అందుకే సరిహద్దులు ప్రశాంతం
ఆ మూడు కుటుంబాల పాలనకు ముగింపు పలకండి
కశ్మీర్ ఎన్నికల ర్యాలీలో ప్రజలకు హోం మంత్రి అమిత్ షా పిలుపు
మెంఢర్: ‘‘ప్రధాని నరేంద్ర మోదీ అంటే పాకిస్తాన్ భయపడుతోంది. అందుకే జమ్మూకశీ్మర్‌లో సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా భారత్ సమాధానం ఎంత తీవ్రంగా ఉంటుందో పాక్‌కు తెలుసన్నారు. సరిహద్దుల్లోని పూంఛ్ జిల్లాలో శనివారం ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మంత్రి మాట్లాడారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని యువకులకు తుపాకులు, రాళ్ల స్థానంలో ల్యాప్‌టాప్‌లను అందించడం ద్వారా ఇక్కడ తీవ్రవాదాన్ని తుడిచిపెట్టామన్నారు.
1990ల్లో తరచూ చోటుచేసుకున్న సీమాంతర ఉగ్రవాదం నేడు కనిపిస్తోందా అని ప్రజలను ప్రశ్నించారు. ‘‘గతంలో ఇక్కడి పాలకులు పాకిస్తాన్‌ను చూసి భయపడేవారు. ఇప్పుడు మోదీని చూసి పాక్‌కు భయం పట్టుకుంది. కాల్పులకు దిగేందుకు సాహసించడం లేదు. జమ్మూకశీ్మర్‌లో 1990ల్లో మొదలైన ఉగ్రవాదానికి 2014 నాటికి 40 వేల మంది బలయ్యారు. దాన్ని ఆపడంలో ఆ మూడు (అబ్దుల్లా, ముఫ్తీ, నెహ్రూ) కుటుంబాలు విఫలమయ్యాయి. పైపెచ్చు, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టాయి. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం వేళ్లూనడానికి వాళ్లు ఎప్పుడూ ప్రయతి్నంచలేదు. ఆ మూడు కుటుంబాల పాలనకు ముగింపు పలికేలా అసెంబ్లీ ఎన్నికల్లో తీరి్పవ్వండి’’ అని అమిత్ షా పిలుపునిచ్చారు.
ఉగ్రవాదంతో ఎవరికీ లాభం లేదు
‘ఉగ్రవాదం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. తుపాకులను మన పిల్లలకు అందజేద్దాం. మన యువతను ఆర్మీ, పోలీసు విభాగాల్లోకి పంపేందుకు ప్రయతి్నద్దాం. ఇందుకోసం సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లను ఏర్పాటు చేస్తాం’’ అని అమిత్ షా ప్రకటించారు. ‘‘కేంద్రంలో 2014లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడకుంటే ఇక్కడ పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగేవే కావు, 30 వేల మంది పంచాయతీ సభ్యుల ఎన్నికయ్యే వారే కాదు. ప్రజలపై ఎన్‌సీ, పీడీపీ, కాంగ్రెస్ పారీ్టల మూడు కుటుంబాల పెత్తనం మరింత పెరిగి ఉండేది’’ అని అమిత్ షా దుయ్యబట్టారు. గుజరాత్‌కు చెందిన ఒక నేత నియంత్రణ రేఖకు అతి సమీపంలోని మెంఢర్‌కు వచ్చి ఉండేవారే కాదని తన పర్యటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 1947లో సరిహద్దులను కాపాడిన పహాడీలు, బకర్‌వాలాలు, గుజ్జర్లను చూసి జాతి గరి్వస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment