Air Force officer
-
పాక్ మహిళ హనీట్రాప్.. భారత ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఏం చేశాడంటే..
దేశంలో ఇప్పటికి ఎన్నో హనీట్రాప్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో హనీట్రాప్ ఉదంతం కలకలం సృష్టించింది. దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ.. భారత వైమానిక దళానికి చెందిన అధికారిని హనీట్రాప్ చేసింది. దీంతో సదరు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. పాక్‌కు చెందిన మహిళ హనీ ట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేసినట్లు భారత వైమానిక దళానికి చెందిన అధికారి దేవేంద్ర శర్మపై ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు.. సోషల్ మీడియాలో శర్మను పాక్ మహిళ ట్రాప్ చేసినట్టు గుర్తించారు. దేవేంద్ర శర్మను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శర్మ ద్వారా దేశ భద్రతకు సంబంధించిన వివరాలు లీక్ అవుతున్నట్టు తెలుసుకున్నారు. మే 6న కస్టడీలోకి తీసుకోగా.. మే 12న (గురువారం) విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. ఈ విచారణలో భాగంగా శర్మ నుంచి ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, దేవేంద్ర శర్మ.. ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో శర్మను సర్వీస్ నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వైద్యుల నిర్వాకం.. బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి.. -
పాక్‌కు గూఢచర్యం.. భారత సైన్యంలో పెను కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : భారత నిఘా వర్గాల్లో ఓ వార్త కలకలం రేపింది. పాక్‌కు గూఢచర్యం ఆరోపణలతో ఓ ఉన్నతాధికారిని భద్రతా బలగాలు గురువారం అర్ధరాత్రి దాటాక అదుపులోకి తీసుకున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కెప్టెన్ అరుణ్ మార్వా ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. గత కొన్ని నెలలుగా ఐఎస్ఐకి ఆయన కీలక సమాచారాన్ని అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఐఎస్ఐ అధికారికి అరుణ్ తన వాట్సాప్ ద్వారా ఫోటోలు, కొన్ని పత్రాలను పంపించారు. కీలకమైన సమాచారాన్నే ఆయన పాక్ నిఘా సంస్థకు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం అరుణ్‌ని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ చేపట్టారు. -
అది ప్రమాదమా? హత్యా?
కోల్ కత్తా ఎయిర్ ఫోర్స్ అధికారి అభిమన్యు గౌడ్ మరణానికి కారణమైన కారు ప్రమాద ఘటన.. కేవలం ప్రమాదవశాత్తూ జరిగిందా .. లేదంటే దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఆడీ కారు డ్రైవింగ్ సీట్ లో తృణముల్ కాంగ్రెస్ నేత మహ్మద్ షోహ్రబ్ కుమారుడు సంబియా ఉన్నారని సమాచారం. అంతకు ముందు షోహ్రబ్ పెద్ద కుమారుడు అంబియా ఉన్నట్లు వార్తలు వచ్చినా.. పోలీసులు మాత్రం సంబియా డ్రైవింగ్ చేస్తున్నాడని తేల్చారు. అయితే ప్రమాదం జరిగిన నాటి నుంచి షోహ్రబ్ తో పాటు.. అతడి ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నారు. మరో వైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తు చేపట్టి 48 గంటలు గడిచినా.. ఇప్పటి వరకూ ఈ కేసులో ఒక్కరిని కూడా అర్టెస్టు చేయక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఈనెల 13న కోలకతాలో రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సిల్స్ చేస్తుండగా విమానయాన అధికారి అభిమన్యు గౌడ్ ను కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు ఉదయం... రిపబ్లిక్ డే పెరేడ్ రిహార్సిల్స్ జరిగే రోడ్డులోకి ఘటనకు కారణమైన కారు ప్రవేశించేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ రోడ్డులోకి కారును పోలీసులు అనుమతించలేదు. తర్వాత కాసేపటికే ఆడీ కారు దగ్గరలోని మరో ప్రవేశమార్గం నుంచి రాంగ్ రూట్ లో వచ్చింది. ఘటనకు ముందు కారు సిగ్నల్ జంప్ చేసినట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డైంది. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ కారు నంబర్ ప్లేట్ తొలగించి... అక్కడి నుంచి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా ఈ కేసు విచారణపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఈ అంశం మీద సీపీఎం ఎంపీ మహ్మద్ సలీమ్ కోల్ కత్తాలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన ఐదు గంటల వరకూ పోలీసులుఎలాంటి చర్య చేపట్టలేదన్నారు. వెంటనే కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ఉంటే బాగుండేదని, అలా చేయకపోవడం వల్ల ఘటనకు కారణమైన వారు తప్పించుకోవడానికి తగినంత సమయం దొరికిందని విమర్శించారు.