Doda
-
J&k: జమ్ముకశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటన
-
ప్రేమ దుకాణం అంటూనే దాడులా?: ప్రధాని మోదీ
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో.. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ. దోడాలో బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. క్రూరత్వాన్ని ఆస్వాదించడంలో కాంగ్రెస్ తారాస్థాయికి చేరిందని మండిపడ్డారు.‘‘వాళ్లు(కాంగ్రెస్) నోరు తెరిస్తే ప్రేమ దుకాణం అంటున్నారు. కానీ, అమెరికాలో ఏం చేశారు?. ఓ జర్నలిస్ట్‌పై కిరాతకంగా దాడి చేశారు. ఓ భరతమాత ముద్దుబిడ్డకు అమెరికాలో అవమానం జరిగింది. స్వేచ్ఛ హక్కు కోసం పాటుపడే వీరులుగా తమను తాము అభివర్ణించుకుంటున్నవాళ్లు.. వాస్తవంలో అవతలివాళ్లను నోరు మెదపనివ్వట్లేదు. ప్రశ్నిస్తే.. దాడులతో పేట్రేగిపోతున్నారు’’ అని మోదీ ప్రసంగించారు.ఇటీవల డల్లాస్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శ్యామ్ పిట్రోడాను ఇంటర్వ్యూ చేసే క్రమంలో.. ఓ జాతీయ మీడియా సంస్థకు చెందిన కరస్పాండెంట్‌పై దాడి జరిగింది. తాను బంగ్లాదేశ్‌లో హిందువులే టార్గెట్‌గా జరుగుతున్న దాడులపై పిట్రోడాను ప్రశ్నించానని, ఈలోపు కొందరు కాంగ్రెస్ వాళ్లు తనతో దురుసుగా ప్రవర్తించారని, తన ఫోన్ లాక్కొని ఇంటర్వ్యూ వీడియోను డిలీట్ చేశారని రోహిత్ శర్మ అనే ఆ రిపోర్టర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు సరిగ్గా మూడు రోజుల ముందే ఈ ఘటన చోటు చేసుకుంది.ఇదీ చదవండి: ‘ఆర్థిక మంత్రికి అహంకారం ఎక్కువా?’ఈ ఘటననే ఇవాళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇదే సభలో కూటమిపైనా ప్రధాని విసుర్లు విసిరారు. వారసత్వ రాజకీయాలతో యువత తీవ్రంగా నష్టపోతోందని, అసలు కాంగ్రెస్‌కు ఈ ప్రాంతమంటే లెక్కేలేదని అన్నారాయన. బీజేపీని గెలిపిస్తే.. కల్లోలిత ప్రాంతంగా పేరున్న జమ్ములో అభివృద్ధి బాటలు వేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత దోడే జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీనే కావడం గమనార్హం. #WATCH | Doda, J&K: Prime Minister Narendra Modi says "...This time's assembly election in Jammu and Kashmir is between three families and the youth of Jammu and Kashmir. One family belongs to Congress, one family belongs to the National Conference and one family belongs to… pic.twitter.com/7KOp8H6M9Y— ANI (@ANI) September 14, 2024 -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్:కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. కిష్త్వార్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచారు. అదే విధంగా కథువాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో భారత బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు.కాగా చత్రూలోని నైద్ఘం గ్రామ సమీపంలోని పింగ్నాల్ దుగడ్డ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులుకాల్పులు జరిపాయి. వీటిని బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు గాయపడినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి#𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐀𝐫𝐦𝐲𝐎𝐏 𝐊𝐇𝐀𝐍𝐃𝐀𝐑𝐀In the Joint operation launched on 11 Sep by 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐑𝐢𝐬𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 𝐂𝐨𝐫𝐩𝐬 & 𝐉&𝐊 𝐏𝐨𝐥𝐢𝐜𝐞, Two Terrorists Neutralised & Large War Like Stores Recovered. 𝐎𝐩𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬 C𝐨𝐧𝐜𝐥𝐮𝐝𝐞𝐝 pic.twitter.com/QUc92EhElN— Rising Star Corps_IA (@RisingStarCorps) September 13, 2024ఇక ఉదంపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన కొద్ది రోజులకే ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. గత జూలైలో దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముడిపడి ఉన్న ఉగ్రవాదులే తాజా కాల్పుల్లోనూ పాల్గొన్నట్లు సంబధిత వర్గాలు తెలిపాయి. దోడా ఎన్కౌంటర్లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు.అయితే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. ప్రధాని రేపు దోడాను సందర్శించే అవకాశం ఉంది.దోడా, ఉదంపూర్, కథువా జిల్లాల్లో ఇటీవల తీవ్రవాద దాడులు పెరిగాయి దోడాలో జరిగిన ఆపరేషన్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మరియు ఏడుగురు సైనికులతో సహా దాదాపు డజను మంది మరణించారు.ఇక సెప్టెంబరు 18న దక్షిణ కాశ్మీర్ జిల్లాలైన అనంత్‌నాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్‌లోని 16 స్థానాలతో పాటు చీనాబ్ లోయ ప్రాంతంలోని దోడా, కిష్త్వార్, రాంబన్ జిల్లాల్లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కిష్త్వార్, దోడా, రాంబన్ జిల్లాల్లో భద్రతను పెంచారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, పోలింగ్ స్టేషన్ల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు. జమ్మూ, కథువా, సాంబా జిల్లాలో సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండో, మూడో దశలలో ఓటింగ్ జరగనుంది. -
ఉగ్రదాడులపై ప్రతీ దేశ భక్తుడి డిమాండ్: రాహుల్ గాంధీ
ఢిల్లీ: జమ్ము కశ్మీర్లో కొన్ని నెలల నుంచి భారత సైనికులే లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన తరచూ చోటుచేసుకోవటం చాలా విచారకమని ‘ఎక్స్’లో అన్నారు. సోమవారం జమ్ము కశ్మీర్‌లోని దోదా జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. సైనికుల మృతికి రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు.‘జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాద దాడుల్లో అమరులైన సైనికులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. అమరులైన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అని ‘ఎక్స్’లో తెలిపారు.మరోవైపు.. జమ్ము కశ్మీర్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులపై రాహుల్ గాంధీ బీజేపీ పభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన తప్పుడు పాలసీలను భారత ఆర్మీ సైనికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ఉగ్రదాలకు కారణం బీజేపీ తీసుకున్న తప్పుడు పాలసీలే. అందులో ఒకటి జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయటం. దీంతో ఇటీవల జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగాయి. తరచూ జమ్ము కశ్మీర్లో చోటుచేసుకుంటున్న భద్రత లోపాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతి దేశ భక్తుడు డిమాండ్ చేయాలి’అని రాహుల్ గాంధీ అన్నారు.आज जम्मू कश्मीर में फिर से एक आतंकी मुठभेड़ में हमारे जवान शहीद हो गए। शहीदों को विनम्र श्रद्धांजलि अर्पित करते हुए शोक संतप्त परिजनों को गहरी संवेदनाएं व्यक्त करता हूं।एक के बाद एक ऐसी भयानक घटनाएं बेहद दुखद और चिंताजनक है। लगातार हो रहे ये आतंकी हमले जम्मू कश्मीर की जर्जर…— Rahul Gandhi (@RahulGandhi) July 16, 2024 ఉగ్రవాద దాడులు పెరుగుతున్న ఈ సమయంలో రాజకీయం అందరూ ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఉగ్రవాద దాడులపై ప్రభుత్వం స్పందిస్తూ.. చర్యలు తీసుకుంటే ప్రతిపక్షం నుంచి పూర్తి సహకారం అందిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. -
జమ్మూ కాశ్మీర్లో తీవ్ర భూకంపం.. రిక్టర్ స్కేలుపై..
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఈరోజు తెల్లవారు జామున తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 37 గా నమోదైంది. మంగళవారం తెల్లవారు జాము 12.04 గంటలకు ధోడా ప్రాంతానికి ఆగ్నేయంగా భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ. భూమి ఉపరితలానికి 5 కి.మీ లోతున భూకంపం సంభవించిందని వారు తెలిపారు. అక్కడక్కడా చిన్నగా భూమి అదిరినట్టుగా అనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ భూకంపం తీవ్రత కొంచెం ఎక్కువైనా భదేర్వా, కిష్త్వార్, ఉధంపూర్, ధోడా పరిసరాల్లో తీవ్ర నష్టం వాటిల్లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పుడు 2-5 సెకన్ల వరకు భూమి కంపించినట్లు చెబుతున్నారు స్థానికులు. ఆ సమయానికి అందరూ గాఢనిద్రలో ఉంటారని అదృష్టవశాత్తు భూకంపం తీవ్రత పెద్దగా లేదని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని వారు తెలిపారు. ఇది కూడా చదవండి: ఎంపీగా లోక్‌సభలోకి రాహుల్ -
కాశ్మీర్ లో భూకంపం.. రెక్టార్ స్కేలుపై తీవ్రత 5
న్యూఢిల్లీ: జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. దోడా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రతగా 5గా నమోదైంది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్టు వార్తలు రాలేదు. పాకిస్థాన్‌లోని నైరుతి ప్రాంతంలోనూ శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. -
మహిళలపై గౌరవం ఇదేనా?
అఫిడవిట్లో భార్య పేరు ప్రస్తావించరు మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు దోడా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తాను వివాహితుడినంటూ మొదటిసారిగా తన భార్య పేరును వెల్లడించడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. ‘‘బీజేపీ మహిళల భద్రత గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి ఇప్పటికి ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నారు. కానీ, తాను వివాహితుడినని మొదటిసారిగా వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మహిళల గౌరవం గురించి మాట్లాడతారు. కానీ, ఆయన భార్య పేరు అఫిడవిట్లో ఉండదు’’ అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లోని దోడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడారు. గుజరాత్లో ఒక మహిళపై పోలీసు నిఘా అంశాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీ అసలు రూపం ఇదేనని, మహిళల సాధికారతపై ఆ పార్టీ చెప్పేదేంటని ప్రశ్నించారు. అద్వానీ స్థానంలో అదానీ వచ్చారు.. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ఆ రాష్ట్ర సీఎం మోడీకి ఉన్న సంబంధాలపై రాహుల్ ప్రశ్నలు సంధించారు. అదానీకి అన్నీ ఇచ్చారని, అదే సమయంలో బీజేపీ అగ్ర నేతలైన అద్వానీ, జశ్వంత్‌సింగ్‌ను పక్కకు నెట్టేశారని రాహుల్ విమర్శించారు. గుజరాత్లో అదానీ ప్రభుత్వం నడుస్తోందంటూ దెప్పిపొడిచారు. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు: తన వైవాహిక స్థితి విషయమై తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు మోడీపై ఎన్నికల కమిషన్ క్రిమినల్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ డిమాండ్ చేశారు. మోడీపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. మోడీపై కాంగ్రెస్ చేసిన విమర్శలను బీజేపీ ఖండించింది. తన వివాహ విషయంలో మోడీ అబద్ధాలాడలేదని, అలాంటప్పుడు దీనిని ఒక అంశంగా చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించింది.