rajouri district
-
కశ్మీర్లో ముగిసిన ఎన్కౌంటర్..
రాజౌరీ/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గురువారం రెండో రోజు కూడా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. బుధవారం ఎన్కౌంటర్ గాయపడిన ఇద్దరు జవాన్లలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని అధికారులు తెలిపారు. దీంతో, ఈ ఎన్కౌంటర్ అసువులు బాసిన జవాన్ల సంఖ్య అయిదుగురుకు చేరుకుంది. బుధవారం చనిపోయిన వారిని కెప్టెన్ ఎంవీ ప్రాంజల్(కర్ణాటక), కెప్టెన్ శుభమ్ గుప్తా(యూపీ), పారా ట్రూపర్ సచిన్ లౌర్(యూపీ), హవల్దార్ అబ్దుల్ మాజిద్(జమ్మూకశ్మీర్)గా గుర్తించారు. గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ధర్మసాల్లోని బాజిమాల్ ప్రాంతంలో బుధవారం ఎన్కౌంటర్ సందర్భంగా ఇద్దరు కెప్టెన్లు సహా నలుగురు జవాన్లు నేలకొరిగారు. మరో ఇద్దరు గాయాలపాలైన విషయం తెలిసిందే. రాత్రి వేళ కాల్పులను నిలిపివేసిన బలగాలు ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశం లేకుండా, అక్కడి దట్టమైన అటవీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో దిగ్బంధించాయి. గురువారం ఉదయం తిరిగి రెండు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ ముగిసినట్లయిందని తెలిపారు. మృతుల్లో ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన పేరుమోసిన ఉగ్రవాది క్వారీగా గుర్తించారు. మందుపాతరలను అమర్చడం, స్నైపర్ కాల్పుల్లోనూ ఇతడు నిపుణుడు. గుహల్లో ఉంటూ ఉగ్ర చర్యలకు పాల్పడుతుంటాడు. పాక్, అఫ్గానిస్తాన్‌లలో ఉగ్ర శిక్షణ పొందిన క్వారీ లష్కరే తోయిబాలో టాప్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. హతమైన మరో ముష్కరుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారీ ఎన్కౌంటర్.. నలుగురు ఆర్మీ అధికారుల మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజౌరి జిల్లాలోని కలకోట్ అడవిలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను తుదముట్టించే క్రమంలో ఇద్దరు ఆర్మీ అధికారులతోపాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ సమచారంతో ఆర్మీ బలగాలు, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసుల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ జరిగింది. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతం గత కొన్నేళ్లుగా వరుస ఎన్కౌంటర్ల జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెర్రరిస్టులకు ఈ అటవీ ప్రాంతాలు స్థావరాలుగా మారాయి. దీంతో ఈ ప్రాంతం భద్రతా దళాలకు సవాలుగా మారింది. గత వారం కూడా రాజౌరీ జిల్లాలో భద్రతాబలగాలకు, ఆర్మీకి మధ్య ఎన్కౌంటర్లో ఓఉగ్రవాది హతమయ్యాడు. బుధాల్ తహసీల్ పరిధిలోని గుల్లెర్-బెహ్రూట్ ప్రాంతంతో సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ కార్డన్ సెర్చ్ సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చదవండి: Air India: టాటా గ్రూప్ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా.. -
‘నాకేమీ వద్దు ప్లీజ్ లే నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు..’
దాల్పట్: ‘‘నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు? నాకేమీ వద్దు. ప్లీజ్.. లే నాన్నా!’’ అంటూ ఓ చిన్నారి.. జవాన్ తండ్రి కోసం కంటతడి పెట్టుకుంది. ఆమె కన్నీరు చూసి అక్కడున్న వారంతా ఆవేదన చెందారు. కాగా, జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఉగ్రదాడుల్లో మృతిచెందిన పారాట్రూపర్ నీలంసింగ్ ముఖాన్ని చేతితో తాకుతూ పదేళ్ల చిన్నారి పావన రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. వివరాల ప్రకారం.. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించారు. మృతిచెందిన వారిలో హవిల్దార్ నీలంసింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నీలంసింగ్ శవపేటిక శనివారం స్వగ్రామం చేరుకుంది. దీంతో, స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నీలంసింగ్కు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. ఇక, నీలంసింగ్ పార్థివ దేహాన్ని చూసి ఆయన కుమార్తె పవనా చిబ్(10).. ‘‘నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు? నాకేమీ వద్దు. ప్లీజ్.. లే నాన్నా!’’ అంటూ కన్నీరుపెట్టింది. పక్కనే నిలుచున్న నీలంసింగ్ భార్య వందన.. భర్త ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని కన్నీరుమున్నీరు అయ్యారు. ఏడేళ్ల కుమారుడు అంకిత్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాగా, వేల మంది సమక్షంలో దలపత్ గ్రామంలో శనివారం నీలంసింగ్ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు.. రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అడవిలో కొంతమంది ఉగ్రవాదులు దాగివున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో అడవిలోని ఓ గుహలో ఉగ్రవాదులు దాగివుండటాన్ని జవాన్లు శుక్రవారం ఉదయం గుర్తించారు. దీంతో సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. జవాన్లపై ఉగ్రవాదులు పేలుడు పదార్థం విసరడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదంపూర్ దవాఖానకు తరలించారు. తీవ్ర గాయాలతో మరో ముగ్గురు దవాఖానలో మరణించారని ఆర్మీ పేర్కొన్నది. Papa aap ku nhai bol rahe, Papa Aap Ku Humain Chor ker jaa rahey hain, 😢😢 Last rites of Martyr Havildar Neelam Singh at his native village in Akhnoor. This bloodshed must stop now. How will this daughter live without her father now? I request the governments of India and… pic.twitter.com/dpLawcSr3Q — Mohammed Hussain (@hussain_hrw) May 7, 2023 ఇది కూడా చదవండి: హింసాకాండలో 54 మంది మృతి.. మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత -
Rajouri: గ్రామస్థుల చేతికే ఆయుధాలు.. కేంద్రం సంచలన నిర్ణయం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరీలో కొద్ది రోజులుగా హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఇళ్లల్లోకి చొరబడి మరీ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కేంద్రం కీలక అడుగు వేసింది. ఇప్పటికే భారీగా పారామిలిటరీ బలగాలను మోహరిస్తుండగా.. తాజాగా గ్రామ పరిరక్షణ బలగాలను పునరుద్ధరిస్తోంది. వారికి ప్రభుత్వమే ఆయుధాలు అందించి గ్రామాల్లో నిఘా వేసేందుకు ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే జిల్లాలో 5,000 మంది స్థానికులు ఆయుధాల కోసం పోలీసుల వద్ద రిజిస్టర్ చేసుకున్నారు. గ్రామ రక్షణ గ్రూప్స్ లేదా వీడీజీగా ఈ నిఘా బలగాలను పిలుస్తారు. గడిచిన రెండు దశాబాద్దాల్లో భారీస్థాయిలో గ్రామ రక్షణ గ్రూప్స్ లేదా కమిటీలను పునరుద్ధరించడం ఇదే తొలిసారి. ఈ గ్రూపుల్లోని ప్రతిఒక్కరికి .303 రైఫిల్, 100 రౌండ్ల తూటాలు అందిస్తారు. అలాగే వారికి ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ కూడా అందించాలని ప్రభుత్వం భవిస్తోంది. ఏమిటీ ఈ గ్రామ రక్షణ కమిటీలు? జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రత పరిరక్షణ పూర్తిగా దెబ్బతిన్న క్రమంలో సుమారు 30 ఏళ్ల క్రితం ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. 1990లో దోడా జిల్లాలో మైనారిటీలపై దాడులు జరిగిన క్రమంలో తొలిసారి వీడీసీలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, ఇతర జిల్లాల ప్రజలకు ఆయుధాలు అందించారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 28000 మంది వీడీసీ సభ్యులు ఉన్నారు. ఇందులో ప్రధానంగా హిందూ, సిక్కు, ముస్లిం వర్గాలకు చెందినవారు ఉన్నారు. అయితే, సాధారణ ప్రజలను రక్షించే బాధ్యతను విస్మరించి, అటువంటి బృందాలకు ఆయుధాలు అందించిన ప్రభుత్వంపై విమర్శలు ఎదురయ్యాయి. ఆ తర్వాత పోలీసు బలగాల ప్రాబల్యం పెరిగిన క్రమంలో ఈ కమిటీల ఉనికి తగ్గిపోయింది. కానీ, ఇటీవలే హిందువులపై ఉగ్రదాడి తర్వాత గ్రామ రక్షణ కమిటీలు తిరిగి పురుడుపోసుకున్నాయి. రాజౌరీ జిల్లాలోని పంచాయతీల్లో ఆయుధాలను తనిఖీ చేసి గ్రామస్థులకు శిక్షణ ఇస్తోంది పోలీసు శాఖ. చాలా కాలం క్రితం కుటుంబంలోని పెద్దలకు, తల్లిదండ్రులకు అందించిన ఆయుధాలను యువకులు చేతబడుతున్నారు. ‘రైఫిల్‌ను శుభ్రం చేసుకునేందుకు నేను ఇక్కడికి వచ్చాను. దీనిని తనిఖీ చేయిస్తున్నా. మాపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నా.’ అని టింకూ రైనా అనే ఓ యువకుడు తెలిపారు. తాను పోలీసు రికార్డుల్లో పేరు నమోదు చేసుకోలేదని, కానీ తన వద్ద .303 రైఫిల్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. జోగిందర్ సింగ్ అనే మరో యువకుడు తన ఇంట్లో వారికి చెందిన రెండు రైఫిల్స్‌ను ఆయుధాల తనిఖీ కేంద్రానికి తీసుకొచ్చారు. తాను వీడీసీ బృందంలో సభ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కొత్త ఆయుధాల అందజేత.. వీడీసీ గ్రూప్ సభ్యులకు కొత్త ఆయుధాలు అందిస్తున్నట్లు చెప్పారు జిల్లా పోలీస్ చీఫ్ మొహమ్మద్ అస్లాం. ఫైరింగ్‌పై శిక్షణ ఇస్తున్నామని, ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. మరోవైపు.. వీడీసీ సభ్యులకు రూ.4000 గౌరవవేతనం ఇస్తామని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇంత వరకు అమలులోకి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో వీడీసీలకు అందిస్తున్న ఆయుధాలు దుర్వినియోగానికి గురవుతున్నాయనే ఆందోళనలు నెలకొన్నాయి. సుమారు 200లకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. రంగంలోకి భారీగా పారామిలిటరీ -
ఇళ్లల్లోకి చొరబడి ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు పౌరులు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రి గ్రామంలో మైనారిటీ వర్గం లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆయుధాలతో గ్రామంలోకి చొరబడిన దుండగులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో 10 మంది స్థానికులు గాయపడ్డారు. తూటాలు తగిలిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రమూకల కోసం భద్రతా దాళం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇద్దరు దుండగులు గ్రామంలోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ‘మూడు ఇళ్లల్లో కాల్పులు జరిగాయి. ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుల కోసం గాల్పింపు చర్యలు కొనసాగుతున్నాయి. ’అని తెలిపారు అదనపు డీజీపీ ముకేశ్ సింగ్. మరోవైపు.. కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని, మరో ఎనిమిది మంది గాయపడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో రాజౌరీ వైద్య కళాశాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన రెండు వారాళ్లో పౌరులే లక్ష్యంగా కాల్పులు జరగటం ఇదే రెండో సంఘటన. డిసెంబర్ 16న ఆర్మీ క్యాంప్ సమీపంలో ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి -
నుదుటిపై బొట్టు పెట్టుకుందని విద్యార్థినిని చితకబాదిన టీచర్
శ్రీనగర్: ఏ వర్గానికి చెందిన వారైనా విద్యాలయంలో సమానమే. ధనికులు, పేదలు, హిందూ, ముస్లిం అనే బేధాలు ఉండవు. విద్యార్థులకు సద్భుద్ధి నేర్పి వారిని ప్రయోజకులు చేసే బాద్యత ఉపాధ్యాయుల మీదే ఉంటుంది. మతాలన్నీ సమానమేనని, మనుషులంతా ఒక్కటేనని కూడా పిల్లలకు బోధించాలి. కానీ విద్యార్థులను సరైన మార్గంలో నడిపించే టీచరే వారిపట్ల క్రూరంగా ప్రవర్తించాడు. నుదుటిపై బొట్టు పెట్టుకొని స్కూల్‌కు వచ్చిన ఓ విద్యార్థినిపై టీచర్ చేయిచేసుకున్న ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో హిందూ కుటుంబానికి చెందిన ఓ బాలిక నుదుటినా బొట్టు పెట్టుకొని పాఠశాలకు వెళ్లింది. ఈ క్రమంలో నిసార్ అహ్మద్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చితకబాదాడు. అయితే బాలికను ఉపాధ్యాయుడు కొట్టిన దృశ్యాలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చదవండి: Viral Video: ఓరిని తెలివి సల్లగుండా.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా! దీంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు రాజౌరీ జిల్లా విద్యాధికారి తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు టీచర్ నిసార్ అహ్మద్ సస్పెన్షన్‌లోనే ఉంటారని పేర్కొన్నారు. కాగా బాలికను కొట్టినట్లు, అభ్యంతరకరమైన పదాలతో దూషించినట్లు తమకు ఫిర్యాదు అందిందని ఎస్పీ జిల్లా ఎస్పీ మహ్మద్ అస్లాం పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం -
లోయలో పడిన బస్సు.. ఒకరు మృతి, 56 మందికి గాయాలు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజౌరి జిల్లా నుంచి నౌషేరా ప్రాంతానికి ప్రయాణిస్తున్న బస్సు.. లామ్ ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 56 మందికి గాయాలైనట్లు నౌషేరా పోలీసు అధికారి సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు. క్షతగాతత్రులను ఆసుపతత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందినట్లు తెలిపారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: యూపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. ఒకరికొకరు ఎదురుపడిన యోగి, అఖిలేష్ -
వైరల్ వీడియో: వైద్య సిబ్బంది సాహసం
-
వైద్య సిబ్బంది సాహసం: వ్యాక్సిన్ కోసం నది దాటి
కశ్మీర్: హిమాలయ రాష్ట్రం జమ్మూకశ్మీర్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. కొండలు.. లోయలు.. నదులు దాటుకుంటూ వెళ్లేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల గ్రామాల్లో టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. నది దాటుతూ ఆరోగ్య సిబ్బంది వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. వారి పనితీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఘటన రాజౌరి జిల్లాలో జరిగింది. రాజౌరి జిల్లాలోని కంది బ్లాక్ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ వేసేందుకు ఆరోగ్య సిబ్బంది నలుగురు బయల్దేరారు. అయితే మార్గమధ్యలో తావి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా కూడా ఆ సిబ్బంది నదిలో నడుస్తూ వెళ్లారు. మోకాలి లోతు నీరు చేరగా ఓ వ్యక్తి సహాయంతో వ్యాక్సిన్ డబ్బాలు పట్టుకుని అతి జాగ్రత్తగా నది దాటారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఓ వ్యక్తి సహాయంతో మహిళలు అతి కష్టంగా నది దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసినట్లు కంది ప్రాంత బ్లాక్ వైద్యాధికారి డాక్టర్ ఇక్బాల్ మాలిక్ తెలిపారు. తమ పరిధిలోని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో కరోనా నివారణకు వ్యాక్సిన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ వైద్య సిబ్బందిని అభినందించారు. జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా 33,98,095 డోసుల వ్యాక్సిన్ వేశారు. -
వక్రబుద్ధిని పోనిచ్చుకోని పాకిస్తాన్
జమ్మూ: సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ యథేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. సరిహద్దుల్లో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగి కాల్పులకు తెగబడింది. నౌషెరా సెక్టార్‌లోని రాజౌరి వద్ద పాక్‌సైన్యం కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు రాజౌరి డీసీ వెల్లడించారు. కాగా 56 గంటల్లో పాక్ సైన్యం కాల్పులు జరపడం ఇది నాలుగోసారి. ఈ విషయాన్ని డిఫెన్స్ మినిస్టరీ అధికార ప్రతినిధి లెఫ్ట్‌నెంట్ కల్నర్ మనీశ్ మెహతా తెలిపారు. అయితే పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు చెప్పారు. పాక్ సైన్యం భారీ మోర్టర్లను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 7.15 నిమిషాల వద్ద కాల్పులు మొదలైనట్లు మనీశ్ మెహతా పేర్కొన్నారు. కాగా పాక్ కాల్పుల్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడిన విషయం తెలిసిందే. పాక్ కాల్పుల నేపథ్యంలో నౌషెరా సెక్టార్‌లోని 14 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి.