జూన్‌లో ఈక్విటీల్లోకి రూ.40,608 కోట్లు
ముంబై: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జూన్ లో రూ.40,608 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో వచి్చ న పెట్టుబడుల కంటే 17 శాతం అధికం. మే నెలలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 83 శాతం అధికంగా రూ.34,670 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం.
డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.1,07,357 కోట్లు బయటకు వెళ్లాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ జూన్ చివరికి రూ.61.15 లక్షల కోట్లకు చేరింది. మే నెలతో పోలిస్తే 4% అధికం. ఇందులో ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.27.67 లక్షల కోట్లుగా ఉంది.
కొత్త గరిష్టానికి సిప్ పెట్టుబడులు
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.21,262 కోట్ల పెట్టుబడులు వచ్చా యి. ఇది నెలవారీ సరికొత్త గరిష్ట స్థాయి. మే నెల సిప్ పెట్టుబడులు రూ.20,904 కోట్లు. జూన్‌లో కొత్తగా 55.13 లక్షల సిప్ రిజి్రస్టేషన్లు పెరిగాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య మే చివరికి ఉన్న 8.76 కోట్ల నుంచి జూన్ చివరికి 8.99 కోట్లకు చేరాయి.
మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు రూ.12.44 లక్షల కోట్లకు దూసుకుపోయాయి. మే చివరికి ఇవి రూ.11.53 లక్షల కోట్లుగా ఉన్నాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చెప్పుకోతగ్గ వృద్ధిని చూసింది. ఆర్థిక స్థిరత్వానికి, కోట్లాది మంది ఇన్వెస్టర్ల సంపద సృష్టికి కీలకంగా మారింది.’’అని ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) సీఈవో వెంకట్ చలసాని తెలిపారు.
జూన్‌లో పెట్టుబడులు రూ.21,262 కోట్లు
మేలో పెట్టుబడులు రూ.20,904 కోట్లు
పెట్టుబడుల మొత్తం రూ.12.44 లక్షల కోట్లు (యాంఫి నివేదిక)
థీమ్యాటిక్ అదుర్స్
రంగాలవారీ/థీమ్యాటిక్ ఫండ్స్ జూన్ నెలలో రూ.22, 351 కోట్లు ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ విభాగంలో 9 కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభమయ్యాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లు సమీకరించాయి. మలీ్టక్యాప్ ఫండ్స్‌లోకి 78% అధికంగా రూ.4,708 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్‌క్యాప్ పథకాల్లోకి పెట్టుబడులు 46% పెరిగి రూ.970 కోట్లుగా ఉన్నాయి. స్మాల్‌క్యాప్ పథకాల్లోకి 17% తగ్గి రూ.2,263 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి 3% తక్కువగా రూ.2,527 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హైబ్రిడ్ ఫండ్స్ రూ.8,854 కోట్ల పెట్టబడులను ఆకర్షించాయి. ప్యాసివ్స్‌లోకి రూ.14,601 కోట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment