
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓమ్ ప్రకాష్ హత్య ఉదంతం ఇప్పటికే సంచలనంగా మారితే, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకంది. సదరు అధికారి భార్యతో కలిసి కారులో ఎయిర్ పోర్టుకు వెళుతున్న సమయంలో దారి కాచి కొంతమంది వ్యక్తులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. బైక్ కీతో ముఖంపై పిడుగుద్దులు కురిపించి తీవ్రంగా గాయపరిచారు. పక్కనున్న ఆఫీసర్ భార్యపై దుర్భాషలాడారు.
వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ గా పని చేస్తున్న బోస్.. ఈరోజు(సోమవారం) ఉదయం భార్యతో కలిసి ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నాడు. భార్య కారు డ్రైవ్ చేస్తుండగా, బోస్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఇంతలో మమ్మల్ని దాటుకుని వచ్చిన ఒక బైక్ మా కారుకు అడ్డంగా ఆగింది. బైక్ పై నుంచి దిగిన ఓ వ్యక్తి మమ్ముల్ని కన్నడలో తిట్టడం ప్రారంభించాడు. వారు మా కారుకు అంటించి ఉన్న డీఆర్డీవో స్టిక్కర్ చూశారు. మీరు డీఆర్డీవో వారా అంటూ నిలదీశాడు. మా భార్యను కూడా తిట్టడం ప్రారంభించారు. నేను భయపడలేదు. ఆ సమయంలో కారు నుంచి కిందకు దిగాను. ఓ వ్యక్తి తన బైక్ తాళం చెవితో నా నుదుటిపై దాడి చేశాడు. నా ముఖానికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఆర్మీకి చెందిన వారిని ఇలానే ట్రీట్ చేస్తారా అని మనసుకు బాధగా అనిపించింది.
వారు చేసిన దాడి నుంచి ఏదో రకంగా తప్పించుకుని బయటపడ్డాం. ఇక్కడ మాకు దేవుడు సాయం చేశాడు. దీనిపై ఫిర్యాదు చేస్తాం. వారు ఎందుకు మాపై దాడి చేశారో తెలియడం లేదు. ప్రతీకారం తీర్చుకోకుండా ఉండే శక్తిని దేవుడు నాకు ఇస్తాడనే అనుకుంటున్నా. ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా’ అని ఐఏఎఫ్ అధికారి తెలిపాడు.
A Wing Commander of the Indian Air Force, brutally assaulted in bangalore today’s morning all over language issue
He explains everything in the video after getting Aid! pic.twitter.com/R05dt3faUk— Chauhan (@Platypuss_10) April 21, 2025