
అరుణ్ మార్‌వాహ్ (పాత చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ : భారత నిఘా వర్గాల్లో ఓ వార్త కలకలం రేపింది. పాక్‌కు గూఢచర్యం ఆరోపణలతో ఓ ఉన్నతాధికారిని భద్రతా బలగాలు గురువారం అర్ధరాత్రి దాటాక అదుపులోకి తీసుకున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కెప్టెన్ అరుణ్ మార్‌వా ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. గత కొన్ని నెలలుగా ఐఎస్‌ఐకి ఆయన కీలక సమాచారాన్ని అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఐఎస్‌ఐ అధికారికి అరుణ్ తన వాట్సాప్ ద్వారా ఫోటోలు, కొన్ని పత్రాలను పంపించారు. కీలకమైన సమాచారాన్నే ఆయన పాక్ నిఘా సంస్థకు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం అరుణ్‌ని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ చేపట్టారు.