Stocks
-
తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్.. తగ్గుతున్న బీర్ల నిల్వలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీర్ల(Beers) నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం గోడౌన్లో లక్ష కేసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 8 వరకు సుమారు 84 లక్షల కేసులు ఉండగా క్రమేపి బీర్ల స్టాక్ తగ్గుతోంది. మరో రెండు, మూడు రోజులు మేనేజ్ చేయొచ్చని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. పాత బకాయిలు ఇవ్వకపోవడంతో బీర్ల స్టాక్‌ను యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) సంస్థ నిలిపివేసిన సంగతి తెలిసిందే.తెలంగాణలో కొత్త బీర్ బ్రాండ్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రిజిస్టర్ కానీ కంపెనీలను తీసుకొస్తే ఇబ్బందులు తప్పవని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. గోడౌన్లో ఉన్న స్టాక్‌ను విడుదల వారీగా ప్రభుత్వం విడుదల చేస్తోంది.తాము తయారు చేసే బీర్లను ఇక నుంచి తెలంగాణలో సరఫరా చేయబోమని యూబీ సంస్థ ప్రకటించింది. బేసిక్ ధరలు పెంచలేదని, బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు కంపెనీ నిబంధనల ప్రకారం...ఎన్ఎస్ఈ, బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లకు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగైదు బ్రాండ్ల బీర్లకు మంచి మార్కెట్ ఉంది.అందులో యూబీ తయారు చేసే కింగ్‌ఫిషర్ బీర్లదే సింహభాగం. మొత్తం తెలంగాణ మార్కెట్లో 72 శాతం వరకు ఈ బ్రాండ్‌దే ఉంటుందని అంచనా. ఈ బీర్లు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు సరఫరా చేసినందుకుగాను కేస్‌కు రూ.289 చొప్పున తయారీదారులకు చెల్లిస్తారు. ఈ బేసిక్ ధర పెంచాలన్న డిమాండ్ ఎక్సైజ్ శాఖలో చాలా కాలంగా వినిపిస్తున్నా, అమల్లోకి రాకపోవడంతో తాజా సమస్య ఏర్పడింది. 2019–20 నుంచి కంపెనీకి చెల్లించే బేసిక్ ధరలను తెలంగాణ ప్రభుత్వం సవరించలేదని, దీని కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో వెల్లడించారు. టీజీబీసీఎల్ చెల్లించాల్సిన పెద్ద మొత్తం పెండింగ్‌లో ఉందని, ఈ కారణంగానే తాము బీర్లు సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: తక్షణమే ప్రక్షాళన..! -
500 షేర్లకు T+0 సెటిల్మెంట్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా టీప్లస్‌జీరో (T+0) సెటిల్మెంట్ను మరింత విస్తరించింది. లావాదేవీ చేపట్టిన రోజే సెటిల్మెంట్కు వీలు కల్పించే విధానంలోకి 500 కంపెనీల షేర్లను చేర్చింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా 500 కంపెనీల స్టాక్స్‌కు ఆప్షనల్‌గా టీప్లస్‌జీరో సెటిల్మెంట్ను వర్తింపచేయనుంది.నిబంధనలకు లోబడి టీప్లస్‌జీరో, టీప్లస్వన్ సెటిల్మెంట్ సైకిళ్లకు విభిన్న బ్రోకరేజీ చార్జీలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సెబీ తొలుత 2024 మార్చిలో 25 కంపెనీల స్టాక్స్ ద్వారా టీప్లస్‌జీరో సెటిల్మెంట్కు తెరతీసింది. నాన్కస్టోడియన్ క్లయింట్లకు మాత్రమే ఇది వర్తింపచేసింది. తదుపరి అభిప్రాయ సేకరణ చేపట్టి సెటిల్మెంట్ను విస్తరించింది. 2024 డిసెంబర్31కల్లా టాప్–500 కంపెనీల షేర్లు టీప్లస్‌జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేర్చుతూ సర్క్యులర్‌ను జారీ చేసింది.2025 జనవరి నుంచి అట్టడుగున ఉన్న 100 కంపెనీలు సెటిల్‌మెంట్‌లోకి రానున్నాయి. ఆపై ప్రతీ నెలా ఇదే రీతిలో 100 కంపెనీలు చొప్పున జత కానున్నాయి. వెరసి ప్రస్తుత 25 కంపెనీలతో కలిపి 525 షేర్లు టీప్లస్‌జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేరనున్నాయి. వీటికి ఉదయం 8.45–9 సమయంలో ప్రత్యేక బ్లాక్ డీల్ విండోను ఏర్పాటు చేయనుంది. ఐసీఈఎక్స్కు చెల్లు సెబీ తాజాగా ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఐసీఈఎక్స్) మూసివేతకు అనుమతించింది. రెండేళ్ల క్రితమే స్టాక్ ఎక్స్ఛేంజీ గుర్తింపును రద్దు చేయగా.. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఐసీఈఎక్స్ కార్యకలాపాల నిలిపివేతకు ఓకే చెప్పింది. వెరసి ఎక్స్ఛేంజీ విభాగం నుంచి ఐసీఈఎక్స్ వైదొలగనుంది. అయితే ఆదాయపన్ను నిబంధనలను అమలు చేయవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. పేరు మార్పుసహా గతకాలపు లావాదేవీలను డేటాబేస్ నుంచి తొలగించవలసిందిగా ఐసీఈఎక్స్ను సెబీ ఆదేశించింది. -
రూ.30 లక్షలు ఇన్వెస్ట్.. ఫండ్స్లోనా లేదా స్టాక్స్లోనా..?
రూ.30 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేదా నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? మెరుగైన అస్సెట్ అలోకేషన్ విధానం ఏది అవుతుంది? – హితేంద్ర వాణిమీ పెట్టుబడి రూ.30 లక్షలను 12 నుంచి 24 సమాన నెలసరి వాయిదాలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి పనితీరు కలిగిన ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి. లేదా నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే అత్యుత్తమ నాణ్యత కలిగిన కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. పటిష్టమైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియోని నిర్మించుకోవడం పెద్ద సవాలుతో కూడుకున్నదే.రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కనుక ఒక కంపెనీకి గరిష్టంగా రూ.6 లక్షలు లేదా అంతకంటే తక్కువ కేటాయించుకోవచ్చు. బలమైన మూలాలు, నమ్మకమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులను వివిధ కంపెనీల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. ఇది రిస్క్‌ను తగ్గిస్తుంది. పెట్టుబడుల నాణ్యతను పెంచుతుంది. ఎంపిక, పెట్టుబడుల కేటాయింపులు, వైవిధ్యం వీపోర్ట్ఫోలియో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.తగినంత సమయం, విశ్వాసం లేకపోతే అప్పుడు మంచి ఫ్లెక్సీక్యాప్ లేదా మల్టీక్యాప్ ఫండ్ మేనేజర్‌పై ఆ బాధ్యతను పెట్టాలి. ఏ స్టాక్స్ ఎంపిక చేసుకోవాలన్న శ్రమ మీకు తప్పుతుంది. స్టాక్స్ పోర్ట్‌ఫోలియో నిర్వహణలో అనుభవం లేకపోతే నేరుగా ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. మీకు తగిన అనుభవం, సమయం ఉంటే, నిబంధనల ప్రకారం వ్యవహరించేట్టు అయితే ఫండ్స్‌తో పోలిస్తే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు.నేను రిటైర్మైంట్ తీసుకున్నాను. క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణ (ఎస్‌డబ్ల్యూపీ) కోసం లిక్విడ్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో దేనిని ఎంపిక చేసుకోవాలి? – విఘ్నేశ్లిక్విడ్ ఫండ్స్ స్థిరత్వంతో, తక్కువ రిస్క్‌తో ఉంటాయి. కనుక షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌తో పోల్చితే సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) కోసం ఇవి అనుకూలం. అతి తక్కువ అస్థిరతలతో, స్థిరమైన రాబడులు ఇవ్వడం వల్ల లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులతో నిశ్చింతగా ఉండొచ్చు.1. లిక్విడ్‌ఫండ్స్ పెట్టుబడుల విలువ దాదాపుగా తగ్గిపోవడం ఉండదు. వారం, నెల వ్యవధిలోనూ ఇలా జరగదు. ఉదాహరణకు కోటక్ లిక్విడ్ ఫండ్ గడిచిన దశాబ్ద కాలంలో వారం వారీ 99.78 శాతం సందర్భాల్లో సానుకూల రాబడులు ఇచ్చింది. నెలవారీగా చూస్తే నూరు శాతం సందర్భాల్లోనూ సానుకూల రాబడులు ఉన్నాయి. అదే కోటక్ షార్ట్ డ్యురేషన్ ఫండ్ పనితీరు గమనించినట్టయితే.. విలువలో కొంత క్షీణించడాన్ని గుర్తించొచ్చు. గడిచిన దశాబ్ద కాలంలో వారం వారీ రాబడులను గమనిస్తే 15.8 శాతం సందర్భాల్లో ప్రతికూలంగా, నెలవారీ రాబడుల్లో 7 శాతం సందర్భాల్లో ప్రతికూల పనితీరును గమనించొచ్చు.2. లిక్విడ్ ఫండ్స్ అయితే అదే రోజు లేదా మరుసటి రోజు పెట్టుబడులు చేతికి అందుతాయి. నెలవారీ ఊహించతగిన రాబడులకు అనుకూలంగా ఉంటాయి. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోనూ లిక్విడిటీ ఎక్కువే. కాకపోతే వాటి ఎన్ఏవీలో స్వల్ప ఊగిసలాటలు ఉంటాయి. ఇది నెలవారీ ఉపసంహరించుకునే మొత్తంపై ప్రభావం చూపిస్తుంది.3. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో రాబడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రూ.10 లక్షల పెట్టుబడిపై ఒక ఏడాదిలో రూ.వేలల్లో ఉంటుంది. కానీ, ఈ మేరకు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది.4. లిక్విడ్ ఫండ్స్‌పై మార్కెట్ అస్థిరతలు పెద్దగా ఉండవు. కనుక ప్రశాంతంగా ఉండొచ్చు. -
బంగారాన్ని మించి.. ‘స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాం’
న్యూఢిల్లీ: ఒకవైపు మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నప్పటికీ.. మరోవైపు మెజారిటీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఏంజెల్ వన్‌కు చెందిన ‘ఫిన్‌వన్’ అధ్యయనంలో వెల్లడైంది.58 శాతం మంది స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే, 39 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్‌ను అనుసరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 13 పట్టణాలకు చెందిన 1,600 మంది యువతీ, యువకుల పెట్టుబడుల ప్రాధాన్యతలు, ఆర్థిక అక్షరాస్యత, టెక్నాలజీ, ఫైనాన్షియల్ టూల్స్ వినియోగాన్ని విశ్లేషించిన అనంతరం ఫిన్‌వన్ నివేదికను విడుదల చేసింది. » పొదుపునకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. 93 శాతం మంది తమ ఆదాయంలో ఎంతో కొంత ఆదా చేస్తుండగా, కొంత మంది 20–30 శాతం వరకు పొదుపు చేస్తున్నారు. » ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బంగారం కంటే స్టాక్స్‌లో పెట్టుబడులకే 45 శాతం మంది ప్రాధాన్యం చూపుతున్నారు. » పెట్టుబడికి అధిక భద్రత ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు 22 శాతం మంది, రికరింగ్ డిపాజిట్ల వైపు 26 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. » అధిక రాబడులతోపాటు స్థిరమైన రాబడులకూ యువత ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇది తెలియజేస్తోందని ఈ నివేదిక పేర్కొంది. » యువతరం టెక్ సాయాన్ని తీసుకుంటోంది. 68 శాతం మంది ఆటోమేటెడ్ సేవింగ్ టూల్స్ వాడుతున్నారు. » 85 శాతం మంది పెరిగిపోయిన జీవన వ్యయం.. ముఖ్యంగా ఆహారం, యుటిలిటీలు, రవాణా వ్యయాలను ప్రస్తావించారు. -
పెట్టుబడులకు ‘రుణ’ పడదాం!
ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. రుణం తీసుకోవడమే ఎక్కువ మంది అనుసరించే మార్గం. అవసరాన్ని వెంటనే గట్టెక్కడమే ముఖ్యంగా చూస్తుంటారు. వడ్డీ రేటు గణనీయంగా ఉండే క్రెడిట్‌కార్డు రుణాలే కాదు, వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తుంటారు. దీంతో అప్పటికి అవసరం తీరుతుందేమో కానీ, ఆ తర్వాత ఆర్థికంగా భారాన్ని మోయాల్సి వస్తుంది. కొందరు స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉంటే వాటిని ఉపసంహరించుకుంటారు. కానీ, వీటికంటే మెరుగైన ఆప్షన్ ఉంది. స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించాల్సిన అవసరం లేకుండా, వాటిపై చౌక వడ్డీకే రుణం పొందొచ్చు. దీనివల్ల పెట్టుబడుల వృద్ధి ప్రయోజనాన్ని కోల్పోవాల్సిన అవసరం ఏర్పడదు. పైగా రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ ఫండ్స్/స్టాక్స్.. మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం పొందడాన్ని లోన్ ఎగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ (ఎల్ఏఎంఎఫ్)గా.. షేర్లపై రుణం పొందడాన్ని లోన్ ఎగైనెస్ట్ సెక్యూరిటీస్ (ఎల్ఏఎస్)గా చెబుతారు. ఇవి సెక్యూర్డ్ రుణాలు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు/õÙర్లు లేదా బాండ్లు తదితర సెక్యూరిటీలను తనఖా పెట్టుకుని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలు మంజూరు చేస్తాయి. కనుక రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాల్సిన అవసరం లేదు. స్వల్పకాల అవసరాల కోసం ఈ రుణాలు తీసుకోవచ్చు. వీటిపై 9–11 శాతం మధ్య వడ్డీ రేటు అమలవుతుంటుంది. మిరే అస్సెట్ సంస్థ 10.5 శాతం వార్షిక వడ్డీ రేటును అమలు చేస్తోంది. డిజిటల్‌గా, నిమిషాల వ్యవధిలోనే రుణం పొందే వెసులుబాటు కూడా ఉంటుంది. అర్హతలు..⇒ సెబీ అనుమతించిన కంపెనీల షేర్లకే రుణాలు పరిమితం. దాదాపు అన్ని బ్లూచిప్ షేర్లకు, టాప్–250 షేర్లకు రుణాలు లభిస్తాయి. డీలిస్ట్ అయిన వాటికి అవకాశం లేదు. ఏఏ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణం లభిస్తుందో.. ప్రతి బ్యాంక్, ఎన్బీఎఫ్సీ ఒక జాబితాను నిర్వహిస్తుంటాయి. ⇒ ఒక్కసారి వీటిపై రుణం తీసుకున్నారంటే, అవి తనఖాలోకి వెళ్లినట్టు అర్థం చేసుకోవాలి. కనుక రుణం తీర్చే వరకు వాటిని విక్రయించలేరు. ⇒ మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ విలువలో నిర్ణీత శాతం వరకే రుణం లభిస్తుంది. ఇక్కడ కూడా లోన్–టు–వేల్యూ (ఎల్టీవీ) వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఆర్బీఐ నిర్దేశించిన ఎల్టీవీ 75 శాతంగా ఉంది. చాలా సంస్థలు ఈక్విటీ ఫండ్స్‌పై 50– 60% మేరకే రుణం ఇస్తున్నాయి. మిరే అస్సెట్ సంస్థ 45 శాతానికే రుణాన్ని పరిమితం చేస్తోంది. రుణం ఇచ్చే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ విడిగా రుణగ్రహీత తిరిగి చెల్లింపుల సామర్థ్యాలను అంచనా వేసుకున్న తర్వాత ఇంతకంటే తక్కువే మంజూరు చేయవచ్చు. ⇒పెట్టుబడుల విలువలో రుణం 50 శాతం మించకుండా ఉంటేనే నయం. ఎందుకంటే తనఖాలో ఉంచిన షేర్లు, సెక్యూరిటీలు, ఫండ్స్ యూనిట్ల విలువను రుణం ఇచి్చన సంస్థలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటాయి. ముఖ్యంగా మార్కెట్లు కరెక్షన్కు లోనైతే ఈ పనిని వెంటనే చేస్తాయి. అప్పుడు లోన్–టు–వేల్యూని మించి రుణం విలువ పెరిగిపోతుంది. దీంతో అదనపు సెక్యూరిటీలు/ఫండ్స్ యూనిట్లను తనఖా ఉంచాలని అవి కోరతాయి. లేదా నగదు సర్దుబాటు చేయాలని కోరతాయి. లేదంటే అదనపు వడ్డీని విధిస్తాయి. లేదా తనఖాలో ఉంచిన వాటిని వెంటనే విక్రయించి సొమ్ము చేసుకుంటాయి. రుణం తీసుకున్న వ్యక్తి స్పందన ఆధారంగా ఈ చర్యలు ఉంటాయి. ⇒ ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఈ రుణం మంజూరు అవుతుంది. ఉదాహరణకు తనఖా పెట్టిన సెక్యూరిటీలు, ఫండ్స్ యూనిట్లపై రూ.5 లక్షల రుణానికి ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం లభించిందని అనుకుందాం. అప్పుడు రూ.2 లక్షలే వినియోగించుకుంటే ఆ మొత్తంపైనే వడ్డీ పడుతుంది. ఎన్ని రోజులు వినియోగించుకుంటే, అంతవరకే వడ్డీ పడుతుంది. కాకపోతే తీసుకున్న రుణంపై వడ్డీని ప్రతినెలా చెల్లించాల్సిందే. ⇒ రుణంపై కనిష్ట, గరిష్ట పరిమితులను బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు అమలు చేస్తున్నాయి. ⇒ వ్యక్తిగత రుణాలను ముందస్తుగా తీర్చివేస్తే ప్రీక్లోజర్ చార్జీలను బ్యాంక్‌లు వసూలు చేస్తుంటాయి. కానీ, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ రుణాలపై ప్రీ క్లోజర్ చార్జీల్లేవు. ⇒ వ్యక్తిగత రుణాల మాదిరే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌పై రుణాలను ఎందుకు వినియోగించుకోవాలనే విషయంలో షరతులు ఉండవు. చట్టవిరుద్ధమైన, స్పెక్యులేటివ్ అవసరాలకే వినియోగించుకోకూడదు. ⇒ తనఖాలోని షేర్లు, స్టాక్స్‌కు సంబంధించి డివిడెండ్లు, బోనస్, ఇతరత్రా ప్రయోజనాలు ఇన్వెస్టర్‌కే లభిస్తాయి. ⇒ గడువు ముగిసిన తర్వాత షేర్లు, ఫండ్స్ యూనిట్లపై రుణాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ⇒ రుణంపై వడ్డీ, అసలు చెల్లింపుల్లో విఫలమైతే తనఖాలో ఉంచిన సెక్యూరిటీలు, స్టాక్స్‌ను విక్రయించే అధికారం రుణం ఇచి్చన సంస్థలకు ఉంటుంది. విక్రయించగా వచి్చన మొత్తాన్ని రుణంతో సర్దుబాటు చేసుకుంటాయి. మిగులు ఉంటే రుణగ్రహీతకు చెల్లిస్తాయి. ఇంకా బకాయి మిగిలి ఉంటే రుణగ్రహీత నుంచి రాబట్టేందుకు తదుపరి చర్యలు తీసుకుంటాయి.డెట్ ఫండ్స్‌పై వద్దు.. డెట్ ఫండ్స్‌లో రాబడులు 6–8 శాతం మధ్యే ఉంటాయి. వీటిపై రుణం తీసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ 10–12 శాతం మధ్య ఉంటుంది. దీనికి బదులు ఆ పెట్టుబడులను విక్రయించుకోవడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. కేవలం ఈక్విటీ ఫండ్స్, స్టాక్స్‌పై రుణానికే పరిమితం కావాలి. ఎందుకంటే, ఈక్విటీ ఫండ్స్, స్టాక్స్‌లో దీర్ఘకాలంలో రాబడులు 15 శాతం స్థాయిలో ఉంటాయి. కనుక వడ్డీ చెల్లింపులు పోను ఎంతో కొంత మిగులు ఉంటుంది. చార్జీలు.. సకాలంలో చెల్లింపులు చేయనప్పుడు పీనల్ చార్జీలు విధిస్తాయి. అలాగే, సెక్యూరిటీ ఇన్వొకేషన్ చార్జీ, కలెక్షన్ చార్జీ, లీగల్ చార్జీ, స్టాంప్ డ్యూటీ, చెక్ బౌన్స్ చార్జీలు కూడా ఉంటాయి. రుణ కాల పరిమితి సాధారణంగా ఒక ఏడాది ఉంటుంది. తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. దీనిపైనా చార్జీలు విధిస్తాయి. రుణం తీసుకోవడానికి ముందే ఈ చార్జీల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఇతర ఆప్షన్లు బంగారం, ప్రాపర్టీ (ఇల్లు లేదా స్థలం), జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లపైనా సెక్యూర్డ్ రుణాలు పొందొచ్చు. కాకపోతే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై డిజిటల్‌గా, వేగంగా రుణం లభిస్తుంది. కనుక ఇది అత్యవసర నిధిగానూ అక్కరకు వస్తుంది. తక్కువ రేటుకే రుణం తీసుకోవాలని భావిస్తే, భిన్న సంస్థల మధ్య వడ్డీ రేటును పరిశీలించాలి. అలాగే, బంగారం, జీవిత బీమా ప్లాన్లు ఉంటే వాటి రేట్లను విచారించి, చౌక మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. వ్యక్తిగత రుణం చివరి ఎంపికగానే ఉండాలి.విక్రయించడం మార్గం కాదు.. రిటైల్ ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుండటం చూస్తున్నాం. ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారిలో 59 శాతం మంది 24 నెలలకు మించి కొనసాగిస్తున్నారు. మిగిలిన వారు ఆ లోపే విక్రయిస్తున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా చేయడం దీర్ఘకాల లక్ష్యాలకు విరుద్ధం.పెట్టుబడులు ఉపసంహరించుకోకుండా, ఓవర్‌డ్రాఫ్ట్ రుణ సదుపాయం ద్వారా స్వల్పకాల అవసరాలను అధిగమించడమే మంచి ఆప్షన్ అవుతుంది. మిరే అస్సెట్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ డేటా ప్రకారం.. ఫండ్స్, షేర్లపై రుణాలను 30 శాతం మంది వ్యాపార అవసరాల కోసం, 19 శాతం మంది ఇంటి నవీకరణ కోసం, 18 % మంది పిల్లల స్కూల్/కాలేజీ ఫీజుల కోసం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఎస్బీఐ యోనో నుంచే.. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ సైతం మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణం ఇస్తోంది. అది కూడా యోనో యాప్ నుంచే దరఖాస్తు చేసుకుని, డిజిటల్‌గా రుణాన్ని పొందొచ్చు. క్యామ్స్ వద్ద నమోదైన అన్ని అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు) మ్యూచువల్ ఫండ్స్ పథకాలపై, ఆకర్షణీయమైన రేట్లకే రుణాన్ని ఇస్తున్నట్టు ఎస్బీఐ చెబుతోంది. గతంలో కేవలం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ పథకాలపై, అది కూడా బ్యాంక్ శాఖకు వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు యోనో నుంచి పది నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రుణం విలువపై 0.50 శాతం ప్రాసెసింగ్చార్జీ, జీఎస్టీ చెల్లించుకోవాలి. -
కాసుల వర్షం కురిపించిన ఈ ఐదు షేర్లు..
-
ఈ రైల్వే షేర్లు కొంటే దశ తిరిగినట్లేనా..?
-
భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఒకప్పటి నుంచి బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్పా.. భారీగా తగ్గుముఖం పట్టిన రోజులు చాలా తక్కువ. అయినా కొనే వారు కొంటూనే ఉన్నారు, ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. ఈ కథనంలో ప్రపంచములో బంగారం ఎవరి దగ్గర ఎక్కువగా ఉంది? ఉత్పత్తిలో భారత్ స్థానం ఏంటనే వివరాలు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగారం అనేది ఈ రోజు వాడుకలో వచ్చింది కాదు, శతాబ్దాల ముందు నుంచి ప్రజలు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలా వరకు బంగారం ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. భారతీయ కుటుంబాల దగ్గర ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్నట్లు సమాచారం. నిజానికి భారతీయులు పెళ్లిళ్లకు, పేరంటాలకు మాత్రమే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా బంగారాన్ని భారీగా ఉపయోగిస్తారు. భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం దాదాపు 25000 టన్నుల కంటే ఎక్కువని సమాచారం. ఇదీ చదవండి: ఈ ఏడాది 1996 క్యాలెండర్స్ వాడుకోండి..! ఎందుకంటే? ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11 శాతం బంగారం భారతీయుల వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. ఇది అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ వంటి దేశాలకంటే ఎక్కువ. భారత్ తరువాత అత్యధిక బంగారం ఉన్న దేశీయులలో సౌదీ అరేబియా, అమెరికా, కెనడా మొదలైనవి ఉన్నాయి. -
ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయొచ్చా?
స్టార్ హెల్త్ ప్రస్తుత ధర: రూ. 524 టార్గెట్: రూ. 653 ఎందుకంటే: 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్.. దేశీయంగా తొలి స్టాండెలోన్ ఆరోగ్య బీమా రంగ కంపెనీ. ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాద బీమా సేవలకు తోడు.. దేశ, విదేశీ ప్రయాణ బీమా ప్రొడక్టుల (సర్వీసుల)ను సమకూరుస్తోంది. 14,200 ఆసుపత్రులతో ఒప్పందం ద్వారా భారత్‌లో అతిపెద్ద ఆరోగ్య బీమా సర్వీసులు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(క్యూ2)లో నికర ఆర్జనా ప్రీమియం (ఎన్ఈపీ)వార్షికంగా దాదాపు 15% జంప్‌చేసి రూ. 3,206 కోట్లకు చేరింది. ఇందుకు రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం సాధించిన రెండంకెల వృద్ధి దోహదపడింది. దీంతో కంబైన్డ్ రేషియో వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం మెరుగుపడి 99.2 శాతాన్ని తాకింది. రిటైల్ హెల్త్ ప్రీమియంలో పటిష్ట పురోగతి, కొత్త ప్రొడక్టుల విడుదల, డిజిటలైజేషన్‌పై నిలకడైన దృష్టి, విస్తారిత పంపిణీ నెట్వర్క్, కొత్త బ్యాంకస్యూరెన్స్ భాగస్వామ్యాలు (పాలసీల విక్రయంలో బ్యాంకులతో ఒప్పందాలు), మెరుగైన సాల్వెన్సీ రేషియో వంటి అంశాలు భవిష్యత్‌లో కంపెనీ పటిష్ట పనితీరు చూపేందుకు సహకరించను న్నాయి. డిజిటలైజేషన్ బాటలో ఇటీవల డైనమిక్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తద్వారా కొత్తగా హెల్త్ ఇన్సూ రెన్స్ కొనుగోలు లేదా హెల్త్ పాలసీ కొనసాగింపు (రెన్యువల్)ను సులభంగా చేపట్టేందుకు వీలును కల్పించింది. రిటైల్ హెల్త్ విభాగంలో 33% వాటాతో మార్కెట్ లీడర్‌గా కంపెనీ నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రస్తుత ధర: రూ. 640 టార్గెట్: రూ. 740 ఎందుకంటే: ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విభా పడాల్కర్తో పాటు.. సీఎఫ్‌వో నీరజ్ షాతో ఇటీవలే సమావేశమయ్యాం. తద్వారా కంపెనీలో వృద్ధికి సంబంధించి చోటు చేసుకుంటున్న కీలక అంశాలు, మొత్తంగా జీవిత బీమా రంగంలో పరిస్థితులు తదితరాలపై అభిప్రాయాలకు తెరతీశారు. వీటి ప్రకారం కంపెనీ మార్కెట్లో తనకున్న వాటాను మరింత సుస్థిరం చేసుకోనుంది. ఇందుకు వ్యూహాత్మకంగా టెక్నాలజీ వినియోగం, కస్టమర్‌కు సేవల అందుబాటు (ఎక్స్పీరియన్స్), బ్రాండ్‌ను పటిష్టపరచుకోవడం, సిబ్బంది అందించే ప్రత్యేక సర్వీసులు వంటివి సహకరించనున్నాయి. వీటికితోడు కొత్త ప్రొడక్టుల విడుదల జత కలవనుంది. బీమా రంగ బిల్లులో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సవరణలు ఆరోగ్య బీమా విభాగానికి ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. వీరి అభిప్రాయం ప్రకారం కస్టమర్ల ఆరోగ్య బీమా అవసరాలకు తాజా బిల్లు తగిన మార్గాలను చూపనుంది. వెరసి కొత్త ప్రొడక్టులను రూపొందించడం, కస్టమర్లకు అనుగుణమైన సర్వీసులందించడం తదితర అంశాలలో బీమా రంగ కంపెనీలకు మరింత వెసులుబాటు లభించనుంది. ఇది దేశీయంగా బీమా సేవల వ్యవస్థ మరింత వేళ్లూనుకునేందుకు తోడ్పాటునివ్వనుంది. రూ. 5 లక్షలలోపు పాలసీలలో 15–17 శాతం చొప్పున వృద్ధి నమోదవుతోంది. అయితే అధిక టికెట్ పరిమాణంగల పొదుపు పాలసీలు తగ్గడంతో సర్దుబాటు ప్రాతిపదికన ఈ ఏడాది (2023–24) మొత్తం వార్షిక ప్రీమియం (ఏపీఈ) 12–13 శాతం చొప్పున పుంజుకునే వీలుంది. మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చానల్ ద్వారా 60 శాతం అమ్మకాలను సాధిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం! -
దలాల్ స్ట్రీట్‌లో శాంటాక్లాజ్ లాభాలు
ముంబై: క్రిస్మస్కు ముందు దలాల్ స్ట్రీట్‌లో శాంటా క్లాజ్ ర్యాలీ కనిపించింది. పతనమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ లాభపడ్డాయి. ఐటీ, మెటల్, టెక్, ఆటో, ఫార్మా, రియల్టీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 71,107 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు బలపడి 21,349 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర లాభ, నష్టాల మధ్య కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 71,260 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 21,390 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు 1.04%, 0.75% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,829 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,167 కోట్ల షేర్లు కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) కలి్పంచే అంశంలో పదేళ్ల గడువు లభించడంతో ఎల్ఐసీ షేరు 4% పెరిగి రూ.793 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 7% పెరిగి రూ.820 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. షేరు నాలుగు లాభపడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.18,057 కోట్లు పెరిగి రూ.5.01 లక్షల కోట్లకు చేరింది. ► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు రాణించాయి. విప్రో 6.55%, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 4%, ఎంఫసీస్, హెచ్‌సీఎల్ టెక్ 3%, కోఫోర్జ్ 2.50%, ఎల్‌అండ్‌టీఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఒకటిన్నర శాతం, ఎల్టీటీఎస్, టీసీఎస్ షేర్లు ఒకశాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ వరుస 3 రోజులు పనిచేయదు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం(డిసెంబర్ 25న) క్రిస్మస్ సందర్భంగా ఎక్చే్చంజీలు పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి మంగళవారం యథావిధిగా ప్రారంభం అవుతుంది. ► అజాద్ ఇంజనీరింగ్ ఐపీఓకు 80.60 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.01 కోట్ల ఈక్విటీలు జారీ చేయగా మొత్తం 81.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఐబీ కోటా 179.66 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్లు విభాగం 87.55 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 23.71 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ► కెనిడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సా గ్రూప్ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్.., ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థలో 5.7% వాటాను దక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా ఎఫ్ఐహెచ్ మారిషన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ నుంచి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌కు చెందిన 2.16 కోట్ల ఈక్విటీల(5.7% వాటా)ను రూ.1,198 కోట్లకు కొనుగోలు చేసినట్లు బల్క్‌డీల్ డేటా తెలిపింది. ఈ లావాదేవీ తర్వాత ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు 4% నష్టపోయి రూ.573 వద్ద స్థిరపడింది. -
Stock Market: జీవితకాల గరిష్టాల వద్ద బేర్ పంజా..!
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో కొత్త శిఖరాలపై దూసుకెళ్తున్న బుల్‌ను ఒక్కసారిగా బేర్ ముట్టడించింది. ఫలితంగా ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు గడిచిన 9 నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు క్షీణించి 70,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయి 21,150 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. పలు రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 71,913 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 21,593 వద్ద కొత్త జీవికాల గరిష్టాలు నమోదు చేశాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాలతో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ట్రేడింగ్ ముగిసే అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో సూచీలు ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,134 పాయింట్లు పతనమై 70,303 వద్ద, నిఫ్టీ 366 పాయింట్లు క్షీణించి 21,087 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ అమ్మకాలు తలెత్తాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 3.42%, 3.12% చొప్పున నష్టపోయాయి. ► ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ఒక్కరోజే రూ.8.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.350 లక్షల కోట్లకు దిగివచ్చింది. ► సెన్సెక్స్ సూచీ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్(0.19%) మినహా మిగిలిన 29 షేర్లూ 4% వరకు నష్టపోయాయి. ► రంగాల వారీగా యుటిలిటీ 4.65%, టెలికం 4.36%, విద్యుత్ 4.33%, సరీ్వసెస్ 4.20%, మెటల్, కమోడిటీ, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 3.50% వరకు నష్టపోయాయి. ► ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. యూకోబ్యాంక్ 10.50%, ఐఓబీ 10%, సెంట్రల్ బ్యాంక్ 8%, పీఎస్బీ, పీఎస్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 5% పతనయ్యాయి. ఇండియన్ బ్యాంక్, బీఓబీ షేర్లు 4–3% పడ్డాయి. ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఈ ఏడాదిలో అత్యధికంగా 4% క్రాష్ అయ్యింది. దుమ్మురేపిన డోమ్స్.. డోమ్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ హిట్ అయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.790)తో పోలిస్తే 77% ప్రీమియంతో రూ.1,400 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 82% ర్యాలీ చేసి రూ.1,434 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 68% లాభంతో రూ.1,331 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.8,077 కోట్లుగా నమోదైంది. కాగా, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిస్టింగ్ పర్వాలేదనిపించింది. బీఎస్ఈ ఇష్యూ ధర (రూ.493)తో పోలిస్తే 12% ప్రీమియంతో రూ.613 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 27% ర్యాలీ చేసి రూ.625 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని వద్ద తాకింది. చివరికి 10% లాభంతో రూ.544 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.5,818 కోట్లుగా నమోదైంది. ఇవీ నష్టాలకు కారణాలు లాభాల స్వీకరణ విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ప్రోద్బలంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ గత నెల రోజుల్లో ఏకంగా 7.2% లాభపడింది. పలు రంగాల షేర్లు అధిక వాల్యుయేషన్ల వద్ద ట్రేడవుతున్నాయి. సాంకేతిక చార్టులు ‘అధిక కొనుగోలు’ సంకేతాలను సూచిస్తున్నాయి. వరుస ర్యాలీతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ అనివార్యమైందని మార్కెట్ నిపుణులు తెలిపారు. మళ్లీ కరోనా భయాలు... దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 614 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో కోవిడ్ 19 సబ్ వేరియంట్ జేఎన్.1కి సంబంధించి 292 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. ఎర్ర సముద్రం వద్ద ఉద్రిక్తతలు ప్రపంచంలో ముఖ్య నౌకా మార్గాల్లో ఒకటైన ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తుండడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అనేక వాణిజ్య సంస్థలు ఆ మార్గం ద్వారా తమ నౌకలు వెళ్లకుండా నిలుపుదల చేశాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత పెరిగే వీలున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రాథమిక మార్కెట్లో ఐపీఓ ‘రష్’ గడిచిన నెల రోజుల్లో ప్రధాన విభాగం నుంచి 11 కంపెనీలతో సహా అనేక చిన్న, మధ్య తరహా స్థాయి కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఈ పబ్లిక్ ఇష్యూల్లో పాల్గొనేందుకు అవసరమైన లిక్విడిటి(ద్రవ్య)ని పొందేందుకు హెచ్ఎన్ఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు పాల్పడంతో సెకండరీ మార్కెట్ ఒత్తిడికి లోనై ఉండొచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
వారెన్ బఫెట్‌కు లక్షల కోట్లు నష్టం!
ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్‌కు భారీ నష్టం వాటిల్లింది. బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే క్యూ3 (జూలై-సెప్టెంబర్) గానూ ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ 12.8 బిలియన్ డాలర్లు (లక్ష కోట్ల రూపాయలకుపైగా) నష్టపోయినట్లు ప్రకటించింది. దీంతో ఒక్కో ఏ రకం షేర్ 8,824 డాలర్లు కోల్పోయినైట్టెంది. గత ఏడాది క్యూ3లో 2.8 బిలియన్ డాలర్ల నష్టం నమోదవగా, ఒక్కో ఏ రకం షేర్ విలువ రూ.1,907 డాలర్లు పడిపోయింది. అదే సమయంలో బెర్క్‌షైర్ హాథ్‌వే ఇన్సూరెన్స్ విభాగం లాభాల్ని గడించింది. బెర్క్‌షైర్ నిర్వహణ లాభంలో 2.4 బిలియన్లు అందించగా.. ఏడాది క్రితం బీమా రంగ సంస్థలు మూడవ త్రైమాసికంలో 1.1 బిలియన్ల నష్టాన్ని నివేదించాయి. బెర్క్‌షైర్ త్రైమాసికంలో 1.1 బిలియన్ డాలర్ల స్టాక్స్‌ను కొనుగోలు చేసింది.అయితే 4.4 బిలియన్ల బెర్క్‌షైర్ షేర్లను కొనుగోలు చేసిన మొదటి త్రైమాసికం నుండి దాని బైబ్యాక్‌ల వేగం గణనీయంగా తగ్గింది. -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ముగిసిన గత వారం మార్కెట్‌తో పోలిస్తే సెన్సెక్స్ 125 పాయింట్ల నష్టంతో 66,166 వద్దకు చేరింది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 19,731లో ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 83.29 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎం అండ్ ఎం, టైటాన్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నెస్లే, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అక్కడి టెక్ స్టాక్స్‌లో వచ్చిన అమ్మకాల సెగ సూచీలను కిందకు లాగింది. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్ల్లోనే స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలూ స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతోందన్న సంకేతాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తోందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం ఇటీవలి ధోరణికి భిన్నంగా రూ.317.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.102.8 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సియెట్, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జై బాలాజీ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓరియెంట్ హోటల్స్, యాత్రా ఆన్లైన్ కంపెనీలు ఈ రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. -
తక్కువ రిస్క్.. మెరుగైన రాబడులకు వ్యాల్యూ ఫండ్స్
రిస్క్ తక్కువగా ఉండాలి.. అదే సమయంలో మెరుగైన రాబడులు కావాలని కోరుకునే వారు వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. వ్యాల్యూ ఫండ్స్ అన్నవి ఒక కంపెనీ వ్యాపారం, మార్కెట్ వాటా, ఆర్థిక బలాలు ఇలా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత వాస్తవ విలువ కంటే షేరు ధరలు తక్కువగా లభిస్తున్న సమయంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్లు వ్యాల్యూఫండ్స్లో దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి ఇవి దీర్ఘకాలంలోనే ఎన్నో రెట్ల ప్రతిఫలాన్ని ఇస్తుంటాయి. స్వల్పకాలంలో గణనీయమైన లేదా మెరుగైన రాబడులను వీటిల్లో ఆశించడం సమంజసం కాదు. పనితీరు ఈ పథకం 2005లో మొదలైంది. అప్పటి నుంచి చూస్తే వార్షికంగా ఇచ్చిన ప్రతిఫలం 16 శాతంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 61 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో 29 శాతం, ఐదేళ్లలో 17.5 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలోనూ 18 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. వ్యాల్యూ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోలిస్తే నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్‌లో రాబడులు 2–3 శాతం అధికంగా ఉన్నాయి. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.5575 కోట్ల పెట్టుబడులున్నాయి. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాల రాబడులు 12 శాతానికి పైన ఉంటే మెరుగైన పనితీరుగా పరిగణనలోకి తీసుకోవచ్చు. 18 శాతానికి పైన ఉంటే అద్భుతమైన పనితీరుగా చెబుతారు. పెట్టుబడుల విధానం స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆకర్షణీయమైన విలువల వద్ద లభించే స్టాక్స్‌ను ఈ పథకం గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. కాకపోతే లార్జ్‌క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేస్తుంది. ప్రస్తుతానికి తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 4 శాతాన్ని నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉండగా.. 96 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. లార్జ్‌క్యాప్‌లో ప్రస్తుతానికి 64 శాతానికి పైగా పెట్టుబడులున్నాయి. మిడ్‌క్యాప్‌లో 29 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 7 శాతానికి పైనే పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీల్లో తీవ్ర అస్థిరతలు కనిపించిన సందర్భంలో పెట్టుబడులను తగ్గించుకుకోవడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2020 మార్చి నుంచి జూన్ మధ్య ఈ విధానాన్నే పాటించింది. ఆ సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకున్న ఈ పథకం.. ఆ తర్వాతి కాలంలో తిరిగి ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ బాటలో నడుస్తున్న తరుణంలో కేటాయింపులను పెంచింది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 72 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. 32 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీలకు 9 శాతం, నిర్మాణ రంగ కంపెనీలకు 8 శాతం, టెక్నాలజీ కంపెనీలకూ 8 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
నామినీ నమోదు చేశారా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టుబడులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తమ సంపదను వృద్ధి చేసుకునేందుకు ఎన్నో రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సొంతిల్లు సమకూర్చుకోవాలని, వారసులకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని.. ఇలాంటి ముఖ్యమైన ఎన్నో జీవిత లక్ష్యాల కోసం పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, జీవిత బీమా ప్లాన్లు, పీపీఎఫ్ ఇలా ఎన్నో ఆర్థిక సాధనాలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఉంటాయి. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. దురదృష్టం కొద్దీ ఈ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? ఆ పెట్టుబడులనేవి జీవిత భాగస్వామి లేదా వారసులకు సాఫీగా, సులభంగా, వేగంగా బదిలీ అవ్వాలి. అందుకు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదే నామినేషన్ నమోదు చేయడం. తమకు అత్యంత ఆప్తులైన వారిలో ఒకరి పేరును నామినీగా ప్రతి పెట్టుబడి సాధనంలోనూ నమోదు చేయాలి. నామినేషన్ లేని సందర్భాల్లో క్లెయిమ్ కోసం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనుక నామినేషన్ ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నామినీ అంటే ఎవరు..? పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో వారి పేరిట ఉన్న పెట్టుబడులను క్లెయిమ్ చేసుకుని, వాటిని పొందే హక్కును కలిగిన వ్యక్తి నామినీ అవుతారు. ఎక్కువ మంది నామినీగా కుటుంబ సభ్యులనే ముందుగా నియమించుకుంటారు. జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు నామినేషన్ విషయంలో ప్రథమ ఎంపికగా ఉంటారు. అవివాహితులై, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు కూడా లేని సందర్భాల్లో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన వారిని, స్నేహితులను నామినీగా నియమించుకోవచ్చు. నామినీకి ఎవరు అయినా అర్హులే. కాకపోతే అంతిమంగా దీని ప్రయోజనం నెరవేరేలా నామినేషన్ ఉండాలన్న అంశాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నామినీగా మైనర్‌ను పేర్కొంటే, సంబంధిత నామినీ సంరక్షకుడి పేరు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి. ఎంతో ప్రాధాన్యం.. 3నామినేషన్ నమోదు చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. అతని పేరిట ఉన్న పెట్టుబడులు నామినీకి చాలా సులభంగా బదిలీ అవుతాయి. నామినీని నమోదు చేయకపోతే.. అప్పుడు ఆ పెట్టుబడులను వారసులే క్లెయిమ్ చేయగలరు. చట్ట ప్రకారం తామే వారసులమని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని స్థానిక తహసీల్దార్ లేదా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సమయంతోపాటు, శ్రమ కూడా పడాలి. ముఖ్యంగా కోర్టు నుంచి లీగల్ హేర్ సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ రిజిస్టర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. పెట్టుబడిదారు డెత్ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుంది. ఒక అప్లికేషన్, దానికితోడు కేవైసీ వివరాలు సమర్పిస్తే చాలు. ప్రక్రియ సులభంగా ముగుస్తుంది. వేటికి?..: బీమా పాలసీ తీసుకోవడం వెనుక ఉద్దేశం తమకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే. అంత ముఖ్యమైన బీమా ప్లాన్ దరఖాస్తులో నామినేషన్ నమోదు చేయకపోతే? అర్థమే ఉండదు. అలాంటప్పుడు పరిహారం దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు ఖాతాకు సైతం నామినేషన్ ఉండాలి. అప్పుడు ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందడానికి వీలవుతుంది. అకౌంట్ హోల్డర్ మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, నామినీ కేవైసీ వివరాలను బ్యాంకు శాఖలో సమర్పించడం ద్వారా వాటిని సొంతం చేసుకోవచ్చు. అలాగే, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ నామినేషన్ ఉండాలి. ఇంకా పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్, అన్ని పోస్టాఫీసు పథకాలకు నామినేషన్ నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నామినేషన్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. అయినా కానీ, నమోదు చేయడం బాధ్యతగా భావించాలి. ప్రతి పెట్టుబడి దరఖాస్తులో నామినేషన్ కాలమ్‌ను తప్పకుండా పూరించాలి. ఎంత మంది? నామినీలు ఎంత మంది అనే విషయం ఆయా పెట్టుబడి సాధనాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అయితే ఎంత మందిని అయినా నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఒకరికి మించి నామినీగా పేర్లు ఇచ్చినప్పుడు, విడిగా ఒక్కొక్కరికీ ఎంత శాతం చొప్పున క్లెయిమ్‌కు అర్హత అనేది కూడా పేర్కొనాలి. ఉదాహరణకు ముగ్గురిని నామినీలుగా నమోదు చేశారనుకుందాం. అప్పుడు ఏకి 50 శాతం, బీకి 30 శాతం, సీకి 20 శాతం లేదా తమకు నచ్చిన విధంగా ఈ శాతాన్ని నిర్ణయించుకోవచ్చు. బ్యాంకు ఖాతాలకు అయితే సాధారణంగా ఒక్కటే నామినేషన్ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు కూడా ఒకటికి మించి నామినేషన్లు ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు నామినేషన్ కింద ముగ్గురి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొందరు తమపై ఆధారపడిన ఒంటరి తల్లి లేదా తండ్రికీ కొంత పెట్టుబడుల మొత్తం వెళ్లాలని కోరుకుంటారు. అలాంటప్పుడు విల్లు రాసి అందులో ఎవరికి ఏమి చెందాలో పేర్కొనాలి. లేదంటే నామినేషన్లో తల్లిదండ్రులకూ ఇంత శాతం చొప్పున వాటా ఇవ్వాలి. సవరణ..: నామినేషన్ ఇవ్వడంతో పని ముగిసిపోయిందని అనుకోవద్దు. ఏడాదికోసారి సంబంధిత నామినేషన్‌ను సమీక్షించుకోవాలి. అప్పటికే నామినీగా పేర్కొన్న వ్యక్తులతో తమకున్న అనుబంధాన్ని విశ్లేషించుకోవాలి. తమకు ఏదైనా జరిగితే వారు ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు సరైన వారేనా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కొందరు వైవాహిక బంధం నుంచి వేరు పడుతుంటారు. మరొకరిని వివాహం చేసుకుంటారు. అవివాహితులు వైవాహిక జీవితంలోకి ప్రవేశించొచ్చు. లేదా నామినీగా పేర్కొన్న వ్యక్తి మరణించి ఉండొచ్చు. మరేదైనా కారణం ఉండొచ్చు. నామినీగా నమోదు చేసిన వ్యక్తి ఆచూకీ లేకుండా పోతే, అప్పుడు అసలు ఉద్దేశమే నెరవేరదు. అందుకే నామినేషన్‌ను ఏడాదికోసారి సమీక్షించి, సవరించుకోవాలి. ఊహించని అనుభవం 2021లో మద్రాస్ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పునిచ్చింది. తన భర్త మరణంతో జీవిత బీమా పాలసీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునే విషయమై ఒక మహిళకు తన మామతో విభేదాలు ఏర్పడ్డాయి. కోర్టును ఆశ్రయించగా, ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కారణం ఆమె భర్త తీసుకున్న జీవిత బీమా పాలసీ ప్రీమియంలను తండ్రి (బాధితురాలి మామ) చెల్లించడమే. పైగా మరణించిన వ్యక్తి తన జీవిత బీమా పాలసీలో నామినీని నమోదు చేయలేదు. విల్లు కూడా రాయలేదు. ప్రీమియంలను పాలసీదారు సొంతంగా చెల్లించనప్పుడు, ఆ పాలసీ ప్రయోజనాలకు జీవిత భాగస్వామి వారసురాలని తేల్చడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నామినీని నమోదు చేయకపోవడంతో, ప్రీమియం చెల్లించిన తండ్రికి ఆ పాలసీ ప్రయోజనాలపై అధికారాలు ఉంటాయని ఈ ఘటన స్పష్టం చేసింది. సరైన నిర్ణయం మనలో కొందరు తమ పిల్లల పేరిట జీవిత బీమా పాలసీలను తీసుకుని తొలుత వారే ప్రీమియం చెల్లిస్తుంటారు. కనుక పెళ్లయిన వ్యక్తులు వెంటనే జీవిత బీమా పాలసీల్లో తమ జీవిత భాగస్వామిని నామినీగా నమోదు చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అందుకే సరైన వ్యక్తిని నామినీగా నమోదు చేసుకోవాలి. లేదంటే విల్లు రాసి రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల ఉద్దేశం నెరవేరాలంటే అందుకు నామినేషన్ మెరుగైన మార్గం. చాలా కేసుల్లో వ్యక్తి మరణంతో జీవిత భాగస్వామిపైనే ఆర్థిక బాధ్యతల భారం పడుతుంది. కనుక జీవిత భాగస్వామినే నామినీగా నమోదు చేసుకోవాలి. కుటుంబం కోసం ఒక పాలసీ, ఒంటరి తల్లి లేదా తండ్రి లేదా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం విడిగా మరో పాలసీ తీసుకునే వారు.. ఆయా పాలసీల్లో తప్పనిసరిగా నామినీని పేర్కొనాలి. నామినేషన్ గడువు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగిన వారు, ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా కలిగిన వారు తప్పనిసరిగా నామినీ విషయంలో ఆప్షన్ ఇవ్వాలని సెబీ ఆదేశాలు తీసుకొచ్చింది. 2023 మార్చి 31 వరకే ఉన్న గడువును, సెస్టెంబర్ 30 వరకు పొడిగించింది. కనుక ఇన్వెస్టర్లు వచ్చే సెప్టెంబర్ 30 నాటికి నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఆప్ట్ అవుట్ ఆఫ్ నామినేషన్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిబంధన. అంటే నామినేషన్ నుంచి వైదొలగడం. కానీ, సెబీ ఆదేశాల ఉద్దేశం అది కాదు. నామినేషన్ విలువ తెలియజేసి, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చేయడమే. ఇక జీవిత బీమా ప్లాన్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినేషన్ నమోదు తప్పనిసరి కాదు. అయినా కానీ, నామినేషన్ ఇవ్వడం తన బాధ్యతగా ఇన్వెస్టర్ గుర్తించాలి. -
అదానీకి ఊరట..
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ర్యాలీ విషయంలో నియంత్రణలపరమైన వైఫల్యమేమీ లేదని సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ పేర్కొంది. అయితే, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక రావడానికి ముందే అదానీ స్టాక్స్‌లో షార్ట్ బిల్డప్ జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. రిపోర్టు వెల్లడై, షేర్లు కుప్పకూలిన తర్వాత ట్రేడర్లు పొజిషన్లు స్క్వేర్ ఆఫ్ చేసి, లాభపడ్డారని వివరించింది. ఆరు సంస్థలు అనుమానాస్పద ట్రేడింగ్ నిర్వహించాయని.. వాటిలో నాలుగు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) కాగా, ఒకటి కార్పొరేట్ సంస్థ, మరొక వ్యక్తి ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ప్రస్తావిస్తూ పేర్కొంది. ‘మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇచ్చిన వివరణ, డేటా ప్రకారం నియంత్రణ వైఫల్యాల వల్ల షేర్ల ధరల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలను ధ్రువీకరించలేము‘ అని సుప్రీం కోర్టుకు ఇచ్చిన 173 పేజీల నివేదికలో కమిటీ తెలిపింది. అలాగే, పరస్పర సంబంధమున్న వర్గాల మధ్య లావాదేవీల్లోనూ, కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల విషయంలోనూ సెబీ విఫలమైనట్లు చెప్పలేమని కమిటీ వివరించింది. సందేహాస్పద విదేశీ సంస్థల నుంచి అదానీ సంస్థల్లోకి నిధులు వచ్చాయన్న ఆరోపణలపై సెబీ 2020 నుంచి చేస్తున్న విచారణలో నిర్దిష్టంగా ఏమీ తేలలేదని కమిటీ తెలిపింది. ఈ నివేదికే తుది తీర్పు కాకపోయినప్పటికీ అదానీ సామ్రాజ్యానికి కాస్త ఊరట మాత్రం కలిగించేదేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదానీ గ్రూప్ ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ సంస్థల షేర్లు కుప్పకూలాయి. ఈ వ్యవహారంపై అటు సెబీ తన వంతుగా దర్యాప్తు చేస్తుండగా, సుప్రీంకోర్టు కూడా సమాంతరంగా ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏఎం సాప్రే సారథ్యంలోని ఈ కమిటీలో కేవీ కామత్, ఓపీ భట్, నందన్ నీలేకని వంటి దిగ్గజాలు ఉన్నారు. స్టాక్స్ రయ్.. కమిటీ నివేదికతో శుక్రవారం అదానీ గ్రూప్ స్టాక్స్‌కు ఊతం లభించింది. గ్రూప్‌లోని 10 స్టాక్స్ 1.2 శాతం నుంచి 7 శాతం వరకు పెరిగాయి. అదానీ విల్మర్ 6.85%, అదానీ పవర్ 4.93%, అదానీ ట్రాన్స్మిషన్ 4.62%, అదానీ గ్రీన్ ఎనర్జీ 4.18%, అదానీ ఎంటర్ప్రైజెస్.. అదానీ పోర్ట్స్ చెరి 3.65 శాతం, ఎన్డీటీవీ 3.53%, అదానీ టోటల్ గ్యాస్ 3.05% లాభపడ్డాయి. అంబుజా సిమెంట్స్, ఏసీసీ చెరి 1 శాతం లాభపడ్డాయి. -
రోడ్లపై ధాన్యం నిల్వలు, ప్రమాదాల భారిన వాహనాలు
-
అదానీ స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇటీవల అదానీ గ్రూప్ స్టాక్స్‌లో రూ. 15,446 కోట్లు ఇన్వెస్ట్ చేయడంతో మార్చిలో పెట్టుబడులు లభించినట్లు నమోదైంది. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అదానీ గ్రూప్‌లో యూఎస్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ పెట్టుబడులను(రూ. 15,446 కోట్లు) మినహాయిస్తే దాదాపు రూ. 4,000 కోట్లమేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. యూఎస్‌లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ విఫలంకావడంతో ఇకపై విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం ఎఫ్‌పీఐలు మార్చి 1–17 కాలంలో రూ. 11,495 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 5,294 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా, జనవరిలో మరింత అధికంగా రూ. 28,852 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే 2022 డిసెంబర్లో నికరంగా రూ. 11,119 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. -
Rekha Jhunjhunwala: రెండు స్టాక్‌ల నుండి రూ. 650 కోట్లు
ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్గా పేరొందిన రాకేష్ ఝున్‌జున్‌వాలా భార్య రేఖా ఝున్‌జున్‌వాలా కూడా స్టాక్ మార్కెట్లో చాలా వర్క్ చేస్తోంది. ఆమె మొత్తం ఆస్తులు ఇప్పుడు రూ. 650 కోట్లకు పెరిగాయి. రేఖా సంపద పెరగడానికి ప్రధాన కారణం ఆమె పోర్ట్‌ఫోలియోలో ఉన్న రెండు స్టాక్‌లు భారీగా వృద్ధి చెందటమే. గత నెలలో రేఖా ఝున్‌జున్‌వాలా మెట్రో బ్రాండ్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ షేర్లలో విపరీతమైన పెరుగుదల నమోదైంది. గత కొన్ని సెషన్లలో దలాల్ స్ట్రీట్ అండ్ గ్లోబల్ మార్కెట్లో ట్రెండ్ రివర్సల్ తరువాత లార్జ్ క్యాప్, మిడ్-క్యాప్ స్టాక్‌లు బలమైన పనితీరును కనబరిచాయి. నిజానికి 2023 ఫిబ్రవరి 2న టైటాన్ కంపెనీ షేరు ధర రూ.2310 నుంచి రూ.2535కి పెరిగింది. ఈ విధంగా కేవలం రెండు వారాల్లోనే ఈ షేర్ ధర రూ.225 మేర పెరిగింది. డిసెంబర్ 2021లో లిస్టింగ్ అయిన తర్వాత, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన రేఖ జున్‌జున్‌వాలా భర్త రాకేష్ జున్‌జున్‌వాలా కంపెనీలో 10,07,53,935 షేర్లు లేదా 17.50 శాతం వాటాను కలిగి ఉన్నారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణం తర్వాత, ఈ షేర్లు అతని భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు చేరాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో రేఖ 10,07,53,935 షేర్లను కలిగి ఉంది. అదే విధంగా 2022 అక్టోబర్ నుండి డిసెంబర్ త్రైమాసికంలో మెట్రో బ్రాండ్లలో 3,91,53,600 షేర్లను కలిగి ఉన్నారు. -
దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త మైలురాయి.. ఒక్క రోజులోనే సెటిల్మెంట్
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. శుక్రవారం(27న) నుంచి మొత్తం ఈక్విటీ విభాగంలో లావాదేవీలను ఒక్క రోజులోనే సెటిల్ చేసే ప్రక్రియకు తెరతీశాయి. దీంతో మార్కెట్లో నమోదయ్యే లావాదేవీలను మరుసటి రోజులోనే క్లియర్ చేస్తారు. అంటే షేరు లేదా నగదు బదిలీని పూర్తి చేస్తారు. ఈక్విటీ విభాగంలోని సెక్యూరిటీలలో ఈ నెల 27 నుంచి ట్రేడ్‌ప్లస్(టీప్లస్)1 సెటిల్మెంట్ను అమలు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా పేర్కొంది. తద్వారా దేశీ మార్కెట్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇప్పటివరకూ టీప్లస్2 సెటిల్మెంట్ అమల్లో ఉంది. అంటే లావాదేవీ జరిగిన రెండు రోజుల్లో క్లియరింగ్‌ను చేపడుతున్నారు. టీప్లస్1 సెటిల్మెంట్ వల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడి సామర్థ్యాలు మెరుగుపడటంతోపాటు.. మొత్తం పరిశ్రమలో రిస్కులు తగ్గేందుకు వీలు చిక్కనుంది. 2021లోనే పునాది: నిజానికి టీప్లస్1 సెటిల్మెంట్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2021 సెప్టెంబర్ 7న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి ప్రవేశపెట్టేందుకు ఎక్సే్ఛంజీలను అనుమతించింది. ట్రేడింగ్ సభ్యులు, కస్టోడియన్లు తదితర మార్కెట్ మౌలిక సంస్థలు దశలవారీగా టీప్లస్1 అమలుకు తెరతీశాయి. 2022 ఫిబ్రవరి 25న కొత్త సెటిల్మెంట్ను ప్రారంభించాయి. 2023 జనవరి 27కల్లా ఈక్విటీ విభాగంలోని అన్ని సెక్యూరిటీలనూ ఒక్క రోజు సెటిల్‌మెంట్‌లోకి తీసుకువచ్చాయి. వీటిలో ఎస్ఎంఈ షేర్లు సహా ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు), రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్లు), సావరిన్ గోల్డ్ బాండ్లు(ఎస్‌జీబీలు), ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు చేరాయి. పలు అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఇప్పటికీ టీప్లస్2 సెటిల్మెంటును అమలు చేస్తుండటం గమనార్హం! చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
రికార్డ్ల రారాజు, ఎలాన్ మస్క్ ఖాతాలో అత్యంత అరుదైన చెత్త రికార్డ్!
ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ సరికొత్త చెత్త రికార్డ్లను క్రియేట్ చేశారు. సుదీర్ఘ కాలంగా వ్యక్తిగత సంపదను కోల్పోయిన వారిలో ఒకరిగా నిలిచి గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..2000 సంవత్సరం తర్వాత ప్రపంచ చరిత్రలో రెండో సారి అత్యధిక సంపదను కోల్పోయిన వారిలో మస్క్ ఒకరు. నవంబర్ 2021 నుంచి 182 బిలియన్ డాలర్ల సంపద కరిగింది. మరికొన్ని నివేదికలు ఆ మొత్తం 200 బిలియన్ డాలర్లు ఉన్నట్లు హైలెట్ చేస్తున్నాయి. అయితే మస్క్ ఎంత మొత్తం వెల్త్ నష్టపోయారనేది నిర్ధారించడం కష్టంగా ఉన్నా..గత రికార్డులను తిరగరాశారు. 2000 సంవత్సరంలో జపాన్ టెక్ ఇన్వెస్టర్ మసయోషి సన్ 58.6 బిలియన్ల నష్టాన్ని చవిచూశారు. ఇప్పుడు మస్క్ ఏకంగా 182 బిలియన్ డాలర్లను లాస్ అయ్యారని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తెలిపింది. ది హిల్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ నెట్ వర్త్ నవంబర్ 2021 నుంచి జనవరి 2023 వరకు 320 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. ప్రస్తుతం ఆయన సంపద 137 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనంతటికి కారణం టెస్లా షేర్లు నిరాశపరచడమేనని తెలుస్తోంది. ట్విటర్ ముంచింది? మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు 7 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను భారీ ఎత్తున అమ్మేశారు. నవంబర్ నెలలో 4 బిలియన్ డాలర్లు,డిసెంబర్ నెలలో మరో 3.58 బిలియన్ల విలువైన స్టాక్‌ను విక్రయించాడు. అలా గతేడాది ఏప్రిల్ నుండి 23 బిలియన్ల విలువైన టెస్లా స్టాక్స్‌ను సేల్ చేశారు. దీంతో పాటు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయారు. ఫ్రాన్స్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ 190 బిలియన్ల నికర విలువతో ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. పునాదులు కదిలాయా? ట్విటర్ కొనుగోలుతో మస్క్ వ్యాపార సామ్రాజ్యపు పునాదులు కదిలిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2022 అక్టోబర్ నెలలో 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ వ్యాపార రంగంలో ప్రాభవం తగ్గుతూ వస్తున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మస్క్‌ను తక్కువ అంచనా వేయొద్దు ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మసయోషి సన్ నికర విలువ ఫిబ్రవరి 2000లో గరిష్టంగా 78 బిలియన్ల నుండి అదే సంవత్సరం జూలైలో 19.4 బిలియన్లకు క్షీణించిందని, అతని కంపెనీ సాఫ్ట్‌బ్యాంక్ విలువ డాట్ కామ్ క్రాష్ అవ్వడంతో తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు. కానీ ఎలాన్ మస్క్ ట్విటర్ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్నారని, భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో బౌన్స్ బ్యాక్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని, ఎందుకంటే అక్కడ ఉంది ఎలాన్ మస్క్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. -
అవును.. కొత్త ఏడాది కలిసొచ్చే కాలమే, ఎందుకో తెలుసా?
గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్‌కు కొత్త ఏడాది కలిసొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ 2023లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు తెరపడనుంది. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొలిక్కి రావచ్చు. దేశీయ పరిస్థితులను గమనిస్తే.., ధరలు కొండెక్కి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వినియోగం పుంజుకుంటుంది. ప్రభుత్వ వృద్ధి దోహద చర్యలు, ప్రోత్సాహక విధానాలు, కార్పొరేట్ కంపెనీల ఆదాయాల్లో మెరుగైన వృద్ధి మన మార్కెట్‌ను ముందుకు నడపొచ్చని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడితో.. లాభాలు చూస్తే కళ్లుచెదరాల్సిందే -
పెట్టుబడులకు థీమ్... భారత్ !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థిరమైన విధా నాలు, తయారీ సామర్థ్యాలు పెంచుకుంటూ ఉండటం, వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు అంతర్జాతీయంగా చూస్తే భారతదేశం ప్రధాన థీమ్‌గా ఉండబోతోందని పీజీఐఎం ఇండియా మ్యుచువల్ ఫండ్ సీఐవో శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు. ప్రస్తుతం ఫైనాన్షియల్స్, ఇండస్ట్రియల్స్ స్టాక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. మరిన్ని వివరాలు.. ► రాబోయే దశాబ్ద కాలంలో పెట్టుబడులకు కొత్తగా ఏ థీమ్‌లు ఆకర్షణీయంగా ఉండబోతున్నాయి? ప్రధానంగా మూడు థీమ్‌లు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా భారత్‌తో ముడిపడినవే. అంతర్జాతీయ దృష్టికోణంతో చూస్తే భారతదేశమే కొత్త పెట్టుబడి థీమ్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం అయిదో అతి పెద్ద ఎకానమీగా ఎదిగింది. స్థిరమైన రాజకీయ పరిస్థితులు, పటిష్టమైన వినియోగంతో కూడుకున్న వృద్ధి, సానుకూల ప్రభుత్వ విధానాలు ఇవన్నీ కూడా రాబోయే దశాబ్దకాలంలో భారత్‌లో పెట్టుబడులకు దోహదపడనున్నాయి. ఇక రెండో థీమ్ విషయానికొస్తే భారత్ తన తయారీ సామరŠాధ్యలను పెంచుకుంటూ ఉండటం. అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ పరిస్థితులు, ముడి సరుకులపై అనిశ్చితి, చైనా ప్లస్ వన్ వ్యూహాలు మొదలైన ధోరణులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. ప్రస్తుతం మన జీడీపీలో ఎక్కువగా సర్వీసుల వాటా ఉంటుండగా, తదుపరి దశ వృద్ధి తయారీ రంగం నుంచి రాబోతోంది. దేశీయంగా తయారీకి ప్రాధాన్యతనిస్తుండటం, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాలు మొదలైనవి ఇందుకు తోడ్పడనున్నాయి. ఇక మూడో థీమ్‌ను తీసుకుంటే పెరుగుతున్న తలసరి ఆదాయంతో వినియోగం కూడా పెరుగుతోంది. మరింత మంది ప్రజలు ఆర్థికంగా ఎదిగే కొద్దీ వినియోగ పరిమాణం, నాణ్యత రెండూ పెరగనున్నాయి. ఫైనాన్షియల్స్, డిజిటలైజేషన్‌లోనూ ఇదే ధోరణి కనిపించనుంది. ► ఒడిదుడుకుల మార్కెట్లో రిటైల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఎలా వ్యవహరించాలి? ఇన్వెస్టర్లు.. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే మార్కెట్లో టైమింగ్ కన్నా ఎంత కాలం పాటు మార్కెట్లో ఉన్నామనేది ముఖ్యం. స్వల్పకాలిక ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు సిప్ల విధానం సరైనది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలి. మార్కెట్లు స్వల్పకాలికంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా, దీర్ఘకాలంలో మాత్రం ఒడిదుడుకులు తక్కువగానే ఉంటాయి. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్లు ప్రతి రోజూ తమ పోర్ట్‌ఫోలియోను చూసుకోవడం కాకుండా దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కోణంలో వ్యవహరించాలి. అలాగే వయస్సుకు తగిన విధంగా అసెట్ కేటాయింపులపై దృష్టి పెట్టాలి. తద్వారా రిటైర్మెంట్ తదితర దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు వీలవుతుంది. ► ద్వితీయార్ధంలో మార్కెట్లకు పొంచి ఉన్న రిస్కులేమిటి? ఇటీవలి కాలంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత మార్కెట్లు బాగానే రాణించాయి. వేల్యుయేషన్స్ చౌకగా లేకపోయినా చాలా అధికంగా కూడా ఏమీ లేవు. భౌగోళికరాజకీయ అనిశ్చితులు, కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు, సరఫరా వ్యవస్థపరమైన అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మొదలైన రిస్కులు ఉన్నాయి. అయితే ఇవన్నీ అంతర్జాతీయంగా కూడా ఉన్నవి, తాత్కాలికమైనవే. ఏదేమైనా రిస్కులనేవి ఈక్విటీ పెట్టుబడుల్లో అంతర్భాగమేనని దృష్టిలో ఉంచుకుని, డైవర్సిఫికేషన్ ద్వారా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ► ప్రస్తుతం ఏయే రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయి? సాధారణంగా అసెట్ క్వాలిటీ, రుణ వృద్ధి మెరుగుపడుతుండటంతో ఫైనాన్షియల్స్ సానుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే దేశీయంగా తయారీకి ప్రోత్సహిస్తున్నందున ఇండస్ట్రియల్స్ కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, యుటిలిటీలు మొదలైనవి అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు. ► తొలిసారిగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి సూచనలు? ఫస్ట్ టైమర్లు దీర్ఘకాలిక పెట్టుబడుల కోణంతో తక్కువ ఒడిదుడుకులు ఉండే, డైవర్సిఫైడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. డైవర్సిఫైడ్/ఫ్లెక్సి క్యాప్, ఈఎల్ఎస్ఎస్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఈ కోవకు చెందుతాయి. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడులకు 3 ఏళ్ల ఆటోమేటిక్ లాకిన్ వ్యవధి ఉంటుంది. ఈక్విటీల్లో రాబడులు అందుకోవాలంటే కనీసం ఆ మాత్రం సమయమైనా ఇన్వెస్ట్ చేయాలి. ఇక వయస్సు, ఇతరత్రా కట్టుకోవాల్సినవి బట్టి ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్థ్యాలు/వయస్సు/వ్యక్తిగత అవసరాల ప్రకారం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్డ్/హైబ్రిడ్ ఫండ్స్‌కు కేటాయించడాన్ని పరిశీలించవచ్చు.స్టాక్, సెక్టార్, మార్కెట్లు .. ఏవైనా కావచ్చు వేలం వెర్రి ధోరణులకు పోవద్దు. మార్కెట్లు ఆశ, నిరాశల మధ్య తీవ్రంగా కొట్టుమిట్టాడుతున్నట్లుగా ఉంటాయి. కాబట్టి రాబడులకు సంబంధించి భారీగా కాకుండా వాస్తవిక స్థాయిలో అంచనాలు పెట్టుకోవడం మంచిది. -
‘నేను తీసుకున్న ఇంటి రుణాన్ని ఇలా చెల్లించవచ్చా’?
గ్రాట్యుటీతో గృహ రుణం తీర్చేయడం సరైనదేనా? నాకు గృహ రుణం ఉంది. మరో 5 ఏళ్లకు ఇది పూర్తవుతుంది. గ్రాట్యుటీ రూపంలో పెద్ద మొత్తంలో రానుంది. ఈ గ్రాట్యుటీతో గృహ రుణాన్ని తీర్చివేయాలా లేక ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలా? –క్రిష్ రుణాలలో గృహరుణం ఒక్క దానిని కొనసాగించుకోవచ్చు. అధిక వడ్డీ రేటు ఉండే ఇతర రుణాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఇతర రుణాలు తీసుకుని ఉంటే, అప్పుడు వాటిని ముందుగా తీర్చేయడాన్ని పరిశీలించొచ్చు. గృహ రుణం కొనసాగించడం వల్ల నష్టం లేదనడానికి పలు కారణాలు ఉన్నాయి. ఒకటి అద్దె రూపంలో కొంత ఆదా చేస్తుంటారు. రుణంపై వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనం ఉంది. పైగా చాలా తక్కువ రేటుకు వచ్చే రుణం ఇది. గృహ రుణం రేటుతో పోలిస్తే పెట్టుబడులపై దీర్ఘకాలంలో అధిక రాబడి వస్తుంది. కనుక గృహ రుణం లాభదాయకమే. భవిష్యత్తులో వచ్చే ఆదాయం గురించి ఆందోళన చెందుతుంటే లేదా గృహ రుణం చెల్లించడం ద్వారా ప్రశాంతంగా ఉంటానని అనుకుంటే గ్రాట్యుటీ ద్వారా వచ్చే మొత్తంతో ఆ పనిచేయవచ్చు. అలా కాకుండా గృహ రుణాన్ని భారంగా భావించకపోతే, భవిష్యత్తు ఆదాయంపై నమ్మకం ఉంటే గృహ రుణాన్ని కొనసాగించుకోవచ్చు. అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్‌ను గుర్తించడం ఎలా?– కపిల్ వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్‌ను గుర్తించం అన్నది ఆర్ట్, సైన్స్‌తో కూడుకున్నది. డిస్కౌంటింగ్ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో చూడాలి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అన్నది కూడా చూడాలి. కంపెనీ నుంచి నిధులను మింగేస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని పెట్టుబడులను కొనసాగించే బలం కూడా కావాలి. చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి! -
ఇన్వెస్టర్లకు లాభాల్ని తెచ్చిపెట్టే ఫోకస్డ్ ఈక్విటీ పథకాలేంటో తెలుసా
దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఫోకస్డ్ ఈక్విటీ పథకాలు ఎంతో అనుకూలం. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అస్థిరతల మధ్య చలిస్తున్న మార్కెట్లో లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకాలకు మించి ఫ్లెక్సీక్యాప్ మెరుగైన పనితీరు ప్రదర్శించాయి. రోలింగ్ రాబడులను గమనిస్తే గత ఏడేళ్ల కాలంలో ఇతర పథకాలతో పోలిస్తే ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలాన్నిచ్చాయి. ఫ్లెక్సీక్యాప్ పథకాలు లార్జ్‌క్యాప్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక ఆటుపోట్లను మెరుగ్గా తట్టుకోగలవు. మార్కెట్ల ర్యాలీల్లో ఇవి మంచి రాబడులు కూడా ఇస్తాయి. ఈ విభాగంలో ఐఐఎఫ్ఎల్ ఫోకస్డ్ ఫండ్‌ను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. రాబడులు ఫోకస్డ్ ఫండ్స్ విభాగంలో ఈ పథకం పనితీరు బలంగా, ఆకర్షణీయంగా ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించొచ్చు. అన్ని రకాల కాల వ్యవధుల్లో స్థిరమైన రాబడులతో మెరుగ్గా ఉంది. పోటీ పథకాలతో చూసినా, బెంచ్ మార్క్ కంటే మంచి పనితీరు చూపిస్తోంది. ఐదేళ్ల కాలంలో రోలింగ్ రాబడులను గమనిస్తే 2012 నుంచి 2022 అక్టోబర్ మధ్య ఈ పథకం ఏటా 16.3 శాతం మేర ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. టాప్ పథకాల్లో ఇది కూడా ఒకటి. కాకపోతే, దేశీ, విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ఎస్బీఐ ఫోకస్డ్ ఫండ్ ఈ విభాగంలో ఐదేళ్ల కాల రోలింగ్ రాబడుల పరంగా మొదటి స్థానంలో ఉంది. ఏటా 16.5 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. అంటే 0.2 శాతం అధిక రాబడులు ఎస్బీఐ ఫోకస్డ్ ఫండ్‌లో ఉన్నాయి. కానీ ఏడేళ్ల కాలంలో ఐఐఎఫ్ఎల్ ఫోకస్డ్ ఈక్విటీ పథకం ఏటా 16.5 శాతం చొప్పున రాబడిని తెచ్చి పెట్టింది. ఎస్అండ్పీ బీఎస్ఈ 500 కంటే 3–4 శాతం అధిక ప్రతిఫలాన్నిచ్చింది. పాయింట్ టు పాయింట్ (కచ్చితంగా రెండు కాలాల మధ్య) రాబడుల పరంగా చూస్తే మూడు, ఐదు, ఏడేళ్ల కాలంలో ఈ విభాగంలో ఈ పథకమే ముందుంది. 2020 మార్కెట్ క్రాష్‌లో సూచీలకు అనుగుణంగా 36.5 శాతం మేర నష్టపోయింది. పెట్టుబడుల విధానం ఈ పథకం వ్యాల్యూ, మూమెంటమ్ అనే రెండు రకాల విధానాలతో పెట్టుబడులు పెడుతుంటుంది. మోస్తరు రిస్క్ తీసుకునే వారు తమ పోర్ట్‌ఫోలియోలోకి ఈ పథకాన్ని చేర్చుకోవచ్చు. కనీసం 7–10 ఏళ్ల పాటు అయినా పెట్టుబడులను కొనసాగించాలి. ఇక సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టడం మరింత మెరుగైన ఆప్షన్ అవుతుంది. అన్ని రకాల మార్కెట్ విలువలు కలిగిన విభాగాల్లో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.3,231 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.25 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించగా, మిగిలిన 6.75 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. అందులోనూ 72 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్‌లో 13.57 శాతం, స్మాల్‌క్యాప్‌లో 14 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 30 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్‌కు అత్యధికంగా 32 శాతం మేర పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత టెక్నాలజీ రంగానికి 10 శాతం, ఆటోమొబైల్ రంగానికి 9 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
మళ్లీ అమ్మకాలదే పైచేయి
ముంబై: గత వారం చివర్లో ఒక్కసారిగా జోరందుకున్న స్టాక్ ఇండెక్సులు తిరిగి తోకముడిచాయి. ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాలకే మొగ్గుచూపడంతో నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 638 పాయింట్లు పతనమై 56,789 వద్దకు చేరగా.. 207 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 16,887 వద్ద స్థిరపడింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆర్థిక మాంద్య ఆందోళనలు సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోపక్క వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణ అదుపునకు వడ్డీ రేట్ల పెంపును చేపడుతుండటం స్టాక్స్‌లో అమ్మకాలకు దారితీస్తున్నట్లు తెలియజేశారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు, ట్రెజరీ ఈల్డ్స్ జోరు సైతం ఇందుకు కారణమవుతున్నట్లు వివరించారు. ఫార్మా ఎదురీత: ఎన్ఎస్ఈలో ఫార్మా (1.1%) మినహా అన్ని రంగాలూ నీరసించాయి. ప్రధానంగా మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ 3–1.6 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్, ఐషర్, అదానీ పోర్ట్స్, టాటా కన్జూమర్, మారుతీ, హెచ్‌యూఎల్, ఇండస్ఇండ్, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ 8.4–2.2% మధ్య పతనమయ్యాయి. అయితే ఓఎన్జీసీ 4.6% జంప్‌చేయగా.. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, బీపీసీఎల్, కోల్ ఇండియా 2–1% మధ్య బలపడ్డాయి. మిడ్ క్యాప్స్ వీక్ మార్కెట్ల బాటలో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.2–0.5 శాతం డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,194 నష్టపోగా 1,356 మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తాజాగా అమ్మకాల బాట వీడీ రూ. 591 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 423 కోట్ల స్టాక్స్ విక్రయించాయి. ఎల్ఐసీ పెట్టుబడి: ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇటీవల కొద్ది రోజులుగా పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ మొత్తం 33.86 లక్షలకుపైగా షేర్లను కొనుగోలు చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ పేర్కొంది. దీంతో కంపెనీలో ఎల్ఐసీ వాటా తాజాగా 7.7 శాతానికి బలపడినట్లు వెల్లడించింది. -
ఇంట్లో పెళ్లి కోసం.. తక్కువ రిస్క్‌తో ఈ మార్గంలో ఇన్వెస్ట్ చేయండి!
నేను నా సోదరి వివాహం కోసం ప్రతి నెలా రూ.45,000 చొప్పున పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా సార్వభౌమ బంగారం బాండ్లలోనా? మన దేశంలో వివాహాలు సాధారణంగా చూస్తే తక్కువ ఖర్చుతో ముగిసేవి కావు. మీరు అనుకుంటున్నట్టు ప్రతి నెలా రూ.45,000 చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్టయితే గణనీయమైన మొత్తమే సమకూరుతుంది. వివాహం లక్ష్యం విషయంలో రాజీపడలేం. అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే. వాయిదా వేయడానికి ఉండదు. తక్కువ రిస్క్ కోరుకునే వారు అయితే మధ్యస్థ మార్గాన్ని అనుసరించాలి. అందుకుని 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్ విషయంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్‌క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ ఈ పెట్టుబడి మీ పోర్ట్‌ఫోలియో పరంగా చూస్తే స్వల్ప మొత్తం అయి, అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే.. అప్పుడు కాస్త దూకుడుగా పెట్టుబడుల సాధనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆటుపోట్లను తట్టుకునేట్టు అయితే ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి. బంగారం కోసమే అయితే సార్వభౌమ బంగారం బాండ్లలో (ఎస్‌జీబీలు) కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బంగారం విలువ పెరుగుదలకు తోడు, పెట్టుబడి విలువపై ఏటా 2.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ బంగారంతో సోదరి పెళ్లి సమయంలో ఆభరణాలు చేయించొచ్చు. ‘‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ స్టాక్ స్ప్లిట్‌నకు గురవుతోంది. రూ.10 ముఖ విలువ నుంచి రూ.1కు తగ్గనుంది. ఇందుకు సంబంధించి రికార్డు తేదీ సెప్టెంబర్ 02, 2022’’ అంటూ నాకు మెస్సేజ్ వచ్చింది. అంటే దీనర్థం ఏంటి? ఒక ఇన్వెస్టర్‌గా దీనివల్ల నాకు ఏం జరగనుంది? దయచేసి వివరాలు తెలియజేయగలరు. సాధారణంగా ఫండ్ హౌస్‌లు స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిక్విడిటీ (లభ్యత) పెంపునుకు వీలుగా స్టాక్ స్ప్లిట్ ప్రకటిస్తుంటాయి. దీనివల్ల సదరు ఈటీఎఫ్ యూనిట్ విలువ మరింత తగ్గి చిన్న ఇన్వెస్టర్లకు కూడా కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది. నిబంధనల ప్రకారం ఈటీఎఫ్ యూనిట్లను స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్ట్ చేయడం తప్పనిసరి. ఒక ఇన్వెస్టర్‌గా ఇలాంటి నిర్ణయాల వల్ల పెట్టుబడులకు సంబంధించి జరిగే మార్పు ఏమీ ఉండదు. ఈటీఎఫ్ ముఖ విలువ తగ్గడం వల్ల యూనిట్ ఎన్ఏవీ కూడా తగ్గుతుంది. అదే సమయంలో యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. ఉదాహరణకు మీకు రూ.10 ముఖ విలువ కలిగిన 100 యూనిట్లు ఉన్నాయని అనుకుందాం. రూ.1 ముఖ విలువకు యూనిట్‌ను స్ప్లిట్ చేయడం వల్ల అప్పుడు మీ వద్దనున్న 100 యూనిట్లు కాస్తా 1,000 యూనిట్లకు పెరుగుతాయి. కొత్త యూనిట్లు రికార్డు తేదీ తర్వాత మీ ఖాతాకు జమ అవుతాయి. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
ఐపీవోల్లో పెట్టుబడులు పెడుతున్నారా? ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
లిస్టింగ్‌లోనే 100 శాతం లాభం. మరొకటి లిస్టింగ్ రోజే 150 శాతం లాభం ఇచ్చింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) గురించి ఈ తరహా వార్తలు వింటుంటే రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఐపీవోలో షేర్లు అలాట్ అయితే లాభాల పంట పండినట్టే! అన్న వేలంవెర్రి కొన్ని సందర్భాల్లో మార్కెట్లో కనిపిస్తుంటుంది. కానీ, ఇది అన్ని వేళలా ఉండే ధోరణి కాదు. బుల్ మార్కెట్ యూటర్న్ తీసుకుంటే, అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటే అంచనాలు తప్పుతాయి. నష్టాలు పలకరిస్తాయి. గతేడాది మార్కెట్ల ర్యాలీ సమయంలో ఐపీవోల పట్ల ఇన్వెస్టర్లలో విపరీతమైన యూఫోరియా నెలకొంది. 2022 వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. స్టాక్స్ భారీ పతనంతో ఆ యూఫోరియా ఆవిరైపోయింది. మార్కెట్లో ఈ రకమైన అస్థిరతలు ఎప్పుడూ ఉంటాయి. అందుకే మార్కెట్లో నిలిచి గెలవాలంటే, పెట్టుబడులన్నవి లక్ష్యాలకు అనుగుణంగానే ఉండాలనేది నిపుణుల మాట. ఐపీవోల్లో పెట్టుబడి విషయంలో ఇన్వెస్టర్లు పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయాలను తెలియజేసే కథనమిది... జొమాటో షేరు ఐపీవో ఇష్యూ ధర రూ.76. లిస్టింగ్ ధర రూ.115. అక్కడి నుంచి రూ.169 వరకు వెళ్లింది. రూ.140 ధరలో ఉన్నప్పుడు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ రూ.175 వరకు పెరుగుతుందని లక్ష్యాన్ని ఇచ్చింది. కానీ, ఒక జొమాటో షేరుకు రూ.41 మించి పెట్టడం దండగని వ్యాల్యూషన్ గురువుగా ప్రసిద్ధి చెందిన అశ్వత్ దామోదరన్ ఐపీవో సమయంలోనే సూచించారు. సరిగ్గా ఆయన చెప్పినట్టు జొమాటో ఇటీవలే రూ.40.55కు పడిపోయి అక్కడి నుంచి కోలుకుంది. ఆ సందర్భంలో జొమాటో సహేతుక విలువ రూ.35 అంటూ దామోదరన్ సవరించారనుకోండి. ఒక్క జొమాటోనే అని కాదు. న్యూఏజ్ వ్యాపారాల్లో ఉన్న అన్ని ఐపీవోలు లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చినవే. అందుకే లాభాల వెర్రితనం కాకుండా.. విలువలకు ప్రాధాన్యం ఇచ్చి ఇన్వెస్ట్ చేయడం ద్వారానే విలువైన క్యాపిటల్‌ను కాపాడుకోవచ్చని మార్కెట్ పండితుల సూచన. 2021 జూలైలో జొమాటో ఐపీవోకు వచ్చింది. బ్లాక్‌బస్టర్‌గా 38 రెట్లు అధిక స్పందన అందుకుంది. రూ.9,000 కోట్ల ఐపీవోకు ఈ స్థాయి స్పందన అంటే చిన్నదేమీ కాదు. లిస్టింగ్‌లోనే 64 శాతం లాభాన్ని పంచింది. నైకా అయితే లిస్టింగ్ రోజే 96 శాతం లాభాలను ఇచ్చింది. ‘‘ఐపీవోలో ఒక కంపెనీ జారీ చేసే షేరు ధరను నిర్ణయించే విధానం ఈ ఏడాది మార్చి 31వరకు వేరుగా ఉంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు సైతం నిధుల లభ్యత దండిగా ఉంది. దీంతో వారు రుణం తీసుకుని మరీ ఐపీవోలకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో రెట్ల అధిక స్పందనతో రిస్క్ తీసుకునే ధోరణి పెరిగి ఆయా షేర్ల ధరల వృద్ధికి దారితీసింది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఐపీవో నిబంధనల్లో మార్పు చోటు చేసుకుంది. దీంతో ఆ తర్వాత నుంచి వచ్చిన ఐపీవోల్లో కేవలం ఒక్క ఇష్యూలోనే అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్ల కోటా (హెచ్ఎన్ఐలు) డబుల్ డిజిట్లో సబ్స్క్రయిబ్ కావడం గమనించాలి’’అని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ ‘క్రిస్’ డైరెక్టర్ అర్జున్ కేజ్రీవాల్ తెలిపారు. గతేడాది ఐపీవోకు వచ్చిన, కొత్తగా లిస్ట్ అయిన వాటిల్లో అధిక శాతం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా పడిపోవడాన్ని గమనించొచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ముఖ్యంగా గడిచిన ఆరు నెలల్లో ఇవి ఎక్కువ నష్టాలను చవిచూశాయి. ఎన్నో ఉదాహరణలు... ప్రస్తుతం జొమాటో ధర (రూ.60)ను చూస్తే గరిష్ట స్థాయి (రూ.169) నుంచి 60 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తుంది. పాలసీబజార్ (పీబీ ఫిన్‌టెక్) గరిష్ట ధర (రూ.1,470) నుంచి చూస్తే 65 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. నైకా (ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్) గరిష్ట ధర రూ.2,574 కాగా, 47 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. ఇక పేటీఎం అయితే ఇష్యూ ధర రూ.2,150 కాగా, 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,961 మాత్రమే. ఈ ధర నుంచి చూస్తే 60 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. భారీ నష్టాల్లో ఉన్న న్యూఏజ్ కంపెనీలు, టెక్నాలజీ సంస్థలు ఐపీవోలకు వచ్చి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించడాన్ని చూశాం. ఆన్లైన్ ఫార్మసీ సంస్థ ఫార్మ్ఈజీని ప్రమోట్ చేస్తున్న ఏపీఐ హోల్డింగ్స్ కూడా నష్టాల్లో నడుస్తున్నదే. ఈ సంస్థ కూడా ఐపీవోకు దరఖాస్తు పెట్టుకుంది. కానీ, న్యూఏజ్ వ్యాపార కంపెనీల షేర్లు పేకమేడల్లా కూలిపోతున్న తరుణంలో, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో ఐపీవోకు రావడం తగదని భావించి ఇటీవలే తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఈ తరహా షేర్ల వ్యాల్యూషన్ నిర్ణయ విధానం సంప్రదాయానికి భిన్నమైనది. వ్యాపారంలో భారీ వృద్ధి, భవిష్యత్తులో వచ్చే లాభాల అంచనాల ఆధారంగా వీటి షేర్ల ధర నిర్ణయమవుతుంటుంది. సుదీర్ఘకాలం పాటు (5–10–15–20 ఏళ్లు) వేచి చూస్తేనే.. ఇవి నిలిచి గెలుస్తాయా? లాభాలు కురిపిస్తాయా? అన్నది తేలుతుంది. కానీ, వీటిపై పెద్దగా అవగాహన లేని, ప్రణాళిక లేని ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల కోసం, స్వల్పకాల లాభాల కోసం వీటికి దరఖాస్తు చేసుకుని నష్టపోయారు. అంతెందుకు ఎల్ఐసీ ఐపీవోనే తీసుకుందాం. దేశవ్యాప్తంగా అధిక శాతం ఇన్వెస్టర్లలో మంచి అంచనాలే ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు, పాలసీదారులకు ఇష్యూ ధరలో డిస్కౌంట్ కూడా లభించింది. కానీ, లిస్టింగ్‌లో నిరాశపరించింది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి అది నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. ఒక్కో షేరు జారీ ధర రూ.949 కాగా, బీఎస్ఈలో నమోదైన గరిష్ట ధర రూ.920. అక్కడి నుంచి 30 శాతం నష్టపోయి రూ.700కు దిగువన ట్రేడ్ అవుతోంది. ఎల్ఐసీ బీమా రంగంలో గొప్ప కంపెనీ. భారీ లాభాల్లో ఉన్న బ్లూచిప్ సంస్థ. ఆ రంగంలో లీడర్. అయినా కానీ లిస్టింగ్‌లో లాభాలు పంచలేకపోయింది. దీనికి కారణం ప్రతికూల మార్కెట్ పరిస్థితులకుతోడు, ఎల్ఐసీ అధిక వ్యాల్యూషన్పై ఐపీవో రావడాన్ని కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం కోసం ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఈ నష్టాల బెడద ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ మన దేశంలో బీమా వ్యాప్తి 5 శాతం మించలేదు. కనుక భవిష్యత్తులో వ్యాపార వృద్ధి అవకావాలు దండిగా ఉన్నాయి. అయినా కానీ, స్వల్పకాలంలో లాభాలకు ఇక్కడ హామీ ఉండదు. ఎందుకంటే..? ఇటీవలి ఐపీవోల్లో ఇన్వెస్టర్ల చేతులు కాలడం వెనుక నిపుణులు ప్రధానంగా.. ఆయా కంపెనీల ఫండమెంటల్స్‌కు తోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనుకూలంగా లేకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘‘గతేడాది వ్యవస్థలో నగదు లభ్యత పుష్కలంగా ఉంది. దీంతో కొత్త టెక్నాలజీ కంపెనీల ధరలను పరుగుపెట్టించింది. ఇప్పుడు నగదు లభ్యత కఠినతరంగా మారింది. వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ షేర్లపై ప్రభావం పడింది’’అని హేమ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ఆస్తాజైన్ పేర్కొన్నారు. వీటి వైపు చూడొచ్చా..? కంపెనీల ఆర్థిక మూలాల ఆధారంగా పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్లకు రక్షణాత్మకం అని భావించొచ్చు. ‘‘జొమాటో షేరును గతేడాది ఇష్టపడని వారు లేరు. కానీ, ఇప్పుడు దీనికి అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే నికరంగా నష్టాలనే ఇచ్చింది. బ్లింకిట్ కొనుగోలుతో లాభాల్లోకి రావడానికి మరింత సమయం పడుతుంది. యాజమాన్యం ఫుడ్ డెలివరీ వ్యాపారంలో బ్రేక్ ఈవెన్‌కు సంబంధించి అంచనాలను ప్రకటించింది. ఈ విషయంలో ఇన్వెస్టర్లకు కూడా సందేహం లేదు. దీర్ఘకాల ఇన్వెస్టర్లు కొనుగోలుకు ఇదొక మంచి ఉదాహరణ అవుతుంది’’అని జెఫరీస్ తన నివేదికలో ప్రస్తావించింది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ గత నెలలో నైకా షేరుకు బై రేటింగ్ ఇచ్చింది. మార్కెటింగ్‌పై అధిక వ్యయాలతో మార్జిన్లు తగ్గుతున్నందున ఇదే నైకా స్టాక్‌కు రెడ్యూస్ (తగ్గించుకోవడం) రేటింగ్‌ను ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ప్రకటించింది. పేటీఎం, ఎల్ఐసీకి మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బై రేటింగ్ ఇచ్చింది. పాలజీబజార్కు కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ బై రేటింగ్ ఇచ్చింది. తిరిగి ఈ కంపెనీలు పూర్వపు ఆదరణ సంపాదించుకోవడానికి కొంత సమయం పడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ‘‘ఈ కంపెనీల మూలాలు మెరుగుపడాల్సి ఉంది. స్థూల ఆర్థిక వాతావరణం కూడా అనుకూలించాలి’’అని ఆస్తాజైన్ పేర్కొన్నారు. మిస్ అయిపోతామన్న భయం వద్దు ఒక స్టాక్‌ను మిస్ అయిపోతామన్న ధోరణి (ఫోమో)కి దూరంగా ఉండాలన్నది స్టాక్ మార్కెట్ల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠంగా సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ‘టీబీఎంజీ క్యాపిటల్’ వ్యవస్థాపకుడు తరుణ్ బిరానీ తెలిపారు. ఈ విధమైన ధోరణిని అనుసరించకుండా, ఆర్థిక లక్ష్యాలకు కట్టుబడి ఉంటే అది ప్రయోజనాన్ని ఇస్తుందని చెప్పారు. ఇన్వెస్టర్లకు స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి, కావాల్సిన క్యాపిటల్ ఉంటే లాభాలను ఇవ్వదు. లక్ష్యాలు, కాల వ్యవధి పట్ల స్పష్టత ఉండాలి. అప్పుడు తమ కాలవ్యవధి, రాబడుల అంచనాలకు అనుకూలమైన స్టాక్స్‌లో పెట్టుబడి చేసుకోవచ్చు. ఐదేళ్లు లేదా పదేళ్ల కోసం, భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తుందన్న అంచనాలతో ఐపీవోలో ఇన్వెస్ట్ చేస్తే, లిస్టింగ్ తర్వాత నష్టాల్లోకి వెళ్లిందని విక్రయించాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు లాభాల్లోకి వస్తామన్నది తమకు తెలియదని జొమాటో ఫౌండర్ గోయల్ ఐపీవో ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. దీర్ఘకాలం కోసమే తాము వ్యాపారాన్ని నిర్మిస్తున్నామనే అంటున్నారు. కనుక దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. ∙ కొందరు లిస్టింగ్ రోజు లాభం వస్తే విక్రయించుకోవచ్చన్న ఒకే ఆలోచనతో డిమాండ్ ఉన్న ఐపీవోల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి వారు లిస్టింగ్ రోజు లాభం వచ్చినా, నష్టం వచ్చినా సరే విక్రయించుకోవాల్సిందే. జొమాటో ఐదేళ్లలో లాభాల్లోకి వస్తుందని అంచనా వేసుకుని ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పటి వరకు వేచి చూసి, కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్తు ఆధారంగా నిర్ణయానికి రావాలి. స్టాక్స్ ఎప్పుడూ పడి లేచే కెరటాలే. కాకపోతే మంచి యాజమాన్యం, బలమైన వ్యాపార మూలాలు ఉన్న కంపెనీలకే ఇది అమలవుతుంది. ఇక అసలు నష్టాల్లో ఉన్న కంపెనీల జోలికి వెళ్లకపోవడం రిస్క్ వద్దనుకునే వారికి మెరుగైన మార్గం. వివిధ రంగాల్లో లీడర్లుగా ఉన్న బ్లూచిప్ కంపెనీల్లో రిస్క్ దాదాపుగా ఉండదు. రాబడులు మోస్తరుగా ఉంటాయి. అధిక రాబడి ఆశించే వారు, అధిక రిస్క్ తీసుకుంటున్నట్టే. అది కూడా తగినంత అధ్యయనం, నిపుణుల సూచనల ఆధారంగా కాలిక్యులేటెడ్ రిస్క్‌కే పరిమితం కావాలి. -
'మా వాటా మేం అమ్మేస్తున్నాం'..జొమాటోకు మరో షాక్!
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్..దేశీయ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటోకు భారీ షాకిచ్చింది. ఆ సంస్థలో ఉన్న 7.8శాతం స్టేక్‌ను అమ్మేందుకు ఉబర్ సిద్ధమైంది. 7.8 శాతం వాటాల అమ్మకంతో ఉబర్‌కు రూ.3,305 కోట్ల వస్తాయని అంచనా వేస్తుంది. తక్కువలో తక్కువ డీల్ పరిమాణం రూ.2,938.6 కోట్లు ఉండనుంది. భారత్‌లో ఉబర్ తన ఫుడ్ డెలివరీ విభాగమైన ఉబెర్ ఈట్స్‌ను జొమాటోకు అమ్మేసింది. ఆ సమయంలో ఉబర్..జొమాటోలో వాటాను కొనుగోలు చేసింది. ఆ సమయంలో స్టాక్ లావాదేవీ డీల్ విలువ రూ.1,376 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆ స్టేక్‌ను ఉబర్ అమ్మేయడంతో ఉబర్‌కు కనీసం 2.5శాతం లాభం పొందవచ్చని భావిస్తోంది. పోటీ పడుతున్న అమెరికన్ కంపెనీలు జొమాటోలో ఉన్న తన వాటాను ఆగస్ట్ 5కి క్లోజ్ చేయాలని ఉబర్ భావిస్తుంది. ఈ తరుణంలో జొమాటోలోని తన షేర్లను ఉబర్ ఎవరికి అమ్మేస్తుందని అంశంపై టర్మ్ షీట్లో వెల్లడించలేదు. అయినప్పటికీ ఉబర్ అమ్మే 7.8% వాటాను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన అనేక మంది సంస్థాగత పెట్టుబడిదారులు పోటీ పడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వెయ్యి కోట్లు లాస్ జొమాటో ప్రీ-ఐపీవో వాటాదారులకు ఒక సంవత్సరం లాక్ ఇన్ పీరియడ్ జులై 23న ముగిసింది. లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన వారం తర్వాత ఉబర్ తన జొమాటోలోని తన వాటాల్ని అమ్మేందుకు సిద్ధమైనట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత మార్కెట్ ప్రారంభమైన జులై 25 ఒక్కరోజే జొమాటో సుమారు వెయ్యి కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. -
Elon Musk:'రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు'!
ఊహించినట్లే జరిగింది. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మెర్జర్ అగ్రిమెంట్ నిబంధల్ని ఉల్లంఘించిందంటూ 44 బిలియన్ డాలర్ల ట్విట్టర్ కొనుగోలు ఢీల్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎలన్ మస్క్ నిర్ణయంపై ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసేలా చట్టపరమైన చర్యలకు దిగుతామని అన్నారు. కానీ మస్క్ ఏం చేశాడో తెలుసా? 'రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు'అన్న చందంగా ఎలన్ మస్క్ వ్యవహరిస్తున్నారు. ట్విట్టర్ డీల్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు మస్క్ ప్రకటనతో టెస్లాలో పెట్టుబడిన మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ మస్క్ మాత్రం యథావిధిగా తనకు సంబంధం లేనివాటిపై స్పందిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రాంటర్ చూస్తూ ప్రసంగించే అలవాటుంది. ఎప్పటిలాగే 'రీ ప్రొడక్టివ్ రైట్స్' గురించి బైడెన్ ప్రాంప్టర్ చూస్తూ మాట్లాడుతున్నారు.ప్రసంగంతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాంప్టర్‌లో ఉన్నట్లుగా 'రిపిటీ ద లైన్' అనే పదాన్ని పదే పదే పలుకుతూ తడబడ్డారు. ప్రసంగం మధ్యలోనే ఆపేశారు. బైడెన్ ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ మస్క్ ట్విట్ చేశారు. Whoever controls the teleprompter is the real President! pic.twitter.com/1rcqmwLe9S — Elon Musk (@elonmusk) July 8, 2022 మస్క్ ఇదేం పద్దతయ్యా 2004లో సెటైరికల్ కామెడీ సినిమా 'యాంకర్ మ్యాన్' తెరకెక్కింది. ఆ సినిమాలోని 'రాన్ బుర్గుండి' యాంకర్ క్యారక్టర్ సీన్లను ట్వీట్ చేస్తూ.. ఎవరు టెలిప్రాంప్టర్ను కంట్రోల్ చేస్తారో వాళ్లే నిజమైన ప్రెసిడెంట్లు అని ట్విట్లో పేర్కొన్నారు. కానీ మస్క్ ట్విట్టర్ డీల్ క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ తరహా ట్విట్లు చేయడంపై మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మస్క్ ఇదేం పద్దతయ్యా. 'రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు' తాము నష్టపోతుంటే ఈ తరహాలో ప్రవర్తించడం సరికాదంటున్నారు. వాళ్ల ఆందోనకు అర్ధం ఉంది! అదే సమయంలో మదుపర్ల ఆందోళనకు అర్ధం ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎలన్ మస్క్ ట్విట్టర్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మదుపర్లు టెస్లాపై చేసిన పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవడంతో భారీగా నష్టపోయారు. టెస్లా 126 బిలయన్ డాలర్ల సంపద ఆవిరైంది. కానీ ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ ఢీల్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు మస్క్ ప్రకటనతో వారికి నష్టం ఏ తరహాలో ఉంటుందోనని మదనపడుతున్నారు. -
వేల కోట్ల డీల్..జొమాటో చేతికి ప్రముఖ కంపెనీ!
న్యూఢిల్లీ: బ్లింక్ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్(గతంలో గ్రోఫర్స్ ఇండియా)ను కొనుగోలు చేయనున్నట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,447.5 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. షేర్ల మార్పిడి ద్వారా కంపెనీని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. శుక్రవారం సమావేశమైన బోర్డు బ్లింక్ కామర్స్‌కు చెందిన 33,018 ఈక్విటీ షేర్ల కొనుగోలుకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఒక్కో షేరుకి రూ. 13.45 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొంది. కాగా.. జొమాటోకు చెందిన 62.85 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించడం ద్వారా లావాదేవీని పూర్తి చేయనున్నట్లు వివరించింది. రూ. 1 ముఖవిలువగల ఒక్కో షేరునీ రూ. 70.76 సగటు ధరలో జారీ చేయనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే బీసీపీఎల్‌లో 1 ఈక్విటీ షేరుతోపాటు మరో 3,248 ప్రిఫరెన్స్ షేర్లను కలిగి ఉంది. క్విక్ కామర్స్ బిజినెస్‌లో పెట్టుబడి వ్యూహాలకు అనుగుణంగా బీసీపీఎల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు జొమాటో ఈ సందర్భంగా పేర్కొంది. బ్లింకిట్ బ్రాండుతో బీసీపీఎల్ ఆన్లైన్ క్విక్ కామర్స్ సర్వీసులను అందిస్తున్న విషయం విదితమే. కాగా, బ్లింకిట్ కొనుగోలు తదుపరి రెండు కంపెనీల యాప్స్ విడిగా కొనసాగనున్నట్లు జొమాటో వెల్లడించింది. కాగా, ఈ వార్తల నేపథ్యంలో జొమాటో షేరు నామమాత్ర లాభంతో రూ. 70.15 వద్ద ముగిసింది. -
షేర్లు ‘సిప్’ చేస్తారా? ఇదుగో మీకు కావాల్సిన సమాచారం
మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) గురించి తెలుసు. వారం/పక్షం/మాసం లేదా త్రైమాసికం.. వీటిల్లో ఎంపిక చేసుకున్న నిర్ణీత కాలానికి ఒకసారి బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిగ్గా మ్యూచువల్ ఫండ్ పథకంలోకి పెట్టుబడి వెళుతుంది. ఇదే సిప్‌ను నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకూ సాధనంగా వినియోగించుకోవచ్చు. ఇన్వెస్టర్లు తాము నిర్ణయించుకున్నన్ని షేర్లను నిర్ణీత కాలానికోసారి ఆటోమేటిగ్గా కొనుగోలు చేసుకునే సిప్ సదుపాయాన్ని స్టాక్ బ్రోకర్లు ఆఫర్ చేస్తున్నారు. అయితే, ఇది అందరికీ కాదు.. ఈక్విటీల పట్ల లోతైన అవగాహన, రిస్క్‌లు తెలిసిన వారికే. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ మార్గమే బెటర్. నేడు సమాచార వ్యాప్తి విస్తృతి కారణంగా గతంతో పోలిస్తే సిప్‌కు ఎంతో ఆదరణ పెరిగింది. ప్రతి నెలా రూ.11,000 కోట్లకు పైనే సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడులు వస్తున్నాయి. ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో రూ.1,000 ప్రతి నెలా సిప్‌గా నిర్ణయించుకుంటే.. నిర్ణీత రోజున ఆ మొత్తం ఆ పథకంలో పెట్టుబడిగా చేరిపోతుంది. అదే స్టాక్స్‌లో అయితే ఎంపిక చేసుకున్నన్ని షేర్లు సిప్ రూపంలో డీమ్యాట్ ఖాతాలోకి చేరిపోతాయి. ఇన్వెస్టర్ తరఫున స్టాక్ బ్రోకర్లు ఈ సేవను ఆఫర్ చేస్తున్నారు. ప్రతి నెలా ఏ తేదీన, ఏ కంపెనీ షేర్లను ఎన్ని కొనుగోలు చేయాలన్నది ఇన్వెస్టర్లు చెబితే చాలు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అయితే ఎంత మొత్తం ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. సొంతంగా వేసుకునే సిప్ (డీఐవై సిప్) ఏ షేర్లలో సిప్ చేసుకోవాలన్నది ఇన్వెస్టర్లు నిర్ణయించుకోవాలి. ఒక్క కంపెనీయే అని కాదు.. ఒకటికి మించిన స్టాక్స్‌లో సిప్ ఏర్పాటు చేసుకోవచ్చు.. దీనివల్ల పెట్టుబడుల్లో వైవిధ్యం నెలకొంటుంది. తద్వారా పెట్టుబడుల్లో రిస్క్ తగ్గించుకోవచ్చు. స్టాక్ సిప్‌లను కావాలనుకున్నప్పుడు నిలిపివేసు కోవచ్చు. లేదా రద్దు చేసుకోవచ్చు. ఎప్పుడైనా పెట్టుబడులకు ఇబ్బంది అనిపించినప్పుడు నిలిపివేసుకునే సౌలభ్యం ఇన్వెస్టర్లకు ఉంటుంది. ట్రేడింగ్ ఖాతా నుంచే సిప్‌లో మార్పులు (మోడిఫై) చేసుకోవచ్చు. స్టాక్‌ను మార్చుకోవచ్చు. అలాగే, సిప్ రూపంలో కొనుగోలు చేయాల్సిన స్టాక్స్ సంఖ్యను కూడా మార్చుకోవచ్చు. కొందరు బ్రోకర్లు ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడయ్యే ఈటీఎఫ్‌ల్లోనూ సిప్ అవకాశాన్ని కల్పిస్తున్నారు. చార్జీలు నిల్...! ఏ సేవ అయినా అందులో చార్జీలు ఉంటాయని తెలిసిం దే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్టివ్ ఫం డ్స్ సాధారణంగా 2.5% వరకు ఎక్స్పెన్స్ రేషియో పేరిట చార్జ్ వసూలు చేస్తున్నాయి. అంటే ఏటా ఇన్వెస్టర్ల పెట్టుబడి వి లువ నుంచి ఈ మేరకు అవి మినహాయించుకుంటాయి. కానీ, స్టాక్ సిప్ విషయానికొస్తే ఎ క్కువ బ్రోకరేజీ సంస్థలు ప్రత్యేకంగా చార్జీలు తీసు కోవడం లేదు. ఈక్విటీ డెలివరీగానే వాటిని చూస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డెలివరీ లావాదేవీలపై 0.5% బ్రోకరేజీ వసూ లు చేస్తోంది. కొందరు బ్రోకర్లు అసలు డెలివరీకి ఎటువం టి చార్జీ తీసుకోవడం లేదు. జెరోదా, అప్‌స్టాక్స్ ఇవన్నీ డెలివరీకి జీరో బ్రోకరేజీ అమలు చేస్తున్నాయి. కనుక ఆయా సంస్థల్లో స్టాక్ సిప్ ఉచితమే. కాకపోతే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తరఫున లావాదేవీ చార్జీ స్వల్పంగా 0.00345 ఉంటుంది. దీనిపై 18% జీఎస్టీ ఉన్నా కానీ, ఈ చార్జీ చాలా కొద్ది మొత్తమే. రిస్క్‌లు కూడా ఉన్నాయ్.. మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లతో పోలిస్తే స్టాక్స్ సిప్‌తో రిస్క్ ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నవి నిపుణుల ఆధ్వర్యంలో నడిచేవి. అవి ఏ ఒకటి, రెండు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవు. 25 నుంచి 75 స్టాక్స్ వరకు తమ పోర్ట్‌ఫోలియోలో నిర్వహిస్తుంటాయి. పెట్టుబడుల పరిమాణాన్ని బట్టి స్టాక్స్ సంఖ్యను నిర్ణయిస్తుంటాయి. అది కూడా భిన్న రంగాలకు చెందిన, బిన్న సైజు (లార్జ్, మిడ్, స్మాల్) కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ వైవిధ్యాన్ని పాటించగలవు. తద్వారా పెట్టుబడులపై రిస్క్‌ను తగ్గిస్తాయి. కానీ, రిటైల్ ఇన్వెస్టర్ నేరుగా సిప్ రూపంలో స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుంటే అది ఒకటి లేదా రెండు స్టాక్స్‌కు పరిమితం కావచ్చు. దీనివల్ల రిస్క్ అధిక పాళ్లలో ఉంటుంది. సిప్ కోసం ఎంపిక చేసుకున్న రెండు కంపెనీల్లో ఒక కంపెనీలో ఏదైనా అక్రమాలు బయటపడితే.. వ్యాపార విధానంలో తేడా వచ్చి చతికిలపడితే అప్పుడు ఎదుర్కొనే రిస్క్ అధికంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకాదు కొన్నేళ్ల పాటు అలా సిప్ చేసుకుంటూ వెళితే.. మీ పెట్టుబడుల్లో అధిక భాగం అలా ఒకటి రెండు కంపెనీల్లోనే పోగుపడిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు, పరిశోధన బృందం మార్కెట్ తీరు, పరిస్థితుల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. భావోద్వేగ నిర్ణయాలకు సాధ్యమైనంత దూరంగా పనిచేస్తుంటారు. పెట్టుబడుల విధానాలు తెలిసి ఉంటారు. ఎంతో లోతైన, విస్తృత అధ్యయనం చేసి, నమ్మకం కలిగితేకానీ ఒక కంపెనీలో ఎక్స్పోజర్ తీసుకోరు. కానీ, రిటైల్ ఇన్వెస్టర్లు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విధమైన పరిశోధన, అధ్యయనం చేస్తారా? దాదాపు లేదనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంది. స్టాక్ సిప్ కోసం ఎంపిక చేసుకున్న కంపెనీ.. సమర్థవంతమైనది కాకపోతే నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్ల గురించి తెలిసి, మంచి విజ్ఞానం ఉన్న వారికి స్టాక్ సిప్ అనుకూలిస్తుంది. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి.. రాబడులా లేక నష్టాలా అన్నది ముఖ్యంగా ఎంపికపైనే ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. అంత పరిజ్ఞానం ఉన్న వారికే స్టాక్సిప్. లేదంటే నిపుణుల ఆధ్వర్యంలో నడిచే మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ చేసుకోవడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్లు అసలు స్టాక్ సిప్ గురించి ఆలోచించకపోవడమే మంచిది. ప్రయోజనం ఉందా..? ఒక కంపెనీ స్టాక్ ధర ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు. తగ్గుతూ పెరుగుతుండడం సాధారణం. సిప్ రూపంలో అయితే తగ్గినప్పుడు, పెరిగినప్పుడు పెట్టుబడి పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకేసారి పెట్టుబడులు పెట్టే వెసులుబాటు లేని ఇన్వెస్టర్లు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అటువంటి వారు సిప్ రూపంలో దీర్ఘకాలంలో నచ్చిన కంపెనీలో వాటాలను పోగు చేసుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు లోనైనప్పుడే ఇన్వెస్ట్ చేయాలని వేచి చూసే అవస్థ, అయోమయానికి స్టాక్ సిప్ పరిష్కారం చూపుతుంది. ఎందుకంటే మార్కెట్లు పడినా, పెరిగినా సిప్ రూపంలో వాటిని కొనుగోలు చేస్తుంటారు కనుక ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ (ఫోమో)’ను అధిగమించొచ్చు. ఫోమో అంటే ఒకవేళ వెంటనే కొనుగోలు చేయకపోతే ఆ స్టాక్ ధర పెరిగిపోతుందేమో, చేయి దాటిపోతుందేమో? అన్న ఆందోళన. ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఫోమో కారణంగానే స్టాక్స్‌ను గరిష్ట వ్యాల్యూషన్ల వద్ద కొనుగోలు చేస్తుంటారు. అక్కడి నుంచి స్టాక్స్ పడిపోతుంటే భయంతో అమ్మి బయటపడదామని భావిస్తుంటారు. సిప్ అయితే ఈ తలనొప్పి ఉండదు. -
నిధుల బాటలో ఐనాక్స్ విండ్..ఎన్ని వందల కోట్లంటే!
న్యూఢిల్లీ: విండ్ ఎనర్జీ సంస్థ ఐనాక్స్ విండ్ నిధుల సమీకరణ బాట పట్టింది. ఈక్విటీ షేర్ల, మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 402.5 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. ప్రిఫరెన్షియల్ మార్గంలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ప్రమోటర్లు రూ. 150 కోట్లు సమకూర్చనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ప్రమోటరేతర విదేశీ కంపెనీ సమేనా గ్రీన్ లిమిటెడ్ ప్రిఫరెన్షియల్ షేర్లు, మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 153 కోట్లు అందించనున్నట్లు పేర్కొంది. ఇదే విధంగా లెండ్ లీజ్ కంపెనీ ఇండియా సైతం రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. -
బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ!
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టంతో ముగిసింది. పెరిగిన క్రూడాయిల్ ధరలతో ద్రవ్యోల్బణ ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. మెగా విలీన ప్రకటనతో సోమవారం ట్రేడింగ్‌లో భారీగా ర్యాలీ చేసిన హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడు శాతం క్షీణించి రూ.1607 వద్ద, హెచ్డీఎఫ్సీ షేరు రెండు శాతం పతనమై రూ.2,622 వద్ద ముగిశాయి. వీటితో పాటు రిలయన్స్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రెండు నుంచి ఒకశాతం నష్టపోయాయి. అధిక వెయిటేజీ షేర్ల పతనంతో సెన్సెక్స్ 435 పాయింట్లు నష్టపోయి 60,177 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లు క్షీణించి 18వేల దిగువున 17,957 వద్ద నిలిచింది. దీంతో సూచీల రెండురోజుల ర్యాలీకి బ్రేక్ పడినట్లైంది. మరోవైపు ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఇంధన రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.375 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.105 కోట్లను కొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తిరిగి పెరిగిన క్రూడాయిల్ ధరలతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్ మార్కెట్లు పనిచేయలేదు. థాయ్‌లాండ్ సూచీ స్వల్పంగా నష్టపోయింది. ఇండోనేíసియా, జపాన్ సింగపూర్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం లాభపడ్డాయి. యూరప్‌లో ఫ్రాన్స్ మార్కెట్ ఒకటిన్నర శాతం, జర్మనీ స్టాక్ సూచీ అరశాతం, బ్రిటన్ మార్కెట్ 0.10 పావుశాతం నష్టపోయాయి. ఇంట్రాడే కనిష్టం వద్ద ముగింపు స్టాక్ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 175 పాయింట్లు పెరిగి 60,786 వద్ద, నిఫ్టీ పాయింట్లు పెరిగి 18,081 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం, ఆర్బీఐ సమావేశం ఆరంభ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో అమ్మకాలు సూచీల పతనాన్ని శాసించాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. ఒక దశలో సెన్సెక్స్ 545 పాయింట్లు క్షీణించి 60,067 స్థాయికి, నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 17,921 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ‘‘గత 5–6 నెలల కన్సాలిడేషన్ తర్వాత మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ఆకర్షణీయమైన ధరల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అందుకే లార్జ్‌క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైనా.., చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం, వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణ తదితర పరిణామాలను విస్తృతస్థాయి మార్కెట్ డిస్కౌంట్ చేసుకుంది. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లోనూ మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల ర్యాలీ మరింత కొంతకాలం కొనసాగవచ్చు’’ అని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు మార్కెట్లో మరిన్ని సంగతులు ►రెస్టారెంట్ భాగస్వాములతో (ఆర్పీ) వ్యాపార లావాదేవీల్లో అనుచిత విధానాలకు పాల్పడుతున్న అభియోగాలపై విచారణ జరపాలంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలతో జొమాటో షేరు 3% నష్టపోయి రూ.83.85 వద్ద స్థిరపడింది. ► పేమెంట్స్ కెనడాతో వ్యూహాత్మక వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో టీసీఎస్ షేరు ఇంట్రాడేలో 2% పెరిగి రూ.3,836 వద్ద ఆరువారాల గరిష్టాన్ని తాకింది. చివరికి ఒకశాతం నష్టంతో రూ.3,814 వద్ద స్థిరపడింది. ► దివాళా పరిష్కార చట్టం కింద ఎస్సార్ పవర్ ఎంపీ సంస్థ చేజిక్కించుకోవడంతో అదానీ పవర్ షేరు పదిశాతం పెరిగి రూ.232 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. -
లాంగ్ టర్మ్‌లో మంచి ప్రాఫిట్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఇవే!
2020 ఫిబ్రవరి నుంచి చూస్తే ఈక్విటీ మార్కెట్లలో ఎన్నో ఆటుపోట్లను గమనించొచ్చు. కరోనా వచ్చిన సమయంలో అమ్మకాల ఒత్తిడికి షేర్ల ధరలు కకావికలం అయ్యాయి. ఆ తర్వాతి మూడు–ఆరు నెలలకే మార్కెట్లు ర్యాలీ బాటలో కుదురుకుని ఏడాదిన్నర పాటు నాన్ స్టాప్ ర్యాలీ చేశాయి. ఇప్పుడు గత ఆరు నెలలుగా అమ్మకాల ఒత్తిడిని చూస్తున్నాయి. మార్కెట్ల గరిష్టాల్లో ఇన్వెస్ట్ చేయకపోయినా, కనిష్టాల్లో పెట్టుబడులు కొనసాగించడం పెట్టుబడుల ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టే వారికి ఈ పెరుగుదల, తరుగుదలతో సంబంధమే లేదు. ఎందుకంటే ఎక్స్ అనే షేరును మార్కెట్ ర్యాలీలో సిప్ ద్వారా రూ.100కు కొనుగోలు చేస్తారు. అదే షేరును దిద్దుబాటులో రూ.80–70కు కూడా కొనుగోలు చేస్తారు. కొనుగోలు సగటు అవుతుంది. ఇక మార్కెట్లలో ఎన్నో విభాగాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అందులో ఫోకస్డ్ ఫండ్స్ గురించి తప్పక చెప్పుకోవాలి. పోర్ట్‌ఫోలియోలో బండెడు స్టాక్స్‌ను పోగేసుకోకుండా.. చాలా పరిమిత స్టాక్స్‌నే ఎంపిక చేసుకుంటాయి. వాటిపైనే ఫండ్ మేనేజ్మెంట్ బృందం దృష్టి ఉంటుంది. కనుక వీటి రాబడుల్లో ఎక్కువ స్థిరత్వం ఉంటుందని ఆశించొచ్చు. ఈ విభాగంలో యాక్సిస్ ఫోకస్డ్ 25 మ్యూచువల్ ఫండ్ పథకం మంచి పనితీరుతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాబడులు ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 15 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 18 శాతం, ఐదేళ్ల కాలంలో 17 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకం సొంతం. మూడేళ్లు అంతకుమించిన కాలాల్లో బెంచ్ మార్క్ పనితీరు కంటే మెరుగైన రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఈ పథకం 2012లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు వార్షిక రాబడులు సగటున 16 శాతం పైనే ఉండడం మెరుగైన పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఫోకస్డ్ ఫండ్స్ విభాగంలోనూ అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న పథకాల్లోనూ యాక్సిస్ ఫోకస్డ్ 25 అగ్ర పథాన ఉంది. పెట్టుబడుల వ్యూహాలు/ పోర్ట్‌ఫోలియో సెబీ నిబంధనల ప్రకారం ఫోకస్డ్ ఫండ్స్ గరిష్టంగా 30 స్టాక్స్ వరకు పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉండొచ్చు. ఈ పథకం మాత్రం 25 స్టాక్స్‌నే పరిమితిగా పెట్టుకుంది. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో 23 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే మొత్తం పెట్టుబడుల్లో 69 శాతం వరకు ఇన్వెస్ట్ చేసి ఉంది. బోటమ్ అప్ విధానాన్ని స్టాక్స్ ఎంపికకు పాటిస్తుంది. స్థిరమైన, అధిక నాణ్యతతో కూడిన వ్యాపారాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. పెట్టుబడుల్లో సగం మేర తక్కువ అస్థిరతలు కలిగిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించుకునే వ్యూహాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ పరిస్థితులు, స్టాక్స్ వ్యాల్యూషన్లను గమనిస్తూ, రిస్క్ ఎక్కువగా ఉన్న విభాగం నుంచి తక్కువగా ఉండే విభాగానికి పెట్టుబడులను మళ్లించే వ్యూహాలను పాటిస్తుంది.ఈ పథకం నిర్వహణలో 19,777 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 90 శాతాన్నే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన మేర డెట్ సాధనాల్లో పెట్టింది. పెట్టుబడుల్లోనూ లార్జ్‌క్యాప్‌లోనే 94 శాతం ఇన్వెస్ట్ చేయగా, మిడ్‌క్యాప్‌నకు 5.65 శాతం కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, పెట్టుబడుల్లో 35.5 శాతం మేర వీటిల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత సర్వీసెస్, టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగంలోని కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. -
వారెవ్వా..! లక్ష పెట్టుబడి పెడితే..రూ.31లక్షలు లాభం
స్టాక్ మార్కెట్ కోరికలకు రెక్కలు తొడిగే లెక్కల ప్రపంచం. కోట్లమంది తలరాతలు మార్చే ఇన్వెస్టర్ల ప్రపంచం. ముఖ్యంగా కేపిటల్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ముదుపర్లు మెగస్టార్లు అవుతున్నారు. ముఖ్యంగా పెన్నీ స్టాక్స్ కొనుగోలు చేసిన మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ స్టాక్స్ స్వర్గంలా కనిపిస్తున్నాయి. అలాంటి మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల కలల్ని నిజం చేసింది సూరజ్ ఇండస్ట్రీస్ స్టాక్స్. గత ఆరు నెలల్లో తన వాటాదారులు 3,378% రాబడి పొందారు. జూన్ 2, 2021న రూ. 2.14 వద్ద ఉన్న పెన్నీ స్టాక్ ఈరోజు బీఎస్ఈలో రూ.74.45 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఆరు నెలల క్రితం సూరజ్ ఇండస్ట్రీస్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన రూ.లక్ష మొత్తం నేడు రూ.34.78 లక్షలుగా మారింది. ఈ ఆరునెలల కాలంలో సెన్సెక్స్ 12.5% పెరిగింది. గత 21 సెషన్లలో ఈ స్టాక్ 175.2% లాభపడింది. ఈరోజు బీఎస్ఈ షేరు 4.93% లాభంతో రూ.74.45 వద్ద ప్రారంభమైంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.64.40 కోట్లకు చేరింది. అంతేకాదు సంస్థ మొత్తం 150 షేర్లు బీఎస్ఈలో రూ. 0.11 లక్షల టర్నోవర్‌తో వృద్దిని సాధించింది. సూరజ్ ఇండస్ట్రీస్ షేర్ 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల సగటు కంటే ఎక్కువగా ట్రేడవుతోంది. ఒక నెలలో ఈ స్టాక్ 162% లాభపడింది. సెప్టెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో,ఐదుగురు ప్రమోటర్లు 59.19% వాటాను లేదా 43.08 లక్షల షేర్లను కలిగి ఉన్నారు.15,512 పబ్లిక్ వాటాదారులు 50.19% వాటాతో రూ.43.41 లక్షల కంపెనీలను కలిగి ఉన్నారు. -
నేర్చుకో.. లాభాలు అందుకో
ఈక్విటీలు నూతన గరిష్టాలకు చేరుతుండడం యువ ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పెట్టుబడులపై చక్కని రాబడులు సొంతం చేసుకునే దిశగా వారు అడుగులు వేస్తున్నారు. గతంతో పోలిస్తే నేటి తరానికి ఉన్న అనుకూలత.. డిజిటల్ వేదికలపై సమాచారం పుష్కలంగా లభిస్తుండడం. లెర్నింగ్ యాప్‌ల సాయంతో ఈక్విటీలపై మరింత అవగాహన పెంచుకునేందుకు టెక్కీ యువత ఆసక్తి చూపిస్తోంది. జెరోదా పెట్టుబడుల మద్దతు కలిగిన ‘లెర్న్‌యాప్’కు యూజర్ల సంఖ్య ఏడాదిలోనే మూడింతలు పెరిగింది. 2020లో యూజర్ల సంఖ్య 70,000 కాగా, ఈ సంఖ్య ప్రస్తుతం 2,00,000 దాటిపోయింది. అంతేకాదు 10 లక్షల మంది ఇతరులు ఈ యాప్‌పై సమాచారాన్ని ఆన్వేషిస్తున్నారు. స్టాక్స్, క్రిప్టోలకు సంబంధించిన పాఠాలు ఇందులో వీడియోల రూపంలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. 50 లక్షల మంది యూజర్లకు చేరువ కావాలన్నది లెర్న్‌యాప్ లక్ష్యం. ‘‘2020 నుంచి మా ఆదాయంలో 300 శాతం వృద్ధి కనిపిస్తోంది. గతేడాది ఆదాయంతో పోలిస్తే 2021లో ఆదాయం 350 అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని లెర్న్‌యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రతీక్‌సింగ్ తెలిపారు. డాక్యుమెంటరీ రూపంలోని వీడియోలు, క్విజ్‌లతో ఇందులోని సమాచారాన్ని మరింత ఆసక్తికంగా మార్చే ప్రయత్నాలను లెర్న్‌యాప్ అమలు చేస్తోంది. సాధారణంగా ఆర్థిక అంశాల పట్ల ఎక్కువ మందిలో ఆసక్తి ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా రూపొందించడంపై ఈ సంస్థ దృష్టి పెట్టడం గమనార్హం. మహిళలకు ప్రత్యేకంగా.. పట్టణ మహిళల కోసం ఉద్దేశించినది ‘బేసిస్’ యాప్. క్రిప్టోలు, పెట్టుబడులపై ఈ యాప్‌లో ఆసక్తికర చర్చలు కూడా సాగుతుంటాయి. మార్కెట్లకు సంబంధించి తమ ఐడియాలను యూజర్లు ఇతరులతో పంచుకుంటుంటారు. 2019లో బేసి స్ మొదలు కాగా.. ఈ ప్లాట్‌ఫామ్‌పై మహిళా యూజర్ల సంఖ్య లక్ష దాటిపోయింది. వీరిలో ఎక్కువ మంది మిలీనియల్స్ కావడం గమనార్హం. కాలేజీ విద్యార్థినులు కూడా ఇందులో యూజర్లుగా ఉన్నారు. పెట్టుబడులను మెరుగ్గా నిర్వహించే విషయంలో నేర్చుకోవాలన్న ఆకాంక్ష వీరి లో వ్యక్తం కావడం భవిష్యత్తు పట్ల వారు ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నారో తెలుస్తోంది. ‘‘సభ్యు లు మా ప్లాట్ఫామ్లో చేరిన తర్వాత తమ ఆదాయంలో సగటున 40 శాతం మేర ఆదా చేయగలుగుతున్నారు’’ అని బేసిస్ సహ వ్యవస్థాపకురాలు దీపికా జైకిషన్ తెలిపారు. నిపుణుల సాయంతో తమ ఖర్చులను క్రమబదీ్ధకరించుకోవడం వల్లే ఇది సాధ్యమవుతున్నట్టు చెప్పారు. ఈ యాప్‌లో సభ్యత్వానికి వార్షిక చందా రూ.9,000. ‘ఫైనాన్స్’కు సంబంధించి ఎన్నో ఆరి్టకల్స్ ఈ యాప్‌పై అందుబాటులో ఉన్నాయి. ‘‘ఫైనాన్స్’ గురించి సౌకర్యవంతంగా నేర్చుకునేందుకు మహిళలకు ఒక సురక్షితమైన వేదికను ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం’’ అని జైకిషన్ వెల్లడించారు. సొంత సామర్థ్యాలపై ఆసక్తి నేటి తరానికి తాము స్వయంగా ఆర్థిక అంశాలను తెలుసుకుని, తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోవాలన్న ఆసక్తి పెరుగుతున్నట్టు ఈ సంస్థలు చెబుతున్నాయి. ఆర్థిక సలహాదారులపై ఆధారపడేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. లెర్న్యాప్ను బెంగళూరు, పుణె, ముంబై తదితర పట్టణాల నుంచి ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులు వినియోగిస్తున్నారు. ప్రాంతీయ మార్కెట్లకూ చేరువ కావాలని, హిందీతోపాటు కనీసం రెండు భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందించాలన్న ప్రణాళికతో ఉన్నట్టు ప్రతీక్‌సింగ్ తెలిపారు. ప్రతీ నెలా రూ.375 చందా చెల్లించడం ద్వారా లెర్న్‌యాప్‌పై ఎన్ని కోర్స్‌లను అయినా నేర్చుకోవచ్చు. యూజర్ల విచారణలకు నిపుణులతో జవాబులను కూడా ఇప్పిస్తోంది. నాణ్యతపై దృష్టి.. ఆన్లైన్లో ఎన్నో వేదికలపై ఫైనాన్స్‌కు సంబంధించి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కానీ, నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్న లక్ష్యంతో లెర్న్‌యాప్, బేసిస్ పనిచేస్తున్నాయి. లెర్న్‌యాప్‌పై పరిశ్రమలకు చెందిన నిపుణులు, దిగ్గజాలు చెప్పిన అనుభవ పాఠాలు అందుబాటులో ఉంటాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చైర్మన్ రామ్‌దియో అగర్వాల్, బీఎస్ఈ సీఈవో ఆశిష్ చౌహాన్, ఎడెల్వీజ్ అస్సెట్ మేనేజ్మెంట్ సీఈవో రాధికా గుప్తా, రాకేశ్ జున్‌జున్‌వాలాకు చెందిన రేర్ ఎంటర్ప్రైజెస్ సీఈవో ఉత్పల్సేత్ తదితరులు చెప్పిన అంశాలతో వీడియోలో ఈ వేదికపై ఉన్నాయి. ‘‘పరిశ్రమలకు చెందిన దిగ్గజ నిపుణులు పాఠాలు చెప్పడం సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే. అంతేకానీ, యూజర్ల నుంచి డబ్బులు సంపాదించుకోవాలని కాదు’’ అని ప్రతీక్‌సింగ్ తెలిపారు. లెర్న్‌యాప్ స్టోరీ రూపంలో వీడియోలను రూపొందిస్తోంది. తద్వారా ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ప్రతి రోజూ 45 నిమిషాల వర్క్‌షాప్‌ను, అనంతరం ప్రశ్న/జవాబుల సెషన్‌ను నిర్వహిస్తోంది. దీంతో తాము నేర్చుకున్న అంశాలపై వారిలో మరింత అవగాహన ఏర్పడే దిశగా పనిచేస్తోంది. ‘‘మేము ప్రత్యక్ష ఫలితాలను కూడా అందిస్తున్నాం. ఈ రోజు నేర్చుకుని.. పెట్టుబడులు వృద్ధి చెందేందుకు 20 ఏళ్లు వేచి చూసే విధంగా ఇది ఉండదు’’ అని ప్రతీస్ సింగ్ చెప్పడం గమనార్హం. -
సెన్సెక్స్ లాభం 364 పాయింట్లు
ముంబై: జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో సోమవారం స్టాక్ సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 364 పాయింట్లు ర్యాలీ చేసి 52,951 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 15,885 వద్ద స్థిరపడింది. ఐటీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లు జూలైలో ఊపందుకోవడంతో రియల్టీ రంగ కౌంటర్లలో కొనుగోళ్ల సందడి నెలకొంది. ఆటో కంపెనీలు జూలైలో వాహన విక్రయాల్లో రెండింతల వృద్ధిని సాధించడంతో ఈ రంగానికి చెందిన షేర్లు ఐదుశాతానికి పైగా రాణించాయి. చిన్న, మధ్య తరహా షేర్లు రాణించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 316 పాయింట్లు పెరిగి 52,901 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 15,875 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్లో నెలకొన్న సానుకూలతలతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 400 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లను ఆర్జించగలిగింది. మిడ్‌సెషన్ తర్వాత అమ్మకాల ఒత్తిడితో సూచీలు కొంత నీరసపడ్డాయి. అయితే మళ్ళీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోల్పోయిన లాభాల్ని తిరిగి ఆర్జించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1540 కోట్ల షేర్లను అమ్మగా., దేశీయ ఇన్వెస్టర్లు రూ.1506 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయంగా సానుకూలతలు... తొలి త్రైమాసికానికి సంబంధించి ఇటీవల కంపెనీలు ప్రకటించిన ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించగలిగాయి. జీఎస్టీ వసూళ్లు జూలైలో మళ్లీ రూ.లక్ష కోట్లను అధిగమించాయి. ఈ ఏడాది జూన్‌లో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 8.9 శాతం వృద్ధిని నమోదుచేసింది. దేశీయ తయారీ రంగం మూడునెలల తర్వాత జూలైలో సానుకూల వృద్ధి రేటును సాధించింది. స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగ్గా నమోదుకావడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా రికవరీ అవుతుందనే ఆశలు ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు ప్రేరేపించాయి. పటిష్టంగా ప్రపంచ మార్కెట్లు మౌలిక రంగ బలోపేతానికి లక్ష కోట్ల డాలర్లను వెచ్చించే బిల్లుకు యూఎస్ సెనెట్ ఆమోదం తెలిపింది. అక్కడి కార్పొరేట్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకుంటున్నాయి. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం ప్రారంభంలోనే లాభాల బాటపట్టాయి. గతవారంలో భారీగా పడిన ఆసియా మార్కెట్లు సోమవారం రికవరీ బాటపట్టాయి. జపాన్, చైనాల స్టాక్ సూచీలు 2% ర్యాలీ చేశాయి. హాంగ్‌కాంగ్, తైవాన్ ఇండెక్సులు ఒకటిన్నర శాతం పెరిగాయి. కొరియా, ఇండోనేషియా మార్కెట్లు ఒకశాతం లాభంతో ముగిశాయి. యూరప్‌లోని ఇటలీ, ఫ్రాన్, బ్రిటన్ సూచీలు ఒకటి నుంచి అరశాతం పెరిగాయి. అమెరికా ఫ్యూచర్లు పటిష్ట లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. -
కొత్త రిటైల్ ఇన్వెస్టర్ల రాకతో బ్రోకరేజ్ షేర్లకు గిరాకీ
కరోనా ప్రేరేపిత లాక్డౌన్లో రిటైల్ ఇన్వెస్టర్లు భారత స్టాక్మార్కెట్లోకి భారీ సంఖ్యలో వచ్చారు. రిటైల్ ఇన్వెస్టర్ల రాకతో బ్రోకింగ్ సంస్థల షేర్లకు అధిక డిమాండ్ నెలకొంది. ఈ ఏడాదిలో బ్రోకరేజ్ సంస్థలైన ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ లిమిడెట్ షేర్లు 17శాతం లాభపడ్డాయి. ఇదే సమయంలో ఎస్అండ్పీ బీఎస్ఈ ఫైనాన్స్ ఇండెక్స్ 26శాతం నష్టాన్ని చవిచూడటం గమనార్హం. డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ 5పైసా లిమిటెడ్ షేరు ఈ ఏడాదిలో దాదాపు రెట్టింతల లాభాల్ని ఆర్జించింది. ఈ కంపెనీ స్థాపించి 4ఏళ్ల తర్వాత ఈ షేరు తొలిసారిగా ఈజూన్ క్వార్టర్లో లాభాల్ని ఆర్జించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘‘స్టాక్ మార్కెట్లో 1984 నుంచి ట్రేడింగ్ చేస్తున్నాను. ఇంత స్థాయిలో రిటైల్ ఇన్వెస్టర్ల యాక్టివిటీ గతంలో ఎన్నడూ చూడలేదు. క్యాష్ మార్కెట్లో గడచిన 3-4నెలల్లో రిటైల్ వాల్యూమ్స్ రికార్డు స్థాయిలో రెట్టింపు అయ్యాయి. రిటైల్ ట్రేడింగ్ గేమింగ్ యాక్టివిటీగా మారుతోంది. చాలామంది యువకులు, గేమ్స్‌లు ఆడటానికి బదులు స్టాక్ మార్కెట్లో ఆడుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ సీఈవో సీజే జార్జ్ తెలిపారు. అగ్రరాజ్యమైన అమెరికా ఉద్దీపన ప్రకటనలు భారీ ప్రకటించడంతో అన్ని దేశాలకు చెందిన ఈక్విటీ మార్కెట్లు కనిష్టస్థాయి నుంచి రికవరిని సాధించాయి. అలాగే మనదేశంలో లాక్డౌన్ పొడగింపుతో ఇతర అసెట్స్ క్లాసెస్‌లో రాబడులు తగ్గుముఖం పట్టాయి. దీంతో భారత్ స్టాక్మార్కెట్లోకి రిటైల్ ఇన్వెస్టర్ల రాక గతంలో కంటే భారీగా పెరిగింది.కొత్త ఇన్వెస్టర్లు అనుభవలేమితో తక్కువ ధరలకు లభించే, ప్రమాదస్థాయిని అధికంగా కలిగిన పెన్నీ స్టాకుల్లో అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లను మించి ఈపెన్నీ స్టాకులు రాణిస్తున్నాయి. కేవలం క్లయింట్లు మాత్రమే పెరగడం కాకుండా విస్తృత స్థాయిలో పార్టిసిపేషన్ పెరుగుతుంది. ఈ కొత్త ఇన్వెస్టర్లు ధీర్ఘకాలం పాటు మార్కెట్లో కొనసాగి సంపద వృద్ధికి తోడ్పడతారు అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ చీఫ్ విజయ్ చందక్ అభిప్రాయపడ్డారు. 1.9 ట్రిలియన్ డాలర్ల విలువ చేసే భారత మార్కెట్ మార్చి కనిష్టం స్థాయి నుంచి ఆసియాలోకెల్లా అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తూ 40శాతం రికవరిని సాధించింది. ఈ మొత్తం రికవరిలో 10శాతం ఈ జూలైలో సాధించడం విశేషం. అలాగే ఆసియాలో అధికంగా పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్ల భారీ స్థాయిలో పెట్టుబడులను పెట్టడం, ఔత్సాహిక ఇన్వెస్టర్లు స్టాక్‌లో రావడం తదితర కారణాలు మార్కెట్ రివకరికి కారణమయ్యాని నిపుణులు భావిస్తున్నారు. -
ఆగస్ట్‌లో ఈ 5ఫార్మా షేర్లను కొనండి: సంజీవ్ భాసిన్
వచ్చేవారంలో ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశం ఉందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ బాసిన్ తెలిపారు. ఆ వారంలో కన్సాలిడేషన్ తర్వాత ఆగస్ట్‌లో ఫార్మా షేర్ల ర్యాలీకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ తరుణంలో సిప్లా, లుపిన్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఇప్కా ల్యాబ్స్, కేడిల్లా హెల్త్‌కేర్ షేర్లను కొనుగోలు చేయవచ్చని భాసిన్ సిఫార్సు చేస్తున్నారు. ఈ 5కంపెనీలకు ఫార్మా రంగంలో మంచి పేరు ఉందన్నారు. జనరిక్, ల్యాబ్, ఏపీఐ ఒప్పందాల విషయంలో ఈ కంపెనీలు అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నాయని తెలిపారు. టెక్నికల్‌గానూ ఈ షేర్ల ర్యాలీకి సిద్ధమైన విషయాన్ని ఛార్ట్లు చెబుతున్నాయన్నారు. నిఫ్టీతో పాటు మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగే సత్తా ఈ షేర్లకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ బుల్మార్కెట్లోనే ఫార్మా షేర్లు: లాభాల స్వీకరణతో ఇటీవల ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయని అయితే ఇప్పటికీ ఈ షేర్లు బుల్ మార్కెట్లోనే ఉన్నాయని బాసిస్ తెలిపారు. మార్కెట్ మార్చిలో కనిష్టస్థాయిని తాకినపుడు ఫార్మా షేర్ల ర్యాలీ ప్రారంభమైందన్నారు. ‘‘మూడేళ్ల పాటు స్తబ్దుగా ట్రేడైన ఈఫార్మా షేర్లు గత 3నెలల పాటు లాభాల పంట పండిచాయి. నిజానికి ఇండెక్స్‌ల మార్చి కనిష్టం స్థాయి నుంచి 33శాతం రికవరికి ఫార్మా షేర్లు అందించిన తోడ్పాటు అభినందననీయం. ప్రభుత్వరంగ షేర్ల రీ-రేటింగ్ కారణంగా ఇన్వెస్టర్లు పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో నిధులు అధిక బీటా స్టాకుల్లోకి వెళ్లిపోతున్నాయి’’ అని బాసిన్ చెప్పుకొచ్చారు. -
పతనమైన షేర్లకే అధిక ప్రాధాన్యత
ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా నష్టాలను చవిచూసిన, అంతంత మాత్రంగా ఆదరణ ఉన్న షేర్లను మాత్రమే కొనుగోలు చేయడం ఉత్తమని దిగ్గజ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. ఈ వ్యాఖ్యలకు కట్టుబడుతూ ఈ తొలి త్రైమాసికంలో ఈయన పతనమైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ విషయం ఆయన ఫోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే అర్థమవుతోంది. అలాగే చిన్న మొత్తంలో అధిక షేర్లను తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకున్నారు. కరోనా కారణంగా మార్చిలో అధికంగా నష్టపోయిన అటోలైన్ ఇండస్ట్రీస్, దిక్సాన్ కార్బోజెన్, ఇండియన్ హోటల్స్ షేర్లను కొనుగోలు చేశారు. ఈ షేర్లను అధిక మొత్తంలో కాకుండా 1శాతానికి మించకుండా కొన్నారు. వీటితో పాటు ఎన్సీసీ, ఫస్ట్‌సోర్ట్స్ సెల్యూషన్స్, జుబిలెంట్ లైఫ్ సెన్సెన్స్, ర్యాలీస్ ఇండియా, ఎడెల్వీజ్ సర్వీసెస్, ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్ప్ షేర్లను కూడా కొన్నారు. ఈ జూన్ క్వార్టర్ నాటికి అటోలైన్ ఇండస్ట్రీస్‌లో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా దంపతులిద్దరూ 6.4శాతం వాటాను కలిగి ఉన్నారు. మార్చిలో ఉన్న మొత్తం వాటాతో పోలిస్తే ఈ క్యూ1లో కొద్దిగా వాటాలను విక్రయించినట్లు తెలుస్తోంది. అలాగే జూన్ త్రైమాసికంలో డిష్‌మెన్ కార్బోజెన్ అమ్సిస్‌లో వీరిద్దరూ 1.59 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఇదే కాలంలో ఝున్‌ఝున్‌వాలా ఇండియన్ హోటల్స్‌లో 1.05శాతం వాటాను కొనుగోలు చేసి టాటా గ్రూప్‌లోకి ప్రవేశించారు. దురదృష్టవశాత్తు ఏడాది కాలంలో ఈ రెండు షేర్ల ప్రదర్శన అంతబాగోలేదు. అటోలైన్ ఇండస్టీస్ షేరు నేటి ట్రేడింగ్‌లో 5శాతం లాభపడినప్పటికీ.., ఏడాది కాలంలో షేరు మొత్తం 52శాతం క్షీణించింది. ఇదే ఏడాది కాలంలో ఇండియా హోటల్స్ షేర్లు 44శాతం, డిష్‌మెన్ కార్బోజెన్ షేరు 13శాతం నష్టాన్ని చవిచూశాయి. గత వారం ఒక వెబ్‌నార్‌లో మాట్లాడుతూ... మార్కెట్లో డౌన్వర్డ్ నష్టాలను, అప్‌సైడ్ పొటెన్షియల్స్ రెండింటినీ చూస్తున్నట్లు తెలిపారు. జూలై 22, 2020 బుధవారం నాటికి ఝున్‌ఝున్‌వాలా మొత్తం స్టాక్ హోల్డింగ్ విలువ రూ.11,261 కోట్లుగా ఉన్నట్లు ట్రెండ్లీన్ డేటా చెబుతోంది. మల్టీబ్యాగర్లను గుర్తించే అంశంపై ఝున్‌ఝున్‌వాలా తన వ్యూహాలను పంచుకున్నారు. ‘‘షేరు కొనుగోలు విషయంలో వ్యక్తిగత అభిప్రాయానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. షేరును అధికం కాలం పాటు హోల్డ్ చేసి ఓపిక ఉండాలి. ఇవన్నీ రిస్క్ తీసుకొనేవారి ధైర్యం, నిలకడ, ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి. ఇప్పటికీ నేను మార్కెట్లో భారీ పతనాన్ని చవిచూసిన షేర్లను కొనుగోళ్లు చేస్తాను’’ అని ఆయన తెలిపారు. ఝున్‌ఝున్‌వాలా అతని సతీమణి ఎన్సీసీలో 1.25శాతం వాటాలను కొనుగోలు చేశారు. ఈ షేరు ఏడాది కాలంలో 60శాతం నష్టాన్ని చవిచూసింది. ఫస్ట్‌సోర్స్ సెల్యూషన్స్‌లో 0.82శాతం వాటాను కొనుగోలు చేశారు. ఈ షేరుకూడా గడిచిన ఏడాదిలో 18శాతం పతనాన్ని చవిచూసింది. అలాగే ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో, ర్యాలీస్ ఇండియా ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్ప్‌లో అరశాతం లోపు వాటాను పెంచుతున్నారు. ఈ మూడింటిలో గడిచిన ఏడాది కాలంలో ర్యాలీస్ ఇండియా 98శాతం లాభపడింది. అయితే డెల్టా పవర్ కార్పోరేట్, ఫెడరల్ బ్యాంక్ షేర్లు వరుసగా 42శాతం, 38శాతం నష్టాన్ని చవిచూశాయి. -
మిడ్‌క్యాప్ ఎన్బీఎఫ్సీ షేర్లు ఆకర్షణీయం: మోర్గాన్ స్టాన్లీ
రాబోయే రెండేళ్ళలో మధ్యతరహా ఎన్బీఎఫ్సీ షేర్లలో రిస్క్‌తో పోలిస్తే రివార్డ్ రేషియో ఎక్కువగా ఉంటుందని మోర్గాన్ స్లాన్లీ తెలిపింది. ఎన్బీఎఫ్సీ సెక్టార్‌కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్సియల్, శ్రీరాం ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటి యూనియన్ ఫైనాన్స్, ఆదిత్యా బిర్లా క్యాపిటల్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు తమ టాప్పిక్లుగా ఉన్నట్లు బ్రోకరేజ్ పేర్కోంది. వచ్చే ఏడాదిలోగా షేర్లు 30-45శాతం రాబడులను ఇస్తాయని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. డీప్ వాల్యూ, మిస్-ప్రైస్డ్ స్టాకుల కోసం అన్వేషిస్తున్న ఇన్వెస్టర్లకు ఈ స్టాకులను సిఫార్సులు చేస్తున్నట్లు మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. రెండేళ్ల పాటు సెక్టార్ సంబంధిత సవాళ్లను ఎదుర్కోన్న ఈ షేర్ల వాల్యూయేషన్లు ఇప్పుడు జీవితకాల కనిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ప్రీ-కోవిడ్19కి ముందు 2020 గరిష్టాలతో పోలిస్తే మిడ్‌క్యాప్ షేర్లు 95-190శాతం అప్‌సైడ్ ఉండగా, లార్జ్‌క్యాప్ షేర్లు కేవలం 22-77శాతం మాత్రమే అప్‌సైడ్‌లో ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కోవిడ్ -19తో వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో బలహీనత కారణంగా వివిధ ఎన్బీఎఫ్సీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయని బ్రోకరేజ్ తెలిపింది. అధిక మూలధనం, లిక్విడిటీ, బలమైన వ్యాపార నమూనాతో పాటు మాతృసంస్థకు మార్కెట్ మంచి స్థాయి ఉండటంతో ఈ స్టాక్స్‌లు రానున్న రోజుల్లో మంచి స్థాయిలో ఉంటాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. మూడవ త్రైమాసిక ఫలితాల అనంతరం సెప్టెంబరులో ఎన్పీఏల గుర్తింపు తర్వాత సెక్టార్ ఎంతమేర నష్టాన్ని చవిచూచూసిందో అంచనావేయవచ్చని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
ఇన్వెస్ట్‌మెంట్‌కు ఈ 5రంగాలు అనుకూలం.!
ప్రస్తుతం మార్కెట్లో రిస్క్‌ను ఎదుర్కోనే సత్తా కలిగిన ఇన్వెస్టర్లకు మార్కెట్ నిపుణుడు అతుల్ భోలే 5రంగాల షేర్లను సూచిస్తున్నారు. ఫైనాన్సియల్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, సిమెంట్, టెలికాం రంగాల షేర్లు అందులో ఉన్నాయి. ఏడాది నుంచి ఏడాదిన్నర కాలపరిమితి దృష్ట్యా కొనుగోలు చేయవచ్చని భోలే సలహానిస్తున్నారు. ఈ 5రంగాల షేర్లపై విశ్లేషణలను ఇప్పుడు చూద్దాం... ఫైనాన్షియల్ స్టాక్స్: ప్రస్తుత ర్యాలీ ముగింపు తర్వాత కూడా ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ రంగాల షేర్ల ధరలను పరిశీలిస్తే, కోవిడ్-19 పతనం తర్వాత జరిగిన రికవరీలో భాగంగా ఇప్పటికీ 35శాతం వెనకబడి ఉన్నాయి. ఇదే సమయంలో ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు ప్రీ-కోవిడ్ స్థాయిలో లేదా అంతకుమించి రికవరీని సాధించాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఈరంగ షేర్లు ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అగ్రో కెమికల్స్, ఫైర్టిలైజర్ స్టాక్: ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదు అవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఫెర్టిలైజర్ కంపెనీలకు కలిసొచ్చే అంశం అవుతుంది. ప్రపంచస్థాయి అగ్రో కెమికల్స్ కంపెనీలకు ఏమాత్రం తక్కువగా కాకుండా మనదేశ అగ్రో కంపెనీలు నిర్వహణ సామర్థా్యన్ని కలిగి ఉన్నాయి. కోవిడ్ అనంతరం పలు అంతర్జాతీయ అగ్రో కంపెనీలు చైనా నుంచి భారత్‌కు తరలిరావాలనే యోచనలో ఉన్నాయి. కాబట్టి అటు వ్యాపార కోణం నుంచి అగ్రి కెమికల్స్ కంపెనీలకు కలిసొస్తుంది. సిమెంట్, టెలికాం షేర్లు: గత మూడేళ్లుగా ఈ రంగాల్లో కన్సాలిడేట్ జరిగింది. ప్రస్తుతం సిమెంట్, టెలికాం కంపెనీలు కన్షాలిడేట్ అనంతరం లాభాల్ని ఆర్జిస్తున్నాయి. ధరల శక్తిని తిరిగి పొందుతున్నాయి. వాల్యూవేషన్ వృద్ధి అవుట్‌లుక్ కూడా చాలా బాగుంది. ఆ అంశాల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ షేర్లు ర్యాలీ చేసే అవకాశం ఉంది. -
లాభాల్లో ఫార్మా షేర్లు - నష్టాల్లో మార్కెట్
మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., శుక్రవారం ఉదయం సెషన్లోఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఎన్ఎస్ఈలో ఫార్మా రంగానికి ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పార్మా ఇండెక్స్ దాదాపు 2శాతం లాభపడింది. డాలర్ మారకంలో రూపాయి బలహీనత ఫార్మా షేర్లకు కలిసొస్తుంది. మనదేశంలో తయారయ్యే ఔషధాలు అధిక స్థాయిలో విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. రూపాయి బలహీనతతో విదేశీ ఎగుమతులు మరింత పెరగవచ్చనే ఆశవాహ అంచనాలు ఫార్మా షేర్లను నడిపిస్తున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ అభివృద్ది చేయడంలో, వేగంగా తయారీని పెంచడంలో భారత్ కచ్చితంగా కీలకపాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ ప్రకటన ఫార్మా షేర్లకు కలిసొచ్చింది. ఉదయం గం.11:30ని.లకు ఫార్మా ఇండెక్స్ మునుపటి ముగింపు(9,987.55)తో పోలిస్తే 1శాతానికి పైగా లాభంతో 10100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఫార్మా షేర్లైన సన్‌ఫార్మా 3శాతం, బయోకాన్ 2.50శాతం, టోరెంటో ఫార్మా 1.50శాతం, అరబిందో ఫార్మా, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు 1శాతం పెరిగాయి. సిప్లా, కేడిల్లా హెల్త్‌కేర్, ఆల్కేమ్ షేర్లు అరశాతం నుంచి 0.10శాతం పెరిగాయి. ఒక్క లుపిన్ షేరు మాత్రం స్వల్పంగా 0.10శాతం నష్టాన్ని చవిచూసింది. నష్టాల్లో మార్కెట్: మిడ్‌సెషన్ సమయానికి మార్కెట్ నష్టాల్లో కదలాడుతోంది. మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలతో సూచీల నష్టాలను మూటగట్టుకున్నాయి. మధ్యాహ్నం 12గంటలకు సెన్సెక్స్ 250 పాయింట్లను కోల్పోయి 36,494 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లను నష్టపోయి 10,737 వద్ద కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ నేడు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
రిటైల్ ఇన్వెస్టర్ల రాకతో మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లలో ర్యాలీ
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు ఈ జూన్1 తేది నుంచి లార్జ్‌క్యాప్ షేర్ల కంటే అధిక లాభాల్ని ఆర్జిస్తున్నాయి. లాక్డౌన్ విధింపుతో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్మార్కెట్లోకి రావడం ఇందుకు కారణమైనట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ జూన్ 1నుంచి బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 13.6శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 17.2శాతం ర్యాలీ చేయగా, బీఎస్ఈ సెన్సెక్స్ మాత్రం 12.50శాతం మాత్రమే పెరిగింది. గత కొన్నేళ్లుగా ర్యాలీలో వెనుకబడిన రియల్ ఎస్టేట్, ప్రభుత్వరంగ బ్యాంక్స్‌లకు చెందిన మధ్య, చిన్న తరహా కంపెనీల షేర్లకు అధికంగా కొనుగోళ్ల మద్దతు లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్ల మార్కెట్ పతనంలో భాగంగా కనిష్టస్థాయిలకు పతమైన మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లను అధికంగా కొనుగోలు చేశాయని బ్రోకరేజ్ సంస్థలు తెలిపాయి. ఈ జూన్‌లో రిటైల్, హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. ఈ క్యాలెండర్ ఇయర్స్‌లో ప్రస్తుతం మిడ్‌క్యాప్ ఇండెక్స్ లార్జ్‌క్యాప్ ఇండెక్స్ కంటే అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తోంది. ఈ పరిస్థితులు విస్తృత మార్కెట్లో అధిక రిస్క్ భరించే స్థాయిని సూచిస్తుంది.’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఈక్విటీస్ సీఈవో రాజ్ఘరియా తెలిపారు. ప్రభుత్వరంగ రిటైల్ రంగాలకు చెందిన చెందిన స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు అధిక రాణిస్తున్నాయని ఆయన తెలిపారు. మిడ్‌క్యాప్ విభాగంలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లు రిటైల్ ఇన్వెస్టర్లు అధికంగా ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియా బ్యాంక్ సేర్లు ఈ జూన్ ప్రారంభం నుంచి 39శాతం నుంచి 108శాతం లాభపడ్డాయి. గతకొన్నేళ్లుగా పీఎస్‌యూ బ్యాంక్, రియల్ ఎస్టేట్ షేర్లు ర్యాలీలో బాగా వెనుకబడ్డాయి. గడిచిన 11ఏళ్లలో బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 7ఏళ్లను నష్టాలను నమోదు చేసింది. అలాగే బీఎస్ఈ పీఎస్‌యూ ఇండెక్స్ 2010 నుంచి 6ఏళ్లు నష్టాలను చవిచూసింది. ఎన్పీఎ సంబంధిత ఆందోళలు, మార్కెట్లో వాటాను కోల్పోవడంతో పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. అలాగే నెమ్మదించిన అమ్మకాలు, పెరిగిన రుణాలతో రియల్ ఎస్టేట్ షేర్ల పతనాన్ని చవిచూశాయి. ‘‘మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2018 జనవరిలో గరిష్టాన్ని తాకినప్పటికీ నుంచి మిడ్‌క్యాప్ షేర్లు చవిచూసిన మూడేళ్ల సైకిల్‌కు ఇది ముగింపు. ఈ మార్చిలో నిఫ్టీ ఇండెక్స్ 7500 కనిష్టస్థాయిని తాకినపుడు ఇవి బాటమ్ లైన్‌ను తాకాయి. అలాగే కనిష్టాలను చవిచూసిన ప్రతిషేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.’’ అని ఐఐఎఫ్ఎల్ ఇన్స్టిస్యూషనల్ ఈక్విటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ తెలిపారు. ప్రస్తుత ర్యాలీ భారీ పతనాన్ని చవిచూసిన పీఎస్‌యూ బ్యాంకులతో మొదలైంది. పీఎస్‌యూ బ్యాంకులు బలమైన రీ-రేటింగ్ పొటెన్షియల్‌ను కలిగి ఉన్నాయి. -
ఇన్సూరెన్స్ షేర్లను ఇప్పుడు కొనొచ్చా..!?
స్టాక్ మార్కెట్ నుంచి వేదాంత షేరు స్వచ్ఛందంగా డీలిస్ట్ కావడంతో దాని స్థానంలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరును చేర్చారు. అలాగే ఆగస్ట్ చివరిలో నిఫ్టీ-50 ఇండెక్స్ మార్పు చేర్పుల్లో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్ షేరు స్థానంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేర్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పులతో నిఫ్టీ-50 ఆదాయ వృద్ధి ప్రొఫైల్‌ను మెరుగుపడుతుందని ఇండెక్స్‌లో నాన్లెండింగ్ ఫైనాన్స్ సర్వీస్ స్టాక్‌ల వెయిటేజీని పెంచుతుందని వారు విశ్వసిస్తున్నారు. అయితే ఇండెక్స్ నుంచి ఒక షేరు తొలగించినంత మాత్రమే షేరును అమ్మకం గానీ, అలాగే చేర్చిన షేరును కొనుగోలు చేయడం మంచి పద్దతి కాదని వారంటున్నారు. ఇండెక్స్‌లో స్థానం ఇందుకే: నిఫ్టీ-50 ఇండెక్స్‌లో చేర్పు/తొలిగింపు అనే అంశం సంబంధిత స్టాక్ పనితీరు ప్రతిబింబిస్తుంది. అలాగే మార్కెట్లో ఆయా రంంగాల డిమాండ్‌ను తెలియజేస్తుంది. భారత్‌లో ఇన్సూరెన్స్ సెక్టార్‌కు అధిక సామర్థ్యం ఉంది. అందుకే ఇన్సూరెన్స్ స్టాకులను ఇండెక్స్‌లో స్థానం కల్పిస్తున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ‘‘భారత్‌లో గత 17ఏళ్లలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ సెక్టార్ దాదాపు 15శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం మార్కెట్లో 50శాతం వాటాను కలిగి ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో భీమా వ్యాపారం తక్కువగా ఉంది. దేశం వృద్ధిని సాధిస్తే గొప్ప పనితీరును కనబరిచే రంగాల్లో ఇన్సూరెన్స్ సెక్టార్ ఒకటిగా ఉంటుంది. దీర్ఘకాలికం దృష్ట్యా ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లలో పెట్టబడులు పెట్టవచ్చు.’’ అని ఐడీబీఐ క్యాపిటల్ రీటైల్ హెచ్ ఏకే ప్రభాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలపై ఐడీబీఐ క్యాపిటల్ బ్రోకరేజ్ తన అభిప్రాయాలను తెలిపింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: ఏజెంట్‌కు చెల్లించే కమిషన్ ఇన్సూరెన్స్ పరిశ్రమలోనే అత్యల్పంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 23వేల ఎస్బీఐ శాఖల ప్రయోజనాన్ని ఉచితంగా పొందుతుంది. ఈ రెండు అంశాలు కంపెనీ వ్యయాలను భారీగా తగ్గిస్తున్నాయి. ఎస్బీఐలో లాస్ట్-మైల్ కనెక్టివిటీ ఉత్తమంగా పనిచేస్తుంది. కాబట్టి, అది వ్యాపారంగా రూపాంతరం చెందితే, అది చాలా బాగా పనిచేయవచ్చు అని ఐడీబీఐ క్యాపిటల్ సంస్థ తెలిపింది. అలాగే షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.892గా నిర్ణయించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్: ఇండెక్స్‌లోకి ప్రవేశించిన తర్వాత రీ-రేటింగ్‌ను చూడవచ్చు. కోవిడ్-19 సంక్షోభంతో చాలా కస్టమర్లు ప్రీమియం చెల్లింపుల్లో విఫలం కావడంతో ఈ ఏడాది అది ఆశించిన స్థాయిలో రాణించకపోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో మంచి రాణించేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. దీర్ఘకాల ప్రదర్శన దృష్టా్య షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు టార్గెట్ ధరను రూ.568 గా నిర్ణయించినట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ రెండు ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లతో పాటు మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు ఐడీబీఐ క్యాపిటల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
రానున్న రోజుల్లో గెలుపు గుర్రాలు ఈ 5 షేర్లు ..!
ఈ ఏడాది తొలి అర్థభాగం నేటితో ముగుస్తుంది. ఈ తొలిభాగంలో కోవిడ్-19 భయాలు బుల్స్‌ను దలాల్ స్ట్రీట్‌లో నిలబడనివ్వలేదు. ఫలితంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి సెన్సెక్స్ 14శాతం పతనాన్ని చూసింది. మార్చి కనిష్టస్థాయి నుంచి 35శాతం రికవరీ జరిగినప్పటికీ ఈ స్థాయిలో నష్టాన్ని చవిచూడటం గమనార్హం. అటు అంతర్జాతీయ మార్కెట్లు కోవిడ్-19 భయాలతో ప్రథమార్ధంలో భారీ నష్టాలను చవిచూశాయి. ఈ అంటువ్యాధికి వ్యాక్సిన్ కనుగోనేంత వరకు ఇదే ట్రెండ్ కొనుసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆ తరుణంలో నాణ్యమైన షేర్లను ఎంపిక ముఖ్యమని ఈక్విటీ విశ్లేషకులు సలహానిస్తున్నారు. ఈ నాణ్యమైన ఎంపిక మార్కెట్ కరెక్షన్ తర్వాత మంచి రాబడులను ఇవ్వొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు కొన్ని షేర్లను సిఫార్సు చేస్తున్నారు. జి.చొక్కాలింగం ఈక్వినామిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ రీసెర్చ్ వ్యవస్థాపకులు 1. బాంబే బర్మా ట్రేడింగ్: కన్సాలిడేటెడ్ ఆదాయానికి 12రెట్ల పీ/ఈ వద్ద ఈ షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. బ్రిటానియాలో ఈ కంపెనీకి ఉన్న పెట్టుబడుల మార్కెట్ విలువతో పోలిస్తే స్టాండ్అలోన్ ప్రాతిపదికన ఈ షేర్లు 80శాతం డిస్కౌంట్‌తో ట్రేడ్ అవుతున్నాయి. 2. యూనికెమ్ ల్యాబ్స్: రుణ రహిత ఫార్మా కంపెనీ. చెప్పుకొదగిన నగదు నిల్వలున్నాయి. ఫార్ములేషన్స్ ఎగుమతులు చేస్తుంది. దాని అమ్మకాల విలువల పరంగా చాలా ఆకర్షణీయమైన వ్యాల్యూయేషన్‌తో ట్రేడ్ అవుతోంది. ఇది రెండు ఏపీఐ తయారీ యూనిట్లలో కొంత ఈక్విటీ వాటాను తీసుకుంది. వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు గణనీయంగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. ఉమేష్ మెహతా సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగపు అధిపతి 3. ముత్తూట్ ఫైనాన్స్: బంగారం ధర బలపడే కొద్ది ఈ షేరు ర్యాలీ చేసేందుకు అవకాశం ఉంది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బంగారాన్ని తనఖా పెట్టుకొని రుణాలు పొందవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో బంగారం రుణాలు మరింత పెరిగే అవకాశం ఉంది. 4. ఐసీఐసీఐ బ్యాంక్: ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నిర్మాణాత్మకమైన లోన్ బుక్, లయబిలిటీ ఫ్రాంచైజ్, క్యాపిటల్ అడ్వకెషీ రేషియోలు లాంటి సానుకూలాంశాలు సహకరిస్తాయి. 5. బజాజ్ అటో: కరోనా వైరస్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు సొంతవాహనాల కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వొచ్చు. కరోనా కాలంలో ప్రత్యర్థి కంపెనీల కంటే అధిక వాహనాలను విక్రయించింది. -
జూలైలో పెరిగేది పరిమితమే: రోలోవర్ సంకేతాలు
నిఫ్టీ ఇండెక్స్ శుక్రవారం జూలై సీరీస్‌ను భారీ లాభంతో ప్రారంభించింది. ఇదే ఇండెక్స్ జూన్ సీరిస్‌లో 8శాతం ర్యాలీ చేసింది. ఫ్యూచర్స్ కాంట్రాక్టుల రోలోవర్, బిల్డ్-అప్ పోజిషన్ల తీరును గమనిస్తే ఈ జూలై డెరివేటివ్స్ సీరీస్‌లో నిఫ్టీ ఇండెక్స్ ప్రస్తుత స్థాయిల నుంచి స్వల్ప అప్‌సైడ్ ట్రెండ్ ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచాన వేస్తున్నారు. జూన్ సీరిస్ ముగింపు తర్వాత ట్రేడర్లు లాంగ్ పొజిషన్లను తీసుకునేందుకు తక్కువ ఆసక్తి చూపారు. దీంతో అధిక స్థాయిల వద్ద బేరిష్ పోజిషన్లు బిల్డప్ కావచ్చనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా నిఫ్టీ 10,500-10,600 స్థాయిలలో బలమైన నిరోధాన్ని ఎదుర్కోవలసి వస్తుందని వారంటున్నారు. ఎక్స్పైరీ తేదీన నిఫ్టీ రోలోవర్స్ 71.6శాతానికి జరిగాయి. ఇది 3నెలల యావరేజ్ స్థాయి 69.7శాతం కంటే ఎక్కువ. అయితే కిందట నెల నమోదైన 75.7శాతం కంటే తక్కువగా ఉన్నట్లు ప్రోవిజన్ల గణాంకాలు చెబుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేత అనంతరం ఆర్థిక వ్యవస్థ ఎంత బలపడుతుందనే అనే అంశంపై స్పష్టత లేనందున మార్కెట్ల మరింత పెరగడానికి సంకోచిస్తాయి. ఈ క్రమంలో ప్రస్తు ర్యాలీ తరువాత సూచీలు అధిక స్థాయిలో ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ అధిక స్థాయిల వద్ద జాగ్రత్త వహించాలని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. కొన్ని అధిక వెయిటేజీ కలిగి స్టాక్ డిస్కౌంట్ వద్ద ట్రేడ్ అవుతుండటంతో నిఫ్టీ జూలై ఫ్యూచర్ కూడా డిస్కౌంట్లోనే ట్రేడ్ అవుతోంది. ఈ జూలై సీరస్‌లో నిప్టీ ఇండెక్స్ 9700-10700 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ డెరివేటివ్స్ విశ్లేషకుడు చందన్ తపారియో అభిప్రాయపడ్డారు. 10,500-10,600 శ్రేణి నిఫ్టీకి కీలకం: నిఫ్టీ ఇండెక్స్ అప్‌ట్రెండ్‌లో 10,500-10,600 శ్రేణిలో నిరోధాన్ని ఎదుర్కోవచ్చని ఎడెల్వీజ్ రీసెర్చ్ క్వాంటిటేటివ్ రిసెర్చ్పర్సన్ యోగేశ్ రాడ్కే తెలిపారు. ఇక డౌన్‌ట్రెండ్‌లో 10000 స్థాయికి నిఫ్టీ కీలకమని, ఈ స్థాయిని కోల్పోతే 9,700 - 9,400 పరిధికి దిగివచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో రిస్క్-ఆన్ ట్రేడ్ మూమెంటం కొనసాగుతుందన్నారు. ప్రపంచ మార్కెట్ల కదలికలు ఈ జూలై సీరీస్‌కు మార్గనిర్దేశం కానున్నాయని రాడ్కే అభిప్రాయపడ్డారు. -
జెఫ్పారీస్ బ్రోకరేజ్ నుంచి 3 స్టాక్ సిఫార్సులు
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫ్పారీస్ మూడు స్టాకులపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. ఫినోలాక్స్ ఇండస్ట్రీస్, కేఈఐ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ అందులో ఉన్నాయి. ఈ 3షేర్లకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేర్ల టార్గెట్ ధరలను పెంచింది. ఈ 3 షేర్లు మార్చి కనిష్టస్థాయిల నుంచి 29-71శాతం లాభపడ్డాయి. ఇప్పుడు ఈ 3కంపెనీల షేర్లపై బ్రోకరేజ్ సంస్థ విశ్లేషణలను చూద్దాం..! 1.ఫినోలాక్స్ ఇండస్ట్రీస్: ఈ క్యూ4లో కంపెనీ అమ్మకాలు 21శాతం క్షీణించగా, నికరలాభం 39శాతం నష్టాన్ని చవిచూసింది. వార్షిక ప్రాతిపాదిక ఈ క్వార్టర్లో పైప్స్లు/పీవీసీ రెసిస్ అమ్మకాల వాల్యూమ్స్ 20శాతం క్షీణించాయి. అయితే ఇదే సమయంలో పైప్‌ల విభాగపు మార్జిన్ అధిక స్థాయిలో మెరుగైంది. ఎర్నింగ్ గణాంకాలు బలహీనంగా ఉన్నప్పటికీ.., కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇప్పటికీ బలంగానే ఉంది. నికర రుణం ఈక్విటీ నిష్పత్తి 0.03గా ఉంది. నేపథ్యంలో షేరు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ., షేరు టార్గెట్ ధరను రూ.500కు పెంచింది. ఈ షేరు మార్చి కనిష్టం నుంచి 71.4శాతంగా రికవరిని సాధించింది. 2.కేఈఐ ఇండస్ట్రీస్: సంస్థకు అప్పులు తక్కువగా ఉన్నాయి. వినియోగ సామర్థ్యం 60-65శాతాన్ని చేరుకుంది. వినియోగం ఇంజనీరింగ్ ఎగుమతులు పెరుగుతున్నాయి. ఎగుమతుల దృష్ట్యా డిమాండ్ వైపు ఆర్డర్లు పుంజుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సవాళ్లను ఎదుర్కోవడానికి కంపెనీకి గల బలమైన బ్యాలెన్స్ షీట్ సహకరిస్తుంది. ఈ సానుకూల పరిణామాలతో షేరు ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ షేరు టార్గెట్ ధరను రూ.400కు పెంచడమైంది. మార్చి కనిష్టం నుంచి షేరు 68శాతం లాభపడింది. 3.ఐసీఐసీఐ బ్యాంక్: నాణ్యమైన అస్తులను కలిగి ఉంది. ప్రస్తుత ధర వాల్యూయేషన్ ఆకర్షణీయంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఇటీవల తన అనుబంధ సంస్థలో వాటాను విక్రయించి రూ.3900 కోట్లను సమీకరించింది. గత కొంతకాలంగా ప్రైవేట్‌రంగ బ్యాంక్ సెక్టార్లో కెల్లా మంచి ప్రదర్శనను కొనసాగిస్తోంది. బ్రోకరేజ్ సంస్థ షేరు గతంలో కేటాయించిన రూ.450ల కొనుగోలు టార్గెట్ ధరను రూ.460కి పెంచింది. ఈ టార్గెట్ ధర ప్రస్తుత షేరు ధరతో పోలిస్తే 25శాతం అధికంగా ఉంది. -
రిలయన్స్ సెక్యూరిటీస్ నుంచి టాప్-3 స్టాక్ సిఫార్సులు
అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ర్యాలీతో సూచీలు ఈ వారాంతాన్ని లాభంతో ముగించాయి. రాబోయే 3-6 నెలల్లో సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయననే ‘ఆశ’లు కూడా సూచీల సానుకూల సెంటిమెంట్‌కు కలిసాచ్చాయి. భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం వివాదం, ఈ కంపెనీ త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపరచడం, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మందగమనం లాంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., ఈ వారంలో సూచీలు లాభాలను ఆర్జించగలిగాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 951 పాయింట్లు, నిఫ్టీ 272 పాయింట్లు చొప్పున ఎగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.8 శాతం, నిఫ్టీ 2.7 శాతం లాభపడ్డాయి. రానున్న రోజుల్లో మార్కెట్ మిశ్రమ వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ రిలయన్స్ సెక్యూరిటీస్ 3 స్టాకులను సిఫార్సు చేసింది. టెక్నికల్ అంశాలను బేరీజు వేసుకుని వచ్చే 3నెలల్లో ఈ 3షేర్లు 22శాతం వరకూ లాభాలను పంచవచ్చని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. షేరు పేరు: పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.100 అప్‌సైడ్: 17శాతం విశ్లేషణ: ఇటీవల షేరు స్వల్పకాలిక, మీడియం టర్మ్ యావరేజ్‌లకు బలమైన వాల్యూమ్స్‌తో క్రాష్ కావడంతో షేరు ప్రస్తుత స్థాయి నుంచి మంచి ప్రదర్శన కనబరచవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది షేరు గరిష్టం రూ.134 నుంచి తన 50శాతం రిట్రేస్‌మెంట్‌ను రూ.74 వద్ద పూర్తి చేసింది. వీక్లీ ఛార్ట్‌లో ఏర్పడిన హయ్యర్ బాటమ్స్ షేరులో బలాన్ని చూపుతున్నాయి. వీక్లీ ఆర్ఎస్ఐ తన యావరేజ్ లైన్‌ను అధిగమిచడం షేరు బలమైన బ్రేక్ అవుట్‌ను సూచిస్తుంది. సెక్టార్లో పాజిటివ్ మూమెంటమ్ కూడా షేరు తదుపరి ర్యాలీకి కలిసొస్తుంది. షేరు పేరు: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ. 439 అప్‌సైడ్: 11శాతం విశ్లేషణ: షేరు తన వీక్లీ ఛార్ట్‌లో రూ.380-385 పరిధిలో ట్రిపుల్ బాటమ్‌ను ఏర్పాటు చేసింది. డైలీ ఛార్ట్‌లో ఇన్సైడ్ రేంజ్ బ్రేక్ అవుట్ ఇవ్వొచ్చు. డైలీ ఆర్ఎస్ఐ 50 స్థాయిపై ట్రేడ్ అవుతోంది. ఇది అప్పర్ హాండ్‌లో షేరు బుల్లిష్ సెట్ ఏర్పాటును ఇండికేట్ చేస్తుంది. ఈ షేరుకు రూ.375-385 పరిధిలో మల్టీపుల్ మద్దతు ధరలను కలిగి ఉంది. ఇది ప్రస్తుత షేరు వద్ద కొనుగోలుకు రిస్క్-రివార్డుకు మంచి అవకాశం. షేరు పేరు: సన్ ఫార్మా రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.590 అప్‌సైడ్: 22శాతం విశ్లేషణ: ఈ షేరు గతవారంలో రూ.515 వద్ద రికార్డు స్థాయిని తాకి కరెక్షన్కు లోనైంది. తర్వాత షేరు దాని దీర్ఘకాలిక యావరేజ్ నుండి తిరిగి వచ్చింది. సెక్టార్ ప్రస్తుతం అప్‌ట్రెండ్‌లో ఉంది. వీక్లీ ఛార్ట్‌లో హైయర్ బాటమ్ ఫార్మేషన్‌ను నమోదు చేసింది. రానున్న నెలల్లో బలమైన మూమెంటం ఉటుందని మంత్లీ ఛార్ట్లు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఈ షేరు 34నెలల యావరేజ్ బలమైన వ్యాల్యూమ్స్‌తో బ్రేక్ చేసింది. -
నెలలో 13శాతం ఆదాయం ఇచ్చే 3షేర్లు
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న భారత ఈక్విటీ మార్కెట్ ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ రిసెర్చ్ హెడ్ షితిజ్ గాంధీ అంచనా వేశారు. మార్కెట్లో పట్టును సాధించే క్రమంలో బుల్స్, బేర్ మధ్య జరుగుతున్న తీవ్ర పోరాటంలో నిఫ్టీ ఇండెక్స్ 10000-9700 పరిమితి శ్రేణిలో కదలాడవచ్చని ఆయన అన్నారు. ‘‘డెరివేటివ్స్ విభాగంలో కాల్ రైటర్లు 10వేల కాల్ స్ట్రైక్ వద్ద భారీ ఓపెన్ ఇంట్రెస్ట్‌ను బిల్డప్ చేశారు. ఈ స్థాయి నిఫ్టీకి కీలక నిరోధంగా పనిచేయవచ్చు. అలాగే నిఫ్టీకి 9800 వద్ద, 9700 వద్ద పుట్ రైటింగ్ తక్కువగా జరిగింది. ఈ నేఫథ్యంలో డౌన్‌సైడ్ ట్రెండ్‌లో ఈ స్థాయిలు కీలక మద్దతు స్థాయిలుగా మారవచ్చు.’’ అని షితిజ్ తెలిపారు. టెక్నికల్ కోణంలో పరిశీలిస్తే స్టాక్ ఆధారిత యాక్షన్‌తో మార్కెట్లో రానున్న రోజుల్లో అస్థిరత నెలకొని ఉంటుందని సెంకడరీ ఓసిలేటర్లు సూచిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ విషయానికొస్తే, 19,600-20,600 శ్రేణిలో కన్సాలిడ్ అవ్వోచ్చు. ఏదైనా సైడ్ బ్రేక్ మార్కెట్‌కు మరింత దిశానిర్దేశం చేయవచ్చని షితీజ్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన 3నుంచి 4వారాల కాలపరిమితిలో 10-13శాతం రాబడులను ఇచ్చే 3స్టాక్స్‌లను ఆయన సిఫార్సు చేస్తున్నారు. షేరు పేరు: రాలీస్ ఇండియా రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.295 స్టాప్ లాస్: రూ.240 అప్‌సైడ్: 11శాతం విశ్లేషణ: గడచిన 3వారాల నుంచి ఈ షేరు రూ.200-230 శ్రేణిలో కన్సాలిడేట్ అవుతోంది. ఈ శ్రేణి డైలీ ఛార్ట్‌లో దాని స్వల్ప, దీర్ఘకాలిక మూవింగ్ యావరేజ్‌ల కంటే అధికంగా ఉన్నాయి. ధీర్ఘకాలిక కన్సాలిడేషన్ ఛార్ట్స్‌లో దీర్ఘచతురస్ర ప్యాట్రన్‌ను ఏర్పాటు చేసింది. ఈ వారం, షేరు అధిక వాల్యూమ్‌లతో నిర్వచించిన పరిధి కంటే కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. కాబట్టి ట్రేడర్లు రూ.240 స్థాయిని స్టాప్‌లాస్ పెట్టుకొని రూ.295 స్థాయి టార్గెట్ లక్ష్యంగా రూ.260-265 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: గోద్రేజ్ ఆగ్రోవేట్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.483 స్టాప్ లాస్: రూ.385 అప్ సైడ్: 13శాతం విశ్లేషణ: ఈ ఏడాది మార్చిలో 300 స్థాయికి పతనమైన తర్వాత, షేరు తన కనిష్టస్థాయిల నుంచి వేగంగా రికవరిని సాధించింది. డైలీ ఛార్ట్‌లో 100 రోజుల ఎక్స్‌పోన్షియల్ మూవింగ్ యావరేజ్కంటే మరోసారి మూమెంటం ఊపందుకుంది. అదనంగా, దాదాపు 7-వారాల సుదీర్ఘ కన్సాలిడేట్ తర్వాత అధిక వాల్యూమ్స్‌తో ధరల వేగం పుంజుకుంది. కాబట్టి ట్రేడర్లు రూ.385 స్థాయిని స్టాప్‌లాస్ పెట్టుకొని రూ.483 స్థాయి టార్గెట్ లక్ష్యంగా రూ.420-425 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: బర్గర్ పేయింట్స్ రేటింగ్: బై టార్గెట్: రూ.555 స్టాప్ లాస్: రూ.468 అప్ సైడ్: 10శాతం విశ్లేషణ: ఈ స్టాక్ డైలీ ఛార్టులలో దాని స్వల్ప, దీర్ఘకాలిక మూవింగ్ యావరేజ్‌ల కంటే స్థిరంగా ఉంది. టెక్నికల్ పాయింట్ కోణంలో స్టాక్ డైలీ చార్టులలో కప్ అండ్ హ్యాండిల్ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేసింది. సెంకడరీ ఓసిలేటర్ల ప్యాట్రన్లు షేరు అప్‌సైడ్ ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. కాబట్టి ట్రేడర్లు రూ.468 స్థాయిని స్టాప్‌లాస్ పెట్టుకొని రూ.555 స్థాయి టార్గెట్ లక్ష్యంగా రూ.500-505 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. -
సీఎల్ఎస్ఏ టార్గెట్ ధరను పెంచిన 5 షేర్లు ఇవే..!
అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న భారీ అమ్మకాలతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండు రోజులుగా భారీ నష్టాలను చవిచూస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరగడం, లాక్డౌన్ విధింపుతో ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం నేపథ్యంలో మార్కెట్లో ఒడిదుడుకులు మరింత కొంతకాలం కొనసాగే అవకాశం ఉందని కొందరు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ 5 షేర్లకు టార్గెట్ ధరను పెంచింది. ఇప్పుడు వాటి పూర్తి వివరాలు చూద్దాం... డీఎల్ఎఫ్ఏ: గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొసాగించింది. టార్గెట్ ధరను రూ.180 నుంచి రూ.190కి పెంచింది. అమ్మకాల వ్యూహంలో మార్పు, మధ్య తరగతి నిర్మాణాలు అధికంగా చేపట్టడం నిర్మాణ సమయంలో అమ్మకాలను ప్రారంభించడటం తదితర ప్రణాళికలతో మొత్తం అమ్మకాల వాల్యూమ్ పునరుద్ధరణ జరగవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022)లో రూ.2,500 కోట్ల అమ్మకాలు జరగవచ్చు. అయితే ఎఫ్వై 21 అంచనాను రూ .1.600 కోట్లుగా కొనసాగించింది వేదాంత లిమిటెడ్: ఇంతకు ముందు కేటాయించిన అండర్ఫర్ఫామ్ రేటింగ్‌ను అవుట్‌ఫెర్‌ఫామ్ రేటింగ్‌కు అప్‌గ్రేడ్ చేసింది. షేరు టార్గెట్ ధరను రూ.95గా నిర్ణయించింది. గతంలో ఇదే షేరుకు టార్గెట్ ధరను రూ.80గా కేటాయించింది. కంపెనీ నిర్వహణ ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. లాక్డౌన్ బలహీనత నికరలాభం మీద ఒత్తిడిని పెంచుతుంది. అల్యూమినియం ఉత్పత్తి సానుకూలంగా ఉండటంతో క్యూ4 ఈబిఐటిడీఏ అంచనాలకు అనుగుణంగా ఉంది. తక్కువ వ్యాల్యూమ్స్, అధిక పరపతితో సంస్థ ఫండమెంటల్స్ ఇంకా బలహీనంగానే ఉన్నాయి. కంపెనీ మెరుగైన కార్యచరణ షేరును నడిపిస్తుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. హీరో మోటోకార్ప్: గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించింది. షేరు టార్గెట్ ధర రూ.2400 నుంచి రూ.2700కు పెంచింది. అంచనాలకు మించి క్యూ4 ఫలితాలను వెల్లడించింది. అయితే ఆదాయం/ఎబిఐటీడిటా 1శాతం, 20శాతంగా నమోదుకావడం కలిసొచ్చే అంశం. సమీప-కాల డిమాండ్ అనిశ్చితంగా ఉండొచ్చు. కాని ద్విచక్ర వాహన మార్కెట్లో కంపెనీ వాటా భారీగా ఉండటం సానుకూలాంశమని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్: షేరు టార్గెట్ ధరను రూ.197 నుంచి రూ.185 పెంచింది. ఫండమెంటల్స్ ఇంకా సహకరించకపోవడంతో స్టీల్ ఇటీవల జరిగిన ర్యాలీ జరగలేదు. ఇప్పుడు ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ యాక్టివిటీ స్టీల్ సంబంధిత కార్యక్రమాల వైపు ఎక్కువగా ఉంటుంది. టాటా స్టీల్: షేరు టార్గెట్ ధరను రూ.290 నుంచి రూ.304కు పెంచింది. స్టీల్ ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి. అలాగే సాంకేతికంగా వీక్లీ, షార్ట్ టర్మ్ ఛార్ట్లు బుల్లిష్ వైఖరిని సూచిస్తున్నాయి. కాబట్టి స్వల్పకాలికానికి షేరు కొనుగోలు చేయడం ఉత్తమం అని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
అరబిందో,అశోక్ లేలాండ్ బై: మోతీలాల్ సిఫార్సులు
కోవిడ్ సంక్షోభంతో గత రెండు నెలలుగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ వారంలో లాభాల్లో ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లకు కొంత ఊరట కలిగిస్తున్నాయి. మరోపక్క లాక్డౌన్లో సడలింపులు ఇస్తూ సాధారణ పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మార్కెట్ల ర్యాలీకి దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ మూడు షేర్లను కొనవచ్చని సిఫార్సు చేస్తోంది. అవి ఈవిధంగా ఉన్నాయి. కంపెనీ పేరు: అశోక్ లేలాండ్ బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.61 ప్రస్తుత ధర: రూ.48 అశోక్ లేలాండ్ కంపెనీ షేరుకు మోతీలాల్ ఓస్వాల్ బయ్ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.61 గా నిర్ణయించింది. బీఎస్-VI ప్రమాణాలతో మధ్య, భారీ స్థాయి ట్రక్కులను అశోక్ లేలాండ్ గురువారం విడుదల చేసింది.ఏవీటీఆర్ బ్రాండ్ పేరుతో ఓ కొత్త మాడ్యులార్ ప్లాట్‌ఫాంపై వీటిని అందుబాటులోకి తీసుకొచ్చిందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. వినియోగదారులు తమకు కావాల్సిన వాణిజ్య వాహనాలను ఎంపిక చేసుకునే సదుపాయం కల్పించింది.దీనివల్ల వాహన విక్రయాలు పెరిగి కంపెనీ లాభాలు ఆర్జిస్తుందని తెలిపింది. వచ్చే రెండు మూడేళ్లలో మంచి వృద్ధిని సాధిస్తుందని వెల్లడించింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో అశోక్ లేలాండ్ షేరు ధర రూ.48.50 గా ఉంది. కంపెనీ పేరు: అరబిందో ఫార్మా బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.880 ప్రస్తుత ధర: రూ.753 బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అరబిందో ఫార్మా షేరుకు బయ్ రేటింగ్‌ను ఇచ్చింది. ఏడాదికాలానికి గాను లాభాలు పెరుగుతాయన్న అంచనాతో షేరు టార్గెట్ ధరను రూ.880 గా నిర్ణయించింది. రెగ్యులేటరీ సమస్యలు కారణంగా ఏఎన్‌డీఏ అనుమతులు ఆలస్యంగా వస్తున్నాయి. అయినప్పటకీ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల ద్వారా అంచనా వేసిన ఆదాయాలను కంపెనీ ఆర్జిస్తుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. యూఎస్, ఈయూ వ్యాపారంలో మెరుగైన లాభాలు వస్తాయని అందువల్ల ఈ షేరు కొనవచ్చని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఆరబిందో షేరు రూ. 753.45 గా ఉంది. కంపెనీ పేరు: బీపీసీఎల్ బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: తటస్థంగా ఉంచింది టార్గెట్ ధర: రూ.425 ప్రస్తుత ధర: రూ.367 బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) షేరు రేటింగ్‌ను తటస్థంగా ఉంచుతూ టార్గెట్ ధరను రూ.425గా నిర్ణయించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో బీపీసీఎల్ ఇబిటా బ్రోకరేజ్‌ల అంచనాలను మించిపోయిందని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన రిఫైనరీ 2 శాతం పెరగగా, విక్రయాలు 5 శాతం పడిపోయాయని వెల్లడించింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో బీపీసీఎల్ షేరు రూ.367.15 గా ఉంది. -
10శాతం లాభపడ్డ టాటామోటర్స్ షేరు
టాటామోటర్స్ కంపెనీ షేరు శుక్రవారం మిడ్‌సెషన్ సమయానికి 10శాతానికి పైగా లాభపడింది. నేడు ఈ కంపెనీ షేరు బీఎస్ఈలో రూ.100.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో నెలకొన్న కొనుగోళ్లలో భాగంగా ఈ షేరుకు డిమాండ్ నెలకొంది. ఒక దశలో షేరు 10.50 పైగా లాభపడి రూ.108.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం 1గంటకు షేరు మునుపటి ముగింపు(రూ.98.50)తో పోలిస్తే 10శాతం లాభంతో రూ.108.35 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.63.60, రూ.201.80గా ఉన్నాయి. ఇదే సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్ల పెరిగి 34180 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 10112.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్ల తప్ప, మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు లాభపడుతున్నాయి. -
జోరుగా ఫార్మా రంగ షేర్ల ర్యాలీ
ఫార్మా రంగానికి చెందిన షేర్లు గురువారం ఉదయం సెషన్లో జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. మార్కెట్ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లోనూ ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దాదాపు 2.50శాతం లాభపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఫార్మా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడంతో అరబిందో ఫార్మా షేరు ఇండెక్స్ ఏడాది గరిష్టాన్ని తాకింది. సన్‌ఫార్మా, బయోకాన్ షేర్లు 3శాతం పెరిగాయి. సిప్లా, లుపిన్, గ్లెన్‌మార్క్ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. దివీస్ ల్యాబ్స్, డాక్టార్ రెడ్డీస్, కేడిలా హెల్త్‌కేర్ షేర్లు 1శాతం లాభపడ్డాయి. అయితే ఒక్క పిరమిల్‌ఎంటర్‌ప్రైజెస్‌లిమిటెడ్ షేరు మాత్రం 3శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం గం.10:45ని.లకు నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2శాతం లాభంతో 9,880.85 వద్ద ట్రేడ్ అవుతోంది. దాదాపు ఏడాదిన్నర తరువాత నిఫ్టీ పార్మా ఇండెక్స్ తిరిగి 10వేల స్థాయిని అందుకుంది. ఇదే సమయానికి సిప్లా, సన్‌ఫార్మా షేర్లు వరుసగా 2శాతం, 3శాతం లాభపడి నిఫ్టీ-50 సూచీలోని టాప్-5 షేర్లలో చోటు దక్కించుకున్నాయి. -
3నెలల్లో 20శాతం వరకు రాబడినిచ్చే 3 షేర్లు ఇవే..!
మార్కెట్ ర్యాలీ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు వికాస్ జైన్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ర్యాలీలో మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ షేర్ల ప్రదర్శన తక్కువగా ఉందని, రాబోయే కొద్ది వారాల్లో ఈ షేర్లలో అద్భుతమైన ర్యాలీని చూడవచ్చని జైన్ అంటున్నారు. నిఫ్టీ ఇండెక్స్ అప్‌సైడ్‌లో 9,750 వద్ద నిరోధ స్థాయిని కలిగి ఉందని, దాన్ని అధిగమిస్తే 9,800 వద్ద మరో నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని జైన్ అంచనా వేస్తున్నారు. ఇక్ డౌన్‌సైడ్‌లో 9,250వద్ద కీలక మద్దతు స్థాయిని కలిగి ఉందని, ఈ స్థాయిని కోల్పోతే 9,050వద్ద మరో కీలక మద్దతు ఉందన్నారు. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ప్రదర్శన రానున్న రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని జైన్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జైన్ 3నెలల వ్యవధిలో 20శాతం వరకు రాబడులనిచ్చే 3స్టాకులను సిఫార్సు చేశారు. షేరు పేరు: సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.340 స్టాప్ లాస్: రూ.253 అప్ సైడ్: 20శాతం విశ్లేషణ: ఈ షేరు నెలవారీ ఎక్స్పైరీ ఛార్ట్‌లో హమ్మర్ క్యాండిల్ ప్యాట్రన్ రూపొందించింది. హయ్యర్ సైడ్‌లో బలమైన రివర్సల్ బ్రేక్అవుట్ను ఆశించవచ్చు. బలమైన వ్యాల్యూమ్స్‌తో షేరు 4వారాల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతోంది. ఆర్ఎస్ఐ గత కొన్నివారాల నుంచి యావరేజ్ లైన్‌పై ట్రేడ్ అవుతోంది. కాబట్టి ట్రేడర్లు రూ.253ని స్టాప్ లాస్‌గా నిర్దేశించుకొని రూ.340 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.410 స్టాప్ లాస్: రూ.324 అప్‌సైడ్: 17శాతం విశ్లేషణ: ఈ షేరు దాని స్వల్ప మరియు మధ్యకాలిక యావరేజ్‌ల దగ్గర ట్రెండ్ అవుతోంది. ప్రస్తుత స్థాయిల నుండి పైకి బ్రేక్అవుట్ కావొచ్చు. వీక్లీ ఛార్ట్‌లో హయ్యర్ బాటమ్‌ను ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో పాజిటివ్ అవుట్‌లుక్‌ను ఆశించవచ్చు . షేరు పేరు: టెక్ మహీంద్రా రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.595 స్టాప్ లాస్: రూ.491 అప్ సైడ్: 12శాతం విశ్లేషణ: ఈ షేరుకు త్రైమాసికపు సగటు రూ.485 వద్ద కీలక మద్దుత స్థాయిని కలిగి ఉంది. ఇది తక్కువ శ్రేణి నుండి సానుకూల మూమెంటంను అందుకుంది. కీలకమైన ఆర్ఎస్ఐ ఇండికేటర్ దాని యావరేజ్ లైన్‌కు పైన ట్రేడ్ అవుతోంది. ఇది ప్రస్తుత స్థాయిల నుంచి బ్రేక్ అవుట్ అయ్యి తదుపరి ర్యాలీకి సిద్ధమవడాన్ని సూచిస్తుంది. -
స్వల్పకాలంలో రెట్టింపు లాభాల్ని ఇచ్చే 3 షేర్లు ఇవే..!
రిస్క్ రివార్డును ఎదుర్కోనగలిగే ఇన్వెస్టర్లకు అటో, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకుల షేర్లను సిఫార్సు చేస్తామని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకుడు విజయ్ జైన్ తెలిపారు. ఈ రంగాలకు చెందిన షేర్లు మాత్రమే స్టాక్ మార్కెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. నిఫ్టీ ఇండెక్స్‌లో మెటల్ షేర్లు వాటి కాంజెస్టింగ్ జోన్ నుండి మీడియం-టర్మ్ సగటులను బ్రేక్ అవుట్ చేస్తున్నాయని ఆయన్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వల్పకాలానికి రెట్టింపు లాభాల్ని ఇచ్చే 3స్టాకులను సిఫార్సు చేస్తున్నారు. 1. షేరు పేరు: ఎన్ఎండీసీ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.86 స్టాప్ లాస్: రూ.68 అప్ సైడ్: 15.60శాతం విశ్లేషణ: డైలీ, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో సుధీర్ఘ కన్సాలిడేషన్ తరువాత బలమైన వ్యాల్యూమ్స్‌తో షేరు బ్రేక్అవుట్ చూసింది. ఈ మెటల్ సెక్టార్లో ఇటీవల పాజిటివ్ మూమెంటమ్ నెలకొంది. రిలిటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (ఆర్ఎస్ఐ) దాని యావరేజ్ లైన్ నుంచి అప్‌వర్డ్ క్రాస్ చేస్తోంది. ఈ సంకేతాలు రానున్న రోజుల్లో షేరు భారీ ర్యాలీని సూచిసున్నాయి. 2. షేరు షేరు: సన్ ఫార్మా రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.535 స్టాప్ లాస్: రూ.425 అప్ సైడ్: 14.6శాతం విశ్లేషణ: గత నెలలో రూ.505 గరిష్టాల నుండి దిద్దుబాటు తర్వాత ధర, సమయం వారీగా షేరు కరెక్షన్ను పూర్తి చేసిందని మేము(రిలయన్స్ సెక్యూరిటీస్) నమ్ముతున్నాము. రాబోయే కొద్ది వారాల్లో ప్రస్తుత స్థాయిల నుండి మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంది. 3. షేరు పేరు: వోల్టాస్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.520 స్టాప్ లాస్: రూ.425 అప్ సైడ్: 13శాతం విశ్లేషణ: ఈ స్టాక్ బలమైన వాల్యూమ్‌లతో సబ్ రూ .430 వద్ద డబుల్ బాటమ్‌ను ఏర్పాటు చేసింది. ఆర్ఎస్ఐ ఇండెక్స్ యావరేజ్ బాండ్... సగటు బాండ్‌ను దాటి పైకి వెళ్లింది. ప్రస్తుత స్థాయిల నుంచి షేరు రాణిస్తుందని నమ్ముతున్నాము. రోజువారీ చార్టులలో డబుల్-బాటమ్ సపోర్ట్ ఓవర్‌సోల్డ్ స్టేటస్ రానున్న రోజుల్లో పదునైన అప్ మూమెంటమ్‌ను సూచిస్తున్నాయి. -
బేర్ గుప్పిట్లో చిక్కని ఏడు షేర్లు!
డౌన్‌ట్రెండ్ మార్కెట్లో బుల్ షేర్లను పసిగట్టడం కాస్త కష్టమే కానీ అసాధ్యం కాదంటున్నారు నిపుణులు. సూచీలు బాటమ్ అవుట్ అవుతున్న దశలో మంచి ప్రదర్శన చూపే షేర్లు తర్వాత మూడేళ్లకాలంలో ర్యాలీని ముందుండి నడిపిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం అలా సూచీల డౌన్‌ట్రెండ్‌లో స్థిర ప్రదర్శన చేస్తున్న ఏడు షేర్లను ఐసీఐసీఐ డైరెక్ట్ గుర్తించి సిఫార్సు చేస్తోంది. వీటిలో బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, సింజెన్ ఇంటర్నేషనల్, డా.లాల్పాథ్ల్యాప్స్, నవిన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, ఇండియా సిమెంట్స్ ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఇవి దాదాపు 19- 24 శాతం రాబడినిస్తాయన్నారు. ఎన్ఎస్ఈలో లిస్టయిన 918 స్టాకుల ప్రదర్శనను, సాంకేతికాంశాలను పరిశీలించి ఈ సిఫార్సు చేసినట్లు తెలిపింది. టెక్నికల్ విశ్లేషణలో భాగంగా ధర నిర్మాణ విశ్లేషణ, ఆర్ఎస్ఐ, డౌథియరీ సంకేతాలు తదితరాలను పరిశీలించినట్లు బ్రోకరేజ్ తెలిపింది. దీనికితోడు ఈ కంపెనీల వ్యాపార నమూనా బాగుందని తెలిపింది. -
10-30% పెరిగిన స్మాల్ క్యాప్ స్టాక్స్
ఈ వారంలో అంతర్జాతీయ పరిస్థితులూ ప్రతికూలంగా ఉండడంతో నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. శుక్రవారం సెన్సెక్స్31,000 పాయింట్ల దిగువకు, నిఫ్టీ50 9,100 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, దేశీయంగా భారత ప్రభుత్వం, ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ రెండు మార్కెట్లు నష్టాలను చవిచూసాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వారం ప్రాతిపదికన బీఎస్ఈ సెన్సెక్స్ 1.3 శాతం పడిపోగా, నిఫ్టీ 1.06 శాతం పడిపోయింది. ఇదే సమయంలో బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం, బీఎస్ఈ మిడ్‌క్యాప్ 2 శాతం పతనమయ్యాయి. అయినప్పటికీ బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో 34 షేర్లు 10-30 శాతం పెరిగాయి. వీటిలో ప్రోజోన్ ఇంటూ, మెక్నల్లీ భారత్, టీవీఎస్ శ్రీచక్ర, ఆషాపుర, ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్, ఇండియా సిమెంట్స్, డీ లింక్, డెక్కన్ సిమెంట్స్, ఆంధ్రా సిమెంట్స్ జెన్ టెక్నాలజీస్, సింటెక్స్ ఇండస్ట్రీ, ఆధునిక్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్, ఎన్ఐఐటీ టెక్నాలజీలు, వాబ్కో ఇండియా, ఏపీఎల్ అపోలో, పయనీర్ డిస్టిల్లరీస్,త్రివేణీ ఇంజనీరింగ్ తదితరాలున్నాయి. ఇక ఈవారంలో నిఫ్టీ 8,800 కనిష్టాల నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. కానీ ఆర్థిక ఒత్తిడిలు ఎక్కువగా ఉండడంతో వారంలో నిఫ్టీ బ్యాంక్ 8శాతానికిపై గా పడిపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన ఆర్థిక ప్యాకేజీ ఇన్వెస్టర్లను మెప్పించకపోవడం, మారటోరియం పొడిగింపుతో బ్యాంక్‌ల బ్యాలెన్స్ షీట్లపై ఒత్తిడి పడనుంది. ఆర్బీఐ రుణాలపై ఎటువంటి నిర్ణయాలు లేకపోవడం, బ్యాంకులకు సాయం చేసే ప్రకటనలు ఏవీ లేకపోవడంతో బ్యాంక్ నిఫ్టీ పడిపోయిందని సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా అన్నారు.మారటోరియం పొడగింపు వల్ల ఎన్పీఏలు పెరుగుతాయని, తద్వారా బ్యాంక్‌ల బ్యాలెన్స్ షీట్ల లాభాలపై ప్రభావం పడుతుందని మేహతా పేర్కొన్నారు. నిఫ్టీ50 వరుసగా మూడో వారం నష్టాల్లో ముగిసింది. ఫార్మా,ఐటీ ,ఎఫ్ఎంసీజీలు మెరుగ్గా ట్రేడ్ అయ్యాయి. -
ప్రమోటర్ల వాటా అప్: షేరు ధర డౌన్ ..!
స్టాక్ మార్కెట్ పతనాన్ని ప్రమోటర్లు తమ సొంత కంపెనీల్లో వాటాను పెంచుకునే అవకాశంగా మలుచుకుంటున్నారు. గడిచిన రెండు త్రైమాసికాల్లో ఓపెన్ మార్కెట్ కొనుగోళ్ల పద్దతిలో సుమారు 24కంపెనీల్లో ప్రమోటర్లు వాటాను పెంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ లాక్డౌన్ విధింపుతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ... త్రైమాసిక ఫలితాలను ప్రకటించేందుకు కంపెనీలకు అదనపు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్1 నుంచి జూన్30 వరకు కంపెనీల వాటాలనుప్రమోటర్లు, ఇతర ఇన్సైడర్లు కొనుగోలు చేయడంపై నిషేధం విధించింది. గడచిన 6నెలల్లో సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్, దీపక్ ఫెర్టిలైజర్స్, వైభవ్ గ్లోబల్, చంబల్ ఫెర్టిలైజర్, మహీంద్రా అండ్ మహీంద్రా, గోద్రేజ్ ఆగ్రోవెట్, ఏపిఎల్ అపోలో ట్యూబ్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ కంపెనీల ప్రమోటర్లు వాటాలను పెంచుకున్నారు. సన్‌ఫార్మా(2 శాతం), దీపక్ ఫెర్టిలేజర్స్(3 శాతం), వైభవ్ గ్లోబల్(19 శాతం) షేర్లు తప్ప ప్రమోటర్లు వాటాలు పెంచుకున్న కంపెనీల షేర్లు వార్షిక ప్రాతిపదికన 50శాతం వరకు నష్టాన్ని చవిచూశాయి. ఇదే సమయంలో సెన్సెక్స్ 20శాతం క్షీణించింది. రెగ్యూలేటరీలు ఫార్మా కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఫార్మా రంగానికి కలిసొచ్చింది. అలాగే ఆదాయాల రికవరీపై ఆశలను పెంచింది. ఐదేళ్ల పనితీరు తర్వాత వాల్యూయేషన్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కోవిడ్ -19 మహమ్మారితో ఈ రంగం చాలా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ఫార్మా రీ-రేటెడ్ అవుతుందని మేము నమ్ముతున్నాము. కోటక్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఫండ్ మేనేజర్ అన్షుల్ సైగల్ నవ భారత్ వెంచర్స్, సైయెంట్, జామ్నా అటో, జెన్సార్ టెక్నాలజీస్, సెంట్రమ్ క్యాపిటల్, వక్రంజీ, గ్రేవీస్ కాటన్, జాగరణ్ ప్రకాశణ్, ఐఆర్బీ ఇన్ఫ్రా, వాలియంట్ కమ్యూనికేషన్స్, కమర్షియల్ సిన్ బ్యాగ్స్, సీసీఎల్ ప్రాడెక్ట్స్, కంపెనీల ప్రమోటర్లు అక్టోబర్-మార్చి నెలలో తమ సంస్థల్లో వాటాను పెంచుకున్నారు. ఈ కంపెనీల షేర్లు వార్షిక ప్రాతిపదికన 10-55శాతం నష్టాలను చవిచూశాయి. ప్రమోటర్లు సొంత కంపెనీల్లో వాటాను ఎప్పుడు పెంచుకుంటారు..? కంపెనీ స్టాక్ విలువ పెరుగుతుందని తెలిసినప్పుడు కంపెనీ లేదా సంబంధిత రంగంలో సానుకూల డెవలప్మెంట్ ఉన్నప్పుడు కొన్ని సార్లు కంపెనీ నియంత్రణ ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రమోటర్లు తన కంపెనీలో వాటాను పెంచుకుంటాడు. ప్రమోటర్లు ఆకర్షణీయమైన ధరలకు వాటాలను పొందే అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఇలా సొంత కంపెనీలో వాటా కొనుగోలు అనేది వారి వ్యాపారాలపై విశ్వాసం చూపించడానికి ఒక మార్గం. అయినప్పటికీ, వారి ఇన్వెస్ట్మెంట్ పరిమాణం చిన్న ఇన్వెసర్ల కంటే ఎక్కువగా ఉన్నందున వాటిని గుడ్డిగా అనుసరించకూడదు అని షేర్‌ఖాన్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ గౌరవ్ దువా పేర్కోన్నారు. -
సస్య రక్షణ ఔషధ షేర్లు క్రాష్..!
సస్య రక్షణ ఔషధ కంపెనీ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సుమారు 27రకాల పురుగుమందుల అమ్మకం, వాడకం, దిగుమతులను నిషేధిస్తూ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ మే14వ తేదిన ముసాయిదా ఉత్తర్వులు జారీ చేయడం ఈ రంగ షేర్ల పతనానికి కారణమైంది. ఈ రంగానికి చెందిన యూపీఎల్, రాలీస్ ఇండియా, అతుల్ లిమిటెడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీల షేర్లు 10శాతం నుంచి 4శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇప్పటికే యూపీఎల్ షేరు ఏడాది కాలంలో ఏకంగా 47శాతం నష్టపోయింది. "ఈ ఆర్డర్ ప్రచురించిన తేదీ(మే 14) నుండి షెడ్యూల్ లో పేర్కొన్న పురుగుల మందులను ఏ వ్యక్తి కూడా దిగుమతి, తయారీ, అమ్మకం, రవాణా, పంపిణీ, వియోగం లాంటి చేయకూడదు" అని నోటిఫికేషన్లు తెలిపాయి. కేంద్రం రూపొందిచిన ముసాయిదా అమల్లోకి వస్తే.., నిషేధిత పురుగుమందుల ఉత్పత్తులను తయారు చేసే యూపీఎల్, రాలీస్ ఇండియా, అతుల్, కోరమాండల్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలపై నిషేధం ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. -
దీర్ఘకాలానికి నిలకడైన రాబడులు
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ గడిచిన 6–12 నెలల కాలంలో గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు ఇది మంచి పెట్టుబడి అవకాశాలను తీసుకొచి్చంది. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు మంచి పనితీరు కలిగిన స్మాల్‌క్యాప్ పథకాల్లో ఈ తరుణంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడులు పొందేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ విభాగంలో ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకం కూడా మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో ఒకటి. పనితీరు..: అన్ని కాలాల్లోనూ ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకం బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీతో పోలిస్తే మంచి పనితీరు చూపించడం ఇన్వెస్టర్లు తప్పకుండా గమనించాల్సిన అంశం. ఏడాది కాలంలో ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకంలో నికరంగా 12 శాతం నష్టాలు ఉన్నాయి. కానీ, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఇదే కాలంలో ఏకంగా 24 శాతానికి పైగా నష్టపోయింది. అంటే గత ఏడాది కాలంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉండడం పనితీరుపై ప్రభావం చూపించింది. అయినప్పటికీ ఈ ఫండ్ మేనేజర్లు నష్టాలను తగ్గించగలిగారు. ఇక మూడేళ్ల కాలంలో ఎస్బీఐ స్మాల్ క్యాప్ పథకం వార్షికంగా 10.25 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 16.58 శాతం చొప్పున రిటర్నులు ఇచి్చంది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ మూడేళ్లలో అసలు రాబడులనే ఇవ్వకుండా ఫ్లాట్‌గా ఉంది. ఐదేళ్ల కాలంలో కేవలం 4.35 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. మూడేళ్లు, ఐదేళ్ల కాలాల్లోనూ బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ అందుకోలేని పనితీరు ఈ పథకంలో చూడొచ్చు. స్మాల్‌క్యాప్ విభాగంలో పోటీ పథకాలు హెచ్డీఎఫ్సీ స్మాల్‌క్యాప్, రిలయన్స్ స్మాల్‌క్యాప్ పథకాలను మించి అన్ని కాలాల్లోనూ ఎస్బీఐస్మా ల్ క్యాప్ ఉత్తమ పనితీరు చూపించడం గమనార్హం. పెట్టుబడుల విధానం 2011, 2013, 2018 మార్కెట్ కరెక్షన్లలో ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకం నష్టాలను తగ్గించింది. ఇక ప్రస్తుత ప్రతికూల సమయంలోనూ ఈ పథకం పనితీరు మెచ్చుకోతగ్గదే. అంతేకాదు 2014, 2017 బుల్ ర్యాలీల్లోనూ మంచి పనితీరు చూపించింది. మొత్తం పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన పెట్టుబడులను లార్జ్, మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయిస్తుంది. అలాగే, డెట్‌కు కూడా కొంత కేటాయిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం పెట్టుబడులను గమనించినట్టయితే స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 72 శాతం మేర ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో 22 శాతం, లార్జ్‌క్యాప్‌లో 3.51 శాతం వరకు పెట్టుబడులు ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 5 శాతం వరకు ఉండడం గమనార్హం. ఇక ఇంజనీరింగ్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచి్చంది. 45 శాతం పెట్టుబడులు ఈ రంగాల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెక్స్టైల్స్, సర్వీసెస్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పరుగెట్టే స్టాక్స్‌ను ముందే పట్టుకునే ఫండ్
స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో భారీగా పెరిగి, అధిక విలువలకు చేరిన స్టాక్స్... ఇటీవలి కరెక్షన్లో భారీగా పడడాన్ని చూసే ఉంటాం. వీటిల్లో ఆణిముత్యాలను పట్టుకుని ఇన్వెస్టింగ్ చేయడమే వ్యాల్యూ ఫండ్స్ చేసే పని. బాగా పడిన స్టాక్స్ లేదా, అధిక విలువ కలిగి, తక్కువ ధరల వద్ద ట్రేడవుతున్నవి, దీర్ఘకాల వృద్ధికి అవకాశాలు బలంగా ఉన్నవి పెట్టుబడులకు మంచి అవకాశాలు అవుతాయి. ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్ కూడా పెట్టుబడులకు ఈ విధానాన్నే ఆచరిస్తోంది. వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఉన్న స్టాక్స్‌ను ఈ ఫండ్ కొనుగోలు చేస్తుంటుంది. అంటే మల్టీ క్యాప్ విధానంగానే భావించొచ్చు. ఫండమెంటల్స్ కంటే తక్కువ విలువకు ట్రేడవుతున్నవి, టర్న్ అరౌండ్‌కు అవకాశం ఉన్న స్టాక్స్‌కు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది. అదే సమయంలో రాబడులను పెంచుకునేందుకు వృద్ధికి అవకాశం ఉన్న స్టాక్స్‌ను కూడా ఎంచుకుంటుంది. 2007 ఏప్రిల్‌లో మార్కెట్లు చాలా గరిష్ట స్థాయిలకు చేరిన సమయంలో ఈ పథకం ఆరంభమైంది. బుల్, బేర్, ఒడిదుడుకులతో ఉన్న వివిధ మార్కెట్ కాల సమయాల్లో పనితీరు పరంగా మెరుగ్గా నిలిచింది. పనితీరు, విధానం మూడింట ఒక వంతు పెట్టుబడులను మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌కు కేటాయించడం అన్ని వేళలా పాటిస్తుంటుంది. దీంతో ర్యాలీల్లో అధిక రాబడుల అవకాశాలను పదిలంగా ఉంచుకుంటుంది. ఇక లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు మార్కెట్ కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేసేందుకు తోడ్పడతాయి. బుల్, బేర్ మార్కెట్లలోనూ ఈక్విటీ పెట్టుబడులను తగ్గించుకోదు. అన్ని మార్కెట్ పరిస్థితుల్లోనూ ఈక్విటీ పెట్టుబడులను 95 శాతానికిపైనే నిర్వహించడాన్ని గమనించొచ్చు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ పెట్టుబడులను రంగాలవారీగా మార్పులు చేర్పులు మాత్రం చేస్తుంది. 2013లో సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్‌ను ఎక్కువగా నమ్ముకుంది. 2014లో ఆటో రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పెట్టుబడులను స్థిరంగా కొనసాగించడం, 2017లో సైయంట్‌లో వాటాలను పెంచుకోవడం ద్వారా మంచి రాబడులనే సొంతం చేసుకుంది. ఈ పథకం పనితీరుకు ప్రామాణిక సూచీ బీఎస్ఈ 500. ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు 11.5 శాతంగా ఉంటే, బెంచ్ మార్క్ (బీఎస్ఈ 500) రాబడులు 8.7 శాతం కావడం గమనార్హం. ఈ పథకంలో మూడేళ్ల కాలంలో వార్షిక సగటు రాబడులు 16.8 శాతం, ఐదేళ్లలో 26.3 శాతం చొప్పున ఉన్నాయి. కానీ ఇదే కాలంలో బెంచ్ మార్క్ రాబడులు 14.6 శాతం, 17.8 శాతంగానే ఉండడం గమనించాలి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్, ఎల్అండ్టీ ఇండియా వ్యాల్యూ ఫండ్ కంటే పనితీరులో ముందుంది. పోర్ట్‌ఫోలియో: ఆటో రంగంలో మారుతి సుజుకీకి ప్రాధాన్యం తగ్గించి తక్కువ విలువల వద్ద లభిస్తున్న ఎంఅండ్ఎం, హీరో మోటో కార్ప్‌లకు ప్రాధాన్యం ఇచ్చింది. అలాగే, విలువలు పెరిగిన ఎంఆర్ఎఫ్, ఎౖMð్సడ్ స్టాక్స్‌లో వాటాలు తగ్గించుకుంది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్‌లో పెట్టుబడులను పెంచుకుంది. అందులోనూ అధిక విలువల్లో ట్రేడ్ అవుతున్న హెచ్‌యూఎల్, గోద్రేజ్ కన్జ్యూమర్, డాబర్ కంటే ఐటీసీ, పరాగ్ మిల్క్ ఫుడ్స్‌ను నమ్ముకుంది. -
ఫండ్లా... లేక షేర్లా?
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను పొందుదామనే అభిలాష నేటి తరం వారిలో ఎక్కువగానే కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లపై వీరిలో అవగాహన కూడా నానాటికీ పెరుగుతోంది. అయితే, ఎక్కువ మందికి ఈ విషయంలో ఎదురయ్యే సాధారణ ప్రశ్న ఏమిటంటే... నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా లేక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలా?. ఈ ప్రశ్నకు సమాధానం ఎలా ఉన్నా... చాలా మంది నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికే ఆకర్షితులవుతుంటారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా అదే పని చేస్తుంటాయి...అదేదో తాము చేయలేమా? అన్నది వారి అభిప్రాయం. అయితే, స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడమనేది పూర్తిగా భిన్నమైన ఆట. ఈ రెండు రకాల ఇన్వెస్ట్‌మెంట్లకూ ఉన్న తేడాలపై... నిపుణులు చెప్పిన సూచనల ఆధారంగా అందిస్తున్న కథనమిది.. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభమన్నది కొందరి అభిప్రాయం. ఆసక్తి కలిగించే టిప్స్ ఆధారంగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం, ఆ తర్వాత స్వల్పకాలంలోనే అది ఎన్నో రెట్లు పెరుగుతుందని వేచి చూడటం సాధారణంగా చేసే పని. కానీ, ఇది నిజం కాదనేది అనుభవజ్ఞులైన స్టాక్ ఇన్వెస్టర్లకు తెలుసు. ఇందుకు ఎంతో పరిజ్ఞానం, అనుభవంతో పాటు కంపెనీ బ్యాలెన్స్ షీట్లు అధ్యయనం చేయటం... వాటి ఆధారంగా సరైన స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవటం వంటివన్నీ చేయాలనేది వారు చెబుతారు. మరికొందరు అవగాహన కోసం, అనుభవం కోసం ఎంతో సమయం వెచ్చిస్తుంటారు. కానీ, ఆ తర్వాత కూడా తప్పిదాలు చేస్తూనే ఉంటారు. అందుకే స్టాక్స్‌లో పెట్టుబడులు అన్నవి చిన్న పిల్లల ఆట మాదిరి కాదు. సరైన స్టాక్స్ ఎంపికకు ఎన్నో ఏళ్ల శ్రమ, ప్రావీణ్యం అవసరం. కానీ, మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే ఇంత ప్రావీణ్యం అవసరం లేదు. స్టాక్స్ ఇన్వెస్టింగ్ కోసం తగినంత సమయం కేటాయించలేని వారి కోసం ఉన్నవే మ్యూచువల్ ఫండ్స్. కాకపోతే తమకు తగిన మ్యూచువల్ ఫండ్ పథకం ఎంపిక చేసుకుంటే చాలు. కొన్ని ప్రాథమిక సూత్రాల ఆధారంగా మంచి ఫండ్ పథకాన్ని సులభంగానే ఎంచుకోవచ్చు. లేదా మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ నుంచి సలహాలు పొందొచ్చు. నియంత్రణ ఉండదు... ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను నిపుణులైన ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తుంటారు. కనుక ఏ స్టాక్స్‌ను ఎంచుకోవాలి, వేటి నుంచి బయటపడాలి అన్నది ఫండ్ మేనేజర్లే నిర్ణయిస్తుంటారు. కేవలం పెట్టుబడి పెట్టి దాన్ని మ్యూచువల్ ఫండ్ మేనేజర్‌కు అప్పగించడం వరకే ఇన్వెస్టర్ శ్రమ. స్టాక్స్ ఎంపికలో ఇన్వెస్టర్ల పాత్ర ఉండదు. కానీ, స్వయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఏ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్న నియంత్రణ ఉంటుంది. అంటే తమ ఈక్విటీలకు తామే ఫండ్ మేనేజర్ మాదిరి. తమకున్న పరిజ్ఞానం మేరకో, ఎవరో చెప్పారనో నచ్చిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ వారికి ఉంటుంది. కానీ, ఈ పనిని నిపుణులు నిర్వహించడం వల్ల వచ్చే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ప్రొఫెషనల్ మేనేజర్... ఓ విమానాన్ని పైలట్ నడపడానికి, డాక్టర్ నడపడానికి మధ్య తేడా ఉంటుంది. ఫ్లయింగ్ అర్హతలు లేని డాక్టర్ విమానాన్ని నడిపితే అది కూలిపోయే ప్రమాదాలే ఎక్కువ. ఈక్విటీలకు కూడా ఇదే వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్‌ను వృత్తిపరంగా నిపుణులైన మేనేజర్లు నిర్వహిస్తూ ఉంటారు. వీరు ఆర్థిక రంగం, క్రెడిట్ సైకిల్, వడ్డీ రేట్ల తీరుతెన్నులు, కంపెనీల మూలాల పరిశీలన, పన్నులు, వ్యాపారాలు, పలు దేశాల ఈక్విటీ మార్కెట్ల గమనం, విశ్లేషణ తదితర అంశాల్లో నిష్ణాతులై ఉంటారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉంటుంది. సంపద నిర్వహణలో కోర్సులు చేసి ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ పని విధానం... మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు ఏ స్టాక్స్‌ను కొనుగోలు చేయాలి, ఏ స్టాక్స్‌ను విక్రయించాలి అన్నది ఆషామాషీగా నిర్ణయించుకోరు. ఆయా కంపెనీలు వ్యాపారం, ఆయా రంగాలపై లోతైన అవగాహన, ఆర్థికాంశాల విశ్లేషణ ఆధారంగానే నిర్ణయాలు తీసుకో వడం జరుగుతుంది. కంపెనీ లు, వాటి ఫ్యాక్టరీలను సందర్శించ డంతోపాటు, ఉన్నత స్థాయి యాజమాన్యంతో నేరుగా సంప్రదింపులు జరిపి సమాచారం సేకరిస్తారు. కంపెనీల్లో అంతర్గతంగా ఏమి జరుగుతోంది? కంపెనీల భవిష్యత్తు గురించి మెరుగ్గా అంచనా వేయగలరు. ఏ స్టాక్స్‌ను కొనుగోలు చేయాలి, ఎప్పుడు, ఎంత మేర అన్నది 5–20 మంది అనలిస్టులతో కూడిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో పరిశోధన జరుగుతుంది. ఇది సాధారణ వ్యక్తులకు కష్ట సాధ్యం. అయినప్పటికీ చాలా మంది సాధారణ ఇన్వెస్టర్లు, తమకున్న కొన్నేళ్ల అనుభవం ఆధారంగా నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి విజయం సాధించగలమని నమ్ముతుంటారు. ఉదాహరణకు టీసీఎస్ ఉద్యోగి తన కంప్యూటర్ ముందు కూర్చుని, హాట్ టిప్స్ ఆధారంగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సులభమే. ఓ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ మాదిరిగా తాను కూడా తన పెట్టుబడుల్లో విజయం సాధించగలిగితే కేవలం రూ.లక్షల్లో ఉన్న ఉద్యోగంలోనే ఎందుకు కొనసాగాలి...? ముంబై వెళ్లి మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అవతారం ఎత్తితే రూ.కోట్లలో ప్యాకేజీలు అందుకోవచ్చు కదా!!. ఆటుపోట్లు, రాబడులు.. అన్నింటికంటే ఇది చాలా కీలకమైనది. ఏదైనా ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే, సంబంధిత పథకం 30–100 స్టాక్స్ మధ్య పెట్టుబడులను వర్గీకరించడం జరుగుతుంది. లాభాలు, నష్టాలు అన్నవి చాలా స్టాక్స్‌పై ఆధారపడి ఉంటాయి. అంటే రిస్క్ అన్నది ఏ ఒకటి రెండు స్టాక్స్ లేదా ఐదు స్టాక్స్‌పై కాకుండా, ఎన్నో స్టాక్స్ మధ్య విభజించి ఉంటుంది. దీంతో రాబడులు సగటుగా మారతాయి. ఓ స్టాక్ 100 శాతం రాబడులను ఇస్తే, మరో స్టాక్ 50 శాతం, ఇంకో స్టాక్ కేవలం 5 శాతం రాబడులనే ఇవ్వొచ్చు. అన్నీ కలిపి సగటున మారడంతో ఈక్విటీ ఫండ్స్‌పై రాబడులు మధ్య నుంచి దీర్ఘకాలంలో 10 శాతం నుంచి 25 శాతం మధ్య ఉంటుంటాయి. నేరుగా ఓ నాలుగైదు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఇలా మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తక్కువ, రాబడులు తక్కువ అనే తరహాలో ఉంటుంది. అదే నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే గరిష్టంగా ఎన్ని స్టాక్స్‌కు తమ పెట్టుబడులను కేటాయించాలి, రాబడులు ఏమేరకు, రిస్క్ తదితర అంశాలు కచ్చితంగా తెలిసి ఉండాలి. ఎక్కువ మంది 5–10 స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుండటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కేవలం రెండు మూడు స్టాక్స్‌లోనే రూ.లక్షలాదిగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ, ఒక్కో స్టాక్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉండటం వల్ల ఏదైనా మార్పులు జరిగితే రాబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అధిక రాబడులు, నష్టాలను నిర్వహించే నేర్పు చాలా మందిలో ఉండదు. రాబడులు కనిపిస్తే అమ్మేస్తుంటారు. అదే సమయంలో నష్టాల్లోకి వెళ్లినా భయంతో అమ్మేసి బయటపడుతుంటారు. తొందరగా బయటపడిపోదామన్న ఆలోచన తప్పిస్తే... ఆటలోనే కొనసాగుదామన్న ఆలోచన రాదు. ఎందుకంటే భావోద్వేగాలు వారిని కుదురుగా ఉండనీయవు. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే పదేళ్ల పాటు కూడా స్థిరంగా ఇన్వెస్ట్ చేయగలరు. కానీ, ఒకే స్టాక్‌లో పదేళ్లు కొనసాగడం అన్నది సాధారణ ఇన్వెస్టర్లలో కనిపించదు. సిప్ మార్గం... మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడులు పెట్టుకునే అవకాశం ఉంది. ప్రతీ వారం లేదా నెలకోసారి ఇలా నిర్ణీత మొత్తం ఆటోమేటిక్‌గా బ్యాంకు ఖాతా నుంచి సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు వెళ్లడం అన్నది మంచి ఆప్షన్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ అలవాటుగా మారుతుంది. అదే స్టాక్స్ విషయానికొస్తే... ప్రతి నెలా ఎంచుకున్న స్టాక్స్‌లో స్వయంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. వాస్తవికంగా ఇది ఓ పెద్ద సవాలు వంటిదే. ఎందుకంటే అంత కచ్చితంగా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేసే వారు తక్కువ మందే ఉంటారు. కొందరు కొన్ని నెలల పాటు కచ్చితంగా చేసినా, ఆ తర్వాత తమ నిర్ణయం మారిపోతుంది. తమ ఆలోచన, దృక్పథంలో మార్పు వస్తుంది. సెక్షన్ 80సీ ప్రయోజనం... ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడుల ప్రయోజనానికి అదనంగా సెక్షన్ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు పొందొచ్చు. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ ప్రయోజనం లేదు. అనుభవంలేని వారి కోసమే మ్యూచువల్ ఫండ్స్.. తగినంత అనుభవం లేని వారు, సమయం కేటా యించలేని వారి కోసమే మ్యూచువల్ ఫండ్స్ అన్నవి సృష్టించబడ్డాయి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత తమ పాత్ర చాలా పరిమితం. నిర్ణీత సమయానికోసారి రాబ డులు తాము ఆశించిన మేరకు, తమ లక్ష్య సాధనకు అనుగుణంగా ఉన్నాయా, లేవా అన్నది సమీక్షించు కుంటే సరిపోతుంది. అయినా సరే స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అది డే ట్రేడింగ్ మాదిరిగా ఉండరాదు. కంపెనీలను అధ్యయనం చేయడం, పోర్ట్‌ఫోలియోలోని ప్రతీ కంపెనీలో ఏం జరుగుతోం దన్నది పరిశీలిస్తూ వెళ్లాలి. యాక్టివ్‌గా ఉండాలి, అదే సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. భావోద్వేగాలు.. తగిన పరిశోధన తర్వాత నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు, ఆ తర్వాత తమ నిర్ణయం తప్పుగా మారితే అంగీకరించేందుకు సిద్ధపడరు. కొనుగోలుకు సంబంధించి దూకుడుగా నిర్ణయం తీసుకున్న వారు, అమ్మకానికి వచ్చే సరికి అలా చేయరు. చేసిన తప్పు ను నష్టానిౖMðనా సరిదిద్దుకునేందుకు వారి మనసు అంగీకరించదు. దాంతో నష్టాల్లో ఉన్న స్టాక్స్‌ను అమ్మడం ఇష్టం లేక ఏళ్ల తరబడి వాటిని అలానే ఉంచేసుకుని నష్టపోతుంటారు. ఆయా అంశాల నేపథ్యంలో అందువల్ల భావోద్వేగా లను నియం త్రించుకోలేని వారికి ఫండ్స్ మెరుగైన మార్గం. ఫీజులు... నేరుగా స్టాక్స్‌ను కొనుగోలు చేసి, విక్రయించేవారు డీమ్యాట్ అకౌంట్ చార్జీలను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఇతర లావాదేవీల చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్స్పెన్స్ రేషియో పేరుతో వ్యయాలను భరించాల్సి వస్తుంది. ఫండ్స్ నికర విలువ ఆధారంగా ప్రతీ రోజూ దీన్ని మినహాయించడం జరుగుతుంది. ఫండ్ యూనిట్ల ఎన్ఏవీలు రోజూ మారుతుంటాయి. స్టాక్స్ క్లోజింగ్ ధర, ఎక్స్పెన్స్ రేషియోను మినహాయించిన తర్వాత చూపించేదే ఎన్ఏవీ. ఎక్స్పెన్స్ రేషియో అన్నది ఈక్విటీ ఫండ్స్‌పై 1–2.5 శాతం మధ్య ఉంటుంది. ఇలా చూసినప్పుడు నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే చౌక. అయితే, మ్యూచువల్ ఫండ్స్‌కు తగ్గకుండా రాబడులను రాబట్టుకునే నైపుణ్యం ఉంటేనే ఆ మార్గాన్ని ఆశ్రయించాలి. నిజంగా ఆ నైపుణ్యం ఉన్న వారు ఫండ్స్ కంటే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే నయం. ఇది సాధ్యం కానప్పుడు, మీ తరఫున ఓ ఫండ్ మేనేజర్ గరిష్ట రాబడులను తీసుకొచ్చే పని చేస్తున్నప్పుడు ఈ వ్యయాలు భరించడం సహేతుకమే. -
షేర్ల జోరు : బఫెట్‌ను దాటేసిన జుకర్‌బర్గ్
శాన్ఫ్రాన్సిస్కో : ఓ వైపు కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా స్కాండల్, మరోవైపు యూజర్ల ప్రైవసీపై ఆందోళనలు ఫేస్‌బుక్‌ను తీవ్ర ఇరకాటంలో పడేసినప్పటికీ, ఆ కంపెనీ మాత్రం ఏ మాత్రం జంగకుండా శరవేగంగా దూసుకుపోయింది. శుక్రవారం ఫేస్బుక్ స్టాక్స్ ఆల్-టైమ్ రికార్డు గరిష్టంలో 203.23 డాలర్ల వద్ద ముగిశాయి. అతిపెద్ద స్పోర్ట్స్ స్ట్రీమింగ్ డీల్‌ను ఫేస్బుక్ దక్కించుకుంది అని తెలియగానే కంపెనీ స్టాక్స్ కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఉరకలు పెట్టారు. ఈ వార్త ఇన్వెస్టర్లకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. ఆసియాలోని థాయ్‌ల్యాండ్, వియత్నాం, కాంబోడియా, లావోస్‌లో 2019 నుంచి 2022 వరకు జరిగే 380 లైవ్ మ్యాచ్‌ల ఎక్స్‌క్లూజివ్ రైట్స్‌ను ఫేస్బుక్ దక్కించుకుందని టైమ్స్ రిపోర్టు చేసింది. ఈ డీల్ విలువ 264 మిలియన్ డాలర్లుగా పేర్కొంది. ఫేస్బుక్ స్టాక్స్ ఆల్‌టైమ్ గరిష్టంలో ర్యాలీ జరుపడంతో, కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంపద కూడా అదేమాదిరి దూసుకుపోయింది. వారెన్ బఫెట్‌ను దాటేసి, ప్రపంచంలో మూడో అత్యంత ధనికుడిగా నిలిచారు. దీంతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తర్వాత మూడో స్థానంలో జుకర్‌బర్గ్ ఉన్నారు. ప్రస్తుతం జుకవర్‌బర్గ్ సంపద 81.6 బిలియన్ డాలర్లుగా ఉంది. డేటా షేరింగ్ స్కాండల్‌తో మార్చి నెలలో ఫేస్బుక్ షేర్లు ఎనిమిది నెలల కనిష్టంలో 152.22 డాలర్ల వద్ద నమోదైన సంగతి తెలిసింది. శుక్రవారం రోజు ఈ స్టాక్ 203.23 డాలర్ల వద్ద ముగిసింది. -
ఫండ్స్‌లో పెట్టుబడుల ద్వారా సంపద పెంపు
సాక్షి, విశాఖపట్నం: సంపద పెంచుకోవడానికి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాల ని ఆదివారం విశాఖలో జరిగిన సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ సదస్సులో ముఖ్య వక్త సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు అవగాహన చేసుకోవడం కీలకమని, మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఎంపికలో జాగ్రత్త వహించాలని అన్నారు. ఖాతాదారుల ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తున్నాయని, డీమ్యా ట్, ట్రేడింగ్, ఏస్బీఐ ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. రియల్ ఎస్టేట్, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు మెరుగ్గా వుంటాయని ఆయన అన్నారు. సదస్సులో ఎస్బీఐ క్యాప్ రీజినల్ హెడ్ టి.జగన్మోహన్రెడ్డి, మ్యూచువల్ చీఫ్ మేనేజర్ ఎల్. కృష్ణకుమార్ నిపుణలు, సాక్షి విశాఖ బ్రాంచి మేనేజర్ కె.రేవతికుమారిలతో పాటు వ్యాపార, వర్తక యజమానులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
వావ్... ఒకటో తేదీ!
శ్రీహరి, సురేందర్ ఇద్దరూ చక్కని ఇన్వెస్టర్లే. ఒకోసారి మ్యూచువల్ ఫండ్స్‌లో, ఒకోసారి తామే స్వయంగా ఎంచుకున్న స్టాక్స్‌లో... ఇలా రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాకపోతే ఇద్దరి మధ్యా ప్రాథమికమైన తేడా ఒకటుంది. శ్రీహరి ప్రతినెలా ఒకటవ తేదీ కాగానే... తన బ్యాంకు ఖాతాలో పడ్డ జీతం నుంచి ఇన్వెస్ట్మెంట్లకు సరిపడా మొత్తాన్ని అప్పటికప్పుడే మళ్లించేస్తూ ఉంటాడు. సురేందర్ మాత్రం నెలలో ఎప్పుడో ఒకప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మళ్లించాలనే నియమం పెట్టుకున్నాడు. సహజంగా నెలాఖర్లో చేస్తే మంచిదని, తన ఖర్చులు పోను మిగిలినదెంతో తెలుస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఈజీ అని భావిస్తుంటాడు. ఇద్దరిదీ ఒకే ఆఫీసు, ఒకేరకమైన జీతం– జీవితం కావటంతో... ఒకసారి ఇద్దరి చర్చా ఇన్వెస్ట్మెంట్లపైకి మళ్లింది. ఇద్దరూ పదేళ్ల కిందట ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టగా... ‘‘నీ ఇన్వెస్ట్మెంట్లు ఇపుడు ఎంతయి ఉండొచ్చు హరీ?’’ అని అడిగాడు సురేందర్. అప్పటికప్పుడు తన మొబైల్లో పోర్ట్‌ఫోలియోను చూసుకున్న శ్రీహరి.. ‘‘దాదాపు 18 లక్షలపైనే ఉంది’’ అని చెప్పాడు. సురేందర్ తన పోర్ట్‌ఫోలియో కూడా చూసుకున్నాడు. అది దాదాపు 13 లక్షలుంది. ‘‘అరె! ఇంత తేడా ఉందే?’’ అని ఆశ్చర్యపోయాడు. అదే ప్రశ్న హరిని కూడా అడిగాడు. ‘‘నేను ప్రతినెలా 1వ తేదీన ఇన్వెస్ట్ చేస్తా! మరి నువ్వు?’’ అని ప్రశ్నించాడు శ్రీహరి. ‘‘నేను నెలలో ఏదో ఒక తేదీలో చేస్తుంటాను. ఎప్పుడైనా ఆ నెల కుదరకపోతే మానేస్తా. అందుకని.. ఇంత తేడా ఉంటుందా?’’ అన్నాడు సురేందర్. అప్పుడు ఒకటో తేదీ మహాత్మ్యం గురించి చెప్పటం మొదలెట్టాడు శ్రీహరి. అదేంటో మనమూ చూద్దాం... ‘‘నెలాఖర్లో స్వయంగా ఇన్వెస్ట్ చేయడమనేది నిజంగా చాలా సులభమైన ప్రక్రియ. ఎందుకంటే అప్పటికే ఆ నెలకు సంబంధించి అన్ని అవసరాలకు ఏర్పాట్లు జరిగిపోయి ఉంటాయి. ఎంత మిగిలిందో స్పష్టంగా తెలిసిపోతుంది. అదే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలామంది చేసే పని ఇదే. కాకపోతే, దీనికన్నా నెల మొదట్లోనే ఆటోమోడ్లో బ్యాంకు ఖాతా నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌కు నిధులు తరలివెళ్లేలా ఏర్పాటు చేసుకోవడం వల్ల లాభమెక్కువ. పక్కా ప్రణాళిక తప్పనిసరి... ప్రతి నెలా మొదట్లోనే ఇన్వెస్ట్ చేసేందుకు వీలైన మార్గం ఒకటుంది. అదేంటంటే... ప్రతి నెలా మన అవసరాలన్నిటికీ ఎంత నిధి కావాలో మొదట తేల్చుకోవాలి. దానికి అదనంగా మరో 10 శాతం కలిపి బ్యాంకు ఖాతాలో ఉంచుకోవాలి. ఆ తర్వాత మన సంపాదనలో మిగులంతా ఇన్వెస్ట్‌మెంట్‌కు వెళ్లిపోవాలి. ఉదాహరణకు శ్రీనాథ్ అనే వ్యక్తి ఏం చేశాడో చూద్దాం. శ్రీనాథ్ నెల వేతనం రూ.50,000. కానీ నెల చివరికి వచ్చేసరికి తన ఖాతాలో రూపాయి మిగలడం లేదు. అతడి కుటుంబ పోషణ, ఇతర అవసరాలను ఓ పేపర్‌పై పెట్టి చూస్తే ప్రతీ నెలా ఖర్చులకు రూ.35,000 అవసరమని తేలింది. అంటే మిగిలిన రూ.15,000 దుబారా అవుతున్నాయని ఇక్కడ తెలుస్తోంది. ఇటువంటప్పుడు శ్రీనాథ్ ప్రతీ నెలా 35,000+10 శాతం మార్జిన్ మనీ అనుకుంటే 3,500 కలిపి రూ.38,500ను నెలవారీ అవసరాల కోసం పక్కన పెట్టాలి. మిగిలిన రూ.11,500 సిప్ రూపంలో ఒకటో తేదీనే ఇన్వెస్ట్‌మెంట్‌కు పంపేయాలి. శ్రీనాథ్ 10 శాతం మార్జిన్ మనీగా ఉంచిన రూ.3,500 గనక ఒకవేళ ఖర్చు కాకుండా ఉంటే మరుసటి నెలలో దాన్ని అత్యవసర నిధికి మళ్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులకు కళ్లెం వేయడం, ఇన్వెస్ట్ చేయడం రెండూ నెరవేరతాయి. పొదుపునకు దారి... మొబైల్స్, గ్యాడ్జెట్లు, పార్టీలు, ప్రయాణాలు ఇలా ఎన్నో రూపాల్లో సంపాదనంతా ఖర్చు పెట్టేసే ధోరణి పెరిగిపోతోంది. దీనికి అలవాటు పడ్డామా ఆర్థికంగా ముందడుగు వేయటం కష్టమవుతుంది. అందుకే ముందు ఇంటి కోసం బడ్జెట్ వేసుకుని... అవసరాలకు సరిపడినంతే ఉంచుకుని, మిగులు నిధులను ఒకటో తేదీనే పెట్టుబడికి తరలించడం చేయాలి. ఇది చేసి పెట్టేదే సిప్. ఈ అలవాటు ప్రారంభంలో కష్టమే అనిపించొచ్చు. ఆచరించడం మొదలు పెడితే సులభంగా మారిపోతుంది. అంతేకాదు ఒకటో తారీఖే ఇన్వెస్ట్మెంట్ పూర్తయిపోతే ఇక నెలంతా ఉన్న నిధులతో స్వేచ్ఛగా వ్యవహరించొచ్చు. క్రమశిక్షణ అలవాటవుతుంది... ఉదాహరణకు మనం ప్రతినెలా చివర్లో రూ.10,000 చొప్పున పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నామంటే... అది అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. కొన్ని సార్లు పెట్టుబడిని వాయిదా వేయాల్సి రావచ్చు. కొన్ని సార్లు ఓ వారం ఆగి మళ్లీ వేతనం వచ్చిన తర్వాత మళ్లిద్దాంలే! అనుకునే సందర్భాలూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఖర్చుల కారణంగా ఆ నెలకు మానేయాల్సి రావచ్చు కూడా. మొత్తమ్మీద చాలా సార్లు ఇన్వెస్ట్మెంట్ సాధ్యం కాదు. దానికి బదులు ఒకటో తేదీన ఆటోమోడ్లో ఆ మొత్తం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో బ్యాంకు ఖాతా నుంచే వెళ్లేలా ఆప్షన్ ఎంచుకోవాలి. వేతనం జమ అయిన వెంటనే మనం ఎంచుకున్న తేదీన పెట్టుబడి మొత్తం బ్యాంకు ఖాతా నుంచి మినహాయించేస్తారు. ఇందులో మన జోక్యం ఏమీ ఉండదు. కానీ, ఇన్వెస్ట్మెంట్ జరిగిపోతుంది. కాకపోతే, చాలా మంది సిప్‌కు ఓకే చెప్పినా ఆటోమోడ్ను ఎంచుకోరు. తామే నిర్ణీత తేదీన ఇన్వెస్ట్ చేయొచ్చునని అనుకుంటుంటారు. కానీ, ఎంత క్రమశిక్షణాపరులైనా గానీ దీన్ని అమలు చేయడం కష్టమే. ఎందుకంటే అధిక ఖర్చులు దీనికి విఘ్నం కలిగించొచ్చు. లేదా క్రమశిక్షణ లోపించొచ్చు. కారణమేదైనా గానీ చివరికి నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే సిప్‌ను ఎంచుకుని, ఆటోమోడ్లో నిధులు పంపించటాన్ని పెట్టుబడుల్లో విజయానికి తొలి అడుగుగా భావించాలి. అనవసర వ్యయాలుంటాయి... సరఫరా అనేది డిమాండ్‌ను సృష్టిస్తుందనేది ఆర్థిక సూత్రం. దీన్ని సగటు వ్యక్తులకు అన్వయించి చూస్తే... బ్యాంకు ఖాతాలో మిగులు నిధులు ఉంటే వాటిని ఖాళీ చేసేందుకు కావాల్సినన్ని అవసరాలు కళ్ల ముందు కనిపిస్తాయి. ఇలా కాకుండా ముందు పెట్టుబడి పెట్టాకే ఏదైనా అన్న సూత్రాన్ని ఫాలో అయ్యామనుకోండి. ఫలితాలు కళ్ల ముందుంటాయి. అవసరాలు తీరిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ అని నెల చివర ముహూర్తం పెట్టుకున్నామనుకోండి. మనలో సంకల్పం ఉన్నా నెల చివరికి వచ్చే సరికి బ్యాంకు ఖాతాలో నిధులేవీ మిగిలి ఉండవు మరి! ఎందుకంటే మన ప్రథమ ప్రాధాన్యం ఖర్చులు, అవసరాలు. అందుకే ఇలా జరగకుండా ఉండటానికే ప్రతి నెలా బ్యాంకు ఖాతాలో వేతనం పడటం ఆలస్యం... దాన్ని మనం చూసేలోగానే అందులోంచి ఇన్వెస్ట్మెంట్ భాగం డిడక్ట్ అయిపోయేలా ప్రణాళిక ఉండాలి. రిస్క్ కూడా తక్కువే ప్రతి నెలా సిప్ విధానంలో దీర్ఘకాలం పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. మార్కెట్లు బుల్ దశలో ఉన్నా, బేర్ దశలో ఉన్నా మన ఇన్వెస్ట్మెంట్లు కొనసాగుతాయి. దాంతో ఇన్వెస్ట్మెంట్ సగటుగా మారి కొనుగోలు ధర తగ్గుతుంది. రాబడులు అధికంగా ఉంటాయి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు సిప్ విధానంలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉదాహరణకు శ్రీనాథ్, రామ్‌నాథ్ మంచి స్నేహితులు. పన్ను ఆదా కోసం ఇద్దరూ ఏడాదిలో సెక్షన్ 80సీ కింద ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నారు. నిర్ణయించుకున్నారు. శ్రీనాథ్ ఫిబ్రవరిలో ఏక మొత్తంలో రూ.1,50,000 ఇన్వెస్ట్ చేయగా, రామ్‌నాథ్ మాత్రం ఏప్రిల్ నుంచి ప్రతినెలా 12,500 చొప్పున ఈఎల్ఎస్ఎస్లో సిప్ చేశాడు. ఒక్కో యూనిట్ మార్కెట్ ధర శ్రీనాథ్ కొన్నప్పుడు రూ.50గా ఉండగా, రామ్‌నాథ్ ఏడాది పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాడు కనుక కొన్ని సందర్భాల్లో ఆయనకు యూనిట్ రూ.41కి కూడా లభించింది. దీంతో సగటున ఒక్కో యూనిట్ రూ.44కే లభించింది. ఇద్దరి మధ్య పెట్టుబడుల విలువలో ఇది చెప్పుకోతగ్గ వ్యత్యాసం తీసుకొచ్చింది’’ అంటూ ముగించాడు శ్రీహరి. ముందుగా మొదలెట్టేయాలి... శ్రీహరి, సురేందర్ పెట్టుబడుల్లో అంత తేడా ఎందుకొచ్చిందో తెలిసిందిగా!! అదంతా ఒకటో తేదీ మహాత్మ్యం. సిప్ చేసిన గమ్మత్తు. అందుకని మీరు కూడా వెంటనే నెల బడ్జెట్ వేసుకుని మిగులు నిధులను మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలోకి ఒకటో తేదీనే వెళ్లేలా ప్లాన్ చేసుకుంటే బెటర్! దీర్ఘకాలంలో ఎక్కువ సంపద సృష్టించే అవకాశం ఉంటుంది!! బెస్టాఫ్ లక్. -
స్టాక్స్ వ్యూ
కొచ్చిన్ షిప్‌యార్డ్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.547 టార్గెట్ ధర: రూ.725 ఎందుకంటే: ఇది ప్రభుత్వ రంగ కంపెనీ. భారత షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ రంగంలో అత్యంత నిలకడగా రాణిస్తున్న, అగ్రగామి కంపెనీ కూడా ఇదే. భారత షిప్‌బిల్డింగ్ సెగ్మెంట్లో ప్రీమియర్ కంపెనీగా అవతరించింది. డిజైనింగ్, ఇంజినీరింగ్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ విభాగాల్లో మంచి పనితీరు కనబరుస్తోంది. ఈ విభాగంలో ఈ కంపెనీ మార్కెట్ వాటా 39 శాతంగా ఉంది. సంక్లిష్టమైన నౌకలు రిపేర్లు చేయడంలో నైపుణ్యం సాధించింది. నౌకల నిర్మాణం వ్యాపారం లాభదాయకత కంటే రెండు రెట్లు లాభదాయకత అధికంగా ఉండే నౌకల రిపేర్ల వ్యాపారానికి సంబంధించిన ఆర్డర్ బుక్ పెరుగుతోంది. కంపెనీ ప్రస్తుత ఆర్డర్ బుక్ విలువ రూ.3,000 కోట్లుగా ఉండగా, మరో రూ.12,000 కోట్ల ఆర్డర్లకు బిడ్డింగ్ చేయనున్నది.. ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ (ఐఏసీ)కు సంబంధించి మూడో దశ ఆర్డర్లు ఈ కంపెనీకే దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ ఆర్డర్ల విలువ రూ.8,000 కోట్లకు మించ ఉండవచ్చని అంచనా. ఈ ఆర్డర్ల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరం వరకూ కంపెనీ ఆదాయ ఆర్జన పటిష్టంగా ఉండనున్నది.అంతర్జాతీయంగా షిప్‌బిల్డింగ్ వ్యాపారం ఒడిదుడుకులమయంగా ఉన్న 2007–17 కాలంలో ఈ కంపెనీ ఆదాయం 11 శాతం, నికర లాభం 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించడం కంపెనీ పనితీరుకు అద్దం పడుతోంది. నికర రుణ భారం రూ.123 కోట్లుగా, నగదు నిల్వలు రూ.1,600 కోట్లుగా ఉన్నాయి. రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.2,800 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నది. 2012–17 కాలానికి రిటర్న్ ఆన్ ఈక్విటీ 16%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 17%గా ఉన్నాయి. రూ.2,800 కోట్ల పెట్టుబడులతో అతి పెద్ద షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. రెండేళ్లలో కంపెనీ ఆదాయం 14%, ఇబిటా 13%, నికర లాభం 11% చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా. ఎన్టీపీసీ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.167 టార్గెట్ ధర: రూ.211 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 6 శాతం క్షీణించి రూ.10,200 కోట్లకు తగ్గింది. ఇక 2015–16 ఆర్థిక సంవత్సరం సవరించిన నికర లాభం 5 శాతం వృద్ధితో రూ.10,800 కోట్లకు పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16 శాతంగా నమోదైంది. సగటు ఇంధన వ్యయం 4 శాతం పెరిగి ఒక్కో కిలోవాట్ అవర్‌కు రూ.1.92గా ఉంది. బొగ్గుకు సంబంధించి సగటు వ్యయం 10 శాతం పెరిగినప్పటికీ, గ్యాస్ ధరలు తగ్గడం, బొగ్గు వినియోగం తగ్గించడం కలసివచ్చాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో 9.5 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 1.1 మిలియన్ టన్నులకు తగ్గాయి. కొన్ని అనుబంధ కంపెనీలు, జాయింట్ వెంచర్లు టర్న్ అరౌండ్ కావడం కంపెనీకి ప్రయోజనం కలిగించాయి. జాయింట్ వెంచర్ల నుంచి డివిడెండ్లు 25 శాతం పెరిగి రూ.163 కోట్లకు పెరిగాయి. 2015–16లో రూ.140 కోట్లుగా ఉన్న జాయింట్ వెంచర్ల నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.620 కోట్లకు పెరిగింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీపీసీ తమిళనాడుకు రూ.140 కోట్ల నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.99 కోట్ల లాభాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్టీపీసీ తమిళనాడు టర్న్ అరౌండ్ కాగా, ఎన్టీపీసీ–సెయిల్ నికర లాభం 57 శాతం పెరిగింది. దేశీయంగా విద్యుదుత్పత్తి సంస్థల పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సగటు 79 శాతంగా ఉండగా, ఎన్టీపీసీకి చెందిన పదికి పైగా ప్లాంట్లు 85 శాతం పీఎల్‌ఎఫ్‌ను సాధించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జాయింట్ వెంచర్ల కంపెనీల నుంచి 445 మెగావాట్ల విద్యుత్తు అదనంగా జత కానున్నది. మూడేళ్లలో ఎన్టీపీసీ కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం చొప్పున వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా పుస్తక విలువకు 1.2 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. -
మార్కెట్లో టీచర్స్ డే ఎఫెక్ట్..!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లలో టీచర్స్ డే ఉత్సాహం నెలకొంది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఎడ్యుకేషన్ రంగ షేర్లు లైమ్ లైట్లోకి వచ్చాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో భారీగా లాభాలను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్వీ డెనిం అండ్ ఎక్స్పోర్ట్ షేర్లు 5 శాతం కరీర్ పాయింట్ 4 శాతం, ఎంటీఎడ్యుకేర్ 3.69 శాతం, లాభాలతో కొనసాగుతున్నాయి. మరోవైపు యూరోప్, ఆసియన్ మార్కెట్లు నష్టపోతున్నప్పటికీ దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నాటి భారీ నష్టాలనుంచి ఇవాళ రీ బౌండ్ అయ్యాయి. బ్యాంకింగ్, మీడియా రంగ షేర్ల లాభాల మద్దుతుతో సెన్సెక్స్ ఒక దశలో 100 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా సాంకేతికంగా కీలకంగా భావించే 9900కి పైన స్థిరంగా కొనసాగుతోంది. -
పాక్ ప్రధానికి షాక్: మార్కెట్లు క్రాష్
కరాచీ: పనామా గేట్ వ్యవహారం పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు పదవీగండం తెచ్చి పెడితే అక్కడి స్టాక్‌మార్కెట్లను అశని పాతంలా తాకింది. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు ఒక్క సారిగా కుప్పకూలిపోయాయి. ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ షాక్ తగలడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన భారీ అమ్మకాలకు దారి తీసింది. కోర్టు తీర్పుపై అంచనాల నేపథ్యంలో ఆరంభంలో ఒక దశలో 12 వందల పాయింట్లు పడిపోయిన సూచీ ఆ తర్వాత కొద్దిగా తేరుకుని 45వేల మార్క్ వద్ద స్థిరపడింది. అయితే కోర్టు తీర్పు వెలువడిన నిమిషాల్లోనే అక్కడి మార్కెట్లు క్రాష్ అయ్యాయి. కరాచీ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కెఎస్ఈ 700 పాయింట్లు పతనమైంది. కాగా ఈ తీర్పు నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షరీఫ్ రాజీనామా చేశారు. -
పీవీఆర్, ఐనాక్స్ లకు బాహుబలి జోష్
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా మారుమ్రోగించిన బాహుబలి-ది బిగినింగ్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేసింది. బాహుబలి: ది బిగినింగ్ రీఎంట్రీ మల్టిప్లెక్స్ ఆపరేటర్లు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లకు భలే జోష్ నిచ్చింది. హిందీ వెర్షన్లలో 1000కి పైగా స్క్రీన్లపై ఈ సినిమాను మల్టిప్లెక్స్ లో ప్రదర్శిస్తున్నారు. బాహుబలి రీ-రిలీజ్ సందర్భంగా నేటి మార్కెట్లో పీవీఆర్ షేర్లు 3 శాతం పైగా పైకి దూసుకెళ్లగా.. ఐనాన్స్ 0.30 శాతం లాభపడ్డాయి. ఓ వైపు దేశీయ బెంచ్ మార్కు సూచీలు తీవ్ర నష్టాల దిశగా పయనిస్తున్న సమయంలోనే పీవీఆర్, ఐనాక్స్ షేర్లను బాహుబలి: ది బిగినింగ్ ఆదుకుంది. గత మూడు నెలల్లో ఈ మల్టిఫ్లెక్స్ ల షేర్లు 30 శాతానికంటే పైకి దూసుకెళ్లాయి. మల్టిప్లెక్స్ ఆపరేటర్లకు మార్చి క్వార్టర్ ఎంతో లాభదాయకమైన త్రైమాసికమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దంగాల్, రాయిస్, కబాలి, జోలీ ఎల్ఎల్బీ2, బద్రినాథ్ కి దుల్హానియా వసూళ్లు ఈ కంపెనీ షేర్లకు భారీగా కలిసివచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బాహుబలి రీ-రిలీజ్ మరింత సెంటిమెంట్ ను బలపరుస్తుందన్నారు. ఏప్రిల్ 28 'బాహుబలి 2' విడుదల అవుతున్న సందర్భంగా మరోమారు 'బాహుబలి 1'ను విడుదల చేసేందుకు థియేటర్ యాజమాన్యాలు నిర్ణయించాయి. తెలుగులో పరిమిత సంఖ్యలో విడుదలవుతున్నా.. హిందీలో మాత్రం మరోసారి ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఒక కొత్త సినిమా మాదిరిగానే హౌస్ ఫుల్ కావడం బాహుబలికున్న క్రేజ్ చాటిచెప్తోంది. ఈ రీ-రిలీజ్ సినిమాను 17వ తేదీ లోపున చూసిన వారికి, బాహుబలి 2 టిక్కెట్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
జియో సమ్మర్ ఎఫెక్ట్: టెలికాం స్టాక్స్ ఢమాల్
ఉచిత ఆఫర్లకు స్వస్తి చెప్పి, ఇక టారిఫ్ లు అమలు చేయబోతుందనుకున్న రిలయన్స్ జియో ఇచ్చిన సమ్మర్ సర్ప్రైజ్ ఎఫెక్ట్ టెలికాం దిగ్గజాలను తాకింది. జియో ప్రైమ్ ఆఫర్ గడువును మరో 15 పొడిగింపుతో పాటు, ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వారికి రూ.303 రీఛార్జ్ తో మరో మూడు నెలల పాటు కాంప్లిమెంటరీ సర్వీసుల కింద ఉచితంగా సేవలందించనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించడంతో ఇతర టెలికాం కంపెనీల ఇన్వెస్టర్లలో ఆందోళన ప్రారంభమైంది. దీంతో టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలో 3 శాతానికి పైగా పడిపోయాయి. సంచలనకరమైన జియో డేటా ఆఫర్లతో, ఉచిత కాల్స్ పై తమ బిజినెస్ అవుట్ లుక్ ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో జియోలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు మంచి లాభాలు చేకూరుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో జియో షేర్లు 52 వారాల గరిష్టంలో 4.5 శాతం పైకి ఎగిసి రూ.1,380.50 వద్ద నమోదవుతోంది. ప్రైమ్ మెంబర్ షిప్ లో ఇప్పటికే 7 కోట్ల మంది కస్టమర్లను ఛేదించామని కంపెనీ ప్రకటించేసింది. ఈ ప్రకటన రిలయన్స్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ గా.. ఇతర టెలికాం కంపెనీల ఇన్వెస్టర్లకు ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 3.60 శాతం పైగా లాభాల్లో ట్రేడవుతుండగా.. ఐడియా సెల్యులార్ షేరు ధర 0.82 శాతం, ఎయిర్ టెల్ షేరు ధర 2.87 శాతం, వొడాఫోన్ 0.33 శాతం, భారతీ ఇన్ఫ్రాటెల్ 1.47శాతం నష్టాల్లో రన్ అవుతున్నాయి. -
స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
ఇన్వెస్ట్ చేయడం సులభం. చేతిలో డబ్బులుంటే చేసేయొచ్చు. కానీ విజయవంతమైన ఇన్వెస్టర్‌గా ఎదగడమే కష్టం. ప్రస్తుతం మార్కెట్లో చాలా ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్టాక్స్ ఒకటి. ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులకు తేడా ఉంది. ఇక్కడ రిటర్న్స్‌తో పాటు రిస్క్‌లూ ఎక్కువగా ఉంటాయి. అందుకే మన కష్టార్జితాన్ని వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందే స్టాక్ మార్కెట్ గురించి అన్ని విషయాలను సమగ్రంగా తెలుసుకోవాలి. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.. మీకు తెలిసిన రంగాలకు చెందిన, అవగాహన ఉన్న కంపెనీల స్టాక్స్‌నే కొనుగోలు చేయాలి. స్టాక్స్ కొనుగోలు చేయాలనుకుంటున్న కంపెనీ ఏ కార్యకలాపాలు నిర్వహిస్తుందో చూడాలి. కంపెనీ పనితీరు ఎలా ఉందో గమనించాలి. దాని త్రైమాసిక ఫలితాలను చదవండి. బ్యాలెన్స్‌షీట్ ఎలా ఉందో చూడండి. కంపెనీ మేనేజ్మెంట్ గురించిన సమాచారాన్ని తెలుసుకోండి. కంపెనీ స్టాక్ విలువ ఏ విధంగా ఉందో చూడండి. అంటే కొన్ని స్టాక్స్ ధర వాటి అసలు విలువ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే స్టాక్స్ కొనుగోలుకు వెచ్చించే మొత్తం సమంజసంగా ఉందో లేదో ఒకటి రెండు సార్లు చూసుకోండి. మీరు స్టాక్స్ కొనాలనుకున్న కంపెనీ ప్రత్యర్థుల గురించి కూడా తెలుసుకోవాలి. వాటి పనితీరు, కార్యకలాపాలు ఎలా ఉన్నాయో చూడాలి. కంపెనీకి సంబంధించిన పీఈ నిష్పత్తి, బీటా, డివిడెండ్, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, డెట్, నికర ఆదాయం వంటి అంశాలనూ చూడండి. దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. మార్కెట్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఉండండి. -
చైనా మార్కెట్లు జూమ్.. ట్రంప్ ఎఫెక్ట్?
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ స్టన్నింగ్విక్టరీ చైనామార్కెట్లకు మాంచి బూస్ట్ ఇచ్చింది. గురువారం షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ గురువారం రికార్డ్ స్థాయిలో దూసుకుపోయింది. చైనా మార్కెట్లు 1.4 శాతం లాభపడగా, చైనా స్టాక్స్ 10 నెలల గరిష్ఠానికి చేరాయి. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 1.4 శాతం జంప్ చేసి 3,171 పాయింట్లకు చేరింది. ఈ ఏడాది జనవరి8 తరువాత ఇదే అత్యధికమని ఎనలిస్టుల అంచనా. బ్లూచిప్ షేర్ల ఇండెక్స్ సీఎస్ఐ ఇండెక్స్ కూడా1.1శాతం ఎగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా ఆర్థిక, పరిశ్రమ రంగ షేర్లతోపాటు చైనా ప్రాపర్టీ డీలర్ జెయింట్ వాంటే 7.5 శాతం ఎగిసింది. దీంతో మరో రియల్ ఎస్టేట్ బహుళజాతి సంస్థ ఎవర్ గ్రాండ్.. వాంటే లో మరో 8.3 వాటాను పెంచింది. కాగా ఒకవైపు ట్రంప్ అనూహ్య విజయంతో ప్రపంచం షాక్ లో ఉండగా, ఆసియా మార్కెట్లు పాజిటివ్ గా స్పందించాయి. మరోవైపు చైనా మార్కెట్లు కఠినమైన మూలధన నియంత్రణ కారణంగా సాధారణంగా అంతర్జాతీయ ట్రెండ్ కు పెద్దగా స్పందించవు. కానీ లోయర్ లెవల్స్‌లో మదుపర్ల కొనుగోళ్లు స్థిరపడుతున్న చైనా ఆర్థిక వ్యవస్థకు నిదర్శమని తెలుస్తోంది. కాగా దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా సుమారు 500 పాయింట్ల లాభానికి చేరువలో ఉన్నాయి. బుధవారం వెయ్యిపాయింట్లకు పైగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ధోరణి భారీగా నెలకొంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ రంగాలు భారీగా లాభపడుతున్నాయి. అయితే నిన్న భారీగా దూసుకుపోయిన బంగారం నేడు స్థిరంగా ట్రేడవుతోంది. -
నోట్ల రద్దుతో రియల్టీపై తీవ్ర ఒత్తిడి
‘కేంద్రం చర్య దీర్ఘకాలంలో రియల్టీ పరిశ్రమ వృద్ధికి బాగా దోహదపడుతుంది. పారదర్శకత పెరుగుతుంది కనక నిధుల సమీకరణలో డెవలపర్ల సమస్యలు కొంతమేర తగ్గుతారుు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో ధరలు అనువైన స్థారుుకి తగ్గొచ్చు. రెసిడెన్షియల్, ల్యాండ్ మార్కెట్లలో లావాదేవీలు తగ్గుతూ రావడం వల్ల సమీప భవిష్యత్తులో పరిశ్రమపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుంది. - శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా చీఫ్ సాహసోపేత నిర్ణయం.. నల్ల ధనం కట్టడికి ప్రధాని మోది తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఎన్నడూ తీసుకోలేదు. ప్రభుత్వం అనుకున్నట్టుగా ప్రధాని నిర్ణయ ప్రభావం స్వల్పకాలంలోనే స్పష్టంగా కనపడుతుంది. చిన్న, మధ్యతరహా వ్యాపారుల లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరుగుతారుు. ప్రధాని చెప్పినట్టుగా న్యాయంగా వ్యాపారం చేసుకునే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలి. - రవీంద్ర మోది, ఫ్యాప్సీ ప్రెసిడెంట్ నల్లధనానికి చెక్... కేంద్రం చాలా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. నల్లధనం, టెరర్ ్రఫైనాన్‌సకు ఇది ఎదురుదెబ్బ. కేంద్ర నిర్ణయాన్ని ఫిక్కీ స్వాగతిస్తోంది. తాజా నిర్ణయంతో ప్రజలు కొంత అసౌకర్యానికి గురికావొచ్చు. సమస్యల త్వరితగతి నియంత్రణకు ఆర్బీఐ, కేంద్రం సంయుక్తంగా పనిచేస్తున్నారుు. - హర్షవర్ధన్ నోతియా, ప్రెసిడెంట్- ఫిక్కీ దీర్ఘకాలానికి మంచి ఫలితాలు.. ప్రభుత్వ చర్య హర్షణీయం. దీని వల్ల ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉత్పన్నమైనా.. దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందొచ్చు. అంతర్జాతీయంగా పారదర్శకత, అవినీతి విభాగాల్లో భారత్ ర్యాంక్ మెరుగుపడుతుంది. - మమతా బినాని, ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ అవినీతి కట్టడికిది సరైన నిర్ణయం ఇప్పుడున్న నల్ల ధనం బయటపడడానికి రూ.500, రూ.1,000 నోట్ల రద్దును మోదీ అస్త్రంగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ధరల స్థిరీకరణ జరగడం ఖాయం. రానున్న రోజుల్లో గృహ కొనుగోళ్లలో నగదు లావాదేవీలకు ఆస్కారం ఉండకపోవచ్చు. వ్యక్తుల చేతుల్లోని నగదు పూర్తిగా బ్యాంకు వ్యవస్థలోకి వచ్చి అధికారికమవుతుంది. ఆర్థిక వృద్ధికి బాటలు పరుస్తుంది. - కలిశెట్టి నాయుడు, రిటైల్ రంగ నిపుణులు ఇన్వెస్టర్ల నమ్మకం పెరుగుతుంది.. కేంద్ర నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుస్తుంది. బ్లాక్ మనీ, అసాంఘిక కార్యకలాపాలకు నిధుల మళ్లింపు ఇక కట్టడి అవుతుంది. నోట్ల రద్దు వల్ల సామాన్యులకు కొంత ఇబ్బందున్నా.. ఇది స్వల్పకాలమే. ప్రభుత్వం, బ్యాంకులు తగు చర్యలు తీసుకుని ఆర్థిక లావాదేవీలు నిరాటంకంగా సాగేలా చూస్తాయనే నమ్మకం ఉంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రపంచ వ్యాపార పటంలో భారత్ ర్యాంకు మెరుగై ఇన్వెస్టర్ల నమ్మకం అధికమవుతుంది. పెట్టుబడుల రాక పెరుగుతుంది. - రమేష్ దాట్ల, సీఐఐ దక్షిణప్రాంత చైర్మన్ -
కళకళలాడుతున్న జెమ్స్ అండ్ జ్యుయలరీ షేర్లు
ముంబై: రానున్న దసరా, దీపావళి పండుగల సందర్భంగా మార్కెట్ లో బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలకు చెందిన షేర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మదుపర్ల కొనుగోళ్లతో ఈ పలు కంపెనీల షేర్లు ధగధగ లాడుతున్నాయి. పండుగ ఉత్సాహంతో నెలకొన్న బైయింగ్ సపోర్ట్ తో దాదాపు అన్ని జెమ్స్ అండ్ జ్యుయలరీ స్టాక్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి. ముఖ్యంగా గోల్డియం ఇంటర్నేషన్ లిమిటెడ్ 15శాతం, తారా జ్యుయలరీ 9శాతం, గీతాంజలి జెమ్స్ 11 శాతం, పీసీ జ్యుయలరీ 6 శాతం, త్రిభువన్ దాస్ భీమ్ జీ జవేరీ లిమిటెడ్ 5 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. అలాగే టైటాన్ కో లిమిటెడ్ , రాజేష్ లిమిటెడ్ కూడా లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో స్పెక్యులేటర్లు కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారని ఎనలిస్టుల అంచనా. అటు బులియన్ మార్కెట్లో గత కొన్ని సెషన్లు గా నీరసంగా ఉన్న పసిడి ధరలు కూడా పుంజుకున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో ఉదయం నుంచీ జోరుమీదున్న పుత్తడి200 రూపాయల లాభంతో 29,780 వద్ద ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రా. బంగారం ధరలు Gold 193రూపాయలు ఎగిసి రూ. 29,850 వద్ద ఉంది. ఇది ఇలా ఉండగా స్టాక్ మార్కెట్లు స్వల్పలాభనష్టాల మధ్య ఊగిసలాడుతో స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. -
మరో 109 పాయింట్లు అప్
వరుసగా ఆరో నెలలోనూ పెరిగిన మార్కెట్ ముంబై: విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడంతో బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 109 పాయింట్లు ర్యాలీ జరిపి 28,452 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో నిఫ్టీ 42 పాయింట్ల పెరుగుదలతో 8,786 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ రెండు సూచీలు వరుసగా ఆరో నెలలోనూ పెరగడం విశేషం. ఆగస్టు నెలలో సెన్సెక్స్ 401 పాయింట్లు, నిఫ్టీ 148 పాయింట్ల చొప్పున ర్యాలీ జరిపాయి. కీలకమైన జీడీపీ డేటా వెలువడనున్న నేపథ్యంలో కూడా భారీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో బుధవారం మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగిందని విశ్లేషకులు తెలిపారు. వెలుగులో ఆటో షేర్లు: ఆగస్టు నెలకు అమ్మకాల డేటా గురువారం వెల్లడికానున్న సందర్భంగా ఆటోమొబైల్ షేర్లు వెలుగులో నిలిచాయి. హీరో మోటో కార్ప్ 2.13 శాతం, టాటా మోటార్స్ 1.73 శాతం చొప్పున ఎగిసాయి. బ్యాంకింగ్ షేర్లు సైతం మార్కెట్‌కు ఊతమిచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1 శాతంపైగా పెరిగి రికార్డు గరిష్టస్థాయి రూ. 1,291 వద్ద ముగి సింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐలు స్వల్పంగా ర్యాలీ జరిపాయి. ఫెడ్ రేట్లు పెంచినా.. మా సెన్సెక్స్ లక్ష్యం 28,800: సిటి గ్రూప్ అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినా, ఈ సంవత్సరాంతానికి తమ సెన్సెక్స్ లక్ష్యమైన 28,800 స్థాయిని కొనసాగిస్తున్నట్లు సిటిగ్రూప్ ప్రకటించింది. ఫెడ్ వడ్డీ రేట్లు డిసెంబర్లో పెరగవచ్చని, అయితే భారత్ ఫండమెంటల్స్ మార్కెట్‌ను ముందుకు నడిపిస్తాయని విశ్లేషించింది. 20 శాతం పెరిగిన నిర్మాణ రంగ స్టాక్స్ నిర్మాణ రంగానికి చెందిన కంపెనీల స్టాక్స్ ధరలు బుధవారం 20 శాతం వరకూ పెరిగాయి. పరిశ్రమలోని మొండిబకాయిలు, ద్రవ్య లభ్యతకు సంబంధించిన పలు అంశాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం వల్ల స్టాక్ ధరలు ఎగశాయి. బీఎస్ఈలో హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ షేరు 19.83 శాతం, గామన్ ఇండియా షేరు 16.55 శాతం, పుంజ్ లాయిడ్ షేరు 12 శాతం, యూనిటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ షేరు 11.14 శాతం, గామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు 6.3 శాతం, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ షేరు 2.86 శాతం ఎగశాయి. -
ఫ్రీ శా(ప్లా)ండ్!
జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ నిల్వలు వర్షాలతో ఆగిన తవ్వకాలు అక్రమాలకు తెర లేపిన కొందరు వ్యాపారులు అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం అక్రమార్కుల జేబులు నింపుతోంది. ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే కొందరు వ్యాపారులు అక్రమ మార్గాలకు తెరలేపారు. అక్రమ నిల్వలతో కృత్రిమ కొరత సృష్టించి, విక్రయాలు పెంచుకోవాలని ప్రయత్నించగా, ఇటీవల కురిసిన వర్షాలు వారికి మరింతగా కలిసొచ్చాయి. – పిఠాపురం అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు అక్రమార్కులు నిబంధనలను తుంగలోతొక్కి, వందల యూనిట్ల ఇసుకను కొల్లగొడుతూ, అక్రమ నిల్వలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఉచిత ఇసుక విధానం ప్రకటించగానే, అప్పటివరకు నిలిచిపోయిన నిర్మాణాలు ఒక్కసారిగా ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు 5 యూనిట్ల లారీ ఇసుక రూ.32 వేలకు అమ్ముడుపోగా, ఇసుక ఉచిత విధానంతో అదే ఇసుక రూ.10 వేలకు లభ్యమైంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు అక్రమాలకు తెరలేపారు. వివిధ వాహనాల్లో దొరికిన చోటల్లా వందల యూనిట్ల ఇసుకను ఉచితంగా తరలించి, కొన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిల్వ చేశారు. ఎక్కడా 20 యూనిట్ల ఇసుక కంటే ఎక్కువ నిల్వ ఉండరాదన్న కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీగా ఇసుక నిల్వలు ఉంచారు. దీనిని అధికారులు పట్టించుకోకపోవడంతో, ఇదంతా అధికార పార్టీ నేతల అండదండలతో జరుగుతోందన్న ఆరోపణలకు బలం చేకూరింది. రెండు నెలల పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లక్ష యూనిట్లకు పైగా నిల్వలు చేసినట్టు తెలుస్తోంది. కొరతతో ధర రెట్టింపు ఇటీవల కురుస్తున్న వర్షాలతో గోదావరి పొంగిపొర్లడంతో పలుచోట్ల రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో ఇసుక కొరత ఏర్పడడంతో దానికి గిరాకీ పెరిగింది. అక్రమ నిల్వలు చేసిన వ్యాపారులు ఇదే అదనుగా ఇసుకను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 5 యూనిట్ల లారీ ఇసుక రూ.10 వేలకు తక్కువగా విక్రయించగా, ప్రçస్తుతం ఇసుక కొరతను సాకుగా చూపి అదే లారీ ఇసుకను రూ.23 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇసుకలో కల్తీ కూడా.. పనిలో పనిగా ఆ అక్రమార్కులు కల్తీకి కూడా తెరలేపారు. గోదావరి ఇసుకతో పాటు గొర్రిఖండి, ఏలేరు ఇతర పంట కాలువల్లో దొరికే ఇసుకను, తీర ప్రాంతంలో లభించే బొండుమట్టిని కలిపి గోదావరి ఇసుకగా అమ్ముతున్నారని చెబుతున్నారు. ఇసుక రీచ్ ను ంచి ఇసుక లోడుతో వచ్చే రెండు లారీల ఇసుక వినియోగదారుల వద్దకు వచ్చేసరికి మూడు లారీలుగా మారుతోందంటున్నారు. పెద్దఎత్తున లారీలతో ఉచిత ఇసుకను తరలించి, రెండు లారీల ఇసుకను, మూడు లారీల్లో లోడ్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. -
షేర్లవైపూ చూడండి..!
♦ ద్రవ్యోల్బణానికి తగ్గ రాబడి అక్కడే వస్తుంది ♦ జీవిత బీమాకు యూలిప్ పాలసీలు చాలవు ♦ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ రెగో సూచనలు నేనో ప్రభుత్వోద్యోగిని. వయస్సు 46 సంవత్సరాలు. నెల వేతనం రూ.50,000. నేను రిటైరవడానికి మరో పన్నెండేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం సొంతంగా ఇండిపెండెంట్ హౌస్, ఒక డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్ ఉన్నాయి. ఈ ఏడాది ఆఖరుకి ఇంటి మీద మరో ఫ్లోర్ వేయాలనుకుంటున్నాను. ఇందుకోసం రూ.4 లక్షలు పొదుపు చేశాను. బ్యాంకు నుంచి మరో రూ.5 లక్షలు తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా తీసుకున్న హౌసింగ్ లోన్ మీద వడ్డీకి సంబంధించి డిడక్షన్ క్లెయిమ్ చేసుకునే వీలుందా? పెట్టుబడుల విషయానికొస్తే, నెలకు రూ.4,000 ఫండ్స్‌లో (సిప్ మార్గంలో), మరో రూ.1,000 ఎస్బీఐ చిల్డ్రన్ యులిప్ పాలసీకి, పోస్టల్ ఆర్డీ కింద రూ. 3,500 కడుతున్నాను. ఎంఐఎస్ ఫండ్‌లో రూ.4 లక్షలు, ఎఫ్డీలో మరో రూ.6 లక్షలు ఉన్నాయి. ఎల్ఐసీ మనీ బ్యాంక్ పాలసీ నుంచి రూ.1 లక్ష వస్తుంది. ఎస్బీఐ స్మార్ట్ పర్ఫార్మర్లో అయిదేళ్ల పాటు రూ.50,000 ఇన్వెస్ట్ చేశాను. ప్రస్తుతం దాని విలువ రూ.3 లక్షలు. ఈ ఏడాది అటు ఎస్బీఐ వెల్త్ బిల్డింగ్‌లో రూ.50,000 పెట్టుబడి పెట్టాను. లక్ష్యాలకు సంబంధించి మా అబ్బాయికి ప్రస్తుతం 14 సంవత్సరాలు. తన చదువుకు తగినంత నిధి, నా రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం రూ.40 లక్షల మేర ఫండ్‌ను సమకూర్చుకోవాలనుకుంటున్నాను. తగిన సూచనలు చేయగలరు. అశోక్ గారు, మీరిచ్చిన వివరాలు పరిమితంగానే ఉన్నాయి. వాటికి అనుగుణంగా సూచనలిస్తున్నాను. ఇంటి రుణం మీద చెల్లించే అసలు, వడ్డీకి సెక్షన్ 80సీ, సెక్షన్ 24ల కింద డిడక్షన్ పొందవచ్చు. పోస్టల్ రికరింగ్ డిపాజిట్ల మీద ప్రస్తుతం 7.4% మేర వడ్డీ లభిస్తోంది. యులిప్ పాల సీలతో తగినంత జీవిత బీమా కవరేజి లభించదు. అలాగే, రాబడులు కూడా మీ అవసరాలకు అనుగుణంగా లభించకపోవచ్చు. కాబట్టి.. వీటి కాలవ్యవధి తీరిన తర్వాత వీలయితే డిస్కంటిన్యూ చేయొచ్చు. ఈక్విటీవైపు చూడండి... మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే .. మీ పోర్ట్‌ఫోలియో ఎక్కువగా రియల్టీ, డెట్‌లోనే కేంద్రీకృతమై ఉంది. మీ అబ్బాయి చదువుకు కావాల్సిన డబ్బును సమకూర్చుకోవాలంటే ఈక్విటీల్లో పెట్టుబడులు మరికాస్త మెరుగైన రాబడులందించే అవకాశముంది. మీరు ఎంత నిధి సమకూర్చుకోవాలనుకుంటున్నారన్నది తెలియరాలేదు. కాకపోతే దాదాపు 12 సంవత్సరాల వ్యవధి ఉన్నందున.. ఈక్విటీ మార్కె ట్ల హెచ్చుతగ్గుల రిస్కుల ప్రభావాలు మీ పెట్టుబడులపై తక్కువగానే ఉండగలవు. ఎల్ఐసీ నుంచి వచ్చిన డబ్బును, ఆర్డీ..యులిప్‌ల ద్వారా వచ్చిన డబ్బుతో ఈక్విటీ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పద్ధతిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ అబ్బాయి చదువు కోసం వీలయినంత ఎక్కువగా పెట్టుబడికి కేటాయించవచ్చు. రూ.40 లక్షలు చాలవేమో!! రిటైర్మెంట్ నాటికి రూ. 40 లక్షల దాకానైనా ఉండాలనుకుంటున్నారు. ఇది పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం మీ దగ్గర రూ. 16.3 లక్షల మేర ఉన్నాయి (రికరింగ్ డిపాజిట్లు, యులిప్‌ల ప్రస్తుత విలువ తెలియనందున వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే), అలాగే సిప్ మార్గంలో నెలకు చేసే రూ. 5,000 (ఆర్డీ, యులిప్ నిధులు మళ్లించాకా చేసే ఇన్వెస్ట్మెంట్) పెట్టుబడులు సురక్షితంగా 8 శాతం రాబడినైనా ఇస్తాయి. అయితే, మీరు ఇక్కడ ధరల పెరుగుదలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణం 5 శాతంగా వేసుకున్నా.. మీరు ఇప్పుడు రూ.40 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అప్పటికి రూ.72 లక్షలు అవసరమవుతాయి. ఇప్పటికే మీరు రూ. 4,000 సిప్ చేస్తున్నందున.. ఈ అదనపు మొత్తం సమకూర్చుకోవడానికి అది తోడ్పడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.. ఇక, ఇతరత్రా రిస్కుల నుంచి మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కలిగించే ందుకు కనీసం రూ. 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. 20 సంవత్సరాల టర్మ్ పాలసీ తీసుకుంటే ఏడాదికి సుమారు రూ. 11,000 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అలాగే మరో రూ. 25 లక్షలకు వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ కూడా తీసుకోండి. దీనికి ఏటా దాదాపు రూ. 4,000 ప్రీమియం ఉంటుంది. వైద్య అవసరాల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనే భావిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మీకోసం, మీ జీవిత భాగస్వామి కోసం పర్సనల్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటే.. రిటైర్మెంట్ తర్వాత అధిక ప్రీమియంలు కట్టాల్సిన అవసరం ఉండదు. తదుపరి కొన్నేళ్ల తర్వాత మీ పోర్ట్‌ఫోలియోను ఒకసారి పునఃసమీక్షించుకోండి. రిటైర్మెంట్కి దగ్గరయ్యే కొద్దీ పెట్టుబడులను క్రమంగా డెట్ సాధనాల వైపు మళ్లించండి. అయితే, పూర్తి స్థాయిలో ఫలితాలు లభించేందుకు మంచి ఫైనాన్షియల్ ప్లానర్‌ను సంప్రదించి తగిన ఆర్థిక ప్రణాళికలు రూపొందిం చుకుని, పాటించడం శ్రేయస్కరం. అనిల్ రెగో ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్ -
ప్రభుత్వ నిర్ణయంతో దూసుకుపోయిన షేర్లు
ముంబై: రక్షణ, విమానయాన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దేశీయ మార్కెట్లో విమానయాన రంగ షేర్లు భారీ లాభాలతో ముగిసాయి. స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ , ఇంటర్ గ్లోబ్ ఎయిర్ వేస్ షేర్ల లాభాల పట్టాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ .ఇప్పటివరకు 49 శాతానికి పరిమితమై ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రకటించడంతో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఇటీవల కొత్త విమాన యాన పాలసీతో విమానయాన రంగానికి తీపి కబురు అందించిన ప్రభుత్వం తాజాగా , వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం నాటి మార్కెట్లో ఆయా రంగ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో దాదాపు అన్ని విమాన యాన రంగ షేర్లు గ్రీన్ గా ముగిశాయి. స్పైస్ జెట్ 7.36 శాతం లాభాలను ఆర్జించగా, జెట్ ఎయిర్ వేస్ లిమిటెడ్ 7.03 శాతం లాభంతో రూ. 589 దగ్గర, ఇంటర్ గ్లోబ్ ఎయిర్ వేస్ 6 శాతం లాభంతో రూ.1071 దగ్గర ముగసింది. కాగా రక్షణ, విమానయాన, ఫార్మా రంగాల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఒకే చెప్పింది. ముఖ్యంగా ఏవియేషన్ రంగంలో 100శాతం పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. అయితే డిఫెన్స్ రంగంలో కొన్ని పరిమితులను కూడా విధించింది. ఆయుధ చట్టం 1959 ప్రకారం చిన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారీకి ఇవి వర్తిస్తాయి. దీంతోపాటుగా ప్రభుత్వ అనుమతి పొందిన ట్రేడింగ్, ఈ-కామర్స్, భారత్‌లో తయారయ్యే ఆహార ఉత్పత్తులపై కూడా విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా వూపింది.