
తుమకూరు(బెంగళూరు): టికెట్ కలెక్షన్ రాలేదనే కోపంతో మహిళా ప్రయాణికులను ఎక్కించుకోకుండా బస్సును ముందుకు తీసుకెళ్తున్న డ్రైవర్ చర్యను మహిళలు అడ్డుకోగా వారిపైకి బస్సును దూకించేందుకు యత్నించాడు. ఈ ఘటన తుమకూరు జిల్లా కొరటెగెరె నాగేనహళ్లి గేట్ వద్ద జరిగింది. చామరాజనగర జిల్లా కొళ్లేగాల నుంచి కొందరు మహిళలు జిల్లాలోని గోరవనహళ్లి మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు.
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు నాగేనహళ్లి గేట్ వద్ద వేచి ఉన్నారు. ఆ మార్గంలో వచ్చిన కేఎస్ ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే కలెక్షన్ లేదని బాధతో ఉన్న డ్రైవర్ బస్సును ఆపలేదు. దీంతో మహిళలు బస్సు ముందుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్ వారిపైకి వాహనాన్ని ఎక్కించే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ప్రవర్తనపై మహిళలంతా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్ మునిశామి రెడ్డి మహిళలకు వేరే బస్సును ఏర్పాటు చేశారు. బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
చదవండి: Aryan Dubey Rebirth Story: ‘ఆవిడ మా ఆవిడే..’ పునర్జన్మ చెబుతూ హడలెత్తిస్తున్న కుర్రాడు!