హుబ్లీ(బెంగళూరు): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం హుబ్లీ ధార్వాడ జంట నగరాల్లోని ప్రతిష్టాత్మక బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బీఆర్‌టీఎస్) చిగరి బస్సుల్లో లేదని సంబంధిత అధికారులు తెలిపారు. రూ.కోట్ల వ్యయంతో హుబ్లీ ధార్వాడ నగరాల మధ్య ప్రత్యేక మార్గం ద్వారా చిగరి బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే.
కాగా బీఆర్‌టీఎస్ పేరిట నిర్వహిస్తున్న చిగరి బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వాయువ్య ఆర్‌టీసీ సంస్థ ఎండీ భరత్ విలేకరులకు తెలిపారు.
చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా!
Comments
Please login to add a commentAdd a comment