ఎప్పుడూ మన్ కీ బాత్ ముచ్చట్లే
బాధ్యతలను విస్మరించారంటూ ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు
సురాన్‌కోట్(జమ్మూకశీ్మర్)/శ్రీనగర్: జమ్మూకశీ్మర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్య, ధరల కట్టడిని మోదీ నిర్లక్ష్యం చేశారని ఎండగట్టారు. సోమవారం పూంఛ్ జిల్లాలోని సురాన్‌కోట్ శాసనసభ నియోజకవర్గంలో, శ్రీనగర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు.
‘‘నెలకోసారి ‘మన్ కీ బాత్’ముచ్చట్లతో మోదీ మోతెక్కిస్తారు. కానీ ఏనాడూ తాను పూర్తిచేయాల్సిన కీలక బాధ్యతలను ప్రస్తావించరు. బాధ్యతలను విస్మరించారు. ఉద్యోగాల కల్పన, ధరల కట్టడి వంటి చేయాల్సిన పనులపై ‘కామ్ కీ బాత్’ఏనాడూ చెప్పరు. గతంలో 56 అంగుళాల ఛాతి అంటూ గొప్పలు చెప్పుకుని తిరిగిన ఆనాటి మోదీ ఇప్పుడు లేరు. ఎందుకంటే ఆయన మూడ్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత విపక్షాల ‘ఇండియా’కూటమి మార్చేసింది. ప్రధాని మోదీ సైకాలజీని మా కూటమి దెబ్బకొట్టింది’’అని రాహుల్ అన్నారు.
కశ్మీర్‌ను ఢిల్లీ సర్కార్ కాదు, స్థానికులే పాలించాలి
జమ్మూకశీ్మర్‌ను ఢిల్లీ ప్రభుత్వం కాకుండా స్థానికులే పాలించాలని రాహుల్ అన్నారు. జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి మోదీ సర్కార్ నేరుగా పరిపాలిస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలుచేశారు. ‘‘కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)లను రాష్ట్రాలుగా మార్చారుగాగానీ రాష్ట్రాన్ని యూటీగా మార్చడం భారత చరిత్రలో ఎన్నడూ జరగలేదు. పూర్తిస్థాయి రాష్ట్రమైన జమ్మూకశీ్మర్‌ను యూటీగా మార్చి ఇక్కడి పౌరుల హక్కులను కాలరాశారు’’అని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కాన్ఫెరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సైతం పాల్గొన్నారు.
వాళ్లు చేయకుంటే మేమే చేస్తాం
‘‘జమ్మూకశీ్మర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కోసం కేంద్రప్రభుత్వంతో పోరాడతాం. అయినా వాళ్లు ఇవ్వకపోతే మేం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మేమే హోదా ఇస్తాం. యూటీకాకమునుపు స్థానికులే కశీ్మర్‌ను పాలించేవారు. ఇక్కడి వారి భవిష్యత్తు, ప్రయోజనాలకనుగుణంగా నిర్ణయాలు జరిగేవి. ఇప్పుడు ‘బయటి’వ్యక్తులు మీ గొంతుక వినకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని ఢిల్లీ నడిపిస్తోంది. మేం మీ ప్రభుత్వాన్ని జమ్మూకశీ్మరే నడపాలని కోరుకుంటున్నాం. మీ సమస్యలను పార్లమెంట్ వేదికగా ఎలుగెత్తి చాటేందుకు మీ గొంతుకనవుతా’’అని స్థానికులనుద్దేశించి రాహుల్ అన్నారు. జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దఫాలో 26 స్థానాలకుగాను సెపె్టంబర్ 25న జరగబోయే పోలింగ్‌కు ప్రచారం సోమవారంతో ముగిసింది.
కుల గణన అనడానికే మోదీ జంకుతున్నారు
కుల గణన అనడానికి కూడా ప్రధాని మోదీ జంకుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ, బీజేపీని విమర్శిస్తూ రాహుల్ సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో హిందీలో పలు పోస్ట్‌లుచేశారు. ‘‘బీజేపీ పూర్తిగా బహుజనుల వ్యతిరేక పారీ్టగా తయారైంది. వాళ్లు ఎన్ని పుకార్లు పుట్టించినా, అబద్ధాలు వ్యాపింపజేసినా మేం మాత్రం రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పు రానివ్వం. సమగ్ర కులగణన జరిగేదాకా మేం ఊరుకోం. సమాజంలోని ప్రతి వర్గానికి హక్కులు, వాటా, న్యాయం దక్కేలా చూస్తాం. అవసరమైతే 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేసి ఎక్కువ రిజర్వేష్లను కలి్పస్తాం. మోదీజీ కనీసం కులగణన అనడానికి కూడా భయపడుతున్నారు. బహుజనులకు న్యాయం దక్కడమనేది రాజకీయ అంశంకాదు అది నా జీవిత లక్ష్యం’’అని రాహుల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment