Dalbir Singh
-
రాజ్యసభకు కపిల్‌దేవ్, మాధురీ!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుల ఖాళీలను భర్తీ చేసే దిశగా కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటి రేఖ, పారిశ్రామికవేత్త అను ఆఘా ఇటీవలే రిటైర్ అయ్యారు. సీనియర్ లాయర్ కే పరాశరన్ నేడు(శుక్రవారం) రాజ్యసభ నుంచి రిటైర్ కానున్నారు. దీంతో ప్రస్తుతం రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుల ఖాళీల సంఖ్య నాలుగుకి చేరనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎవరిని రాజ్యసభకు నామినేట్ చేయనుందనే విషయంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే జూలై 18 నాటికి కొత్త సభ్యుల నియామకంపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. రాజ్యసభలో మొత్తం 12 మంది నామినేటెడ్ సభ్యులుంటారు. మాజీ సీజేఐ, ఆర్మీ మాజీ చీఫ్ పేర్లు! రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశమున్న వారిలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్సీ లహోటియా, ఆర్మీ మాజీ చీఫ్ దల్బీర్ సింగ్, రాజ్యాంగ వ్యవహారాల నిపుణుడు సుభాష్ కాశ్యప్, బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్.. తదితరుల పేర్లు బీజేపీ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దాదాపు వీరందరినీ ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు. ‘సంపర్క్ సే సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, క్రీడాకారుడు మిల్ఖా సింగ్, జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్, యోగా గురు బాబా రామ్‌దేవ్, జస్టిస్ ఆర్సీ లహోటియా, మాజీ ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సహా పలువురు ప్రముఖులను అమిత్ షా కలిసిన విషయం తెలిసిందే. హరియాణాకు చెందిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌కు, అలాగే, ఇటీవలి కాలం వరకు హీరోయిన్గా వెండితెరపై మెరిసిన మాధురీ దీక్షిత్‌కు దేశవ్యాప్తంగా అభిమానులున్న విషయాన్ని బీజేపీ పరిగణనలోకి తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
'సర్జికల్ దాడులు మోదీ సాహసోపేత నిర్ణయం'
న్యూఢిల్లీ : భారత్ 2015లో ఒకసారి, 2016లో ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని భారత ఆర్మీ మాజీ చీఫ్ అధికారి జనరల్ దల్బీర్ సింగ్ చెప్పారు. ఈ రెండు దాడుల్లో కూడా ఘనమైన విజయం సొంతం చేసుకుందని, భారత్ ప్రతిష్ట అమాంతం పెరిగిందని తెలిపారు. 2015 జూన్ నెలలో తొలుత మ్యాన్మార్లో, 2016 సెప్టెంబర్ నెలలో పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి విజయవంతంగా సర్జికల్ దాడులు చేసినట్లు వివరించారు. 'ఈ రెండు సర్జికల్ దాడులతో భారత ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా అమాంతం పెరిగింది. మన సైనికులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ రెండు దాడులు విజయవంతం అయ్యాయి. ఇది ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ధైర్యమైన నిర్ణయం. ఆ సర్జికల్ దాడుల తర్వాత ఎలాంటి సంఘటన చర్చించుకోదగినది లేదు' అని ఆయన తెలిపారు. -
ఆర్మీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ మండిపాటు!
-
ఆర్మీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ మండిపాటు!
న్యూఢిల్లీ: నూతన సైనికాధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ నియామకంపై కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఆర్మీ చీఫ్‌గా సీనియర్-మోస్ట్ అధికారులను నియమించే సంప్రదాయం ఉండగా.. దానిని ప్రభుత్వం ఎందుకు తోసిపుచ్చిందని ప్రశ్నించింది. లెఫ్టినెంట్ జనరల్ రావత్ నియామకం విషయంలో సీనియారిటీ సూత్రాన్ని ఎందుకు అనుసరించలేదని ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించింది. ‘ఆర్మీ చీఫ్ నియమాకంలో సీనియారిటీని ఎందుకు గౌరవించలేదు. లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ బక్షి, లెఫ్టినెంట్ జనరల్ మహమెద్ అలీ హరిజ్ను ఎందుకు పక్కనపెట్టారు ప్రధానిగారు’ అని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఈ నెల 31న రిటైరవుతున్న ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ బక్షీ అత్యంత సీనియర్ అధికారి. ఆయన తర్వాత సదరన్ ఆర్మీ కమాండర్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మహమెద్ హరిజ్ సీనియర్మోస్ట్ అధికారి. నిజానికి సీనియారిటీలో రావత్ నాలుగోస్థానంలో ఉన్నారని, ఆయన కన్నా సెంట్రల్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ నేగి ముందు ఉన్నారని పేర్కొన్నారు. ఆర్మీ అంతర్గత విషయాలపై స్పందించడానికి సాధారణంగా రాజకీయ పార్టీలు ముందుకురావు. కానీ, పెద్దనోట్ల రద్దుతో ప్రధాని మోదీపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా ఆర్మీ చీఫ్ నియామకంలో కూడా విమర్శలకు దిగింది. గతంలో 1980లో ఇదే తరహాలో సీనియరిటీ ప్రకారం ముందున్న లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సిన్హాను పక్కనబెట్టి.. ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఏఎస్ వైద్యను నియమించారు. -
సొరంగం నుంచి ఉగ్రవాదులు
సాంబా సెక్టార్లో గుర్తించిన సైన్యం న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో మంగళవారం బలగాల చేతుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు సొరంగం ద్వారా చొరబడినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) చీఫ్ కేకే శర్మ చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద పొలాల్లో 80 మీటర్ల సొరంగ మార్గం ద్వారా అక్రమంగా ప్రవేశించినట్లు చెప్పారు. ‘చమ్లియాల్ ఔట్‌పోస్టు వద్ద ఆపరేషన్ పూర్తరుున తర్వాత కంచెను పరిశీలించాం. ఉగ్రవాదులు కంచెను తొలగించిన ఆనవాళ్లేవీ కనపడలేదు. అరుుతే బుధవారం ఉదయం అక్కడ 2బై2 చిన్న సొరంగమార్గాన్ని గుర్తించాం. పంట పొలాల్లో దీన్ని తవ్వారు.’ అని చెప్పారు. ఈ సొరంగం.. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 75-80 మీటర్ల దూరంలో, కంచె నుంచి 35-40 మీటర్లు ఉంది. దాడిలో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ హస్తం ఉందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన ముష్కరుల వద్ద జైషే మొహమ్మద్‌కు చెందిన ‘అఫ్జల్ గురు దళం (ఏజీఎస్)’ అని ఉర్దూలో రాసి ఉన్న నోట్ లభ్యమైంది. రైళ్ల పేల్చివేతకు కుట్ర సాంబా సెక్టార్లో చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు దేశంలో భారీ విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారు. రైళ్లను, రైలు పట్టాలను పేల్చేయడం లాంటి వరుస దాడులకు పన్నాగం పన్నినట్లు బీఎస్ఎఫ్ అదనపు డెరైక్టర్ జనరల్ అరుణ్ చెప్పారు. 5 చైన్ ఐఈడీ (అత్యాధునిక పేలుడు పదార్థాలు), ద్రవరూపంలోని పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించాలనుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఐదు సీసాల ట్రైనైట్రోగ్లిసరిన్ అనే ద్రవ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటితోపాటు 3 ఏకే 47 తుపాకులు, 20 మేగజీన్లు, 517 బుల్లెట్లు, 8ఎంఎం పిస్టల్, 20 గ్రెనేడ్లు, జీపీఎస్ సెట్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ చీఫ్ సమీక్ష నగ్రోటాలో దాడి జరిగిన ప్రాంతాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ సందర్శించారు. దాడి వివరాలను కమాండర్లు సుహాగ్‌కు వివరించారు. భద్రతా పరిస్థితులను ఆయన సమీక్షించారు. -
దళపతులతో మోదీ భేటీ
సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై సమీక్ష న్యూఢిల్లీ: ప్రధానిమోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితిని సైనిక, నౌకా, వైమానిక దళాల అధిపతులతో సమీక్షించారు. భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దాదాపు రోజూ కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి నెలకొన్న పరిస్థితిని, పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ ప్రధానికి వివరించారు. -
‘సర్జికల్’ షాక్‌లోనే పాకిస్తాన్
ఆపరేషన్ మత్తు నుంచి ఇంకా కోలుకోలేదు - హనుమంతుడి లా జవాన్లకు తమ శక్తేంటో తెలిసింది: పరీకర్ - ఎల్వోసీ వెంట మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్ బలగాలు - సర్జికల్ దాడుల నేపథ్యంలో రాష్ట్రపతితో ప్రధాని భేటీ డెహ్రాడూన్: భారత సర్జికల్ దాడుల షాక్ నుంచి పాకిస్తాన్ ఇంకా తేరుకోలేదని, ఆపరేషన్ పూర్తయినా పాకిస్తాన్ ఇంకా మత్తులోనే ఉందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. హనుమంతుడు తన శక్తిని గుర్తించినట్లు ఈ దాడులతో భారత సైన్యం తమ సామర్థ్యాన్ని తెలుసుకుందని పేర్కొన్నారు. శనివారం ఉత్తరాఖండ్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌చంద్రసింగ్ గర్వాల్ విగ్రహావిష్కరణ సభలో పరీకర్ మాట్లాడుతూ... దాడులు పూర్తయిన రెండ్రోజుల అనంతరం కూడా ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో పాక్ ఉందన్నారు. అనస్తీసియా(మత్తు)లో ఉన్న రోగికి ఆపరేషన్ పూర్తయ్యాక కూడా ఆ విషయం తెలియట్లే... సర్జికల్ దాడుల అనంతరం పాక్ పరిస్థితి అలా ఉందని చమత్కరించారు. భారత్ శాంతినే కోరుకుంటుందని, రెచ్చగొట్టకుండా దాడులు చేయదని అన్నారు. ‘ప్రతీకారం తీర్చుకునే సత్తా భారత దళాలకు ఉందన్న విషయాన్ని పాక్‌కు చెప్పడానికే దాడులు చేశారు. హనుమంతుడి శక్తుల గురించి జాంబవంతుడు చెప్పాక ఒక్క అంగలో సముద్రాన్ని దూకిన విషయం మన సైనికులకూ వర్తిస్తుంది. సర్జికల్ దాడులకు ముందు హనుమంతుడి వలే తమ సామర్థ్యం గురించి సైనికులకు తెలియదు’ అని పేర్కొన్నారు. దాడుల అనంతరం పాక్ గందరగోళంలో ఉందని, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కాగా, ఈ దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ... శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని ట్వీట్ చేశారు. వారి మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో మాత్రం తెలియలేదు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన భారత సైనిక శిబిరాలు, జనావాసాలే ల క్ష్యంగా పాక్ దళాలు శనివారం కాల్పులకు తెగబడ్డాయి. మోర్టార్ బాంబులు, భారీ మెషిన్ గన్స్‌తో జమ్మూ కశ్మీర్‌లోని అక్నూర్ తాలుకాలో ఎల్వోసీ వెంట 3 గంటలకు పైగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఎలాంటి నష్టం జరగలేదని ఆర్మీ పేర్కొంది. తెల్లవారుజాము 3.30 గంటలకు ప్రారంభమైన కాల్పులు 6 గంటల వరకూ కొనసాగాయంది. అక్నూర్ తాలూకా పల్లాన్‌వాలా సెక్టార్, చాంబ్ ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, బడూ, చనూ గ్రామాలపై కూడా కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల గ్రామస్తులు పశువులు, ఇళ్లను చూసుకునేందుకు తిరిగి రాగా... వారిని లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. గత నాలుగు రోజుల వ్యవధిలో ఐదో సారి పాక్ కాల్పుల విర మణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత్ నిజాన్ని దాస్తోంది: పాకిస్తాన్ పీవోకేలో భారత్ దాడుల సందర్భంగా ఆ దేశ సైనికులు మరణించారని పాక్ మళ్లీ పేర్కొంది. నష్టాన్ని భారత్ దాస్తోందని పాక్ ఆర్మీ ప్రతినిధి అసిమ్ సలీం బజ్వా ఆరోపించారు. భారత దాడుల్ని తమ దళాలు తిప్పికొట్టాయన్నారు. సరిహద్దుల్లో దల్బీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ఉత్తర, పశ్చిమ కమాండ్ బేస్ల్ని శనివారం సందర్శించారు. నార్తర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. సరిహద్దు వెంట యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. పీవోకేలోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసిన సైనికులు, అధికారుల్ని వ్యక్తిగతంగా అభినందించారు. -
జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ చీఫ్ పర్యటన
జమ్మూ: సర్జికల్ ఆపరేషన్స్ అనంతరం భారత్-పాక్ సరిహద్దులోని పరిస్థితులు వేడిమీద ఉన్న నేపథ్యంలో.. భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ శనివారం కశ్మీర్లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలోని భద్రతా వ్యవహారాలను ఆయన సమీక్షించనున్నారు. ఎల్ఓసీని దాటి ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన అనంతరం జమ్మూకశ్మీర్‌లో భారత ఆర్మీ చీఫ్ తొలి పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉధంపూర్‌లోని ఉత్తర కమాండ్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఎల్ఓసీ ప్రాంతంలో సైతం దల్బీర్ సింగ్ పర్యటించే అవకాశం ఉందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. -
కేంద్రమంత్రిపై ఆర్మీ చీఫ్ తీవ్ర ఆరోపణలు!
న్యూఢిల్లీ: తన పూర్వ ఆర్మీ చీఫ్, కేంద్రమంత్రి వీకే సింగ్‌పై ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీకే సింగ్ దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తూ తన ప్రమోషన్‌ను అడ్డుకోవాలని, నిరంకుశంగా తనను శిక్షించాలనే ఆలోచనతోనే ఆయన ఇలా మిస్టిరియస్గా ప్రవర్తించారని దల్బీర్ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు వ్యక్తిగత హోదాలో ఆయన బుధవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. మాజీ ఆర్మీ చీఫ్ లేదా కేంద్రమంత్రిపై ఓ ఆర్మీ అధిపతి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2012లో అప్పటి ఆర్మీ చీఫ్‌గా ఉన్న వీకే సింగ్ తనను బాధితుడిని చేసేందుకు ప్రయత్నించారని, ఆర్మీ కమాండర్‌గా తనకు ప్రమోషన్ దక్కకూడదన్న ఏకైక ఉద్దేశంతో ఆయన ఇలా వ్యవహరించారని దల్బీర్ సింగ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. నిరాధార, ఊహాజనిత, అసత్య ఆరోపణలతో మే 19, 2012న తనకు షోకాజ్ నోటీసు జారీచేశారని, ఆ తర్వాత అక్రమంగా తనపై క్రమశిక్షణ, విజిలెన్స్ (డీవీ) నిషేధాన్ని విధించారని ఆయన తెలిపారు. దల్బీర్ సింగ్‌ను ఆర్మీ కమాండర్‌గా నియమించడంలో ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారంటూ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) రవీ దస్తానె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఆయనను ఆర్మీ కమాండర్‌గా నియమించడంతో జనరల్ బిక్రం సింగ్ తర్వాత ఆర్మీ చీఫ్‌గా నియమించడానికి మార్గం సుగమమైంది. 2012 ఏప్రిల్, మే నెలల్లో దల్బీర్ సింగ్‌పై వీకే సింగ్ డీవీ నిషేధాన్ని విధించినా.. ఆయనను ఆర్మీ చీఫ్ గా నియమించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలవ్వగా.. ఈ కేసులో దల్బీర్ సింగ్ అఫిడవిట్ సమర్పించారు. -
'భారత సైన్యం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి'
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతను స్పష్టించడానికి పొరుగు దేశం పాకిస్థాన్ కొత్త పద్ధతులు పాటిస్తోందని భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ తెలిపారు. జమ్మూ కశ్మీర్ ను నిత్యం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంచేందుకు పాక్ యత్నిస్తోందన్నారు. సరిహద్దుల్లో పాక్ సైన్యం తరుచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని.. కేవల ఆగస్టులోనే 55 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించదని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో 245 సార్లు సరిహద్దుల్లో అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. పాక్ ను కంట్రోల్ చేయడానికి భారత సైన్యం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు. -
‘కల్నల్ రాయ్ అత్యంత ధైర్యసాహసి’
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగిన కల్నల్ ఎన్.రాయ్ అత్యం త ధైర్య సాహసి అని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ కొనియాడారు. జమ్మూ, కశ్మీర్లో మంగళవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 42 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన రాయ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూపు హెడ్‌కానిస్టేబుల్ సంజీవ్‌లు మృతి చెందిన విషయం తెలిసిందే. కల్నల్ రాయ్ గణతంత్ర వేడుకల్లో ప్రతిష్టాత్మకమైన యుధ్‌సేవా పతకం పొందిన మర్నాడే ఉగ్రవాదుల చేతిలో బలయ్యారని పేర్కొన్నా రు. రాయ్ విధి నిర్వహణలో అంకితభావాన్ని ప్రదర్శించి యువ జవానులకు ఆదర్శంగా నిలిచారన్నారు. గురువారం ఇక్కడి బేస్ ఆస్పత్రికి రానున్న రాయ్ మృతదేహానికి ఆర్మీ చీఫ్ నివాళులు అర్పిస్తారు. -
'పాక్ పరోక్ష యుద్ధానికి మద్దతిస్తోంది'
న్యూఢిల్లీ : జమ్ము కాశ్మీర్లో పాకిస్తాన్ పరోక్ష యుద్ధానికి మద్దతు ఇస్తోందని ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత సైన్యాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది 110మంది ఉగ్రవాదుల చొరబాటును సమర్థవంతంగా నిరోధించగలిగామని దల్బీర్ సింగ్ పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్ తరచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే.