రూ.30 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేదా నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? మెరుగైన అస్సెట్ అలోకేషన్ విధానం ఏది అవుతుంది? – హితేంద్ర వాణి
మీ పెట్టుబడి రూ.30 లక్షలను 12 నుంచి 24 సమాన నెలసరి వాయిదాలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి పనితీరు కలిగిన ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి. లేదా నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే అత్యుత్తమ నాణ్యత కలిగిన కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. పటిష్టమైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియోని నిర్మించుకోవడం పెద్ద సవాలుతో కూడుకున్నదే.
రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కనుక ఒక కంపెనీకి గరిష్టంగా రూ.6 లక్షలు లేదా అంతకంటే తక్కువ కేటాయించుకోవచ్చు. బలమైన మూలాలు, నమ్మకమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులను వివిధ కంపెనీల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. ఇది రిస్క్‌ను తగ్గిస్తుంది. పెట్టుబడుల నాణ్యతను పెంచుతుంది. ఎంపిక, పెట్టుబడుల కేటాయింపులు, వైవిధ్యం వీపోర్ట్‌ఫోలియో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
తగినంత సమయం, విశ్వాసం లేకపోతే అప్పుడు మంచి ఫ్లెక్సీక్యాప్ లేదా మల్టీక్యాప్ ఫండ్ మేనేజర్‌పై ఆ బాధ్యతను పెట్టాలి. ఏ స్టాక్స్ ఎంపిక చేసుకోవాలన్న శ్రమ మీకు తప్పుతుంది. స్టాక్స్ పోర్ట్‌ఫోలియో నిర్వహణలో అనుభవం లేకపోతే నేరుగా ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. మీకు తగిన అనుభవం, సమయం ఉంటే, నిబంధనల ప్రకారం వ్యవహరించేట్టు అయితే ఫండ్స్‌తో పోలిస్తే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు.
నేను రిటైర్మైంట్ తీసుకున్నాను. క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణ (ఎస్‌డబ్ల్యూపీ) కోసం లిక్విడ్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో దేనిని ఎంపిక చేసుకోవాలి? – విఘ్నేశ్
లిక్విడ్ ఫండ్స్ స్థిరత్వంతో, తక్కువ రిస్క్‌తో ఉంటాయి. కనుక షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌తో పోల్చితే సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) కోసం ఇవి అనుకూలం. అతి తక్కువ అస్థిరతలతో, స్థిరమైన రాబడులు ఇవ్వడం వల్ల లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులతో నిశ్చింతగా ఉండొచ్చు.
1. లిక్విడ్‌ఫండ్స్ పెట్టుబడుల విలువ దాదాపుగా తగ్గిపోవడం ఉండదు. వారం, నెల వ్యవధిలోనూ ఇలా జరగదు. ఉదాహరణకు కోటక్ లిక్విడ్ ఫండ్ గడిచిన దశాబ్ద కాలంలో వారం వారీ 99.78 శాతం సందర్భాల్లో సానుకూల రాబడులు ఇచ్చింది. నెలవారీగా చూస్తే నూరు శాతం సందర్భాల్లోనూ సానుకూల రాబడులు ఉన్నాయి. అదే కోటక్ షార్ట్ డ్యురేషన్ ఫండ్ పనితీరు గమనించినట్టయితే.. విలువలో కొంత క్షీణించడాన్ని గుర్తించొచ్చు. గడిచిన దశాబ్ద కాలంలో వారం వారీ రాబడులను గమనిస్తే 15.8 శాతం సందర్భాల్లో ప్రతికూలంగా, నెలవారీ రాబడుల్లో 7 శాతం సందర్భాల్లో ప్రతికూల పనితీరును గమనించొచ్చు.
2. లిక్విడ్ ఫండ్స్ అయితే అదే రోజు లేదా మరుసటి రోజు పెట్టుబడులు చేతికి అందుతాయి. నెలవారీ ఊహించతగిన రాబడులకు అనుకూలంగా ఉంటాయి. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోనూ లిక్విడిటీ ఎక్కువే. కాకపోతే వాటి ఎన్‌ఏవీలో స్వల్ప ఊగిసలాటలు ఉంటాయి. ఇది నెలవారీ ఉపసంహరించుకునే మొత్తంపై ప్రభావం చూపిస్తుంది.
3. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో రాబడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రూ.10 లక్షల పెట్టుబడిపై ఒక ఏడాదిలో రూ.వేలల్లో ఉంటుంది. కానీ, ఈ మేరకు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది.
4. లిక్విడ్ ఫండ్స్‌పై మార్కెట్ అస్థిరతలు పెద్దగా ఉండవు. కనుక ప్రశాంతంగా ఉండొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment