LoC
-
ముగిసిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు
సాక్షి,అనంతపురం : విధి నిర్వహణలో వీర మరణం పొందిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య (43) అంత్యక్రియలు అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పలలో ముగిశాయి. తాను ప్రాణాలు వదులుతూ.. ఇతరులను కాపాడి అసలైన వీరుడు అనిపించుకున్న సుబ్బయ్య అంత్యక్రియలు పాల్గొనేందుకు మండల వ్యాప్తంగా ప్రజలు కుల, మతాలకతీతంగా భారీ ఎత్తున తరలివచ్చారు. ఆర్మీ అధికారులు సుబ్బయ్య భార్య, తల్లికి సుబ్బయ్య భౌతిక కాయంపై ఉంచిన జాతీయ జెండాను సైనిక లాంచనాలతో సైనిక అధికారులు అందజేశారు.కంభం మండలం రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్‌లో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో జమ్మూకశ్మీర్‌లోని మినీ కాశ్మీర్‌గా పేరొందని పూంచ్ జిల్లా, పూంచ్ సెక్టార్ పరిధిలోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట సహచర జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో భూమిలో పాతిపెట్టిన మందుపాతరపై కాలు మోపారు. ఈ విషయాన్ని గుర్తించిన జవాను సుబ్బయ్య సహచరులను అప్రమత్తం చేసి వారిని ప్రమాదం నుంచి కాపాడారు. ఆ మందుపాతరకు మాత్రం తాను బలయ్యారు.ఎల్ఓసీలో అమరుడైన సుబ్బయ్య పార్ధీవ దేహాన్ని ఆర్మీ అధికారులు ప్రత్యేక వాహనంలో బుధవారం అర్ధరాత్రి అనంతపురం జిల్లా నార్పలకు తీసుకువచ్చారు. సుబ్బయ్య పార్ధీవ దేహాన్ని చూసి భార్య లీల, తల్లి గాలెమ్మ, పిల్లలు, అన్నదమ్ములు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్ వీర జవాను సుబ్బయ్యకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్. జమ్మూలో విధి నిర్వహణలో సుబ్బయ్య వీరమరణం చెందారు. ల్యాండ్‌మైన్ నుంచి 30 మంది జవాన్లను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నా’అని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్జమ్మూలో విధి నిర్వహణలో ఉన్న ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి తనతోటి జవాన్లు 30 మందిని కాపాడి, తాను మాత్రం దాని బారిన పడి ప్రాణాలుకోల్పోవడం బాధాకరం. తన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 11, 2024 -
‘ట్యాపింగ్’ కేసులో ఎమ్మెల్సీపై ఎల్ఓసీ
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు పోలీసులు, మీడియా సంస్థకు చెందిన వారి చుట్టూనే దీని దర్యాప్తు తిరుగుతుండగా.. తాజాగా రాజకీయ నాయకులకు ఆ మకిలి అంటింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్‌రావు పాత్రను ఈ వ్యవహారంలో రూఢీ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆయనపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న నవీన్‌రావు దేశంలోకి అడుగు పెట్టిన వెంటనే అదుపులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విదేశాల్లో తలదాచుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌రావులపై ఎల్ఓసీ ఉంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ వెస్ట్‌జోన్ పోలీసులు ఈ ఏడాది జూన్ 29న హైకోర్టుకు ఓ నివేదిక సమరి్పంచారు.అందులో మూడు చోట్ల ఎమ్మెల్సీ పేరు ప్రస్తావించడంతో తొలిసారిగా నవీన్‌రావు పేరు వెలుగులోకి వచి్చంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న ప్రభాకర్‌రావుతోపాటు శ్రవణ్‌రావుతో కూడా కలసి నవీన్‌రావు పని చేశారన్నది ప్రధాన ఆరోపణ. అప్పటి అధికార పారీ్టకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు వీళ్లు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. దీనికోసం ఎస్ఐబీలో ప్రత్యేకంగా ఓ బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. నాటి ప్రతిపక్షంతో పాటు వివిధ విభాగాలకు చెందిన పలువురి ఫోన్ నంబర్లను ట్యాప్ చేయడంతో పాటు సున్నితమైన డేటాను అక్రమంగా సంగ్రహించారు. వివిధ రంగాలకు చెందిన వారిని బెదిరించడం ద్వారా ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసేలా ఒత్తిడి చేశారని పోలీసులు చెపుతున్నారు. హార్డ్ డిస్‌్కల ధ్వంసంలోనూ పాత్ర గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అదే సందర్భంలో ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్‌్కలను డీఎస్పీ ప్రణీత్‌రావు తదితరులు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం వెనుకా ప్రభాకర్‌రావుతో పాటు నవీన్‌రావు ఉన్నారని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. సంధ్య కన్వెన్షన్స్ అధినేత ఎస్.శ్రీధర్‌రావును బెదిరించడం, ఆయన ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేయించడంలోనూ నవీన్‌రావు పాత్రను దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నవీన్‌రావును విచారించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కొంత కాలం కిందట ఆయనకు నోటీసులు జారీ చేయడానికి ఓ ప్రత్యేక బృందం ముమ్మరంగా ప్రయతి్నంచింది.వాటి ఆధారంగా ఆయనను పిలిచి విచారించాలని భావించింది. నోటీసులతో అధికారులు నవీన్‌రావు ఇల్లు, కార్యాలయాల వద్ద కాపుకాసినా ఆయనను కలవలేక పోయారు. ఈ లోపు పోలీసుల కదలికలు తెలుసుకున్న నవీన్‌రావు దుబాయ్ వెళ్లిపోయారని తెలిసింది. ఆయన విదేశాలకు వెళ్లిపోయారనే సమాచారం ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఎల్ఓసీ జారీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాల్లో రాష్ట్రానికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా ఉన్న సీఐడీ ద్వారా ఎల్ఓసీని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులతో పాటు సరిహద్దుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టులకు పంపారు. ఎల్ఓసీలో నవీన్‌రావు పాస్‌పోర్టు నంబర్, ఇతర వివరాలు పొందుపరిచారు. దీని ఆధారంగా ఆయన దేశంలో అడుగుపెట్టగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. అనంతరం ఆయనను హైదరాబాద్ పోలీసులకు అప్పగిస్తారని సమాచారం. -
సైన్యం కాల్పుల్లో ఉగ్రవాదులు మృతి
జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్లో దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సోమవారం (సెప్టెంబర్ 9) సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద నుంచి ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నౌషేరా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఇదే ప్రాంతంలో చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఇదీ చదవండి.. ఘనంగా రెండో ప్రపంచ యుద్ధ వీరుడి బర్త్‌డే వేడుకలు -
ఎల్ఓసీలోకి చొరబాటుదారులు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
గత కొంతకాలంగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జమ్ములోని పాలన్‌వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.భద్రతా దళాలకు నలుగురు చొరబాటుదారుల కదలిక కనిపించింది. దీంతో బలగాలు రాత్రిపూట లైట్లతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. డ్రోన్ల ద్వారా నిఘాను కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో అడవులు, కొండలు ఉండడంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించేందుకు భద్రతా సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొంటోంది.ఆర్టికల్ 370 రద్దుకు అయిదవ వార్షికోత్సవం దృష్ట్యా, ఖౌడ్, జ్యోడియన్ ప్రాంతాల్లో సైన్యం, పోలీసులు ఇప్పటికే నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతంలోని చెక్‌పోస్టుల వద్ద భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచారు ఆ ప్రాంతానికి వచ్చిపోయే ప్రతి వ్యక్తిని తనిఖీ చేస్తున్నారు.మరోవైపు సరిహద్దు భద్రతా దళం తాజాగా ఒక పాక్ చొరబాటుదారుడి మృతదేహాన్ని పాక్ రేంజర్స్‌కు అప్పగించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడిని పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ముహమ్మద్ అఫియల్‌గా గుర్తించారు. అతని మృతదేహాన్ని సుచేత్‌గఢ్ సెక్టార్‌లోని ఆక్ట్రాయ్ పోస్ట్‌లో పాకిస్తాన్ రేంజర్స్‌కు అప్పగించారు. -
Kargil Vijay Diwas: యుద్ధం: ఈ సినిమాలు పిల్లలకు చూపిద్దాం!
కార్గిల్ వార్‌లో భారత పతాకం విజయగర్వంతో నిలబడి 25 ఏళ్లు. వీరులు శూరులై్రపాణాలను చిరునవ్వుతో త్యాగం చేసి ఎందరో సైనికులు అమరులైతే మనకా విజయం సిద్ధించింది. వారి కథలు గాథలు తలుచుకోవాల్సిన సమయం ఇది. అందుకై ‘రజత్ జయంతి వర్ష్’ పేరుతో ఉత్సవాలు సాగుతున్నాయి. ఆ యుద్ధ సమయపు తెగువను బాలీవుడ్ గొప్పగా చూపించింది. ఆ సినిమాలను పిల్లలకు చూపించాలి ఈ వీకెండ్.పాతికేళ్లంటే కనీసం మూడుతరాలు వచ్చి ఉంటాయ్. దేశం దాటిన క్లిష్ట పరిస్థితులు ఏ తరానికి ఆ తరం స్ఫూర్తిదాయకంగా అందిస్తూ ఉండాలి. అప్పుడే ఆ స్ఫూర్తిని కొత్తతరం అందిపుచ్చుకుంటూ ఉంటుంది. అనూహ్యంగా మన ్రపాంతంలో చొరబడి వాస్తవాధీన రేఖ దగ్గర 1999లో టైగర్ హిల్‌ను ఆక్రమించింది పాకిస్తాన్. వారిని వెనక్కు తరిమి కొట్టడానికి భారత సైన్యం రంగంలో దిగింది. మే 2 నుంచి జూలై 26 వరకు అంటే రెండు నెలల మూడు వారాల రెండు రోజుల పాటు ఈ యుద్ధం సాగింది. ఆక్రమిత ్రపాంతం కొండ కావడంతో పై నుంచి శత్రువులు సులభంగా దాడి చేసే పరిస్థితి ఉండటంతో ఈ యుద్ధం ఒక సవాలుగా మారింది. అయినా సరే మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కలిసి విజయం సాధించాయి. తర్వాతి కాలంలో ఈ యుద్ధ నేపథ్యంలో ఎంతో సాహిత్యం, పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. వాటిలో బాలీవుడ్ నుంచి వచ్చిన ముఖ్యమైన సినిమాలు ఇవి... 1) లక్ష్య 2) షేర్ షా 3) ఎల్ఓసి కార్గిల్ 4) గుంజన్‌సక్సేనా 5. ధూప్.1. లక్ష్య (2004)లక్ష్య రహితమైన ఒక యువకుడు కార్గిల్ యుద్ధంలో దేశానికి సేవ చేయడమే తన లక్ష్యం అని గ్రహించడమే ‘లక్ష్య’. హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమాలో అమితాబ్, బొమన్ ఇరాని, ఓం పురి వంటి ఉద్ధండులు నటించారు. పెద్దగా బాధ్యత పట్టని హృతిక్ రోషన్ తన స్నేహితుడు రాస్తున్నాడని డిఫెన్స్ సర్వీస్ అకాడెమీ పరీక్షలు రాసి ఇండియన్ మిలటరీ అకాడెమీలో సీట్ తెచ్చుకుంటాడు. కాని ట్రయినింగ్ అతని వల్ల కాదు. పారి΄ోయి వస్తాడు. అయితే అందరూ అతణ్ణి తక్కువ దృష్టితో చూసే సరికి ఈసారి పట్టుదలగా వెళ్లి ట్రయినింగ్ పూర్తి చేసి పంజాబ్ బెటాలియన్‌కు ఎంపికవుతాడు. అదే సమయంలో కార్గిల్ యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో 1000 అడుగుల కొండ మొనపై ఉన్న పాకిస్తాన్ యూనిట్‌ను కడతేర్చడానికి భారత సైన్యం నుంచి బయలుదేరిన 12 మందిలో హృతిక్ కూడా ఒకడు. వీరిలో ఆరుగురు మరణించినా పాకిస్తాన్ యూనిట్‌ను ధ్వంసం చేసి విజయం సాధిస్తారు. ఫర్హాన్ అక్తర్ దర్వకత్వం వహించిన ఈ సినిమా విడుదల సమయంలో ఆదరణ ΄÷ందక΄ోయినా తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. చాలా మంది కుర్రాళ్లను సైన్యంలో చేరేందుకు ఈ సినిమా ప్రేరేపించింది.2. షేర్షా (2021)‘యుద్ధానికి వెళుతున్నాను. మన దేశపతాకాన్ని ఎగరేసి వస్తాను లేదా అందులో చుట్టబడైనా వస్తాను’ అని చెప్పిన ఆర్మీ ఆఫీసర్ విక్రమ్ బాత్ర బయోపిక్ షేర్షా. కార్గిల్ యుద్ధంలో ఊరికే అరాకొరా శత్రువులను నేల రాల్చడం తన తత్వం కాదని ‘ఏ దిల్ మాంగే మోర్’ తన నినాదమని అందరు శత్రువులను నామరూపాల్లేకుండా చేస్తానని చెప్పిన విక్రమ్ బాత్ర అలాగే చేసి మన పతాకం ఎగురవేసి ్రపాణాలు కోల్పోయాడు. సిద్దార్థ్ మల్హోత్ర, కియారా అద్వానీ నటించిన ఈ సినిమా కోవిడ్ కారణంగా అమెజాన్‌లో స్ట్రీమ్ అయ్యింది. తమ ΄్లాట్‌ఫామ్ మీద అత్యధికులు వీక్షించిన సినిమా షేర్షా అని అమెజాన్ తెలిపింది. తుపాకీ గుళ్లు మరఫిరంగుల ఘీంకారాలు మాత్రమే వినపడే యుద్ధ రంగంలో సైనికుల మానసిక స్థితి, వారు ప్రదర్శించే స్థయిర్యం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడాలి. కార్గిల్ వీరునికి గొప్ప నివాళి ఈ సినిమా.3.ఎల్ఓసి కార్గిల్ (2003)1997లో ‘బోర్డర్’ వంటి సూపర్‌హిట్ తీసిన జె.పి.దత్తా కార్గిల్‌వార్ మీద తీసిన 4 గంటల 15 నిమిషాల సుదీర్ఘమైన సినిమా ఎల్ఓసి కార్గిల్. వాస్తవాధీన రేఖను దాటి పాకిస్తాన్ సైన్యం కార్గిల్‌లో తిష్ట వేశాక వివిధ దళాలు ఎన్ని విధాలుగా కార్యరంగంలో దిగుతాయి సైనిక తంత్రాలు ఎలా ఉంటాయి ఆఫీసర్లకు వారి దళాలకు సమన్వయం ఎలా ఉంటుందో ఇవన్నీ దాదాపుగా తెలియాలంటే ఈ సినిమా తీయాలి. నిడివి రీత్యా ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేక΄ోయినా దర్శకుడు పట్టుబట్టి అలాగే ఉంచేశాడు. సంజయ్ దత్, అజయ్ దేవగణ్, సన్ని డియోల్, సునీల్ శెట్టి, అభిషేక్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో ఉంది.4. గుంజన్ సక్సేనా (2020)‘కార్గిల్ గర్ల్’గా ఖ్యాతి గడించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన గుంజన్ పైలట్ కావాలని కలలు కంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అమ్మాయిలకు అప్పుడే ప్రవేశం కల్పించినా ట్రయినింగ్ సమయంలో ఆ మగవాళ్ల ప్రపంచంలో సవాళ్లు ఎదుర్కొంది గుంజన్. 1996లో భారతదేశ తొలి ఎయిర్‌ఫోర్స్ మహిళా పైలట్లలో ఒకరైన గుంజన్ 1999లో కార్గిల్‌లో చురుకైన పాత్ర ΄ోషించింది. యుద్ధ సమయంలో గాయపడిన వారిని బేస్ క్యాంప్‌కు తరలించి వైద్యం అందించడంలో లెక్కకు మించి చక్కర్లు కొట్టింది. మిస్సయిల్స్కు అందితే ్రపాణాలు చెల్లాచెదురవుతాయని తెలిసినా ఆమె సాహసం కొనసాగింది. జాన్హీ్వ కపూర్ నటించిన ఈ సినిమా అమ్మాయిలకు సమాన అవకాశాలు అన్నింటా కావాలని చెబుతుంది.5. ధూప్ (2003)యుద్ధంలో బలిదానం ఇచ్చిన వీరులను శ్లాఘించడం సరే నిజ జీవితంలో వారి కుటుంబం ఎటువంటి గౌరవాన్ని ΄÷ందుతోంది అని ప్రశ్నించే సినిమా ధూప్. కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ అనుజ్ నయ్యర్ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను ఆధారం చేసుకుని ఈ సినిమా తీశారు. అనుజ్ మరణించాక ప్రభుత్వం వారికి ఒక పెట్రోల్ బంక్ కేటాయిస్తుంది. కుటుంబ సభ్యులు ఇందుకు మొదట నిరాకరించినా కొడుకు స్మృతిని నిలబెట్టడానికి ఇదొక మార్గమని భావించి అందుకు అంగీకరిస్తుంది. అయితే అక్కడి నుంచే కథ మొదలవుతుంది. ప్రభుత్వం కేటాయించిన పెట్రోల్ బంక్ వాస్తవ రూపం దాల్చాలంటే ఎన్ని లంచాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు ఎదురవుతాయో ఈ సినిమా చూపిస్తుంది. చివరకు కుటుంబం పెట్రోల్ బంక్ సాధించి దానికి ‘కార్గిల్ హైట్స్’ అని పేరు పెడుతుంది. అమరుల రుణం తీర్చుకునే దారిలో ప్రభుత్వం, ΄ûరులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని చెప్పే చిత్రం ఇది. ఓంపురి,రేవతి తారాగణం. -
ఆర్థిక పటిష్టత ప్రాతిపదికనే ఎల్ఓసీలు
న్యూఢిల్లీ: తమ ఆర్థిక పటిష్టత, శక్తిసామర్థ్యాల ప్రాతిపదికనే ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌యూ) ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ను జారీ చేయాలని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఎల్ఓసీల జారీ విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరుతూ చమురు, విద్యుత్ రంగంలోని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కోరిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. సొంత ఆర్థిక బలం ఆధారంగా ఎల్ఓసీల జారీ సాధారణ వ్యాపార ఆచరణలో ఒక భాగం. ఇది సంస్థలు వాటి క్యాపెక్స్ లేదా వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం పోటీ రేట్ల వద్ద నిధులను సమీకరించుకోడానికి అలాగే జాయింట్ వెంచర్లు లేదా అనుంబంధ సంస్థలు లేదా గ్రూప్ కంపెనీల వ్యాపార ప్రయోజనాలను పరిరక్షించుకోడానికి దోహదపడుతుంది. ఇన్ఫ్రా ప్రాజెక్టుల కోసం నిధుల టై–అప్ కోసం బ్యాంకులకు ’లెటర్ ఆఫ్ కంఫర్ట్’ (ఎల్ఓసీ) జారీ చేయడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) గత సంవత్సరం ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
వారి పాత్ర లేకపోతే ‘లుక్ఔట్’ ఎందుకు?
సాక్షి, అమరావతి: నేరంలో నిందితుల పాత్ర లేదంటూ చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత కూడా ఆ నిందితులపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్వోసీ)ను కొనసాగించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన దంపతులపై గతంలో జారీ చేసిన ఎల్వోసీ కొనసాగించడంపై పోలీసుల తీరును తప్పుపట్టింది. వెంటనే వారిపై ఎల్వోసీ ఉపసంహరించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఇటీవల తీర్పు వెలువరించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్త, వైద్యులైన తన అడపడుచు, ఆమె భర్త తదితరులపై వరకట్న వేధింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారందరినీ నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆడపడుచు, ఆమె భర్తపై పోలీసులు ఎల్వోసీ జారీ చేశారు. ఆ తరువాత వరకట్న వేధింపుల వ్యవహారంలో ఆడపడుచు, ఆమె భర్తకు ఎలాంటి సంబంధం లేదంటూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు వారిద్దరికీ క్లీన్చిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆడపడుచు, ఆమె భర్త ఉన్నత చదువుల కోసం విదేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఇమ్మిగ్రేషన్ అధికారి వారిని విదేశానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. వారిపై ఎల్వోసీ ఉందని, అందువల్ల విదేశీ ప్రయాణానికి అనుమతించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో ఆ దంపతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ దుర్గాప్రసాద్ వారిపై జారీ చేసిన ఎల్వోసీ ఉపసంహరించాలని పోలీసులను, విదేశం వెళ్లేందుకు అనుమతించాలని ఇమ్మిగ్రేషన్ అధికారిని ఆదేశించారు. కేసు విచారణకు సంబంధించి ఎప్పుడు కోర్టు ఆదేశిస్తే అప్పుడు స్వయంగా హాజరయ్యేలా కింది కోర్టులో హామీ ఇచ్చి, రూ.2.50 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని పిటిషనర్లను న్యాయమూర్తి ఆదేశించారు. -
చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వెంబడి అంగుళం భూ భాగాన్ని కూడా పొరుగు దేశానికి వదలబోమని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పష్టం చేశారు. యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ప్రయత్నాలను దీటుగా తిప్పికొడతామన్నారు. దేశం ముందున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన కార్యాచరణ సంసిద్ధతకు ప్రాధాన్యమిస్తానన్నారు. ఆదివారం సౌత్‌బ్లాక్‌లో గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్‌తో కలిసి జనరల్ పాండే మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతుండటంతో మనకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే, సమకాలీన, భవిష్యత్ సంక్షోభాలను తిప్పికొట్టేందుకు అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన కార్యాచరణ సంసిద్ధతే నా ప్రథమ ప్రాధాన్యం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కలిసికట్టుగా ఎటువంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. రక్షణ విషయంలో స్వావలంబన సాధించడంతోపాటు ఆర్మీ కార్యాచరణ సన్నద్ధతను మరింత విస్తృతం చేసేందుకు సంస్కరణలు, పునరి్నర్మాణంపై దృష్టి సారిస్తాను’ అన్నారు. ప్రస్తుత త్రివిధ దళాధిపతులు ముగ్గురూ నేషనల్ డిఫెన్స్ అకాడమీ 61వ బ్యాచ్‌లో కలిసి చదువుకున్నవాళ్లే కావడం విశేషం. నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు తన క్లాస్‌మేట్లేనని జనరల్ పాండే అన్నారు. త్రివిధ దళాల సమష్టి కార్యాచరణకు, సహకారానికి ఇది శుభారంభమన్నారు. ఇది కూడా చదవండి: అప్పుడే మోదీకి సపోర్ట్ చేశాం: సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు -
కాల్పుల విరమణ.. మా బలహీనత కాదు: పాక్
ఇస్లామాబాద్: భారత్–పాకిస్తాన్ మధ్య గత ఏడాది ఫిబ్రవరి 25న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒకరి బలంగా, మరొకరి బలహీనతగా చూడరాదని పాకిస్తాన్ సైనిక దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ అన్నారు. ఈ ఒప్పందం విషయంలో భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే చేసిన వ్యాఖ్యలను ఆయన శుక్రవారం ఖండించారు. నరవణే వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తూ 2021 ఫిబ్రవరి 25న నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట కాల్పుల విరమణను పాటించేలా ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ చీఫ్ నరవణే గురువారం ఢిల్లీలో ఓ సెమినార్లో మాట్లాడుతూ.. తాము(భారత సైన్యం) బలమైన స్థానంలో ఉండి చర్చలు జరపడం వల్లే పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని చెప్పారు. చదవండి: ఆందోళనకారులపై మిలటరీ అవసరం లేదు -
భావి యుద్ధాలకు ట్రైలర్లు చూస్తున్నాం
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో మనం కొత్త తరహా యుద్ధాలను ఎదుర్కోవాల్సి రానుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అభిప్రాయపడ్డారు. వాటి తాలూకు ట్రైలర్లు ఐటీ, ఎకనామిక్, సైబర్ వార్ఫేర్ వంటి రూపాల్లో ఇప్పటికే కళ్లముందు కన్పిస్తున్నాయన్నారు. అణుపాటవమున్న పొరుగు దేశాలు, వాటి దన్నుతో ఉగ్ర మూకలు చేస్తున్న పరోక్ష యుద్ధం దేశ భద్రతకు ముందెన్నడూ లేనంతగా సవాళ్లు విసురుతున్నాయని చైనా, పాకిస్తాన్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధ స్వరూపంలో వస్తున్న ఈ సమూల మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టగలగడం, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనే సన్నద్ధత ముఖ్యం. ఈ దిశగా మన ప్రత్యక్ష, పరోక్ష యుద్ధ పాటవాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి’’ అన్నారు. గురువారం ఇక్కడ సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ (సీఎల్‌ఏడబ్ల్యూఎస్) ఏర్పాటు చేసిన సెమినార్లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధురి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్‌లతో పాటు నరవణె పాల్గొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవాలి యుద్ధ రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యం ఎంతగానో పెరిగిందని ఆర్మీ చీఫ్ అన్నారు. ఇటీవల ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే ప్రధాన పాత్ర కావడం, యూఏఈపై యెమన్ హౌతీ రెబెల్స్ డ్రోన్, మిసైల్ దాడులు, వాటిని అమెరికా సాంకేతిక సహకారంతో యూఏఈ అడ్డుకున్న తీరు ఇందుకు తాజా నిదర్శనాలన్నారు. పాక్, చైనా నుంచి జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను లోతుగా ఆయన విశ్లేషించారు. ‘‘విచ్ఛిన్న శక్తులు స్థానిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని తక్కువ ఖర్చుతో భారీ దాడులకు తెగబడతాయి. అధునాతన సామర్థ్యం అందుబాటులో ఉన్నా పూర్తిస్థాయిలో ప్రయోగించలేని పరిస్థితులను కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. అఫ్గానిస్తాన్‌లో నిత్యం జరుగుతున్న మారణహోమమే నిదర్శనం’’ అన్నారు. పాక్‌ను నిర్దేశించగలుగుతున్నాం నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గడం, పాక్‌తో కాల్పుల విరమణ పూర్తిస్థాయిలో అమలవుతుండటానికి ప్రధాన కారణం మన సైనిక పాటవమేనని జనరల్ నరవణె అన్నారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడుతూ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులను కట్టిపెట్టేందుకు ఇరు సైన్యాల మధ్య గతంలో అంగీకారం కుదరడం తెలిసిందే. -
పాక్ కాల్పులపై భారత్ సీరియస్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పులపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడింది. శుక్రవారం పాకిస్తాన్ విచక్షణారహితంగా జరిపిన కాల్పులపై పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు జారీ చేసింది. జమ్మూ కశ్మీర్ సరిహద్దుల వెంట పలు చోట్ల భారత భద్రత బలగాలు, పౌరులపై పాకిస్తాన్ శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నలుగురు జవాన్లు, ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారు. అయితే పాక్ కాల్పులకు భారత్ దీటుగా బదులిచ్చింది. ఈ ప్రతీకార దాడుల్లో పాక్ వైపు భారీ నష్టం జరిగిందని భారత ఆర్మీ పేర్కొంది. దానికి సంబంధించి భారత ఆర్మీ వర్గాలు పలు వీడియోలు విడుదల చేశారు. ‘భారత్ జరిపిన ఎదురు దాడిలో పాకిస్తాన్ భారీగా నష్టపోయింది. భారత్ కాల్పుల్లో 8 మంది వరకు పాక్ సైనికులు హతమయ్యారు. వారిలో కనీసం ఇద్దరు పాక్ సైన్యానికి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమెండోలు ఉన్నార’ ని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. చదవండి: (సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి) పాక్ ఆర్మీ స్థావరాలు, ఆయుధ కేంద్రాలు, ఉగ్రవాద చొరబాటు స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను ఆర్మీ విడుదల చేసింది. భారత్ ప్రయోగించిన క్షిపణి నేరుగా పాక్ ఆర్మీ బంకర్‌ను ఢీ కొట్టి ధ్వంసం చేసిన దృశ్యాలు మరో వీడియోలో ఉన్నాయి. భారత్ ప్రతిదాడిలో 8 మంది పాక్ జవాన్లు చనిపోయారని, 12 మంది గాయపడ్డారని భారత ఆర్మీ తెలిపింది. కాగా, పాక్ కాల్పుల్లో చనిపోయిన వారిలో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేశ్ దోవల్, నలుగురు ఆర్మీ జవాన్లు, ఆరుగురు పౌరులు ఉన్నారు. 8 మంది పౌరులతో పాటు నలుగురు జవాన్లు గాయపడ్డారు. నియంత్రణ రేఖ వెంట ఉడి, దావర్, కేరన్, నౌగమ్, గురెజ్ సహా పలు సెక్టార్లలలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. హజీపీర్ సెక్టార్లో పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేశ్ దోవల్ చనిపోయారు. చదవండి: (కశ్మీర్లో పాక్ దుస్సాహసం) -
పాకిస్తాన్ దుశ్చర్య : ఆరుగురు మృతి
శ్రీనగర్ జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. ఎల్వోసీ వెంబడి కాల్పులకు తెగబడి రక్తపాతం సృష్టించింది. ఈ కాల్పుల్లో భారత్‌కు చెందిన ఆరుగురు పౌరులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు జవాన్లు, నలుగురు పౌరులు ఉన్నారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరోవైపు కాల్పులు పలు ఇళ్లు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితి నేపథ్యంలో భద్రతాదళాలు మరింత అప్రమత్తం అయ్యాయి. పాకిస్తాన్ చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
9 నెలల్లో ఏకంగా 3186 సార్లు ఉల్లంఘన
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ ఆగడాలు సరిహద్దుల్లో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికి పాక్ మాత్రం దాన్ని తుంగలో తొక్కుతూ తరచూ సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇదే తరహా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే సరిహద్దులో అప్రమత్తంగా ఉండే భారత సైన్యం… పాకిస్తాన్ దాడులను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉంటుంది. అయితే 17 ఏళ్లలో మొదటిసారి సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎక్కువసార్లు ఉల్లంఘించింది. ఈ జనవరి నుంచి సెప్టెంబర్ 7 వరకు దాదాపు తొమ్మిది నెలల్లో 3186 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలిపింది. అయితే ప్రతిసారి భారత సైన్యం పాకిస్తాన్‌ను సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా, పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ ప్రాంతంలో 242 సరిహద్దు కాల్పులు (జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు) జరిగాయని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ రాజ్యసభలో తెలిపారు. (చదవండి: భారత్‌పై ఆన్లైన్ వార్‌కు పాక్ కుట్ర) ఈ ఏడాది కాల్పుల విరమణ ఉల్లంఘనల సందర్భంగా ఎనిమిది మంది ఆర్మీ సిబ్బంది దేశం కోసం మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో అమాయక పౌరులు చంపబడ్డారు, అనేక ఇళ్ళు, భవనాలు ధ్వంసమయ్యాయని శ్రీపాద్ నాయక్ తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు 2,432 కాల్పుల విరమణ ఉల్లంఘనలు నమోదయ్యాయని ఇవి అప్రకటిత దాడులే కాక 2003 కాల్పుల విరమణ అవగాహనకు విరుద్ధంగా జరిగాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఉపసంహరణతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని గతేడాది ఆగస్టులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య శత్రుత్వం కూడా పెరిగింది. 2019 అంతటా సుమారు 2,000 కాల్పుల విరమణ ఉల్లంఘనలు మాత్రమే జరిగాయి. -
8 నెలలుగా అక్కడే సైనికుడి మృతదేహం
శ్రీనగర్ : జనవరి నెలలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్ హవల్దర్ రాజేంద్ర సింగ్ నేగి(36) మృతదేహాన్ని భారత సైన్యం కనుక్కొంది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత శనివారం కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో మంచు చరియల కింద ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేగి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. భారతీయ సైన్యం యొక్క 11 గర్హ్వాల్ రైఫిల్స్‌కు అనుబంధంగా ఉన్న నేగి, ఈ ఏడాది జనవరిలో కశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖకు సమీపంలో విధుల్లో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు భారీ మంచులో పడిపోవడంతో తప్పిపోయాడు. అతని మృతదేహాన్ని కనుగొనడంలో విఫలమైన సైన్యం జూన్‌లో అతన్ని 'అమరవీరుడు' గా ప్రకటించి, ఈ విషయాన్ని జూన్ 21న నేగి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అయితే, అతని భార్య రాజేశ్వరి దేవి నేగిని అమరవీరుడిగా అంగీకరించడానికి నిరాకరించింది. తన భర్త మృతదేహాన్ని కళ్లతో చూసే వరకు అతను మరణించినట్లు భావించనని ఆమె తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేగి మృతదేహం లభించిన విషయాన్ని ఆతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నేగి మృతదేహాన్ని శ్రీనగర్‌లోని మిలిటరీ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి మృతదేహం డెహ్రాడూన్‌కు చేరుకుంటుందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. డెహ్రాడూన్‌కు చెందిన నేగి..2001లో సైన్యంలో చేరారు. అతనికి భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
గట్టిగా బుద్ధి చెప్పాం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా, పాకిస్తాన్లకు గట్టి హెచ్చరికలే పంపారు. ఎల్ఓసీ (నియంత్రణ రేఖ) నుంచి ఎల్ఏసీ (వాస్తవాధీన రేఖ) వరకు దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన వారికి సాయుధ బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయన్నారు. లద్దాఖ్‌లో మన సైనికుల శౌర్య పరాక్రమాలు యావత్ ప్రపంచం చూసిందన్నారు. శనివారం ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన దేశ 74వ స్వాతంత్ర దిన వేడుకలకు సంప్రదాయబద్ధంగా కాషాయం, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తా, పైజామా తలపాగా ధరించి వచ్చిన ప్రధాని గంటా 26 నిమిషాల సేపు ప్రసంగించారు. కేంద్ర పథకాలైన ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, మేకిన్ ఇండియా టు మేక్ ఫర్ వరల్డ్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక రంగ పురోగతికి చేపట్టిన సంస్కరణల గురించి వివరించారు. కరోనా వ్యాక్సిన్ నుంచి మహిళా సాధికారత వరకు ప్రతీ అంశాన్ని స్పృశిస్తూ ఆయన ప్రసంగం సాగింది. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశ కోసం ప్రాణాలర్పించిన వారికి ఎర్రకోట నుంచి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. సరిహద్దుల్లో ఉగ్రవాదమైనా, విస్తరణ వాదమైనా భారత్ వాటిపై యుద్ధం చేస్తుందని స్పష్టం చేశారు. అయితే పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకే తాము ప్రాధాన్యం ఇస్తామన్నారు. గత ఏడాది విదేశీ పెట్టుబడుల్లో రికార్డు స్థాయిలో 18 శాతం వృద్ధి సాధించామని ప్రపంచ దేశాలు భారత్‌పై విశ్వాసం ఉంచాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. అయోధ్యలో రామ మందిర భూమి పూజను ప్రస్తావిస్తూ శతాబ్దాల సమస్యను శాంతియుతంగా పరిష్కరించమన్నారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్లను ప్రధాని మోదీ అభినందించారు. మోదీ కొత్త మంత్ర మేక్ ఫర్ వరల్డ్ మోదీ తన ప్రసంగంలో ఆత్మనిర్భర్ భారత్‌పై అత్యధికంగా దృష్టి పెట్టారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితులు కూడా దేశ సంకల్ప బలాన్ని అడ్డుకోలేవని ధీమాగా చెప్పారు. ఇంక ఎక్కువ కాలం దిగుమతులు మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే దిగుమతులు తగ్గించుకోవడమే కాదు, మన సామర్థ్యం, సృజనాత్మకత, నైపుణ్యం ప్రపంచం గుర్తించేలా చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇక మేకిన్ ఇండియా కాదు, మేక్ ఫర్ వరల్డ్ దిశగా భారత్ ప్రయాణం సాగాలని అన్నారు. ప్రపంచం ఆదరించేలా భారత్‌లో నాణ్యమైన వస్తువుల్ని ఉత్పత్తి చేయాలని మోదీ అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎన్–95 మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల తయారీలో నాలుగు నెలల్లోనే భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ఎగుమతులు కూడా చేస్తోందని అన్నారు. దీంతో యువతకి ఉపాధి అవకాశాలను కల్పించామని ప్రధాని చెప్పారు. మౌలిక సదుపాయాల రంగంలో విప్లవం సృష్టించేలా రూ. 110 లక్షల కోట్లతో వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏడు వేల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ప్రాజెక్టుల్ని ప్రారంభించామని అన్నారు. కోవిడ్ విసిరిన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్న ప్రధాని రైతులే పారిశ్రామికవేత్తలుగా మారడానికి వీలుగా లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధిని ప్రారంభించామని చెప్పారు. దీనివల్ల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వెయ్యిరోజుల్లో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ రాబోయే మూడేళ్ల కాలంలో దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించే ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ప్రాజెక్టుని ప్రకటించారు. గత అయిదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించామని మరో మూడేళ్లలో ప్రతీ గ్రామానికి నెట్ సదుపాయం ఉంటుందని అన్నారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికమైన నేపథ్యంలో సైబర్ భద్రతపై త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకొస్తామన్నారు. తయారీలో మూడు కరోనా వ్యాక్సిన్లు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్‌లో మూడు వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా ఇప్పటికే మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారీలో అహరహం శ్రమిస్తున్న శాస్తవేత్తల్ని ప్రధాని రుషులు, మునులతో పోల్చారు. కరోనాపై విజయం సాధించడానికి వారు ల్యాబొరేటరీల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ చేరేలా చూస్తామన్నారు. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్లు ఒకటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతులు లభించాయి. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా రక్షణ రంగంలో స్వావలంబన దిశగా గట్టి చర్యలు చేపడుతున్నట్లు మోదీ తెలిపారు. వందకు పైగా ఆయుధాలు, రక్షణ పరికరాల దిగుమతిని నిషేధించామన్నారు. క్షిపణుల నుంచి తేలికపాటి సైనిక హెలికాప్టర్లు, రైఫిల్స్, యుద్ధ రవాణా విమానాలను భారత్‌లో తయారుచేస్తామన్నారు. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఆధునీకరణ జరుగుతోందన్నారు. దేశ రక్షణలో సరిహద్దు, తీరప్రాంత మౌలికసదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో, హిందూ మహాసముద్రంలోని దీవుల మధ్య, లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు రహదారుల నిర్మాణం జరిగిందని, రవాణా సదుపాయాలకు ప్రాధాన్య మిచ్చామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఏడాదిలో 2 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని, ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి సురక్షిత మంచినీరు అందించామని తెలిపారు. రూపాయికే శానిటరీ ప్యాడ్ స్వాతంత్య్రదిన ప్రసంగంలో ఈ సారి ప్రధాని ఏనాడూ ఎవరూ మాట్లాడని మహిళల రుతు స్రావం అంశాన్ని లేవనెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మహిళా సాధికారత గురించి వివరిస్తూ నిరుపేద మహిళలకు 6 వేల జన ఔషధి కేంద్రాల ద్వారా రూపాయికే శానిటరీ ప్యాడ్లు అందిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది మహిళలకు ఈ ప్యాడ్లు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతమున్న 18 ఏళ్లుగా ఉన్న అమ్మాయిల పెళ్లి వయసును మార్చడానికి సన్నాహాలు చేస్తున్నామని, దీనికోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళా అధికారుల్ని కీలక పదవుల్లో తీసుకున్నామని, ట్రిపుల్ తలాక్‌ని రద్దు చేశామన్నారు. ప్రధాని శానిటరీ ప్యాడ్ల ప్రస్తావనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. 40 కోట్ల ‘జన్‌ధన్ బ్యాంకు అకౌంట’్లలో 22 కోట్ల అకౌంట్లు మహిళలవేనని, ఈ మహమ్మారి కాలంలో వారి ఖాతాల్లో రూ.30 వేలకోట్ల నిధులను వేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. ‘ముద్ర’రుణాల్లో 70 శాతం చెల్లెళ్ళు, తల్లులకే ఇచ్చామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అత్యధిక రిజిస్ట్రేషన్లు మహిళల పేరిటే ఉన్నాయన్నారు. అందరికీ హెల్త్ కార్డులు ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ ఆరోగ్య రంగాన్ని డిజిటలైజ్ చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతీ పౌరుడికి హెల్త్ ఐడీ నంబర్ ఇస్తారు. ఈ హెల్త్ ఐడీ డిజిటల్ రూపంలోనే ఉంటుంది. అందులో వారి ఆరోగ్య సమాచారం, వాడే మందులు, మెడికల్ రిపోర్ట్స్ నిక్షిప్తం చేస్తారు. ఈ ఐడీలన్నింటినీ దేశ వ్యాప్తంగానున్న ఆరోగ్య కేంద్రాలు, రిజిస్టర్డ్ వైద్యులతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల దేశంలో ఎవరైనా అనారోగ్యంతో వైద్యుల్ని సంప్రదిస్తే ఒక్క క్లిక్‌తో వారి సమస్యలన్నీ తెలుసుకోవచ్చు. ఈ్త ఐడీలతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మోదీ చెప్పారు. ఎన్సీసీ కేడెట్లకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ ఎర్రకోట వద్ద 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృశ్యం విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న రాష్ట్రపతి నివాస ప్రాంతం రైసినా హిల్స్ -
‘సరిహద్దుల పహారాలో మగువల తెగువ’
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఓసీ) వెంబడి భారత సైన్యం మంగళవారం తొలిసారిగా ‘రైఫిల్ విమెన్’ను దేశ భద్రత విధుల్లోకి దింపింది. ఎల్ఓసీ ప్రాంతంలో భద్రతా విధుల్లో మహిళలను మోహరించడం భారత సైన్యం చరిత్రలో ఇదే తొలిసారి. సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తులో సాధనా పాస్ ద్వారా ఎల్ఓసీ వైపు వెళ్లే రహదారిపై భద్రతా విధుల్లో మహిళా అధికారి నేతృత్వంలో ఆరుగురు రైఫిల్ విమెన్‌ను నియమించామని సైన్యం వెల్లడించింది. అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఈ మహిళా సైనికులు భారత సైన్యంలో డిప్యుటేషన్‌పై చేరారని అధికార వర్గాలు తెలిపాయి. ఎల్ఓసీకి దగ్గరగా ఉన్న జాతీయ సరిహద్దుల్లో పహారా విధులను రైఫిల్ విమెన్‌కు అప్పగించినట్టు వెల్లడించాయి. సాధనా పాస్ ద్వారా దేశంలోకి నార్కోటిక్స్, నకిలీ కరెన్సీ, ఆయుధాల స్మగ్లింగ్‌ను వీరు అడ్డుకుంటారు. ఈ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మర్‌కు అత్యంత చేరువగా ఉండటంతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌వైపు చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రాంతంలో 40 గ్రామాల ప్రజలు కశ్మీర్లోకి వెళ్లేందుకు సాధనా పాస్ మీదుగా వెళ్లాల్సిన క్రమంలో వీరిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంటారు. ఈ గ్రామాల నుంచి వచ్చే మహిళలు ఉన్న వాహనాలను తనిఖీ చేసేందుకు రైఫిల్ విమెన్ సేవలను భారత సైన్యం వినియోగించుకోనుంది. భారత సైన్యంలో మహిళలు శాశ్వత హోదాలో పనిచేయవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. చదవండి : చైనాకు దీటుగా బలగాల మోహరింపు -
కాచుకూర్చున్న 300 మంది ఉగ్రవాదులు
శ్రీనగర్: భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు సుమారు 300 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి ఏర్పాటు చేసుకున్న లాంచ్ప్యాడ్స్లో సిద్ధంగా ఉన్నారని భారత ఆర్మీ శనివారం వెల్లడించింది. ముఖ్యంగా నౌగర్ సెక్టార్ ప్రాంతంలో ఉన్న లాంచ్ ప్యాడ్లు ఉగ్రవాదులతో కిక్కిరిసిపోయాయని, వారు ఏ క్షణంలోనైనా ఇండియాలోకి చొరబడే అవకాశం ఉందని మేజర్ జనరల్ వీరేంద్ర వాత్స్ వెల్లడించారు. 250 నుంచి 300 మంది టెర్రరిస్టులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు. (కరోనా : చైనాపై మరో బాంబు) ఈ రోజు తెల్లవారుజామున కుప్వారాలో ఎల్వోసీ దాటి భారత్‌లోకి చొరబడిన ఇద్దరు టెర్రరిస్టులను సైన్యం హతమార్చింది. వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రూ.1.50 లక్షల విలువ చేసే ఇండియా, పాకిస్తాన్ కరెన్సీని స్వాధీనం చేసుకుంది.(మారణహోమానికి పాక్ కుట్ర) -
మారణహోమానికి పాక్ కుట్ర
శ్రీనగర్: భారత్‌లో మరో మారణహోమానికి పాకిస్తాన్ కుట్ర పన్నింది. ఆర్టికల్ 370 రద్దై ఏడాది పూర్తి కావొస్తున్న తరుణంలో జమ్మూకాశ్మీర్‌లో అలజడి రేపేందుకు పెద్ద ఎత్తున మారణాయుధాలతో టెర్రరిస్టులను పంపుతోంది. శనివారం తెల్లవారుజామున ఇద్దరు టెర్రరిస్టులు ఏకే–47 తుపాకులు, పెద్ద సంఖ్యలో బుల్లెట్లు, చైనా తయారీ హ్యాండ్ గన్స్, ఆస్ట్రియా టెక్నాలజీతో పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లతో కుప్వారా జిల్లా వద్ద గల ఎల్వోసి బోర్డర్‌ను దాటారు.(‘రెమ్‌డెసివిర్ ద్వారా మరణాల సంఖ్య తగ్గే అవకాశం’) దాదాపు వంద మీటర్లు లోపలికి వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులను సిక్కు లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన సైనికులు మట్టుబెట్టినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. టెర్రరిస్టులు ఇద్దరిలో ఒకరిని కుప్వారాకు చెందిన ఇద్రిస్ అహ్మద్ భట్(23)గా గుర్తించినట్లు తెలిపారు. 2018లో ఇద్రిస్ పాకిస్తాన్ వెళ్లాడని వివరించారు. ఇరువురూ లష్కర్ ఈ తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నట్లు వెల్లడించారు.(లాక్డౌన్: లగ్జరీ కారును అమ్మకానికి పెట్టిన అథ్లెట్) ఐఎస్ఐ ప్రోద్భలంతో ఉగ్రవాదులు చైనాకు చెందిన డ్రోన్లతో ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తారనే సమాచారంతో ఎల్వోసీ వద్ద ముందుస్తుగా నిఘాను పెంచినట్లు భారత ఆర్మీ అధికారి మేజర్ జనరల్ వీరేంద్ర పేర్కొన్నారు. ఫెన్సింగ్ కట్ చేసి కాశ్మీర్‌లోకి చొరబడిన టెర్రరిస్టులను సైనికులు అడ్డుకున్నట్లు చెప్పారు. పార్లమెంటుపై దాడిలో ఇవే గ్రెనేడ్లు 2001లో ఇండియా పార్లమెంటుపై జైషే ఈ మహమ్మద్ చేసిన ఉగ్రదాడిలో వాడిన గ్రెనేడ్లు, శనివారం టెర్రరిస్టుల వద్ద లభించిన గ్రెనేడ్లు ఒకే రకానికి చెందినవి. వీటితో 20 మీటర్ల పరిధిలో ఉన్న అందరినీ చంపొచ్చు. చైనా నుంచి అందుకున్న డ్రోన్లతో పాకిస్తాన్ పంజాబ్‌లోకి డ్రగ్స్, ఆయుధాలను పంపుతోంది. దీంతో సరిహద్దుల్లో డ్రోన్లను కూల్చివేసే యాంటీ డ్రోన్ సిస్టమ్స్‌ను మోహరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
పాక్ కాల్పులు: భారత జవాను మృతి
కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. ఆదివారం జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో షాపూర్, కిర్ణి సెక్టార్ల పరిధిలో నియంత్రణ రేఖ(ఎల్ఓసి) వెంబడి కాల్పులు జరుపుతూ, మోర్టార్లు విసిరింది. ఈ దాడిలో ఒక భారత సైనికుడు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. కాగా సరిహద్దుల వెంబడి పాక్ పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని భారత రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనందర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. (సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు..) ఈ ఏడాది జూన్ మొదటి పది రోజుల్లోనే 114 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని వెల్లడించారు. గడిచిన ఆరునెలల్లో 2 వేల సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత పదహారేళ్లతో పోలిస్తే 2019లో అత్యధిక సార్లు(3168) పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. గత ఆరు రోజులుగా పూంచ్ సెక్టార్లో పాక్ బలగాలు సరిహద్దు గ్రామాల్లో మోర్టార్లు విసరడం సహా పదే పదే కాల్పులు జరుపుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. (ఎల్వోసీ వద్ద కాల్పులు; 8 మంది ఉగ్రవాదుల హతం) -
ఆర్మీ అధికారులతో మోదీ దీపావళి వేడుకలు
-
ఆర్మీ అధికారులతో మోదీ దీపావళి వేడుకలు
-
ఆర్మీ అధికారులతో మోదీ దీపావళి వేడుకలు
రాజౌరి : భారత ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వద్ద ఆర్మీ అధికారులతో కలిసి ఆదివారం దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన వీడియోనూ మోదీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. దేశ భద్రత కోసం తమ ప్రాణాలనే త్యాగం చేస్తూ నిరంతరం శ్రమిస్తున్న ఆర్మీ అధికారులతో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.కాగా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి జమ్మూ కశ్మీర్లో పర్యటించిన మోదీ ఆర్మీ అధికారులతో కలిసి సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు. బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్‌లో ఆర్మీ అధికారులుతో సమావేశంలో ఆర్మీ సిబ్బందితో కరచాలనం చేస్తూ , స్వీట్లు పంచి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్మీ సిబ్బంది తమ సంతోషాన్నిమీడియాతో పంచుకున్నారు. 'స్వయంగా ప్రధాని ఇక్కడకు రావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. మాతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నందుకు ప్రధాని మోదీకు కృతజ్ఞతలు' అని ఓ సైనికుడు తెలిపారు. #Diwali is sweeter when celebrated with our brave soldiers. pic.twitter.com/skO2SfcwJ3 — Narendra Modi (@narendramodi) October 27, 2019 -
తెల్ల జెండాలతో వచ్చి శవాలను తీసుకెళ్లారు
న్యూఢిల్లీ: భారత సైన్యాన్ని కాల్పులతో ఎదుర్కోలేక పాకిస్తాన్ ఆర్మీ తెల్ల జెండాతో హాజిపిర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖలోకి ప్రవేశించింది. భారత్–పాక్ సైన్యాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాక్ ఆర్మీ ఈ పద్ధతిని ఎంచుకుంది. దీనికి ముందు పాక్ ఎల్ఓసీలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించి కాల్పులు జరిపింది. దీంతో భారత ఆర్మీ కూడా తిరిగి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఈ నెల 10న పాక్ సైనికుడు గులాం రసూల్ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాక్ తిరిగి కాల్పులు జరుపుతూ చొరబడాలని ప్రయత్నించింది. భారత సైన్యం తిరిగి కాల్పులు జరపడంతో మరో సైనికుడు మృతిచెందాడు. దీంతో రెండు రోజుల తర్వాత పాక్ సైన్యం తెల్ల జెండాతో ముందుకొచ్చింది. తెల్ల జెండా పట్టుకొని ఉంటే కాల్పులు జరపబోమని సంకేతం. ఈ జెండాతో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది. మరణించిన ఇద్దరినీ పంజాబ్‌కు చెందిన ముస్లింలుగా భావిస్తున్నారు. జూలై 30–31న కీరన్ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో దాదాపు ఏడు మంది పాక్ సైనికులు మరణించినప్పటికీ, పాక్ వారి మృతదేహాలను తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. బహుశా వారు కశ్మీర్ నేపథ్యం ఉన్నవారుగానీ, పాకిస్తాన్‌లోని ఉత్తర లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన వారు అయి ఉండవచ్చని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కేవలం పంజాబీ పాకిస్తానీలు మరణిస్తేనే పాక్ ముందుకు వస్తుందని విమర్శించారు. -
ఎల్వోసీని సందర్శించిన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: సరిహద్దు దేశాలైన భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దాయాది ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ)ను సందర్శించారు. ఆయన వెంట రక్షణశాఖ మంత్రి పర్వేజ్ ఖటక్, విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ, కశ్మీర్ మీద ఏర్పాటైన స్పెషల్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఫఖర్ ఇమామ్, ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా ఉన్నారు. పాకిస్థాన్ రక్షణ, అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇమ్రాన్ ఎల్వోసీని సందర్శించారు. ఆర్మీ చీఫ్ బజ్వాతో కలిసి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం సైనికులు, అమర జవాన్ల కుటుంబసభ్యులతో ముచ్చటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లోనూ ఆయన పర్యటించారు. 1965లో భారత్‌తో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళిగా పాక్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. -
సరిహద్దు శిబిరాలకు ఆర్మీ చీఫ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం పాక్‌తో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, ఆ దేశ నాయకుల రెచ్చగొట్టే ప్రకటనల నేపథ్యంలో భారత్ అప్రమత్తమయింది. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం శ్రీనగర్‌కు చేరుకున్నారు. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి సైనిక పోస్టులను సందర్శించారు. బలగాల కార్యాచరణ సన్నద్ధత, ముఖ్యంగా ఎల్వోసీ వెంట వాస్తవ పరిస్థితులపై సైనిక కమాండర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాదామీబాగ్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో రాష్ట్రంలో అంతర్గత పరిస్థితులపైనా ఆయన సమీక్షించనున్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం ఆర్మీ చీఫ్ రాష్ట్రంలో పర్యటించడం ఇదే ప్రథమం. ఇలా ఉండగా, కశ్మీర్ లోయతోపాటు శ్రీనగర్‌లో శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలు విధించారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మలయాళ మనోరమ న్యూస్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. -
గత15 రోజుల్లో 10 మంది పాకిస్తాన్ కమాండోలు హతం
జమ్మూకశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు తర్వాత పాకిస్తాన్ సైన్యానికి భారత సైన్యం గట్టి సమాధానం ఇచ్చింది. ఏదో ఒక చోట కవ్వింపులకు పాల్పడుతూ భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 10 మంది పాకిస్తాన్ ఆర్మీ కమాండోలను హతమార్చింది. ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైన్యం సహకారంతో భారత్‌కి చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య పలు సార్లు కాల్పులు జరిగాయి. ఈనేపథ్యంలోనే ఆగస్టు 5 నుండి నేటి వరకు పదిమంది పాకిస్తాన్ కమాండోలను హతం చేసినట్టు భారత భద్రతా దళాలు వెల్లడించాయి. గత మూడు వారాలుగా పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోకి చోరబడటానికి ప్రయత్నిస్తోందని, పాకిస్తాన్ ఉగ్రవాదులను వెనక్కి పంపే ప్రయత్నంలో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పులలో పది మందికి పైగా ఎస్ఎస్జీ కమాండోలు మరణించినట్లు భద్రతా దళ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ఘటనను పాకిస్తాన్ ఆర్మీ అంతర్జాతీయం చేయాలని చుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే గత 15 రోజులుగా పాకిస్తాన్ ఆర్మీ వందమందికి పైగా కమాండోలను నియంత్రణ రేఖ వద్ద కాపలా ఉంచి భారత దళాలపై బ్యాట్ చర్యకు ప్రతిపాదించినట్లు తెలిపారు. పాకిస్తాన్ సైన్యాన్ని, ఉగ్రవాదులు చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టడానికి నియంత్రరేఖ వద్ద భారత ఆర్మీ దళాలు హై అలర్ట్‌ను ప్రకటించాయి. -
కశ్మీర్‌పై ఐసీజేకి వెళ్తాం: పాక్
ఇస్లామాబాద్/జమ్మూ/శ్రీశ్రీనగర్: కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పాక్ తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విదేశాంగ మంత్రి ఖురేషి తెలిపారు. కశ్మీర్ అంశాన్ని అన్ని అంతర్జాతీయ వేదికలపైనా ప్రస్తావించడంతో పాటు, ఐసీజేలోనూ పిటిషన్ వేస్తామని ఆగస్టు 6వ తేదీన జరిగిన పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రధాని ఇమ్రాన్ ఇటీవల చెప్పారు. పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్ బలగాలు మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. పూంచ్ జిల్లాలో జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను మరణించగా, నలుగురు పౌరులు గాయపడ్డారు. భారత బలగాలు జరిపిన కాల్పుల్లో పాక్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. సరిహద్దు వెంబడి కృష్ణా ఘటి, మెందర్ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పాకిస్తాన్ బలగాలు కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో బిహార్‌కు చెందిన రవిరంజన్ సింగ్ (36) మరణించగా నలుగురు పౌరులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. కాగా, బాలాకోట్ దాడుల సమయంలో పాక్ విమానాలను మిగ్–21తో ఎంతో ధైర్యంగా తరుముకుంటూ వెళ్లిన ఐఏఎఫ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను చిత్రహింసలు పెట్టిన పాక్ కమాండో అహ్మద్ ఖాన్.. భారత సైన్యం కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. ఆగస్టు 17వ తేదీన భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుం డగా నక్యాల్ సెక్టార్లో సైన్యం జరిపిన కాల్పుల్లో అహ్మద్ ఖాన్ మరణించినట్లు సమాచారం. మిగ్ 21 జెట్ విమానాన్ని కూల్చేయడంతో తప్పించుకున్న అభినందన్‌ను పాక్ సైన్యం పట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, జమ్మూ కశ్మీర్లో క్రమంగా ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. దాదాపు 15 రోజుల తర్వాత మంగళవారం శ్రీనగర్‌లో వాణిజ్య కేంద్రం లాల్ చౌక్ వద్ద బారికేడ్లను పోలీసులు తొలగించారు. పలు ప్రాంతాల్లో ఆంక్షలను సడలించారు. శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపు కొనసాగుతోంది. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. కశ్మీర్లోకి ప్రవేశించేందుకు యత్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్‌ను జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అడ్డుకుని తిరిగి ఢిల్లీకి పంపేశారు. -
కశ్మీరంలో సడలుతున్న ఆంక్షలు
జమ్మూ/శ్రీనగర్: కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. జమ్మూ, కశ్మీర్‌లోయలో ప్రజల రాకపోకలపై విధించిన ఆంక్షలను కేంద్రం శనివారం పాక్షికంగా సడలించింది. దీంతో పలువురు కశ్మీరీలు పక్క గ్రామాల్లోని తమ బంధువులు, కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆంక్షలను సడలించినా భద్రతాబలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. కశ్మీర్‌లోని 35 పోలీస్స్టేషన్ల పరిధిలో ఆంక్షలను అధికారులు సడలించారు. కశ్మీర్ బయట ఉండే కుటుంబ సభ్యులతో ప్రజలు మాట్లాడేందుకు వీలుగా 17 టెలిఫోన్ ఎక్సే్ఛంజీల్లో సేవలను పునరుద్ధరించారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్ మాట్లాడుతూ..‘కశ్మీర్ లోయలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి’ అని తెలిపారు. కాగా, ప్రభుత్వం ఆంక్షలు సవరించినా పలు పెట్రోల్ బంకులు, ఇతర మార్కెట్లు శనివారం కూడా మూతపడ్డాయి. ఇంటర్నెట్, టెలిఫోన్ సేవల పునరుద్ధరణ జమ్మూలో శనివారం 5జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ..‘2జీ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించాం. ఈ సందర్భంగా ఇంటర్నెట్ సేవలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. ప్రస్తుతానికి త్రీజీ, 4జీ సేవలపై ఆంక్షలను సడలించడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఉగ్రవాదులు త్వరలోనే దాడిచేసే అవకాశముందని నిఘావర్గాల నుంచి తమకు సమాచారం అందిందని జమ్మూకశ్మీర్ సీఎస్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. పాక్ కాల్పుల్లో జవాన్ మృతి కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో సరిహద్దులోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులు లక్ష్యంగా పాక్ బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ దుర్ఘటనలో డెహ్రాడూన్‌కు చెందిన జవాన్ లాన్స్‌నాయక్ సందీప్ థాపా(35) తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ పాక్ దుశ్చర్యను దీటుగా తిప్పికొట్టిందని ఆర్మీ అధికార ప్రతినిధి శనివారం మీడియాకు చెప్పారు. -
కశ్మీర్లో ఏం జరుగుతోంది?
-
మన భూభాగంలోకి చైనా సైన్యం రాలేదు
న్యూఢిల్లీ: లడఖ్‌లో సరిహద్దులు దాటి చైనా సైన్యం చొచ్చుకువచ్చిందన్న వార్తలపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ఆధ్యాత్మిక గురువు దలై లామా 84వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన కొందరు టిబెటన్లు లడఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో ఉత్సవాలు జరుపుకున్నారని, ఆ సందర్భంగా వారు టిబెటన్ పతాకాలను ఎగురవేశారని తెలిపారు. ఆ సమయంలో భారత్ భూభాగంలోని వాస్తవ నియంత్రణ రేఖను దాటేందుకు యత్నించిన చైనా సైనికులను తాము అడ్డుకున్నామన్నారు. దీంతో వారు అక్కడ జరుగుతున్న ఉత్సవాలను గమనించి, అర్థగంట తర్వాత వెనక్కి వెళ్లిపోయారన్నారు. అంతేతప్ప, చైనీయులు ఎటువంటి ఆక్రమణకు పాల్పడలేదన్నారు. పాకిస్తాన్ సైన్యం ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా గట్టిగా బదులిస్తామని, ఉగ్ర చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ‘కార్గిల్ యుద్ధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వేతర శక్తులు బలపడి ఉగ్ర చర్యలకు పాల్పడుతుండటం కొత్త పరిణామం అని అన్నారు. -
సియాచిన్‌లో రాజ్‌నాథ్ పర్యటన
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన తొలి పర్యటనలో ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన, ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్‌ను సందర్శించనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో కలసి సోమవారం ఉదయం ఆయన లేహ్ లోని 14వ, శ్రీనగర్‌లోని 15వ సైనికదళాల ప్రధాన కార్యాలయాలను సందర్శించారు. పాకిస్తాన్‌తో ఉన్న నియంత్రణరేఖ (ఎల్వోసీ) వద్ద భద్రతా ఏర్పాట్లు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై సైనిక ఉన్నతాధికారులు రాజ్‌నాథ్‌కు వివరిస్తారు. అనంతరం సాయంత్రానికి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. సియాచిన్ వద్ద గత పదేళ్లలో దేశం 163 మంది సైనికులను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ అమరవీరులకు నివాళులు అర్పించారు. -
‘విశ్వాస’ ఘాతుకం
న్యూఢిల్లీ: దాయాది దేశాల ప్రజల్లో పరస్పరం విశ్వాసం నెలకొల్పాలన్న సదుద్దేశంతో వాస్తవాధీన రేఖ వెంబడి వాణిజ్యానికి భారత్ ఇచ్చిన అవకాశాన్ని ఉగ్రవాదులు దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవాధీన రేఖకు ఇరువైపుల ఉన్న భారత వ్యతిరేక శక్తులు(హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్రమ వ్యాపార లావాదేవీలతో విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ సొమ్ము నంతా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాద మూకలకు అందిస్తున్నాయి. ఆ సొమ్ముతో ఉగ్రవాదులు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సేకరించి భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయి. అంతేకాకుండా ఈ దారి గుండా మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ కూడా భారత దేశంలోకి పెద్ద ఎత్తున వచ్చి పడుతోంది. ఈ విషయం గుర్తించిన భారత దేశం సరిహద్దు వాణిజ్యాన్ని నిషేధించింది. పకడ్బందీగా.... సరిహద్దు ఆవల నుంచి వివిధ పదార్ధాలు, వస్తువులను ఈ మార్గం గుండా భారత దేశానికి రవాణా చేస్తారు. ఆ సమయంలో సరుకు అసలు ధర కంటే బాగా తక్కువ ధరను ఇన్వాయిస్లో చూపిస్తారు. మన దేశంలో వ్యాపారులు ఆ సరుకులను మార్కెట్ ధరకు అమ్మి అత్యధిక లాభాలు సంపాదిస్తున్నారు. ఇలా వచ్చిన అధిక లాభాలను ఉగ్రవాదులకు అందజేస్తున్నారు. ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలతో సంబంధాలు ఉన్న వారు సరిహద్దుకు ఇరువైపుల వ్యాపారాల పేరుతో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని భద్రతా దళ అధికారులు చెబుతున్నారు. వీరే కాకుండా సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర సంస్థల్లో చేరిన భారతీయులు కొందరు మన దేశంలో ఉన్న వారి బంధు, మిత్రులతో వ్యాపార సంస్థలు పెట్టించి వారి ద్వారా కూడా ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారని వారు వివరించారు. ఈ దారి గుండా జమ్ము,కశ్మీర్లోకి చేరిన మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ, ఆయుధాలు ఇక్కడి ఉగ్రవాద, వేర్పాటు వాదులకు అందుతున్నాయని, ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతున్నాయని వారు తెలిపారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్న ఆరోపణపై అరెస్టు చేసిన జహూ అహ్మద్ వతాలి అనే వ్యాపారి ఎల్వోసీ ట్రేడర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడని తేలింది. జహూకు చెందిన కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. 12 మందిని అరెస్టు చేశారు. వేల కోట్ల వాణిజ్యం భారత ప్రభుత్వం 2008లో వాస్తవాధీన రేఖ వెంబడి రెండు చోట్ల వాణిజ్యానికి అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ఈ దారిలో రూ. 6,900 కోట్ల లావాదేవీలు జరిగాయి. మన దేశం నుంచి అరటిపళ్లు, ఎంబ్రాయిడరీ వస్తువులు, చింతపండు, ఎర్రమిర్చి వంటివి ఎగుమతి అవుతోంటే, కాలిఫోర్నియా బాదంపప్పు, ఎండు ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, మామిడి వంటివి దిగుమతి అవుతున్నాయి. 21 రకాల వస్తువులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో కాలిఫోర్నియా బాదం పప్పు వల్లే వ్యాపారులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ మార్గంలో అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, పరిస్థితిని సమీక్షించి వాణిజ్యాన్ని మళ్లీ అనుమతించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని అధికారులు చెప్పారు. -
పాక్‌తో సరిహద్దు వాణిజ్యం రద్దు
న్యూఢిల్లీ / శ్రీనగర్: భారత్–పాకిస్తాన్ల మధ్య జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట జరుగుతున్న వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. మామిడికాయలు, ఎండు మిరప, మూలికలు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, కాలిఫోర్నియా ఆల్మండ్ సహా 21 ఉత్పత్తుల కొనుగోలు–అమ్మకాలను రద్దుచేస్తున్నట్లు వెల్లడించింది. వాణిజ్యం ముసుగులో ఉగ్రమూకలకు ఆయుధాలు, డ్రగ్స్, ధనసహాయం అందడంతో పాటు నకిలీ నోట్లు భారత్‌లోకి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తాజా నిర్ణయంతో 280 వ్యాపారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. -
పాక్‌కు బుద్ధి చెప్పిన భారత్
జమ్మూ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సరిహద్దు ప్రాంతాలైన రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో మోర్టారు దాడులు, కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్‌కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్‌కు చెందిన 7 సైనిక పోస్టులను భారత్ ధ్వంసం చేసింది. పలువురు పాక్ సైనికులు గాయపడ్డారు. ఈ మేరకు ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్లను మూసివేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సోమవారం పాక్ మోర్టారు దాడులు చేయడంతో ఓ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఐదేళ్ల బాలికతోపాటు ముగ్గురు మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్, నౌషెరా సెక్టార్ పరిధిలోని రాజౌరీలో పాక్ సోమవారం మొదలుపెట్టిన మోర్టారు దాడులు, కాల్పులు మంగళవారం కొనసాగాయి. ఇందుకు ప్రతిగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఎల్ఓసీ వెంబడి రాక్‌చిక్రి, రావలకోటె ప్రాంతాల్లో ఉన్న 7 పాక్ సైనిక పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్ సైనికులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్ ప్రభుత్వ విభాగం తెలిపింది. -
కాల్పులకు దిగిన పాక్..జవాను మృతి
శ్రీనగర్ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో భారత జవాను యశ్ పాల్(24 ) ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌పై మెరుపు దాడుల నేపథ్యంలో భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో జనవరి నాటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 110 సార్లు కాల్పులకు తెగబడింది. ఇదిలా ఉండగా.. గత సోమవారం నియంత్రణ రేఖ వెంబడి అఖ్నూర్, సుందర్బనీ సెక్టార్లలో పాక్ సైన్యం బాంబులతో విరుచుకు పడినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో కరమ్‌జీత్ సింగ్ అనే జవాను మరణించారని పేర్కొన్నారు. గతేడాది పాక్ 2936 సార్లు కాల్పులకు దిగిందని, గత పదిహేనేళ్లలో ఇదే అత్యధికమని తెలిపారు. -
పాక్ సరిహద్దు దాడులు ఆగేదెప్పుడు ?
సాక్షి, న్యూఢిల్లీ : అది మార్చి ఒకటవ తేదీ. వాఘా సరిహద్దులో భారత వింగ్ కమాండర్ అభినందన వర్తమాన్‌కు ఘన స్వాగతం చెప్పేందుకు సైనికులు, పౌరులు పెద్ద ఎత్తున బారులు తీరారు. మరో పక్క బాణా సంచా పేలుళ్లతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది. దీనికి సంబంధించిన వార్తలను తారిక్ హుస్సేన్ అనే 24 ఏళ్ల సలోత్రి గ్రామస్థుడు ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్నాడు. సమయం రాత్రి 9.18 గంటలు కావొస్తోంది. ఇంతలో ఇంటి ముందు భారీ పేలుడు శబ్దం. ఒక్కసారి కాళ్ల కింద భూమి కంపించి పోయింది. ఏదో శతఘ్ని మందు గుండు వచ్చి పడి ఉంటుందని అనుకున్నాడు తారిక్ హుస్సేన్. ఇంట్లో ఉన్నవాళ్ల ఎవరూ కదల్లేదు. మరో గుండు వచ్చి పడొచ్చని వారంతా భయం భయంగా ఒకరికొకరు దగ్గరగా ఉండిపోయారు. మరికొన్ని క్షణాల్లోనే మరో భారీ పేలుడు. సలోత్రి గ్రామం వణికి పోయింది. ఈ సారి రెండో శతఘ్ని గుండు తారిక్ హుస్సేన్ ఇంటికి 25–30 మీటర్ల దూరంలో ఉన్న ఆయన మామ మొహమ్మద్ అస్లాం ఇంటిపై పడి పేలింది. ఈ పేలుడులో ఐదేళ్ల మొహమ్మద్ ఫైజాన్, పది నెలల శబ్నం, ఆ ఇద్దరు పిల్లల తల్లి రుబీనా కౌన్సర్ మరణించారు. ఆమె భర్త యూనిస్ తీవ్రంగా గాయపడ్డారు. మొదటి పేలుడుతో అప్రమత్తమైన యూనిస్ తండ్రి మొహమ్మద్ అస్లాం లేచి, భార్యా పిల్లలను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాల్సిందిగా కొడుకూ యూనిస్‌కు చెప్పి ఇంటి ముందుకెళ్లాడు. ఇంతలో ఇంటి మీద బాంబు పడింది. ఆ సమయంలో రుబీనా కౌన్సర్ తన పది నెలల పాపకు పాలిస్తోంది. పేలుడు తీవ్రతకు ఆ తల్లి, ఆ పాప తలలు తెగిపడ్డాయి. సలోత్రి గ్రామం జమ్మూలోని పూంచ్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ)కు సమీపంలో ఉంది. అక్కడి నుంచి సరిహద్దుకు ఆవల ఉన్న పాకిస్థాన్ గ్రామాలు కూడా కనిపిస్తాయి. 1971 పాకిస్థాన్‌తో యుద్ధం తర్వాత ఈ స్థాయిలో శతఘ్ని గుండ్లు వచ్చి పడడం ఇదే మొదటి సారని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలోని చాలా ఇళ్లకు తుపాకీ, మోర్టార్ గుళ్లు తగిలిన చాలా ఇళ్లకు కనిపిస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ వైమానిక దాడులు జరిపిన మరుసటి రోజు నుంచే పాకిస్థాన్ వైపు నుంచి ఇలాంటి దాడులు పెరిగాయి. రాజౌరి జిల్లాలో కూడా ఇలాంటి దాడులు జరిగాయని, ఆ దాడుల్లో నలుగురు పౌరులు చనిపోయారని భారత సైన్యం అధికార ప్రతినిధి దేవేందర్ ఆనంద్ తెలిపారు. సరిహద్దుకు ఆనుకొని ఉన్న 25 ప్రాంతాలపై పాకిస్థాన్ సైనికులు రోజుకు రెండు, మూడు సార్లు మోర్టార్ దాడులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడపా దడపా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరో ముగ్గురో పౌరులు చనిపోతూనే ఉన్నారు. ఇలా పాక్ దాడుల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాని కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల చొప్పుక నష్టపరిహారం ఇస్తుంది. ఇల్లు ధ్వంసం అయితే మరో ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తుంది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కోరుకుంటే మాత్రం తొమ్మిది లక్షల నష్టపరిహారానికి బదులు ఒక లక్ష పరిహారం వస్తుంది. గాయపడిన వారందరి చికిత్సకు అయ్యే ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఆస్పత్రి బిల్లులను సమర్పిస్తే తర్వాత రీఎంబర్స్మెంట్ చేస్తుంది. పస్తుతం చికిత్సకు డబ్బులు లేవంటా విలపిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. -
పాకిస్తాన్‌కు భారత్ హెచ్చరిక
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ అదనపు బలగాల్ని మోహరించడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ జనావాస ప్రాంతాలు లక్ష్యంగా దాడులకు దిగొద్దని హెచ్చరించింది. పుల్వామా, బాలాకోట్ ఘటనల తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ తన బలగాలు, ఆయుధ సంపత్తిని అఫ్గానిస్తాన్ సరిహద్దుల నుంచి నియంత్రణ రేఖ వైపు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం భారత్ స్పందిస్తూ.. పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు జారీచేసింది. (ఫేక్ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన పాక్) ఎల్వోసీ వెంట సామాన్య పౌరులు లక్ష్యంగా మోర్టార్ దాడులకు దిగొద్దని మంగళవారం హాట్‌లైన్ ద్వారా జరిపిన సంభాషణలో భారత అధికారులు పాక్‌ను హెచ్చరించారు. ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దులో నిఘాను పటిష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు ఎదురైనా దీటుగా తిప్పికొడతామని ఆర్మీ తెలిపింది. (‘బాలాకోట్’ సాక్ష్యాలివిగో!) -
ఉగ్రవాదుల ఘాతుకం.. ఆర్మీ అధికారి మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో మరోసారి అలజడి రేగింది. ఉగ్రవాదులు పెట్టిన బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో ఓ ఆర్మీ మేజర్ మృతిచెందగా.. ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ) వద్ద పెట్రోలింగ్ చేస్తున్న భద్రత బలగాలకు రాజౌరీలోని నౌషీరా సెక్టారు వద్ద బాంబు పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ క్రమంలో అక్కడ అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) ఉండటం గమనించిన ఆర్మీ అధికారి దానిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బాంబు ఒక్కసారిగా పేలడంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో పక్కనే ఉన్న జవాను కూడా తీవ్రంగా గాయపడినట్లు లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ పేర్కొన్నారు. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేసే అంశమై చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. The Major-rank army officer was killed while defusing an Improvised Explosive Device (IED) which had been planted by terrorists. The officer is from the Corps of Engineers. The IED was planted 1.5 kms inside the Line of Control in the Naushera sector, Rajouri district, in J&K https://t.co/ZyWFS9RbWR — ANI (@ANI) February 16, 2019 -
నిబంధనలు ఉల్లంఘించామని తెలియదు: పాక్
ఇస్తామాబాద్: నిబంధనలు ఉల్లంఘించి భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ హెలికాప్టర్‌పై భారత సైనికులు కాల్పులు జరిపిని విషయం తెలిసిందే. ఈ ఘటనపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పర్యాటక మంత్రి ముస్తాక్ మిన్హాస్ స్పందించారు. ఆ సమయంలో తను హెలికాప్టర్లోనే ఉన్నానని, తనతో పాటు పీఓకే ప్రధాన మంత్రి రాజా ఫరూక్ హైదర్ ఖాన్, ఆయన భద్రతాధికారులు, ప్రొవిన్స్ విద్యాశాఖ మంత్రి ఇఫ్తికర్ గిలానీలను ఉన్నారని తెలిపారు. ‘ నిజానికి ఎయిర్‌స్పేస్ నిబంధనలు ఉల్లంఘించామని మాకు తెలియదు. మాపైకి కాల్పులు జరుగుతున్నాయని తెలుసుకున్నాం. మా గమ్యం చేరిన తరువాత ఆ కాల్పులు భారత్ నుంచి వచ్చాయని తెలిసింది.’ అని తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి పూంచ్ జిల్లా గుల్పూర్ సెక్టార్‌లోకి చొచ్చుకొచ్చిన తెలుపు రంగు హెలికాప్టర్‌ను కూల్చివేయడానికి భారత సైనికులు ప్రయత్నించడంతో, వెనక్కి మళ్లిందని భారత అధికారులు చెప్పారు. అది సైనిక హెలికాప్టర్ కాదని, గాల్లో చాలా ఎత్తులో చక్కర్లు కొట్టినట్లు తెలిపారు. ఆ సమయంలో మూడు ఫార్వర్డ్ పోస్ట్‌ల్లోని సైనికులు చిన్న తుపాకులతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ వీడియోల్ని పాక్ టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. ఐరాసలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్‌పై మండిపడిన తరువాతి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. నిబంధనల ప్రకారం..ఎల్వోసీకి కిలోమీటరు దూరంలోకి హెలికాప్టర్లు, పది కి.మీ. పరిధిలోకి విమానాలు రావొద్దు. (చదవండి: భారత గగనతలంలోకి పాక్ హెలికాప్టర్) -
భారత గగనతలంలోకి పాక్ హెలికాప్టర్
జమ్మూ: నిబంధనలు ఉల్లంఘించి భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ హెలికాప్టర్ ఆదివారం కలకలం సృష్టించింది. నియంత్రణ రేఖ వెంబడి పూంచ్ జిల్లా గుల్పూర్ సెక్టార్‌లోకి చొచ్చుకొచ్చిన తెలుపు రంగు హెలికాప్టర్‌ను కూల్చివేయడానికి భారత సైనికులు ప్రయత్నించడంతో, వెనక్కి మళ్లిందని అధికారులు చెప్పారు. అది సైనిక హెలికాప్టర్ కాదని, గాల్లో చాలా ఎత్తులో చక్కర్లు కొట్టినట్లు తెలిపారు. ఆ సమయంలో మూడు ఫార్వర్డ్ పోస్ట్‌ల్లోని సైనికులు చిన్న తుపాకులతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నేత రజా ఫరూక్ హైదర్ ఖాన్ ఆ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఆ వీడియోల్ని పాక్ టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. గగనతల నిబంధనల్ని పాక్ అతిక్రమించిందని చూపడానికే భారత్ కాల్పులు జరిపిందని, కానీ ఆ సమయంలో తమ గగనతలంలోనే ఉన్నామని ఫరూక్ కార్యాలయం వెల్లడించింది. ఐరాసలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్‌పై మండిపడిన తరువాతి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. నిబంధనల ప్రకారం..ఎల్వోసీకి కిలోమీటరు దూరంలోకి హెలికాప్టర్లు, పది కి.మీ. పరిధిలోకి విమానాలు రావొద్దు. మిలిటెంట్ కాల్పుల్లో పోలీస్ మృతి... షోపియాన్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్‌పై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒక పోలీస్ మృతి చెందారు. ఆదివారం పోలీస్ స్టేషన్‌పై మిలిటెంట్లు కాల్పులకు దిగడంతో వెంటనే జవాన్లు కూడా ఎదురు దాడి చేశారు. -
భారత సరిహద్దుల్లో చొరబడ్డ పాక్ హెలికాఫ్టర్
-
సర్జికల్స్ స్టైక్స్ రెండోసారి జరిగాయా?
-
పెళ్లి: మతం మార్పించి.. మొహం చాటేశాడు!
మల్కాజిగిరి: ఓ యువతిని పెళ్లి పేరుతో మోసగించి ఏడు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుణ్ని ఎల్ఓసీ(లుక్ అవుట్ సర్టిఫికెట్) ద్వారా ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. ఎస్హెచ్ఓ మన్మోహన్ కథనం ప్రకారం..దారుల్‌షిఫాకు చెందిన సఫ్దర్ అబ్బాస్ జైదీ(28) దుబాయిలో 2014 నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అంతకు ముందు 2012 నుంచి దుబాయికి వెళ్లే వరకు హైటెక్ సిటీ ప్రాంతంలో పనిచేశాడు. ఆ సమయంలో పరిచయమైన ఓ హిందూ యువతిని ప్రేమించాడు. అనంతరం దుబాయికి వెళ్లిన అబ్బాస్ కొన్ని రోజుల తర్వాత ఆ యువతిని కూడా అక్కడికి పిలిపించుకొని ఉద్యోగంలో చేర్చాడు. వివాహం చేసుకోవడానికి అబ్బాస్ తన తల్లితండ్రులను ఒప్పిస్తానని అందుకు మతం మారాలని నమ్మించి మత మార్పిడి చేయించాడు. అనంతరం వారిద్దరూ గతేడాది నగరానికి తిరిగి వచ్చారు. తల్లితండ్రులతో మాట్లాడానని ఏప్రిల్ 17న పెళ్లి, 28న రిసెప్షన్ ఏర్పాటు చేశామని ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఆ యువతిని నమ్మించారు. జనవరిలో దుబాయికి వెళ్లిన అనంతరం అబ్బాస్ ఆమెతో మాట్లాడడం మానేశాడు. ఈ సంఘటనపై ఆ యువతి తల్లి ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ కమిషనర్ మహేష్ భగవత్ నిందితునిపై ఎల్ఓసీ జారీ చేశారు. ఈ నెల 27న నగరానికి వచ్చిన అబ్బాస్‌ను ఎయిర్‌పోర్టు పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మరిన్ని సర్జికల్ దాడులు..?!
న్యూఢిల్లీ : ‘సర్జికల్ స్ట్రైక్స్’ రెండో వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ‘పరాక్రమ్ పర్వ్’ పేరుతో ఆర్మీ ఎగ్జిబిషన్‌ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ‘గత రెండు మూడు రోజుల్లో మరో పెద్ద విషయం జరిగింది. ఇప్పుడే దీని గురించి ఏం చెప్పలేను.. కానీ భవిష్యత్తులో తెలుస్తుంది’ అన్నారు. కొన్ని రోజుల క్రితం ఎల్వోసీ దగ్గర పాకిస్తాన్ సైన్యాలు నాగేంద్ర సింగ్ అనే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్‌ను కాల్చి చంపారు. ఈ సంఘటన నేపధ్యంలో రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. బీఎస్ఎఫ్ జవాన్ మృతికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ స్థావరాలను నాశనం చేశారనే విషయం గురించి రాజ్‌నాథ్ సింగ్ సూచనప్రాయంగా తెలియజేశారని విశ్వసనియ వర్గాల సమాచారం. ఈ విషయం గురించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఒక విషయం అయితే జరిగింది.. కానీ దాని గురించి ఇప్పుడేం ఏం చెప్పలేను. కానీ జరిగింది ఏదైనా మంచికే జరిగింది. నన్ను నమ్మండి. గడిచిన రెండు, మూడు రోజుల్లో చాలా గొప్ప విషయం ఒకటి జరిగింది. నిన్న, మొన్న ఏం జరిగిందనేది మీకు భవిష్యత్తులో తెలుస్తుంది’ అంటూ నిగూఢంగా మాట్లాడారు. ‘నేను మన బీఎస్ఎఫ్ జవాన్లకు ఒకటే చెప్పాను. ముందు పేలిన తూటా ఎప్పటికీ మనది కాకుడదు. వారు మన పొరుగువారు. కానీ వారు కాల్పులకు తెగబడితే మాత్రం ఊరుకోకండి. విజృంభించండి అని చెప్పాను’ అని వివరించారు. పాక్ సైన్యం నాగేంద్ర సింగ్‌ని అతి క్రూరంగా చంపేసినందుకు ప్రతీకారంగా బీఎస్ఎఫ్ కొన్ని చర్యలు తీసుకున్నట్లు.. భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. -
సర్జికల్ స్ట్రైక్స్ జవాన్ వీర మరణం
శ్రీనగర్: నిత్యం దేశం కోసం పరితపించే లాన్స్ నాయక్ సందీప్ సింగ్ సోమవారం వీర మరణం పొందారు. 2016లో పీవోకేలో తలదాచుకుంటున్న ఉగ్రమూకలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌లో సందీప్ సింగ్ చురుకుగా పాల్గొన్నారు. ప్రస్తుతం జుమ్మూ కశ్మీర్‌లోని టాంగ్దార్ సెక్టార్లో భారత దళాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సందీప్ తన చివరి శ్వాస ఉన్నంత వరకు దేశం కోసం పోరాడుతూనే ఉన్నారు. శనివారం టాంగ్దార్ సెక్టార్లో ఉగ్ర కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు వారిని నివారించేందుకు ఆపరేషన్ చేపట్టాయి. అందులో భాగంగా ఆది, సోమ వారాల్లో ఐదుగురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఆపరేషన్‌లో సందీప్ ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించారు. ఈ ప్రయత్నంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అతని శరీరంలోకి బులెట్లు దూసుకెళ్లాయి. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. కాగా, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన సందీప్‌కు భార్య, ఐదేళ్ల బాబు ఉన్నారు. -
కంచె దాటే యత్నం; ఆరుగురు హతం
శ్రీనగర్: భారత భద్రతా బలగాలు కుపర్వా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఆదివారం పాకిస్తాన్ తీవ్రవాదుల భారీ చొరబాటుని అడ్డుకున్నాయి. దేశంలోకి చొరబడేందుకు యత్నిసున్న ఆరుగురిని కాల్చి చంపాయి. కీరన్ సెక్టార్లో ఆదివారం ఉదయం ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ‘దేశంలోకి చొరబాటుకు యత్నించిన ఆరుగురు తీవ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. తప్పించుకుపోయిన మరికొంత మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చ’ని రక్షణ శాఖ ప్రతినిధినొకరు తెలిపారు. కాగా, జమ్మూకశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి శనివారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లెక్కకు మించి భద్రతా దళాలను మోహరిచండంతోనే అనేక మంది యువకులు తీవ్రవాదం వైపు మళ్లుతున్నారనే ఆరోపణలు నిజం కాదని అన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా భారత భద్రతా బలగాలు ఎటువంటి తీవ్రవాద నిర్మూలన ఆపరేషన్లు చేపట్టలేదనీ, కాల్పుల విరమణ పాటిస్తున్నాయని గుర్తు చేశారు. కశ్మీర్ ప్రాంతంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందనీ, అయినా కొంతమంది యువకులు తీవ్రవాదం అడుగులేస్తున్నారని ఆర్మీ మాజీ బ్రిగేడియర్ అనిల్ గుప్తా అన్నారు. -
పాక్ మరోసారి కాల్పుల ఉల్లంఘన
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సరిహద్దులోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) వద్ద పాక్స్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దులోని ఎల్ఓసి వద్ద బీఎస్ఎఫ్ స్థావరాలపై పాక్ సోమవారం కాల్పులకు దిగింది. కాల్పుల ప్రభావం సరిహద్దులోని రెండు గ్రామాలపై ఉంటుందని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంతవరకు ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఆర్మీ అధికారులు సూచించారు. సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నందున కశ్మీర్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పాక్ సరిహద్దులోని ఆర్నియా, ఆర్ఎస్ పుర, రాంగఢ్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో పాక్ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. పాక్ కాల్పులను భద్రతా బలగాలు తిప్పికొట్టారని, పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నందువల్ల ప్రతీకారం తీర్చుకుంటామని అధికారులు పేర్కొన్నారు. పాక్ దాడులకు ఎల్ఓసీ సరిహద్దులోని ఆఖ్కూనూర్లో ఎనిమిది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోగా, ఆర్నియా సెక్టార్లో ఆరుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం పాక్ దళాలు కాల్పులకు పాల్పడటంతో వేగంగా స్పందించిన భద్రత దళాలు పాక్ కాల్పులను తిప్పికొట్టన విషయం తెలిసిందే. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తున్నట్లు వెన్నకి తగ్గిన పాక్, సోమవారం మరోసారి రెచ్చిపోయి దాడులకు పాల్పడింది. పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఏవిధంగా కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందో 19 సెకన్ల థర్మల్ ఇమేజరీ ఫుటేజ్‌ను బీఎస్ఎఫ్ అధికారులు విడుదల చేశారు. కాగా ఏడాది సమయంలో పాక్ ఎల్ఓసి వద్ద 700 సార్లు దాడులకు పాల్పడిందని, 38 పౌరులు, 18 మంది భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించారని ఆర్మీ ఈ అధికారులు తెలిపారు. -
అమరులైన ఇద్దరు సైనికులు
శ్రీనగర్ : నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సోమవారం పాక్ కాల్పులకు తెగబడింది. సుబేదార్ సెక్టార్లో కాల్పుల బారినపడి తీవ్రంగా గాయపడిన ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దాడిలో అమరులైన రైఫిల్‌మెన్ వినోద్ సింగ్, జాకీ శర్మలు జమ్మూకశ్మీర్‌కు చెందినవారు. వినోద్ సింగ్(24) అక్నూర్ జిల్లాకి చెందిన దనాపూర్ వాసి. జాకీ శర్మ(30) హిరానగర్ జిల్లాకి చెందిన సన్‌హైల్ గ్రామ నివాసి. భారత్ వైపు నుంచి ఎలాంటి కాల్పులు లేకపోయిన పాక్ ఈ అకృత్యానికి దిగిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. -
భారతీయుల్ని కాల్చిచంపిన పాక్
-
భారతీయుల్ని కాల్చిచంపిన పాక్
శ్రీనగర్ : దాయాది పాకిస్తాన్ మళ్లీ బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు వెంబడి ఘాతుకానికి తెగబడింది. గ్రామాలపై బుల్లెట్లు, మోర్టార్‌షెల్స్ వర్షం కురిపించింది. కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. జమ్ముకశ్మీర్ ఫూంచ్ సెక్టార్ బాల్కోట్ సరిహద్దుపైకి పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యయని అధికారులు చెప్పారు. చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారని పేర్కొన్నారు. -
ఆర్బీఐ సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: పీఎన్బీ స్కాం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్వోయూ, లెటర్ ఆఫ్ కంఫర్ట్‌లను లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆథరైజ్డ్ డీలర్లకు అన్ని బ్యాంకుల లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్, లెటర్ ఆఫ్ కంఫర్ట్‌ను రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలోకి దిగుమతులకుద్దేశించిన వాణిజ్య రుణాలకోసం ఎల్వోయూ (స్వల్పకాలిక క్రెడిట్ రూపంలో బ్యాంకు మరొక ఇండియన్ బ్యాంకు విదేశీ బ్రాంచి నుంచి రుణం పొందానికి తన కస్టమర్‌ను అనుమతించే పత్రమే లెటర్ ఆఫ్ అండర్ స్టాండింగ్..ఎల్వోయూ) జారీ ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. తక్షణమే తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో ప్రకటించింది. అయితే జూలై 1, 2015 నాటి బ్యాంకింగ్ నిబంధనలను లోబడి లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆర్బీఐ కీలక నిర్ణయంతో దిగుమతి దారులకు భారీ షాక్ ఇచ్చింది. దీనిపై పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఎల్వోయూ, ఎల్వోసీ రూపంలో బ్యాంక్ గ్యారంటీలు పొందే దిగుమతుదారులను భారీగా ప్రభావితం చేయనుందని వాదించాయి. -
‘భారత సైనికులను చంపాం..’ ‘అంతా అబద్ధం’
ఇస్లామాబాద్ : భారత్‌కు చెందిన ఆర్మీ పోస్ట్‌ను ధ్వంసం చేసినట్లు పాక్ ప్రకటించింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తట్టపాని సెక్టార్‌లోని ఆర్మీ స్థావరంపై తాము దాడి చేశామని, ఐదుగురు భారత్ సైనికులను చంపేశామని పాక్ ఆర్మీ మేజర్ జనరల్ అసిఫ్ గఫార్ గురువారం రాత్రి ట్వటర్ ద్వారా వెల్లడించారు. ఆర్మీ స్థావరంపై బాంబు దాడి చేస్తున్నట్లుగా ఉన్న వీడియోను కూడా ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో బాంబు దాడి జరిగి భారీ ఎత్తున దుమ్ముధూళితో కూడిన పొగ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, భారత్ ఈ వార్తలను కొట్టిపారేసింది. పాకిస్థాన్ చెబుతుందంతా ఒట్టి బూటకమని, ఆధారరహితంగా మాట్లాడుతోందని, అసలు దాడి జరగలేదని, భారత సైనికులు చనిపోలేదని భారత ఆర్మీ ప్రకటించింది. Indian Army post on LOC targeting innocent citizens destroyed by Pak Army troops in Tatta Pani (Hot Spring) sector. Five Indian soldiers killed, many injured. Indian terrorism against innocent citizens shall be responded befittingly. pic.twitter.com/MHWv4Xc97n — Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) 15 February 2018 -
మీ ఇష్టం ఇక చెలరేగిపోండి
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దులో పాకిస్థాన్ కవ్వింపు చర్యలపై భారత సైన్యం కీలక ప్రకటన చేసింది. ఇకపై సహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులను ధీటుగా స్పందించాలని.. ఇందుకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు సైన్యాధికారులకు(కమాండర్) ఆదేశాలు జారీ చేసింది. ‘గత కొన్ని వారాలుగా సరిహద్దు వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రాను రాను ఈ ఘటనలు పెరిగిపోతున్నాయి. దానికి భారత్ కూడా గట్టి సమాధానమే ఇస్తోంది. ఇకపై దూకుడు మరింత పెంచండి. పాక్ సైన్యం కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించినా, ఉగ్రవాదులకు దాడులకు-చొరబాటులకు యత్నించినా మీరూ ధాటిగానే సమాధానం ఇవ్వండి. వారికి అడ్డుకట్ట వేసేందుకు ఎంతటికైనా తెగించండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. చర్యలకు దిగినా... సైన్యం మీకు పూర్తి సహకారం అందిస్తుంది’ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, తాజాగా సరిహద్దులో దాడులు తీవ్ర తరం కావటం చూస్తున్నాం. జమ్ము లోని రాజౌరీ ఉగ్రదాడిలో నలుగురు సైనికులు, సుంజువాన్ మిలిటరీ స్టేషన్ పై ఉగ్రదాడిలో ఓ పౌరుడు సహా ఆరుగురు సైనికులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో ఇకపై ఉపేక్షించాల్సిన అవసరం లేదని భారత సైన్యం నిర్ణయించుకున్నట్లు స్పష్టమౌతోంది. భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ‘పాక్ ఇందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించటం తెలిసిందే. -
‘300 మంది ఉగ్రవాదులు రెడీగా ఉన్నారు’
జమ్మూ : భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) అవతల 300 మందికి పైగా ఉగ్రవాదులు రెడీగా ఉన్నారని బుధవారం భారత ఆర్మీ తెలిపింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులు చేయించడంలో పాకిస్తాన్ ఆర్మీ కీలక పాత్ర నిర్వహిస్తోందని కూడా తెలిపింది. లూటెనంట్ జనరల్ దేవరాజ్ అన్భు బుధవారం ఉదంపూర్‌లోని ఆర్మీ నార్తర్న్ కమాండ్ హెడ్‌క్వార్టర్‌లో మాట్లాడారు. పీర్ పంజల్ శ్రేణికి దక్షిణం నుంచి 185 నుంచి 220 మంది, ఉత్తరం వైపు నుంచి 190 నుంచి 225 మంది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కాపలా చాలా కష్టతరమైందని, చాలెంజింగ్ కూడిన విషయమన్నారు. శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు తమ వ్యూహాలు తమకు ఉన్నాయని చెప్పారు. భారత ఎదురు కాల్పుల్లో సుమారు 192 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని వెల్లడించారు. గత రెండు సంఘటనల్లో కేవలం ఆరేడుగురు మాత్రమే చనిపోయినట్లు పాకిస్తాన్ చెప్పుకుంటుందని, కానీ పెద్ద సంఖ్యలో పాక్ సైనికులు చనిపోయారని దేవరాజ్ అన్నారు. -
అధీనరేఖ రక్తసిక్తం
భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో, ముఖ్యంగా అధీనరేఖ వద్ద కొన్నాళ్లుగా మళ్లీ ఉద్రి క్తతలు పెరుగుతున్నాయి. అధీన రేఖ నిశ్శబ్ద రేఖగా ఎప్పుడూ లేదు. కానీ రెండు నెలలుగా అక్కడ చోటు చేసుకున్న ఉదంతాలు గమనిస్తే గత పదిహేనేళ్లలో ఇంత చేటు ఘర్షణలు ఎప్పుడూ లేవని అర్ధమవుతుంది. ఆదివారం పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత కెప్టెన్‌తోసహా నలుగురు జవాన్లు కన్నుమూశారు. అయిదురోజుల్లో ఇలా చనిపోయిన జవాన్ల సంఖ్య 9కి చేరుకుంది. ఇరువైపులా సైని కులతోపాటు సాధారణ పౌరులు కూడా ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎందరో క్షతగాత్రులవుతున్నారు. అధీనరేఖకు, అంతర్జాతీయ సరిహద్దుకు చేర్చి ఉన్న గ్రామాల్లోని ఇళ్లు నిలువునా తూట్లు పడి కనబడుతున్నాయి. సాధారణ పౌరులు ఇళ్లూ వాకిళ్లూ వదిలి సురక్షిత ప్రాంతాలకు వలసపోతున్నారు. పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న కాల్పుల కారణంగా అటు అధీన రేఖ వద్ద, ఇటు అంతర్జాతీయ సరిహద్దు వద్ద గత నవంబర్ నుంచి 500 పాఠ శాలలు మూసేయవలసి వచ్చింది. గత సంవత్సరం అధీన రేఖ వద్ద పాకిస్తాన్ వైపు నుంచి 881 కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకోగా ఒక్క డిసెంబర్లోనే అవి 147 ఉన్నాయి. మొన్న జనవరి 1 నుంచి ఇంతవరకూ దాదాపు 240 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలో ఈ ఉదంతాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య గత ఏడాది ఉదంతా లన్నిటా మరణించినవారి సంఖ్యతో సమానంగా ఉన్నదంటున్నారు. చాలా సంద ర్భాల్లో మన సైన్యం గట్టి జవాబిచ్చింది. పర్యవసానంగా అటువైపు కూడా ప్రాణ నష్టం ఉంటున్నది. తొలుత మీరు కాల్పులు జరిపారంటే మీరు జరిపారని పర స్పరం ఆరోపణలు చేసుకోవడం కూడా సర్వసాధారణమైంది. ఇలాంటి ఉల్లంఘనలు జరిగినప్పుడు ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చర్యలు తీసుకోవడానికి ఇరు దేశాల సైనిక డైరెక్టర్ జనరళ్ల(డీజీఎంఓ) మధ్యా హాట్‌లైన్ సదుపాయం ఉంది. ఈమధ్య కాలంలో ఒకటి రెండుసార్లు అలా మాట్లా డుకున్నారని అంటున్నారు. కానీ ఫలితం లేదు. 2016 సెప్టెంబర్‌లో మన సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి అక్కడ చొరబాటుదార్ల కోసం నిర్మించిన శిబిరాలను ధ్వంసం చేసింది. అంతక్రితం ఉడీ సెక్టార్లో లష్కరే తొయిబా ఉగ్రవాదులు సైనిక స్థావరంపై దాడిచేసి బిహార్ బెటాలియన్‌కు చెందిన 19మంది జవాన్ల ప్రాణాలు తీసినందుకు ప్రతీకారంగా ఈ సర్జికల్ దాడులు జరిగాయి. అయితే అవి సైతం పాకిస్తాన్‌ను కట్టడి చేయలేకపోయాయని ఆ తర్వాత సాగుతున్న ఘర్షణల పరంపరను గమనిస్తే అర్ధమవుతుంది. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక అధీనరేఖ, అంతర్జాతీయ సరిహద్దు ప్రశాంతంగా ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. అయితే ఉల్లంఘనల సంఖ్య మొదట్లో చాలా స్వల్పంగా ఉండేది. కానీ 2013 దాటాక ఈ ఉదంతాలు క్రమేపీ పెరుగుతూ 2015 నాటికి మితిమీరాయి. వాటితోపాటే మరణాల సంఖ్య పెరు గుతోంది. ఇదంతా చొరబాటుదార్ల సమస్యతో మొదలవుతున్నదని మన నిపుణులు చెబుతున్నారు. లష్కరే తొయిబా, ఇతర సంస్థలకు చెందిన మిలిటెంట్లకు పాక్ సైన్యం మారణాయుధాలిచ్చి భారత్ గడ్డపై ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తూ అందులో భాగంగానే కాల్పులు జరుపుతున్నదని వారు విశ్లేషిస్తున్నారు. ఉడీ సెక్టార్లో మన సైన్యానికి భారీ నష్టం కలగజేసిన లష్కరే మిలిటెంట్లు అలా ప్రవే శించినవారే. ఇరు దేశాల మధ్యా రెండుసార్లు పూర్తి స్థాయి యుద్ధాలు చోటు చేసుకున్నాయి. 1999లో కార్గిల్‌లో చొరబడేందుకు పాక్ సైన్యం చేసిన ప్రయత్నాన్ని మన జవాన్లు తిప్పికొట్టారు. ఆ సందర్భంగా దాదాపు మూడు నెలలు చిన్నపాటి యుద్ధం జరిగింది. యుద్ధ సమయాల్లో ప్రభుత్వం ముందుగానే సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తుంది. అక్కడ జవాన్ల కదలికలు ముమ్మరమవుతాయి. యుద్ధం ముగిసిందన్న ప్రకటన వచ్చేవరకూ ఊరు వెళ్లడం క్షేమం కాదని అందరికీ తెలుస్తుంది. కానీ అధీనరేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలది ఏడాది పొడవునా అయోమయ స్థితి. ఈ క్షణం అంతా సవ్యంగానే ఉన్నదని పిస్తుంది. మరుక్షణంలో సరిహద్దుల ఆవలి నుంచి శతఘ్నులు, మోర్టార్లు గర్జిస్తాయి. అవి ఎప్పుడు శాంతిస్తాయో తెలియదు. పొలం పనికెళ్లినవారో, బడి నుంచి తిరిగొస్తున్న పిల్లలో, ఇంట్లో పనిచేసుకుంటున్న మహిళో వాటి బారిన పడతారు. ప్రాణాలైనా పోవచ్చు. తీవ్రంగా గాయపడి శాశ్వత వైకల్యమూ రావొచ్చు. చావు బతుకుల మధ్య ఉండే సన్నటి సరిహద్దు రేఖ అక్కడ చెదిరిపోతుంది. చిత్రమేమంటే ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనలూ, వాటిననుసరించి ఉండే పరస్పర హెచ్చ రికలు, వాటికి కొనసాగింపుగా ఆరోపణల యుద్ధం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉన్నా రెండు దేశాల మధ్యా వాణిజ్య లావాదేవీలు ఆగవు. అలా ఆపి రోజూ కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నష్టపోవడానికి రెండు దేశాలూ సిద్ధంగా ఉండవు. అయితే ఇరు దేశాల మధ్యా సామరస్య వాతావరణం ఏర్పడితే ఈ వాణిజ్యం మరిన్ని వందల రెట్లు పెరుగుతుందని, అది రెండు ఆర్థిక వ్యవస్థలనూ బలోపేతం చేస్తుందని పాకిస్తాన్ సైన్యం గుర్తించదు. రెండు దేశాల డీజీఎంఓల మధ్యా హాట్‌లైన్ సదుపాయం ఉన్నమాట నిజమే అయినా ఆచరణలో అది పెద్దగా ఉపయోగపడటం లేదు. సమస్యకు మూలంగానీ, దానికి పరిష్కారంగానీ అక్కడ లేకపోవడమే ఇందుకు కారణం. ఇరు దేశాల మధ్యా ఉన్నత స్థాయి చర్చలు జరగడం, అంతర్జాతీయ వేదికల ద్వారా పాకిస్తాన్‌పై ఒత్తిళ్లు తీసుకురావడం ముఖ్యం. అలాగే కశ్మీర్లో ప్రశాంతత నెలకొనడానికి రాజకీయ పరమైన చర్యలు కూడా ప్రారంభించాలి. అక్కడ ప్రశాంతత నెలకొంటే సరిహద్దుల్లో పాక్ ఆటలు సాగవు. ఇప్పుడు అధీనరేఖ వద్ద దాదాపు యుద్ధ వాతావరణం నెల కొంది. దీన్ని సాధారణ స్థితికి తీసుకురావడమన్నది తన చేతుల్లోనే ఉన్నదని పాక్ నాయకత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. -
పాక్ ఉన్మాదం ; సరిహద్దు గ్రామాల్లో అప్రమత్తత
పూంఛ్ : యుద్ధోన్మాదంతో పేట్రేగుతోన్న పాకిస్తాన్.. భారత పల్లెలే లక్ష్యంగా దాడులు జరుపుతున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి గడిచిన మూడురోజుల్లో పలుమార్లు కాల్పులకు పాల్పడింది. దీంతో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ), సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భయానకవాతావరణం నెలకొంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కీలకమైన ఐదు జిల్లాల్లో బార్డర్‌కు దగ్గరగా ఉన్న పాఠశాలలను శనివారం నుంచి మూయించారు. ‘జమ్ము, సాంబా, కథువా, రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో సరిహద్దును ఆనుకుని ఉన్న స్కూళ్లన్నింటినీ మూసేశాం. వచ్చే మూడురోజుల వరకు వాటిని తెరవకూడదని సిబ్బందిని ఆదేశించాం. పరిస్థితిని బట్టి మరోమారు ఆదేశాలు జారీచేస్తాం’ అని అధికారులు మీడియాకు చెప్పారు. మూడురోజుల్లో 9 మంది మృతి : భారత పల్లెలే లక్ష్యంగా పాక్ బలగాలు జరుపుతోన్న కాల్పుల్లో ఇప్పటివరకు తొమ్మిదిమంది చనిపోయారు. వారిలో ఐదుగురు సాధారణ పౌరులుకాగా, ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు, ఇద్దరు ఆర్మీ సిబ్బంది ఉన్నారు. ఇటీవల భారత సైన్యం మినీ సర్జికల్ స్ట్రైక్ చేసి పాక్ బలగాల్ని మట్టుపెట్టిన తర్వాత సరిహద్దులో మళ్లీ యుద్ధవాతావరణం నెలకొంది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై ఇరుదేశాలూ ఆయా రాయబారులకు నిరసనలు తెలిపాయి. -
14 వేల బంకర్లు
జమ్మూ: పాకిస్తాన్‌తో అంతర్జాతీయ, పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల వద్ద 14,460 బంకర్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ మోర్టార్లతో దాడు లు చేస్తున్నందున సరిహద్దు గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ బంకర్లను నిర్మించనున్నారు. కాగా, ఈ బంకర్ల నిర్మాణానికి కేంద్రం రూ.415.73 కోట్లను ఇటీవలే విడుదల చేసింది. ఈ భూగర్భ బంకర్లలో ఎల్వోసీ వెంట పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో 7,298, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, కథువా, సాంబా జిల్లాల్లో 7,162 బంకర్లను నిర్మించనున్నారు. ఇందులో 13,029 వ్యక్తిగతమైనవి కాగా, 1,431 సామాజిక బంకర్లున్నాయి. వ్యక్తిగత భూగర్భ బంకర్లు 160 చదరపు అడుగులు (ఎనిమిది మంది ఉండేందు కు వీలుగా), సామాజిక బంకర్లు 800 చదరపు అడుగులు (40 మంది ఉండేందుకు వీలుగా) ఉంటాయి. గతేడాది పాకిస్తాన్ కవ్వింపు చర్యల కారణంగా 35 మంది (23 మంది సైనికులు, 12 మంది పౌరులు) మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం బంకర్ల నిర్మాణానికి చొరవతీసుకుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. -
పాక్ సైనికులను వేటాడిన భారత ఆర్మీ
న్యూఢిల్లీ : భారత్ - పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ల మధ్యలో గల నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వద్ద హైటెన్షన్ నెలకొంది. ఎల్వోసీని దాటి వెళ్లిన భారత ఆర్మీ సైనికుల బృందం ముగ్గురు పాకిస్తాన్ సైనికులను హతమార్చింది. గత శనివారం ఎల్వోసీ వద్ద పాకిస్తాన్ ఆర్మీ విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో నలుగురు భారత ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగానే నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోకి భారత ఆర్మీ బలగాలు చొచ్చుకెళ్లినట్లు పేరు తెలపడానికి ఇష్టపడని ఇంటిలిజెన్స్ అధికారి ఒకరు చెప్పారు. భారత్ ఆర్మీ ఎల్వోసీలోకి వెళ్లొచ్చిన కొద్దిసేపటికే భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య పుల్వామాలో కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో జైషే ఈ మహ్మద్ టాప్ కమాండర్ నూర్ మహ్మద్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామాలోనే నక్కిన మరో ముగ్గురు ఉగ్రవాదుల కోసం దళాలు జల్లెడ పడుతున్నాయి. కాగా, భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్‌పై పాకిస్తాన్ మీడియా ప్రకటనను వెలువరించింది. నియంత్రణ రేఖ వద్ద ముగ్గురు పాకిస్తాన్ సైనికులను చంపినట్లు పేర్కొంది. మరొకరికి కాల్పుల్లో తీవ్ర గాయాలయ్యాయని తెలిపింది. -
భారత సైన్యంపై పాక్ కాల్పులు
జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూకశ్మీర్‌లో రాజౌరీ జిల్లాలోని కేరీ సెక్టార్లో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి గస్తీకాస్తున్న భారత జవాన్లపై పాక్ సైన్యం శనివారం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో మేజర్ మోహర్కర్ ప్రఫుల్ల అంబాదాస్(32), లాన్స్‌నాయక్ గుర్మైల్ సింగ్(34), సిపాయ్ పర్గత్ సింగ్(30)లతో పాటు మరో జవాన్ ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు వెల్లడించారు. పాక్ కాల్పుల్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. ‘మేజర్ అంబదాస్, లాన్స్‌నాయక్ గుర్మైల్, సిపాయ్ పర్గత్‌లు అసమాన ధైర్యం, నిజాయితీలున్న సైనికులు. విధి నిర్వహణలో వారి అంకితభావానికి, ప్రాణత్యాగానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’ అని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. అంబదాస్ మహారాష్ట్రలోని భందారాకు చెందినవారు కాగా.. గుర్మైల్ కుటుంబం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో, పర్గత్ కుటుంబం హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఉంటోంది. ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు సీఎం మెహబూబా ముఫ్తీ రాజౌరీ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పాక్ కాల్పులు జరపడం గమనార్హం. మరోవైపు పాక్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు కశ్మీర్ డిప్యూటీ సీఎం నిర్మల్‌సింగ్ నివాళులర్పించారు. పాక్‌ను ఉగ్రవాదుల స్వర్గధామంగా ప్రపంచం గుర్తించిందన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్న పాక్‌కు దీటుగా బుద్ధి చెప్పాలన్నారు. ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయ వేదికలపై పాక్ ప్రస్తుతం ఏకాకీగా మారిందని సింగ్ ఎద్దేవా చేశారు. -
పాక్ కాల్పుల్లో భారత జవాన్ల మృతి
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భారత జవాన్లతో పాటు ఓ అధికారి మృతిచెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ జరిగిన ఘటనపై అప్రమత్తమై బలగాలు వెంటనే ప్రతిదాడి మెదలుపెట్టాయి. సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. -
భారత్ దౌత్యవేత్తకు పాక్ సమన్లు
ఇస్లాబామాద్ : ఎల్ఓసీ వద్ద భారత్ భధ్రతా బలగాలు ఏకపక్షంగా కాల్పులు జరుపుతున్నాయని ఆరోపిస్తూ.. పాకిస్తాన్‌లోని భారత రాయబారికి పాకిస్తాన్ సమన్లు జారీచేసింది. ప్రతిసారి భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తోందని పాక్ ఆరోపించింది. సెప్టెంబర్ 30, అక్టోబర్ 2న భారత్ బలగాలు ఎల్ఓసీ వద్ద కాల్పుకు తెగబడిందని ఆరోపించింది. ఈ కాల్పుల వల్ల ముగ్గురు పౌరులు చనిపోగా, మరో అయిదు మంది తీవ్రంగా గాయపడ్డారని చెబుతోంది. కాల్పుల విరమణకు సమాధానం చెప్పాలంటూ.. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ ఫైసల్.. భారత్ హైకమిషనర్ జేపీ సింగ్‌కు సమన్లు జారీ చేశారు. దీనిపై స్పందించిన సింగ్.. భారత బలగాలు ఎన్నటికీ కాల్పుల విరమణ ఉల్లంఘించలేదని చెప్పారు. -
‘సరిహద్దు’లో రక్షణ మంత్రి
శ్రీనగర్: కశ్మీర్లో భారత్– పాక్ నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి బీఎస్ఎఫ్ జవాన్లు పహారా కాస్తున్న భారత ఫార్వర్డ్ పోస్టులను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. ఎల్వోసీ వెంట ఉగ్రవాదుల చొరబాట్లను విజయ వంతంగా నిలువరించిన ఘటనలను సైన్యాధికారులు ఆమెకు వివరించారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న ఆమె శుక్రవారం నేరుగా కుప్వారా సెక్టార్‌లోని సరిహద్దు పోస్టులను సందర్శించారు. బదామీ బాగ్ కంటోన్మెంట్లో ఉగ్రచొరబాట్లను నిలువరించిన తీరు, ఉగ్రవ్యతిరేక చర్యలను ఆర్మీ కమాండర్ ఆమెకు వివరించారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా ఆమె కశ్మీర్ లోయ వెంట సరిహద్దు ప్రాంతాలు, లడఖ్ ప్రాంతంలో వాస్తవాధీనరేఖ వెంట భద్రత పరిస్థితులను ఆమె సమీక్షించనున్నారు. -
మరో ఇద్దరు మిలిటెంట్లు హతం
సాక్షి, న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లకు ప్రయత్నించిన ఇద్దరు మిలిటెంట్లను భద్రతాబలగాలు హతమార్చాయి. కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ వద్ద శనివారం ఉదయం ఇద్దరు మిలిటెంట్లు ఎల్ఓసీని దాటేందుకు ప్రయత్నించారు. వీరిని మొదటగా భద్రతాబలగాలు నిరోధించే ప్రయత్నం చేశాయి. దీంతో మిలిటెంట్లు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ప్రతికాల్పులకు దిగడంతో.. ఇద్దరూ ఉగ్రవాదులు మరణించారు. ఇదే విషయాన్ని రక్షణ శాఖ అధికార ప్రతినిధి రాజేష్కలియా ధృవీకరించారు. టెర్రరిస్టుల నుంచి ఆయుధాలు, గుర్తింపు కార్డులు, ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ నియంత్రణ రేఖ, జమ్మూ కశ్మీర్ సరిహద్దులో 22 సార్లు మిలిటెంట్లు చొరబాట్లకు ప్రయత్నించారని రాజేష్ తెలిపారు. అదే విధంగా.. చొరబాట్లకు ప్రయత్నించిన 38 మంది మిలిటెంట్లను భద్రతా బలగాలు మట్టుపెట్టాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా మాచిల్ సెక్టార్లో ఆగస్టు నుంచి ఇప్పటివరకూ చొరబాట్లకు ప్రయత్నించిన 5 మంది మిలిటెంట్లను చంపేసినట్లు ఆయన తెలిపారు. -
అవసరమైతే.. మళ్లీ సర్జికల్ స్ర్టైక్స్
న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వద్ద అవసరమైతే మళ్లీ సర్జికల్ స్ర్టైక్స్ చేపడతామని నార్తర్న్ కమాండెంట్.. లెఫ్టినెంట్ జనరల్ దేవరాజ్ అన్బు ప్రకటించారు. చైనా, పాకిస్తాన్లతో ఏకకాలంలో అయిన యుద్ధం చేసే సత్తా భారత్‌కు ఉందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించి రోజు గడవకుందే.. అన్బు ఇటువంటి ప్రకటన చేయడం గమనార్హం. నియంత్రణ రేఖ అనేది ఒక ఊహాత్మక గీత.. అవసరమైన సమయంలో దానిని దాటేందుకు పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు వద్ద సర్జికల్ స్ర్టయిక్స్ చేయాల్సివస్తే.. అందుకు సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. సరిహద్దు రేఖ వద్ద గతంలోకన్నా ఇప్పుడు లాంచింగ్ పాడ్స్, టెర్రరిస్ట్ క్యాంప్స్ అధికంగా ఏర్పడ్డాయని చెప్పారు. దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదుల ప్రయత్నిస్తే.. వారిని ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు ఎప్పడూ సిద్ధంగా ఉంటాయని చెప్పారు. -
సరిహద్దుల్లో పాక్ దాష్టీకం!
విచక్షణారహితంగా కాల్పులు.. ఒక మహిళ మృతి పూంచ్: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాకిస్థాన్ దాష్టీకం పెరిగిపోతోంది. పూంచ్ జిల్లాలోని వాస్తవాధీన రేఖకు సమీపంలో పాకిస్థాన్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచాయి. శనివారం ఉదయం విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక మహిళ మృతిచెందారు. మృతురాలిని రుఖియా బీగా గుర్తించారు. పూంచ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్లో ఉదయం 5 గంటల సమయంలో భారీ ఎత్తున కాల్పులకు తెగబడిందని, దీంతో భారత బలగాలు దీటు బదులిచ్చాయని, కాల్పులు కొనసాగుతున్నాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు కుప్వారా జిల్లాలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి చేశారు. ఈ దాడిలో ఒక జవానుకు గాయాలు అయ్యాయి. దీంతో ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టాయి. -
పాఠశాలలపై పాక్ సైన్యం కాల్పులు
జమ్మూ: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న పాఠశాలలు లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం మంగళవారం కాల్పులకు తెగబడింది. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని నాలుగు సెక్లార్లలో పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. పాఠశాలలపై మోర్టారు బాంబులు, తుపాకులతో పాక్ జరిపిన కాల్పుల్లో ఓ పాఠశాల భవనం ధ్వంసమైంది. నౌషెరా, మాంజ కోట్ సెక్టార్లలోని మూడు పాఠశాలల్లోని 217 మంది విద్యార్థులు, 15 మంది ఉపాధ్యాయులను భద్రతా దళాలు రక్షించాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో వారిని తరలించినట్లు రాజౌరీ ఉప కమిషనర్ చెప్పా రు. సమీపంలో మోర్టారు బాంబులు పడటంతో భవానీ ప్రాంతంలోని సహాయక బృందాలకు, ఓ పాఠశాలలోని విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. -
పాక్ కాల్పుల్లో భారత సైనికుడి మృతి
శ్రీనగర్: నియంద్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి పాకిస్తాన రేంజర్లు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భారత జవాన్ ఒకరు మంగళవారం ప్రాణాలు విడిచారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ఎల్వోసీ వద్ద గడిచిన రెండు రోజులుగా పాకిస్తాన్ బలగాలు కాల్పులకు పాల్పడుతున్నాయి. కాల్పుల్లో భారత సైనికుడు మృతిచెందడం ఇది రెండోసారి. మృతిచెందిన సైనికుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత..
జమ్మూ: భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్, బీంబర్ గాలీ సెక్టార్‌లోని భారత నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పులను భారత్ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయని ఢిఫెన్స్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయని, పాక్ బలగాలు మోటార్లతో కాల్పులు జరుపుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. -
సరిహద్దులో పాక్ దురాగతం
► ఆ దేశ ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు జవాన్ల బలి ► కాల్పుల విరమణకు పాక్ తూట్లు ► మరో ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం శ్రీనగర్: సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విర మణకు మళ్లీ తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కెరన్ సెక్టార్లో బుధవారం నియంత్రణ రేఖ వద్ద ఆ దేశ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతిచెందారు. పాక్ నుంచి మిలి టెంట్లు భారత్‌లోకి చొరబడే ఫుర్కియా ప్రాంతంలో ఈ దురాగతం చోటుచేసుకుం దని, మృతులు జమ్మూకశ్మీర్ రైఫిల్స్ దళానికి చెందినవారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మరోపక్క బుడ్గాం జిల్లా రెడ్బగ్లో జరిగిన హోరాహోరీ ఎన్కౌంటర్లో భద్రతా బలగా లు ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవా దులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు ఉన్నా రనే పక్కా సమాచారంతో జవాన్లు ఆ ప్రాంతాన్ని మంగళవారం సాయంత్రం చుట్టుముట్టారు. తమపై మిలిటెంట్లు జరిపిన కాల్పులకు దీటుగా బదులిచ్చారు. మంగళ వారం రాత్రి ఆపరేషన్‌ను నిలిపేసి ముష్క రులు తప్పించుకోకుండా గట్టి నిఘా ఉంచా రు. బుధవారం ఉదయం ఇరుపక్షాల మధ్య మళ్లీ కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఘటనాస్థలి నుంచి కొన్ని ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకు న్నామని పోలీసులు చెప్పారు. మృతులను గూడిపోరాకు చెందిన ఆకిక్ గుల్, జావేద్ అహ్మద్ షేక్, సాజిద్ అహ్మద్ గిల్కర్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. -
పాక్ కాల్పుల్లో దంపతుల మృతి
జమ్మూ: కశ్మీర్లో పూంచ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ) వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులు, జనావాసాలపై పాకిస్తాన్ ఆయుధాలతో విరుచుకుపడింది. పాక్ ప్రయోగించిన మోర్టార్ షెల్ కర్మరాలోని ఓ ఇంటి సమీపంలో పేలడంతో మొహమ్మద్ షౌకత్ అనే జవానుతో పాటు అతని భార్య సఫియా బీ దుర్మరణం చెందారు. వీరి ముగ్గురు కుమార్తెలు జైదా(6), రుబీనా(12), నజియా గాయపడ్డారు. పాకిస్తాన్ దాడిని భారత బలగాలు వెంటనే దీటుగా తిప్పికొట్టాయి. ఖదీ, కర్మరా, గుప్లూర్ ప్రాంతాల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. -
కొనసాగుతున్న కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట పాక్ బలగాల కాల్పులు కొనసాగుతున్నాయి. వరుసగా మూడోరోజూ పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుందని భారత సైన్యం వెల్లడించింది. అయితే.. పాక్‌కు ధీటుగా సమాధానం ఇస్తున్నట్లు ఆర్మీ అధికారి తెలిపారు. రాజౌరీ జిల్లా భీంబర్ గలి(బీజీ) సెక్టార్‌లోని భారత పోస్టులను లక్ష్యంగా చేసుకొని మోర్టార్స్, ఆటోమేటిక్ వెపన్స్‌తో పాక్ సైన్యం దాడులకు పాల్పడుతుందని తెలిపారు. గురువారం జరిపిన కాల్పల్లో ఇద్దరు భారత జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే. జాన్‌లో మొత్తం 23 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ సైన్యం ఉల్లంఘించిందని అధికారులు వెల్లడించారు. -
భారత్‌లోకి చొరబడి కాల్పులు
సరిహద్దులో పాకిస్తాన్ కిరాతకం ► ఇద్దరు జవాన్ల మృతి ► ప్రతీకార కాల్పుల్లో ఇద్దరు పాకిస్తానీల హతం జమ్మూ: పాకిస్తాన్ ఆర్మీ గురువారం మరోసారి సరిహద్దులో రెచ్చిపోయింది. ఏకంగా నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ని దాటి వచ్చి భారత జవాన్లపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. ఎల్ఓసీని దాటి 600 మీటర్లు భారత భూభాగంలోకి చొరబడిన బీఏటీ (బోర్డర్ యాక్షన్ టీమ్) దళాలు ఈ ఘాతుకానికి పాల్పడ్డాయి. బీఏటీకి మద్దతుగా పాక్ ఆర్మీ పెద్ద ఎత్తున కాల్పులు జరిపింది. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బీఏటీ సభ్యులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, ఉగ్రవాదులను కలగలిపి భారత జవాన్లపై దాడులు చేయడానికి ఏర్పరచిన బృందమే బీఏటీ. గురువారం దాడి చేసిన బీఏటీలో ఐదు నుంచి ఏడు మంది సభ్యులు ఉన్నారనీ, భారత శిబిరాలకు దాదాపు 200 మీటర్ల దూరం వరకు వారు వచ్చారని ఓ ఆర్మీ అధికారి చెప్పారు. భారత జవాన్లు ప్రతికాల్పులు జరపగా ఇద్దరు మరణించారు. మిగిలినవారు తప్పించుకుని వెనక్కు వెళ్లిపోయారు. భారత గస్తీ బృందాలపై దాడులు చేయడానికే వారు సరిహద్దును దాటి వచ్చారని అధికారి చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు కాల్పులు కొనసాగాయి. కాగా, చనిపోయిన ఇద్దరు జవాన్లు మహారాష్ట్రకు చెందిన వారే. ఒకరు ఔరంగాబాద్‌కు చెందిన నాయక్ జాదవ్ సందీప్ (34) కాగా, మరొకరు కొల్హాపూర్‌కు చెందిన సిపాయి మనే సావన్ బల్కు (24). జాదవ్‌కు భార్య ఉండగా, సావన్ అవివాహితుడు. ఈ ఏడాది పూంచ్‌లో బీఏటీ దాడి చేయడం ఇది మూడోసారి. మే 1న పూంచ్‌లోని కృష్ణ ఘాటీలో బీఏటీ ఇద్దరు జవాన్ల తలలు నరికింది. ఫిబ్రవరి 18న ఓసారి బీఏటీ దాడి చేసింది. గతంలోనూ బీఏటీ పలు దాడులు చేసి జవాన్ల తలలు నరకడం, వారి శరీరాలను ముక్కలు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడింది. -
జీఎస్టీతో సానుకూల ఫలితాలు: జైట్లీ
న్యూఢిల్లీ: జీఎస్టీతో (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) సానుకూల ఫలితాలు వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రభుత్వ మూడేళ్ల పాలనపై ఆయన గురువారం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న కొద్దీ ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. వృద్ధిరేటు 7 నుంచి 8 శాతంగా ఉంటుందన్నారు. పెద్ద నోట్ల రద్దు విజయవంతమైందని, ఎంత డబ్బు వెనక్కి వచ్చిందనేది త్వరలో లెక్కతేలుతుందన్నారు. నియంత్రణ రేఖ వెంబడి భారత్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని, దక్షిణ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని అరుణ్ జైట్లీ అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇక గోవధ నిషేధంపై తాము కొత్తగా చట్టమేమీ చేయలేదన్నారు. రాష్ట్ర చట్టాలకు లోబడే పశువుల విక్రయంపై కొత్త నిబంధనలు తెచ్చామని జైట్లీ పేర్కొన్నారు. కాగా దేశంలోని రాష్ట్రాలన్నీ దాదాపుగా ఆమోదించటంతో... జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తేవటానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. -
పాకిస్తాన్ ఆర్మీకి చెంపచెళ్లు..
ఎల్వోసీలో ఐరాస సిబ్బందిపై భారత్ సైన్యం కాల్పులంటూ ప్రకటన అదేమీ లేదంటూ తేల్చిచెప్పిన ఐరాస న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) మీదుగా ప్రయాణిస్తున్న ఐక్యరాజ్యసమితి వాహనంపై భారత సైన్యం కాల్పులు జరిపిందంటూ పాకిస్థాన్ ఆర్మీ చేసిన ప్రకటన పచ్చి అబద్ధమని తేలింది. పాక్ సైన్యం వాదనను ఐరాస నిర్ద్వందంగా తిరస్కరించింది. ఖంజర్ సెక్టార్లో బుధవారం భారత్-పాకిస్థాన్ వాహనంలో వెళుతున్న ఐరాస సైనిక పరిశీలక బృందాన్ని లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం కాల్పులు జరిపిందంటూ పాక్ సైనిక మీడియా విభాగాన్ని ఉటంకిస్తూ ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించింది. భారత సైన్యం చర్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, భారత్ కాల్పులను దీటుగా ఎదుర్కొంటామని పాక్ ఆర్మీ చెప్పుకొచ్చింది. అయితే, పాక్ ఆర్మీ ప్రకటన ఎంతమాత్రం నిజం కాదని ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి బుధవారం మీడియాకు వివరణ ఇచ్చారు. భీంబర్ జిల్లాలో ఐరాస సైనిక పరిశీలక బృందం వాహనం పాక్ సైన్యం ఎస్కార్ట్‌తో వెళుతుండగా.. దూరంగా కాల్పుల శబ్దం వినిపించిందని, ఇది ఐరాస బృందం లక్ష్యంగా జరిగిన కాల్పులు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఇందులో ఐరాస సిబ్బంది ఎవరూ గాయపడలేదని తేల్చిచెప్పారు. -
పిచ్చికుక్కలా పాక్; మమ్మల్ని కాల్చిచంపండి
-
పిచ్చికుక్కలా పాక్; మమ్మల్ని కాల్చిచంపండి..
(పాక్ వైపు నుంచి భీకర కాల్పులు.. ప్రాణాలు కాపాడుకునేందుకు గ్రామస్తుల యాతన) రాజౌరీ: దాయాది పాకిస్థాన్ పిచ్చిపట్టిన కుక్కలా పేట్రేగిపోతున్నది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నది. పాక్ ఆర్మీ శుక్రవారం మొదలుపెట్టిన కాల్పుల పర్వం ఆదివారం ఉదయం దాకా ఎడతెరిపిలేకుండా సాగుతూనేఉంది. వేగంగా దూసుకొస్తున్న షెల్స్, తూటాలు.. గ్రామస్తులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. అప్రమత్తమైన భారత సన్యం పాక్ రేంజర్లకు గట్టి సమాధానం ఇస్తూనే, జాగ్రత్త చర్యల్లో భాగంగా సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించింది. ‘ఆదివారం తెల్లవారుజామున రాజౌరీ సెక్టార్లో ఎల్వోసీని ఆనుకొని చీటి బక్రి గ్రామంపైకి పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. వెంటనే అప్రమత్తమై వాళ్లకు(పాక్‌కు) ధీటుగా జవాబిచ్చాం. అక్కడి ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాం’ అని ఆర్మీ అధికారులు మీడియాకు చెప్పారు. ఇదే సెక్టార్‌లోని ఏడు గ్రామాలపై శనివారం పాక్ జరిపిన కాల్పుల్లో మైనర్ బాలిక సహా ఇద్దరు మరణించారు. 35 పౌరులు, కొందరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెనక్కి వెళ్లం.. కాల్చిచంపండి.. పాకిస్థాన్ బరితెగింపు దృష్ట్యా నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలను ఆర్మీ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. సుమారు 200 కుటుంబాలకు చెందిన 1000 మందిని రాజౌరీలో ఏర్పాటుచేసిన సహాయక శిబిరాలకు తరలించారు. సొంత ఊళ్లను వదిలేసి క్యాంపుల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్న గ్రామస్తులు తమను కలిసిన మీడియాతో గోడువెళ్లబోసుకున్నారు. ‘ఆ కాల్పుల వర్షాన్ని మేం తట్టుకోలేం. అలాగని సొంత ఊరిని వదిలేసిరాలేం. మాకు వేరే దారిలేదు. మమ్మల్ని ఇక్కడే కాల్చి చంపేయండి..’ అని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్రిక్తతల నేపథ్యంలో రాజౌరీ, నౌవ్‌షీరా, మాంజకోటే, డూంగి జోన్లలోని 87 పాఠశాలలను మూసివేశారు. -
వక్రబుద్ధిని పోనిచ్చుకోని పాకిస్తాన్
జమ్మూ: సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ యథేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. సరిహద్దుల్లో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగి కాల్పులకు తెగబడింది. నౌషెరా సెక్టార్‌లోని రాజౌరి వద్ద పాక్‌సైన్యం కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు రాజౌరి డీసీ వెల్లడించారు. కాగా 56 గంటల్లో పాక్ సైన్యం కాల్పులు జరపడం ఇది నాలుగోసారి. ఈ విషయాన్ని డిఫెన్స్ మినిస్టరీ అధికార ప్రతినిధి లెఫ్ట్‌నెంట్ కల్నర్ మనీశ్ మెహతా తెలిపారు. అయితే పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు చెప్పారు. పాక్ సైన్యం భారీ మోర్టర్లను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 7.15 నిమిషాల వద్ద కాల్పులు మొదలైనట్లు మనీశ్ మెహతా పేర్కొన్నారు. కాగా పాక్ కాల్పుల్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడిన విషయం తెలిసిందే. పాక్ కాల్పుల నేపథ్యంలో నౌషెరా సెక్టార్‌లోని 14 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. -
ఆర్మీ జవాన్ ఆత్మహత్య
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ఎల్వోసీలో ఘటన ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మంద రాజశేఖర్(21) జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ఎల్వోసీలో ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో ఉండగానే ఆయన ఎస్ఎల్ఆర్ తుపాకీతో కుడి కణతపై కాల్చుకొని చనిపోయాడు. ఈ విషయం మంగళవారం ఆలస్యంగా ఇక్కడికి సమాచారం అందించింది. సుర్జాపూర్‌కు చెందిన మంద శివయ్య పెద్దకొడుకు అయిన రాజశేఖర్ ఏడాదిన్నర క్రితం ఆర్మీ జవానుగా ఎంపికై మహారాష్ట్రలోని పుణెలో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. పాకిస్తాన్–ఇండియా బోర్డర్లో గల జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ఎల్వోసీలో సెంట్రీగార్డుగా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం విధుల్లోకి వెళ్లాడు. రాజశేఖర్‌తో పాటు విధులు నిర్వర్తిస్తున్న మరో ఆర్మీ జవాన్ భోజనానికి వెళ్లి వచ్చేలోగా ఎస్ఎల్ఆర్ తుపాకీతో కాల్చుకున్నట్లు ఖానాపూర్ సీఐ అంగోతు పవార్‌నరేశ్ కుమార్ తెలిపారు. కాగా, కుప్వార ఎల్వోసీ నుంచి అతని మృతదేహాన్ని అతి కష్టంపై మీది నుంచి కిందకు మంగళవారం తెచ్చారు. రాజశేఖర్ మృతదేహానికి శ్రీనగర్‌లో పోస్టుమార్టం చేయించిన అనంతరం విమానంలో నాగ్‌పూర్‌కు, అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకొస్తారు. అయితే, తట్టుకోలేని వాతావరణ పరిస్థితులతో పాటు.. సకాలంలో సెలవు దొరకకపోవడంతోనే రాజశేఖర్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని భావిస్తున్నారు. -
ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపిన సైన్యం
-
ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపిన సైన్యం
జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్-లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు బుధవారం ప్రయత్నించారు. ఆ విషయాన్ని గమనించిన భారత సైన్యం వెంటనే అప్రమత్తమైంది. దీంతో సదరు ఉగ్రవాదులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. -
పాక్‌పై మరో సర్జికల్ స్ట్రైక్: ఆర్మీ చీఫ్
- టెర్రరిస్టు స్థావరాలపై దాడి ‘మన హక్కు’ - ఏక్షణంలోనైనా మెరుపు దాడికి సిద్ధమన్న జనరల్ బిపిన్ రావత్ న్యూఢిల్లీ: గత ఏడాది సెప్టెంబర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్లపై మెరుపుదాడి చేసిన విధంగా మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేపడతామని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్పారు. భారత్‌లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించే ఉగ్రవాదుల పీచమణచడం ‘మన హక్కు’ అని ఆయన పునరుద్ఘాటించారు. తద్వారా ఉగ్రవాద సంస్థలకు, వారికి సహకరిస్తోన్న పాకిస్థాన్ సైన్యానికి పరోక్ష హెచ్చరికలు చేశారు. అవసరంమైన క్షణంలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి వెలసిన ఉగ్రస్థావరాలపై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగుతామని మంగళవారం రాత్రి ఓ జాతీయ చానెల్‌కు ఇంటర్వ్యూలో ఆర్మీచీఫ్ వెల్లడించారు. (పీఓకేలో భారత కమాండోల మెరుపు దాడి) సెప్టెంరబ్ 29నాటి సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహకర్తల్లో ఒకరైన రావత్.. ఆర్మీ డిప్యూటీ చీఫ్ హోదాలో నాటి దాడుల ఆపరేషన్‌ను స్వయంగా పరిశీలించారు. పాకిస్థాన్‌కు దిమ్మతిరిగేలా నిర్వహించిన తొలి సర్జికల్ స్ట్రైక్స్ గురించిన పలు విషయాలనూ జనరల్ రావత్ వెల్లడించారు. ‘పాక్ సైన్యం నుంచి శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించడానికి సిద్దంగా ఉన్న ఏడు లాంచ్ ప్యాడ్లను టార్గెట్ చేశాం. ఇందుకోసం బృహత్ప్రణాళిక రచించించి పకడ్బందీగా అమలుచేశాం. మన సైనికుల సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తూనే భీకర దాడులు చేపట్టాం. అది రియల్‌టైమ్ ఆపరేషన్ కాబట్టి బేస్ క్యాంపుల నుంచి ఆదేశాల జారీ కూడా అంతే త్వరగా జారీ అయ్యాయి. ఎల్వోసీ నుంచి 2కిలోమీటర్ల దూరంలోని స్థావరాలపై దాడులుచేసి మనవాళ్లు సూర్యోదయానికల్లా తిరిగి వచ్చేశారు. ఆపరేషన్ మొత్తాన్ని డ్రోన్ కెమెరాలతో రికార్డుచేశాం’ అని ఆర్మీ చీఫ్ వివరించారు. భారత సైన్యానికి 29వ చీఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ గత వారమే బాధ్యతలు చేపట్టడం, సీనియర్లను పక్కనపెట్టి పెద్ద పోస్టుకు రావత్‌ను ఎంపిక చేయడంపై వివాదం చెలరేగడం తెలిసిందే. (చదవండి: ఆర్మీ చీఫ్ నియామకంపై వివాదం) దీనిపై విలేకరి అడిగిన ప్రశ్నకు, ‘ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వ్యక్తిగా నేనైనా, మరొకరైనా ప్రభావితం చేయలేరు. ఒకవేళ అలా జరిగితే ఎవరికివారు కోరుకున్న పదవులు దక్కించుకుంటారు కదా!’అని జనరల్ రావత్ బదులిచ్చారు. ఆర్మీ చీఫ్ పదవికి చేపట్టేందుకు అర్హులై ఉండి కూడా రావత్ నియామకంతో ఆ అవకాశాన్ని కోల్పోయిన ఇద్దరు సీనియర్ అధికారులను (లెఫ్టినెంట్ జనరల్ ప్రవీన్ బక్షి(ఈస్ట్రన్ కమాండ్ చీఫ్), లెఫ్టినెంట్ జనరల్ పి.ఎం. హరీజ్(సదరన్ కమాండ్ చీఫ్)) ఉద్దేశంచి మాట్లాడుతూ.. ‘మేమంతా కలిసే ఎదిగాం. ఒకే కంచం, ఒకే మంచం అన్న చందంగా వారితో నాకు స్నేహం ఉంది. వారిద్దరూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకోగలరు’అని జనరల్ రావత్ పేర్కొన్నారు. -
భారత్-పాక్ కంచె వద్ద భీకర సన్నివేశం
శ్రీనగర్: శత్రువును వేడుకునే సందర్భం యుద్ధంలోనే ఎదురవుతుందనుకుంటే ఇండియా-పాకిస్థాన్‌లు ఇప్పటికే యుద్ధం చేస్తున్నట్లు లెక్క. నియంత్రణరేఖ(ఎల్వోసీ)ని ఆనుకుని ఉన్న నూర్కోటే గ్రామంలో కనిపించిన ఈ భీకర సన్నివేశం కశ్మీరీలు ఎంతటి భయానక పరిస్థితుల్లో జీవిస్తున్నారో తెలియజేసేలా ఉంది. గడిచిన కొద్ది నెలలుగా సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా పాకిస్థాన్ రేంజర్లు విచ్చలవిడి కాల్పులకు తెగబడుతున్నారు. గురువారం నాడు పాక్ జరిపిన కాల్పుల్లో నూర్కోటేకు చెందిన తన్వీర్ అనే16 ఏళ్ల బాలుడు చనిపోయాడు. పూంచ్ జిల్లా హవేలీ తాలూకాలో ఉన్న నూర్కోటే గ్రామంలో.. సరిగ్గా కంచె వెంబడే ఆ బాలుడి కుటుంబానికి చెందిన పొలం ఉంది. చనిపోయిన అతణ్ని పొలంలోనే సమాధి చేయాలని కుటుంబ సభ్యులు భావించారు. శుక్రవారం జనాజా ప్రార్థన ముగిసిన తర్వాత శవయాత్ర బయలుదేరింది.. అంతలోనే పాక్‌వైపు నుంచి మళ్లీ కాల్పుల మోత! అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితిలో.. మత పెద్దలు మసీదులోని మైక్ నుంచి బిగ్గరగా అరిచారు.. 'మీరు మా వాణ్ని కాల్చిచంపారు. అతని అంత్యక్రియలు నిర్వహించాలి. కాల్పులు ఆపండి..' అని! మతపెద్దల ప్రకటనతో కొద్ది సేపటికి అటువైపు నుంచి తూటాల వర్షం ఆగింది. వెంటనే అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్తులు విషాద హృదయాలతో వెనుతిరిగారు. సరిహద్దు గ్రామాల ప్రజలు నిత్యం ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారని స్థానిక ఎమ్మెల్సీ జహంగీర్ మీర్ మీడియాకు చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రరిస్టు లాంచ్ప్యాడ్లపై (సెప్టెంబర్ చివరల్లో) భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన తర్వాత దాయాది దేశం దాదాపు 300 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ కాల్పుల్లో ఇప్పటివరకు 27 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది భద్రతా సిబ్బందే కావడం గమనార్హం. ఆదివారం ఉదయం కూడా పూంఛ్ సెక్టార్పైకి పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. -
టెర్రరిస్టు అరెస్టు, గ్రెనేడ్లు స్వాధీనం
జమ్మూకశ్మీర్: నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఓ చొరబాటుదారుడుని భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. కశ్మీర్ లో పూంచ్ సెక్టార్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హిజ్బుల్ మొజాహిద్దీన్ ఉగ్రవాది బిలాల్ షేక్(40)గా భద్రతా దళాలు గుర్తించాయి. పట్టుబడిన ఉగ్రవాది నుంచి పెద్ద ఎత్తున గ్రెనేడ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సివుంది. -
మా వాళ్లపై భారత్ ఆర్మీ దాడి: పాకిస్థాన్
ఇస్లామాబాద్: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. సరిహద్దు వెంబడి భారత్ కాల్పుల్లో 11 మంది మరణించారని పాకిస్థాన్ ఆరోపించింది. నీలం వ్యాలీలో ఓ బస్సును లక్ష్యంగా చేసుకుని బుధవారం భారత దళాలు జరిపిన దాడిలో తొమ్మిది మంది పౌరులు మృతి చెందారని స్థానిక అధికారి వహిద్ ఖాన్ తెలిపారు. మరో దాడిలో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని నాక్యాల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారని పోలీసు అధికారి వసీంఖాన్ వెల్లడించారు. కాల్పుల విరమణ ఉల్లఘించినందుకు తాము తగిన రీతిలో స్పందించామని భారత సైనిక అధికార ప్రతినిధి కల్నల్ నితిన్ జోషి అన్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే కశ్మీర్ లోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. పాక్ దాడులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టడంతో ఇరువైపులా భారీగా కాల్పులు జరిగాయి. మంగళవారం పాక్ బలగాలు జరిపిన మెరుపు దాడిలో ముగ్గురు భారత సైనికులు అమరులయ్యారు. -
భారత డ్రోన్‌ను కూల్చాం: పాక్
ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ దాటి తమ భూభాగంలోకి చొరబడిన భారత డ్రోన్‌ను నేలకూల్చామని పాకిస్థాన్ సైన్యం శనివారం ప్రకటించింది. ‘పాక్ భూభాగంలోకి ప్రవేశించిన భారత క్వాడ్‌కాప్టర్‌ను పాక్ దళాలు శనివారం సాయంత్రం కుప్పకూల్చాయి. దాని శకలాలు రాక్చక్రి సెక్టార్‌లోని అగాయ్ పోస్టు సమీపంలో పడ్డాయి’ అని పాక్ ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. సర్జికల్ దాడుల తరువాత ఇరు దేశాల సరిహద్దుల్లో పాక్ 286 సార్లు షెల్లింగ్, మోర్టార్లతో కాల్పులకు పాల్పడటంతో 14 మంది భద్రతా సిబ్బంది సహా 26 మంది ప్రజలు చనిపోయారు. భారత్‌కే ఎక్కువ నష్టం జరిగింది: పాక్ అత్యున్నత కమాండర్ గత కొద్దిరోజులుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భారత సైనికులే ఎక్కువ మంది చనిపోయారని పాక్ 10 కారప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మాలిక్ జఫార్ ఇక్బాల్ అన్నారు. పాక్ సైనికులు 20 మంది చనిపోగా భారత్ వైపు కనీసం 40 మంది మరణించారని తెలిపారు. ప్రజాగ్రహానికి భయపడే భారత్ ఈ సంఖ్యను తగ్గించి చూపుతోందని ఆరోపించారు. -
దళపతులతో మోదీ భేటీ
సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై సమీక్ష న్యూఢిల్లీ: ప్రధానిమోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితిని సైనిక, నౌకా, వైమానిక దళాల అధిపతులతో సమీక్షించారు. భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దాదాపు రోజూ కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి నెలకొన్న పరిస్థితిని, పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ ప్రధానికి వివరించారు. -
పాకిస్థానే ఎక్కువ నష్టపోయింది!
వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దులు (ఐబీ) మీదుగా పౌరులే లక్ష్యంగా విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న పాకిస్థాన్‌కు దీటుగా బదులిస్తున్నామని బీఎస్ఎఫ్ ఐజీ డీకే ఉపాధ్యాయ బుధవారం వెల్లడించారు. పాక్ సైన్యం మన పౌరులు లక్ష్యంగా కాల్పులు, షెల్లింగ్ దాడులతో విరుచుకుపడుతుండగా.. తాము కేవలం సైనికులే లక్ష్యంగా నిర్దేశితమైన కచ్చితమైన దాడులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. భారత సైన్యం ఎప్పుడూ కూడా అటువైపున్న సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపలేదని, కాల్పులతో పెట్రేగుతున్న పాక్ రేంజర్లు లక్ష్యంగా కచ్చితమైన ప్రతి దాడి జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. తమ ప్రతిదాడిలో పెద్ద ఎత్తున పాక్ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయని, పాక్ సైన్యం పెద్దసంఖ్యలో నష్టపోయిందని చెప్పారు. ‘మేం వారి పోస్టుల లక్ష్యంగా కాల్పులు జరిపాం. వారివైపు నష్టం ఎక్కువగా సంభవించింది. అయితే, ఎంతమంది చనిపోయి ఉంటారనే సంఖ్యను మేం ధ్రువీకరించలేం’ అని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. పాక్ సైన్యం విచ్చలవిడి కాల్పులతో మంగళవారం ఎనిమిది మంది భారత పౌరులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో మరో 22మంది చనిపోయారు. దీంతో ప్రతిదాడులకు దిగిన భారత సైన్యం దీటుగా దెబ్బకొడుతూ 14 పాక్ సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లు చనిపోయినట్టు తెలుస్తోంది. -
మళ్లీ బరి తెగించిన పాకిస్తాన్.
-
మళ్లీ బరి తెగించిన పాకిస్తాన్
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి బరితెగింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దు ప్రాంతాల్లో జవాన్లుతో పాటు పౌరులు లక్ష్యంగా పాక్ రేంజర్లు మంగళవారం కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘిస్తూ... ఆర్ఎస్ పురా సెక్టార్లో కాల్పులు జరపగా ఆరుగురు పౌరులతోపాటు ఒక ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. భారత సైన్యం చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్థాన్ సైన్యం సామాన్యులపై తన ప్రతాపం చూపిస్తోంది. సరిహద్దు వెంబడి గ్రామాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తోంది. నౌషెరా, రాజౌరీ, ఆర్నియా, సాంబా, ఆర్ఎస్ పుర సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. నౌషెరాలో మోటార్లతోనూ దాడులు చేశారు. భారత భద్రతా దళాలు వాటిని బలంగా తిప్పి కొట్టాయి. అయితే పాక్ కాల్పుల్లో జమ్మూలో ఒక ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. ఇక సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్థాన్ సైన్యానికి... అంతే స్థాయిలో మన జవాన్లు సమాధానం చెబుతున్నారు. అక్టోబర్ 19వ తేదీ నుంచి పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉండటంతో... దాదాపు ప్రతిరోజూ తుపాకుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. బీఎస్ఎఫ్ జరిపిన కాల్పులలో దాదాపు 15 మంది పాక్ రేంజర్స్‌తోపాటు మరికొందరు పౌరులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. గడిచిన పదకొండు రోజుల్లో బీఎస్ఎఫ్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో 35 వేల బుల్లెట్లు కాల్చాయి. వీటిలో ఎంఎంజీలు, ఎల్ఎంజీలు, రైఫిళ్లు తదితరాలున్నాయి. ఇవి కాక.. 3000 దీర్ఘశ్రేణి మోర్టార్ షెల్స్‌ను కాల్చాయి. అలాగే తక్కువ దూరం వెళ్లగల మోర్టార్ షెల్స్ రెండువేలు కాల్చాయి. ఈ 11 రోజుల్లో పాకిస్థాన్ దాదాపు 60 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇక పాకిస్థాన్ వంకర బుద్ది మారడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా సరిహద్దులో చొరబాట్లు ఆగడం లేదు. ముఖ్యంగా కశ్మీర్లో చొరబాట్లు కొనసాగుతున్నాయి. బలగాల కళ్లుకప్పి గీత దాటేందుకు ముష్కరులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక వీడియోను రిలీజ్ చేసింది. రాత్రి పూట చెట్ల మధ్య నక్కి బోర్డర్ క్రాస్ చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సాగించిన చొరబాటు యత్నాన్ని బిఎస్ఎఫ్ భగ్నం చేసింది. -
సరిహద్దులో పాక్ చొరబాట్లు వీడియో విడుదల
-
కొనసాగుతున్న దాడులు.. ఇద్దరు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో చొరబాటుదారులు, పాక్ రేంజర్ల దాడులు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరు భారత జవాన్లు మృతి చెందారు. కుప్వారా జిల్లాలో చొరబాటుదారులు జరిపిన కాల్పుల్లో ఓ సైనికుడు మృతి చెందగా.. జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టర్లో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడు. పాక్ రేంజర్ల దాడిలో ఏడుగురు పౌరులు సైతం గాయపడ్డారని సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్లో సైతం గురువారం సాయంత్రం పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆర్మీ అధికారి కల్నల్ రాజేష్ కలియా వెల్లడించారు. చొరబాటుదారుల దాడిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని, ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
పాక్ సైన్యాన్ని మేం ఎదుర్కోవడానికి రెడీ!
బోనియార్ (జమ్మూకశ్మీర్): పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదులు ఎలాంటి దుశ్చర్యకు ఒడిగట్టినా.. దానిని ఎదుర్కోవడానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని భారత సైన్యం స్పష్టం చేసింది. ‘వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) మీదుగా మా సన్నద్ధత అత్యున్నత స్థాయిలో ఉంది. ఎల్వోసీ మీదుగా ఎలాంటి దుశ్చర్య ఎదురైనా దానిని ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధంగా ఉంది. ఇది నిత్యం ఎదురయ్యేదైనా, వేరే తరహాదైనా ఎదుర్కొంటాం’ అని శ్రీనగర్‌కు చెందిన 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెప్టినెంట్ జనరల్ సతీష్ దువా మంగళవారం బోనియార్‌లో విలేకరులకు తెలిపారు. ఎల్వోసీ మీదుగా భారీగా చొరబాటు ప్రయత్నాలు జరగుతున్నాయని, వాటిని చాలావరకు ఆర్మీ భగ్నం చేస్తున్నదని, ఎల్వోసీ మీదుగా తరచూ జరుగుతున్న ఎన్కౌంటర్లే ఇందుకు నిదర్శనం అని ఆయన చెప్పారు. చొరబాటు యత్నాలను భగ్నం చేస్తూ ఆర్మీ పలువురు మిలిటెంట్లను హతమార్చిందని, ఇది ఆర్మీ సన్నద్ధతను చాటుతోందని ఆయన చెప్పారు. అయితే, పీవోకేలో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌పై స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఈ విషయంలో సైన్యం, రాజకీయ అధినాయకత్వం చెప్పాల్సినదంతా చెప్పేసిందని, ఆ విషయంలో తనకు ఎలాంటి భిన్నమైన అభిప్రాయం లేదని తెలిపారు. కొందరు తప్పుదోవ పట్టిన యువకులే కశ్మీర్‌లోయలో జరుగుతున్న ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారని, మెజారిటీ యువత సైన్యం వైపే ఉందని ఆయన చెప్పారు. -
29సార్లు ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్తాన్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ యథేచ్చగా కాల్పలు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం పాకిస్తాన్ ఇప్పటివరకూ 29సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా, రాజౌరి సెక్టార్ల్లో పాక్ బలగాలు గతరాత్రి కాల్పులకు పాల్పడ్డాయి. అయితే అప్రమత్తంగా ఉన్న భద్రతా సిబ్బంది సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. కాల్పుల్లో ఓ జవాను గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో పాక్ కాల్పులు జరపడం ఇది రెండోసారి. కాగా సర్టికల్ స్ట్రైక్స్ దాడుల నేపథ్యంలో పలుమార్లు పాక్ తన దుర్భిద్ధిని ప్రదర్శించింది. పూంఛ్, రాజౌరీ, ఝానగర్, మక్రీ, నౌషెరా, గిగ్రియల్, ప్లాటాన్, పుల్వామా, బల్లోయ్, కృష్ణగాటి తదితర ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. మరోవైపు పాక్ కాల్పుల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. కాల్పుల మోతలో పరిసర ప్రాంతాలు తరచు దద్దరిల్లుతున్నాయి. -
ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్ కాల్పులు
జమ్మూకశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ దళాలు తాజాగా సరిహద్దులో నౌషరా సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద భారత దళాలపై పాక్ సైన్యం ఆదివారం ఉదయం కాల్పులకు తెగబడింది. నాలుగు ఆర్మీ పోస్టులే లక్ష్యంగా ఈ కాల్పులు జరిపారు. అయితే వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా దళాలు వెంటనే స్పందించి ధీటుగా సమాధానం ఇచ్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఎదురు కాల్పుల్లో ఆర్మీ జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా సరిహద్దు రక్షణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలు నిత్యకృత్యంగా మారిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
భవిష్యత్తులోకూడా ఎల్వోసీని దాటుతాం: భారత్
న్యూఢిల్లీ: ఉడీ దాడి తర్వాత భారత్ ఉడీకి ముందు భారత్ అని ప్రపంచదేశాలు చెప్పుకునే స్ధాయికి ఇండియా చేరుకుంటోందా?. తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు దీన్నే సూచిస్తున్నాయి. వరుస ఉగ్రదాడులతో దేశం నెత్తురోడుతున్నా ఎన్నడూ సంప్రదింపుల గీతను దాటని భారత్ నిర్దేశిత దాడులతో పాకిస్తాన్ కు గట్టిగా బదులిచ్చింది. ఈ మేరకు భారత్ లోకి ఉగ్రవాదులను పంపే ఆలోచనను మానుకోకపోతే నియంత్రణ రేఖా(ఎల్వోసీ)నిబంధనల ఉల్లంఘనకు భారత్ ఏ మాత్రం వెనుకాడదని కేంద్ర ప్రభుత్వం పాక్ కు చెప్పినట్లు సమాచారం. నియంత్రణ రేఖ నుంచి ఉగ్రవాదులు చొరబడుతున్నారనే సమాచారం ఉన్నా, స్ధావరాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిసినా ముందస్తు చర్యగా కూడా ఎల్వోసీ నిబంధనలను ఉల్లంఘించడానికి సిద్ధంగా ఉన్నట్లు పాక్ ను హెచ్చరించింది. 2004 జనవరి 6న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారాఫ్ తమ ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి భారత్ పై ఉగ్రదాడులను ప్రోత్సహించమనే ఒప్పందంపై సంతకం చేశారు. అయినా సంవత్సరాలుగా పాక్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నా భారత్ మాత్రం ఓపికగా సంప్రదింపులు జరుపుతూనే వచ్చింది. ఉడీ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రతిఘటించిన భారత్ ఎల్వోసీ ఆవల ఉగ్రస్ధావరాలపై నిర్దేశిత దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. నిర్దేశిత దాడుల అనంతరం నియంత్రణ రేఖ వెంబడి ప్రతీకారం కోసం పాక్ ఆర్మీ చేసిన చొరబాటు ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టింది. ఈ విషయంపై పాక్ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) నసీర్ జంజువాతో సమావేశమైన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ లు ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అన్నారు. తమ ఓపికను నిస్సహాయత పాక్ భావిస్తే అది వారి తప్పని తెలుసుకునేలా చేస్తామని భారత్ పాక్ కు చెప్పినట్లు తెలిసింది. కానీ ప్రతీకార దాడుల కోసం పాక్ ప్రయత్నిస్తున్నట్లు భారత ఇంటిలిజెన్స్ కు సమాచారం ఉంటోంది. అంతేకాకుండా భారత్-పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న పరిస్ధితులు సద్దుమణుగుతాయా? లేదా? అన్న విషయం తెలియాలంటే నవంబర్ లో పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ రిటైరవుతారా? పదవీకాలాన్ని పొడగిస్తారా? అనే దానిపై ఆధాపడి ఉంటుంది. -
పలన్వాలా గ్రామంపై పాక్ రేంజర్ల కాల్పులు
-
నియంత్రణ రేఖ వెంబడి గ్రామ ప్రజల ఆందోళనలు
-
మళ్లీ పాక్ కాల్పులు
జమ్మూ: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. శనివారం ఉదయం పూంచ్ జిల్లాలోని ఎల్ఓసీ వెంబడి పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డాడని ఐజీ పోలీస్(రాజౌరి-ఫూంచ్ రేంజ్) జానీ విలియమ్స్ తెలిపారు. అయితే కాల్పుల ఉల్లంఘన జరగలేదని డిఫెన్స్ పీఆర్ఓ కల్నల్ మనీశ్ మెహతా పేర్కొనడం గమనార్హం. భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన తర్వాత పాక్ ఇప్పటివరకు 25 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
మాటల్లేవ్.. ఇక చేతలే!
• ఐఏఎఫ్ చీఫ్ రాహా వ్యాఖ్య ‘వసుధైక కుటుంబకం’ మా నినాదం: రాజ్‌నాథ్ • భద్రతపై సమీక్ష.. సైనికులకు మౌలిక వసతుల కల్పన వేగవంతం ఘజియాబాద్: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి నెలకొన్న రాజకీయ, సైనిక ఉద్రిక్త వాతావరణంపై ఇకపై ఆర్మీ మాట్లాడటమేమీ ఉండదని.. చేతల్లోనే సమాధానం ఉంటుందని వైమానిక దళం చీఫ్ అరుప్ రాహా స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులకైనా సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ జిల్లాలోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శనివారం ‘వైమానిక దళ 84వ వ్యవస్థాపక దినోత్సవం’ ఆయన మాట్లాడారు. ‘సర్జికల్ దాడులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందరూ అభిప్రాయాలు చెబుతున్నారు. దేశం ఏం కోరుకుంటోందో దాన్ని నిర్వహించటం ఆర్మీ పని. మేం దీని గురించి మాట్లాడదలచుకోవటం లేదు. కేవలం చేతల్లో చూపిస్తాం’ అని తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు, పరికరాలతో భారత వైమానిక దళం సిద్ధంగా ఉందని.. ఎయిర్ వారియర్స్ విన్యాసాల ద్వారా గగనతలంలో పటిష్టమైన నిఘా ఏర్పాటుచేసుకున్నామన్నారు. ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల చర్యలను ఆర్మీ నిర్వీర్యం చేస్తోందని.. ప్రతి ఘటన తర్వాత గుణపాఠాలు నేర్చుకుంటున్నామని రాహా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారతీయ వైమానిక దళం ఫేస్బుక్ పేజీ ‘పవర్ టు పనిష్’ను ఆయన ప్రారంభించారు. రాజ్‌నాథ్ ‘సరిహద్దు’ సమీక్ష సర్జికల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో సరిహద్దుల్లో భద్రతను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. రాజస్తాన్‌లోని మునాబావో సరిహద్దు ఔట్‌పోస్టును సందర్శించారు. ‘భారత్ ఎప్పుడూ ఒకరిపై యుద్ధం చేయదు. కానీ, తనపై ఎవరైనా దాడిచేస్తే దీటైన జవాబిస్తుంది’ అని తెలిపారు. సరిహద్దుల్లో భద్రతాపోస్టుల్లో కంచె నిర్మాణం, ఫ్లడ్‌లైట్లు, సైనికులకు సౌకర్యాలతోపాటు ఇతర మౌలికవసతుల కల్పనను ప్రాధాన్యతతో పూర్తిచేస్తామని సైనికులకు తెలిపారు. ‘వసుధైక కుటుంబకం’ అనే సూత్రాన్ని బలంగా విశ్వసించే భారత్.. ఇతరుల భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సరిహద్దుల్లో కాపలా ఉండే సైనికుల త్యాగాలు మరవలేనివన్నారు. సరిహద్దుల్లో సైనికుల కోసం మరిన్ని మొబైల్ టవర్ల ఏర్పాటుతోపాటు.. శాటిలైట్ ఫోన్లను కూడా పెంచనున్నట్లు తెలిపారు. జవాన్లతో కాసేపు ముచ్చటించి వారిలో ధైర్యాన్ని నింపారు. మళ్లీ భగ్గుమన్న కశ్మీర్ లోయలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తమైంది. పెల్లెట్ గాయాలతో ఓ బాలుడు మృతి చెందటంతో.. ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల కర్ఫ్యూ విధించారు. సఫకదల్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఘర్షణలో జునైద్ అఖూన్ అనే బాలుడికి తల, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ.. జునైద్ మరణించటంతో.. ఆందోళనకారులు రెచ్చిపోయారు. అయితే ఘర్షణలోనే బాలుడు మృతిచెందాడని పోలీసులంటుంటే.. పెల్లట్లు తగిలే చనిపోయాడని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో వ్యాపారాలు, ఆస్తులు లేవు పాక్ ప్రధాని షరీఫ్ కుటుంబ సభ్యులు లాహోర్: భారత్‌లో తమ కుటుంబానికి ఎటువంటి వ్యాపారాలు, ఆస్తులు లేవని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. తమకు భారత్‌లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. ఈ మేరకు షరీఫ్ కుటుంబ ప్రతినిధి స్పందిస్తూ.. ప్రధాని కుమారునికి భారత్‌లో సొంత వ్యాపారాలు కానీ, వ్యాపారాల్లో భాగస్వామ్యం కానీ లేదని తెలిపారు. మోదీ సర్కారతో సంబంధాల పురోగతికి అవకాశం తక్కువే: అజీజ్ మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వంతో సంబంధాలు మెరుగవుతాయనే నమ్మకం పాకిస్తాన్‌కు లేదని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. -
భారీగా బలగాలను మోహరించిన పాక్
న్యూఢిల్లీ: సర్జికల్ దాడుల అనంతరం అసలు దాడులే జరగలేదంటూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్తాన్ దూకుడు పెంచింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో సరిహద్దు వెంబడి భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించింది. దీంతోపాటు అక్కడ ఉన్న గ్రామాలను ఖాళీ చేయించినట్లు గుర్తించామని భారత ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే.. దీనికి ప్రతిగా భారత్ కూడా ఎల్ఓసీ వద్ద భారీగా సైన్యాన్ని మోహరించిందని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. మరోసారి ఇండియన్ ఆర్మీ పాక్ లాంచ్ ప్యాడ్స్ మీద దాడి చేసే అవకాశం ఉందని భయపడుతున్న నేపథ్యంలో పాక్ సైనిక బలగాల మోహరింపు చేపడుతుందని భావిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారి వెల్లడించారు. సర్జికల్ స్ట్రైక్స్ తరువాత ప్రతీకార చర్యకు పాల్పడాలన్న ఉద్దేశంతో ఉన్న పాక్.. అంతర్జాతీయంగా ఉన్న వ్యతిరేకత దృష్ట్యా నేరుగా సైన్యం ద్వారా కాకుండా ఉగ్రవాదుల రూపంలో ఫిదాయిన్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. సర్జికల్ దాడుల అనంతరం పాకిస్తాన్ లష్కర్-ఏ-తాయిబా, జైషే మహ్మద్ టెర్రర్ క్యాంపులను పీఓకే నుంచి తరలించినట్లు సమాచారం. -
సర్జికల్ స్ట్రైక్స్‌పై కశ్మీరీ ప్రజలు ఏమన్నారు...
భారత సైన్యం అసలు సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని దుష్ప్రచారం చేస్తున్న పాక్ మీడియాతో పాటు.. స్వదేశంలోని కొందరు రాజకీయ నాయకులకు కశ్మీరీ ప్రజలు షాకింగ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి.. భారత ఆర్మీ బలగాలు చేసిన దాడిని ప్రత్యక్షంగా చూసిన కొంతమంది.. వాటికి సంబంధించిన గ్రాఫిక్స్‌ను విడుదల చేశారు. తాము కళ్లారా ఆ దాడులను చూశామని తెలిపారు. ఈ దాడులు చాలా కొద్దిసేపే జరిగినా.. అవి చాలా శక్తిమంతమైనవని తెలిపారు. ఈ ఆపరేషన్ ముగించుకునే వెళ్లేముందు జిహాదీల స్థావారాలన్నింటినీ భారత ఆర్మీ ధ్వంసం చేసిందని చెప్పారు. సర్జికల్ స్ట్రయిక్స్‌లో మరణించిన ఉగ్రవాదులను రహస్యంగా సమాధి చేసేందుకు సెప్టెంబర్ 29 తెల్లవారుజామున వాటిని పాక్ వర్గాలు ట్రక్కులలో తీసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భారత ఆర్మీ లక్ష్యంగా చేసుకుని జరిపిన కొన్ని ప్రాంతాల వివరాలను కూడా వారు తెలిపారు. అల్-హవీ వంతెన గుండా సెప్టెంబర్ 28న 84ఎంఎం కార్ల్ గుస్తావ్ రైఫిల్స్ శబ్దాలు భారీగా వినిపించాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. నియంత్రణ రేఖ వెంబడి నౌగమ్ సెక్టార్‌లోని ఉగ్రవాద స్థావారాలను టార్గెట్‌గా చేసుకుని 25 పల్లెటూర్లలో ఈ ఆపరేషన్‌ను ఆర్మీ కొనసాగించిందని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఖైరతి బాగ్ అనే గ్రామంలో లష్కరే తాయిబాకు చెందిన మూడు చెక్క భవనాలను కూడా భారత ఆర్మీ ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. ఆ ప్రాంతం లష్కర్ కంచుకోటగా ప్రాముఖ్యం పొందింది. కాల్పులు ప్రారంభమైన వెంటనే కొంతమంది లష్కర్ ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారని వివరించారు. ఈ దాడుల్లో సమారు 38-50 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని, జిహాదీల వాహనాలు, కొన్ని భవనాలు కూడా ఈ దాడుల్లో ధ్వంసం అయినట్టు పేర్కొన్నారు. తర్వాతి రోజు ఉదయం కూడా ఆరు మృతదేహాలను చల్హానా లష్కర్ క్యాంప్ వద్దకు తరలించినట్లు తెలుస్తోంది. దాడుల అనంతరం లష్కర్ ఉగ్రవాదులు ఓ చోట సమావేశమై, పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడులను తిప్పికొట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెప్పారు. భారత ఆర్మీకి ఈ దాడులపై త్వరలోనే సమాధానం ఇవ్వాలని వారు నిర్ణయించినట్టు మరో స్థానిక వ్యక్తి వివరించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావారాలపై భారత సైన్యం దాడులను పాక్ ఖండిస్తున్న నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులు ఈ వివరాలు వెల్లడించారు. ఇవి సర్జికల్ స్ట్రయిక్స్ కావని, సరిహద్దుల్లో తరచు జరిగే చిన్నపాటి ఎదురు కాల్పులేనని పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తోంది. దానిపై ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు నాయకులు కూడా సాక్ష్యాలను బయట పెట్టాలని కోరారు. మరోవైపు భారత ఆర్మీ సైతం ఆ దాడుల వీడియోలను బయటపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
పాకిస్థాన్ పై భారత్ దాడి జరపడం అబద్ధమా?
న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంలోకి భారత సైనిక కమాండోలు చొచ్చుకుపోయి తీవ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై దాడులు జరపడం, 38 మంది ఉగ్రవాదులను హతమార్చడం నిజమా, కాదా? అన్నది ప్రస్తుతం భారత్, పాక్ ప్రజలతోపాటు అంతర్జాతీయ సమాజాన్ని తొలుస్తున్న ప్రశ్న. దీనిపై సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. దాడులు జరిపినట్లు భారత్ పదే, పదే ప్రకటించడం, దాన్ని పదే పదే పాకిస్థాన్ ఖండించడం పట్ల అంతర్జాతీయ సమాజంలోను అనుమానాలు రేకెత్తుతున్నాయి. పాకిస్థాన్ కు కనువిప్పు కలిగేలా దాడులకు సంబంధించి రికార్డు చేసిన సాక్ష్యాధారాలను విడుదల చేయడమే మంచిదని సోషల్ మీడియాలో మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ పరువుతీసి మరింత ఏకాకిని చేయాలంటే సాక్ష్యాధారాలను విడుదల చేయడమే మంచిదని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సూచిస్తున్నాయి. పాకిస్థాన్ భూభాగంలోకి భారత సైనికులు చొచ్చుకుపోయి తీవ్రవాద స్థావరాలపై దాడులు జరపడం ఇదే మొదటిసారి కాదు. కాకపోతే బహిరంగంగా ప్రకటించడం మొదటిసారి. కార్గిల్ యుద్ధానంతరం 1998 నుంచి 2014 సంవత్సరాల మధ్య భారత సైనికులు అనేకసార్లు పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి లక్షిత దాడులు జరిపారు. అలాంటిప్పుడు ఇప్పుడు దాడులు జరపకుండానే జరిపినట్లు బూటకపు ప్రకటనలు చేయాల్సిన అవసరం భారత్ కు లేదు. కానీ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దాడి జరిగినట్లు తమ దృష్టికి రాలేదని, భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కశ్మీర్ కు ఇరువైపుల సైనిక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సైనిక పరిశీలక బృందం (యుఎన్ఎంజిఐపి) ప్రకటించడం అంతర్జాతీయంగాను, సాధారణంగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు తీవ్రవాదుల మధ్య సంభాషణలు లేదా సందేశాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుందని, ఈసారి అలాంటివేవి జరగినట్లు బయటపడలేదని లక్షిత దాడులతో సంబంధంలేని సైనిక, ఇంటిలెజెన్స్ వర్గాలు ప్రకటించడం దేశీయంగా అనుమానాలకు దారితీసింది. 38 మంది తీవ్రవాదులు హతమార్చడం సామాన్య విషయం కాదని, కచ్చితంగా ఈ విషయమై టెర్రరిస్టులు మధ్య చర్చ జరుగుతుందని, అలా జరగకుండా పాకిస్థాన్ ఐఎస్ఐ వర్గాలు ఉగ్రవాదులను నియంత్రించైనా ఉండాలని లేదా ఒకరిద్దరు మాత్రమే చనిపోతే ఎక్కువ మంది మరణించినట్లు భారత వర్గాలు ప్రకటించి ఉండాలని ఆ సైనిక, ఇంటెలిజెన్స్ వర్గాలు వ్యాఖ్యానించాయి. లక్షిత దాడులకు సంబంధించిన సాక్ష్యాధారాలను బయటపెట్టడం, పెట్టకపోవడం రాజకీయపరమైన నిర్ణయమని, ప్రస్తుతం సందిగ్ధత కొనసాగించడమే మంచిదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని భద్రతా విశ్లేషకుడొకరు అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ సైనికులు కార్గిల్‌లోకి చొచ్చుకువచ్చినప్పుడు అలాంటిదేమీ లేదని పాకిస్థాన్ ప్రభుత్వం బుకాయించింది. ఆ విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందు నిరూపించేందుకు అప్పటి భారత ప్రభుత్వం పాక్ జనరల్ పర్వేజ్ ముషారఫ్, అప్పటి పాక్ సైనిక దళాల ప్రధానాధికారి లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అజీజ్ మధ్య జరిగిన సంభాషణలను బయటపెట్టింది. వారి మధ్య జరిగిన సంభాషణలను భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ రికార్డు చేసింది. పాకిస్థాన్ కు ఇప్పుడు కూడా అలాంటి షాకివ్వాలి అని భారతీయులు వాంఛిస్తున్నారు. భారత దాడులు బూటకమని పాకిస్థాన్ వాదిస్తుందంటే భారత్ పై ప్రతీకార దాడులకు పాల్పడే ఉద్దేశం పాకిస్థాన్ కు లేదని, సాక్ష్యాధారాలను బయటపెట్టి ప్రతీకార దాడులకు పాక్ ను రెచ్చగొట్టడం ఎందుకని శాంతికాముకులు అంటున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ నవంబర్ నెలలో పదవీ విరమణ చేస్తారని, ఈలోగా ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ గత దాడులకు సాక్ష్యాలివిగో.... కార్గిల్ యుద్ధానంతరం కెప్టెన్ గుజిందర్ సింగ్ సూరి నాయకత్వాన 12వ బిహార్ బటాలియన్ కు చెందిన ఘటక్స్ (పదాతిదళం కమాండోలు) పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి లక్షిత దాడులు జరిపారు. ఆ దాడుల్లో గుజిందర్ సింగ్ వీర మరణం పొందారు. ఆ తర్వాత ఆయనకు ‘మహావీర్ చక్ర’ ప్రదానం చేశారు. 2000, మార్చి 2వ తేదీన పంజాబ్ సరిహద్దుల్లో 35 మంది సిక్కులను లష్కరే తోయిబా తీవ్రవాదులు హతమార్చగా, అందుకు ప్రతీకారంగా 9వ పారా మిలటరీ దళానికి చెందిన భారత సైనికులు ఓ మేజర్ నాయకత్వాన పాక్ భూభాగంలోకి చొరబడి 28 మంది టెర్రరిస్టులను, పాక్ సైనికులను హతమార్చారు. 9వ పారా మిలటరీ దళానికి శ్రీలంకలో ఎల్టీటీఈపై యుద్ధం చేసిన అనుభవం ఉన్న విషయం తెల్సిందే. ఆ తర్వాత 2007, 2008 సంవత్సరాల్లో కూడా భారత్ సర్జికల్ దాడులు జరిపింది. పాకిస్థాన్ ముందుగానీ, అంతర్జాతీయ సమాజం ముందుగానీ భారత ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. ఇప్పుడు భారత్ వ్యూహం మార్చుకొని మొట్టమొదటిసారిగా దాడులు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. కనుక సాక్ష్యాధారాలను బయటపెట్టమని ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థులైన రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రివాల్ కూడా కోరుతున్నారు. -
సర్జికల్ స్ట్రైక్స్: ధోవల్‌కు పాక్ ఎన్ఎస్ఏ ఫోన్!
న్యూఢిల్లీ: పీవోకేలో భారత సైన్యం సర్జికల్ దాడులతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఉగ్రవాదులు దాడులతో అలజడి రేపుతుండగా మరోవైపు కాల్పుల ఉల్లంఘన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా సరిహద్దుల మీదుగా ఉన్న గ్రామాలను ఖాళీ చేయించి.. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) నసీర్ జంజువా భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇద్దరూ అంగీకరించారు. ఈ విషయాన్ని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తజ్ అజిజ్ తెలిపినట్టు పాక్ మీడియా తెలిపింది. -
మేం కూడా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించగలం:షరీఫ్
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్(నిర్దేశిత దాడి) నిర్వహించడంతో షాక్ కు గురైంది. దాడిపై శుక్రవారం ఏర్పాటు చేసిన కేబినేట్ సమావేశంలో పాల్గొన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తమకూ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించ గల సామర్ధ్యం ఉందని పేర్కొన్నారు. దేశ భద్రతకు ఎవరైనా ఆటంకం కలగజేయాలని ప్రయత్నిస్తే.. చూస్తూ ఊరుకోమని అన్నారు. నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నా ప్రజలను, దేశ సమగ్రతను కాపాడుకోగల సత్తా పాక్ కు ఉందని చెప్పారు. భారత్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని షరీఫ్ వ్యాఖ్యానించినట్లు ఓ ప్రముఖ పాకిస్తాన్ పత్రిక పేర్కొంది. నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు భారత ఆర్మీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, భారత్ ప్రకటనను పాక్ తోసిపుచ్చింది. ఉడి ఉగ్రదాడిపై విచారణ చేయాలని షరీఫ్ ఆదేశించినట్లు తెలిసింది. దాడిలో పాక్ హస్తం ఉందని భారత్ చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని షరీఫ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
జై జవాన్!
నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి కొంతకాలంగా పాకిస్తాన్ వైపు నుంచి సాగుతున్న అరాచకానికి తొలిసారి భారత సైన్యం నుంచి దీటైన జవాబు వెళ్లింది. 1971నాటి యుద్ధం తర్వాత చరిత్రలో మొట్టమొదటిసారి ఎల్ఓసీని దాటి పాకిస్తాన్ భూభాగంలో మూడు కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి ఏడు చోట్ల గుర్తించిన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గురువారం వేకువజామున మన సైన్యం మెరుపు దాడుల్ని నిర్వహించింది. 38మందిని మట్టుబెట్టి మరి కొందర్ని అదుపులోకి తీసుకున్నారంటే... ఆ సంగతి మనం వెల్లడించేవరకూ ఇతర దేశాలతోపాటు పాకిస్తాన్‌కు కూడా తెలియదంటే ఈ మొత్తం ఆపరేషన్ ఎంత పకడ్బందీగా నిర్వహించారో అర్ధమవుతుంది. ఎంచుకున్న ప్రాంతంలో, అనుకున్న సమయానికి, ముందుగా నిర్ణయించిన విధంగా దాడులు జరపడం... ఉగ్రవాదులకు భారీ నష్టం కలిగించడం... అదే సమయంలో ఇటువైపు ఎలాంటి ప్రాణ నష్టమూ లేకుండా చూసుకోవడం మన సైనిక కమాండోల తిరుగులేని సామర్ధ్యాన్ని వెల్లడిస్తుంది. 250 కిలోమీటర్ల విస్తృతిలో ఎల్ఓసీ ఆవల హెలికాప్టర్లలో బలగాలను దించి ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశారు. దీన్నంతటినీ ద్రోన్ కెమెరాలతో చిత్రించారు. వారం రోజులుగా ఎల్ఓసీలో పకడ్బందీ నిఘా పెట్టి, ఉగ్రవాద స్థావరాలను నిర్దిష్టంగా గుర్తించి ఈ దాడులు నిర్వహించారు. ఈ మాదిరి దాడులకు ఎంతో నైపుణ్యం, సమర్ధత కావాలి. అక్కడి సైనికుల జోలికెళ్తే మొత్తం ఆపరేషన్‌ను వక్రీకరించే ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ విషయంలో మన కమాండోలు అభినందనీయులు. ఏ దేశానికైనా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, అందుకు భంగం కలిగించే శక్తులపై దాడులు చేయడానికి సర్వహక్కులూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదురైనా మన దేశం నిగ్రహం పాటిస్తూ వచ్చింది. సరిహద్దు ఆవలినుంచి వచ్చిన ఉగ్రవాదులు వివిధ ప్రాంతాల్లో ఎన్నిసార్లు, ఎంత విధ్వంసం సృష్టించినా... దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబై నగరాన్ని నాలుగు రోజులపాటు గడగడలాడించి 164మందిని పొట్టన బెట్టుకున్నా ఓర్పుతో వ్యవహరించింది. సజీవంగా పట్టుబడిన ఉగ్రవాదినుంచి సేకరించిన సమాచారాన్ని పాకిస్తాన్‌కు అందజేసి కారకుల్ని పట్టి బంధించి అప్పగిం చాలని కోరింది. మొన్నటి పఠాన్‌కోట్ దాడి వరకూ ఇలా ఎప్పటికప్పుడు చెబు తున్నా బుకాయించడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. భారత్‌లో సాగు తున్న ఉగ్ర దాడులతో తమకు సంబంధమే లేదన్న బలహీనమైన వాదనను వినిపిం చడాన్ని అది రివాజుగా మార్చుకుంది. అయితే ఉడీ ఉగ్రవాద దాడిలో 18మంది జవాన్ల ప్రాణాలు తీసినప్పటినుంచీ దేశ ప్రజలు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెడితే ఇవి మున్ముందు మరింత మితిమీరడం ఖాయమన్న వాదనలు వచ్చాయి. ఏదో చేస్తామన్నారు... ఏం చేస్తున్నారని ఎన్డీఏ ప్రభుత్వంపై వివిధ పక్షాలు విమర్శలు కురిపించాయి. అందులో కాంగ్రెస్, వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. మరోపక్క పాకిస్తాన్ ఎప్పటిలానే ఉడీ దాడి ఉదంతాన్ని వక్రీకరించడం మొదలుపెట్టింది. దాంతో తమకు సంబంధమే లేదన్నట్టు ప్రవర్తిం చింది. పెపైచ్చు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌పై ఎదురుదాడికి దిగారు. వీటన్నిటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. అన్నివిధాలా ఆలోచించింది. పర్యవ సానంగా మన వైఖరిలో గుణాత్మకమైన మార్పు కనబడింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించారు. మనకు హాని తలపెట్టినవారికి నొప్పి తెలిసేలా చేస్తామని రక్షణ మంత్రి పరీకర్ హెచ్చరించారు. ఉడీ ఉగ్రవాద దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లను మరువబోమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘నీళ్లూ, నెత్తురూ కలిసి ప్రవహించలేవ’ని అంటూ సింధు నదీ జలాల ఒప్పందం పునఃసమీక్షకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగే దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి(సార్క్) సమావేశాలకు గైర్హాజరవుతున్నట్టు మన దేశం ప్రకటించింది. బంగ్లా, భూటాన్, అఫ్ఘాన్లు తాము సైతం హాజరుకాబోమని తెలిపి ప్రపంచం ముందు పాక్‌ను దోషిగా నిలిపాయి. కానీ పాకిస్తాన్ దీన్నంతటినీ తేలిగ్గా తీసుకుంది. మా దగ్గర అణ్వాయుధాలు న్నాయి... ప్రయోగించడానికి వెనకాడబోమని హెచ్చరించడం మొదలెట్టింది. ఎన్ని కలకు ముందూ, అధికారంలోకొచ్చాక కొన్నాళ్లు సొంతంగా ఆలోచించినట్టు కనిపిం చిన నవాజ్ షరీఫ్ అక్కడి సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారారు. తనకు తిరుగు లేని ప్రజామోదం ఉన్నా మునుపటి ప్రధానుల మాదిరే బలహీనంగా వ్యవహరిం చడం మొదలుపెట్టారు. అసాధారణ రీతిలో తన పుట్టినరోజునాడు స్వయంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోదీ వ్యవహార శైలి చూశాకైనా ఆయన మారలేకపోయారు. పాకిస్తాన్ సైన్యం, దాని ఆధ్వర్యంలోని గూఢచార సంస్థ ఐఎస్ఐలు పెంచి పోషించిన ఉగ్రవాద మూకలు తమ దేశానికే ముప్పుగా పరిణ మించినా అక్కడి పౌర సమాజం మద్దతును కూడగట్టి సైన్యం చేష్టలను నియం త్రించడానికి షరీఫ్ ఏమాత్రం ప్రయత్నించలేదు. అమెరికా కూడా ఈ ధోరణుల విషయంలో చూసీచూడనట్టే వ్యవహరించింది. ఈ పరిణామాలపై కళ్లుమూసు కుంది. ఉడీ దాడిని ఖండించడం తప్ప బాధ్యులు మీరేనని పాక్‌కు చెప్పడంలో అది విఫలమైంది. మన దేశం కూడా ఎల్లకాలమూ చూస్తూ ఊరుకుంటుందనుకోవడం తెలివితక్కువతనం. ఇప్పుడు నిర్వహించిన దాడుల్ని ‘ప్రతీకార చర్య’గా కాక ఉగ్ర వాద చర్యలను నిరోధించడంలో భాగంగా సాగించినవేనని చెప్పడం ద్వారా మన దేశం ఎంతో పరిణతితో వ్యవహరించింది. దీన్ని పాకిస్తాన్ ఎలా చూస్తుందన్నది దాని ఇష్టం. దాడులు నిజంకాదని, ఆవలినుంచి కాల్పులు జరిగాయని తన పౌరు లను నమ్మింపజూస్తున్నది. అయితే అటునుంచి ఎదురయ్యే ఎలాంటి పరిణామా లనైనా ఎదుర్కొనడానికి మన సైన్యం సర్వసన్నద్ధంగా ఉంటుంది. అది తప్పనిసరి. ఈ దశలోనైనా పాకిస్తాన్‌కు వాస్తవ పరిస్థితులు అవగాహనకొచ్చేలా చేయాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలకూ, మరీ ముఖ్యంగా అమెరికా తదితర అగ్రరాజ్యాలకూ ఉంది. -
వాఘా సరిహద్దులో రిట్రీట్ రద్దు
ఛండీఘర్: పంజాబ్ రాష్ట్రంలోని వాఘా సరిహద్దులో గురువారం జరగాల్సిన బీటింగ్ రిట్రీట్ రద్దు అయింది. ఎల్వోసీ వద్ద ఉద్రిక్తల నేపథ్యంలో అట్టారి-వాఘా బోర్డర్ వద్ద జరిగే రిట్రీట్ను బీఎస్ఎఫ్ రద్దు చేసింది. ఈ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటలముందు జరుగుతుంది. 1959 నుండి ఈ ఆనవాయితీ ఉన్నది. అరగంటపాటు జరిగే ఈ రీట్రీట్‌ను వీక్షించేందుకు ఇరు దేశాల నుంచి వందలాంది మంది వస్తుంటారు. ఇక్కడకు వచ్చే ప్రతి వారూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తారు. అయితే అట్టావా నుంచి రిట్రీట్‌కు వెళ్లేందుకు పర్యాటకులతో పాటు సందర్శకులు ఆసక్తి చూపనట్లు సమాచారం. అయితే రిట్రీట్ను ఎందుకు రద్దు చేశారో తమకు స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. -
భారత మాతకు జై..ఆర్మీ సేన జిందాబాద్
-
మార్కెట్లకు షాకిచ్చిన యుద్ధ వాతావరణం
ముంబై: లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఏర్పడిన యుద్ధ వాతావరణం దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు రేపింది. భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడుల నేపథ్యంలో ఆరంభంలో పాజిటివ్ నోట్ తో వున్న దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవి చూశాయి. ఒక దశలో 572 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 465 నష్టంతో 27,827 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 154పాయింట్లను కోల్పోయి 8,591 వద్ద స్థిరపడింది. గత మూడునెలల్లో ఇదే అతి భారీ పతనమని ఎనలిస్టులు వ్యాఖ్యానించారు. 88 వేల మార్క్ దగ్గర ప్రధాన నిరోధాన్ని ఎదుర్కొన్న నిఫ్టీ ఈ దెబ్బతో మరో కీలక మద్దతు స్థాయి 86వేల దిగువకు పడిపోయింది. తరువాత 8,500 వద్ద కీలక మద్దతు అని, ఇక్కడ విఫలమైతే మరింత పతనం తప్పదని మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేశారు. దాదాపు అన్ని రంగాల సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఆటో, రియల్టీ రంగాలురంగాలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అటు చిన్న షేర్లూ కుప్పకూలాయి. ఇన్ఫ్రాటెల్, టీసీఎస్, ఐటీసీ, ఎంఅండ్ఎం, ఓఎన్జీసీ స్వల్ప లాభాలను ఆర్జించగా, భెల్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, అరబిందో, బీవోబీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, లుపిన్, ఐషర్, గెయిల్ నష్టపోయాయి. అటు డాలర్ తో పోలిస్తే 38 పైసల నష్టంతో 66.85 దగ్గరు ఉంది. ఒక దశలో 45పైసలకు పైగా దిగజారి రూ. 67 స్థాయికి చేరువలోకి వచ్చింది. బ్రెగ్జిట్ ఉదంతం తరువాత రూపాయి ఈ స్తాయిలో పతనం కావడం ఇదే మొదటి సారని మార్కెట్ ఎనలిస్టులు విశ్లేషించారు. అయితే ఇటీవల నష్టాల్లో పసిడి ఈ రోజు పుంజుకుంది. పది గ్రా. పుత్తడి. రూ.163 లాభంతో రూ. 31,118 వద్ద ఉంది. -
కశ్మీర్లో ఉగ్ర కలకలం, కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలతో శుక్రవారం ఉదయం మళ్లీ కాల్పులు జరిగాయి. కుప్వారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) సమీపంలో ఉగ్రకదలికలతో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. ఆపరేషన్ కొనసాగుతుందని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. గురువారం ఇదే ప్రాంతంలో రెండు చొరబాట్లను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, కశ్మీర్లో కర్ఫ్యూ 77వ రోజుకు చేరింది. వేర్పాటువాదుల ఆందోళనల నేపథ్యంలో శ్రీనగర్‌లో కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అనంతనాగ్, షోపియాన్, పుల్వామా, కుల్గామ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉన్నాయన్నారు. -
మా పర్యవేక్షణ ఎల్‌వోసీకే పరిమితం: యూఎన్
కశ్మీర్‌లోని పరిస్థితుల పర్యవేక్షణను భారత్, పాక్‌లలోని తమ సైనిక పరిశీలక బృందం (యూఎన్‌ఎంవోజీఐపీ) కొనసాగిస్తుందని తొలుత ప్రకటించిన ఐక్యరాజ్య సమితి.. దాన్ని సవరిస్తూ మరో ప్రకటన చేసింది. తమ పర్యవేక్షణ నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వరకే పరిమితమని స్పష్టం చేసింది. యూఎన్‌ఎంవోజీఐపీ ద్వారా కశ్మీర్లో తమ పర్యవేక్షణ కొనసాగిస్తామని బాన్ కీ మూన్ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హాక్ మంగళవారం విలేకరులతో వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజర్రిక్.. తమ పర్యవేక్షణ ఎల్వోసీ వరకే పరిమితమని స్పష్టం చేశారు. ‘నియంత్రణ రేఖ వెంబడి జరగుతున్న కాల్పుల విరమణపై నివేదించడమే యూఎన్‌ఎంవోజీఐపీ పని. కశ్మీర్లో జరుగుతున్న ఘటనలు భారత్ అంతర్గత వ్యవహరానికి సంబంధించినవి. అవి యూఎన్‌ఎంవోజీఐపీ పరిధిలోకి రావు. ఎల్వోసీ వెంబడి జరిగే ఘటనలను గమనించడం, నివేదించడమే దాని పని. అంతేకాని జమ్యూకశ్మీర్ పరిస్థితిని పర్యవేక్షించడం కాదు’ అని స్పష్టం చేశారు. -
ఇదిగో భారత్.. అదిగో పాక్..
సార్క్ సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం పాకిస్థాన్ కు వెళ్లనున్నారు. ఆయన రాకను అక్కడి సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్ నాథ్ ను పాక్ లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించాయి కూడా. ఇటీవల కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనలకు మద్దతుగా పాకిస్థాన్ లోనూ రాజకీయాలు వేడెక్కాయి. ఉగ్రవాద సంస్థల నాయకులు ఏకంగా సరిహద్దుల్లోనే బైఠాయింపునకు దిగారు. భారత్ తో సరిహద్దును పంచుకుంటున్న అన్ని దేశాల కంటే పాకిస్థాన్ తోనే మనకు అనేక సమస్యలు! ఇరుదేశాల మధ్య ఇప్పటికే మూడు పెద్ద, ఒక చిన్న యుద్ధాలు జరిగాయన్న సంగతి తెలిసిందే. ఈశాన్యంలో బంగ్లాదేశ్.. ఉత్తరాన చైనా.. దక్షిణాన హిందూ మహాసముద్ర ద్వీపదేశం శ్రీలంక.. ఇలా భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటున్న దేశాలన్నీ ఏదోఒక సందర్భంలో మనతో కయ్యానికి దిగినవే. వాయువ్యంలోని పాకిస్థాన్ సంగతి సరాసరే! నిత్యం ఉద్రిక్తవాతావరణాలతో ఇండో-పాక్ సరిహద్దు 'ప్రపంచంలోని కల్లోల సరిహద్దుల్లో' ఒకటిగా నిలిచింది. సమస్యల సంగతి కాసేపు పక్కనపెడితే దాయాది దేశంతో మనది చారిత్రక బంధం! 1947లో దేశ విభజన, భారత్- పాక్ ల మధ్య 2,900 కిలోమీటర్ల సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు ఏర్పడింది. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ వోసీ)గా పిలిచే ఈ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చాలా చోట్ల ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. కొన్ని చోట్ల సాయుధులు పహారా కాస్తుంటారు. ఎల్ వోసీ వద్ద ఇరుదేశాలు కలిపి దాదాపు 50వేల స్తంభాలు, 1.5 లక్షల ఫ్లడ్ టైట్లు ఏర్పాటుచేశారు. రాత్రిపూట ఆ ఫ్లడ్ లైట్ల కాంతి అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మధ్య నాసా ఉపగ్రహం తీసిన భారత్- పాక్ సరిహద్దు ఫొటోల్లో ఆ వెలుగు స్పష్టంగా కనిపించింది. సరిహద్దుల్లోని విభిన్న ప్రాంతాల అరుదైన ఫొటోలు కొన్ని మీకోసం.. 1. నీలం నదికి అటూఇటూ చీలిపోయిన కేరన్ గ్రామం. 2. ఇరుదేశాలను వేరు చేసే చకోటి నది. 3. పిక్నిక్ కు వెళ్లినట్లుగా ప్రజలు నిల్చున్న ఈ చోటు చలియానా లోయలోని అంతర్జాతీయ సరిహద్దు. నీలం ప్రవాహనికి అటుఇటుగా చీలిపోయిన చలియానా గ్రమస్తులు ఒడ్డున నలబడి అరుపులతో సంభాషించుకుంటారు. 4. లల్హూన్- గోవిందీ రోడ్డుకు ఇటు ఇండియా, అటు పాక్. 5. ప్రఖ్యాత వాఘా సరిహద్దు. వాఘా గ్రామం నుంచి అటు 15 కిలోమీటర్లదూరంలో లాహోర్, ఇటు 32 కిలోమీటర్ల దూరంలో అమృత్ సర్ పట్టణాలున్నాయి. 6. సుచేత్ ఘర్ (కశ్మీర్)లోని జీరో లైన్ 7. పంజాబ్ లోని కౌసర్ జిల్లా గుండాసింగ్ వాలా సరిహద్దు. 8. చకోటి నదిపై నిర్మించిన అంతర్జాతీయ వారధి. 9. పాక్ పంజాబ్ లోని సియాల్ కోట్ అంతర్జాతీయ సరిహద్దు. 10. నాసా ఉపగ్రహం పై నుంచి తీసిన భారత్-పాక్ సరిహద్దు ఫొటో. -
పాక్ సరిహద్దులో హఫీజ్ తనయుడి కలకలం
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ తనయుడు తల్హా సయూద్.. భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో కలకలం సృష్టించాడు. భారీ ట్రక్కుల నిండా ఆహార పదార్థాలు, వైద్య సామాగ్రిని తీసుకొచ్చి.. వాటిని కశ్మీర్ కు పంపాలని, అప్పటివరకు తాను కదలబోనని చికోటిలోని లైన్ ఆఫ్ కంట్రోల్ (నియంత్రణ రేఖ) చెక్ పాయింట్ వద్ద బైఠాయించాడు. తండ్రిలాగే ఇస్లామిక్ ప్రొఫెసర్ అయిన తల్హా సయీద్.. జమాత్ ఉల్ దవా సోదర సంస్థ ఫలె-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. 10 ట్రక్కుల్లో పెద్ద ఎత్తున సామాగ్రిని నింపుకొని మంగళవారం సాయంత్రం చికోటి వద్దకు చేరుకున్న తల్హా.. అనుచరులతో కలిసి భారత్ లోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశాడు. పాక్ భద్రతాబలగాలు, పోలీసులు అడ్డుకోవడంతో చికోటిలోనే బైఠాయింపునకు దిగాడు. బుధవారం కూడా వారి నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సార్క్ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారమే పాకిస్థాన్ కు వెళ్లనున్నారు. ఆయను పాక్ లో అడుగుపెట్టనివ్వబోమని ఉగ్రసంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటు భారత్ బలగాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తర్వాత కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనల్లో దాదాపు 50 మంది పౌరులు చనిపోవడం, 2,500 మంది గాయపడటం తెలిసిందే. భారత్ లో జరుగుతున్న ఆందోళనలను అనుకూలంగా తీసుకుని, కశ్మీర్ కు వైద్య బృందాన్ని జమాత్ ఉల్ దవా ప్రయత్నించింది. వారికి భారత్ వీసా నిరాకరించడంతో.. ఇప్పుడు హఫీజ్ కొడుకు తల్హా రంగంలోకిదిగాడు. సోదర కశ్మీరీలకు చేరేలా వైద్య సామాగ్రిని భారత్ లోకి పంపేవరకు చకోటీలోనే బైఠాయిస్తానని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్హా చెప్పాడు. -
ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది, జవాను మృతి
శ్రీనగర్: జమ్మాకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవానుతో పాటు ఉగ్రవాది మృతి చెందగా, మరో ముగ్గురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. మచిల్ సెక్టార్ వెంబడి ఉన్న సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆయుధాలతో అక్రమంగా చొరబడుతున్నారనే సమాచారంతో రాష్ట్రీయ రైఫిల్ 56 బెటాలియన్ కూంబింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్మీ జవాన్లకు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్లు ఆర్మీ అధికారి తెలిపారు. ఈ కాల్పుల్లో జవానుతో పాటు ఉగ్రవాది మృతి చెందగా, ముగ్గురు జవాన్లు గాయపడినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో అయిదుగురు ఆర్ఆర్ జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే. శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. -
అధీన రేఖవద్ద హైఅలర్ట్, తీవ్రవాదులకోసం జల్లెడ!
జమ్మూః శ్రీనగర్ సిటీలో సోమవారం ఉదయం జరిగిన ఉగ్రదాడి తమ పనేనంటూ తీవ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిదీన్ ప్రకటించడంతో వారికోసం సైన్యం జల్లెడ పడుతోంది. జడిబల్ పోలీసు స్టేషన్ పై ఉదయం జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పోలీసులు మృతి చెందడంతో సైన్యం అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ వెంబడి హై అలర్ట్ ప్రకటించింది. మెహబూబా ముఫ్తి సారధ్యంలోని పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి వేర్పాటువాద గెరిల్లా దాడి జరిగింది. పాకిస్తాన్ మద్దతుతో అక్కడే శిక్షణ పొందిన ఉగ్రవాదులు సరిహద్దులగుండా భారత్ లోకి చొరబడేందుకు చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో సైన్యం నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది. భారీగా సాయుధ తీవ్రవాదులు జడిబల్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మరణించినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఏఎస్ఐ అహ్మద్, కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ లు దాడిలో అక్కడికక్కడే మరణించగా.. మరో పోలీసు తీవ్రంగా గాయపడి, అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులు చెప్తున్నాయి. అయితే ఇటువంటి ఉగ్రదాడులపై ఆర్మీ, పోలీసులు, ఇతర ఏజెన్సీలు దృష్టి సారించాయని టెర్రరిస్టులను ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టేది లేదని జీవోసీ అధికారి సతీష్ దువా తెలిపారు. ఇటువంటి దాడులను ఎదుర్కొనేందుకు ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిద్ధంగా ఉన్నాయన్నారు. -
ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపిన సైన్యం
జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్-లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు గురువారం ప్రయత్నించారు. ఆ విషయన్ని గమనించిన భారత సైన్యం వెంటనే అప్రమత్తమైంది. దీంతో సదరు ఉగ్రవాదులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఈ మేరకు భారత సైన్యానికి చెందిన ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. -
'పాకిస్థాన్ కు స్నేహపూర్వక హస్తం'
జమ్మూ: పాకిస్థాన్, చైనా దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. తాము ఎల్లప్పుడూ పాకిస్థాన్ కు స్నేహపూర్వక హస్తం అందిస్తున్నామని చెప్పారు. దీన్ని పాకిస్థాన్ అందిపుచ్చుకుని చర్యలు చేపట్టాలని కోరారు. సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించేందుకు సోమవారం ఆయన జమ్మూకశ్మీర్ కు వచ్చారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుండడంతో రాజ్ నాథ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
సరిహద్దులో కాల్పుల మోత
శ్రీనగర్: భారత్- పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రద్దయిన తర్వాత కొద్దిరోజుల విరామం అనంతరం పాక్ రేంజర్లు మళ్లీ రెచ్చిపోయారు. కశ్మీర్ సరిహద్దులోని పూంఛ్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి నిర్విరామంగా కాల్పులు జరుపుతున్నారు. సోమవారం ఉదయం వరకు తుపాకుల మోత కోనసాగుతూనే ఉన్నది. బీఎస్ఎఫ్ జవాన్లు కూడా ఎదురుకాల్పులతో పాక్ బలగాలకు బుద్ధిచెప్పేపనిలో ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
పేట్రేగిన పాక్ రేంజర్లు
- సరిహద్దు సమీప భారత గ్రామాలపై కాల్పులు - ముగ్గురు పౌరుల మృతి, 16 మందికిపైగా తీవ్ర గాయాలు శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలోతొక్కిన పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. జమ్ముకశ్మీర్ లోని ఆర్ఎస్ పురా సెక్టార్ లో శుక్రవారం తెల్లవారజామున కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పుల్లో ముగ్గురు భారతీయ పౌరులు చనిపోగా, 16 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మరింత అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు పాక్ కు బుద్ధి చెప్పేపనిలో ఉన్నాయి. గురువారం పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాన్ చనిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్ లో మారణహోమం సృష్టించేందుకు గురువారం సరిహద్దు దాటి కశ్మీర్ లోకి ప్రవేశించిన నలుగురు పాక్ ఉగ్రవాదుల్లో ఒకరిని భారత సైన్యం సజీవంగా పట్టుకుంది. -
'హద్దు'లేని పాకిస్థాన్ కాల్పులు
జమ్మూ: ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా పాకిస్థాన్ వైఖరిలో మార్పు రావడం లేదు. దాయాది దేశం కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. 'హద్దు' మీరి కవ్వింపులకు పాల్పడుతోంది. సరిహద్దు వెంబడి కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలోని సాజియాన్, మండీ సెక్టార్లపై పాకిస్థాన్ బలగాలు కాల్పులకు దిగాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి కాల్పులు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కాల్పులు సాగించిందని భారత రక్షణశాఖ ప్రతినిధి కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. 120, 80 ఎంఎం మోర్టార్లు, భారీ మెషీన్ గన్లతో దాడికి దిగిందని వెల్లడించారు. పాక్ బలగాల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. మన సైనికులు ఎవరూ గాయపడలేదని చెప్పారు. సరిహద్దు వెంబడి శని, ఆదివారాల్లో పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు భారత పౌరులు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా, పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్ మండిపడింది. విదేశాంగ శాఖ కార్యదర్శి(తూర్పు) అనిల్ వాధ్వా.. ఆదివారం ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించుకుని తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తం చేశారు. -
మరోసారి దాడికి తెగబడ్డ ఉగ్రవాదులు: జవాన్ మృతి
శ్రీనగర్: గడిచిన రెండు నెలలుగా తరచూ దాడులకు దిగుతున్న ఉగ్రవాద మూకలు మరోసారి పేట్రేగిపోయాయి. ఆదివారం ఉదయం కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖకు సమీపంలోని తంగ్ధర్ సెక్టార్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రమూకల ప్రవేశాన్ని అడ్డుకునే క్రమంలో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయాడని, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని ఆర్మీ అధికారులు చెప్పారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనేఉన్నాయని పేర్కొన్నారు. -
పాక్ దుస్సాహసం
శ్రీనగర్: పాకిస్థాన్ సైన్యం మరోదుస్సాహసానికి ఒడిగట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలోతొక్కి సరిహద్దు వెంబడి ఉన్న ఆరు ఔట్ పోస్టులపై మోర్టార్ షెల్స్, తుపాకి గుండ్ల వర్షం కురిపించింది. దీనికి బీఎస్ఎఫ్ కూడా ధీటుగా జవాబు చెప్పింది. కాగా, ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని నోవ్‌గావ్ సెక్టార్లో పాక్ సైన్యం కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ మృతిచెందాడు.మరణించిన జవాన్ అభిజీత్ నంద్యా 119వ బెటాలియన్ కు చెందినవాడని ఉన్నతాధికారులు చెప్పారు. -
ఐదుగురు చొరబాటుదారుల హతం: జవాన్ మృతి
శ్రీనగర్: బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం రాత్రి భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. ఈ ఘటనలో ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం నుంచే భారీగా ఆయుధాలు కలిగిన ముష్కర బృందం భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిదని, సైన్యం కాల్పుల్లో ఐదుగురు మరణించగా మరికొందరు పలాయనం చిత్తగించారని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. -
ఎల్వోసీ వద్ద కాల్పులు: ఇద్దరు ఉగ్రవాదుల హతం
బారాముల్లా: భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో శనివారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి. బారాముల్లా సరిహద్దు నుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఎల్వోసీ వద్ద హోరాహోరీ
చొరబాటుదారులు, భారత సైన్యానికి మధ్య ఎదురు కాల్పులతో కశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భారీగా ఆయుధాలు కలిగిన ఓ ముష్కరు బృందం ఆదివారం ఉదయం కశ్మీర్ కుప్వారా జిల్లాలోని తగ్ధార్ సెక్టార్ వద్ద ఎల్వోసీ దాటి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించింది. వీరిని గుర్తించి హెచ్చరికలు చేసిన భారత సైన్యంపైకి ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో సైన్యం కూడా వారికి ధీటుగా సమాధానమిచ్చేందుకు ప్రయత్నించింది. కడపటి వార్తలు అందేవరకు కూడా హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
కాల్పుల విరమణపై మళ్లీ తూటా
-
కవ్వింపులకు దిగిన పాకిస్థాన్
జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు వద్ద కవ్వింపులకు దిగింది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లాల్లో భారత్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగింది. ఎల్ ఓసీ వద్ద సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బాలకోట్ సెక్టార్ లో పాకిస్థాన్ బలగాలు కవ్వింపు కాల్పులకు దిగాయని రక్షణశాఖ ప్రతినిధి కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. పాక్ కాల్పులకు భారత సైనికులు దీటుగా స్పందించారని వెల్లడించారు. 8.10 గంటలకు వరకు కాల్పులు కొనసాగాయి. ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. -
బంకర్ కు నిప్పంటుకుని సైనికుడు మృతి
శ్రీనగర్: నియంత్రణ రేఖ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఓ సైనికుడు చనిపోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన జమ్మూ, కాశ్మీర్ లోని కుప్వారా వద్ద జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. తూట్ మార్ గలి ప్రాంతంలోని నవ్ గాం సెక్టర్ లోని నియంత్రణ రేఖ వద్ద బంకర్ కు నిప్పంటుకోవడంతో జాట్ రెజిమెంట్ కు చెందిన భారత సైనికుడు, మరో ఇద్దరు మరణించారని అధికారి తెలిపారు. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగినపుడు బంకర్ లో కిరోసిన్, కోక్ హీటర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. -
ఆర్మీ దాడిలో నలుగురు మిలిటెంట్లు మృతి
శ్రీనగర్:భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద చొరబడేందుకు యత్నించిన నలుగురు మిలిటెంట్లను హతమార్చినట్లు భద్రతా దళాలు స్పష్టం చేశాయి. తంగథర్ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో మిలిటెంట్లు చొరబాటుకు యత్నించే క్రమంలో భారత జవాన్లు వారిని తిప్పికొట్టారని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. శనివారం ఉదయం ఆర్మీకి సవాల్ విసిరిన మిలిటెంట్లు ఒక్కసారిగా కాల్పులకు ఒడిగట్టారు. ఈ క్రమంలోనే భారత జవాన్లు ఎదురుదాడి చేసి నలుగురు మిలిటెంట్లను హతమార్చారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఆర్మీ దళాలు వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న సమయంలో మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారన్నారు. దాదాపు 15 మంది మిలిటెంట్లు జవాన్లపైకి కాల్పులు జరిపారని.. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను బంధించడంతో మిగతా మిలిటెంట్లు తప్పించుకోలేరని పోలీస్ అధికారి తెలిపారు. -
సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత, పాక్ జవాన్లు!
జమ్మూ: పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా జమ్మూ,కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణారేఖ వద్ద పాక్, భారత జవాన్లు స్వీట్లు పంచుకుని సామరస్యాన్ని చాటారు. కాల్పుల ఒప్పంద నిబంధనల్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఆరోపణలు వచ్చిన 24 గంటల్లోనే ఈ ఘటన ఇరుదేశాల జవాన్ల మధ్య చోటుచేసుకోవడం అందర్ని ఆకట్టుకుంది. నియంత్రణారేఖ సమీపంలోని చకన్ దా బాగ్, హాట్ స్పింగ్ మెందార్ పాయింట్ల వద్ద ఇరుదేశాలకు చెందిన జవాన్తు గురువారం రాత్రి స్వీట్లు పంచుకున్నట్టు సైనికాధికారి వెల్లడించారు. నియంత్రణా రేఖ వద్ద సామరస్యం నెలకొనాలని ఇరుదేశాల అధికారులు అశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు రోజుల్లో హమీర్ పూర్, బాలకోటే ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పూంచ్ జిల్లా పోలీసులు తెలిపారు. -
పాక్ సరిహద్దులో సైన్యంతో సురేష్ రైనా!
శ్రీనగర్: పొరుగు దేశ సైన్యం దాడులను తిప్పుకొడుతూ.. దేశానికి రక్షణగా నిలిచిన సైనికుల్లో మనోధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు జమ్మూ,కాశ్మీర్ లోని సైనిక శిబిరాలను ఆదివారం భారత క్రికెటర్ సురేశ్ రైనా సందర్శించారు. కాశ్మీర్ లోని ఎల్ ఓసీ (నియంత్రణ రేఖ) సమీపంలోని ఫార్వర్డ్ పోస్ట్ ను సురేష్ రైనా సందర్శించారు. కాశ్మీర్ సరిహద్దులోని అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో నియమించిన సైనికుల్లో మానసిక ధైర్యాన్ని రైనా నింపారని కల్నల్ ఎన్ఎన్ జోషి మీడియాకు తెలిపారు. నియంత్రణారేఖ వద్ద సైనికులు ఎదుర్కొంటున్న సవాళ్లను రైనా అడిగి తెలుసుకున్నారు. ఎల్ ఓసి వద్ద భారత సైనికులు చేస్తున్న సేవను రైనా కొనియాడారు. సైనికులతో తన వ్యక్తిగత అనుభవాల్ని, ఆనందకరమైన అనుభవాలను సైనికులతో పంచుకోవడమే కాకుండా వారితో భోజనం కూడా చేశారు. కాశ్మీరి పండితుల కుటుంబానికి చెందిన రైనా కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా నివాసి. దేశీయ క్రికెట్ లో రంజీ ట్రోఫి పోటీలలో రైనా జమ్మూ, కాశ్మీర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. -
ఎల్ఓసీ వద్ద కాల్పులు
రక్షణమంత్రి జైట్లీ కాశ్మీర్ పర్యటన ముందు కాల్పుల విరమణ ఉల్లంఘన జమ్మూ/న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ) వద్ద పాకిస్థాన్ సైనిక బలగాలు శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. భారత సైనిక బలగాలపై భారీ స్థాయిలో కాల్పులకు పాల్పడ్డాయి. మోర్టార్ షెల్లింగ్ జరిపాయి. వీటిని తిప్పికొట్టేందుకు భారత బలగాలు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఎల్ఓసీ వెంట మెంధార్ - భీమ్బేర్గాలి - కేరి క్షేత్రాల్లో శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో భారత సైనిక శిబిరాలపై పాక్ బలగాలు 81 మిల్లీమీటర్ల మోర్టార్ షెల్స్, ఆటోమేటిక్, చిన్నతరహా ఆయుధాలతో కాల్పులు జరిపాయి. పూంచ్ సెక్టార్‌లోని తార్కుండి వద్ద ఎల్ఓసీ సమీపంలో గురువారం బాంబు విస్ఫోటనంలో ఒక భారత జవాను మరణించగా మరో ముగ్గురు జవాన్లు గాయపడిన ఘటన మరుసటి రోజు ఈ కాల్పుల ఉల్లంఘన చోటు చేసుకోవటం గమనార్హం. మరోవైపు.. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆ దేశ సైనికాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ భారత్ ఎలాంటి కవ్వింపు చర్యా లేకుండానే ఎల్ఓసీ వద్ద పాక్ దళాలపై కాల్పులు జరిపిందని, ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారని పేర్కొన్నారు. భారత బలగాల కాల్పులను పాక్ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని ఆయన వ్యాఖ్యానించారు. రక్షణ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన అరుణ్‌జైట్లీ.. ఆ హోదాలో తొలిసారి శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆ ముందు రోజు పాక్ దళాలు కాల్పులకు తెగబడటాన్ని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్అబ్దుల్లా ప్రశ్నించారు. సరిహద్దులో శాంతి అవసరం: భారత్ ‘‘భారత్ - పాకిస్థాన్‌ల మధ్య లేఖా దౌత్యం, సరిహద్దు వెంట శాలువాలు, చీరలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటం అంతా మంచిదే! కానీ.. రెండు దేశాల మధ్య శాంతియుత, సుహృద్భావ సంబంధాలు.. చర్చల పునరుద్ధరణకు.. సరిహద్దులో శాంతి, ప్రశాంతత అనేవి అత్యంత అవసరం’’ అని భారత్ స్పష్టంచేసింది. ఎల్ఓసీ వద్ద శుక్రవారం పాక్ కాల్పుల ఉల్లంఘన ఘటన నేపథ్యంలో భారత విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. పాక్‌తో సుహృద్భావ సంబంధాలు, చర్చల పునరుద్ధరణకు.. సరిహద్దులో శాంతి నెలకొల్పటం ముందస్తుగా చేయాల్సిన పని అని ఆమె స్పష్టంచేశారు. మోడీతో ఆర్మీ చీఫ్ సుదీర్ఘ భేటీ కాశ్మీర్లో ఎల్ఓసీ వద్ద పాక్ కాల్పుల ఉల్లంఘన నేపధ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమై.. భద్రతా పరిస్థితులు, సైనిక బలగాల సంసిద్ధత గురించి వివరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:40 గంటల వరకూ సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, రక్షణ శాఖ సహాయమంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్, కాబోయే ఆర్మీ చీఫ్, ప్రస్తుత వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్లు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో విస్తృత స్థాయి సమీక్ష జరిగిందని.. సరిహద్దు భద్రత, అంతర్గత భద్రతతో పాటు.. భవిష్యత్ సవాళ్లపైనా చర్చించారని సైన్యం తెలిపింది. -
మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
ఇటీవల భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఆ ఇద్దరు ప్రధానిల మధ్య జరిగిన చర్చలతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంటుందని ఇరుదేశాల దేశాలు భావించాయి. అలాంటి తరుణంలో పాకిస్థాన్ సైనికులు మరోసారి తమ తెంపరితనాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఇరుదేశాల సరిహద్దుల్లోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఎల్ఓసీ వెంబడి ఉన్న రాజోరి, పూంచ్ జిల్లాలపైకి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ ప్రాంతంలో ఉన్న భారత భద్రత దళాలు వెంటనే అప్రమత్తమైయ్యాయి. పాక్ సైనికులు కాల్పులకు ప్రతిగా భారత్ దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. పాక్ సైనికులు కాల్పులకు ప్రతిగా భారత్ దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. అయితే పాక్ సైన్యం జరిపిన కాల్పులలో ఓ భారత్ జవాన్ మృతి చెందగా, మరో ముగ్గురు సైనికులు మరణించినట్లు సమాచారం. శుక్రవారం పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో రాజోరి, పూంచ్ జిల్లాలోని జనావాసాలపైకి బుల్లెట్లు దూసుకువచ్చాయని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఆ బుల్లెట్లకు పెంపుడు జంతువులు బలైయ్యాయని శుక్రవారం ఒమర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఇద్దరు సీనియర్లను కాల్చి చంపి..సైనికుడి ఆత్మహత్య
పూంచ్: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఒక సైనికుడు తన సీనియర్లు ఇద్దరిని కాల్చి చంపి, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్దనున్న సైనిక స్థావరంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.15 గంటలకు ఈ సంఘటన జరిగింది. సిపాయి దర్శన్‌లాల్ తొలుత తన సీనియర్ హవల్దార్ రంజోత్ సింగ్‌తో గొడవపడి, అతడిపై కాల్పులు జరిపాడు. అక్కడే ఉన్న జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సుబేదార్ చెమైల్ సింగ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతడిపైనా కాల్పులు జరిపాడు. తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ సంఘటనపై సైన్యం కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీకి ఆదేశించినట్లు సైనిక ప్రతినిధి ఒకరు చెప్పారు. -
సరిహద్దు దాటి వస్తే కాల్చిపారేస్తాం: ఆర్మీ చీఫ్
ఏ ఉగ్రవాది అయినా సరే.. జమ్ము కాశ్మీర్ వద్ద నియంత్రణ రేఖను దాటి వచ్చాడంటే వెంటనే కాల్చిపారేస్తామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించి నియంత్రణ రేఖ వద్ద ఓ పౌరుడిపై కాల్పులు జరిపిందంటూ పాకిస్థానీ మీడియా గోల పెట్టడంతో ఆయనీ ప్రకటన చేశారు. 'ఎల్ఓసీని దాటి వచ్చే ఏ ఉగ్రవాదిమీద అయినా కాల్పులు జరిపి తీరుతాం' అని ఆయన స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరుపక్షాలూ గౌరవించేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నామే గానీ పెంచి పోషించాలని మాత్రం అనుకోవడం లేదని అన్నారు. పొరుగువారు నిబంధనలు పాటిస్తే తాము కూడా పాటిస్తామని, వాళ్లు ఉల్లంఘిస్తే తాము కూడా ఉల్లంఘించి తీరుతామని విక్రమ్ సింగ్ చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల రాకను అడ్డుకోడానికే తాము కాల్పులు జరుపుతున్నాం తప్ప పౌరుల మీద కాదని జనరల్ అన్నారు. డిసెంబర్ నెలలో ఇరుదేశాల డీజీఎంఓల సమావేశం తర్వాతి నుంచి కాల్పుల విరమణ ఉల్లంఘనలు గణనీయంగా తగ్గాయన్నారు. -
పాక్ మళ్లీ కాల్పుల ఉల్లంఘన : ఆర్మీ అధికారి మృతి
శ్రీనగర్ : భారత్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. కాశ్మీర్‌లోని యురి సెక్టార్లో పాక్ సైన్యం కాల్పుల్లో భారత్ సైనిక అధికారి మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్తాన్‌కు పరిపాటిగా మారిపోయింది. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఎలాంటి కాల్పులు ఉండకూడదంటూ 2003 నవంబర్ నెలలో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం ఒకటి కుదిరింది. అయితే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండానే పాక్ దళాలు పదే పదే కాల్పులకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వద్ద, జమ్ము కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ దళాలు కాల్పులకు పాల్పడుతున్నట్లు భారత నిఘా సంస్థలు చెబుతున్నాయి. -
దైవాధీనరేఖ...!
‘పుట్టుకతో వచ్చిన బుద్ధి’ని ఓ పట్టాన వ దులుకోలేనని పాకిస్థాన్ నిరూపించుకుంటూనే ఉంది. అధీనరేఖ వద్ద గత పక్షం రోజులుగా వరసబెట్టి చోటుచేసుకుంటున్న ఘటనలకు పరాకాష్టగా ఆదివారం భారీయెత్తున ఆయుధాలు, మందుగుండు పట్టుబట్టాయి. అందులో ఏడు ఏకే-47 రైఫిళ్లు, 10 పిస్టల్స్, గ్రెనేడ్లు, రేడియోసెట్లు ఉన్నాయి. గత నెల 24 నుంచి ఆ సెక్టార్లో 30, 40 మంది మిలిటెంట్లు కాశ్మీర్లో చొరబడటానికి ప్రయత్నించారని మన సైన్యం చెబుతున్న వివరాలనుబట్టి తెలుస్తోంది. 1999లో జరిగిన కార్గిల్ చొరబాట్లను గుర్తుకుతెచ్చేలా ఇవి చోటుచేసుకున్నాయన్నది సైన్యం విశ్లేషణ. ఒకపక్క సెప్టెంబర్ 29న ప్రధాని మన్మోహన్సింగ్, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. ఆ సమావేశానికి చాలా ముందే ఆ సమావేశాన్ని భగ్నంచేసే ఉద్దేశంతో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటం, మిలిటెంట్ల చొరబాటును ప్రోత్సహించడం ముమ్మరం చేసింది. వారిద్దరి సమావేశంలో ఇవన్నీ చర్చకొచ్చాయి. ఇలాంటి ఘటనలను నివారిస్తే తప్ప ఇరుదేశాలమధ్యా సామరస్యపూర్వక సంబంధాలు నెలకొనే అవకాశం లేదని మన్మోహన్సింగ్ చెప్పారు. ఈ తరహా ఉల్లంఘనలను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవడానికి ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరళ్ల (డీజీఎంఓ) సమావేశం జరగాలని నిర్ణయించారు కూడా. చర్చలు ముగిశాయి. ఆ సమావేశం ఎప్పుడు జరగాలన్న అంశంపై రెండుదేశాలూ ఇంకా సంప్రదించుకుంటున్నాయి. కానీ, దానికి సమాంతరంగా సరిహద్దుల్లో ఉల్లంఘనలు సాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధీనరేఖలోని పూంఛ్ సెక్టార్లో ఇవి ఈమధ్య కాలంలో బాగా పెరిగాయి. ఇప్పుడు సాగుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘన ఉద్దేశం ఉగ్రవాదులను భారత్‌లోకి ప్రవేశపెట్టడమేనని మన సైన్యం చెబుతున్నది. సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం ఉంటే ప్రత్యేకించి డీజీఎంఓల సమావేశమే జరగనవసరం లేదు. మన డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా, పాకిస్థాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ అమీర్ రియాజ్‌లు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలా మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని గత జనవరినుంచి పాకిస్థాన్ కల్పిస్తూనే ఉంది. ఇద్దరు భారత జవాన్ల తలలు నరికినప్పటినుంచి సరిహద్దులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. అప్పటినుంచీ ఒక్క పూంఛ్ సెక్టార్లోనే తరచు ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్క ఆగస్టులోనే అక్కడ 32 ఉల్లంఘనలు జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. సెక్టార్లవారీగా చూస్తే సెప్టెంబర్ నెలలో పూంఛ్‌లో 20, రాజౌరిలో 11, బాండీపూరాలో 3 ఉల్లంఘనలు జరిగాయి. సరిగ్గా ఇరుదేశాల ప్రధానులూ సమావేశం కావడానికి మూడురోజుల ముందు జమ్మూ సెక్టార్‌లోని రెండు జిల్లాల్లో ఉగ్రవాదులు రెండుచోట్ల దాడిచేసి ఆరుగురు పోలీసులు, నలుగురు జవాన్లతోసహా 12 మందిని కాల్చిచంపారు. మిగిలిన ఘటనలైతే కట్టుకథలని పాక్ కొట్టిపారేయొచ్చుగానీ జమ్మూ సెక్టార్‌లోనూ, కేరన్లోనూ జరిగినవి చొరబాట్లేనని స్పష్టంగా రుజువవుతున్నది. ఉగ్రవాదులను దేశంలోకి ప్రవేశపెట్టి విధ్వంసాలను ప్రేరేపించడమే వాటి లక్ష్యం. అయితే, ఇలాంటి చొరబాట్లుగానీ, అతిక్రమణలుగానీ లేనేలేవని పాకిస్థాన్ హైకమిషనర్ సల్మాన్ బషీర్ అంటున్నారు. ఇదంతా మీడియా చేస్తున్న అనవసర రాద్ధాంతంగా ఆయన తేల్చేశారు. రెండు దేశాలూ తమ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి విస్తృతస్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. న్యూయార్క్‌లో ఇరుదేశాల ప్రధానులు చర్చలకు కూర్చోవడానికి ముందు సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటనలు ఎంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించాయో అందరూ చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకు మన్మోహన్ వెళ్లకూడదని ఒత్తిళ్లు వచ్చాయి. అయినా, మన్మోహన్ పాకిస్థాన్‌తో సంబంధాల మెరుగుదలకు ఇవి తప్పనిసరని భావించారు. వీటన్నిటినీ పాకిస్థాన్ పరిగణనలోకి తీసుకుని తనవైపుగా ఉంటున్న లోపాలను సరిదిద్దుకోవాల్సింది. కానీ, అలాంటి ఛాయలెక్కడా కనిపించడంలేదు. ముఖ్యంగా కేరాన్ సెక్టార్లో భారీయెత్తున పట్టుబడిన మారణాయుధాలను చూస్తే భారత్‌తో సత్సంబంధాలు ఏర్పడటం పాకిస్థాన్ సైన్యానికి ఇష్టంలేదనిపిస్తుంది. పాకిస్థాన్ హైకమిషనర్ చెబుతున్న లెక్కలనుబట్టి చూస్తేనే పాకిస్థాన్‌లో గత వంద రోజుల్లో 110 ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ఎందరో పౌరులు ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా. ఈ దాడులను ఎందుకు నిరోధించలేకపోతున్నామో పాక్‌లో ఎంతవరకూ ఆత్మపరిశీలన జరుగుతున్నదో అనుమానమే. అక్కడ జరుగుతున్న ఘటనల్లోనూ, సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటనల్లోనూ మిలిటెంట్లదే కీలకపాత్ర. తాము దేశంలో నిరోధించలేకపోతున్న మిలిటెంట్లే సరిహద్దుల్లోనూ సంచరించగలుగుతున్నారంటే అర్ధం ఏమిటి? దేశంలో అయితే, వారు ఎక్కడెక్కడ మెరుపుదాడులకు దిగుతారో అంచనా ఉండటంలేదను కోవచ్చు. కానీ, సరిహద్దుల్లో అలా కాదు. అక్కడ గస్తీ తిరుగుతున్న సైన్యం తప్ప మరెవరూ ఉండటానికి ఆస్కారంలేదు. తమ సరిహద్దుల్ని రెప్పవాల్చని నిఘాతో రక్షించే సైన్యానికి అటునుంచి భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న మిలిటెంట్లు కనబడటంలేదంటే ఎవరైనా నమ్ముతారా? ఈమధ్య జరిగిన చర్చల్లో తమవైపుగా తప్పులు జరగకుండా చూస్తానని నవాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు. కానీ, ఈ ఘటనలు చూస్తుంటే పాక్ సైన్యం ముందు ఆయన నిస్సహాయుడిగా మిగిలారని... తన హామీలను అమలుచేయించగల స్థితి ఆయనకు లేదని అర్ధమవుతోంది. ప్రధానిగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయంలో ఆయన ప్రేక్షకుడిగా మిగిలిపోవడం విచారకరం. సమస్యలకు పరిష్కారం కనుగొనే విషయాన్ని రాజకీయ నాయకత్వానికి వదలాలని ఆయన తమ సైన్యానికి ఇప్పటికైనా నచ్చజెప్పాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే, సమస్యలు మరింత ముదిరే ప్రమాదం ఉందని గ్రహించాలి. -
మళ్లీ తెగబడిన పాక్ దళాలు.. సరిహద్దు వద్ద కాల్పులు
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సాక్షిగా భారత్ - పాకిస్థాన్ దేశాల ప్రధాన మంత్రులు సమావేశం కావడానికి ఒక్కరోజు ముందు కూడా పాకిస్థాన్ దళాలు తెగబడ్డాయి. నియంత్రణ రేఖ వెంబడి రెండు ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపాయి. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరి జిల్లాలో బీమార్ గలీ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు ఎలాంటి కవ్వింపు లేకుండానే కాల్పులకు పాల్పడినట్లు డిఫెన్స్ ప్రతినిధి కెప్టెన్ ఎస్.ఎన్.ఆచార్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4.45 నుంచి రాత్రి 7.30 వరకు కాల్పులు కొనసాగినట్లు ఆయన చెప్పారు. చిన్న ఆయుధాలు, ఆటోమేటిక్ ఆయుధాలతో వారికి భారత బలగాలు సమాధానమిచ్చాయి. ఆ తర్వాత పూంఛ్ సెక్టార్‌లోకూడా పాక్ దళాలు కాల్పులు జరిపాయి. రాత్రి 10.30 గంటల సమయంలో చిన్న ఆయుధాలు, ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపాయి. అక్కడ ఇరువర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈనెలలో పాక్ దళాలు ఒక్క జమ్ము ప్రాంతంలోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది 30వ సారి!! -
సరిహద్దులో హోరాహోరీ కాల్పులు
పూంచ్: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం ఆదివారం కూడా కాల్పుల విరమణను ఉల్లంఘించింది. మెంధార్ సబ్ సెక్టార్లో మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఆటోమేటిక్, మధ్యరకం మోర్టార్ బాంబులను ప్రయోగించింది. భారత బలగాలు వీటిని గట్టిగా తిప్పికొట్టాయి. ఇరు పక్షాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ప్రాణనష్టం జరిగినట్లు వార్తలేవీ రాలేదని రక్షణ శాఖ ప్రతినిధి ఎస్ఎన్ ఆచార్య తెలిపారు. పాక్ బలగాలు శనివారం అర్ధరాత్రి కూడా పూంచ్‌లోని కృష్ణఘాటీ, బాల్కోట్, హరీర్పూర్ లలో భారత పోస్టులపై కాల్పులు జరిపాయని, తమ బలగాలు దీటుగా స్పందించి తిప్పికొట్టాయన్నారు. మరోపక్క.. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద ఆదివారం వేకువజామున భారీ ఆయుధాలతో భారత్‌లోకి చొరబడేందుకు మిలిటెంట్లు చేసిన యత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఇరు పక్షాల మధ్య మూడు గంటలకు పైగా కాల్పులు జరిగాయి. భారత సైన్యాన్ని ఎదుర్కోలేక మిలిటెంట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి పారిపోయారు. -
పూంఛ్ సెక్టార్లో మళ్లీ పాకిస్థాన్ దళాల కాల్పులు
సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా హెచ్చరించినా, ఏకంగా రాష్ట్రపతే సహనానికి హద్దు ఉంటుందని చెప్పినా పాపిస్థాన్గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకోవట్లేదు. మరోసారి నియంత్రణ రేఖ వద్ద ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపి, రాకెట్లు, మోర్టార్లతో దాడులకు తెగబడింది. దీంతో ముగ్గురు ఆర్మీ జవాన్లు, మరో పౌరుడు గాయపడ్డారు. జమ్ము కాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్లోనే ఇదంతా జరిగింది. గడిచిన ఐదు రోజుల్లో పాకిస్థానీ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది 11వ సారి. పూంఛ్ జిల్లాలోని బాలాకోట్ ప్రాంతంలో ఉదయం 6.30 నుంచి పలు మార్లు భారత భూభాగం వైపు చొచ్చుకొచ్చి కాల్పులు జరిపినట్లు సైనికాధికారులు తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలు, రాకెట్లు, మోర్టార్ షెల్స్‌తో దాడి చేయడంతో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. పర్వైజ్ అనే స్థానికుడు కూడా గాయపడ్డాడు. బసోనియా గ్రామంలో ఓ గోశాల మీద రాకెట్ పడి పేలడంతో దాదాపు 12 ఆవులు చనిపోయాయి. పాకిస్థానీ దళాలు తెల్లవారుజాము నుంచి ఎలాంటి కారణం లేకుండా కాల్పులు జరుపుతూ భారత్‌లోని మెంధార్ సెక్టార్ వైపు చొచ్చుకొచ్చినట్లు జమ్ము రక్షణ శాఖ ప్రతినిధి ఎస్ఎన్ ఆచార్య తెలిపారు. వెంటనే భారత దళాలు భారీ ఆయుధాలతో దీటుగా సమాధానమిచ్చాయని, మధ్యాహ్నం వరకు కాల్పులు కొనసాగాయని ఆయన తెలిపారు. 2003 సంవత్సరంలో భారత్-పాక్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి అర్థం పర్థం లేకుండా పోతోంది. దాదాపు ప్రతిరోజూ ఇరు పక్షాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు 57 సార్లు పాకిస్థానీ దళాలు కాల్పులు జరిపాయి. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది 80 శాతం ఎక్కువని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
కాల్పుల విరమణను మళ్లీ ఉల్లంఘించిన పాక్
జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాకిస్థాన్ బలగాలు మరోసారి భారీ స్థాయిలో కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. ఇదే ప్రాంతంలో ఇటీవల ఐదుగురు భారత సైనికులను మట్టుబెట్టిన పాక్ సైన్యం, శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఎల్ఓసీ వద్ద ఉన్న భారత సైనిక స్థావరాలపై భారీ స్థాయిలో గుళ్ల వర్షం కురిపించింది. మోర్టార్లు సహా భారీ ఆయుధాలతో పాక్ బలగాలు దాదాపు ఏడు గంటల సేపు, ఏడువేల రౌండ్లు కాల్పులు జరిపాయి. భారత సైన్యం కూడా తిరిగి కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. పూంచ్ జిల్లాలోని దుర్గా బెటాలియన్ ప్రాంతంపై శుక్రవారం రాత్రి 10.20 గంటల నుంచి పాక్ సైన్యం కాల్పులు జరిపిందని, భారత సైనికులు దీటుగా బదులు చెప్పారని రక్షణశాఖ ప్రతినిధి ఎస్.ఎన్.ఆచార్య తెలిపారు. -
ఫూంచ్ సెక్టార్లో మరోసారి కాల్పుల ఉల్లంఘన
శ్రీనగర్ : పాకిస్తాన్ మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. జమ్మూ కాశ్మీర్లో శనివారం పాకిస్తాన్ సైన్యం భారత్ జవాన్లపై కాల్పులకు తెగబడింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ భారత్- పాకిస్తాన్ సరిహద్దులోని పూంచ్ సెక్టార్‌లోని పాక్ సైన్యాలు కాల్పులకు మళ్లీ తెగబడ్డాయి. అయితే భారత్ బలగాలు ధీటుగా సమాధానం ఇచ్చారు. పాక్ సైనికుల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను పాకిస్థాన్ పలుమార్లు ఉల్లంఘిస్తూ వస్తోంది. పూంచ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత ఔట్ పోస్టులపై పాక్ కాల్పులకు తెగబడటం పరిపాటిగా మారిపోయింది. గత మంగళవారం పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అయిదుగురు భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలి -
గీత దాటలేదు.. భారత సైనికులను చంపలేదు: పాకిస్థాన్
చేయాల్సిందంతా చేయడం, తర్వాత తమ తప్పేమీ లేదని చెప్పడం.. ఇలాంటివన్నీ పాకిస్థాన్‌కు అలవాటే. అలాగే ఈసారి కూడా ఇదే మాట చెప్పింది. తమ దళాలు అసలు నియంత్రణ రేఖను దాటనే లేదని, భారత సైనికులను హతమార్చలేదని తెలిపింది. అసలు నియంత్రణ రేఖ వద్ద అలాంటి సంఘటన ఏదీ జరగనే లేదని, తమ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని పాక్ సైనికాధికారి ఒకరు తెలిపారు. సుమారు 20 మంది పాకిస్థానీ సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి, సర్లా పోస్టు వద్ద భారత సైనికులపై దాడి చేసి ఐదుగురిని కాల్చి చంపినట్లు భారత రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. మృతులలో 21 బీహార్ యూనిట్‌కు చెందిన ఒక సుబేదార్, నలుగురు జవాన్లు ఉన్నారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నియంత్రణ రేఖకు 450 మీటర్ల దూరంలో సంభవించింది. కాగా, పూంచ్ సెక్టార్లో ఐదుగురు భారత సైనికులను పాకిస్థానీ దళాలు హతమార్చడం దురదృష్టకరమని, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోడానికి ఇది మార్గం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ తెలిపారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈ సంఘటనపై ఈరోజు మధ్యాహ్నం పార్లమెంటులో ఓ ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చలు నిలిపివేసేది లేదని కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ తెలిపారు. మరోవైపు, సైనికులను హతమార్చిన సంఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియ ఆపేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. సరిహద్దుల్లో ఒక్క బుల్లెట్ పేలినా చర్చలు జరపకూడదని, ఒకవైపు మన సైనికులను చంపేస్తూ మరోవైపు చర్చించడం సరికాదని బీజేపీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్ అన్నారు. ఇక ఈ సంఘటన పార్లమెంటును కూడా కుదిపేసింది. లోక్‌సభ సమావేశం కాగానే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, పాకిస్థాన్ దుశ్చర్య అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోనే లేచి నిలబడి, భారత సైనికుల హత్యను లేవనెత్తారు. సమాజ్‌వాదీ అద్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ ఎంపీ శైలేంద్రకుమార్ దీనిపై వాయిదా తీర్మానం లేవనెత్తారు. ఈ గందరగోళంతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది.