
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్)లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.26,866 కోట్ల పెట్టుబడులు వచ్చాయని భారత మ్యూచువల్ ఫండ్‌ల సంఘం (యాంఫీ) గణాంకాలు వెల్లడించాయి. ఒక నెలలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం గడిచిన 23 ఏళ్లలో గరిష్టం.
ఈ జనవరిలో వెల్లువెత్తిన రూ.21,721 కోట్లతో పోలిస్తే కూడా 23% అధికం. కొత్త ఫండ్ల ఆవిష్కరణ, థీమాటిక్/సెక్టోరియల్ ఫండ్లపై ఆసక్తి ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) పథకాల్లోకి కూడా ఫిబ్రవరి జీవితకాల గరిష్టం రూ.19,186 కోట్లకు చేరాయి. జనవరి ఇవి రూ.18,838 కోట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment