
ఏదైనా గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది. గొప్పగా బ్రతకొచ్చు.. నీ గొప్పను అవతలి వాడు చెప్పుకోవాలి.. అంతేకానీ మనకు అవకాశం దొరికింది కదాని లేనిపోని గొప‍్పలకు పోతే ఇలానే ఉంటుంది. ఓ వ్యక్తి గొప్పలకు పోయాడు. తాను ఓ కుక్కును పెంచుకుంటున్నాడు. అది సహజమే. కాకపోతే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు అంటూ గొప్పలకు పోయాడు. నిజంగానే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు ఉంటుందో లేదో తెలీదు కానీ, ఇక్కడ ఆ మనిషి నోరు జారిన ‘గొప్ప’ ఈడీ రైడ్స్ వరకూ వెళ్లింది.
విషయంలోకి వెళితే.. తాను అత్యంత ఖరీదు అని చెప్పుకునే కుక్కను తీసుకుని గత ఫిబ్రవరిలో ఓ షోకు వెళ్లాడు సతీష్ అనే వ్యక్తి. అక్కడ తన కుక్క విలువ రూ. 50 కోట్లంటూ ఏవో గొప్పలు చెప్పుకున్నాడు. ఇదొక అరుదైన జాతి కుక్క అని, దీని విలువ లక్షరాల రూ. 50 కోట్లని బహిరంగంగా ప్రకటించాడు. ఇది ఆనోట ఈనోట మారి ఈడీ వరకూ వెళ్లింది. ఫిబ్రవరిలో ఏదో చెప్పుకున్నాడు.. కానీ ఈడీ ఓ కన్నేసి ఉంచింది. అతనికి రెండు నెలల తర్వాత సోదాల పేరుతో వెళ్లింది. కుక్కనే అంత పెట్టి కొన్నాడంటే ఇంక ఎంత ఉంటుందో అని ఈడీ లెక్కలు వేసుకుంది. అంతే అతనికి ఇంటికి గురువారం వెళ్లి సోదాలు చేపట్టింది.
ఈ క్రమంలోనే అతనికి సంబంధించి అన్నీ ఆరాలు తీసింది. అతని బ్యాంకు అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే పెద్ద మొత్తంలో ఏమీ లావాదేవీలను జరగలేదని విషయాన్ని గుర్తించింది. కుక్కను రూ. 50 కోట్లను పెట్టి కొనుగోలు చేసినట్లు అతను చెప్పిన కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేసింది. అయితే అతను లావాదేవీల్లో అంత పెద్ద మొత్తాన్ని ఈడీ గుర్తించలేదు. హవాలా రూట్ లో ఏమైనా చేశాడా.. అనే కోణాన్ని ఈడీ దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది.