ఇస్లామాబాద్ : భారత్‌కు చెందిన ఆర్మీ పోస్ట్‌ను ధ్వంసం చేసినట్లు పాక్ ప్రకటించింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తట్టపాని సెక్టార్‌లోని ఆర్మీ స్థావరంపై తాము దాడి చేశామని, ఐదుగురు భారత్ సైనికులను చంపేశామని పాక్ ఆర్మీ మేజర్ జనరల్ అసిఫ్ గఫార్ గురువారం రాత్రి ట్వటర్ ద్వారా వెల్లడించారు.
ఆర్మీ స్థావరంపై బాంబు దాడి చేస్తున్నట్లుగా ఉన్న వీడియోను కూడా ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో బాంబు దాడి జరిగి భారీ ఎత్తున దుమ్ముధూళితో కూడిన పొగ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, భారత్ ఈ వార్తలను కొట్టిపారేసింది. పాకిస్థాన్ చెబుతుందంతా ఒట్టి బూటకమని, ఆధారరహితంగా మాట్లాడుతోందని, అసలు దాడి జరగలేదని, భారత సైనికులు చనిపోలేదని భారత ఆర్మీ ప్రకటించింది.
Indian Army post on LOC targeting innocent citizens destroyed by Pak Army troops in Tatta Pani (Hot Spring) sector. Five Indian soldiers killed, many injured. Indian terrorism against innocent citizens shall be responded befittingly. pic.twitter.com/MHWv4Xc97n
— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) 15 February 2018
Comments
Please login to add a commentAdd a comment