ఉగ్రదాడులపై ప్రతీ దేశ భక్తుడి డిమాండ్‌: రాహుల్‌ గాంధీ | Rahul Gandhi Says Demand Of Every Patriotic Indian Is Over Doda Terror Attack, See Tweet Inside | Sakshi
Sakshi News home page

Rahul Gandhi: ఉగ్రదాడులపై ప్రతీ దేశ భక్తుడి డిమాండ్‌

Published Tue, Jul 16 2024 2:57 PM | Last Updated on Tue, Jul 16 2024 4:09 PM

Rahul Gandhi says Demand Of Every Patriotic Indian Is over Doda Terror Attack

ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో  కొన్ని నెలల నుంచి భారత సైనికులే లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులపై ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన తరచూ చోటుచేసుకోవటం చాలా విచారకమని ‘ఎక్స్‌’లో అన్నారు. సోమవారం జమ్ము కశ్మీర్‌లోని దోదా జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. సైనికుల మృతికి రాహుల్‌ సంతాపం వ్యక్తం చేశారు.

‘జమ్ము  కశ్మీర్‌లోని దోడా జిల్లాలో  ఉగ్రవాద దాడుల్లో అమరులైన సైనికులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా.  అమరులైన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అని  ‘ఎక్స్‌’లో తెలిపారు.

మరోవైపు.. జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న దారుణమైన పరిస్థితులపై రాహుల్‌ గాంధీ బీజేపీ పభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన తప్పుడు పాలసీలను భారత  ఆర్మీ సైనికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ఉగ్రదాలకు కారణం బీజేపీ తీసుకున్న తప్పుడు పాలసీలే. అందులో ఒకటి జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయటం. దీంతో ఇటీవల జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరిగాయి.  తరచూ జమ్ము కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న భద్రత లోపాలకు ప్రభుత్వం  బాధ్యత వహించాలని ప్రతి దేశ భక్తుడు డిమాండ్‌ చేయాలి’అని రాహుల్‌ గాంధీ అన్నారు.

 

ఉగ్రవాద దాడులు పెరుగుతున్న ఈ సమయంలో రాజకీయం అందరూ ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఉగ్రవాద దాడులపై ప్రభుత్వం స్పందిస్తూ.. చర్యలు తీసుకుంటే ప్రతిపక్షం నుంచి పూర్తి సహకారం అందిస్తామని రాహుల్‌ గాంధీ  తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement