ఫ్రీ శా(ప్లా)ండ్‌! | free sand | Sakshi
Sakshi News home page

ఫ్రీ శా(ప్లా)ండ్‌!

Published Sat, Jul 30 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

ఫ్రీ శా(ప్లా)ండ్‌!

ఫ్రీ శా(ప్లా)ండ్‌!

  • జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ నిల్వలు     
  • వర్షాలతో ఆగిన తవ్వకాలు
  • అక్రమాలకు తెర లేపిన కొందరు వ్యాపారులు
  • అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు
  •  
    అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం అక్రమార్కుల జేబులు నింపుతోంది. ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే కొందరు వ్యాపారులు అక్రమ మార్గాలకు తెరలేపారు. అక్రమ నిల్వలతో కృత్రిమ కొరత సృష్టించి, విక్రయాలు పెంచుకోవాలని ప్రయత్నించగా, ఇటీవల కురిసిన వర్షాలు వారికి మరింతగా 
    కలిసొచ్చాయి.        – పిఠాపురం
     
    అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు అక్రమార్కులు నిబంధనలను తుంగలోతొక్కి, వందల యూనిట్ల ఇసుకను కొల్లగొడుతూ, అక్రమ నిల్వలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఉచిత ఇసుక విధానం ప్రకటించగానే, అప్పటివరకు నిలిచిపోయిన నిర్మాణాలు ఒక్కసారిగా ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు 5 యూనిట్ల లారీ ఇసుక రూ.32 వేలకు అమ్ముడుపోగా, ఇసుక ఉచిత విధానంతో అదే ఇసుక రూ.10 వేలకు లభ్యమైంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు అక్రమాలకు తెరలేపారు. వివిధ వాహనాల్లో దొరికిన చోటల్లా వందల యూనిట్ల ఇసుకను ఉచితంగా తరలించి, కొన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిల్వ చేశారు. ఎక్కడా 20 యూనిట్ల ఇసుక కంటే ఎక్కువ నిల్వ ఉండరాదన్న కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీగా ఇసుక నిల్వలు ఉంచారు. దీనిని అధికారులు పట్టించుకోకపోవడంతో, ఇదంతా అధికార పార్టీ నేతల అండదండలతో జరుగుతోందన్న ఆరోపణలకు బలం చేకూరింది. రెండు నెలల పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లక్ష యూనిట్లకు పైగా నిల్వలు చేసినట్టు తెలుస్తోంది.
    కొరతతో ధర రెట్టింపు
    ఇటీవల కురుస్తున్న వర్షాలతో గోదావరి పొంగిపొర్లడంతో పలుచోట్ల రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో ఇసుక కొరత ఏర్పడడంతో దానికి గిరాకీ పెరిగింది. అక్రమ నిల్వలు చేసిన వ్యాపారులు ఇదే అదనుగా ఇసుకను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 5 యూనిట్ల లారీ ఇసుక రూ.10 వేలకు తక్కువగా విక్రయించగా, ప్రçస్తుతం ఇసుక కొరతను సాకుగా చూపి అదే లారీ ఇసుకను రూ.23 వేల వరకు విక్రయిస్తున్నారు.
    ఇసుకలో కల్తీ కూడా..
    పనిలో పనిగా ఆ అక్రమార్కులు కల్తీకి కూడా తెరలేపారు. గోదావరి ఇసుకతో పాటు గొర్రిఖండి, ఏలేరు ఇతర పంట కాలువల్లో దొరికే ఇసుకను, తీర ప్రాంతంలో లభించే బొండుమట్టిని కలిపి గోదావరి ఇసుకగా అమ్ముతున్నారని చెబుతున్నారు. ఇసుక రీచ్‌ ను ంచి ఇసుక లోడుతో వచ్చే రెండు లారీల ఇసుక వినియోగదారుల వద్దకు వచ్చేసరికి మూడు లారీలుగా మారుతోందంటున్నారు. పెద్దఎత్తున లారీలతో ఉచిత ఇసుకను తరలించి, రెండు లారీల ఇసుకను, మూడు లారీల్లో లోడ్‌ చేసి అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement