ఢిల్లీ: జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో.. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ. దోడాలో బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. క్రూరత్వాన్ని ఆస్వాదించడంలో కాంగ్రెస్ తారాస్థాయికి చేరిందని మండిపడ్డారు.
‘‘వాళ్లు(కాంగ్రెస్) నోరు తెరిస్తే ప్రేమ దుకాణం అంటున్నారు. కానీ, అమెరికాలో ఏం చేశారు?. ఓ జర్నలిస్ట్‌పై కిరాతకంగా దాడి చేశారు. ఓ భరతమాత ముద్దుబిడ్డకు అమెరికాలో అవమానం జరిగింది. స్వేచ్ఛ హక్కు కోసం పాటుపడే వీరులుగా తమను తాము అభివర్ణించుకుంటున్నవాళ్లు.. వాస్తవంలో అవతలివాళ్లను నోరు మెదపనివ్వట్లేదు. ప్రశ్నిస్తే.. దాడులతో పేట్రేగిపోతున్నారు’’ అని మోదీ ప్రసంగించారు.
ఇటీవల డల్లాస్‌లో ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ చీఫ్ శ్యామ్ పిట్రోడాను ఇంటర్వ్యూ చేసే క్రమంలో.. ఓ జాతీయ మీడియా సంస్థకు చెందిన కరస్పాండెంట్‌పై దాడి జరిగింది. తాను బంగ్లాదేశ్‌లో హిందువులే టార్గెట్‌గా జరుగుతున్న దాడులపై పిట్రోడాను ప్రశ్నించానని, ఈలోపు కొందరు కాంగ్రెస్ వాళ్లు తనతో దురుసుగా ప్రవర్తించారని, తన ఫోన్ లాక్కొని ఇంటర్వ్యూ వీడియోను డిలీట్ చేశారని రోహిత్ శర్మ అనే ఆ రిపోర్టర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు సరిగ్గా మూడు రోజుల ముందే ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇదీ చదవండి: ‘ఆర్థిక మంత్రికి అహంకారం ఎక్కువా?’
ఈ ఘటననే ఇవాళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇదే సభలో కూటమిపైనా ప్రధాని విసుర్లు విసిరారు. వారసత్వ రాజకీయాలతో యువత తీవ్రంగా నష్టపోతోందని, అసలు కాంగ్రెస్‌కు ఈ ప్రాంతమంటే లెక్కేలేదని అన్నారాయన. బీజేపీని గెలిపిస్తే.. కల్లోలిత ప్రాంతంగా పేరున్న జమ్ములో అభివృద్ధి బాటలు వేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత దోడే జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీనే కావడం గమనార్హం.
#WATCH | Doda, J&K: Prime Minister Narendra Modi says "...This time's assembly election in Jammu and Kashmir is between three families and the youth of Jammu and Kashmir. One family belongs to Congress, one family belongs to the National Conference and one family belongs to… pic.twitter.com/7KOp8H6M9Y
— ANI (@ANI) September 14, 2024
Comments
Please login to add a commentAdd a comment