వక్రబుద్ధిని పోనిచ్చుకోని పాకిస్తాన్
జమ్మూ: సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ యథేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. సరిహద్దుల్లో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగి కాల్పులకు తెగబడింది. నౌషెరా సెక్టార్‌లోని రాజౌరి వద్ద పాక్‌సైన్యం కాల్పులు
జరిపింది. పాక్ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు రాజౌరి డీసీ వెల్లడించారు. కాగా 56 గంటల్లో పాక్ సైన్యం కాల్పులు జరపడం ఇది నాలుగోసారి. ఈ విషయాన్ని డిఫెన్స్ మినిస్టరీ అధికార ప్రతినిధి లెఫ్ట్‌నెంట్ కల్నర్ మనీశ్ మెహతా తెలిపారు. అయితే పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు చెప్పారు. పాక్ సైన్యం భారీ మోర్టర్‌లను ఉపయోగించినట్లు పేర్కొన్నారు.
ఈ రోజు ఉదయం 7.15 నిమిషాల వద్ద కాల్పులు మొదలైనట్లు మనీశ్ మెహతా పేర్కొన్నారు. కాగా పాక్ కాల్పుల్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడిన విషయం తెలిసిందే. పాక్ కాల్పుల నేపథ్యంలో నౌషెరా సెక్టార్‌లోని 14 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి.