equity mutual funds
-
ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. గత క్యాలండర్ ఏడాది(2024)లో రూ. 3.94 లక్షల కోట్ల నిధులు లభించాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇవి రెట్టింపుకాగా.. ఇది మార్కెట్లపట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసాన్ని, దీర్ఘకాలిక పెట్టుబడులపట్ల ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. ప్రధానంగా ఇందుకు క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్‌లు) ఉపయోగపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కొత్త ఏడాది(2025)లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. 2024 డిసెంబర్ ప్రారంభం నుంచి మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమలో పెట్టుబడులు తగ్గడం ప్రారంభమైనట్లు జెరి్మనేట్ ఇన్వెస్టర్ సరీ్వసెస్ సీఈవో, సహవ్యవస్థాపకుడు సంతోష్ జోసెఫ్ పేర్కొన్నారు. ఇందుకు స్టాక్ మార్కెట్ల ఆటుపోట్లు కారణమైనట్లు తెలియజేశారు. చరిత్ర ప్రకారం మార్కెట్ల ఆధారంగానే ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు ప్రవహిస్తుంటాయని వివరించారు. మార్కెట్ల ఒడిదుడుకులు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపుతుంటాయని అందువల్ల ప్రస్తుత హెచ్చుతగ్గుల కారణంగా 2025లో కొత్త ఫండ్ ఆఫర్లు(ఎన్‌ఎఫ్‌వోలు), ఈక్విటీ ఫండ్ల నిధుల సమీకరణ తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు కొనసాగవచ్చు పరిస్థితులు సర్దుకున్నాక పెట్టుబడులపై లబ్ది చేకూరే వీలుండటంతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించే వీలున్నదని సంతోష్ తెలియజేశారు. గతేడాది మొత్తం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాలకు రూ. 3.94 లక్షల కోట్లు లభించినట్లు మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) వెల్లడించింది. 2023లో రూ. 1.61 లక్షల కోట్ల పెట్టుబడులు మాత్రమే అందుకున్నట్లు తెలియజేసింది. కాగా.. గతేడాది భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఎంఎఫ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 40 శాతం ఎగశాయి. దీంతో 2024 డిసెంబర్‌కల్లా రూ. 30.57 లక్షల కోట్లకు ఏయూఎం చేరింది. 2023లో రూ. 21.8 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్లు నిలకడగా బలపడటం, ఆరి్ధక అవగాహన మెరుగుపడటం, ఇన్వెస్టర్లు సిప్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు 2024లో ఈక్విటీ ఫండ్ల ఉత్తమ పనితీరుకు తోడ్పాటునిచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపై అవగాహన పెంచుకోవడం ద్వారా సంపద వృద్ధికి వీలు దోహదపడినట్లు బజాజ్ ఫిన్సర్వ్ ఏఎంసీ సీఈవో గణేశ్ మోహన్ పేర్కొన్నారు. మార్కెట్లు నిలకడగా బలపడటం, పెట్టుబడుల్లో డిజిటైజేషన్‌తో ఈక్విటీ ఎంఎఫ్‌లు పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు తెలియజేశారు. థిమాటిక్ ఫండ్స్ స్పీడ్ గతేడాది ఈక్విటీ పథకాలలో థిమాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ. 1.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ రూ. 32,465 కోట్లు, రూ. 34,223 కోట్లు చొప్పున అందుకున్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ. 19,415 కోట్లు ప్రవహించాయి. పెట్టుబడుల్లో రూ. 2.5 లక్షల కోట్లతో సిప్‌లు ప్రధాన పాత్ర పోషించాయి. -
ఈక్విటీ ఫండ్స్లోకిపెట్టుబడుల ప్రవాహం
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు డిసెంబర్ నెలలో దుమ్మురేపాయి. అక్టోబర్ నెలలో నికరంగా 14 శాతం మేర పెట్టుబడులను కోల్పోయిన ఈక్విటీ ఫండ్స్.. తిరిగి డిసెంబర్ నెలలో రూ.41156 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అక్టోబర్ నెలలో నికర ఈక్విటీ పెట్టుబడులు రూ.35,943 కోట్లతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగాయి. వరుసగా 46వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లో సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. ఈక్విటీలోని అన్ని విభాగాల పథకాల్లోకి నికర పెట్టుబడులు వచ్చాయి. 2024 మొత్తం మీద ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్టర్లు రూ.3.94 లక్షల కోట్లను పెట్టుబడి పెట్టారు. 2023తో పోల్చితే 144 శాతం అధికం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. ఎప్పటి మాదిరే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు తమ జోరును కొనసాగించాయి. ఈ రెండు విభాగాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు. థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌కు సైతం డిమాండ్ కొనసాగింది. డిసెంబర్లో డెట్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.1.3 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోయాయి. దీంతో మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి డిసెంబర్లో రూ.80,355 కోట్లను ఇన్వెస్టర్లను వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా పరిశ్రమ నిర్వహణలోని పెట్టుబడుల విలువ (ఏయూఎం) నెలవారీగా 1.7 శాతం తగ్గి డిసెంబర్ చివరికి రూ.66.9 లక్షల కోట్లకు పరిమితమైంది. విభాగాల వారీగా.. → స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,667 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,093 కోట్లు వచ్చాయి. నవంబర్ నెలతో పోల్చి చూస్తే స్మాల్క్యాప్లోకి 13 శాతం, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి 4 శాతం అధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం వీటిని ఎంపిక చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. → లార్జ్‌క్యాప్ పథకాలు రూ.2,010 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. నవంబర్‌లో వచి్చన రూ.2,500 కోట్లతో పోల్చితే 20% తగ్గాయి. → సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.15,331 కోట్లను ఆకర్షించాయి. నవంబర్‌లో వచి్చన రూ.7,658 కోట్లతో పోల్చితే రెట్టింపయ్యాయి. → డిసెంబర్లో 33 కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు (ఎన్ఎఫ్వో) మార్కెట్లోకి వచ్చాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.13,643 కోట్లను రాబట్టాయి. నవంబర్‌లో మొత్తం 18 ఎన్ఎఫ్వో ఇష్యూలు రాగా, అవి సమీకరించిన మొత్తం రూ.4,000 కోట్లు కావడం గమనార్హం. ఏకంగా మూడింతలకుపైగా పెరిగినట్టు తెలుస్తోంది. → ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,770 కోట్లు వచ్చాయి. నవంబర్‌లో వచి్చన రూ.5,084 కోట్లతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. మల్టీక్యాప్ ఫండ్స్ 15 శాతం తక్కువగా రూ.3,075 కోట్లను ఆకర్షించాయి. → లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో రూ.3,811 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూ.640 కోట్లను ఆకర్షించాయి. 2024 సంవత్సరం మొత్తం మీద గోల్డ్ ఫండ్స్‌లోకి రూ.11,226 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.సిప్ పెట్టుబడుల్లో వృద్ధి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో డిసెంబర్లో ఈక్విటీ పథకాల్లోకి రూ.26,459 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. నవంబర్ నెల సిప్ పెట్టుబడులు రూ.25,320 కోట్లతో పోల్చి చూస్తే 5 శాతం పెరిగాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సిప్ పెట్టుబడుల విలువ రూ.13.63 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్లలో నమ్మకానికి నిదర్శనం ‘‘ఎన్‌ఎఫ్‌వోలు, సిప్ పెట్టుబడులు, ఏక మొత్తంలో కొనుగోళ్లు నికర పెట్టుబడుల ప్రవాహానికి తోడ్పడ్డాయి. పెట్టుబడులు బలంగా రావడం మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి నిదర్శనం’’అని కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ సేల్స్ హెడ్ మనీష్ మెహతా తెలిపారు. మార్కెట్ అస్థిరతల్లోనూ సిప్ పెట్టుబడులు బలంగా కొనసాగడం అన్నది దీర్ఘకాల పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నట్టు మిరే అస్సెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ డి్రస్టిబ్యూషన్ హెడ్ సురంజన బోర్తకుర్ పేర్కొన్నారు. -
రూ.30 లక్షలు ఇన్వెస్ట్.. ఫండ్స్లోనా లేదా స్టాక్స్లోనా..?
రూ.30 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేదా నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? మెరుగైన అస్సెట్ అలోకేషన్ విధానం ఏది అవుతుంది? – హితేంద్ర వాణిమీ పెట్టుబడి రూ.30 లక్షలను 12 నుంచి 24 సమాన నెలసరి వాయిదాలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి పనితీరు కలిగిన ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి. లేదా నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే అత్యుత్తమ నాణ్యత కలిగిన కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. పటిష్టమైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియోని నిర్మించుకోవడం పెద్ద సవాలుతో కూడుకున్నదే.రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కనుక ఒక కంపెనీకి గరిష్టంగా రూ.6 లక్షలు లేదా అంతకంటే తక్కువ కేటాయించుకోవచ్చు. బలమైన మూలాలు, నమ్మకమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులను వివిధ కంపెనీల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. ఇది రిస్క్‌ను తగ్గిస్తుంది. పెట్టుబడుల నాణ్యతను పెంచుతుంది. ఎంపిక, పెట్టుబడుల కేటాయింపులు, వైవిధ్యం వీపోర్ట్ఫోలియో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.తగినంత సమయం, విశ్వాసం లేకపోతే అప్పుడు మంచి ఫ్లెక్సీక్యాప్ లేదా మల్టీక్యాప్ ఫండ్ మేనేజర్‌పై ఆ బాధ్యతను పెట్టాలి. ఏ స్టాక్స్ ఎంపిక చేసుకోవాలన్న శ్రమ మీకు తప్పుతుంది. స్టాక్స్ పోర్ట్‌ఫోలియో నిర్వహణలో అనుభవం లేకపోతే నేరుగా ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. మీకు తగిన అనుభవం, సమయం ఉంటే, నిబంధనల ప్రకారం వ్యవహరించేట్టు అయితే ఫండ్స్‌తో పోలిస్తే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు.నేను రిటైర్మైంట్ తీసుకున్నాను. క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణ (ఎస్‌డబ్ల్యూపీ) కోసం లిక్విడ్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో దేనిని ఎంపిక చేసుకోవాలి? – విఘ్నేశ్లిక్విడ్ ఫండ్స్ స్థిరత్వంతో, తక్కువ రిస్క్‌తో ఉంటాయి. కనుక షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌తో పోల్చితే సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) కోసం ఇవి అనుకూలం. అతి తక్కువ అస్థిరతలతో, స్థిరమైన రాబడులు ఇవ్వడం వల్ల లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులతో నిశ్చింతగా ఉండొచ్చు.1. లిక్విడ్‌ఫండ్స్ పెట్టుబడుల విలువ దాదాపుగా తగ్గిపోవడం ఉండదు. వారం, నెల వ్యవధిలోనూ ఇలా జరగదు. ఉదాహరణకు కోటక్ లిక్విడ్ ఫండ్ గడిచిన దశాబ్ద కాలంలో వారం వారీ 99.78 శాతం సందర్భాల్లో సానుకూల రాబడులు ఇచ్చింది. నెలవారీగా చూస్తే నూరు శాతం సందర్భాల్లోనూ సానుకూల రాబడులు ఉన్నాయి. అదే కోటక్ షార్ట్ డ్యురేషన్ ఫండ్ పనితీరు గమనించినట్టయితే.. విలువలో కొంత క్షీణించడాన్ని గుర్తించొచ్చు. గడిచిన దశాబ్ద కాలంలో వారం వారీ రాబడులను గమనిస్తే 15.8 శాతం సందర్భాల్లో ప్రతికూలంగా, నెలవారీ రాబడుల్లో 7 శాతం సందర్భాల్లో ప్రతికూల పనితీరును గమనించొచ్చు.2. లిక్విడ్ ఫండ్స్ అయితే అదే రోజు లేదా మరుసటి రోజు పెట్టుబడులు చేతికి అందుతాయి. నెలవారీ ఊహించతగిన రాబడులకు అనుకూలంగా ఉంటాయి. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోనూ లిక్విడిటీ ఎక్కువే. కాకపోతే వాటి ఎన్ఏవీలో స్వల్ప ఊగిసలాటలు ఉంటాయి. ఇది నెలవారీ ఉపసంహరించుకునే మొత్తంపై ప్రభావం చూపిస్తుంది.3. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో రాబడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రూ.10 లక్షల పెట్టుబడిపై ఒక ఏడాదిలో రూ.వేలల్లో ఉంటుంది. కానీ, ఈ మేరకు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది.4. లిక్విడ్ ఫండ్స్‌పై మార్కెట్ అస్థిరతలు పెద్దగా ఉండవు. కనుక ప్రశాంతంగా ఉండొచ్చు. -
ఈక్విటీ ఫండ్స్ అదే జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్‌లోనూ తమ జోరు చూపించాయి. నికరంగా రూ.38,239 కోట్లను ఆకర్షించాయి. ముఖ్యంగా థీమ్యాటిక్ ఫండ్స్, కొత్త పథకాల (న్యూ ఫండ్ ఆఫర్లు/ఎన్‌ఎఫ్‌వోలు) రూపంలో ఎక్కువ పెట్టుబడులను సమీకరించాయి. ఈ ఏడాది జూలైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచి్చన రూ.37,113 కోట్లతో పోల్చి చూస్తే 3.3 శాతం మేర ఆగస్ట్‌లో వృద్ధి నమోదైంది. జూన్‌లో వచి్చన రూ.40,608 కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు నెలవారీ గరిష్ట రికార్డు కాగా, ఆగస్ట్‌లో పెట్టుబడులు రెండో గరిష్ట రికార్డుగా ఉన్నాయి. ఈ గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా అన్ని రకాల పథకాల్లోకి కలిపి ఆగస్ట్‌లో రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో ఇవి రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్నాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ జూలై చివరికి ఉన్న రూ.65 లక్షల కోట్ల నుంచి ఆగస్ట్ చివరికి రూ.66.7 లక్షల కోట్లకు చేరింది. కొత్త గరిష్టానికి సిప్ పెట్టుబడులు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వచ్చే పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో రూ.23,547 కోట్లుగా నమోదయ్యాయి. జూలైలో ఇవి రూ.23,332 కోట్లుగా ఉన్నాయి. విభాగాల వారీగా పెట్టుబడులు.. → థీమ్యాటిక్ ఫండ్స్ (రంగాలు/ప్రత్యేక థీమ్‌లలో ఇన్వెస్ట్ చేసేవి) పథకాల్లోకి అత్యధికంగా రూ.18,117 కోట్లు వచ్చాయి. ఈ తరహా పథకాలు జూలైలో రూ.18,336 కోట్లు, జూన్‌లో రూ.22,352 కోట్ల చొప్పున ఆకర్షించడం గమనార్హం. → ఆగస్ట్‌లో ఆరు కొత్త పథకాలు ప్రారంభం కాగా, అందులో ఐదు సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి రూ.10,202 కోట్లను సమీకరించాయి. → లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,637 కోట్లు వచ్చాయి. మిడ్‌క్యాప్ పథకాలు రూ.3,055 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.3,209 కోట్ల చొప్పున ఆకర్షించాయి. అన్ని రకాల పథకాల్లోకి పెట్టుబడుల రాక ఇన్వెస్టర్లలో మార్కెట్ల పట్ల ఉన్న సానుకూల ధోరణిని తెలియజేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. → ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక రూ.3,513 కోట్లుగా ఉంది. → కేవలం ఫోకస్డ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. → డెట్ పథకాల్లోకి నికరంగా రూ.45,169 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో వచ్చిన రూ.1.2 లక్షల కోట్ల కంటే 62 శాతం తక్కువ. → డెట్‌లో ఓవర్‌నైట్ ఫండ్స్ అత్యధికంగా రూ.15,106 కోట్లను ఆకర్షించాయి. ఆ తర్వాత లిక్విడ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. మొత్తం పెట్టుబడుల్లో 86 శాతం ఈ మూడు విభాగాల్లోని పథకాల్లోకే వచ్చాయి. → గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.1,611 కోట్లను ఆకర్షించాయి. జూలైలో వచ్చిన రూ.1,337 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతానికి పైగా వృద్ధి కనిపిస్తోంది. → మొత్తం ఫోలియోలు (ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలు) జూలై చివరకి ఉన్న 19.84 కోట్ల నుంచి ఆగస్ట్ చివరికి 20 కోట్ల మార్క్‌ను అధిగమించాయి. -
AMFI: ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.37,113 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కొనసాగుతోంది. జూలైలోనూ రూ.37,113 కోట్ల మేర ఈక్విటీ పథకాల్లో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే జూన్ నెలలో వచి్చన రూ.40,608 కోట్లతో పోల్చి చూస్తే మాత్రం 9 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. అయినప్పటికీ నెలవారీ పెట్టుబడుల్లో ఇది రెండో గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి జూలై నెలలో రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పరిశ్రమ నుంచి (అన్ని రకాల పథకాలు) రూ.43,637 కోట్లు నికరంగా బయటకు వెళ్లడం గమనార్హం. దీంతో జూలై చివరికి అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.65 లక్షల కోట్లకు చేరుకుంది. జూన్ చివరికి ఇది రూ.61.15 లక్షల కోట్లుగా ఉంది. సిప్ పెట్టుబడుల జోరు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.23,332 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. జూన్ నెలలో రూ.21,262 కోట్ల సిప్ పెట్టుబడులతో పోలి్చతే 10 శాతం మేర పెరిగాయి. మొత్తం సిప్ నిర్వహణ ఆస్తులు (పెట్టుబడులు) రూ.13,09,385 కోట్లకు చేరాయి. పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు ఇది నిదర్శనమని, క్రమపద్ధతిలో సంపద సృష్టించుకునేందుకు సాయపడుతుందని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌ను నమ్మకమైన పెట్టుబడుల విభాగంగా రిటైల్ ఇన్వెస్టర్లు పరిగణిస్తున్నారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సానుకూల వృద్ధిని నమోదు చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల ఆర్థిక వ్యూహాల్లో మ్యూచువల్ ఫండ్స్ కీలకంగా మారాయి’’అని వెంకట్ తెలిపారు. విభాగాల వారీగా.. → లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.670 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఇవి రూ.970 కోట్లుగా ఉన్నాయి. → లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,622 కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవే పథకాలు రూ.2,912 కోట్లను ఆకర్షించాయి. → మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి జూన్ నెలలో వచి్చన రూ.2,528 కోట్లతో పోలి్చతే.. జూలైలో రూ.1,644 కోట్లకు పరిమితమయ్యాయి. → స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,109 కోట్లు వచ్చాయి. జూన్‌లో వచి్చన రూ.2,263 కోట్లతో పోలి్చతే తగ్గాయి. → మల్టీక్యాప్ ఫండ్స్ రూ.7,085 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఈ పథకాల్లోకి రూ.4,709 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. → వ్యాల్యూ ఫండ్/కాంట్రా ఫండ్స్‌లోకి రూ.2,171 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.18,386 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఇవే ఫండ్స్‌లోకి రూ.22,352 కోట్లు వచ్చాయి. ముఖ్యంగా జూలై నెలలో ఈ విభాగంలో 9 కొత్త ఎన్‌ఎఫ్‌వోలు (నూతన పథకాలు) మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లను సమీకరించాయి. → ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.3053 కోట్లు వచ్చాయి. → డెట్ (స్థిరాదాయ) పథకాల నుంచి జూన్ నెలలో రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లగా.. జూలై నెలలో రూ.1.2 లక్షల కోట్లు తిరిగొచ్చాయి. త్రైమాసికం చివరి నెలలో డెట్ పథకాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సహజంగా కనిపిస్తుంటుంది. డెట్‌లో లిక్విడ్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.70,061 కోట్లు వచ్చాయి. ఎన్‌ఎఫ్‌వోల అండ.. జూన్ నెలతో పోలి్చతే జూలైలో ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు తగ్గాయి. మరీ ముఖ్యంగా నూతన పథకాల లిస్టింగ్ (ఎన్‌ఎఫ్‌వోలు), సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచాయి. ఏక మొత్తంలో పెట్టుబడులు ఎక్కువగా ఎన్‌ఎఫ్‌వోల రూపంలో వచ్చాయి.– మనీష్ మెహతా, కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ హెడ్ (సేల్స్) -
ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం
ముంబై: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జూన్ లో రూ.40,608 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో వచి్చ న పెట్టుబడుల కంటే 17 శాతం అధికం. మే నెలలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 83 శాతం అధికంగా రూ.34,670 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.1,07,357 కోట్లు బయటకు వెళ్లాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ జూన్ చివరికి రూ.61.15 లక్షల కోట్లకు చేరింది. మే నెలతో పోలిస్తే 4% అధికం. ఇందులో ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.27.67 లక్షల కోట్లుగా ఉంది.కొత్త గరిష్టానికి సిప్ పెట్టుబడులుసిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.21,262 కోట్ల పెట్టుబడులు వచ్చా యి. ఇది నెలవారీ సరికొత్త గరిష్ట స్థాయి. మే నెల సిప్ పెట్టుబడులు రూ.20,904 కోట్లు. జూన్‌లో కొత్తగా 55.13 లక్షల సిప్ రిజి్రస్టేషన్లు పెరిగాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య మే చివరికి ఉన్న 8.76 కోట్ల నుంచి జూన్ చివరికి 8.99 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు రూ.12.44 లక్షల కోట్లకు దూసుకుపోయాయి. మే చివరికి ఇవి రూ.11.53 లక్షల కోట్లుగా ఉన్నాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చెప్పుకోతగ్గ వృద్ధిని చూసింది. ఆర్థిక స్థిరత్వానికి, కోట్లాది మంది ఇన్వెస్టర్ల సంపద సృష్టికి కీలకంగా మారింది.’’అని ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. జూన్‌లో పెట్టుబడులు రూ.21,262 కోట్లు మేలో పెట్టుబడులు రూ.20,904 కోట్లుపెట్టుబడుల మొత్తం రూ.12.44 లక్షల కోట్లు (యాంఫి నివేదిక)థీమ్యాటిక్ అదుర్స్ రంగాలవారీ/థీమ్యాటిక్ ఫండ్స్ జూన్ నెలలో రూ.22, 351 కోట్లు ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ విభాగంలో 9 కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభమయ్యాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లు సమీకరించాయి. మలీ్టక్యాప్ ఫండ్స్‌లోకి 78% అధికంగా రూ.4,708 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్‌క్యాప్ పథకాల్లోకి పెట్టుబడులు 46% పెరిగి రూ.970 కోట్లుగా ఉన్నాయి. స్మాల్‌క్యాప్ పథకాల్లోకి 17% తగ్గి రూ.2,263 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి 3% తక్కువగా రూ.2,527 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హైబ్రిడ్ ఫండ్స్ రూ.8,854 కోట్ల పెట్టబడులను ఆకర్షించాయి. ప్యాసివ్స్లోకి రూ.14,601 కోట్లు వచ్చాయి. -
మేలో ఈక్విటీ ఫండ్స్ హవా..!
న్యూఢిల్లీ: గత నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)కు ఇన్వెస్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ మే నెలలో రూ. 34,697 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 83 శాతం అధికంకాగా.. అప్పుడప్పుడూ మార్కెట్లో నమోదైన దిద్దుబాట్లు ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టేందుకు అవకాశాలను కలి్పంచాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా థిమాటిక్ ఫండ్స్‌పట్ల ఆకర్షితులైనట్లు దేశీ ఎంఎఫ్ అసోసియేషన్(యాంఫీ) పేర్కొంది. ఈ బాటలో క్రమబద్ధ పెట్టుబడి పథకాల(సిప్)కు సైతం రూ. 20,904 కోట్ల పెట్టుబడులు లభించినట్లు వెల్లడించింది. ఇది కూడా సరికొత్త రికార్డ్‌కావడం గమనార్హం! హెచ్చుతగ్గుల్లోనూ ఇటీవల మార్కెట్లలో ఆటుపోట్లు కొనసాగినప్పటికీ ఇన్వెస్టర్లు ఈక్విటీలపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు భారీ పెట్టుబడులు తెలియజేస్తున్నాయి. వెరసి ఈక్విటీ ఫండ్స్‌లోకి వరుసగా 39వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు ప్రవేశించాయి. ఏప్రిల్‌లో సిప్ పెట్టుబడులు రూ. 20,371 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో వరుసగా రెండో నెలలోనూ సిప్‌లో రూ. 20,000 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు సిప్‌లో ఇన్వెస్ట్ చేసే సంగతి తెలిసిందే. ఇక మొత్తంగా ఎంఎఫ్ పరిశ్రమకు మే నెలలో రూ. 1.1 లక్ష కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్‌లో ఇవి రూ. 2.4 లక్షల కోట్లుకావడం గమనార్హం! ఫలితంగా ఎంఎఫ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) ఏప్రిల్‌లో నమోదైన రూ. 57.26 లక్షల కోట్ల నుంచి మే చివరికల్లా రూ. 58.91 లక్షల కోట్లకు బలపడింది. స్మాల్ క్యాప్స్ జోరు చిన్న షేర్ల(స్మాల్ క్యాప్స్) విభాగం మే నెలలో 23 శాతం వృద్ధితో రూ. 2,724 కోట్ల పెట్టుబడులను అందుకుంది. అయితే లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు రూ. 663 కోట్లు మాత్రమే లభించాయి. అంటే ప్రత్యేకించిన, అధిక రిటర్నులు అందించే అవకాశాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీర్ఘకాలంగా మార్కెట్లలో అప్‌ట్రెండ్ కొనసాగుతుండటంతో మధ్యమధ్యలో వస్తున్న దిద్దుబాట్లను ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు అవకాశాలుగా వినియోగించుకుంటున్నట్లు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. కొటక్ మహీంద్రా ఏఎంసీ సేల్స్ నేషనల్ హెడ్ మనీష్ మెహతా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదన్న అంచనాలు సైతం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టనుందన్న అంచనాలు మార్కెట్లలో మరింత ర్యాలీకి కారణమవుతుందన్న ఆలోచన కొనుగోళ్లకు దారి చూపుతున్నట్లు వివరించారు. దేశ ఆర్థిక వృద్ధిపట్ల విశ్వాసంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు క్యూ కడుతున్నట్లు ఫైయర్స్ వైస్‌ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు. ఇక ఈక్విటీలుకాకుండా రుణ పథకాల విభాగంలోనూ రూ. 42,495 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై ఆసక్తి చూపడం ప్రభావం చూపింది. అయితే ఏప్రిల్‌లో నమోదైన రూ. 1.9 లక్షల కోట్లతో పోలిస్తే పెట్టుబడులు 78 శాతం క్షీణించాయి. రుణ పథకాలలో లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా రూ. 25,873 కోట్లు ఆకట్టుకుని రికార్డ్ నెలకొల్పాయి. ఈఎల్ఎస్ఎస్ మినహా ఈక్విటీ ఆధారిత ఎంఎఫ్‌లలో నికర పెట్టుబడులు రూ. 25 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించి రూ. 25.39 లక్షల కోట్లకు చేరాయి. ఇది చరిత్రాత్మక గరిష్టమని యాంఫీ సీఈవో వెంకట్ చలసాని తెలియజేశారు. ఫోకస్డ్, ఈక్విటీ లింక్డ్ పొదుపు పథకాలు(ఈఎల్ఎస్ఎస్) విభాగాలను మినహాయించి చూస్తే ఇతర విభాగాలకు నికరంగా పెట్టుబడులు తరలి వచి్చనట్లు పేర్కొన్నారు. సెక్టార్, థిమాటిక్ ఫండ్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. దీంతో మే నెలలో రూ. 19,213 కోట్లు లభించాయి. ప్రధానంగా హెచ్డీఎఫ్సీ మ్యాన్యుఫాక్చరింగ్ ఫండ్ నుంచి వెలువడిన కొత్త ఆఫరింగ్(ఎన్ఎఫ్వో) రూ. 9,563 కోట్లు అందుకోవడం ఇందుకు సహకరించింది. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగడం, లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గడం తదితర అంశాల కారణంగా ఏప్రిల్‌లో ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు క్షీణించాయి. మార్చితో పోలిస్తే 16 శాతం తగ్గి రూ. 18,917 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రవాహం కొంత తగ్గినప్పటికీ 2021 మార్చి నుంచి చూస్తే వరుసగా 38వ నెల కూడా ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా పెట్టుబడుల రాక కొనసాగినట్లు మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల్లో వెల్లడైంది. మరోవైపు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) రూపంలో పెట్టుబడులు ఏప్రిల్‌లో కీలకమైన రూ. 20,000 కోట్ల మార్కును దాటి ఆల్–టైమ్ గరిష్ట స్థాయి రూ. 20,371 కోట్లకు చేరాయి. అంతక్రితం నెలలో ఇవి రూ. 19,271 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మీద మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి మార్చిలో రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరగ్గా, ఏప్రిల్‌లో రూ. 2.4 లక్షల కోట్లు వచ్చాయి. డెట్ స్కీముల్లోకి అత్యధికంగా రూ. 1.9 లక్షల కోట్లు వచ్చాయి. యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు.. → ఈక్విటీ, డెట్ కేటగిరీల్లోకి పెట్టుబడులు ప్రవా హం పటిష్టంగా ఉండటంతో నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 57.26 లక్షల కోట్లకు పెరిగింది. మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 53.54 లక్షల కోట్లుగా ఉంది. → ఈక్విటీ ఆధారిత స్కీముల్లోకి ఏప్రిల్‌లో రూ. 18,917 కోట్లు వచ్చాయి. మార్చిలో ఇది రూ. 22,633 కోట్లుగా, ఫిబ్రవరిలో రూ. 26,866 కోట్లుగా నమోదైంది. → గత నెల ఓపెన్ ఎండెడ్ స్కీముల విభాగంలో తొమ్మిది స్కీముల ద్వారా ఫండ్ సంస్థలు రూ. 1,532 కోట్లు సమీకరించాయి. → లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు మార్చిలో రూ. 2,128 కోట్లు రాగా ఏప్రిల్‌లో ఏకంగా రూ. 357 కోట్లకు పడిపోయాయి. స్మాల్ క్యాప్ కేటగిరీలోకి రూ. 2,208 కోట్లు వచ్చాయి. అంతక్రితం నెలలో రూ. 94 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను మదుపరులు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్స్‌లోకి రూ. 5,166 కోట్లు, మలీ్ట–క్యాప్ కేటగిరీలోకి రూ. 2,724 కోట్లు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల నుంచి రూ. 144 కోట్ల ఉపసంహరణ జరిగింది. → హైబ్రిడ్ ఫండ్స్‌లోకి చెప్పకోతగ్గ స్థాయిలోకి రూ. 19,863 కోట్లు రాగా, డెట్ ఆధారిత స్కీముల విషయానికొస్తే లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ. 1.02 లక్షల కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ. 34,000 కోట్లు, ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి రూ. 21,000 కోట్లు వచ్చాయి. → మ్యుచువల్ ఫండ్స్ ఫోలియోల సంఖ్య ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 18.14 కోట్లకు చేరింది. -
మార్చిలో ఎంఎఫ్‌లు డీలా
న్యూఢిల్లీ: గత నెల(మార్చి) ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు నీరసించాయి. జనవరితో పోలిస్తే 16 శాతం క్షీణించి రూ. 22,633 కోట్లకు పరిమితమయ్యాయి. ఈక్విటీ ఆధారిత పథకాలకు ఫిబ్రవరిలో రూ. 26,866 కోట్ల పెట్టుబడులు లభించాయి. అయితే వరుసగా 37వ నెలలోనూ ఈక్విటీ ఎంఎఫ్లకు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు లభించినట్లు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) మార్చి గణాంకాలు పేర్కొన్నాయి. వీటి ప్రకారం థిమాటిక్ ఫండ్స్, కొత్త ఫండ్ ఆఫరింగ్స్(ఎన్‌ఎఫ్‌వోలు) ఇందుకు సహకరించాయి. ప్రధానంగా సిప్ నెలవారీ పెట్టుబడులు మార్చిలో రూ. 19,270 కోట్లకు చేరడం మద్దతిచి్చంది. ఫిబ్రవరిలో ఇవి రూ. 19,187 కోట్లుగా నమోదయ్యాయి. మార్చిలో హైబ్రిడ్ ఫండ్స్ రూ. 5,584 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. ఇక మార్చితో ముగిసిన గతేడాది(2023–24) అంతక్రితం ఏడాదితో పోలిస్తే సిప్ పెట్టుబడులు 28 శాతం వృద్ధితో రూ. 2 లక్షల కోట్లను తాకాయి. రుణ పథకాల నుంచి అత్యధికంగా రూ. 1.98 లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. మార్చిలో మొత్తం ఫండ్స్ పరిశ్రమ నుంచి రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. ఇందుకు ముందస్తు పన్ను చెల్లింపులు, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అధిక విలువలకు చేరడం కారణమయ్యాయి. ఇక ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని నికర ఆస్తుల విలువ(ఏయూఎం) ఫిబ్రవరిలో నమోదైన రూ. 54.54 లక్షల కోట్ల నుంచి మార్చికల్లా రూ. 53.4 లక్షల కోట్లకు వెనకడుగు వేసింది. -
చిన్న షేర్ల పెద్ద ర్యాలీ
న్యూఢిల్లీ: దలాల్ స్ట్రీట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023 –24)లో రిటైల్ ఇన్వెస్టర్ల హవా కొనసాగింది. దేశంలో దృఢమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, ఆకర్షణీయమైన కార్పొరేట్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు చిన్న, మధ్య స్థాయి షేర్లును కొనేందుకు ఆధిక ఆసక్తి చూపారు. 2023–24లో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 62%, స్మాల్ క్యాప్ సూచీ 60% రాణించాయి. ఇదే కాలంలో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 25% పెరిగింది. ‘‘ఆదాయాలు గణనీయంగా పెరగడం, అధిక వృద్ధి అవకాశాలతో రిటైల్ ఇన్వెస్టర్లు చిన్న, మధ్య తరహా షేర్లను కొనుగోలుకు ఆసక్తి చూపారు. లార్జ్ క్యాప్ షేర్ల పట్ల విముఖత చూపారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నికర పెట్టుబడులు పెరగడం ఇందుకు నిదర్శనం. ఆర్థిక విస్తరణ సమయంలో చిన్న, మధ్య తరహా షేర్ల వృద్ధి వేగంగా ఉంటుందనే సంప్రదాయ సూత్రాన్ని వారు విశ్వసించారు. అంతేకాకుండా స్మాల్, మిడ్ సైజ్ కంపెనీల అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు వారిని కొనుగోళ్ల వైపు ఆకర్షితం చేశాయి’’ అని హెడ్జ్ ఫండ్ హెడోనోవా సీఐఓ సుమన్ బెనర్జీ తెలిపారు. ► 2023–24లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫిబ్రవరి 8న 40,282 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. గతేడాది మార్చి 31న 23,881 వద్ద ఏడాది కనిష్టానికి తాకింది. ► ఇదే కాలంలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ ఫిబ్రవరి 7న 46,821 వద్ద ఆల్‌టైం హైని నమోదు చేయగా, గతేడాది మార్చి 31న 26,692 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ► సెన్సెక్స్‌తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చిన్న, మధ్య స్థాయి షేర్ల అత్యుత్తమ ప్రదర్శన భారత ఈక్విటీ మార్కెట్ క్రియాశీలక స్వభావాన్ని, ఇన్వెస్టర్ల అపార వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తుందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతీ తెలిపారు. ► వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ చిన్న, మధ్య తరహా షేర్ల ర్యాలీ కొనసాగుతుందని న్యాతీ అభిప్రాయపడ్డారు. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వమే తిరిగి అధికారాన్ని దక్కించుకోవచ్చనే అంచనాలతో వ్యాపార అనుకూల వాతావరణం పెంపొంది స్థిరమైన వృద్ధి కొనసాగొచ్చు. దీనికి తోడు భారత వృద్ధి బలమైన అవుట్‌లుక్ అంచనాలు ఈ రంగాల షేర్లకు డిమాండ్‌ను పెంచుతాయి’’ న్యాతీ తెలిపారు. అయితే కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ అనిశి్చతులు, లాభాల స్వీకరణ వంటి అంశాలు స్వల్పకాలిక ఒడిదుడుకులకు దారితీయొచ్చన్నారు. ఐపీవో బాటలో ఆఫ్కన్స్ ఇన్ఫ్రా ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లి క్ఇష్యూ బాట పట్టింది. సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఐపీవోతో రూ. 7,000 కోట్లు సమకూర్చుకోనుంది. రూ. వెయ్యి కోట్లకు జిరోధా ఫండ్ విలువ జిరోధా, స్మాల్‌కేస్ జేవీ జిరోధా ఫండ్ హౌస్ నిర్వహణలోని ఆస్తుల విలువ కేవలం 40 రోజుల్లో రూ. 500 కోట్ల మేర ఎగిసింది. దీంతో సంస్థ ఏయూఎం రూ. 1,000 కోట్ల మార్కును దాటింది. -
ఈక్విటీ ఎంఎఫ్లకు ఫిబ్రవరిలో రూ.26,866 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్)లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.26,866 కోట్ల పెట్టుబడులు వచ్చాయని భారత మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) గణాంకాలు వెల్లడించాయి. ఒక నెలలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం గడిచిన 23 ఏళ్లలో గరిష్టం. ఈ జనవరిలో వెల్లువెత్తిన రూ.21,721 కోట్లతో పోలిస్తే కూడా 23% అధికం. కొత్త ఫండ్ల ఆవిష్కరణ, థీమాటిక్/సెక్టోరియల్ ఫండ్లపై ఆసక్తి ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) పథకాల్లోకి కూడా ఫిబ్రవరి జీవితకాల గరిష్టం రూ.19,186 కోట్లకు చేరాయి. జనవరి ఇవి రూ.18,838 కోట్లుగా ఉన్నాయి. -
వెయ్.. ‘సిప్’ వెయ్
న్యూఢిల్లీ: మెజారిటీ యవత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకుంటున్నారు. డిజిటల్ రూపంలో లావాదేవీలు సులభంగా నిర్వహించుకునే వీలు, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, ఆర్థిక అక్షరజ్ఞానం పెరుగుతుండడం ఇందుకు వీలు కలి్పస్తున్నట్టు వైట్ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఈ సంస్థ నిర్వహణలో 3.33 లక్షల ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.8,400 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఏడాది క్రితమే ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలు మొదలు పెట్టింది. తన కస్టమర్లలో 56 శాతం జెనరేషన్ జెడ్, మిలీనియల్స్ (జెనరేషన్ వై) ఉన్నట్టు తెలిపింది. 1981–1996 మధ్య జన్మించిన వారు జెనరేషన్ వై కిందకు, 1997–2012 మధ్య జని్మంచిన వారు జెనరేషన్ జెడ్ కిందకు వస్తారు. తనకున్న 3.33 లక్షల కస్టమర్లలో 28 శాతం మేర జెనరేషన్ జెడ్, మరో 28 శాతం మేర జెనరేషన్ వై విభాగంలోని వారేనని ఈ సంస్థ తెలిపింది. అంతేకాదు 51 శాతం మంది డిజిటల్ చానల్స్ ద్వారానే ఇన్వెస్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘జెనరేషన్ వై, జెడ్ డిజిటల్ టెక్నాలజీ తెలిసిన వారు. కనుక వారు టెక్నాలజీ ఆధారితంగా నడిచే ఫైనాన్షియల్ సరీ్వస్ ప్రొవైడర్లకు ప్రాధాన్యత ఇవ్వడం సహజమే’’అని వైట్ఓక్ క్యాపిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్ పంత్ తెలిపారు. సహేతుక రాబడులు, నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడుల నిర్వహణ, చాలా స్వల్ప మొత్తం నుంచే పెట్టుబడికి అవకాశం, ఎన్నో రకాల పెట్టుబడి పథకాలు, సులభంగా ఉపసంహరించుకునే వెసులుబాటు ఇవన్నీ యువ ఇన్వెస్టర్లు సిప్ వేసేందుకు అనుకూలిస్తున్నట్టు చెప్పారు. టికెట్ సైజు తక్కువే 18–35 ఏళ్ల వయసు వారు సిప్ రూపంలో చేస్తున్న పెట్టుబడి, ఇంతకంటే పెద్ద వయసులోని వారితో పోలిస్తే తక్కువగానే ఉన్నట్టు వైట్ఓక్ తెలిపింది. తమ పాకెట్ మనీ నుంచి లేదంటే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం ద్వారా వచ్చే మొత్తం నుంచి వీరు ఇన్వెస్ట్ చేస్తుండొచ్చని ప్రతీక్ పంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలో 7.92 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయి. -
అరుదైన పెట్టుబడుల అవకాశాలు..!
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఎన్నో విధానాలు ఉన్నాయి. అందులో స్పెషల్ సిచ్యుయేషన్స్ థీమ్ కూడా ఒకటి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని కంపెనీల ధరలు ఆకర్షణీయమైన స్థాయిలకు, చౌక విలువకు దిగి వస్తాయి. అలాంటప్పుడు వాటిల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు ఆర్జించడమే స్పెషల్ సిచ్యుయేషన్స్ థీమ్‌లో కనిపిస్తుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ కూడా ఇదే మాదిరి పనిచేస్తుంటుంది. ఈ పథకానికి మెరుగైన రాబడుల చరిత్ర ఉంది. రాబడులు ఈ పథకంలో ఐదేళ్ల క్రితం ఒకే విడత రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇప్పుడు అది రూ.2.8 లక్షలుగా మారి ఉండేది. ఈ పథకానికి ఐదేళ్ల చరిత్ర ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఐవో శంకరన్ నరేన్తోపాటు, రోషన్ చట్కే దీని నిర్వహణ వ్యవహరాలు చూస్తున్నారు. ఈ పథకం 2019 జనవరి 15న మొదలైంది. ఆరంభం నుంచి చూస్తే ఈ పథకం ఏటా 22.9 శాతం చొప్పున కాంపౌండెడ్ వార్షిక రాబడులు (సీఏజీఆర్) అందించింది. ఈ పథకం పనితీరుకు బెంచ్‌మార్క్‌గా పరిగణించే నిఫ్టీ 500 టీఆర్ఐ ఇదే కాలంలో ఇచ్చిన రాబడి 19 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో ఏటా 37.7 శాతం చొప్పున రాబడి అందించగా, నిఫ్టీ 500 టీఆర్ఐ రాబడి 19.8 శాతంగానే ఉంది. సూచీ కంటే 17.9 శాతం అధిక రాబడిని అందించినట్టు తెలుస్తోంది. ఏడాది కాల రాబడి చూసినా 38 శాతంగా ఉంది. ఇదే కాలంలో సూచీ రాబడి 30 శాతమే కావడం గమనించాలి. ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున ఈ పథకంలో సిప్ చేస్తూ వచ్చి ఉంటే, రూ.12.58 లక్షలు సమకూరి ఉండేది. పెట్టుబడుల విధానం ముందు చెప్పినట్టుగానే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ అన్నది స్పెషల్ సిచ్యుయేషన్స్ థీమ్‌తో నడిచే పథకం. ఏదైనా ఒక కంపెనీ లేదా రంగంలో కొన్ని సమస్యల వల్ల షేరు ధర గణనీయంగా దిద్దుబాటుకు గురైనప్పుడు, ఆ కంపెనీ/రంగం దీర్ఘకాల వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయన్నది ఈ పథకం అంచనా వేస్తుంది. దీర్ఘకాలంలో బలమైన, మెరుగైన పనితీరుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫండ్ మేనేజర్ భావిస్తే వెంటనే దిద్దుబాటుకు గురైన కంపెనీల్లో, రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, పెట్టుబడిదారులకు మంచి రాబడులను ఇచ్చే విధంగా పనిచేస్తుంటారు. సకాలంలో లాభాలు స్వీకరించడం, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కంపెనీలపై దృష్టి సారించడం వంటివి మంచి పనితీరుకు దోహదం చేస్తున్న అంశాలు. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,205 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 92.52 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 1.53 శాతం డెట్ సాధనాలకు కేటాయించగా, మిగిలినది నగదు రూపంలో ఉంది. ఈక్విటీల్లో 78 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలకు 20 శాతం కేటాయించగా, స్మాల్‌క్యాప్ కేటాయింపులు 1.78 శాతంగా ఉన్నా యి. ప్రధానంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, ఫార్మాస్యూటికల్స్, టెలికం సర్వీసెస్ కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉంది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం భారతీ ఎయిర్టెల్ 6.74 ఐసీఐసీఐ బ్యాంక్ 6.40 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.64 సన్‌ఫార్మా 4.43 ఇన్ఫోసిస్ 3.96 కోటక్ బ్యాంక్ 3.92 ఓఎన్జీసీ 3.81 ఎన్టీపీసీ 3.75 టాటా స్టీల్ 2.93 హీరో మోటో 2.82 -
ఈక్విటీ ఫండ్స్‌లోకి జోరుగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జనవరిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి. ఈక్విటీ పథకాల్లోకి రెండేళ్ల గరిష్ట స్థాయిలో రూ.21,780 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్, థీమ్యాటిక్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. ఫోకస్డ్ ఫండ్స్ మినహా మిగిలిన అన్ని ఈక్విటీ విభాగాలు పెట్టుబడులను ఆకర్షించాయి. 2023 డిసెంబర్ నెలలో వచి్చన రూ.16,997 కోట్లతో పోల్చి చూసినప్పుడు 28 శాతం అధికంగా పెట్టుబడులు వచి్చనట్టు తెలుస్తోంది. చివరిగా 2022 మార్చి నెలలో రూ.28,443 కోట్లు ఈక్విటీ ఫండ్స్‌లోకి రాగా, ఇప్పటి వరకు అదే గరిష్ట రికార్డుగా కొనసాగింది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)కు ఆదరణ కొనసాగుతోంది. సిప్ ద్వారా వచ్చే పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అయిన రూ.18,838 కోట్లకు చేరాయి. డిసెంబర్ నెలలో వచి్చన సిప్ పెట్టుబడులు రూ.17,610 కోట్లను అధిగమించాయి. జనవరి నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. కొత్తగా 51.84 లక్షల సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాలు జనవరి చివరికి 7.92 కోట్లకు పెరిగాయి. ‘‘జనవరిలో అస్థిరతలు ఉన్నప్పటికీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బలమైన పనితీరు చూపించాయి. మార్కెట్ ఆటుపోట్లలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు స్థిరమైన విశ్వాసాన్ని కొనసాగించడం, దీర్ఘకాలంలో సంపద సృష్టి దిశగా వారి నిబద్ధతను తెలియజేస్తోంది’’అని బ్రోకరేజీ సంస్థ ‘ప్రభుదాస్ లీలాధర్’ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ హెడ్ పంకజ్ శ్రేష్ట పేర్కొన్నారు. జనవరిలో మూడు కొత్త ఈక్విటీ పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) సంయుక్తంగా రూ.967 కోట్లను సమీకరించినట్టు మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అనలిస్ట్ మెలి్వన్ శాంటారియా తెలిపారు. విభాగాల వారీగా.. ► థీమ్యాటిక్ ఫండ్స్‌లోకి రూ.4,805 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,257 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్ నెలతో పోల్చి చూసినప్పుడు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.600 కోట్ల పెట్టుబడుల రాక తగ్గింది. ► మల్టీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,039 కోట్లు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,287 కోట్లు ఆకర్షించాయి. 19 నెలల తర్వాత ఇదే గరిష్ట స్థాయి. డిసెంబర్ నెలలో లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.281 కోట్ల పెట్టుబడులను కోల్పోవడం గమనార్హం. ► డెట్ ఫండ్స్ రూ.76,469 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. డిసెంబర్ నెలలో ఇదే విభాగం రూ.75,560 కోట్ల పెట్టుబడులను కోల్పోవడం గమనార్హం. ► డెట్ విభాగంలో అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.49,468 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.10,651 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► గోల్డ్ ఈటీఎఫ్ పథకాలలో ఇన్వెస్టర్లు రూ.657 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ► మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ జనవరి నెలలో రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. గత డిసెంబర్లో రూ.40,685 కోట్ల పెట్టుబడులను కోల్పోవడంతో పోలిస్తే పరిస్థితి పూర్తిగా మారింది. ► మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ డిసెంబర్ చివరికి ఉన్న రూ.50.78 లక్షల కోట్ల నుంచి రూ.52.74 లక్షల కోట్లకు పెరిగింది. బంగారంలో హెడ్జింగ్.. ‘‘మిడ్‌క్యాప్ స్టాక్స్ 15 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్ 20 శాతం మేర ప్రీమియం వ్యాల్యూషన్లలో ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో విలువల అంతరాన్ని గుర్తించారు. అందుకు తగ్గట్టు పెట్టుబడుల్లో మార్పులు చేసుకున్నారు’’అని ఫైయర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధికంగా ఉండడంతో బంగారం సురక్షిత సాధనంగా, ద్రవ్యోల్బణానికి మంచి హెడ్జింగ్ సాధనంగా కొనసాగుతుందని మెలి్వన్ శాంటారియా పేర్కొన్నారు. -
సిప్ పెట్టుబడుల్లో కొత్త రికార్డ్
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు గత నెల(నవంబర్)లో 22 శాతం నీరసించాయి. నెలవారీగా చూస్తే రూ. 15,536 కోట్లకు చేరాయి. అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అక్టోబర్‌లో రూ. 19,957 కోట్ల పెట్టుబడులు లభించగా.. సెప్టెంబర్‌లో ఇవి రూ. 14,091 కోట్లుగా నమోదయ్యాయి. దేశీ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వెల్లడించిన గణాంకాలివి. దీపావళి తదితర పండుగలు, బ్యాంక్ సెలవులు నికర పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కొటక్ మ్యూచువల్ ఫండ్ సేల్స్ హెడ్ మనీష్ మెహతా పేర్కొన్నారు. అయితే వరుసగా 33వ నెలలోనూ పెట్టుబడులు లభించడం గమనించదగ్గ అంశంకాగా.. ఈక్విటీకి సంబంధించిన అన్ని విభాగాలలోకీ పెట్టుబడులు ప్రవహించాయి. ఇందుకు కొత్తగా ఆరు ఫండ్స్ రంగ ప్రవేశం చేయడం సహకరించింది. వెరసి నవంబర్‌లో ఇవి రూ. 1,907 కోట్లు అందుకున్నాయి. అయితే నవంబర్‌లో పెట్టుబడులు క్షీణించినప్పటికీ కొత్త రికార్డు నెలకొల్పుతూ క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్‌లు) ద్వారా రూ. 17,073 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. సిప్ ద్వారా చేకూరనున్న లబ్దిపై అవగాహన పెరగుతుండటంతో కొత్త ఇన్వెస్టర్లను ఇవి ఆకట్టుకుంటున్నాయి. వెరసి సిప్ పెట్టుబడులు జోరు చూపుతున్నాయి. కారణాలున్నాయ్ గరిష్టస్థాయిలోని ఆర్థిక లావాదేవీలు, నిలకడైన జీఎస్టీ వసూళ్లు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలపై విశ్వాసం నేపథ్యంలో ఇన్వెస్టర్లు వివిధ రంగాలలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్ ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయని ఫైయర్స్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు. ఫలితంగా అక్టోబర్‌లో నమోదైన రూ. 16,928 కోట్లను నవంబర్(రూ. 17,073 కోట్లు) అధిగమించినట్లు తెలియజేశారు. ఈక్విటీ ఫండ్స్‌లో మధ్య, చిన్నతరహా ఈక్విటీ ఫండ్స్ అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు వివరించారు. మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో ఇవి 41 శాతాన్ని ఆక్రమిస్తున్నట్లు వెల్లడించారు. స్మాల్ క్యాప్ ఫండ్స్ గరిష్టంగా రూ. 3,699 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ. 2,666 కోట్లు, కొన్ని రంగాలు లేదా థీమాటిక్ ఫండ్స్ రూ. 1,965 కోట్లు చొప్పున పెట్టుబడులను అందుకున్నాయి. అయితే లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు మందగించగా.. ఇండెక్స్ ఫండ్స్‌లోకి రూ. 1,353 కోట్లు ప్రవహించాయి. ఆస్తుల వృద్ధి నవంబర్‌లో మార్కెట్ ప్రామాణిక ఇండెక్సులు చరిత్రాత్మక గరిష్టాలకు చేరడంతో 42 సంస్థల మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని నికర ఆస్తులు(ఏయూఎం) రూ. 49.04 లక్షల కోట్లను తాకాయి. అక్టోబర్‌లో చివర్లో ఇది రూ. 46.71 లక్షల కోట్లుగా నమోదైంది. మరోపక్క రుణ ఆధారిత సెక్యూరిటీల విభాగంలో గత నెల రూ. 4,707 కోట్లు వెనక్కి మళ్లాయి. అక్టోబర్‌లో మాత్రం డెట్ ఫండ్స్‌కు రూ. 42,634 కోట్ల పెట్టుబడులు లభించాయి. మనీ మార్కెట్, దీర్ఘకాలిక, బ్యాంకింగ్, పీఎస్‌యూ, గిల్ట్, ఫ్లోటర్ విభాగాలను మినహాయిస్తే.. ఇతర కేటగిరీలలో నికరంగా పెట్టుబడులు తరలివెళ్లాయి. పన్ను చట్టాల సవరణ తదుపరి ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్‌లో పెట్టుబడులు మందగించినట్లు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. వడ్డీ రేట్ల అనిశ్చిత పరిస్థితులు ఇన్వెస్టర్ల పెట్టుబడి నిర్ణయాలను మరింత సంక్లిష్టం చేసినట్లు అభిప్రాయపడ్డారు. -
మీ పెట్టుబడికి మీరే డ్రైవర్!
భవిష్యత్ లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నియమబద్ధంగా పెట్టుబడులు పెట్టే ధోరణి మన దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. ఇందుకు నెలవారీ వస్తున్న సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులే నిదర్శనం. 16,928 కోట్లు సిప్ రూపంలో అక్టోబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఒక నెలలో సిప్ ద్వారా వచి్చన గరిష్ట పెట్టుబడులు ఇవి. అంతేకాదు, ప్రతి నెలా ఈ మొత్తం పెరుగుతూ పోతుండడం, మరింత మంది ఇన్వెస్టర్లు ఈక్విటీ ఫండ్స్ వైపు అడుగులు వేస్తుండడాన్ని తెలియజేస్తోంది. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల కనీసం ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్ ప్లాన్లు, రెగ్యులర్ ప్లాన్లలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది తెలిసి ఉండాలి. దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్స్ ద్వారా సంపద సమకూర్చుకోవాలని ఆశించే వారు ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకుంటే ఎక్కువ ప్రయోజనమో తెలిసి ఉంటే, తమ లక్ష్యం సులువు అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లు దీర్ఘకాలంలో అధిక రాబడులు అందిస్తాయి. రెగ్యులర్ ప్లాన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ డి్రస్టిబ్యూటర్ ద్వారా లేదా బ్రోకర్ ద్వారా విక్రయించే ప్లాన్. దీనిపై వారికి అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) నుంచి కమీషన్లు అందుతాయి. కనుక ఎక్స్పెన్స్ రేషియో (ఇన్వెస్టర్ పెట్టుబడి నుంచి ఏటా వసూలు చేసే మొత్తం) రెగ్యులర్ ప్లాన్లలో అధికంగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. మూడో పక్షం (బ్రోకర్లు, ఫిన్‌టెక్ సంస్థలు) కూడా రెగ్యులర్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. అయినప్పటికీ వీటిపై కమీషన్ చెల్లింపులు ఉండవు. కనుక డైరెక్టర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో, రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్ ప్లాన్లను ప్రవేశపెట్టి పదేళ్లు అవుతోంది. అయినా, ఇప్పటికీ ఎక్కువ మంది పెట్టుబడులు రెగ్యులర్ ప్లాన్లలోకే వెళుతున్నాయి. డైరెక్ట్ ప్లాన్లలో రాబడులు ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో ఫోలియోలు ఎంతో తక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతీ ఇన్వెస్టర్ వీటి మధ్య వైరుధ్యాన్ని తప్పక తెలిసి ఉండాలి. అనుకూలతలు... మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ (సలహాదారు) లేదా పంపిణీదారు (డి్రస్టిబ్యూటర్) సేవలు అవసరం లేకుండా నేరుగా పెట్టుబడులు పెట్టే వారికి వ్యయాలు ఆదా చేసుకునేందుకు తీసుకొచి్చందే డైరెక్ట్ ప్లాన్లు. సులభంగా చెప్పాలంటే డ్రైవర్ సాయం లేకుండా ఎవరి కారును వారు డ్రైవ్ చేసుకున్నట్టు. ఇన్వెస్టర్ తన పెట్టుబడుల నిర్వహణను తానే చూసుకోవడం. మ్యూచువల్ ఫండ్స్‌లో టీఈఆర్ అని ఉంటుంది. అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్). ఇందులో ఫండ్ నిర్వహణ చార్జీలు, మార్కెటింగ్ వ్యయాలు, రిజిస్ట్రార్ ఫీజు, కస్టోడియన్ ఫీజు, ఇతర వ్యయాలు కలిపి ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్లలో పంపిణీదారులకు కమీషన్ చెల్లించాల్సి వస్తుంది. కనుక ఇక్కడ చెప్పుకున్న వివిధ రకాల వ్యయాలకు కమీషన్ కూడా తోడు కావడంతో రెగ్యులర్ ప్లాన్లలో టీఈఆర్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టర్ పెట్టుబడి విలువపై వార్షికంగా టీఈఆర్‌ను అమలు చేస్తారు. కానీ చార్జీ మినహాయింపు ఏరోజుకారోజు కొనసాగుతుంది. పెట్టుబడి నుంచి అధిక వ్యయాలను మినహాయించినప్పుడు ఆ మేర రాబడి తగ్గుతుంది. ఒక ఇన్వెస్టర్ రెండు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో రూ.10,000 చొప్పున లమ్సమ్‌గా ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ‘ఏ’ అనే పథకంలో టీఈఆర్ ఒక శాతంగా ఉంది. ‘బీ’ అనే పథకంలో టీఈఆర్ 2.5 శాతంగా ఉంది. కానీ, పదేళ్ల తర్వాత రూ.10,000 పెట్టుబడి ‘ఏ’ పథకంలో రూ.36,587గా మారితే, ‘బీ’ పథకంలో రూ.31,407 సమకూరింది. అంటే వ్యత్యాసం ఎంతుందో స్పష్టంగా అర్థమవుతోంది. రాబడులు పేరొందిన ఈక్విటీ ఫండ్స్ డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్లలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసే వారి రాబడులు పరిశీలించినా.. డైరెక్ట్ ప్లాన్లలోనే ఎక్కువ ఉంటున్నాయి. ఉదాహరణకు మిరే అస్సెట్ లార్జ్‌క్యాప్ ఫండ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఎక్స్ఐఆర్ఆర్) డైరెక్ట్ ప్లాన్‌లో 16.73 శాతం రాగా, రెగ్యులర్ ప్లాన్‌లో ఇది 15.60 శాతంగానే ఉంది. అంటే గడిచిన పదేళ్లలో ఈ పథకంలో చేసిన రూ.6 లక్షల సిప్ కాస్తా డైరెక్ట్ ప్లాన్‌లో రూ.14.26 లక్షలుగా మారితే, రెగ్యులర్ ప్లాన్‌లో రూ.13.42 లక్షలు అయి ఉండేది. అంటే ఈ రెండింటి మధ్య రూ.82,945 వ్యత్యాసం కనిపిస్తోంది. రెగ్యులర్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల ఇన్వెస్టర్ పదేళ్ల కాలంలో కమీషన్ల రూపేణా ఇంత మొత్తం నష్టపోవాల్సి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్, ఐసీసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్‌లోనూ రెగ్యులర్ ప్లాన్‌తో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో రూ.67,540, రూ.60,788 చొప్పున అధిక రాబడి వచ్చింది. నేపథ్యం.. 2007 వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడులపై 2–2.5 శాతం వరకు ఎంట్రీ లోడ్‌ను వసూలు చేశాయి. డి్రస్టిబ్యూటర్లు లేదా నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా ఇన్వెస్ట్ చేసినా ఈ చార్జ్ పడేది. కాకపోతే అప్పట్లో ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. కనుక నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టే వారి నుంచి ఎంట్రీ లోడ్ వసూలు చేయవద్దంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి)ను సెబీ కోరింది. అప్పట్లో సెబీ చైర్మన్‌గా దామోదరన్ ఉన్నారు. ఆయన తర్వాత సీబీ భవే అదే విధానానికి మద్దతుగా నిలిచారు. 2008లో ప్రపంచ ఆరి్థక మాంద్యం కారణంగా మార్కెట్లు కుదేలు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది. దీంతో 2009లో సెబీ ఫండ్స్‌లో ఎంట్రీలోడ్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి పంపిణీదారులు, ఏజెంట్లకు ఫండ్స్ సంస్థలు కమీషన్ చెల్లిస్తూ, ఆ మొత్తాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) పేరుతో ఇన్వెస్టర్ల నుంచి రాబట్టడం మొదలు పెట్టాయి. నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి, పంపిణీదారులు ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ఒక్కటే టీఈఆర్ వసూలు చేసేవి. దీనివల్ల ఎంట్రీలోడ్ రద్దు చేసిన ప్రయోజనం ఇన్వెస్టర్లకు నెరవేరకుండా పోయింది. దీంతో డైరెక్ట్ ప్లాన్లకు అప్పటి సెబీ చైర్మన్ యూకే సిన్హా పునాది వేశారు. గతంలో యూటీఐ మ్యూచువల్ ఫండ్‌కు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో, నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలి్పంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి కమీషన్ల బెడద తొలగి, డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువగా ఉండడం అమల్లోకి వచి్చంది. ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..? 2007 వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడులపై 2–2.5 శాతం వరకు ఎంట్రీ లోడ్‌ను వసూలు చేశాయి. డి్రస్టిబ్యూటర్లు లేదా నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా ఇన్వెస్ట్ చేసినా ఈ చార్జ్ పడేది. కాకపోతే అప్పట్లో ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. కనుక నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టే వారి నుంచి ఎంట్రీ లోడ్ వసూలు చేయవద్దంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి)ను సెబీ కోరింది. అప్పట్లో సెబీ చైర్మన్‌గా దామోదరన్ ఉన్నారు. ఆయన తర్వాత సీబీ భవే అదే విధానానికి మద్దతుగా నిలిచారు. 2008లో ప్రపంచ ఆరి్థక మాంద్యం కారణంగా మార్కెట్లు కుదేలు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది. దీంతో 2009లో సెబీ ఫండ్స్‌లో ఎంట్రీలోడ్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి పంపిణీదారులు, ఏజెంట్లకు ఫండ్స్ సంస్థలు కమీషన్ చెల్లిస్తూ, ఆ మొత్తాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) పేరుతో ఇన్వెస్టర్ల నుంచి రాబట్టడం మొదలు పెట్టాయి. నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి, పంపిణీదారులు ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ఒక్కటే టీఈఆర్ వసూలు చేసేవి. దీనివల్ల ఎంట్రీలోడ్ రద్దు చేసిన ప్రయోజనం ఇన్వెస్టర్లకు నెరవేరకుండా పోయింది. దీంతో డైరెక్ట్ ప్లాన్లకు అప్పటి సెబీ చైర్మన్ యూకే సిన్హా పునాది వేశారు. గతంలో యూటీఐ మ్యూచువల్ ఫండ్‌కు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో, నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలి్పంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి కమీషన్ల బెడద తొలగి, డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువగా ఉండడం అమల్లోకి వచి్చంది. ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..? డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్ల మధ్య రాబడుల్లో ఇంత స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తున్నా, ఈ ప్రయోజనాన్ని పొందుతున్న ఇన్వెస్టర్లు 25 శాతానికి మించి లేరు. యాంఫీ గణాంకాల ప్రకారం మొత్తం 13.89 కోట్ల వ్యక్తిగత ఫండ్స్ ఫోలియోల్లో డైరెక్టర్ ప్లాన్లలో పెట్టుబడులకు సంబంధించినవి కేవలం 3.45 కోట్ల ఫోలియోలే ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో డైరెక్ట్ ప్లాన్ల నుంచి వస్తున్నది 12 శాతం మించి లేదు. ఇందుకు గల కారణాలపై మహీంద్రా మనులైఫ్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో ఆంటోనీ హెరెడియా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్లు సైతం దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి సంపదను సమకూర్చి పెట్టాయి. దీనికి తోడు డైరెక్ట్ ప్లాన్లపై ఎక్కువ మందిలో అవగాహన లేదు’’అని వివరించారు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డైరెక్ట్ ప్లాన్ల వైపే మొగ్గు చూపుతుంటే, నాన్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లలోనూ 50 శాతం మంది డైరెక్టర్ ప్లాన్లనే ఎంచుకుంటున్నారు. కేవలం రిటైల్ విభాగంలోనే డైరెక్ట్ ప్లాన్లను ఎంపిక చేసుకుంటున్న వారు తక్కువగా ఉంటున్నారు. ఏమిటి మార్గం..? ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల అవగాహన ఉంటే మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్లను ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ సాయం తీసుకోవాలి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు, సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్ పథకం ఎంపిక కీలకం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో వేలాది పథకాలు ఉన్నాయి. ఇందులోనూ ఎన్నో విభాగాలు ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్టర్ల ఆకాంక్షలు, రిస్‌్కకు అనుగుణంగా అనుకూలమైన వాటిని ఎంపిక చేసుకోవడం కొంచెం క్లిష్టమైన పనే. ఈక్విటీ మార్కెట్ల పట్ల అవగాహన కలిగి ఉండి, రోజులో కొంత సమయం కేటాయించే వీలున్న వారు నేరుగా డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల సేవలను ఆశ్రయించినట్టయితే, వారు మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్లను సూచిస్తారు. కాకపోతే సెబీ వద్ద నమోదైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు కేవలం 1,328 మందే ఉన్నారు. కనుక ఇన్వెస్టర్లు డిస్కౌంట్ బ్రోకర్లు, ఫిన్‌టెక్ సంస్థల సేవలను సైతం పొందొచ్చు. కాకపోతే చాలా మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల సూచనల మేరకే నడుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యత్యాసాలు ► మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పంపిణీదారులు, బ్రోకర్లు తదితర మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. కనుక రెగ్యులర్ ప్లాన్‌లో యూనిట్ ఎన్ఏవీతో పోలిస్తే, డైరెక్ట్ ప్లాన్ యూనిట్ ఎన్ఏవీ ఎక్కువగా ఉంటుంది. ►డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువ. దీంతో దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి వీటిల్లో ఎక్కువ. ►డైరెక్ట్ ప్లాన్లను ఏ సంస్థా సూచించదు. ఇన్వెస్టర్ నేరుగా ఎంపిక చేసుకోవాలి. ►ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డైరెక్ట్ ప్లాన్లలో సులభంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జెరోదా, గ్రోవ్ వంటి సంస్థలు సైతం డైరెక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. -
రికార్డు స్థాయిలో సిప్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జూలై నెలలోనూ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొన్నాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చే నెలవారీ పెట్టుబడులు రూ.15,245 కోట్లకు చేరాయి. ఒక నెలలో సిప్ పెట్టుబడుల పరంగా ఇదే గరిష్ట రికార్డు కావడం గమనార్హం. జూన్ నెలలో సిప్ పెట్టుబడులు రూ.14,734 కోట్లుగా ఉన్నాయి. సిప్ పెట్టుబడులు 2022 అక్టోబర్ నుంచి ప్రతి నెలా రూ.13వేల కోట్లకు పైనే వస్తున్నాయి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి జూలై నెలలో మొత్తం మీద రూ.7,626 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో వచి్చన పెట్టుబడులతో పోల్చిచూస్తే 12 శాతం తగ్గాయి. జూలై నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. జూలై నెలలో ఈక్విటీ, డెట్ ఇలా అన్ని విభాగాలు కలసి మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.82,046 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బలపడుతున్న సిప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈక్విటీల్లోకి సిప్ రూపంలో రూ.58,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద ఈక్విటీ ఫండ్స్ రూ.1.56 లక్షల కోట్లను సిప్ రూపంలో ఆకర్షించాయి. సిప్ అనేది ప్రతీ నెలా పెట్టుబడులు పెట్టుకు నే సాధనం. దీనివల్ల మార్కెట్లలో ఉండే అస్థిరతల రిస్క్ కొనుగోలుపై తగ్గుతుంది. ఈ సానుకూలతలను అర్థం చేసుకుంటున్న ఇన్వెస్టర్లు సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. 29 నెలలుగా సానుకూల పెట్టుబడులు ఈక్విటీల్లోకి 29 నెలలుగా సానుకూల పెట్టుబడులు వస్తున్నట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాకపోతే జూన్ నెలలో ఈక్విటీ పథకాలు రూ.8,637 కోట్లను ఆకర్షించగా, జూలైలో రూ.7,626 కోట్లకు తగ్గాయి. జూలై నెలలో ఐదు నూతన పథకాలు ప్రారంభం కాగా, వీటి వరకే రూ.3,011 కోట్లు సమీకరించాయి. లార్జ్‌క్యాప్, ఫోకస్డ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్, ఫ్లెక్సీక్యాప్ మినహా మిగిలిన అన్ని విభాగాల్లోని పథకాలు పెట్టుబడులను ఆకర్షించాయి. ఈక్విటీ ఫండ్స్ ► స్మాల్‌క్యాప్ పథకాల్లోకి అత్యధికంగా రూ.4,171 కోట్లు వచ్చాయి. గడిచిన నాలుగు నెలలుగా స్మాల్‌క్యాప్ పథకాల్లోకి ఇతర పథకాలతో పోలిస్తే అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నాయి. ► మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.2,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్ నుంచి రూ.1,880 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. గడిచిన మూడు నెలలుగా లార్జ్‌క్యాప్ పథకాలు పెట్టుబడులను కోల్పోతున్నాయి. ► ఫోకస్డ్ ఫండ్స్ విభాగం నుంచి రూ.1,067 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈ విభాగం గడిచిన నాలుగు నెలలుగా పెట్టుబడులను కోల్పోతోంది. ► ఈఎల్ఎస్ఎస్ విభాగం నుంచి రూ.592 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ నుంచి రూ.932 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ► లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,327 కోట్లు, మిడ్క్యాప్ఫండ్స్ రూ.1,623 కోట్లు, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ రూ.342 కోట్లు, వ్యాల్యూఫండ్స్ రూ.703 కోట్లు, సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ రూ.1,429 కోట్ల చొప్పున పెట్టుబడులను రాబట్టాయి. డెట్ ఫండ్స్ ► డెట్ ఫండ్స్‌లోకి రూ.61,440 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఈ విభాగం నుంచి నికరంగా రూ.14,135 కోట్లకు బయటకు వెళ్లడం గమనార్హం. ► అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.51,938 కోట్లు వచ్చాయి. మనీ మార్కెట్ ఫండ్స్ రూ.8,608 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ రూ.7,027 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.2,865 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ రూ.2,000 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ► ఓవర్ నైట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.10,746 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్ నుంచి రూ.1,309 కోట్లను ఉపసంహరించుకున్నారు. లాభాల స్వీకరణ.. ‘‘మ్యూచువల్ ఫండ్స్ పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది. దీంతో అన్ని విభాగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఈ నెలలో అన్నింటికంటే సిప్ పనితీరు గొప్పగా ఉంది. 33 లక్షల నూతన సిప్ ఖాతాలు నమోదయ్యాయి’’అని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. అయితే జూన్‌తో పోలిస్తే జూలై నెలలో ఈక్విటీల్లోకి నికర పెట్టుబడులు తగ్గడానికి లాభాల స్వీకరణే కారణమై ఉండొచ్చని మారి్నంగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కొందరు ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి కూడా అనుసరించి ఉండొచ్చన్నారు. -
ఈక్విటీ పథకాల్లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మరోసారి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించాయి. జూన్ నెలలో నికరంగా రూ.8,637 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. వివిధ ఏఎంసీలు కొత్త పథకాల ద్వారా (ఎన్‌ఎఫ్‌వోలు) పెట్టుబడులు సమీకరించడం, సిప్ పెట్టుబడులు బలంగా కొనసాగడం, స్మాల్‌క్యాప్ పథకాలకు చక్కని ఆదరణ లభించడం ఇందుకు దారితీసింది. జూన్ నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. ఈక్విటీ పథకాల్లోకి జూన్ నెలలో వచ్చిన పెట్టుబడులు మూడు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. మే నెలలో రూ.3,240 కోట్లను ఈక్విటీ పథకాలు ఆకర్షించగా, ఏప్రిల్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.6,480 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మార్చి నెలలో ఈక్విటీ పథకాలు భారీగా రూ.20,534 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ‘‘ఈక్విటీ పథకాల్లోకి మెరుగైన పెట్టుబడులు రావడం అన్నది ప్రధానంగా ఆరు కొత్త పథకాలు రూ.3,038 కోట్లు సమీకరించడం వల్లేనని చెప్పుకోవాలి’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెల్విన్ శాంటారియా పేర్కొన్నారు. జూన్ నెలలో 11 ఎన్‌ఎఫ్‌వోలు (ఓపెన్ ఎండెడ్) ప్రారంభం కాగా, ఇవి సమీకరించిన పెట్టుబడులు రూ.3,228 కోట్లుగా ఉన్నాయి. మే నెలతో పోలిస్తే జూన్ పెట్టుబడులు మెరుగ్గా ఉన్నట్టు కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సేల్స్ హెడ్ మనీష్ మెహతా చెప్పారు. గరిష్ట స్థాయిలో అస్సెట్ అలోకేషన్ కారణంగా కొంత లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదన్నారు. అయితే ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) ద్వారా పెట్టుబడులు కొనసాగించుకోవాలని సూచించారు. నికరంగా చూస్తే ఉపసంహరణే జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం మీద నికరంగా రూ.2,022 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ప్రధానంగా డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.14,135 కోట్లను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీనివల్లే మొత్తం మీద పెట్టుబడుల క్షీణత చోటు చేసుకుంది. అంతకుముందు మే నెలలో డెట్ విభాగంలోకి రూ.45,959 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. విభాగాల వారీగా.. ►స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రికార్డు స్థాయిలో రూ.5,472 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ►సిప్ రూపంలో ఇన్వెస్టర్లు జూన్‌లో రూ.14,734 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మే నెలలో సిప్ పెట్టుబడులు రూ.14,749 కోట్లుగా ఉన్నాయి. ►లార్జ్‌క్యాప్ పథకాల నుంచి రూ.2,049 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ నుంచి రూ.1,018 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ►వ్యాల్యూ ఫండ్స్ రూ.2,239 కోట్లు, మిడ్‌క్యాప్ పథకాలు రూ.1,748 కోట్లు, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,147 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ►ఈటీఎఫ్ ల్లోకి రూ.3,402 కోట్లు వచ్చాయి. ►అన్ని ఏఎంసీల నిర్వహణలోని మొత్తం నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) విలువ మే చివరికి ఉన్న రూ.42.9 లక్షల కోట్ల నుంచి, జూన్ చివరికి రూ.44.8 లక్షల కోట్లకు పెరిగింది. ►డెట్ విభాగంలో హైబ్రిడ్ ఫండ్స్‌లోకి రూ.4,611 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ►లిక్విడ్ ఫండ్స్ రూ.28,545 కోట్లు కోల్పోయాయి. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు తగ్గుముఖం
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మే నెలలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించలేకపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడంతో.. నికరంగా రూ.3,240 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ఇది గడిచిన ఆరు నెలల కాలంలో నెలవారీ అత్యంత కనిష్ట స్థాయి ఈక్విటీ పెట్టుబడులు కావడం గమనించొచ్చు. ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా 27వ నెలలోనూ నమోదైంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన రూ.6,480 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే సగానికి సగం తగ్గాయి. అంతకుముందు నెల మార్చిలోనూ రూ.20,534 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) మే నెలకు సంబంధించి గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. మొత్తం అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్‌లోకి మే నెలలో వచ్చిన నికర పెట్టుబడులు రూ.57,420 కోట్లుగా ఉన్నాయి. కానీ, ఏప్రిల్ నెలలో వచ్చిన రూ.1.21 లక్షల కోట్లతో పోలిస్తే 50 శాతానికి పైగా తగ్గాయి. 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఉమ్మడి ఆస్తులు రూ.43.2 లక్షల కోట్లకు చేరాయి. ఏప్రిల్ చివరికి ఇవి రూ.41.62 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆల్‌టైమ్ గరిష్టానికి సిప్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.14,749 కోట్ల పెట్టుబడులు మే నెలలో వచ్చాయి. ఇది నెలవారీ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి కావడం గమనించొచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన సిప్ పెట్టుబడులు రూ.13,728 కోట్లుగా ఉన్నాయి. అనిశ్చితుల్లోనూ పరిశ్రమ మంచి పనితీరు చూపించినట్టు యాంఫి సీఈవో ఎన్ వెంకటేశ్ పేర్కొన్నారు. ‘‘మార్కెట్లు పెరగడంతో లాభాల స్వీకరణకు తోడు, వేసవి విహార పర్యటనలు, విద్యా సంబంధిత ఖర్చులు మే నెలలో పెట్టుబడులు తగ్గడానికి కారణమై ఉండొచ్చు’’అని కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ డిజిటల్ బిజినెస్ సేల్స్ హెడ్ మనీష్ మెహతా తెలిపారు. లాభాల స్వీకరణకు తోడు, అమెరికా డెట్ సీలింగ్ పెంచడం వల్ల ఇన్వెస్టర్లు ఆందోళనతో ఈక్విటీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఉండొచ్చని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ మెల్విన్ శాంటారియా అభిప్రాయపడ్డారు. విభాగాల వారీగా.. ► లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,362 కోట్లను ఆకర్షించాయి. ► ఫోకస్డ్ ఫండ్స్‌లోకి రూ.944 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.504 కోట్ల చొప్పున వచ్చాయి. ► డెట్ పథకాలు రూ.46,000 కోట్లను ఆకర్షించాయి. ► డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.45,234 కోట్లు రాగా, హైబ్రిడ్ ఫండ్స్‌లోకి రూ.6,093 కోట్లు వచ్చాయి. ► ఓవర్‌నైట్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.18,910 కోట్లను ఉపసంహరించుకున్నారు. ► ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకి రూ.6,694 కోట్లు వచ్చాయి. ► బ్యాలన్స్డ్ హైబ్రిడ్, అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాల నుంచి రూ.997 కోట్లు బయటకు వెళ్లాయి. ► గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేటెడ్ ఫండ్స్‌లోకి రూ.103 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే విలువల పరంగా తక్కువగా ఉండడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నట్టు ఫయర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు. -
చిన్నబోయిన ఈక్విటీ ఫండ్స్
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు ఏప్రిల్‌లో ఆదరణ తగ్గింది. మార్చి నెలతో పోలిస్తే పెట్టుబడులు 68 శాతం తగ్గిపోయి రూ.6,480 కోట్లకు పరిమితమయ్యాయి. అయినా, ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా 26వ నెలలోనూ నమోదైంది. వచ్చిన కొద్ది పెట్టుబడుల్లోనూ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాలు ఎక్కువ మొత్తం ఆకర్షించాయి. ఏప్రిల్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గురువారం విడుదల చేసింది. మొత్తం మీద 42 సంస్థలతో కూడిన మ్యూచువల్ పండ్స్ పరిశ్రమ ఏప్రిల్ నెలలో రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ప్రధానంగా డెట్ విభాగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం ఇందుకు దోహదం చేసింది. అంతకుముందు మార్చి నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు నికరంగా రూ.56,884 కోట్ల పెట్టుబడులను నష్టపోవడం గమనార్హం. కానీ, ఏప్రిల్‌లో రూ.1.06 లక్షల కోట్లను రాబట్టాయి. దీంతో మ్యచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ మార్చి చివరికి ఉన్న రూ.39.42 లక్షల కోట్ల నుంచి ఏప్రిల్ చివరికి రూ.41.62 లక్షల కోట్లకు ఎగిసింది. ► ఈక్విటీల్లో ఫోకస్డ్ మినహా అన్ని విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. స్మాల్ క్యాప్ పథకాల్లోకి రూ.2,182 కోట్లు, మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,791 కోట్లు వచ్చాయి. ► మల్టీక్యాప్ ఫండ్స్ రూ.206 కోట్లు, లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.52 కోట్లు, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.738 కోట్లు చొప్పున ఆకర్షించాయి. ► డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌లోకి రూ.122 కోట్లు రాగా, సెక్టోరల్ (థీమ్యాటిక్) ఫండ్స్‌లోకి రూ. 614 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ విభాగంలోకి రూ.61 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.550 కోట్లు, వ్యాల్యూ ఫండ్స్‌లోకి రూ.291 కోట్ల చొప్పున వచ్చాయి. ► ఫోకస్డ్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.131 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ► డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా రూ.63,219 కోట్లను ఆకర్షించాయి. ► మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.13,961 కోట్లు, అల్ట్రాషార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.10,663 కోట్ల చొప్పున వచ్చాయి. ► ఇక గోల్డ్ ఈటీఎఫ్‌లు సైతం రూ.125 కోట్లను ఆకర్షించాయి. ఇండెక్స్ ఫండ్స్‌లోకి రూ.147 కోట్లు, ఇతర ఈటీఎఫ్‌ల్లోకి రూ.6,790 కోట్ల చొప్పున వచ్చాయి. సిప్ ద్వారా రూ.13,728 కోట్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.13,728 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెలలో వచ్చిన మొత్తం రూ.14,276 కోట్లతో పోలిస్తే తగ్గాయి. ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నెలలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి కాస్త అధిక మొత్తంలోనే పెట్టుబడులు వస్తుంటాయి. ఇన్వెస్టర్లు సిప్ ద్వారా ప్రస్తుత పెట్టుబడులు కొనసాగిస్తూనే.. ఈక్విటీ పథకాలకు అదనపు పెట్టుబడులను కేటాయించే విషయమై కాస్త వేచి చూసే ధోరణితో ఉన్నట్టు తెలుస్తోందని కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన మనీష్ మెహతా పేర్కొన్నారు. -
ఈక్విటీ ఫండ్స్‌లో రికార్డు స్థాయి పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడులు కొత్త గరిష్టానికి చేరాయి. ఫిబ్రవరి నెలలో నికరంగా రూ.15,685 కోట్లను ఈక్విటీ పథకాలు ఆకర్షించాయి. ఇది తొమ్మిది నెలల గరిష్ట స్థాయి. 2022 మే నెలకు వచ్చిన రూ.18,529 కోట్లు ఇప్పటి వరకు గరిష్ట స్థాయిగా ఉంది. ఈ ఏడాది జనవరి నెలలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన రూ.12,546 కోట్లతో పోల్చినా, గత డిసెంబర్ నెలకు వచ్చిన రూ.7,303 కోట్లతో పోల్చినా గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఈక్విటీ పథకాల్లో గత 24 నెలలుగా నికరంగా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. డెట్ విభాగం నుంచి ఇన్వెస్టర్లు ఫిబ్రవరిలో రూ.13,815 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఫిబ్రవరి నెలకు మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.9,575 కోట్లకు పరిమితం అయ్యాయి. ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు ఎక్కువగా ఉండడంతో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌ను మెరుగైన మార్గంగా భావించడం అధిక పెట్టుబడుల రాకకు మద్దతుగా నిలిచింది. విభాగాల వారీగా.. ► సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో రూ.14,000 కోట్లు వచ్చాయి. 2022 అక్టోబర్ నుంచి నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.13వేల కోట్లకు పైనే ఉంటున్నాయి. ► 11 కేటగిరీల్లో సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.3,856 కోట్లు ఆకర్షించాయి. ఆ తర్వాత స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,246 కోట్లు వచ్చాయి. ► మల్టీక్యాప్ ఫండ్స్ రూ.1977 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,816 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రూ.1,802 కోట్లు, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,651 కోట్ల చొప్పున పెట్టుబడులను ఫిబ్రవరి నెలలో ఆకర్షించాయి. ► ఇండెక్స్ ఫండ్స్‌లోకి రూ.6,244 కోట్లు వచ్చాయి. ► గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)లోకి రూ.165 కోట్లు వచ్చాయి. ► డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.11,304 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫథకాల నుంచి రూ.2,430 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.1,904 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ► 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తులు రూ.39.46 లక్షల కోట్లుగా ఉంది. జనవరి చివరికి ఇది రూ.39.62 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. క్రమశిక్షణగా పెట్టుబడులు ‘‘విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల విక్రయాలతో అస్థిరతలు నెలకొన్నప్పటికీ, ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించారు. డివిడెండ్ ఈల్డ్, ఫోకస్డ్ ఫండ్స్, లార్జ్‌క్యాప్ ఫండ్స్ మినహా మిగిలిన అన్ని ఈక్విటీ విభాగాల్లో వచ్చిన పెట్టుబడులు రూ.700 కోట్లపైనే ఉన్నాయి’’అని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి పెరుగుతాయనే అంచనాలతో డెట్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు బయటకు వెళుతున్నట్టు చెప్పారు. ‘‘మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ స్మాల్, మిడ్‌క్యాప్ క్యాప్ ఫండ్స్ భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ఆకట్టుకునే విధంగా ఉంది. దీర్ఘకాలంలో ఈ పథకాలు అద్భుతమైన రాబడులను అందించగలవు’’అని ఫిన్ ఎడ్జ్ సీఈవో హర్‡్ష గెహ్లాట్ అన్నారు. -
ఈక్విటీల్లోకి మళ్లీ పెట్టుబడుల వరద
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు జనవరిలో తిరిగి డిమాండ్ ఏర్పడింది. రూ.12,546 కోట్లు నికరంగా ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. గత నాలుగు నెలల్లో ఈక్విటీ ఫండ్స్‌లోకి ఒకనెలలో వచ్చిన గరిష్ట పెట్టుబడులు ఇవి. 2022 డిసెంబర్లో ఈక్విటీల్లోకి రూ.7,303 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే ఏడాది నవంబర్‌లో రూ.2,258 కోట్లు, అక్టోబర్‌లో రూ.9,390 కోట్ల చొప్పున వచ్చాయి. ఇక 2022 సెప్టెంబర్‌లో వచ్చిన రూ.14,100 కోట్లు నెలవారీ గరిష్ట స్థాయిగా ఉంది. ఈక్విటీ పథకాల్లోకి వరుసగా 23వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు రావడాన్ని గమనించొచ్చు. 2023 జనవరి గణాంకాలను ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. విభాగాల వారీగా.. అత్యధికంగా స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,256 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,902 కోట్లు, మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.1,773 కోట్లు, మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,628 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.14,14 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.1,006 కోట్లు, సెక్టోరల్, థీమ్యాటిక్ పథకాల్లోకి రూ.903 కోట్లు, కాంట్రా ఫండ్స్‌లోకి రూ.763 కోట్లు, లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.716 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్‌లోకి రూ.183 కోట్ల చొప్పున నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ఫిక్స్డ్ ఇన్కమ్ స్థిరాదాయ పథకాల (డెట్) నుంచి జనవరిలో నికరంగా రూ.10,316 కోట్లు బయటకు వెళ్లాయి. అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లో రూ.5,042 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో రూ.3,859 కోట్లు, ఓవర్‌నైట్ ఫండ్స్‌లో రూ.3,688 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు విక్రయించారు. మనీ మార్కెట్ పథకాలు రూ.6,460 కోట్లు ఆకర్షించాయి. ఇక హైబ్రిడ్ పథకాలు సైతం రూ.4,492 కోట్లు ఆకర్షించగా, మల్టీ అస్సెట్ పథకాల్లోకి రూ.2,182 కోట్లు, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకి రూ.2,055 వచ్చాయి. ఇండెక్స్ ఫండ్స్‌లోకి రూ.5,813 కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్లలో నమ్మకం ‘‘స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ ఇన్వెస్టర్లు ఈక్విటీ పథకాలపై నమ్మకాన్ని ఉంచారు. దీనికి నిదర్శనమే రూ.12,546 కోట్లు రావడం. నెలవారీగా చూస్తే ఇది 72 శాతం అధికం’’అని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. మార్కెట్లలో ఆటుపోట్లు ఉన్నా ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించినట్టు మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది పేర్కొన్నారు. సిప్ బలం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.13,856 కోట్లు వచ్చాయి. డిసెంబర్లో వచ్చిన రూ.13,573 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. సిప్ పెట్టుబడులు రూ.13వేల కోట్లకు పైగా రావడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైంది. సిప్ ఖాతాల సంఖ్య 6.21 కోట్లుగా ఉంది. నికరంగా 9.20 లక్షల కొత్త సిప్ ఖాతాలు రిజిస్టర్ అయ్యాయి. ఒకవైపు ఎఫ్‌పీఐలు విక్రయాలు చేస్తున్నప్పటికీ మార్కెట్లు స్థిరంగా ఉండడానికి సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచినట్టు యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. -
ఈక్విటీ పథకాల్లో కొనసాగిన పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక డిసెంబర్లో బలంగా నమోదైంది. రూ.7,303 కోట్లను ఈక్విటీ ఫండ్స్ ఆకర్షించాయి. అంతకుముందు నవంబర్ నెలలో వచ్చిన రూ.2,224 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగాయి. డిసెంబర్ నెలకు సంబంధించి ఫండ్స్ సంస్థల గ ణాంకాలను యాంఫి విడుదల చేసింది. డెట్ మ్యూ చువల్ ఫండ్స్ నికరంగా రూ.21,947 కోట్లను కో ల్పోయాయి. 2022 సంవత్సరం మొత్తం మీద అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తు లు (ఏయూఎం) 5.7 శాతం (రూ.2.2 లక్షల కోట్లు ) వృద్ధి చెంది రూ.39.88 లక్షల కోట్లకు చేరాయి. 2021లో 7 శాతం వృద్ధితో పోలిస్తే తగ్గింది. పథకాల వారీగా.. ► ఈక్విటీ విభాగంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,245 కోట్లు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.26 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ రూ.203 కోట్ల పెట్టుబడులను కోల్పోయాయి. ► 24 ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్ల రూపంలో (నూతన పథకాలు/ఎన్‌ఎఫ్‌వోలు) ఫండ్స్ సంస్థలు డిసెంబర్లో ఇన్వెస్టర్ల నుంచి రూ.6,954 కోట్లను సమీకరించాయి. ► 12 క్లోజ్ ఎండెడ్ ఎన్‌ఎఫ్‌వోలు రూ1,532 కోట్లను సమీకరించాయి. ► మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.676 కోట్లు రాగా, లా ర్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.1189 కోట్లు ఆకర్షించా యి. మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,962 కో ట్లు వచ్చా యి. ► వ్యాల్యూ ఫండ్స్‌లోకి రూ.648 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.564 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.403 కోట్ల చొప్పున వచ్చాయి. ► డెట్ విభాగంలో అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.13,852 కోట్లు బయటకు వెళ్లాయి. ► మల్టీ అస్సెట్ అలోకేషన్ పథకాలు రూ.1,711 కోట్లను ఆకర్షించాయి. సిప్ రూపంలో రూ.13,573 కోట్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి డిసెంబర్ నెలలో రూ.13,573 కోట్లు వచ్చాయి. అంతకుముందు నెల నవంబర్‌లో సిప్ పెట్టుబడులు రూ.13,307 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. సిప్ వరుసగా వృద్ధి చూపించడం ఇది మూడో నెల. డిసెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ మొత్తం ఫోలియోల సంఖ్య 14.11 కోట్లకు చేరింది. ఒక పథకంలో ఇక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపును ఫోలియోగా చెబుతారు. పెట్టుబడులు కొనసాగుతాయి.. ‘‘ఇన్వెస్టర్లు సమీప భవిష్యత్తులోనూ మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో పెట్టుబడులు కొనసాగిస్తారు. వృద్ధి ఆధారిత బడ్జెట్ కోసం ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఇది మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించనుంది. దీర్ఘకాల లక్ష్యాలకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలన్న ప్రాధాన్యాన్ని ఇన్వెస్టర్లు విస్మరించలేదు. సిప్ ఖాతాలు పెరగడం దీన్నే సూచిస్తోంది. కొత్తగా డిసెంబర్లో 24 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి. ఈ సాధనంపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఇది తెలియజేస్తోంది’’అని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. -
నూతన గరిష్టాలకు సిప్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు నవంబర్ నెలలో 76 శాతం తగ్గిపోయి రూ.2,258 కోట్లకు పరిమితమయ్యాయి. అక్టోబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.9,390 కోట్లుగా ఉండడం గమనించొచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.13,306 కోట్ల రికార్డు స్థాయి (ఒక నెలలో ఇదే గరిష్టం) పెట్టుబడులు నవంబర్‌లో నమోదయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో సిప్ ద్వారా వచ్చిన పెట్టుబడులు రూ.13,041 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది మే నెల నుంచి సిప్ ద్వారా వచ్చే పెట్టుబడులు ప్రతి నెలా రూ.12వేల కోట్లపైనే నమోదవుతున్నాయి. సెప్టెంబర్‌లో రూ.12,976 కోట్లు, ఆగస్ట్‌లో రూ.12,693 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్లు, జూన్‌లో రూ.12,276 కోట్లు, మేలో రూ.12,286 కోట్ల చొప్పున సిప్ సాధనం ద్వారా ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన సిప్ పెట్టుబడులు రూ.11,863 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు) సిప్ రూపంలో మొత్తం రూ.87,275 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. సిప్ అన్నది పెట్టుబడి మొత్తాన్ని ఒకే విడత పెట్టకుండా, ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని, కొన్ని వాయిదాలుగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కల్పించే సాధనం. గణాంకాలు.. ►నవంబర్ నెలలో కొత్తగా 11.27 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య 6.04 కోట్లకు చేరింది. ►మొత్తం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నవంబర్‌లో వచ్చిన నికర పెట్టుబడులు రూ.13,263 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు నెలలో వచ్చిన రూ.14,405 కోట్ల కంటే స్వల్పంగా తగ్గాయి. ►డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.3,668 కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్‌లో డెట్ పథకాల నుంచి రూ.2,818 కోట్ల ఉపసంహరణతో పోలిస్తే పరిస్థితి మారింది. ►ఇండెక్స్ ఫండ్స్, గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇతర ఈటీఎఫ్‌లు, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‌లోకి కలిపి మొత్తం రూ.10,394 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో రూ.8,602 కోట్లు ఒక్క ఇండెక్స్ ఫండ్సే ఆకర్షించాయి. గోల్డ్ ఫండ్స్‌లోకి రూ.195 కోట్లు వచ్చాయి. ►43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ అక్టోబర్ చివరికి ఉన్న రూ.39.5 లక్షల కోట్ల నుంచి నవంబర్ చివరికి రూ.40.37 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ►మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోల సంఖ్య 13.97 కోట్లకు పెరిగింది. రిటైల్ ఇన్వెస్టర్లలో విశ్వాసం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు నిలకడగా, సిప్ల ద్వా రా పెట్టుబడులు కొనసాగించినట్టు యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ వెల్లడించారు. ‘‘రిటైల్ పథకాల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లాయి. ప్రజలు లాభాలను స్వీకరిస్తున్నారు. పండుగల సందర్భంగా వినియోగం పెరగడమే ఇందుకు కారణం. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధి పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో నమ్మకం ఉంది. కనుక వారు వెంటనే మళ్లీ మార్కెట్లోకి వస్తారు. రానున్న బడ్జెట్ మార్కెట్లకు మంచి ఉత్సాహాన్నిస్తుంది. పలు పథకాల్లోకి మరిన్ని పెట్టుబడులు రావడానికి వీలు కల్పిస్తుంది. ఆర్బీఐ రేట్ల పెంపు ఆగిపోయినప్పుడు డెట్ పథకాల్లో స్థిరత్వం వస్తుంది’’అని వెంకటేశ్ తెలిపారు. ఇన్వెస్టర్లలో పరిణతి.. ‘‘దేశ ఈక్విటీ మార్కెట్లో ఆరోగ్యకరమైన ధోరణి ఏమిటంటే సిప్ ద్వారా పెట్టుబడులు నికరంగా పెరుగుతుండడం. ఇవి నవంబర్‌లో కొత్త గరిష్టానికి చేరాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు సిప్ ఎంతో విజయవంతమైన విధానంగా నిరూపితమైంది. సిప్ ద్వారా పెట్టుబడులు పెరగడం దేశ ఇన్వెస్టర్లలో పరిణతి పెరిగినదానికి నిదర్శనం’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. -
ఈక్విటీ పథకాల్లోకి రూ.15,498 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటి మాదిరే జూన్ మాసంలోనూ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొన్నాయి. రూ.15,498 కోట్లు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ఈక్విటీ పథకాల్లోకి ఇలా నికరంగా పెట్టుబడుల రాక వరుసగా 16వ నెల (2021 ఫిబ్రవరి నుంచి) కావడం గమనార్హం. అయితే, ఈ ఏడాది మే నెలలో ఈక్విటీ పథకాలు రూ.18,529 కోట్లను ఆకర్షించాయి. దీంతో పోలిస్తే జూన్‌లో కాస్తంత తగ్గాయి. ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి జూన్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. దాదాపు అన్ని విభాగాలూ పెట్టుబడులను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.12,286 కోట్లుగా నమోదయ్యాయి. సిప్ ఖాతాల సంఖ్య 5.54 కోట్లకు పెరిగింది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ విభాగంలోకి అత్యధికంగా రూ.2,512 కోట్ల పెట్టుబడులు రాగా, మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.2,130 కోట్లు వచ్చాయి. బంగారం ఈటీఎఫ్‌లు రూ.135 కోట్లు ఆకర్షించాయి. అలాగే, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు రూ.12,660 కోట్లు రాబట్టాయి. నూతన పథకాల ఆవిష్కరణపై సెబీ నిషేధం విధించినప్పటికీ పెట్టుబడుల రాక బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. డెట్ విభాగం నుంచి జూన్ నెలలో రూ.92,247 కోట్లకు నికరంగా బయటకు వెళ్లాయి. అంతకుముందు మేలో డెట్ పథకాల నుంచి రూ.32,722 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. అన్నీ కలిపి చూస్తే జూన్ నెలలో ఫండ్స్ పరిశ్రమ నుంచి రూ.69,853 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. నిర్వహణ ఆస్తులు మే చివరికి రూ.37.37 లక్షల కోట్లుగా ఉంటే, జూన్ చివరికి రూ.36.98 లక్షల కోట్లకు తగ్గాయి. ప్రతికూలతలు ఉన్నా.. ‘‘విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నుంచి విక్రయాల తీవ్రత పెట్టుబడుల రాకపై ఉంది. దీనికితోడు అంతర్జాతీయ మాంద్యం ఆందోళనలు కూడా ఉన్నాయి. బిట్‌కాయిన్, ఎథీరియం ఇతర క్రిప్టో కాయిన్ల ధరలు పతనం అయ్యాయి. సంప్రదాయ ఉత్పత్తుల్లో రాబడులు తక్కువగా ఉన్నాయి. దీర్ఘకాల పెట్టుబడుల సాధపాల పట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన అవగాహన పెట్టుబడుల రాక కొనసాగేందుకు సాయపడ్డాయి’’అని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ తెలిపారు. మార్కెట్లో అస్థిరతలు అధికంగా ఉన్నా కానీ, ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. ఒక్క జూన్ మాసంలోనే ఎఫ్‌పీఐలు రూ.50వేల కోట్ల మేర ఈక్విటీల్లో అమ్మకాలు చేయడం గమనార్హం. ‘‘అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. రూపాయి బలహీనపడుతోంది. వర్షాల ప్రారంభం మిశ్రమంగా ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇవన్నీ చిన్న పొదుపుదారులను అవరోధం కాలేదు. వారు సిప్ ద్వారా తమ పెట్టుబడులు కొనసాగించారు’’అని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. -
ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు.. నవంబర్‌లో రూ.11,615 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీ పెట్టుబడులు నవంబర్‌లో రూ.11,615 కోట్లకు పెరిగాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. మార్కెట్లు అస్థిరతల్లో ఉన్నప్పటికీ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి కొనసాగడం పెట్టుబడులు బలంగా ఉండేందుకు దోహదం చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రూ.5,215 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.8,677 కోట్లు, ఆగస్ట్‌లో రూ.8,666 కోట్ల చొప్పున నికర పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది జూలై తర్వాత అత్యధిక స్థాయిలో పెట్టుబడులు వచ్చింది నవంబర్లోనే కావడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.25,002 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద అన్ని రకాల పథకాల్లోకి కలిపి నవంబర్‌లో రూ.46,165 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో ఈ మొత్తం రూ.38,275 కోట్లుగా ఉంది. నవంబర్ చివరికి ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.38.45 లక్షల కోట్లకు చేరుకుంది. హైబ్రిడ్ పథకాలు ఆదరణ - ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,660 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. - ఈక్విటీ హబ్రిడ్ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.9,422 కోట్లుగా ఉన్నాయి. - సిప్ ఖాతాలు 4.78 కోట్లకు పెరిగాయి. నెలవారీగా సిప్ రూపంలో వచ్చే పెట్టుబడులు 11,005 కోట్లుకు చేరాయి. - డెట్ పథకాల్లోకి నికరంగా రూ.14,893 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. - గోల్డ్ ఈటీఎఫ్ పథకాలు రూ.682 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికరంగా రూ.39,927 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతక్రితం జూన్ త్రైమాసికంలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.19,508 కోట్లుగానే ఉన్నాయి. నూతన పథకాల ఆవిష్కరణ (ఎన్‌ఎఫ్‌వోలు), సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు స్థిరంగా ఉండడం ఇందుకు మేలు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలను పరిశీలిస్తే.. సెప్టెంబర్ ఆఖరుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.12.8 లక్షల కోట్లుగా ఉంది. జూన్ చివరికి ఈ మొత్తం రూ.11.1 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లగా.. ఈ ఏడాది మార్చి నుంచి నికరంగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈక్విటీ పథకాల్లోకి వచ్చే నికర పెట్టుబడుల్లో 50 శాతం ఎన్‌ఎఫ్‌వోల నుంచే ఉంటున్నట్టు పరిశ్రమకు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్విటీల్లో ఫ్లెక్సీక్యాప్ విభాగం అత్యధికంగా రూ.18,258 కోట్లను ఆకర్షించగా.. సెక్టోరల్ ఫండ్స్ రూ.10,232 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.4,197 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్ రూ.3,716 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.3,000 కోట్ల చొప్పున సెప్టెంబర్ క్వార్టర్లో నికరంగా పెట్టుబడులు ఆకర్షించాయని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ డేటా పేర్కొంది. -
ఈక్విటీ ఫండ్స్‌కు భారీ డిమాండ్..
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. న్యూ ఫండ్ ఆఫర్ల (ఎన్ఎఫ్వో) ఊతంతో జులైలో నికరంగా రూ. 22,583 కోట్ల నిధులు వచ్చాయి. దీంతో వరుసగా అయిదో నెలా ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినట్లయింది. జూన్‌తో పోలిస్తే జులైలో రూ. 5,988 కోట్లు అధికంగా పెట్టుబడులు వచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఈ ఏడాది మార్చిలో రూ. 9,115 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 3,437 కోట్లు, మే నెలలో రూ. 10,083 కోట్ల మేర ఈక్విటీ స్కీముల్లోకి పెట్టుబడులు వచ్చాయి. అంతకన్నా ముందు 2020 జులై నుంచి 2021 ఫిబ్రవరి దాకా వరుసగా ఎనిమిది నెలల పాటు నిధుల ఉపసంహరణ కొనసాగింది. తాజా పరిణామాలతో జూన్ ఆఖరున రూ. 33.67 లక్షల కోట్లుగా ఉన్న ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని అసెట్స్ (ఏయూఎం) విలువ జులై ఆఖరుకు రూ. 35.32 లక్షల కోట్లకు చేరింది. లిక్విడిటీ.. విధానాల ఊతం.. రిజర్వ్ బ్యాంక్ ఉదార విధానాలు, కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉండటం, టీకాల ప్రక్రియతో కోవిడ్ మహమ్మారిని స్థిరంగా కట్టడి చేయగలుగుతుండటం, దేశ..విదేశాల నుంచి వచ్చే నిధుల (లిక్విడిటీ)ఊతంతో ఈక్విటీ మార్కెట్లు చారిత్రక గరిష్టాలను తాకుతున్నాయని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేష్ తెలిపారు. దీనితో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా మ్యుచువల్ ఫండ్ సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)ల ద్వారా ఈక్విటీ ర్యాలీలో పాలుపంచుకుంటున్నారని ఆయన వివరించారు. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, ఈక్విటీలు ఇటీవల మెరుగైన రాబడులు ఇవ్వడం, కోవిడ్ రెండో విడతలోనూ మార్కెట్లు స్థిరంగా నిలదొక్కుకోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు భరోసా కల్పిస్తున్నాయని ఫండ్స్ఇండియా సంస్థ రీసెర్చి విభాగం హెడ్ అరుణ్ కుమార్ తెలిపారు. ఈక్విటీల్లోకి ప్రవహించిన నిధుల్లో 50 శాతం భాగం ఎన్‌ఎఫ్‌వోల ద్వారా వచ్చినవేనని వైట్ ఓక్ క్యాపిటల్ సీఈవో ఆశీష్ సోమయ్య పేర్కొన్నారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన స్కీమ్ కేటగిరీ నిబంధనలకు అనుగుణంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ) నిధులను కేటాయించడం ఇందుకు ఓ కారణమని వివరించారు. మరిన్ని విశేషాలు.. ►ఈక్విటీ ఫండ్స్‌లో విభాగాలవారీగా చూస్తే ఫ్లెక్సీ క్యాప్ సెగ్మెంట్లోకి అత్యధికంగా రూ. 11,508 కోట్లు వచ్చాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్, ఇతర ఎన్‌ఎఫ్‌వోలు దాదాపు ఏకంగా రూ. 13,709 కోట్లు సమీకరించడం ఇందుకు దోహదపడింది. ►గత నెలలో హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు రూ. 19,481 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇందులో రూ. 14,924 కోట్లను ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో పెట్టారు. ►ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల (ఈఎల్ఎస్ఎస్) నుంచి మాత్రం రూ. 512 కోట్లు, వేల్యూ ఫండ్స్ నుంచి రూ. 462 కోట్లు మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ►గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి నికరంగా రూ. 257 కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవి రూ. 360 కోట్లు. ►డెట్ మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు నికరంగా రూ. 73,964 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ. 31,740 కోట్లు రాగా, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ. 20,910 కోట్లు, తక్కువ వ్యవధి ఉండే ఫండ్స్‌లోకి రూ. 8,161 కోట్లు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌లోకి రూ. 6,656 కోట్లు వచ్చాయి. ►వివిధ విభాగాలవారీగా చూస్తే మ్యుచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నికరంగా రూ. 1.14 లక్షల కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవి రూ. 15,320 కోట్లు. -
కష్టమైనా.. ఇన్వెస్ట్ చేయాల్సిందే..!
రిటైర్మెంట్.. ఏదో ఒకరోజు ఆహ్వానించాల్సిందే. ఉద్యోగాల్లో ఉన్న వారికి కాస్త ముందు, స్వయం ఉపాధుల్లోని వారికి కొంత ఆలస్యంగా అయినా.. వృద్ధాప్యంలో పని జీవితం నుంచి విశ్రాంతి అవసరమే. అప్పటి వరకు సంపాదనతో నడిచిన జీవితం.. ఆ తర్వాత కూర్చుని కొనసాగించాలంటే అందుకు ముందు నుంచే ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాల్సిందే. రిటైర్మెంట్ కోసం పొదుపును పెద్దగా పట్టించుకోని ధోరణి యుక్త వయసులోని వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రిటైర్మెంట్ కోసం చాలా సమయం ఉందన్నది వారి ఆలోచనా తీరు. ఈ ధోరణితో రిటైర్మెంట్ ప్రణాళికను వాయిదా వేస్తే.. వివాహంతో గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత పిల్లలు, వారి ఉన్నత విద్య, వారి వివాహాలు, సొంతిల్లు, కారు తదితర లక్ష్యాలు ముఖ్యమైనవిగా మారతాయి. దీంతో తమ విశ్రాంత (వృద్ధాప్య) జీవనానికి సంబంధించిన ప్రణాళిక పక్కకు వెళ్లిపోతుంది. కారణం ఏదైనా కానీయండి.. వయసుతో సంబంధం లేకుండా సంపాదించే గ్రూపులో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ పదవీ విరమణ జీవితానికి పొదుపును తక్షణం ప్రారంభించడమే మంచి పరిష్కారం. ఇది ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత సులభంగా కావాల్సినంత సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. ఇందుకు ఏం చేయాలో చూద్దాం.. ఉద్యోగులు అయితే ‘ఉద్యోగుల భవిష్య నిధి’ (ఈపీఎఫ్) సదుపాయం ఉంటుంది. వేతనంలో ప్రతీ నెలా నిర్ణీత శాతం మేర ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుంటుంది. ఉద్యోగి వాటాకు సమానంగా పనిచేయించుకునే సంస్థ కూడా తన వంతు వాటాను సమకూర్చడం ఇందులోని విశేషం. ఉద్యోగి ప్రమేయం లేకుండా క్రమం తప్పకుండా ప్రతీ నెలా భవిష్యనిధి ఖాతాకు జమ కావడం వల్ల దీన్ని మంచి సాధనంగా నిపుణులు చెబుతారు. దీనికి విరుద్ధంగా చాలా మంది ఈపీఎఫ్ విషయంలో తప్పుగా వ్యవహరిస్తుండడాన్ని చూడొచ్చు. తమ అవసరాలకు ఈపీఎఫ్ నిధిపై ఆధారపడుతుంటారు. ఇల్లు కొనుగోలు, ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ నిధిని వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడాన్ని చూడొచ్చు. ఇలా చేయడం అన్ని సందర్భాల్లోనూ సరైనది కాదు. ఈపీఎఫ్ నిధిని కదపకుండా.. రిటైర్మెంట్ తర్వాత ఉపసంహరించుకోవడం వల్ల మంచి నిధిని చేతికందుకోవచ్చు. ప్రతీ ఉద్యోగికీ సాధ్యమయ్యే రిటైర్మెంట్ పొదుపు సాధనంగా దీన్ని చూడాలి. మరి రిటైర్మెంట్ జీవితానికి ఈపీఎఫ్ ఒక్కటి సరిపోతుందా..? లేదు. మరింత అదనంగా పొదుపు, మదుపు చేసుకుంటూ వెళ్లాలి. ఎంత మొత్తం అన్నది మీరు తీసుకునే రిస్క్, ఇన్వెస్ట్ చేయగలిగే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. రిస్క్ తీసుకోని రక్షణాత్మక ధోరణి ఇన్వెస్టర్ అయితే డెట్ సాధనాలను పెట్టుబడులకు ఎంచుకోవాలి. ఓ మోస్తరు రిస్క్ అయినా ఫర్వాలేదనుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలం. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్.. ప్రయోజనాలు ఈపీఎఫ్ ఉద్యోగుల భవిష్యనిధిలో జమ అయ్యే మొత్తాలకు సెక్షన్ 80సీ కింద పన్ను పడదు. ఉద్యోగి వాటాతోపాటు, సంస్థ జమ చేసే వాటా కూడా పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంది. అంతే కాదు రిటైర్మెంట్ సమయంలో ఈపీఎఫ్ నుంచి తీసుకునే మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇందులో పెట్టుబడులు, రాబడులు, ఉపసంహరణల మొత్తం కూడా పన్ను లేనిదే. అందుకే ఉద్యోగాలలో ఉన్న వారు అనవసరాలకు ఈపీఎఫ్ నిధిని ఖాళీ చేయకుండా, రిటైర్మెంట్ కోసం కొనసాగించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఒక సంస్థ నుంచి వేరే సంస్థకు మారినా, ఈపీఎఫ్ నిధిని బదిలీ చేసుకుని, కొనసాగించుకోవాలి. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్‌కు అనుసంధానంగా పనిచేసే వీపీఎఫ్‌ను వినియోగించుకునే వారు చాలా తక్కు వ మందే. ఈపీఎఫ్ వాటా మూల వేతనంలో 12 శాతానికే పరి మితం. కానీ, వీపీఎఫ్ విషయానికొస్తే మూలవేతనం, డీఏ రెండింటికి సమాన స్థాయిలో ప్రతీ నెలా పొదుపు చేసుకునేందుకు అనుమతి ఉంది. ఈపీఎఫ్ వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ అమలవుతుంది కనుక.. మెరుగైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇందు లో జమ చేసే మొత్తానికీ పన్ను మినహాయింపు పొందొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వేతన జీవులు కాని వారికి పీపీఎఫ్ ఒకానొక సాధనం అవుతుంది. రాబడులు ఈపీఎఫ్‌తో పోలిస్తే ప్రస్తుతానికి ఒక శాతానికి పైగా తక్కువగా ఉన్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో రాబడులు, ఉపసంహరణలకూ పన్ను మినహాయింపు ఉంది కనుక ఇది కూడా డెట్‌లో ఒక మెరుగైన ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్జన ఆరంభమైన నాటి నుంచి రిటైర్మెంట్కు చాలా సమయం ఉంటుంది. కనుక ముందే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఆరంభించినట్టయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఘనంగా సమకూర్చుకోవచ్చు. మధ్యస్థ రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకుంటే.. ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకుని ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి సంపదను సృష్టించుకునే మార్గం ఈక్విటీలు. కాకపోతే ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ పనితీరును ఏడాదికోసారి తప్పకుండా సమీక్షించుకోవాలి. ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీల్లోనే ఇవి ఒక విభాగం. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీ పొందొచ్చు. రాబడులను వెనక్కి తీసుకున్న సమయంలో మాత్రం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 10 శాతం (రూ.లక్ష మించిన మొత్తాలపై) చెల్లించాల్సి ఉంటుంది. అయినా, రిటైర్మెంట్ కోసం ఈ పథకాలను ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం మంచి మార్గమే అవుతుంది. అంతేకాదు, రిటైర్మెంట్ తర్వాత ఈక్విటీ పథకాల నుంచి ఏకమొత్తంలో ఉపసంహరించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతీ నెలా తమ అవసరాలకు కావల్సిన మొత్తాన్ని రిడెండప్షన్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అప్పుడు మిగిలి ఉన్న పెట్టుబడులకు రాబడులు జమవుతూ ఉంటాయి. ఎన్పీఎస్ ఇది పూర్తిగా రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం ఉద్దేశించిన సాధనం. ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఇప్పుడు తప్పనిసరి అమల్లో ఉన్న పెన్షన్ సాధనం ఇదే. ప్రైవేటు రంగ సంస్థలు తమ అభీష్టం మేరకు ఈపీఎఫ్‌కు బదులు ఎన్పీఎస్ను కూడా ఎంచుకోవచ్చు. స్వచ్ఛందంగా ఎవరైనా ఎన్‌పీఎస్‌లో భాగం కావచ్చు. ఇందులో డెట్, ఈక్విటీల కలయికగా పెట్టుబడుల ఆప్షన్ ఎంచుకునేందుకు వీలుంది. ఎంత మేర ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించుకోలేకపోతే.. వయసు ఆధారంగా ఈక్విటీ, డెట్ శాతాలను నిర్ణయించే ఆటో చాయిస్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్, పీపీఎఫ్ సాధనాల్లో మెచ్యూరిటీ తర్వాత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. కానీ, ఎన్‌పీఎస్‌లో అలా కాదు.. 60 ఏళ్లనాటికి సమకూర్చుకున్న నిధిలో 60 శాతాన్నే వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. ఈ మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగిలిన 40 శాతంతో పెన్షన్ ఇచ్చే యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా యాన్యుటీ ప్లాన్ నుంచి ప్రతీ నెలా అందుకునే మొత్తం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఇలా మెచ్యూరిటీ తర్వాత కచ్చితంగా యాన్యుటీలో 40 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కొందరికి నచ్చకపోవచ్చు. అటువంటి వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. రక్షణాత్మక ధోరణి కలిగిన విభాగంలోకి మీరు వస్తే.. ఈపీఎఫ్ ఖాతాకు ప్రతీ నెలా మీ వంతు అదనంగా జమ చేయడం ఒక మంచి మార్గం. దీన్నే వాలంటరీ ప్రావిడెంట్ ఫంఢ్ (వీపీఎఫ్) అంటారు. ఈపీఎఫ్ నిల్వలపై అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ వర్తిస్తుంది. డెట్ సాధనాల్లో ఈపీఎఫ్ అత్యధిక రిటర్నులు అందిస్తున్న ఒక సాధనమని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేయని వారు ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)ని ఎంచుకోవచ్చు. కాకపోతే ఇందులో రాబడులు కాస్త తక్కువగా ఉంటాయి. ఈపీఎఫ్‌తోపాటు వీపీఎఫ్ లేదా పీపీఎఫ్ రూపంలో రిటైర్మెంట్కు కావాల్సిన మేర నిధికి ప్రణాళిక వేసుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. అయితే, డెట్ సాధనాల్లో వచ్చే రాబడిలో అధిక శాతం ద్రవ్యోల్బణ ప్రభావానికే కరిగిపోతుంది. కనుక అధిక రాబడుల కోసం కొంత మొత్తాన్ని అయినా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మోస్తరు నుంచి అధిక రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీలు అనుకూలమైన పొదుపు సాధనమని చెప్పుకోవాలి. ఈపీఎఫ్, వీపీఎఫ్, పీపీఎఫ్, ఈక్విటీ ఫండ్స్ కలయికతో పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకున్నామెరుగ్గానే ఉంటుంది. 20–30ల్లోనే ఉండి ఆదాయం మొదలు పెట్టిన వారు ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకోవడం ద్వారా భారీ నిధిని సమకూర్చుకునే అవకాశం సొంతం చేసుకోవచ్చు. రిటైర్మెంట్కు కనీసం 20–30 ఏళ్లు అయినా ఉంటే, ఈక్విటీల కలయికగా పెట్టుబడులను ప్లాన్ చేసుకోవాలి. పెంచుతూ పోవడం పరిష్కారం ఆదాయం పెరుగుతూ వెళుతున్నట్టే.. రిటైర్మెంట్ కోసం చేసే పొదుపు మొత్తాన్ని కూడా అంతే మేర పెంచుకుంటూ వెళ్లాలి. వీలైనంత ముందుగా పెట్టుబడులను ప్రారంభించాలి. చెప్పడం సులభం.. ఆచరణే కష్టం. కానీ, ఆరంభించేంత వరకే కష్టం. ఒక్కసారి మొదలు పెడితే, దానికి తగినట్టు ఖర్చులను సర్దుబాటు చేసుకోవచ్చు. రిటైర్మెంట్ కోసం కొంత మొత్తం కావాలన్న అవసరాన్ని ఒక్కొక్కరు ఒక్కో సమయంలో గుర్తిస్తుంటారు. కొందరు అయితే అప్పటి సంగతి అప్పుడే చూసుకోవచ్చనుకుంటారు. కానీ, ముందుగా ప్రారంభించినట్టయితే.. దానికి కాంపౌండింగ్ (వృద్ధి) శక్తి తోడవుతుంది. దాంతో దీర్ఘకాలానికి గణనీయమైన మొత్తాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు మధ్య వయసు కూడా దాటి, రిటైర్మెంట్ పొదుపును ఇంకా ప్రారంభించలేదని ఆలోచిస్తున్నారా..? ఆందోళన చెందకుండా వెంటనే ఆచరణలో పెట్టడం ఉత్తమం. ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే 45–50లకు చేరిన తర్వాత రిటైర్మెంట్ కోసం పొదుపు మొదలు పెట్టడం వల్ల అవసరమైనంత నిధి సమకూరదు. చిన్న వయసులో అయితే సంపాదనలో కొంత భాగాన్ని పక్కన పెట్టినా సరిపోతుంది. కానీ, ఆలస్యం చేసిన కొద్దీ సంపాదనలో భారీ మొత్తాన్ని రిటైర్మెంట్కు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రిటైర్మెంట్ అవసరాలకు ఎంత మేర కావాలి, అందుకు ఏం చేయాలన్న విషయమై సందేహాలు ఉంటే ఆర్థిక సలహాదారులను సంప్రదించి వారిచ్చే సూచనలను అనుసరించాలి. -
అటు రాబడి... ఇటు భద్రత
వడ్డీ రేట్లు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబడుల కోసం నూరు శాతం రిస్క్ తీసుకోవడం సూచనీయం కాదు. రాబడులు తక్కువే ఉన్నా ప్రతి ఒక్కరి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో డెట్ సాధనాలకూ(స్థిరాదాయ పథకాలు) తప్పకుండా చోటు ఉండాలి. ఈక్విటీలు దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఉన్నప్పటికీ.. గడిచిన మూడేళ్ల కాలంలో చూసుకుంటే అధిక శాతం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక డెట్ సాధనాలను ఎంత మాత్రం విస్మరించలేము. మరి డెట్ విభాగంలో పెట్టుబడులకు ఏది ఉత్తమమైన ఎంపిక? అన్న సందిగ్ధత ఉంటే.. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఆ విషయమై స్పష్టత వస్తుంది. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎస్బీఐ 5.70 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు (వృద్ధులకు) 6.50 శాతంగా ఉంది. 20 శాతం పన్ను శ్లాబులో ఉన్న వృద్ధులకు నికరంగా మిగిలే రాబడి 5.15 శాతం కాగా, ఇతరులకు ఇది 4.51 శాతంగా ఉంది. అదే 30 శాతం శ్లాబు పరిధిలో ఉన్న వృద్ధులకు నికర రాబడి 4.47 శాతం అయితే, ఇతరులకు 3.92 శాతం రాబడి లభిస్తుంది. పన్ను రేటు సెస్సులతో కలిపి గణించడం జరిగింది. పన్ను ప్రయోజనాలు: సెక్షన్ 80సీ ప్రయోజనం లేదు. అందుకునే రాబడి కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. అనుకూలం: ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డిపాజిట్‌ను రద్దు చేసుకుని వెనక్కి తీసేసుకోవచ్చు. ప్రతికూలం: అధిక పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను చెల్లించగా మిగిలేది చాలా తక్కువే. ఎవరికి అనుకూలం?: కోరుకున్నప్పుడు వెంటనే డబ్బులు తీసుకునే వీలుండాలని అనుకునేవారికి. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులు పన్ను ఆదా ప్రయోజనంతో కూడిన ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐలో పన్ను ఆదా ఎఫ్డీని పరిగణనలోకి తీసుకుంటే వృద్ధులకు 6.50 శాతం, ఇతరులకు 5.70 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. సెక్షన్ 80సీ ప్రయోజనాన్ని వినియోగించుకుంటే 20 శాతం పన్ను పరిధిలోని వృద్ధులకు నికర రాబడి 6.50 శాతంగాను, ఇతరులకు 5.70 శాతంగాను ఉంటుంది. పన్ను ప్రయోజనం: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. రాబడిపై పన్ను పడుతుంది. అనుకూలం: సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా ప్రయోజనం. ప్రతికూలం: ఐదేళ్ల లాకిన్‌తో వస్తుంది. కనుక ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని వెనక్కి తీసుకునే వీలుంటుంది. ఎవరికి అనుకూలం?: పన్ను ఆదా కోసం బ్యాంకుల్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటాననే వారికి. నోట్: చిన్న బ్యాంకులు అధిక రాబడులను ఆఫర్ చేస్తున్నాయి. రిస్క్ తీసుకునే వారు వాటిని పరిశీలించొచ్చు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుతం వడ్డీ రేటు 7.60 శాతం. పెట్టుబడులపై సెక్షన్ 80సీ పన్ను ప్రయోజనాన్ని వినియోగించుకుంటే 20 శాతం, 30 శాతం పన్ను పరిధిలోని వారికి నికర రాబడి 7.60 శాతంగానే ఉంటుంది. పన్ను ప్రయోజనాలు: ఈ పథకంలో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. రాబడిపై పన్ను పడుతుంది. అనుకూలం: అధిక వడ్డీ రేటు, ఎటువంటి రిస్క్ లేకపోవడం. పరిమితులు: గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట తల్లిదండ్రులు మాత్రమే ఈ ఖాతాను తెరిచేందుకు ఉంటుంది. ఒక ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునే పరిమితి ఉంటుంది. కుమార్తె విద్యా, వివాహ అవసరాలకు ఉపయోగపడుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రస్తుత రేటు 7.10 శాతం. పన్ను ప్రయోజనాలు: పెట్టుబడులకు సెక్షన్ 80సీ ప్రయోజనాలు వర్తిస్తాయి. రాబడిపైనా పన్ను ఉండదు. అనుకూలతలు: పన్ను లేని అధిక రాబడి రేటు. రిస్క్ ఉండదు. పరిమితులు: 15 ఏళ్ల పథకం. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోగలరు. రాబడులు: సెక్షన్ 80సీ పన్ను ఆదాను కలిపి చూసుకుంటే 20% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి రేటు 8.96 శాతం, 30% పన్ను పరిధిలోని వారికి ఇది 10.32 శాతం. ఎవరికి?: పన్ను పరిధిలోని వ్యక్తుల దీర్ఘకాల అవసరాలకు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటు 7.40%. 20% పన్ను పరిధిలోని వారికి 5.86%, 30% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి రేటు 5.09 శాతంగాను ఉంటుంది. సెక్షన్ 80సీ ప్రయోజనాన్ని వినియోగిం చుకుంటే 20 % పన్ను శ్లాబులోని వారికి నికర రాబడి రేటు 7.40%గానే ఉంటుంది. పన్ను ప్రయోజనం: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో చేసే పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను ఆదా పొందొచ్చు. వడ్డీ ఆదాయం మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. అనుకూలం: అధిక వడ్డీ రేటుతోపాటు రిస్క్ అస్సలు ఉండదు. పరిమితులు: 60 ఏళ్లు పైబడిన వారికే పరిమితం. గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షల వరకే. ఐదేళ్ల లాకిన్ అమలవుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ఇందులో ఆఫర్ చేస్తున్న ప్రస్తుత వడ్డీ రేటు 6.80%. పన్ను ప్రయోజనాలు: సెక్షన్ 80సీ పన్ను ఆదాకు అర్హత ఉంది. వడ్డీ రాబడిపై పన్ను ఉంటుంది. అనుకూలం: ఎటువంటి రిస్క్ లేకపోవడం. ప్రతికూలం: ఐదేళ్ల లాకిన్ అమలవుతుంది. రాబడులు: 20% పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను నికర రాబడి 5.39 శాతం. 30% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి 4.68 %. ఎవరికి?: రిస్క్ వద్దనుకునే వారు పరిశీలించదగినది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో రిస్క్ లేని రెండు విభాగాలు లిక్విడ్ ఫండ్స్, ఓవర్‌నైట్ ఫండ్స్‌ను తీసుకుంటే.. లిక్విడ్ ఫండ్స్‌లో రాబడులు వార్షికంగా 5.58% వరకు ఉంటాయి. ఓవర్‌నైట్ ఫండ్స్‌లో 4.70% వరకు ఉండొచ్చు. పన్ను ప్రయోజనాలు: ఇందులో పెట్టుబడులకు, రాబడులు ఎటువంటి పన్ను ప్రయోజనాల్లేవు. అనుకూలతలు: ఎటువంటి లాకిన్ ఉండదు. అవసరమైనప్పుడు వేగంగా ఉపసంహరించుకోవచ్చు. ప్రతికూలతలు: భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబడులు ఇంకా తగ్గొచ్చు. ఎవరికి?: అధిక లిక్విడిటీ కోరుకునే వారికి. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్‌కు అనుబంధంగా ఇన్వెస్ట్ చేసుకునే వీలున్న సాధనం. ఇందులో 2018–19లో అమల్లో ఉన్న రేటు 8.65 శాతం. పన్ను ప్రయోజనాలు: ఇందులో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. రాబడిపైనా పన్ను ఉండదు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 20 శాతం శ్లాబులోని వారికి నికర రాబడి రేటు 10.92 శాతంగాను, 30 శాతం పన్ను పరిధిలోని వారికి 12.57 శాతంగాను ఉంటుంది. అనుకూలతలు: మార్కెట్ కంటే అధిక రాబడులు ఇందులో ఉంటున్నాయి. పరిమితులు: ఈపీఎఫ్ పరిధిలో ఉన్న వారికే ఇది పరిమితం. అలాగే, ఉపసంహరణలకు పరిమితులు ఉన్నాయి. ఎవరికి?: రిస్క్ రహితంగా దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవాలని అనుకునే వారికి. ఐదేళ్ల కంపెనీ డిపాజిట్ కంపెనీలు తమ అవసరాల కోసం వివిధ మార్గాల్లో నిధులను సమీకరిస్తుంటాయి. ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, ఎన్బీఎఫ్సీలు డిపాజిట్ల రూపంలో నిధులు సేకరిస్తుంటాయి. వీటిల్లో హెచ్డీఎఫ్సీ ఆఫర్ చేస్తున్న డిపాజిట్‌పై వడ్డీ రేటు పెద్దలకు 7.55 శాతం, ఇతరులకు 7.30 శాతంగా ఉంది. 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వృద్ధులకు నికరంగా వచ్చే రాబడి 5.98 శాతం.. ఇతరులకు 5.78%. 30% పన్ను పరిధిలోని వృద్ధులకు నికరంగా అందే రాబడి 5.19%, ఇతరులకు 5.02 శాతంగా ఉంటుంది. పన్ను ప్రయోజనాలు: పన్ను ప్రయోజనాలు కంపెనీల డిపాజిట్లపై ఉండవు. అనుకూలతలు: బ్యాంకు ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీ రేటు లభిస్తుంది. ప్రతికూలతలు: అధిక రిస్క్ ఉంటుంది. ముందస్తుగా డబ్బులను వెనక్కి తీసుకోవాలంటే నియంత్రణలు ఉంటాయి. ఎవరికి?: అధిక రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకునే వారికి. ఏఏఏ రేటింగ్ కలిగిన సంస్థల డిపాజిట్లనే పరిశీలించడం మంచిది. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి తగ్గిన పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక ఈ ఏడాది నవంబర్ మాసంలో గణనీయంగా తగ్గిపోయింది. నికరంగా రూ.933 కోట్లు మాత్రమే ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ‘యాంఫి’ తెలియజేసింది. నెలవారీగా చూసుకుంటే ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక 85 శాతం మేర తగ్గిపోయింది. 2016 జూన్ తర్వాత ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం వరుసగా మూడో నెలలోనూ తగ్గినట్టయింది. ఏవో కొన్ని ఎంపిక చేసిన స్టాక్స్ మినహా మిగిలిన స్టాక్స్ పనితీరు గత ఏడాది కాలంలో ఆశాజనకంగా లేకపోవడం ఫండ్స్ రాబడులపై ప్రభావం చూపించింది. ఇది పెట్టుబడులపైనా ప్రతిఫలించింది. మరోవైపు క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు గణనీయంగా బయటకు వెళ్లిపోతున్నాయి. గత నెల చివరి నాటికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు రూ.27.04 లక్షల కోట్లకు పెరిగాయి. అక్టోబర్ చివరికి ఉన్న రూ.26.33 లక్షల కోట్లతో పోల్చుకుంటే 3 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం మీద ఫండ్స్ పథకాల్లోకి అక్టోబర్‌లో రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే, అది నవంబర్‌లో రూ.54,419 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా డెట్ ఫండ్స్‌లోకి రూ.51,000 కోట్ల పెట్టుబడులు రావడం వృద్ధికి దోహదపడింది. ‘క్రెడిట్ రిస్క్’ సంక్షోభం! దేశీయ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మొత్తం 44 సంస్థలు (ఏఎంసీలు) కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటి పరిధిలోని క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి నవంబర్‌లో నికరంగా రూ.1,899 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారు. అంతక్రితం మాసం నాటి గణాంకాలతో పోలిస్తే పెట్టుబడుల ఉపసంహరణ 37.4 శాతం పెరిగింది. గతేడాది జూలై నుంచి క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌కు అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం, ఆ తర్వాత డీహెచ్ఎఫ్ఎల్ తదితర సంస్థలు రుణ పత్రాలపై చెల్లింపుల్లో విఫలం కావడం, వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన క్రెడిట్ రిస్క్ ఫండ్స్ రాబడులు దెబ్బతినడం ఈ పరిణామాలకు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నాటికి క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నిర్వహణలో రూ.79,643 కోట్ల పెట్టుబడులు ఉండగా, నవంబర్ చివరికి అవి రూ.63,754 కోట్లకు తగ్గాయి. ఇది 20% క్షీణత. లిక్విడ్ ఫండ్స్‌కూ నిరాదరణ... డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్‌కూ నిరాదరణ ఎదురైంది. అక్టోబర్‌లో లిక్విడ్ ఫండ్స్ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు రూ.93,203 కోట్లుగా ఉంటే, నవంబర్‌లో రూ.6,938 కోట్లకు తగ్గిపోయాయి. ఎగ్జిట్ లోడ్ విధించడం వల్ల కొందరు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఓవర్‌నైట్ ఫండ్స్‌కు మళ్లించి ఉంటారని యాంఫి సీఈవో వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. ఇతర ఫండ్స్‌లోకి... ► ఈక్విటీ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) పథకాల్లోకి నవంబర్‌లో నికరంగా రూ.2,954 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం అక్టోబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.5,906 కోట్లతో పోలిస్తే సగం మేర తగ్గాయి. ► ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకాల్లోకి రూ.1,312 కోట్ల పెట్టుబడులు రాగా, రూ.379 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. దీంతో నికర పెట్టుబడులు రూ.933 కోట్లుగా నమోదయ్యాయి. ► డెట్ విభాగంలో ఓవర్‌నైట్ ఫండ్స్ (ఒక్క రోజు కాల వ్యవధి సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేవి)లోకి రూ.20,650 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లిక్విడ్ ఫండ్స్‌కు ఎగ్జిట్ లోడ్ విధించడం వీటికి కలిసొచ్చింది. ► బ్యాంకింగ్–పీఎస్‌యూ ఫండ్స్‌లోకి 7,230 కోట్లు వచ్చాయి. ► గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా రూ.7 కోట్లు వచ్చాయి. అంతక్రితం నెలలో రూ.31.45 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. లాభాల స్వీకరణే.. ఈక్విటీ పథకాల్లో నికర పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గడానికి ఒకింత ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే కారణం. అయితే, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణ ఆస్తులు మాత్రం మొత్తం మీద రూ.27 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి దీర్ఘకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన సిప్ పెట్టుబడులు క్రమంగా వృద్ధి చెందుతూ నూతన గరిష్ట స్థాయి రూ.3.12 లక్షల కోట్లకు చేరాయి. – ఎన్ఎస్ వెంకటేశ్, యాంఫి సీఈవో -
ఏడాది మారింది... మరి మీరు?
గతేడాది చాలా పెట్టుబడి సాధనాలు సగటు కంటే తక్కువ రాబడులే ఇచ్చాయి. ఇటీవలి కాలంలో ఎక్కువ అస్థిరతలు చూసింది గతేడాదిలోనే. అయితే, 2019లో పరిస్థితులు ఆశాజనకంగానే ఉంటాయన్నది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. ప్రతికూలతలను అధిగమించి, పెట్టుబడి అవకాశాలను అందుకోవాలంటే అందుకు ప్రతి ఒక్కరూ పాటించతగిన ఆర్థిక విధానాలు కొన్ని ఉన్నాయి. అవేంటన్నది నిపుణుల మాటల్లోనే... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందున మార్కెట్లలో అస్థిరతలు కొనసాగేందుకు అధిక అవకాశాలున్నాయి. ఈ అస్థిరతలను అధిగమించేందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఉపయోగపడుతుంది. ఎన్నికల వరకు స్టాక్స్ ధరలు పరిమిత పరిధిలోనే కదలాడే అవకాశం ఉంది. ఫలితాలు వెలువడ్డాక దిశను ఎటువైపు అయినా మార్చుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఇన్వెస్టర్లు సిప్ ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేయడమే సరైన మార్గం. మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు ఎన్ఏవీ ధరలు పెరగడం వల్ల తక్కువ ఫండ్స్ యూనిట్లు, మార్కెట్లు కరెక్షన్ బాట పడితే ఎన్ఏవీ ధరల పతనంతో ఎక్కువ యూనిట్లు సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లు కొంతమేర కరెక్షన్కు గురైన ఈ సమయంలో సిప్‌ను ఆపకూడదు. దీనివల్ల తక్కువ ధరలకు ఎన్ఏవీలను కొనుగోలు చేసుకునే అవకాశం కోల్పోతారు. ముఖ్యంగా 12–18 నెలల క్రితం సిప్ ఆరంభించిన వారు కచ్చితంగా ఈ సమయంలో ఆపకుండా కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఏడాది, ఏడాదిన్నర క్రితం మార్కెట్ల వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. కనుక గరిష్ట ధరల్లో పెట్టుబడి పెట్టిన వారు, ఇప్పుడు తక్కువ ధరకే కొనే అవకాశాన్ని కోల్పోకూడదు. లార్జ్‌క్యాప్‌నకు ప్రత్యామ్నాయాలు చాలా వరకు ప్రధాన లార్జ్‌క్యాప్ ఫండ్స్ గతేడాది మెరుగైన పనితీరు చూపించలేకపోయాయి. ఈ ఏడాది కూడా వీటి పనితీరు అంత బాగుండకపోవచ్చనే అంచనా ఉంది. అధిక రాబడులు కోరుకునే వారు అధిక రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందని మరిచిపోవద్దు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్, హెచ్డీఎఫ్సీ టాప్ 100, రిలయన్స్ లార్జ్‌క్యాప్, యూటీఐ మాస్టర్‌షేర్ పథకాలన్నీ గతేడాది ఒక శాతం నుంచి రెండున్నర శాతం నష్టాలను మిగిల్చాయి. ఇదే కాలంలో నిఫ్టీ– 50 సూచీ 3 శాతం రాబడులను ఇచ్చింది. కనుక లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు బదులు ఈ సమయంలో మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మల్టీక్యాప్ ఫండ్స్ భిన్న మార్కెట్ విలువతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయని వారు సూచిస్తున్నారు. దీంతో అధిక రాబడులిచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే రిస్క్ కాస్త తక్కువగానే ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే... మల్టీక్యాప్ ఫండ్స్ అయినప్పటికీ క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్) ద్వారా కనీసం ఐదేళ్లు ఆపైన ఇన్వెస్ట్ చేయడం ద్వారానే మెరుగైన రాబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పన్ను భారం తగ్గించుకోవచ్చు ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత కూడా ఈక్విటీల్లోకి, మ్యూచువల్ ఫండ్స్‌లోకి రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఆగలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. సిప్ ద్వారా 2018లో వచ్చిన పెట్టుబడుల్లో 20 శాతం వృద్ధి నెలకొంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి దీర్ఘకాల మూలధన లాభం పొందితే దానిపై 10 శాతం పన్ను చెల్లించాలి. అయితే, ఈక్విటీ ఫండ్స్‌లో వచ్చే లాభాల్లో ఇది స్వల్ప మొత్తమేనని ఇన్వెస్టర్లు అర్థం చేసుకున్నట్టున్నారు. నిజానికి 10 శాతం పన్ను రాబడులను పెద్దగా ప్రభావం చేసేది కాదని నిపుణుల అభిప్రాయం కూడా. నెలకు సిప్ ద్వారా రూ.5,000– 10,000 మొత్తం ఇన్వెస్ట్ చేసే వారిపై ఇప్పటికిప్పుడు ఈ పన్ను ప్రభావం కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ స్వల్ప మొత్తంపై ఏడాదిలో వచ్చే లాభాలు పన్ను పడే స్థాయిలో ఉండవు. అదే రూ.30,000– 50,000 మధ్య ఇన్వెస్ట్ చేసే వారయితే వార్షికంగా 12 శాతం రాబడులు వచ్చాయనుకుంటే రెండేళ్ల తర్వాత మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తారు. రెండేళ్లలో వారు పొందే లాభం రూ.లక్ష దాటుతుంది. ఆ మొత్తాన్ని ఒకే ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటేనే పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఈ పన్ను కూడా చెల్లించకుండా మార్గం ఉంది. ఏడాది దాటాక ప్రతీ నెలా అంతే మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటూ తిరిగి అదే ఫండ్ లేదా మరో ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. దీంతో పన్ను వర్తించేంత లాభాలు రాకముందే తిరిగి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు 2018 ఏప్రిల్ నెలలో ఓ ఫండ్‌లో ఎన్ఏవీ రూ.25 వద్ద రూ.25,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి. 1,000 యూనిట్లు వచ్చి ఉంటాయి. 2019 ఏప్రిల్ నెలతో ఏడాది పూర్తవుతుంది. ఆ మరుసటి నెలలోనే వెయ్యి యూనిట్లను రెడీమ్ చేసుకుని తిరిగి ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ప్రతీ సిప్‌కు ఏడాది పూర్తయిన వెంటనే తిరిగి ఇన్వెస్ట్ చేస్తుంటే సరి. మల్టీ ఇయర్ హెల్త్ ప్లాన్ వైద్య బీమాకు ఏటా ప్రీమియం చెల్లించాలి. లేదంటే కవరేజీ ఆగిపోతుంది. దీనికి బదులు ఒకేసారి రెండేళ్లకు ప్లాన్ తీసుకుని ప్రీమియం చెల్లించడం వల్ల తగ్గింపుతోపాటు... ఏడాదికే ప్రీమియం చెల్లించాల్సిన ఇబ్బందీ తప్పుతుంది. న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ 2017లో వృద్ధుల వైద్య బీమా ప్రీమియంను ఒకేసారి రెట్టింపునకు పైగా పెంచింది. కనుక ఒకేసారి ఎక్కువ సంవత్సరాలకు పాలసీ తీసుకోవడం వల్ల తగ్గింపు ఒక్కటే కాదు, ప్రీమియం పెరిగే భారం కూడా కొంత వరకు తప్పించుకున్నట్టు అవుతుంది. ఎన్పీఎస్ కూడా చూడొచ్చు.. జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) విశ్రాంత జీవనం కోసం ప్రణాళికలు వేసుకునే వారికి అనువైన సాధనాల్లో ఒకటి. ఇందులో చార్జీలు ఇతర సాధనాలతో పోలిస్తే తక్కువ. ఈక్విటీ, డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 60 ఏళ్లు వచ్చాక ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంలో 20 శాతంపై పన్ను ఉండేది. ఇది నచ్చక చాలా మంది దీనికి దూరంగా ఉండిపోయారు. అయితే, ఎన్పీఎస్ పథకం నుంచి రిటైర్మెంట్ వయసులో ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంపైనా పన్నును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలని తెలిసిందే. ఇక ఈక్విటీల్లో యాక్టివ్ చాయిస్ కింద 75 శాతం వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తూ ఎన్పీఎస్ నిర్వహణను చూసే పీఎఫ్ఆర్డీఏ గతేడాది అక్టోబర్‌లో మరో నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్లు వచ్చే వరకూ కూడా ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతించింది. గత ఐదేళ్ల కాలంలో చూసుకుంటే వార్షికంగా రెండంకెల రాబడులు ఎన్‌పీఎస్‌లో ఉన్నాయి. ఈక్విటీలకు 50 శాతం వరకు కేటాయించుకునే వారికి 11.31 శాతం చొప్పున వార్షిక రాబడులు, పూర్తిగా డెట్‌కే పరిమితమైన వారికి వార్షికంగా 10.55 శాతం చొప్పున పెట్టుబడుల వృద్ధి ఉంది. ఇక పన్ను ప్రయోజనాలు అదనం. బేసిక్ వేతనంలో 10 శాతాన్ని సెక్షన్ 80సీసీడీ(2) కింద ఉద్యోగి తరఫున కంపెనీ ఎన్పీఎస్కు జమ చేస్తే పన్ను ఉండదు. అలాగే, సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద ఎన్‌పీఎస్‌లో అదనంగా మరో రూ.50,000 పెట్టుబడిపైనా పన్ను ఉండదు. కనుక దీన్ని తప్పకుండా పరిశీలించాల్సిన పథకంగా ఫైనాన్షియల్ అడ్వైజర్ల సూచన. విదేశీ ఫండ్స్‌లో కూడా... అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఎన్ఏవీల ధరలు కొంత కాలం క్రితం వరకూ బాగా పెరిగాయి. తాజాగా అమెరికా మార్కెట్ల పతనం నేపథ్యంలో వాటి ఎన్ఏవీలు తగ్గుముఖం పట్టాయి. అంతమాత్రాన అమెరికా ఫండ్స్‌లో పెట్టుబడులు ఆపేయాల్సిన అవసరం లేదన్నది నిపుణుల విశ్లేషణ. అమెరికన్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఎన్నో అంశాలను అధ్యయనం చేశాకే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుంటాయి. బలమైన బ్రాండ్, మార్కెట్ వ్యాల్యూ, బలమైన నగదు ప్రవాహాలు వంటి అంశాలను చూస్తాయి. పైగా డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణత కూడా పెట్టుబడుల విలువ పెరిగేందుకు దోహదపడుతుంది. కనుక తమ పిల్లలను విదేశీ విద్యకు పంపించాలనుకునే వారు ఈ తరహా ఫండ్స్‌లో ముందునుంచే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రుణాన్ని బదలాయించుకుంటే...? రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో బ్యాంకులు వాటి అంతర్గత బెంచ్ మార్క్ రేటుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో పారదర్శకత తక్కువగా ఉంటోంది. దీనికి బదులు రెపో రేటు, 91, 182 రోజుల ట్రెజరీ బిల్లు ఈల్డ్ రేటు లేదా ఏదైనా ఇతర బెంచ్ మార్క్ మార్కెట్ రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లను అనుసరించాలని ఆర్బీఐ ఇటీవలే ఆదేశించింది. గృహ, ఆటోమొబైల్, వ్యక్తిగత రుణాలకూ ఇది అమలుకానుంది. బ్యాంకుల మధ్య పోటీ పెరిగి కస్టమర్లకు తక్కువ రేట్లకే రుణం లభించే పరిస్థితులకు ఇది దారితీస్తుంది. కనుక అధిక వడ్డీ రేటుకు రుణం తీసుకున్న వారు దాన్ని తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు బదలాయించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. రుణం తొలి నాళ్లలో ఈఎంఐలో ఎక్కువ మొత్తం వడ్డీకే వెళుతుంది. కనుక మొదట్లోనే రుణాన్ని బదలాయించుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువ. పెద్దల పేరు మీద పెట్టుబడి 60 ఏళ్లు దాటిన వారు వార్షికంగా పొందే రూ.50వేల వడ్డీ ఆదాయానికి పన్నును మినహాయిస్తూ కేంద్రం గతేడాది నిర్ణయం తీసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. 60 ఏళ్ల లోపు వయసులో ఉన్న వారు ఏటా వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక తమ తల్లిదండ్రులకు పన్ను వర్తించేంత ఆదాయం లేకపోతే, వారికి గిఫ్ట్‌గా ఇచ్చి, వారి పేరిట డిపాజిట్ చేయడం మంచి ఆలోచన. ఇది చట్టబద్ధం కూడా. పైగా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అర శాతం వరకు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. భార్యా, పిల్లలకు గిఫ్ట్ ఇచ్చి వారి పేరిట ఇన్వెస్ట్ చేసినా, అది గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ఆదాయం కిందే చట్టం పరిగణిస్తుంది. తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇస్తే మోసపూరిత లావాదేవీగా చట్టం పరిగణించదని ట్యాక్స్‌స్పానర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు సుధీర్కౌశిక్ తెలిపారు. షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్ ప్రస్తుతం వడ్డీ రేట్ల పరంగా ఆటుపోట్లు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కనుక ఈ సమయంలో దీర్ఘకాల డెట్ ఫండ్స్ కంటే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ అనుకూలమని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాల ఫండ్స్, దీర్ఘకాలంలో గడువు తీరే బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇంక్రిమెంటల్ రిస్క్ తీసుకున్నా గానీ దీర్ఘకాల డెట్ ఫండ్స్ తగినంత రాబడులను ఆఫర్ చేయడం లేదని, వీటికి బదులు మూడేళ్ల లోపు గడువు తీరే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఐవో ధావల్ దలాల్ సూచించారు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్ (రుణ చరిత్ర) ఉన్న కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌ను కూడా పరిశీలించొచ్చని కెనరా రొబెకో మ్యూచువల్ ఫండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం హెడ్ అవనీష్ జెయిన్ సూచన. 2–5 ఏళ్ల కాలానికి ఇవి మంచి రాబడులను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు డెట్ ఫండ్స్‌లో వడ్డీ రేట్ల రిస్క్ ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు ఆ ప్రయోజనం నష్టపోతారు. ఈ రకమైన రిస్క్ వద్దనుకునేవారు ఎఫ్ఎంపీలను పరిశీలించొచ్చు. ఇవి డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసి గడువు తీరే వరకు కొనసాగుతాయి. దాంతో బాండ్ ఈల్డ్స్‌కు అనుగుణంగానే రాబడులు ఉంటాయి. -
సిప్‌తో నష్టాలా..? కంగారొద్దు!!
శ్రీనిధి (32) ఎంఎన్సీ కంపెనీలో మానవ వనరుల విభాగంలో పనిచేస్తోంది. గతేడాది నుంచి ఆమె ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా పెట్టుబడి పెడుతోంది. ఇటీవలి మార్కెట్ల పతనం నేపథ్యంలో ఆమె తన పోర్ట్‌ఫోలియోపై రాబడులను పరిశీలించింది. అవేమో కాస్త నష్టాల్లో ఉన్నాయి. శ్రీనిధి తెల్లబోయింది. మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో సంపద సమకూరుతుందని, లక్ష్యాలు సులభంగా చేరుకోవచ్చని నిపుణులు చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. అవి నిజమేనా? అని డైలమాలో పడింది. నిజానికిది శ్రీనిధి ఒక్కరి సమస్యే కాదు. ఈ మధ్య మార్కెట్లోకి ప్రవేశించి సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టిన వారిలో చాలా మందికి నష్టాలే ఎదురవుతున్నాయి. వారు అవి చూసి ఆందోళన చెందుతున్నారు. దీన్ని కొనసాగించాలా... వద్దా? అనే డైలమాలో పడ్డారు కూడా. కాకపోతే, దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారు ఈ తాత్కాలిక నష్టాలను చూసి ఆందోళన చెందక్కర్లేదన్నది నిపుణుల మాట. ఇలా పడ్డప్పుడే సిప్‌ను కొనసాగించాలని, అపుడు పెరిగితే మంచి లాభాలు చూడవచ్చనేది వారి సూచన. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం మార్కెట్లు పడితే మంచిదే... సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను (సిప్) ఆపేద్దామని నిర్ణయించుకుంటే లేదా ఇప్పటి వరకు వచ్చిన లాభాలు చాల్లేనని వాటిని వెనక్కి తీసుకుందామనుకున్నా దాని కంటే ముందు మీరు పరిశీలించాల్సినవి ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించి కనీసం మూడు నుంచి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలమే అయితే కచ్చితంగా మంచి లాభాలతో ఉండి ఉంటారు. కాబట్టి తాజా పతనంలో ఆ లాభాల శాతం తగ్గిందని అమ్మేయడం సరికాదు. ఒకవేళ మీరు గడిచిన ఏడాది లేదా రెండేళ్లుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, తాజా మార్కెట్ల పతనం నిజంగా మీకంటూ లభించిన ఓ అవకాశం. మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు ఫండ్ యూనిట్లు గానీ, షేర్లు గానీ అధిక ధర పెట్టి కొనాలి. అవే యూనిట్లు ఈ సమయంలో చాలా డిస్కౌంట్ రేటుకే కొనుగోలు చేయొచ్చు. కాబట్టి దీన్నో చక్కని అవకాశంగా చూడాలి. ఉదాహరణకు రూ.10,000ను సిప్ రూపంలో ఓ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. దాని ఎన్ఏవీ రూ.200. రూ.10,000 పెట్టుబడికి 50 యూనిట్లు వస్తాయి. కరెక్షన్ సమయంలో ఈ ఎన్ఏవీ రూ.175కు తగ్గిపోయిందనుకోండి. రూ.10వేల పెట్టుబడికి 57.14 యూనిట్లు వస్తాయి. ఓ రెండు నెలల తర్వాత మార్కెట్ల రికవరీతో మీ ఫండ్ ఎన్ఏవీ తిరిగి రూ.250కు వెళితే అదనంగా వచ్చిన 7.14 యూనిట్లపై రూ.535 లాభం వచ్చినట్టు. అయితే మార్కెట్లు నెలా, రెండు నెలల్లో రికవరీ అవ్వాలనేమీ లేదు. ఇంకా ఎక్కువ సమయమే తీసుకోవచ్చు. అయినా కానీ, మార్కెట్లు దిద్దుబాటుకు గురైన సమయంలో తక్కువ ఎన్ఏవీల వద్ద ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడం వల్ల కాస్తంత ఆలస్యమైనా మంచి రాబడులు కనిపిస్తాయి. ఇన్వెస్టింగ్లో రిస్క్ ఉంటుంది... ఇక తాజా కరెక్షన్ మార్కెట్లు అధిక విలువల వద్ద ఇన్వెస్ట్ చేస్తే ఉండే రిస్క్‌ను తెలియజేసింది. గతేడాది మార్చిలో నిఫ్టీ 23 పీఈవో వద్ద ఉంటే, మిడ్‌క్యాప్ సూచీ 33–49 పీఈ స్థాయిలో, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 45 పీఈల వద్ద ఉన్నాయి. ఆ విలువల వద్ద పెట్టుబడులు మొదలు పెట్టిన వారికి సమీప కాలంలో లాభాలు ఆర్జించే అవకాశాలు తక్కువేనని ‘పర్సనల్ ఫైనాన్స్ ప్లాన్ డాట్ ఇన్’ వ్యవస్థాపకుడు దీపేశ్ రాఘవ్ చెప్పారు. అయినప్పటికీ సిప్ కొనసాగిస్తే దీర్ఘకాలంలో చక్కని రాబడులు అందుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ‘‘ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే కనీసం 7–10 ఏళ్ల కాల వ్యవధికి సిద్ధపడాలి. ఒకవేళ మార్కెట్లు గరిష్ట విలువల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినాగానీ 7–10 ఏళ్ల కాలంలో మరోసారి గరిష్టాలకు వెళ్లే అవకాశం దాదాపుగా ఉంటుంది. ఆ గరిష్టాలు అంతకు ముందు స్థాయి కంటే ఎక్కువే అయి ఉంటాయి’’ అని దీపేశ్ చెప్పారు. కరెక్షన్ అవసరమే... ఇటీవలి బుల్ రన్లో లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ మెరుగైన పనితీరు చూపించాయి. నిజానికి ఈ తరహా పథకాలు మార్కెట్లు పెరుగుతున్నప్పుడు వేగంగా పెరగడం, పడిపోతున్నప్పుడు అంతే వేగంగా పతనం అవడం జరుగుతుంటుంది. అందుకే రిస్క్ ఎక్కువ తీసుకోలేని వారు మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ముందు ఆ పెట్టుబడుల కేటాయింపుల్లో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈక్విటీల్లో 70–75 శాతం వరకు పెట్టుబడులను లార్జ్ క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవాలని, మిగిలిన 25–30 శాతం పెట్టుబడులను స్మాల్, మిడ్ క్యాప్స్‌లో ఉండేలా చూసుకోవాలన్నది ఆర్థిక సలహాదారుల సూచన. ఇక తమ మిగులు నిల్వలన్నింటినీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, వాటి విలువలు పెరుగుతున్న కొద్దీ డైవర్సిఫై చేసుకోవాలి. కొంత మేర నిధుల్ని బంగారం, డెట్ సాధనాల్లోకి మళ్లించుకోవడం ద్వారా రిస్క్ పరిమితం చేసుకోవచ్చు. ‘‘ప్రతీ ఆరు నెలలకోసారి మీ ఫండ్ పనితీరును పరిశీలించుకోవాలి. ఆ ఫండ్ పనితీరు ఆ విభాగంలోని మిగిలిన పథకాల కంటే, బెంచ్ మార్క్ సూచీ కంటే వెనుకబడిందా అన్నది గమనించుకోవాలి’’ అని ఆర్థిక సలహాదారు ఆర్ణవ్ పాండ్యా సూచించారు. ఇలాంటపుడే సిప్ కొనసాగాలి మార్కెట్లు పడుతున్న ఇలాంటి సమయంలో యువ ఇన్వెస్టర్లు సిప్‌లను ఆపేసి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని పొరపాటు చేయవద్దని ఎక్కువ మంది విశ్లేషకులు, ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. తమ పెట్టుబడులను, సిప్‌లను కొనసాగించాలనే చెబుతున్నారు. ‘‘సిప్ ప్రధాన ఉద్దేశం మార్కెట్లు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు నిరాటంకంగా పెట్టుబడులను కొనసాగించడమే. కరెక్షన్ వల్ల మార్కెట్ల వ్యాల్యూషన్లు చౌకగా మారిన సమయంలో మీ సిప్‌ను ఆపేయడం తెలివైన పని కాదు. సిప్పై నెగెటివ్ రిటర్న్‌లు వచ్చిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2008–09, 2012–13లో ఇలానే జరిగింది. ఆ సమయంలో నష్టాలను చూసి సిప్ ఆపేసిన ఇన్వెస్టర్లు లాభాలను మిస్సయ్యారు. నష్టాలు వచ్చినప్పటికీ సిప్ కొనసాగించిన వారు మాత్రం మార్కెట్లు వృద్ధిలోకి వచ్చిన తర్వాత లాభాలను కళ్లజూశారు’’ అని కోటక్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ నీలేశ్ షా వ్యాఖ్యానించారు. -
ఫండ్స్‌లో.. ఇన్వెస్ట్ చేస్తున్నారా..?
స్టాక్ మార్కెట్ల ర్యాలీ కారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. డెట్ ఫండ్స్‌కూ ఆదరణ పెరుగుతూ వస్తోంది. అయితే, పెట్టుబడులు పెట్టేయడంతోనే బాధ్యత అయిపోయిందనుకోవడం సరికాదు. ఓ ఇన్వెస్టర్‌గా చట్టపరంగా మీకుండే హక్కులు, బాధ్యతల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రతీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలపై అందిస్తున్న ప్రాఫిట్ కథనం ఇది. కేవైసీ కాంప్లియంట్ ప్రతీ ఇన్వెస్టర్ కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనలను పూర్తి చేయడం తప్పనిసరి. నల్లధనానికి చెక్ పెట్టడం, చట్టవిరుద్ధమైన నిధులు ఫండ్స్‌లోకి రాకుండా అడ్డుకోవడమే ఈ నిబంధనల ఉద్దేశ్యం. కేవైసీ కింద ఇన్వెస్టర్ గుర్తింపునకు సంబంధించి చెల్లుబాటయ్యే ఓ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, చిరునామా ధ్రువీకరణ, ఓ పాస్‌పోర్ట్ సైజు ఫొటో కూడా ఇవ్వాలి. గుర్తింపు, చిరునామా ధ్రువీకరణకు పాస్‌పోర్ట్, పాన్, వోటర్ ఐడీ చెల్లుబాటవుతాయి. పైగా ఆధార్‌ను ఇతర అన్ని కేవైసీ పత్రాలతో అనుసంధానం చేయాలి. ఏ ఇన్వెస్టర్ అయినా గానీ కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీల వద్ద తమ కేవైసీ వివరాలను అప్డేట్ చేయించుకుంటే, ఆతర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని పెట్టుబడుల్లోనూ ఆ మేరకు ఆటోమేటిక్‌గా మార్పులు జరిగిపోతాయి. వ్యక్తిగత సమాచారం ప్రతీ ఇన్వెస్టర్ కూడా తనకు సంబంధించి సంప్రదింపులకు వీలుగా చిరునామా, కాంటాక్టు నంబర్లు, ఈమెయిల్ ఐడీ, పాన్, ఒక బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాలి. అంతేకాదు, వీటిలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఆ సమాచారాన్ని వెంటనే ఆయా ఫండ్ సంస్థలకు తెలియజేయడం ప్రతీ ఇన్వెస్టర్ బాధ్యతే. బ్యాంకు ఖాతాకు సంబంధించి ఐఎఫ్ఎస్సీ నంబర్, 9 అంకెల ఎంఐసీఆర్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. మోసాల నివారణకు వీలుగా ఈ కీలక సమాచారం ఫండ్స్ సంస్థలకు తెలియజేయడం అవసరం. నామినేషన్ ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ప్రతీ ఇన్వెస్టర్ కనీసం నామినీగా ఒక్కరి పేరును అయినా సూచించాలి. లేదంటే ఎవరినీ నామినీగా నియమించడం ఇష్టం లేదని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్‌గా ఏదైనా జరిగితే నామినేషన్ అక్కరకు వస్తుంది. పరిశీలిస్తూ ఉండాలి... తాము పెట్టుబడి పెట్టిన పథకాల పనితీరు ఎలా ఉన్నదీ అప్పడప్పుడూ పరిశీలిస్తూ ఉండడం అవసరం. ఇందుకు సంబంధించి ఆయా ఫండ్ పథకాల ఎన్ఏవీ చూస్తే తెలిసిపోతుంది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే రోజువారీ, ప్రతీ వారం రాబడులు ఎలా ఉన్నదీ చూసుకోవాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా నెలకోసారి రాబడులను సమీక్షిస్తూ వెళితే సరిపోతుంది. మరీ తరచుగా కాకపోయినా మధ్య మధ్యలో ఆయా పథకాల పనితీరు ఎలా ఉన్నదీ గమనించడం అవసరమే. దీనివల్ల మార్కెట్ల పని తీరుకు అనుగుణంగా ఆయా పథకాల పనితీరు ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. అవసరమైతే పెట్టుబడుల్లో మార్పులు కూడా చేసుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక ఆర్థిక ప్రణాళిక వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ప్రతీ ఇన్వెస్టర్ గుర్తుంచుకోవాలి. కుటుంబ భవిష్యత్తు అవసరాలు, కీలకమైన ఆర్థిక లక్ష్యాలు, ఇందులో స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక అవసరాలు ఏవి, ఇందుకోసం ఎంచుకోవాల్సిన సాధనాలు, అస్సెట్ అలోకేషన్ తదితర వివరాలతో ప్రణాళిక ఉండాలి. అలాగే, ఆదాయం, ఖర్చులు, ఎంత మేర పెట్టుబడులకు కేటాయించాలి, ఇందుకోసం అందుబాటులో ఉన్న వనరులు ఇలా అన్ని వివరాలు సమగ్రంగా ఉండాలి. అలాగే, అత్యవసరాల్లో ఆదుకునే నిధి కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, సరిపడా జీవిత బీమా కవరేజీ కూడా తీసుకోవాలి. వీటిని క్రమానుగతంగా సమీక్షిస్తూ అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవడం కూడా అవసరమే. ఆధార్, ఫ్యాక్టా ప్రతీ వ్యక్తి తమ పేరిట ఉన్న అన్ని రకాల పెట్టుబడులకు ఆధార్ నంబర్‌తో ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది కేంద్ర సర్కారు. అలాగే, విదేశీ పన్ను చట్టం (ఫ్యాక్టా) నిబంధనలనూ అనుసరించాల్సి ఉంటుంది. -
ఈక్విటీ ఎంఎఫ్ పెట్టుబడులు రూ.9,429 కోట్లు
డిసెంబరు తరవాత ఇదే గరిష్ఠ స్థాయి న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఏప్రిల్ నెలలో రూ.9,429 కోట్లమేర పెట్టుబడులు వచ్చాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపడం సహా ఫండ్ హౌస్‌లు మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం తీసుకున్న పలు చర్యలు ఇన్వెస్ట్మెంట్ల పెరుగుదలకు కారణంగా ఉన్నాయి. రిడంప్షన్లతో పోలిస్తే ఈక్విటీ ఎంఎఫ్‌లలోకి పెట్టుబడుల ఇన్‌ఫ్లో పెరుగుతూ రావడం వరసగా ఇది 13వ నెల. ఎందుకంటే ఇన్వెస్టర్లు గతేడాది మార్చిలో ఏకంగా రూ.1,370 కోట్లమేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఆ తరవాత నుంచి పెట్టుబడుల ఇన్‌ఫ్లో పెరిగినట్లు యాంఫీ తెలియజేసింది. దీని ప్రకారం... ఈక్విటీ ఫండ్స్‌లోకి ఏప్రిల్ ఒక్క నెలలోనే నికరంగా రూ.9,429 కోట్లమేర పెట్టుబడులు వచ్చాయి. అంతకు ముందు నెలలో ఇవి రూ.8,216 కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్ తరవాత చూస్తే ఇదే గరిష్ట స్థాయి. డిసెంబర్లో పెట్టుబడులు రూ.10,103 కోట్లుగా ఉన్నాయి. కాగా గతేడాది ఏప్రిల్‌లో ఈక్విటీ ఎంఎఫ్‌ల పెట్టుబడులు రూ.4,438 కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి మ్యూచ్‌వల్ ఫండ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.5.69 లక్షల కోట్లకు చేరినట్లు కూడా యాంఫీ తెలియజేసింది. -
మార్కెట్ రాణులు మహిళలే !
► మగవారికన్నా మెరుగ్గా రాణిస్తున్నది వారే ► ఓపిక, వేగంగా నిర్ణయాలు తీసుకోవటమే కారణం ► భాగస్వామ్యం మరింత పెరగాలి: నిపుణులు స్టాక్ మార్కెట్ మదుపరులుగా మగవారి కన్నా మహిళలే మెరుగ్గా రాణిస్తున్నారట!!. వ్యక్తిగతంగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టి చక్కని రాబడులు సాధిస్తున్న వారిలో మహిళలే ముందుంటున్నారట!! ఇవి పరిశోధనల సాక్షిగా... విశ్లేషకులు చెబుతున్న వాస్తవాలు. ఎందుకంటే స్టాక్మార్కెట్లో లాభాలు సంపాదించాలంటే పెట్టుబడులు పెట్టడంతో పాటు వాటిని నిర్ణీతకాలం పాటు కొనసాగించే ఓపిక కూడా ఉండాలి. దానికంటే ముందు సరైన పరిశోధన చేయాలి. అవసరమైనప్పుడు వాటిని మార్చుకుంటూ వెళ్లాలి. ఇవన్నీ మహిళలకే సాధ్యమవుతున్నాయనేది వారి మాట. మహిళలు రాణించటానికి వారు చెబుతున్న కారణాలేమంటే... రిస్కుకు మరీ ఎక్కువ భయపడొద్దు శ్రీనిధి వయసు 32 ఏళ్లు. మూడేళ్ల పాప కూడా ఉంది. భర్త ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. శ్రీనిధి గృహిణి. ఆర్థిక విషయాల గురించి పెద్దగా తెలియదు. ఓ రోజు ప్రమాదంలో శ్రీనిధి భర్త ప్రాణాలు కోల్పోయాడు. దాంతో శ్రీనిధికి ఉన్నట్టుండి సమస్యలు వచ్చి పడ్డాయి. ఆమె భర్త ఎన్నో సాధనాల్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ ఒకటి రెండు తప్పిస్తే వేటికీ నామినేషన్ ఇవ్వలేదు. అప్పుడు ఓ బంధువు సూచన మేరకు శ్రీనిధి ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుంది. భర్త పేరిట ఉన్న ఇన్వెస్ట్మెంట్లను తన పేరు మీదకు బదిలీ చేసుకుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టింది. మూడేళ్లలోనే ఆమె పెట్టుబడి రెండింతలు అయింది. నెలనెలా కుటుంబ అవసరాలకు ఆమె కొద్ది మొత్తంలో రిడెంప్షన్ తీసుకోవడం ప్రారంభించింది. కుటుంబ అవసరాలు, తన కుమార్తె విద్య, వివాహం, వాటి కోసం అనుసరించాల్సిన విధానం, ఏ ఏ సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి తదితర వివరాలతో ఆమె సమగ్రంగా ఓ ప్రణాళిక కూడా రూపొందించుకుంది. ఈ విషయంలో ఆర్థిక నిపుణుల సూచనలూ పాటించింది. కుటుంబ ఆర్థిక వ్యవహారాలు ఆలస్యంగానే శ్రీనిధి చేతికొచ్చాయి. అయినా ఓపిగ్గా... సంయమనంతో పరిస్థితిని చక్కదిద్దుకుంది. ఒకవేళ శ్రీనిధి ముందుగానే ఈ బాధ్యతలు తీసుకుని ఉంటే..? నామినీగా తన పేరును ముందే నమోదు చేసేలా భర్తకు సూచించి ఉండేది. భర్త హఠాన్మరణం తర్వాత అతని పేరిట ఉన్న ఆస్తులను బదిలీ చేసుకునేందుకు అంతగా శ్రమించే పనీ తప్పేది. అలాగే, పాప పుట్టాక ఆమె భవిష్యత్తు అవసరాలకు ఇంకాస్త ముందుగానే ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రారంభించేలా భర్తతో కలసి ప్లాన్ చేసుకుని ఉండేది. అందుకే ఆర్థిక విషయాల పట్ల అవగాహనే కాక... కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో క్రియాశీలంగా ఉండటం ప్రతి మహిళకూ తప్పనిసరి. స్టాక్ మార్కెట్లో ప్రతి కొనుగోలుపైనా లాభాన్నే ఆర్జించాలంటే సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో నష్టాన్ని పరిమితం చేసుకునేందుకు వాటిని వదిలించుకోక తప్పదు. కానీ, నష్టాలను బుక్ చేసుకోవడం ఓటమిని అంగీకరించడమేనని మగవారు భావిస్తుంటారు. అలాంటి ఆలోచనతో అవే పెట్టుబడులను కొనసాగిస్తూ పరిమిత నష్టాలు కాస్తా పెద్దవి కావడానికి కారణమవుతారు. మహిళలైతే ఈ విషయంలో కాస్త తెలివిగా ఉంటారు. అవసరమైతే ఆ నష్టాలకు అంతటితో చెక్ పెట్టేసి మెరుగైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటారు. మహిళలు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తే దాన్ని నిర్ణీత కాలం పాటు కొనసాగిస్తారు. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు మొదలు పెడితే మధ్యలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినాగానీ వాటి నుంచి దాదాపుగా పక్కకు తప్పుకోరు. మహిళల్లో దూరదృష్టి ఎక్కువ. అసంతృప్తితోనో, మరే చిన్న చిన్న కారణాలతోనో తరచు తమ పెట్టుబడులను మార్చరు. పెట్టుబడి పెట్టాక దీర్ఘకాలం పాటు వేచి చూసే ధోరణి వారిలో ఉంటుంది. దీనివల్ల అనవసర వ్యయాలను ఆదా చేసినట్టే. పెట్టుబడుల విషయంలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం కీలకం. ఈ విషయంలో మహిళలు పురుషుల కంటే ముందున్నారు. మహిళల్లో ఉన్న మరో బలం... మార్కెట్లో వినిపించే వదంతుల్ని పట్టించుకోకపోవడం. ఒకసారి ప్రణాళికకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తే వారు దానికే కట్టుబడి ఉంటారు. అందుకోసం నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెలా పక్కన పెడుతుంటారు. మహిళల్లో తొందరపాటు ఉండదు. పెట్టుబడికి ముందే వారు తగినంత పరిశోధన కూడా చేస్తారు. కానీ, అదే పురుషులు కొనుగోళ్లు ఎక్కువ.. పరిశోధన తక్కువ అన్నట్టు వ్యవహరిస్తారు. ఇష్టం పెంచుకోవాలి... గడచిన పదేళ్లలో స్టాక్ మార్కెట్లలో మహిళల భాగస్వామ్యం పెరిగినట్టు కోటక్ మహింద్రా బ్యాంక్ కన్సూమర్ బ్యాకింగ్ ప్రెసిడెంట్ శాంతి ఏకాంబరం చెప్పారు. అయినప్పటికీ పురుషులతో పోలిస్తే మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువ స్థాయిలోనే ఉందన్నారు. ఆర్థిక విషయాల పట్ల ఉన్న అయిష్టాన్ని మహిళలు విడిచిపెట్టాలని, ఇష్టం పెంచుకోవాలని యెస్ బ్యాంక్ క్లైమేట్ స్ట్రాటజీ గ్లోబల్ ప్రెసిడెంట్ నమితా వికాస్ సూచించారు. ‘‘చాలా మంది మహిళలు తప్పనిసరో లేక అవకాశం లేకో కుటుంబ ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇది దురదృష్టకరం. సహజంగా మహిళలు కుటుంబ స్థితిగతుల పట్ల తగిన అవగాహనతో ఉంటారు. దాంతో మరింత తెలివిగా ఇన్వెస్ట్ చేయగలరు’’ అని నమిత పేర్కొన్నారు. మహిళలు కుటుంబ ఆర్థిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను తెలుసుకోవాలని వీరు సూచించారు. మహిళల భాగస్వామ్యం పెరగటానికి నిపుణులు చేస్తున్న సూచనలివీ... ♦ ఆర్థిక విషయాలు పురుషులకే బాగా తెలుసన్న భావన నుంచి మహిళలు బయటకు రావాలి. కుటుంబ ఆర్థిక విషయాలను ఆసాంతం తెలుసుకునేందుకు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ♦ పర్సనల్ ఫైనాన్స్ గురించి చదవడం ప్రారంభించాలి. లేదా ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ కోర్సులో చేరినా సరిపోతుంది. ♦ నేరుగా పెట్టుబడి పెట్టడానికి ముందు స్వల్ప పెట్టుబడితో నిజంగా కాకుండా డమ్మీ పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకుని దాన్ని పర్యవేక్షించాలి. సరైన అవగాహన, కిటుకులు తెలిసిన తర్వాత పెట్టుబడి ప్రారంభించాలి. ♦ కుటుంబానికి అవసరమైన ఆర్థిక లక్ష్యాలను గుర్తించేందుకు, పెట్టుబడులను ఎక్కడ పెట్టాలన్న విషయాలను తేల్చేందుకు జీవిత భాగస్వామితో కలసి చర్చించాలి. ♦ స్నేహితుల సలహాలు తీసుకోవద్దు. ♦ ఫీజు తీసుకుని సలహాలు ఇచ్చే ఫైనాన్షియల్ ప్లానర్ సేవలు పొందాలి. ♦ విశ్వాసం, నేర్చుకునేందుకు ఆసక్తి అనేవి మంచి విజయ సాధనాలు. ♦ పొదుపులో మహిళలు ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయంలో మగవారికంటే వీరికే ఎక్కువ మార్కులు పడతాయి. ఈ పొదుపును ఇన్వెస్ట్‌మెంట్‌కు మళ్లించి లాభాలు పొందడానికి నిపుణులు ఏమంటున్నారంటే.. రిస్క్ తీసుకోవటానికి వెనకాడొద్దు నష్ట భయమనేది నగదు నిర్వహణ విషయంలో మహిళలను వెనక్కి లాగే అంశాల్లో ప్రధానమైనది. సరైన సాధనాల్లో పెట్టుబడి పెట్టినప్పటికీ కొందరు అభద్రతకు లోనవుతున్నారు. జీవితాంతం తగినంత నగదు చేతిలో ఉండదేమోనని సందేహిస్తున్నారు. ఇవి వారిని రిస్క్ తీసుకోకుండా అడ్డుకుంటున్నాయి. ఫలితంగా ఎక్కువ మంది మహిళలు ఈక్విటీలవైపు రావటం లేదు. పెట్టుబడులకు హామీ ఉండే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, బాండ్లనే ఎంచుకుంటున్నారు. కానీ, ఈక్విటీల్లో పెట్టుబడులను సైతం పరిశీలించాలి. అప్పుడే మెరుగైన రాబడులొస్తాయి. – మ్రినీ అగర్వాల్, ఉమంత్రా సహ వ్యవస్థాపకురాలు –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
ఈక్విటీ ఫండ్స్‌లోకి జోరుగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సలో గత నెలలో జోరుగా పెట్టుబడులు వచ్చారుు. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఆశావహంగా ఉండటంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సలోకి రూ.9,079 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స ఇన్ ఇండియా(యాంఫి) పేర్కొంది.. ఈక్విటీ, డెట్ మార్కెట్లలో సానుకూల, ఆశావహ పరిస్థితులు ఉండటంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సలోకి జోరుగా పెట్టుబడులు వచ్చాయని నిపుణులంటున్నారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండడం, జీఎస్టీ బిల్లు సజావుగా ఆమోదం పొందడం కూడా కలసివచ్చాయని వారంటున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స ఇన్ ఇండియా(యాంఫి) వెల్లడించిన గణాంకాల ప్రకారం., ⇔ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)తో కూడిన ఈక్విటీ ఫండ్సలో గత నెలలో రూ.9,079 కోట్ల పెట్టుబడులు వచ్చారుు. ⇔ ఈక్విటీ స్కీమ్‌ల్లోకి పెట్టుబడులు రావడం ఇది వరుసగా ఎనిమిదో నెల. ⇔ అంతకు ముందు, అంటే ఈ ఏడాది మార్చిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సనుంచి రూ.1,370 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. ⇔ ఈ ఏడాది అక్టోబర్‌లో ఈక్విటీ ఫండ్సల్లోకి రూ.9,394 కోట్ల పెట్టుబడులు వచ్చారుు. గత 16 నెలల్లో ఇవే అత్యధిక పెట్టుబడులు. ⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సలోకి వచ్చిన పెట్టుబడుల మొత్తం రూ.40,706 కోట్లకు చేరారుు. ⇔ ఈ ఏడాది నవంబర్ నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స నిర్వహణ ఆస్తులు (ఏయూఎమ్) రూ.4.68 లక్షల కోట్లకు పెరిగారుు. -
మధ్యలో పీపీఎఫ్ ఖాతా ఆపేయవచ్చా..?
నేనొక సంస్థ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది గడవక ముందే వేరే సంస్థ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోకి మారిస్తే ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? ఎలాంటి పన్నుపోటు లేకుండా ఉండాలంటే ఎంత కాలం తర్వాత ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయాలి? - రామాచారి, విశాఖపట్టణం పన్ను అంశాల పరంగా చూస్తే, ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయడం అంటే...ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించి, కొత్తగా మరో మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యూనిట్లను కొనుగోలు చేయడంగా పరిగణిస్తారు. ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, దాని నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాదిలోపు మరో మ్యూచువల్ ఫండ్‌లోకి బదిలీ చేస్తే మీరు 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది దాటిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఉండదు. పన్ను పోటు లేకుండా ఉండాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది తర్వాత బదిలీ చేయాలి. ఇక లిక్విడ్ ఫండ్స్ విషయానికొస్తే, లిక్విడ్ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లలోపు వేరే ఫండ్‌లోకి మళ్లిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ బదిలీపై వచ్చిన లాభాలను మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ బదిలీ విషయంలో ఎగ్జిట్ లోడ్ విషయాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. జీవన్ సరళ్ పాలసీ సరెండర్ చేద్దామనుకుంటున్నాను. ఈ పాలసీ సరెండర్‌పై నేనేమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - రమణ, నెల్లూరు మీరు పాలసీ తీసుకొని ఎన్ని సంవత్సరాలయింది, మీరు తీసుకున్న బీమా కవర్, మీరు చెల్లించిన ప్రీమియమ్ తదితర అంశాలను బట్టి పన్నుల విధింపు ఉంటుంది. కొన్ని సందర్భాల్లోనే జీవన్ సరళ్ బీమా పాలసీ సరెండర్‌పై పన్ను మినహాయింపులు పొందవచ్చు. 2012 మార్చి 31కి ముందు తీసుకున్న పాలసీలైతే, మీరు తీసుకున్న బీమా మొత్తం ,మీరు చెల్లించే వార్షిక ప్రీమియమ్‌నకు ఐదు రెట్ల కంటే అధికంగా ఉన్నప్పుడు. మీరు 2012 ఏప్రిల్ తర్వాత పాలసీలు తీసుకుంటే, మీరు తీసుకున్న బీమా మొత్తం మీరు చెల్లించే వార్షిక ప్రీమియమ్‌నకు పదిరెట్లు కంటే అధికంగా ఉన్నప్పుడు. ఈ రెండు సందర్భాల్లో మాత్రం మీకు పన్ను మినహాయింపులు లభిస్తాయి, ఇలా కాని పక్షంలో ఎల్ఐసీ జీవన్ సరళ్ లాంటి ఎండోమెంట్ పాలసీలను సరెండర్ చేసినప్పుడు వచ్చిన సరెండర్ విలువను మీ ఆదాయానికి కలిపి, మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నా కొడుకు ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అతని నెల జీతం రూ.11,000. తన వైద్య బీమా ప్రీమియాన్ని నేనే చెల్లిస్తున్నాను. ఈ చెల్లించే ప్రీమియమ్‌పై పన్ను మినహాయింపు పొందవచ్చా? - క్రాంతి, గుంటూరు 18 సంవత్సరాలు దాటిన పిల్లలు, ఉద్యోగస్తులైతే, వారికి చెల్లించే ప్రీమియమ్లకు మీరు పన్ను మినహాయింపు పొందలేరు. మీకు, మీ జీవిత భాగస్వామికి, మీపై ఆధారపడిన పిల్లలకు చెల్లించే వైద్య బీమా ప్రీమియమ్లకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80డి ప్రకారం రూ.25 వేల వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. నేను 2012, జూలై నుంచి పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఖాతాలో ఇప్పటిదాకా జమ అయిన మొత్తం రూ. లక్షకు పైగా ఉంది. దీని కంటే పన్ను ఆదా చేసే స్కీమ్‌లు ఉండటంతో ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేయడం ఆపేద్దామనుకుంటున్నాను. ఈ ఖాతాను ఆపేయడం ఎలా? ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని నేను ఎప్పుడు తీసుకోవచ్చు? - జ్యోతి, కాకినాడ పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఖాతాను మధ్యలో ఆపేయడానికి లేదు. ఈ ఖాతాను ప్రారంభించి పదిహేను ఆర్థిక సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే ఈ ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ఇన్వెస్ట్ చేయని పక్షంలో ప్రతీ ఏడాది రూ.50 చొప్పున ఈ ఖాతా మెచ్యుర్ అయ్యేంత వరకూ జరిమానా విధిస్తారు. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించి ఆరేళ్లు దాటితే పాక్షికంగా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. - ధీరేంద్ర కుమార్, సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్ -
పాప చదువు కోసం.. ఈక్విటీ ఫండ్స్ మెరుగు
నాకు ఇటీవలే ఒక కూతురు పుట్టింది. ఆమె చదువు కోసం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. పన్ను ప్రయోజనాలు లభించేలా ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇవ్వగలరు. - ఆనంద్, విశాఖ పట్టణం చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం బీమా పాలసీలు తీసుకుంటారు. దీనివల్ల పన్నులు కలిసి వస్తాయనేది వారి ఆలోచన. కానీ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ తప్పుల్లో ఇదొకటి. మీ పాప విద్యావసరాల కోసం ఇన్వెస్ట్ చేయడానికి ప్రత్యేక ప్లాన్ అవసరం లేదు. పన్ను ఆదా చేసే స్కీమ్‌లతో సహా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే చాలు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. దీర్ఘకాలానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులను ఇస్తాయి. ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకొని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ పరిస్థితులను పట్టించుకోకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కనీసం ఏడాదికొకసారైనా సమీక్షించండి. మీ పాప ఉన్నత చదువులు నిమిత్తం మీకు మరో రెండు, మూడేళ్లలో డబ్బులు అవసరమవుతాయనుకున్నప్పుడు, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విత్‌డ్రా చేసుకుని సురక్షితమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బులు అవసరమైనప్పుడు మార్కెట్ పరిస్థితులు బాగాలేకపోతే ఆ ప్రభావం నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. నా వయస్సు 27 సంవత్సరాలు. నేనొక బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆన్లైన్ ద్వారా ఒక బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలపండి. - ఖాదర్ బీ, కడప స్టాక్ మార్కెట్‌కు కొత్త అయిన ఇన్వెస్టర్లకు బ్యాలెన్స్డ్ ఫండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఈ ఫండ్స్ తమ నిధుల్లో కొంత మొత్తాన్ని ఈక్విటీల్లో, మరికొంత మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒడిదుడుకుల ప్రభావాన్ని కొంత మేర తట్టుకోవచ్చు. ఆన్లైన్లో బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లో ఇన్వెస్ట్ ఆన్లైన్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే సూచనలను పాటించండి. ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండాలి. మిరా అసెట్ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్-డెరైక్ట్ ప్లాన్-వీక్లీ డివిడెండ్ స్కీమ్‌లో భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేశాను. ఆ తర్వాత ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మిరా ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్‌కు బదిలీ చేశాను. నాకు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్లో షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చినట్లుగా ఉంది. ఇది ఎలా సాధ్యం. వీక్లీ డివిడెండ్ పేఅవుట్ స్కీమ్‌లో వచ్చే డివిడెండ్‌పై పన్ను విధించిన తర్వాతే రీ ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ ఉండవు కదా ! ఈ విషయమై తగిన సలహా ఇవ్వగలరు. - మధు, విజయవాడ వాస్తవ లాభాలపైన మాత్రమే డివిడెండ్‌ను ప్రకటించాలని సెబీ నిబంధనలు వెల్లడిస్తున్నాయి. మిరా అసెట్ షార్ట్ బాండ్ ఫండ్-డెరైక్ట్ ప్లాన్ అమల్లోకి వచ్చి రెండేళ్లు మాత్రమే అయింది. ఈ ఫండ్ మూలధన నిధులు రూ.4 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఇది ఎలాంటి డివిడెండ్లను ప్రకటించలేదు. వాస్తవ లాభాలను ఆర్జించలేకపోయినందువల్ల కావచ్చు. మరోవైపు మిరా అసెట్ షార్ట్‌టెర్మ్ బాండ్ ఫండ్-రెగ్యులర్ ప్లాన్ క్రమం తప్పకుండా డివిడెండ్లను చెల్లిస్తోంది. ఈ కారణం వల్ల మీ లాభాలు క్యాపిటల్ గెయిన్స్‌గా ఆ సంస్థ చూపించి ఉండవచ్చు. డెట్ ఫండ్స్‌పై వచ్చిన షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ను మీ ఆదాయానికి జత చేసి మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. నేను ఐసీఐసీఐ ప్రులైఫ్స్టేజ్ పెన్షన్ యాడ్(డైనమిక్ పీ/ఈ ఫండ్)లో 2010నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. రాబడులు సంతృప్తికరంగా లేనందున ఈ స్కీమ్ నుంచి వైదొలగాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి ? - రాహుల్, హైదరాబాద్ మీరు తీసుకున్న పాలసీ డిఫర్డ్ యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్. జీరో ప్రీమియం అలకేషన్ చార్జీలు ఉండడం ఈ ప్లాన్ ప్రత్యేకత. అయితే నిర్వహణ చార్జీలు ఏడాదికి 13.1 శాతంగా ఉన్నాయి. ఇది కాకుండా 1.35 శాతం(ఏడాదికి) ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు అదనం. వ్యయాలు అధికంగా ఉన్నందున రాబడులు అల్పంగా వస్తాయి. ఇప్పటికే పెద్ద మొత్తంలో వ్యయాలు చెల్లించారు. అయినప్పటికీ, ఈ పాలసీని సరెండర్ చేయడమే ఉత్తమం. ఇప్పుడు మీరు సరెండర్ చేస్తే, సరెండర్ వాల్యూగా ఫండ్ విలువ మీకు లభిస్తుంది. ఈ మొత్తాన్ని మీ ఆదాయానికి జత చేసి మీ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటివరకూ మీరు చెల్లించిన ప్రీమియమ్‌లపై మీరు పొందిన పన్ను మినహాయింపులను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్‌లో కొనసాగితే నష్టాలు మరింతగా కొనసాగుతాయి. కాబట్టి దీనిని సరెండర్ చేసి భవిష్యత్తులో తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
న్యూ ఫండ్ ఆఫర్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
నాలుగేళ్ల నుంచి కోటక్ గోల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. దీంతో పాటు మరికొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా మొత్తం నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ప్లాన్ (సిప్) ఇన్వెస్ట్మెంట్స్ మొత్తంలో ఈ గోల్డ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ 9 శాతంగా ఉంది. ప్రతీ ఏడాది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 10 శాతం చొప్పున పెంచుకుంటూ పోతున్నాను. గత కొన్నేళ్లుగా బంగారం ధరలు తగ్గుతుండటంతో ఈ గోల్డ్ఫండ్ రాబడులు అంతకంతకూ తగ్గుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ డైవర్సిటీ వ్యూహంలో భాగంగా ఈ గోల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా? లేకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసి, ఈ గోల్డ్ఫండ్ నుంచి వైదొలగమంటారా? - శౌరి, నెల్లూరు పుత్తడిలో పెట్టుబడి పెట్టమని సాధారణంగా ఎవరికీ సలహా ఇవ్వము. ఎందుకంటే బంగారమనేది విభిన్నమైన ఇన్వెస్ట్మెంట్. బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే మీకు వడ్డీ వస్తుంది. అదే షేర్లలో అయితే యాజమాన్యంలో కొంత వాటా వస్తుంది. బంగారం విషయంలో మాత్రం అలా కాదు. బంగారం విలువ డిమాండ్, సరఫరాలపై ఆధారపడి ఉంటుంది. 2008లో అంతర్జాతీయంగా ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నప్పుడు బంగారం మంచి రాబడులను ఇచ్చింది. అది అసాధారణమైన పరిస్థితి. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే డైవర్సిఫికేషన్ కాదని గమనించాలి. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో బంగారంపై ఇన్వెస్ట్మెంట్స్ 5 శాతం మించకూడదని సలహా ఇస్తాము. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి. డెట్, ఈక్విటీల మిశ్రమంగా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిగణిస్తారు కదా ! అలాంటప్పుడు పన్నుల విషయంలో డెట్ విభాగానికి, ఈక్విటీ విభాగానికి వేర్వేరుగా పన్నులు చెల్లించాలా? బ్యాలెన్స్డ్ ఫండ్స్‌కు సంబంధించి పన్నులు ఎలా లెక్కించాలి? - లలిత, వరంగల్ మీరు చెప్పినట్లుగానే డెట్, ఈక్విటీల మిశ్రమంగా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిగణిస్తారు. ఈక్విటీ విభాగం పెట్టుబడులను బట్టి వీటిని ఈక్విటీ ఓరియెంటెడ్, లేదా డెట్ ఓరియెంటెడ్ ఫండ్స్‌గా విభజించవచ్చు. ఒక ఫండ్ తన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం 65 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే దానిని ఈక్విటీ ఓరియెంటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్‌గా పరిగణిస్తారు. వీటిల్లో ఒక ఏడాదికి మించి ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే మూలధన లాభాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అలా కాకుండా ఏడాది కంటే తక్కువ కాలానికే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే, 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఓరియెంటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్‌ను పన్నుల పరంగా డెట్ఫండ్గానే పరిగణిస్తారు. వీటిపై వచ్చే స్వల్పకాల మూలధన లాభాలను మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ట్యాక్సశ్లాబ్ననుసరించి పన్ను విధిస్తారు. ఇక వీటిపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 20 శాతంగా ఉంటుంది. న్యూఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్ఓ)లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఎన్ఎఫ్ఓల గురించి ఎందుకు బాగా ప్రచారం చేస్తాయి? - ఉత్తమ్ కుమార్, విజయవాడ న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్ఎఫ్ఓ)ల్లో ఇన్వెస్ట్ చేయొద్దనే సాధారణంగా మేము ఇన్వెస్టర్లకు సలహా ఇస్తుంటాం. గతంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిదనేది మా సూచన. మార్కెట్లో అప్పటివరకూ లేని వినూత్నమైన ఆఫర్‌తో వచ్చే ఎన్ఎఫ్ఓలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే అలాంటి ఎన్ఎఫ్ఓలు ఎప్పుడో గానీ రావు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు వివిధ కారణాల వల్ల ఎన్ఎఫ్ఓలను తీసుకువస్తాయి, వాటిని బాగా ప్రచారం చేస్తాయి. తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవడం, మరింతమంది ఇన్వెస్టర్లను ఆకర్షించి, వారి నుంచి పెట్టుబడులను సమీకరించి, తమ నిర్వహణ ఆస్తులను పెంచుకోవడం.. తదితర కారణాల వల్ల ఎన్ఎఫ్ఓలను తీసుకువస్తాయి. అందుకే ఎన్ఎఫ్ఓల్లో ఇన్వెస్ట్ చేసేముందు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అప్పటివరకూ ఏ ఫండ్ ఆఫర్ చేయని వినూత్నమైన థీమ్ అయితేనే ఇన్వెస్ట్ చేయండి. అలా కాకుంటే దీర్ఘకాలం పాటు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయండి. నేను జీవన్ సరళ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వార్షిక ప్రీమియం రూ.29,800. నేను ఇప్పటికే మొదటి ప్రీమియాన్ని చెల్లించాను. అయితే ఇది సరైన పాలసీ కాదని, దీని కంటే మంచి పాలసీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ పాలసీని ఇప్పుడు సరెండర్ చేయడమే ఉత్తమమా లేకుంటేమరో ప్రీమియం చెల్లించిన తర్వాత సరెండర్ చేయమంటారా? - వీరేశ్, హైదరాబాద్ ఎల్ఐసీ జీవన్ సరళ్ అనేది ఎండోమెంట్ పాలసీ. ఈ కేటగిరిలోని ఇతర ప్లాన్ల మాదిరే వ్యయాల విషయమై ఈ పాలసీలో పారదర్శకత లేదు. పాలసీ ముగిసిన తర్వాత పాలసీ మొత్తాన్ని, లాయల్టీ బోనస్‌లను ఎల్ఐసీ మీకు చెల్లిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది సరైన ఇన్వెస్ట్మెంట్ కాదు. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీరు దీనికంటే మంచి రాబడులు పొందవచ్చు. అందుకని తక్షణం ఈ పాలసీని సరెండర్ చేయండి. మీరు చెల్లించిన ప్రీమియమ్‌లో 30 శాతం సరెండర్ వేల్యూగా(తొలి ఏడాది ప్రీమియం మినహా) మీకు వస్తుంది. ఇప్పుడు మీరు సరెండర్ చేస్తే మీకు ఏమీ రాదు. అయితే మీ నష్టాలను మీరు తగ్గించుకోగలుగుతారు. మరో ప్రీమియం చెల్లించిన తర్వాత ఈ పాలసీని సరెండర్ చేస్తే మీ నష్టాలు మరింతగా పెరుగుతాయి.