free scheme
-
కర్ణాటక: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అక్కడ తప్ప!
హుబ్లీ(బెంగళూరు): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం హుబ్లీ ధార్వాడ జంట నగరాల్లోని ప్రతిష్టాత్మక బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బీఆర్టీఎస్) చిగరి బస్సుల్లో లేదని సంబంధిత అధికారులు తెలిపారు. రూ.కోట్ల వ్యయంతో హుబ్లీ ధార్వాడ నగరాల మధ్య ప్రత్యేక మార్గం ద్వారా చిగరి బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా బీఆర్టీఎస్ పేరిట నిర్వహిస్తున్న చిగరి బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వాయువ్య ఆర్టీసీ సంస్థ ఎండీ భరత్ విలేకరులకు తెలిపారు. చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా! -
ఎన్నికల హామీలకు నిధులెలా తెస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉచితాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మోడల్ కోడ్‌ను(ఎన్నికల ప్రవర్తనా నియమావళి) సవరించాలని ఎన్నికల సంఘం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఓటర్లకు చెప్పాలని, ఈ ప్రతిపాదనపై ఈ నెల 19వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలకు మంగళవారం లేఖ రాసింది. మేనిఫెస్టోల్లో ప్రకటించిన ఎన్నికల వాగ్దానాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ఓటర్లకు అందజేయాలని లేఖలో స్పష్టం చేసింది. మోడల్ కోడ్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఆర్థిక వనరులు ఏమిటో కూడా ఓటర్లకు తెలియచేయాలని వెల్లడించింది. పార్టీ ఇచ్చే ఎన్నికల హామీల విషయంలో తాము కళ్లు మూసుకొని కూర్చోలేమని తేల్చిచెప్పింది. బూటకపు వాగ్దానాలతో విపరిణామాలు రాజకీయ పార్టీలు ఇచ్చే బూటకపు వాగ్దానాలు విపరిణామాలకు దారితీస్తాయని ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయకుండా తాము అడ్డుకోలేకపోనప్పటికీ, ఓటర్లకు సమాచారం ఇచ్చే హక్కు ఉందని పేర్కొంది. ఇకపై దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నిర్దిష్ట ఫార్మాట్లో పార్టీల వ్యయాల వివరాలను అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల వివరాలను ఓటర్లకు చెప్పే అంశాన్ని ఎన్నికల ప్రవర్తనా నియామావళి(ఎంసీసీ)లోని పార్ట్–8లో (ఎన్నికల మేనిఫెస్టోపై మార్గదర్శకాలు) చేరుస్తూ ఎంసీసీని సవరించాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. దీని ప్రకారం మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీల అమలుకు నిధులు సేకరించే మార్గాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అదనపు పన్నులు, ఖర్చుల హేతుబద్దీకరణ, కొన్ని పథకాల్లో కోత, మరిన్ని అప్పులు తీసుకురావడం వంటి వివరాలు వెల్లడించాలి. ఓటర్లకు ఉచితాలు పంచే సంస్కృతికి రాజకీయ పార్టీలు చరమగీతం పాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే పిలుపునిచ్చారు. దీనిపై అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సైతం జరిగింది. ఉచితాలపై సర్వోన్నత న్యాయస్థానంలో సైతం ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉచితాల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను తాము అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని.. ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో వెచ్చించడమే ఇక్కడ ప్రధాన అంశమని పేర్కొంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచిత హామీలు చేయకుండా నిరోధించాలని కోరుతూ లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఉచితం అనే పదాన్నే నిర్వచించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఉచిత తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలను ఉచితాలుగా వర్ణించలేమనిపేర్కొన్నారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని చెప్పలేమన్నారు. ఉచిత వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఉచిత వాగ్దానాల సమస్య జఠిలమవుతోందన్న జస్టిస్ ఎన్వీ రమణ అసలు ఉచిత హామీ, సంక్షేమ పథకం అని తేల్చేది ఎలా అంటూ ప్రశ్నించారు. ఉచిత తాయిలం అంటే ఏంటో అర్థాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, దీనిపై మరింత చర్చ జరగాలని పేర్కొన్నారు. శనివారం (ఆగస్టు 20)లోగా తమ సూచనలు దాఖలు చేయాలని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది. చదవండి: బిహార్‌లో న్యాయశాఖ మంత్రి అరెస్టు కలకలం... తనకేం తెలియదన్న సీఎం -
ఫ్రీ శా(ప్లా)ండ్!
జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ నిల్వలు వర్షాలతో ఆగిన తవ్వకాలు అక్రమాలకు తెర లేపిన కొందరు వ్యాపారులు అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం అక్రమార్కుల జేబులు నింపుతోంది. ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే కొందరు వ్యాపారులు అక్రమ మార్గాలకు తెరలేపారు. అక్రమ నిల్వలతో కృత్రిమ కొరత సృష్టించి, విక్రయాలు పెంచుకోవాలని ప్రయత్నించగా, ఇటీవల కురిసిన వర్షాలు వారికి మరింతగా కలిసొచ్చాయి. – పిఠాపురం అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు అక్రమార్కులు నిబంధనలను తుంగలోతొక్కి, వందల యూనిట్ల ఇసుకను కొల్లగొడుతూ, అక్రమ నిల్వలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఉచిత ఇసుక విధానం ప్రకటించగానే, అప్పటివరకు నిలిచిపోయిన నిర్మాణాలు ఒక్కసారిగా ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు 5 యూనిట్ల లారీ ఇసుక రూ.32 వేలకు అమ్ముడుపోగా, ఇసుక ఉచిత విధానంతో అదే ఇసుక రూ.10 వేలకు లభ్యమైంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు అక్రమాలకు తెరలేపారు. వివిధ వాహనాల్లో దొరికిన చోటల్లా వందల యూనిట్ల ఇసుకను ఉచితంగా తరలించి, కొన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిల్వ చేశారు. ఎక్కడా 20 యూనిట్ల ఇసుక కంటే ఎక్కువ నిల్వ ఉండరాదన్న కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీగా ఇసుక నిల్వలు ఉంచారు. దీనిని అధికారులు పట్టించుకోకపోవడంతో, ఇదంతా అధికార పార్టీ నేతల అండదండలతో జరుగుతోందన్న ఆరోపణలకు బలం చేకూరింది. రెండు నెలల పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లక్ష యూనిట్లకు పైగా నిల్వలు చేసినట్టు తెలుస్తోంది. కొరతతో ధర రెట్టింపు ఇటీవల కురుస్తున్న వర్షాలతో గోదావరి పొంగిపొర్లడంతో పలుచోట్ల రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో ఇసుక కొరత ఏర్పడడంతో దానికి గిరాకీ పెరిగింది. అక్రమ నిల్వలు చేసిన వ్యాపారులు ఇదే అదనుగా ఇసుకను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 5 యూనిట్ల లారీ ఇసుక రూ.10 వేలకు తక్కువగా విక్రయించగా, ప్రçస్తుతం ఇసుక కొరతను సాకుగా చూపి అదే లారీ ఇసుకను రూ.23 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇసుకలో కల్తీ కూడా.. పనిలో పనిగా ఆ అక్రమార్కులు కల్తీకి కూడా తెరలేపారు. గోదావరి ఇసుకతో పాటు గొర్రిఖండి, ఏలేరు ఇతర పంట కాలువల్లో దొరికే ఇసుకను, తీర ప్రాంతంలో లభించే బొండుమట్టిని కలిపి గోదావరి ఇసుకగా అమ్ముతున్నారని చెబుతున్నారు. ఇసుక రీచ్ ను ంచి ఇసుక లోడుతో వచ్చే రెండు లారీల ఇసుక వినియోగదారుల వద్దకు వచ్చేసరికి మూడు లారీలుగా మారుతోందంటున్నారు. పెద్దఎత్తున లారీలతో ఉచిత ఇసుకను తరలించి, రెండు లారీల ఇసుకను, మూడు లారీల్లో లోడ్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి.