సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై సమీక్ష
న్యూఢిల్లీ: ప్రధానిమోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితిని సైనిక, నౌకా, వైమానిక దళాల అధిపతులతో సమీక్షించారు. భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దాదాపు రోజూ కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. వాస్తవాధీన రేఖ(ఎల్‌వోసీ), అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి నెలకొన్న పరిస్థితిని, పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ ప్రధానికి వివరించారు.
దళపతులతో మోదీ భేటీ
Published Wed, Nov 9 2016 2:33 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
Advertisement
Advertisement