
బెంగళూరు: నగరంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఓ హోటల్‌లో 33 ఏళ్ల మహిళపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్యాటరింగ్ సర్వ్ చేసే మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జ్యోతి నివాస్ కాలేజ్ జంక్షన్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ మహిళను ఓ నలుగురు కుర్రాళ్లు ఫాలో అయ్యారు. వారంతా హోటల్ తీసుకున్నామని, అక్కడకి డిన్నర్ కు భోజనం తీసుకురమ్మని చెప్పారు. దాంతో ఆమె డిన్నర్‌కు భోజనం తీసుకెళ్లగా వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
డిన్నర్ చేసిన తర్వాత వారంతా ఆమెను లొంగదీసుకున్నట్లు ఆమె ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ హెటల్ టెర్రాస్ పై కి తీసుకెళ్లి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారన్నారు. ఈ ఉదయం(శుక్రవారం) ఆరు గంటలకు ఆమెను వదిలేశారన్నారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయటంతో పాటు పోలీసులకు చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.
ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ హోటల్లో పని చేయడానికి వచ్చిన వారిగా గుర్తించినట్లు సదరు పోలీస్ అధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment