జమ్ము కాశ్మీర్లో పాకిస్తాన్ పరోక్ష యుద్ధానికి మద్దతు ఇస్తోందని ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత సైన్యాన్ని ..
న్యూఢిల్లీ : జమ్ము కాశ్మీర్లో పాకిస్తాన్ పరోక్ష యుద్ధానికి మద్దతు ఇస్తోందని ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత సైన్యాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది 110మంది ఉగ్రవాదుల చొరబాటును సమర్థవంతంగా నిరోధించగలిగామని దల్బీర్ సింగ్ పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్ తరచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే.