్షన్ నా ఖర్చులన్నింటికీ సరిపోతుంది. ఇప్పటికే రూ.3 లక్షల మేర అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్నాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఎలా ఇన్వెస్ట్ చేయాలి ? ఎంత మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి? పుత్తడిలో ఎంత పెట్టాలి ? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు ఎంత కేటాయించాలి? –వెంకటాచలం, హైదరాబాద్ నా దృష్టిలో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తి కాదు. ఇతర ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ ఒక మార్గమని నా అభిప్రాయం. కొంత మొత్తాన్ని ఈక్విటీ, మరికొంత మొత్తాన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇదే మొదటిసారైతే, ముందుగా బ్యాలన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఇక పుత్తడి విషయానికొస్తే, ఇది దీర్ఘకాల ఆస్తి కాదు. దీంట్లో పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు. కాదూ, కూడదు బంగారంలో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాల్సిందేనని మీరు అనుకుంటే, సావరిన్ గోల్డ్ బాండ్స్(ఎస్జీబీ)లో ఇన్వెస్ట్ చేయండి. భారత్‌లో పుత్తడిలో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న అత్యుత్తమ మార్గం ఇదే. ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే, మీకు వార్షికంగా 2.5 శాతం వడ్డీ గ్యారంటీగా వస్తుంది. ధరలు పెరిగితే ఆ వృద్ధి అదనం. ఈ బాండ్ రిడంప్షన్ సమయంలో మీరు పొందే మూలధన లాభాలపై పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 10–20 శాతం మించకుండా పుత్తడి పెట్టుడులు ఉండేలా చూసుకోండి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో కూడా కొంత డిపాజిట్ చేయవచ్చు. -
ఒకటా, రెండా.. ఎన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి?
నేను గత కొంత కాలంగా కెనర రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇది మంచి ఫండేనా? నేను 15–20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇన్నేళ్లు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? –కిన్నెర, విశాఖపట్టణం కెనర రొబెకొ ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్... గత కొంత కాలంగా మంచి పనితీరునే కనబరుస్తోంది. ఈ కేటగిరీలో నిలకడైన పనితీరు కనబరుస్తున్న మంచి ఫండ్స్‌లో ఇది కూడా ఒకటి. అందుకని 15–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్‌కు మీరు మంచి ఫండ్‌నే ఎంచుకున్నారని చెప్పవచ్చు. ఇక ఇన్నేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా మూడు ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి. మార్కెట్లో ఎలాంటి పరిస్థితులున్నా మీ సిప్‌లు ఆపకూడదు. మార్కెట్ పతనమై ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నా. మీ పెట్టుబడులను ఆపకండి. రెండోది కనీసం ఏడాదికొక్కసారైన మీ సిప్ మొత్తాన్ని కనీసం 10 శాతమైనా పెంచండి. మూడోది ముఖ్యమైనది... కనీసం ఏడాదికి ఒక్కసారైనా మీ ఫండ్ పనితీరును మదింపు చేయడం. ఫండ్ పనితీరు సంతృప్తికరంగా ఉంటే, సిప్‌లు కొనసాగించండి. ఆశించిన స్థాయిలో లేకుంటే ఈ కేటగిరీలోనే మంచి పనితీరును కనబరుస్తున్న మరో ఫండ్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదలాయించండి. నేను అల్ట్రా–షార్ట్ డ్యూరేషన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒకే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? లేక రెండు–మూడు ఫండ్స్‌ను ఎంచుకోమంటారా?ఒక ఫండ్ క్రెడిట్ రేటింగ్ వివరాలను ఎలా అర్థం చేసుకోవాలి.? –ఈశ్వర్, తిరుపతి మీరు మూడు నెలల నుంచి ఏడాది కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అల్ట్రా షార్ట్–డ్యూరేషన్ ఫండ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేసేది పెద్ద మొత్తమైతే, రెండు వేర్వేరు ఫండ్ హౌస్‌లకు సంబంధించిన రెండు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. చిన్న మొత్తమైతే ఒక ఫండ్ సరిపోతుంది. ఒక సంస్థ ఆర్థిక స్థితిగతులు, ఆ కంపెనీ రుణ చెల్లింపుల అంచనాలకు సంబంధించిన క్రెడిట్ రిస్క్‌ను క్రెడిట్ రేటింగ్ మనకు వెల్లడిస్తుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఒక కంపెనీ రుణ సాధనాలకు రేటింగ్‌ను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇస్తుంది. అల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా రెండు విషయాలు గమనంలో ఉంచుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఫండ్... డబల్ ఏ (ఏఏ), అంతకంటే దిగువ రేటింగ్ ఉన్న సాధనాల్లో తక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్ చేసి ఉండాలి. రెండో విషయం డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇటీవలి పనితీరును మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదు. కనీసం మూడేళ్ల పనితీరును పరిశీలించిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలి. సాధారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో మంచి పనితీరు కనబరిచిన ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. డెట్ ఫండ్స్ విషయంలో ఇది సరైన నిర్ణయం కాదు. అధిక రాబడులు ఉన్నాయంటే, రిస్క్ కూడా అధికంగానే ఉందని అర్థం. ఇలాంటి ఫండ్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. ఇన్వెస్ట్‌మెంట్‌కు భద్రత కూడా ముఖ్యమైన విషయమే కదా ! నేను ప్రతి నెలా కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఫండ్స్‌లో గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవాలా? డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలా? తగిన సలహా ఇవ్వండి. –కిరణ్, నెల్లూరు 2018 బడ్జెట్‌కు ముందు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవాలా ? డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలా అనే విషయానికి ప్రాధాన్యత అధికంగానే ఉండేది. ఇన్వెస్టర్ వయస్సు, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తం, ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారు...ఈ అంశాలన్నీ పరిగనలోకి తీసుకొని పెద్ద కసరత్తే చేసి నిర్ణయం తీసుకోవలసి వచ్చేది. ప్రస్తుతం రెండు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎవరూ డివిడెండ్ ప్లాన్ల జోలికి వెళ్లడం లేదు. గతంలో ఎలా ఉండేదంటే, మీరు ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది కాలం పాటు కొనసాగించి ఉంటే, మీకు వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సి ఉండేది కాదు. అలాగే డివిడెండ్లపై కూడా ఎలాంటి పన్నులు ఉండేవి కావు. ఇప్పుడు మాత్రం 10 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీని) చెల్లించాల్సి ఉంటుంది. మీరు డివిడెండ్ ప్లాన్‌ను ఎంచుకుంటే మీకు వచ్చే రాబడుల్లో 10 శాతం తగ్గుతాయి. ఉదాహరణకు ఒక ఫండ్ రూ.10 డివిడెండ్ ప్రకటించిందనుకోండి. మీకు రూ.9 మాత్రమే వస్తుంది. అందుకని డివిడెండ్ ప్లాన్‌ను కాకుండా గ్రోత్ ప్లాన్‌ను ఎంచుకోండి. -
ఎక్స్ పెన్స్ రేషియో అధికం... ఇన్వెస్ట్ చేయాలా? వద్దా?
పరాగ్ పరీక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కాకుండా అంతర్జాతీయంగా షేర్లలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా ? అసలు మన ఫండ్స్‌కు విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేసే అవకాశం, అనుమతులు ఉన్నాయా? విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌కు సంబంధించి పన్ను నియమాలు ఎలా ఉంటాయి? ఈ పరాగ్ ఫండ్‌కు సంబంధించిన డైరెక్ట్ ప్లాన్ ఎక్స్‌పెన్ ్స రేషియో అధికంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్స్‌పెన్ ్స రేషియోను కూడా పరిగణనలోకి తీసుకోవాలా? –రవీందర్ జైన్ , సికింద్రాబాద్ పరాగ్ పరీక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌కు విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేసే అనుమతి ఉంది. తన కార్పస్‌లో 35 శాతం మేర విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ ఫండ్‌కు ఉంది. గతంలో కూడా ఈ ఫండ్ తన కార్పస్‌లో 20–25 శాతం మేర విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేసింది. ఇలా విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి æ అనుమతులు ఉన్న మరో రెండు, మూడు ఫండ్స్ కూడా ఉన్నాయి. అయితే వీటితో పోల్చితే ఈ పరాగ్ ఫండ్ నిరంతరాయంగా విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తోంది. ఇక ఈ ఫండ్‌కు సంబంధించి పన్ను నిబంధనలు ఇతర ఈక్విటీ ఫండ్స్ పన్ను నిబంధనలుగానే ఉంటాయి. ఈ ఫండ్ ఎక్స్పె¯Œ ్స రేషియో 1.5 శాతంగా ఉంది. ఇది మరీ ఎక్కువేమీ కాదని నా అభిప్రాయం. తన నిర్వహణ ఆస్తులు పెరిగితే, ఎక్స్పెన్స రేషియోను తగ్గిస్తానని తన ఆఫర్ డాక్యుమెంట్లో పరాగ్ ఫండ్ పేర్కొంది. ఎక్స్పె¯Œ ్స రేషియోకు సంబంధించిన పన్ను నిబంధనలను ఇటీవలే మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ సవరించింది. ఈ మేరకు ఎక్స్‌పెన్ ్స రేషియోలో త్వరలోనే ఈ ఫండ్ మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కొంత కాలం ఎదురు చూడండి. ఇక ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్స్‌పెన్ ్స రేషియో ను పరిగణనలోకి తీసుకోవలసిందే. అయితే ఎక్స్పె¯Œ ్స రేషియో అధికంగా ఉందన్న ఒక్క కారణంగా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలను వాయిదా వేయడం సరికాదు. డెట్ ఫండ్స్ విషయంలో ఎక్స్‌పెన్ ్స రేషియో చాలా ముఖ్యమైన అంశం. ఈ ఫండ్స్ రాబడులు అధికంగా వచ్చే అవకాశాలు లేనందున పరిమిత ప్రభావం చూపే ఎక్స్పె¯Œ ్స రేషియో డెట్ ఫండ్స్ విషయంలో కీలకమైన అంశమే. అయితే ఈక్విటీ ఫండ్స్‌లో రాబడులు అధికంగా వస్తాయి. కాబట్టి, ఎక్స్పె¯Œ ్స రేషియోను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. వాల్యూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయమేనా? మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ప్రభుత్వానికి పన్ను ఆదాయం భారీగానే వస్తుందా? –కిరీటి, విజయవాడ వాల్యూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే, చాలా ఓపిక కావాలి. వాల్యూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పటికైతే సరైన సమయం రాలేదని చెప్పొచ్చు. వాల్యూ ఫండ్సే కాదు, ›గ్రోత్ ఫండ్స్‌ల్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయం కాదు. కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగుండి, నికర లాభాలు మెరుగుపడితేనే, కంపెనీల షేర్లు పెరుగుతాయి. అప్పుడు మాత్రమే గ్రోత్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో వాల్యూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు సరైన సమయం మాత్రం కాదు. ఈ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే, కంపెనీలన్నీ సమతూకంగానే ఉన్నాయి. ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత మొత్తాన్ని వాల్యూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సముచితమే. ప్రస్తుతానికైతే మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం లభించదనే చెప్పవచ్చు. 2018, íఫిబ్రవరి నుంచి చూసినా, మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాలు.. పన్ను చెల్లించాల్సిన స్థాయిలో రాలేదని చెప్పొచ్చు. అందుకని ప్రభుత్వానికి ఫండ్స్ లాభాలపై విధించే మూలధన లాభాల పన్ను పెద్ద మొత్తంలో వచ్చే అవకాశాలు పెద్దగా లేవు. నా వయస్సు 50 సంవత్సరాలు. రిటైర్మెంట్ కోసం ఇప్పటిదాకా ఎలాంటి పొదుపు, మదుపు చేయలేదు. నేనే 65 లేదా 70 ఏళ్ల వరకూ పనిచేయగలను. నా రిటైర్మెంట్ అవసరాల కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి? –ఫయాజ్, విశాఖపట్టణం రిటైర్మెంట్ అవసరాల కోసం సాధారణంగా 30 ఏళ్ల నుంచే ఇన్వెస్ట్ చేయడం ఆరంభించాలి. రిటైర్మెంట్ అనేది దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం. ఇలాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లా¯Œ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఇక మీ విషయానికొస్తే, మీకు ఎంత సాధ్యమైతే అంత ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా ఈక్విటీ ఫండ్‌ను గానీ, మల్టీ క్యాప్ ఫండ్‌ను గానీ ఎంచుకోండి. ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసే సొమ్ములను ఇతర అవసరాల కోసం వినియోగించవద్దు. ఇప్పటి నుంచి మీరు మరో పది పదిహేనేళ్లు పనిచేయగలరు అనుకుంటున్నారు. కాబట్టి, తర్వాతి 10–15 ఏళ్ల అవసరాల కోసం ఇప్పటి నుంచి 10–15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయండి. ఫండ్స్‌ల్లో సిప్ విధానంలో పదేళ్లకు మించి ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులే వస్తాయి. -
రిస్క్ ఉన్నా రాబడులు ఆశించే వారికి...
స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్ దిద్దుబాటుకు గురై ఆకర్షణీయ విలువలకు చేరాయి. గతేడాది స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 21 శాతం పతనం కాగా, మిడ్‌క్యాప్ సూచీ 12 శాతం మేర నష్టపోయింది. స్మాల్క్యాప్తో పోలిస్తే మిడ్‌క్యాప్ కంపెనీల్లో అస్థిరత కాస్త తక్కువ. ఈ తరుణంలో మంచి మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకుని దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులను సొంతం చేసుకునేందుకు అవకాశాలున్నాయి. అధిక రిస్క్ తీసుకున్నా గానీ, రాబడులు మెరుగ్గా ఉండాలనుకునే వారు కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో 9 శాతం నికర నష్టాలు ఉన్నాయి. కానీ, మిడ్‌క్యాప్ పథకాల రాబడులకు ప్రామాణికంగా చూసే నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 టీఆర్ఐ ఇండెక్స్ ఇదే కాలంలో 12.2 శాతం నష్టపోగా, దీంతో పోలిస్తే ఈ పథకంలో నష్టాలు కాస్త తక్కువే ఉన్నాయని భావించాల్సి ఉంటుంది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 10.5 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 19.2 శాతం చొప్పున ఈ పథకం ఇన్వెస్టర్ల పెట్టుబడులపై రాబడులను ఇచ్చింది. ఇదే కాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ రాబడులు మూడేళ్లలో 9.3 శాతం, ఐదేళ్లలో 13.6 శాతంగానే ఉన్నాయి. ఇక పదేళ్ల కాలంలో చూసుకున్నా కానీ ఈ పథకం వార్షికంగా సగటున 17 శాతం చొప్పున రాబడులను ఇవ్వడం గమనార్హం. బుల్ మార్కెట్లలో బెంచ్ మార్క్ కంటే అధిక రాబడులను ఇవ్వడంతోపాటు, కరెక్షన్లలో బెంచ్ మార్క్‌తో పోలిస్తే నష్టాలు తగ్గినట్టు ఈ పథకం పనితీరును పరిశీలిస్తే తెలుస్తుంది. ఇతర పోటీ పథకాలు హెచ్డీఎఫ్సీ మిడ్‌క్యాప్ అపార్చునిటీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మిడ్‌క్యాప్, ఎల్అండ్టీ మిడ్‌క్యాప్ పథకాల కంటే మెరుగ్గా కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ నష్టాలనుతక్కువకు పరిమితం చేయడాన్ని గమనించొచ్చు. పెట్టుబడుల విధానం: అప్పుడే అభివృద్ధి చెందుతున్న లేదా అప్పటికే అభివృద్ధి ప్రయాణం ఆరంభించిన మిడ్‌క్యాప్ కంపెనీలను పరిశోధన ద్వారా గుర్తించి ఇన్వెస్ట్ చేయడం అ పథకం అనుసరించే విధానం. ఈ తరహా స్టాక్స్‌లో మోస్తరు అస్థిరతలు ఉండడమే కాదు, దీర్ఘకాలంలో మంచి రాబడులకూ అవకాశం ఉంటుంది. పోర్ట్‌ఫోలియోలో 82 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్స్‌కు, స్మాల్‌క్యాప్‌నకు 12 శాతం చొప్పున కేటాయింపులు ప్రస్తుతం చేయగా, మరో 5 శాతాన్ని లార్జ్‌క్యాప్‌నకు కేటాయించింది. 2011, 2018 మార్కెట్ కరెక్షన్ల సమయాల్లో ఈ పథకంలో నష్టాలు బెంచ్ మార్క్‌తో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. 2014 నుంచి ఈ పథకం స్థిరమైన రాబడులను అందిస్తోంది. 25 రంగాలకు చెందిన 65 స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం పెట్టుబడుల్లో 20 శాతాన్ని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. తర్వాత కెమికల్స్ రంగానికి 15 శాతం, ఇంజనీరింగ్ 14 శాతం, క¯Œ స్ట్రక్ష¯Œ 9 శాతం, హెల్త్‌కేర్ రంగాల స్టాక్స్‌కు 9 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. టాప్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం పీఐ ఇండస్ట్రీస్ 3.71 రామ్‌కో సిమెంట్స్ 3.58 అతుల్ 3.42 ఏయూ స్మాల్ఫైనా 3.29 సుప్రీమ్ ఇండస్ట్రీస్ 3.20 స్కాఫ్లర్ ఇండియా 3.07 ఆర్బీఎల్ బ్యాంకు 2.84 థర్మాక్స్ 2.83 ఎస్ఆర్ఎఫ్ 2.66 సోలార్ ఇండస్ట్రీస్ 2.56 -
‘ఈక్విటీ’ నిధులు @ రూ.63,744 కోట్లు
న్యూఢిల్లీ: భారత కంపెనీలు ఈ ఏడాది వివిధ ఈక్విటీ మార్గాల ద్వారా రూ.63,744 కోట్లు సమీకరించాయి. గత ఏడాది సమీకరించిన రూ.1.6 లక్షల కోట్ల నిధులతో పోలిస్తే ఇది 60 శాతం తక్కువని డేటా ఎనలిటిక్స్ సంస్థ, ప్రైమ్ డేటాబేస్ వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..., ► ఈక్విటీ ద్వారా కాకుండా బాండ్ల ద్వారా కంపెనీలు మరో రూ.29,944 కోట్లు సమీకరించాయి. ► ఈ ఏడాది నిధుల సమీకరణ జరిగిన వివిధ ఈక్విటీ మార్గాల్లో అత్యధిక నిధులు ఐపీఓ మార్గంలో వచ్చాయి. ఈ మార్గంలో 24 కంపెనీలు రూ.33,244 కోట్లు సమీకరించాయి. గత ఏడాదితో పోల్చితే ఇది దాదాపు సగం. గత ఏడాది మొత్తం 36 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.67,147 కోట్లు సమీకరించాయి. ► కంపెనీలు ఈ ఏడాది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ద్వారా రూ.16,077 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.10,678 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్) ద్వారా రూ.3,145 కోట్లు సేకరించాయి. ► గత ఏడాది ఓఎఫ్ఎస్ మార్గంలో సమీకరించిన నిధులు రూ.18,094 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది ఇది రూ.10,678 కోట్లకు తగ్గింది. ► ఈ ఏడాది అతి పెద్ద ఓఎఫ్ఎస్గా కోల్ ఇండియా ఇష్యూ(రూ.5,274 కోట్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రూ.1,848 కోట్లతో లార్సెన్ అండ్ టుబ్రో ఇష్యూ నిలిచింది. ► క్యూఐపీ నిధుల సమీకరణ కూడా 73 శాతం తగ్గింది. గత ఏడాది ఈ విధానంలో రూ.61,148 కోట్లు రాగా, ఈ ఏడాది 73 శాతం తగ్గి రూ.16,677 కోట్లు మాత్రమే వచ్చాయి. అతి పెద్ద క్యూఐపీగా రూ.3,500 కోట్ల ఐడియా క్యూఐపీ నిలిచింది. ► ఈ ఏడాది అతి పెద్ద ఐపీఓగా రూ.4,473 కోట్ల బంధన్బ్యాంక్ ఐపీఓ నిలిచింది. ► ఈ ఏడాది ఎస్ఎమ్ఈల (స్మాల్, మీడియమ్ ఎంటర్ప్రైజ్) కార్యకలాపాలు గత ఏడాది కంటే జోరుగా ఉన్నాయి. ఈ ఏడాది ఎస్ఎమ్ఈలు ఐపీఓ విధానంలో రూ.2,254 కోట్లు సమీకరించగా, గత ఏడాది ఈ సమీకరణ రూ.1,679 కోట్లుగా మాత్రమే ఉంది. 161 ఐపీఓలు @ 552 కోట్ల డాలర్లు: ఈవై కాగా, ఈ ఏడాది అత్యధిక ఐపీఓలు వచ్చిన స్టాక్ ఎక్సే్చంజ్లుగా భారత స్టాక్ ఎక్సే్చంజ్‌లు రెండో స్థానంలో నిలిచాయని ఈవై తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదిలో నవంబర్ నెల చివరి వరకూ మొత్తం 161 ఐపీఓలు వచ్చాయని, ఈ ఐపీఓలు 552 కోట్ల డాలర్లను సమీకరించాయని ఈవై ఇండియా ఐపీఓ ట్రెండ్స్ నివేదిక పేర్కొంది. ఈ క్యూ3లో 9 ఐపీఓలు రాగా, ఈ క్యూ4లో రెండు ఐపీఓలు మాత్రమే వచ్చాయని వివరించింది. ఎస్ఎమ్ఈ ఐపీఓల్లో కూడా ఇదే ధోరణి చోటు చేసుకుంది. ఈ క్యూ3లో 42గా ఉన్న ఎస్ఎమ్ఈ ఐపీఓలు ఈ క్యూ4లో ఎనిమిదికి తగ్గాయని తెలిపింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ అమెరికాలో 261 ఐపీఓలు 6,000 కోట్ల డాలర్లు సమీకరించాయి. -
చెక్కుచెదరని పనితీరు!
రిస్క్ పెద్దగా భరించలేని వారు, అదే సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు యూటీఐ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఇది మల్టీక్యాప్ ఫండ్. ఇప్పటి వరకు రాబడుల చరిత్ర మెరుగ్గా ఉంది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలో పనితీరు ఉంది. 2017లో ఏకంగా 30 శాతం మేర ఈ పథకం ఎన్ఏవీ పెరిగింది. అయితే, ఈ విభాగం సగటు రాబడుల కంటే తక్కువే. కానీ, ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు 1.3 శాతం మేర రాబడులు ఇచ్చింది. కానీ, ఈ ఏడాది మల్టీ క్యాప్ విభాగం సగటు రాబడులు 8.6 శాతం ప్రతికూలంగా ఉన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా తీవ్ర ఒడిదుడుకులతో కూడిన ఈ ఏడాదిలో ప్రతికూల సమయాల్లోనూ అనుకూల పనితీరు చూపించిన ఈ పథకాన్ని రిస్క్ తక్కువ ఉండాలని భావించే వారు తప్పక పరిశీలించొచ్చు. ఈ పథకం రాబడుల చరిత్ర గొప్పగా లేదు. కానీ, స్థిరంగా తక్కువ ఆటుపోట్లతో ఉన్నందున రిస్క్ తక్కువగా ఉండాలనుకునే వారికి మంచి ఆప్షన్. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఈ పథకం 2008, 2011 కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడం గమనార్హం. ఐదేళ్ల కాలం, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో చూస్తే సగటున మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ఎస్అండ్పీ బీఎస్ఈ 200 సూచీ ప్రామాణికం. ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు 5.9 శాతం అయితే, బీఎస్ఈ 200 రాబడులు 0.9 శాతమే ఉన్నాయి. మూడేళ్లలో చూసుకుంటే ఈ పథకం రాబడులు 8.9 శాతంగా ఉంటే, బీఎస్ఈ 200 రాబడులు మాత్రం కాస్త ఎక్కువగా 9.1 శాతం మేర ఉన్నాయి. ఇక ఐదేళ్ల కాలంలో ఈ పథకం సగటున వార్షికంగా 15.8 శాతం రాబడులు ఇచ్చింది. ఇదే కాలంలో బీఎస్ఈ 200 రాబడులు 13.4 శాతంగానే ఉన్నాయి. ఏడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 14.2 శాతం, పదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 16.7 శాతం చొప్పున ఉన్నాయి. మరి ఈ కాలంలో బీఎస్ఈ 200 రాబడులు 12 శాతం, 13.5 శాతం చొప్పున ఉన్నాయి. సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత మెరుగైన రాబడులు అందుకునే అవకాశం ఉంటుంది. విధానం..: 2015, 2016 సంవత్సరాల్లో ఈ పథకం పనితీరు తక్కువగా ఉండటానికి కారణం... సాఫ్ట్వేర్ రంగ పనితీరు ఆశాజనకంగా లేకపోవడం వల్లే. యూటీఐ ఈక్విటీ ఫండ్ ఐటీ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆ రెండు సంవత్సరాల్లో మెరుగైన పనితీరు చూపించలేకపోయింది. కానీ, ఆ తర్వాత, ఈ ఏడాది మెరుగైన పనితీరుకు ఐటీ రంగ స్టాక్స్ దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. 58 శాతం నిధులను లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో, 32 శాతం నిధులను మిడ్‌క్యాప్ విభాగంలో, మిగిలిన నిధులను స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. బ్యాంకులు, సాఫ్ట్వేర్, ఫార్మా, ఫైనాన్స్ ఈ పథకం పెట్టుబడులకు ప్రాధాన్య రంగాలుగా ఉన్నాయి. అయితే, గడిచిన ఏడాది కాలంలో బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడులను కొంత మేర తగ్గించుకోవడం గమనార్హం. అదే కాలంలో సాఫ్ట్వేర్, ఇండస్ట్రియల్ ప్రోడక్టు కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకుంది. -
సత్తా ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్టింగ్
ఇటీవలి మార్కెట్ కరెక్షన్లో అన్ని రకాల స్టాక్స్ దిద్దుబాటుకు గురయ్యాయి. దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారి ముందు, స్టాక్స్ విలువలు పడిపోయిన ప్రస్తుత తరుణంలో చక్కని అవకాశాలు ఉన్నాయి. మంచి పనితీరుతో కూడిన వ్యాల్యూ ఫండ్స్‌ను ఎంచుకోవడమే ఇన్వెస్టర్లు చేయాల్సిన పని. ఆ విధంగా చూసినప్పుడు హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ బిల్డర్ వ్యాల్యూ ఫండ్ ఒక ఎంపికగా పరిశీలించొచ్చు. విలువల పరంగా ఆకర్షణీయంగా ఉన్న స్టాక్స్‌లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. పనితీరు ఈ పథకం రాబడులకు ప్రామాణిక సూచీ అయిన నిఫ్టీ 500 (టోటల్ రిటర్న్ ఇండెక్స్). కనీసం 50 శాతం నిధులను స్టాక్స్ సగటు విలువల కంటే తక్కువ (పీఈ/పీబీ)కు లభించే వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పథకం తాజా పోర్ట్‌ఫోలియో పీఈ రేషియో 18.5 రెట్లుగా ఉంది. బెంచ్ మార్క్ పీఈ 24తో పోలిస్తే తక్కువలో ఉంది. హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ బిల్డర్ వ్యాల్యూ పథకం... ఇదే విభాగంలోని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వ్యాల్యూ ఫండ్, ఎల్అండ్టీ ఇండియా వ్యాల్యూ ఫండ్‌తో పోలిస్తే ఐదేళ్ల కాల పనితీరులో వెనుకబడి ఉంది. కానీ, ఏడాది, మూడేళ్ల కాల పనితీరు పరంగా చూస్తే మిగిలిన పథకాల కంటే మెరుగ్గా ఉంది. ఏడాది కాలంలో చూసుకుంటే బెంచ్ మార్క్ రాబడులకు సమీపంలో ఉండగా, మూడేళ్ల కాలంలో మాత్రం 11.27 శాతం సగటు వార్షిక రాబడులను అందించింది. మూడేళ్లలో నిఫ్టీ 500 రాబడులు 9.94 శాతమే. ఐదేళ్లలో ఈ పథకం రాబడులు వార్షికంగా 18.47 శాతం కాగా, బెంచ్ మార్క్ రాబడులు 14.99 శాతంగా ఉన్నాయి. పెట్టుబడుల విధానం 2012 ర్యాలీలో ఈ పథకం బెంచ్ మార్క్‌తో పోలిస్తే పనితీరు పరంగా వెనుకబడింది. మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో తక్కువ ఎక్స్పోజర్ కలిగి ఉండటం వల్లే అలా జరిగింది. కానీ, నాటి అనుభవంతో 2014, 2017 ర్యాలీల్లో నిఫ్టీ 500ను పనితీరుతో వెనక్కి నెట్టేసింది. తన పోర్ట్‌ఫోలియోలో మూడింట ఒక వంతు మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌ను కలిగి ఉంటోంది. అయితే, ఈ ఏడాది నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వంటి సందర్భాల్లో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే స్టాక్స్‌లోకి ఎక్స్పోజర్ మళ్లించే విధానాన్ని అనుసరిస్తోంది. ఈ ఏడాది మిడ్, స్మాల్ క్యాప్‌లో పెట్టుబడులను 26 శాతానికి తగ్గించుకుంది. అంతేకాదు మొత్తం మీద ఈక్విటీ పెట్టుబడులను కూడా కొంత తగ్గించింది. ఈక్విటీల్లో 90–95 శాతం మధ్యే పెట్టుబడులు ఉన్నాయి. 2013, 2015లోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరించింది. సాధారణంగా ఈ పథకం 50–60 స్టాక్స్‌ను తన పోర్ట్‌ఫోలియోలో కొనసాగిస్తుంటుంది. గడిచిన రెండు సంవత్సరాలుగా 8–10 శాతం పెట్టుబడులను హెచ్డీఎఫ్సీ బ్యాంకులోనే కొనసాగిస్తూ వస్తోంది. బ్యాంకింగ్ రంగంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ కాలంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం. అన్ని మార్కెట్ సైకిల్స్‌లోనూ బ్యాంకింగ్ స్టాక్స్‌కు ప్రాధాన్యం కొనసాగిస్తోంది. అందులోనూ ప్రైవేటు బ్యాంకుల పట్ల సానుకూలంగా ఉంది. ప్రస్తుతం ఈ రంగంలో 23 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. ఐటీ రంగంలో విప్రోను ఇటీవలే తన పోర్ట్‌ఫోలియోకు యాడ్ చేసుకుంది. ఇన్ఫోసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టింది. -
ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. గత నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు రూ.10,585 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారని ఆంఫి వెల్లడించింది. వర్షాలు బాగానే కురుస్తాయన్న అంచనాలు, కంపెనీల క్యూ1 ఫలితాలు బాగా ఉండడం దీనికి ప్రధాన కారణాలని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఆంఫి ) పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు విషయమై ఆంఫి వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు... ఈ ఏడాది ఏప్రిల్–జూలై క్వార్టర్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మొత్తం పెట్టుబడులు రూ.43,300 కోట్లకు పెరిగాయి. ఫలితంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు 10 శాతం పెరిగాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో రూ.7.5 లక్షల కోట్లుగా ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు ఈ ఏడాది జూన్ క్వార్టర్‌కు రూ.8.3 లక్షల కోట్లకు ఎగిశాయి. ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.12,409 కోట్లకు చేరాయి. ఈ పెట్టుబడులు మేలో రూ.12,070 కోట్లు, జూన్‌లో రూ.8,237 కోట్లు, జూలైలో రూ.10,585 కోట్లుగా ఉన్నాయి. గత నెలలో ఇన్వెస్టర్లు రూ.32,000 కోట్ల పెట్టుబడులను ఫండ్స్ నుంచి వెనక్కి తీసుకున్నారు. స్వల్ప కాలిక పెట్టుబడుల సాధనాలైన ట్రెజరీ బిల్లులు, సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్ల నుంచి రూ.31,000 కోట్ల ఉపసంహరణ జరిగింది. ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే ఇన్కమ్ ఫండ్స్ నుంచి రూ.7,950 కోట్ల మేర పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. ఈక్విటీ ఎమ్ఎఫ్ల్లో పెట్టుబడులు ఇందుకే.... గత కొన్నేళ్లుగా సగటు భారత ఇన్వెస్టర్లకు ఆర్థిక అంశాలపై అవగాహన పెరుగుతోందని ఇండియాబుల్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ హెడ్(ఈక్విటీ ఫండ్స్) సుమిత్ భట్నాగర్ చెప్పారు. వ్యవస్థాగతంగా భారత్ పటిష్టమైన వృద్ధిని సాధించగలదని వారు విశ్వసిస్తున్నారని, అందుకే దీర్ఘకాలిక పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారని వివరించారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లు పెరుగుతుండటమే దీనికి నిదర్శనమని చెప్పారు. దీర్ఘకాలంలో రెండంకెల రాబడినిచ్చే పెట్టుబడి సాధనాలు లేకపోవడంతో, చాలా మంది ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని వివరించారు. లార్జ్ క్యాప్ కంపెనీ షేర్లలో బుల్ రన్ కొనసాగుతుండటంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయని గ్రోడాట్ఇన్ సీఓఓ హర్ష జైన్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల నిర్వహణ ఆస్తులు రూ.23 లక్షల కోట్ల రేంజ్లో ఉన్నాయి. -
కొత్త ఏడాది... కాస్తమారాలి
(సాక్షి, బిజినెస్ విభాగం) : ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినవారందరికీ 2017వ సంవత్సరం మంచి రాబడులను పంచి పెట్టింది. రెరా చట్టం వచ్చినా రియల్ ఎస్టేట్ రంగం పెద్దగా పుంజుకున్నది లేదు. బినామీ ఆస్తుల చట్టం, జీఎస్టీ వంటి ప్రతిబంధకాలూ ఎదురయ్యాయి. రియల్టీ విషయంలో నూతన సంవత్సరం భిన్నంగా ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. ఇక డెట్ మార్కెట్... అంటే బాండ్లలోను, డెట్ ఫండ్స్‌లోను పెట్టుబడులు పెట్టాలంటే వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా లేవు. బంగారమైతే పెద్దగా పెరగకపోయినా స్థిరంగా కొనసాగుతోంది. దీని కదలికలు ఇక ముందూ ఇదే తీరులో ఉంటాయన్న అంచనాలున్నాయి. మరి 2018లో మంచి రాబడులు రావాలంటే ఏం చేయాలి? ఏ సాధనాలు ఆకర్షణీయంగా ఉన్నాయి? పెట్టుబడుల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇదే విషయమై పలువురు నిపుణులతో ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ విభాగం ప్రతినిధులు మాట్లాడారు. వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం... రీ బ్యాలెన్స్ తప్పనిసరి... 2017లో మార్కెట్ల ర్యాలీతో ఈక్విటీ పెట్టుబడుల విలువ పుంజుకుని ఉంటుంది. కనుక పెరిగిన విలువకు తగినట్టు ఆ పెట్టుబడులను ఇప్పుడే రీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరముంది. అయితే, మార్కెట్లు బులిష్‌గా ఉన్న ఈ తరుణంలో ఈక్విటీలో పెట్టుబడులను తగ్గించుకోవటం అన్నది ప్రతికూలంగానే అనిపించొచ్చు. అయితే, ప్రతి ఇన్వెస్టర్‌కు ఫలానా సాధనంలో ఇంత శాతం పెట్టుబడులు పెట్టాలన్న (అస్సెట్ అలోకేషన్) ప్లాన్ ఒకటి ఉంటుంది. ఉదాహరణకు మిగులు నిధుల్లో 25 శాతం ఈక్విటీ, 25 శాతం డెట్, 25 శాతం బంగారం, 25 శాతం రియల్టీ అనుకుని ఉండొచ్చు. ‘‘ఈ పెట్టుబడుల విలువ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కనుక విలువకు తగినట్టు మార్పులు చేసుకోవడం అన్నది తెలివైన చర్య. పెట్టుబడులను క్రమానుగతంగా సమీక్షించుకుంటూ, అవసరమైతే నిర్ణీత శాతం మేర పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసుకోవాలి’’ అని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా సూచించారు. మిడ్, స్మాల్ క్యాప్స్‌లో పెట్టుబడులు 2017లో సెన్సెక్స్ 28 శాతం పెరిగింది. కానీ, స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు ఇంకా ఎక్కువే రాబడులు ఇచ్చాయి. నిపుణుల సూచన ఏమంటే అధిక విలువలకు చేరిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని. ప్రస్తుత స్థాయిలో వాటికి దూరంగా ఉండడమే మంచిదంటున్నారు. ఎందుకంటే బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ పీఈ 46.7 రెట్లయితే... స్మాల్‌క్యాప్ సూచీ పీఈ ఏకంగా 114.5 రెట్లకు చేరింది. మిడ్, స్మాల్ క్యాప్‌లో పెట్టుబడి పెట్టేందుకు ప్రత్యేకంగా ఆరంభమైన పలు మ్యూచువల్ ఫండ్ పథకాలు స్టాక్స్ అధిక వ్యాల్యూషన్ల నేపథ్యంలో కొత్తగా పెట్టుబడులను తీసుకోవడం తాత్కాలికంగా నిలిపివేశాయి. రిస్క్ కొద్దీ రాబడుల దృష్ట్యా ప్రస్తుతానికి లార్జ్‌క్యాప్ ఫండ్స్ అన్నవి తగిన ఎంపిక అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఐవో, ఈడీ శంకరన్ నరేన్ అభిప్రాయపడ్డారు. షార్ట్‌టర్మ్ డెట్ పథకాలు చూడొచ్చు 2017లో డెట్‌ఫండ్స్ రాబడులు చిన్నబోయాయి. అంతకుముందు ఒకటి రెండు సంవత్సరాల కాలంలో ఇవి రెండంకెల స్థాయిలో రాబడులనిచ్చాయి. దీంతో గత సంవత్సరం రాబడులు నిరాశపరిచినట్లే భావించాల్సి ఉంటుంది. చమురు ధరలు పెరగడం, ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడంపై ఉన్న ఆందోళనలు బాండ్ మార్కెట్‌కు ప్రతికూలంగా మారాయి. అయితే, ఇన్వెస్టర్లు స్వల్పకాలిక డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని, వీటిలో అంత అస్థిరతలు ఉండవని, స్థిరమైన రాబడులు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. పన్ను రహిత రాబడుల కోసం... స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వారికి మార్కెట్ల ర్యాలీ కారణంగా మంచి రాబడులొచ్చి ఉంటాయి. దీంతో లాభాల స్వీకరణకు ఇది సరైన సమయమనేది నిపుణుల సూచన. స్టాక్స్‌ను విక్రయించేసి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ప్రయోజనాలను పొందాలని, తిరిగి అవే స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవాలని పేర్కొంటున్నారు. తాజాగా కొనుగోలు చేసిన ధర నుంచి స్టాక్స్ ధరలు ఒకవేళ పడిపోతే స్వల్పకాలిక నష్టాలను బుక్ చేసుకోవచ్చని, ఈ నష్టాలను ఇతర క్యాపిటల్ గెయిన్స్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సర్దుబాటు చేసుకోవచ్చని లేదా ఎనిమిది ఆర్థిక సంవత్సరాల వరకు వాటిని పొందే అవకాశం ఉందని సూచిస్తున్నారు. రిటైర్మెంట్ కోసం ఎన్పీఎస్ అతి తక్కువ చార్జీలతో కూడిన ఎన్పీఎస్ పథకం... దేశీయ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్న రిటైర్మెంట్ పథకాల్లో అత్యంత చౌకయినదని చెప్పొచ్చు. ప్రత్యేక అవసరాల్లో పాక్షిక ఉపసంహరణలు, రిటైర్ అయిన తర్వాత కూడా పెట్టుబడులు పదేళ్ల వరకు కొనసాగించుకునే అవకాశం... ఇవన్నీ ఎన్పీఎస్ ఇన్వెస్టర్లకు పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఎన్పీఎస్ ఖాతాను ఇప్పుడు చాలా సులభంగా ఆన్లైన్ విధానంలోనే ప్రారంభించుకోవచ్చు. ఆధార్‌కు బ్యాంకు ఖాతా, పాన్ లింక్ అనుసంధానమై ఉంటే ఎన్పీఎస్ ఖాతాను ఆన్లైన్లో అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రారంభించుకోవచ్చు. ఇంటి రుణం ముందే తీర్చేస్తే సరి ఇల్లు అద్దెకు ఇవ్వకపోయినట్టయితే ఆ ఇంటి కోసం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీకి పూర్తిగా పన్ను మినహాయింపు ఉండేది. అధిక నికర విలువ కలిగిన ఇన్వెస్టర్లు తమ పన్ను భారం తగ్గించుకునేందుకు ఈ నిబంధనను ఉపయోగించుకునే వారు. కోటి రూపాయల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి 8.75 శాతం వడ్డీ రేటుకు తీసుకుని ఉంటే రూ.8.67 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అవకాశం లభిస్తుంది. దీంతో రుణం తీసుకున్న వారిపై పన్ను భారం మొదటి సంవత్సరం రూ.2.5 లక్షల మేర తగ్గుతుంది. అయితే, గత బడ్జెట్లో పన్ను మినహాయింపును రూ.2 లక్షలకు పరిమితం చేశారు. కనుక ఇంతకంటే ఎక్కువ మొత్తంలో పన్ను ప్రయోజనం ఉండదు కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్స్‌లో పెట్టే కంటే ఇంటి రుణం తీర్చేందుకు అదనంగా కేటాయించుకోవడం నయం. అనారోగ్యానికి కవరేజీ ఉండాలి మీరు తీసుకున్న వైద్య బీమా పాలసీ అన్ని రకాల రిస్క్‌లను కవర్ చేస్తుందనుకుంటున్నారా..? ఒక్కసారి పరిశీలించుకోండి. ఎందుకంటే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడితే హాస్పిటల్లో చేరి 30 రోజులకు పైగా చికిత్స తీసుకోవాల్సిన సందర్భమే వస్తే అప్పుడు సాధారణ బీమా పాలసీలు అక్కరకు రావు. ఎందుకంటే ఈ పాలసీల్లో కవరేజీ పరిమితంగా ఉండడమే కాకుండా, హాస్పిటల్లో గరిష్టంగా 30రోజులకే కవరేజీ లభిస్తుంది. ఆరోగ్య సంరక్షణ వ్యయాలు ఏటేటా భారీగా పెరిగిపోతున్నాయి. కనుక బేసిక్ ప్లాన్‌కు అదనంగా క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కూడా ఉండాలని సూచిస్తున్నారు హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ ముకేశ్‌కుమార్. జీవిత బీమా లేదా వైద్య బీమాకు రైడర్‌గానూ లేదా స్టాండలోన్‌గా క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ప్లాన్‌ను తీసుకునే వెసులుబాటు ఉంది. గోల్డ్ ఫండ్స్ వద్దు బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌ను (ఈటీఎఫ్) బంగారంలో పెట్టుబడులకు అనువైన సాధనంగా గతంలో పరిగణించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి తల్లకిందులయింది. వీటి కంటే సార్వభౌమ బంగారం బాండ్లు అధిక రాబడులనిస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు వార్షికంగా 1 శాతాన్ని ఎక్స్పెన్స్ రేషియోగా వసూలు చేస్తున్నాయి. అదే బంగారం బాండ్లు ఎక్స్పెన్స్ ఛార్జీలవంటివేమీ లేకుండా... వార్షికంగా అవే 2.5 శాతం వడ్డీని ఇస్తున్నాయి. ఇక బంగారం ధర పెరుగుదల ప్రయోజనం ఎలాగూ లభిస్తుంది. దీంతో బంగారం ఈటీఎఫ్‌ల కంటే బంగారం బాండ్లు వార్షికంగా 3.5 శాతం అధికంగా రాబడులను ఇస్తున్నట్టు లెక్క. వీటిల్లో ఇన్వెస్ట్ చేయొద్దు ఇటీవల బిట్‌కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీల్లో చోటు చేసుకున్న పతనం ఇన్వెస్టర్లకు ఓ మేల్కొలుపుగా నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు బిట్‌కాయిన్‌కు దూరంగా ఉండాలని, వారికి ఏ ధరలో కొనాలి, ఎక్కడ విక్రయించాలో తెలియకపోవడం పెద్ద రిస్క్ అని కోటక్ మహింద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ నీలేష్ షా చెప్పారు. అద్దెకు తీసుకుంటే పోలే... ఇటీవల కాలంలో ఇంటికి కావాల్సిన ఉత్పత్తులు అద్దెకు తీసుకునే ధోరణి పెరుగుతోంది. ఇది ఖర్చు పరంగా సౌకర్యమైనది. ఎందుకంటే ఒకే నగరం, పట్టణం పరిధిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం సాధారణం అయిపోతోంది. ముఖ్యంగా యువ నిపుణులకు ఇది ఎక్కువగా అనుభవం. దీంతో ఫర్నిచర్‌ను అద్దెకు తీసుకుంటున్న వారున్నారు. ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలను అద్దెకు తీసుకునేందుకు నెలకు రూ.10 వేల బడ్జెట్ చాలు. అద్దెకు తీసుకుంటే అందులోనే ఉచితంగా డెలివరీ చేస్తారు. వేరే ప్రాంతానికి మారినా ఉచితంగానే రవాణా చేస్తారు. శుభ్రం చేయడం, నిర్వహణ కూడా అద్దెకు ఇచ్చిన సంస్థల పనే. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి నిధుల వెల్లువ
ఏప్రిల్–జూన్ మధ్య మూడు రెట్ల వృద్ధితో రూ.28,000 కోట్లకు న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నిధులతో కళకళలాడుతున్నాయి. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు మూడు రెట్లు అధికమై (గతేడాది ఇదే కాలంలో పోల్చుకుంటే) రూ.28,332 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో వచ్చిన నిధులు రూ.9,479 కోట్లు మాత్రమే. ‘‘ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి నిధుల రాక బలంగా ఉంది. రియల్టీ రంగం పనితీరు పేలవంగా ఉండడం, ఫిక్స్డ్ ఇనకమ్ సాధనాల్లో రాబడులు మెరుగ్గా లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో అధిక రాబడుల కోసం ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలను ఆశ్రయిస్తున్నారు’’ అంటూ బజాజ్ క్యాపిటల్ సీఈవో రాహుల్ పారిక్ పేర్కొన్నారు. వీటికితోడు ఇన్కమ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్‌లో రాబడులు తక్కువగా ఉండడంతో వీటిలోని పెట్టుబడులు ఈక్విటీ, ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ బ్యాలన్స్డ్ ఫండ్స్‌లోకి మళ్లడం కూడా అధికంగా ఉందన్నారు. దీంతో గతేడాది ఇదే కాలంతో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నుంచి సరికొత్త పథకాల విడుదల కూడా పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో కొత్త పథకాల ద్వారా మ్యూచుల్ ఫండ్స్ సేకరించిన నిధులు రూ.4,908 కోట్లుగా ఉండగా, గతేడాది ఇదే కాలంలో కొత్త పథకాల ద్వారా సమీకరించిన నిధులు 173 కోట్లుగానే ఉండడం గమనార్హం. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ పథకాల్లోని మొత్తం పెట్టుబడుల విలువ జూన్ చివరి నాటికి రూ.5.91 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.4.28 లక్షల కోట్లుగా ఉన్నాయి. -
‘ఫిక్స్డ్’ మైండ్ వదిలేయండి!
► ప్రస్తుత పరిస్థితుల్లో ఎఫ్డీలు పనికిరావు ► పన్ను, ద్రవ్యోల్బణం పోగా మిగిలేది సున్నానే ఎఫ్డీ, ఆర్డీ, పొదుపు కోసమే తప్ప పెట్టుబడికి కాదు ► దీర్ఘకాలిక లక్ష్యాలకు డెట్, ఈక్విటీ ఫండ్స్ ఉత్తమం సంప్రదాయంగా, కొన్ని దశాబ్దాలుగా ఎక్కువ మందికి పొదుపు, మదుపు సాధనంగా ఉంటూ వస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రస్తుతం కళతప్పాయ్! దీర్ఘకాల లక్ష్యాలకు, సంపద వృద్ధికి ఫిక్స్డ్ డిపాజిట్లు ఇకపై ఎంత మాత్రం ఉత్తమ సాధనాలు కావన్నది ఆర్థిక పండితుల మాట. ఆర్థిక విధానాలు, మార్కెట్ తీరుతెన్నులు మారుతున్న తరుణంలో, ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రస్తుతం పక్కన పెట్టేసి వాటికి మించి రాబడులనిచ్చే వాటిని ఎంచుకోవడం అవసరం అంటున్నారు ఆర్థిక సలహాదారులు... మన తాత, తల్లిదండ్రుల కాలం నుంచి చాలా మందికి తెలిసింది ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) గురించే. లేదంటే పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలు. కొంత మొత్తం పొదుపు కనిపించిన వెంటనే బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేయడం అలవాటుగా ఉండేది. కానీ, అదే సమయంలో అత్యవసరాలు ఏర్పడితే కనిపించేదీ అదే డిపాజిట్. దాంతో ఆ డిపాజిట్‌ను మధ్యలోనే రద్దు చేసి వెనక్కి తీసుకునేవారు. చివరి వరకూ కొనసాగించేది కొందరే. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉత్తమ పెట్టుబడి సాధనం కాదు అనేందుకు పలు కారణాలున్నాయి. ఒకప్పుడు 8–9% వడ్డీ రేటు డిపాజిట్లపై వచ్చేది. కానీ, ఇప్పుడది 7 శాతానికి పడిపోయింది. ఎఫ్డీపై పన్ను భారంతోపాటు ఎటువంటి పన్ను రాయితీలు లేవు. ఒకవేళ 30% ఆదాయపన్ను శ్లాబులో ఉన్న వారు తీసుకెళ్లి ఎఫ్డీలో పెడితే పొందే ప్రయోజనం ఏమీ ఉండదు. ఉదాహరణకు రూ.10 లక్షలను ఎఫ్డీ చేస్తే దానిపై వార్షికంగా రూ.72వేల ఆదాయం పొందారనుకోండి. 30% పన్ను కింద రూ.21,600 చెల్లించాల్సి వస్తుంది. పోనీ ఎంతోకొంత వచ్చిందని సర్ది చెప్పుకోకండి. ద్రవ్యోల్బణం ఉండనే ఉంది. ఏటేటా ద్రవ్యోల్బణం నగదు విలువను హరిస్తుంటుంది. ఈ ప్రభావాన్ని మినహాయిస్తే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే రాబడిలో చివరికి ఏమీ మిగలదు. అధిక పన్ను రేటులో ఉన్నవారు ప్రతి కూల రాబడులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే రాబడి లేకపోగా తమ పెట్టుబడుల విలువ 1 నుంచి 2% వరకు కోల్పోవాల్సి ఉంటుంది. నిజానికి ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన సాధనాలున్నాయి. అందులోనూ ఫిక్స్డ్ డిపాజిట్ల తరహా సాధనమే కావాలనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ సరైనవి. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పైనా పన్ను ఉంటుంది. కానీ ఆ పన్ను ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తీసేసిన తర్వాత మిగిలిన రాబడులకే వర్తిస్తుంది. అందుకే ఎఫ్డీలతో పోలిస్తే డెట్ మ్యూ చువల్ ఫండ్స్ బెటర్. డెట్ మ్యూచువల్ ఫండ్స్...? నిజానికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో డెట్ ఫండ్స్ ఓ రకం. ఇది ఎఫ్డీలకు చక్కని ప్రత్యామ్నాయం. డెట్ ఫండ్స్ ద్వారా తమకు వచ్చిన నిధులను అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు అధిక భద్రత ఉండే ప్రభుత్వ బాండ్లు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, ఇతర భద్రతతో కూడిన వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. సాధారణ ఇన్వెస్టర్‌కు ఈ విధమైన వైవిధ్య పెట్టుబడులు కష్ట సాధ్యం. పన్నులో వెసులుబాటు బ్యాంకు ఎఫ్డీలు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండింటిపైనా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ డెట్ ఫండ్స్‌పై పన్ను చాలా తక్కువ. ఎలా అంటే... డెట్ ఫండ్స్‌పై రాబడి 8 శాతం ఉందనుకోండి. దానిలోంచి ద్రవ్యోల్బణ సూచీ ప్రభావాన్ని తీసేయగా మిగిలిన నికర రాబడిపైనే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇదీ తేడా... ఉదాహరణకు... ఎఫ్డీలో, డెట్ ఫండ్‌లో రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెడితే... రెండింటిపైనా రాబడి 8 శాతం అనుకుంటే (కేవలం అవగాహన కోసమే) మూడేళ్ల తర్వాత ఒక్కోదానిలో రూ.1,25,971 చొప్పున అవుతాయి. ఎఫ్డీపై కొనుగోలు ఆధారిత ద్రవ్యోల్బణ ప్రభావం కలిపేందుకు అవకాశం లేదు. అదే డెట్ ఫండ్‌పై ఈ వెసులుబాటు ఉంది. అప్పుడు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని నికర పెట్టుబడికి కలిపితే లక్ష కాస్తా రూ.1,19,102 అవుతుంది. అంటే పన్ను చెల్లించాల్సిన నికర రాబడి డెట్ ఫండ్‌లో రూ.6,869 కాగా, ఎఫ్డీలో రూ.1,25,971. ఇప్పుడు ఎఫ్డీపై 30 శాతం పన్ను రేటులో ఉన్న వారు చెల్లించాల్సిన పన్ను రూ.8,025. ఎఫ్డీపై రూ.1,371 మాత్రమే. పన్ను పోగా ఎఫ్డీలో మిగిలిన రాబడి రూ.17,946. డెట్ ఫండ్‌లో రూ.24,597. రాబడి శాతం ఎఫ్డీలో 5.65 శాతం కాగా, డెట్ ఫండ్‌లో 7.61 శాతంగా ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఎప్పుడు? దీర్ఘకాల పెట్టుబడులకు ఎఫ్డీలు సరైన సాధనాలు కావన్నది నిజమే. కానీ, ఆరు నెలల కాలానికి ఎఫ్‌డీల్లో మదుపు చేయడం తప్పేమీ కాదు. చాలా తక్కువ కాలంలోనే డబ్బుతో పని ఉంటే అప్పటి వరకు ఎఫ్‌డీల్లో ఉంచడమే నయం. రాబడి ఓ రెండు శాతం ఎక్కువ వస్తుంది కదా అని మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్లక్కర్లేదు. ఎందుకంటే అంత తక్కువ వ్యవధికి రాబడుల్లో ఉండే వ్యత్యాసం స్వల్పమే. సిప్ విధానంలో... కొంత మందికి రికరింగ్ డిపాజిట్ కట్టడం అలవాటు. నెలనెలా కొంత పొదుపు చేసుకునేందుకు ఇలా ఆర్డీ, చిట్స్‌లో చేరడం చేస్తుంటారు. కానీ, ఇవి కేవలం పొదుపు సాధనాలుగానే ఉపయోగపడతాయి. పొదుపు వేరు, మదుపు వేరన్న విషయం తెలిసే ఉంటుంది. వీటి కంటే డెట్ ఫండ్స్‌లో సిప్ విధానంలో నెలనెలా కొంత మదుపు చేస్తూ వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులకు అవకాశం ఉంటుంది. చాలా స్వల్ప కాల వ్యవధికి ఎఫ్డీలను ఎంచుకుంటే తప్పులేదు గానీ, రిటైర్మెంట్, పిల్లల విద్య తరహా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఎంచుకోవడం ఎంత మాత్రం సరికాదు. మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ వంటివే దీర్ఘకాల అవసరాలను తీర్చగలిగే సాధనాలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్మెంట్ చేయదలిస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో మంచి రాబడులను పొందడానికి అవకాశం ఉంది. అదీ సిప్ విధానంలోనే. ఫండ్ పథకాల్లోనూ రిస్క్ సామర్థ్యం ఆధారంగా పూర్తి ఈక్విటీ, ఈక్విటీ + డెట్ కలసినవి, ఈక్విటీ పథకాల్లోనూ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ ఉన్నాయి. వీటిలో నెలనెలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే దీర్ఘకాలంలో వార్షికంగా 14 నుంచి 18 శాతం వరకు రాబడులను పొందడానికి అవకాశం ఉందని చరిత్ర చెబుతోంది. పన్ను రహిత రాబడులకు వీలు కల్పించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథకాల్లోనూ రాబడులు 14 శాతం కంటే ఎక్కువే ఉన్నాయి. అందుకే దీర్ఘకాల అవసరాలకు ఎఫ్డీలకు బదులు ప్రత్యామ్నాయాలవైపు చూడడం ద్వారానే సంపద సృష్టి సాధ్యమవుతుంది. -
స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడి ఓకేనా?
దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈక్విటీ ఫండ్స్‌ను పరిశీలించమని మీరు తరచూ చెబుతుంటారు కదా! ఎందుకని? భాను ప్రకాశ్, విశాఖపట్నం ఈక్విటీ (షేర్) ద్వారా కంపెనీ యాజమాన్యంలో కొంత వాటాను మీరు పొందవచ్చు. అంటే కంపెనీకి లాభాలు వస్తే మీకు వాటిల్లో భాగముంటుందని అర్థం. కంపెనీ పనితీరు బాగుంటే ఆ కంపెనీ అమ్మకాలు, లాభాలు పెరుగుతాయి. అలాకాకుండా స్థిరమైన ఆదాయాన్నిచ్చే సాధనాల్లో రాబడులు, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే స్థాయిలో ఉండవు. రెండో విషయం... ఒక మంచి కంపెనీ ఎప్పటికప్పుడు తన మార్కెట్ వాటాను పెంచుకుంటూ, గరిష్ట రాబడులను పొందే ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాల వల్ల ఆ కంపెనీ షేర్ ధర పెరుగుతూ ఉంటుంది. అయితే కంపెనీలన్నీ ఇలా మంచి రాబడులిస్తాయని చెప్పలేం. చాలా కంపెనీలు ఒక స్థాయికి వచ్చాక వాటిలో పెద్దగా వృద్ధి ఉండదు. ఈక్విటీ ఫండ్స్ విషయానికొస్తే, ఎంతో అనుభవముండే ఫండ్ మేనేజర్లు... ఆకర్షణీయమైన ధరల్లో ఉండి భవిష్యత్తులో మంచి రాబడులనిచ్చే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కంపెనీ ఫండమెంటల్స్, కంపెనీ భవిష్యత్, భవిష్యత్తు ప్రభుత్వ విధానాలు... ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో పెట్టుబడి పెడితే మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ లభిస్తుంది. అత్యవసర నిధి కోసం కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. దేన్లో చేస్తే బాగుంటుంది? ఖలీల్, విజయవాడ అత్యవసరాల కోసం ఇన్వెస్ట్ చేయడమనేది వ్యక్తులను బట్టి మారుతుంది. వ్యక్తులు, వారిపై ఆధారపడిన వాళ్లు, వాళ్ల ఆదాయం, అవసరాలు, వాళ్లు అంచనా వేసే అత్యవసర ఖర్చుల్ని బట్టి ఇది మారుతుం ది. అత్యవసర నిధిని 2–3 స్థాయిలుగా విభజించుకోవాలి. మీ పిల్లలు, తల్లిదండ్రులు కూడా మీ వద్దే ఉన్నారనుకోండి. మీరు కొంత మొత్తం ఇంట్లోనే ఉంచుకోవాలి. ఇది మొదటి స్థాయి. దీనివల్ల రాబడులేమీ రాకపోయినా, మీకు అత్యంత సౌకర్యంగా ఉంటుంది. రెండో స్థాయి లో కొంత మొత్తాన్ని స్వీప్–ఇన్ సౌకర్యమున్న సేవింగ్స్ ఖాతాలో ఉంచుకోవాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు డబ్బులు తీసుకోగలుగుతారు. మీకు వైద్య, జీవిత బీమా పాలసీలున్న పక్షంలో పెద్ద మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మూడో స్థాయలో కొంత మొత్తాన్ని ఆల్ట్రా–షార్ట్ టర్మ్ లేదా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలి. స్వల్పకాలిక నోటీస్తోనే వీటి నుంచి సొమ్ములను విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ ఆదాయం, అవసరాలు, ఎదురయ్యే అత్యవసర పరిస్థితులు.. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఏ స్థాయిల్లో ఎంత.. అంటే ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? సేవిం గ్స్ ఖాతాలో ఎంత మొత్తం డిపాజిట్ చేయాలి? ఆల్ట్రా–షార్ట్ టర్మ్ లే దా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ల్లో ఎంత వరకూ ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయిం చుకోవాలి. మీరు ఉద్యోగస్తులైతే కనీసం ఆరునెలల జీతాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇదే సూత్రం అందరికీ వర్తించదు. అత్యవసర అంచనాలను బట్టి ఈ మొత్తం మారుతుంది. ప్రస్తుతం స్మాల్‌క్యాప్ ఫండ్స్ మంచి రాబడులనిస్తున్నాయని, అందుకని స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని మిత్రుడొకరు చెప్తున్నారు. నిజమేనా? తగిన సలహా ఇవ్వండి. జాన్సన్, వరంగల్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్.. డైవర్సిఫికేషన్ ప్రధాన లక్ష్యంగా ఉండాలి. అన్ని కేటగిరీ ఫండ్స్ ఒక్కోసారి మంచి రాబడులు ఇస్తాయి. మరోసారి నష్టాలను ఇస్తాయి. ఇదంతా ఒక వృత్తంలాంటిది. గత 5–10 ఏళ్లలో స్మాల్ క్యాప్ ఫండ్స్ మంచి రాబడులనే ఇచ్చాయి. అయితే గత 2–3 సంవత్సరాల్లో మంచి స్మాల్‌క్యాప్ ఫండ్స్ కూడా చెప్పుకోదగ్గ రాబడులనివ్వలేదు. త్వరలో మార్కెట్ ఒకింత పతనమయ్యే అవకాశాలున్నాయని అంచనా. ఈ పరిస్థితుల్లో స్మాల్ క్యాప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ఒకింత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అందుకని వీటికి బదులుగా మల్టీ–క్యాప్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ మల్టీ క్యాప్ ఫండ్స్‌లో స్మాల్ క్యాప్ షేర్లు కూడా ఉంటాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ విషయంలో ఇన్వెస్టర్లు 2008 సంవత్సరాన్ని అసలు మరచిపోకూడదు. ఆ సంవత్సరంలో స్మాల్–క్యాప్ ఫండ్స్ 70–80 శాతం పడిపోయాయి. అయితే ఈ తరహా మార్కెట్ పరిస్థితులు తరచూ తలెత్తే అవకాశాలు లేవనే చెప్పాలి. అయినప్పటికీ, మార్కెట్ భారీగా పడిపోతే మీ ఇన్వెస్ట్మెంట్స్కూడా భారీగా నష్టపోవచ్చు. అందుకనే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేయాలి. స్మాల్ క్యాప్ ఫండ్స్ నుంచి మంచి రాబడులు పొందాలనుకుంటే మార్కెట్ పరిస్థితులు బాగాలేనప్పుడే వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎస్బీఐ మ్యాగ్నమ్ బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్ల తరవాత కనీసం 10 శాతం రాబడులు వస్తాయని సదరు ఏజెంట్ చెప్తున్నాడు. దీన్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులే వస్తాయా ? లేకుంటే నా డబ్బులు నష్టపోయే పరిస్థితులుంటాయా? భావన, హైదరాబాద్ సాధారణంగా చూస్తే, బ్యాలెన్స్డ్ ఫండ్స్ మంచివి. సురక్షితమైనవి. మూడేళ్లలో బ్యాలెన్స్డ్ ఫండ్స్ 10 శాతం రాబడులనివ్వగలవు. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ పనితీరు బాగుంటే అంతకుమించిన రాబడులు కూడా రావచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్ రాబడులు ఎక్కువే ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇంత రాబడి వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఇంత మొత్తం రాబడులు ఇస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. దీర్ఘకాలంలో ఇవి మంచి రాబడులనే ఇస్తాయి. -
పిల్లల చదువు కోసం ఫండ్స్..
నాకు ఇటీవలే వివాహమైంది. నా భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. భవిష్యత్తులో సొంత ఇల్లు సమకూర్చుకోవాలనేది మా ఆర్థిక లక్ష్యం. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫండ్స్‌లో డివిడెండ్లను బాగా చెల్లించే ఫండ్స్‌ను ఎలా ఎంచుకోవాలి? –సుధీర్, విజయవాడ సొంత ఇల్లు సమకూర్చుకోవడం అనే ఆర్థిక లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మంచి నిర్ణయమే. అయితే డివిడెండ్లు ఇచ్చే ఫండ్స్‌ను ఎంచుకోవడం అనేది సరైనది కాదు. డివిడెండ్ల రూపంలో ఆదాయం పొందడానికి ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు.. ఈక్విటీ ఫండ్స్ ద్వారా వచ్చే డివిడెండ్.. పెద్దగా ఉండదు. పైగా ఆధారపడదగ్గ ఆదాయం కాదని చెప్పవచ్చు. ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఫండ్‌ను ఎంచుకోవడానికి డివిడెండ్ చెల్లింపు అనేది కీలకం కాకూడదు. ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఫండ్‌ను ఎంచుకోవాలంటే మీరు చూడాల్సింది.. ఆ ఫండ్ గత కొన్నేళ్లలో ఏ స్థాయిల్లో రాబడులు ఇచ్చిందనే విషయాన్నే. అంతేకాని ఆ ఫండ్ ఎంత డివిడెండ్లు ఇచ్చింది అనేది అసలు పరిశీలించదగ్గ విషయమే కాదు. మార్కెట్ పరిస్థితులు బాగా లేకపోయినా, సదరు ఫండ్ డివిడెండ్ ఇచ్చిందని, దీంతో ఈ ఫండ్ మంచి పనితీరు కనబరుస్తుందని పలువురు ఇన్వెస్టర్లు అపోహపడే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఓపెన్–ఎండ్ఈక్విటీ ఫండ్స్‌లో డివిడెండ్ అసలు ఏమంత పరిగణించాల్సిన విషయమే కాదు. పైగా ఫండ్ ఇచ్చిన డివిడెండ్ మేరకు మీ ఫండ్ విలువ తగ్గుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక ఫండ్ ఎన్ఏవీ రూ.20 అనుకుందాం. ఆ ఫండ్ 20 శాతం డివిడెండ్(ముఖ విలువపై) ప్రకటించిందనుకుందాం. అప్పుడు ఆ ఫండ్ ఎన్ఏవీ రూ.18కు తగ్గిపోతుంది. అంటే డివిడెండ్ వల్ల ప్రత్యేకమైన లాభాలేమీ లేవని చెప్పవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే మీ సొమ్మే మీరు తిరిగి వెనక్కి పొందుతారు. నిలకడగా వృద్ధి చెందుతున్న ఫండ్స్‌లోనే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయాలి. గత కొన్నేళ్లలో మంచి రాబడులు ఇచ్చిన ఏవైనా 1–2 ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్స్‌ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) ద్వారా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయండి. సొంత ఇల్లు సమకూర్చుకోవాలనుకునే మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాన్ని సాకారం చేసుకోండి. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల చదువుల కోసం నెలకు రూ.20,000 చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అధిక రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? కొన్ని మంచి ఈక్విటీ ఫండ్స్‌ను సూచించండి. –అజయ్, కరీంనగర్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండడం మంచిదే. కానీ రిస్క్‌ను తగ్గించుకోవడం అంతకంటే మంచి విషయం. మీ పిల్లల విద్యావసరాల కోసం ఏదైనా 2–4 మంచి మల్టీ–క్యాప్ ఫండ్స్‌ను ఎంచుకోండి. మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. బిర్లా ఎస్ఎల్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ, మిరా అసెట్ ఇండియా ఆపర్చునిటీ. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, సిప్ విధానంలో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మార్కెట్ బాగా లేని పరిస్థితుల్లో కూడా సిప్‌ను కొనసాగిస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ దీర్ఘకాలంలో మంచి రాబడులనిస్తాయి. నేనొక వర్కింగ్ వుమెన్‌ను. నా దగ్గర ప్రస్తుతం రూ. లక్ష ఉన్నాయి. సంవత్సరం తర్వాత వీటి అవసరం నాకు ఉంటుంది. ఆలోగా మంచి రాబడులు వచ్చే దాంట్లో ఈ డబ్బులను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఫిక్స్డ్ డిపాజిట్లు కంటే ఎక్కువ రాబడి రావాలి. అదే సమయంలో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు భద్రత ఉండాలి. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక వేరే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయనా? తగిన ఇన్వెస్ట్మెంట్ సాధనాలను తెలపండి. –కీర్తి, విశాఖపట్టణం మీరు షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. వీటికి లాక్–ఇన్ పీరియడ్ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మంచి రాబడులనే ఇస్తాయి. ఏడాది స్వల్ప కాలానికి ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం కాదు. కనీసం 3–5 ఏళ్లకు మించితేనే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. స్వల్పకాలానికి ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే తక్కువ రాబడులు రావచ్చు. లేదా నష్టాలు వచ్చినా రావచ్చు. నేను తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను రిస్క్ తీసుకోవడానికి సిద్ధమే. మ్యూచువల్ ఫండ్స్‌లో 10–15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి. –అఫ్జల్, హైదరాబాద్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ తక్కువ రిస్క్‌కే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మార్కెట్ ఒడిదుడుకులకు గురైనప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ విలువ తగ్గే ప్రమాదం ఉంది. మీరు తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ముందుగా 2–3 ఏళ్ల పాటు బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత ఈక్విటీ ఫండ్స్‌కు మరలండి. పన్ను ప్రయోజనాలు కావాలనుకుంటే, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్చేయండి. -
ఈక్విటీ ఫండ్స్‌లో డివిడెండ్ ఆప్షన్ ఓకేనా?
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. వీటికి లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు కాబట్టి... ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైనదా లేకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయమంటారా? –సురేశ్, విశాఖపట్టణం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. పన్ను ప్రయోజనాలతో పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మంచి రాబడులను కూడా పొందవచ్చు. ఇతర ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో లాగానే ఈఎల్ఎస్ఎస్ల్లో కూడా సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలోనే ఇన్వెస్ట్ చేయడం సముచితం. ఒకవేళ మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులుంటే వాటిని నెలకి కొంత మొత్తంగా విభజించి సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి. అలా కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈక్విటీ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉండి, . ఆ తర్వాత పతనమైనప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత భాగం హరించుకుపోతుంది. ఈ రిస్క్ ఉండకూడదనుకుంటే మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా సిప్ విధానంలోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. సాధారణంగా చాలా మంది పన్ను ఆదా నిమిత్తం ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సంపద సృష్టించుకోవచ్చు కూడా. కనీసం 5 నుంచి ఏడేళ్ల పాటు ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే డివిడెండ్లపై ఎలాంటి పన్ను లేనందున డివిడెండ్ ఆప్షన్ ను ఎంచుకోవాలనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? – స్పందన, హైదరాబాద్ మీ నిర్ణయం సరైనది కాదు. కేవలం పన్ను అంశాలు ఆధారంగా డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం అర్థం లేనిది. మీకు క్రమానుగతంగా డబ్బులు అవసరమైతేనే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు, రిటైరైన తర్వాత మీకు వైద్య, ఇతర ఖర్చుల కోసం నెలా నెలా కొంత మొత్తం డబ్బులు అవసరమవుతాయి. ఇలాంటి సందర్బాల్లోనే డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేసుకోవడం, సొంత ఇల్లు సమకూర్చుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే మీరు గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే డివిడెండ్ చెల్లింపు మొత్తాన్ని కూడా మళ్లీ ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి, చక్రగతి వృద్ధితో ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మంచి రాబడులు వస్తాయి. అలా కాకుండా డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకున్నారనుకోండి. వచ్చే డివిడెండ్లు స్వల్పంగా ఉంటాయి. వీటిని ఖర్చు చేయడమో, లేకుంటే స్వల్పరాబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడమో జరుగుతుంది. ఇవి అలా వృ«థా అయిపోతాయి. ఈక్విటీ ఫండ్స్ డివిడెండ్లపై ఎలాంటి పన్నులు లేవు. ఏడాది తర్వాత ఈక్విటీ ఫండ్స్‌ను విక్రయిస్తే, ఎలాంటి మూలధన లాభాల పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకని కేవలం పన్ను అంశాలు ఆధారంగా డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం అర్థం లేనిది. నా ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్) ఖాతాను రెండు దఫాలుగా పదేళ్లపాటు పొడిగించాను. ఇలా పొడిగించిన తర్వాత పీపీఎఫ్ ఖాతాపై వచ్చే రాబడులపై నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉందా? – రాజేశ్, బెంగళూరు రెండు దఫాలుగా పొడిగించిన తర్వాత కూడా మీ పీపీఎఫ్ ఖాతా రాబడులపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. పన్ను పరంగా పీపీఎఫ్‌ను 3ఈ ఎగ్జెంప్ట్(మినహాయింపు)–ఎగ్జెంప్ట్–ఎగ్జెంప్ట్)గా వ్యవహరిస్తారు. అంటే మూడు దశల్లో(ఇన్వెస్ట్ చేసేటప్పుడు–మీ ఇన్వెస్ట్మెంట్స్ వృద్ధి చెందేటప్పుడు–ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకునేటప్పుడు) పన్ను మినహాయింపులుంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే దశలో పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే వడ్డీపై కూడా ఎలాంటి పన్ను భారం ఉండదు. ఇక మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరించుకునేటప్పుడు కూడా మీపై ఎలాంటి పన్ను భారం ఉండదు. మెచ్యురిటీ తీరిన తర్వాత పొడిగించిన పీపీఎఫ్ ఖాతాలకు కూడా ఇదే వర్తిస్తుంది. ప్రస్తుతం నా వయస్సు 52 సంవత్సరాలు. ఎల్ఐసీ జీవన్ అక్షయ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. వడ్డీరేట్లు పడిపోతున్న నేపథ్యంలో దీర్ఘకాలానికి ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా? – జాన్సన్, విజయవాడ ఎల్ఐసీ జీవన్ అక్షయ్ సిక్స్ అనేది తక్షణ యాన్యుటీ ప్లాన్. మీరు వన్‌టైమ్ ప్రీమియమ్ చెల్లించారనుకోండి. మీరు బతికున్నంత కాలం మీకు నెలవారీ లేదా సంవత్సరానికొకసారి కొంత మొత్తం చెల్లిస్తారు. మీరు చెల్లించిన ప్రీమియమ్‌ను తిరిగి పొందే ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీకు నెలవారీ వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలనే దానిపై గరిష్ట పరిమితి లేదు. చెల్లింపులు ఎలా కావాలనుకుంటే అలా (నెలవారీ, మూడు నెలలకొకసారి, ఆరు నెలలకొకసారి, ఏడాదికొకసారి) ఎంచుకోవచ్చు. ఇలాంటి సంప్రదాయ పెన్షన్ ప్లాన్లకు దూరంగా ఉండడమే మంచిది. ఇవి ఖరీదైనవి. ఈ తరహా ప్లాన్‌ల్లో పారదర్శకత ఉండదు. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, లేదా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లతో పోల్చితే ఈ స్కీమ్‌లో వచ్చే రాబడి తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. -
అధిక రాబడి ఈక్విటీల్లోనే..!
ఏడేళ్ల వ్యవధిలో 20 శాతం రాబడులిచ్చిన ఈక్విటీ ఫండ్స్ * మ్యూచువల్ ఫండ్లలో పెరుగుతున్న పెట్టుబడులు * ఫండ్ల పెట్టుబడుల్లో 85 శాతం షేర్లలోనే... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్చుతగ్గులు, రిస్కులున్నప్పటికీ దీర్ఘకాలంలో ఇతర సాధనాల కన్నా ఈక్విటీలే మెరుగైన రాబడినిస్తున్నాయి. మరి దీర్ఘకాలమంటే ఎంత? రెండేళ్లా? మూడేళ్లా? లేక ఐదేళ్లా? అనే సందేహం రావచ్చు. నిజానికి మూడేళ్లు దాటితే దీర్ఘకాలంగా పరిగణిస్తారు. ఆ రకంగా చూస్తే మన స్టాక్ మార్కెట్లు మెరుగైన రాబడినే ఇచ్చాయి. దాన్ని మన మ్యూచువల్ ఫండ్లు అందిపుచ్చుకున్నాయి కూడా. బహుశా!! ఇది గమనించే కాబోలు! ఇన్వెస్టర్లు మళ్లీ వాటివైపు మళ్లుతున్నారు. 2104లో సుమారు 3.95 కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రయిబర్ల సంఖ్య... ఈ ఏడాది మార్చి నాటికి 4.77 కోట్లకు చేరింది. వీటిలో 4.54 కోట్ల మంది రిటైల్ ఇన్వెస్టర్లు కాగా.. మిగిలిన వారు సంస్థాగత.. సంపన్న ఇన్వెస్టర్లు. గతేడాది మేలో రూ. 12.26 లక్షల కోట్లుగా ఉన్న ఏయూఎం (ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు) ఈ ఏడాది మే నాటికి 18 శాతం పెరిగి రూ.14.46 లక్షల కోట్లకు చేరాయి. సంస్థాగత ఇన్వెస్టర్లను పక్కన పెడితే ఇందులో దాదాపు సగభాగం రూ.6.58 లక్షల కోట్లు వ్యక్తిగత పెట్టుబడులుగా వచ్చినవే. మ్యూచువల్ ఫండ్ సంస్థల సమాఖ్య (యాంఫీ) గణాంకాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఈక్విటీ ఆధారిత స్కీముల్లో అత్యధికంగా 85 శాతం పెట్టుబడులు రిటైల్, సంపన్న ఇన్వెస్టర్లవే ఉన్నాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు అందిస్తాయన్న విశ్వాసమే దీనికి కారణం. ఏడేళ్లలో అధిక రాబడులు.. వివిధ ఫండ్స్‌ను కలిపి యాంఫీ, రేటింగ్ సంస్థ క్రిసిల్ రూపొందించిన సూచీ ప్రకారం... ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి వెల్లడైన గణాంకాలను చూస్తే ఈక్విటీల్లోనూ, షేర్ల ఆధారిత పథకాల్లోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్లు దీర్ఘకాలంలో సగటున గణనీయమైన రాబడులు అందించాయి. ఉదాహరణకు.. అయిదేళ్ల క్రితం ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల్లో (ఈఎల్ఎస్ఎస్) చేసిన పెట్టుబడులు సగటున 11.22 శాతం మేర వార్షిక రాబడులిచ్చాయి. అదే మార్కెట్లు కనిష్ట స్థాయిల్లో తిరుగాడుతున్నప్పుడు ఏడేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉంటే సగటున 20 శాతం మేర వార్షిక రాబడులొచ్చాయి. ఇక అటు ఈక్విటీలు ఇటు డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేసే బ్యాలెన్స్డ్ ఫండ్లు కూడా ఈ కాలంలో సుమారు 18.79 శాతం మేర వార్షిక రాబడులు అందించాయి. అదే సమయంలో ప్రభుత్వ బాండ్లు మొదలైన సురక్షిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్లు ఒకే స్థాయిలో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం రాబడులందించాయి. అయితే సంవత్సర కాలంలో ఈక్విటీ ఫండ్లు కొంత నష్టాలు పంచినప్పటికీ (దాదాపు 2 శాతం నుంచి 7 శాతం మేర) .. డెట్ ఫండ్ సూచీ మాత్రం సుమారు 7 శాతం స్థాయిలో సానుకూల రాబడులు అందించింది. హెచ్చుతగ్గులు సహా పలు కారణాలు... 2007-08 ప్రాంతంలో మార్కెట్లు గరిష్ట స్థాయిలకి ఎగిశాయి. కనిష్ట స్థాయిలకూ పడిపోయాయి. 2007 ప్రారంభంలో సుమారు 13,000 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ ఆ ఏడాది ఆఖరు నాటికి ఏకంగా 20,287 పాయింట్లకు ఎగిసింది. అదే సెన్సెక్స్.. ఆ మరుసటి ఏడాది 2008 ప్రారంభంలో 20,800 పాయింట్ల స్థాయి నుంచి సంవత్సరం ఆఖరు నాటికల్లా అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల ప్రభావం దరిమిలా 8,450 పాయింట్లకు (గరిష్టం నుంచి 12,000 పైగా పాయింట్ల పతనం) పడింది. సరిగ్గా ఇటువంటి సమయంలో కంగారుపడి ఈక్విటీ ఫండ్స్ నుంచి వైదొలగకుండా స్థిరంగా పెట్టుబడులు కొనసాగించిన వారు గణనీయంగా లాభపడ్డారు. మరోవైపు, అప్పటిదాకా దాదాపు ఏడు శాతం స్థాయిలో కొనసాగిన ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు మందగమన పరిస్థితుల్లో వృద్ధికి ఊతమిచ్చే చర్యల వల్ల 4.25 శాతానికి తగ్గాయి. అటుపైన మూడేళ్ల క్రితం దాకా దాదాపు 8.50 శాతం పైగా తిరుగాడిన రేట్లు మళ్లీ ఇప్పుడు ఆరున్నర స్థాయికి దిగొచ్చాయి. తదనుగుణంగానే వడ్డీ రేట్ల ఆధారిత పథకాలూ ఓ మోస్తరు రాబడులిచ్చాయి. -
గతవారం బిజినెస్
వ్యాపార నిర్వహణ... భారత్‌కు రెండో ర్యాంక్ వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంలో భారత్ ఈ ఏడాది రెండో ర్యాంక్‌ను సాధించింది. గ్లోబల్ రిటైల్ డెవలప్మెంట్ ఇండెక్స్(జీఆర్‌డీఐ) రూపొందించిన ఈ జాబితాలో అభివృద్ధి చెందుతున్న 30 దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. భారత్‌లో జనాభా అధికంగా ఉండడం, జీడీపీ జోరు పెరుగుతుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ప్రభుత్వం సరళీకరిస్తుండడం వంటి కారణాల వల్ల భారత్‌కు ఈ ర్యాంక్ లభించిందని నివేదిక పేర్కొంది. ఎల్అండ్టీకి ఖతార్ ప్రతిష్టాత్మక కాంట్రాక్ట్ ఖతార్ 2022 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు సంబంధించి 13.5 కోట్ల డాలర్ల (సుమారుగా రూ.900 కోట్లకు పైగా)విలువైన స్టేడియం నిర్మాణ కాంట్రాక్ట్ ఎల్ అండ్ టీ జాయింట్ వెంచర్‌కు లభించింది. ఏఐ బలగ్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీతో ఎల్ అండ్ టీ ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కాంట్రాక్టులో భాగంగా 40 వేల సీట్ల ఏఐ రాయ్యన్ స్టేడియమ్‌ను ఎల్ అండ్ టీ జేవీ 2019 కల్లా నిర్మించాల్సి ఉంటుంది. గ్రీన్ బాండ్లతో యాక్సిస్ నిధుల సమీకరణ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో గ్రీన్ బాండ్ల జారీ ద్వారా ప్రైైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ 50 కోట్ల డాలర్లు సమీకరించింది. అంతర్జాతీయంగా లిస్టైన తొలి భారత గ్రీన్ బాండ్ ఇది. యాక్సిస్ బ్యాంక్ గ్రీన్ బాండ్‌ను క్లైమెట్ బాండ్స్ స్టాండర్డ్స్ బోర్డ్ సర్టిఫై చేసింది. ఈ గ్రీన్ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను హరిత ఇంధనోత్పత్తి, రవాణా, మౌలిక ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తామని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్ షేర్ల బై బ్యాక్! ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజ కంపెనీలు ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్‌లు 25 శాతం వాటా షేర్లను బై బ్యాక్ చేయనున్నాయి. ఈ రెండు సంస్థలు కలసి రూ.10,000 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేస్తాయని అంచనాలున్నాయి. ఈ రెండు కంపెనీల్లో ప్రభుత్వ వాటా 80 శాతంగా ఉండటంతో ఈ బై బ్యాక్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.6,500 కోట్లు సమకూరుతాయని అంచనా. యథాతథ రేట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా బ్యాంక్ రేటు (7 శాతం), రెపో రేటు (6.5 శాతం), రివర్స్ రెపో రేటు (6 శాతం), నగదు నిల్వల శాతం (సీఆర్ఆర్-4 శాతం)లను అంచనాలకనుగుణంగానే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం రిస్క్‌తో ఈ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. వర్షాలు కురిసి ద్రవ్యోల్బణం దిగొస్తే రేట్లను తగ్గిస్తామని చెప్పారు. టాప్-100 మహిళల్లో నలుగురు మనవారు.. ప్రపంచంలోని తొలి వంద మంది శక్తిమంతమైన మహిళల్లో నలుగురు భారతీయ మహిళలు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ఈ జాబితాలో... ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య 25వ స్థానంలో నిలవటం విశేషం. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ 40వ స్థానంలోను... బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 77వ స్థానంలోను, హెచ్‌టీ మీడియా అధిపతి శోభనా భర్తియా 93వ స్థానంలోను నిలిచారు. అలాగే అరుంధతీ భట్టాచార్య.. ఫోర్బ్స్ ‘ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత శక్తివంతమైన మహిళల’ జాబితాలో 5వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈక్విటీ ఫండ్స్ పెట్టుబడుల రికార్డు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు జోరుగా కొనసాగుతున్నాయి. మే నెలలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)తో సహా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.4,721 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు యాంఫీ పేర్కొంది. ఆరు నెలల కాలంలో ఈ నెలలోనే అధిక పెట్టుబడులు వచ్చాయని, రిటైల్ ఇన్వెస్టర్లు అధికంగా పెట్టుబడులు పెట్టడమే దీనికి ప్రధాన కారణమని తెలియజేసింది. సిండికేట్ బ్యాంక్ భారీ నిధుల సమీకరణ ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,700 కోట్లు సమీకరించనుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) లేదా రైట్స్ ఇష్యూ లేదా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్విప్) లేదా ప్రభుత్వం/ ఆర్బీఐ ఆమోదించే మరే ఇతర మార్గాల ద్వారానైనా ఈ నిధులు సమీకరించాలని యోచిస్తున్నామని సిండికేట్ బ్యాంక్ తెలియజేసింది. ఈ నెల 26న జరిగే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఈ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరతామని వివరించింది. ఆఫీసు లీజుల్లో బెంగళూరు టాప్ ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకోవటంలో బెంగళూరు రికార్డుసృష్టించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక ఆఫీసు స్థల లీజు ఒప్పందాలు బెంగళూరులోనే చోటు చేసుకున్నట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా తెలియజేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి బెంగళూరు, టోక్యో, ఢిల్లీ- ఎన్సీఆర్లో ఈ ఏడాది ప్రారంభం నుంచే లీజింగ్ కార్యకలాపాలు ఊపందుకున్నాయని సంస్థ పేర్కొంది. రుణ రేటు తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణ రేటును స్వల్పంగా 0.05 శాతం తగ్గించింది. కొత్త రుణ గ్రహీతల నెలవారీ బకాయిల చెల్లింపు (ఈఎంఐ)లు తగ్గడానికి దోహదపడే అంశం ఇది. తాజా నిర్ణయంతో బ్యాంక్ రెండేళ్ల రుణ రేటు 9.25 శాతం నుంచి 9.20 శాతానికి తగ్గింది. ఈ నిర్ణయం 7వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెబ్సైట్లో పేర్కొంది. ఇక నెలవారీ రేటు 9 శాతం నుంచి 8.95కు తగ్గింది. హైదరాబాద్‌లో ఫ్లైదుబాయ్ కేంద్రం వినూత్న యాప్స్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్ డెవలపర్లకు మరో అరుదైన అవకాశం లభించింది. ఇక్కడి యువ డెవలపర్ల ప్రతిభను చూసిన చౌక విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్... హైదరాబాద్‌లో డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ) ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. శంషాబాద్ సమీపంలో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం సంస్థకు భారత్‌లో తొలి డెవలప్మెంట్ సెంటర్ కావటం విశేషం. తిరిగి పరిశ్రమల పడక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటినెల ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధి నమోదుకాలేదు. 2015 ఇదే నెలతో పోల్చితే ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా -0.8 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 శాతం, మార్చిలో 0.3 శాతం ప్లస్‌లో వున్న పారిశ్రామికోత్పత్తి ఏప్రిల్‌లో మైనస్‌లోకి జారిపోవడం గమనార్హం. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3 శాతం. ఇక మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీలో 75 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో కూడా అసలు వృద్ధి లేకపోగా - 3.1 శాతం క్షీణత నమోదయ్యింది. 2015 ఏప్రిల్‌లో ఈ రంగం వృద్ధి రేటు 3.9 శాతం. అమ్మకానికి డెక్కన్ క్రానికల్ ట్రేడ్‌మార్క్‌లు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) ట్రేడ్‌మార్కులను వేలం వేసేందుకు ఐడీబీఐ బ్యాంకు సిద్ధమైంది. దాదాపు రూ. 444 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు ఈ నెల 24న డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ట్రేడ్‌మార్క్‌లను ఆన్లైన్లో వేలం వేయనున్నట్లు ప్రకటించింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 23 ఆఖరు తేదీగా పేర్కొంది. డీల్స్.. * పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న గ్రీన్కో ఎనర్జీలో సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీఐసీతోపాటు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీలకు చెందిన కంపెనీలు సుమారు రూ.1,530 కోట్లు పెట్టుబడి పెట్టాయి. * అమెరికా మార్కెట్లో విక్రయాల కోసం యూఎస్‌ఫార్మా విండ్లాస్ సంస్థ నుంచి నాలుగు ఉత్పత్తులకు సంబంధించి హక్కులు దక్కించుకున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది. డ్రోన్‌డరోన్, లూరాసిడోన్, ప్రాసుగ్రెల్, ఫింగ్లిమోడ్ వీటిలో ఉన్నట్లు వివరించింది. * టీవీఎస్ గ్రూప్‌కు చెందిన టీవీఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్(టీవీఎస్ ఏఎస్ఎల్) సంస్థ 3 స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టింది. కంపెనీ డిజిటల్ ప్రయత్నాల్లో భాగంగా ఈ స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేశామని టీవీఎస్ ఏఎస్ఎల్ వివరించింది. * ఫోన్ డెరైక్టరీ యాప్, ట్రూకాలర్‌లో మైనారిటీ వాటాను వొడాఫోన్ గ్లోబల్ కంపెనీ మాజీ సీఈఓ అరుణ్ శరీన్ కొనుగోలు చేశారు. ఎంత వాటాను, ఎంతకు కొనుగోలు చేసింది తదితర వివరాలు వెల్లడికాలేదు. * స్టార్టప్‌ల్లో రతన్ టాటా పెట్టుబడుల జోరు పెరుగుతోంది. తాజాగా ఆయన ఈ-టికెటింగ్ కంపెనీ క్యజూంగలో పెట్టుబడులు పెట్టారు. * బీఎల్ఏ పవర్లో 15.23 శాతం వాటాను ప్రిజమ్ సిమెంట్ రూ.21 కోట్లకు కొనుగోలు చేసింది. -
స్థిరాస్తికి ఈక్విటీ జోష్!
♦ ఈ ఏడాది 3 నెలల్లో 420.45 మిలియన్ డాలర్ల పెట్టుబడులు ♦ వంద శాతం ఎఫ్‌డీఐ, రీట్స్, రేరా బిల్లులతో మరింత జోష్ ♦ వీసీ సర్కిల్ నివేదికలో వెల్లడి.. ♦ హైదరాబాద్ ప్రాజెక్ట్‌ల్లోనూ ఈక్విటీ నిధులు గతంలో స్థిరాస్తి రంగమంటే.. సరైన అమ్మకాల్లేక.. విదేశీ పెట్టుబడులూ రాక.. రుణాల మంజూరులో కనికరించని బ్యాంకులతో.. అరకొర నిధులతో కునారిల్లే రంగం! కానీ, ఇప్పుడో.. ప్రైవేట్ ఈక్విటీలు, డెబిట్ వెంచర్లకు తోడుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) వంటి సరికొత్త పెట్టుబడులతో భారీగా నిధుల ప్రవాహం పారే అతిపెద్ద రంగం!! .. ఇది అక్షరాల నిజం. ఎందుకంటే ఈ ఏడాది (జనవరి-మార్చి) తొలి మూడు నెలల్లోనే భారత స్థిరాస్తి రంగంలోకి 420.45 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి మరి. అయితే గతేడాదితో పోలిస్తే ఇది తక్కువే. ఎందుకంటే ఇదే మూడు నెలల్లో గతేడాది 520 మిలియన్ డాలర్లు నిధులొచ్చాయని వీసీ సర్కిల్ నివేదిక చెబుతుంది. 2011 నుంచి 2016 మార్చి నాటికి మొత్తం 42 ఒప్పందాల ద్వారా 3,635.24 మిలియన్ డాలర్ల నిధులొచ్చాయని వివరించింది. మరిన్ని వివరాలివిగో.. ఇప్పటివరకు దేశ స్థిరాస్తి రంగంలో ప్రైవేట్ ఈక్విటీలు, ఎఫ్‌డీఐ పెట్టుబడులు పెట్టాలంటే అడ్డగోలు నిబంధనలు మోకాలడ్డేవి. వాణిజ్య సముదాయాల్లో అయితే మరీను. కానీ, తాజాగా కేంద్రం స్థిరాస్తి రంగంలోకి వంద శాతం ఎఫ్‌డీఐలకు పచ్చజెండా ఊపడంతో పాటూ రీట్స్ రూపంలో మరో పెట్టుబడి పథకాన్ని తీసుకొచ్చింది. ఆయా పెట్టుబడుల్లో పారదర్శకత, అడ్డగోలు మోసాలకు కళ్లెం వేసేందుకు స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లుకూ ఆమోదముద్ర వేసింది. దీంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడుల్లో పారదర్శకతతో పాటు జవాబుదారీతనమూ పెరుగుతుందని నిపుణులంటున్నారు. దీంతో ఇన్నాళ్లు పెట్టుబడులకు దూరంగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు వాణిజ్య, నివాస సముదాయాలు రెండింట్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశముందని చెబుతున్నారు. ♦ విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టాయంటే.. ఆయా సంస్థలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించినట్లే. భవన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాల్ని పాటించే బిల్డర్లకే, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వారికే ఈ అవకాశమొస్తుందని నిపుణులంటున్నారు. యూఎస్, యూకే తదితర అభివృద్ధి మార్కెట్లలో గిట్టుబాటయ్యే వడ్డీ తక్కువే. ఈ కారణంగానే ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్ల తమ పెట్టుబడులను మన దేశ స్థిరాస్తి రంగం వైపు మళ్లిస్తున్నారనేది వారి అభిప్రాయం. అయితే స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రేరా) ప్రకారం.. 70 శాతం అమ్మకాలు నిర్మాణ వ్యయానికి, మిగిలిన 30 శాతం ఈక్విటీ లేదా రుణాలను భూసేకరణ కోసం లేదా ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు వినియోగించుకునే వీలుంటుంది. అయితే ఆయా పెట్టుబడులకు గాను సుమారు 25 శాతం ధరను నిర్ణయిస్తారు ఈక్విటీ ఇన్వెస్టర్లు. నిధులు సమీకరించిన సంస్థల్లో కొన్ని.. ♦ కొటక్ మహేంద్రా గ్రూప్‌కు చెందిన కొటక్ రియల్టీ ఫండ్ నివాస సముదాయాల విభాగంలో ఇటీవల 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,600 కోట్లు) నిధులను సమీకరించింది. ఈ పెట్టుబడులను అందుబాటు గృహాల నిర్మాణం కోసం వినియోగిస్తామని కొటక్ రియల్టీ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వికాస్ చీమకుర్తి చెప్పారు. ♦ ఆస్క్ ఇండియా రియల్ ఎస్టేట్ స్పెషల్ ఆపర్చునీటీస్ ఫండ్ మొత్తం 200 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఇందులో ఈ ఏడాదికి గాను 146 మిలియన్ డాలర్లను ఇప్పటికే పొందింది కూడా. ఈ పెట్టుబడులతో ముంబై, పుణె, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ఆరు నగరాల్లో నివాస సముదాయాల ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు వినియోగిస్తామని ప్రకటించింది. ♦ హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), బీమా సంస్థల నుంచి మైల్స్టోన్ క్యాపిటల్ మొత్తం 500 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. ఈ ఏడాది జనవరిలో ఇప్పటికే రూ.150 కోట్లు సమీకరించింది. మిగిలిన మొత్తాన్ని మరో ఆరు నెలల్లో సమీకరిస్తామని ప్రకటించింది. భాగ్యనగరం తక్కువేం కాదు! ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లను సమీకరించడంలో హైదరాబాద్ నిర్మాణ సంస్థలూ తక్కువేం కాదు. భాగ్యనగరం ప్రత్యేకతలు, ఇక్కడి స్థిరాస్తి ధరల గురించి తెలిసిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఇన్వెస్టర్లు స్థానిక డెవలపర్లు చేపట్టే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నార్సింగి, మణికొండ, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్ట్‌లపై దృష్టిసారిస్తున్నారు. ♦ నగరానికి చెందిన మంజీరా కన్స్ట్రక్షన్స్, జనప్రియ ఇంజినీర్స్ సిండికేట్, అపర్ణా, సాకేత్ గ్రూప్ తదితర సంస్థలు ఇప్పటికే విదేశీ సంస్థల పెట్టుబడులను ఆకర్షించిన జాబితాలో ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రాజెక్ట్‌లు పూర్తికాగా, మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. తాజాగా పిరామిల్ ఫండ్ సంస్థ ఆదిత్యా కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ఓ హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టింది. ఇంకా పలు సంస్థలు, నగరానికి చెందిన స్థానిక డెవలపర్లతో కలిసి గేటెడ్ కమ్యూనిటీలు, ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ♦ మంజీరా గ్రూప్‌లో లండన్‌కు చెందిన ట్రినిటీ క్యాపిటల్ పెట్టుబడుల్ని పెట్టింది. దీంతో కేపీహెచ్‌బీ కాలనీలో మూడు ప్రాజెక్టుల్ని చేసిందీ సంస్థ. మోర్గాన్ స్టాన్లీతో కలసి అపర్ణా గ్రూప్ నల్లగండ్లలో అపర్ణా సరోవర్ ప్రాజెక్టును చేపట్టింది. ♦ అమెస్టర్ డ్యామ్‌కు చెందిన యాత్రా క్యాపిటల్.. సాకేత్ ఇంజినీర్స్‌లో ఏడు మిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టింది. ఇది సుమారు రూ. 40 కోట్లతో సమానం. ♦ రాజమండ్రిలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 50 ఎకరాల్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో ప్రైవేట్ ఈక్విటీ రూపంలో రూ. 25 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా సమీకరించింది. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
బయో స్టార్టప్ లకు ఈక్విటీ నిధులు
♦ బయో ఏషియా సదస్సులో ♦ బైరాక్ ఎండీ రేణు స్వరూప్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బయో టెక్నాలజీలో స్టార్టప్ కంపెనీలను ఈక్విటీ నిధులను సమకూర్చనున్నట్లు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్ (బైరాక్) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనే కనీసం రూ.200 కోట్లతో కార్పస్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు బైరాక్ మేనేజింగ్ డెరైక్టర్ రేణు స్వరూప్ తెలిపారు. మంగళవారం బయో ఏషియా సీఈవో కాన్క్లేవ్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ రంగంలో స్టార్టప్‌లకు గ్రాంట్ల కింద గత ఐదేళ్లలో రూ. 600 కోట్ల వరకు నిధులను సమకూర్చామని, రెండో దశలో ఇక నుంచి ఈక్విటీ నిధులను సమకూర్చనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు బయోటెక్నాలజీలో 150 కంపెనీల స్టార్టప్‌లకు ఆర్థిక సహాయాన్ని అందించామని వీటి నుంచి 25 కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చినట్లు స్వరూప్ తెలిపారు. ఆర్థిక సహాయం అందుకున్న కంపెనీల్లో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల కంపెనీలే కావడం గమనార్హం. ప్రస్తుతం 5 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ బయోటెక్నాలజీ రంగం ప్రభుత్వం సహకారం అందిస్తే 2025 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకునే సామర్థ్యం ఉందన్నారు. అనుమతులు త్వరితగతిన లభించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తే ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం బయోటెక్నాలజీ పరిశ్రమ నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని, దీనిని భర్తీ చేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీలో ఐఎస్బీ తరహాలో 100 ఎకరాల్లో ఫార్మా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. ఇందుకు ఫార్మా కంపెనీల సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలిపారు. -
దేన్లోనైతే ‘ఫండు’తుంది?
- ఇన్కమ్ ఫండ్స్‌తో స్థిర ఆదాయం - ఈక్విటీ ఫండ్స్‌లో రిస్కూ, రాబడి.. రెండూ ఎక్కువే - బ్యాలెన్స్డ్ ఫండ్స్‌తో భరోసా (సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) ప్రతి వ్యక్తికీకొన్ని ఆర్థిక లక్ష్యాలుంటాయి. అయినా బాగా డబ్బు సంపాదించాలని, అన్నీ సమకూర్చుకోవాలని ఉండనిదెవరికి చెప్పండి!? అందుకే చక్కని రాబడి కోసం పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడులన్నిటి వెనకా బలమైన అవసరం ఉంటుంది. ఇక మ్యూచ్‌వల్ ఫండ్స్ విషయానికొస్తే ఈ అవసరాలకు అనుగుణంగానే కాకుండా... పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి రకరకాల పథకాలను తెస్తున్నాయి. కాకపోతే వీటిలో ఇన్వెస్ట్ చేసే వారు రిస్క్ కూడా భరించాల్సి ఉంటుంది. సరే! రిస్క్ భరిస్తాం కానీ, ఏ ఫండైతే బెటర్ అంటారా...! ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఫండ్స్‌పై కొంత అవగాహన ఉండాలి. అందుకే... ఎలాంటి ఫండ్స్ ఉంటాయి? ఏవి ఎవరికి అనువుగా ఉంటాయి? అనేది తెలియజేసేదే ఈ కథనం... కాలం, ఇన్వెస్ట్మెంట్ విధానం వంటివి పరిగణనలోకి తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మూడు రకాలు. వాటిలో మొదటివి ఓపెన్ ఎండెడ్ కాగా రెండోవి క్లోజ్డ్ ఎండెడ్. ఇక మూడోవి ఇంటర్వల్ స్కీమ్స్. 1. ఓపెన్-ఎండెడ్ స్కీమ్స్ అంటే ఈ పథకాల్లో ఎప్పుడైనా చేరొచ్చు. ఎప్పుడైనా నిష్ర్కమించవచ్చు. ఇవి ఎప్పుడూ ఇన్వెస్ట్మెంట్లకు ఆహ్వానం పలుకుతూనే ఉంటాయన్న మాట. నిజానికి మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్‌దే అధిక వాటా. ఇవి మన అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైనా కొనటం, ఎప్పుడైనా విక్రయించటం చేయగలిగే ఈ రకం ఫండ్స్ ముఖ్య లక్ష్యం... అధిక లిక్విడిటీయే. 2. క్లోజ్డ్-ఎండెడ్ స్కీమ్స్ ఇవి ఓపెన్ ఎండెడ్ వంటివి కాదు. ఈ ఫండ్స్‌లో ఎప్పుడు పడితే అప్పుడు చేరలేం. బయటకు రాలేం. వీటికొక నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. వీటిని న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) సమయంలో మాత్రమే కొనగలం. ఒక మ్యూచువల్ ఫండ్ ఏవైనా కొత్త పథకాన్ని ప్రకటించినప్పుడు ముందుగా ఎన్‌ఎఫ్‌ఓకు వస్తుంది. అప్పుడే మనం ఆ ఫండ్స్‌ను కొనడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఇది ముగిస్తే.. తర్వాత కొనడానికి ఆస్కారం లేదు. మళ్లీ ఎన్ఎఫ్ఓ వచ్చే వరకు ఆగాల్సిందే. 3. ఇంటర్వల్ స్కీమ్స్ ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్... రెండింటి లక్షణాలూ ఈ ఇంటర్వెల్ స్కీమ్స్‌లో ఉన్నాయి. ఈ ఫండ్స్ యూనిట్లను నిర్ణయించిన వ్యవ ధిలో సంబంధిత ఎన్ఏవీ ధ ర వద్ద కొనుగోలు చేయవచ్చు లేదా స్టాక్ మార్కెట్లోనో, బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడి, రాబడి, రిస్క్ తదితర అంశాల పరంగా మ్యూచువల్ ఫండ్స్ 4 రకాలు 1. గ్రోత్/ ఈక్విటీ స్కీమ్స్: మనం పెట్టిన పెట్టుబడిని పెంచటమే లక్ష్యంగా పనిచేసేవి ఈక్విటీ ఫండ్స్. ఈ ఫండ్స్ మన పెట్టుబడులను ఎక్కువగా ఈక్విటీ మార్కెట్లో పెడతాయి. ఈ స్కీమ్స్‌లో డివిడెండ్, మూలధన పెరుగుదల తదితర ఆప్షన్స్ ఉం టాయి. ఇన్వెస్టర్లు వారికి నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఫండ్స్ ఎంచుకున్న వారు అధిక రిస్క్‌కు సిద్ధపడాలి. ఎందుకంటే స్టాక్‌మార్కెట్లు స్థిరంగా ఉండవు కదా!! దీర్ఘకాలంలో ప్రయోజనాలను ఆశించి, ఇన్వెస్ట్ చేసే వారికి ఈ గ్రోత్/ఈక్విటీ స్కీమ్స్ అనువైనవి. 2. ఇన్కమ్/డెట్ స్కీమ్స్ ఈ ఫండ్స్ నిరంతర, స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఇవి మన డబ్బుల్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అయి న బాండ్లు, కార్పొరేట్ డి బెంచర్లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తదితర వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే వీటిలో రిస్క్ తక్కువ. కాకపోతే మన పెట్టుబడి పెరగటానికి ఉన్న అవకాశాలూ పరిమితమే. ఈ ఫండ్స్‌కు వడ్డీ రేట్ల హెచ్చుతగ్గుల వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసే వారికి ఇలాంటి వాటి వల్ల ఎలాంటి భయం అవసరం లేదు. నిరంతర, స్థిర ఆదాయాన్ని కోరుకునే వారు ఈ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. 3. బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఒకవంక నిరంతర ఆదాయంతోపాటు మరోవంక మూలధన పెరుగుదలనూ అందించే ఫండ్స్ ఇవి. ఈ ఫండ్స్ మన డబ్బును కొంత ఈక్విటీ మార్కెట్లలోను, కొంత ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లోను ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక మోస్తరు ఆదాయ వృద్ధిని కోరుకునే వారు ఈ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. రిస్క్ పరిమితం. 4. మనీ మార్కెట్/లిక్విడ్ స్కీమ్స్ ఇవి కూడా ఇన్కమ్ ఫండ్స్ లాంటివే. మన డబ్బుల్ని ఇవి ట్రెజరీ బిల్స్, డిపాజిట్ పత్రాలు, వాణిజ్య పత్రాలు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తదితర సాధానాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిలో రిస్క్ తక్కువ. తక్కువ కాలంలో బ్యాంకు వడ్డీతో పోలిస్తే కాస్త అధిక వడ్డీని ఆశించే వారికి, కార్పొరేట్, సాధారణ ఇన్వెస్టర్లకు ఇవి అనువుగా ఉంటాయి. -
అన్నీ ఒకేసారి కుదరవు..!
ప్రాధాన్యాన్ని బట్టి ఒక్కొక్కటీ సాధించొచ్చు ♦ మొదటి నుంచీ ‘సిప్’ చేయటమే ఉత్తమం ♦ ఇదీ... రవికుమార్‌కు అనిల్రెగో సూచన మీరు ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలు, ప్రాధాన్యాలు బాగున్నాయి. పెట్టుబడి సాధనాల్లో మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను వృద్ధి చేసుకుంటూ మీ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. మీరిచ్చిన సమాచారం ఆధారంగా, మీ లక్ష్యాల్లో ఎప్పటికి ఎంత మొత్తం అవసరమవుతుందో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుత ధరలను బట్టి, మీరు మధ్యస్థాయి రిస్క్ చేయగలరన్న నమ్మకంతో లెక్కించడం జరిగింది. ఇలా చేద్దాం... ప్రస్తుతం మీ ఆదాయాన్ని బట్టి లక్ష్యాలన్నింటికీ ఒకేసారి కేటాయించడం కుదిరే పని కాదు. కాబట్టి మీ ప్రాధాన్యాలను బట్టి లక్ష్యాలను నిర్దేశించుకొని దాని ప్రకారం ఒక్కొక్కటీ నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ లక్ష్యాలను పరిశీలిస్తే కారు కొనుక్కోవడం అనేది స్వల్పకాలిక లక్ష్యంగాను, సొంతిల్లు సమకూర్చుకోవడం అనేది మధ్యకాలిక లక్ష్యంగా, పదవీ విరమణ అనేది దీర్ఘకాలిక లక్ష్యంగా విభజించొచ్చు. ఈ స్వల్పకాలిక లక్ష్యం చేరుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. దీనికంటే ముందు ఆఫీసులో కారు లోన్ ఆప్షన్ ఉందేమో తెలుసుకోండి. దీనివల్ల మీరు ఈఎంఐలో కారులోన్ తీర్చే అవకాశం ఉండటంతో పాటు, ఇది పెర్క్ కిందకు వస్తుంది కాబట్టి ఎటువంటి పన్ను భారం ఉండదు. ఇక మధ్యస్థాయి, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి డెట్, ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఇంటిని రుణం మీద కొనుగోలు చేయండి. ఇంటి విలువ రూ.40 లక్షలు అనుకుంటే ఇందులో 20 శాతం డౌన్ పేమెంట్ అంటే రూ.8 లక్షలు సమకూర్చుకోవాలి. దీనికి ఇప్పుడున్న డబ్బుకు అదనంగా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మిగిలిన మొత్తం రూ. 32 లక్షలకు రుణం తీసుకుంటే 20 ఏళ్లపాటు ఈఎంఐ కింద ప్రతి నెలా రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు మీ పొదుపుపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం మీరు ప్రతి నెలా రూ. 20,000 పొదుపు చేయగలమన్నారు. ఈ మొత్తాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర సేవింగ్స్ ఖాతాలో ఉన్న రెండు లక్షల్లో రూ.60,000 అత్యవసర నిధి కింద ఉంచి, మిగిలిన మొత్తాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కింద ఈక్విటీ ఫండ్స్‌లోకి మార్చుకోండి. ఈ విధానం అమలు చేయడం ద్వారా త్వరితగతిన మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలరు. ఇవన్నీ ప్రస్తుత ధరలను బట్టి లెక్కించడం జరిగింది. ప్రస్తుత ఖర్చుల్ని బట్టి నెలకు రూ. 10,000 చొప్పున పెన్షన్ లెక్కించాను. కానీ ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకుంటే ఇంకా పెద్ద మొత్తం అవసరమవుతుంది. ఇక ఇంటి నిర్మాణానికి వస్తే ఇంటి విలువలో 20 శాతం డౌన్‌పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి నెలా ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నా పేరు రవి కుమార్(30). నెల జీతం రూ.30,000. ఇంకా పెళ్లి కాలేదు కనక కుటుంబ బాధ్యతలేవీ లేవు. ప్రతి నెలా ఖర్చులు రూ.10,000 పోగా మిగిలిన మొత్తం రూ. 20,000 దాచుకోగలను. కానీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎలాంటి అవగాహనా లేకపోవడంతో ఈ మొత్తం సేవింగ్స్ ఖాతాలోనే ఉంటున్నాయి. ఇలా నా సేవింగ్స్ ఖాతాలో ఇపుడు రూ.2 లక్షల వరకూ ఉన్నాయి. నా ఆర్థిక లక్ష్యాల విషయానికొస్తే 35 ఏళ్లు వచ్చే నాటికి సొంతిల్లు సమకూర్చుకోవడం... రెండేళ్లలో రూ.10 లక్షలు పెట్టి కారు కొనుక్కోవడంతో పాటు రిటైర్మెంట్కు తగిన నిధిని సమకూర్చుకోవడం. దీనికి ఏం చేయాలి? ఇవి సాధ్యమవుతాయా? - రవి, హైదరాబాద్. -
లక్ష్యానికి తగ్గట్లే పెట్టుబడులు
పదవీ విరమణ చేసిన ఆ జంటకు పెట్టుబడులపై మంచి అవగాహనే ఉంది. బాగానే ఇన్వెస్ట్ కూడా చేశారు. చాలామటుకు డబ్బును ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టారు. వారికి బోలెడు ఆర్థిక అవసరాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రోజువారీ ఇంటి ఖర్చులను సమకూర్చుకోవడం మొదటిది. అనుకోని పరిస్థితి ఏదైనా తలెత్తితే ఆదుకునే అత్యవసర నిధి రెండోది. రాబోయే రెండు, మూడేళ్లలో కుటుంబపరంగా తలెత్తబోయే భారీ ఖర్చులను తట్టుకునేందుకు తగినంత నిధి సమకూర్చుకోవడం మూడోది. ఇక, చిట్టచివరిగా .. నాలుగోది.. భవిష్యత్‌లో ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిశ్చింతగా జీవితం గడిపేందుకు జాగ్రత్తపడటం. నిజానికి చాలా మందితో పోలిస్తే ఆ వృద్ధ జంట ఆర్థిక అవసరాలు అసాధారణమైనవేమీ కావు. ఇందుకోసం వారు ఎంచుకున్న ఫండ్స్ సరైనవే అయినప్పటికీ.. తాము సరైన దారిలోనే వెడుతున్నామా లేదా అన్నది వారి సందేహం. ఇందులో వారి తప్పేమీ లేదు. ఈ సమస్య వారొక్కరిదే కాదు. ఏదైనా సాధనంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికంటూ ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోతే ఇలాంటి సందేహాలు, గందరగోళ పరిస్థితులే తలెత్తుతాయి. ఇందుకోసం ముందుగా మన అవసరాన్ని (లక్ష్యాన్ని) గుర్తెరగాలి. అది స్వల్పకాలికమా, మధ్య కాలికమా, దీర్ఘకాలికమా అన్నది చూసుకోవాలి. అప్పుడే సరైన సాధనాన్ని ఎంచుకోవడం వీలవుతుంది. అనేకానేక పెట్టుబడి సాధనాలు లేని కాలంలో అమ్మలు ఇంటి ఖర్చుల కోసం ఒక డిబ్బీ, పొదుపు కోసం ఒక డిబ్బీ, పిల్లల ఖర్చులు మొదలైన వాటి కోసం మరొకటి ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో దానిలో డబ్బులు ఉంచేవారు. ఇప్పటివారికి ఇది పాత చింతకాయ పచ్చడిలాంటిది అనిపించినా కూడా ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఈ సూత్రం ఇప్పుడు కూడా వర్తించేదే. డబ్బంతా కూడా ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేసేయకూడదు. అవసరాన్ని బట్టి, వ్యవధిని బట్టి తగిన సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. మధ్య మధ్యలో పోర్ట్‌ఫోలియోలో తగు మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన అవసరాలకు అనుగుణమైన ఫలితాలను సదరు సాధనం నుంచి అందుకోవడం సాధ్యపడుతుంది. హర్షేందు బిందాల్ ప్రెసిడెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్స్ (ఇండియా) -
మ్యూచువల్ ఫండ్లలోకి 12,300 కోట్లు
వరుసగా 14 నెలల పాటు పెట్టుబడుల జోరు ముంబై : దేశీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో గత నెల భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. ఏకంగా రూ. 12,300 కోట్ల (సుమారు 1.92 బిలియన్ డాలర్లు) నిధులు వెల్లువెత్తాయి. 2008 జనవరి తర్వాత ఫండ్స్‌లో ఈ స్థాయిలో నిధులు రావడం ఇది రెండోసారి. ఇక, వరుసగా 14 నెలల పాటు (2014 మే-2015 జూన్) పెట్టుబడులు వస్తూనే ఉండటం ఇదే తొలిసారి. ఈక్విటీ రీసెర్చ్ ఏషియా నివేదికలో డాయిష్ బ్యాంక్ ఈ విషయాలు తెలిపింది. పెద్ద యెత్తున నిధులు రావడం, విలువలు పెరగడం వంటి పరిణామాల కారణంగా జూన్‌లో ఈక్విటీ ఫండ్స్, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో రూ. 3,72,300 కోట్లకు చేరిందని వివరించింది. మరోవైపు, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రిటైల్ ఇన్వెస్టర్ల ఊతంతో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు .. ఈక్విటీ ఫండ్స్‌లో రూ. 33,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఈక్విటీ ఫండ్స్‌లో రూ. 70,000 కోట్లు మాత్రమే రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఒక్క త్రైమాసికంలోనే అందులో దాదాపు సగభాగం మేర పెట్టుబడులు రావడం గమనార్హం. -
ఈఎల్‌ఎస్‌ఎస్‌లపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుందా?
మూడేళ్ల నుంచి కొన్ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటిల్లోనే ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా? ఈ ఈఎల్ఎస్ఎస్ల నుంచి వైదొలగి వేరే స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయమంటారా? తగిన సూచనలివ్వండి. - కృష్ణ తేజ, గుంటూరు మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌లు మంచి రాబడులు ఇస్తున్న పక్షంలో వీటి నుంచి వైదొలగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అదనపు సొమ్ములుంటే వాటిని కూడా ఈఎల్ఎస్ఎస్ల్లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ఆదా ప్రయోజనాలు పొందవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత ఇన్వెస్ట్ చేశాను. ఏడాది కాలంలో ఒక ఈక్విటీ ఫండ్ నుంచి మరో ఈక్విటీ ఫండ్‌కు యూనిట్లను బదిలీ చేశాను. మరికొన్ని సార్లు ఈక్విటీ ఫండ్ నుంచి లిక్విడ్ ఫండ్‌కు బదిలీ చేశాను. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను బదిలీ మాత్రమే చేశాను. కానీ, వాటిని విక్రయించలేదు. అందుకని నాకు ఎలాంటి సొమ్ములు రాలేదు. యూనిట్లను బదిలీ చేసినందుకు నేను ఏమైనా పన్ను చెల్లించాల్సి ఉంటుందా? -ఖాలీ మస్తాన్ వలీ, తిరుపతి ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేస్తే, పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ బదిలీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా జరిగినా, లేదా మరో విధంగా జరిగినా సరే. ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి యూనిట్లను ఉపసంహరించుకొని, మరో కొత్త మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడంగా యూనిట్ల బదిలీని పరిగణిస్తారు. మీరు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌కు యూనిట్లను ఏడాది కాలంలో బదిలీ చేస్తే, మీరు పొందే లాభాలపై 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ యూనిట్ల బదిలీ ఏడాది తర్వాత జరిగితే మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఒక లిక్విడ్ ఫండ్ యూనిట్లను మూడేళ్లలోపు వేరే మ్యూచువల్ ఫండ్‌కు బదిలీ చేస్తే మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో మీరు పొందే లాభాలను మీ మొత్తం ఆదాయానికి జత చేసి మీ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి పన్ను లెక్కిస్తారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులు ఎక్స్పెన్స్ రేషియోను కూడా పరిగణనలోకి తీసుకునే వెల్లడిస్తారా? ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)పై వచ్చే వడ్డీ పన్ను రహితమేనా? లేకుంటే ఏమైనా పన్నులు చెల్లించాలా? -సింధూరి, విశాఖపట్టణం మ్యూచువల్ ఫండ్ వార్షిక వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే వాటి రాబడులను వెల్లడిస్తారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి రెండు రకాలైన చార్జీలను వసూలు చేస్తాయి. మొదటిది ఎక్స్పెన్స్ రేషియా. అంటే ఫండ్ నిర్వహణ, యాజమాన్య వ్యయాలు. ఒక మ్యూచువల్ ఫండ్ రాబడుల నుంచి ఈ వ్యయాలను తీసివేసిన తర్వాత ఎన్ఏవీని నిర్ణయిస్తారు. ఈక్విటీ ఫండ్స్‌కు ఈ ఎక్స్పెన్స్ రేషియో సాధారణంగా 2.5 శాతం నుంచి 3 శాతంగా ఉంటుంది. దీనిని వార్షిక ప్రాతిపదికన ప్రతీ ఏడాది వసూలు చేస్తారు. ఇక మ్యూచువల్ ఫండ్ సంస్థలు వసూలు చేసే రెండో వ్యయం ఎగ్జిట్ లోడ్...ఇది ఒక్కసారి చెల్లించే చార్జీ. మ్యూచువల్ ఫండ్ నుంచి ఇన్వెస్టర్ వైదొలిగితే, (ఒక నిర్దేశిత కాలంలో) ఈ ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్‌కు వర్తించదు. ఒకవేళ ఈ చార్జీ వసూలు చేస్తే, ఈ మేరకు మీకు మీ రాబడుల్లో కోత పడుతుంది. ఇక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్‌పై మీకు ఎలాంటి వడ్డీ రాదు. వాటిని ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. మీరు ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు డివిడెండ్స్ వస్తాయి. మార్కెట్ పరిస్థితులను, ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్లను బట్టి, ఆ స్టాక్స్‌లో మ్యూచువల్ ఫండ్ సంస్థ స్వీకరించిన లాభాలను బట్టి ఈ డివిడెండ్లు వస్తాయి. ఈఎల్ఎస్ఎస్ల నుంచి వచ్చే డివిడెండ్లపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మూడేళ్ల నుంచి ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్‌లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. మంచి రాబడులే పొందాను. అయితే ఇటీవల ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా? -సురేందర్, వరంగల్ ఏడాది కాలంలో ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్ 57 శాతం రాబడిని అందించింది. ఇలాంటి తరుణంలో ఈ ఫండ్ నుంచి వైదొలగాల్సిన అవసరం లేదు. ఈ ఫండ్ ఐదేళ్ల ట్రాక్ రికార్డ్‌ను పరిగణనలోకి తీసుకున్నా మంచి పనితీరునే కనబరిచింది. మా రేటింగ్స్ ప్రకారం ఇది ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్. ఇటీవలి పనితీరు ఆధారంగా ఈ ఫండ్ నుంచి వైదొలగాలనుకోవడం సమంజసం కాదు. మిడ్, స్మాల్-క్యాప్ కేటగిరీకి చెందిన ఫండ్స్‌లో ఇది ముఖ్యమైన ఫండ్ అని చెప్పవచ్చు. -
ఈక్విటీ ఫండ్స్ జోరు..
3 నెలల్లో 33కి పైగా ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆదాయపు పన్ను మినహాయింపుల్ని గతేడాది పెంచటం వల్ల సామాన్యుల జేబుల్లో డబ్బులు గలగలలాడుతున్నాయో ఏమో!! పొదుపు మొత్తాలు మాత్రం పెరుగుతున్నాయి. అందుకే దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి కొత్త పథకాలు దూసుకొస్తున్నాయి. ఏడాదిన్నర కాలంగా స్టాక్ సూచీలు ఆకర్షణీయమైన లాభాలను అందిస్తూ, సూచీలు నూతన గరిష్ట స్థాయిలను నమోదు చేస్తుండటంతో మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా గత మూడు నెలల కాలంలో 33కి పైగా ఈక్విటీ పథకాలు ఇన్వెస్టర్ల ముందుకు రావడమే కాకుండా, ప్రస్తుతం 12కు పైగా ఈక్విటీ పథకాల ఇష్యూలు నడుస్తున్నాయి. దీంతో దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కొత్త నిధుల ప్రవాహంతో కళకళలాడుతోంది. కేవలం ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోల ద్వారానే రూ.5,652 కోట్లు సమీకరించాయి. డెట్ పథకాలను కూడా కలుపుకుంటే ఈ మూడు నెలల కాలంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఎన్‌ఎఫ్‌వోల ద్వారా రూ.11,654 కోట్లు సమీకరించాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోందని, దీంతో కొత్త పథకాల విడుదలపై దృష్టి సారిస్తున్నామని ఫండ్ మేనేజర్లు చెబుతున్నారు. ఇది రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. క్లోజ్డ్ ఎండెడ్ పథకాలే ఎక్కువ... మ్యూచువల్ ఫండ్ సంస్థలు క్లోజ్డ్ ఎండెడ్ పథకాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ఈ మూడు నెలల్లో ప్రవేశపెట్టిన 33 పథకాల్లో 26 పథకాలు క్లోజ్డ్ ఎండెడ్ కావటమే దీనికి నిదర్శనం. అలాగే ప్రస్తుతం నడుస్తున్న ఇష్యూల్లో 5 ఎన్‌ఎఫ్‌వోలు ఓపెన్ ఎండెడ్ అయితే, 8 క్లోజ్డ్ ఎండెడ్ పథకాలున్నాయి. దేశ ఆర్థిక వృద్ధిరేటును దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలంలో రాబడిని ఇచ్చే ఇండియా గ్రోత్ స్టోరీ, ఇండియా ఆపర్చునిటీస్ పేరుతో పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వీటి తర్వాతి స్థానంలో ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ర్యాలీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగానికి చెందిన ఫండ్స్ ఉన్నాయి. ప్రధాన ఇండెక్స్ షేర్ల కంటే స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు బాగా పెరుగుతుండటంతో ఫండ్స్ కూడా ఈ పథకాలపైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఏడాది కాలంలో సెన్సెక్స్ కేవలం 38 శాతం లాభాలను అందిస్తే ఇదే సమయంలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 75 శాతం లాభాలను అందించింది. కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలు అయితే గడిచిన ఏడాది కాలంలో 100 నుంచి 132 శాతం వరకు లాభాలను అందించడం విశేషం. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. భారీగా పెరిగిన ఫండ్ ఆస్తులు.... గడిచిన ఏడాది కాలంలో మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువలో భారీ వృద్ధి నమోదయింది. గతేడాది ఫిబ్రవరిలో రూ.9.16 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఆస్తుల విలువ(ఏయూఎం), ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.12.02 లక్షల కోట్లకు ఎగబకాయి. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో నికరంగా ఇప్పటి వరకు రూ. 2.13 లక్షల కోట్ల నిధులు వచ్చినట్లు మ్యూచ్‌వల్ ఫండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (యాంఫీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి ఫండ్స్‌లోకి నికరంగా రూ.1.63 లక్షల కోట్ల నిధులు వచ్చాయి. ఈక్విటీల్లోకి నిధుల ప్రవాహం పెరిగి డెట్, ఇతర ఫండ్స్ నుంచి నిధులు బయటకు వెళుతున్నట్లు ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. మార్చి, 2014 నాటికి మొత్తం ఆస్తుల విలువలో ఈక్విటీ ఫండ్స్ వాటా 22 శాతంగా ఉంటే జనవరి నాటికి ఇది 30 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో డెట్ పథకాల వాటా 52 శాతం నుంచి 45 శాతానికి పడిపోయింది. -
ఫండ్ డివిడెండులో పన్ను కోత ఉంటుందా?
నేను సుందరం గ్లోబల్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఇటీవలే ఈ ఫండ్ ఒక్కో యూనిట్‌కు రూ.1 డివిడెండ్‌ను ప్రకటించింది. ఆ ప్రకారం నాకు రూ.1,042 డివిడెండ్ లభించాలి. కానీ నాకు రూ.756.45 డివిడెండ్ మాత్రమే వచ్చింది. ఈ విషయమై సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థను సంప్రదించాను. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) పోగా మిగిలిన మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లించామని ఆ సంస్థ వెల్లడించింది. నేను చాలా సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాను. ఎలాంటి మినహాయింపులు లేకుండా పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు నాకు డివిడెండ్లు చెల్లించేవి. డీడీటీ కోత నాకు ఇదే మొదటిసారి. ఇప్పుడు నేను ఏం చేయాలి? - సాదిక్ ఆలీ, నిజామాబాద్ సుందరం గ్లోబల్ అడ్వాంటేజ్ ఫండ్ సంస్థ చేసినది సరైనదే. ఈక్విటీ యేతర మ్యూచువల్ ఫండ్లు డివిడెండ్లు చెల్లిస్తే, వీటిపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) తప్పనిసరి. అయితే ఈక్విటీ, బ్యాలెన్స్డ్ ఫండ్స్ డివిడెండ్లపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మీరు ఇన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకూ మీకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) పడలేదంటే మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉండి ఉండాలి. మొదటిసారిగా ఈక్విటీయేతర ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుంటారు. దీంతో డీడీటీ మీకు కొత్తగా అనిపిస్తుంది. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్ డీడీటీ మదింపు గత ఏడాది బడ్జెట్ నుంచి మారింది. గతంలో ఏదైనా సంస్థ రూ.100 డివిడెండ్‌ను ప్రకటిస్తే, రూ.128.3 డివిడెండ్ చెల్లింపుల కోసం కేటాయించేది. రూ.100 ఇన్వెస్టర్‌కు, రూ.28.3 పన్నులుగా చెల్లించేది. ఇలా కాకుండా స్థూల డివిడెండ్ మొత్తంపై డీడీటీని చెల్లించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీని ప్రకారం ఏదైనా డివిడెండ్ సంస్థ రూ.100 డివిడెండ్‌ను ప్రకటిస్తే, దానిపై 28.33 శాతం డీడీటీని ప్రభుత్వానికి, మిగిలిన దానిని ఇన్వెస్టర్‌కు మ్యూచువల్ ఫండ్ సంస్థలు చెల్లిస్తున్నాయి. నా వయస్సు 38 సంవత్సరాలు. వారం క్రితం ఈక్విటీ ఫండ్స్ నుంచి పెద్ద మొత్తమే రిడీమ్ చేశాను. మరో మూడు నెలల తర్వాత కానీ వీటి అవసరం నాకు ఉండదు. అప్పటి వరకూ ఈ పెద్ద మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటారా? లేక డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏమైనా పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? అలా అయిన పక్షంలో కొన్ని ఉత్తమమైన డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి. నేను 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. - పవన్, సికింద్రాబాద్ కార్పొరేట్ బాండ్లు, గిల్ట్ల్లో స్వల్పకాలానికి ఇన్వెస్ట్ చేసే షార్ట్ టెర్మ్ డెట్ ఫండ్స్‌ను ఎంచుకోండి. పన్ను ప్రయోజనాల విషయానికొస్తే ఫిక్స్డ్ డిపాజిట్లకు, డెట్ ఫండ్స్‌కు తేడా ఏమీ లేదు. వీటిపై వచ్చే రాబడులను మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ శ్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. పన్ను విషయాల్లో కాకుండా కొన్ని విషయాల్లో డెట్ ఫండ్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లకంటే మెరుగైనవి. డెట్ ఫండ్స్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపసంహరించుకోవచ్చు. ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. అదే ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికొస్తే, వాటిని మధ్యలో ఉపసంహరించుకుంటే కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని డెట్ ఫండ్స్ 7.5 శాతం నుంచి 10 శాతం రేంజ్లో రాబడులు ఇస్తాయి. ఇక మీరు ఇన్వెస్ట్ చేయడానికి పరిశీలించదగ్గ కొన్ని షార్ట్ టెర్మ్ డెట్ ఫండ్స్- పీర్లెస్ షార్ట్‌టెర్మ్, సుందరం సెలెక్ట్ షార్ట్‌టెర్మ్ డెట్ అసెట్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా ఆల్ట్రా షార్ట్ టెర్మ్ బాండ్ ఫండ్, టారస్ ఆల్ట్రా షార్ట్ టెర్మ్ బాండ్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ ఇన్కమ్ ఫండ్లు. నేను ఇటీవలనే ఎస్బీఐ ఎఫ్ఎంసీజీ ఫండ్‌లో రూ.లక్ష వరకూ ఇన్వెస్ట్ చేశాను. ఇది మంచి నిర్ణయమేనా? -మేఘమాల, విజయవాడ ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, ఇతర రంగాలు ఏమంత మంచి పనితీరు కనబరచకపోయినప్పటికీ, ఎఫ్ఎంసీజీ రంగం మాత్రం మంచి వృద్ధినే సాధించింది. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో ఎంత మంచి రాబడి ఇస్తున్న మ్యూచువల్ ఫండ్‌లోనైనా ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. మరీ ముఖ్యంగా ఏదైనా ప్రత్యేక రంగానికి చెందిన ఫండ్ అయితే అది అసలు మంచి నిర్ణయమే కాదు. అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేది వివిధీకరణ ప్రయోజనాలు పొందడానికే. అందుకని మీ పెట్టుబడులను కనీసం మూడు విభిన్నమైన మ్యూచువల్ ఫండ్స్‌కు విస్తరించండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని(సిప్) అనుసరిస్తే మంచి ప్రయోజనాలు పొందగలరు. -
బుల్లిష్‌గానే మార్కెట్!
* వచ్చే ఆర్బీఐ పాలసీపై ఆశలు * ఈసీబీ సమావేశంవైపు చూపు * కార్పొరేట్ ఫలితాల ప్రభావం కూడా న్యూఢిల్లీ: ఈ వారం కూడా భారత్ స్టాక్ మార్కెట్ బుల్లిష్‌గానే వుండవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. రిజర్వుబ్యాంక్ అనూహ్యంగా రెపో రేటును తగ్గించడంతో గతవారం ఈక్విటీలు ర్యాలీ సాగించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి తొలివారంలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష వున్నందున, ఆ సమావేశంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మరిన్ని చర్యల్ని కేంద్ర బ్యాంక్ తీసుకోవొచ్చన్న అంచనాలతో రానున్న ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధకన్ చెప్పారు. అలాగే ఇటీవలి రేటు తగ్గింపు ప్రభావంతో వచ్చే కొద్దిరోజుల్లో వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు మరింత పెరుగుతాయని బ్రోకర్లు భావిస్తున్నారు. అయితే ఈ వారం వెల్లడికానున్న బ్లూచిప్ కంపెనీల ఫలితాలు సైతం ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నది అంచనా. హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, కెయిర్న్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్తాన్ జింక్ తదితర కార్పొరేట్లు ఈ వారం క్యూ3 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ కారణంగా స్వల్పకాలంలో నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని, కానీ మొత్తంమీద అప్‌ట్రెండ్ మాత్రం కొనసాగుతుందని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 663 పాయింట్ల పెరుగుదలతో 28,122 పాయింట్ల వద్ద ముగిసింది. 2014, అక్టోబర్ 31 తర్వాత ఒకేవారంలో ఇంత భారీ పెరుగుదల ఇదే ప్రథమం. అంతర్జాతీయంగా ఈ వారం జరగనున్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చు. ఈసీబీ ఒక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చన్న అంచనాలు గత కొద్దికాలంగా మార్కెట్లో కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐల నికర పెట్టుబడులు రూ. 244 కోట్లు... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 244 కోట్లు మాత్రమే నికరంగా పెట్టుబడి చేశారు. అయితే రుణ మార్కెట్లో మాత్రం వీరు జనవరి 1-16 తేదీల మధ్య భారీగా రూ. 11,300 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరిపారు. ద్రవ్యోల్బణం బాగా క్షీణించడంతో పాటు వడ్డీ రేటు తగ్గింపు అంచనాల కారణంగా ఎఫ్ఐఐలు రుణ పత్రాల్లో భారీ పెట్టుబడులు జరిపినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్విటీ ఫండ్స్‌లో పెరుగుతున్న ఖాతాలు... స్టాక్ మార్కెట్ ర్యాలీ ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-2015) ఏప్రిల్- డిసెంబర్ మధ్య తొమ్మిదినెలల కాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 12 లక్షల కొత్త ఖాతాలను ఆకర్షించాయి. దేశంలోని మొత్తం 45 మ్యూచువల్ ఫండ్ సంస్థల వద్ద ఈక్విటీ ఫోలియో ఖాతాల సంఖ్య గత నెలాఖరునాటికి 3,03,92,991కు పెరిగింది. 2014 మార్చి చివరినాటికి ఈ సంఖ్య 2,91,80,922. నాలుగేళ్ల తర్వాత 2014 ఏప్రిల్ నెలలో తొలిసారిగా ఖాతాల సంఖ్య పెరిగింది. అంతకుముందు 2009 మార్చి నుంచి ప్రతినెలా ఖాతాలు మూతపడుతూ వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రూ. 50,000 కోట్ల నికర పెట్టుబడుల్ని ఆకర్షించింది. -
పన్ను లేకుండా ఫండ్ మార్పు ఎలా..
నేను సిప్ విధానంలో ఒక ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. అందుకే వేరే ఈక్విటీ ఫండ్‌లోకి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మారుద్దామనుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ నుంచి పెట్టుబడులను ఒకేసారి ఉపసంహరించుకొని ఆ మొత్తాన్ని వేరే ఫండ్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయమంటారా? ఇలాచేస్తే ఏడాదిలోపు నేను సిప్ద్వారా ఇన్వెస్ట్ చేసిన మొత్తాలపై షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అలాకాకుండా ప్రస్తుత ఫండ్ నుంచి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ)ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని వేరే ఫండ్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? ఈ రెండింటిలో దేనిని ఎంచుకుంటే బావుంటుంది? - అరవిందరావు, హైదరాబాద్ ఈక్విటీ ఫండ్స్ పనితీరు స్వల్పకాలాన్ని పరిగణనలోకి తీసుకొని మదింపు చేయకూడదు. ఈక్విటీ ఫండ్ పనితీరును అంచనా వేయడానికి ఏడాది కాలం సరిపోదని మేం భావిస్తున్నాం. మీరు వేరే ఈక్విటీ ఫండ్‌లోకి మారేటప్పుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి. ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి మీరు మారేటప్పుడు ముందుగా మీరు చేయాల్సిన పని... ఈక్విటీ ఫండ్‌ను నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్‌కు స్టాప్ రిక్వెస్ట్‌ను సమర్పించాలి. ఒకేసారి మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిని ఉపసంహరించుకుంటే మీరు చెప్పినట్లుగానే మీరు షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఏడాది దాటిన వాటిని ఒకేసారి ఉపసంహరించుకోవాలి. ఏడాది లోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఈ విధానాన్ని అనుసరిస్తే మంచిది. తాతల నాటి స్థిరాస్థిని విక్రయించగా నా భాగానికి కోటి రూపాయలు వచ్చాయి. దీనిని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామనుకుంటున్నాను. దీనిపై వచ్చే వడ్డీని ఇంటి అద్దె, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఉపయోగించుకోవాలనేది నా ఆలోచన. ఫిక్స్డ్ డిపాజిట్‌గా కాకుండా, ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? నా సొమ్ము భద్రంగా ఉండేలా మరో మార్గమేదైనా ఉందా? సరైన సలహా ఇవ్వండి. - జాన్, ఈ మెయిల్ ద్వారా డెట్ ఫండ్‌లో ఇంత పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. మీరు భద్రత కోరుకుంటున్నారు. అదే సమయంలో స్థిరమైన రాబడులు (ఇంటి అద్దె, ఇతర ఖర్చులు) కోరుకుంటున్నారు. ఈ దృష్ట్యా చూస్తే డెట్ఫండ్లో ఇన్వెస్ట చేయడం సరైనపనే కాదు. బ్యాంక్ డిపాజిట్లతో పోల్చితే డెట్‌ఫండ్స్ ఒకింత అధిక రాబడినే అందిస్తాయని చెప్పవచ్చు. అయితే ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయి. నెలవారీ రాబడుల నిమిత్తం ఈ ఫండ్లపై ఆధారపడడం సరైన విధానం కాదు. రూ. కోటి అనేది అతి పెద్ద మొత్తం. దీనిని ఒకేచోట ఒకేసారి ఒకే మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఏడాది పాటు ఇంటి అద్దె, ఇతర ఖర్చులన్నింటిని లెక్కవేసి ఆ మొత్తాన్ని మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో జమ చేయండి. ఇదే మొత్తానికి మూడు రెట్ల మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. గరిష్టంగా రాబడులను పొందాలంటే స్వీప్-ఇన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌం ట్ను తెరవండి. ఈ తరహా ఖాతాల్లో నిర్దేశిత పరిమితికి మించి సొమ్ములు పెరిగినట్లయితే, బ్యాంక్ ఆ పెరిగిన మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్‌గా మారుస్తుంది. దీంతో మామూలుగా కన్నా అధికంగా మీకు రాబడులు లభిస్తాయి. మరోవైపు పరిమితి కంటే తక్కువగా మీ ఖాతాలో సొమ్ములున్నప్పుడు, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ రద్దై, ఆ సొమ్ములు సేవింగ్స్ ఖాతాలోకి వస్తాయి. ఇక మిగిలిన మొత్తాన్ని మంచి రేటింగ్ ఉన్న ఇన్కమ్, షార్ట్‌టెర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. .. ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్‌టెర్మ్ ఇన్కమ్ ప్లాన్, యూటీఐ షార్ట్‌టెర్మ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్, బిర్లా సన్‌లైఫ్ మీడియమ్ టెర్మ్ ప్లాన్, యూటీఐ డైనమిక్ బాండ్ తదితర ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. -
ఎగ్జిట్ లోడ్ సొమ్ము ఏం చేస్తారు.. ?
మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విక్రయాలపై విధించే ఎగ్జిట్ లోడ్ ద్వారా వచ్చిన సొమ్ములను ఫండ్ హౌస్ ఏంచేస్తుంది? ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏమిటి? సదరు ఫండ్ మొత్తం వ్యయాలను ఇది సూచిస్తుందా? ఇవి కాకుండా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వసూలు చేసే ఇతర చార్జీలేమైనా ఉన్నాయా? -ప్రణీత, గుంటూరు ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ నుంచి తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ముందే ఉపసంహరించుకోవడాన్ని నిరోధించడానికి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ ఎగ్జిట్ లోడ్‌ను విధిస్తాయి. గతంలో ఫండ్ మేనేజర్ల వ్యయాలకు గాను ఎగ్జిట్ లోడ్‌ను మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వసూలు చేసేవి. ఇప్పుడు ఈ ఎగ్జిట్ లోడ్‌ను మ్యూచువల్ ఫండ్ కంపెనీలు తిరిగి ఆ ఫండ్ స్కీమ్‌లోనే రీ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లకు వచ్చే రిటర్న్‌లు పెరుగుతాయి. ఇక ఎక్స్పెన్స్ రేషియో విషయానికొస్తే కంపెనీ నిర్వహణ, వ్యవస్థాపన సంబంధిత వ్యయాలన్నింటినీ ఎక్స్పెన్స్ రేషియో ప్రతిబింబిస్తుంది. ఇంకా ఎక్స్పెన్స్ రేషియోలో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ అడ్వైజరీ ఫీజు, ట్రస్టీ ఫీజు, ఆడిట్ ఫీజు, కస్టోడియన్ ఫీజు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్, మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్(ఏజెంట్ కమిషన్‌తో కలిపి), ఇన్వెస్టర్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించి వ్యయాలు, ఫండ్ ట్రాన్స్ఫర్ వ్యయాలు, అకౌంట్ స్టేట్మెంట్ వ్యయాలు, డివిడెండ్ రిడంప్షన్ చెక్‌లు, వారంట్ల వ్యయాలు, ప్రకటనల వ్యయాలు, ఇన్వెస్టర్ల అవగాహన వ్యయాలు, బ్రోకరేజ్ వ్యయాలు, సర్వీస్ ట్యాక్స్‌లు, లిస్టింగ్ వ్యయాలు, వంటి ఇతర వ్యయాలు ఉంటాయి. ఫండ్ వ్యయాలన్నీ కవర్ అయ్యేలా నిర్దేశిత పరిమితికి లోబడి ఎక్స్పెన్స్ రేషియోను వసూలు చేసుకోవచ్చని సెబీ మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు అనుమతిచ్చింది. టాప్ 15 నగరాలు కాకుండా ఇతర నగరాల ఇన్వెస్టర్ల నుంచి వచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై అదనంగా 0.30% అదనపు చార్జీ విధించవచ్చని సెబీ ఇటీవలనే మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు అనుమతిచ్చింది. మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? యూలిప్లలో మంచిదా? నేను బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైనా నిర్ణయమేనా? ఐటీ చట్టం, సెక్షన్ 80 సీ ప్రకారం పన్ను ప్రయోజనాలు ఆశించడంలేదు. కేవలం ఇన్వెస్ట్‌మెంట్స్‌పైనే నా దృష్టి. సరైన సూచనలివ్వండి. - సంతోష్ కుమార్, హైదరాబాద్ యూలిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడమే మంచిది. ఇన్వెస్ట్‌మెంట్‌కే కాదు బీమాకు కూడా పెట్టుబడులకు యూలిప్‌లను పరిగణించకూడదు. యూలిప్‌లకు వ్యయాలు ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. యూలిప్ పాలసీ తీసుకున్న పక్షంలో మీరు 4,5 ఏళ్ల పాటు అధిక వ్యయాలు చెల్లించాల్సి ఉంటుంది. యూలిప్లతో పోల్చితే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు చార్జీలు తక్కువగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు గరిష్టంగా ఈక్విటీ ఫండ్స్‌పై 2.5%, డెట్‌ఫండ్స్ 2.25 శాతం చొప్పున ఎక్స్పెన్స్ రేషియోను వసూలు చేస్తాయి. యూలిప్‌లు తొలి ఏడాదిలోనే విధించే చార్జీ కనీసం 5-6 %. మ్యూచువల్ ఫండ్స్ తమ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాన్ని, పోర్ట్‌ఫోలియోలను పారదర్శకంగా ఉంచుతాయి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫండ్స్ నుంచి వైదొలగవచ్చు. అదే యూలిప్‌ల విషయంలో అయితే లాకిన్ పీరియడ్ ఐదేళ్ల వరకూ ఉంటుంది. ఇక ఈక్విటీ ఫండ్ ఎంపిక విషయానికొస్తే, మీ అవసరాలు, భరించగలిగే రిస్క్ వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవాలి. బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్. దీనికి మా వేల్యూ రీసెర్చ్ ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. నిరభ్యంతరంగా దీనిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. నేనొక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలోని షేర్లు డివిడెండ్లు ఇస్తే, వాటిని మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుంది? ఇలాంటి డివిడెండ్‌ను ఏ ఫండ్ ఎంత ఆర్జించిందో ఎలా తెలుసుకోవచ్చు? - బిస్మిల్లా, నిజామాబాద్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తాను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ నుంచి పొందిన డివిడెండ్ వివరాలను వెల్లడించే నిబంధనలేవీ లేవు. డివిడెండ్స్ చెల్లించే షేర్లలోనే డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ తమ స్కీమ్‌ల పోర్ట్‌ఫోలియోల వివరాలను నెలవారీ పద్ధతిన వెల్లడిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీ(నెట్ అసెట్ వేల్యూ) మదింపు, పోర్ట్‌ఫోలియో వేల్యూయేషన్, స్వీకరించిన డివిడెండ్ల తాలూకు అకౌంటింగ్...ఇవన్నీ కఠినమైన నియమ నిబంధనలతో గణించాల్సి ఉంటుంది. అందుకని ఈక్విటీ ఫండ్స్ పొందే డివిడెండ్స్ విషయమై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ ఈక్విటీ ఫండ్ అయినా డివిడెండ్లు పొందితే, మీ రాబడులు, ఎన్ఏవీ కూడా పెరుగుతాయి. -
పీఎఫ్ సొమ్ము ఎఫ్డీగా ఓకేనా?
నేను ఒక ప్రభుత్వోద్యోగిని. నా వార్షికాదాయం మూడున్నర లక్షలు. నేను మ్యూచువల్‌ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఎక్కడ నుంచి ప్రారంభించాలి? - ప్రకాశ్, రాజమండ్రి మీరు మొదటిసారిగా మ్యూచువల్‌ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి, జాగ్రత్తగా వ్యవహరించాలి. మొదట్లోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, మీకు మ్యూచువల్ఫండ్స్పైననే నమ్మకం పోతుంది. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్‌ల్లో దీర్ఘకాలంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లభించే ప్రయోజనాలను మీరు కోల్పోతారు. ఈక్విటీల్లో 5-10 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని ధీటుగా ఎదుర్కొనగలుగుతారు. మరోవైపు చెప్పుకోదగ్గ స్థాయిలో సంపదను సమకూర్చుకున్నవారవుతారు. దీనికోసం మీరు పెద్ద మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా, క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేయండి. మీరు మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త కాబట్టి, మొదటిసారిగా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే వీటిల్లో ఒడిదుడుకులు తక్కువ. పైగా పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. ఈ ఫండ్స్‌నుంచి వచ్చే దీర్ఘకాలిక రాబడులపై ఎలాంటి పన్నులు ఉండవు. మీరు ఎంచుకోవడానికి కొన్ని ఫండ్స్-కెనరా రొబెకో బ్యాలెన్స్, డీఎస్పీ బీఆర్ బ్యాలెన్స్డ్, ఎఫ్టీ ఇండియా బ్యాలెన్స్డ్, టాటా బ్యాలెన్స్డ్. నాలుగేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయడానికి ఎల్ అండ్ టీ బిజినెస్ సైకిల్, రిలయన్స్ బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్స్‌ను షార్ట్‌లిస్ట్ చేశాను. నేను సరైన ఫండ్స్‌నే ఎంచుకున్నానా? మీ అభిప్రాయం తెలపండి ? - అవంతిక, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి, 4 ఏళ్ల కాలానికి ఏ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయకూడదో, ఆ ఫండ్స్‌నే మీరు ఎంపిక చేసుకున్నారు. ఎల్ అండ్ టీ బిజినెస్ సైకిల్ అనేది కొత్త మ్యూచువల్ ఫండ్. దీనికి ట్రాక్ రికార్డ్ ఏమీ లేదు. ఇక రిలయన్స్ బ్యాంకింగ్ అనేది సెక్టోరియల్ మ్యూచువల్ ఫండ్. 4 ఏళ్ల కాలానికి ఇది సరైనది కాదు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. వివిధీకరణ తప్పనిసరి అని గుర్తించండి. మంచి పనితీరు ఉన్న లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. 4 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉత్తమం. క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? - పారినాయుడు, శ్రీకాకుళం క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ ఫండ్-మంచి పనితీరు కనబరుస్తున్న డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఒకటి. ఈ ఫండ్‌ను నేరుగానే విక్రయిస్తారు. కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతమున్న అన్ని ఈక్విటీ పండ్స్‌ల్లో ఈ ఫండ్కే ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇతి అత్యుత్తమమైన ఫండ్ అని చెప్పవచ్చు. మా నాన్నగారు ఇటీవలనే రిటైరయ్యారు. ప్రావిడెండ్ ఫండ్ కింద రూ.25 లక్షలు వచ్చాయి. ఈ మొత్తాన్ని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. దీనిపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎంత శాతం ఉంటుంది. ఆయనకు వేరే ఆదాయ వనరులు ఏమీ లేవు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా వేరే ఇతరత్రా ఏమైనా సాధానాల్లో ఇన్వెస్ట్ చేయమంటారా? - ఘనీ, నిజామాబాద్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఆర్జించిన వడ్డీపై మీ నాన్నగారి ట్యాక్స్ స్లాబ్‌ను బట్టి పన్ను విధిస్తారు. ఇతర వనరుల నుంచి ఆదాయంగా ఈ ఎఫ్డీ వడ్డీని పరిగణిస్తారు. వడ్డీ మొత్తం రూ.10,000కు మించితే బ్యాంకు 10 శాతం టీడీఎస్‌గా కోత విధిస్తుంది. పీఎఫ్ మొత్తంపై క్రమం తప్పని ఆదాయాన్ని మీ నాన్నగారు ఆశిస్తున్నట్లుగా ఉంది. ఈ దిశగా చూస్తే, ఎఫ్‌డీల కంటే మెరుగైన కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ మొత్తం ఒకేసారి మీ నాన్నగారికి ఆవసరముండదు. అందుకుని ఆయన నెలవారీ ఖర్చు ఎంతో ముందు లెక్కించండి. దీనికి 6 రెట్ల మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేయండి.అ తర్వాత 2-3 సంవత్సరాల మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. దీంతో పన్ను బాధ్యత చెప్పుకోదగిన విధంగా తగ్గిపోతుంది. మిగిలిన మొత్తాన్ని మంచి రేటింగ్ ఉన్న షార్ట్‌టెర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. -
దీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ బెటర్
ఐదేళ్ల నుంచి ఒక లార్జ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కానీ ఈ ఫండ్ నేను ఆశించిన రాబడులనివ్వడం లేదు. పోర్ట్‌ఫోలియోలో లార్జ్ క్యాప్ ఫండ్ ఉండడం తప్పనిసరా? నేను మరో పదేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించగలను. కొన్ని మంచి ఫండ్స్‌ను సూచించండి? - పవన్, విశాఖపట్టణం మిడ్, స్మాల్-క్యాప్ ఫండ్స్‌తో పోల్చితే లార్జ్ క్యాప్ ఫండ్స్ కుదురుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఎక్కువ కాలం ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే ఉన్నాయి. అందుకే మీరు ఇన్వెస్ట్ చేసిన లార్జ్‌క్యాప్ ఫండ్ పనితీరు మిమ్మల్ని నిరాశ పరిచింది. మరోవైపు వడ్డీరేట్లు అధికంగా ఉండడంతో ఆ ప్రయోజనాలను మీరు కోల్పోయారు. మరో పదేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించాలనుకుంటున్నారు. కాబట్టి, లార్జ్‌క్యాప్ కాకుండా ఇతర సెగ్మెంట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ ఫండ్స్‌ను విస్మరించకండి. దీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ చెప్పుకోదగ్గ స్థాయి రాబడులను అందించగలవు. మీరు నిర్దేశించుకున్న పదేళ్ల ఇన్వెస్ట్మెంట్ కాలానికి కొన్ని ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. అవి క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ పుడెన్షియల్ డైనమిక్, యూటీఐ ఈక్విటీలు. నేను 2007 నుంచి హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటి పనితీరు బాగా లేదు. మంచి రాబడులనిచ్చే మరికొన్ని ఫండ్స్‌ను సూచించగలరా? - రాధిక, ఖమ్మం గత ఒకటిన్నర సంవత్సరాలుగా హెచ్డీఎఫ్సీ టాప్ 200, హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్లు ఆయా కేటగిరీ ఫండ్లతో పోల్చితే చెప్పుకోదగ్గ పనితీరును కనబరచడం లేదు. అయితే ఈ ఫండ్స్ పూర్తిగా ఇన్వెస్ట్మెంట్స్ ఆపేయదగ్గ అధ్వాన ఫండ్స్ కావని చెప్పవచ్చు. మీరు ఈ రెండు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వివిధీకరణను విస్మరించినట్లయింది. ఈ రెండు ఫండ్స్‌ను నిర్వహించేది ఒకే ఫండ్ మేనేజర్. అదీ కాకుండా ఈ రెండు ఫండ్స్ లక్ష్యాలు కూడా ఒకటే. ఈ రెండు ఫండ్ల పోర్ట్‌ఫోలియో 60% ఒకేలా ఉండడమే దీనికి కారణం. మా సూచన ఏమిటంటే మీరు హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఫండ్ నుంచి వైదొలగండి. ఆ సొమ్మును ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ లేదా క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ వంటి మల్టీక్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఒక ఏడాది కాలానికి ఐసీఐసీఐ ఎఫ్ఎంసీజీ గ్రోత్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నా మిత్రులేమో ఇది ఈక్విటీ ఫండ్ దీర్ఘకాలానికి అయితేనే ఇలాంటి ఫండ్స్‌ను ఎంచుకోవాలంటున్నారు. నాది సరైన నిర్ణయమేనా? తగిన సూచనలివ్వండి? - విజయ్, కరీంనగర్ ఏడాది వంటి స్వల్పకాలానికి ఈక్విటీ ఫండ్స్ గురించి అసలు ఆలోచించనే వద్దు. ఈక్విటీ మార్కెట్లలో వచ్చే స్వల్పకాలిక ఒడిదుడుకుల కారణంగా మీ పెట్టుబడి హరించుకుపోయే అవకాశాలే అధికం. కొన్నేళ్ల పాటు మంచి పనితీరునే కనబరిచే ఈ ఫండ్స్ ఒక్కసారిగా కుప్పకూలవచ్చు. అందుకనే డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఇన్వెస్టర్లకు సూచిస్తాం. ఇలా ఇన్వెస్ట్ చేస్తేనే, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అసలు ప్రయోజనం నెరవేరుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఆ ఫండ్ మేనేజర్ రీసెర్చ్ చేసి మీ కోసం ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకుంటారు. అలా కాకుండా మీరే ఒక రంగాన్ని ఎంచుకొని, ఆ రంగం ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే మరి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అర్థమే ఉండదు. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు ఒకే రంగపు మ్యూచువల్ ఫండ్స్ సరైనవి కావు. డైవర్సిఫైడ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తేనే మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ప్రయోజనాలు లభిస్తాయి. చాలా డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన షేర్లు ఉంటాయి. రంగాల వారీ ఫండ్లు అయితే గియితే అద్భుత రాబడులనిస్తాయి లేదంటే వాటి పనితీరు పేలవంగా ఉంటుంది. -
సిప్ పెట్టుబడులపై పన్నులు ఉంటాయా?
డీఎస్పీ బ్లాక్ రాక్ ఈక్విటీ ఫండ్‌లో మూడేళ్ల సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పూర్తి చేశాను. ఇటీవలే ఆ మొత్తాన్ని రిడీమ్ చేసుకున్నాను. రూ.3.10 లక్షలు ఇన్వెస్ట్ చేయగా, రూ.3.40 లక్షలు వచ్చాయి. నేను ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది? - ప్రసన్న, విశాఖ పట్టణం. ఒక ఏడాది లోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పొందిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలు(షార్ట్‌టెర్మ్ గెయిన్స్)గానూ, అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పొందిన లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలు(లాంగ్‌టెర్మ్ గెయిన్స్)గానూ పరిణిస్తారు. ఈక్విటీ, ఈక్విటీ ఫండ్స్‌పై పొందిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఎలాంటి పన్నులు ఉండవు. స్వల్పకాలిక మూలధన లాభాలపై మాత్రం 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక సిప్ ఇన్వెస్ట్మెంట్ విషయానికొస్తే, పన్ను బాధ్యత ప్రతీ ఇన్‌స్టాల్‌మెంట్‌కు విడివిడిగా లెక్కిస్తారు. ఇన్వెస్ట్ చేసిన తేదీ నుంచి రిడంప్షన్ తేదీ మధ్య ప్రతీ ఇన్స్టాల్మెంట్ కాలం, పొందిన లాభాలను పరిగణనలోకి తీసుకొని పన్ను లెక్కిస్తారు. అయితే ఇదంతా మీరు పెన్నూ, పేపరూ తీసుకొని లెక్కించాల్సిన పని లేదు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్ను డీఎస్పీ బ్లాక్‌రాక్ కంపెనీని మీరు అడగవచ్చు. లేదా ఫండ్హౌజ్ వద్ద మీరు మీ ఈ మెయిల్ ఐడీని నమోదు చేసుకున్నట్లైతే, మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్కామ్స్ఆన్లైన్డాట్కామ్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. దీంట్లో ఇన్వెస్టర్ సర్వీసెస్, మెయిల్బాక్ సర్వీసెస్, కన్సాలిడేటెడ్ రియలైజ్డ్ గెయిన్ స్టేట్మెంట్పై క్లిక్ చేస్తే మీ మెయిల్‌కు ఆ స్టేట్మెంట్ వచ్చేస్తుంది. వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్లో మీరు మీ పోర్ట్‌ఫోలియోను మెయింటైన్ చేస్తున్నట్లయితే ఆ లెక్కలను ఈ వెబ్సైట్ నుం చి కూడా పొందవచ్చు. అయితే పన్ను సంబంధిత అంశాలకు అధీకృత క్యామ్స్ స్టేట్మెం ట్ను మాత్రమే రుజువుగా ఉపయోగించాలి. నా మైనర్ కూతురి పేరు మీద నేను గార్డియన్‌గా పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చా? నేను నా పీపీఎఫ్ అకౌంట్లో ఒక లక్ష, నా కూతురి పీపీఎఫ్ అకౌంట్లో మరో లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే, సెక్షన్ 80 సీ కింద నాకు వచ్చే పన్ను ప్రయోజనాలు ఎలా ఉంటాయి. - కుమార్, విజయవాడ మీరు మీ మైనర్ కూతురి కోసం మీరు గార్డియన్‌గా పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మీ పీపీఎఫ్ అకౌంట్లో రూ. 1 లక్ష, మీ కూతురి పీపీఎఫ్ అకౌంట్లో రూ. 1 లక్ష, లేదా ఈ రెండు అకౌంట్లలో అంతకు మించి గానీ ఇన్వెస్ట్ చేసినప్పటికీ, ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ ప్రకారం, ఒక ఏడాదిలో ఒక వ్యక్తి పొందగలిగే పన్ను ప్రయోజనాలు రూ. 1 లక్ష మాత్రమే. రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్(ఆర్జీఈఎస్ఎస్) కింద ఏ ఈటీఎఫ్‌ను ఎంచుకోవాలి? - వంశీకృష్ణ, బెంగళూరు రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్‌కు అర్హమైన స్కీమ్‌లు చాలా ఉన్నాయి. ఈ స్కీమ్ కింద ఉత్తమమైన ఫండ్స్‌ల్లో నిఫ్టీ ఈటీఎఫ్ ఒకటి. దీనికి సంబంధించిన సమగ్రమైన జాబితా కోసం వాల్యూరీసెర్చ్ వెబ్‌సైట్‌ను చూడండి. ముందు ఇన్వెస్టర్లు ఈ స్కీమ్‌ను బాగా అర్థం చేసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లో తొలిసారిగా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్‌ను డిజైన్ చేశారు. వార్షికాదాయం రూ.12 లక్షల లోపు ఉన్న కొత్త ఇన్వెస్టర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. సెక్షన్ 80సీ కింద లభించే రూ. లక్ష పన్ను మినహాయింపులకు ఇది అదనం. ఒక వ్యక్తికి ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసే పరిమితిని రూ.50,000గా నిర్ణయించారు. ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 50 శాతానికి పన్ను రాయితీ పొందవచ్చు. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే ఒక ఏడాది పూర్తయిన తర్వాత కొన్ని షరతులకు లోబడి ట్రేడింగ్ చేయొచ్చు. మొత్తం మీద ఈ స్కీమ్ కొంచెం సంక్లిష్టమైనదే. ఎంచుకోవడానికి పరిమితమైన ఫండ్స్, షేర్లు అందుబాటులో ఉంటాయి. పన్ను ప్రయోజనాలూ ఓమోస్తరుగానే ఉంటాయి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 6. ఈ ఏడాది 5% స్థాయిలో జీడీపీ: నోమురా ముంబై: ఈ ఆర్థిక సంవత్సర ం(2013-14)లో దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) అనూహ్య వృద్ధిని సాధించే అవకాశాల్లేవని జపనీస్ బ్రోకింగ్ దిగ్గజం నోమురా అంచనా వేసింది. ఇందుకు రిజర్వ్ బ్యాంక్ అనుసరిస్తున్న క ఠిన పరపతి విధానాలు, మందగమన పరిస్థితులు వంటివి కారణంగా నిలుస్తాయని నివేదికలో నోమురా పేర్కొంది. వెరసి ఈ ఏడాది జీడీపీ 4.5-5% స్థాయిలో నమోదు కావచ్చునని అభిప్రాయపడింది. అయితే 2014లో ఆర్థిక స్థిరీకరణకు అవకాశమున్నదని, పెట్టుబడుల వాతావరణం చక్కబడేందుకు ఆస్కారమున్నదని వివరించింది. అయితే ప్రస్తుతం అనూహ్య పురోభివృద్ధి సాధించేందుకు సరైన కారణాలు కనిపించడంలేదని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది తొలి రెండు క్వార్టర్లలో జీడీపీ 4.4%(ఏప్రిల్-జూన్), 4.8%(జూలై-సెప్టెంబర్) చొప్పున పుంజుకున్న సంగతి తెలిసిందే. కాగా, గడిచిన ఏడాది(2012-13) జీడీపీ 4.5%కు పరిమితమైంది. ప్రధానంగా అధిక వడ్డీ రేట్లు, డిమాండ్ పడిపోవడం వంటి దేశీయ అంశాలు ఇందుకు ప్రభావం చూపాయి. -
పసిడి ఫండ్‌పై పునరాలోచన మేలు
నా ఫండ్ పోర్ట్‌ఫోలియోలో 5 ఫండ్లు ఉన్నాయి. వీటి వివరాలు.., ఎస్బీఐ మ్యాగ్నమ్ ఎమర్జింగ్ బిజినెసెస్, రిలయన్స్ ఈక్విటీ ఆపర్చునిటీస్, హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, డీఎస్పీ బ్లాక్‌రాక్ టాప్ 100, రిలయన్స్ గోల్డ్. ఈ ఫండ్స్ పర్వాలేదా? మీరేమైనా మార్పులు, చేర్పులు సూచిస్తారా? నా పోర్ట్‌ఫోలియోలో మరిన్ని అగ్రెసివ్ లార్జ్-క్యాప్ ఫండ్స్‌కు చోటివ్వమంటారా? - నవీన్, శ్రీకాకుళం మీరు మంచి ఫండ్స్‌నే ఎంపిక చేసుకున్నారు. ఈక్విటీ ఫండ్స్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుంటాయి. స్వల్పకాలానికంటే దీర్ఘకాలానికే ఈక్విటీ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు పెట్టాలి. అగ్రెసివ్ ఫండ్స్ విషయంలో ఇది మరింతగా వర్తిస్తుంది. లార్జ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్స్... అగ్రెసివ్ ఫండ్స్‌లా పనితీరును కనబరిచే అవకాశాలు స్వల్పంగా ఉంటాయి. నష్టభయం ఉన్నప్పటికీ, చిన్న కంపెనీల్లోనే అగ్రెసివ్ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి. అయితే కొన్ని లార్జ్‌క్యాప్ ఫండ్స్ అగ్రెసివ్ ఫండ్స్‌లాగానే పనితీరు కనబరుస్తాయి. దీనికి ఉదాహరణగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ను చెప్పుకోవచ్చు. మీరు దీర్ఘకాలిక ఇన్వెస్టర్ అయినట్లయితే మరిన్ని అగ్రెసివ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లయితే, మా వాల్యూ రీసెర్చ్ వెబ్‌సైట్‌లోని లార్జ్ అండ్ మిడ్, మిడ్-క్యాప్ కేటగిరిల్లోని ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. భవిష్యత్తులో నిలకడైన వృద్ధిని బంగారం ఇవ్వలేదని చెప్పొచ్చు. అందుకే మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న గోల్డ్ ఫండ్ విషయమై పునరాలోచన చేయండి. డీఎస్పీ బ్లాక్‌రాక్ టాప్ 100 మాతం అగ్రెసివ్ ఫండ్ కాదని చెప్పవచ్చు. ఇక మిగిలిన ఫండ్స్ అన్నీ బావున్నాయి. అన్ని ఫండ్స్ మంచి పనితీరునే కనబరుస్తున్నాయి. నేను 2007లో రిలయన్స్ ట్యాక్స్ సేవర్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌లో రూ.20,000 పెట్టుబడులు పెట్టాను. ఇప్పటిదాకా డివిడెండ్ రూపంలో రూ.11,600 వచ్చాయి. ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? కొనసాగమంటారా? -శ్రీవాణి, హైదరాబాద్ రిలయన్స్ ట్యాక్స్ సేవర్ అనేది 3-స్టార్ రేటింగ్ ఉన్న పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్. కానీ అన్ని ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటోంది. దీంతో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి లేదు. ఈ ఫండ్స్ చెల్లించే డివిడెండ్‌ను రీ ఇన్వెస్ట్ చేస్తే మళ్లీ దానికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఈ లాకిన్ పీరియడ్ పూర్తయ్యేదాకా మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి లేదు. ఒకవేళ మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటే, మీరు మీ ప్లాన్‌ను డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ నుంచి డివిడెండ్ పేఅవుట్కు మార్చుకోవలసి ఉంటుంది. ఇలా మార్చుకుంటే మీకు రావలసిన డివిడెండ్‌ను రీ ఇన్వెస్ట్ చేయకుండా డివిడెండ్‌ను మీకు నేరుగా ఫండ్ కంపెనీ చెల్లిస్తుంది. మూడేళ్ల తర్వాత మీ పెట్టుబడులను వెనక్కు తీసుకోవచ్చు. నా వయస్సు 46 సంవత్సరాలు. నేను హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ యంగ్‌స్టార్ సూపర్ టూ పాలసీ- ఆపర్చునిటీస్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ప్రీమియం టెర్మ్ ఐదేళ్లు, బెనిఫిట్ టెర్మ్ పదేళ్లుగా ఉన్న ఈ ఫండ్‌లో 2010, నవంబర్ నుంచి ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నాను. ఏడాదికి రూ.25,000 చొప్పున మూడేళ్ల పాటు చెల్లించాను. ఆ తర్వాత ఆపేశాను. ఈ ఏడాది డిసెంబర్ 1 నాటికి ఈ ప్లాన్ విలువ రూ.58,120గా ఉంది. ఈ పాలసీ నుం చి వైదొలగమంటారా? కొనసాగమంటారా? - జాన్సన్, గుంటూరు హెచ్డీఎఫ్సీ యంగ్‌స్టార్ సూపర్ టూ అనేది యూనిట్ లింక్డ్ పాలసీ.సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంతైతే రాబడి వస్తుందో అంతే రాబడి ప్రస్తుతం ఈ ఫండ్ ద్వారా వస్తోంది. మీరు ఇప్పటికే మూడేళ్లపాటు ప్రీమి యం చెల్లించారు. కానీ ప్రస్తుతమున్న విలువ దృష్ట్యా మీకు నష్టం వచ్చింది. మీరు ఇప్పుడు ఈ పాలసీని సరెండర్ చేస్తే, డిస్కంటిన్యూ చార్జీల కింద మీ వార్షిక ప్రీమియంలో 10 శాతం మొత్తాన్ని, లేదా రూ. 1,000 (ఏది కనిష్టమైతే, అది) చెల్లించాలి. మీ నష్టాలకు ఇది అదనం. ఇప్పటికే మీ ప్లాన్ డిస్కంటిన్యూ మోడ్‌లో ఉంది. ఇక ఫండ్ మేనేజ్మెంట్ చార్జీల కింద మీ డిస్కంటిన్యూడ్ పాలసీపై 0.50 శాతాన్ని ఈ ప్లాన్ సంస్థ చార్జ్ చేస్తుంది. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, మీ పాలసీని సరెండర్ చేసి మీ నష్టాలను పరిమితం చేసుకుంటేనే సముచితంగా ఉంటుంది. మీరు ఈ పాలసీని సరెండర్ చేస్తే, మీకు ఇన్సూరెన్స్ కవర్ ఉండదు కాబట్టి, మీకు సరిపోయేలా టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇక మిగిలిన మొత్తాన్ని మీరు భరించగలిగే నష్ట భయాన్ని బట్టి ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ధీరేంద్ర కమర్,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
జీవిత బీమా ఎంత కు తీసుకోవాలి?
నా పోర్ట్‌ఫోలియోలో ఐదు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఉన్నాయి. వీటిల్లో ఆరేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ పూర్తయింది. వీటి నుంచి పెట్టుబడులను రెగ్యులర్ డైవర్సిఫైడ్ ఫండ్స్‌కు మళ్లించమంటారా? రెగ్యులర్ ఈక్విటీ ఫండ్స్‌లాగానే ఇవి కూడా మంచి పనితీరును కనబరుస్తాయా? -ఈశ్వర్, తిరుపతి ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌కు లాకిన్ పీరియడ్ పూర్తయితే, అవి సాధారణ ఈక్విటీ ఫండ్స్‌లాగానే పనిచేస్తాయి. ఇతర ఓపెన్-ఎండెడ్ ఫండ్స్‌లాగానే యాక్టివ్‌గా ట్రేడవుతాయి. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ విషయానికొస్తే, ఒకేసారి డబ్బులు వస్తాయి. దీని నిర్వహణ నిమిత్తం ఈ ఫండ్ మేనేజర్లకు ఎలాంటి ఇన్సెంటివ్‌లు లభించవు. అందుకనే క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్‌పై ఫండ్ మేనేజర్లకు అంతగా ఆసక్తి ఉండదు. కానీ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్‌కు మినహాయింపు ఉంటుంది. పన్ను ఆదా నిమిత్తం ఎప్పటికప్పుడు కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడతారు కాబట్టి ఇవి ఆకర్షణీయంగానే ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్‌ల్లో ఏ ఫండ్ అయినా సరైన పనితీరు కనబరచకపోతే మెథాడికల్ వేలో ఈ ఫండ్స్ నుంచి వైదొలగవచ్చు. ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్ ఎలా ఉంటుంది? ఈ ఫండ్ పనితీరు నానాటికీ దిగజారుతోంది. అయినప్పటికీ పెట్టుబడులను కొనసాగించమంటారా? -పావని, ఖమ్మం డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఫ్లెక్సి డెట్ బాండ్స్‌గా వ్యవహరిస్తారు. భవిష్యత్ వడ్డీరేట్ల అవుట్‌లుక్ ఆధారంగా మెచ్యూర్ అయ్యే పేపర్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. వడ్డీరేట్లు అనుకోకుండా పెరగడంతో ఈ ఏడాది జూన్‌లో ఈ ఫండ్స్‌కు నష్టాలొచ్చాయి. వడ్డీరేట్లు తగ్గుతాయని అందరూ భావించిన తరుణంలో ఆర్బీఐ ఆశ్చర్యకరంగా వడ్డీరేట్లను పెంచేసింది. మీరు ఇన్వెస్ట్ చేసే డైనమిక్ బాండ్ ఫండ్స్ కాలపరిమితి ఏడాదికి మించినట్లయితే, వీటిల్లోనే కొనసాగడం ఉత్తమం. జూన్‌లో వచ్చిన నష్టాలను ఇప్పటికే చాలా బాండ్ ఫండ్స్ రికవరీ చేసుకున్నాయి. చాలా బాండ్ ఫండ్స్ తమ పోర్ట్‌ఫోలియో ప్రొఫైల్స్‌ను మార్చేశాయి కూడా. ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్‌కు 2011 నుంచి 4/5 స్టార్ రేటింగ్ ఉంటోంది. ఈ ఏడాది ఆగస్టు తర్వాతనే ఈ ఫండ్ రేటింగ్ 3 స్టార్‌కు తగ్గింది. ఈ ఫండ్ రేటింగ్, పనితీరు పడిపోవడం కొనసాగుతున్నట్లయితే, ఇదే కేటగిరిలోని మరో ఫండ్‌కు మారిపోవడం ఉత్తమం. ఒకటి లేదా రెండేళ్ల కాలానికి అధిక రిటర్న్‌లు కావాలనుకునే ఇన్వెస్టర్లు ఇలాంటి డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. అయితే గత 3-4 నెలల్లో ఈ ఫండ్స్ పనితీరు బాగాలేని విషయం వాస్తవమే. ఎక్కువ కాలం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలనుకుంటే, మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడే ఈ ఫండ్స్ నుంచి వైదొలగండి. నా వయస్సు 45 సంవత్సరాలు. నాకు తొమ్మిదేళ్ల కొడుకున్నాడు. నా నెలసరి సంపాదన రూ.20,000. నేను ఇంతవరకూ ఎలాంటి బీమా పాలసీ తీసుకోలేదు. ఏదైనా ఉత్తమమైన టెర్మ్ పాలసీనొకదానిని సూచించండి? - రవీందర్, కడప బీమా అవసరాన్ని గుర్తించినందుకు అభినందనలు. మీరు లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని బీమానే అందిస్తుంది.మీ ప్రస్తుత ఖర్చులు, మీ కుటుంబానికున్న ఆస్తులు, అప్పులు, ఆర్థిక లక్ష్యాలు తదితర అంశాలపై అధారపడి ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. అయితే ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలనే విషయంలో ఎలాంటి నిర్దిష్ట నియమం లేదు. ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించాలంటే,,, ముందుగా మీరు చెల్లించాల్సిన అప్పులు, రోజువారీ వ్యయాలు, పిల్లాడి చదువు ఖర్చు, తదితర అంశాలను లెక్కించండి. ఆ తర్వాత మీ ఆస్తులు, మీకు లభించే ఆదాయాన్ని గణించాలి. మీ ఆర్థిక లక్ష్యాలకు అవసరమయ్యే మొత్తానికి మీ అప్పులను కూడి దాని నుంచి మీ ఆస్తులను తీసేయండి. అలా వచ్చేదే మీకు అవసరయ్యే బీమా మొత్తం. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అవైవా ఐ-లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఈషీల్డ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్2ప్రొటెక్ట్,... ఇవి కొన్ని ఉత్తమమైన ఆన్లైన్ జీవిత బీమా పాలసీలు. ఈ ఆన్లైన్ విధానం సౌకర్యంగా లేదని మీరు భావిస్తే, అవైవా లైఫ్షీల్డ్ ప్లాటినమ్ ప్రొటెక్షన్, ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ షీల్డ్-లెవల్ టెర్మ్..ఈ ఆఫ్‌లైన్ పాలసీలను పరిశీలించవచ్చు. ఏజెంట్లు ఉండరు కాబట్టి ఆఫ్‌లైన్ పాలసీల కంటే ఆన్లైన్ పాలసీలు చౌకగా ఉంటాయి. ఎంత మొత్తానికి బీమా పాలసీ తీసుకోవాలో నిర్ణయించుకున్న తర్వాత ఆయా పాలసీల ప్రీమియంలు ఎంత ఉన్నాయో పరిశీలించి మీ బడ్జెట్‌కు సరిపోయే పాలసీ తీసుకోండి. ధీరేంద్ర కుమార్ సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్ -
ధీరేంద్ర కుమార్ ఇన్ఫ్రా ఫండ్ ఇంటర్వ్యూ
యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో 2009లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు దాని విలువ రూ. 59,000. నా సొమ్మును రికవరీ చేసుకోవడానికి మరో ఉత్తమమైన ఫండ్‌ను సూచించండి? - అరవింద్, ఖమ్మం గత కొన్నేళ్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ హవా పనిచేయడం లేదు. 2005-07 మధ్యకాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం శిఖర స్థాయిలకు చేరింది. ఆ తర్వాత ఈ రంగం ప్రభ మసకబారింది. ఇక యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ విషయానికొస్తే, పోటీ స్కీమ్‌లతో పోల్చితే ఈ మ్యూచువల్ ఫండ్ పనితీరు బాగాలేదు. ప్రస్తుతానికి ఈ మ్యూచువల్ ఫండ్ రేటింగ్ వన్ స్టార్‌గా ఉంది. ఈ ఫండ్ నుంచి వైదొలగి వేరే డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. సరిగా పనిచేయని ఫండ్‌లో కొనసాగడమంటే, మంచి పనితీరు కనబరుస్తున్న ఫండ్ నుంచి అవకాశాలు మిస్ అవుతున్నట్లే లెక్క. ఆయా రంగాలు బూమ్‌లో ఉన్నప్పుడే ఆయా రంగాలకు సంబంధించిన ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి. ప్రభుత్వ వ్యయంపైనే మౌలిక రంగం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతమున్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, అధికంగా ఉన్న వడ్డీరేట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఈ తరహా ఫండ్స్ నుంచి దూరంగా ఉండడమే మంచిది. మీరు గతంలో డీఎస్పీ మైక్రో క్యాప్ ఫండ్‌కు 5 స్టార్ రేటింగ్‌ను ఇచ్చారు. ఇప్పుడు దాని రేటింగ్ 3 స్టార్‌కు తగ్గిపోయింది. ఈ హఠాత్ డౌన్‌గ్రేడింగ్‌కు కారణమేమిటి? - యామిని, హైదరాబాద్, ఫండ్ పనితీరును బట్టే రేటింగ్ ఉంటుంది. ఈ తరహా మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరి ఫండ్స్ పనితీరును కూడా పరిగణనలోకి తీసుకుని రేటింగ్ నిర్ణయిస్తాం. అంచనాలకనుగుణంగా ఉన్నందునే అప్పుడు ఆ ఫండ్‌కు 5 స్టార్ రేటింగ్‌ను ఇచ్చాం. ఈ ఫండ్‌కు సంబంధించిన రికమండేషన్స్ వెల్లడించేటప్పుడు, ఈ కేటగిరి ఫండ్స్‌ల్లో ఇదే అత్యంత రిస్క్ ఉన్న ఫండ్ అని కూడా పేర్కొన్నాం. ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో స్మాల్ క్యాప్ షేర్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే 2008, 2011 మార్కెట్ పతన కాలంలో ఈ ఫండ్ బాగా దెబ్బతిన్నది. ఇక ఈ ఏడాదిలో ఈ కేటగరీలో ఫండ్స్ సగటు నష్టం 12 శాతంగా ఉండగా, ఈ ఫండ్ 17 శాతం నష్టపోయింది. 2009లో ఈ కేటగిరి ఫండ్స్‌లో మూడో ఉత్తమ ఫండ్‌గా (116 శాతం రాబడి, ), 2010లో 44 శాతం రాబడులతో అత్యుత్తమ ఫండ్‌గా నిలిచింది. ఇతర మెజారిటీ ఫండ్స్‌తో పోల్చితే ఈ డీఎస్పీ మైక్రో క్యాప్ ఫండ్ మరింత ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయి. అయితే దీర్ఘకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఫండ్ నుంచి మంచి ప్రయోజనాలు పొందవచ్చు. నా వయసు 29 సంవత్సరాలు. వార్షిక జీతం 7.5 లక్షలు. ఇప్పటివరకూ నేనెలాంటి టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోలేదు. కొటక్ ఈ ప్రిఫర్ టెర్మ్ ప్లాన్(రూ.35 లక్షల కవర్‌తో) తీసుకోవాలనుకుంటున్నాను. మొత్తం రూ.75 లక్షల కవర్ ఉండేట్లుగా 2, 3 స్కీమ్‌ల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. నా పెట్టుబడి వ్యూహం సరైనదేనా? కొటక్ పాలసీ ఉత్తమమైనదేనా? నా వ్యూహానికి తగ్గట్లుగా మరికొన్ని ఫండ్స్‌ను సూచించండి? - జాన్సన్, గుంటూరు చిన్న వయసులోనే టర్మ్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వయసును బట్టే ప్రీమియంలు ఆధారపడి ఉంటాయి. ఎక్కువ వయసులో పాలసీ తీసుకుంటే, ఎక్కువ ప్రీమియం, తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మీ బాధ్యతలన్నీ తీరిపోయేదాకా మీ పాలసీ కవర్ కొనసాగాలి. మీకు అరవైఏళ్లు వచ్చేటప్పటికి, మీ ఆర్థిక బాధ్యతలన్నీ తీరిపోయే పక్షంలో మీరు 30 ఏళ్ల టర్మ్ పాలసీ తీసుకోవాలి. మీ ఆర్ధిక బాధ్యతలు తీరడానికి అంతకంటే ఎక్కువ సమయం పడితే, టర్మ్ పాలసీ వ్యవధిని పెంచాలి. ఇక కొటక్ ఈ- ప్రిఫర్డ్ అనేది ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. స్టెప్ అప్ ఆప్షన్ అందించడం ఈ పాలసీ ప్రత్యేకత. స్టెప్ అప్ ఆప్షన్ అంటే, వివాహం, గృహ కొనుగోలు, బిడ్డ పుట్టడం వంటి ప్రత్యేక సందర్భాల్లో కవర్‌ను పెంచుకునే వెసులుబాటు లభించడం. ఇలాంటి సందర్భాల్లో బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి అధిక రక్షణ అవసరం. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఇది మంచి పాలసీనే. ఇక బీమా పాలసీలకు సంబంధించి డైవర్సిఫికేషన్‌ను పాటించడం ఉత్తమమైన విషయమే. కాకుంటే ఇది 2,3 పాలసీలకే పరిమితం చేయడం మంచిది. హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్2 ప్రొటెక్ట్, ఐసీఐసీఐ ప్రు ఐకేర్ ఇవి రెండు కూడా పరిశీలించదగ్గ పాలసీలే. సింగిల్ ప్రీమియం ఆప్షన్‌ను మాత్రం ఎంచుకోవద్దు. ఇది కొంచెం ఖరీదైన విషయం.